‘బ్రహ్మపుత్ర’లో భారీ అగ్ని ప్రమాదం | INS Brahmaputra Severely Damaged In Fire At Mumbai Dockyard, Sailor Missing | Sakshi
Sakshi News home page

‘బ్రహ్మపుత్ర’లో భారీ అగ్ని ప్రమాదం

Published Tue, Jul 23 2024 6:32 AM | Last Updated on Tue, Jul 23 2024 10:47 AM

INS Brahmaputra severely damaged in fire at Mumbai dockyard

పూర్తిగా పక్కకు ఒరిగిపోయిన యుద్ధ నౌక 

ముంబై/న్యూఢిల్లీ: ముంబై డాక్‌ యార్డులో మరమ్మతుల కోసం ఉన్న ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్ర నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనతో యుద్ధ నౌక పూర్తిగా ఒక పక్కకు ఒరిగిపోగా ఒక నావికుడు గల్లంతయ్యారని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబై డాక్‌యార్డులో రీఫిట్‌ పనులు జరుగుతున్న మలీ్టరోల్‌ ఫ్రిగేట్‌ ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని నేవీ తెలిపింది. 

సోమవారం ఉదయం కల్లా మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చామని వివరించింది. అయితే, మధ్యాహ్నం నుంచి యుద్ధ నౌక పక్కకు ఒరిగిపోవడం మొదలైందని, నిటారుగా సరైన స్థితిలో ఉంచేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వివరించింది. ప్రస్తుతం బ్రహ్మపుత్ర పూర్తిగా పక్కకు ఒరిగి ఉందని తెలిపింది. ప్రమాదంపై విచారణ జరుగుతోందని, గల్లంతైన ఒక జూనియర్‌ నావికుడి కోసం గాలింపు చేపట్టామని తెలిపింది. దేశీయంగా మొదటిసారిగా రూపొందిన బ్రహ్మపుత్ర క్లాస్‌కు చెందిన గైడెడ్‌ మిస్సైల్‌ ఫ్రిగేట్‌ ఇది. 2000 ఏప్రిల్‌ నుంచి విధుల్లో ఉన్న ఈ షిప్‌పై 40 మంది అధికారులు, 330 మంది నావికులు విధుల్లో ఉంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement