న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ తిరిగి భారత హాకీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మిడ్ ఫీల్డ్‌ను బలోపేతం చేయడంలో భాగంగా అతనితో పాటు బీరేంద్ర లక్డాలను ఎంపిక చేశారు. ఈ నెల 23 నుంచి నెదర్లాండ్స్‌లో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీ కోసం గురువారం జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యుల జట్టుకు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నిరాశజనక ప్రదర్శన కనబరచడంతో జట్టులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కామన్వెల్త్ జట్టులో చోటు దక్కని సర్దార్ సింగ్, లాక్రాలను తిరిగి ఎంపిక చేశారు.
జట్టు: గోల్‌కీపర్స్: శ్రీజేశ్ (కెప్టెన్), బహదూర్ పాఠక్. డిఫెండర్స్: హర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, సురేందర్, జర్మన్‌ప్రీత్ సింగ్, బీరేంద్ర లక్డా, అమిత్ రొహిదాస్. మిడ్‌ఫీల్డర్స్: మన్‌ప్రీత్ సింగ్, చింగ్లెన్‌సన సింగ్, సర్దార్ సింగ్, వివేక్ సాగర్. ఫార్వర్డ్స్: సునీల్ విఠలాచార్య, రమణ్‌దీప్ సింగ్, మన్‌దీప్ సింగ్, సుమిత్ కుమార్, ఆకాశ్‌దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్.
సర్దార్ సింగ్‌కు పిలుపు
Published Fri, Jun 1 2018 1:58 AM | Last Updated on Fri, Jun 1 2018 1:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment