ఫిక్సింగ్ నియంత్రణకు ఐదు సూత్రాలు
కోల్‌కతా: ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే చాంపియన్స్ లీగ్ టి20లో అవినీతిని అరికట్టేందుకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు దాల్మియా సూచించిన ఐదు పాయింట్ల ప్రతిపాదనలను వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
1. ప్రతీ జట్టు వెంట ఉండే భద్రతా సిబ్బందితో పాటు అదనంగా అవినీతి వ్యతిరేక మరియు భద్రతా యూనిట్ అధికారి ఉండాలి.
2. డగ్ అవుట్, మ్యాచ్ అధికారుల ఏరియాలో ఇతరుల కదలికలను నిషేధించాలి.
3. ముఖ్యంగా టోర్నీ సందర్భంగా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్ అధికారులు బయటి వారి నుంచి ఎలాంటి బహుమతులను స్వీకరించరాదు. అలాంటివేమన్నా ఉంటే టోర్నీ ప్రారంభానికి 15 రోజుల ముందే ఆ బహుమతి విలువతో పాటు ఇచ్చిన వ్యక్తి గురించి కూడా వెల్లడించాల్సి ఉంటుంది.
4. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది తమ మొబైల్ నంబర్లను ముందే బహిరంగపర్చాలి. ఆటగాళ్లకు వచ్చే కాల్స్‌ను హోటల్ ఎక్స్ఛేంజ్ ద్వారా టీమ్ మేనేజర్ రూఢి చేసుకుంటారు.
5. అవసరమనుకుంటే ఏసీఎస్‌యూ అధికారులు స్థానిక అధికారుల సహాయాన్ని తీసుకోవచ్చు.