Brahmaputra
-
‘బ్రహ్మపుత్ర’లో భారీ అగ్ని ప్రమాదం
ముంబై/న్యూఢిల్లీ: ముంబై డాక్ యార్డులో మరమ్మతుల కోసం ఉన్న ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనతో యుద్ధ నౌక పూర్తిగా ఒక పక్కకు ఒరిగిపోగా ఒక నావికుడు గల్లంతయ్యారని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబై డాక్‌యార్డులో రీఫిట్ పనులు జరుగుతున్న మలీ్టరోల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని నేవీ తెలిపింది. సోమవారం ఉదయం కల్లా మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చామని వివరించింది. అయితే, మధ్యాహ్నం నుంచి యుద్ధ నౌక పక్కకు ఒరిగిపోవడం మొదలైందని, నిటారుగా సరైన స్థితిలో ఉంచేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వివరించింది. ప్రస్తుతం బ్రహ్మపుత్ర పూర్తిగా పక్కకు ఒరిగి ఉందని తెలిపింది. ప్రమాదంపై విచారణ జరుగుతోందని, గల్లంతైన ఒక జూనియర్ నావికుడి కోసం గాలింపు చేపట్టామని తెలిపింది. దేశీయంగా మొదటిసారిగా రూపొందిన బ్రహ్మపుత్ర క్లాస్‌కు చెందిన గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ఇది. 2000 ఏప్రిల్ నుంచి విధుల్లో ఉన్న ఈ షిప్‌పై 40 మంది అధికారులు, 330 మంది నావికులు విధుల్లో ఉంటారు. -
ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్ని ప్రమాదం.. నావికుడు గల్లంతు
ముంబై: భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర యుద్ధనౌకలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని నౌకదళం డాక్‌యార్డ్‌లో మరమత్తుల కోసం నిలిపినన సమయంలో ఆదివారం సాయంత్రం ఈ యుద్ధనౌకలో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నావికాదళంలోని ఓ జూనియర్ నావికుడు గల్లంతైనట్లు.. అతని కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యులు చేపట్టినట్లు పేర్కొన్నారు.మిగతా సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు నావికాదళం తెలిపింది. ప్రమాదంతో యుద్ధనౌక ఓవైపు ఒరిగిపోయిందని పేర్కొంది. ‘ముంబయిలోని నౌకాదళ డాక్‌యార్టులో ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రకు మరమ్మతులు నిర్వహిస్తుండగా ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక బృందాలు సోమవారం ఉదయం నాటికి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి’ అని తెలిపింది.అయితే సోమవారం మధ్యాహ్నం నాటికి ఓడ ఓవైపుకు ఒరిగిపోయిందని.. దాన్ని పూర్వస్థితికి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదని పేర్కొంది. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది. -
‘సూపర్’ డ్యామ్ నిర్మాణంలో వెనక్కి తగ్గని చైనా? భారత్‌ను కలవరపెడుతున్న తాజా నివేదికలు!
టిబెట్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు (ఎల్‌ఎసి) సమీపంలో గల యార్లంగ్-త్సాంగ్పో నది (భారతదేశంలో దీనిని బ్రహ్మపుత్ర అని పిలుస్తారు) దిగువ ప్రాంతాలపై ‘సూపర్’ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా తన ప్రణాళికలను కొనసాగిస్తున్నదంటూ మరోమారు నివేదికలు వెలువడ్డాయి. భారత సైనిక స్థావరాల సరిహద్దుకు దగ్గరగా.. ప్రముఖ భౌగోళికరాజకీయ నిపుణుడు బ్రహ్మ చెల్లానీ నిక్కీ ఇటీవల..చైనా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను రహస్యంగా నిర్మించడం సాధ్యం కాదని అన్నారు. కాగా చైనా రూపకల్పనలోని ఈ మెగా ప్రాజెక్ట్ 60 గిగావాట్ల సామర్థ్యం కలిగి భారత సైనిక స్థావరాల సరిహద్దుకు దగ్గరగా ఉంది. కాగా చైనా చేపడుతున్న ఈ ఆనకట్ట నిర్మాణ కార్యకలాపాల నివేదికలు మీడియాలో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఈ ప్రాజెక్టుల స్థాయిని, భౌగోళిక పరిధిని చైనా ఎప్పుడూ వెల్లడించనందున అవి రహస్యంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద నదిపై.. బ్రహ్మపుత్ర నది కైలాష్ పర్వతం సమీపంలోని అంగ్సీ హిమానీనదంపై ఉద్భవించింది. 3,969-కిలోమీటర్ల పరిధి కలిగివుంది. దీని ఉపనది యార్లంగ్-త్సాంగ్పో వైవిధ్యమైన వాతావరణ, జలసంబంధమైన మండలాలను కలిగి ఉన్న ఒక ప్రధాన నదీ వ్యవస్థగా అలరారుతోంది. ఇది టిబెట్ అటానమస్ రీజియన్ (టీఏఆర్) నుంచి విభిన్న ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. యార్లంగ్ జాంగ్బో బ్రహ్మపుత్రగా భారతదేశంలోకి ప్రవహిస్తుంది. చివరకు బంగ్లాదేశ్‌లో డెల్టాను ఏర్పరుస్తుంది. తూర్పు దిశలో అనేక ఉపనదులను తనలో కలుపుకున్న తరువాత నది ఈశాన్యం వైపుకు మారుతుంది. హిమాలయాల తూర్పు చివర పర్వత ప్రాంతాల మధ్య పెద్ద ఇరుకైన మార్గం గుండా వెళ్లి తిరిగి చైనాను దాటుతుంది. భారత వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)కు ఇరువైపులా 5,000 మీటర్ల పరిధిలో విస్తరించి భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు లోతైన గార్జ్ (యార్లంగ్ త్సాంగ్పో గ్రాండ్ కాన్యన్) ఏర్పడుతుంది. నీటి విడుదల పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద నది (సెకనుకు 19,825 క్యూబిక్ అడుగులు). ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం.. గత రికార్డులు బద్దలు కొడుతూ.. ‘ఇది చైనీస్ జలవిద్యుత్ పరిశ్రమకు ఒక చారిత్రాత్మక అవకాశం’ యార్లంగ్-త్సాంగ్పో/బ్రహ్మపుత్ర వద్ద నది భారతదేశంలోకి ప్రవేశించే ముందు ఉన్న ప్రదేశంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని చైనా యోచిస్తోందని సమాచారం. నవంబర్ 2020లో ఆనకట్ట గురించిన నివేదికలు వెలువడినప్పుడు చైనీస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్.. ‘చైనా యార్లంగ్-త్సాంగ్పో నదిపై ఒక జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఇది ఆసియాలోని ప్రధాన జలాల్లో ఒకటి. ఇది భారతదేశం, బంగ్లాదేశ్ గుండా కూడా వెళుతుంది’ అని పేర్కొంది. కాగా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా ఛైర్మన్.. ‘చరిత్రలో దీనికి సమానమైనది లేదు. ఇది చైనీస్ జలవిద్యుత్ పరిశ్రమకు ఒక చారిత్రాత్మక అవకాశం. ఈ ఆనకట్ట 300 బిలియన్ల ఆదాయాన్ని అందించగలదని’ ప్రకటించారు. బీజింగ్ రూపొందించిన స్వచ్ఛమైన శక్తి లక్ష్యాలను చేరుకోవడంలో ఇది సహాయపడుతుందన్నారు. ఈ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన రిపోర్టులు మరోమారు చర్చల్లోకి వచ్చాయి. నీటి దోపిడీలో నిమగ్నమైన చైనా చైనా తమ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరతను నివారించేందుకు ఈ నదిని ఉత్తరం వైపు మళ్లించే అవకాశం కూడా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ఫలితంగా భారతదేశానికి పలు చిక్కులు తలెత్తనున్నాయి. పర్యావరణ సమస్యలు తలెత్తడంతోపాటు బ్రహ్మపుత్ర నీటి ప్రవాహం తగ్గుతుందని పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. చైనా పలు ప్రధాన నదుల నుండి జలవిద్యుత్ ఉత్పత్తి చేయడానికి దాదాపు 100 డ్యామ్‌ల ప్రణాళికలను కలిగి ఉందని భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు బ్రహ్మ చెల్లానీ తెలిపారు. టిబెటన్ పీఠభూమి నుండి ప్రవహించే అన్ని ప్రధాన నదులపై బహుళ డ్యామ్‌లను నిర్మింపజేస్తూ నీటి దోపిడీలో చైనా నిమగ్నమై ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా యార్లంగ్-త్సాంగ్పో నదిపై పలు ప్రాంతాల్లో చైనా చిన్న డ్యామ్‌లను నిర్మించడం ప్రారంభించింది. ఇప్పుడు అతిపెద్ద ఆనకట్టలను నిర్మించడానికి ప్రణాళికలు జరుగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అస్థిరతకు మరింత ఆజ్యం పోస్తూ.. ఈ ఏడాది జనవరిలో జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ పలు ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి, టిబెట్‌లోని మబ్జా జాంగ్బో (త్సాంగ్పో) నదిపై భారత్-నేపాలీ-చైనీస్ సరిహద్దు ట్రైజంక్షన్‌కు ఉత్తరంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో డ్యామ్ నిర్మిస్తున్నట్లు ధృవీకరించారు. ఇది ఆనకట్ట నిర్మాణ కార్యకలాపానికి సంబంధం లేనప్పటికీ, ఇది హిమాలయ సరిహద్దులోని పలు విభాగాలలో కొనసాగుతున్న అస్థిరతకు మరింత ఆజ్యం పోస్తున్నదన్నారు. యూఎన్ కన్వెన్షన్ ఆన్ నాన్-నేవిగేషనల్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాటర్‌కోర్స్ ఆధారంగా రూపొందించిన అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ నదిలో జోక్యానికి వీటో అవకాశం కల్పించలేదు. చైనా ధోరణిపై భారత్ అప్రమత్తం 2002లో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం చైనా.. యార్లంగ్-త్సాంగ్పో/బ్రహ్మపుత్ర జలసంబంధ సమాచారాన్ని మే, అక్టోబర్ మధ్య భారత్‌తో పంచుకోవాలి. తద్వారా వర్షాకాలంలో భారీ ప్రవాహం తలెత్తినప్పుడు భారతదేశం అప్రమత్తం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే 2017 డోక్లామ్ సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత చైనా నది నీటి ప్రవాహ స్థాయిలను భారత్‌తో కమ్యూనికేట్ చేయడాన్ని అకస్మాత్తుగా నిలిపివేసింది. ఈ నేపధ్యంలో చైనా ధోరణి విషయంలో భారత్ అప్రమత్తమైంది. ప్రస్తుతం యార్లంగ్-త్సాంగ్పో-బ్రహ్మపుత్ర మార్గంలో చైనా చేపడుతున్న ఆనకట్ట నిర్మాణం పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింతగా పెంచే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇది కూడా చదవండి: ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి..! -
డేంజర్లో గంగా నది..!
-
బ్రహ్మపుత్ర ‘నలుపు’పై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ : ఆకాశగంగ బ్రహ్మపుత్ర నదిలోని నీరు నలుపెక్కడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖతో చర్చించినట్లు కూడా వెల్లడించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ.. జల వనరుల శాఖతో చర్చించి బ్రహ్మపుత్ర నది నీరు నలుపు రంగులోకి మారడంపై నిజాలను తెలుసుకున్నట్లు చెప్పారు. ఇదే విషయంపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చైనా విదేశాంగ మంత్రితో చర్చించినట్లు తెలిపారు. బ్రహ్మపుత్ర నది నీరు నలుపు రంగులోకి మారడం, నీరు విష తుల్యం కావడంపై కారణాలను తెలుసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జల వనరుల శాఖను ఆదేశించిన అనంతరం విదేశాంగ శాఖలో సైతం కదలిక రావడం గమనార్హం. బ్రహ్మపుత్ర నీటిపై జరిగిన చర్చలో మోదీ, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌లు బుధవారం భేటీ అయిన విషయం తెలిసిందే. త్సాంగ్ పో(టిబెట్‌లో బ్రహ్మపుత్రను త్సాంగ్పో అని పిలుస్తారు) నది నీటి సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని మోదీ ఈ సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. బ్రహ్మపుత్ర సింహభాగం చైనాలో ఉండటంతో ఆ దేశంతో కూడా చర్చించాలని మోదీ విదేశాంగ శాఖకు సూచించారు. అంతకుముందు సియాంగ్ నది(అసోంలో బ్రహ్మపుత్రను సియాంగ్ అని పిలుస్తారు) నీటికి సంబంధించిన 15 శాంపిల్స్‌ను అసోం రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి పరీక్షల కోసం పంపింది. కాగా, నవంబర్ చివరి నుంచి బ్రహ్మపుత్ర నది నీరు నలుపు రంగులోకి మారింది. నదికి ఎగువన చైనా 1000 కిలోమీటర్ల టన్నెల్ నిర్మిస్తున్న కారణంగానే ఇలా జరుగుతోందనే రిపోర్టులు కూడా ఉన్నాయి. అయితే, ఈ రిపోర్టులను చైనా ఖండించింది. -
బ్రహ్మపుత్రపై.. చైనా దొంగబుద్ధి
బీజింగ్ : ఈశాన్యరాష్ట్రాలకు వరప్రదాయిని అయిన బ్రహ్మపుత్ర నదిని పూర్తిగా కబ్జా చేసేందుకు చైనా ప్రయత్నాలు మమ్మురం చేసింది. హిమాలయ నదుల్లో ప్రత్యేకమయిన బ్రహ్మపుత్ర నదిపై వివిధ ప్రాంతాల్లో భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను చైనా నిర్మిస్తోందని గ్లోబెల్ టైమ్స్ పత్రిక ప్రకటించింది. చైనా ప్రాజెక్టులు పూర్తి చేస్తే.. ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌లు పూర్తిగా ఎండిపోతాయని ఆ పత్రిక పేర్కొంది. ఇదిలా ఉండగా.. బ్రహ్మపుత్ర నది (దీనిని చైనాలో యార్లుంగ్ త్సాంగ్పోగా పిలుస్తారు)కి భారీ సొరంగం తవ్వి నీటని జిన్‌జాయాంగ్ ప్రాంతానికి తరలిస్తారనే పుకార్లు గత నెల్లో వచ్చాయి. అయితే వీటిని చైనా ప్రభుత్వం కొట్టిపారేసింది. అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవపట్టించేందుకు చైనా ఇటువంటి వ్యాఖ్యలు చేసిందని.. వాస్తవంగా టన్నెల్ నిర్మాణ పనుల గురించి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆ పత్రిక స్పష్టం చేసింది. కేవలం బ్రహ్మపుత్ర లక్ష్యంగా..! టిబెట్‌లో బ్రహ్మపుత్రతో పాటూ.. జిన్షా, లాన్‌శాంగ్, నుజియాంగ్ నదులు ప్రవహిస్తున్నాయి. హైడ్రోపవర్‌కు బ్రహ్మపుత్రకన్నా ఇవి అత్యుత్తమమని నిపుణులు ఇప్పటికే తేల్చారు. అయితే ఆ నదులు భారత్‌లో ప్రవహించనందున చైనా వాటిపై దృష్టి పెట్టలేదు. కేవలం దొంగబుద్ధితో బ్రహ్మపుత్ర నదిపై విరివిగా జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జాంగ్ము..! ఇప్పటికే బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించిన జాంగ్ము ప్రాజెక్టు 2014 నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రాజెక్టులో 86.6 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిలువచేయవచ్చు. ఇలాంటివి మరిన్ని టిబెట్ సరిహద్దుల్లో నిర్మించాలని చైనా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. -
ఆకాశగంగను చైనా అందకుండా చేస్తుందా?
బీజింగ్ : భారత్ - చైనాల మధ్య మరో భారీ పోరాటం ఆరంభం కాబోతోంది. నిన్నటివరకూ భారత్‌తో భూమి(డోక్లాం) కోసం పోరాడిన చైనా.. ఇక నుంచి నీటి పోరుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. షిన్జియాంగ్ చైనా భూభాగంలోని ఎడారి ప్రాంతం. ప్రస్తుతం దీన్ని చైనా సస్యశ్యామలం చేయాలనుకుంటోంది. అది పొరుగు దేశాల పొట్టకొట్టి. డ్రాగన్ కన్ను మన ‘బ్రహ్మపుత్ర’పై పడింది. చైనాలో బ్రహ్మపుత్రను యార్లుంగ్ త్సాంగ్పోగా పిలుస్తారు. వాస్తవానికి షిన్జియాంగ్ ఉన్న ప్రాంతానికి బ్రహ్మపుత్ర 1,000 కిలోమీటర్లు దూరంలో ఉంది. మరి ఎలా?. ఇందుకు చైనా పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలను ఈ దిశగా ఆలోచించి మార్గం చూపాలని కోరింది. ఒక్క నెలలోనే అదిరిపోయే ప్లాన్‌తో వచ్చారు సైంటిస్టులు. శాస్త్రవేత్తలు వేసిన ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే. షిన్జియాంగ్ నుంచి వెయ్యి కిలోమీటర్లు పాటు సొరంగం తవ్వి నీటిని తరలిద్దామనేది ఆ ప్రతిపాదన. ఈ నిర్మాణం జరిగితే ప్రపంచంలోనే అతి పెద్ద జల సొరంగంగా ప్రఖ్యాతి చెందుతుంది. సొరంగం తవ్వడానికి కావల్సిన బ్లూ ప్రింట్‌ను తయారు చేయాలని శాస్త్రవేత్తలను చైనా ఆదేశించింది. ప్రస్తుతం బ్లూప్రింట్‌ను సిద్ధం చేసే పనిలో నిమజ్ఞమయ్యారు పరిశోధకులు. అయితే ఈ ప్రాజెక్టు అంత సులువేమీ కాదు. ప్రస్తుతం ప్రపంచంలో అతి పొడవైన జల సొరంగం న్యూయార్క్‌లో ఉంది. దీని పొడవు కేవలం 137 కిలోమీటర్లే. మరుభూమిగా ఈశాన్య భారత్.. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే ఈశాన్య భారత్, బంగ్లాదేశ్‌లు మరుభూమిగా మారతాయి. ఇది ముందే తెలిసిన శాస్త్రవేత్తలు విషయాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచారు. బయటకు వచ్చి అవాంతరాలు ఎదురైనా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించారు. భారీ డ్యామ్‌ను కనుక నిర్మించ తలపెడితే ఎన్విరాన్‌మెంటలిస్టులు, పొరుగు దేశాలు చైనాకు వ్యతిరేకంగా పోరాడటం ప్రారంభిస్తాయి. అంతర్జాతీయ ఒత్తిడిల నుంచి తప్పించుకునేందుకే సొరంగ నిర్మాణ వ్యూహాన్ని చైనా భూజానికెత్తుకున్నట్లు తెలుస్తోంది. షిన్జియాంగ్ సస్యశ్యామలం.. త్సాంగ్పో(బ్రహ్మపుత్ర) నీటిని చైనా తరలిస్తే.. ఈశాన్య భారత్ నడ్డివిరిచినట్లవుతుంది. టిబెట్ పీఠభూమిలో చైనా చేపట్టిన ప్రాజెక్టుల వల్ల దిగువన బ్రహ్మపుత్రా నీటి ప్రవాహం తగ్గిపోతోందని భారత్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎడారులతో కూడిన కరవు ప్రాంతమైన షిన్జియాంగ్ దాహార్తిని తీర్చేందుకు ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల నుంచి నీటి మళ్లింపును చైనా చేపట్టింది. బ్రహ్మపుత్ర జలాలను భారీగా తలించటం ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చాలన్నది తమ లక్ష్యమని ప్రాజెక్టు రూపకల్పనలో కీలకపాత్ర వహిస్తున్న ఇంజినీర్ ఒకరు తెలిపినట్లు హాంకాంగ్ నుంచి వెలువడే ‘సౌత్‌చైనా మార్నింగ్‌పోస్ట్’ పేర్కొంది. వివిధ రంగాలకు చెందిన 100 మంది శాస్త్రవేత్తలు ఈ భారీ ప్రాజెక్టుపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. యునాన్ ప్రావిన్స్‌లో 600 కి.మీ. సొరంగం నిర్మాణాన్ని చైనా ఆగస్టులో ప్రారంభించింది. -
వంకర బుద్ధి మార్చుకోని చైనా
బీజింగ్ : బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో పంచుకోవడం కుదరదని చైనా మంగళవారం తేల్చి చెప్పింది. అయితే భారత్‌తో చర్చలు జరిపేందుకు తామెప్పడూ సిద్దమేనని బీజింగ్ తెలిపింది. డోక్లామ్ సమస్య ఉత్పన్నమైన సమయంలో సిక్కిం సరిహద్దులో మూసేసిన నాథూలా పాస్‌ను తిరిగి తెరించేందుకు సిద్ధమని.. భారత్ ముందుకు వస్తే తమకు అభ్యంతరం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ తెలిపారు. నాథూలా పాస్ని తిరిగి తెరిస్తే కైలాస్, మానస సరోవర యాత్ర చేసే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయాన్నిఆయన వ్యక్తం చేశారు. బ్రహ్మపుత్ర నదీ జలాలకు సంబంధించిన సమచారం కోసం భారత్‌ను ఎన్నిసార్లు అభ్యర్థించినా.. స్పందించలేదని దీంతో తాము కూడా నదీజలాల సమాచారాన్ని అందివ్వలేమని చెప్పారు. -
వరద బీభత్సం.. 100 మంది మృతి
- అసోంలో బ్రహ్మపుత్ర విలయతాండవం - 22 లక్షల మంది నిరాశ్రయులు.. నీట మునిగిన కజిరంగా పార్కు - రోడ్లపైకి కొట్టుకొచ్చిన భారీ చేపలు, ఏనుగులు.. - అసోం పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా..సీఎం సోనోవాల్‌కు ఫోన్ గువాహటి: "అసోం దుఃఖదాయిని" బ్రహ్మపుత్రా నది విలయతాండవానికి 100 మంది బలయ్యారు. 22 లక్షల మందికిపైగా నిరాశ్రయులు కాగా వందల వేల సంఖ్యలో జంతువులు వరదలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా ఉప్పొంగిన బ్రహ్మపుత్రా నది.. గడిచిన మూడు రోజులుగా అతిప్రమాదకరంగా ప్రవహిస్తూ తీరం వెంబడి ఊళ్లన్నింటినీ ముంచేస్తోంది. నదిలోకి ఇంకా వరద వచ్చిచేరుతుండటంతో ఉధతి ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడంలేదు. బ్రహ్మపుత్రతోపాటు ఇతర నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని 22 జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. సోమవారం ఒక్కరోజే వరదలో చిక్కుకుని 16 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. రోజురోజుకూ పరిస్థితి దారుణంగా మారుతుండటంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానిక యువత బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నాయి. లోయర్ అసోం, అప్పర్ అసోం డివిజన్లలోని కోక్రాఝర్, ధుబ్రి, బొంగైగావ్, దిబ్రూఘర్, ధేమాజీ, కలియాబర్ తదితర జిల్లాల్లో ఊహించని రీతిలో నష్టం వాటిల్లింది. అసోం ప్రభుత్వ లెక్కల ప్రకారం 490 పునరావాస కేంద్రాలు మాత్రమే ఉండగా, వాటిలో కేవలం 2లక్షల మంది మాత్రమే ఆశ్రయం పొందుతున్నారు. మిగిలిన 20 లక్షల మంది దయనీయ స్థితిలో కాలంగడుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అసోం సీఎం సర్బానంద సోనోవాల్‌కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సాయాన్ని కేంద్రం తక్షణమే అందిస్తుందని సీఎంకు చెప్పారు. రోడ్లపైకి భారీ చేపలు.. బురదలో ఏనుగు వరద ఉధృతికి భారీ చేపలు రోడ్లపైకి కొట్టుకొచ్చిన దృశ్యాల తాలూకు వీడియోలు అసోంలో నెలకొన్న పరిస్థితిని తెలియజేస్తున్నాయి. కలియాబోర్ వద్ద జలప్రవాహంలో మునిగిపోయిన జాతీయ రహదారిపై జనం గుమ్మికూడి ఉండగా.. పెద్దపెద్ద చేపలు అటుగా కొట్టుకొచ్చాయి. ప్రఖ్యాత కజిరంగా జాతీయ పార్కు 85 శాతం నీట మునగడంతో అక్కడి జంతుజాలం వరదలో కొట్టుకుపోయాయి. కాలువలో పడిపోయిన ఏనుగును, పొదల్లో చిక్కుకున్న ఖడ్గమృగం పిల్లను స్థానికులు కాపాడు. సంబంధిత వీడియోలను నందన్ ప్రతీమ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి. -
భారత్ విధానంతో బంగ్లాకు నష్టం
బ్రహ్మపుత్ర నీటిపై చైనా వ్యాఖ్య బీజింగ్: వివిధ మార్గాల్లో బ్రహ్మపుత్ర నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి భారత్ చేస్తున్న యత్నాల వల్ల బంగ్లాదేశ్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లవచ్చని చైనా పేర్కొంది. ఆర్థిక అవసరాలకు బంగ్లాదేశ్ ఆధారపడటంతో, ఆ దేశ బేరసారాల శక్తిని భారత్ హరిస్తోందని విమర్శించింది. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ ఆరోపణలతో కథనాన్ని ప్రచురించింది. తాము నిర్మిస్తున్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుపై భారత్ అతిగా స్పందించాల్సిన అవసరం లేదని, బ్రహ్మపుత్ర నీటిని చైనా అపేసిందనే వార్తలతో భారత ప్రజల్లో పెల్లుబుకిన ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలమని తెలిపింది. భారత్, బంగ్లాదేశ్‌లతో నీటిని పంచుకోనేందు కు బహుముఖ సహకార విధానానికి చైనా సిద్ధం గా ఉందంది. కాగా, తమ అధికారిక పత్రిక కథనం ప్రభావాన్ని తక్కువ చేసేందుకు చైనా విదేశాంగ శాఖ ప్రయత్నించింది. భారత్‌కు తమ సహకారం ఉంటుందని పేర్కొంది. -
బ్రహ్మపుత్ర నదిని బ్లాక్ చేసిన చైనా
-
బ్రహ్మపుత్ర నదిని బ్లాక్ చేసిన చైనా
బీజింగ్: చైనా మరోసారి భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించే దుందుడుకు చర్యకు పాల్పడింది. పాకిస్థాన్‌తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని ఇండియా సమీక్షించదలుచుకున్న నేపథ్యంలోమనదేశంలోకి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదిని బ్లాక్ చేస్తూ చైనా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బ్రహ్మపుత్ర నదిపై టిబెట్‌లో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన హైడ్రోఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్టును చైనా నిర్మిస్తోంది. దీని వ్యయం రూ.9765 కోట్టు అని అంచనా.ఇది2.5 బిలియన్ కిలోవాట్ల సామర్థంతో ఆరు యూనిట్లతో నిర్మిస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు. దీని నిర్మాణాన్ని 2019 కల్లా చైనా పూర్తి చేయాలని భావిస్తోంది. బ్రహ్మపుత్ర నది టిబెట్ నుంచి భారత్ లోని అరుణాచల్, అస్సాంలలో ప్రవహిస్తుంది. తాజాగా చైనా బ్రహ్మపుత్ర నదిని బ్లాక్ చేయడం వల్ల ఇండియా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.ఈ ప్రాజెక్టుపై చాలా కాలంగా వ్యతిరేకిస్తున్న భారత్ సరిహద్దుకు 550 కి.మీ దూరంలో ప్రాజెక్టును నిర్మించాలని డిమాండ్ చేస్తోంది.