ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కేఆర్‌పీ రెడ్డి
న్యూఢిల్లీ: ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్‌ఎస్)కి 2014-15 ఏడాదికిగాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ‘సాక్షి’ దినపత్రిక డెరైక్టర్ కె.రాజప్రసాద్‌రెడ్డి (కేఆర్‌పీ రెడ్డి) ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మొత్తంగా 41 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోగా.. ది హిందూకు చెందిన కె.బాలాజీ, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన వివేక్ గోయెంకా, విపుల-అన్నదాత ప్రచురణలకు చెందిన సీహెచ్ కిరణ్, డెక్కన్ క్రానికల్ పత్రికకు చెందిన టి.వెంకట్రామిరెడ్డి తదితరులు అందులో ఉన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఐఎన్‌ఎస్ 75వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఈ కార్యవర్గం ఎంపిక జరిగింది. ఐఎన్‌ఎస్ అధ్యక్షుడిగా గుజరాతీ పత్రిక సంభావ్ మెట్రోకు చెందిన కిరణ్ బి వదోదరియా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఐఎన్‌ఎస్‌కు నూతన కార్యవర్గం
Published Sun, Jan 4 2015 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM
Advertisement
Advertisement