champions league
-
రక్తం కళ్ల చూసిన ఫుట్‌బాల్ మ్యాచ్.. వీడియో వైరల్
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భాగంగా ఒక గోల్ ఆటగాడి రక్తం కళ్ల చూసింది. ఈ ఘటన వార్సాలో జరుగుతున్న చాంపియన్ లీగ్‌లో చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా గ్రూఫ్-ఎఫ్‌లో రియల్ మాడ్రిడ్, షాఖ్తర్ దొనేత్సక్ల మధ్య బుధవారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయం ముగిసే సమయానికి షాఖ్తర్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మరో ఐదు నిమిషాలు అదనపు సమయం ఇవ్వడంతో రియల్ మాడ్రిడ్ గోల్ కొట్టడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆట 95వ నిమిషంలో రియల్ మాడ్రిడ్ ఢిఫెండర్ ఆంటోనియో రూడిగర్ హెడర్ గోల్ చేశాడు. ఇక్కడే ఊహించని పరిణామం జరిగింది. బంతిని తలతో బలంగా కొట్టే క్రమంలో రూడిగర్ పైకి ఎగరగా.. అదే సమయంలో షాఖ్తర్ గోల్ కీపర్ అనటోలీ ట్రూబిన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ట్రూబిన్ తలభాగం రూడిగర్ నుదుటన గట్టిగా గుద్దుకుంది. అయితే అప్పటికే బంతి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లిపోవడంతో రియాల్ మాడ్రిడ్- షాఖ్తర్ దొనేత్సక్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తాము క్వార్టర్ ఫైనల్ చేరామన్న సంతోషంతో రియల్ మాడ్రిడ్ సంబరంలో మునిగిపోగా.. జట్టు ఆటగాడు రూడిగర్ తల పగిలి రక్తం కారసాగింది. అటు పక్కన ట్రూబిన్ తలకి కూడా బలంగానే తగిలింది. దీంతో గ్రౌండ్‌లోనే ఇద్దరు కాసేపు పడుకున్నారు. ఆ తర్వాత రూడిగర్, ట్రూబిన్లను ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. కాగా ట్రూబిన్ తల చుట్టూ బ్యాండేజీ వేయగా.. రూడిగర్ మొహానికి 20 కుట్లు పడే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Rudiger scores the equalizer 🤍 He got into an accident with Shakhtar goalkeeper, hopefully both are well.pic.twitter.com/SkFpH0X1Lb — Omar Aref 🇦🇪 (@LosB1ancos_) October 11, 2022 చదవండి: కుక్కతో రెజ్లింగ్ మ్యాచ్.. దూల తీరింది! 'బౌలింగ్‌లో దమ్ము లేకపోయేది.. హెల్మెట్ లేకుండానే ఆడేవారు' -
క్రికెట్ సవాల్ మొదలు
విశాఖ స్పోర్ట్స్ : గ్రామీణ క్రీడాకారులకు గట్టి సవాలు విసిరి, ఉత్తేజకరమైన బహుమతులను అందించి ప్రోత్సహించే ప్రతిష్టాత్మక ఎంవీవీ టీ10 చాంపియన్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఉత్సాహకర వాతావరణంలో మొదలైంది. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులలోని జట్లు హోరాహోరీగా తలపడి, వాటిలోని అత్యుత్తమ జట్లు తుది అంచెలో ఢీకొనే ఈ టోర్నీలో.. భీమిలి అంచె పోటీలను వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ శనివారం నగర శివార్లలోని సాంకేతిక ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నిరంతర సాధనతో సామర్ధ్యాన్ని మె రుగు పరుచుకోవాలని, అలా ఉన్నత స్థాయికి చేరుకోవాలని గ్రామీణ క్రీడాకారులకు పిలుపునిచ్చారు.అందివచ్చిన అవకాశాల్ని వినియోగించుకుని క్రీడాకారులుగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు. ఎంవీవీ చాంపియన్‌లీగ్ రాజకీయ కార్యక్రమం కాదని నియోజకవర్గంలో క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించడానికేనని అన్నారు. తొలుత వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో నలభై జట్లు పోటీపడుతున్నాయని వాటిలో ఫైనల్స్ ఆడిన రెండు జట్లకు పార్లమెంట్ నియోజకవర్గ లీగ్ పోటీలకు అర్హత కల్పించనున్నారని తెలి పారు. వైఎస్సార్సీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తైనాల విజయకుమార్ మా ట్లాడుతూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ పోటీలను నిర్వహిస్తున్నారని ప్రతీ సెగ్మెంట్ పోటీలలో తొలిరెండు స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్స్ లీగ్‌కు అర్హత సాధిస్తారని తెలిపారు. పార్టీ సీనియర్ నాయకుడు కొడాలి నాని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంలో ఉన్న క్రీడాకారులు వెలుగులోకి వచ్చేందుకు ఇలాంటి పోటీల వల్ల ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. తొలుత పోటీల నిర్వాహక కమిటీ చైర్మన్, విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ జనవరి ఐదునుంచి పదోతేదీవరకు సెమీస్, ఫైనల్స్ పోటీలు విశాఖలోని పోర్ట్ స్టేడియంలో జరగనున్నాయన్నారు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ. 2 లక్షల ప్రోత్సాహక బహుమతులు అందచేయనున్నామన్నారు. బొత్స సత్యన్నారాయణ గాల్లోకి బెలూన్లను విడిచి పోటీలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం బొత్స బ్యాటింగ్ చేయగా కొడాలి నాని బౌలింగ్ చేసారు. మళ్ల వికెట్ కీపింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. పోటీల ప్రారంభంలో పార్టీ నాయకులు దివంగత సీఎం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ పాలనకు అంతిమ ఘడియలు పీఎంపాలెం (భీమిలి): రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు పరచడంలో విఫలమైన టీడీపీ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు దాపురించాయని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. చాంపియన్ లీగ్ టీ10 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీపై విమర్శలు సంధించా రు. కల్లబొల్లి మాటలు చెప్పి అందలమెక్కి ఇచ్చిన వాగ్దానాలు అమలు పరచడంలో విఫలమైన సీఎం చంద్రబాబును రాష్ట్ర ప్రజలు క్షమిం చరన్నారు.హుందాతనానికి మారుపేరైన జననేత జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్నారు.టీడీపీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈ ప్రభంజనాన్ని నిలువరించడం అసాధ్యమన్నారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో ప్రజా వంచన తప్ప చేసిందేమీ లేదని బొత్స విమర్శించారు. నిరుద్యోగ భృతి పేరుతో లక్షలాది మంది నిరుద్యోగులను చంద్రబాబు నిలువునా మోసం చేసారని విమర్శించారు.రానున్న ఎన్నికలలో టీడీపీ గట్టిగా బుద్ధి చెప్పాలని యువతకు పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో భీమిలి సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, నగర పరిధిలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, కేకే రాజు, తిప్పల నాగిరెడ్డి, డాక్టర్ పీవీ రమణమూర్తి, ఎస్‌కోట నియోజకవర్గం సమన్వయ కర్త కడుబండ శ్రీనివాసరావు, అక్కరమాని వెంకటరావు, గాదె రోశిరెడ్డి, పోతిన శ్రీనివాసరావు, స్థానిక నాయకులు జెఎస్ రెడ్డి, గుమ్మడి మధు, వంకాయల మారుతీ ప్రసాద్, గరికిన గౌరి, మల్లువలస జగదీశ్వరరావు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు లభిమానులు పాల్గొన్నారు. -
సర్దార్ సింగ్‌కు పిలుపు
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ తిరిగి భారత హాకీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మిడ్ ఫీల్డ్‌ను బలోపేతం చేయడంలో భాగంగా అతనితో పాటు బీరేంద్ర లక్డాలను ఎంపిక చేశారు. ఈ నెల 23 నుంచి నెదర్లాండ్స్‌లో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీ కోసం గురువారం జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యుల జట్టుకు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నిరాశజనక ప్రదర్శన కనబరచడంతో జట్టులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కామన్వెల్త్ జట్టులో చోటు దక్కని సర్దార్ సింగ్, లాక్రాలను తిరిగి ఎంపిక చేశారు. జట్టు: గోల్‌కీపర్స్: శ్రీజేశ్ (కెప్టెన్), బహదూర్ పాఠక్. డిఫెండర్స్: హర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, సురేందర్, జర్మన్‌ప్రీత్ సింగ్, బీరేంద్ర లక్డా, అమిత్ రొహిదాస్. మిడ్ఫీల్డర్స్: మన్‌ప్రీత్ సింగ్, చింగ్లెన్సన సింగ్, సర్దార్ సింగ్, వివేక్ సాగర్. ఫార్వర్డ్స్: సునీల్ విఠలాచార్య, రమణ్‌దీప్ సింగ్, మన్దీప్ సింగ్, సుమిత్ కుమార్, ఆకాశ్‌దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్. -
యూరోప్ కింగ్స్
ప్రతిష్టాత్మక ‘చాంపియన్స్ లీగ్’ ఫుట్‌బాల్ టైటిల్‌ను రియల్ మాడ్రిడ్ క్లబ్ 11వ సారి సొంతం చేసుకుంది. ఇటలీలోని మిలాన్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో రియల్ మాడ్రిడ్ (స్పెయిన్) క్లబ్ ‘పెనాల్టీ షూటౌట్’లో 5-3తో అట్లెటికో మాడ్రిడ్ (స్పెయిన్) క్లబ్‌పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన రియల్ మాడ్రిడ్ జట్టుకు కోటీ 50 లక్షల యూరోలు (రూ. 111 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించింది. యూరోప్ దేశాల్లోని ఫుట్‌బాల్ క్లబ్ జట్ల మధ్య ఈ లీగ్ జరుగుతుంది. -
‘లబ్ధిదారుల’ జాబితాలో గవాస్కర్, రవిశాస్త్రి
సుప్రీంకోర్టుకు అందజేసిన బీసీసీఐ తీర్పు రిజర్వ్ చేసిన ఉన్నత న్యాయస్థానం న్యూఢిల్లీ: ఐపీఎల్, చాంపియన్స్ లీగ్‌లతో లాభం పొందుతున్న బోర్డు పరిపాలకులు, ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ బుధవారం సుప్రీంకోర్టు ముందుంచింది. మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, గంగూలీ, రవిశాస్త్రి, కృష్ణమాచారి శ్రీకాంత్, లాల్‌చంద్ రాజ్‌పుత్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ ఈ ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాల’ జాబితాలో ఉన్నారు. విచారణ సందర్భంగా మొత్తం 12 మంది పేర్లను బోర్డు న్యాయవాది సీఏ సుందరమ్ కోర్టుకు అందజేశారు. వీరికి బోర్డుతో పాటు ఐపీఎల్, చాంపియన్స్ లీగ్‌తో రకరకాల సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు బీసీసీఐ అందజేసిన జాబితాతో తప్పులు ఉన్నాయని బీహార్ క్రికెట్ సంఘం న్యాయవాది నళిని చిదంబరం కోర్టుకు విన్నవించారు. మరోవైపు బీసీసీఐలోగానీ, ఐపీఎల్‌లోగానీ తనకు పరిపాలన పాత్ర లేదని గవాస్కర్ అన్నారు. ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై బుధవారం చివరి దశ వాదనలు విన్న సుప్రీంకోర్టు ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్‌కు సంబంధించిన తీర్పును రిజర్వ్‌లో ఉం చింది. ఈ వారాంతం నుంచి కోర్టుకు శీతాకాలం సెలవులు ఉండటంతో జనవరి 5 తర్వాత దీనిపై తీర్పు వెలువడే అవకాశం ఉంది. -
ఐపీఎల్, సీఎల్ లబ్ధిదారుల వివరాలు అందించండి
బీసీసీఐకి సుప్రీం కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: ఐపీఎల్, చాంపియన్స్ లీగ్‌తో లాభం పొందుతున్న బోర్డు పరిపాలకులు, ఆటగాళ్ల జాబితాను తమ ముందుంచాలని సుప్రీం కోర్టు బీసీసీఐని కోరింది. పాలనాధికారిగా ఉండడంతో పాటు ఐపీఎల్, సీఎల్లో జట్టును కలిగి ఉండవచ్చనేవివాదాస్పద నిబంధనపై బోర్డు వాదనలు వినిపిస్తున్న సమయంలో కోర్టు ఈ సూచన చేసింది. ‘బీసీసీఐ అధికారులు లీగ్‌లో జట్లను కలిగి ఉండకపోతే స్వర్గమేమీ కూలిపోదు. ఒకవేళ బోర్డు అధ్యక్షుడికి సొంత ఫ్రాంచైజీ లేకపోతే మొత్తం ఐపీఎల్ ప్రాజెక్ట్ కుప్పకూలిపోదు. ఎలాంటి వాణిజ్యపరమైన లాభాలు లేకపోతే ఈ లీగ్ ప్రారంభమయ్యేదే కాదు. అధికారులతో పాటు ఇతరుల జాబితాను మాకు ఇవ్వండి’ అని జస్టిస్ టీఎస్ ఠాకూర్, కలీఫుల్లాలతో కూడిన బెంచ్ తెలిపింది. 6.2.4 నిబంధనను మార్చకపోతే జట్లను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదని బోర్డు కౌన్సిల్ సీఏ సుందరం వాదనను కోర్టు తోసిపుచ్చింది. అసలు ఏ ఉద్దేశంతో ఆ నిబంధనను మార్చారో తెలుసుకోవాల్సిన అవసరం ఈ దేశ ప్రజలకు ఉందని కోర్టు అభిప్రాయపడింది. రూ.425 కోట్లపై ఈడీ దర్యాప్తు ఐపీఎల్ మీడియా హక్కుల విషయంలో చేతులు మారిన రూ.425 కోట్ల ‘అసలు లబ్ధిదారులు’ ఎవరనేది ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) పరిశోధిస్తున్నట్టు పార్లమెంట్లో కేంద్రం తెలిపింది. -
రైనా సెంచరీ: టైటిల్ వేటలో చెన్నై 'సూపర్'
బెంగళూరు: ఆరు ఫోర్లు..ఎనిమిది సిక్సర్లు..ఒక జట్టులో ఆటగాడు ఈ తరహా బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థి జట్టులో వణుకు పుట్టకమానదు. అది కూడా ఫైనల్ పోరులో అయితే అవతలి ఎండ్ లో ఆటగాళ్లు మిన్నుకుండు పోవాల్సిందే. సురేష్ రైనా అదే చేసి చూపెట్టాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నైకు రైనా సునాయాస విజయాన్ని అందించాడు. శనివారం ఇక్కడ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన తుది పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది వికెట్లు తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ ను చేజిక్కించుకుంది. కోల్ కతా విసిరిన 181 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ఆడుతూ పాడుతూ ఛేదించింది. సెమీ ఫైనల్ కు చేరుకునే క్రమంలో ఒక్క మ్యాచ్ లో కూడా ఓటమి చవిచూడని కోల్ కతాకు ధోనీ సేన షాకిచ్చింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన చెన్నై 18.3 ఓవర్లో 185 పరుగులు చేసి సూపర్ విక్టరీని నమోదు చేసింది. ఆదిలో స్మిత్ వికెట్టు కోల్పోయిన చెన్నైను సురేష రైనా ఆదుకున్నాడు. రైనా (109; 62 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సులు) చేయడంతో చెన్నై గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. అతనికి తోడుగా మెక్ కలమ్ (39) పరుగులు చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. తనదైన రోజున ప్రత్యర్థులపై విరుచుకుపడే చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అదే జోరును టైటిల్ వేటలో కొనసాగించింది. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ విశేషంగా రాణించిన చెన్నై చాంపియన్స్ లీగ్ టైటిల్ ను రెండో సారి కైవసం చేసుకుంది. గతంలో 2010 లో చెన్నై టైటిల్ ను సాధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు టాస్ గెలిచిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా కోల్ కతాను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతాకు ఓపెనర్లు రాబిన్ ఊతప్ప(39; 32బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), గౌతం గంభీర్(80;52 బంతుల్లో 7 ఫోర్లు,3సిక్సులు)లు శుభారంభాన్నిచ్చారు. అనంతరం జాక్వస్ కల్లిస్ (1) పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. చివర్లో యూసఫ్ పఠాన్(20), మనీష్ పాండే(32) పరుగులు చేయడంతో కోల్ కతా నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 180పరుగులు చేసింది. -
చాంపియన్స్ లీగ్ ఫైనల్: చెన్నైవిజయలక్ష్యం 181
బెంగళూర్: చాంపియన్స్ లీగ్ లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా కోల్ కతాను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతాకు ఓపెనర్లు రాబిన్ ఊతప్ప(39; 32బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), గౌతం గంభీర్(80;52 బంతుల్లో 7 ఫోర్లు,3సిక్సులు)లు శుభారంభాన్నిచ్చారు. అనంతరం జాక్వస్ కల్లిస్ (1) పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. చివర్లో యూసఫ్ పఠాన్(20),మనీష్ పాండే(32) పరుగులు చేయడంతో కోల్ కతా నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 180పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నేగీ ఐదు వికెట్లు తీసి ఆకట్టుకోగా, రవీంద్ర జడేజాకు ఒక వికెట్టు లభించింది. -
చెన్నై x కోల్‌కతా
వరుసగా రెండో ఏడాది చాంపియన్స్ లీగ్ టి20 టోర్నమెంట్ టైటిల్ ఐపీఎల్ జట్టుకే దక్కనుంది. ఐపీఎల్ జట్లయిన కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ అంతిమ సమరానికి అర్హత సాధించాయి. సెమీఫైనల్స్‌లో కోల్‌కతా ఏడు వికెట్ల తేడాతో హోబర్ట్ హరికేన్స్ జట్టుపై, చెన్నై సూపర్ కింగ్స్ 65 పరుగుల ఆధిక్యంతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై గెలిచాయి. ఫైనల్ శనివారం బెంగళూరులో జరుగుతుంది. ► సెమీస్‌లో ఓడిన పంజాబ్, హోబర్ట్ జట్లు ► అవానా ‘హ్యాట్రిక్’ వృథా ► రాణించిన కలిస్ ► బ్రేవో మెరుపు ఇన్నింగ్స్ ► చాంపియన్స్ లీగ్ సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ చాంపియన్స్ లీగ్‌లో తమ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. టి20ల్లో వరుసగా 14వ విజయం సాధించిన కోల్‌కతా జట్టు గురువారం ఇక్కడి ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో 7 వికెట్ల తేడాతో హోబర్ట్ హరికేన్స్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హోబర్ట్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 140 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (46 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, డంక్ (29 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం నైట్‌రైడర్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 141 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జాక్ కలిస్ (40 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌తో ముందుండి నడిపించగా... మనీశ్ పాండే (32 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఐపీఎల్లో దాదాపు 200 పరుగుల లక్ష్యాలను కూడా అవలీలగా ఛేదించిన పంజాబ్‌కు ఈ సారి కలిసి రాలేదు. పటిష్టమైన చెన్నైతో నాటి ప్రదర్శనను ఆ జట్టు పునరావృతం చేయలేకపోయింది. చాంపియన్స్ లీగ్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు నెగ్గిన ఆ జట్టు సెమీస్‌లో చేతులెత్తేసింది. రెండో సెమీఫైనల్లో చెన్నై 65 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డ్వేన్ బ్రేవో (39 బంతుల్లో 67; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, డు ప్లెసిస్ (33 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. పంజాబ్ బౌలర్ పర్వీందర్ అవానా హ్యాట్రిక్ సాధించాడు. తన రెండో ఓవర్ చివరి బంతికి రైనాను అవుట్ చేసిన అతను...మూడో ఓవర్ తొలి రెండు బంతులకు నేగి, ధోనిలను పెవిలియన్ పంపించాడు. అనంతరం పంజాబ్ 18.2 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. అక్షర్ పటేల్ (18 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్కోరు వివరాలు: హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్: డంక్ (సి) గంభీర్ (బి) కుల్దీప్ 39; మైకేల్ (సి) అండ్ (బి) రసెల్ 0; బ్లిజార్డ్ (ఎల్బీ) (బి) పఠాన్ 0; మాలిక్ (నాటౌట్) 66; బిర్ట్ (సి) డస్కటే (బి) నరైన్ 13; వెల్స్ (బి) చావ్లా 3; గల్బిస్ (రనౌట్) 15; హిల్ఫెన్హాస్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 140 వికెట్ల పతనం: 1-4; 2-13; 3-46; 4-77; 5-91; 6-135; బౌలింగ్: యూసుఫ్ పఠాన్ 4-0-24-1; రసెల్ 4-0-24-1; నరైన్ 4-0-24-1; కుల్దీప్ 4-0-31-1; చావ్లా 4-0-35-1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (బి) డోహర్తి 17; గంభీర్ (సి) వెల్స్ (బి) బొలింజర్ 4; కలిస్ (నాటౌట్) 54; పాండే (సి) మాలిక్ (బి) లాఫ్లిన్ 40; పఠాన్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 141 వికెట్ల పతనం: 1-20; 2-44; 3-107. బౌలింగ్: హిల్ఫెన్హాస్ 4-0-28-0; బొలింజర్ 3.1-0-26-1; డోహర్తి 4-0-28-1; గల్బిస్ 4-0-23-0; లాఫ్లిన్ 4-0-36-1. స్కోరు వివరాలు: చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) అవానా 14; మెకల్లమ్ (సి) అవానా (బి) పెరీరా 6; రైనా (సి) బెయిలీ (బి) అవానా 6; డు ప్లెసిస్ (బి) అక్షర్ 46; బ్రేవో (సి) మ్యాక్స్‌వెల్ (బి) అక్షర్ 67; నేగి (బి) అవానా 8; ధోని (సి) కరణ్వీర్ (బి) అవానా 0; జడేజా (నాటౌట్) 27; అశ్విన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 182 వికెట్ల పతనం: 1-23; 2-29; 3-41; 4-106; 5-141; 6-141; 7-160. బౌలింగ్: అనురీత్ 4-0-44-0; అవానా 4-0-30-4; పెరీరా 4-0-41-1; కరణ్వీర్ 4-0-36-0; అక్షర్ పటేల్ 4-0-30-2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) మెకల్లమ్ (బి) మోహిత్ 0; వోహ్రా (సి) డు ప్లెసిస్ (బి) వోహ్రా 16; సాహా (బి) నెహ్రా 6; మ్యాక్స్‌వెల్ (సి) ధోని (బి) నెహ్రా 0; మిల్లర్ (బి) అశ్విన్ 22; బెయిలీ (సి) మెకల్లమ్ (బి) నేగి 6; పెరీరా (సి) బ్రేవో (బి) నేగి 0; అక్షర్ (బి) రైనా 31; కరణ్వీర్ (నాటౌట్) 17; అవానా (సి) డు ప్లెసిస్ (బి) రైనా 0; అనురీత్ (సి) రైనా (బి) జడేజా 16; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 117 వికెట్ల పతనం: 1-3; 2-24; 3-24; 4-24; 5-34; 6-34; 7-61; 8-90; 9-90; 10-117; బౌలింగ్: నెహ్రా 3-0-9-2; మోహిత్ 3-0-14-2; అశ్విన్ 4-0-33-1; నేగి 4-0-28-2; జడేజా 1.2-0-9-1; రైనా 2-0-10-2; బ్రేవో 1-0-12-0. -
చెన్నైని సెమీస్‌కు చేర్చిన పెర్త్
కీలక మ్యాచ్‌లో ఓడిన లాహోర్ బెంగళూరు: చాంపియన్స్ లీగ్‌లో పెర్త్, లాహోర్ల మధ్య గ్రూప్ ‘ఎ’ ఆఖరి లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో లాహోర్ కనీసం 46 పరుగుల తేడాతో పెర్త్‌ను ఓడిస్తే సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ పెర్త్ గెలిచినా లేక లాహోర్ 46 కంటే తక్కువ పరుగుల తేడాతో నెగ్గినా... చెన్నై సెమీస్‌కు వెళుతుంది. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం నాటకీయంగా మ్యాచ్ సాగింది. తొలుత లాహోర్ కేవలం 124 పరుగులే చేసింది. లక్ష్య ఛేదనలో పెర్త్ తడబడి 40 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 78 పరుగులకు పెర్త్‌ను నియంత్రిస్తే లాహోర్ సెమీస్‌కు చేరుతుంది. ఈ స్థితిలో పెర్త్ కెప్టెన్ మిషెల్ మార్ష్ (38 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో పెర్త్‌ను మూడు వికెట్ల తేడాతో గెలిపించాడు. ఫలితంగా చెన్నై ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా సెమీస్‌కు చేరింది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో పెర్త్ ఫీల్డింగ్ ఎంచుకోగా... లాహోర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. సాద్ నసీమ్ (55 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించాడు. 11 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లాహోర్‌ను నసీమ్, ఉమర్ అక్మల్ (19 బంతుల్లో 26; 4 ఫోర్లు) కలిసి ఆదుకున్నారు. పెర్త్ బౌలర్లలో పారిస్ 3, మిషెల్ మార్ష్ 2 వికెట్లు తీసుకున్నారు. పెర్త్ జట్టు 19 ఓవర్లలో ఏడు వికెట్లకు 130 పరుగులు చేసి నెగ్గింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మార్ష్‌తో పాటు బ్రాడ్ హాగ్ (19 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా ఆడాడు. హఫీజ్, ఇక్బాల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంతో చెన్నై సెమీస్‌కు చేరింది. -
చాంపియన్స్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ బోణి
-
పంజాబ్ కింగ్స్ బోణి
మొహాలీ: ఐపీఎల్-7లో వీర బాదుడుకు పర్యాయంగా నిలిచిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (25 బంతుల్లో 43; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) మరోసారి తన పవర్ చూపించాడు. లక్ష్యం చిన్నదే అయినా నాలుగు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును తనకే సాధ్యమైన ఆటతీరుతో గట్టెక్కించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పెరీరా, బెయిలీ (27 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు) చివర్లో చెలరేగడంతో చాంపియన్స్ లీగ్‌లో తొలిసారిగా ఆడుతున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు శుభారంభం చేసింది. పీసీఏ స్టేడియంలో గురువారం హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో బెయిలీ సేన ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హరికేన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. వెల్స్ (18 బంతుల్లో 28; 5 ఫోర్లు), బిర్ట్ (21 బంతుల్లో 28; 1 ఫోర్; 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. బౌలింగ్‌లో పెరీరా (2/17) రాణించాడు. అనంతరం పంజాబ్ 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసి నెగ్గింది. నెమ్మదిగా ఆరంభం హరికేన్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే నెమ్మదిగా సాగింది. ఐదో ఓవర్లో కెప్టెన్ పైన్ (16 బంతుల్లో 11; 1 ఫోర్)ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో ఓపెనర్ డంక్ మూడు ఫోర్లతో రెచ్చిపోయినా ఎనిమిదో ఓవర్లో పెరీరాకు దొరికిపోయాడు. పంజాబ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మిడిల్ ఓవర్లలోనూ హరికేన్ బ్యాట్స్‌మెన్ పరుగులు తీసేందుకు ఇబ్బందిపడ్డారు. అటు వరుస ఓవర్లలో బ్లిజార్డ్, షోయబ్ మాలిక్ (14 బంతుల్లో 14; 1 ఫోర్) అవుట్ కావడంతో స్కోరు మరింత నెమ్మదించింది. చివర్లో బౌలర్లు మంచి బంతులు వేయడంతో భారీ స్కోరు సాధ్యపడలేదు. తొలి బంతికే ఝలక్ పంజాబ్ బ్యాటింగ్‌లో బొలింజర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే వీరేంద్ర సెహ్వాగ్ అవుటై నిరాశపరిచాడు. తన మరుసటి ఓవర్లోనే సాహా (9 బంతుల్లో 11; 1 ఫోర్)ను కూడా బొలింజర్ పెవిలియన్ పంపించాడు. మిల్లర్ డకౌట్‌తో 23 పరుగులకే మూడు వికెట్లు పోవడంతో పంజాబ్ శిబిరంలో ఆందోళన నెలకొన్నా మ్యాక్స్‌వెల్ ఆ పరిస్థితిని మార్చాడు. తాను ఎదుర్కొన్న మూడో బంతిని సిక్స్‌గా మలిచిన ఈ డాషింగ్ ఆటగాడు ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. అయితే బోయ్స్ వేసిన 9వ ఓవర్లో 6,4తో అదరగొట్టి జోరు చూపిస్తున్న వేళ గల్బిస్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే బెయిలీ, పెరీరా వేగంగా ఆడి మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. స్కోరు వివరాలు హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్: డంక్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) పెరీరా 26; పైన్ (బి) పటేల్ 11; బ్లిజార్డ్ (సి) అవానా (బి) పెరీరా 27; షోయబ్ (సి) బె యిలీ (బి) కరణ్వీర్ 14; బర్ట్ (సి) కరణ్వీర్ (బి) అవానా 28; వెల్స్ (రనౌట్) 28; గల్బిస్ నాటౌట్ 6; హిల్ఫెన్హాస్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (4); మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1-15; 2-43; 3-71; 4-78; 5-130; 6-143. బౌలింగ్: అనురీత్ సింగ్ 4-0-25-0; అవానా 4-0-25-1; పటేల్ 4-0-20-1; సెహ్వాగ్ 1-0-8-0; పెరీరా 3-0-17-2; మ్యాక్స్‌వెల్ 1-0-9-0; కరణ్వీర్ సింగ్ 3-0-37-1. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) బోయ్స్ (బి) బొలింజర్ 0; వోహ్రా (సి) హిల్ఫెన్హాస్ (బి) లాగ్లిన్ 18; సాహా (సి) షోయబ్ (బి) బొలింజర్ 11; మిల్లర్ (సి) బోయ్స్ (బి) హిల్ఫెన్హాస్ 0; మ్యాక్స్‌వెల్ (సి) పైన్ (బి) గల్బిస్ 43; బెయిలీ నాటౌట్ 34; పెరీరా నాటౌట్ 35; ఎక్స్‌ట్రాలు (5); మొత్తం (17.4 ఓవర్లలో 5 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1-0; 2-21; 3-23; 4-51; 5-77. బౌలింగ్: బొలింజర్ 4-0-30-2; హిల్ఫెన్హాస్ 4-0-30-1; బోయ్స్ 3-0-36-0; లాగ్లిన్ 4-0-26-1; గల్బిస్ 2.4-0-23-1. -
హైదరాబాద్ సిటిల్లో చాంపియన్స్ లీగ్
-
బైక్ అంటేనే లైక్ :ధోని
బైక్ మీద రివ్వున దూసుకుపోవడం అంటే ఎవరికిష్టం ఉండదు... ధోని కూడా ఈ విషయంలో సగటు భారతీయుడే. బైక్‌లంటే చెవి కోసుకుంటాడు. ఏదైనా కొత్త తరహా బైక్ కనిపిస్తే వెంటనే దాన్ని నడపాలంటాడు. ఏదైనా మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా బైక్ వచ్చిందంటే... జట్టులో ఎవరికి వచ్చినా తాను తీసుకుని గ్రౌండ్లో రౌండ్ వేస్తాడు. గత ఏడాది చాంపియన్స్ లీగ్ సమయంలో ధోని పెద్ద సాహసమే చేశాడు. రాజస్థాన్‌తో మ్యాచ్ ముగిశాక జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్లడానికి చెన్నై జట్టు మొత్తం విమానం ఎక్కేసింది. కానీ ధోని మాత్రం ఒక్కడే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బైక్ మీద ఢిల్లీ వెళ్లాడు. తనకు బాగా ఇష్టమైన హెల్కాట్ ఎక్స్ 132 (2200 సీసీ) మీద మూడు గంటలలోపే 266 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసి రాజధానికి చేరుకున్నాడు. మహికి బైక్‌లంటే ఎంతఇష్టమో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇదే బైక్‌ను గత ఏడాది నోయిడాలో ఉన్న బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌పై కూడా నడిపాడు. ఇక ఈ బైక్‌ను కొనుగోలు చేసిన తొలి దక్షిణాసియా వ్యక్తి ధోనీయే కావడం విశేషం. ఈ హెల్కాట్ ఎక్స్ 132 బైక్‌ను ధోనీ రూ. 28 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇదే ధోనీ దగ్గరున్న అత్యంత ఖరీదైన బైక్. ఒకప్పుడు రాజ్‌దూత్, యమహా లాంటి బైక్‌లంటే చాలా ఇష్టపడే మహి ఇప్పుడు మనసుకు నచ్చిన లేటెస్ట్ బైక్‌లు నడుపుతూ తన ముచ్చటను తీర్చుకుంటున్నాడు. అలాగని పాత బైక్‌లపై మోజు తీరిందనుకుంటే పొరపాటే.. ప్రతీ బైక్ అతని గ్యారేజీలో ఉండాల్సిందే. రాంచీలో లంకంత ఇల్లు కట్టుకున్న ధోని.. అక్కడే తాను ముచ్చటపడిన బైక్‌ల కోసం గ్యారేజీని కూడా ఏర్పాటు చేశాడు. ఇప్పటి వరకు 20 బైక్‌లను కొనుగోలు చేసిన మహి వీటిలో ఎక్కువ బైక్‌లను రాంచీలోని గ్యారేజీకి తరలించాడట. తాను తొలిసారిగా అమితంగా ఇష్టపడి నడిపిన బైక్ (రాజ్‌దూత్)ను తీసేయకుండా ప్రస్తుతం తన గ్యారేజీలోనే ఉంచాడు. అప్పట్లో దానిని రూ.4500కు కొన్నాడట. రెండేళ్ల క్రితం అది చెడిపోతే దగ్గరుండి రిపేర్ చేయించుకున్నాడు. బిజీ షెడ్యూల్ కారణంగా గ్యారేజీలో ఉన్న బైక్‌లను నడపడం వీలుచిక్కడం లేదని తెగ ఫీలైపోతున్నాడట. క్రికెట్ నుంచి ఏ మాత్రం విరామం లభించినా బైక్ మీద రాంచీలో చక్కర్లు కొట్టడం ధోనీకి అత్యంత ఇష్టమైన వ్యాపకం. -
‘పాల బుగ్గల’ పోటుగాడు!
ఏడాది క్రితం...చాంపియన్స్ లీగ్ టి20 మ్యాచ్. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైవెల్డ్ లయన్స్ తడబడింది. నిప్పులు చిమ్ముతున్న జాన్సన్, మలింగ బౌలింగ్‌కు ఎదురొడ్డి 19 ఏళ్ల కుర్రాడు తన జట్టును విజేతగా నిలిపాడు. గత గురువారం... అదే వాండరర్స్ మైదానంలో ఆ కుర్రాడే మైదానంలోకి దిగుతుంటే అభిమానులు నీరాజనాలు పట్టారు. జొహన్నెస్‌బర్గ్‌లోనే పుట్టిన ఈ కుర్రాడు తొలిసారి సొంతగడ్డపై ఆడుతూ అద్భుత సెంచరీతో తన ఫ్యాన్స్ అంచనాలను అందుకున్నాడు. దక్షిణాఫ్రికా క్రికెట్లో పాత రికార్డులన్నీ చెరిపేస్తూ ఇంత తొందరగా ఒక కుర్రాడు దూసుకుపోవడం విశేషమే. పాలుగారే బుగ్గలు, అమ్మాయిలా సున్నితంగా కనిపించే మొహంతో ఇంకా పసితనం వీడనట్లు ఉండే క్వాంటన్ డి కాక్... ఫామ్‌లో ఉన్న టీమిండియాపై వరుసగా మూడు శతకాలతో తన సత్తా చూపించాడు. వికెట్ కీపర్‌గా కూడా చురుకైన కదలికలతో...బౌచర్లాంటి దిగ్గజం స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడిననే సందేశానిచ్చాడు. స్కూల్ స్థాయిలోనే: దక్షిణాఫ్రికా ప్రస్తుత కెప్టెన్ గ్రేమ్ స్మిత్ చదివిన కింగ్ ఎడ్వర్డ్ హైస్కూల్లోనే చదివిన డి కాక్ అక్కడే ఆటలో ఓనమాలు నేర్చుకున్నాడు. అదే సమయంలో క్లబ్ క్రికెట్లో భారీగా పరుగులు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ ప్రదర్శనతో పాటు దూకుడైన మనస్తత్వం అతడికి జాతీయ అండర్-19 జట్టు కెప్టెన్‌గా కూడా అవకాశం కల్పించింది. కలిసొచ్చాయి: సీఎల్‌టి20 ప్రదర్శన, ఫస్ట్‌క్లాస్ కెరీర్లో నిలకడతో పాటు డివిలియర్స్ విశ్రాంతి కోరడంతో ఈ కుర్రాడికి దక్షిణాఫ్రికా సీనియర్ టీమ్ నుంచి పిలుపు వచ్చింది. బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా వికెట్ కీపర్‌గా రాణించడం, చిన్న వయసు కూడా కావడంతో వరుసగా అతడిని కొనసాగించారు. ఈ మధ్యలో సన్‌రైజర్స్ తరఫున ఐపీఎల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఎట్టకేలకు తాను ఆడిన తొమ్మిదో వన్డేలో (పాక్‌పై) శతకంతో పోటీలో ఉన్న కీపర్లను వెనక్కి తోసి కాక్ నిలదొక్కుకున్నాడు. ఇక భారత్‌తో సిరీస్‌లో లభించిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. ఎన్నో ఏళ్ల అనుభవం తర్వాతే దిగ్గజాలకు సాధ్యమైన వరుస సెంచరీల రికార్డును చిన్న వయసులోనే అందుకున్నాడు. ఈ సిరీస్‌లో ఆడిన తీరు చూస్తుంటే భవిష్యత్తులో టెస్టు జట్టులో అతనికి చోటు దక్కొచ్చు. - సాక్షి క్రీడావిభాగం వచ్చే బుధవారంతో 21 ఏళ్లు నిండనున్న ఈ కుర్రాడు వ్యక్తిగత జీవితంలో మాత్రం ముదురేనండోయ్. మైనార్టీ తీరగానే గత రెండేళ్లుగా సాషా హర్లీ అనే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు. 21 ఏళ్లలోపే 4 సెంచరీలు సాధించిన డి కాక్... స్టిర్లింగ్ (ఐర్లాండ్) రికార్డు సమం చేశాడు. 3 వన్డేల సిరీస్‌లో అత్యధిక పరుగులు(342) చేసిన ఆటగాడు డికాక్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండానే డి కాక్ 4 సెంచరీలు చేయడం విశేషం. తక్కువ ఇన్నింగ్స్‌లలో (16) నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడు కూడా అతనే. -
మరో ఐపీఎల్!
చాంపియన్స్ లీగ్‌కు మొదట్నించీ ఉన్న పేరు... మరో ఐపీఎల్. ఈ సీజన్లోనూ మళ్లీ అదే కనిపించింది. సెమీఫైనల్‌కు చేరిన నాలుగు జట్లలో మూడు ఐపీఎల్వే కావడంతో లీగ్‌కు విదేశాల్లో ఆదరణ తగ్గింది. 12 జట్లు పాల్గొంటే నాలుగు ఐపీఎల్ జట్లు బరిలోకి దిగడమే దీనికి ప్రధాన కారణం. ఈ టోర్నీకి బీజం వేసింది బీసీసీఐ కావడం, మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్‌లో క్రికెట్ మార్కెట్ పెద్దది కావడం, ఆదాయం కూడా ఇక్కడి నుంచే ఎక్కువ వచ్చే అవకాశం ఉండటం వల్ల ఐపీఎల్ జట్లకు ప్రాధాన్యత పెరిగింది. అయితే కేవలం ఐపీఎల్ జట్లు ఆడుతున్న మ్యాచ్‌లనే ప్రేక్షకులు చూస్తున్నప్పుడు దీన్ని ఒక ‘గ్లోబల్ టోర్నీ’గా భావించవచ్చా! మరి దీనికి, ఐపీఎల్‌కు తేడా లేనప్పుడు సీఎల్‌టి20 ప్రత్యేకత ఏముంటుంది? మిగిలిన మ్యాచ్‌లపై ఆసక్తి లేదు ఐపీఎల్ సూపర్ సక్సెస్ ఊపులో మరింత సొమ్ము చేసుకునేందుకు 2009లో లీగ్‌ను హడావిడిగా ప్రారంభించారు. అయితే టోర్నీ మొదలైననాటినుంచి కూడా ఇది అభిమానులకు చేరువ కావడంలో విఫలమైంది. ముఖ్యంగా విదేశీ జట్ల గురించి ఫ్యాన్స్‌కు పెద్దగా పరిచయం లేకపోవడం, ఐపీఎల్ తరహాలో సొంత మైదానంలో ఆడే అవకాశం ఇవ్వని లీగ్ షెడ్యూల్...తదితర కారణాలతో వారు లీగ్‌ను పట్టించుకోలేదు. ఈసారి కూడా... ధోని ఆడిన అద్భుత ఇన్నింగ్స్లాంటిది తప్పితే తటస్థ అభిమానులకు చెప్పుకోదగ్గ వినోదం ఎక్కడా దక్కలేదు. నిజానికి ఒటాగో వోల్ట్స్, లయన్స్ మధ్య అద్భుతమైన టి20 మ్యాచ్ జరిగింది. డి కాక్, నీషామ్ చక్కటి ఆటతో పాటు సూపర్ ఓవర్ కూడా ‘టై’గా నిలిచే స్థాయిలో ఉత్కంఠభరితంగా సాగింది. అయితే భారత అభిమానుల్లో టోర్నీపై ఆసక్తి పెంచేందుకు ఈ ప్రదర్శన కూడా సరిపోలేదు. స్థాయి తక్కువ పోరు... ఈ సారి సీఎల్‌టి20లో జట్ల ఆట స్థాయి కూడా నాసిరకంగా ఉంది. క్వాలిఫయర్స్‌తో కలిసి మొత్తం 12 జట్లు బరిలోకి దిగాయి. ఇందులో నాలుగు జట్లు కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాయి. మరో రెండు జట్లు ఒక్కో విజయం సాధించాయి. అంటే ఆరు జట్లు కలిపి రెండే మ్యాచ్‌లు నెగ్గితే ఇక పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా కనీస పోటీ కూడా ఇవ్వలేని జట్లు ఆయా దేశపు అత్యుత్తమ టి20 టీమ్‌లంటే ఇంక పోటీ ఎక్కడ ఉంటుంది! ముఖ్యంగా ఐపీఎల్లో చెలరేగిపోయే విదేశీ ఆటగాళ్లు తమ స్వంత దేశపు జట్ల తరఫున కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. టీవీ ప్రేక్షకులు కొంత మేరకు మ్యాచ్‌లు చూసినా...వస్తున్న ప్రకటనలు చూస్తే స్పందన పెద్దగా లేదని అర్ధమవుతుంది. మైదానాల్లో అయితే ప్రేక్షకుల సంఖ్య మరీ పల్చగా ఉంది. ‘లీగ్‌తో అసలు ఎలాంటి సందడి లేదు. భారత్ బయట అయితే అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు. పూర్తిగా టైమ్‌వేస్ట్ వ్యవహారం’ అని క్రికెట్ వీరాభిమాని అయిన ఒక బ్రాండింగ్ కంపెనీ సీఈఓ వ్యాఖ్యానించారు. మార్పులు చేస్తారా... ఐపీఎల్ తర్వాత ఆ స్థాయి అందుకుంటుందని భావించి లీగ్‌కు అంకురార్పణ చేసిన నిర్వాహకులు తాజా పరిస్థితిని చూసి నిట్టూరుస్తున్నారు. లీగ్‌ను సక్సెస్ చేసేందుకు ఏం చేయాలనే దానిపై కసరత్తు మొదలైంది. ‘భారత్‌కంటే సీఎల్‌టి20కి దక్షిణాఫ్రికాలో ఎక్కువ ఆదరణ లభించింది. కాబట్టి దీనిని భారత్ బయట నిర్వహించడం, ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది జట్లనే ఆడించి నాకౌట్ తరహాలో టోర్నీ నిర్వహించడం తదితర మార్పులపై దృష్టి పెడుతున్నాం’ అని లీగ్‌తో సంబంధాలు ఉన్న ఒక అధికారి వెల్లడించారు. ఏదేమైనా కొత్త మార్పులతో ఆసక్తికరంగా మారితేనే చాంపియన్స్ లీగ్‌కు భవిష్యత్తులో మనుగడ ఉంటుందనేది ఖాయం. - సాక్షి క్రీడా విభాగం -
నేడే ‘ఫైనల్’
సచిన్ టెండూల్కర్ అభిమానులంతా ఈ రోజు రాత్రి టీవీ సెట్ల ముందు కూర్చోవాల్సిందే. చాంపియన్స్ లీగ్‌తో పరిమిత ఓవర్ల ఆటకు గుడ్‌బై చెబుతున్న మాస్టర్... తన కెరీర్లో చివరిసారి రంగుదుస్తుల్లో పోటీ క్రికెట్ ఆడబోతున్నాడు. ట్రినిడాడ్‌తో శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో ముంబై ఇండియన్స్ అలవోకగా నెగ్గి... రాజస్థాన్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఇద్దరు దిగ్గజాల (సచిన్, ద్రవిడ్) చివరి ముఖాముఖి పోరుకు ఢిల్లీ వేదికైంది. ‘స్టేడియంలో స్క్రీన్ మీద చూసేవరకూ 50 వేల పరుగులకు చేరువయ్యాననే విషయం నాకు తెలియదు. నాకు కొంచెం ‘నమ్మకాలు’ ఎక్కువ. కాబట్టి ఫైనల్ గురించి ఏమీ మాట్లాడను. పొలార్డ్, స్మిత్ మా జట్టులో ఉండటం అదృష్టం’ - సచిన్ న్యూఢిల్లీ: క్లబ్ క్రికెట్లో ఐపీఎల్ స్థాయి ఏంటో మరోసారి బయటపడింది. ఆరు దేశాల నుంచి 12 జట్లు పాల్గొన్న చాంపియన్స్ లీగ్‌లో రెండు ఐపీఎల్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఆదివారం జరిగే ఫైనల్లో ద్రవిడ్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమైంది. ఇదే మైదానంలో శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టుపై గెలిచింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ట్రినిడాడ్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్ లూయిస్ (46 బంతుల్లో 62; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ చేశాడు. యానిక్ ఓట్లీ (30 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ ద్వితీయార్థంలో వేగంగా ఆడాడు. ముంబై ఇండియన్స్ జట్టు 19.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు డ్వేన్ స్మిత్ (38 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సచిన్ టెండూల్కర్ (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 66 బంతుల్లో 90 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. అయితే ట్రినిడాడ్ బౌలర్లు ఆరు పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరితో పాటు రాయుడును కూడా అవుట్ చేసి ముంబైపై ఒత్తిడి పెంచారు. కెప్టెన్ రోహిత్ (22 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (21 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి నాలుగో వికెట్‌కు 42 పరుగులు జోడించి పరిస్థితి చేజారకుండా చూసుకున్నారు. ట్రినిడాడ్ మిస్టరీ స్పిన్నర్ నరైన్ (3/17) మ్యాజిక్ చేసినా ముంబై గట్టెక్కింది. డ్వేన్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. చాంపియన్స్ లీగ్ ప్రధాన మ్యాచ్‌లు ముంబై, రాజస్థాన్ల మ్యాచ్‌తోనే ప్రారంభం అయ్యాయి. మళ్లీ చివరి మ్యాచ్ కూడా ఈ రెండు జట్ల మధ్యే జరగనుండడం కాకతాళీయమే. స్కోరు వివరాలు ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) స్మిత్ (బి) హర్భజన్ 0; ఎవిన్ లూయిస్ (సి) అండ్ (బి) పొలార్డ్ 62; డారెన్ బ్రేవో (స్టం) కార్తీక్ (బి) ఓజా 14; ఓట్లీ నాటౌట్ 41; రామ్‌దిన్ (బి) జాన్సన్ 9; పూరన్ (సి) రాయుడు (బి) కౌల్టర్ 15; స్టీవార్ట్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 153 వికెట్ల పతనం: 1-13; 2-61; 3-93; 4-111; 5-148. బౌలింగ్: జాన్సన్ 3-0-31-1; హర్భజన్ 4-0-35-1; రిషి ధావన్ 3-0-30-0; కౌల్టర్ 4-0-20-1; పొలార్డ్ 3-0-16-1; ఓజా 3-0-16-1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) నరైన్ 59; సచిన్ (సి) రామ్‌దిన్ (బి) సిమ్మన్స్ 35; రాయుడు (సి) రామ్‌దిన్ (బి) నరైన్ 0; రోహిత్ (బి) నరైన్ 25; కార్తీక్ నాటౌట్ 33; పొలార్డ్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.1 ఓవర్లలో నాలుగు వికెట్ల కు) 157 వికెట్ల పతనం: 1-90; 2-91; 3-96; 4-138. బౌలింగ్: బద్రీ 4-0-25-0; రామ్‌పాల్ 4-0-29-0; ఓట్లీ 3-0-38-0; నరైన్ 4-0-17-3; సిమ్మన్స్ 2.1-0-27-1; స్టీవార్ట్ 2-0-20-0. మాస్టర్ @ 50,000 రికార్డుల రారాజు సచిన్ అన్ని ఫార్మాట్లు, అన్ని రకాల క్రికెట్లలో కలిపి 50 వేల పరుగులు పూర్తి చేశాడు. ట్రినిడాడ్‌తో మ్యాచ్‌లో 26వ పరుగు పూర్తి చేయగానే ఈ ఘనత అందుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ సచిన్. ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్లో 16వ క్రికెటర్. ఈ విభాగంలో రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ గ్రాహం గూచ్ (67057) పేరిట ఉంది. సచిన్ పరుగులు వచ్చాయిలా.... ఫస్ట్‌క్లాస్ క్రికెట్ : 307 మ్యాచ్‌ల్లో - 25228 లిస్ట్ ఎ క్రికెట్ : 551 మ్యాచ్‌ల్లో - 21999 టి20 క్రికెట్ : 95 మ్యాచ్‌ల్లో - 2782 మొత్తం: 953 మ్యాచ్‌ల్లో - 50009 -
సచిన్ కోసం మరోసారి!
చాంపియన్స్ లీగ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్న మాస్టర్ బ్లాస్టర్‌ను... మరోసారి కూడా అభిమానులు చూడాలంటే నేడు జరిగే రెండో సెమీఫైనల్లో ట్రినిడాడ్‌పై ముంబై ఇండియన్స్ గెలవాలి. న్యూఢిల్లీ: సమఉజ్జీల సమరం... ట్రినిడాడ్, ముంబైల మ్యాచ్‌ను ఒక్క ముక్కలో ఇలా చెప్పొచ్చు. దూకుడుగా ఆడే, ఫామ్‌లో ఉన్న రెండు జట్ల మధ్య పోరాటం... రెండు జట్లూ తమ చివరి లీగ్ మ్యాచ్‌లలో చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో సంచలన విజయాలు సాధించాయి. అదే ఆత్మవిశ్వా సంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాంపియన్స్ లీగ్‌లో శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ముంబై ఇండియన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్ల మధ్య ఆసక్తికర సమరం జరిగే అవకాశం ఉంది. అందరి నోటా ఒకే మాట 2011లో హర్భజన్ సింగ్ సారథ్యంలోని ముంబై జట్టు చాంపియన్స్ లీగ్ టైటిల్ గెలిచింది. ఈ ఏడాది రోహిత్ శర్మ సారథ్యంలో ఐపీఎల్‌లోనూ విజేతగా నిలిచింది. గతంతో పోలిస్తే ఈసారి ముంబై జట్టు మంచి దూకుడుగా ఆడుతుందని అనుకోవాలి. ఈసారి టోర్నీ ఆరంభం నుంచి ముంబై ఆటగాళ్లంతా ఒకటే మాట అంటున్నారు. ‘టైటిల్ గెలిచి మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌కు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలి’ అని చెబుతున్నారు. సచిన్ రంగు దుస్తుల్లో పోటీ క్రికెట్ ఆడటం ఈ టోర్నీతోనే ఆఖరు. కాబట్టి మాస్టర్ మరో మ్యాచ్ ఆడాలంటే ఇప్పుడు ముంబై గెలవాలి. బ్యాటింగ్‌లో డ్వేన్ స్మిత్, రోహిత్ శర్మ, పొలార్డ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. సచిన్, కార్తీక్, రాయుడు ఫామ్‌లో లేకపోయినా మ్యాచ్‌ను ఏ క్షణమైనా మలుపు తిప్పగల సమర్థులు. బౌలింగ్‌లో కౌల్టర్ నైల్, రిషిధావన్, ఓజా, హర్భజన్ కీలకం. గత మ్యాచ్‌లో ఆడిన మ్యాక్స్‌వెల్‌ను కొనసాగిస్తారా లేక జాన్సన్‌ను తుది జట్టులో తెస్తారో చూడాలి. తమ చివరి మ్యాచ్‌లో పెర్త్‌పై సాధించిన అద్భుత విజయంతో ముంబై ఆత్మవిశ్వాసంతో ఉంది. అనూహ్యంగా ముందుకు... ఈసారి లీగ్‌లో ట్రినిడాడ్ బాగా ఆకట్టుకుంది. ‘బి’ గ్రూప్‌లో టాపర్‌గా సెమీస్‌కు చేరడం కాస్త ఆశ్చర్యకర పరిణామం. బ్రిస్బేన్‌పై గెలిచి, సన్‌రైజర్స్ చేతిలో ఓడిన ఈ కరీబియన్ జట్టు... టైటాన్స్‌తో మ్యాచ్‌లో విశ్వరూపం చూపించడంతో వర్షం పడ్డా డక్‌వర్త్ పద్ధతిలో గట్టెక్కింది. అయినా చివరి మ్యాచ్‌లో గెలవాల్సిన స్థితిలో... పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి ఏకంగా గ్రూప్ టాపర్‌గా నిలిచింది. మిగిలిన ఫలితాలు ఎలా ఉన్నా... కోట్ల మైదానంలో ధోనిసేనపై సాధించిన విజయం ఈ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందనడంలో సందేహం లేదు. బౌలింగ్‌లో రామ్‌పాల్, నరైన్, బద్రీ ఈ జట్టుకు ప్రధాన బలం. ఆల్‌రౌండర్ లెండిల్ సిమ్మన్స్ ఫామ్‌లో ఉన్నాడు. డారెన్ బ్రేవో, రామ్‌దిన్, స్టీవార్ట్, పూరన్, లూయిస్ నాణ్యమైన బ్యాట్స్‌మెన్. ముంబైని ఓడించి ఫైనల్‌కు చేరగలమనే ధీమా ఈ కరీబియన్ ఆటగాళ్లలో ఉంది. -
చాంపియన్స్ లీగ్ ఫైనల్లో రాజస్థాన్
సొంతగడ్డపై అజేయ రికార్డును కొనసాగిస్తూ... ఎంత పటిష్ట జట్టైనా జైపూర్‌లో రాయల్స్‌ను ఓడించలేదని నిరూపిస్తూ... రాజస్థాన్ జట్టు చాంపియన్స్ లీగ్ ఫైనల్‌కు చేరింది. చెన్నై సూపర్ కింగ్స్ లాంటి బలమైన జట్టుపై గెలిచి తుది సమరానికి సిద్ధమైంది. జైపూర్: ఇన్నాళ్లూ రాజస్థాన్ రాయల్స్ సొంతగడ్డపై గెలిచిన మ్యాచ్‌లన్నీ ఒకెత్తు... ఈ ఒక్క మ్యాచ్ ఒకెత్తు. వరుసగా 12 మ్యాచ్‌లు గెలిచినా... అన్నీ లీగ్ మ్యాచ్‌లే. ఈసారి నాకౌట్ సమరంలో... అది కూడా టి20ల్లో అత్యంత పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి... సొంతగడ్డపై తమ జైత్రయాత్రను (వరుసగా 13 విజయాలు) కొనసాగించింది. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ద్రవిడ్ సేన 14 పరుగుల తేడాతో ధోని బృందాన్ని ఓడించి ఇంటికి పంపించింది. లీగ్ దశలో చెలరేగిపోయిన కింగ్స్... తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లోని పేలవ ప్రదర్శననే సెమీస్‌లోనూ కొనసాగించి మూల్యం చెల్లించుకుంది. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోగా... రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ రహానే (56 బంతుల్లో 70; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు వెన్నెముకలా నిలిచి అర్ధసెంచరీ చేశాడు. వాట్సన్ (23 బంతుల్లో 32; 4 ఫోర్లు) రహానేకు అండగా నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 39 బంతుల్లో 59 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో బ్రేవో మూడు వికెట్లు తీసి రాజస్థాన్‌ను నియంత్రించాడు. సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేసి ఓడింది. రైనా (23 బంతుల్లో 29; 4 ఫోర్లు) మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలం కావడంతో... చెన్నై 72 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. బౌలర్లు మోరిస్ (17 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు), అశ్విన్ (28 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చివర్లో పోరాడి ఎనిమిదో వికెట్‌కు 43 బంతుల్లోనే 73 పరుగులు జోడించినా ఫలితం లేకపోయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రవీణ్ తాంబె (3/10) చెన్నై స్టార్ లైనప్‌ను కట్టడి చేశాడు. వారెవ్వా తాంబె రాజస్థాన్ విజయంలో యువ రహానేది ఎంత కీలక పాత్రో... 42 సంవత్సరాల ప్రవీణ్ తాంబెది కూడా అంతే కీలక పాత్ర. చాంపియన్స్ లీగ్ సెమీఫైనల్లో చెన్నైలాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు మీద నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. ఏనాడూ రంజీ క్రికెట్ కూడా ఆడని తాంబె... ముంబైలోని కంగా లీగ్‌లో ప్రఖ్యాత స్పిన్నర్. అయినా ఏనాడు ఫస్ట్‌కాస్ల్ క్రికెట్ కూడా ఆడకుండానే రిటైర్మెంట్ దశకు వచ్చాడు. అలాంటి సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్లో ఆడే అవకాశం ఇచ్చింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం తర్వాత రాజస్థాన్ జట్టులోని ప్రధాన స్పిన్నర్లు అజిత్ చండిలా, అంకిత్ చవాన్లపై నిషేధం పడింది. దీంతో చాంపియన్స్ లీగ్‌లో తాంబె మినహా ఆ జట్టుకు మరో స్పిన్నర్ లేడు. దీంతో అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడే అవకాశం లభించింది. దీనిని సద్వినియోగం చేసుకున్న ఈ వెటరన్ చెలరేగిపోయాడు. పేసర్లకు సహకారం లభించిన వికెట్‌పై కూడా మాయాజాలం చేశాడు. తనపై కెప్టెన్ ద్రవిడ్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. స్కోరు వివరాలు : రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ద్రవిడ్ (బి) మోరిస్ 5; రహానే (సి) మోహిత్ (బి) బ్రేవో 70; కూపర్ (సి) బద్రీనాథ్ (బి) మోహిత్ 14; సామ్సన్ (సి) అశ్విన్ (బి) హోల్డర్ 11; వాట్సన్ (సి) హోల్డర్ (బి) మోరిస్ 32; హాడ్జ్ (బి) హోల్డర్ 11; స్టువర్ట్ బిన్నీ (సి) జడేజా (బి) బ్రేవో 5; యాజ్ఞిక్ (సి) హోల్డర్ (బి) బ్రేవో 0; ఫాల్కనర్ నాటౌట్ 1; శుక్లా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 159 వికెట్ల పతనం: 1-14; 2-29; 3-62; 4-121; 5-149; 6-155; 7-157; 8-157. బౌలింగ్: జడేజా 3-0-19-0; మోహిత్ 4-0-37-1; మోరిస్ 4-0-25-2; హోల్డర్ 4-0-35-2; బ్రేవో 4-0-26-3; అశ్విన్ 1-0-16-0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: హస్సీ రనౌట్ 9; విజయ్ రనౌట్ 14; రైనా (సి) మేనరియా (సబ్) (బి) తాంబె 29; బద్రీనాథ్ (స్టం) యాజ్ఞిక్ (బి) తాంబె 8; ధోని ఎల్బీడబ్ల్యు (బి) శుక్లా 3; డ్వేన్ బ్రేవో ఎల్బీడబ్ల్యు (బి) తాంబె 3; జడేజా (సి) యాజ్ఞిక్ (బి) వాట్సన్ 2; మోరిస్ నాటౌట్ 26; అశ్విన్ (సి) బిన్నీ (బి) ఫాల్కనర్ 46; హోల్డర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 145 వికెట్ల పతనం: 1-13; 2-33; 3-51; 4-54; 5-61; 6-70; 7-72; 8-145. బౌలింగ్: బిన్నీ 1-0-2-0; ఫాల్కనర్ 4-0-36-1; వాట్సన్ 4-0-34-1; రాహుల్ శుక్లా 3-0-21-1; కూపర్ 4-0-41-0; తాంబె 4-0-10-3. -
రాయల్స్‌ను ఆపగలరా!
సొంతవేదిక జైపూర్‌లో వరుసగా 12 మ్యాచ్‌లు నెగ్గిన జోరులో ఒక జట్టు...డైనమైట్ కెప్టెన్ నేతృత్వంలో టి20ల్లో సూపర్ రికార్డు ఉన్న జట్టు మరో వైపు...చాంపియన్స్ లీగ్‌లో మరో హోరాహోరీ సమరానికి రంగం సిద్ధమైంది. టోర్నీ తొలి సెమీ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అజేయ ద్రవిడ్ సేనను... జైపూర్‌లో ధోనిసేన నిలువరిస్తుందా? రాజస్థాన్‌తో చెన్నై అమీతుమీ చాంపియన్స్ లీగ్ తొలి సెమీస్ నేడు సొంతగడ్డపై అద్భుత ఫామ్‌లో ద్రవిడ్ సేన ఆత్మవిశ్వాసంతో ధోని బృందం రాత్రి గం. 8.00 నుంచి స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం జైపూర్: ద్రవిడ్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లూ గెలవడం ద్వారా సొంతగడ్డపైనే సెమీస్ ఆడే అవకాశాన్ని సంపాదించుకుంది. మరోవైపు అద్భుతంగా ఆడిన ధోనిసేన ఆఖరి మ్యాచ్‌లో తడబాటు కారణంగా... జైపూర్ వెళ్లి రాజస్థాన్‌తో ఆడాల్సి వచ్చింది. మామూలుగా సూపర్ కింగ్స్ అద్భుతమైన జట్టే అయినా... రాయల్స్ సొంతగడ్డపై సాధిస్తున్న విజయాలు చూస్తుంటే, ధోనిసేనకు విజయం అంత తేలిక కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో రాజస్థాన్, చెన్నై తలపడుతున్నాయి. ధోనిసేన గతంలో చాంపియన్స్ లీగ్ టైటిల్ గెలవగా... రాజస్థాన్ ఎప్పుడూ ఈ టోర్నీ ఫైనల్‌కు చేరలేదు. బ్యాటింగే బలం : గత మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమిపాలైనా చెన్నై ప్రధాన బలం బ్యాటింగ్‌లోనే ఉంది. ఓపెనర్లుగా విజయ్, మైక్ హస్సీ తమ వంతు పాత్రను సమర్థంగా పోషించారు. సురేశ్ రైనా అయితే తిరుగులేని ప్రదర్శన కనబరుస్తున్నాడు. కెప్టెన్ కూల్ ధోని దూకుడు జట్టుకు తారకమంత్రంగా పని చేస్తుందని చెప్పవచ్చు. బౌలింగ్‌లో మాత్రం చెన్నై అంత గొప్ప ప్రదర్శన కనబర్చడంలేదు. అశ్విన్ మినహా మిగతావారంతా ఆల్‌రౌండర్లే తప్ప రెగ్యులర్ బౌలర్లు కాదు. ముందుగా బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టగల సామర్ధ్యం జట్టుకు ఉంది. నిలకడైన ప్రదర్శన : మరో వైపు రాజస్థాన్ రాయల్స్ మాత్రం ప్రశాంతంగా లీగ్‌లో తమ పని చేసుకుపోతోంది. వ్యక్తిగతంగా చూస్తే ఎలాంటి అద్భుత రికార్డు ఎవరూ నమోదు చేయకపోయినా సమష్టిగా ఆ జట్టు ఓటమి ఎరుగకుండా నాలుగు విజయాలు అందుకుంది. ఇక జైపూర్‌లో పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండటం కూడా ద్రవిడ్ బృందానికి కలిసొచ్చే అంశం. ద్రవిడ్, రహానే జట్టుకు కావాల్సిన మెరుగైన ఆరంభాన్ని అందిస్తుండగా...సామ్సన్, బిన్నీలాంటి యువ ఆటగాళ్లు కూడా తమ పరిధిలో రాణిస్తున్నారు. షేన్‌వాట్సన్, బ్రాడ్ హాడ్జ్‌లు చెలరేగితే వారికి ఆకాశమే హద్దు. బౌలింగ్‌లో ఫాల్క్‌నర్‌తో పాటు తాజా సంచలనం రాహుల్ శుక్లాను జట్టు నమ్ముకుంది. తాంబే, కూపర్‌లకు ప్రత్యర్థికి పరుగులు ఇవ్వకుండా నిరోధించగల సామర్థ్యం ఉంది. -
సెమీస్‌లో ముంబయి ఇండియన్స్
చాంపియన్స్ లీగ్ టి-20 టోర్నీలో ముంబయి ఇండియన్స్ సెమీస్‌కు అర్హత సాధించింది. బుధవారమిక్కడ పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్‌లో ముంబయి ఆరు వికెట్లతో ఘనవిజయం సాధించి బెర్తు సొంతం చేసుకుంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి నాలుగు వికెట్లు కోల్పోయి మరో 40 బంతులు మిగిలుండగా అలవోకగా విజయతీరాలకు చేరింది. రోహిత్ శర్మ (24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 నాటౌట్), డ్వెన్ స్మిత్ (25 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 48) మెరుపులు మెరిపించారు. పొలార్డ్ 23, అంబటి రాయుడు 14 (నాటౌట్) పరుగులు చేశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పెర్త్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 149 పరుగులు చేసింది. వైట్మన్ (32 బంతుల్లో 51 నాటౌట్) దూకుడుగా ఆడగా, అగర్ (35), కార్ట్‌రైట్ (28) ఆకట్టుకున్నారు. ముంబయి బౌలర్లు కల్టర్ నిలె మూడు, ప్రజ్ఞాన్ ఓజా రెండు వికెట్లు తీశారు. రోహిత్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. -
ట్రినిడాడ్ ఆశలు సజీవం
అహ్మదాబాద్: ఓపెనర్ ఎవిన్ లెవిస్ (35 బంతుల్లో 70; 7 ఫోర్లు; 5 సిక్స్‌లు), డారెన్ బ్రేవో (44 బంతుల్లో 63; 5 ఫోర్లు; 4 సిక్స్‌లు) మెరుపు ఆటతీరుతో పాటు వరుణుడి అండతో చాంపియన్స్ లీగ్ టి20లో ట్రినిడాడ్ అండ్ టొబాగో విజయం సాధించింది. సోమవారం మొతేరా స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో టైటాన్స్‌తో తలపడిన టీ అండ్ టీ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 6 పరుగులతో నెగ్గింది. దీంతో తమ సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది. ఈ విజయంతో ట్రినిడాడ్ జట్టు టైటాన్స్‌తో సమానంగా ఎనిమిది పాయింట్లతో ఉంది. అయితే బుధవారం చెన్నైతో జరిగే మ్యాచ్‌లో ట్రినిడాడ్ నెగ్గితే ఇప్పటికే చివరి లీగ్ మ్యాచ్ ఆడిన టైటాన్ కథ ముగిసిపోతుంది. ఓడినా కూడా మెరుగైన రన్‌రేట్ ఆధారంగా టీఅండ్టీకే అవకాశం ఉంటుంది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రినిడాడ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 188 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు లెవిస్, డారెన్ బ్రేవో 68 బంతుల్లో 109 పరుగులు జోడించారు. చివర్లో వరుస విరామాల్లో వికెట్లు పడినప్పటికీ పటిష్ట స్కోరును సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ 17 ఓవర్లలో ఆరు వికెట్లకు 153 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారీ వర్షం అంతరాయం కలిగించింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన టైటాన్స్ తమ విజయానికి ఏడు పరుగుల దూరంలో ఉంది. ఆట కొనసాగే వీలు లేకపోవడంతో ట్రినిడాడ్‌ను గెలిచినట్టుగా ప్రకటించారు. ఓపెనర్లు డేవిడ్స్ (22 బంతుల్లో 42; 6 ఫోర్లు; 2 సిక్స్‌లు), రుడాల్ఫ్ (28 బంతుల్లో 31; 4 ఫోర్లు) శుభారంభాన్ని అందించినా మిడిలార్డర్ విఫలమైంది. స్పిన్నర్ సునీల్ నరైన్, సిమ్మన్స్‌లకు రెండేసి వికెట్లు పడ్డాయి. రెయిన్ లూజర్స్! అహ్మదాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. చాంపియన్స్ లీగ్‌లో నిలబడాలంటే రైజర్స్ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ నీటిపాలైంది. బ్రిస్బేన్ హీట్స్‌తో సోమవారం ఇక్కడ జరగాల్సిన గ్రూప్ ‘బి’ మ్యాచ్ భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దాంతో ఇరు జట్లకు చెరో 2 పాయింట్లు కేటాయించారు. ఫలితంగా టోర్నీలో ఒకే మ్యాచ్ గెలిచి, రెండు ఓడిన హైదరాబాద్ మొత్తం 6 పాయింట్లకే పరిమితమైంది. ఇప్పటికే ఈ గ్రూప్‌లో చెన్నై సెమీ ఫైనల్ చేరగా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, టైటాన్స్ 8 పాయింట్ల వద్ద నిలిచాయి. దాంతో సన్‌రైజర్స్ లీగ్‌నుంచి నిష్ర్కమించింది. మరో వైపు ట్రినిడాడ్, టైటాన్స్ పాయింట్ల పరంగా సమానంగా ఉన్నా ట్రినిడాడ్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. బుధవారం చెన్నైతో చివరి మ్యాచ్ ఆడనున్న ఆ జట్టు గెలిస్తే నేరుగా సెమీస్ చేరుతుంది. లేదంటే రన్‌రేట్‌లో టైటాన్స్‌తో పోటీ పడాల్సి వస్తుంది కాబట్టి...చెన్నై చేతిలో భారీ తేడాతో ఓడకుండా ఉంటే చాలు. చాంపియన్స్ లీగ్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్ x ఒటాగో వోల్ట్స్ రాత్రి గం. 8.00 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
‘రాయల్’గా సెమీస్‌కి..
జైపూర్: సమీకరణాలతో సంబంధం లేకుండా... మిగిలిన జట్ల ఫలితాలతో పట్టింపు లేకుండా... రాజస్థాన్ రాయల్స్ జట్టు చాంపియన్స్‌లీగ్ సెమీఫైనల్‌కు చేరింది. టోర్నీలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ అలవోకగా నెగ్గి... మరో మ్యాచ్ మిగిలుండగానే నాకౌట్ సమరానికి అర్హత సాధించింది. ఆదివారం సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ద్రవిడ్ సేన 9 వికెట్ల తేడాతో పెర్త్ స్కార్చర్స్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా... పెర్త్ 20 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటయింది. వోజస్ (27) టాప్ స్కోరర్. రాజస్థాన్ బౌలర్లు కూపర్ (4/18), తాంబె (2/17), ఫాల్కనర్ (2/16) పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ ముగ్గురూ కలిసి 12 ఓవర్లలో కేవలం 51 పరుగులు మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లు తీశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 16.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 121 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. ద్రవిడ్ (0) నిరాశపరిచినా... రహానే (53 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), శామ్సన్ (42 బంతుల్లో 50 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్సర్) కలిసి రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. కూపర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చాంపియన్స్ లీగ్‌లో ముంబై సెమీఫైనల్ భవిష్యత్తు రాజస్థాన్ రాయల్స్‌పై ఆధారపడి ఉంది. రాయల్స్ ఇప్పటికే 12 పాయింట్లతో సెమీస్‌కు చేరింది. ఒటాగో 10 పాయింట్లతో ఉంది. ముంబైకి కేవలం ఆరు పాయింట్లే ఉన్నాయి. తమ చివరి మ్యాచ్‌ను బుధవారం ముంబై పెర్త్తో ఆడాలి. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే 10 పాయింట్లకు చేరుతుంది. మరోవైపు ఒటాగో, రాజస్థాన్ తమ చివరి మ్యాచ్‌ను మంగళవారం ఆడతాయి. ఒకవేళ ఇం దులో ఒటాగో గెలిస్తే... ముంబై ఇంటికే. రాజస్థాన్ గెలిస్తే మాత్రం... ఒటాగో, ముంబై పదేసి పాయిం ట్లతో ఉంటాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు సెమీస్‌కు చేరుతుంది. కాబట్టి రాజస్థాన్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఒటాగోను భారీ తేడాతో ఓడిస్తేనే... ముంబైకి అవకాశాలు ఉంటాయి. ముంబై భవిత రాయల్స్ చేతుల్లో చాంపియన్స్ లీగ్‌లో ముంబై సెమీఫైనల్ భవిష్యత్తు రాజస్థాన్ రాయల్స్‌పై ఆధారపడి ఉంది. రాయల్స్ ఇప్పటికే 12 పాయింట్లతో సెమీస్‌కు చేరింది. ఒటాగో 10 పాయింట్లతో ఉంది. ముంబైకి కేవలం ఆరు పాయింట్లే ఉన్నాయి. తమ చివరి మ్యాచ్‌ను బుధవారం ముంబై పెర్త్తో ఆడాలి. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే 10 పాయింట్లకు చేరుతుంది. మరోవైపు ఒటాగో, రాజస్థాన్ తమ చివరి మ్యాచ్‌ను మంగళవారం ఆడతాయి. ఒకవేళ ఇం దులో ఒటాగో గెలిస్తే... ముంబై ఇంటికే. రాజస్థాన్ గెలిస్తే మాత్రం... ఒటాగో, ముంబై పదేసి పాయిం ట్లతో ఉంటాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు సెమీస్‌కు చేరుతుంది. కాబట్టి రాజస్థాన్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఒటాగోను భారీ తేడాతో ఓడిస్తేనే... ముంబైకి అవకాశాలు ఉంటాయి. స్కోరు వివరాలు పెర్త్ స్కార్చర్స్ ఇన్నింగ్స్: డేవిస్ (సి) కూపర్ (బి) ఫాల్కనర్ 18; ఎగర్ (సి) మాలిక్ (బి) వాట్సన్ 10; కాటిచ్ (స్టం) శామ్సన్ (బి) తాంబె 12; వోజస్ (సి) ఫాల్కనర్ (బి) కూపర్ 27; కార్ట్‌రైట్ ఎల్బీడబ్ల్యు (బి) కూపర్ 5; టర్నర్ (బి) కూపర్ 11; ట్రిఫిట్ (సి) అండ్ (బి) తాంబె 2; పారిస్ (బి) ఫాల్కనర్ 2; మెన్నీ (సి) బిన్నీ (బి) కూపర్ 2; బెహ్రన్‌డార్ఫ్ నాటౌట్ 12; బీర్ రనౌట్ 3; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 120. వికెట్ల పతనం: 1-18; 2-29; 3-62; 4-76; 5-77; 6-80; 7-85; 8-97; 9-97; 10-120. బౌలింగ్: మేనరియా 2-0-11-0; విక్రమ్‌జీత్ మాలిక్ 2-0-22-0; ఫాల్కనర్ 4-0-16-2; వాట్సన్ 3-0-23-1; బిన్నీ 1-0-7-0; తాంబె 4-0-17-2; కూపర్ 4-0-18-4. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ద్రవిడ్ (బి) బెహ్రన్‌డార్ఫ్ 0; రహానే నాటౌట్ 62; శామ్సన్ నాటౌట్ 50; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (16.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 121. వికెట్ పతనం: 1-1. బౌలింగ్: బెహ్రన్‌డార్ఫ్ 4-0-28-1; పారిస్ 4-0-28-0; మెన్నీ 2.3-0-22-0 ; బీర్ 4-0-26-0; కార్ట్‌రైట్ 1-0-10-0; ఎగర్ 1-0-6-0. చాంపియన్స్ లీగ్‌లో నేడు టైటాన్స్ x ట్రినిడాడ్ సా. గం. 4.00 నుంచి బ్రిస్బేన్ x సన్‌రైజర్స్ రా. గం. 8.00 నుంచి వేదిక: అహ్మదాబాద్ స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సూపర్ ‘టై’
జైపూర్: ఇన్నాళ్లూ టి20ల్లో మ్యాచ్‌లు ‘టై’ అయితే సూపర్ ఓవర్ ద్వారా ఫలితం రావడం చూశాం. కానీ సూపర్ ఓవర్ కూడా టైగా ముగిస్తే... ఆ ఉత్కంఠతను తట్టుకోవడం కష్టం. టి20 చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొలిసారి సూపర్ ఓవర్ కూడా ‘టై’ అయిన మ్యాచ్ చాంపియన్స్ లీగ్‌లో జరిగింది. హైవీల్డ్ లయన్స్, ఒటాగో వోల్ట్స్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో బౌండరీల సంఖ్య ద్వారా గెలిచిన ఒటాగో... సీఎల్టీ20 సెమీస్‌కు చేరువయింది. తమ బ్యాట్స్‌మన్ డి కాక్ అద్భుతమైన సెంచరీ చేసినా లయన్స్ మ్యాచ్‌ను కోల్పోయింది. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమితో లయన్స్ జట్టు రిక్తహస్తాలతో వెనుదిరగనుంది. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లయన్స్... 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగలు చేసింది. ఓపెనర్ క్వింటాన్ డి కాక్ (63 బంతుల్లో 109 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. సహచరులంతా విఫలమైనా ఒంటిచేత్తో పోరాడి భారీ స్కోరు అందించాడు. తర్వాత ఒటాగో జట్టు కూడా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి సరిగ్గా 167 పరుగులే చేసింది. ఒక దశలో ఓడిపోతుందనుకున్న ఒటాగోను... నీషామ్ (25 బంతుల్లో 52 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా... తన్వీర్ వేసిన ఈ ఓవర్లో నీషామ్ ఓ సిక్సర్ కొట్టినా... 10 పరుగులే వచ్చాయి. దీంతో మ్యాచ్ టై గా ముగిసింది. సూపర్ ఓవర్లో డ్రామా: ఫలితం కోసం నిర్వహించిన సూపర్ ఓవర్లో తొలుత ఒటాగో జట్టు 13 పరుగులు చేసింది. తన్వీర్ బౌలింగ్‌లో నీషామ్ ఒక బౌండరీ, మెకల్లమ్ ఒక సిక్సర్ కొట్టారు. తర్వాత లయన్స్ తరఫున డి కాక్ తొలి మూడు బంతులకే నీషామ్ బౌలింగ్‌లో ఫోర్, సిక్సర్, సింగిల్‌తో 11 పరుగులు రాబట్టాడు. ఇక మూడు బంతులకు మూడు పరుగులు కావలసిన దశలో... సైమ్స్ అవుటయ్యాడు. తర్వాతి బంతికి డి కాక్ మరో సింగిల్ తీశాడు. ఇక విజయానికి ఆఖరి రెండు పరుగులు కావాల్సి ఉండగా... ప్రిటోరియస్ ఒక పరుగు తీసి రనౌట్ అయ్యాడు. దీంతో లయన్స్‌కు కూడా సరిగ్గా 13 పరుగులే వచ్చాయి. దీంతో స్కోర్లు మరోసారి సమమయ్యాయి. ఫలితం తేలిందిలా: సూపర్ ఓవర్ కూడా టై అయితే ఫలితం కోసం ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఇందులోనూ రెండు జట్లు సరిగ్గా ఏడేసి సిక్సర్లు కొట్టాయి. ఈ సమయంలో బౌండరీలు ఎక్కువ కొట్టిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. లయన్స్ 11 ఫోర్లు కొడితే.. ఒటాగో జట్టు 12 ఫోర్లు కొట్టింది. దీంతో ఒక బౌండరీ అధికంగా కొట్టినందున ఒటాగో జట్టు మ్యాచ్ గెలిచినట్లు ప్రకటించారు. -
ఇక సన్ రైజర్స్‌కు కష్టమే!
రాంచీ: చాంపియన్స్ లీగ్‌లో ఇక సన్‌రైజర్స్ సెమీస్‌కు చేరితే అది అద్భుతమే అనుకోవాలి. గ్రూప్ ‘బి’ లో వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోవడం, రన్‌రేట్ కూడా దారుణంగా పడిపోవడంతో ఈ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఈ సారి లీగ్ దశతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేట్లుంది. జేఎస్సీఏ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాకు చెందిన టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. టాస్ గెలిచిన టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా... సన్‌రైజర్స్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (21 బంతుల్లో 37; 7 ఫోర్లు, 1 సిక్సర్), పార్థీవ్ పటేల్ (24 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 39 బంతుల్లోనే 62 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే టైటాన్స్ బౌలర్లు పుంజుకుని వరుస విరామాల్లో వికెట్లు తీసి స్కోరును నియంత్రించారు. పెరీరా (11), డుమిని (17), స్యామీ (1) విఫలమయ్యారు. దీంతో ఓ దశలో సన్‌రైజర్స్ 112 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. చివర్లో స్టెయిన్ (12 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కరణ్ శర్మ (6 బంతుల్లో 11 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) వేగంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. టైటాన్ ఆల్‌రౌండర్ వీస్ మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. టైటాన్స్ జట్టు 16.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 147 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. కెప్టెన్ డేవిడ్స్ (42 బంతుల్లో 64; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ రుడాల్ఫ్ (42 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి వరకూ బాధ్యతగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 12.1 ఓవర్లలో 112 పరుగులు జోడించి విజయాన్ని సులభం చేశారు. ఈ విజయంతో టైటాన్స్ జట్టు సెమీస్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. సన్‌రైజర్స్ బౌలర్లలో స్టెయిన్, ఇషాంత్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. డేవిడ్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: పార్థీవ్ (బి) వీస్ 26; శిఖర్ ధావన్ (సి) మోర్కెల్ (బి) వీస్ 37; డుమిని (బి) డిలాంజ్ 17; విహారి (సి) డేవిడ్స్ (బి) వీస్ 6; సామంత్రె (స్టం) మోసెహెలె (బి) డేవిడ్స్ 0; పెరీరా రనౌట్ 11; స్యామీ (సి) బెహర్డిన్ (బి) రిచర్డ్స్ 1; కరణ్ శర్మ నాటౌట్ 11; స్టెయిన్ నాటౌట్ 27; ఎక్స్‌ట్రాలు (బై 1, లెగ్‌బై 1, వైడ్లు 7) 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 145 వికెట్ల పతనం: 1-62; 2-71; 3-83; 4-86; 5-102; 6-105; 7-112. బౌలింగ్: డేవిడ్స్ 4-0-18-1; మోర్నీ మోర్కెల్ 4-0-42-0; రిచర్డ్స్ 4-0-24-1; డిలాంజ్ 4-0-42-1; వీస్ 4-0-17-3. టైటాన్స్ ఇన్నింగ్స్: రుడాల్ఫ్ నాటౌట్ 49; డేవిడ్స్ (సి) స్యామీ (బి) స్టెయిన్ 64; డివిలియర్స్ (సి) పెరీరా (బి) ఇషాంత్ 9; కున్ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 6, వైడ్లు 4) 10; మొత్తం (16.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 147 వికెట్ల పతనం: 1-112; 2-123. బౌలింగ్: క రణ్ శర్మ 1-0-9-0; స్టెయిన్ 4-0-23-1; ఇషాంత్ 4-0-32-1; పెరీరా 2.3-0-29-0; అమిత్ మిశ్రా 2-0-17-0; డుమిని 1-0-14-0; స్యామీ 2-0-17-0. -
సెమీస్‌లో చెన్నై
చాంపియన్స్ లీగ్‌లో టైటిల్ ఫేవరెట్ చెన్నై సూపర్ కింగ్స్ స్థాయికి తగ్గ ఆటతీరుతో సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. బ్రిస్బేన్ హీట్ జట్టుపై అలవోకగా నెగ్గి టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు ఆసీస్ దేశవాళీ జట్టు బ్రిస్బేన్ వరుసగా మూడో ఓటమితో టోర్నీలో సెమీస్ ఆశలు వదిలేసుకుంది. రాంచీ : ఓపెనర్ల వైఫల్యం, స్పిన్నర్ల నిలకడలేమి... చెన్నై జట్టుకు తొలి రెండు మ్యాచ్‌లు గెలిచినా కనిపించిన సమస్యలు ఇవి. కానీ మూడో మ్యాచ్ ద్వారా ఈ రెండు అంశాల్లోనూ సూపర్ కింగ్స్ కుదురుకుంది. జైత్రయాత్రను కొనసాగిస్తూ టోర్నీలో వరుసగా మూడో విజయం సాధించి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. జేఎస్సీఏ స్టేడియంలో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరచి ఎనిమిది వికెట్ల తేడాతో బ్రిస్బేన్ హీట్‌పై నెగ్గింది. టాస్ గెలిచిన ధోని ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్రిస్బేన్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేసింది. టాప్ ఆర్డర్లో హోప్ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు), లిన్ (25 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించారు. మధ్య ఓవర్లలో చెన్నై స్పిన్నర్లు పొదుపుగా బౌలింగ్ చేసి నియంత్రణ తెచ్చారు. అశ్విన్, జడేజా, రైనా కలిసి 11 ఓవర్లలో కేవలం 37 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశారు. అయితే చివర్లో కట్టింగ్ (25 బంతుల్లో 42 నాటౌట్; 5 సిక్సర్లు), హార్ట్లీ (32 బంతుల్లో 35; 3 ఫోర్లు) వేగంగా ఆడటంతో బ్రిస్బేన్‌కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. చెన్నై బౌలర్లలో జడేజా, మోహిత్ శర్మ రెండేసి వికెట్లు తీసుకోగా... రైనా, అశ్విన్, మోర్కెల్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ 15.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. ఓపెనర్లు మైక్ హస్సీ (48 బంతుల్లో 57 నాటౌట్; 7 ఫోర్లు), మురళీ విజయ్ (27 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 75 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. రైనా (15 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్) ఉన్నంతసేపు వేగంగా ఆడాడు. ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలబడి అర్ధసెంచరీ చేసిన హస్సీ, ధోని (5 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) కలిసి మ్యాచ్‌ను తొందరగా ముగించారు. సొంతనగరం రాంచీలో ఈ సీజన్ చాంపియన్స్ లీగ్ చివరి మ్యాచ్‌ను ధోని సిక్సర్‌తో ముగించాడు. మైక్ హస్సీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గ్రూప్-బిలో 12 పాయింట్లతో చెన్నై సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ గ్రూప్‌లో మరో సెమీస్ స్థానం కోసం టైటాన్స్, ట్రినిడాడ్, సన్‌రైజర్స్ రేస్‌లో ఉన్నాయి. స్కోరు వివరాలు: బ్రిస్బేన్ హీట్ ఇన్నింగ్స్: హోప్స్ (సి) హోల్టర్ (బి) మోర్కెల్ 20; మైఖేల్ (సి) బద్రీనాథ్ (బి) మోహిత్ 0; లిన్ (సి) జడేజా (బి) అశ్విన్ 29; క్రిస్టియాన్ (సి) హస్సీ (బి) జడేజా 3; బర్న్స్ (సి) రైనా (బి) జడేజా 0; హార్ట్లీ (సి) హోల్డర్ (బి) మోహిత్ 35; సాబర్గ్ (బి) రైనా 2; కట్టింగ్ నాటౌట్ 42; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 4, వైడ్లు 2) 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 137 వికెట్ల పతనం: 1-5; 2-29; 3-54; 4-55; 5-61; 6-66; 7-137. బౌలింగ్: మోహిత్ శర్మ 3-0-35-2; ఆల్బీ మోర్కెల్ 2-0-15-1; హోల్డర్ 2-0-26-0; అశ్విన్ 4-1-10-1; జడేజా 4-0-18-2; రైనా 3-0-9-1; డ్వేన్ బ్రేవో 2-0-20-0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: మైక్ హస్సీ నాటౌట్ 57; మురళీ విజయ్ (సి) బర్న్స్ (బి) కట్టింగ్ 42; రైనా ఎల్బీడబ్ల్యు (బి) క్రిస్టియాన్ 23; ధోని నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 2, వైడ్లు 3) 5; మొత్తం (15.5 ఓవర్లలో రెండు వికెట్లకు) 140 వికెట్ల పతనం: 1-75; 2-116. బౌలింగ్: హోప్స్ 1-0-7-0; గాలె 2-0-22-0; గేనన్ 3-0-19-0; క్రిస్టియాన్ 3-0-16-1; హారిట్జ్ 3-0-36-0; కట్టింగ్ 3.5-0-38-1. చాంపియన్స్ లీగ్‌లో నేడు లయన్స్ x ఒటాగో సా. గం. 4.00 నుంచి రాజస్థాన్ x పెర్త్ రా. గం. 8.00 నుంచి వేదిక: జైపూర్ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సాకర్‌లోనూ ధోని హవా
రాంచీ: చాంపియన్స్ లీగ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్.ధోని.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లోనూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. శుక్రవారం జరిగిన స్నేహపూరిత మ్యాచ్‌లో ఒక గోల్ చేశాడు. తన స్నేహితుడు, జార్ఖండ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుదేశ్ మహతో అసెంబ్లీ నియోజకవర్గం సిలిలో ఈ మ్యాచ్ జరిగింది. ధోని, మహతోల టీమ్ 4-1తో స్థానిక సాకర్ అకాడమీపై విజయం సాధించింది. ధోని ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాలని అతని అభిమానులు కోరుకుంటారని ఈ సందర్భంగా మహతో అన్నారు. దీనికి స్పందించిన మహీ... కొంతకాలం వేచి చూడాలని సమాధానమిచ్చాడు. మ్యాచ్ సందర్భంగా స్టేడియం కిక్కిరిసిపోయింది. ధోని, ధావన్‌లకు జరిమానా రాంచీ: స్లో ఓవర్ రేట్ కారణంగా చెన్నై, సన్‌రైజర్స్ జట్ల కెప్టెన్లతో పాటు ఆటగాళ్లపై కూడా జరిమానా పడింది. సీఎల్‌టి20లో భాగంగా గురువారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నిర్ణీత సమయంకంటే చాలా ఆలస్యంగా ముగిసింది. దీనిని తొలి తప్పిదంగా గుర్తిస్తూ సీఎల్‌టి20 నిబంధనల ప్రకారం ధోని, ధావన్‌లకు చెరో 1500 డాలర్లు (దాదాపు రూ. 94 వేలు) చొప్పున, ఇరు జట్ల సభ్యులకు ఒక్కొక్కరికి 750 డాలర్ల (దాదాపు రూ. 47 వేలు) చొప్పున జరిమానా విధించారు. -
ఎదురులేని రాయల్స్
జైపూర్: గత ఐపీఎల్లో సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రికార్డును... చాంపియన్స్ లీగ్‌లోనూ రాజస్థాన్ రాయల్స్ కొనసాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌కు చేరువయింది. మాన్సింగ్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ద్రవిడ్ సేన 30 పరుగుల తేడాతో హైవీల్డ్ లయన్స్‌పై గెలిచింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కెప్టెన్ ద్రవిడ్ (30 బంతుల్లో 31; 5 ఫోర్లు), వాట్సన్ (24 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. స్టువర్ట్ బిన్నీ (20 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్సర్), బ్రాడ్ హాడ్జ్ (23 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడి జట్టుకు భారీ స్కోరు అందించారు. లయన్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ అల్విరో పీటర్సన్ (28 బంతుల్లో 40; 4 ఫోర్లు) మినహా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. రాజస్థాన్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబె (4/15) నాలుగు వికెట్లతో రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్నాడు. స్కోరు వివరాలు రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ద్రవిడ్ (సి) పీటర్సన్ (బి) ప్రిటోరియస్ 31; రహానే (సి) విజియోన్ (బి) తన్వీర్ 6; శామ్సన్ (సి) సొలెకిలె (బి) సోట్సోబ్ 12; వాట్సన్ (సి) సెమైస్ (బి) సోట్సోబ్ 33; బిన్నీ (బి) ప్రిటోరియస్ 38; హాడ్జ్ నాటౌట్ 46; మేనరియా నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1-21; 2-36; 3-67; 4-110; 5-145. బౌలింగ్: సోట్సోబ్ 4-0-26-2; తన్వీర్ 4-0-36-1; విజియోన్ 4-0-41-0; ప్రిటోరియస్ 4-0-27-2; ఫాంగిసో 4-0-52-0. హైవీల్డ్ లయన్స్ ఇన్నింగ్స్: వాన్‌డెర్ డుసెన్ (సి) ద్రవిడ్ (బి) మాలిక్ 14; డి కాక్ (సి) మేనరియా (బి) వాట్సన్ 18; బవుమా (సి) శామ్సన్ (బి) మాలిక్ 0; విజియోన్ (బి) తాంబె 24; పీటర్సన్ (బి) తాంబె 40; సెమైస్ (సి) బిన్నీ (బి) తాంబె 3; తన్వీర్ ఎల్బీడబ్ల్యు (బి) తాంబె 0; సొలెకిలె (బి) ఫౌల్కనర్ 21; ప్రిటోరియస్ (సి) హాడ్జ్ (బి) ఫాల్క్‌నర్ 19; ఫాంగిసో నాటౌట్ 4; సోట్సోబ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1-25; 2-36; 3-36; 4-89; 5-101; 6-101; 7-120; 8-137; 9-152. బౌలింగ్: విక్రమ్‌జీత్ మాలిక్ 3-0-26-2; ఫౌల్కనర్ 4-0-22-2; వాట్సన్ 4-0-27-1; బిన్నీ 2-0-17-0; కూపర్ 4-0-39-0; ప్రవీణ్ తాంబె 3-0-15-4. చాంపియన్స్ లీగ్‌లో నేడు చెన్నై x సన్‌రైజర్స్ రా. గం. 8.00 నుంచి వేదిక: రాంచీ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
పెరీరా మెరుపులు
క్వాలిఫయింగ్ పోటీల ద్వారా ప్రధాన మ్యాచ్‌లకు అర్హత సాధించిన సన్‌రైజర్స్.... చాంపియన్స్ లీగ్‌ను ఘనంగా ప్రారంభించింది. ట్రినిడాడ్‌తో జరిగిన మ్యాచ్‌లో పెరీరా సంచలన బ్యాటింగ్‌తో ఒంటిచేత్తో హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు. మొహాలీ: ప్రధాన మ్యాచ్‌లకు ఒక్క రోజు ముందు సన్‌రైజర్స్ ఆటగాళ్లపై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి సమయంలో ఆటగాళ్ల స్థైర్యం కాస్తో కూస్తో దెబ్బతింటుంది. కానీ ఆ ప్రభావం తమపై ఏమాత్రం పడలేదని తమ ఆటతీరుతోనే నిరూపించారు సన్‌రైజర్స్ స్టార్స్. తిసార పెరీరా (32 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన హిట్టింగ్తో హైదరాబాద్ జట్టు లీగ్‌లో పాయింట్ల బోణీ చేసింది. పీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన గ్రూప్ బి లీగ్ మ్యాచ్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టుపై సన్‌రైజర్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్... 19.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు పార్థీవ్ (15 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ ధావన్ (18 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్సర్) తొలి నాలుగు ఓవర్లలో 35 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే ట్రినిడాడ్ బౌలర్లు పది పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరినీ అవుట్ చేశారు. డుమిని (16 బంతుల్లో 17; 2 ఫోర్లు) నిలకడగా ఆడుతున్న దశలో రనౌట్ అయ్యాడు. విహారి (13) కూడా నిరాశపరిచాడు. దీంతో సన్‌రైజర్స్ 95 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో తిసార పెరీరా అద్భుతమైన హిట్టింగ్తో ట్రినిడాడ్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. రెండో ఎండ్‌లో డారెన్ స్యామీ (15 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్సర్) కూడా చెలరేగిపోయాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు కేవలం 4.4 ఓవర్లలోనే 47 పరుగులు జోడించి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. అయితే నరైన్ వరుస బంతుల్లో స్యామీ, ఆశిష్‌లను అవుట్ చేసి ట్రినిడాడ్ ఆశలను సజీవంగా నిలిపాడు. అయితే పెరీరా ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా కరణ్ శర్మ (5 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) సాయంతో జట్టును గట్టెక్కించాడు. ట్రినిడాడ్ బౌలర్లలో నరైన్ (4/9) అద్భుతంగా బౌలింగ్ చేసినా ఫలితం లేకపోయింది. అంతకు ముందు టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకోగా... ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సిమ్మన్స్ (0) స్టెయిన్ బౌలింగ్‌లో తొలి బంతికే అవుటయ్యాడు. కానీ డారెన్ బ్రేవో (44 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ చేసి ట్రినిడాడ్ ఇన్నింగ్స్‌కు మూలస్తంభంలా నిలిచాడు. లూయిస్ (14 బంతుల్లో 22; 4 ఫోర్లు), కెప్టెన్ రామ్‌దిన్ (15 బంతుల్లో 21; 3 ఫోర్లు) రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఇషాంత్ శర్మ, పెరీరా, స్యామీ రెండేసి వికెట్లు తీసుకున్నారు. లెగ్‌స్పిన్నర్ కరణ్‌శర్మ తుది జట్టులో ఉన్నా... అతడితో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. తిసార పెరీరాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) పార్థీవ్ (బి) స్టెయిన్ 0; లూయిస్ (సి) పార్థీవ్ (బి) ఇషాంత్ 22; డారెన్ బ్రేవో (సి) ధావన్ (బి) ఇషాంత్ 66; జాసన్ మహమ్మద్ (బి) స్యామీ 19; రామ్‌దిన్ (సి) స్టెయిన్ (బి) పెరీరా 21; పూరన్ (సి) పార్థీవ్ (బి) స్యామీ 6; స్టీవార్ట్ (బి) పెరీరా 17; నరైన్ రనౌట్ 0; ఎమ్రిట్ నాటౌట్ 3; బద్రీ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 1, వైడ్లు 3, నోబాల్ 1) 5; మొత్తం (20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి) 160. వికెట్ల పతనం: 1-0; 2-49; 3-110; 4-110; 5-124; 6-153; 7-154; 8-156. బౌలింగ్: స్టెయిన్ 4-0-41-1; ఇషాంత్ 4-0-36-2; విహారి 1-0-8-0; పెరీరా 4-0-26-2; మిశ్రా 3-0-27-0; స్యామీ 4-0-21-2. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: పార్థీవ్ పటేల్ (సి) స్టీవార్ట్ (బి) నరైన్ 17; శిఖర్ ధావన్ (సి) అండ్ (బి) స్టీవార్ట్ 23; డుమిని రనౌట్ 17; విహారి (స్టం) రామ్‌దిన్ (బి) నరైన్ 13; పెరీరా నాటౌట్ 57; స్యామీ (సి) బద్రీ (బి) నరైన్ 15; ఆశిష్ రెడ్డి (సి) అండ్ (బి) నరైన్ 0; కరణ్ శర్మ నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 2, వైడ్లు 4, నోబాల్స్ 3) 9; మొత్తం (19.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి) 164. వికెట్ల పతనం: 1-35; 2-45; 3-70; 4-95; 5-142; 6-142. బౌలింగ్: రామ్‌పాల్ 4-0-39-0; బద్రీ 4-0-25-0; ఎమ్రిట్ 4-0-57-0; నరైన్ 4-1-9-4; స్టీవార్ట్ 3.3-0-32-1. చాంపియన్స్ లీగ్‌లో నేడు ఒటాగో x పెర్త్ సా. గం. 4.00 నుంచి రాజస్థాన్ x లయన్స్ రా. గం. 8.00 నుంచి వేదిక: జైపూర్ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
‘రాయల్’ గా ఆరంభం
గత ఐపీఎల్లో సొంతగడ్డపై అన్ని మ్యాచ్‌లూ గెలిచిన సంప్రదాయాన్ని రాజస్థాన్ రాయల్స్ చాంపియన్స్లీగ్లోనూ కొనసాగించింది. తమ తొలి మ్యాచ్‌లో ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై అలవోకగా గెలిచింది. జైపూర్: ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం తర్వాత... రాజస్థాన్ రాయల్స్ ఆట కంటే మిగిలిన విషయాల్లోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. చాంపియన్స్ లీగ్‌కు ముందు ఆ జట్టు షాక్ నుంచి తేరుకుందా లేదా అనే అంశంపై భారీగా చర్చ జరిగింది. కానీ మైదానంలోకి దిగాక అవన్నీ పక్కకి నెట్టిన రాయల్స్ చాంపియన్స్లీగ్ను ఘనంగా ప్రారంభించింది. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో శనివారం జరిగిన గ్రూప్ ఎ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై అలవోకగా నెగ్గింది. టాస్ గెలిచిన ద్రవిడ్ బౌలింగ్ ఎంచుకోగా... ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. రాజస్థాన్ పేసర్ విక్రమ్‌జీత్ మాలిక్ చక్కగా బౌలింగ్ చేసి స్మిత్ (9), కార్తీక్ (2)ల వికెట్లు తీయడంతో ముంబై తడబడింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (17 బంతుల్లో 15; 3 ఫోర్లు) మంచి టచ్‌లోనే కనిపించినా.... ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. రాయుడు (3) కూడా రనౌట్‌గా వెనుదిరగడంతో ముంబై జట్టు 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ (37 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పొలార్డ్ (36 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. తొలుత రోహిత్, ఆ తర్వాత పొలార్డ్ వేగంగా ఆడి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఈ ఇద్దరూ అవుటయ్యాక... చివరి ఓవర్లో కౌల్టర్ నైల్ (5 బంతుల్లో 12 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) ఉపయోగకరమైన పరుగులు సాధిం చాడు. రాయల్స్ బౌలర్లలో విక్రమ్‌జీత్ మాలిక్ మూడు వికెట్లు తీసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 19.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలోనే కెప్టెన్ ద్రవిడ్ (1) వికెట్‌ను కోల్పోయినా... రహానే (31 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్సర్), సంజు శామ్సన్ (47 బంతుల్లో 54; 8 ఫోర్లు) కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 59 బంతుల్లోనే 74 పరుగులు జోడించారు. గత ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన శామ్సన్ ఈసారి కూడా నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడి అర్ధసెంచరీ సాధించాడు. శామ్సన్ అవుటయ్యాక వాట్సన్ (22 బంతుల్లో 27 నాటౌట్; 2 సిక్సర్లు), స్టువర్ట్ బిన్నీ (14 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) చకచకా పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) మాలిక్ 9; సచిన్ (సి) శామ్సన్ (బి) బిన్నీ 15; దినేశ్ కార్తీక్ (బి) మాలిక్ 2; రోహిత్ శర్మ (సి) శామ్సన్ (బి) వాట్సన్ 44; రాయుడు రనౌట్ 3; పొలార్డ్ (సి) శామ్సన్ (బి) మాలిక్ 42; హర్భజన్ రనౌట్ 8; కౌల్టర్ నైల్నాటౌట్ 12; రిషి ధావన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 2, వైడ్లు 5) 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 142. వికెట్ల పతనం: 1-9; 2-26; 3-38; 4-43; 5-95; 6-130; 7-141. బౌలింగ్: మేనరియా 2-0-9-0; విక్రమ్‌జీత్ మాలిక్ 4-0-24-3; ఫాల్క్‌నర్ 4-0-31-0; వాట్సన్ 3-0-26-1; స్టువర్ట్ బిన్నీ 2-0-13-1; రాహుల్ శుక్లా 2-0-6-0; కూపర్ 3-0-31-0. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ద్రవిడ్ (సి) పొలార్డ్ (బి) కౌల్టర్ నైల్ 1; రహానే (బి) రిషి ధావన్ 33; శామ్సన్ (సి) స్మిత్ (బి) పొలార్డ్ 54; వాట్సన్ నాటౌట్ 27; స్టువర్ట్ బిన్నీ నాటౌట్ 27; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 4, వైడ్లు 2) 6; మొత్తం (19.4 ఓవర్లలో మూడు వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1-5; 2-79; 3-107. బౌలింగ్: జాన్సన్ 4-0-38-0; కౌల్టర్ నైల్ 3.4-0-22-1; రిషి ధావన్ 4-0-17-1; ప్రజ్ఞాన్ ఓజా 1-0-13-0; హర్బజన్ 3-0-22-0; పొలార్డ్ 3-0-20-1; డ్వేన్ స్మిత్ 1-0-12-0. -
‘మాస్టర్’ ఆఖరిసారిగా...
మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌ను అభిమానులు ఆఖరిసారిగా క్రికెట్ మైదానంలో రంగు దుస్తుల్లో చూడబోతున్నారు. ఇప్పటికే వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ‘మాస్టర్’ చాంపియన్స్ లీగ్ టోర్నీ అనంతరం టి20 ఫార్మాట్‌నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో సీఎల్‌టి20లో సచిన్ ఆడే ప్రతీ మ్యాచ్‌పై ప్రేక్షకుల వైపు నుంచి అదనపు ఆసక్తి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్‌లాగే ఈ టోర్నీని కూడా నెగ్గి ఈ దిగ్గజ క్రికెటర్‌కు మరో కానుక ఇవ్వాలని ముంబై ఇండియన్స్ పట్టుదలగా ఉంది. మరో వైపు రాహుల్ ద్రవిడ్ కూడా చివరిసారిగా క్రికెట్ మైదానంలో దిగనున్నాడు. జైపూర్: చాంపియన్స్ లీగ్-2013 తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్ తమ సొంతగడ్డపై ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో తలపడనుంది. సచిన్ కోసం... అంటూ ముంబై జట్టు టోర్నీని ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, ఐపీఎల్లో తమ జట్టుపై వచ్చిన ఫిక్సింగ్ వివాదాన్ని మరచి విజయాన్ని అందుకోవాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది. దాంతో ఇరు జట్లకు తొలి మ్యాచ్ కీలకంగా మారింది. ముంబై గతంలో ఒకసారి చాంపియన్స్ లీగ్‌లో విజేతగా నిలిచింది. రాయల్స్ మాత్రం టైటిల్ అందుకోలేదు. ఐపీఎల్-6లో ఈ రెండు జట్లు మాత్రమే సొంత మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడి సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో బరిలోకి దిగుతుండటం ద్రవిడ్ సేనకు అనుకూలాంశం. మలింగ లేని లోటు... ఐపీఎల్ విజేత హోదాలో బరిలోకి దిగుతున్న ముంబై ఇండియన్స్ మరోసారి తమ బ్యాటింగ్‌నే నమ్ముకుంది. సచిన్ టెండూల్కర్‌తో పాటు ఐపీఎల్లో జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ, డ్వేన్ స్మిత్, రాయుడు, దినేశ్ కార్తీక్‌లతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇక సీఎల్‌టి20తోనే వెలుగులోకి వచ్చిన పొలార్డ్ చెలరేగితే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. డ్వేన్ స్మిత్ అద్భుత బ్యాటింగ్‌తోనే ముంబై జట్టు ఐపీఎల్లో దూసుకుపోయింది. అయితే ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన లసిత్ మలింగ టోర్నీకి దూరం కావడం ఆ జట్టు బౌలింగ్‌ను బలహీనపర్చింది. అయితే కౌల్టర్కు పెద్దగా అనుభవం లేకపోవడం, ఆబూ నెచిమ్, రిషి ధావన్ రూపంలో ఇద్దరు భారత పేసర్లు మాత్రమే జట్టులో ఉండటంతో మిచెల్ జాన్సన్‌పై పేస్ భారం పడుతుంది. మలింగ గైర్హాజరీతో హర్భజన్ సింగ్ ప్రధాన బౌలర్ బాధ్యత నెరవేర్చాల్సి ఉంది. వాట్సన్‌పై భారం... ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ వివాదం రాజస్థాన్ రాయల్స్ జట్టు స్థైర్యాన్ని బాగా దెబ్బ తీసింది. జట్టులోని ప్రతీ క్రికెటర్‌నూ అనుమానించాల్సిన పరిస్థితిని కల్పించింది. వీటిని అధిగమించి జట్టుగా సత్తా చాటాలని రాజస్థాన్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పట్టుదలగా ఉన్నాడు. పైగా తన క్రికెట్ కెరీర్‌ను మెరుగైన ప్రదర్శనతో ముగించాలని కూడా అతను భావిస్తున్నాడు. రాయల్స్ బ్యాటింగ్‌కు షేన్‌వాట్సన్ మూల స్థంభంగా చెప్పవచ్చు. ఐపీఎల్లో జట్టు టాప్ స్కోరర్ అయిన అతను ఇటీవల ఇంగ్లండ్‌పై వన్డేలో సెంచరీ చేసి ఫామ్‌లో ఉన్నాడు. బ్రాడ్ హాడ్జ్, ద్రవిడ్, రహానే, బిన్నీలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. అశోక్ మేనరియా కూడా భారీ షాట్లు ఆడగల సమర్థుడు. అయితే శ్రీశాంత్, అంకిత్ చవాన్, సిద్ధార్థ్ త్రివేదిలపై వేటు పడటంతో జట్టు బౌలింగ్ కాస్త బలహీనంగా మారింది. షాన్ టెయిట్, ఫాల్క్‌నర్, వాట్సన్లదే ప్రధాన పాత్ర. కూపర్‌తో పాటు భారత దేశవాళీ బౌలర్లలో విక్రమ్‌జిత్ మాలిక్, రాహుల్ శుక్లాలు అండగా నిలవాల్సి ఉంది. రాయల్స్ టీమ్‌లో ప్రవీణ్ ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్. జట్ల వివరాలు ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), సచిన్, నెచిమ్, కౌల్టర్, రిషి ధావన్, హర్భజన్, జాన్సన్, కార్తీక్, మ్యాక్స్‌వెల్, ప్రజ్ఞాన్ ఓజా, అక్షర్ పటేల్, పొలార్డ్, రాయుడు, స్మిత్, తారే. రాజస్థాన్ రాయల్స్: ద్రవిడ్ (కెప్టెన్), బిన్నీ, కూపర్, ఫాల్క్‌నర్, హాడ్జ్, మాలిక్, మేనరియా, రహానే, సంజు సామ్సన్, శుక్లా, టెయిట్, తాంబే, యాజ్ఞిక్, హర్మీత్‌సింగ్. ‘ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తేమ ఎక్కువగా ఉండి వికెట్ కాస్త నెమ్మదించవచ్చు. సాధారణంకంటే ఎక్కువగానే సుదీర్ఘ సమయం పాటు వర్షం పడుతోంది. మేం అన్ని ఏర్పాట్లు చేస్తున్నా వరుణుడిని అడ్డుకోలేం కదా. పిచ్‌పై అంతా చక్కబడే సరికి కొంత సమయం పట్టవచ్చు’. - తపోష్ ఛటర్జీ, పిచ్ క్యురేటర్ -
ఒటాగో, సన్‌రైజర్స్ ‘పాస్’
చాంపియన్స్ లీగ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్, ఒటాగో వోల్ట్స్ జట్లు ప్రధాన పోటీలకు అర్హత సాధించాయి. ఈ రెండు జట్లూ వరుసగా రెండు రోజుల పాటు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.... మూడో మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండానే క్వాలిఫయింగ్‌లో ‘పాస్’ అయ్యాయి. పాకిస్థాన్‌కు చెందిన ఫైసలాబాద్ వోల్వ్స్, శ్రీలంకకు చెందిన కందురతా మారూన్స్కు నిరాశే మిగిలింది. శుక్రవారం జరిగే క్వాలిఫయింగ్ చివరి మ్యాచ్‌ల ద్వారా ఎవరు ‘టాప్’ అనేది తేలుతుంది. ఒటాగో, సన్రైజర్స్ల మ్యాచ్ విజేత క్వాలిఫయర్-1గా ప్రధాన పోటీల బరిలోకి దిగుతుంది. ఫైసలాబాద్, కందురతాల మధ్య జరిగే పోరు నామమాత్రం. ఒంటిచేత్తో.... మొహాలీ: ఇంగ్లండ్ నుంచి బుధవారం ఉదయం మొహాలీ వచ్చిన టెన్ డష్కటె... కేవలం ఆరు గంటల విశ్రాంతి తర్వాత నేరుగా మైదానంలోకి దిగాడు. సుదీర్ఘ ప్రయాణం చేసిన అలసటను అధిగమించి ఒంటిచేత్తో ఒటాగో వోల్ట్స్ను గెలిపించాడు. డష్కటె (2/9, 32 బంతుల్లో 64; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆల్‌రౌండ్ షో తో... పీసీఏ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఒటాగో వోల్ట్స్ జట్టు కందురతా మారూన్స్పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఒటాగో ఫీల్డింగ్ ఎంచుకోగా... కందురతా మారూన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ తరంగ (56 బంతుల్లో 76; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) నిలకడగా ఆడినా... సంగక్కర సహా మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడటం, చివర్లో ఒటాగో బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో కందురతా ఓ మాదిరి స్కోరు సాధించింది. ఒటాగో బౌలర్ బట్లర్ నాలుగు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బ తీశాడు. టెన్ డష్కటె రెండు వికెట్లు తీసుకున్నాడు. ఒటాగో జట్టు 18 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. డష్కటెతో పాటు నీషమ్ (19 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగిపోయాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు కేవలం 30 బంతుల్లో 57 పరుగులు జోడించడం విశేషం. ఓపెనర్లు బ్రూమ్ (25), రూథర్‌ఫోర్డ్ (20) కూడా రాణించారు. కందరుతా బౌలర్ దిల్హారా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆల్‌రౌండ్ షో కనబరచిన టెన్ డష్కటెకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు కందురతా మారూన్స్ ఇన్నింగ్స్: తరంగ (సి) బి.మెకల్లమ్ (బి) బట్లర్ 76; షెహాన్ జయసూర్య (బి) మెక్‌మిలన్ 13; సంగక్కర (సి) టెన్ డష్కటె (బి) నీషమ్ 13; దిల్హారా (సి) రూథర్‌ఫోర్డ్ (బి) టెన్ డష్కటె 15; తిరిమన్నె (సి) బి.మెకల్లమ్ (బి) టెన్ డష్కటె 6; చమరసిల్వ ఎల్బీడబ్ల్యు (బి) బట్లర్ 6; లోకురాచి (బి) బట్లర్ 0; కులశేఖర (బి) వాగ్నర్ 14; కాందంబి రనౌట్ 5; రణ్‌దివ్ నాటౌట్ 1; మెండిస్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (బై 1, లెగ్‌బైస్ 2, వైడ్లు 2) 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1-25; 2-52; 3-99; 4-112; 5-134; 6-134; 7-135; 8-146; 9-154. బౌలింగ్: బట్లర్ 4-0-21-3; మెక్‌మిలన్ 3-0-17-1; వాగ్నర్ 4-0-28-1; ఎన్.మెకల్లమ్ 2-0-30-0; నీషమ్ 4-0-39-1; టెన్ డష్కటె 2-0-9-2; బెర్డ్ 1-0-7-0. ఒటాగో వోల్ట్స్ ఇన్నింగ్స్: బ్రూమ్ (సి) కాందంబి (బి) దిల్హారా 25; రూథర్‌ఫోర్డ్ (సి) దిల్హారా (బి) రణ్‌దివ్ 20; బి. మెకల్లమ్ (స్టం) సంగక్కర (బి) దిల్హారా 8; టెన్ డష్కటె (సి) కులశేఖర (బి) దిల్హారా 64; నీషమ్ నాటౌట్ 32; ఎన్.మెకల్లమ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (బైస్ 3, లెగ్‌బైస్ 2, వైడ్లు 2, నోబాల్ 1) 8; మొత్తం (18 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1-31; 2-45; 3-89; 4-146. బౌలింగ్: కులశేఖర 3-0-31-0; రణ్‌దివ్ 4-0-36-1; మెండిస్ 4-0-26-0; దిల్హారా 4-0-20-3; లోకురాచి 2-0-24-0; జయసూర్య 1-0-15-0. అలవోకగా... మొహాలీ: చాంపియన్స్‌లీగ్‌లో హైదరాబాద్‌తో ఆడాల్సిన జట్లన్నింటికీ హై అలెర్ట్. శిఖర్ ధావన్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్ ధావన్ (50 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్సర్) వరుసగా రెండో అర్ధసెంచరీ సాధించడంతో... సన్‌రైజర్స్ అలవోకగా ఫైసలాబాద్పై నెగ్గి లీగ్ ప్రధాన పోటీలకు అర్హత సాధించింది. పీసీఏ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో ఫైసలాబాద్ వోల్వ్స్‌పై నెగ్గింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఫైసలాబాద్ వోల్వ్స్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు అమ్మర్ (31), అలీ (16) 48 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చినా... మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కెప్టెన్ మిస్బావుల్ హక్ (40 బంతుల్లో 56 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో కనీసం ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. సన్‌రైజర్స్ బౌలర్లంతా సమష్టిగా రాణించారు. ఇషాంత్, మిశ్రా, కరణ్, పెరీరా, స్యామీ ఒక్కో వికెట్ తీసుకున్నారు. సన్‌రైజర్స్ 17.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ పార్థీవ్ పటేల్ (21 బంతుల్లో 23; 3 ఫోర్లు), ధావన్ కలిసి తొలి వికెట్‌కు 68 పరుగులతో శుభారంభాన్నిచ్చారు. ఈ ఇద్దరూ అవుటైనా... డుమిని (27 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్) నిలకడగా ఆడాడు. చివర్లో స్యామీ (6 బంతుల్లో 14 నాటౌట్; 3 ఫోర్లు) చకచకా పరుగులు చేసి మ్యాచ్‌ను త్వరగా ముగించాడు. సన్‌రైజర్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (1/13)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు ఫైసలాబాద్ వోల్వ్స్ ఇన్నింగ్స్: అమ్మర్ మొహమ్మద్ (సి) మిశ్రా (బి) స్యామీ 31; అలీ వకాస్ (సి) ఆశిష్ (బి) మిశ్రా 16; ఆసిఫ్ అలీ ఎల్బీడబ్ల్యు (బి) కరణ్ 0; మిస్బావుల్ హక్ నాటౌట్ 56; ఇమ్రాన్ ఖాలిద్ (సి) పెరీరా (బి) ఇషాంత్ 2; ఖుర్రమ్ షెహ్జాద్ (బి) పెరీరా 4; సల్మాన్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు (బైస్ 4, లెగ్‌బైస్ 6, వైడ్లు 4, నోబాల్ 1) 15; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1-48; 2-50; 3-69; 4-92; 5-101. బౌలింగ్: స్టెయిన్ 4-0-20-0; ఇషాంత్ 4-0-26-1; పెరీరా 4-0-33-1; అమిత్ మిశ్రా 4-1-13-1; కరణ్ శర్మ 2-0-11-1; స్యామీ 2-0-14-1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: పార్థీవ్ పటేల్ (సి) ఖుర్రమ్ (బి) అదిల్ 23; శిఖర్ ధావన్ (బి) ఖాలిద్ 59; డుమిని నాటౌట్ 20; సామంత్రె ఎల్బీడబ్ల్యు (బి) ఖాలిద్ 0; స్యామీ నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 6, వైడ్లు 8, నోబాల్ 1) 15; మొత్తం (17.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి) 131. వికెట్ల పతనం: 1-68; 2-112; 3-112. బౌలింగ్: సమియుల్లా 4-0-36-0; అసద్ అలీ 3.3-0-27-0; అజ్మల్ 4-0-25-0; అదిల్ 3-0-14-1; ఖుర్రమ్ 1-0-9-0; ఖాలిద్ 2-0-14-2. -
తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఘన విజయం
ఐపీఎల్లో కనబర్చిన స్ఫూర్తిదాయక ఆటతీరును చాంపియన్స్ లీగ్‌లోనూ హైదరాబాద్ జట్టు కొనసాగించింది. విజయలక్ష్యం పెద్దదే అయినా ఏ మాత్రం బెదరకుండా దూకుడు ప్రదర్శించి సీఎల్‌టి20 క్వాలిఫయింగ్‌లో శుభారంభం చేసింది. ఇటీవల తనకు వచ్చిన సూపర్‌స్టార్ ఇమేజ్ను నిలబెట్టుకుంటూ శిఖర్ ధావన్ మళ్లీ చెలరేగి నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాడు. మొహాలీ: చాంపియన్స్ లీగ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సీఎల్‌టి20 అర్హత మ్యాచుల్లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో కందురతా మారూన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కందురతా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 168 పరుగులు చేసింది. సంగక్కర (46 బంతుల్లో 61 నాటౌట్; 7 ఫోర్లు), కెప్టెన్ తిరిమన్నె (39 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 89 పరుగులు జోడించి జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించారు. ఇషాంత్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 174 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. శిఖర్ ధావన్ (53 బంతుల్లో 71; 11 ఫోర్లు), పార్థివ్ పటేల్ (42 బంతుల్లో 52; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 121 పరుగులు జత చేసి రైజర్స్ లక్ష్యాన్ని సులభతరం చేశారు. చివర్లో పెరీరా (11 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో మ్యాచ్ ముగిసింది. ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కీలక భాగస్వామ్యం టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో గతి తప్పిన బౌలింగ్‌తో స్టెయిన్ తన రెండు ఓవర్లలో 20 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే మరో వైపు ఇషాంత్ చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. తన తొలి ఓవర్లో ఒకే పరుగు ఇచ్చిన ఇషాంత్, రెండో ఓవర్లో తరంగ (18 బంతుల్లో 19; 4 ఫోర్లు)ను పెవిలియన్‌కు పంపించాడు. మరుసటి ఓవర్లోనే స్యామీ బౌలింగ్‌లో జయసూర్య (4) వెనుదిరిగాడు. పవర్‌ప్లే ముగిసే సరికి కందురతా 2 వికెట్లకు 37 పరుగులు చేసింది. ఈ దశలో సంగక్కర, తిరిమన్నె కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరు సమన్వయంతో చక్కటి షాట్లు ఆడుతూ వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తిరిమన్నె... ఆ వెంటనే ఇషాంత్ వేసిన యార్కర్‌కు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం జోరు పెంచిన సంగక్కర 36 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చివర్లో దిల్హారా (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో మారూన్స్ ఇన్నింగ్స్ 168 పరుగుల వద్ద ముగిసింది. చెలరేగిన ఓపెనర్లు హైదరాబాద్‌కు ధావన్, పార్థివ్ కలిసి మరోసారి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ప్రతీ ఓవర్లో బౌండరీలు బాదుతూ వీరిద్దరు వేగంగా లక్ష్యం దిశగా జట్టును నడిపించారు. మెండిస్ వేసిన తొలి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి ధావన్ తన దూకుడును ప్రదర్శించాడు. పవర్‌ప్లేలో రైజర్స్ వికెట్ కోల్పోకుండా 58 పరుగులు చేసింది. ఏ బౌలర్‌ను వదలని రైజర్స్ ఓపెనర్లు జోరును కొనసాగించడంతో 10.4 ఓవర్లలో జట్టు స్కోరు వంద పరుగులకు చేరుకుంది. ఆ వెంటనే ధావన్ (35 బంతుల్లో), పార్థివ్ (37 బంతుల్లో) వరుస బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కొంత వ్యవధిలో ఈ ఇద్దరూ అవుటైనా...డుమిని (6 నాటౌట్)తో కలిసి పెరీరా ముగించాడు. స్కోరు వివరాలు కందురతా మారూన్స్ ఇన్నింగ్స్: తరంగ (సి) పార్థివ్ (బి) ఇషాంత్ 19; జయసూర్య (సి) పార్థివ్ (బి) స్యామీ 4; సంగక్కర (నాటౌట్) 61; తిరిమన్నె (బి) ఇషాంత్ 54; దిల్హారా (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 168 వికెట్ల పతనం: 1-25; 2-33; 3-122. బౌలింగ్: స్టెయిన్ 4-0-35-0; ఇషాంత్ 4-0-20-2; స్యామీ 4-0-31-1; పెరీరా 4-0-43-0; మిశ్రా 1-0-9-0. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్: పార్థివ్ (సి) జయరత్నే (బి) జయసూర్య 52; ధావన్ (సి) కులశేఖర (బి) మెండిస్ 71; డుమిని (నాటౌట్) 6; పెరీరా (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 174 వికెట్ల పతనం: 1-121; 2-136. బౌలింగ్: జయసూర్య 4-0-25-1; జయరత్నే 3-0-33-0; నువాన్ కులశేఖర 3.3-0-35-0; దిల్హారా 4-0-38-0; అజంతా మెండిస్ 4-0-39-1. -
నేటి నుంచి చాంపియన్స్ లీగ్
-
రెండో ఐపీఎల్!
టి20 క్రికెట్లో ఐపీఎల్ తర్వాత ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న టోర్నీ చాంపియన్స్ లీగ్. భారత్ నుంచి ఎక్కువ జట్లు బరిలోకి దిగడంతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలకు చెందిన పటిష్టమైన టీమ్‌లు పోటీపడుతుండటంతో టోర్నీపై ఆసక్తి రేపుతోంది. ఆయా దేశాల నుంచి ప్రతి ఏటా పాల్గొంటున్న జట్లు మారుతూ ఉండటం వల్ల ఐపీఎల్‌తో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో జట్లను ఈ టోర్నీలో చూసే అవకాశం కలుగుతోంది. ఈ సారి ఇంగ్లండ్ టోర్నీకి దూరంగా ఉంది. ఐపీఎల్ ప్రారంభమైన (2008) మరుసటి ఏడాది నుంచి సీఎల్‌టి20 జరుగుతోంది. ఐపీఎల్ స్థాయిలో విజయవంతం కాలేకపోయినా ప్రతీ ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సీఎల్‌టి20 కూడా తక్కువేమీ కాదు. సాక్షి క్రీడా విభాగం చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీకి భారత్ మరోసారి వేదికైంది. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుల భాగస్వామ్యంలో జరుగుతున్న ఈ టోర్నీకి రెండుసార్లు భారత్ ఆతిథ్యమివ్వగా, మరో రెండుసార్లు దక్షిణాఫ్రికాలో జరిగింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ అక్టోబర్ 6న ముగుస్తుంది. ఈ నెల 17, 18, 20 తేదీల్లో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు... 21 నుంచి ప్రధాన మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నేపథ్యంలో సీఎల్‌టి20 గత రికార్డులు, టోర్నీ విశేషాలపై ‘సాక్షి’ ఫోకస్ 10 జట్లతో... ఈసారి టోర్నీలో 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఎనిమిది జట్లు నేరుగా అర్హత సాధించగా, రెండు టీమ్‌లు క్వాలిఫయర్స్ ద్వారా ప్రధాన మ్యాచ్‌లకు అర్హత సాధిస్తాయి. మొత్తం జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో టీమ్ తన గ్రూప్‌లోని ఇతర నాలుగు జట్లతో తలపడుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. క్వాలిఫయర్స్‌లో ఆడుతున్న జట్లు: సన్‌రైజర్స్ హైదరాబాద్, ఫైసలాబాద్ వోల్వ్స్, కందురతా మారూన్స్, ఒటాగో వోల్ట్స్. చూడదగ్గ ఆటగాళ్లు: సచిన్, రోహిత్, పొలార్డ్, ధోని, రైనా, డ్వేన్ బ్రేవో, మిస్బా, అజ్మల్, బ్రెండన్ మెకల్లమ్, ద్రవిడ్, వాట్సన్, ధావన్, స్టెయిన్, డివిలియర్స్, నరైన్, సంగక్కర, అజంత మెండిస్. చాంపియన్స్ లీగ్ రికార్డులు అత్యధిక స్కోరు: 215/8 (బెంగళూరు, సౌత్ ఆస్ట్రేలియాపై) అత్యధిక పరుగులు: వార్నర్ (13 మ్యాచుల్లో 556) అత్యధిక వ్యక్తిగత స్కోరు: వార్నర్ (135 నాటౌట్) అత్యధిక సిక్స్‌లు: పొలార్డ్ ( 20 మ్యాచుల్లో 38) ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్స్‌లు: వార్నర్ (11) అత్యధిక వికెట్లు: మలింగ ( 14 మ్యాచుల్లో 24) అత్యుత్తమ బౌలింగ్: అజహర్ మహమూద్ (5/24) -
చాంపీయన్స్ లీగ్ 2013
-
ఫైసలాబాద్ వోల్వ్స్‌కు వీసా చిక్కులు
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన ఫైసలాబాద్ వోల్వ్స్ జట్టు చాంపియన్స్ లీగ్ (సీఎల్టీ20) టోర్నమెంట్లో పాల్గొనే అవకాశాలు సన్నగిల్లాయి. భారత్ ఆతిథ్యమిచ్చే చాంపియన్స్ లీగ్ టి20లో ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్న వోల్వ్స్ జట్టు ఆశలపై భారత ప్రభుత్వం నీళ్లు చల్లింది. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పాక్ జట్టుకు వీసా ఇచ్చేందుకు భారత ప్రభుత్వం నిరాకరించినట్లు తెలిసింది. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో వారి జట్టు పర్యటనకు భద్రతా చిక్కులు వస్తాయనే నెపంతో విదేశీ వ్యవహారాల శాఖ వీసా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. చివరి నిమిషంలో వీసా మంజూరైతే తప్ప... వోల్వ్స్ జట్టు టి20 టోర్నీలో ఆడే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. షెడ్యూలు ప్రకారమైతే క్వాలిఫయింగ్ ఈవెంట్లో వోల్వ్స్ జట్టు ఈ నెల 17న ఒటాగో వోల్ట్స్‌తో తలపడాల్సి ఉంది. ఫైసలాబాద్ జట్టు గైర్హాజరీతో ఇప్పుడు క్వాలిఫయింగ్‌లో మూడు జట్లే తలపడనున్నాయి. దాయాది దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతినడంతో గతంలోనూ పాక్ జట్టుకు అవకాశం కల్పించలేదు. -
ఫిక్సింగ్ నియంత్రణకు ఐదు సూత్రాలు
కోల్‌కతా: ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే చాంపియన్స్ లీగ్ టి20లో అవినీతిని అరికట్టేందుకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు దాల్మియా సూచించిన ఐదు పాయింట్ల ప్రతిపాదనలను వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. 1. ప్రతీ జట్టు వెంట ఉండే భద్రతా సిబ్బందితో పాటు అదనంగా అవినీతి వ్యతిరేక మరియు భద్రతా యూనిట్ అధికారి ఉండాలి. 2. డగ్ అవుట్, మ్యాచ్ అధికారుల ఏరియాలో ఇతరుల కదలికలను నిషేధించాలి. 3. ముఖ్యంగా టోర్నీ సందర్భంగా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్ అధికారులు బయటి వారి నుంచి ఎలాంటి బహుమతులను స్వీకరించరాదు. అలాంటివేమన్నా ఉంటే టోర్నీ ప్రారంభానికి 15 రోజుల ముందే ఆ బహుమతి విలువతో పాటు ఇచ్చిన వ్యక్తి గురించి కూడా వెల్లడించాల్సి ఉంటుంది. 4. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది తమ మొబైల్ నంబర్లను ముందే బహిరంగపర్చాలి. ఆటగాళ్లకు వచ్చే కాల్స్‌ను హోటల్ ఎక్స్ఛేంజ్ ద్వారా టీమ్ మేనేజర్ రూఢి చేసుకుంటారు. 5. అవసరమనుకుంటే ఏసీఎస్‌యూ అధికారులు స్థానిక అధికారుల సహాయాన్ని తీసుకోవచ్చు. -
బరిలో సచిన్, ద్రవిడ్
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ చివరిసారిగా రంగు దుస్తుల్లో క్రికెట్ ఆడుతుంటే చూడటానికి అభిమానులకు ఆఖరి అవకాశం. సెప్టెంబరు 17 నుంచి జరిగే చాంపియన్స్‌లీగ్ టి20లో ఈ ఇద్దరూ బరిలోకి దిగుతున్నారు. లీగ్ బరిలోకి దిగే 12 జట్లు తమ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. రెండు జట్ల తరఫున చాంపియన్స్ లీగ్ ఆడే అవకాశం ఉన్న విదేశీ క్రికెటర్లు 12 మంది ఉంటే... ఇందులో 11 మంది ఐపీఎల్ జట్ల తరఫున ఆడాలని నిర్ణయించుకున్నారు. వాట్సన్, హస్సీ, బ్రేవో, పొలార్డ్ ఈ జాబితాలో ఉన్నారు. శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర మాత్రం తమ దేశవాళీ జట్టు కుందురత తరఫునే ఆడనున్నాడు. సెప్టెంబరు 17న హైదరాబాద్‌లో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో టోర్నీకి తెరలేవనుంది. ఇందులో సన్‌రైజర్స్‌తో సహా నాలుగు జట్లు పోటీ పడతాయి. వీటిలోంచి రెండు జట్లు ప్రధాన పోటీలకు అర్హత సాధిస్తాయి. మిగిలిన 8 జట్లతో ఈ రెండింటిని కలిపి... మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించి లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అక్టోబరు 6న ఢిల్లీలో టోర్నీ ఫైనల్ జరుగుతుంది. వీసా కోసం పాక్ జట్టు దరఖాస్తు చాంపియన్స్ లీగ్ టి20లో ఆడే ఫైసలాబాద్ జట్టు క్రికెటర్ల వీసా కోసం పాక్ క్రికెబ్ బోర్డు భారత్‌కు దరఖాస్తు చేసింది. అయితే సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఫైసలాబాద్ వోల్వ్స్‌ను అనుమతించే విషయమై ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ‘ఫైసలాబాద్ జట్టు విషయమై భారత క్రికెట్ బోర్డును మేం నిరంతరం సంప్రదిస్తూనే ఉన్నాం. అయితే వారు ప్రభుత్వం నుంచి వచ్చే తుది నిర్ణయం కోసం వేచి ఉన్నామని చెప్పారు. కానీ మా జట్టును భారత్ పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచించారు’ అని పీసీబీ వర్గాలు తెలిపాయి. ‘నా విధేయతను ఎవరూ ప్రశ్నించలేరు’ చాంపియన్స్ లీగ్ టి20లో తమ సొంత జట్టు తరఫున ఆడేందుకు నిర్ణయించుకున్న కుమార సంగక్కర దేశం పట్ల తనకున్న విధేయతను ప్రశ్నించిన శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులను విమర్శించాడు. సీఎల్ టి20లో ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్, లంక నుంచి కుందురత మరూన్ కూడా అర్హత సాధించడంతో సంగ తన సొంత జట్టుకే ఆడాలని భావించాడు. ‘సీఎల్ టి20కి కుందురత అర్హత సాధించడంతోనే నేను ఆ జట్టుకే ఆడాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే ఐపీఎల్ టీమ్ నన్ను వదులుకునేందుకు మొదట్లో సిద్ధపడలేదు. అసలు కుందురత తరఫున నేను ఆడాలని వారు నేరుగా చెప్పడం గత మంగళవారమే విన్నాను. ఐపీఎల్ ఫ్రాంచైజీతో వారు మాట్లాడితే బావుండేది. శ్రీలంక క్రికెట్ ఆ విషయంలో విఫలమైంది. అందుకే నేనే తగిన నిర్ణయం తీసుకున్నాను’ అని సంగక్కర చెప్పాడు. సన్‌రైజర్స్‌కు దూరమైనందుకు సంగ లక్షా 40 వేల డాలర్లు కోల్పోనున్నాడు.