భారత్ చేస్తున్న యత్నాల వల్ల బంగ్లాదేశ్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లవచ్చని చైనా పేర్కొంది.
బ్రహ్మపుత్ర నీటిపై చైనా వ్యాఖ్య
బీజింగ్: వివిధ మార్గాల్లో బ్రహ్మపుత్ర నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి భారత్ చేస్తున్న యత్నాల వల్ల బంగ్లాదేశ్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లవచ్చని చైనా పేర్కొంది. ఆర్థిక అవసరాలకు బంగ్లాదేశ్ ఆధారపడటంతో, ఆ దేశ బేరసారాల శక్తిని భారత్ హరిస్తోందని విమర్శించింది. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ ఆరోపణలతో కథనాన్ని ప్రచురించింది. తాము నిర్మిస్తున్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుపై భారత్ అతిగా స్పందించాల్సిన అవసరం లేదని, బ్రహ్మపుత్ర నీటిని చైనా అపేసిందనే వార్తలతో భారత ప్రజల్లో పెల్లుబుకిన ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలమని తెలిపింది.
భారత్, బంగ్లాదేశ్‌లతో నీటిని పంచుకోనేందు కు బహుముఖ సహకార విధానానికి చైనా సిద్ధం గా ఉందంది. కాగా, తమ అధికారిక పత్రిక కథనం ప్రభావాన్ని తక్కువ చేసేందుకు చైనా విదేశాంగ శాఖ ప్రయత్నించింది. భారత్‌కు తమ సహకారం ఉంటుందని పేర్కొంది.