working committee
-
హైదరాబాద్ వేదికగా తొలిసారి!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే నియామకమైన అత్యున్నత విధాన నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) హైదరాబాద్‌లో తొలిసారిగా సమావేశం కానుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు నూతనోత్సాహం తేవడం, కాంగ్రెస్ వైపు ప్రజల దృష్టి మళ్లించడం లక్ష్యంగా ఈ సమావేశాలను నిర్వహించనుంది. గత నెల 20న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. 16, 17 తేదీల్లో కొత్త కమిటీ తొలి సమావేశం కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ వివరాలను వెల్లడించారు. 17న విస్తృతస్థాయి సమావేశం తర్వాత అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని.. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అందించే 5 గ్యారెంటీ హామీలను ప్రకటించనున్నామని వివరించారు. 17న నియోజకవర్గాల్లో బస ఈ నెల 17న బహిరంగ సభ ముగిశాక అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో తమకు కేటాయించిన చోటికి వెళ్లి రాత్రి బస చేస్తారు. 18న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా నియోజకవర్గాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థానిక నేతలతో కలసి మధ్యాహ్న భోజనం చేస్తారు. అయితే ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్న నేపథ్యంలో.. నియోజకవర్గాల పర్యటన నుంచి ఎంపీలకు మినహాయింపు ఇచ్చినట్టు కేసీ వేణుగోపాల్ తెలిపారు. సోనియా, రాహుల్, ప్రియాంక.. అంతా.. హైదరాబాద్‌లో జరిగే సీడబ్ల్యూసీ భేటీ తొలిరోజు సమావేశాల్లో.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సహా మొత్తం 39 మంది సీడబ్ల్యూసీ సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొననున్నారు. రెండోరోజు 17న జరిగే విస్తృతస్థాయి సీడబ్ల్యూసీ సమావేశంలో వర్కింగ్ కమిటీ సభ్యులతోపాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు పాల్గొంటారు. గత ఐదేళ్లలో ఢిల్లీ వెలుపల సీడబ్ల్యూసీ సమావేశం జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2019 మార్చి 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. తర్వాత ఢిల్లీలోనే ఈ భేటీలు నిర్వహించారు. ఈసారి హైదరాబాద్‌లో జరగనున్నాయి. -
NCP Crisis: అబ్బాయికి బాబాయ్ చురకలు
ముంబై: ఎన్సీపీని ఎట్టిపరిస్థితుల్లో చేజార్చుకోనని.. తిరుగుబాటుతో కుదేలు అయిన పార్టీని పునర్నిర్మించి తీరతానని తోటి నేతలతో శరద్ పవార్ మరోమారు స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో తన నివాసంలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ చీలిక సంక్షోభం, భవిష్యత్ ప్రణాళిక గురించి పార్టీ నేతలతో చర్చించిన ఆయన.. తానే అధ్యక్షుడిగా కొనసాగుతానని, ఇకపైనా పార్టీని ముందుండి నడిపిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో తిరుగుబాటు నేత అజిత్ పవార్ చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. వయసు 82 అయితే ఏంటి.. 92 అయితే ఏంటి.. ఈ వయసులోనూ నేను ఇప్పటికీ ఇంకా ఆరోగ్యంగానే ఉన్నా. పార్టీ కోసం పని చేస్తూనే ఉన్నా కదా అంటూ పవార్ సమావేశం అనంతరం మీడియా వద్ద ప్రస్తావించారు. పార్టీ అధ్యక్షుడిని నేనే. పార్టీలో చీలిక తదితర పరిణామాల గురించి నేరుగా ఈసీ వద్దే తేల్చుకుంటామని చెప్పారాయన. ‘‘ కొందరు తామే అసలైన ఎన్సీపీ నేతలమని.. పార్టీ అధినేత తానేనని చెప్పుకుంటున్నారు. ఎవరో ఏదో వాగుతున్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంకా ఆరోగ్యంగానే ఉండి.. పని చేస్తున్నా. ఇక మీదట అధ్యక్ష పదవిలోనూ నేను ఉంటా. వయసు ఎంత మీద పడినా సరే.. పార్టీ కోసం కష్టపడుతూనే ఉంటా. ఏం చెప్పాలనుకున్నా మనం ఎన్నికల సంఘం ముందే చెబుదాం. ఎవరికో ఏదో వివరణ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదూ అంటూ తోటి నేతలతో సమావేశంలో చెప్పారాయన. Meeting of @NCPspeaks was held at the Delhi residence of National President Hon'ble Sharad Pawar Saheb. Party Working committee members, Mp's, leaders and office bearers attended this meeting to discuss important strategies and chart the course for future endeavors.@supriya_sule… pic.twitter.com/3mWpQEuIoO — Sharad Pawar (@PawarSpeaks) July 6, 2023 ఇదిలా ఉంటే.. శరద్ పవార్ నేతృత్వంలో ఆయన నివాసంలో జరిగిన కార్యవర్గ సమావేశం.. తిరుగుబాటు నేతలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో న్యాయపరంగా ఈ అంశాన్ని ఎలా ఎదుర్కోవాలనే సమాలోచనలు చేస్తోంది. ఒక ఎన్సీపీ కార్యవర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే అజిత్ పవార్ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం కీలక ప్రకటన చేసింది. శరద్ పవార్ నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశం చెల్లదని, అసలు అలాంటి భేటీ నిర్వహించేందుకు అధికారం.. అందులో నిర్ణయాలు తీసుకునేందుకు హక్కు లేదంటూ అజిత్‌పవార్ వర్గం ఒక ప్రకటన విడుదల చేసింది. పవార్‌తో రాహుల్ భేటీ ఇదిలా ఉంటే.. ఎన్సీపీ కార్యవర్గ సమావేశం తర్వాత జన్‌పథ్‌లోని తన అధికార నివాసానికి శరద్ పవార్ చేరుకున్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. పవార్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. పార్టీ చీలిక సంక్షోభంపై వీళ్లు చర్చించినట్లు సమాచారం. #WATCH | Congress leader Rahul Gandhi meets NCP President Sharad Pawar in Delhi pic.twitter.com/vU2DUZZMqH — ANI (@ANI) July 6, 2023 ఇదీ చదవండి: బీజేపీతో పొత్తు కోసం యత్నించింది శరద్ పవారే! -
‘హస్తం’లో కొత్త కోణం.. ఏళ్లుగా వైరం.. సేవ్ కాంగ్రెస్‌తో ఒక్కటైన వైనం
సాక్షి,ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో నిన్న, మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డిలదే పైచేయి. నాలుగు జిల్లాల్లో అయితే ఆ వర్గం లేని పక్షంలో ఈ వర్గం అన్నట్లుగా పార్టీ వ్యవహారాలు సాగుతూ వచ్చాయి. ముఖ్య నాయకులంతా వారి అనుచర వర్గంగానే కొనసాగారు. ఏళ్లుగా ఈ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వైరం కొనసాగుతూ వచ్చింది. తాజాగా సేవ్ కాంగ్రెస్ నినాదంతో రాష్ట్రంలోని కొంత మంది ముఖ్యనేతలు తిరుగు బావుటా ఎగరవేసిన సంగతి విధితమే. ఇందులో భాగంగా మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు ఒక్కటవడాన్ని పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదిలా ఉంటే వారి తీరును ఖండిస్తూ కొంత మంది నాయకులు వ్యతిరేకంగా కదలడం పార్టీలో ఇప్పుడు సంచనలం కలిగిస్తోంది. తద్వారా ఈ రెండు వర్గాలకు ధీటుగా మరో వర్గం కీలకంగా తయారవుతుందన్న చర్చ సాగుతోంది. ఇటీవల ఆదిలాబాద్‌లో మీడియా సమావేశంలో ఏఐసీసీ సభ్యులు నరేశ్‌జాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు కొత్త కమిటీల తరువాత.. ఇటీవల పార్టీ అధిష్టానం కొత్త కమిటీలను నియమించింది. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సాజిద్‌ఖాన్‌ను పూర్తి స్థాయిలో నియమించింది. గతంలో ఆయన ఇన్‌చార్జీగా కొనసాగారు. మహేశ్వర్‌రెడ్డి అనుచరుడిగా ఉన్నారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలిగా మరోసారి ప్రేమ్‌సాగర్‌రావు సతీమణి కె.సురేఖనే నియమించారు. నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి అనుచరుడు ముత్యంరెడ్డికి అవకాశం కల్పించారు. కుమురం భీం ఆసిపాబాద్‌లో పెండింగ్‌లో పెట్టారు. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి టీపీసీసీ ఎగ్జిక్యూటీవ్ కమిటీలో మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డికి చోటు కల్పించారు. ప్రస్తుతం ఆయన వయోభారంతో కీలకంగా వ్యవహరించకపోయినా తనకంటూ ప్రత్యేక అనుచరగణం ఉంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గండ్రత్ సుజాతతో పాటు ఉట్నూర్‌కు చెందిన వెడ్మ బొజ్జుకు చోటు కల్పించారు. ఆయన నేరుగా రేవంత్‌రెడ్డి అనుచరుడిగా పేరుంది. తాజా రాజకీయాల నేపథ్యంలో సుజాత సైలెంట్‌గా ఉండగా, బొజ్జు పార్టీలో పట్టుసాధించేందుకు గట్టి యత్నాలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మాజీ మంత్రి గడ్డం వినోద్‌కు ఎగ్జిక్యూటీవ్ కమిటీతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగానూ నియమించారు. పార్టీ పరిస్థితులపై ప్రస్తుతం ఆయన స్తబ్దుగానే ఉన్నారు. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో కొంత మంది నాయకులకు రాష్ట్ర కమిటీల్లో చోటు దక్కింది. వారు ప్రేమ్‌సాగర్‌రావు అనుచరులుగా ఉన్నారు. దీంతో జిల్లా, రాష్ట్ర కమిటీల పరంగా ముఖ్య నేతల అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూనే కొత్త నాయకులకు పార్టీ అవకాశం కల్పించింది. చదవండి: కేసీఆర్ డ్రగ్ టెస్ట్ సవాల్‌పై బండి సంజయ్ కౌంటర్ నేతల తీరుపై ధ్వజం.. కాంగ్రెస్‌లో రాష్ట్ర స్థాయిలో కొంత మంది ముఖ్య నేతలు సేవ్ కాంగ్రెస్ నినాదం అందుకోగా అందులో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యనేతలు ఉండటం, వారి తీరును ఖండిస్తూ ఆదిలాబాద్‌లో కొంత మంది కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. తద్వారా రానున్న రోజుల్లో ఈ రెండు వర్గాలే కాకుండా వారికి వ్యతిరేకంగా మరో వర్గం తయారైందనేది స్పష్టం అవుతోంది. ఇది ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే సేవ్ కాంగ్రెస్ నినాదం పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
కాంగ్రెస్ బాహుబలి టీం!
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ ‘బాహుబలి’టీంను సిద్ధం చేస్తోంది. కొత్త కమిటీని ఏర్పాటు చేసుకుని చావో రేవో తేల్చుకోవాల్సిన 2023 ఎన్నికలను పకడ్బందీగా ఎదుర్కొనే దిశగా ముందుకెళుతోంది. కొద్ది రోజులుగా కొత్త కమిటీ నేడో, రేపో వస్తుందనే అంచనాలుండగా... విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇందులో ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 17–18 మంది ఉపాధ్యక్షులు, 70 మంది ప్రధాన కార్యదర్శులు, 120 మంది కార్యదర్శులు ఉండనున్నట్టు సమాచారం. కార్యదర్శుల పేర్లు ఎక్కువ కావడంతో ఈ 120 మందికి అదనంగా కొందరిని ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా నియమించనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ మరో పదవి ఎందుకనే అభిప్రాయం వ్యక్తమైతే వారిని కూడా కార్యదర్శులుగానే నియమించనున్నారు. ఇక, 12 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను కూడా మార్చనున్నారు. వీరిలో కొందరిని టీపీసీసీ ఉపాధ్యక్షులుగా, మరికొందరిని ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తున్నారు. కొత్త కమిటీలో సీనియర్లు, జూనియర్లు, యువత కలబోతగా, అన్ని వర్గాలకు ప్రాధాన్యత, సామాజిక సమతుల్యత అనే ద్విముఖ వ్యూహంతో కమిటీని కూర్చారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. పదోన్నతులు.. బాధ్యతల్లో మార్పులు టీపీసీసీ ప్రతిపాదన ప్రకారం...కొత్త కమిటీలో ప్రస్తుతము న్న ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లనూ కొనసాగిస్తారని, వారికి తోడుగా వైస్ ప్రెసిడెంట్లకు పదోన్నతులిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతమున్న 10 మంది సీనియర్ ఉపాధ్యక్షు ల సంఖ్యను 17 లేదా 18కి పెంచుతారని భావిస్తున్నారు. ఉపాధ్యక్షులకు లోక్‌సభ నియోజకవర్గాల వారీ బాధ్యతలు అప్పగిస్తారని, ముగ్గురు ఉపాధ్యక్షులను పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలకు వినియోగిస్తారనే చర్చ జరుగుతోంది. ఆఫీస్ వ్యవహారాలు, ఎన్నికల ప్రణాళికలు, అనుబంధ సంఘాల బాధ్యతలను వీరికి అప్పగించే అవకాశముంది. వీరికి తోడు అనూహ్యంగా పెరుగుతున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శులను అసెంబ్లీ క్లస్టర్ల వారీ ఇంచార్జులుగా నియమిస్తారని సమాచారం. ఇప్పటిదాకా 35–40 మందిని ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తుండగా ఆ సంఖ్యను 70కి పెంచి క్లస్టర్ బాధ్యతలిస్తారని తెలుస్తోంది. ఇక, నియోజకవర్గానికి ఒకరు చొప్పున నియమించే టీపీసీసీ కార్యదర్శులను ఇతర నియోజకవర్గాల సమన్వయకర్తలుగా నియమిస్తారని, ఎన్నికలు ముగిసేంతవరకు వీరికి అక్కడి నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకునే బాధ్యతలను అప్పగిస్తారని సమాచారం. ‘రాష్ట్ర కాంగ్రెస్‌లోని కీలక నేతలందరితో కొత్త కమిటీ కూర్పుపై అధిష్టానం చర్చించింది. ఆ తర్వాతనే టీపీసీసీ పెట్టిన దాదాపు అన్ని ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కొత్తగా ఆర్గనైజింగ్ కార్యదర్శులు రావడం కూడా ఓకే అయింది. కొత్త కమిటీని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం. ఒకవేళ ఏఐసీసీ నిర్ణయంలో మార్పున్నా మరికొన్ని రోజుల తర్వాతయినా కర్ణాటక తరహాలో తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల పందేరం భారీగానే ఉంటుంది’అని ఏఐసీసీ ముఖ్య నాయకుడు ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఈ నేతల పేర్లు దాదాపు ఖాయం! టీపీసీసీ ఉపాధ్యక్షులుగా గాలి అనిల్‌కుమార్, ఫిరోజ్ ఖాన్, రాములు నాయక్, చల్లా నర్సింహారెడ్డి, హర్కర వేణుగోపాల్, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, కలకుంట్ల మదన్మోహన్రావు, ఒబేదుల్లా కొత్వాల్, ప్రేంసాగర్‌రావు, ఎర్ర శేఖర్, నర్సారెడ్డిల పేర్లు దాదాపు ఖరారైనట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గద్వాల, వనపర్తి, సిరిసిల్ల, నిజామాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల అధ్యక్షులు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, శంకర్ ప్రసాద్, సత్యనారాయణగౌడ్, మానాల మోహన్‌రెడ్డి, విశ్వప్రసాదరావులను టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా నియమించనున్నట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షులుగా.... ఇక, కొత్త జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా జి.మధుసూదన్‌రెడ్డి (మహబూబ్‌నగర్), మల్రెడ్డి రాంరెడ్డి (రంగారెడ్డి), రాజ్ ఠాకూర్ (పెద్దపల్లి), నర్సారెడ్డి లేదా పూజల హరికృష్ణ (సిద్దిపేట), సంగీతం శ్రీనివాస్ (సిరిసిల్ల), కేశ వేణు లేదా శేఖర్ గౌడ్ (నిజామాబాద్)తోపాటు ములుగు, మహబూబాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలకు కూడా కొత్త అధ్యక్షులను నియమించనున్నారు. హైదరాబాద్‌ను మూడు జిల్లాలుగా విభజించి వాటికి అధ్యక్షులుగా రోహిణ్‌రెడ్డి లేదా మెట్టు సాయికుమార్ (ఖైరతాబాద్), అనిల్‌కుమార్ యాదవ్ లేదా ఆదం సంతోష్ (సికింద్రాబాద్), సమీవలియుల్లా లేదా ఉస్మాన్ అల్ హాద్రి (హైదరాబాద్) పేర్లను పరిశీలిస్తున్నారు. ఇక, యూత్‌కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గంలో, పార్లమెంటు అధ్యక్షులుగా పనిచేసిన వారిని టీపీసీసీ కార్యదర్శులుగా నియమించనున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద పీసీసీ కొత్త కార్యవర్గంలోకి 35 ఏళ్లలోపు యువనాయకులను సుమారు 20 మందిని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇక, ఏఐసీసీ ప్రచార, కార్యక్రమాల అమలు, ఎన్నికల సమన్వయ కమిటీలకు ముగ్గురు ముఖ్య నాయకులను కన్వీనర్లుగా నియమించనున్నారు. అజ్మతుల్లా హుస్సేనీ, దయాసాగర్‌రావు, ఎం.ఆర్.జి.వినోద్రెడ్డిలను ఇందుకోసం ప్రతిపాదించారు. -
హాజరుకానున్న ప్రధాని... ఆ ప్రాంతాలను హై సెక్యూరిటీ జోన్‌గా...
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాలను హై సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించాలని రాష్ట్ర పోలీసు విభాగం యోచిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా అనేక మంది అత్యంత ప్రముఖులు వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు దేశంలోని 18 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు సైతం హాజరు కానుండటం, ఇక్కడే ఉండనుండటంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు ఆఖరి రోజు పరేడ్‌గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. నగరంలోని రాజ్‌భవన్ లేదా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు నోవాటెల్, వెస్టిన్ లేదా ఐటీసీ కోహినూర్ల్లో ఏదో ఒకచోట మోదీ బస చేస్తారని తెలుస్తోంది. ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులదే తుది నిర్ణయమని పోలీసులు చెబుతున్నారు. రాజ్‌భవన్‌తో పాటు ఆయా హోటళ్లలోనూ అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరిస్తున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ హోటళ్లలో నో రూమ్స్... అత్యంత ప్రముఖులతో పాటు ఇతరులు, వారి భద్రతా సిబ్బంది బస చేయడానికి బీజేపీ పార్టీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. మాదాపూర్‌తో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న హోటళ్లను ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు బుక్ చేసేసింది. ప్రధాని సహా ప్రముఖులు దాదాపు 350 మంది రానున్నారని తెలుస్తోంది. వీరితో పాటు అనుచరులు, సహాయకులు సైతం పెద్ద సంఖ్యలోనే వస్తారు. దీంతో మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని స్టార్ హోటళ్లతో పాటు సాధారణ హోటళ్లలోని రూమ్‌లన్నీ బ్లాక్ చేసి ఉంచారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఐటీ కారిడార్‌లోని హోటళ్లను బుక్ చేసుకుని అడ్వాన్స్‌లు కూడా చెల్లించారు. ఆ మూడు రోజు లూ సాధారణ కస్టమర్లకు హోటళ్లలో గదులు దొరకని పరిస్థితి ఉంది. మరోపక్క నగరంలోనూ కొన్ని హోటళ్లలోని రూమ్స్ బీజేపీ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అబిడ్స్, లక్డీకాపూల్లతో పాటు బేగంపేట్, అమీర్‌పేట్, సికింద్రాబాద్‌ల్లో ఉన్న హోటళ్లను బుక్ చేసి ఉంచారు. ప్రారంభమైన సెక్యూరిటీ వెట్టింగ్ ప్రక్రియ.. ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎంలు, బీజేపీ జాతీయ ముఖ్యనేతలు రానుండటంతో సైబరాబాద్ పోలీసులు బందోబస్తు, భద్రత ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. బందోబస్తు కోసం రాచకొండతో పాటు ఇతర జిల్లాల నుంచి అధికారులను రప్పించనున్నారు. భద్రత చర్యల్లో భాగంగా ఆయా హోటళ్లలో పని చేసే సిబ్బందికి సంబంధించి సెక్యూరిటీ వెట్టింగ్ చేపడుతున్నారు. వారి వివరాలు, ఆధార్ లేదా గుర్తింపుకార్డుల్ని సేకరిస్తున్నారు. వీటిని స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులు సాయంతో సరిచూస్తున్నారు. హెచ్ఐసీసీతో పాటు ఆయా హోటళ్ల పక్కన నిర్మాణంలో ఉన్న భవనాల పైనా పోలీసులు దృష్టి పెట్టారు. వాటిలో పని చేసే ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీల వివరాలు సేకరిస్తున్నారు. వీరందరి పూర్వాపరాలు, గత చరిత్ర, నేరాలు సంబంధాలు తదితరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ సెక్యూరిటీ వెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్య నేతలు బస చేసే హోటళ్ల వద్ద యాక్సెస్ కంట్రోల్ పాయింట్లు, చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. అడుగడుగున వాహనాల తనిఖీలు చేపట్టనున్నారు. హోటల్ సిబ్బందితో పాటు బస చేస్తున్న వారికీ సరైన గుర్తింపు కార్డులు ఉంటేనే లోనికి అనుమతించనున్నారు. ఆయా హోటళ్లల్లో ఇప్పటికే ఉన్న వాటి పనితీరు పరిశీలించడంతో పాటు తోడు కొత్తగా పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. (చదవండి: బీజేపీ నేతల తీరు దుర్మార్గం: బాల్క సుమన్) -
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై కసరత్తు షురూ
-
నాటా కొత్త కార్యవర్గం
అమెరికాలో ప్రవాసాంధ్రుల అభిమాన తెలుగు సంఘం నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ నాటా తన మెగా కన్వెన్షన్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కీలకమైన నాటా కొత్త కార్యవర్గం లాస్ వేగాస్‌లో నామినేట్ అయినట్టు నాటా మీడియా అండ్ పీఆర్ డీవీ కోటిరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో నాటా కొత్త అధ్యక్షుడిగా డాక్టర్ కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ గోసల రాఘవ రెడ్డి నుంచి శ్రీధర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశంలో నాటా అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ ఎమిరేటర్స్ డా. ప్రేమ్‌రెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ ఆది శేషారెడ్డి, డా. మోహన్ మల్లం, డా.సంజీవ రెడ్డి, డా. ప్రసాద్ జీరెడ్డి, డా.చంద్రశేఖర్ నారాల తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతీ రెండేళ్లకోసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాటా మెగా కన్వెన్షన్ కరోనా కారణంగా 2020లో జరగలేదు. ఈ సారి కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు.. పాండమిక్ కాస్తా ఎండమిక్‌గా మారిపోవడంతో మళ్లీ నాటా సభలు నిర్వహించాలని నిర్ణయించారు. జులై 2023లో డల్లాస్ వేదికగా మెగా కన్వెన్షన్ నిర్వహించనున్నట్టు డాక్టర్ కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. ప్రవాసాంధ్రులను ఒక్కతాటిపైకి తేవడంతో పాటు వారికి సంబంధించిన అన్ని అంశాలు చర్చిస్తామని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంధ, సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. అమెరికాలో నివసించే తెలుగు ప్రజలందరికి నాటా ఎప్పుడు అండగా ఉంటుందని, తమ సంస్థ ద్వారా విస్తృతంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు కొర్సపాటి శ్రీధర్ రెడ్డి. న్యూజెర్సీలో నాటా కార్యాలయానికి త్వరలోనే శాశ్వత భవనం నిర్మిస్తామని తెలిపారు. 2022 - 2023కు గాను నామినేట్ అయిన నాటా కొత్త కార్యవర్గం ► డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి(అధ్యక్షులు) ► హరి వేల్కూర్(కాబోయే అధ్యక్షులు) ► ఆళ్ళ రామి రెడ్డి (కార్యనిర్వహణ ఉపాధ్యక్షుడు) ► గండ్ర నారాయణ రెడ్డి(ప్రధాన కార్యదర్శి) ► సోమవరపు శ్రీనివాసులు రెడ్డి(కోశాధికారి) ► మందపాటి శరత్ రెడ్డి(సంయుక్త కోశాధికారి) ► సతీష్ నరాల(సంయుక్త కార్యదర్శి ) ► డాక్టర్ గోసల రాఘవ రెడ్డి(మాజీ అధ్యక్షులు) ► అంజిరెడ్డి సాగంరెడ్డి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) ► శ్రీనివాసులు రెడ్డి కోట్లూరే (నేషనల్ కన్వెన్షన్ అడ్వైజర్) ► నగేష్ ముక్కమల్ల (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు) ► దర్గా నాగిరెడ్డి (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు) ► లక్ష్మీ నరసింహారెడ్డి కొండా (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు) ► శ్రీధర్ రెడ్డి తిక్కవరపు (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు) ► సురేన్ బత్తినపట్ల (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు) ► సురేష్ రెడ్డి కోతింటి (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు) . డల్లాస్ కన్వెన్షన్ కమిటీ: ► గిరీష్ రామిరెడ్డి, కన్వీనర్ ► డా.రామిరెడ్డి బూచిపూడి, కోఆర్డినేటర్ ► కృష్ణ కోడూరు, కో కన్వీనర్ ► భాస్కర్ గండికోట, కో-ఆర్డినేటర్ ► రమణారెడ్డి క్రిష్టపతి డిప్యూటీ కన్వీనర్ ► మల్లిక్ అవుల, డిప్యూటీ కోఆర్డినేటర్ -
టీసీఎస్ఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఏడవ వార్షిక సర్వ సభ్య సమావేశం ఆదివారం జూమ్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో టీసీఎస్ఎస్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. ప్రస్తుత అధ్యక్షుడు నీలం మహేందర్ని.. కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుండి నామినేషన్ రావడంతో ఎలాంటి పోటీ లేకుండానే మరోసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో మరోసారి బాధ్యతను అప్పగించి, ఇక్కడి తెలంగాణ వాసులకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు. నూతన కార్యవర్గంలో సొసైటీ అధ్యక్షులుగా నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, నల్ల భాస్కర్ గుప్త, మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్, బొడ్ల రోజారమణి, నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, గింజల సురేందర్ రెడ్డి, శ్రీధర్ కొల్లూరి, చకిలం ఫణిభూషణ్, గజ్జి రమాదేవి, నగమడ్ల దీప, ఆరూరి కవిత, గర్రేపల్లి కస్తూరి, వీరమల్లు కిరణ్, రంగ పట్నాల ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక వర్గ సభ్యులుగా పెరుకు శివరామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల, పట్టూరి కిరణ్ కుమార్, రవి కృష్ణ కాసర్ల శ్రీనివాస్‌లను ప్రకటించారు. -
సీపీఎస్ రద్దుపై వర్కింగ్ కమిటీ
సాక్షి, అమరావతి : కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం(సీపీఎస్) రద్దు అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కింగ్ కమిటీని నియమించింది. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఐదు శాఖల కార్యదర్శులతో కమిటీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ కన్వీనర్‌గా ఆర్థికశాఖ కార్యదర్శి, సభ్యులుగా ప్లానింగ్, పాఠశాల విద్య, పంచాయతీ రాజ్, వైద్య శాఖ కార్యదర్శులు ఉన్నారు. కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని నియమించింది. ఎన్పీ టక్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను ఈ కమిటీ పరిశీలిస్తుంది. జూన్ 30లోపు నివేదిక అందజేయాలని వర్కింగ్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. -
‘మున్సిపల్ సబార్డినేట్’ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
తెనాలి: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సబార్డినేట్ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలను గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్లో శనివారం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షునిగా యేగేంద్రనాథ్ (తెనాలి), ప్రధాన కార్యదర్శిగా పీవీ రంగారావు (సత్తెనపల్లి), కోశాధికారిగా కేఎండీ నాసిర్ హుస్సేన్ (ఎమ్మిగనూర్, చిత్తూరు జిల్లా), ఉపాధ్యక్షులుగా కేబీ మధుసూదన్‌రెడ్డి (జమ్మలమడుగు), కేవీఎస్ శర్మ (నరసరావుపేట), ఎం. రవిసుధాకర్ (శ్రీకాకుళం), ఎస్.విజయలక్ష్మి (నూజివీడు), సంయుక్త కార్యదర్శులుగా వి.చంద్రశేఖర్ (తణుకు), ఎం.రమేష్ (పలాస- కాశీబుగ్గ), అమీర్‌బాషా (ధర్మవరం), వీజే రత్నాంజలి (తాడేపల్లి), కార్యనిర్వాహణ కార్యదర్శులుగా కె.ఫజులుల్లా (మార్కాపురం), పి.రవిబాబు( బొబ్బిలి), ఎస్.బేబి( రాయదుర్గం), ఆర్.వసంతరావులను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన చిత్తూరు జిల్లా ఉంగనూరు మున్సిపల్ కమిషనర్ కేఎల్ వర్మ తెలిపారు. -
టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి
హైదరాబాద్: టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా హమీద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు టీఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న దేవీప్రసాద్ ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికైనందున ఆయన స్థానంలో నూతన అధ్యక్షుని ఎన్నిక అనివార్యమైంది. -
కార్యవర్గ భేటీకి కేజ్రీవాల్ దూరం
అనారోగ్యమే కారణం 10 రోజులపాటు బెంగళూరులో నేచురోపతి చికిత్స తీసుకోనున్న సీఎం ఆప్‌లో ముదురుతున్న అంతర్గత కలహాలు సాక్షి, న్యూఢిల్లీ: అంతర్గత కలహాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బుధవారం నిర్వహించనున్న జాతీయ కార్యవర్గ భేటీకి పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుకావడం లేదు. అనారోగ్యం కారణంగా ఈ భేటీకి రాలేకపోతున్నట్లు కేజ్రీవాల్ సమాచారమిచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పది రోజులపాటు నేచురోపతి చికిత్స తీసుకునేందుకు ఆయన బెంగళూరు వెళ్లనున్నారని తెలిపాయి. ఒత్తిడి కారణంగా కేజ్రీవాల్ దేహంలో షుగర్ స్థాయి బాగా పెరిగిందని, మాత్రలు, ఇన్సులిన్ తీసుకున్నా.. నియంత్రణలోకి రాలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా ఇంటిపోరుతో అతలాకుతలమవుతోన్న ఆప్ నాయకత్వం... జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో పార్టీ సీనియర్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) నుంచి ఉద్వాసన పలకడానికి అరవింద్ కేజ్రీవాల్ వర్గం రంగం సిద్ధం చేసిందని అంటున్నారు. మరోవైపు ప్రశాంత్ భూషణ్‌పై కేజ్రీవాల్ వర్గం విమర్శల దాడి పెంచింది. ‘శాంతి భూషణ్, ఆయన తనయుడు ప్రశాంత్ భూషణ్, కుమార్తె షాలిని భూషణ్ పార్టీలోని అన్ని విభాగాలను తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఏక వ్యక్తి పార్టీగా ఉండకూడదని చెబుతున్న వీరు ఆప్‌ను వారి కుటుంబ పార్టీగా చేయాలని చూస్తున్నారు’ అని ఆప్ నేత ఆశీష్ ఖేతాన్ మండిపడ్డారు. కాగా, కేజ్రీవాల్‌పై ఇటీవలి వరకు విమర్శలు కురిపించిన ఆప్ వ్యవస్థాపక సభ్యుడు శాంతిభూషణ్ మాట మార్చారు. కేజ్రీవాల్ పార్టీ జాతీయ కన్వీనర్‌గా కొనసాగాలని, యోగేంద్ర, ప్రశాంత్ లు ఆయనకు సహకరించాలని సూచించారు. తనపై వస్తున్న ‘కుట్ర’ ఆరోపణలను యోగేంద్ర కూడా తోసిపుచ్చారు. కేజ్రీవాలే పార్టీని నడపాలని కోరుకున్నామని, కన్వీనర్ పదవి నుంచి ఆయన వైదొలగాలని తాను ఎన్నడూ అనలేదన్నారు. పీఏసీ నుంచి తొలగిస్తారని వస్తున్న వార్తలను ప్రస్తావించగా... ‘అందుకు నేను, ప్రశాంత్ భూషణ్ ఎప్పుడూ రెడీగానే ఉంటాం’అని చెప్పారు. ఆ మురికిలోకి దిగదల్చుకోలేదు: కేజ్రీవాల్ పార్టీలో అంతర్గత కలహాలపై కేజ్రీవాల్ పెదవి విప్పారు. ఈ గొడవలు తనను బాధించాయని, ఆ మురికి యుద్ధంలోకి తాను దిగదల్చుకోలేదని ట్వీటర్లో పేర్కొన్నారు. ఇలా గొడవ పడడం ఢిల్లీవాసులు పార్టీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయడమేనన్నారు. ‘గొడవలోకి దిగను. ఢిల్లీ పాలనపైనే నా దృష్టి నిలుపుతా. ఎట్టిపరిస్థితుల్లో కూడా ప్రజల నమ్మకాన్ని వమ్ము కానివ్వబోం’’ అని కేజ్రీవాల్ అన్నారు. -
బీసీసీఐ ఏజీఎం మార్చి 2న
చెన్నై: ఎట్టకేలకు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగే తేది ఖరారైంది. మార్చి 2న చెన్నైలోనే ఏజీఎం జరపాలని బోర్డు అత్యవసర వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. ఆరు వారాల్లోగా బోర్డు తమ ఏజీఎంతో పాటు ఎన్నికలు జరపాలని గత నెల 22న సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ సమావేశానికి తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదాలో ఎన్.శ్రీనివాసన్ కూడా హాజరయ్యారు. సుప్రీం కోర్టు ఇటీవల సూచించిన మార్గదర్శకాల అమలుపై కమిటీ చర్చించింది. అలాగే ఈ విషయంలో న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించింది. ‘మార్చి 2న ఉదయం 9.30 గంటలకు చెన్నైలో ఏజీఎం జరపాలని బీసీసీఐ అత్యవసర వర్కింగ్ కమిటీ నిర్ణయించింది’ అని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో బోర్డు స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించిన కోర్టు తీర్పుపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. మరోవైపు మాజీ ఆటగాళ్లకు ఇచ్చే పెన్షన్‌ను 50 శాతం పెంచాలని నిర్ణయించారు. బోర్డు ఎన్నికల్లో పోటీ చేసేందుకు శ్రీనివాసన్ అనాసక్తి ప్రదర్శిస్తే మాత్రం ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడుగా ఉన్న శివలాల్ యాదవ్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. అలాగే చెన్నై జట్టును ఇండియా సిమెంట్స్ నుంచి వేరు చేసిన విషయాన్ని శ్రీని.. కమిటీకి తెలిపారు. శ్రీనివాసన్‌పై అసత్య ఆరోపణలకు దిగుతున్న బీహార్ క్రికెట్ సంఘం (సీఏబీ) కార్యదర్శి ఆదిత్య వర్మపై న్యాయపరంగా ముందుకెళ్లాలని వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. -
ఐఎన్ఎస్కు నూతన కార్యవర్గం
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కేఆర్పీ రెడ్డి న్యూఢిల్లీ: ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్)కి 2014-15 ఏడాదికిగాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ‘సాక్షి’ దినపత్రిక డెరైక్టర్ కె.రాజప్రసాద్‌రెడ్డి (కేఆర్పీ రెడ్డి) ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మొత్తంగా 41 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోగా.. ది హిందూకు చెందిన కె.బాలాజీ, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన వివేక్ గోయెంకా, విపుల-అన్నదాత ప్రచురణలకు చెందిన సీహెచ్ కిరణ్, డెక్కన్ క్రానికల్ పత్రికకు చెందిన టి.వెంకట్రామిరెడ్డి తదితరులు అందులో ఉన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఐఎన్ఎస్ 75వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఈ కార్యవర్గం ఎంపిక జరిగింది. ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా గుజరాతీ పత్రిక సంభావ్ మెట్రోకు చెందిన కిరణ్ బి వదోదరియా ఎన్నికైన విషయం తెలిసిందే. -
ఉప్పెనలా ఉద్యమం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: ఈ ఏడాదంతా అన్నివర్గాలవారూ ఉద్యమబాట పట్టారు. వ్యాపార, రాజకీయ, కర్షక, కార్మిక, శ్రామికులు చేసిన ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలతో జిల్లా దద్దరిల్లిపోయింది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జూలై 30న తీసుకున్న నిర్ణయంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దం టూ అన్ని వర్గాల ప్రజలు రోడ్లెక్కారు. ఆగస్టు 12 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ, ఎన్జీవో సంఘాలు ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి. రెండు నెలల పాటు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలన్నీ స్తంభించాయి. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ వైఎస్ఆర్ సీపీ శ్రేణులు జనవరి తొమ్మిదో తేదీన ఉద్యమించారు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, ఏపీడీసీఎల్ విద్యుత్ స్టేషన్లను ముట్టడించారు. తమ ప్రాణాలైనా అర్పించి కొవ్వాడ అణువిద్యుత్ ప్రాజెక్టును అడ్డుకుంటామని అఖిలపక్షం ఆధ్వర్యంలో మార్చి నాలుగో తేదీన మత్స్యకారులుఉద్యమించారు. అణువిద్యుత్ కేంద్ర వ్యతిరేక పోరా ట కమిటీ సభ్యులు భారీగా తరలివచ్చి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అరిణాం అక్కివలసలోని శ్యాంపిస్టన్ కార్మికుల సమస్యలపరిష్కారం కోరుతూ మార్చి 13న కలెక్టరేట్ వద్ద ధర్నాకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నా రు.దీంతోఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. 221 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. సమైక్యం కోసం బంద్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 2న జిల్లా బంద్ పాటించారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మారుమూల గ్రామాల ప్రజ లు సైతం పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. యువగర్జన రాష్ట్రాన్ని ముక్కలు చేసి తమకు అన్యాయం చేయవద్దంటూ ఆగస్టు 12న విద్యార్ధులంతా ‘యువగర్జన’ పేరుతో బహిరంగ సభను నిర్వహించారు. రాష్ట్ర విభజన వలన కలిగే నష్టాలు, విద్యార్థులకు హైదరాబాద్‌తో ముడిపడిన అనుబంధాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహా మానవహారం సమైక్యాంధ్రకు మద్దుతుగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 31న ఇచ్ఛాపురం నుంచి పైడిభీమవరం వరకూ రెండు ల క్షల మందితో ‘మహా మానవహారం’ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి జాతీయరహదారిపైకి చేరుకుని ఎడమవైపు నిలబడి చేయి చేయి కలపి మానవహారం చేశారు. ‘టీ’నోట్ ఆమోదంతో.. ేంద్రమంత్రి వర్గం తెలంగాణ నోట్‌ను అక్టోబర్ 3న ఆమోదించడంతో జిల్లావ్యాప్తంగా సమైక్యవాదులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించారు. అప్పటి పరిణామాల నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ నవీన్ గులాటి జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కదం తొక్కిన అంగన్వాడీలు అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జూలై పదో తేదీన వందలాది మంది కార్యకర్తలు కొదం తొక్కారు. కలెక్టరేట్ ముఖద్వారం నుంచి వాంబే కాలనీ వరకూ రోడ్డుపైనే బైఠాయించి మహాధర్నా చేశారు. అధికారులను అడ్డుకొని నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమ ర్యాలీతో జూలై 12న జిల్లా దద్దరిల్లింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సమైక్యవాదులు నినదించారు. టెక్కలిలో కేంద్రమంత్రి ఇంటిని ముట్టడించి నిరసన తెలిపారు. ధరల దాడి ! శ్రీకాకుళం సిటీ,న్యూస్‌లైన్: విజయనామ సంవత్సరం ధరల నామ సంవత్సరంగా మారిపోయింది. ఏడాది కాలమంతా ప్రజలపై ధరలు దాడి చేశాయి. భారీగా పెరిగిన ధరలతో సామాన్యుడి జీవన చిత్రం కూడా మారిపోయింది. ఇంతటి ధరాఘాతాన్ని మిగిల్చి...జీవన చక్రాన్ని చిదిమేసిందీ ఈ సంవత్సరం. ధనిక వర్గాలను సైతం ధరల పోటు వణికించింది. గ్యాస్ బండైంది! ధరల పెరుగుదలలో గ్యాస్ కూడా చేరింది. ఏడాది మొదట్లో సిలిండర్ ధర 373 రూపాయలు ఉండేంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నగదు బదిలీ పథకాన్ని కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో నేరుగా బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వ సబ్సిడీని జమ చేస్తున్నారు. తాజాగా గ్యాస్ బండ ధర 411 రూపాయలకు (బ్యాంకు జమ కాకుండా) చేరుకోగా, డీలర్ కమీషన్ పెంచిన కారణంగా మరో రూ. 3.50 అదనపు భారమయ్యింది. దీంతో సిలిండర్ ధర రూ. 414.50కి చేరింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న సుమారు రెండున్నర లక్షల మంది వినియోగదారులపై కోట్లాది రూపాయల భారం పడింది. కూరగాయాలు! నిత్యావసర వస్తువుల విషయానికొస్తే ఆకు కూరల నుంచి మాంసాహారం వరకు ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటిందనే చెప్పాలి. ఒకదశలో కిలో చికెన్ ధర కంటే కేజీ ఉల్లిపాయల ధర ఎక్కువ పలికిన పరిస్థితి నెలకొంది. అల్లం కేజీ ధర రూ. 130కి చేరుకోగా, వెల్లుల్లి రూ. 75, ఉల్లిపాయలు రూ. 85, బంగాళా దుంపలు 60 రూపాయలు పలికింది. కోడి గుడ్డ ధర వింటే గుడ్లు తేలేసే పరిస్థితి వచ్చింది. ఒకగుడ్డు ధర జనవరిలో మూడు రూపాయల 30 పైసలుంటే నేడు రూ. 4.70కి చేరింది. క్యారెట్, చిక్కుడు, బెండ, బీర, వంకాయ, క్యాబేజి ధరలు కూడా కేజీ రూ. 50 వరకు వెళ్లాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల నెలవారీ బడ్జెట్ మారిపోయింది. వేలాది ఇళ్లల్లో కూర వాడకం మానేశారు. పరుగు తీసిన పెట్రోలు పెరుగుతున్న వాహనాల జోరుకు తగ్గట్టుగానే పెట్రో ధరలు కూడా పెరిగింది. ముఖ్యంగా పెట్రోల్ ధరలు పరిశీలిస్తే..జనవరిలో లీటర్ ధర రూ. 72.65 ఉండగా, తాజాగా రూ. 77.50 వరకు ఉంది. అలాగే డీజిల్ ధరల విషయంలో 52.68 రూపాయల నుంచి తాజాగా 58.40 రూపాయలకు చేరింది. దీంతో సగటున పెట్రోల్ 5 రూపాయలు, డీజిల్ 6 రూపాయలు పెరిగింది. వాహన చోదకులపై ఈ ఏడాది సుమారు రూ. 70 కోట్ల మేర ఇంధన అదనపుభారం పడిందని మార్కెట్ అంచనాలున్నాయి. పెట్రోల్ ధరలు మార్చి నుంచి జూన్ వరకు నాలుగు రూపాయల మేర తగ్గినా, ఆ తర్వాత మళ్లీ యథావిధిగా పెరిగిపోయింది. ఇదిలావుంటే ఆర్టీసీ ధరలు కూడా ఈ ఏడాదిలో ఒకసారి పెంచగా, కిలోమీటర్‌కు సుమారు రూ.1.20 పైసలు వరకు సగటున పెరిగింది. దీంతో రవాణా చార్జీల భారం కూడా కోట్ల రూపాయలకు చేరింది. విద్యుత్ చార్జీల భారం రూ.16 కోట్ల పైనే.. జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు ఈ ఏడాది పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. మార్చి నెలాఖరు వరకున్న 500 వాట్ల లోపల వినియోగంపై ఉన్న పాత శ్లాబ్ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం ఏప్రిల్ నుంచి వినియోగంపై మరింత భారం మోపింది. దీంతో కనీసం 50 వాట్లు కంటే వినియోగం పెరగడంతోనే యూనిట్ చార్జీల టారిఫ్ ఆటోమెటిక్‌గా పెరుగుతున్నాయి. దీని ప్రకారం ఈ ఏడాది మార్చి వరకు 500 వాట్లు లోపున ఒక యూనిట్‌కు 50 యూనిట్ల వరకు రూ. 1.45, 500 వాట్లు దాటి, 50 యూనిట్లు వరకు రూ. 2.60 ఉండేది. ప్రసుత్తం ఇదే టారిఫ్‌లో 50 యూనిట్ల లోపు, 51 నుంచి 100 యానిట్ల వినియోగ యూనిట్ చార్జి రూ. 2.60, 101 నుంచి 200 వరకు రూ. 3.60, అలాగే మళ్లీ 200 యూనిట్లు దాటిన డొమస్టిక్ వినియోగదారులకు ప్రత్యేక టారిఫ్‌లను నిర్ణయించారు. ఈ ఏడాది మార్చి వరకు కేటగిరీ-2 వినియోగదారులకు 100 యూనిట్ల వరకు రూ. 6, 100 యూనిట్లు దాటితే యూనిట్చార్జి రూ. 7 ఉండేది. తాజాగా 50 యూనిట్ల వరకు రూ. 6.63, 51 నుంచి 100 యూనిట్ల వరకు రూ. 7.38, 100 నుంచి 300 యూనిట్ల వరకు రూ. 8.13, 301 నుంచి 500 వరకు రూ. 8.63, 500 యూనిట్లు దాటితే యూనిట్ చార్జి రూ. 9.13 వరకు ధరను పెంచి అమలుచేశారు. దీంతో జిల్లాలో ఉన్న సుమారు 6 లక్షల మంది విద్యుత్ వినియోగదారుల నుంచి ఈ ఏడాది మార్చి వరకు నెలకు చెల్లించిన చార్జీల వసూళ్లలకంటే ఏప్రిల్ తర్వాత పెరిగిన చార్జీలతో నెలకు 1.32 కోట్ల రూపాయలు అదనంగా విద్యుత్ శాఖకు చార్జీల రూపంలో ఆదాయం వచ్చింది. ఈ లెక్కన ఏడాదికి సుమారు 16 కోట్ల రూపాయలు భారం ప్రజలపై పడినట్లైంది. -
ఫిక్సింగ్ నియంత్రణకు ఐదు సూత్రాలు
కోల్‌కతా: ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే చాంపియన్స్ లీగ్ టి20లో అవినీతిని అరికట్టేందుకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు దాల్మియా సూచించిన ఐదు పాయింట్ల ప్రతిపాదనలను వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. 1. ప్రతీ జట్టు వెంట ఉండే భద్రతా సిబ్బందితో పాటు అదనంగా అవినీతి వ్యతిరేక మరియు భద్రతా యూనిట్ అధికారి ఉండాలి. 2. డగ్ అవుట్, మ్యాచ్ అధికారుల ఏరియాలో ఇతరుల కదలికలను నిషేధించాలి. 3. ముఖ్యంగా టోర్నీ సందర్భంగా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్ అధికారులు బయటి వారి నుంచి ఎలాంటి బహుమతులను స్వీకరించరాదు. అలాంటివేమన్నా ఉంటే టోర్నీ ప్రారంభానికి 15 రోజుల ముందే ఆ బహుమతి విలువతో పాటు ఇచ్చిన వ్యక్తి గురించి కూడా వెల్లడించాల్సి ఉంటుంది. 4. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది తమ మొబైల్ నంబర్లను ముందే బహిరంగపర్చాలి. ఆటగాళ్లకు వచ్చే కాల్స్‌ను హోటల్ ఎక్స్ఛేంజ్ ద్వారా టీమ్ మేనేజర్ రూఢి చేసుకుంటారు. 5. అవసరమనుకుంటే ఏసీఎస్‌యూ అధికారులు స్థానిక అధికారుల సహాయాన్ని తీసుకోవచ్చు.