INS
-
‘బ్రహ్మపుత్ర’లో భారీ అగ్ని ప్రమాదం
ముంబై/న్యూఢిల్లీ: ముంబై డాక్ యార్డులో మరమ్మతుల కోసం ఉన్న ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనతో యుద్ధ నౌక పూర్తిగా ఒక పక్కకు ఒరిగిపోగా ఒక నావికుడు గల్లంతయ్యారని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబై డాక్‌యార్డులో రీఫిట్ పనులు జరుగుతున్న మలీ్టరోల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని నేవీ తెలిపింది. సోమవారం ఉదయం కల్లా మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చామని వివరించింది. అయితే, మధ్యాహ్నం నుంచి యుద్ధ నౌక పక్కకు ఒరిగిపోవడం మొదలైందని, నిటారుగా సరైన స్థితిలో ఉంచేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వివరించింది. ప్రస్తుతం బ్రహ్మపుత్ర పూర్తిగా పక్కకు ఒరిగి ఉందని తెలిపింది. ప్రమాదంపై విచారణ జరుగుతోందని, గల్లంతైన ఒక జూనియర్ నావికుడి కోసం గాలింపు చేపట్టామని తెలిపింది. దేశీయంగా మొదటిసారిగా రూపొందిన బ్రహ్మపుత్ర క్లాస్‌కు చెందిన గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ఇది. 2000 ఏప్రిల్ నుంచి విధుల్లో ఉన్న ఈ షిప్‌పై 40 మంది అధికారులు, 330 మంది నావికులు విధుల్లో ఉంటారు. -
ఐఎన్ఎస్ సంధాయక్ జాతికి అంకితం.. రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖ: ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం ఇచ్చారు. ఈరోజు విశాఖలోని నేవల్ డాక్‌యార్డులో తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ సంధాయక్ నౌకను జాతికి అంకితమిచ్చారు. హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిపేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆదేశాలతో.. కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) సంస్థ ‘ఐఎన్ఎస్ సంధాయక్’ను నిర్మించింది. ఇది 3,800 టన్నుల సామర్థ్యంతో 110 మీటర్ల పొడవుంది. హెలిపాడ్, సర్వే సాంకేతిక పరికరాలు, రెండు డీజిల్ యంత్రాలు అమర్చారు. తాజాగా దీన్ని జాతికి అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్క పాల్గొన్నారు. సంధాయక్ నౌకకు కమాండింగ్ అధికారిగా కెప్టెన్ ఆర్.ఎం.థామస్ వ్యవహరించనున్నారు. Indian Navy commissions its latest Survey Vessel #INSSandhayak, at Naval Dockyard, Vizag in the presence of Defence Minister@rajnathsingh. The event marks the formal induction into the Navy of the first of four Survey Vessel (Large) ships under construction at @OfficialGRSE… pic.twitter.com/6JFPkVNKkl — All India Radio News (@airnewsalerts) February 3, 2024 ఈ సందర్బంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ..‘భారత నౌకాదళ అమ్ములుపొదిలో ఐఎన్ఎస్ సంధాయక్ జలప్రవేశం సంతోషకరం. భారత నౌకాదళం స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ప్రపంచ సముద్ర జలాల్లో కూడా భారత నౌకాదళం కీలక భద్రత చర్యలు చేపడుతోంది. భారత్‌కు ఎనిమిది వేల నాటికల్ మైళ్ల దూరంలో సముద్రపు దొంగలను కూడా నౌకాదళం అదుపు చేసింది. సముద్ర జలాల్లో శాంతి సామరస్యం పరిరక్షించడమే ఇండియన్ నేవీ లక్ష్యం. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ నగరం. తూర్పు నౌకాదళం విశాఖ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. విశాఖ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. ఇండియన్ నేవీ విస్తరణలో విశాఖ నగర పాత్ర మరువ లేనిది’ అని కామెంట్స్ చేశారు. #WATCH | Andhra Pradesh: Defence Minister Rajnath Singh addresses the Commissioning Ceremony of INS Sandhayak, at the Naval Dockyard in Visakhapatnam. He says, "If I talk about our naval power, the Indian Navy has become so strong that we have become the first responder in terms… pic.twitter.com/RO0vedn9WI — ANI (@ANI) February 3, 2024 -
భారత సిబ్బందితో ఉన్న నౌకపై దాడి.. రంగంలోకి ఐఎన్ఎస్ విశాఖ
ఎర్రసముద్రంలో నౌకలపై యెమెన్ దేశానికి చెందిన తిరుబాటుదారులు హౌతీ రెబల్స్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో సముద్రంలో ప్రయాణిస్తున్న బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్‌పై హౌతీ రెబల్స్ మిస్సైల్ దాడికి తెగపడ్డారు. దాడికి గురైన బ్రిటిష్ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది, ఒక బంగ్లాదేశ్ ఉద్యోగి ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ సహాయక చర్యలకోసం ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బందిని పంపించినట్లు శనివారం వెల్లడించింది. దాడి జరిగిన వెంటనే ఎంవీ మార్లిన్ లువాండా అనే బ్రిటిష్ నౌక నుంచి ఓ అత్యవసర సందేశం ఇండియాన్ నేవీ వచ్చింది. #IndianNavy's Guided missile destroyer, #INSVisakhapatnam, deployed in the #GulfofAden responded to a distress call from MV #MarlinLuanda on the night of #26Jan 24. The fire fighting efforts onboard the distressed Merchant Vessel is being augmented by the NBCD team along with… pic.twitter.com/meocASF2Lo — SpokespersonNavy (@indiannavy) January 27, 2024 ‘ఎంవీ మార్లిన్ లువాండా నుంచి వచ్చిన అత్యవసర సందేశంతో అప్రమత్తమైన సమీపంలోని ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బంది రంగంలో దిగారు. నౌకల భద్రతను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నాం’ ఇండియాన్ నేవి ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా పేర్కొంది. -
త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు
త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు త్రివిధ దళాలలో మహిళా అధికారులకు సంబంధించి ఈ సంవత్సరంలో ఎన్నో ‘ప్రథమం’లు కనిపిస్తాయి. మహిళా సైనికులు ఆర్టిలరీ బ్రాంచిలలోకి అడుగుపెట్టారు. యుద్ధనౌకల కమిషనింగ్ బృందంలో భాగం అయ్యారు. అత్యంత కఠినమైన యుద్ధభూమి సియాచిన్లోకి వైద్యసేవల కోసం వెళ్లారు. భారత నావికాదళానికి చెందిన గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్ఎస్’ ఇంఫాల్ మహిళా అధికారులు, నావికులతో ప్రత్యేక వసతులతో కూడిన తొలి యుద్ధనౌకగా అవతరించింది, నావికా, వైమానిక దళాలు తమ ఆపరేషన్లకు సంబంధించిన ప్రతి విభాగం లోకి మహిళలను అనుమతిస్తున్నాయి. ఇంతకాలం పురుషులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండే విభాగాలలో ఈ సంవత్సరం మహిళా అధికారులు నాయకత్వ స్థానాల్లోకి వచ్చారు.... ► హరియాణాలోని జింద్ జిల్లాకు చెందిన చెందిన పాయల్ చబ్ర ఎంబీబీఎస్, ఎంఎస్ చేసింది. అంబాలా కంటోన్మెంట్ని ఆర్మీ హాస్పిటల్, లడఖ్‌లోని ఖర్దుంగ్లా ఆర్మీ హాస్పిటల్లో పనిచేసింది. ఆ తరువాత లడఖ్‌లోని ఆర్మీ హాస్పిటల్లో సర్జన్‌గా పనిచేసింది. ఒకవైపు సర్జన్‌గా పనిచేస్తూనే మరోవైపు పారో కమాండో కావడానికి ఆగ్రాలోని పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందింది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తరువాత పారా మిలిటరీ ప్రత్యేక భద్రతా దళంలో చేరిన తొలి మహిళా ఆర్మీ సర్జన్‌గా ప్రత్యేకత సాధించింది. ►ముంబాయికి చెందిన ప్రేరణ దేవస్థలీ సెయింట్ జేవియర్స్ కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. 2009లో భారత నావికా దళంలో చేరింది. పశ్చిమ నౌకాదళానికి చెందిన పెట్రోలింగ్ నౌక ‘ఐఎన్ఎస్ త్రిన్కాత్’ ఫస్ట్ ఫిమేల్ కమాండింగ్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది. ప్రేరణ సోదరుడు ఇండియన్ నేవీలో పనిచేస్తాడు. అతడి స్ఫూర్తితోనే నావికాదళంలోకి వచ్చింది ప్రేరణ. ‘భారత నౌకాదళం అవకాశాల సముద్రం. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా మనల్ని మనం నిరూపించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి’ అంటుంది ప్రేరణ. ► దిల్లీ కంటోన్మెంట్‌లోని భారత సైన్యానికి చెందిన రక్తమార్పిడి కేంద్రం(ఎఎఫ్టీసీ) ఫస్ట్ ఉమెన్ కమాండింగ్ ఆఫీసర్‌గా ప్రత్యేకత చాటుకుంది కల్నల్ సునీతా బీఎస్. రోహ్తక్ మెడికల్ కాలేజీలో ‘పాథాలజీ’లో పీజీ చేసిన సునీత అరుణాచల్‌ప్రదేశ్‌లో మిలిటరీ ఆస్పత్రిలో కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేసింది. ► ‘ఫ్రంట్‌లైన్ ఐఏఎఫ్ కంబాట్ యూనిట్’ కమాండర్ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళ షాలిజా ధామి. 2003లో హెలికాప్టర్ పైలట్ అయింది. 2,800 గంటలకు పైగా విమానాన్ని నడిపిన అనుభవం ఆమె సొంతం. వెస్ట్రన్ సెక్టార్‌లోని హెలికాప్టర్ యూనిట్లో ఫ్లైట్ కమాండర్‌గా పనిచేసింది. పంజాబ్‌లోని లూథియానా థామి స్వస్థలం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసింది. భారత వైమానిక దళంలో శాశ్వత కమిషన్‌ను పొందిన మొదటి మహిళా అధికారిగా నిలిచింది. ► తూర్పు లడఖ్‌లో భారత్–చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ‘స్వతంత్ర ఫీల్డ్ వర్క్‌షాప్’కు పురుష అధికారులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండేవారు. ఈ ఏడాది ఆ అవకాశం గీతా రాణాకు వచ్చింది. స్వతంత్ర ఫీల్డ్ వర్క్‌షాప్‌కు కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళా అధికారిగా గీతా రాణా ప్రత్యేకత నిలుపుకుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్(ఈఎంఈ) ట్రైనింగ్ సెంటర్లో ఇన్‌స్ట్రక్టర్‌గా బాధత్యలు నిర్వహించింది గీతా రాణా. ► స్క్వాడ్రన్ లీడర్ మనిషా పధి మిజోరం గవర్నర్ సహాయకురాలి (ఏడీసీ)గా నియామకం అయింది. మన దేశంలో గవర్నర్‌కు ఎయిడ్–డి–క్యాంప్(ఏడీసీ)గా నియామకం అయినా ఫస్ట్ ఉమన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది. మనిషా స్వస్థలం ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్–బీదర్, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్–పుణె చివరగా భటిండాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో పనిచేసింది. ► ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్. వైద్యసేవలు అందించడానికి ఈ ప్రమాదకరమైన యుద్ధక్షేత్రంలోకి అడుగు పెట్టిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్ (ఆపరేషనల్ పోస్ట్)గా ప్రత్యేకత చాటుకుంది కెప్టెన్ ఫాతిమా వసిమ్. దీనికిముందు ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఎన్నో నెలల పాటు కఠోరమైన శిక్షణ తీసుకుంది. (చదవండి: కొత్త సంవత్సరమా మనిషిని మేల్కొలుపు) -
కొచ్చి నేవీ కేంద్రంలో హెలికాప్టర్ ప్రమాదం
కొచ్చి/న్యూఢిల్లీ: కొచ్చి నావికా కేంద్రంలో శనివారం జరిగిన ప్రమాదంలో నేవీకి చెందిన ఒక నావికుడు ప్రాణాలు కోల్పోయారు. ఐఎన్ఎస్ గరుడపై ట్యాక్సీ చెకింగ్ సమయంలో చేతక్ హెలికాప్టర్ అనుకోకుండా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో లీడింగ్ ఎయిర్ మ్యాన్ యోగేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయారని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ఘటనపై బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు వెల్లడించింది. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ యోగేంద్ర సింగ్ మృతికి సంతాపం ప్రకటించారని వివరించింది. యోగేంద్ర సింగ్ స్వరాష్ట్రం మధ్యప్రదేశ్ అని తెలిపింది. -
యుద్ధనౌక సూరత్.. సిద్ధమైంది.!
సాక్షి, విశాఖపట్నం: తీర ప్రాంత రక్షణకు అగ్ర దేశాలతో పోటీగా ఆయుధ సంపత్తిని పెంచుకోవడమే లక్ష్యంగా భారత నౌకాదళం వడివడిగా అడుగులు వేస్తోంది. అరేబియా సముద్ర జలాల్లో కీలకంగా ఉంటూ క్షిపణుల్ని తీసుకెళ్లడమే కాకుండా.. మిసైల్ డిస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్త యుద్ధ నౌక ఐఎన్ఎస్ సూరత్ సిద్ధమైంది. ఈ నౌక నిర్మాణంలో కీలకమైన క్రెస్ట్ (శిఖరావిష్కరణ) కార్యక్రమాన్ని సోమవారం సూరత్‌లో నిర్వహించనున్నారు. అనంతరం తుది దశ పరిశీలనల తర్వాత భారత నౌకాదళానికి అప్పగించనున్నారు. ముంబైలో తయారైన ఈ యుద్ధ నౌక గంటకు 56 కి.మీ. వేగంతో దూసుకుపోతూ శత్రు సైన్యంలో వణుకు పుట్టించగలదు. ప్రాజెక్టు–15బీలో చివరి యుద్ధ నౌక.. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్–15బీ పేరుతో రూ. 35,800 కోట్లతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం, మర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లని పెట్టాలని నిర్ణయించారు. తొలి షిప్‌ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు. 2011 జనవరి 28న ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. ఇప్పటికే ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్ యుద్ధ నౌకలు భారత నౌకాదళంలో చేరాయి. తాజాగా చివరి నౌకగా ఐఎన్ఎస్ సూరత్ వార్ షిప్ కూడా విధుల్లో చేరేందుకు సిద్ధమైంది. ఈ షిప్‌కు సంబంధించి 2018 జూలైలో కీల్ నిర్మించగా.. 2022 మే 17న షిప్ తయారీ పనుల్ని బ్లాక్ కనస్ట్రక్షన్ మెథడాలజీ సాంకేతికతతో ముంబైలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్(ఎండీఎల్) ప్రారంభించింది. ఈ నౌకకు తొలుత గుజరాత్లో ప్రధాన ఓడరేవు అయిన పోర్బందర్ పేరు పెట్టాలని నౌకాదళం భావించింది. తర్వాత.. రక్షణ మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఐఎన్ఎస్ సూరత్‌గా నామకరణం చేశారు. ఈ 4 షిప్స్‌ని 2024 కల్లా నౌకాదళానికి అప్పగించాలని ఒప్పందం. కాగా, తుదిదశకు ఐఎన్ఎస్ సూరత్ పనులు చేరుకున్న తరుణంలో ముఖ్యమైన క్రెస్ట్ (యుద్ధనౌకకు సంబంధించి ప్రత్యేకమైన సంప్రదాయ చిహ్నం. క్రెస్ట్ పూర్తయితే నౌక జాతికి అంకితం చేసేందుకు సిద్ధమైనట్లే.) ఆవిష్కరణ సూరత్‌లో జరగనుంది. అనంతరం తుది దశ ట్రయల్స్ నిర్వహించి నౌకాదళానికి అప్పగించనున్నారు. బ్రహ్మోస్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం విశాఖపట్నం–క్లాస్ స్టెల్త్ గైడెడ్–మిసైల్ డిస్ట్రాయర్ యర్ నౌకల్లో ఆఖరిది ఐఎన్ఎస్ సూరత్. విశాఖపట్నం క్లాస్ యుద్ధ నౌకలన్నీ బ్రహ్మోస్ క్షిపణుల్ని మోసుకెళ్లగల సామర్థ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోదగ్గ ఐఎన్ఎస్ సూరత్‌ను అత్యాధునిక ఆయుధ సెన్సార్లు, అధునాతన ఫీచర్లు, పూర్తిస్థాయి ఆటోమేషన్తో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ఈ యుద్ధనౌక భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక విశేషాలు.. బరువు: 7,400 టన్నులు పొడవు: 163 మీటర్లు బీమ్: 17.4 మీటర్లు డ్రాఫ్ట్: 5.4 మీటర్లు వేగం: గంటకు 30 నాటికల్ మైళ్లు (56 కిమీ) స్వదేశీ పరిజ్ఞానం: 80 శాతం పరిధి: 45 రోజుల పాటు ఏకధాటిగా 8 వేల నాటికల్ మైళ్లు ప్రయాణం చేయగల సత్తా సిబ్బంది– 50 మంది అధికారులు, 250 మంది సిబ్బంది సెన్సార్స్, ప్రాసెసింగ్ వ్యవస్థలు– మల్టీ ఫంక్షన్ రాడార్, బ్యాండ్ ఎయిర్ సెర్చ్ రాడార్, సర్ఫేస్ సెర్చ్ రాడార్ ఆయుధాలు: 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు విమానాలు: రెండు వెస్ట్‌ల్యాండ్ సీకింగ్ విమానాలు లేదా రెండు హెచ్ఏఎల్ ధృవ్ విమానాలు తీసుకెళ్లగలదు ఏవియేషన్ ఫెసిలిటీ: రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యే సౌకర్యం ఎల్రక్టానిక్ వార్ఫేర్: డీఆర్డీవో శక్తి సూట్, రాడార్ ఫింగర్ ప్రింటింగ్ సిస్టమ్ ఏర్పాటు, 4 కవచ్ డెకాయ్ లాంచర్లు, 2 కౌంటర్ టార్పెడో సిస్టమ్స్. -
ఐఎన్ఎస్ అధ్యక్షునిగా రాకేశ్ శర్మ
న్యూఢిల్లీ: ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్)కి 2023–24 కాలానికి నూతన అధ్యక్షునిగా రాకేశ్ శర్మ(ఆజ్ సమాజ్) ఎన్నికయ్యారు. వార్తాసంస్థలు, మ్యాగజైన్లు, పీరియాడికల్స్ సంస్థల సంఘమైన ఐఎన్ఎస్ 84వ వార్షిక సాధారణ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యనిర్వాహక కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఇప్పటిదాకా సంస్థకు కె.రాజ ప్రసాద్ రెడ్డి(సాక్షి) అధ్యక్షునిగా కొనసాగిన విషయం తెల్సిందే. 2023–24 కాలానికిగాను ఐఎన్ఎస్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా శ్రేయాంస్ కుమార్(మాతృభూమి), వైస్ ప్రెసిడెంట్‌గా వివేక్ గుప్తా(సన్మార్గ్), గౌరవ ట్రెజరర్‌గా తన్మైయ్ మహేశ్వరి(అమర్ ఉజాలా) ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కె.రాజ ప్రసాద్ రెడ్డి(సాక్షి), ఐ.వెంకట్(ఈనాడు, అన్నదాత)సహా 41 మంది ఎన్నికయ్యారు. సొసైటీకి సెక్రెటరీ జనరల్‌గా మేరీ పాల్ ఎంపికయ్యారు. మరోవైపు అధ్యక్షునిగా కొనసాగిన కాలంలో తనకు పూర్తి సహాయక సహకారాలు అందించిన ఐఎన్ఎస్ ఉపాధ్యక్ష, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, తదితరులకు మాజీ అధ్యక్షుడు కె.రాజ ప్రసాద్ రెడ్డి(కేఆర్పీ రెడ్డి) కృతజ్ఞతలు తెలిపారు. -
వియత్నాంకు కానుకగా మన యుద్ధనౌక
న్యూఢిల్లీ: వియత్నాంకు భారత్ అరుదైన కానుక అందించింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నిదర్శనంగా ఐఎన్ఎస్ కృపాణ్ యుద్ధనౌకను బహుమతిగా ఇచి్చంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యంపై ఇరు దేశాల్లో నెలకొన్న ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకొని తీర ప్రాంతంలో గస్తీని బలోపేతం చేయడం దీని ఉద్దేశమంటున్నారు. పూర్తి సామర్థ్యంతో పని చేసే యుద్ధ నౌకను ఒక మిత్రదేశానికి భారత్ కానుకగా ఇవ్వడం ఇదే తొలిసారని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వెల్లడించారు. వియత్నాం పర్యటనలో ఉన్న ఆయన శనివారం బే ఆఫ్ కామ్ రన్హ్ జలాల్లో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ కృపాణ్‌ను ఆ దేశానికి అందజేశారు. పూర్తిస్థాయి ఆయుధాలతో కూడిన నౌకను ఆ దేశ నేవీకి అప్పగించినట్టు వివరించారు. భారత్ జీ20 సదస్సు ప్రధాన థీమ్ అయిన వసుధైక కుటుంబం (ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్)లో భాగంగానే ఈ కానుక ఇచ్చినట్టు తెలిపారు. ఐఎన్ఎస్ కృపాణ్ గస్తీతో దక్షిణ చైనా జలాల్లో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అన్ని దేశాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎన్ఎస్ కృపాణ్ జూన్ 28న విశాఖపట్నం నుంచి బయల్దేరి జూలై 8 నాటికి వియత్నాం చేరింది. -
యుద్ధనౌక ఐఎన్ఎస్ కృపాణ్:ఈ కానుక ఏ తీరాలకి..?..ప్రత్యేకతలివే..!
► పసిఫిక్ మహా సముద్రంలోని దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. చైనా ఈ ప్రాంతంపై తన సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడాన్ని సముద్రం చుట్టూ ఉన్న దేశాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రం కేవలం డ్రాగన్దేనంటే ఊరుకోబోమని అందులో తమకూ భాగం ఉందని గళమెత్తుతున్నాయి. అలాంటి దేశాల్లో వియత్నాం కూడా ఒకటి. చైనా పొరుగునే ఉన్న వియత్నాం ఇండో పసిఫిక్ ప్రాంతంలో మనకి అత్యంత కీలక భాగస్వామిగా ఉంది. భావసారూప్యత కలిగిన భాగస్వామ్య దేశమైన వియత్నాం నౌకాదళ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశ ఆధిపత్యానికి చెక్ పెట్టాలన్నది భారత్ వ్యూహంగా ఉంది. దక్షిణ చైనా సముద్రంపై చైనా పెత్తనం పెరుగుతున్న కొద్దీ ప్రపంచ పటంలో కొత్త మార్పులు వస్తాయన్న ఆందోళనలున్నాయి. ఇటీవల కాలంలో వియత్నాంతో మన దేశానికి ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. రక్షణ రంగంలో సహకరించుకుంటున్నాం. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశ పెత్తనం సహించలేనిదిగా మారింది. ఈ నేపథ్యంలో వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ జియాంగ్ భారతదేశ పర్యటనకు వచి్చనçప్పుడు ఈ యుద్ధ నౌకను కానుకగా ఇవ్వాలని భారత్ నిర్ణయించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇప్పటివరకు భారత్ ఎన్నో మిత్ర దేశాలకు మిలటరీ సాయాలు చేసింది. మాల్దీవులు, మారిషస్ వంటి దేశాలకు చిన్న చిన్న పడవలు, మిలటరీ పరికరాలు ఇచి్చంది. మయన్మార్‌కు ఒక జలాంతర్గామిని ఇచి్చంది. కానీ వియత్నాంకు క్షిపణిని మోసుకుపోగలిగే సామర్థ్యమున్న యుద్ధ నౌకను ఇవ్వడం వల్ల ఆ తీరంలో చైనా కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయడానికి వీలు కలుగుతుందన్నది భారత్ ఉద్దేశంగా ఉంది. ప్రత్యేకతలివే..! ► ఐఎన్ఎస్ కృపాణ్ ఖుక్రీ క్లాస్‌కు చెందిన అతి చిన్న క్షిపణి యుద్ధనౌక. 1,350 టన్నుల బరువైన, సముద్రజలాలను పక్కకు తోసేస్తూ వేగంగా ముందుకు దూసుకెళ్లగల శక్తివంతమైన నౌక ఇది. ► పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇంజనీర్లు రూపొందించిన ఈ నౌక గత కొన్నేళ్లుగా మన నావికా దళానికి గర్వకారణంగా ఉంది. ► 1991 జనవరి 12న దీనిని నావికాదళంలోకి ప్రవేశపెట్టారు.. 25 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు. ► మీడియం రేంజ్ గన్స్ అంటే 30 ఎంఎం తుపాకీలను ఈ నౌకకు అమర్చవచ్చు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, చాఫ్ లాంచర్స్ వంటి వైవిధ్యమైన పనులు చేయగలదు. ► తీరప్రాంతాల్లో భద్రత, గస్తీ, కదనరంగంలో పాల్గొనడం, యాంటీ పైరసీ, విపత్తు సమయాల్లో మానవతా సాయం వంటివి చేయగల సామర్థ్యముంది. ► భారత్ నావికాదళంలో చురుగ్గా సేవలు అందిస్తున్న యుద్ధనౌక ఐఎన్ఎస్ కృపాణ్‌ను కేంద్ర ప్రభుత్వం వియత్నాంకు కానుకగా ఇచ్చింది. విదేశాలకు ఒక నౌకని బహుమతిగా ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి. ఈ నౌక విశాఖ నుంచి ఈ నెల 28 బుధవారం వియత్నాంకు బయల్దేరి వెళ్లింది. 2016 నుంచి భారత్, వియత్నాం మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటివరకు మనం ఎన్నో దేశాలకు మిలటరీ సాయం చేశాము. కానీ కోట్లాది రూపాయల విలువ చేసే యుద్ధ నౌకను ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు ? ఎందుకీ నిర్ణయం? దీని వల్ల భారత్‌కు ఒరిగేదేంటి ? దక్షిణ చైనా సముద్రం వివాదమేంటి? ► దక్షిణ చైనా సముద్రంపై సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఈ సముద్ర భూభాగంపై సార్వ¿ౌమాధికారాన్ని ప్రకటించుకున్న చైనా ఏకంగా కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. ఈ సముద్రంలో ఎన్నో దీవులున్నాయి. మత్స్య సంపద అపారంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 15 శాతం ఈ సముద్రంలో జరుగుతుంది. దీనిపై చైనా సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడం ఇతర దేశాలకు మింగుడు పడడం లేదు.ఈ సముద్రంలో ఉన్న అన్ని ద్వీపాలను ఒకే రేఖ మీద చూపిస్తూ చైనా విడుదల చేసిన ‘‘నైన్ డ్యాష్ లైన్’ మ్యాప్‌తో తనవేనని వాదిస్తోంది. ఈ సముద్రంలో భారీగానున్న చమురు నిల్వలపై అన్వేషణ కూడా ప్రారంభం కావడంతో దేశాల మధ్య పోటీ ఎక్కువైంది. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రం మధ్యలో దక్షిణ చైనా సముద్రం ఉండడం వల్ల అక్కడ చైనా జోక్యం పెరిగితే భారత్‌కూ నష్టమే. ఈ సముద్రం చుట్టూ చైనా, తైవాన్, వియత్నాం, మలేసియా, ఇండోనేసియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ దేశాలున్నాయి. ఇవి కూడా సముద్రంలో తమకూ వాటా ఉందని ప్రకటించాయి. మరోవైపు చైనా కృత్రిమ దీవులు, సైనిక స్థావరాలతో ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య మనం పంపిన కృపాణ్ దక్షిణ చైనా జలాల్లో ఎంత మేరకు నిఘా పెడుతూ డ్రాగన్‌కు చెక్ పెడుతుందో వేచిచూడాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించిన నేవీ
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. నేవీకి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మర్ముగోవాపై నుంచి ప్రయోగించినట్లు ఆదివారం వెల్లడించారు. ఐఎన్ఎస్ మర్ముగోవాతోపాటు బ్రహ్మోస్ క్షిపణి కూడా దేశీయంగా తయారైనవేనని చెప్పారు. సముద్రజలాలపై మన నావికాదళ శక్తిని, దేశ ఆత్మనిర్భరతకు చాటిచెప్పే పరిణామమని వివరించారు. ధ్వని వేగం కంటే మూడు రెట్లు వేగంతో ఇది దూసుకెళ్లిందన్నారు. భారత్–రష్యా ఉమ్మడిగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జలాంతర్గాములు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలతోపాటు భూమిపై నుంచి సైతం ప్రయోగించేందుకు వీలున్న బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేస్తోంది. -
సెలవిక.. శత్రుంజయ! ‘ఐఎన్ఎస్ మగర్’ యుద్ధ నౌక నిష్క్రమణ
సాక్షి, విశాఖపట్నం: నీటిలోనే కాదు.. నేలపైనా దాడిచేసే స్వభావం ఉన్న మొసలి (మగర్) లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న ఆ యుద్ధ నౌక వస్తుందంటే శత్రువుల వెన్నులో వణుకు పుట్టేది. ఆయుధ సంపత్తిని మోసుకొస్తున్న ఆ నౌక కనిపిస్తే చాలు.. శత్రు సైన్యంతో పోరాడుతున్న బలగాలకు కొండంత ధైర్యం పోగవుతుంది. ఆపదలో ఉన్నవారికి ఆత్మీయత పంచుతూ.. విపత్తులో ఉన్నవారిని ఒడ్డుకు చేర్చుతూ.. 36 ఏళ్లపాటు భారత నౌకాదళానికి సుదీర్ఘ సేవలందించిన ఐఎన్ఎస్ మగర్ ఆదివారంతో విధులకు స్వస్తి పలకనుంది. వార్ఫేర్ వెసెల్‌గా అంతర్జాతీయ విన్యాసాల్లో సత్తా చాటిన మగర్‌కు భారత నౌకాదళం ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతోంది. ఒడ్డుకు వచ్చి మరీ.. భారత నౌకాదళ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఉభయచర యుద్ధ నౌకల్లో కీలకమైనదిగా ఐఎన్ఎస్ మగర్ ఖ్యాతి ఆర్జించింది. విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డు సహకారంతో కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ)లో మగర్ని యాంఫిబియాస్ షిప్‌గా తీర్చిదిద్దారు. అంటే.. సాధారణంగా షిప్‌లు ఒడ్డు వరకూ రాలేవు. కానీ.. మగర్ మాత్రం ఒడ్డు వరకూ వచ్చి.. సైన్యానికి అవసరమైన ఆయుధ సంపత్తిని అందించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. అందుకే.. దీనికి మగర్ (తెలుగులో మొసలి అని అర్థం) అనే పేరుపెట్టారు. 1987 జూలై 15న భారత నౌకాదళంలో ఈ షిప్ ప్రవేశించింది. విశాఖ నుంచి సుదీర్ఘ సేవలు తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నానికి ఐఎన్ఎస్ మగర్ని కేటాయించారు. ల్యాండింగ్ షిప్ ట్యాంక్(ఎల్ఎస్టీ) హోదాలో యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు తీసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. నలుగురు ల్యాండింగ్ క్రాఫ్ట్ వెహికల్ సిబ్బంది, అత్యవసర సమయంలో దళాల్ని మోహరించేందుకు మగర్ యుద్ధ నౌకను వినియోగించేవారు. శ్రీలంకలో ఎల్టీటీఈని నిరోధించే సమయంలో నిర్వహించిన ఆపరేషన్ పవన్‌లో మగర్ కీలక పాత్ర పోషించింది. నిరంతర పోరాటం చేసిన ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్(ఐపీసీకే)కు అవసరమైన సామగ్రిని అందించింది. వివిధ దేశాల్లో జరిగిన ద్వైపాక్షిక విన్యాసాల్లో మగర్ సత్తా చాటింది. 2006 ఫిబ్రవరి 22న విశాఖ తీరానికి 70 కి.మీ. దూరంలో మగర్ యుద్ధ నౌకలో ఘోర ప్రమాదం సంభవించింది. షిప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు నావికులు మృతి చెందారు. మరో 19 మంది గాయాల పాలయ్యారు. 2018వ సంవత్సరం వరకూ విశాఖ కేంద్రంగా సేవలందించిన మగర్‌ను 2018 ఏప్రిల్‌లో కొచ్చికి తరలించి.. మార్పులు చేర్పుల అనంతరం మొదటి స్క్వాడ్రన్ శిక్షణ నౌకగా సేవలు అందించింది. సునామీలో విశిష్ట సేవలు మగర్ అందించిన సేవల్లో ముఖ్యంగా 2004లో వచ్చిన సునామీ సమయమనే చెప్పుకోవాలి. ఎప్పుడు మళ్లీ సముద్రం ఉప్పొంగి.. విలయం వస్తుందో తెలీని సమయంలో ధైర్యంగా సాగర జలాల్లో ప్రయాణించిన మగర్.. అండమాన్ నికోబార్ దీవుల్లో చిక్కుకున్న 1,300 మందిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చింది. అంతేకాకుండా.. అక్కడి నుంచి వివిధ విపత్తు ప్రాంతాలకు తరలివెళ్లి నిరాశ్రయులుగా మిగిలిన వారికి సహాయక సామగ్రి అందజేయడంలోనూ కీలకంగా వ్యవహరించిన మగర్‌కు భారత రక్షణ దళం నుంచి అద్భుత ప్రశంసలందాయి. కోవిడ్ సమయంలో నిర్వహించిన ఆపరేషన్ సముద్ర సేతులోనూ మగర్ విశిష్ట పాత్ర పోషించింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడం, స్నేహపూర్వక దేశాలకు వైద్యసామగ్రి అందించడం మగర్ ద్వారానే సాధ్యమైంది. నౌకాదళంలో సేవలు ప్రారంభం:15 జూలై, 1987 పొడవు: 390 అడుగులు వెడల్పు: 57 అడుగులు డ్రాఫ్ట్: 13 అడుగులు వేగం: గంటకు 28 కి.మీ. ప్రయాణ సామర్థ్యం: ఏకధాటిగా 3 వేల మైళ్ల ప్రయాణం ఆయుధ సామర్థ్యం: బీఈఎల్–1245 రాడార్ నావిగేటర్, నాలుగు బోఫోర్స్ 40 ఎంఎం గన్స్, 2 మల్టిపుల్ బ్యారెల్ రాకెట్ లాంచర్స్, ఒక సీ కింగ్ హెలికాప్టర్ వార్ ఫేర్ యూనిట్: 15 యుద్ధ ట్యాంకులు, 13 బీఎంపీ పదాతిదళ పోరాట వాహనాలు, 10 ట్రక్కులు, 8 భారీ మోటార్ వెహికల్స్‌తోపాటు 500 మంది సైనికుల్ని ఒకేసారి తీసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. నేడు కొచ్చిలో నిష్క్రమణం నౌకాదళానికి 36 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలందించిన మగర్ యుద్ధ నౌకకు కొచ్చి పోర్టులో భారత నౌకాదళం ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించే డీకమిషన్ కార్యక్రమంలో ఐఎన్ఎస్ మగర్‌లో సేవలందించిన కెప్టెన్లు, అధికారులకు ఆత్మీయ సత్కారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘అవర్ బోల్డ్ అండ్ బ్రేవ్ మగర్’ పేరుతో షార్ట్ ఫిల్మ్‌ని ప్రదర్శించి యుద్ధ నౌకకు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. (చదవండి: మరింత వేగంగా వీసీఐసీ అభివృద్ధి) -
నిప్పులు చిమ్ముకుంటూ లక్ష్యానికి...
దొండపర్తి (విశాఖ దక్షిణ): దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయిని సాధించింది. ఐఎన్ఎస్ విశాఖ నుంచి మధ్య శ్రేణి నౌకా విధ్వంసక క్షిపణిని మంగళవారం ప్రయోగించింది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన మిసైల్ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. అత్యంత వేగంతో దూసుకొచ్చే శత్రు దేశాల యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు, గైడెడ్ బాంబులు, క్రూయిజ్ క్షిపణులు, యుద్ధ నౌకలను సైతం నాశనం చేసే సామర్థ్యం ఈ మధ్యస్థ శ్రేణి క్షిపణికి ఉంది. నేలపై నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించే(ఎంఆర్ఎస్ఏఎం) వ్యవస్థ దీనికి ఉంది. 70 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న ల క్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగల శక్షివంతమైన ఈ క్షిపణి వ్యవస్థను భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీఓ), ఇజ్రాయిల్ ఎరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వీటిని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోంది. మీడియం రేంజ్ సర్ఫేస్ –టు –ఎయిర్ మిస్సైల్ (ఎంఆర్ఎస్ఏఎం) ప్రత్యేకతలు పరిధి: 70 కిలోమీటర్లు మార్గదర్శకత్వం: డ్యూయల్ (కమాండ్ –యాక్టివ్ రాడార్ సీకర్ (ఆర్ఎఫ్) నియంత్రణ: టీవీఎస్ అండ్ ఏరోడైనమిక్ ప్రొపల్షన్: డ్యూయల్ పల్స్ –సాలిడ్ మోటార్ వార్ హెడ్: ప్రీ–ఫ్రాగ్మెంట్ ప్రయాణ సమయం: 230 సెకన్లు పొడవు: 4500 మిల్లీమీటర్లు వ్యాసం: 225 మిమీ బరువు: 275 కిలోలు లాంచర్: షిప్/వాహనం (నిలువు) లాంచ్. భారత రక్షణ దళం శక్తివంతం ‘ఆత్మనిర్భర్’లో భాగంగా భారత సైన్యం శక్తివంతమైన క్షిపణులను సిద్ధం చేసుకుంటోంది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మీడియం రేంజ్ క్షిపణిల తయారీ, అభివృద్ధికి బీడీఎల్‌తో 2017లో ఐఏఐతో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం ఎదురుగా వచ్చే విమానాలు, హెలికాఫ్టర్లు, మిస్సైళ్లను, యుద్ధ నౌకలను సైతం ధ్వంసం చేసేలా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఒకసారి ఒడిశాలోని బాలాసోర్ తీరం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి సుదూర శ్రేణిలో ఉన్న హైస్పీడ్ ఏరియల్ లక్ష్యాన్ని చేధించింది. తాజాగా పరీక్షించిన ఎంఆర్ఎస్ఏఎం వ్యవస్థలో దేశీయంగా అభివృద్ధి చేసిన డ్యుయల్ పల్స్ రాకెట్ మోటర్‌ను వాడారు. అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ద్వారా శత్రు విమానాలు, హెలీకాఫ్టర్లు, యాంటీ షిప్ మిసైళ్లను ధ్వంసం చేస్తుంది. -
నేవీ అమ్ములపొదిలోకి వాగీర్.. జలాంతర్గామి విశేషాలివే..
ముంబై: అత్యాధునిక ఆయుధ వ్యవస్థ, వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం, గుట్టుగా మోహరించే దమ్ము ఉన్న నూతన జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగీర్ లాంఛనంగా భారత నావికాదళంలో చేరింది. సోమవారం ముంబైలోని నావల్ డాక్‌యార్డ్ ఇందుకు వేదికైంది. కల్వరీ శ్రేణి జలాంతర్గాముల్లో చివరిది, ఐదవది అయిన వాగీర్‌ను నావికా దళ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ లాంఛనంగా భారత నేవీలోకి ప్రవేశపెట్టారు. ‘వాగీర్ రాకతో సముద్రజలాల్లో శత్రువుల బారి నుంచి దేశ ప్రయోజనాలను మరింతగా సంరక్షించవచ్చు. ఇంటెలిజెన్స్, నిఘా, మొహరింపు విభాగాల్లో నేవీ సామర్థ్యాన్ని వగర్ పరిపుష్టంచేస్తుంది’ అని ఈ సందర్భంగా భారత నేవీ ప్రకటించింది. ఎలాంటి జంకు లేకుండా దాడి చేసే ఇసుక షార్క్ చేప(వాగీర్) పేరును దీనికి పెట్టారు. 24 నెలల వ్యవధిలో నేవీ చేరిన మూడో సబ్‌మరైన్ ఇది. మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ సంస్థ దీనిని తయారుచేసింది. ఫ్రాన్స్ నుంచి బదిలీచేసిన సాంకేతికతను ఇందులో వినియోగించారు. 11 నెలలపాటు సముద్రంలో పలు రకాల ప్రయోగ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాక సోమవారం నేవీలోకి తీసుకున్నారు. జలాంతర్గామి విశేషాలు ► ప్రపంచంలోనే అత్యత్తుమ సెన్సార్లను దీనిలో అమర్చారు. ► వైర్ ఆధారిత టోర్పెడోలున్నాయి. ► దీని ద్వారా సముద్ర అంతర్భాగం నుంచి క్షిపణులను సముద్రజలాల మీది లక్ష్యాలపైకి ప్రయోగించవచ్చు ► స్పెషల్ ఆపరేషన్స్‌లో మెరైన్ కమెండోలను శత్రు స్థావరాలలోకి చడీచప్పుడుకాకుండా తరలించగలదు. ► శక్తివంత డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ► శత్రు టోర్పెడోలను ఏమార్చే నూతన స్వీయ రక్షణ వ్యవస్థతో దీనిని బలోపేతం చేశారు -
భారత నౌకాదళంలోకి మరో యుద్ధనౌక.. ‘మర్ముగోవా’ జల ప్రవేశం
ముంబై: భారత నౌకాదళంలోకి మరో యుద్ధనౌక చేరింది. శత్రుదుర్భేద్యమైన మిసైల్ విధ్వంసక యుద్ధనౌక ‘మర్ముగోవా’ జలప్రవేశం చేసింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఐఎన్ఎస్ మర్ముగోవాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రితో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిల్లయి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘ఈరోజు స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణ చరిత్రలో మరో మైలురాయిని చేరుకున్నాం. ఏడాది క్రితమే మనం సిస్టర్ షిప్ విశాకపట్నంను భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టాం. గత దశాబ్దకాలంలో యుద్ధనౌకల డిజైన్, నిర్మాణంలో ఈ విజయం గొప్ప పురోగతిని సూచిస్తుంది. ఈ నౌకలకు నగరాల పేర్లు పెట్టే సంప్రదాయాన్ని కొనసాగించాం.’ అని తెలిపారు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్. మర్ముగోవా విశేషాలు.. ► ఈ యుద్ధనౌక రెండోతరానికి చెందిన స్టీల్త్ గైడెడ్ మిసైల్ విధ్వంసక నౌక. ► ప్రాజెక్టు 15బీ కింద ఈ యుద్ధ నౌకను రూపొందించారు. గోవాలోని ప్రముఖ పోర్టు సిటీ మర్ముగోవా నగరం పేరును ఈ వార్‌షిప్‌కు పెట్టారు. ► ఈ నౌక పొడవు 163 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు కాగా.. బరువు సుమారు 7,400 టన్నులు. అత్యధికంగా 30 నాటిక్ మైళ్ల వేగంతో దూసుకెళ్తుందు. ►భారత నౌకాదళ వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 4 విశాఖపట్నం క్లాస్ విధ్వంసక నౌకల్లో ఇది రెండోది. దీనిని మజాగాన్ డాక్ నౌకానిర్మాణ సంస్థ నిర్మించింది. ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ -
రిమ్ ఆఫ్ ద పసిఫిక్ ఎక్సర్‌సైజ్‌కి ఐఎన్ఎస్ సాత్పురా
మల్కాపురం (విశాఖ పశ్చిమ): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రిమ్ ఆఫ్ ద పసిఫిక్ ఎక్సర్సైజ్ 2022లో పాల్గొనడానికి ఐఎన్ఎస్ సాత్పురా ఈ నెల 27న హవాయి దీవులకు చేరుకుంది. ఈ నౌక విన్యాసాలు ఆరు వారాల పాటు నిర్వహిస్తారు. వివిధ దేశాల మధ్య స్నేహ సంబంధాలను, నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచడానికి నావికా సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడుతుంది. ఇందులో 27 దేశాలు పాల్గొంటున్నాయి. భారత్ నుంచి పాల్గొంటున్న ఐఎన్ఎస్ సత్పురా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడింది. ఇది 6 వేల టన్నుల మిసైల్‌కు మార్గదర్శకత్వం వహిస్తుంది. ఇది భూమిపైనా, గగనతలంలో, నీటిలో కూడా పనిచేస్తుంది. ఇది విశాఖ కేంద్రంగా తన సేవలను అందిస్తోంది. దీనిని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ విన్యాసాలకు పంపుతున్నారు. -
శత్రువులకు సింహస్వప్నం.. సైలెంట్ కిల్లర్ 'వాగ్షీర్'.. ప్రత్యేకతలివే..
సాక్షి, విశాఖపట్నం: సముద్రం లోతుల్లో ప్రయాణిస్తూ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడే జలాంతర్గామి. దాని పేరు ఐఎన్ఎస్ వాగ్షీర్. నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందా.. అని శత్రువు సైతం ఆశ్చర్యపోయేలా చేసే సైలెంట్ కిల్లర్. ప్రాజెక్టు–75లో భాగంగా తయారైన చిట్టచివరి సబ్‌మెరైన్ వాగ్షీర్ ఈ నెల 20న జలప్రవేశం చేయనుంది. మన దేశ సముద్ర సరిహద్దుని శత్రు దుర్బేధ్యంగా నిలిపేందుకు ముంబైలోని మజ్గావ్ డాక్‌యార్డులో పీ–75 స్కార్పెన్ ప్రాజెక్ట్ కింద నిర్మితమైన అల్ట్రామోడ్రన్ సబ్‌మెరైన్ (ఆరో జలాంతర్గామి)గా.. చిట్టచివరిదిగా ‘వాగ్షీర్’ రూపొందింది. ప్రాజెక్ట్–75లో భాగంగా ఇప్పటికే ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ ఖందేరి, ఐఎన్ఎస్ కరంజ్, ఐఎన్ఎస్ వేలా భారత నౌకాదళంలో ప్రవేశించగా.. ఐఎన్ఎస్ వగీర్ సీట్రయల్స్ పూర్తి చేసుకుంది. కాగా, వాగ్షీర్ జలాంతర్గామి కల్వరి తరగతికి చెందిన చిట్టచివరిది కావడం విశేషం. ఇది భారత నౌకాదళంలోకి ప్రవేశించిన తర్వాత.. తూర్పు నౌకాదళానికి కేటాయించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. సముద్రంలో మందుపాతర పేల్చగలదు ఇప్పటివరకూ ఉన్న సబ్మెరైన్లలో వాగ్‌షీర్‌ని అత్యంత భయంకరంగా, శక్తిమంతంగా తయారు చేశారు. శత్రువులను ఎదుర్కోవడానికి విభిన్న రకాల మారణాయుధాలను సబ్‌మెరైన్‌లో అమర్చారు. ఇందులో 533 మి.మీ. వైశాల్యం గల 6 టార్పెడో ట్యూబ్‌లు ఉన్నాయి. ఏదైనా భారీ ఆపరేషన్ సమయంలో ఈ సైలెంట్ కిల్లర్ 18 టార్పెడోలు లేదా ఎస్ఎం39 యాంటీ–షిప్ క్షిపణులను మోసుకెళ్లగల సత్తా దీని సొంతం. శత్రు జలాంతర్గాములను, యుద్ధనౌకలను ధ్వంసం చేసేందుకు సముద్రంలో మందుపాతరలను పేల్చగల సామర్థ్యం కూడా దీనికున్న ప్రత్యేకత. ఏకకాలంలో దాదాపు 30 మందుపాతరలను పేల్చగలదు. సైలెంట్ కిల్లర్ వాగ్‌షీర్‌ని సైలెంట్ కిల్లర్‌గా పిలుస్తున్నారు. ఎందుకంటే.. ఇందులోని అధునాతన వ్యవస్థ శబ్దం లేకుండా సముద్రంలో దూసుకుపోతుంది. స్టెల్త్ టెక్నాలజీ కారణంగా శత్రు నౌకలు లేదా సబ్మెరైన్లు రాడార్ సాయంతో కూడా వాగ్షీర్ ఎక్కడుందో కనుక్కోలేరు. ఈ జలాంతర్గామిలో రెండు అధునాతన పెరిస్కోప్‌లను అమర్చారు. ఆధునిక నావిగేషన్, ట్రాకింగ్ సిస్టమ్‌లతో కూడిన ఈ సబ్‌మెరైన్ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా తన పని తాను చేసుకుపోగలదు. -
ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్
-
ఆర్కే బీచ్ లో మిలాన్ విన్యాసాలు తిలకించనున్న సీఎం వైఎస్ జగన్
-
INS రణ్వీర్ నౌకలో పేలుడు.. ముగ్గురు మృతి
సాక్షి, విశాఖపట్నం: ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ముంబై డాక్ యార్డ్‌లో నిలిచి ఉన్న ఐఎన్ఎస్ రణ్వీర్ యుద్ధనౌకలో మంగళవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు భారత నౌకాదళాధికారులు ధ్రువీకరించారు. మరో 11 మంది వరకూ గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్ని ముంబైలోని ఐ.ఎన్.ఎస్. అశ్విన్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఐఎన్ఎస్ రణ్వీర్లోని ఇంటర్నల్ కంపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఘటన జరగ్గానే నౌకలోని ఇతర సిబ్బంది తక్షణమే స్పందించి.. పరిస్థితులను చక్కదిద్దడంతో పెను ప్రమాదం తప్పింది. అదేవిధంగా నౌకలో కీలక మెటీరియల్ ఏమీ దెబ్బతినలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే మృతి చెందిన సెయిలర్స్ వివరాల్ని నౌకాదళం ఇంకా వెల్లడించలేదు. ఈ పేలుడు ప్రమాదవశాత్తూ సంభవించిందేనని ప్రాథమికంగా నిర్ధారించిన నేవీ అధికారులు.. ప్రమాదానికి కారణాలను సమగ్రంగా అన్వేషించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా రణ్వీర్ సేవలు ఐఎన్ఎస్ రణ్వీర్ విశాఖ కేంద్రంగా తూర్పు నౌకాదళంలో సేవలందిస్తోంది. 1986 అక్టోబర్ లో భారత నౌకాదళంలో చేరిన రణ్వీర్ యుద్ధనౌక సోవియట్ యూనియన్‌లో నిర్మితమైంది. 35 మంది అధికారులు సహా మొత్తం 320 మంది సిబ్బంది ఈ నౌకలో విధులు నిర్వర్తిస్తుంటారు. రాజ్‌పుత్ క్లాస్ డిస్ట్రాయర్గా విధుల్లో చేరిన ఈ యుద్ధనౌక గంటకు 35 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకెళ్తుంది. దీనిపై పలు రకాల మిసైల్స్‌ను అమర్చారు. సముద్ర జలాల్లో గస్తీ కాయడం, సముద్ర దొంగలను, ఉగ్రవాదులను అడ్డుకోవడం, నావికా దౌత్యం, జలమార్గ కమ్యూనికేషన్స్ పర్యవేక్షణ తదితర కార్యక్రమాలను ఈ నౌక నిర్వహిస్తోంది. 2008లో శ్రీలంకలో జరిగిన 15వ సార్క్ దేశాల సదస్సులో పాల్గొన్న ప్రధాని భద్రత వ్యవహారాల్లోనూ, సింగపూర్, ఇండోనేషియా దేశాల ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొని ఇరుదేశాల నౌకాదళాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో రణ్వీర్ ముఖ్య భూమిక పోషించింది. క్రాస్ కోస్ట్ ఆపరేషన్స్ కోసం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ నేతృత్వంలో రణ్వీర్ పని చేస్తోంది. వివిధ ఆపరేషన్లలో భాగంగా 2021 నవంబర్‌లో విశాఖ నుంచి బయలుదేరింది. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ బేస్ అయిన విశాఖపట్నానికి ఈ నౌక మరికొద్ది రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉండగా ఈ సమయంలో ప్రమాదం సంభవించిందని నేవీ అధికారులు చెబుతున్నారు. -
INS Khukri: రక్షణ సేవలో 32 ఏళ్లు.. 30 సార్లు ప్రపంచాన్ని చుట్టి..
సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి క్షిపణి సామర్థ్య యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రి సేవల నుంచి నిష్క్రమించింది. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ యుద్ధనౌక శత్రు నౌక ఎటువంటిది, ఏ దేశానికి చెందినది అనేది లెక్క చెయ్యకుండా మిసైల్ దాడులతో ధ్వంసం చేయగలదు. మజ్గావ్ డాక్లో తయారైన ఐఎన్ఎస్ ఖుక్రి 1989లో భారత నౌకాదళంలో చేరింది. 32 ఏళ్లపాటు భారత రక్షణలో పాలుపంచుకున్న ఖుక్రి వీడ్కోలు కార్యక్రమాన్ని విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. తూర్పు నౌకా దళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూర్యాస్తమయం సమయంలో ఖుక్రి నౌకపై ఉన్న జాతీయ జెండా, నౌకాదళ పతాకాన్ని అవనతం చేసి, డీకమిషనింగ్ పెనెంట్‌ని కిందికి దించారు. అనంతరం ఖుక్రీలో పని చేసి రిటైర్ అయిన కమాండింగ్ అధికారుల్ని వైస్ అడ్మిరల్ బిస్వజిత్ అభినందించారు. ఈ వేడుకల్లో ఇండియన్ ఆర్మీ గూర్ఖా బ్రిగేడ్ లెఫ్టినెంట్ జనరల్ పీఎన్ అనంతనారాయణ్ తదితరులు పాల్గొన్నారు. దేశీయంగా నిర్మించిన తొలి క్షిపణి కార్వెట్టి ఐఎన్ఎస్ ఖుక్రీ సేవలు ఉపసంహరించినట్లు కేంద్ర రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సాహసానికి ప్రతీక ఖుక్రి అంటే సాహసోపేతం అని అర్థం. 1971లో పాక్‌తో జరిగిన యుద్ధ సమయంలో శత్రువుల్ని మట్టికరిపించేందుకు భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రి పాక్ సముద్రజలాల వైపు దూసుకెళ్లింది. అయితే.. సబ్‌మెరైన్ పీఎన్ఎస్ హన్‌గోర్‌లో పొంచి ఉన్న పాక్ సైనికులు డయ్యు సమీపంలో ఖుక్రీని టార్పెడోలతో ధ్వంసం చేశారు. ఖుక్రీతో పాటు ఆ నౌకలోని 18 మంది అధికారులు, 176 మంది సిబ్బంది జలసమాధి అయ్యారు. ఖుక్రి కమాండింగ్ అధికారి కెప్టెన్ మహింద్రనా«ధ్ ముల్లా తన లైఫ్ జాకెట్‌ని జూనియర్ ఆఫీసర్‌కి ఇచ్చి రక్షించి.. తాను ప్రాణాలు వదిలారు. ఖుక్రిని నాశనం చేసిన 48 గంటల్లోనే కరాచీ రేవుని భారత రక్షణ దళం స్వాధీనం చేసుకొని పాక్‌పై విజయం సాధించింది. భారత రక్షణ శాఖలో తిరుగులేని పోరాట స్ఫూర్తి రగిలించిన ఖుక్రి పేరుతో ఈ నౌకని నిర్మించారు. 1989 ఆగస్టు 23న పాత ఖుక్రి నౌకలో అసువులు బాసిన కెప్టెన్ మహింద్రనాధ్ ముల్లా సతీమణి సుధా ముల్లా దీనిని జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి తూర్పు, పశ్చిమ నౌకాదళాల్లో సేవలందించింది. కీలకమైన ఆపరేషన్లు నిర్వహించింది. ఇప్పటివరకూ ఖుక్రిలో 28 మంది కమాండింగ్ ఆఫీసర్లు విధులు నిర్వర్తించారు. మొత్తం 6,44,897 నాటికల్ మైళ్లు ప్రయాణించింది. ఈ దూరం 30 సార్లు ప్రపంచాన్ని చుట్టొచ్చినంత. భూమికి, చంద్రునికి మధ్య ఉన్న దూరానికి మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఐఎన్ఎస్ ఖుక్రి విశేషాలివీ.. పొడవు 91.1 మీటర్లు బీమ్ 10.5 మీటర్లు డ్రాట్ 4.5 మీటర్లు బరువు 1,350 టన్నులు వేగం గంటకు 25 నాటికల్ మైళ్లు సామర్థ్యం 16 నాటికల్ మైళ్ల వేగంతో ఏకధాటిగా 7,400 కిమీ దూరం ప్రయాణించగలదు ఆయుధాలు పీ–20ఎం యాంటీషిప్ మిసైల్స్– 4, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్– 2, ఏకే–176 గన్ ఒకటి, ఏకే–630 గన్స్ 2 ఎయిర్‌క్రాఫ్ట్ హల్ ధ్రువ్ హెలికాఫ్టర్– 1 -
నావికాదళంలోకి ఐఎన్ఎస్ వేలా
ముంబై: భారతా నావికాదళం మరింత శక్తిమంతమయ్యేలా మరో అస్త్రం వచ్చి చేరింది. ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి గురువారం నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ చేతుల మీదుగా ముంబై తీరంలో జలప్రవేశం చేసింది. ప్రాజెక్టు 75లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ జలాంతర్గామిని తయారు చేశారు. 2005లో భారత్, ఫ్రాన్స్ 375 కోట్ల డాలర్లతో ఆరు స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాముల్ని తయారు చేయాలని ఒప్పందం కుదిరింది. అందులో ఇది నాలుగవది. ఈ సందర్భంగా కరమ్‌బీర్ సింగ్ మాట్లాడుతూ ఐఎన్ఎస్ వేలా అత్యంత సమర్థవంతమైనదని, జలంతార్గాముల ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లో భద్రతాపరమైన సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో ఐఎన్ఎస్ వేలాకి భారత నావికాదళ ప్రయోజనాలను పరిరక్షించే సత్తా ఉందని అన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్ఎస్, భారత్‌కు చెందిన మాజ్‌గావ్ డాక్స్ లిమిటెడ్ కంపెనీలు ఈ జలాంతర్గామి తయారీలో భాగస్వామ్యులుగా ఉన్నాయి. అయితే ఫ్రాన్స్ సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులో జాప్యం చేయడంతో ఈ ప్రాజెక్టులు ఆలస్యమవుతూ వచ్చాయి. 2017లో ఐఎన్ఎస్ కల్వారి అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ కరాంజ్‌లు కూడా విధుల్లో చేరాయి. అయితే కరోనా కారణంగా ఐఎన్ఎస్ వేలా మరింత ఆలస్యమైంది. 1973 నుంచి 2010 వరకు నావికాదళంలో సేవలు అందించిన ఒకప్పటి జలాంతర్గామి వేలా పేరునే దీనికీ పెట్టారు. సోవియెట్ రష్యా తయారు చేసిన ఆ సబ్‌మెరైన్ మన దేశం నిర్వహించిన ఎన్నో కీలక ఆపరేషన్లలో పాల్గొంది. నేవీలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన వేలాని 2010లో నావికాదళం నుంచి విరమించారు. పాక్‌కు చైనా ఎగుమతులు చైనా నుంచి పాకిస్తాన్‌కు మిలటరీ హార్డ్‌వేర్ ఎగుమతులు అధికమయ్యాయని, ఇది అంతిమంగా భారత్ భద్రతకు ముప్పు కలిగిస్తుందని నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. నౌకలు, జలాంతర్గాముల ఎగుమతులు పెరిగాయని, అన్నింటికి భారత్ సిద్ధంగా ఉండాలన్నారు. ప్రత్యేకతలు.. ► వేలా సబ్‌మెరైన్ 67.5 మీటర్లు పొడవు, 12.3 మీటర్ల ఎత్తు, 6.2 మీటర్ల వెడల్పు ఉంటుంది. ► ఈ జలాంతర్గామి నీట మునిగినప్పుడు 20 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. ► ఐఎన్ఎస్ వేలా సీ303 యాంటీ టార్పెడో కౌంటర్మెజర్ వ్యవస్థ కలిగి ఉంది. ఈ సబ్‌మెరైన్‌లో 18 టార్పెడోలను, లేదంటే యాంటీ షిప్ క్షిపణుల్ని అత్యంత సమర్థవంతంగా ప్రయోగించగలదు. ► ఎనిమిది మంది అధికారులు, 35 మంది సిబ్బందిని మోసుకుపోగలిగే సామర్థ్యం కలిగి ఉంది. ► స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన వేలాలో తొలిసారిగా బ్యాటరీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. డీజిల్, ఎలక్ట్రిక్ శక్తితో ఇంజిన్లు పని చేస్తాయి. -
అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు వక్ర భాష్యాలా?
ముంబై: భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డ్రాగన్ దేశం చైనాపై మరోసారి పరోక్షంగా నిప్పులు చెరిగారు. కొన్ని బాధ్యతారాహిత్యమైన దేశాలు సంకుచిత ప్రయోజనాలే లక్ష్యంగా ఆధిపత్య ధోరణితో, పక్షపాతంతో వ్యవహరిస్తున్నామని ఆరోపించారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు(యూఎన్క్లాస్) వక్ర భాష్యాలు చెబుతూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాయని విమర్శించారు. కొన్ని దేశాలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఈ చట్టాలను బలహీన పరుస్తుండడం ఆందోళనకరమని అన్నారు. దేశీయంగా నిర్మించిన క్షిపణుల విధ్వంసక వాహక నౌక ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ ఆదివారం మహారాష్ట్రలోని ముంబై తీరంలో రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా అరేబియాలో సముద్రంలో జల ప్రవేశం చేసింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన భారత్ బాధ్యతాయుతంగా పనిచేస్తోందని, అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలను గౌరవిస్తోందని చెప్పారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని తాము కోరుకుంటున్నట్లు గుర్తుచేశారు. ఇక్కడ అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలకు రక్షణ లభించాలన్నదే తమ ఆకాంక్ష అని వివరించారు. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో దేశాల స్థిరత్వం, ఆర్థిక పురోగతి, ప్రపంచాభివృద్ధి కోసం నిబంధనలతో కూడిన స్వేచ్ఛాయుత నౌకాయానం, సముద్ర మార్గాల రక్షణ చాలా అవసరమని వివరించారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు సొంత భాష్యాలు చెబుతూ ఉల్లంఘిస్తుండడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇలాంటివి స్వేచ్ఛాయుత నౌకాయానికి అడ్డంకులు సృష్టిస్తాయని చెప్పారు. భారత నావికాదళం పాత్ర కీలకం ఇండో–పసిఫిక్ ప్రాంతం కేవలం ఇక్కడి దేశాలకే కాదు, మొత్తం ప్రపంచానికి చాలా కీలకమని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. ఈ ప్రాంత భద్రత విషయంలో భారత నావికాదళం తనవంతు కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారతదేశ ప్రయోజనాలు హిందూ మహాసముద్రంతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నాయని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇండో–పసిఫిక్ ప్రాంతం ఒక ఆయువు పట్టు అని ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు సైనిక సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటున్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. ఆయుధాలు, సైనిక రక్షణ పరికరాలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రక్షణ ఖర్చు 2.1 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని తెలిపారు. రక్షణ రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశీయ పరిజ్ఞానంతో నౌకల నిర్మాణంలో భారత్‌ను కేంద్ర స్థానంగా మార్చాలన్నారు. శత్రువుల పాలిట సింహస్వప్నం ఐఎన్ఎస్ విశాఖపట్నం.. హిందూ మహా సముద్ర ప్రాంత రక్షణలో కీలకంగా మారనుంది. సముద్ర ఉపరితలం నుంచి సముద్ర ఉపరితలానికి, సముద్ర ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను మోసుకెళ్లనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖపట్నం శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. బరువు: 7,400 టన్నులు పొడవు: 163 మీటర్లు వెడల్పు: 17.4 మీటర్లు వేగం: గంటకు 30 నాటికల్ మైళ్లు పరిధి: ఏకధాటిగా 4,000 నాటికల్ మైళ్లు ప్రయాణం చేయగలదు ఆయుధాలు: 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ ర్యాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్లు నాలుగు, రెండు జలాంతర్గామి విధ్వంసక రాకెట్ లాంచర్లు, కాంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్, రాకెట్ లాంచర్, అటోమేటెడ్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్. – సాక్షి, విశాఖపట్నం -
విశాఖ.. ఓ యుద్ధనౌక
సుందర నగరం.. సిటీ ఆఫ్ డెస్టినీగా ప్రపంచం చూపు తన వైపు తిప్పుకుంటున్న విశాఖపట్నం పేరుని ఓ యుద్ధ నౌకకు పెట్టడం గర్వించదగ్గ విషయం. ఈ నెల 21న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేయనున్న ఐఎన్ఎస్ విశాఖపట్నం.. హిందూ మహా సముద్ర ప్రాంత రక్షణలో కీలకంగా మారనుంది. క్షిపణులను తీసుకెళ్లడమే కాకుండా.. మిస్సైల్ డిస్ట్రాయర్గా సత్తా చాటగల సామర్థ్యం విశాఖపట్నం యుద్ధ నౌక సొంతం. ఈ యుద్ధ నౌకతో పాటు సంధ్యక్ షిప్‌ని కూడా డిసెంబర్లో జాతికి అంకితం చేసేందుకు నౌకాదళం సన్నద్ధమవుతోంది. సాక్షి, విశాఖపట్నం: సహజ సిద్ధమైన భౌగోళిక రక్షణతో పాటు శత్రుదేశాలకు సుదూర కేంద్రంగా.. తూర్పు తీరంలో వ్యూహాత్మక రక్షణ ప్రాంతంగా.. విశాఖపట్నం కీలకంగా మారింది. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ని ఓడించి.. జాతి గర్వించదగ్గ గెలుపునందించిన విశాఖ పేరు వింటే.. తెలుగు ప్రజల గుండె ఉప్పొంగుతుంది. మరి సముద్ర రక్షణలో శత్రువులను సమర్థంగా ఎదుర్కొనే యుద్ధ నౌకని విశాఖపట్నం పేరుతో పిలిచే రోజు సమీపించింది. భారత నౌకాదళం ఐఎన్ఎస్ విశాఖపట్నం పేరుతో భారీ యుద్ధ నౌకని సిద్ధం చేసింది. ఈ నెల 21న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ముంబైలో జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం తూర్పు నౌకాదళం కేంద్రంగా ఐఎన్ఎస్ విశాఖపట్నం సేవలందించనుంది. ప్రాజెక్టు–15బీలో మొదటి యుద్ధ నౌక ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్–15బీ పేరుతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలు విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లు పెట్టాలని నిర్ణయించింది. తొలి షిప్‌ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు. 2011 జనవరి 28న ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. 2013 అక్టోబర్‌లో షిప్ తయారీ పనులను వై–12704 పేరుతో ముంబైలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్(ఎండీఎల్) ప్రారంభించింది. ఇది సముద్ర ఉపరితలంపైనే ఉంటుంది.. కానీ ఎక్కడి శత్రువుకి సంబంధించిన లక్ష్యాన్నైనా ఛేదించి మట్టుబెట్టగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖ శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. సముద్ర జలాల్లోకి సంధాయక్ సాగర గర్భాన్ని శోధిస్తూ భారత భూభాగాన్ని పరిరక్షిస్తూ.. తిరుగులేని శక్తిగా సేవలందించేందుకు మరో నౌక సన్నద్ధమవుతోంది. 1981 నుంచి దేశ రక్షణలో ముఖ్య భూమిక పోషిస్తూ అనేక కీలక ఆపరేషన్లలో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని.. ఈ ఏడాది జూన్‌లో సేవల నుంచి ఐఎన్ఎస్ సంధాయక్ నిష్క్రమించింది. దాని స్థానంలో హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్(లార్జ్) సంధాయక్‌ని నిర్మిస్తున్నారు.ఈ నౌక నిర్మాణానికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖకు, కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్(జీఆర్ఎస్ఈ) మధ్య ఒప్పందం జరిగింది. హల్ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో డిసెంబర్లో తొలిసారిగా సముద్ర జలాల్లోకి రానుంది. అనంతరం.. బేస్ ట్రయల్స్, సీ ట్రయల్స్ పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న సంధాయక్ షిప్‌ల కంటే.. ఇది అతి పెద్ద సర్వే నౌకగా అవతరించబోతోంది. సముద్రలోతుల్ని, కాలుష్యాన్ని సర్వే చేయడంలో సంధాయక్ ప్రపంచంలోనే మేటి షిప్‌గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతోంది. ఇందులో కొత్త సాంకేతికతతో కూడిన హైడ్రోగ్రాఫిక్ పరికరాలు అమర్చారు. హిందూ మహా సముద్రంలోని భౌగోళిక డేటాని సేకరించేందుకు తొలిసారిగా దీన్ని వినియోగించనున్నారు. నౌకాదళానికి కొత్తబలం హిందూ మహా సముద్ర ప్రాంతంలో మారుతున్న పవర్ డైనమిక్స్‌కి అనుగుణంగా విధులు నిర్వర్తించేలా ఐఎన్ఎస్ విశాఖ సత్తా చాటనుంది. ఈ యుద్ధ నౌక తూర్పు నౌకాదళ బలాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా డిజిటల్ సర్వే కచ్చితత్వ ప్రమాణాల్ని పసిగట్టేవిధంగా సంధాయక్ కూడా త్వరలోనే కమిషనింగ్‌కు సిద్ధమవుతోంది. డిజిటల్ సర్వే అండ్ ప్రాసెసింగ్ సిస్టమ్, ఆటోమేటెడ్ డేటా లాగిన్ సిస్టమ్, ఓషినోగ్రాఫిక్ సెన్సార్లు, సీ గ్రావి మీటర్, సైడ్ స్కాన్ సోనార్లు, మల్టీబీమ్ స్వాత్ ఎకో సౌండింగ్ సిస్టమ్‌లతో గతంలో ఉన్న సర్వే నౌకలకు భిన్నంగా ఇది రూపుదిద్దుకుంటోంది. – వైస్ అడ్మిరల్ అజేంద్ర బహద్దూర్ సింగ్, తూర్పు నౌకాదళాధిపతి ► సిబ్బంది– 50 మంది అధికారులు, 250 మంది సిబ్బంది ► సెన్సార్స్, ప్రాసెసింగ్ వ్యవస్థలు– మల్టీ ఫంక్షన్ రాడార్, ఎయిర్ సెర్చ్ రాడార్ ► విమానాలు– రెండు వెస్ట్‌ల్యాండ్ సీ కింగ్ విమానాలు లేదా రెండు హెచ్ఏఎల్ ధృవ్ విమానాలు తీసుకెళ్లగలదు ► ఆయుధాలు– 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు -
Warship: ఐఎన్ఎస్ విశాఖపట్నం.. ఆ పేరెందుకు పెట్టారంటే..
సాక్షి, విశాఖపట్నం: పాకిస్తాన్ పీచమణిచి.. 1971 యుద్ధంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడిన చిరస్మరణీయ విజయానికి విశాఖ కీలక వేదికగా నిలిచింది. భారత జాతి గర్వించదగ్గ గెలుపును అందించిన విశాఖ పేరు వింటేనే ఉత్తరాంధ్ర వాసులకే కాదు.. యావత్ తెలుగు ప్రజల గుండె ఉప్పొంగుతుంది. అలాంటిది.. సముద్ర రక్షణలో శత్రువుల్ని సమర్థంగా ఎదుర్కొనే యుద్ధ నౌకకు విశాఖపట్నం పేరు పెడితే ఆ ఆనందం సాగరమంత అవుతుంది. అందుకే.. నౌకాదళ అధికారులు ఐఎన్ఎస్ విశాఖపట్నం పేరుతో భారీ యుద్ధ నౌకను సిద్ధం చేశారు. త్వరలోనే దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఆ ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక విశేషాలివీ. (చదవండి: పసిడికి పెట్టింది పేరు.. నరసాపురం గోల్డ్ మార్కెట్) విశాఖపట్నం పేరెందుకు పెట్టారంటే.. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్–15బీ పేరుతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిౖసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లను పెట్టాలని సంకల్పించి తొలి షిప్‌ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు. చదవండి: పర్యాటకానికి 'జల'సత్వం ముంబైలో తయారీ 2011 జనవరి 28న ఈ ప్రాజెక్ట్ ఒప్పందం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్, ఇండియన్ నేవీకి చెందిన అంతర్గత డిజైన్ సంస్థలు షిప్ డిజైన్లని సిద్ధం చేశాయి. 2013 అక్టోబర్‌లో విశాఖపట్నం యుద్ధనౌక షిప్ తయారీకి వై–12704 పేరుతో ముంబైలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్ (ఎండీఎల్) శ్రీకారం చుట్టింది. 2015 నాటికి హల్‌తో పాటు ఇతర కీలక భాగాలు పూర్తి చేసింది. తయారు చేసే సమయంలో పలుమార్లు ప్రమాదాలు కూడా సంభవించాయి. 2019 జూన్‌లో షిప్‌లోని ఏసీ గదిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు మరణించాడు. అయితే.. షిప్ తయారీలో మాత్రం ఎక్కువ నష్టం వాటిల్లలేదు. 2020లో రెండుసార్లు విజయవంతంగా సీ ట్రయల్స్ పూర్తి చేసిన అనంతరం తూర్పు నౌకాదళానికి ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను అక్టోబర్ 28న అప్పగించారు. డిసెంబర్లో దీనిని జాతికి అంకితం చేయనున్నారు. శత్రువుల పాలిట సింహస్వప్నమే ఇది సముద్ర ఉపరితలంపైనే ఉన్నా.. ఎక్కడ శత్రువుకు సంబంధించిన లక్ష్యాన్నైనా ఛేదించి మట్టుబెట్టగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖను శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. యుద్ధ నౌక విశేషాలివీ.. బరువు 7,400 టన్నులు పొడవు 163 మీటర్లు బీమ్ 17.4 మీటర్లు డ్రాఫ్ట్ 5.4 మీటర్లు వేగం గంటకు 30 నాటికల్ మైళ్లు స్వదేశీ పరిజ్ఞానం - 75 శాతం పరిధి - ఏకధాటిన 4 వేల నాటికల్ మైళ్ల ప్రయాణం సెన్సార్స్ ,ప్రాసెసింగ్ వ్యవస్థలు- మల్టీ ఫంక్షన్ రాడార్, ఎయిర్ సెర్చ్ రాడార్ ఆయుధాలు: 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు విమానాలు: రెండు వెస్ట్‌ల్యాండ్ సీ కింగ్ విమానాలు లేదు రెండు హెచ్ఏఎల్ ధృవ్ విమానాల్ని తీసుకెళ్లగలదు -
గూఢచారి ‘ధ్రువ్’ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలివే..
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. అధునాతన సాంకేతికతతో రూపొందించిన గూఢచారి నౌక ఐఎన్ఎస్ ధ్రువ్‌ను ఈ నెల 10న జాతికి అంకితం చేయనున్నట్లు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ప్రకటించారు. విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డులో ఈ నౌకని రూపొందించారు. 2015లో నౌక నిర్మాణం ప్రారంభించగా 2020 అక్టోబర్‌లో పూర్తయింది. మొత్తం రూ.1,500 కోట్లతో ధ్రువ్ నిర్మితమైంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) శాస్త్రవేత్తలు, ఇండియన్ నేవీ ఇంజనీర్లు, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) శాస్త్రవేత్తలు, హిందుస్థాన్ షిప్‌యార్డు (హెచ్ఎస్ఎల్) నిపుణులు ఈ నౌక నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. శత్రు క్షిపణుల్ని సమర్థవంతంగా గుర్తించగల సామర్థ్యంతోపాటు అనేక ప్రత్యేకతలు ఈ నౌకకు ఉన్నాయి. శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్లతో పాటు ఇతర భూభాగాల నుంచి క్షిపణులను ప్రయోగిస్తే వాటిని ధ్రువ్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. అంతేకాకుండా మనకు నష్టం జరగకుండా శత్రు క్షిపణులను ఏ ప్రాంతంలో ధ్వంసం చేయాలన్న విస్తృత సమాచారాన్ని సైతం అందించగల సామర్థ్యం ధ్రువ్ సొంతం. సాధారణ మిసైల్స్‌తో పాటు న్యూక్లియర్ మిసైల్స్ జాడల్ని కూడా ఇది సులభంగా గుర్తిస్తుంది. ధ్రువ్ నౌక మరిన్ని ప్రత్యేకతలివే.. ►దేశాన్ని మొత్తం నిశిత పరిశీలన చేసే శాటిలైట్ మానిటర్లను ఇందులో ఏర్పాటు చేశారు. ►ఈ నౌక రాకతో అత్యాధునిక అధునాతన సముద్ర నిఘా వ్యవస్థలున్న పీ–5 దేశాల సరసన భారత్ చేరింది. ►ఇందులో సెన్సార్లతో కూడిన త్రీ డోమ్ షేప్డ్ సర్వైలెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఎరే రాడార్స్ టెక్నాలజీని వాడారు. ►అందుకే భారత నౌకాదళం ఐఎన్ఎస్ ధ్రువ్‌ని ‘ఈసీజీ ఆఫ్ ఇండియన్ ఓషన్’ అని పిలుస్తోంది. ►అంతేకాకుండా.. దీని ద్వారా 14 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. సాగరతీరంలో విజయ జ్వాల బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): పాక్‌తో 1971లో జరిగిన యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వార్షికోత్సవం స్వర్ణిమ్ విజయ్ వర్ష్‌లో భాగంగా వెలిగించిన విక్టరీ ఫ్లేమ్ శుక్రవారం ఈఎన్సీకి చేరుకుంది. ఈ విక్టరీ ఫ్లేమ్‌ను అధికారికంగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, ఈఎన్సీ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ తీసుకున్నారు. విక్టరీ ఫ్లేమ్ రాక సందర్భంగా శుక్రవారం బీచ్‌రోడ్డులోని విక్టరీ ఎట్ సీ వద్ద వేడుకలు జరిగాయి. నేవీ సిబ్బంది నిర్వహించిన కవాతు అందర్నీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా 1971 యుద్ధంలో పాల్గొన్న వారి అనుభవాలను హోంమంత్రి తెలుసుకున్నారు. విక్టరీ ఫ్లేమ్‌ను స్వీకరిస్తున్న హోంమంత్రి సుచరిత, ఈఎన్సీ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. 1971లో విజయం సాధించి 50 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద 2020 డిసెంబర్ 16న నాలుగు విజయ జ్వాలలను వెలిగించారు. ఇవి దేశవ్యాప్తంగా ప్రయాణిస్తున్నాయి. దక్షిణ కార్డినల్ కోసం విక్టరీ ఫ్లేమ్ ఐఎన్ఎస్ సుమిత్రలో పోర్ట్ బ్లెయిర్ నుంచి విశాఖపట్నం చేరుకుంది. ఇది నగరంలోని వివిధ పాఠశాలలకు వెళ్తుంది. అనంతరం రాజమహేంద్రవరం, విజయవాడ, నల్గొండ మీదుగా హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ఏడాది డిసెంబర్ 16న ఈ నాలుగు విజయ జ్వాలలు కలుస్తాయి. ఇవీ చదవండి: వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ.. మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్