
మల్కాపురం (విశాఖ పశ్చిమ): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రిమ్ ఆఫ్ ద పసిఫిక్ ఎక్సర్‌సైజ్ 2022లో పాల్గొనడానికి ఐఎన్‌ఎస్ సాత్పురా ఈ నెల 27న హవాయి దీవులకు చేరుకుంది. ఈ నౌక విన్యాసాలు ఆరు వారాల పాటు నిర్వహిస్తారు. వివిధ దేశాల మధ్య స్నేహ సంబంధాలను, నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచడానికి నావికా సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడుతుంది.
ఇందులో 27 దేశాలు పాల్గొంటున్నాయి. భారత్ నుంచి పాల్గొంటున్న ఐఎన్‌ఎస్ సత్పురా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడింది. ఇది 6 వేల టన్నుల మిసైల్‌కు మార్గదర్శకత్వం వహిస్తుంది. ఇది భూమిపైనా, గగనతలంలో, నీటిలో కూడా పనిచేస్తుంది. ఇది విశాఖ కేంద్రంగా తన సేవలను అందిస్తోంది. దీనిని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ విన్యాసాలకు పంపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment