China Products
-
చైనా వస్తువుల దిగుమతులకు చెక్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా చైనా నుంచి దిగుమతయ్యే ఐదు వస్తువులపై ఐదేళ్లపాటు అమలయ్యేలా యాంటీడంపింగ్ డ్యూటీకి తెరతీసింది. వీటిలో గ్లాస్ మిర్రర్, సెల్‌ఫోన్ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్ తదితరాలున్నాయి. తద్వారా పొరుగు దేశం నుంచి భారీగా దిగుమవుతున్న వస్తువులకు చెక్ పెట్టింది. దీంతో చౌక దిగుమతుల నుంచి దేశీ తయారీదారులకు రక్షణ లభించనుంది.యాంటీడంపింగ్ డ్యూటీ విధించిన చైనా వస్తువుల జాబితాలో ఐసోప్రొపిల్ ఆల్కహాల్, సల్ఫర్ బ్లాక్, సెల్‌ఫోల్ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్, థెర్మోప్లాస్టిక్ పాలీయురెథేన్, అన్ఫ్రేమ్డ్ గ్లాస్ మిర్రర్ చేరాయి. సాధారణ ధరలకంటే తక్కువ ధరల్లో ఈ వస్తువులు చైనా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. రెవెన్యూ శాఖ, పరోక్ష పన్నులు, కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ విడిగా జారీ చేసిన ఐదు నోటిఫికేషన్ల ద్వారా డ్యూటీలు ఐదేళ్లపాటు అమల్లో ఉంటాయని వెల్లడించింది.మెడికల్, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే ఐసోప్రొపిల్ ఆల్కహాల్‌పై టన్నుకి 82 డాలర్ల నుంచి 217 డాలర్ల మధ్య వివిధ కంపెనీలపై సుంకాన్ని విధించింది. చర్మంపై యాంటీసెప్టిక్, హ్యాండ్ శానిటైజర్గానూ ఈ ప్రొడక్ట్ వినియోగమవుతోంది. టెక్స్టైల్ డయింగ్, పేపర్, లెదర్ తయారీలో వినియోగించే సల్ఫర్బ్లాక్పై టన్నుకి 389 డాలర్ల సుంకాన్ని ప్రకటించింది.ఇదీ చదవండి: డాలర్లు దండిగా.. కొరతలోనూ చింత లేని బంగ్లాదేశ్!ఈ బాటలో ఆటోమోటివ్, మెడికల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో వినియోగించే థెర్మోప్లాస్టిక్ పాలీయురెథేన్పై కేజీకి 0.93 డాలర్ల నుంచి 1.58 డాలర్లు, ప్యాకేజింగ్ మెటీరియల్‌గా వినియోగించే సెల్‌ఫోన్ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్‌పై కేజీకి 1.34 డాలర్లు చొప్పున డ్యూటీ విధించింది. అన్ఫ్రేమ్డ్ గ్లాస్ మిర్రర్లపై టన్నుకి 234 డాలర్ల యాంటీడంపింగ్ సుంకాన్ని ప్రకటించింది. వాణిజ్య శాఖ పరిశోధన విభాగం డీజీటీఆర్ సూచనలమేరకు ప్రభుత్వం తాజా చర్యలను చేపట్టింది. -
చైనా ఉత్పత్తులకు బ్రేక్! హోలీ వేళ భారతీయులంతా..
భారతీయ మార్కెట్లో చైనీస్ ఉత్పత్తులకు గిరాకీ మామూలుగా ఉండదు, అయితే ఈ సారి హోలీ సందర్భంగా కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆత్మనిర్భర్ భారత్ చొరవతో చాలామంది చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి సుముఖత చూపించడం లేదు. నివేదికల ప్రకారం, ఢిల్లీలో ఇప్పటికే చాలామంది వ్యాపారులు కేవలం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా సదర్ బజార్ విక్రేత జావేద్ మాట్లాడుతూ.. ఎక్కువ మంది కొనుగోలుదారులు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిపాడు. తమ పిల్లలకు రంగులను కొనుగోలు చేయడానికి చేయడానికి వచ్చిన కస్టమర్లతో ఒకరు మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతీయ ఉత్పత్తుల నాణ్యత బాగుండటంతో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్లో అమ్మకానికి ఉన్న చాలా ఉత్పత్తులు మన దేశంలో తయారు చేయబడినవి కావడం సంతోషించదగ్గ విషయం అన్నారు. కొనుగోలుదారుల నుంచి చైనా ఉత్పత్తుల మీద పెరుగుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని భారతీయ ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తున్నామని, లోపాలు ఉన్న వాటిని తిరిగి ఇవ్వకపోవడం కూడా చైనా ఉత్పత్తులు అమ్మకపోవడానికి కారణమని కొంతమంది వ్యాపారాలు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ హోలీ పండుగ వేళ భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరగటం మంచి విషయమనే చెప్పాలి. -
దురాక్రమణదారు చైనా నుంచి దిగుమతులా?
న్యూఢిల్లీ: భారత్‌పై దురాక్రమణలకు పాల్పడుతున్న చైనా నుంచి దిగుమతులకు కేంద్రం ఎందుకు అనుమతిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల గౌరవాన్ని ప్రభుత్వం కాపాడాలన్నారు. ధైర్యంగా చైనా దిగుమతులను నిలిపివేసి మత సత్తా చాటాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చౌకగా దొరికేవే అయినా చైనా వస్తువులను మానేసి, ఖరీదైనా దేశీయంగా తయారైన వాటినే కొనాలని కోరారు. ఎద్దు నుంచి పాలు పితికాం గుజరాత్ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకోవడంపై కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ఆవు నుంచి పాలు ఎవరైనా పితుకుతారు. కానీ, గుజరాత్లో మేం ఎద్దు నుంచి పాలు పితికాం. అతికష్టమ్మీద 5 సీట్లు గెలుచుకున్నాం’ అని అన్నారు. -
వివాదాలున్నా... వ్యాపారం వ్యాపారమే!
చైనా వస్తువులను బహిష్కరించాలని భారత్ పాలకులు, దేశంలోని ఓ వర్గం ఈ మధ్య తరచుగా పిలుపునివ్వడం కనిపిస్తున్నది. నిజంగా చైనా వస్తువులను సంపూర్ణంగా బహిష్కరించి భారత దేశం మనుగడ సాగించగలదా? స్వయంసమృద్ధి సాధించినప్పుడే ఇటువంటి పిలుపు ఇవ్వడంలో అర్థం ఉంటుంది. అయితే ప్రభుత్వం స్వయం సమృద్ధిని సాధించినట్లు నటిస్తూ ప్రజలను మభ్యపెడుతోంది. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) పొడవునా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నా... భారత్–చైనాల మధ్య వాణిజ్య పరిమాణం పెరగటం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. 2021 జనవరి–నవంబర్ మధ్య కాలంలో భారత్, చైనాల మధ్య మొత్తం రూ. 8.57 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య జరిగిన వ్యాపారంలో అత్యధిక మొత్తం ఇదే. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ – చైనా మధ్య వాణిజ్య పరిమాణం పెరుగుతోంది. ఇరు దేశాలూ 50,000 మందికి పైగా సైనికులను అక్కడ మోహరించి ఉంచాయి. ఇది 1962 యుద్ధ సమయంలో మోహరించిన సైనికుల సంఖ్య కంటే ఎక్కువ అనే సంగతి గమనార్హం. సరిహద్దు వివాదాన్ని పరిష్క రించడానికి ప్రయత్నించిన పన్నెండు కమాండర్ స్థాయి చర్చలు విఫలమయ్యాయి. ఇప్పుడు కూడా సాధారణ స్థితిని కొన సాగిం చడానికి రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రాము ఖ్యతకు సాక్ష్యంగా నిలిచింది. ఇవ్వాళ యుద్ధం కంటే వ్యాపారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యుద్ధం ద్వారా పౌరుల అవసరాలను మనం తీర్చలేం. ఇతర దేశాలతో ఒక దేశం వ్యాపార సంబంధాలు సరిగా లేకపోతే అది చివరికి నాశనం అవుతుంది. మనం అన్ని విధాలుగా స్వావలంబన సాధించడానికి ప్రయత్నించాలి. అదే మనల్ని ఏ రకమైన యుద్ధం నుండైనా కాపాడగలుగుతుంది. మారిన పరిస్థితులను ఆశ్చర్యంతో చూడవలసిన పనిలేదు. భారతదేశం ఇప్పటికీ స్వయంసమృద్ధి సాధించలేదన్నది నిజం. అనేక ఉత్పత్తుల సరఫరా కోసం చైనాపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించడం భావోద్వేగ చర్య అవుతుంది. వాస్తవా నికి, భారతీయ మార్కెట్‌ను చైనా ఉత్పత్తులు ఇప్పటికే ఆక్రమిం చేశాయి. కత్తెర్లు, రేజర్లు, పిల్లలకు బొమ్మలు, దీపావళిలో విక్రయించే ప్రమిదలు, భారతీయ దేవతా విగ్రహాలు, అలంకరణ సామగ్రి, మొబైల్స్, టీవీలు, ల్యాప్ టాప్‌లు, పల్లెల కిరాణా దుకాణాల్లో విక్ర యించే చాలా వస్తువులు, క్షురకులు క్షౌరం చేసేటప్పుడు వాడే షీట్లు.. ఇలా మనం ఉపయోగించే ఎన్నో ఉత్పత్తులు చైనాలోనే తయార వుతున్నాయి. ఇప్పుడు భారత మార్కెట్ చైనా వస్తువులతో నిండి ఉందన్నది నిజం. ఇటువంటి పరిస్థితిలో చైనా ఉత్పత్తులను బహిష్క రించాలని ఆలోచించడం కూడా పగటి కలలాంటిదే అని చెప్పక తప్పదు. చైనా ప్రభుత్వం విడుదల చేసిన తాజా డేటా ప్రకారం... 2021లో భారతదేశం నుండి చైనా మునుపటి కంటే ఎక్కువ పరిమాణంలో వస్తువులను దిగుమతి చేసుకుంది. రాబోయే రోజుల్లో భారతదేశంతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి చైనా పాలకులు కూడా మరింతగా మొగ్గు చూపుతున్నారు. 2020లో చైనాతో భారతదేశం జరిపిన మొత్తం వాణిజ్యం విలువ 87.6 బిలి యన్ డాలర్లు. దీనిలో భారతదేశం చైనా నుండి సుమారు 50.28 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. దీనికి ముందు 2019లో భారతదేశం చైనా నుండి 20.17 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులనే దిగుమతి చేసుకుంది. ఈ దిగుమతుల్లో విద్యుత్ యంత్రాలు, యంత్రాల విడి భాగాలు వంటివి ఎక్కువగా ఉన్నాయి. వీటితోపాటు, భారతదేశం 8.39 బిలియన్ డాలర్ల విలువైన సేంద్రియ రసాయనాలు, 1.67 బిలియన్ డాలర్ల విలువైన ఎరువులు వంటివాటిని చైనా నుండి దిగుమతి చేసుకుంది. 2014–15 ఆర్థిక సంవత్సరం నుండి 2019–20 ఆర్థిక సంవత్సరం వరకు భారత్– చైనా మధ్య జరిగిన వాణిజ్య కార్య కలాపాల డేటాను పరిశీలిస్తే... భారతదేశం చైనాకు చాలా తక్కువ విలువ కలిగిన ముడి ఉత్పత్తులను ఎగుమతి చేసినట్లు కనిపిస్తుంది. అదే సమయంలో చైనా నుండి వస్తు తయారీ సంబంధిత ఉత్ప త్తులను దిగుమతి చేసుకుంది. ఈ కాలంలో చైనా ప్రధానంగా ఇనుప ఖనిజం, పెట్రోలియం ఆధారిత ఇంధనాలు, సేంద్రియ రసాయ నాలు, శుద్ధి చేసిన రాగి, పత్తి నూలు వంటి వాటిని భారతదేశం నుండి దిగుమతి చేసుకుంది. భారతదేశం చేపలు, సముద్ర ఆహారం, నల్ల మిరియాలు, వంట నూనెలు, కొవ్వు వంటి ఆహార ఉత్పత్తులను చైనాకు ఎగుమతి చేస్తోంది. అలాగే భారతదేశం భవన నిర్మాణంలో ఉపయోగించే గ్రానైట్ బండలను, రాళ్లను; ముడి పత్తిని కూడా చైనాకు ఎగుమతి చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా చైనా నుండి భారతదేశం... ఆటోమేటిక్ డేటా ప్రాసెసింగ్ యంత్రాలు, టెలిఫోన్ పరికరాలు, వీడియో ఫోన్లు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, ట్రాన్సిస్టర్లు, సెమీకండక్టర్ పరికరాలు, యాంటీబయాటిక్స్, ఎరువులు, సౌండ్ రికార్డింగ్ పరిక రాలు, టీవీ కెమెరాలు, ఆటో భాగాలు, ఆటో ఉపకరణాలు వంటి వాటిని ప్రధానంగా దిగుమతి చేసుకుంది. ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ విషయంలో కూడా చైనా భారత మార్కెట్లో ఆధిపత్యం చెలాయి స్తోంది. ఒక దేశ ఎగుమతుల వల్ల వచ్చిన ఆదాయం దిగుమతులు చేసుకోవడానికి ఖర్చుచేసిన వ్యయం కంటే ఎక్కువ ఉంటే దానిని విదేశీ వాణిజ్య లాభం అంటారు. అయితే దిగుమతులపై ఖర్చు చేసిన మొత్తం ఎగుమతుల నుండి సంపాదించిన మొత్తం కంటే ఎక్కువగా ఉంటే విదేశీ వాణిజ్య లోటు అని అంటారు. చైనాతో భారతదేశ వాణిజ్య లోటు నిరంతరం పెరుగుతోంది. ఎందుకంటే భారతదేశం చైనా నుండి ఎక్కువ ఉత్పత్తులను దిగుమతి చేసుకొని, తక్కువ ఎగుమతి చేస్తున్నది. 2014 నుంచి 2021 వరకు చైనాతో జరిగిన వాణిజ్యాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 2014లో చైనాతో భారత్ వాణిజ్య లోటు రూ.3.36 లక్షల కోట్లు ఉండగా 2015కి రూ.3.91 లక్షల కోట్లకు చేరింది. అది 2016లో రూ.3.87 లక్షల కోట్లు ఉంటే... 2017లో రూ.4.45 లక్షల కోట్లు ఉంది. అయితే 2018లో ఈ వాణిజ్య లోటు పెరుగుదల కొద్దిగా తగ్గి రూ.4.30 లక్షల కోట్లుగా నమోదైంది. ఆ తర్వాత 2019లో రూ.3.83 లక్షల కోట్లు, 2020లో రూ.3.30 లక్షల కోట్లుగా నమోదైనా... తిరిగి 2021లో రూ.4.61 లక్షల కోట్లకు వాణిజ్య లోటు పెరిగింది. చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తామని లక్షల సార్లు ప్రకటించినా... వాస్తవానికి అలా చేయడం భారత్‌కు సాధ్యం కాదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మన దేశీయ అవసరాలను తీర్చడానికి మనం చైనా ఉత్పత్తులపై ఆధారపడుతూనే ఉంటాం. ఇది మాత్రమే కాదు, ఇప్పటికీ వివిధ ఉత్పత్తుల తయారీ కోసం చైనా నుండి ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. కంప్యూటర్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల రంగంలో చైనా స్వయంసమృద్ధి సాధించింది. చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు వివిధ ఉత్పత్తులను ఎగుమతి చేçస్తోంది. ఎలక్ట్రానిక్స్ 20.6 శాతం, యంత్రాలు 13.4 శాతం, సేంద్రియ రసాయనాలు 8.6 శాతం, ప్లాస్టిక్ ఉత్పత్తులు 2.7 శాతంౖ చెనా నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తుల్లో ఉన్నాయి. ఇండియా నుంచి చైనాకు ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల్లో సేంద్రియ రసాయనాలు, పత్తి కలిసి 3.2 శాతం వాటాను, అలాగే దుస్తులు 1.8 శాతం వాటాను కలిగి ఉన్నాయి. విద్యుత్ యంత్రాలు, యంత్ర పరికరాలు, సేంద్రీయ రసా యనాలు, ప్లాస్టిక్లు, ఆప్టికల్ సర్జికల్ పరికరాలను భారతదేశం దిగుమతి చేసుకునేవాటిలో అధికంగా ఉన్నాయి. ఇవి భారతదేశం మొత్తం దిగుమతుల్లో 28 శాతంగా ఉన్నాయి. భారతదేశం చైనా నుంచి 40 శాతం సేంద్రియ రసాయనాలను దిగుమతి చేసుçకుం టున్నది. అలాగే ఆ రసాయనాలను ఉపయోగించి తయారు చేసిన ఉత్ప త్తులను చైనాకు ఎగుమతి చేస్తున్నది. చైనాలో తయారైన వస్తువులను బహిష్కరించాలనే మాట భారత్‌లో వినిపిస్తున్నప్పటికీ, ఇక్కడి అనేక పరిశ్రమలు... ముడి పదార్థాలు, యంత్ర విడి భాగాల కోసం చైనాపై ఆధారపడి ఉన్నా యనే సంగతి మరువరాదు. అదే సమయంలో భారత ప్రజలు అనేక చైనా వస్తువుల వినియోగానికి అలవాటై ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో, చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తున్నట్లు నటించడానికి బదులుగా ‘మేడ్ ఇన్ ఇండియా‘ వస్తువుల పరిమాణాన్ని పెంచడంపై మనం దృష్టి పెట్టాలి. – సతీష్ సింగ్, సీనియర్ జర్నలిస్ట్ (మిలీనియం పోస్ట్ సౌజన్యంతో) -
CAIT Diwali sales: దేశీ తడాఖా.. చైనాకు రూ.50 వేల కోట్ల నష్టం!
సరిహద్దు వివాదాలు చైనాకు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఆశించినంత వేగంగా కాకపోయినా క్రమంగా చైనా ఉత్పత్తుల పట్ల వ్యతిరేకత మొదలవుతోంది. దీపావళి సందర్భంగా జరిగిన అమ్మకాలే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పదేళ్ల రికార్డు బ్రేక్ దీపావళి పండగ వెలుగులు పంచింది. వ్యాపారుల గల్లా పెట్టెని గలగలమనిపించింది. పదేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఈ సారి వ్యాపారం పుంజుకుంది. ది కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (కైట్) జారీ చేసిన గణాంకాల ప్రకారం దీపావళి పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా 1.25 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. గడిచిన పదేళ్లలో ఈ స్థాయిలో బిజినెస్ ఎన్నడూ జరగలేదు. రిఫ్రెష్ అయ్యారు ఏడాదిన్నర కాలంగా కరోనా భయం వెంటాడుతుండటంతో ప్రజలంతా ఎక్కువగా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం కరోనా భయాలు తొలగిపోతుండటం, త్వరలోనే పెళ్లిల సీజన్ మొదలవుతుండటంతో జనం షాపింగ్‌కు మొగ్గు చూపారు ఫలితంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. కరోనా ఒత్తిడి నుంచి జనాలు రిఫ్రెష్మెంట్ కోరుకున్నారని, దాని ఫలితమే ఈ స్థాయి అమ్మకాలు అని కైట్ అంటోంది. Wow - a very happy #Diwali indeed! #Retail Diwali sales notched a record Rs1.25L crore - a 10 yr high per #CAIT. Shoppers gorged on sweets, dry fruits besides buying diyas, candles, watches, toys, clothing, home decor & of course Gold jewelry. Even #online sales were up ~24% YoY. pic.twitter.com/uRzeKnamJj — Sachchidanand Shukla (@shuklasach) November 6, 2021 ఢిల్లీలోనే రూ. 25 వేల కోట్లు దీపావళికి జరిగిన అమ్మకాల్లో ఆన్లైన్ ద్వారా సుమారు 32 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఇక బంగారం, వెండి ఆభరణాలకు సంబంధించి రూ. 9,000 కోట్ల రూపాయల బిజినెస్ కంప్లీట్ అయ్యింది. దీపావళి బిజినెస్‌కి సంబంధించి ఒక్క ఢిల్లీలోనే ఏకంగా రూ 25,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. దీపావళి అమ్మకాలకు సంబంధించి డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, హోం డెకార్, ఫుట్‌వేర్, టాయ్స్, వాచెస్‌ల విభాగంలో భారీగా అమ్మకాలు జరిగాయని కైట్ అంటోంది. చైనాకు షాక్ ది కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (కైట్) దేశంలో 7 కోట్ల మంది వర్తకులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. కైట్ జాతీయ అధ్యక్షుడిగా భార్తీయా, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్ వాల్లు కొనసాగుతున్నారను. వీరిద్దరు చెప్పిన వివరాల ప్రకారం.. ఈసారి దీపావళి సందర్భంగా మట్టి ప్రమిదలను, పేపర్ వస్తువులను కొనేందుకు జనం ఎక్కువ ఆసక్తి చూపించారు. చైనా వస్తువులు కొనడం కంటే దేశీయంగా స్థానికులు తయారు చేసిన వస్తువులు కొనేందుకే మొగ్గు చూపారు. ఫలితంగా చైనా మేడ్ దీపాలు, ఎలక్ట్రిక్ లైట్లకు గిరాకీ పడిపోయింది. ఇక బాణాసంచా విషయంలోనూ ఈ తేడా కనిపించింది. మొత్తంగా దీపావళి వ్యాపారానికి సంబంధించి రూ. 50 వేల కోట్ల వరకు చైనా ఉత్పత్తులకు నష్టం వాటిల్లింది. చైనా వస్తువులు దేశంలోని దిగుమతి చేసుకున్న వ్యాపారులకు ఈసారి నష్టాలు తప్పేలా లేవు. -
‘అలా అయితే చైనా ముందు తల దించుకోవల్సి వస్తుంది’
ముంబై: చైనా వస్తువులపై ఆధారపడి జీవనం సాగిస్తే ఆ దేశం ముందు తల దించుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఆయన ఆదివారం భరత 75వ స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముంబైలోని ఓ స్కూల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వదేశి అంటే భారత్ దేశంలో తయారైన వస్తువలను వాడాలని తెలిపారు. ప్రస్తుతం మనం సాంకేతికతను అధికంగా ఉపయోగిస్తున్నామని, కానీ మన దేశం వద్ద ఇంకా పూర్తి స్థాయి సాంకేతికత లేదని పేర్కొన్నారు. చాలా వరకు అంతా బయటి దేశాల నుంచి వస్తుందన్నారు. చైనా వస్తువులను నిషేధించామని ఎంత చెప్పినా.. మనం వాడే మొబైల్స్‌లోని కొన్ని యాప్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలుకోవాలన్నారు. చైనా వస్తువులుపై మీద మనం ఎక్కువగా ఆధారపడినంత కాలం ఆ దేశం ముందు తల దించుకోవాల్సి పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఆర్థిక భద్రత ప్రధానమైందని, సాంకేతిక పూర్తిగా మన దేశ నిబంధనలుకు అనుకూలమైనది ఉండాలన్నారు. స్వదేశి పేరుతో అన్నింటిని బహిష్కరించడం కాదని, ప్రపంచ వాణిజ్యంలో పాలుపంచుకుంటూ స్వావలంబన సాధించాలని చెప్పారు. ఇళ్లలో తయారు చేసుకొనే వస్తువులను మార్కెట్లల్లో కొనటం తగ్గించాలని తెలిపారు. ప్రపంచ వాణిజ్యానికి తాను వ్యతిరేకం కాదని, మన గ్రామాల్లో వస్తువుల ఉత్పత్తులను పెంచాలని ఆయన పేర్కొన్నారు. -
ప్రభుత్వం నిషేధం విధించిన యాప్‌లివే..
సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో 43 చైనా మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించింది. అలీబాబా గ్రూప్‌కి చెందిన ఈ కామర్స్ యాప్ అలీ ఎక్స్‌ప్రెస్ సహా కొన్ని డేటింగ్ యాప్‌లపై నిషేధం విధిస్తూ మంగళవారం ఉత్వర్వులు జారీ చేసింది. గల్వాన్ లోయలో భారత్‌తో ఘర్షణలకు దిగిన డ్రాగన్ దేశానికి బుద్ధి చెప్పడం కోసం ఈ ఏడాది జూన్ 29న తొలిసారిగా 59 యాప్‌లపై నిషేధం విధించిందించిన విషయం తెలిసిందే. చదవండి: మరో 47 చైనా యాప్‌లపై నిషేధం నిషేధం విధించిన యాప్‌లివే.. ► అలీ సప్లయర్స్ మొబైల్ యాప్ ► అలీబాబా వర్క్ బెంచ్ ► అలీ ఎక్స్‌ప్రెస్– స్మార్టర్ షాపింగ్ బెటర్ లివింగ్ ► అలీ పే క్యాషియర్ ► లాలామూవ్ ఇండియా – డెలివరీ యాప్ ► డ్రైవ్ విత్ లాలామూవ్ ఇండియా ► స్నాక్ వీడియో ► క్యామ్ కార్డ్ – బిజినెస్ కార్డు రీడర్ ► క్యామ్‌కార్డ్ – బీసీఆర్ (వెస్టర్న్) ► సోల్ – ఫాలో ది సోల్ టు ఫైండ్ యూ ► చైనీస్ సోషల్ ► డేట్ ఇన్ ఆసియా ► విడేట్ ► ఫ్రీడేటింగ్ యాప్ ► అడోర్ యాప్ ► ట్రూలీ చైనీస్ ► ట్రూలీఆసియాన్ ► చైనాలవ్ ► డేట్మైయాజ్ ► ఆసియాన్డేట్ ► ఫ్లర్ట్‌విష్ ► గైస్ ఓన్లీ డేటింగ్ ► ట్యుబిట్ ► వివర్క్చైనా ► ఫస్ట్ లవ్ లివ్ ► రేలా ► క్యాషియర్ వాలెట్ ► మ్యాంగో టీవీ ► ఎంజీటీవీ–హునాన్ టీవీ ► వుయ్‌టీవీ–టీవీ వెర్షన్ ► వుయ్‌టీవీ–సిడ్రామా ► వుయ్‌టీవీ లైట్ ► లక్కీ లైవ్ ► తావోబావో లైవ్ ► డింగ్‌టాక్ ► ఐడెంటిటీ వీ ► ఐల్యాండ్ 2 ► బాక్స్ స్టార్ ► హీరోస్ ఎవాల్వ్ ► హ్యాపీ ఫిష్ ► జెల్లిపాప్ మ్యాచ్ ► మంచికన్ మ్యాజ్ ► కాంక్విస్టా ఆన్లైన్ -
ఐపీఎల్ : ఒమర్ అబ్దుల్లా సెటైర్లు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2020)నిర్వహణకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై స్పందించారు. చైనా కంపెనీలు ఐపీఎల్ క్రికెట్ టోర్నీ టైటిల్ స్పాన్సర్లుగా ఉండటంపై అబ్దుల్లా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (10న ‘ఫైనల్’ చేశారు) వివో సహా ఇతర చైనా కంపెనీలను కొనసాగించాలన్న బీసీసీఐ కౌన్సిల్ నిర్ణయంపై ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ఒకవైపు చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలకు చెబుతారు మరోవైపు చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీలను స్పాన్సర్ కంపెనీలుగా కొనసాగిస్తారంటూ విమర్శలు గుప్పించారు. లడాఖ్ సరిహద్దుల్లో చైనా దళాలు మన భూభాగాల్లోకి చొరబడుతుంటే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్లుగా వీవోను కొనసాగించడంలో అర్థం లేదన్నారు. చైనీస్ మనీ, ఇన్వెస్ట్ మెంట్, స్పాన్సర్ షిప్, అడ్వర్టైజింగ్ విషయాల నిర్వహణలో ఈ గందరగోళ వైఖరిపై చైనా ముక్కున వేలేసుకోవడంలో ఆశ్చర్యం లేదంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ పరిణామం తరువాత చైనా టీవీలను బాల్కనీల నుంచి విసిరి పారేసిన వారి మానసిక పరిస్థితిపై ఆయన విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. పాపం ఇడియట్స్ అంటూ అబ్దుల్లా సెటైర్లు వేశారు. ఇండియాలో కరోనా మహమ్మారి నేపధ్యంలో యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ తేదీలను బీసీసీఐ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకూ ఐపీఎల్ పోటీలు జరగనున్నాయి. అబుదాబి, దుబాయ్, షార్జాలలో 51 రోజుల పాటు జరగనున్న క్రికెట్ మ్యాచ్ లకు స్పాన్సర్ కంపెనీలుగా చైనా కంపెనీల్ని కూడా ఆమోదించడం విమర్శలకు తావిస్తోంది. BCCI/IPL governing council has decided to retain all sponsors including the big Chinese ones. I feel bad for those idiots who threw their Chinese made TVs off their balconies only to see this happen. — Omar Abdullah (@OmarAbdullah) August 2, 2020 BCCI/IPL governing council has decided to retain all sponsors including the big Chinese ones. I feel bad for those idiots who threw their Chinese made TVs off their balconies only to see this happen. — Omar Abdullah (@OmarAbdullah) August 2, 2020 -
చైనాపై ‘విసర్జికల్ స్ట్రైక్’
‘గాల్వన్’ ఉద్రిక్తతల దరిమిలా భారత ప్రభుత్వం 59 చైనా యాప్స్‌పై నిషేధం విధించింది. క్రమంగా చైనా వస్తువులను సైతం నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌లో తమ వస్తువులకు అడ్రస్ గల్లంతయిపోతే, చైనా ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం తప్పదు. ఒకరకంగా ఇది భారత ప్రభుత్వం చైనాపై చేస్తున్న ‘విసర్జికల్ స్ట్రైక్’గా చెప్పుకోవచ్చు. సరి‘హద్దు’ మీరిన చైనా సైనికుల దాడిలో కల్నల్ సంతోష్‌బాబు సహా ఇరవై మంది భారత సైనికుల మృతి ఉభయ దేశాల నడుమ ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా చైనాపై వ్యతిరేకత చెలరేగింది. చైనా వస్తువులను తగులబెట్టి కొందరు నిరసన వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే భారత ప్రభుత్వం దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేవిగా ఉన్నాయంటూ చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించింది. నిషేధానికి గురైన యాప్స్‌లో పెద్దసంఖ్యలో యూజర్లు ఉన్న ‘టిక్‌టాక్’తో పాటు చాలామంది తరచుగా ఉపయోగించే ‘హెలో’, ‘షేర్ ఇట్’, ‘యూసీ బ్రౌజర్’, ‘యూ వీడియో’ వంటివి కూడా ఉన్నాయి. మన దేశంలో చైనా ప్రమేయం యాప్స్, మొబైల్ఫోన్ల వరకు మాత్రమే పరిమితం కాదు. వివిధ రంగాల్లో చైనా మన మార్కెట్‌ను ముంచెత్తుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో మన ఆర్థికరంగం నుంచి చైనా ప్రమేయాన్ని పూర్తిగా తొలగించి ‘ఆత్మనిర్భరత’ సాధించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మన దేశంలోని పలు కీలక రంగాల్లో చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఆటోమొబైల్, ఖనిజ లోహాలు, విద్యుత్తు, భవన నిర్మాణ, సేవా రంగాల్లో చైనా పెట్టుబడులు గణనీయమైన స్థాయిలోనే ఉన్నాయి. గడచిన ఐదేళ్ల వ్యవధిలోనే భారత్‌లో చైనా పెట్టుబడులు ఐదురెట్లు పెరిగాయి. చైనా పెట్టుబడులు 2014లో 1.60 బిలియన్ డాలర్లు (రూ.11,973 కోట్లు) ఉంటే, 2019 నాటికి 8 బిలియన్ డాలర్లకు (రూ.59,867 కోట్లు) చేరాయి. చైనా కంపెనీలు కొన్ని మన దేశంలో పనిచేస్తున్నాయి. గడచిన కొన్నేళ్లుగా చైనా వస్తువులు దేశం నలుమూలలకూ పాకాయి. మన దేశంలో చాలామంది ఉపయోగించే మొబైల్ ఫోన్లలో చైనాకు చెందినవే ఎక్కువ. చైనాతో మన దేశానికి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. వాటిని ఇప్పటికిప్పుడు రద్దు చేసుకునే పరిస్థితులైతే కనిపించడం లేదు. కొన్ని కీలక రంగాల్లో చైనా పెట్టుబడులు ఏ మేరకు ఉన్నాయంటే... భారత్–చైనా ద్వైపాక్షిక వాణిజ్య విలువ 2001 నాటికి 3.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.27 వేల కోట్లు) మాత్రమే అయితే, 2019 నాటికి ఈ విలువ 90 బిలయన్ డాలర్లకు (సుమారు రూ.6.74 లక్షల కోట్లు) పెరిగింది. ఇన్నాళ్లూ భారత్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతూ వచ్చింది. అయితే, సరిహద్దు ఉద్రిక్తతల దరిమిలా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో భారత్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న చైనా కంపెనీలకు భారీస్థాయి ఆర్థికనష్టం తప్పకపోవచ్చు. చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై భారీగా సుంకాలను విధించేందుకు భారత ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇందుకోసం కేంద్ర వాణిజ్యశాఖ చైనా దిగుమతి వస్తువుల జాబితాను సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా పలు వాణిజ్య, వర్తక సంఘాలు కూడా ‘బాయ్‌కాట్ చైనా’ నినాదాన్ని ప్రచారం చేస్తున్నాయి. కొన్నిచోట్ల వర్తక సంఘాలు తమ మార్కెట్లలో చైనా వస్తువులను అమ్మబోమంటూ కూడా ప్రకటించాయి. చైనా వస్తువుల బహిష్కరణ నిర్ణయాన్ని కట్టుదిట్టంగా అమలు చేయగలిగితే దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) లాభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వస్తువూ దేశంలోనే తయారు కావాలనే భావన ప్రజల్లో ఎక్కువగా ఉన్నా, ఆచరణలో అది సాధ్యమయ్యే అవకాశాలు తక్కువేనని ప్రముఖ ఆర్థికవేత్త యోగేంద్ర కపూర్ అభిప్రాయపడుతున్నారు. చైనా నుంచి మన దేశానికి ప్రధాన దిగుమతులు ఇప్పటికి ఏ స్థాయిలో ఉన్నాయంటే... నిషేధానికి దారితీసిన పరిణామాలు ‘టిక్‌టాక్’ సహా 59 చైనా యాప్స్‌కు సంబంధించి కంటెంట్ వివాదం పాతదే అయినా, వీటి నిషేధానికి కంటెంట్ ప్రధాన కారణం కాదు. ఇవి దేశభద్రతకు కలిగించే అవకాశాలు ఉన్నాయనే కారణంతోనే భారత ప్రభుత్వం వీటిని నిషేధించింది. అమెరికా, ఆస్ట్రేలియా కూడా భారత్ బాటలోనే చైనా యాప్స్‌పై నిషేధం విధించే అంశంపై కసరత్తులు ప్రారంభించాయి. చైనా యాప్స్‌కు భారత్‌లో కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. యాప్స్‌ను అందిస్తున్న సంస్థల్లో చాలావాటికి భారత్‌లో కార్యాలయాలు ఉన్నాయి. వీటి సర్వర్లు మాత్రం చైనాలో ఉన్నాయి. ఇవి ఇక్కడి నుంచి కోట్లాది మంది భారతీయుల వ్యక్తిగత వివరాలను చైనా సర్వర్లకు చేరవేస్తున్నాయనేదే వీటిపై ప్రధాన అభియోగం. పౌరులకు సంబంధించిన గోప్యమైన వివరాలను దేశం వెలుపలకు పంపడం దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగకరమనే కారణంతోనే భారత ప్రభుత్వం వీటిని నిషేధించింది. గాల్వన్ లోయలో చైనా సైనికుల చొరబాటుకు ముందే, ఈ ఏడాది ఏప్రిల్ 20లోనే ప్రభుత్వం ‘ఈ యాప్స్ ద్వారా చైనా మీ వ్యక్తిగత వివరాలపై కన్నేసి ఉంటుంది’ అని ప్రజలను హెచ్చరించింది. దీనికితోడు సరిహద్దుల వద్ద కూడా చైనా ఆగడాలు శ్రుతి మించడంతో ప్రభుత్వం ఈ యాప్స్‌పై వేటు వేసింది. చైనా వస్తుబహిష్కరణపై భిన్నస్వరాలు గాల్వన్ లోయ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో చైనాపై ఆగ్రహావేశాలు చెలరేగాయి. ఆర్థికశక్తిగా అగ్రస్థానానికి ఎదగాలనే చైనా ఆకాంక్షలను ఆర్థికంగానే దెబ్బతీయాలని కొన్ని వాణిజ్య, వర్తక సంస్థలు అభిప్రాయపడ్డాయి. ప్రభుత్వం కూడా ఈ దిశగానే చర్యలకు సమాయత్తమవుతోంది. అయితే, చైనా వస్తువులను నియంత్రించడం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. చైనాకు చెందిన వస్తువులేవీ భవిష్యత్తులో ఉపయోగించరాదంటూ ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్కు ప్రభుత్వం సూచించింది. అయితే, వ్యూహాత్మక అంశాలను కార్పొరేట్ నిర్ణయాలతో కలపకుండా ఉంటేనే బాగుంటుందని టెలికం కంపెనీల సంస్థ ‘సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (సీఓఏఐ) ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే, చైనా వస్తువులను ఇప్పటికిప్పుడే బహిష్కరించడం సాధ్యమయ్యే పరిస్థితులు లేవని లార్సన్ అండ్ టర్బో సీఈవో ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఎలాంటి దుందుడుకు నిర్ణయం తీసుకున్నా, తలెత్తబోయే ప్రమాదాలను ఊహించవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దిశగా నిర్ణయం తీసుకునే ముందు సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా బేరీజు వేసుకోవాలని సూచించారు. ‘భారత్‌లో చైనా కంపెనీలు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నాయి. చాలా అంశాల్లో చైనా వస్తువులు నాణ్యమైనవే కాకుండా, తక్కువ ధరలకే దొరుకుతున్నాయి. చైనాతో మనకు వ్యాపార సమతుల్యత కూడా ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, చైనా వస్తువులను బహిష్కరించడం సాధ్యం కాదు. అలా కాకుండా, దీర్ఘకాలిక దృష్టితో చైనాను శత్రు దేశంగా పరిగణిస్తున్నట్లయితే, మన విధానాలను అందుకు అనుగుణంగా మార్చుకుని, అమలులోకి తేవాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పడుతుంది’ అని సుబ్రహ్మణ్యన్ అన్నారు. ఒకవైపు సుబ్రహ్మణ్యన్ ప్రకటనపై చర్చ సాగుతుండగా, మరోవైపు మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ కూడా ఈ అంశంపై గళం విప్పారు. ‘చైనా నుంచి వచ్చే వస్తువులను నిషేధించడం వల్ల దేశంలో వస్తువుల ధరలు పెరుగుతాయి. అంత నాణ్యమైన వస్తువులు అంత తక్కువ ధరకు భారత్‌లో అందుబాటులో లేవు. ఎంతోకాలంగా దిగుమతులపై ఆధారపడ్డ కంపెనీలకు ఇది లాభదాయకం కాదు. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ నానాటికీ పడిపోతోంది. దీనివల్ల కంపెనీల వ్యయం ఇదివరకటి కంటే బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వస్తువులను దిగుమతి చేసుకోవడం మినహా కంపెనీలకు మరో మార్గం లేదు’ అని ఆయన అన్నారు. మరోవైపు, చైనా వస్తువులపై అకస్మాత్తుగా నిషేధం విధిస్తే, అంతిమంగా జనాలపైనే ఆర్థిక భారం పడుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, చైనా దిగుమతుల నిషేధానికి వీలుగా ప్రభుత్వం ఎయిర్ కండిషనర్, టీవీల్లో విడి భాగాలు సహా పది పన్నెండు రకాల ఉత్పత్తులపై లైసెన్సింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు సమాయత్తమవుతోందంటూ కథనాలు వస్తున్నాయి. చైనా యాప్స్‌తో మొదలైన నిషేధపర్వం ఇంకెంత దూరం పోతుందో, పర్యవసానాలు ఎలా ఉంటాయోననే అంశంపై పారిశ్రామిక వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. చర్చ అంతా టిక్‌టాక్ పైనే.. టిక్‌టాక్‌ను కలుపుకొని మొత్తం 59 చైనా యాప్స్‌పై ప్రభుత్వం నిషేధం విధించినా, ప్రధానమైన చర్చ టిక్టాక్పైనే జరుగుతోంది. మారుమూల అనామకంగా ఉన్న చాలామంది ఔత్సాహికులకు తమ నటనా పాటవాన్ని చాటుకునే వేదికగా నిలిచింది ‘టిక్‌టాక్’. ఇలాంటి ఔత్సాహికుల్లో కొందరు ‘టిక్‌టాక్’ ద్వారానే పాపులారిటీ సాధించారు. వీడియో షేరింగ్ యాప్ అయిన ‘టిక్‌టాక్’ స్వల్పకాలంలోనే చాలామందికి వదులుకోలేని వ్యసనంలా మారింది. ప్రభుత్వం ‘టిక్‌టాక్’ను నిషేధించడంతో ఇలాంటి వాళ్ల కలల మేడలు ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లయింది. ‘టిక్‌టాక్’ మైకంలో పడి కొందరు ప్రమాదాలను కొని తెచ్చుకున్న సంఘటనలు, ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా తరచుగా వార్తలకెక్కాయి. టిక్‌టాక్‌పై నిషేధం తర్వాత ఇదే తరహాకు చెందిన స్వదేశీ వీడియో షేరింగ్ యాప్స్‌కు గిరాకీ పెరిగింది. ‘చింగారీ’, ‘లిట్లాట్’, ‘మిత్రోం’, ‘బోలో ఇండియా’ వంటి యాప్స్‌కు డౌన్లోడ్లు బాగా పెరిగాయి. ‘యూజర్ జెనరేటెడ్ కంటెంట్’ (యూజీసీ) షేర్ చేసుకోవడానికి ఉపయోగపడే యాప్స్‌లో ‘టిక్‌టాక్’ ఒక సంచలనం సృష్టించిందనే చెప్పుకోవాలి. నిషేధానికి గురైన మిగిలిన చైనా యాప్స్‌కు కూడా స్వదేశీ ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో యూజీసీ యాప్స్ నడుపుతున్న సంస్థల నిర్వాహకుల్లో ‘టిక్‌టాక్’ నిషేధం వరమా? శాపమా? అనే చర్చ మొదలైంది. యూజీసీ యాప్స్‌కు పాపులారిటీ పెరుగుతున్న నేపథ్యంలో వీటి ద్వారా వ్యాప్తి చెందుతున్న కంటెంట్ నాణ్యత, నైతికత, భాషా సాంస్కృతిక విలువలపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అశ్లీలత, అసభ్యకరమైన భాష వీటి ద్వారా వ్యాప్తి చెందడమే కాకుండా, వీటి వలలో చిక్కుకుని కుర్రకారు దారితప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్మార్ట్ఫోన్ల ద్వారా విరివిగా అందుబాటులోకి వచ్చిన పలు సామాజిక మాధ్యమాలు యూజర్లు తమదైన కంటెంట్‌ను ఇతరులతో తేలికగా పంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. కోట్లాది మంది యూజర్లు తమ కంటెంట్‌ను క్షణాల్లోనే ప్రపంచానికి చేరవేయగలుగుతున్నారు. కొందరు కంటెంట్‌ను సృష్టించడంలో వైవిధ్యాన్ని, సృజనాత్మకతను చూపుతుంటే, అక్కడక్కడా కొందరు వీటి ద్వారా తమ మనోవికారాలన్నింటినీ బయటపెట్టుకుంటున్నారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలను, అశ్లీలమైన చేష్టలు, అసభ్యమైన మాటలతో కూడిన వీడియోలను ప్రసారం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా యూజర్లు జనాలకు చేరవేసే కంటెంట్‌పై కట్టుదిట్టమైన పరిశీలన, నియంత్రణ తప్పనిసరిగా ఉండాలని, కంటెంట్ షేరింగ్‌కు అవకాశం కల్పిస్తున్న సంస్థలే ఈ బాధ్యతను జాగరూకతతో నిర్వర్తించాల్సి ఉంటుందని ‘మామ్స్ప్రెస్సో’ సీఈవో విశాల్ గుప్తా చెబుతున్నారు. ‘మామ్స్ప్రెస్సో’ మహిళల కోసం రూపొందిన ఆన్లైన్ యూజీసీ వేదిక. ఇది పది భాషల్లో పనిచేస్తోంది. దీనికి యూజర్ల నుంచి వచ్చే కంటెంట్‌లో ప్రతి పీస్‌ను తమ సిబ్బంది నిరంతరాయంగా పరిశీలిస్తూనే ఉంటారని, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ఉండే కంటెంట్‌ను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటారని విశాల్ తెలిపారు. సామాజిక మాధ్యమాలను నిర్వహించే సంస్థలు యూజర్ల కంటెంట్‌పై జాగ్రత్తలు తీసుకోక తప్పదని, భారత్ వంటి దేశంలో సాంస్కృతిక విలువలు, వివిధ వర్గాల ప్రజల మనోభావాలు వంటి సున్నితమైన అంశాలపై మరింత అప్రమత్తంగా ఉండటం అవసరమని సిలికాన్ వ్యాలీకి చెందిన వీడియో షేరింగ్ యాప్ ‘ఫైర్‌వర్క్’ సీఈవో సునీల్ నయ్యర్ అభిప్రాయపడుతున్నారు. -
బెదిరించైనా బహిష్కరించైనా గెలవగలమా?
చైనా వస్తువులు వాడటం మానేయడం ద్వారా మనం ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టగలమా? ఇప్పుడు సెలబ్రిటీలు డ్రాగన్ వస్తువులు బహిష్కరిద్దామని ఇస్తున్న పిలుపు చైనాకి నష్టమా, మనకా? కమ్యూనిస్టు పాలన ముసుగులో నియంత పాలన కొనసాగిస్తున్న చైనా, దాడి చేసైనా, ఆక్ర మిం‘చైనా’, బెదిరిం‘చైనా’ అన్ని రంగాల్లో ఆధిపత్యం నిలుç ³#కునే కుట్రలతో నెట్టుకొస్తోంది. స్వేచ్ఛా వాణిజ్య ప్రపం చంలో చైనా ఆర్థిక పెరుగుదల పెట్టుబడిదారీ పాశ్చాత్య వనరుల ప్రవాహం వల్లే సాధ్యమైంది. వాక్, పత్రికా స్వాతంత్య్రాల మాటే వినపడని చైనా ఇంకా మధ్యయుగపు ఆలోచనలతోనే పయనిస్తోంది. మన దేశానికి పెట్టని కోటలాంటి హిమాయాలను ఆనుకుని వున్న టిబెట్‌ను దురాక్రమించి స్వాధీనంలో ఉంచుకున్న చైనాతో మన దేశానికి సుదీ ర్ఘమైన సరిహద్దు ఉంది. చైనా దురాక్రమణ ప్రయత్నాలతో అది చాలాచోట్ల వివాదాస్పద సరిహద్దుగా మారింది. కరోనా వైరస్ వ్యాప్తికి చైనా కారణమని ప్రపంచమంతా వేలెత్తి చూపిస్తున్న నేపథ్యంలో, అగ్రరాజ్యం అమెరికా చైనాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించిన కఠిన సమయంలో, కయ్యానికి కాలు దువ్వేందుకు మన దేశాన్ని ఎంచుకుంది చైనా. దీంతో మనదేశం ప్రతీకార చర్యకి దిగాల్సిందేనని ఒక్క మాట పైకొచ్చింది. చైనాని దెబ్బకొట్టాలంటే, వారి ఆర్థికశక్తిని దెబ్బకొట్టాలని ప్రముఖులు పిలుపు నిచ్చారు. సామాజిక మాద్యమాల వేదికగా సెలబ్రిటీలు చెనా తయారీ వస్తువులను బహిష్కరిద్దామంటూ ఒక ఉద్యమంలా చేపట్టారు. అయితే మన ఆర్థిక శక్తి, తయారీ శక్తిని చైనాతో పోలిస్తే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. ప్రపంచ వాణిజ్య రంగంలో 2019 లెక్కల ప్రకారం మన దేశ వాటా కేవలం 3 శాతం అయితే, చైనాది 17 శాతం. వస్తువుల వాడకం నిలిపేయడం ద్వారా చైనాను ఇబ్బంది పెట్టగలమా? చైనా వస్తువుల నిషేధం అనేది ఓ భావోద్వేగపు ప్రకటన గానే చూడాలి. వాస్తవంలోకి వస్తే పరిస్థితులు భిన్నంగా వుంటాయి. 2018 గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా చైనా చేస్తున్న ఎగుమతుల్లో భారతదేశా నికి చేస్తున్నవి 2.5 శాతం మాత్రమే. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో చైనాది 3వ స్థానం. ఔషధ ఉత్పత్తులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ టెలికం, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది భారత్. ఆటో మొబైల్ విడి భాగాలు (30%), సైకిల్ భాగాలు (50%), సెల్‌ఫోన్ విడి భాగాలు (70%), బొమ్మలు (90%) చైనా నుంచి వస్తున్నవేనంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతల భావోద్వేగానికి దేశ ప్రజలు గురవడం సహజం. దేశభక్తి ప్రకటన ఉండాల్సిందే. అయితే మేడ్ ఇన్ చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునివ్వడం ద్వారా చైనాను అడ్డుకోవడం ప్రస్తుతానికి అసాధ్యం. చైనా దిగుమతులపై ఆధారపడిన మనం ఆ దేశ ఉత్పత్తులు బహిష్క రిస్తామంటే, వివిధ రంగాల ఉత్పత్తుల కోసం బంగ్లాదేశో, వియత్నామో, కొరియా పైనో ఆధారపడాల్సిన పరిస్థితి. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా మన దేశంలో విదేశీ వస్త్ర బహిష్కరణని ఒక ఉద్యమంగా చేపట్టారు. 1980 ప్రాంతంలో అమె రికాలో జపాన్ కార్ల వాడకంపై, 1990లలో గల్ఫ్ యుద్ధం కారణంగా అమెరికా ఉత్పత్తులు వాడొద్దంటూ మధ్య ప్రాచ్య దేశాలలో ఇటువంటి ఉద్యమాలే వచ్చాయి. తాత్కాలికమైన భావోద్వేగాలను చల్లార్చే వీటివల్ల వచ్చే ప్రయోజ నాలు గానీ, అటువైపుగా పెద్దగా నష్టపోయేవి గానీ ఏమీ వుండవు. మనదేశంలో ఉత్పత్తి రంగం, వాణిజ్య రంగం స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు ఉపయోగపడిననాడు, భారతదేశ సెల బ్రిటీలు స్వదేశీ వస్తువులను మాత్రమే ప్రమోట్ చేస్తూ, స్వదేశీ వాణిజ్యవేత్తలను ప్రోత్సహించినపుడు ఇటువంటి వస్తుబహిష్కరణల పిలుపునకు అర్థం వుంటుంది. ఎందుకంటే, చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా మన దేశంలో తయారుచేసుకునే సామర్థ్యం సంతరించుకోవడానికి భారత్‌కు అను కూలత ఉంది. భారతదేశం లేబర్ ఫోర్స్ 52 కోట్లు ఉండగా, చైనా లేబర్ ఫోర్స్ 80 కోట్లు. ఆసియా ఖండంలో 14 కోట్లతో ఇండోనేషియా మూడో స్థానంలో ఉంది. నైపుణ్యం గల శ్రామిక లభ్యతలో భారత్ 47వ స్థానంలో ఉంటే, చైనా 41వ స్థానంలో ఉంది. అయితే భారతదేశంలో 65% మంది 35 సంవత్సరాల లోపు వాళ్లే, 50% మంది 25 సంవత్సరాల లోపు వాళ్లే. దేశ తలసరి వయసు 29 ఏళ్లు. జపాన్ తలసరి వయసు 48 సంవత్సరాలు. అదే యూరప్, చైనా, అమెరికాలో వయసు దాదాపు 42 సంవత్సరాలు. అందువల్లే గత రెండు మూడు దశాబ్దాలుగా చైనా మాన్యుఫాక్చరింగ్, నైపుణ్యవంతమైన మానవ వనరులను సప్లై చేయ డంలో ముందుంది. కానీ రాబోయే రెండు మూడు దశాబ్దాలు మాన్యు ఫాక్చరింగ్లో భారత్‌వే. దాదాపు 15–20 కోట్లమందిని నైపుణ్యవంతమైన మానవ వనరులుగా తీర్చిదిద్దిగలిగితే ప్రపంచానికి కావలసిన ఉత్పత్తులని భారత్ తయారు చేయగలదు. కానీ భారతదేశం యొక్క రాజకీయ వ్యవస్థ మరియు వాటిని పాలించే క్యాబినెట్ మంత్రులు అందరూ 70 సంవత్సరాల పైబడిన వారే. వారి ఆలోచనలు నేటి యువతరానికి ఉపయోగపడే విధంగా లేవు అనేది నా అభి ప్రాయం. ఏ వయసు వాళ్లలో ఆ వయసుకు తగిన విధంగా ఆలోచనలు ఉంటాయి. ప్రభుత్వాలు యువతను సంక్షేమ మరియు నిరుద్యోగ భృతి వైపు మరల్చకుండా నైపుణ్యత నేర్పితే వచ్చే రెండు మూడు దశాబ్దాలలో చైనా ఆర్థిక వ్యవస్థ కంటే భారత్ ముందుంటుంది. వ్యాసకర్త: శ్రీనుబాబు గేదెల, పారిశ్రామికవేత్త -
చిలకలపూడిని మింగేస్తున్న డ్రాగన్
సాక్షి, అమరావతి: చైనా.. మన భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడమే కాదు.. మారుమూల ప్రాంతాలకు సైతం చొచ్చుకొచ్చి మన మార్కెట్లను కబ్జా చేసేసింది. చైనా వస్తువుల్ని బహిష్కరించాలనే డిమాండ్ పురుడు పోసుకోకముందే.. రోల్డ్ గోల్డ్ (గిల్టు) నగల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చిలకలపూడి మార్కెట్‌ను డ్రాగన్ మింగేసింది. ‘బంగారం’ లాంటి నగలు ► చిలకలపూడి చుట్టుపక్కల దాదాపు వందేళ్ల నాటినుంచి గిల్టు నగలు తయారు చేస్తున్నారు. ► గాజులు, వడ్డాణాలు, చెవి దిద్దులు, నెక్లెస్‌లు, హారాలు, పాపిడి బిళ్లలు, జడగంటలు, దేవతా విగ్రహాలకు కిరీటాలు, హారాలు, గొలుసులు, వంకీలు, పట్టీలు, మాటీలను వేలాది డిజైన్లలో తయారు చేసే నిపుణులకు ఇక్కడ కొదవలేదు. వీటికి 6 నెలలు, ఏడాది, రెండుమూడేళ్ల వరకు గ్యారంటీ ఇచ్చి మరీ విక్రయిస్తుంటారు. ► ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన చిలకలపూడి బంగారం కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ మార్కెట్లకు ఇమిటేషన్ నగలు అందిస్తోంది. ► కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 10 వేల కుటుంబాలు (45 వేల మందికి పైగా కార్మికులు) వీటి తయారీపై జీవనోపాధి పొందుతున్నాయి. మచిలీపట్నంలోని పోతేపల్లి జ్యువెలరీ పార్కులో మొత్తం 236 పరిశ్రమలున్నాయి. ► వీటికి అనుబంధంగా మచిలీపట్నం, గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, చల్లపల్లి, ఘంటసాల, పామర్రు, మొవ్వ తదితర ప్రాంతాల్లో వేలాది మంది ఇళ్ల వద్ద నగలకు రాళ్లు అద్దడం, మంగళ సూత్రాలకు మెరుగులు అద్దడం, పూసల దండలు చుట్టడం వంటి వివిధ రకాల పనులు చేస్తుంటారు. రూ.80 కోట్ల టర్నోవర్‌ను మింగేసిన డ్రాగన్ ► మచిలీపట్నం ప్రాంతంలో నెలకు సగటున రూ.7 కోట్ల చొప్పున ఏడాదికి రూ.80 కోట్ల విలువైన ఇమిటేషన్ నగలు ఉత్పత్తి అయ్యేవి. ► గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఇమిటేషన్ నగలపై కన్నేసిన డ్రాగన్ క్రమంగా చిలకలపూడి పరిశ్రమను కబ్జా చేసింది. ► ప్రస్తుతం చిలకలపూడి నగల మార్కెట్లో ఏకంగా 60 శాతం చైనా ప్రమేయం ఉంటే.. కేవలం 40 శాతం మాత్రమే స్థానికత ఉంది. ► నాణ్యత మాట అటుంచితే చైనా ఉత్పత్తుల ధర తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. లాభాలు తగ్గాయి చైనా సరుకులు తక్కువ ధరకు వస్తున్నాయనే దిగుమతి చేసుకుంటున్నాం. 60 శాతం చైనా సరుకులు మన మార్కెట్‌ను ఆక్రమించాయి. వాటి నాణ్యత ఎలా ఉన్నా ముందుగానే డబ్బులు చెల్లించాల్సి రావడంతో లాభాలు తగ్గిపోయాయి. అవే ధరలకు మన దేశీయ మార్కెట్లో ముడి సరుకుల ఉత్పత్తి జరిగితే చైనా సరుకుల్ని బహిష్కరించవచ్చు. – పీవీ సుబ్బారావు, అధ్యక్షుడు, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వయం సమృద్ధి సాధిస్తేనే.. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే నినాదం చాలా గొప్పదే. అయితే, మనం స్వయం సమృద్ధి సాధించే దిశగా దిగువ స్థాయి వరకు ప్రయత్నం జరగాలి. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన చిలకలపూడి గిల్టు నగల రంగాన్ని నిలబెట్టుకునే స్థాయిలో మన ప్రయత్నాలు గట్టిగా జరగాలి. – నూకల సురేష్, గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ అధినేత -
డ్రాగన్‌తో కటీఫ్ సాధ్యమేనా
చేతిలో రెడ్మి స్మార్ట్‌ఫోన్... ఓపెన్ చేస్తే టిక్‌టాక్ వీడియో... చెవిలో షియోమి ఇయర్ ఫోన్... అలీ ఎక్స్‌ప్రెస్‌లో నచ్చిన వస్తువుకు ఆర్డర్... పేటీఎంలో ఫ్రెండ్‌కి క్షణాల్లో నగదు బదిలీ... ఇలా ఒకటేమిటి చేతికి తొడుక్కునే వాచీ నుంచి కాలికి వేసుకునే చెప్పుల వరకూ అన్నింటికీ ఒకటే లింకు.. అరే ఠక్కున భలే చెప్పేశారే! అదేమరి చైనా ‘చౌక’ మహిమ!! భారతీయులను తన చౌక ఉత్పత్తులతో బానిసలుగా మార్చేసిన డ్రాగన్... అదును చూసి మనపైనే బుసలు కొడుతోంది. సరిహద్దుల్లో భారతీయ సైనికులను దొంగదెబ్బతీస్తూ... తన ఉత్పత్తులను మాత్రం రాజమార్గంలో ఎడాపెడా అమ్ముకుంటోంది. దేశంలో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్. చైనా వస్తువులను బహిష్కరించి డ్రాగన్‌తో వాణిజ్య యుద్ధం చేయాలంటూ సోషల్ మీడియాలో ఒకటే హల్చల్. మరి ఇది సాధ్యమయ్యే పనేనా? అసలు చైనాతో మనకున్న ఆర్థిక, వాణిజ్య బంధం ఏ స్థాయిలో ఉంది. దీన్ని తెంచుకుంటే మనకొచ్చే ఇబ్బందులేంటి? దిగుమతులు, ఎగుమతులు ఆగిపోతే మన కంపెనీలు పడే అవస్థలు ఎలా ఉంటాయి? వీటన్నింటినీ వివరించే ‘సాక్షి బిజినెస్ డెస్క్’ ప్రత్యేక కథనమిది... చైనా–భారత్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండుమూడేళ్లుగా ముదురుతూ వస్తున్న సరిహద్దు ఉద్రిక్తతలు... తాజాగా గల్వాన్ లోయలో 20 మంది భారతీయ సైనికుల ఊచకోతతో మరింత తీవ్రరూపం దాల్చాయి. గడిచిన 40 ఏళ్లలో ఇరు దేశాల మధ్య ఇంత ఘోరమైన ఘర్షణ చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనికితోడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌కు మూలం కూడా చైనాయే కావడంతో భారతీయులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. చైనా ఉత్పత్తులు, కంపెనీలను బహిష్కరించాలంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి. అయితే, ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ఇప్పుడు ఒకదానితో మరొకటి పెనవేసుకుపోయాయి. మరీ ముఖ్యంగా చైనా లాంటి బాహుబలి ఎకానమీతో అంటీముట్టనట్టుగా ఉండటం మనకేకాదు అమెరికాలాంటి అగ్రదేశానికీ సాధ్యంకాని పరిస్థితి. 14.14 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అంతకంతకూ విస్తరిస్తోంది. భారత్ జీడీపీ 2.94 లక్షల కోట్లు మాత్రమే (ఆసియాలో నంబర్–3, ప్రపంచంలో నంబర్–5). పారిశ్రామిక యంత్రాలు, విడిభాగాలు, ముడి పదార్థాల సరఫరా నుంచి స్టార్టప్‌లు, టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడుల వరకూ అమెరికా తర్వాత భారత్‌కు చైనా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. చైనా ముడి పదార్థాలు, విడిభాగాలపై అత్యధికంగా ఆధారపడిన మన పరిశ్రమలకు అంత చౌకగా ప్రపంచంలో మరేదేశం కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో కేవలం సరిహద్దు ఘర్షణ, కరోనా కారణంగా చైనాతో వాణిజ్య, ఆర్థిక బంధాన్ని తెంచుకోవడం అంత సులువేమీ కాదనేది నిపుణుల అభిప్రాయం. ద్వైపాక్షిక వాణిజ్యం @ రూ.7.3 లక్షల కోట్లు 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల్లో 5.33 శాతం అంటే దాదాపు రూ.1.8 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు చైనాకు వెళ్లాయి. అయితే, చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విలువ ఎంతో తెలుసా? రూ.5.5 లక్షల కోట్లు. అంటే మూడు రెట్లు ఎక్కువ. మన మొత్తం దిగుమతుల్లో ఇది ఏకంగా 14 శాతం. భారత్‌కు చైనాయే అతిపెద్ద దిగుమతిదారు కూడా. 2000 సంవత్సరం నుంచి 2018–19 నాటికి చూస్తే చైనా నుంచి బారత్‌కు దిగుమతులు 45 రెట్లు ఎగబాకి 70 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. డ్రాగన్ మన దేశంలోకి చౌక వస్తువులను ఎలా కుమ్మరిస్తోందో... అదేవిధంగా చైనా దిగుమతులపై మనం ఎంతగా ఆధారపడిపోయామో చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు అంతకంతకూ తీవ్రమవుతోంది. మొబైల్స్, కన్సూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, విద్యుత్ ఉపకరణాలు, పవర్ ప్లాంట్ పరికరాలు, ఎరువులు, వాహన విడిభాగాలు, ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తులు, టెలికం పరికరాలు, మెట్రో రైలు కోచ్‌లు ఇతరత్రా యంత్ర పరికరాలు, ఔషధ ముడిపదార్థాలు, రసాయనాలు మరియు ప్లాస్టిక్స్, ఇంజినీరింగ్ గూడ్స్... ఇలా చెప్పుకుంటూ పోతే చైనా నుంచి మనం దిగుమతి చేసుకునే ఉత్పత్తుల లిస్టు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలా వెళ్తూనే ఉంటుంది. చైనా ముడి వస్తువులపై ఆధారపడిన మన కంపెనీలు, పరిశ్రమలకు వాటి సరఫరా నిలిచిపోతే లక్షలాది మందికి ఉపాది కరువయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. మరోపక్క, చైనాకు ఎగుమతులు నిలిచిపోతే వాటిపై ఆధారపడిన మన కంపెనీలకూ తీవ్ర నష్టమే. ప్రధానంగా భారత్‌నుంచి చైనాకు ఆర్గానిక్ రసాయనాలు, ముడి ఖనిజం, మినరల్ ఆయిల్స్, మినరల్ ఫ్యూయెల్స్ ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జోరు... భారత్‌లోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో(ఎఫ్‌డీఐ) చైనా జోరు గడిచిన రెండుమూడేళ్లుగా పుంజుకుంది. ముఖ్యంగా లోహ సంబంధ పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం (సోలార్ ప్యానెల్స్), విద్యుత్ పరికరాలు, వాహన రంగం మరియు రసాయన పరిశ్రమల్లోకి చైనా నుంచి ఎఫ్‌డీఐలు భారీగా వస్తున్నాయి. ఇప్పటిదాకా భారత్‌లోకి వచ్చిన, ప్రణాళికల్లో ఉన్న చైనా ఎఫ్‌డీఐల విలువ 2600 కోట్ల డాలర్లుగా (దాదాపు రూ.1.98 లక్షల కోట్లు) అంచనా. భారత్‌లో చైనాకు చెందిన 75 తయారీ ప్లాంట్లు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒప్పో, షావోమి, వివో, ఫోసున్, హేయర్, ఎస్ఏఐసీ, వంటివి భారత్‌లో ప్లాంట్లున్న అతిపెద్ద బ్రాండ్స్‌లో కొన్ని. ఇక చైనాలో కార్యకలాపాలున్న తయారీ సంస్థల్లో అదానీ గ్లోబల్, డాక్టర్ రెడ్డీస్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, బీఈఎంఎల్, బీహెచ్ఈఎల్, గోద్రేజ్ అండ్ బాయ్స్, అరబిందో వంటివి ఉన్నాయి. స్టార్టప్స్‌లోకి నిధుల వరద... భారతీయ స్టార్టప్ సంస్థలకు నిధుల తోడ్పాటును అందించడంలో చైనా కంపెనీలు ముందువరుసలో నిలుస్తున్నాయి. ప్రధానంగా చైనా ఫండ్స్, కంపెనీలు తమ సింగపూర్, హాంకాంగ్, మారిషస్‌లోని సంస్థల ద్వారా భారత్‌లోని స్టార్టప్‌లకు నిధులను మళ్లిస్తున్నాయి. ఉదాహరణకు చైనాకు చెందిన ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ పేటీఎంలో పెట్టుబడిని అలీబాబా సింగపూర్ హోల్డింగ్స్ ద్వారా వెచ్చించింది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పెట్టుబడి నేరుగా చైనా నుంచి వచ్చినట్లు కాదు, సింగపూర్ ఖాతాలోకి వెళ్తుంది. ఇలా మారువేషంలో చైనా నుంచి భారత్‌లోకి వస్తున్న పెట్టుబడులు చాలానే ఉన్నాయని ‘గేట్‌వే హౌస్’ నివేదిక చెబుతోంది. మొత్తంమీద భారత్‌లోని 30 స్టార్టప్ యూనికార్స్న్(బిలియన్ డాలర్లకు మించి విలువ కలిగినవి)కు ఈ ఏడాది మార్చివరకూ చైనా టెక్ ఇన్వెస్టర్ల నుంచి లభించిన మొత్తం పెట్టుబడులు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 30,000 కోట్లు) పైనే ఉంటుందని అంచనా. బల్క్ డ్రగ్స్... చైనాయే ఆధారం! పరిమాణం పరంగా భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. విలువ పరంగా చూస్తే 14 ర్యాంకు మాత్రమే. 2018–19లో భారత్ 1400 కోట్ల డాలర్లకు పైగా విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. అదేసమయంలో ఔషధాల తయారీలో అత్యంత కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రేడియంట్స్(ముడి పదార్థాలు–ఏపీఐ) దిగుమతుల్లో మూడింట రెండు వంతులు చైనా నుంచే నమోదవడం గమనార్హం. ఇప్పుడు ఉన్నపళంగా చైనా దిగుమతులను తగ్గించుకుంటే... ఆమేరకు మనకు సరఫరా చేసేందుకు ఇతరదేశాలేవీ సిద్ధంగా లేవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చైనా గనుక సరఫరా తగ్గిస్తే మన ఔషధ రంగానికి చాలా నష్టం వాటిల్లుతుందనేది ఫార్మా సంస్థల ఆందోళన. స్మార్ట్ ఫోన్స్‌లో ఆధిపత్యం.. భారత్‌లో అమ్ముడవుతున్న ప్రతి 100 స్మార్ట్‌ఫోన్స్‌లో 72 చైనావే అంటే నమ్ముతారా? అవును ఇది ముమ్మాటికీ నిజం! అంతగా మనం చైనా చౌక మొబైల్స్‌కు అలవాటుపడిపోయాం. షావోమీ, వివో, ఒప్పో, వన్‌ప్లస్ వంటి బ్రాండ్స్ మొత్తం కలిపి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 72% వాటాను కొల్లగొట్టాయని గేట్‌వే హౌస్ నివేదిక పేర్కొంది. చైనా మొబైల్స్ దెబ్బకి శాంసంగ్, యాపిల్ అట్టడుగుకు పడిపోయాయి. టిక్ ‘టాప్’...: భారత్‌లో చైనా మొబైల్ యాప్ టిక్‌టాక్‌కు ఉన్న ప్రాచుర్యం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. 2016 సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చిన టిక్‌టాక్‌కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు(నెలవారీ) ఉన్నారు. దాదాపు 200 కోట్ల మేర డౌన్లోడ్స్ అయ్యాయి. ఇందులో సుమారు 50 కోట్ల డౌన్లోడ్స్ భారత్ నుంచే ఉండటం గమనార్హం. టిక్‌టాక్ వాడకంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానం(తర్వాత స్థానాల్లో చైనా–18 కోట్ల డౌన్లోడ్స్, అమెరికా–13 కోట్ల డౌన్లోడ్స్) ఉంది. చైనా ప్రతీకారం.. న్యూఢిల్లీ: భారత్‌లో స్వదేశీ ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో చైనా ప్రతీకార చర్యలకు దిగుతోంది. తమ కన్సైన్మెంట్లను హాంకాంగ్, చైనా కస్టమ్స్ అధికారులు నిలిపివేస్తున్నారంటూ ఎగుమతిదారులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై పోర్టులో చైనా నుంచి వచ్చిన దిగుమతులకు సంబంధించి భారత అధికారులు తీసుకున్న చర్యలకు ప్రతిగా ఆ దేశం ఇలాంటి చర్యలకు దిగుతోందని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో పేర్కొంది. ‘చైనా దిగుమతులన్నింటినీ కస్టమ్స్ శాఖ భౌతికంగా ఒక్కో దాన్నీ తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా దిగుమతుల వ్యయం పెరిగిపోతోంది. దీంతో హాంకాంగ్, చైనా కస్టమ్స్ అధికారులు కూడా భారత్ నుంచి వచ్చే కన్సైన్మెంట్ల పై ఇలాంటి వైఖరే చూపిస్తున్నారు‘ అని వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్‌కు రాసిన లేఖలో ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్కె సరాఫ్ పేర్కొన్నారు. కింకర్తవ్యం..? చైనాతో సరిహద్దు వివాదం ముదిరింది కాబట్టి ఆ దేశంతో పూర్తిగా తెగదెంపులు చేసుకునే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా చేస్తే చైనా కంటే భారత్‌కే అధిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నాయి. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్(స్వయం సమృద్ధి)తో దేశీయంగా తయారీకి ప్రోత్సాహం లభించినప్పటికీ.. చైనా కంపెనీలు, చైనా దిగుమతులను పూర్తిగా లేకుండా చేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. మేకిన్ ఇండియానే చూసుకుంటే... భారత్‌లో తయారీ ప్లాంట్లను పెట్టాలని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు షావోమీ, వివో, ఒప్పో, హేయర్ తదితర అనేక చైనా కంపెనీలు సైతం భారత్‌లో ప్లాంట్లు నెలకొల్పాయి. భారీగా పెట్టుబడులు, ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సరిహద్దు వివాదాలను సాకుగా చూపి వాటిని వెళ్లగొట్టగలమా? అలాచేస్తే అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘన కింద మనం భారీగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సి రావడంతోపాటు ఇన్వెస్టర్లలో అభద్రతా భావం నెలకొనేందుకు దారితీస్తుంది. దిగుమతుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. అయితే, చైనా నుంచి క్రమంగా దిగుమతులను తగ్గించుకోవచ్చని.. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌కు తైవాన్, మలేషియా, జపాన్, కొన్ని యూరప్ దేశాలను ప్రత్యామ్నాయంగా మార్చుకోవచ్చని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. మేకిన్ ఇండియాలో చైనాకు క్రమంగా ప్రాధాన్యం తగ్గించి ఇతర దేశాలను ప్రోత్సహించేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం మంచిదనేది వారి సూచన!! సాక్షి బిజినెస్ విభాగం -
మార్కెట్లోంచి చైనాను తొలగించాలంటే...
భారత్–చైనా సరిహద్దులో 20 మంది ఇండియా సైనికుల్ని చైనా క్రూరంగా చంపేసిన ఘటనతో, భారతీయుల్లో జాతీయవాద ఉద్వేగాన్ని రెచ్చగొట్టినట్ట యింది. సరైన కారణంతో పెల్లుబికిన ఈ సహేతుకమైన ఆగ్రహజ్వాలలు చైనా వస్తువుల మీద వ్యతిరేకతకు దారి తీశాయి. అయితే, ఈ ఉద్వేగాగ్నికి ప్రయోజనం చేకూరాలంటే, చైనీయుల ఆయువు పట్టుపై దెబ్బ కొట్టాలి. దీనికి ఆలోచనాపూరితమైన వ్యూహం కావాలి. అప్పుడే ఆర్థికంగా చైనాను దెబ్బ తీయగలం. దీనికిగానూ మన వస్తూత్పత్తి శక్తి సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇది, గత రెండు దశాబ్దాల్లో మన దేశీయ మార్కెట్లో చైనా వస్తూత్పత్తి ప్రాభవానికి భారతీయ పరిశ్రమ ఎంతగా తలొగ్గిందనే కీలకమైన ప్రశ్నను ముందుకు తెస్తుంది. భారత స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ ఆర్థిక సామర్థ్యాన్ని బలహీనపరిచినట్టుగా, ప్రస్తుతం నొక్కి చెబుతున్న ఆత్మనిర్భ రత ఇప్పుడు మరింత అత్యావశ్యం. లేదంటే టీవీ కెమెరాల ముందు చైనా తయారీ టీవీలు, ఫోన్లను ధ్వంసం చేయడం ప్రజల కోపాగ్నిని చూపే ఒక మనోరంజకమైన దృశ్యం కాగలదంతే. గత రెండు దశాబ్దాల్లో భారతీయ మార్కెట్లో అత్యధిక భాగాన్ని వశం చేసుకున్న చైనా, దాన్ని విçస్తృతమైన వస్తుశ్రేణి వరదలో ముంచెత్తింది. ఏ వినియోగదారుడికైనా ధర అనేది కీలకాంశం. 2000 సంవత్సర ప్రాంతంలో చైనా తన డ్రై పెన్సిల్ బ్యాటరీలను ఒక్కోదాన్ని 50 పైసల చొప్పున అమ్మకానికి దింపినప్పుడే ధరలో ఉన్న బలం ఏమిటో భారతీయ పరి శ్రమకు తెలిసొచ్చింది. అప్పుడు ఇండియన్ బ్రాండ్లు ఒక్కో దాన్ని రూ.8 నుంచి 10 వరకు అమ్ముతున్నాయి. చైనా వస్తువుల నాణ్యత నాసిరకందని భారతీయ పరిశ్రమ ఎంత ప్రచారం చేసినా అది వినియోగదారులకు ఏమాత్రం పట్టలేదు. పైగా భారతీయ పరిశ్రమ ఇన్నాళ్లుగా తమను అధిక ధరతో మోసం చేసిందన్న భావనకు అత్యధికులు లోనవడం భారత దేశీయ మార్కెట్‌ను మరింత దెబ్బతీసింది. దాంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మార్కెట్‌ను చైనాకు కోల్పోవడంతో అవి నిలదొక్కుకోవడం కష్టమైపోయింది. అయితే కొద్దిపాటి పరిశ్రమలు మాత్రం దేశీయంగానే కాదు, అంతర్జాతీయ విపణి లోనూ చైనాను ఎదుర్కొని నిలబడ్డాయి. అగ్రశ్రేణి మోటార్‌సైకిల్ తయారీదారైన బజాజ్ కంపెనీ దీనికి ఒక ఉదాహరణ. వీళ్లు మేధోకార్మికులకు అత్యధిక వేత నాలు చెల్లించారు; పరిశోధన–అభివృద్ధి(ఆర్ అండ్ డీ), డిజైన్, మార్కెటింగ్ కోసం అధికంగా ఖర్చు చేశారు. చైనా మీద పైచేయి సాధించారు. కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉమ్మడిగా ఘోరంగా విఫలమై, సప్లై చైన్ల, టెక్నాలజీల దిగుమ తుల మీద ఆధారపడిన దేశీయ పరిశ్రమ చైనాను ఎదుర్కో గలదా? కనీసం దేశీయ మార్కెట్లోనైనా? బహువిధమైన వాణిజ్య ఒప్పందాల యుగంలో చైనా ఉత్పత్తులను నిషేధిం చడం ప్రభుత్వానికి సాధ్యం కాకపోవచ్చు. వివిధ రంగాల్లో చైనా మీద మనం ఎలా ఆధారపడివున్నామో చూడండి: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా 72 శాతం వాటా కలిగివుంది, టెలికం పరి కరాల్లో 25 శాతం, స్మార్ట్ టీవీల్లో 45 శాతం, ఇంటర్నెట్ యాప్స్‌లో 66 శాతం, సౌర విద్యుత్‌లో 90 శాతం, స్టీలులో 18–20 శాతం, ఔషధరంగంలో 60 శాతం మార్కెట్ చైనా సొంతం. ఈ విభాగాల్లో ఆదరాబాదరగా చైనా స్థానంలోకి మరోదాన్ని భర్తీచేయడం చాలా కష్టం. ఇలాంటి కీలక సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వాటి పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయలేకపోవడం బాధాకరం. అప్పటికే అంతంతమాత్రంగా ఉన్నవి 2016 నుంచీ వరుసగా తగులుతున్న దెబ్బలతో కోలుకోవడానికి పోరాడుతూవున్నాయి. ఇంతలో తలెత్తిన కోవిడ్–19 ఉపద్ర వమూ, తదనంతరం ప్రభుత్వం విధించిన కఠిన లాక్‌డౌన్‌తో లేవలేని ఆ తుదిదెబ్బ కూడా పడింది. ఈ తరహా పరిశ్రమలు మన దగ్గర 6.34 కోట్ల యూనిట్లు ఉండి, జీడీపీలో 30 శాతం మేరకు తోడ్పడుతున్నాయి. అలాగే ఉత్పత్తిలో 33 శాతం వాటా కలిగి వున్నాయి. కాబట్టి వీటిని బలోపేతం చేయడంలో సాయ పడటం ద్వారా దేశీయ మార్కెట్లో చైనాను ఎదుర్కొనేటట్టు చేయాలి. దేశ ఎగుమతుల్లో 45 శాతం వాటా కలిగివున్న ఈ రంగ ప్రాధాన్యత దేశ ఆర్థికవ్యవస్థ దృష్ట్యా విస్మరించలేనిది. మోదీ ప్రభుత్వం ఈ రంగానికి కూడా ప్యాకేజీ ప్రకటించిన మాట వాస్తవమే గానీ, క్షేత్రస్థాయిలో ఈ కర్మాగారాలు నడిపే వారి అనుభవం పూర్తి నిరాశగా ఉంది. ఎంత సదుద్దేశంతో ఎన్ని ప్రభుత్వ పథకాలు ప్రారంభించినా, వాటి అమలుతీరు అంత కంటే కీలకం అవుతుంది. అధికారంలో ఎవరు ఉన్నారన్న దానితో నిమిత్తం లేకుండా, ప్రభుత్వ సేవలు లబ్ధిదారులకు అందడంలో నిరాశ కొనసాగుతూనేవుంది. ఇంకా ముఖ్యంగా, ఈ లోపభూయిష్టమైన బట్వాడా విధానం ప్రపంచానికే వస్తూ త్పత్తి కేంద్రం కావాలన్న భారత ప్రభుత్వ స్వప్నాలను పట్టాలు తప్పించవచ్చు. కానీ ప్రపంచంలోని అన్ని చోట్లకూ నౌకాయాన వసతి కలిగివున్న ఇండియాకు ద్వీపకల్పం పొడవునా ప్రపంచ వస్తూ త్పత్తి కేంద్రం కావడానికి దోహదపడే సానుకూల అంశాలెన్నో ఉన్నాయి. లక్ష్మణ వెంకట్ కూచి వ్యాసకర్త, సీనియర్ పాత్రికేయుడు -
ఎలక్ట్రానిక్స్‌కు ప్రత్యామ్నాయ మార్కెట్లున్నాయ్..
ముంబై: చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి ఎలక్ట్రానిక్స్ దిగుమతులను భారత్ నిజంగానే తగ్గించుకోదల్చుకుంటే ప్రత్యామ్నా య మార్కెట్లు చాలానే ఉన్నాయని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ముంబై (డబ్ల్యూటీసీ) వెల్లడించింది. సింగపూర్, మలేసియా, తైవాన్, అమెరికా నుంచి దిగుమతులను పెంచుకునే అంశం పరిశీలించవచ్చని పేర్కొంది. డబ్ల్యూటీసీ గణాంకాల ప్రకారం చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ గూడ్స్‌లో ఎక్కువగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, టీవీ సెట్లు ఉంటున్నాయి. చమురుయేతర ఉత్పత్తుల దిగుమతుల్లో చైనాకు 14% వాటా ఉంటోంది. ‘2019 ఏప్రిల్ నుంచి 2020 ఫిబ్రవరి మధ్య కాలం లో మొత్తం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతుల విలువ రూ.3.59 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో చైనా నుంచి దిగుమతుల విలువ సుమారు రూ. 1.42 లక్షల కోట్లు.. అంటే దాదాపు మొత్తం దిగుమతుల్లో 40% వాటా’ అని డబ్ల్యూటీసీ తెలిపింది. ప్రస్తుతం చైనా నుంచి దిగుమతుల్లో అత్యధిక వాటా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులదే (కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక దిగుమతులు, కంప్యూటర్, ఐటీ హార్డ్‌వేర్, మొబైల్ ఫోన్స్ మొదలైనవి) ఉంటోంది. మొబైల్ దిగుమతులు తగ్గినా.. చైనాదే హవా.. గత ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల దిగుమతులు మొత్తం మీద తగ్గినప్పటికీ చైనా వాటా మాత్రం పెరగడం గమనార్హం. 2019 ఏప్రిల్ – 2020 ఫిబ్రవరి మధ్య కాలంలో సెల్ ఫోన్ దిగుమతులు సగానికి సగం పడిపోయాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలోని రూ. 11,304 కోట్ల నుంచి రూ. 6,313 కోట్లకు క్షీణించాయి. దేశీయంగా తయారీ పెరగడం, హ్యాండ్‌సెట్స్‌పై దిగుమతి సుంకాలు పెంచడం ఇందుకు కారణం. అయితే, చైనా నుంచి కూడా దిగుమతులు తగ్గినప్పటికీ మొత్తం దిగుమతుల్లో దాని వాటా 55 శాతం నుంచి 75 శాతానికి పెరిగింది. దేశీయంగా ఉత్పత్తికి ఊతం... కేంద్రం ఇటీవల కొన్నాళ్లుగా దేశీయంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకోవడంతో పలు స్కీములను అమలు చేస్తోంది. దీంతో 2014–2020 మధ్య కాలంలో దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ 20.6 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.73 లక్షల ఓట్లుగా ఉన్న స్థానిక ఉత్పత్తి 2019–20లో రూ. 5.33 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ పరిస్థితులు చూస్తే ఇది మరింత వేగంగా వృద్ధి చెందనుందని డబ్ల్యూటీసీ అంచనా వేసింది. అయితే, దేశీయంగా ఉత్పత్తి గణనీయంగా పెరిగే దాకా చైనా నుంచి దిగుమతులను తగ్గించుకునే క్రమంలో ఇతర మార్కెట్లవైపు చూడవచ్చని తెలిపింది. సింగపూర్, అమెరికా, మలేసియా, జపాన్ నుంచి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, కలర్ టీవీ సెట్లను, సింగపూర్, తైవాన్, జర్మనీ, ఇజ్రాయెల్, జపాన్ నుంచి టెలికం పరికరాలను దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. -
'చైనా ఉత్పత్తుల ప్రకటనల్లో నటించను'
ప్రతి భారతీయుడిని ఇప్పుడు ఆగ్రహానికి చేస్తున్న అంశం చైనా దురాగతమే. నిబంధనలు తుంగలో తొక్కి ఆ దేశ సైన్యం సరిహద్దుల్లో మన సైన్యంపై దాడులకు తెగపడుతోంది. దీంతో ప్రతి భారతీయుడు చైనాపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాడు. చైనా ఉత్పత్తులను మన దేశంలో బహిష్కరించాలనే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నటి సాక్షి అగర్వాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆమె దేశంపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. సాక్షి అగర్వాల్ మాట్లాడుతూ.. తాను ఇకపై చైనా ఉత్పత్తులను వినియోగించరాదని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. శాంతికి సహనానికి మార్గం మన దేశంగా పేర్కొంది. చైనా దేశం మన దేశం సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకోవాలని చూస్తోందన్నారు. అందులో భాగంగానే ఇటీవల చైనా సైనికులు మన సైనికులపై దాడులకు తెగపడ్డారని పేర్కొంది. దీంతో చైనా చర్యల్ని తీవ్రంగా ఇకపై ఆ దేశ ఉత్పత్తులను ఉపయోగించరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. అంతే కాకుండా ఇకపై చైనాకు చెందిన ఉత్పత్తుల ప్రకటనల్లో కూడా తాను నటించనని నటి సాక్షి అగర్వాల్ చెప్పింది. చదవండి: సుశాంత్‌కు గొప్ప నివాళి -
చైనాను ఆర్థికంగా ఢీకొట్టే వ్యూహాలు..
ముంబై: ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రజలు చైనాకు సంబంధించిన వస్తువులను వాడకూడదని డిమాండ్ ఎక్కువైంది. కాగా తయారీ రంగంలో ప్రపంచ వ్యాప్త ఎగుమతులలో కీలక పాత్ర పోషిస్తున్న చైనాను ఢీకొట్టడం అంత సులువు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి చైనా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ.. దిగుమతులు తగ్గించుకొని, తయారీ రంగంలో చైనా వస్తువులతో ఆధారపడకుండా, సొంతంగా ఎదగడానికి ప్రభుత్వం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో చైనాపై ఆర్థిక ఆంక్షలను ప్రభుత్వం మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. మరో కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పందిస్తూ.. చైనా వస్తువులను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. తాజా ఉద్రిక్త పరిస్థితులలో నూతన స్మార్ట్పోన్లను లాంచ్ చేసే ఈవెంట్లను చైనీస్ స్మార్ట్ ఫోన్ సంస్థలు వాయిదా వేసుకున్నాయి. కాగా దేశ వృద్ధిలో చైనా ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2017 సంవత్సరంలో సిక్కింలో డొక్లాం ప్రాంతంపై సరిహద్దు వివాదాలున్న మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడకుండా చర్యలు చేపట్టింది. మరోవైపు చైనీస్ దిగ్గజాలు హువాయి టెక్నాలజీస్, షియోమీ బ్రాండ్స్ వైవిధ్యమైన స్మార్ట్ఫోన్స్తో అలరిస్తున్నాయి. అయితే దేశీయ మొబైల్ వినియోగంలో 75 శాతం చైనా నుంచి దిగుమతవుతున్నాయి. మరోవైపు దేశీయ ఫార్మా దిగుమతులలో 75శాతం ముడిపదార్థాలు చైనా నుంచి లభిస్తున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం చైనాను ఢీకొట్టాలంటే ఒకేసారి వస్తువులను బ్యాన్ చేయాలనడం సరికాదని, అలా పిలుపునిస్తే అంతర్జాతీయంగా దేశానికి నష్టం కలిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశ్లేషకుల ప్రకారం.. దేశీయ తయారీ రంగానికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తు, యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారిస్తే తయారీ రంగంలో వేరే దేశంపై భారత్‌కు ఆధారపడే అవకాశం తగ్గుతుంది. అలాగే యువతకు ఉపాధితో పాటు నిరుద్యోగం తగ్గి, దేశ వృద్ధి రేటు పెరుగుతుంది. కాగా దేశీయ సంస్థలు తక్కువ ధరకే క్వాలిటీ వస్తువులు అందించి, చైనాను భావోద్వేగంతో కాకుండా క్వాలిటీతో ఢీకొట్టాలి. దేశీయ మార్కెట్లో చైనా వస్తువులను ప్రజలు స్వచ్చందంగా బహిష్కరించే ప్రణాళికలు రచించడానికి సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.(చదవండి: ఈ పాపులర్ యాప్స్ అన్నీ చైనావే) -
సర్వే: చైనా వస్తువుల బ్యాన్‌కే మొగ్గు!
న్యూఢిల్లీ : గల్వాన్ లోయ వద్ద చైనా సైనికుల దాడి ఘటన తరువాత భారత్‌లో చైనా వస్తువుల బహిష్కరణ నినాదం ఊపందుకుంది. చైనా వస్తువులను ఇండియా బహిష్కరిస్తే ఆ దేశానికి ఆర్థికంగా నష్టం వస్తుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈనెల 16న జరిగిన చైనా-భారత్ సంఘటనలో 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో చైనా తయారు చేసిన వస్తువులను, ఉత్పత్తులను బహిష్కరించాలని కేంద్ర పిలుపునివ్వడంతో అనేక రాష్ట్రాల్లో చైనా వస్తువులకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో చైనాపై భారత్ ప్రజల అభిప్రాయాలను అంచనా వేయడానికి న్యూస్ 18 నెట్వర్క్ డిజిటల్ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో కలిసి ఆన్లైన్ పోల్‌ను నిర్వహించింది. ఇది శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం(24 గంటలు) వరకు చేపట్టింది. తొమ్మిది ప్రశ్నలతో కూడిన ఈ సర్వేలో సుమారు 6,000 వేల మంది తమ స్పందనలను తెలియజేశారు. ఇందులో కనీసం 70 శాతం మంది భారతీయులు చైనా వస్తువులను బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తేలింది. వీరు చైనా వస్తువులకు బదులు ఎక్కువ మొత్తంలో చెల్లించి వేరే వస్తువులను కొనేందుకు సైతం ఆసక్తి చూపుతున్నారు. వీరిలో 91 శాతం మంది చైనా యాప్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడం మానేస్తామని తెలిపినట్లు వెల్లడైంది. అంతేగాక ఇతరులను ఇందుకు ప్రోత్సాహిస్తామని తేలింది. 92 శాతం మంది చైనా ఉత్పత్తులపై తమకు నమ్మకం లేదని తెలిపారు. కాగా వీరిలో ఎక్కువ మందికి చైనాపై వ్యతిరేక వాదన ఉంది. ఎక్కువగా 97 శాతం ప్రజలు చైనా ఉత్పత్తులను భారతీయ సెలబ్రిటీలు ఉపయోగించడం మానేయాలని సూచించారు. 92 శాతం మంది భారత్‌కు పాకిస్తాన్ కంటే చైనా భారత్‌కు పెద్ద ముప్పుగా తయారైందని భావిస్తున్నారు. అలాగే 52 శాతం మంది భారత్‌కు మిత్రదేహాలు లేవని దేశం తనను తాను రక్షించుకోవాల్సి ఉందని హితవు పలికారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (18.12 శాతం) కంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (19.32 శాతం) భారత్‌కు మంచి సన్నిహితుడిగా పేర్కొన్నారు. చైనీయుల ఆహారం మరియు రెస్టారెంట్లను బహిష్కరించాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఇంతకుముందు పిలుపునిచ్చినప్పటికీ, చాలా మంది భారతీయులు దీని గురించి ఇంకా తెలియదన్నారు. 43 శాతం మంది తాము చైనీస్ ఆహారాన్ని తినబోమని, 31 శాతం మంది ఆ ఆహారంతో తమకు సంబంధం లేదని చెప్పారు. కాగా గత 15 రోజుల్లో చైనాపై మనోభావాలను అంచనా వేయడానికి న్యూస్ 18 నిర్వహించిన రెండవ పోల్ ఇది. మొదటి పోల్ ఫలితాలు జూన్ 5న వెల్లడించింది. -
చైనా 'బే'జార్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న నినాదం ఒక్కటే.. ‘చైనా వస్తువుల్ని బహిష్కరించాల’ని.. మన దేశంలో తన వస్తువులు అమ్ముకొని బతికే చైనా.. మన సైనికులపై రాళ్లతో దాడి చేసి పొట్టన పెట్టుకోవడం ఏంటని..? ఓవైపు కరోనా మహమ్మారిని ప్రపంచంపై వదిలి లక్షల ప్రాణాలను తీసుకుంటోందని.. మరోవైపు తన సైన్యాన్ని భారత్‌పై ఉసిగొల్పుతోందని ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే ఫోన్లలో ఉండే చైనీస్ యాప్‌లను వేల సంఖ్యలో డిలీట్ చేసి.. ‘నేను దేశభక్తి చాటుకున్నాను’ అంటూ వాట్సాప్‌లో పోస్టులు పెడుతున్నారు. ఈ నినాదం నగరంలో జోరుగా వినిపిస్తోంది. చైనా వస్తువులను బహిష్కరించాలని పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ చైనా వస్తువులనుబహిష్కరించి దేశభక్తి చాటుకోవాలని కోరుతున్నారు. మనదగ్గరే కుటీర పరిశ్రమల్లో తయారైన వస్తువులను కొనుగోలు చేయాలని అంటున్నారు. దీంతో నిత్యం కిటకిటలాడే చైనా బజార్లు వెలవెలబోతున్నాయి. చైనీస్ ఫుడ్‌ని సైతం నగరవాసులు ఇష్టపడటం లేదు. అప్రమత్తమైన వ్యాపారులు చైనా బజార్ల బోర్డులు తొలగిస్తున్నారు. అంబర్‌పేట: చైనా వస్తువులు కొనుగోలు చేయవద్దంటూ ప్రచారం నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోని చైనా బజార్ల నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. చైనా బజార్ల బోర్డులను తొలగిస్తున్నారు. స్థానిక పేర్లతో వ్యాపారాలు సాగించుకుంటున్నారు. అవసరమైన వస్తువులను స్థానికంగా కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. మనమూ తయారు చేయవచ్చు.. చైనా బజార్లలో విక్రయించే చైనా వస్తువులను ఇక్కడే తయారు చేయవచ్చని పలువురు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకొని ఇక్క డ విక్రయాలు సాగించే పరిస్థితి నుంచి బయట పడేందుకు ప్రభుత్వాలు అండగా ఉండాలంటున్నారు. చైనా నుంచి వచ్చి ఇక్కడ విక్రయాలు జరిగే వరకు వేచి చూడకుండా ప్రభుత్వం నిషేధిస్తే ఇక్కడి వరకు ఎలా వస్తాయంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనా బజార్లలో అమ్మే ప్రతి వస్తువు చైనాది కాదంటున్నారు. చైనీస్ ఫుడ్ రెస్టారెంట్లు ఢమాల్ సనత్‌నగర్: నగరంలో చైనీస్ ఫుడ్ రెస్టారెంట్లు డీలా పడిపోయాయి. చైనా వంటకాలను లొట్టలేసుకుని తినే భోజన ప్రియులు ఇప్పుడు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. నగరవాసులు సరికొత్త రుచులను ఆహ్వానించేందుకు ముందుంటారు. ఈ క్రమంలో సిటీజనుల జిహ్వా రుచులను పట్టేసిన చైనీస్ ఫుడ్ రెస్టారెంట్ల నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొత్త రుచులను అందిస్తూ వచ్చారు. అయితే కరోనా తోడు తాజాగా చైనా–భారత్ సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘర్షణల్లో భారత సైనికులు అమరులుకావడం.. దీంతో ఆ దేశీయ ఉత్పత్తుల వాడకాన్ని నిషేధిద్దామనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై సోషల్ మీడియాలో ఉవ్వెతున ఉద్యమమే నడుస్తోంది. ఈ క్రమంలో చైనా పేరు వినిపిస్తేనే కొంత ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. అలాంటిది చైనీస్ ఉత్పత్తులే కాదు.. చైనీస్ ఫుడ్‌పై కూడా నిషేధాన్ని విధిస్తున్నారా? అన్న పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. బిజినెస్ భారీగా పడిపోయి ఆయా రెస్టారెంట్లు కుదేలవ్వడమే ఇందుకు నిదర్శనం. 5–10 శాతమే వ్యాపారం.. కరోనా వైరస్ చైనాలో పుట్టిందని తెలిసినప్పటి నుంచే ఆయా వంటకాలకు క్రమేపీ డిమాండ్ తగ్గుతూ వచ్చింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే చైనీస్ ఫుడ్ రెస్టారెంట్ల బిజినెస్ 30 శాతానికి పడిపోగా, లాక్డౌన్ తర్వాత మరింత పతనావస్థకు చేరుకుంది. దీనికి తోడు చైనా కవ్వింపు చర్యలకు దిగడమే కాకుండా ఘర్షణల్లో భారత్ సైనికులను పొట్టన పెట్టుకున్న దగ్గర నుంచి చైనా ఉత్పత్తులు అంటే మండిపోతున్నారు. ఈ క్రమంలో కేవలం 5–10 శాతం మాత్రమే వ్యాపారం జరుగుతుందనేది రెస్టారెంట్ల నిర్వాహకులు చెప్పేమాట. గతంలో లక్ష వ్యాపారం జరిగే చోట రూ.5–10 వేలకు పడిపోయింది. సాధారణంగా చైనీస్ రెస్టారెంట్లలో ఎక్కువ శాతం వివిధ రకాల సూప్‌లతో పాటు చికెన్, మటన్, చేపలు, రొయ్యలతో వివిధ రకాల వంటకాలను తయారుచేసి అందిస్తుంటారు. ఆయా రకాల వంటకాలు హైదరాబాదీయులను నోరూరించేవే.. కానీ చైనీస్ అనే పదం వినిపిస్తే చాలు.. భోజన ప్రియులు ఆమడదూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. తెరుచుకోని మెయిన్ ల్యాండ్ చైనా రెస్టారెంట్.. సమస్త చైనీస్ వంటకాలకు పెట్టింది పేరు గ్రీన్‌ల్యాండ్స్ ప్రాంతంలోని మెయిన్ ల్యాండ్ చైనా రెస్టారెంట్. సాధారణంగా ఎక్కువ శాతం ఇక్కడి వారే చైనీస్ ఫుడ్ రెస్టారెంట్లను నెలకొల్పి నిర్వహిస్తుండగా, మెయిన్‌ల్యాండ్ చైనా రెస్టారెంట్ మాత్రం అచ్చంగా చైనీయులకు సంబంధించినదేనన్న పేరును మూటగట్టుకుంది. ఇక్కడ దొరకని చైనీస్ వంటకం అంటూ ఏమీ ఉండదు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి మూసివేసిన ఈ రెస్టారెంట్ ఇప్పటి వరకు తెరుచుకోలేదు. అనివార్య కారణాల వల్ల తెరవలేకపోయామని, అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ నిర్వాహకులు బోర్డును కూడా ఏర్పాటుచేశారు. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితుల్లో ఓపెన్ చేసినా చైనీస్ వంటకాలను ఎక్కువగా ఇష్టపడరనే ఆలోచనతోనే ఈ రెస్టారెంట్‌ను ఇంకా ఓపెన్ చేయలేదని తెలుస్తోంది. చైనీస్ ఫుడ్‌కు డిమాండ్ పడిపోయింది కరోనా దెబ్బకు తోడు ఇప్పుడు చైనా, భారత్ మధ్య జరుగుతున్న ఘర్షణలతో చైనీస్ వంటకాలకు డిమాండ్ భారీగా పడిపోయింది. 5 శాతం మాత్రమే ఇప్పుడు జరుగుతుంది. హోటల్ అద్దె రూ.2 లక్షలు చెల్లించాలి. సిబ్బంది 30 మంది ఉండేవారు. ప్రస్తుతం 11 మందే విధులు నిర్వర్తిస్తున్నారు. కనీసం జీతాలు, అద్దెలు చెల్లించాలంటేనే గగనమయ్యే పరిస్థితులు ఉన్నాయి. మళ్లీ సాధారణ స్థితి ఎప్పటికి వస్తుందో తెలియడం లేదు.– నూర్, బౌల్ ఓ చైనా రెస్టారెంట్ ఉద్యోగి, బేగంపేట. గిరాకీ లేక వెలవెలబోతున్న చైనా బజార్లు గోల్కొండ: చైనా బజార్లలో గిరాకీ తగ్గింది. లాక్డౌన్ నేపథ్యంలో అసలే అంతంత మాత్రం గిరాకీ ఉన్న చైనా బజార్లు సరిహద్దులో చైనా దుశ్చర్య కారణంగా భారత్ జవాన్లు వీరమరణం పొందిన తర్వాత చైనా బజార్ల నిర్వాహకులు జాగ్రత్తపడ్డారు. చైనా వస్తువులను బహిష్కరించాలన్న పిలుపు మేరకు గుడిమల్కాపూర్, మెహిదీపట్నం, టోలిచౌకి తదితర ప్రాంతాల్లోని చైనా బజార్ల నిర్వాహకులు రాత్రికి రాత్రే తమ తమ షోరూంలలోని చైనా వస్తువులను తీసేశారు. ప్రస్తుతం ఆ షాపుల్లో ప్లాస్టిక్ సామాగ్రి, పూల కుండీలు, ప్లాస్టిక్ పూలతో పాటు హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలలో తయారైన వస్తువులను మాత్రమే అమ్ముతున్నారు. చైనా వస్తువులను ఇక నుంచి విక్రయించేదిలేదని చైనా బజార్ నిర్వాహకులు అంటున్నారు. ప్రోత్సహిస్తే బావుంటుంది మా దుకాణంలో అమ్మే చైనా వస్తువులను ఇక్కడే తయారు చేయవచ్చు. నేను గతంలో ప్రైవేట్ ఉద్యోగం చేశాను. ఆదాయం సరిపోక ఈ వ్యాపారంలోకి దిగాను. హోల్‌సేల్ దుకాణదారుల నుంచి వస్తువులు తెచ్చుకొని అమ్ముకుంటాం. రెండు, మూడు దశల్లో తమకు ఈ వస్తువులు చేరుతాయి. చైనాలో ఉపాధి కోసం 72 గంటల్లో బ్యాంకు నుంచి రుణం మంజూరవుతుందని విన్నాను. ఇక్కడ ఆసక్తి, ప్రతిభ ఉన్నా అలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది.– షకీర్, అంబర్‌పేట, చైనాబజార్ మేనేజర్ -
చైనా వస్తువుల బహిష్కరణకు సిద్ధమే..కానీ
సాక్షి, న్యూఢిల్లీ : గాల్వాన్ లోయలో డ్రాగన్ దుశ్చర్య, తరువాత ఇండియాలో చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ముఖ్యంగా ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీవాసులు చైనా వస్తువులపై ఏకంగా "యుద్ధం" ప్రకటించారు. ఇంట్లోని ప్రతి చైనా వస్తువును రోడ్డుపైకి విసిరేయాలని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేజర్ రంజిత్ సింగ్ పిలుపునిచ్చారు. దురదృష్టవశాత్తు తుపాకులు, బుల్లెట్లతో ప్రత్యక్షంగా చైనాపై యుద్ధానికి దిగలేకపోయినా వస్తువులు బహిష్కరణ ద్వారా చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్నారు. అయితే ఈ పిలుపునకు పెద్దగా స్పందన రాలేదు. పైగా ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కూర్చుని యుద్ధ నినాదాలు ఇవ్వడం సరైంది కాదంటూ డిఫెన్స్ కాలనీకి చెందిన భవ్రీన్ కంధారి విమర్శించారు. (చైనా ఉత్పత్తులపై నిషేధం) మరోవైపు ఢిల్లీలోని అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ గా పేరుగాంచిన సదర్ బజార్ వ్యాపారులు భిన్నంగా స్పందించారు. చైనా వస్తువుల బహిష్కరణకు సంసిద్దతను వ్యక్తం చేస్తూనే కొన్ని షరతులతో మాత్రమే ఇది సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. సదర్ బజార్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ శర్మమాట్లాడుతూ, తాము కూడా చైనా ఉత్పత్తుల నిషేధానికి సిద్ధమే. 'హిందీచీనీ బైబై' నినాదానికి తమ మద్దతు ఉంటుంది, కానీ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సహకాలతోపాటు, అధికారుల దాడులు, ఇతర వేధింపులనుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. (చైనాకు షాక్ : చైనా పరికరాల వాడకం తగ్గించండి!) దాదాపు 70 శాతం ఎలక్ట్రికల్ వస్తువులు చైనానుంచే వస్తాయనీ మరో వ్యాపారి తరుణ్ గార్గ్ తెలిపారు. ముఖ్యంగా దీపావళి సందర్భంగా బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లు జరుపుతామని వెల్లడించారు. అనేక మేడ్ ఇన్ ఇండియా వస్తువులకు సంబంధించిన విడిభాగాలు కూడా చైనా నుండే దిగుమతి అవుతాయన్నారు. దాదాపు 40 వేల దుకాణాలను కలిగి ఉన్న సదర్ బజార్లో అలంకరణ వస్తువులు, బొమ్మలు, గడియారాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఇలా దాదాపు ప్రతీది చైనానుంచి దిగుమతి అయినవే ఉంటాయన్నారు. దీంతో చైనా ఉత్పత్తుల బహిష్కరణ, దిగుమతులపై నిషేధం సాధ్యమేనా అనే ప్రశ్న కూడా వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. కాగా దేశీయంగా 7 కోట్ల మంది వ్యాపారులు, 40 వేల ట్రేడ్ అసోసియేషన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఐఐటి) చైనా దిగుమతులను బ్యాన్ చేయాలని పిలుపు నిచ్చింది. వచ్చే ఏడాది చివరి నాటికి చైనా దిగుమతులు 13 బిలియన్ డాలర్లు తగ్గించాలంటూ ఒక ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అంతేకాదు బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్లు చైనా ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దని కోరింది. ప్రస్తుతం, ప్రతి ఏటా చైనా నుంచి దేశానికి దిగుమతి అయ్యే వస్తువుల విలువ 70 బిలియన్ డాలర్లకు పై మాటే. -
బాయ్‌కాట్ చైనా
న్యూఢిల్లీ: సరిహద్దులో ఘర్షణ నేపథ్యంలో భారత్‌లో చైనా ఆహార పదార్థాలను అమ్ముతున్న అన్ని రెస్టారెంట్లు, హోటళ్లను మూసేయాలంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే పిలుపునిచ్చారు. చైనాకు చెందిన ఆహారాన్ని బహిష్కరించాలన్నారు. రోజూవారీ కార్యకలాపాల్లో చైనా ఉత్పత్తుల వాడకాన్ని బహిష్కరించాలంటూ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చైనా వైఖరిని అందరం చూస్తున్నామని అందుకే చైనా ఉత్పత్తులను వాడరాదని ఆయన అన్నారు. చైనా నుంచి వచ్చే ఉత్పత్తులకు ఇకపై బీఐఎస్ నాణ్యత ఉండేలా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. చైనా నుంచి అక్రమంగా భారత్‌లోకి వచ్చే ఫర్నీచర్ వంటి వాటిలోనూ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. -
‘వివో’ వల్ల మనకే లాభం!
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంతో భారత్‌లో చైనా వ్యతిరేక ఉద్యమం మొదలైంది. చైనా బ్రాండ్లు, ఉత్పత్తులు కొనుగోలు చేయవద్దని, యాప్‌లకు దూరంగా ఉండాలని డిమాండ్లు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. అయితే భారత క్రికెట్‌కు బంగారు బాతులాంటి ఐపీఎల్‌ను ఒక చైనా కంపెనీ (వివో) స్పాన్సర్షిప్ చేస్తోంది. ఇటీవలి వరకు మరో కంపెనీ ‘ఒప్పో’ టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించగా...ఇప్పుడున్న బైజూస్‌లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలతో అనుబంధం కొనసాగించడంపై వస్తున్న ప్రశ్నలకు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ సమాధానమిచ్చారు. ‘వివో’ వల్లే మనకే లాభం తప్ప చైనాకు కాదని ఆయన స్పష్టం చేశారు. బోర్డు భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోదని, వాస్తవాలు చూడాలని ఆయన అన్నారు. ‘ఇప్పుడంతా భావోద్వేగంతో స్పందిస్తున్నారు. దీన్ని పక్కనబెట్టి యథార్థంగా ఆలోచించండి. చైనా కంపెనీలకు మద్దతు ఇస్తున్నామా లేక అక్కడి నుంచి రాబడి అందుకుంటున్నామా అనే తేడా తెలుస్తుంది. చైనా కంపెనీల ఉత్పత్తుల్ని భారత్‌లో విక్రయించేందుకు అనుమతిస్తే మన వినియోగంతో వారికి డబ్బు వెళ్తుంది. అదే చైనా కంపెనీ వారి బ్రాండ్ ప్రమోషన్ కోసం మనకు చెల్లిస్తే అక్కడి నుంచి రాబడి వస్తుంది. అంటే భారత ఆర్థిక రంగానికి ఇది లాభించేది! ఎలాగంటే టైటిల్ స్పాన్సర్ కోసం వివో కంపెనీ బీసీసీఐకి సాలీనా రూ. 440 కోట్లు చెల్లిస్తుంది. ఇందులో 42 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. అంటే ఇది ఆర్థికంగా మనకు మేలు చేసే అంశమే’ అని వివరించారు. ఒక వేళ మనం వద్దనుకుంటే ఆ మొత్తం చైనాకు తరలిపోతుందన్నారు. మరో వైపు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మాత్రం అవసరమైతే చైనా స్పాన్సర్లను బాయ్‌కాట్ చేస్తామని తెలిపింది. చైనా స్పోర్ట్స్ పరికరాల కంపెనీ ‘లి–నింగ్’ భారత ఆటగాళ్లకు కిట్ స్పాన్సర్‌గా ఉందని, టోక్యో ఒలింపిక్స్ వరకు ఈ కాంట్రాక్టు ఉన్నప్పటికీ జనరల్ బాడీ మీటింగ్‌లో అభ్యంతరాలుంటే రద్దు చేసుకునేందుకు వెనుకాడమని చెప్పారు. -
చైనా ఉత్పత్తులపై నిషేధం
అబిడ్స్(హైదరాబాద్): భారత్, చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఘర్షణల ప్రభావంతో హైదరాబాద్‌కు చెందిన హోల్‌సేల్ వ్యాపారుల సంఘం చైనా ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బేగంబజార్, ఫీల్‌ఖానా, సిద్ది అంబర్‌బజార్, ఉస్మాన్‌గంజ్ ప్రాంతాల్లో ఈ నెల 19 నుంచి చైనా ఉత్పత్తులను విక్రయించకుండా నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్‌వ్యాస్ గురువారం వెల్లడించారు. ఫీల్ఖా నాలో అసోసియేషన్ ప్రతినిధులంతా చైనా ఉత్పత్తులను నిషేధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఫీల్‌ఖానా మార్కెట్‌తో పాటు బేగంబజార్‌లో ఉన్న అజీజ్ప్లాజా మార్కెట్లో వేలాది దుకాణాల్లో ప్రతి రోజు చైనా ఉత్పత్తులను విక్రయాలు చేస్తారు. కాగా, ప్రతి రోజు జనరల్ మర్చంట్స్ దుకాణాల ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరామ్‌వ్యాస్ వివ రించారు. కరోనా కారణంగా వ్యాపార సమయాలు కుదించినట్లు వెల్లడించారు. -
చైనాకు షాకివ్వనున్న భారత్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తత, నెట్వర్క్ సెక్యూరిటీ సమస్యల నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనాకు షాకివ్వనుంది. ముఖ్యంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 4జీ అప్‌గ్రేడ్‌లో చైనా పరికరాల వినియోగాన్ని నిషేధించనుంది. బీఎస్ఎన్ఎల్ తో పాటు ఎంటీఎన్ఎల్, ఇతర అనుబంధ సంస్థలకు కూడా ఇదే ఆదేశాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాదు, ఈ పనులకు సంబంధించి పాత టెండర్లను రద్దు చేసి రీ-టెండరింగ్ కు కూడా వెళ్లనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీఎస్ఎన్ఎల్ సంస్థలో మేడ్-ఇన్-చైనా పరికరాల వినియోగాన్ని తగ్గించాలని టెలికం విభాగం నిర్ణయించింది. కేంద్రం ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్ భారత్’ లో భాగంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ వస్తువులను కొనుగోలు చేయమని తన పరిధిలోని అన్ని సంస్థలకు ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు ప్రైవేట్ టెలికం సంస్థలు కూడా చైనా సంస్థలు ఉత్పత్తి చేసే పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గించాలంటూ ఆదేశించనుంది. అలాగే టెండర్ల ప్రక్రియలో చైనా కంపెనీలు పాల్గొనలేని విధంగా నిబంధనలను మార్చాలని రాష్ట్రంలోని సర్వీసు ప్రొవైడర్లను కోరడంతోపాటు, మునుపటి టెండర్లన్నింటినీ రద్దు చేయాలని కోరనుంది. కాగా లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా దుశ్చర్య కారణంగా 20 మంది భారత జవాన్లు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) కూడా సిద్ధమయ్యింది. చైనాకు సంబంధించిన 500 వస్తువుల జాబితాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ట్విటర్లో 'హిందీచీనిబైబై', 'భారత్ వెర్సస్ చైనా వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. -
చైనా వస్తువులను బహిష్కరించాలి: నిఖిల్
సాక్షి, హైదరాబాద్: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన భారత జవానులకు యావత్ దేశం కన్నీటి నివాళి అర్పించింది. శాంతిమంత్రం జపిస్తూ దందుడుకుగా యుద్ధోన్మాదాన్ని ప్రేరేపిస్తున్న చైనా వైఖరిని దేశ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. చైనా సైనికులతో ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో 19 మంది భారత జవాన్లు మృతిచెందినట్లు ఆర్మీ ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు చెలరేగుతుండగా.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ట్వీట్లతో ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. (తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన తనయుడు) అమరవీరుల మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు విడిచిన అమరవీరుల ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహేశ్ బాబు, దేవిశ్రీప్రసాద్, నిఖిల్ సిద్దార్థ, అనిల్ సుంకర, ప్రణీత, మంచు విష్ణు, లక్ష్మీ మంచు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, తదితరులు వీరజవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. చైనా అహంకార చర్యలపై నా రక్తం మరిగిపోతోందని, టిక్‌టాక్ నుంచి మొదలు చైనా వస్తువులన్నింటిని బహిష్కరించాలని నిఖిల్ పిలుపునిచ్చాడు. అంతేకాకుండా వీర జవాను సంతోష్ బాబు తల్లిని ఉద్దేశిస్తూ ‘అమ్మ నీ త్యాగాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. మేమందరం మీతోనే ఉన్నాం. ధైర్యంగా ఉండండి’ అంటూ నిఖిల్ మరో ట్వీట్ చేశారు. (విషం చిమ్మిన చైనా..) Amma We r all with you 🙏🏽 Please stay strong... Your sacrifice will never be forgotten 🙏🏽🙏🏽🙏🏽🙏🏽 🙏🏽 Mother of #ColonelBSantoshBabu #IndiaChinaFaceOff #IndiaChinaBorder #BoycottChina https://t.co/moARnT9tiu — Nikhil Siddhartha (@actor_Nikhil) June 16, 2020 Deeply disturbed and saddened to learn that our soldiers were martyred at #GalwanValley. Your sacrifice for the nation will forever be etched in our hearts. We salute your bravery and patriotism. My heartfelt condolences to the bereaved families. Jai Hind — Mahesh Babu (@urstrulyMahesh) June 17, 2020 Heartfelt condolences to Col. Santosh Babu, an Indian army officer hailing from Suryapet, Telangana who laid down his life for the nation. I salute you, your family & all our bravehearts of Galwan. Jai Jawan! #IndianArmy #SantoshBabu #Galwanvalley pic.twitter.com/fLztX6Lmhz — Vishnu Manchu (@iVishnuManchu) June 17, 2020 My heart goes out to all the lost brave souls at the border#GalwanValley #BraveSonsofIndia #Saluteindianarmy pic.twitter.com/2K8VmWAvZO — Anil Ravipudi (@AnilRavipudi) June 17, 2020 #GalwanValley you are our true heroes. Strentgh to their families. Ok 2020 you may end now..enough is enough — Lakshmi Manchu (@LakshmiManchu) June 17, 2020 -
చైనా కంపెనీలు, ఉత్పత్తులను నిషేధించాలి
న్యూఢిల్లీ: లడఖ్ గాల్వన్ లోయలో భారత్ - చైనా ఆర్మీ మధ్య జరిగిన దాడుల్లో భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడంపై ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరన్ మంచ్ (ఎస్జేఎమ్) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరణించిన సైనికులకు నివాళిగా ప్రభుత్వం చేపట్టే టెండర్లలో చైనా కంపెనీలు పాల్గొనకుండా నిషేధం విధించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అదేవిధంగా దేశంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించే దిశగా అడుగులు వేయాలని సూచించింది. బుధవారం ఎస్జేఎమ్ కో కన్వీనర్ అశ్వని మహాజన్ మాట్లాడుతూ.. నటీనటులు, క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు సైతం చైనా ఉత్పత్తులను ప్రోత్సహించవద్దని కోరారు. (సరిహద్దు వివాదం : డ్రాగన్ కుయుక్తి) కాగా మే 5వ తేదీ నుంచి చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై రెండు దేశాల మధ్య చర్చలు మేనేజర్ జనరల్ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు దేశాలు తమ సైన్యాలను వెనక్కు తరలించడం ప్రారంభించాయి. ఇదే సమయంలో సోమవారం రాత్రి లడఖ్‌లో భారత్-చైనా ఆర్మీ మధ్య తీవ్రస్థాయిలో హింసాత్మక ఘర్షణలు తలెత్తాయి. ముఖాముఖీ పోరాటంలో రాళ్లు, ఇనుప రాడ్లతో చైనా సైనికులు దాడి చేశారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. చైనాకు కూడా భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం. ( విషం చిమ్మిన చైనా ) -
బాయ్‌కాట్ చైనా
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ‘బాయ్‌కాట్ చైనా’ ఆన్లైన్ ఉద్యమం తెరపైకొచ్చింది. 3ఇడియట్స్ సినిమాకు ప్రేరణగా నిలిచిన విద్యావేత్త, ఆవిష్కర్త సోనమ్ వాంగ్‌చుక్ యూట్యూబ్‌లో షేర్ చేసిన వీడియో ఈ పరిణామానికి ఊపిరిపోసింది. వాంగ్చుక్కు పలువురు నెటిజన్లు, సెలిబ్రిటీలు మద్దతు పలికారు. వీరిలో అర్షద్ వార్సి, మిలింద్ సోమన్, రణ్వీర్ షోరే తదితరులున్నారు. చైనా వస్తువుల వాడకం మానేయాలని వీరు కోరుతున్నారు. ‘చైనా వస్తువులను వాడటం నేను ఆపేస్తున్నా. మీరూ ఆపండి’అని అర్షద్ వార్సీ కోరారు. చైనా వీడియో అప్లికేషన్ టిక్‌టాక్‌ను వాడబోనంటూ యాక్టర్, మోడల్ మిలింద్ ఉషా సోమన్ ట్వీట్ చేశారు. నటుడు రణ్వీర్ షోరే ఆమెకు మద్దతు ప్రకటించారు. భారత్ తయారీ వస్తువులనే వాడాలంటూ టీవీ నటి కామ్య పంజాబీ కోరారు. చైనా ఉత్పత్తులతో వాణిజ్య సంబంధాలున్న వారంతా ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాలన్నారు. రచయిత రాజ్ శాండిల్య కూడా ‘బాయ్‌కాట్ చైనా’ ఆన్లైన్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపు ఇచ్చిన విధంగా ప్రపంచం చైనాను ఏకాకిగా చేయాలని ఫొటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్ కోరారు. -
'చైనా ఉత్పత్తులను నిషేదిద్దాం'
లడఖ్ : భారత్, చైనాల మధ్య సరిహద్దుకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనాకు సంబంధించిన అన్ని ఉత్పత్తులతో పాటు టిక్‌టాప్ యాప్‌ను నిషేదిద్దామంటూ ఇంజనీర్ కమ్ సైంటిస్ట్ సోనమ్ వాంగ్ చుక్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వాంగ్‌చుక్ యూట్యూబ్ ద్వారా షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. వాంగ్‌చుక్ లడఖ్‌లోని హిమాలయాలు, సింధూ నదిని బ్యాక్డ్రాఫ్గా ఏర్పాటు చేసుకొని ఒక కొండపై కూర్చొని మాట్లాడాడు. (మధ్యవర్తిత్వంపై మోదీకి ఫోన్ చేశా : ట్రంప్) ' 3 ఇడియట్స్ సినిమాలో అమిర్‌ఖాన్ కారెక్టర్ చెప్పిన ' ఫున్సుక్ వాంగ్డు' డైలాగ్ నాకు ఆదర్శంగా నిలిచింది. చైనీయులకు సంబంధించిన అన్ని సాఫ్ట్వేర్ ఉత్పత్తులను ఒక వారంలోగా, హార్డ్‌వేర్ ఉత్పత్తులను సంవత్సరం లోగా తిరిగి ఇచ్చేయండి. నేను నా ఫోన్‌ను వారం లోపలే చైనాకు తిరిగి ఇచ్చేస్తున్నా. మీ వాలెట్ శక్తిని ఉపయోగించండి. లడఖ్‌లో చైనా బెదిరింపులను ఆపడంతో పాటు చైనాకు వెట్టి చాకిరి చేస్తున్న 1.4 బిలియన్ కార్మికులు, 10 మిలియన్ ఉయ్ఘర్ ముస్లింలు, 6 మిలియన్ టిబెటియన్ బౌద్ధులను విముక్తి చేయడానికి పాటుపడదాం. ఏటా చైనాకు సంబంధించిన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఉత్పత్తులను కొనడంతో పాటు టిక్‌టాక్ లాంటి యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని వారికి కోట్ల ఎకానమీ సంపదను సృష్టిస్తున్నాం. చైనా భారత్‌లో తమ వ్యాపారాన్ని పెట్టుబడులుగా పెట్టి ప్రతి ఏటా దాదాపు రూ . 6లక్షల కోట్లు సంపాదిస్తుంది. ఆ డబ్బుతోనే చైనీయులు మన దేశం బోర్డర్ వద్ద కాపలా కాస్తున్న మన సైనికులను కాల్చి చంపుతున్నారు. ప్రస్తుతం భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారతీయులను అర్థిస్తున్నా.. ఈ సమయంలో బులెట్ పవర్ కన్నా ఆర్థిక శక్తి అత్యంత బలం చూపెడుతుంది.. కాబట్టి 130 కోట్ల మంది భారతీయులతో పాటు విదేశాల్లో ఉంటున్న భారతీయులారా.. చైనా ఉత్పత్తులను నిషేధించడానికి సిద్ధమవండి. మనం చేస్తున్న పని సరైనదే అనిపిస్తే ప్రపంచం కూడా మనవెంటే ఉంటుంది' అంటూ పేర్కొన్నాడు. (హద్దు మీరుతున్న డ్రాగన్) కాగా లదాఖ్ లోని ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు భారత్ భూభాగంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తాను మధ్యవర్తిత్వం చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ద్వారా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య థర్డ్‌పార్టీ (మూడో వ్యక్తి) జోక్యం అవసరం లేదనిభారత్తో పాటు డ్రాగన్ దేశం కూడా తేల్చిచెప్పింది. భారత్-చైనాల మధ్య చోటుచేసుకున్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునే శక్తీసామర్థ్యాలు తమకు (ఇరుదేశాలకు) ఉన్నాయని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సరిహద్దు దేశాలైన తమ మధ్య డొనాల్డ్ ట్రంప్ తల దూర్చాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. -
దటీజ్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ దంగల్ సినిమాతో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌పై వసూళ్ల దాడితో రికార్డులు క్రియేట్ చేసింది. కేవలం ఇండియాలోనే కాక చైనా మార్కెట్లో ఇండియన్ సినిమాలకు గుర్తింపును తీసుకొచ్చింది దంగల్ మూవీ. చైనాలో దంగల్ సినిమా దాదాపు 1300కోట్ల కలెక్షన్లు సాధించింది. గత మూడు సంవత్సరాలుగా చైనాలో 8 ఇండియన్ సినిమాలు విడుదలవ్వగా.. అవి దాదాపు 2784కోట్ల కలెక్షన్లను సాధించాయి. వాటిలో కేవలం దంగల్ సినిమానే సగానికి పైగా వసూళ్లను రాబట్టింది. సీక్రెట్ సూపర్‌స్టార్, బజరంగీ భాయిజాన్ సినిమాలు సైతం మంచి కలెక్షన్లను రాబట్టాయి. -
చైనాకు మరోసారి షాకిచ్చిన ట్రంప్
వాషింగ్టన్ : ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం మరింత ఉధృతమవుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై ట్రేడ్ వార్ బాంబు వేశారు. చైనా నుంచి దిగుమతి అయ్యే మరో 200 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. దీంతో ఆ దిగుమతులు అదనంగా 10 శాతం సుంకాలను ఎదుర్కోబోతున్నాయి. ఇప్పటికే చైనాకు చెందిన పలు ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. వాటికి ప్రతీకారంగా ఇటీవలే చైనా కూడా 34 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. దీనికి కౌంటర్‌గా అదనంగా 200 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై ఈ సుంకాలను అమెరికా విధించింది. ఇలా అమెరికా, చైనాలు సుంకాల మీద సుంకాలు విధించుకుంటూ.. వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. అమెరికా చర్యలకు దీటుగా చైనా స్పందిస్తోంది. అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై కూడా అధిక సుంకాలు విధిస్తోంది. అయితే ప్రస్తుతం తాము చేపట్టిన టారిఫ్ యుద్ధం, చైనా అమెరికా మేథోసంపత్తి హక్కులను దొంగలించకుండా నిరోధిస్తుందని అమెరికా కార్యాలయ అధికారులు చెబుతున్నారు. చైనీస్ మార్కెట్లో యాక్సస్ పొందడానికి ట్రేడ్ సీక్రెట్లు చెప్పాలని అమెరికా కంపెనీలపై డ్రాగన్ ఒత్తిడి తెస్తుందని ఆరోపిస్తున్నారు. చైనా వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతోందని వందల బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడుతోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇది తమ ఆర్థికవ్యవస్థకు భవిష్యత్తులో ముప్పు కలిగిస్తుందని అమెరికా అధ్యక్ష ప్రధాన వాణిజ్య సందానకర్త రాబర్ట్ అన్నారు. ట్రంప్ ప్రస్తుతం చైనాపై తీసుకున్న ఈ చర్య వల్ల టెలివిజన్లు, వస్త్రాలు, బెడ్షీట్లు, ఎయిర్‌కండీషనర్లు ప్రభావితం కానున్నాయి. అమెరికా తీసుకుంటున్న ఈ చర్యలకు ఇతర మార్గాల్లో కూడా ప్రతీకారం తీసుకోవాలని చైనా అధికారులు భావిస్తున్నారు. చైనాలో కార్యకలాపాలు సాగిస్తున్న అమెరికా కంపెనీల్లో చెప్పాపెట్టకుండా తనిఖీలు, ఆర్థిక లావాదేవీల ఆమోదంలో జాప్యం, ఇతర కార్యాలయ తలనొప్పులను అమెరికా కంపెనీలకు విధించాలని డ్రాగన్ చూస్తోంది. ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకం విధిస్తున్నాయని, అమెరికాలో మాత్రం ఆయా దేశాల ఉత్పత్తులపై తక్కువ సుంకాలు విధిస్తున్నామని, ఇలా కాకుండా పరస్పరం ఒకే విధమైన సుంకాలు విధించే విధానం ఉండాలని డొనాల్డ్ ట్రంప్ అంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇతర దేశాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచుతూ వస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. తొలుత స్టీట్, ఉక్కులపై సుంకాలు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. -
ట్రంప్ ‘ట్రేడ్‌వార్’ బుల్లెట్ పేలింది, ఇక రణరంగమే..
వాషింగ్టన్ : ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థికవ్యవస్థలైన అమెరికాకు, చైనాకు మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై ‘ట్రేడ్ వార్’ బుల్లెట్ ప్రయోగించారు. 34 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై టారిఫ్‌లను ధృవీకరిస్తూ.. ఈ అర్థరాత్రి నుంచి వీటిని అమల్లోకి తేనున్నట్టు వెల్లడించారు. ట్రంప్ ఆదేశాల మేరకు సెమికండక్టర్ల నుంచి ఎయిర్‌ప్లేన్ పార్ట్‌ల వరకు పలు చైనీస్ దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లను అమెరికా కస్టమ్స్ అధికారులు సేకరించబోతున్నారు. అమెరికా మేథోసంపత్తి హక్కులను బీజింగ్ దొంగలిస్తుందని, అమెరికా వాణిజ్య అకౌంట్‌కు తీవ్రంగా తూట్లు పొడుస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించిన అనంతరం డైరెక్ట్‌గా చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించడం ఇదే మొదటిసారి. మరో 16 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై మరో రెండు వారాల్లో టారిఫ్ మోత మోగనుందని కూడా హెచ్చరించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కొనసాగుతున్న క్రమంలో, ప్రపంచవ్యాప్తంగా కన్జ్యూమర్లు, కంపెనీలు అత్యంత ప్రమాదకరమైన జోన్లలోకి ప్రవేశిస్తున్నాయని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా సైతం అమెరికాకు కౌంటర్‌గా అంతేమొత్తంలో పలు అమెరికన్ ఉత్పత్తులపై టారిఫ్‌లను విధించనున్నట్టు ప్రకటించింది. వీటిలో సోయాబీన్స్ నుంచి పందిమాంసం వరకూ ఉన్నాయి. ఇటీవల స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన టారిఫ్, ప్రపంచదేశాలన్నీ ఆగ్రహంతో ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, కెనడా దేశాలు అమెరికాపై ప్రతీకార పన్నులు విధించేశాయి. అమెరికా ఐకానిక్ కంపెనీ హార్లీ డేవిడ్సన్ సైతం ఈయూ విధించే టారిఫ్‌లను తప్పించుకోవడానికి అమెరికా నుంచి బయటికి వచ్చేయాలని నిర్ణయించుకుంది. ఒకవేళ చైనీస్ వాణిజ్యాన్ని దెబ్బతీసేందుకు పెద్ద మొత్తంలో ట్రంప్ ఏమైనా సుంకాలను విధిస్తే, చైనా కూడా అమెరికా కంపెనీలపై కస్టమ్స్ ఆలస్యం, పన్ను ఆడిట్లు, రెగ్యులేటరీ తనిఖీలను భారీగా పెంచి, జరిమానాలు విధిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ హెచ్చరించారు. అమెరికా కంపెనీలు ఆపిల్ ఇంక్, వాల్‌మార్ట్ ఇంక్ నుంచి జనరల్ మోటార్స్ వరకు అమెరికా కంపెనీలు చైనాలో వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీలన్నింటికీ ఈ ట్రేడ్ వార్ అతిపెద్ద ముప్పుగా అవతరించిందని ఆర్థిక వేత్తలంటున్నారు. -
52 కంపెనీలకు డేటా లీక్
వాషింగ్టన్: తమ ఖాతాదారుల సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా 52 కంపెనీలతో పంచుకున్నామని, వాటిలో చైనా కంపెనీలు కూడా ఉన్నాయని ఫేస్బుక్ వెల్లడించింది. సెల్‌ఫోన్ తయారీ కంపెనీలతో ఖాతాదారుల సమాచారం మార్పిడికి ఫేస్బుక్ ఒప్పందం కుదుర్చుకుందని ఇటీవల వార్తలు వెలువడిన నేపథ్యంలో అమెరికన్ కాంగ్రెస్‌కు శుక్రవారం ఆ కంపెనీ యాజమాన్యం వివరణిచ్చింది. ఏయే కంపెనీలతో యూజర్ల సమాచారాన్ని పంచుకున్నారో వెల్లడిస్తూ దాదాపు 700 పేజీల నివేదికను అమెరికన్ ప్రతినిధుల సభకు చెందిన హౌస్ ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీకి ఫేస్బుక్ సమర్పించింది. యాపిల్, అమెజాన్, బ్లాక్‌బెర్రీ, శాంసంగ్, అలీబాబా, క్వాల్‌కాం, పాన్‌టెక్ మొదలైన వాటితో పాటు అమెరికా భద్రతకు ముప్పుగా ఆ దేశ నిఘా విభాగం పేర్కొన్న నాలుగు చైనా కంపెనీలు హ్యువాయ్, లెనోవో, ఒప్పో, టీసీఎల్లు కూడా ఉన్నాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు, అలాగే ఆయా కంపెనీ ఉత్పత్తులతో ఫేస్బుక్ యాప్ అనుంధానం కోసం వివరాలు అందచేశామని ఫేస్బుక్ తెలిపింది.మొత్తం 52 కంపెనీల్లో 38 కంపెనీలతో ఒప్పందాలు ముగిశాయని, జూలైలో మిగిలిన వాటి కాలపరిమితి కూడా ముగుస్తుందని ఫేస్బుక్ తెలిపింది. తాజా వివరాలపై ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీ సభ్యుడు ఫ్రాంక్ పల్లోనే స్పందిస్తూ.. ‘ఫేస్బుక్ స్పందన సమాధానాల కంటే మరిన్ని ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది’ అని పేర్కొన్నారు. -
చైనా పాల దిగుమతులపై నిషేధం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : చైనా నుంచి చాక్లెట్లు, పాలు, పాల ఉత్పత్తుల దిగుమతులపై విధించిన నిషేధాన్ని మరో ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది డిసెంబర్ 23 వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు వెలువరించేవరకూ నిషేధం గడువును పొడిగించినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) పేర్కొంది. ప్లాస్టిక్, ఫెర్టిలైజర్స్ తయారీలో ఉపయోగించే విషపూరిత మెలామిన్ అనే రసాయనం చైనా నుంచి వచ్చే పాల ఉత్పత్తుల్లో ఉన్నాయనే అభ్యంతరాల నేపథ్యంలో వీటిని నిషేధించిన విషయం తెలిసిందే. చైనా నుంచి పాలు, పాల ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోకున్నా, ముందు జాగ్రత్త చర్యగా నిషేధం విధించారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు, వినిమయదారుగా ఉంది. భారత్‌లో ఏటా 15 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తవుతాయి. దేశంలో అత్యధికంగా యూపీలో పాల ఉత్పత్తి సాగుతుండగా, తర్వాతి స్ధానాల్లో రాజస్థాన్, గుజరాత్‌లు నిలిచాయి. -
చైనాకు మరోసారి ట్రంప్ షాక్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా విషయంలో అసలు తగ్గేలా కనిపించడం లేదు. ఎలాగైనా వాణిజ్య యుద్ధాన్ని తారస్థాయికి తీసుకెళ్లేలా చైనాను రెచ్చగొడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించిన ట్రంప్, తాజాగా మరోసారి 50 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులతో 25 శాతం టారిఫ్‌లను విధించనున్నట్టు శుక్రవారం ప్రకటించారు. తమ మేథోసంపత్తి ఆస్తులను, టెక్నాలజీని చైనా దొంగలిస్తుందని ఆరోపిస్తూ.. ట్రంప్ ఈ టారిఫ్‌లను విధించారు. అన్యాయపరమైన వాణిజ్య విధానాలను చైనా అనుసరిస్తుందని ట్రంప్ ఆరోపించారు. ఒకవేళ అమెరికా ఉత్పత్తులు, సర్వీసు ఎగుమతులపై కనుక చైనా ప్రతీకారం తీర్చుకుంటే, అదనపు సుంకాలు కూడా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. అన్యాయపరమైన ఆర్థిక విధానాల ద్వారా తమ టెక్నాలజీ, మేథోసంపత్తి ఆస్తులను కోల్పోవాల్సి వస్తే, అమెరికా అసలు సహించదని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటనపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించింది. ట్రంప్ వార్నింగ్‌లను ఏ మాత్రం లెక్కచేయకుండా.. తాము కూడా ఇదే స్థాయిలో పన్ను చర్యలను వెంటనే ప్రవేశపెడతామని బీజింగ్ ప్రకటించింది. ఇరు పార్టీలు అంతకముందు సాధించిన అన్ని ఆర్థిక, వాణిజ్య విజయాలు ఇక వాలిడ్‌లో ఉండవని పేర్కొంది. 34 బిలియన్ డాలర్ల విలువైన 818 ఉత్పత్తులపై జూలై 6ను టారిఫ్‌లను విధిస్తామని, మిగతా 16 బిలియన్ డాలర్ల విలువైన 284 ఉత్పత్తులపై ప్రజాభిప్రాయాలు, సమీక్షల అనంతరం ఇదే మాదిరి చర్యలు తీసుకుంటామని అమెరికా వాణిజ్య అధికార ప్రతినిధి చెప్పారు. చైనాను కవ్విస్తూ అమెరికా టారిఫ్‌లు విధించడం, అమెరికాకు ప్రతిగా చైనా చర్యలు తీసుకోవడం మరింత వాణిజ్య యుద్ధానికి పురిగొల్పుతోంది. -
చైనా హ్యాకర్ల చేతిలో అమెరికా నేవీ వివరాలు
వాషింగ్టన్: అమెరికా నౌకాదళం (నేవీ)కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చైనా ప్రభుత్వ హ్యాకర్లు భారీస్థాయిలో చోరీ చేశారు. అమెరికా తయారుచేయబోయే కొత్త రకం జలాంతర్గాముల రహస్య సమాచారం సహా పలు కీలక వివరాలు చైనా హ్యాకర్లు సంపాదించారు. చోరీకి గురైన మొత్తం సమాచార పరిమాణం 614 జీబీ ఉంటుందనీ, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో హ్యాకింగ్ జరిగిందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. సీ డ్రాగన్ అనే రహస్య ప్రాజెక్టు వివరాలు, సిగ్నళ్లు, సెన్సర్ల సమాచారం, సముద్రగర్భంలో యుద్ధానికి సంబంధించిన పలు వివరాలు చైనా హ్యాకర్ల చేతికి వెళ్లాయని ఓ అధికారి చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. -
భారత్‌లోకి లొపో మెడికల్ ఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య పరికరాల తయారీలో ఉన్న చైనా కంపెనీ లొపో మెడికల్ భారత్‌లో ఎంట్రీ ఇచ్చింది. 119 రకాల ఉత్పత్తులను కంపెనీ తయారు చేస్తోంది. వీటిలో ప్రధానంగా గుండె సంబంధ వైద్య పరికరాలు అగ్రదేశాల్లోనూ ప్రాచుర్యం పొందాయి. తొలుత చైనాలోని ప్లాంటు నుంచి వీటిని దిగుమతి చేసుకుని భారత్‌లో విక్రయిస్తామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఆరోన్ లిన్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఉపకరణాలను అందుబాటు ధరల్లో ప్రవేశపెట్టి పోటీకి తెరలేపుతామన్నారు. మెడికల్ హెల్త్‌కేర్ సర్వీసులను సైతం భారత్‌లో పరిచయం చేస్తామని వెల్లడించారు. ఔషధాల తయారీలో సైతం లొపో గ్రూప్ ఉంది. -
రాజమౌళికి బిగ్ షాక్
దర్శక ధీరుడు రాజమౌళికి ఊహించని షాక్ తగిలింది. బాహుబలి-2 చైనా వర్షన్ దారుణమైన ఫలితాన్ని రాబడుతోంది. ఇప్పటిదాకా కనీసం రూ. 100 కోట్లు కూడా వసూలు చేయకపోవటం విశేషం. అమీర్ ఖాన్ దంగల్ చిత్రం చైనాలో రూ. 1200 కోట్లు వసూలు చేయగా(ఫుల్ రన్లో).. ఇక్కడ యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ‘సీక్రెట్ సూపర్ స్టార్’ చిత్రం సైతం రూ. 700 కోట్లు రాబట్టడం గమనార్హం. అంతెందుకు బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై విజయం సాధించిన హిందీ మీడియం కూడా చైనాలో రూ. 200 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి-2 కూడా మంచి వసూళ్లనే రాబడుతుందని రిలీజ్‌కు ముందు మేకర్లు భావించారు. బాహుబలి మొదటి భాగం ఫలితం తేడా కొట్టడంతో జాగ్రత్త పడ్డ జక్కన్న హాలీవుడ్ టెక్నీషియన్ విన్సెంట్ టబైల్లాన్ను రంగంలోకి దించారు. విన్సెంట్(ది ఇన్క్రిడబుల్ హల్క్, క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ చిత్రాల ఫేమ్) ఎడిటింగ్ వర్క్‌తో చిత్రం బాహుబలి-2 ష్యూర్ హిట్ అని అంతా భావించారు. కానీ, సీన్ ఇప్పుడు పూర్తిగా రివర్స్ కావటంతో ఖంగుతినటం రాజమౌళి అండ్ నిర్మాతల వంతు అయ్యింది. మే 4వ తేదీన 7 వేలకు పైగా స్క్రీన్లలో రిలీజైన బాహుబలి-2.. మంగళవారం వరకు చిత్రం రూ.63 కోట్లు వసూలు చేసింది. అయితే ఇప్పటిదాకా వచ్చిన వసూళ్లతో త్రీ ఇడియట్స్, ధూమ్-3 చిత్రాల వసూళ్లను మాత్రం అధిగమించింది. కాగా, ఎస్ ఎస్ రాజమౌళి సృష్టించిన కళాఖండం బాహుబలి సిరీస్ ఇండియాలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. భారత బాక్సాఫీస్ వద్ద వేగంగా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన చిత్రంగా బాహుబలి ది కంక్లూజన్ రికార్డు సృష్టించింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 18 వందల కోట్లు వసూళ్లు చేసింది. హిందీ వర్షన్ ఇండియాతోపాలు విదేశాల్లోనూ భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ మధ్యే బాహుబలి-2 జపాన్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. #Baahubali2 continues to struggle... Remains on the lower side in CHINA... Fri $ 2.43 mn Sat $ 2.94 mn Sun $ 2.30 mn Mon $ 0.89 mn Tue $ 0.82 mn Total: $ 9.38 mn [₹ 63.19 cr] — taran adarsh (@taran_adarsh) 9 May 2018 -
చనిపోయిన నాలుగేళ్లకు బిడ్డకు జన్మనిచ్చారు..
బీజింగ్ : సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత అసాధ్యాలన్నీ సుసాధ్యాలైపోతున్నాయి. వైద్య రంగంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన దంపతులు గతేడాది డిసెంబర్ 9న మగశిశువుకు జన్మనిచ్చారు. పిల్లలు లేని దంపతుల పాలిట వరంలా మారిన సరోగసీ విధానం వల్ల ఇది సుసాధ్యమైంది. దీంతో మృతుల తల్లిదండ్రులు మనవడిని పొందగలిగారు. 2013లో చనిపోయిన దంపతుల శిశువుకు సరోగసి ద్వారా ఓ మహిళ జన్మనిచ్చిందని చైనా మీడియా పేర్కొంది. బాబు నానమ్మా తాతయ్యలు అతడికి ‘టయాంటిన్’ అనే ముద్దు పేరు పెట్టారని స్థానిక మీడియాలో వార్తలు ప్రచురితం అవుతున్నాయి. పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది.. సరోగసీ ద్వారా పిల్లల్ని కనడం చైనాలో చట్టవిరుద్ధం. ప్రమాదంలో మరణించిన దంపతుల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిరూపాన్ని చూడాలని భావించారు. సరోగసీ కోసం వారు లావోస్‌కు చెందిన ఒక మహిళను ఆశ్రయించారు. కానీ ఆ పక్రియ అంతా పూర్తి కావడానికి చట్టపరంగా అనేక చిక్కులు ఏర్పడ్డాయి. సరోగసీ ద్వారా విదేశంలో జన్మించిన పిల్లలు చైనా పౌరులుగా గుర్తింపబడాలంటే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. పిల్లాడి తల్లి లేదా తండ్రి చైనా పౌరులై ఉంటేనే అతడికి పౌరసత్వం లభిస్తుంది. ఇందుకోసం ఆ సరోగసీ మదర్ని టూరిస్ట్ వీసా మీద చైనాలోని గవాంగూ సిటీలో ఉన్న ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడే ఆమె శిశువుకు జన్మనిచ్చింది. 15 రోజులపాటు ఆస్పత్రిలో ఉన్న పిల్లాడికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడి నానమ్మ తాతయ్యలకు అప్పగించారు. పెద్దయ్యాకే అతడికి నిజం చెప్తాం.. ‘ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి మనవడిని పొందాము. తన పుట్టుక గురించి ఇప్పుడే నిజం చెప్పాలనుకోవడం లేదు. అతను పెరిగి పెద్ద వాడయ్యేంతవరకు తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నారని చెప్తామంటూ’ పిల్లాడి తాతయ్య మీడియాకు వెల్లడించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సరోగసీని చట్టబద్ధం చేయాలంటూ చైనీయులు వాదిస్తున్నారు. -
ఆరు రోజుల్లోనే రూ.150 కోట్ల వసూళ్లు
సాక్షి, ముంబై : సరిహద్దు గొడవలైనా.. ఇరుదేశాల మధ్య సఖ్యత లేదని నాయకులు వాదిస్తున్నా.. ఎల్లలు, సంస్కృతీ సంప్రదాయాలకు అతీతంగా ప్రజలందరినీ కలిపి ఉంచే మాధ్యమం సినిమా అని మరోసారి నిరూపించారు చైనా ప్రేక్షకులు. ఆమిర్ ఖాన్ దంగల్ సినిమాతో భారతీయ సినిమాలపై మొదలైన చైనీయుల ప్రేమ బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురుపిస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, సబా కమర్ జంటగా తెరకెక్కిన హిందీ మీడియం సినిమా చైనాలో విడుదలైన ఆరు రోజుల్లోనే 150 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ తర్వాత చైనాలో విడుదలైన మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. మనుషులను కలిపి ఉంచడానికి మాతృభాష అవసరమని చెబుతూనే.. వ్యాపారంగా మారిన విద్యా వ్యవస్థపై విమర్శనాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా తమ నేటివిటీకి దగ్గరగా ఉండటంతో చైనా ప్రజలు ఆదరించారని స్థానిక మీడియా పేర్కొంది. ఈనెల 4న కిపోజియాన్(స్టార్టింగ్ లైన్) పేరుతో చైనాలో విడుదలైంది హిందీ మీడియం. పిల్లల విద్య కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా తెరకెక్కిన ఈ సినిమా చైనీయులను అమితంగా ఆకర్షించిందని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. సామాజిక సమస్యలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ తెరకెక్కిన ఇలాంటి భారతీయ సినిమాలను చైనీయుల తప్పక ఆదరిస్తారని మరోసారి ఈ సినిమా నిరూపించిందని పేర్కొంది. -
డజను ప్రభుత్వ వెబ్సైట్లపై సైబర్ దాడి!
న్యూఢిల్లీ: రక్షణ, హోం మంత్రిత్వశాఖలు సహా 12కు పైగా ప్రభుత్వ వెబ్సైట్లు శుక్రవారం హ్యాకింగ్‌కు గురయ్యాయి. సైబర్‌దాడికి గురైన ఈ వెబ్సైట్లలో చైనీస్ అక్షరాలు కన్పించడంతో ఈ పని చైనా హ్యాకర్లే చేసుంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రక్షణ, హోం మంత్రిత్వశాఖలతో పాటు న్యాయ, కార్మిక మంత్రిత్వశాఖల వెబ్సైట్లపై కూడా సైబర్‌దాడి జరిగింది. ఈ ఘటనపై స్పందించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో రక్షణ శాఖ వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తామని ట్వీట్ చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లపై ఎలాంటి సైబర్‌దాడి జరగలేదని జాతీయ సైబర్ భద్రత (ఎన్సీఎస్) సమన్వయకర్త గుల్షన్ రాయ్ అన్నారు. నెట్వర్కింగ్ వ్యవస్థలో హార్డ్‌వేర్ ఫెయిల్యూర్ కారణంగానే ఈ ఇబ్బంది తలెత్తిందని వెల్లడించారు. -
వాట్సాప్‌తో ఎటాక్
న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలని సైనికులకు భారత ఆర్మీ వార్నింగ్ ఇస్తోంది. వాట్సాప్‌ను వాడుతూ చైనీస్, భారత సిస్టమ్స్‌ను హ్యాక్ చేస్తున్నట్టు ఆదివారం దేశీయ ఆర్మీ ఓ వార్నింగ్ వీడియోను పోస్టు చేసింది. నిమిషం నిడివి గల ఈ వీడియోను సమాచార, ప్రసారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ రీపోస్టు చేశారు. ‘మన డిజిటల్ ప్రపంచాన్ని కొల్లగొట్టడానికి చైనీస్ అన్ని రకాల ప్లాట్‌ఫామ్‌లను వాడుతున్నారు. మన సిస్టమ్‌లను హ్యాక్ చేయడానికి చైనీస్ వాడుతున్న కొత్త మాధ్యమం వాట్సాప్ గ్రూప్‌లు. +86 ప్రారంభమయ్యే చైనీస్ నెంబర్లు మీ గ్రూప్‌లోకి ప్రవేశించి, మీ డేటాను సంగ్రహించడం ప్రారంభించాయి’ అని తెలుపుతూ ఆర్మీ అధికారులు ఈ వీడియో ట్వీట్ చేశారు. సైనికులు తమ కాంటాక్ట్ నెంబర్లను పేర్లతో సేవ్ చేసుకోవాలని, అన్ని వాట్సాప్ గ్రూప్‌లను ఎప్పడికప్పుడు చెక్ చేసుకోవాలని, తెలియని నెంబర్లను పదేపదే క్రాస్‌చెక్ చేసుకోవాలని భారత ఆర్మీ సూచించింది. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ మారిస్తే, గ్రూప్ అడ్మిన్‌కు తెలియజేయాలని తెలిపింది. ఒకవేళ సిమ్ కార్డును మారిస్తే, దాన్ని పూర్తిగా నాశనం చేయాలని సూచించింది. ఆర్మీ అడిషినల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్ఫేస్ ఈ వీడియోను రూపొందించింది. ‘బీ అలర్ట్, బీ సేఫ్’ అనే ట్వీట్‌తో ఈ వీడియోను విడుదల చేసింది. గతేడాది చైనా సరిహద్దులో ఉన్న సైనికులను తమ స్మార్ట్ఫోన్లను ఫార్మాట్ చేసుకోవాలని ఆర్మీ ఆదేశించిన సంగతి తెలిసిందే. చైనీస్ హ్యాకర్ల నుంచి ప్రమాదం పొంచి ఉన్న 40కి పైగా యాప్‌లను అన్ఇన్స్టాల్ చేయమని కూడా ఆదేశాలు జారీచేసింది. చైనీస్ సంస్థలు అభివృద్ధి చేసిన ఆ యాప్స్ అనుమానితమైనవిగా ఆర్మీ పేర్కొంది. ఇరు దేశాల మధ్య డోక్లాం వివాదం ముగిసిన రెండు నెలల తర్వాత ఆర్మీ ఈ హెచ్చరికలు జారీచేయడం పలు ఆందోళనలకు దారితీస్తోంది. -
చైనాలో దుమ్మురేపిన భాయ్‌జాన్
బీజింగ్ : బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన భజ్రంగి భాయ్‌జాన్ చైనా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈనెల 2న చైనాలో విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకూ రూ 150 కోట్లు కలెక్ట్ చేసింది. అమీర్‌ఖాన్ సినిమాలకు మెరుగైన మార్కెట్ ఉన్న చైనాలో అక్కడ విడుదలైన సల్మాన్ తొలిమూవీ ఇదే కావడం గమనార్హం. చైనా మార్కెట్లో సినిమా మంచి వసూళ్లు రాబడుతోందని భజ్రంగి భాయ్‌జాన్ మేకర్లు పేర్కొన్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ భజ్రంగీ భాయ్‌జాన్ రెండో వారాంతంలో మెరుగైన కలెక్షన్లతో దూసుకుపోతూ ఇప్పటివరకూ రూ 150.70 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాతలు ఓ ప్రకటనలో తెలిపారు. చైనాలో విడుదలైన తొలిరోజే ఈ సినిమా రూ 18 కోట్లు వసూలు చేసి మంచి ఓపెనింగ్స్ సాధించింది. సల్మాన్‌తో పాటు మూవీలో కరీనా కపూర్, బాల నటి హర్షాలి మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్ధిఖీల నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చైనా బాక్సాఫీస్ గణాంకాల ప్రకారం భజ్రంగి భాయ్‌జాన్ తొలి రోజు కలెక్షన్లు అమీర్‌ఖాన్ దంగల్ను అధిగమించాయి. అయితే అమీర్ ఖాన్ ఇటీవలి చిత్రం సీక్రెట్ సూపర్‌స్టార్ రికార్డును మాత్రం భజ్రంగి చెరిపివేయలేకపోయింది. సీక్రెట్ సూపర్‌స్టార్ చైనాలో తొలిరోజు రూ 40 కోట్లు కలెక్ట్ చేసింది. -
వైరల్.. లిఫ్ట్‌లో బాలుడి బిత్తిరి చర్య
బీజింగ్ : చైనాలో ఓ బాలుడు చేసిన బిత్తిరి చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండరు. ‘బాగైందంటూ.. భుజాలు ఎగురేస్తారు’. ఎవడు తీసుకున్న గొయ్యిలో వాడే పడ్డట్లుంది ఆ బాలుడి చేసిన పని. లిఫ్ట్‌లో ఒంటరిగా వెళ్తున్న ఆ బాలుడికి ఓ తీట పని చేయాలని తోచింది. లిఫ్ట్ బటన్స్‌ను ఇతరులు కూడా ఉపయోగిస్తారనే ఉద్దేశంతో వాటిపై టాయిలెట్ పోసాడు. తీరా ఆ బటన్స్‌ను తానే ఉపయోగించాల్సి వచ్చింది. తాను దిగాల్సిన ఫ్లోర్ వచ్చే సరికి బటన్స్ వాటంతటవే పని చేయడంతో లిఫ్ట్ ఒక్కసారిగా స్ట్రక్ అయింది. దీంతో లిఫ్ట్ డోర్ తెర్చుకోవడం.. మూసుకోవడంతో ఆ కుర్రాడు భయంతో అరవడం మొదలెట్టాడు. చివరకు తానే ఆ బటన్లను ప్రెస్ చేసి బయటకి వచ్చాడు. ఇతరులకు కీడు చేయాలనుకుంటే తనకే కీడు జరుగుతుందనే కర్మ సిద్దాంతం రుజువైంది. ఈ తతంగం అంతా అందులోని సీసీ టీవీలో రికార్డు అయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్ అయింది. -
లిఫ్ట్‌లో బాలుడి బిత్తిరి చర్య.. వీడియో హల్ చల్
-
చైనా జాబ్‌లతో నిరుద్యోగానికి చెక్
సాక్షి,న్యూఢిల్లీ: మోదీ సర్కార్‌కు సవాల్‌గా మారిన నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేలా చైనాకు చెందిన భారీ దిగ్గజ కంపెనీలు భారత్‌లో కొలువుతీరనున్నాయి. 600కు పైగా కంపెనీలు దేశంలో రానున్న ఐదేళ్లలో ఏడు లక్షల కొలువులు సృష్టించనున్నాయి.చైనాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ మెషినరీ తయారీ కంపెనీ శానీ హెవీ ఇండస్ర్టీస్, ఫసిఫిక్ కన్స్ర్టక్షన్, చైనా ఫార్చూన్ ల్యాండ్ డెవలప్మెంట్ తదితర చైనా కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇప్పటికే రూ 50,000 కోట్ల పైగా పెట్టుబడులతో పలు కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించాయని, లక్ష మందికి ఉపాధి సమకూరిందని ఇన్వెస్ట్ ఇండియా పేర్కొంది. మరికొన్ని సంస్థలు త్వరలోనే పెట్టుబడులతో ముందుకు రానున్నాయి.కాగా, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించే ఏజెన్సీ ఇన్వెస్ట్ ఇండియా ఇప్పటికే భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు 200 కంపెనీలతో కూడిన జాబితాను రూపొందించి ఆయా సంస్థలను ఒప్పించే ప్రక్రియ చేపట్టింది.రానున్న రెండేళ్లలో తాము రూ 5 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని ఇన్వెస్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ బాగ్లా తెలిపారు. రోల్స్ రాయిస్ రూ 25,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేయగా, ఆస్ట్రేలియాకు చెందిన పెర్దమాన్ ఇండస్ర్టీస్ రూ 20,000 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్ నెలకొల్పనుంది. భారత్‌కు వెల్లువెత్తుతున్న విదేశీ కంపెనీల పెట్టుబడుల ప్రతిపాదనల్లో 42 శాతంతో చైనా ముందుండగా, అమెరికా 24 శాతం, బ్రిటన్ 11 శాతం పెట్టుబడులతో తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి. ఇంధన, వ్యర్థ నిర్వహణ రంగాల్లో అత్యధిక పెట్టుబడులు సమకూరగా, నిర్మాణ, ఈ కామర్స్ రంగాల్లోనూ పెట్టుబడులు భారీగా తరలిరానున్నాయి. భారత్‌కు పెద్ద ఎత్తున రానున్న విదేశీ పెట్టుడులపై ఇన్వెస్ట్ ఇండియా బృందం ప్రధాని మోదీని కలిసి ప్రజెంటేషన్ ఇచ్చిందని దీపక్ బాగ్లా చెప్పారు. దేశంలో నెలకొన్న రెడ్ టేప్ సమస్య నుంచి ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్ పరిచేలా మార్చాలన్న ప్రధాని మోదీ స్ఫూర్తితో ఇన్వెస్ట్ ఇండియా ముందుకెళ్తోందని తెలిపారు. గత రెండేళ్లుగా 114 దేశాల నుంచి లక్ష మంది ఇన్వెస్టర్లు తమను పెట్టుబడి ప్రతిపాదనలపై సంప్రదించారని చెప్పారు. -
స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..
బీజింగ్: స్మార్ట్ఫోన్లు వచ్చాక ప్రపంచం సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్‌లో మునిగిపోయింది. మనుషులు వాటికి బానిసలుగా మారిపోతున్నారు. ఎంతలా అంటే రోజువారి జీవితంలో స్మార్ట్‌ఫోన్ లేకుండా గడపలేనంతగా మారిపోయారు. అలా ఓయువతి స్మార్ట్‌ఫోన్‌లో బానిసగా మారి ఫోన్లో ఒకరోజంతా ఆటలాడటం ద్వారా అంధురాలిగా మారిపోయింది. వివరాల్లోకి వెళ్తే చైనాకు చెందిన షుడోనిమవూ జియాజింగ్ అనే 21 ఏళ్ల యువతి ఓకంపెనీలో ఫైనాన్స డిపార్ట్మెంట్లో పనిస్తోంది. ఈనెల ఒకటో తేదీన 'కింగ్ గ్లోరీ' అనే గేమ్‌ను రోజు మొత్తం ఆడింది. దీంతో ఆమె కుడి కన్ను పాక్షికంగా పనిచేయడం మానేసింది. దీంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుడికన్ను రెటినాల్ ఆర్టరి ఆక్యులోషన్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. చూపు కోసం పలు ఆస్పత్రుల్లో చికిత్స అందించినా ఉపయోగం లేకపోయింది. జియాజింగ్ ప్రతిరోజు 8గంటల పాటు గేమ్ ఆడేది. కనీసం తిండి తినడం, ఏదైనా తాగకుండా ఏకధాటిగా ఆడేది. ఆక్టోబర్ ఒకటిన మాత్రం ఒకరోజంతా ఆటతోనే గడిపింది. దీంతో తన చూపు కోల్పోవాల్సి వచ్చింది. ఈ గేమ్‌కు చైనాలో అత్యంత ప్రజాదరణ ఉంది. ఏకంగా 200 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. -
మనిషి తట్టుకోలేనంత వేగం
చైనా వాళ్లింతే.. ఎలుక దూరే కంత దొరికితే చాలు.. దాంట్లోంచే ఏనుగును పంపేందుకు ప్లాన్లు సిద్ధం చేసేస్తారు. పక్కనున్న ఫొటోలో చూశారుగా.. అవే నిదర్శనం. ఏంటివి అంటారా? టెస్లా కార్ల కంపెనీ ఓనర్ ఎలన్ మస్క్ హైపర్‌లూప్ పేరుతో గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలిగే రవాణా వ్యవస్థ ఐడియా తీసుకొచ్చాడు కదా.. దానికి ఇది పోటీ అన్నమాట. వివరాలు చూడండి.. విషయం మీకే అర్థమవుతుంది. దీని పేరు టీ–ఫ్లైట్. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ డిజైన్ చేసింది దీన్ని. అయస్కాంతాల సాయంతో గాల్లో కొద్దిగా తేలుకుంటూ వెళ్లే మ్యాగ్లెవ్ ట్రెయిన్లు తెలుసుగా.. అవే రైళ్లను గాలి మొత్తం తీసేసిన గొట్టాల్లో పంపితే ఎలా ఉంటుందో టీ–ఫ్లైట్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే మ్యాగ్లెవ్ రైళ్లు గంటకు 400 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అందుకోగలవు.. టీ–ఫ్లైట్ దీనికి పదిరెట్లు ఎక్కువ స్పీడ్‌తో వెళుతుందని అంటున్నారు చైనా ఇంజినీర్లు. ముందుగా గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగాన్ని అందుకుని ఆ తరువాత దశలవారీగా పెంచుతామని వీరు చెబుతున్నారు. ఇంత వేగంతో వెళ్లినా ఈ రైల్లోని ప్రయాణీకులకు ఆ విషయం పెద్దగా తెలియదని.. విమానం టేకాఫ్ తీసుకునేలా ఉంటుందని అంటున్నారు. పెట్రోలు, డీజిల్ వంటి సంప్రదాయ ఇంధనాలను వాడకపోవడం.. వాతావరణ పరిస్థితుల ప్రభావం ఏదీ లేకపోవడం టీ–ఫ్లైట్ ప్రత్యేకతలు. అయితే మనిషి శరీరం ఇంతటి వేగాన్ని తట్టుకునే అవకాశం తక్కువేనని.. గంటకు 4000 కిలోమీటర్ల వేగాన్ని అతితక్కువ సమయం మాత్రమే శరీరం తట్టుకుంటుందని అంటున్నారు బీజింగ్ ట్రాన్స్పోర్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఝావ్ జియాన్. చూద్దాం ఒక్కటైతే నిజం.. చైనీయులు అనుకున్నది అనుకున్నట్టుగా టీ–ఫ్లైట్ సిద్ధమైతే మాత్రం.. భూమ్మీద రవాణా అన్నది కొత్త శకంలోకి ప్రవేశించినట్లే అవుతుంది! 4 గంటల్లో భారత్ నుంచి అమెరికాకు వెళ్లగలగడమంటే మాటలు కాదు కదా! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఈల వేస్తే కోళ్లు గాల్లోకి.. వీడియో చూడండి..
బీజింగ్ : నెమళ్లంతపైకి కూడా పెంపుడు కోళ్లు గాల్లోకి ఎగరలేవు అంటారు. అదంతా అబద్ధమని అంతకన్నా పైకి ఎగురగలమని నిరూపిస్తున్నాయి చైనాకు చెందిన ఓ రైతు పెంపుడు కోళ్లు. ఓ కొండపై ఎక్కడెక్కడో తిండి కోసం వేట మొదలు పెట్టిన ఆ కోళ్లు రైతు ఈల ఊదగానే రెక్కలు అల్లార్చుతూ ఈల వినిపించిన వైపు గాల్లో ఎగురుకుంటూ వచ్చాయి. ఒకటి కాదు, పదులు కాదు, వందల్లో వచ్చి రోడ్డుపై అవి ఒక్క చోట చేరాయి. ఆ రైతు తిండి గింజలు వేయగానే అవి వాటిని తినడంలో నిమగ్నమయ్యాయి. చైనాలోని గిఝౌవ్ రాష్ట్రానికి చెందిన ఓ రైతు ఈ పెంపుడు కోళ్లకు ఎంతగా శిక్షణ ఇచ్చాడో తెలియదుగానీ ఆగస్టు 14వ తేదీన రికార్డు చేసిన ఈ కోళ్ల వీడియో మాత్రం ఇప్పుడు ఆన్లైన్ హల్చల్ చేస్తోంది. -
చైనా ఉత్పత్తులతో దేశానికి ముప్పు
వీహెచ్‌పీ సాక్షి, హైదరాబాద్: చైనా ఉత్పత్తులతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్రకుమార్ జైన్ అన్నారు. బజరంగ్దళ్ మూడు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. బజరంగ్దళ్ అంతర్జాతీయ అధ్యక్షుడు మనోజ్‌వర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సమావేశంలో సురేంద్రకుమార్ మాట్లాడుతూ గోసంరక్షణ చట్టం అమలు, లవ్ జిహాద్, మతి ప్రాతిపదికపైన రిజర్వేషన్లు, జాతీయ విద్యావిధానం, చైనా వస్తువుల బహిష్కరణ వంటి అంశాలపై ఈ సమావేశాల్లో సమగ్రంగా చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో బజరంగ్దళ్ రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్, ఉపాధ్యక్షుడు సుభాష్ చందర్, వీహెచ్‌పీ రాష్ట్ర ప్రచారప్రముఖ్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
మీ సహాయం మాకొద్దు: భారత్
-
అధిక జీఎస్టీతో చైనా ఫర్నిచర్‌కు ఊతం
దేశీ పరిశ్రమ మూతపడుతుంది ఫర్నిచర్ తయారీ సంఘాల ఆందోళన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎస్టీలో ఫర్నిచర్‌ను 28% పన్ను శ్లాబులోకి చేర్చడంపై తెలంగాణ ఫర్నిచర్ తయారీదారుల సంఘం, అఖిలభారత ఫర్నిచర్ సంస్థల సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. నిరుపేద, మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే సాధారణ ఫర్నిచర్‌నూ కేంద్రం లగ్జరీ వస్తువులుగా పరిగణించి 28% పరిధిలోకి తేవటం దారుణమని ఆయా సంఘాల ప్రతినిధులు కొండా శ్రావణ్ కుమార్, సతీష్, నందకిషోర్ వాపోయారు. బుధవారమిక్కడ తమ సంఘాల ప్రతినిధులతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. కేంద్రం చర్య వల్ల చిన్న పరిశ్రమలు మూసుకోవాల్సి వస్తుందని, దీనిపై ఆధారపడ్డ ఎంతో మంది రోడ్డున పడతారని చెప్పారు. ‘‘18% కన్నా ఎక్కువ పన్ను కేవలం లగ్జరీ వస్తువులపైనేనని కేంద్రం చెబుతోంది. మరి ఫర్నిచర్ లగ్జరీ వస్తువా?’’ అని ప్రశ్నించారు. ఇంపోర్టెడ్ ఫర్నిచర్‌పై కస్టమ్స్, ఎక్సైజ్, వ్యాట్ అన్నీ కలిపి 45% పన్నులుండగా జూలై 1 నుండి జీఎస్టీ 28%, 11% కస్టమ్స్ డ్యూటీ కలిపితే 39 శాతమే అవుతుందని, విదేశీ ఫర్నిచర్‌పై 6% పన్ను తగ్గుతుందన్నారు. దీనివల్ల చైనా ఫర్నిచర్ వెల్లువెత్తే అవకాశముందని శ్రావణ్ కుమార్ చెప్పారు. ‘‘మరోవైపు దేశీయ ఫర్నీచర్‌పై 14.5%గా ఉన్న పన్ను 28% అవుతోంది. దీంతో అమ్మకాలు పడిపోతాయి’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. తాజా పరి ణామాలతో ఈ రంగంపై ఆధారపడ్డ లక్షల మంది చిన్నా చితకా తయారీదార్లు రోడ్డున పడతారని కరీం నగర్‌కు చెందిన వ్యాపారి పవన్ కుమార్ చెప్పారు. పరిశ్రమను కాపాడాలని గృహ శోభ ఫర్నీచర్ ప్రమోటర్ శంకర్ అగర్వాల్ ప్రభుత్వాన్ని కోరారు. -
వ్యాన్‌లోంచి దూకేశాడు.. వైరల్ వీడియో!
బీజింగ్: రోడ్డుపై ఓ వ్యాన్ వేగంగా వెళ్తోంది అందరూ చూస్తుండగానే ఆ వాహనం నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా భయంతో రోడ్డుపైకి దూకేశాడు. ఆ వెంటనే వ్యాన్‌కు దూరంగా పరిగెత్తాడు. కొన్ని క్షణాల్లోనే వాహనం రోడ్డుపై మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది. ఈ షాకింగ్ ఘటన చైనా గాంగ్ డాంగ్ ప్రావిన్స్‌లోని డోంగ్వాన్‌లో గత సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వివరాలు.. ఓ వ్యక్తి తన వ్యాన్‌లో డోంగ్వాన్ రోడ్డులో ప్రయాణిస్తున్నాడు. ఇంతలో వాహనం ఇంజన్లో మంటలు రావడం గమనించాడు. వాహనం రోడ్డుపై ఆపి, ఏం జరిగిందో చూసే సమయం లేదని గ్రహించిన ఆ వ్యక్తి.. ఒక్కసారిగా వ్యాన్‌లోంచి రోడ్డుపై దూకేసి ప్రాణాలు రక్షించుకున్నాడు. వ్యాన్ నుంచి దూకిన కొన్ని క్షణాల్లో వాహనం మంటల్లో కాలి బూడిదైంది. ఆ వ్యాన్‌తో పాటు పార్కింగ్ ప్రదేశంలో ఉన్న మరో ఏడు వాహనాలు కాలి బూడిదయ్యాయని, ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సీసీటీవీ ఫుటేజీ వీడియోని అధికారులు విడుదల చేయగా ఇది చూసిన వారు షాకవుతున్నారు. వ్యాన్‌లోంచి ఆ వ్యక్తి దూకిన సమయంలో వెనుక నుంచి మరో వాహనం రాకపోవడంతో అతడు అసలుసిసలైన అదృష్టవంతుడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
భారత గగనతలంలోకి చైనా ఆర్మీ హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: రెండు చైనా ఆర్మీ హెలికాప్టర్లు భారత గగనతలంలోకి వచ్చి ఐదు నిమిషాల తర్వాత తిరిగి వెళ్లాయి. ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోకి ఇవి శనివారం వచ్చినట్లు అధికారులు చెప్పారు. చైనా హెలికాప్టర్లు, విమానాలు అనుమతి లేకుండా భారత గగనతలంలోకి ప్రవేశించడం ఈ ఏడాది మార్చి నుంచి ఇది నాలుగోసారి. భారత భద్రతా దళాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రహస్యంగా కనుగొనేందుకు ఈ హెలికాప్టర్లు వచ్చాయని భావిస్తున్నారు. -
రూ.1000 కోట్ల క్లబ్లో మరో సినిమా
ముంబయి: ‘బాహుబలి 2’ తర్వాత మరో భారతీయ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్లో చేరింది. ఆమిర్ ఖాన్ నటించిన ’దంగల్’ ఈ సినిమా ఈ ఘనత సాధించింది. ‘బాహుబలి 2’ తర్వాత రూ. 1000 కోట్ల వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. ఈ నెల 5న చైనాలో విడుదల చేయడంతో ‘దంగల్’ కలెక్షన్లు మెరుగుపడ్డాయి. ఈ సినిమాకు చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురుస్తోంది. పది రోజుల్లోనే 382.69 కోట్లు వసూళ్లు రాబట్టింది. దీంతో చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ (భారత్) సినిమాగానూ నిలిచింది. హర్యానాకు చెందిన రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం భారత్‌లోనూ ఘన విజయం సాధించింది. ‘బాహుబలి 2’ విడుదల ముందు వరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా కొనసాగించింది. ‘బాహుబలి 2’ వచ్చిన తర్వాత దంగల్ రెండో స్థానానికి పరిమితమైంది. -
గడుగ్గాయి.. ఈసారి కత్తితో!
వీడి వయసుకు, సైజుకు, చేష్టలకు అసలు పొంతనే లేదు. నాలుగేళ్ల పిల్లాడు ఎక్కడైనా రౌడీయిజానికి దిగుతాడా? కానీ ఈ చైనా గడుగ్గాయి మాత్రం నిండా ఐదేళ్లు నిండకముందే కర్రలు, కత్తులతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. వీధిలో అక్రమంగా దుకాణం ఉందంటూ తన బామ్మ దుకాణం తొలగిస్తున్న పోలీసులపై చైనాకు చెందిన నాలుగేళ్ల పిల్లాడు ఆగ్రహంతో ఊగిపోయిన వీడియో గుర్తుందా? పోలీసులనే బెదిరిస్తూ.. తన బామ్మ జోలికి రావద్దంటూ వారికి ఎదురుతిరిగిన వీడియో గతఏడాది ఇంటర్నెట్లో హల్చల్ చేసింది. ఎంత గడుగ్గాయోనంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అదే పిల్లాడు మరోసారి బెదిరింపులకు పాల్పడిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఐదేళ్ల క్సియో పాంగ్ తన బామ్మ దుకాణం వద్ద ఉండగా.. దుకాణం ముందు ఓ ట్రాలీ వచ్చి ఆగింది. అంతే దుకాణం ముందు ట్రాలీ పెట్టి గిరాకీ రాకుండా చేస్తున్నావని క్సియో ట్రాలీ డ్రైవర్‌పై రంకెలేశాడు. పండ్లు కోసే కత్తితో డ్రైవర్‌ను ‘నువ్వు పార్కింగ్ ఇక్కడ చేయకూడదు. పార్క్ చేస్తే కొడతా’ అంటూ బెదిరించడమే కాదు.. టైర్ పంక్చర్ కూడా చేయబోయాడు. పంక్చర్ చేస్తే ట్రాలీ వెనక్కి వెళ్లదనుకున్నాడో ఏమో.. ఆ పని చేయకుండా ట్రాలీ తీసేవరకు కత్తి పట్టుకొని అక్కడే నిల్చున్నాడు. -
చైనా కుటిలనీతి
దలైలామాతో సంబంధమున్నప్రాంతాలకే పేరు మార్పు న్యూఢిల్లీ: చైనా ఇటీవల కొత్త పేర్లు పెట్టిన అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాల్లో చాలా మటుకు టిబెట్ లేదా టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాతో సంబంధమున్నవేనని చైనా నిపుణుడు పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో దలైలామా పర్యటనకు అనుమతించిన భారత్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడానికే చైనా ఇలా చేసిందని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చైనీస్ స్టడీస్ ప్రొఫెసర్ శ్రీకాంత్ కొండపల్లి చెప్పారు. ఎగువ సుబానిస్రి జిల్లాలో మిలారిగా మారిన దాపోరిజో పట్టణం బ్రహ్మపుత్ర నది ఉపనది అయిన సుబానిస్రి సమీపంలో ఉంది. భారత్‌లోకి ప్రవేశించడానికి టెబెటన్లు ఇదే ప్రాంతాన్ని ఉపయోగించుకునేవారని, చాలా ఏళ్ల పాటు ఇరు దేశాలు అక్కడ సైన్యాన్ని మోహరించలేదని శ్రీకాంత్ తెలిపారు. చైనా అధీనంలో ఉన్న అక్సాయ్ చిన్, మానస సరోవర ప్రాంతాల పేర్లు మార్చి భారత్ ఆ దేశానికి తగిన జవాబు చెప్పొచ్చని సూచించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఆరు పట్టణాలకు ఇటీవల అధికారికంగా తమ పేర్లు పెట్టి భారత్ తో కయ్యానికి చైనా కాలు దువ్వింది. -
చైనా క్రికెట్ చాలా చీప్‌గా...
⇒28 పరుగులకే ఆలౌట్ ⇒390 పరుగులతో సౌదీ అరేబియా ఘనవిజయం చియాంగ్ మై (థాయిలాండ్): చైనా వస్తువులకు గ్యారంటీ ఉండదని, సుదీర్ఘ కాలం మన్నిక ఉండదని మనందరిలో సాధారణంగా ఉండే అభిప్రాయం. చైనా క్రికెట్ జట్టు కూడా అలా ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండటానికి ఇష్టపడలేదేమో! ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ క్వాలిఫయర్ (ఆసియా) టోర్నీలో భాగంగా సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌లో చైనా అతి చెత్త ప్రదర్శన నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో సౌదీ 390 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 419 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చైనా జట్టు 12.4 ఓవర్లలో 28 పరుగులకే కుప్పకూలింది. జట్టులో ఏడుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కాగా... ఇద్దరు చెరో 6 పరుగులు, మరొకరు 3 పరుగులు చేశారు. 13 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. ఇన్నింగ్స్ చివరి మూడు బంతులకు ముగ్గురు బ్యాట్స్‌మెన్ క్లీన్‌బౌల్డ్ అయి సౌదీ బౌలర్ రషీద్‌కు ‘హ్యాట్రిక్’ అందించారు. అంతకుముందు సౌదీ అరేబియా 50 ఓవర్లలో 418 పరుగులకు ఆలౌటైంది. అఫ్జల్ (120) సెంచరీ చేశాడు. -
భారత్‌పై విషం చిమ్మిన చైనా
బీజింగ్: భారత్‌పై మరోసారి చైనా విషం చిమ్మింది. అసత్య కథనాన్ని అక్కడి మీడియా వండివార్చింది. భారత్ అక్రమంగా పరిపాలిస్తున్న అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని, తీవ్ర కష్టాలుపడుతున్నారని ఇష్టరీతినా ఓ చైనాకు చెందిన అధికారిక పత్రిక రాసింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు తిరిగి చైనాకు వచ్చేయాలని అనుకుంటున్నట్లు కూడా అందులో పేర్కొంది. దలైలామాకు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఇస్తే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలోనే అక్కడి పేపర్లో ఇలాంటి కథనం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘చట్ట విరుద్ధంగా భారత్ పరిపాలిస్తున్న దక్షిణ టిబెట్(అరుణాచల్ ప్రదేశ్‌లో భాగం. దీనిని చైనా తమదిగా చెప్పుకుంటోంది) ప్రాంతంలోని ప్రజలంతా తీవ్ర కష్టాలు, దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఒకరకమైన వివక్షను చవిచూస్తూ వారు ఇండియాకు తిరిగొచ్చేయాలని అనుకుంటున్నారు’ అంటూ చైనా డెయిలీ రాసుకొచ్చింది. -
ఆండ్రాయిడ్ వీల్‌చెయిర్.. సూపర్ నాజిల్
స్టార్టప్.. స్టార్టప్.. స్టార్టప్.. ఇటీవల అందరికీ చిరపరిచితమవుతున్న పేరు ఇది. యువతరం కొత్త కొత్త ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు.. తద్వారా కొత్త ఉత్పత్తులు, సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలివి. సాఫ్ట్వేర్ రంగాన్ని కాసేపు పక్కనబెడితే.. సామాజిక ప్రభావాన్ని చూపే స్టార్టప్ కంపెనీలూ దేశంలో బోలెడున్నాయి. వాటిల్లో మచ్చుకు రెండింటి గురించి స్థూలంగా.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ గౌరవాన్ని కాపాడే వీల్‌చెయిర్.. ప్రమాదం.. తీవ్రవాద దుశ్చర్య.. లేదంటే అంతు చిక్కని రుగ్మత.. ఇలా రకరకాల కారణాల వల్ల కొంతమంది చక్రాల కుర్చీకే పరిమితమైపోవాల్సిన పరిస్థితి వస్తూంటుంది. అటు ఇటు కదిలేందుకు ఈ చక్రాల కుర్చీలు బాగానే ఉపయోగపడతాయి. మరి.. స్నానం చేయాలంటే? ఉదయాన్నే కడుపులోని బరువు దించేసుకోవాలంటే? ఇతరుల సాయం తప్పనిసరి. దీని వల్ల చాకిరి చేసేవారికీ, చేయించుకునేవారికీ ఇబ్బందే. ఇకపై మాత్రం ఇలా కాదంటున్నారు గణేష్ సోనావాణే. ఆర్కాట్రాన్ పేరుతో ఈయన ఏర్పాటు చేసిన స్టార్టప్ ఇప్పుడు ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే సరికొత్త వీల్‌చెయిర్‌ను సిద్ధం చేసింది. ఆండ్రాయిడ్ అప్లికేషన్ సాయంతో ఎస్ఏఎస్100 పేరుతో తయారు చేసిన ఈ సరికొత్త వీల్‌చెయిర్ అందుబాటులో ఉంటే స్నానం, బాత్రూమ్ అవసరాలకు ఇతరుల సాయం తీసుకునే అవసరమే ఉండదని అంటున్నారు కాలికట్ ఎన్ఐటీ నుంచి బీటెక్ ఇంజనీరింగ్ చదివిన గణేష్. సహచరులు నలుగురితో కలసి ఆర్కాట్రాన్ను స్థాపించారు. పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి వీల్చెయిర్లు ఇప్పటికే అందుబాటు ఉన్నాయి. కాకపోతే వాటి ఖరీదు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకూ ఉంటుంది. చైనా కంపెనీలు కొన్ని నాసికరం వీల్‌చెయిర్లను రూ.20 వేలకు ఒకటి చొప్పున అమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో తాము పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌గా ఉండే, బ్యాటరీతో పనిచేసే కమోడ్, షవర్ వీల్‌చెయిర్‌ను రూ.13 వేలకే అందుబాటులోకి తెస్తున్నట్లు గణేష్ తెలిపారు. చుక్క కూడా వృథా పోనీదు.. పెట్రోల్ బంకుల్లో మీరో విషయం గమనించారా? వాహనంలోకి పెట్రోల్, డీజిల్ వేయించుకునేటప్పుడు.. చివరల్లో ఒకట్రెండు చుక్కల ఇంధనం వృథా అవుతూంటుంది. ఆ.. చుక్కలే కదా అని మనం పట్టించుకోము. కానీ బెంగళూరుకు చెందిన ఫజల్ ఇమ్దాద్ షిర్పూర్వాలా పట్టించుకున్నాడు. ఎందుకంటే.. చుక్క చుక్క కలిసి.. దేశం మొత్తమ్మీద వృథా అవుతున్న ఇంధనం దాదాపు 22 కోట్ల లీటర్లు.. విలువ అక్షరాలా.. 1,300 కోట్ల రూపాయలు కాబట్టి! ఈ వృథాను ఎంత అరికడితే అంత మేరకు విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవచ్చన్నది తెలిసిందే. అందుకే ఫజల్ ఫియాజ్ టెక్ పేరుతో ఓ స్టార్టప్‌ను ఏర్పాటు చేశాడు. ఒక్క చుక్క కూడా వృథా కాకుండా సరికొత్త ఫ్యుయెల్ డిస్పెన్సర్ సిద్ధం చేశాడు. వీటిని కొనమని చమురు కంపెనీలను కోరితే.. వారెంటీ ఉన్నందున బంకుల్లో ఇప్పటికే వాడుతున్న ఫ్యుయెల్ డిస్పెన్సర్లను మార్చడం కష్టమని చేతులెత్తేశారు. దీంతో ఫజల్ వాడుతున్న ఫ్యుయెల్ డిస్పెన్సర్లకు బిగించుకునేలా ఓ సరికొత్త నాజిల్‌తో కూడిన కిట్‌ను తయారు చేశాడు. దీంతో వారెంటీకి ఎలాంటి సమస్య రాదని ఉన్న వాటిని మార్చాల్సిన అవసరమూ ఏర్పడదని అంటున్నారు. ఆటోడెస్క్ సాయం.. ఐడియాలు అందరికీ ఉంటాయి. వాటిని ఆచరణలోకి తీసుకు రావడం మాత్రం కష్టం. హైటెక్ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంటే ఈ పని కొంచెం సులువు అవుతుంది. కానీ వీటి ఖరీదెక్కువ. అందుకే తాము కొత్త కొత్త ఐడియాలతో ముందుకొచ్చే ఇన్నొ వేటర్స్కు సాయం అందించాలని నిర్ణయించామని అంటోంది ఆటోడెస్క్. ఆటోక్యాడ్ వంటి డిజైనింగ్, ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేసే ఈ సంస్థ ‘ఎంటర్ ప్రెన్యూర్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్’లో భాగంగా ఏటా కొంత మంది ఇన్నొవేటర్స్కు తమ సాఫ్ట్‌వేర్‌ను మూడేళ్లపాటు ఉచితంగా వాడుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. తాము ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు వేల స్టార్టప్ కంపెనీలకు ఈ రకమైన సాయం అందించామని, భారత్‌లో ఆర్కాట్రాన్, ఫయాజ్టెక్ వంటి 20 స్టార్టప్‌లకు చేయూత అందిస్తున్నామని సంస్థ సీనియర్ అధికారి జేక్ వేల్స్ ‘సాక్షి’కి తెలిపారు. -
అమ్మవారికి నూడుల్సే నైవేద్యం!
కోల్‌కతా: అవును మీరు చదివింది కరెక్టే.. పశ్చిమబెంగాల్లో కోల్‌కతా సమీపంలోని టంగ్రా ప్రాంతంలో కాళీమాత గుడి ఉంది. ఈ ప్రాంతంలో చైనీయులు ఎక్కువగా నివసిస్తుంటారు. చైనా టౌన్‌గా ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతంలో కొన్ని దశాబ్దాల క్రితం ఓ వృక్షం కింద ఉన్న కొన్ని రాళ్లను... స్థానికులు కాళీమాతగా పూజించేవారు. ఆ వృక్షం సమీపంలో నివసించే ఓ చైనా కుటుంబంలోని పిల్లవాడికి ఓసారి జబ్బు చేసింది. డాక్టర్లకు చూపించినా ఫలితం లేకపోవడంతో.. ఆ కుటుంబం కాళీమాతను పూజించగా...పిల్లవాడు కొన్ని రోజులకే కోలుకున్నాడని.. అప్పటినుంచి ఆ గ్రామంలో ఉన్న చైనీయులు కాళీమాతను పూజించడం మొదలుపెట్టారనే ప్రచారం ఉంది. స్థానికంగా ఉన్న చైనీయులందరూ చందాలు వేసుకుని కాళీమాతకు గుడి కూడా కట్టారు. అమ్మవారికి నైవేద్యంగా చైనా వంటకాలనే పెడుతుంటారు. -
దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో చైనా కంపెనీ ‘ఐవోమి’!
ఈ నెలలో మార్కెట్లోకి ‘ఐవీ505’ న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ‘ఐవోమి’ అతి త్వరలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇది తన తొలి స్మార్ట్‌ఫోన్ ‘ఐవీ505’ను ఈ నెలలో మార్కెట్లోకి తీసుకురానుంది. దీని ధర రూ.3,999గా ఉంది. చౌక, మధ్య ధర శ్రేణిలోని స్మార్ట్ఫోన్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఫోన్ జియో 4జీ సిమ్ కార్డును సపోర్ట్ చేస్తుందని తెలిపింది. ఆండ్రాయిడ్ మార్షమాలో ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్లో ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీని పొందుపరిచామని పేర్కొంది. 2019 నాటికి దేశీయంగా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. -
హోటల్లో అగ్నిప్రమాదం: 10 మంది మృతి
-
హోటల్లో అగ్నిప్రమాదం: 10 మంది మృతి
ఆగ్నేయ చైనాలోని నాన్‌చాంగ్ నగరంలో గల నాలుగు అంతస్థుల హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 10 మంది మరణించినట్లు సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. హెచ్‌ఎన్‌ఏ ప్లాటినం మిక్స్ హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ హోటల్ చైనాలోని జియాంగ్జి రాష్ట్ర రాజధాని అయిన నాన్‌చాంగ్ నగరంలో ఉంది. మంటల్లో కాలిపోయిన హోటల్ శిథిలాల్లో ఏడు మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. తీవ్రంగా గాయపడిన 16 మందిని ఆస్పత్రికి తరలించగా, వాళ్లలో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. ఈ హోటల్ పక్కనే ఉన్న 24 అంతస్తుల అపార్టుమెంటులో 260 మందికి పైగా ఉంటారు. వాళ్లందరినీ వెంటనే ఖాళీ చేయించారు. ఈ హోటల్ యాజమాన్యానికి చెందిన ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
ఉండీ లేనట్టు కనిపించే వంతెన!
వావ్ ఫ్యాక్టర్ ఉన్నది లేనట్టు... లేనిది ఉన్నట్టుగా కనిపించేలా చేయడాన్ని కనికట్టు అంటారు. ఇందులో మాయమంత్రాలేవీ ఉండవు. చేతివాటమే కీలకం. కానీ ఇక్కడి ఫొటోలు చూస్తే కనికట్టు చాలా చిన్న పదం అనిపించక మానదు. అవతార్ సినిమాలోని వేలాడే కొండల్ని పోలిన ప్రదేశం... రెండు ఎత్తైన శిఖరాల మధ్య ఓ బ్రిడ్జి. అదీ స్టోరీ! చైనాలోని ఝాంగ్గీయాజీ ప్రాంతంలో త్వరలో పూర్తి కానుందీ బ్రిడ్జి. కేవలం గాజు బ్రిడ్జి కావడం ఒక్కటే దీని ప్రత్యేకత కానేకాదు. ఎటు నుంచి చూసినా... అటువైపు ఉన్న సీనరీ మొత్తం పారదర్శకంగా కనిపించడం ఒక విశేషమైతే... అసలు బ్రిడ్జి ఉండీ లేనట్టుగా ఉండటం ఇంకో ముఖ్యమైన అంశం. మార్టిన్ డుప్లాంటైర్, డాకియాన్ ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్సు డిజైన్ చేసి నిర్మిస్తున్న ఈ వంతెనను స్టెయిన్లెస్ స్టీల్‌తో, నల్ల రాళ్లతో కడుతున్నారు. ఫొటోలను కొంచెం పరిశీలనగా చూస్తే వాటిల్లో రెండు పొరలున్న విషయం తెలుస్తుంది. అడుగున ఉన్న పొరల్లో పూర్తిగా పారదర్శకమైన పదార్థాన్ని వాడారు. పై అంతస్తులో ఇలాంటి ఏర్పాటేదీ ఉండదు. కాకపోతే నల్లరాళ్లపై దాదాపు రెండు సెంటీమీటర్ల ఎత్తువరకూ నీళ్లు ప్రవహించే ఏర్పాటు చేశారు. ఫలితంగా ఇది ఒక అద్దం మాదిరిగా మారిపోతుంది. పరిసరాల ఛాయాచిత్రాలతో దాదాపుగా కనిపించకుండా పోతుంది. ఏడు నిమిషాలకోసారి ఈ నీటిని తోడివేసి మంచులాంటి నీటి ఆవిరితో నింపుతూంటారు. దీంతో అక్కడ మేఘాల్లో తేలియాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. బ్రిడ్జికి ఒకవైపున ఒక పార్క్, ఓ హోటల్, ఓ వీఐపీ సూట్ వంటి ఏర్పాట్లు ఉన్నాయి. -
కిమ్ జోంగ్‌పై జోకులకు చెల్లుచీటీ
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మీద ఇప్పటివరకు సోషల్ మీడియాలలో చాలా జోకులు పేలుతున్నాయి. కానీ, ఇక మీదట చైనాలో మాత్రం అలాంటి జోకుకు చెల్లుచీటీ పలికారు. 'కిమ్ ఫాటీ ద థర్డ్' లాంటి పదాలను చైనా వెబ్సైట్లు సెన్సార్ చేస్తున్నాయి. ఇలాంటి పదాలు విపరీతంగా వాడుతున్నారంటూ ఉత్తరకొరియా అధికారులు చైనా అధికారులతో జరిగిన సమావేశంలో తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. దాంతో చైనా వెంటనే వాటిని నిరోధించే చర్యలు మొదలుపెట్టింది. 'జిన్ సాన్ పాంగ్' లాంటి పదాలను చైనా సెర్చింజన్ బైదులో వెతికినా, మైక్రో బ్లాగింగ్ సైట్ వైబోలో వెతికినా ఎలాంటి ఫలితాలు చూపించడం లేదు. కిమ్ వంశంలో మూడోతరానికి చెందిన కిమ్ జోంగ్ ఉన్ కాస్తంత లావుగా ఉండటంతో పాటు.. ఆయన నిరంకుశ విధానాల కారణంగా ప్రపంచం నలుమూలలా ఆయన చర్చనీయాంశంగా మారారు. ప్రపంచం మొత్తమ్మీద కమ్యూనిస్టులలో కూడా వారసత్వ పాలన ఉన్న ఏకైక దేశం ఉత్తర కొరియా మాత్రమే. దాంతో చైనా యువతీ యువకులు ఉత్తర కొరియా గురించి, ఆ దేశ పాలకుడి గురించి ఇంటర్నెట్లో విపరీతంగా వెతుకుతుంటారు. వాస్తవానికి అణ్వస్త్రాలను పరీక్షించిన తర్వాత ఉత్తరకొరియాపై చైనా కూడా మండిపడింది. కానీ, కొద్దిపాటి వాణిజ్యంతో పాటు దౌత్య సంబంధాలు కూడా ఉండటంతో మళ్లీ కిమ్ పాలనకు చైనా మద్దతు పలుకుతోంది. దాంతో.. తమ దేశాధ్యక్షుడికి ఇలాంటి నిక్ నేమ్‌లు ఉన్నాయని తెలిస్తే ఏం జరుగుతుందోనన్న భయంతో కొరియా అధికారులు ఆ విషయాన్ని వెంటనే చైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే చైనా కూడా దీనిపై స్పందించింది. ఈ నిక్ నేమ్‌లు ఏవీ వాస్తవాలకు దగ్గరగా ఉండబోవని, అందువల్ల వాటిని నిషేధిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ తెలిపారు. కిమ ఫాటీ ద థర్డ్ అనే పదాన్ని చైనాలో ఇంతకుముందు విస్తృతంగా ఉపయోగించేవారు. ఇక మీదట ఇప్పుడు అలాంటివేవీ కనిపించవన్నమాట. -
భారత అణు ఒప్పందానికి చైనా మద్దతు!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ టోక్యో పర్యటన సందర్భంగా కుదిరిన భారత్ - జపాన్ అణు ఒప్పందానికి చైనా మద్దతు తెలిపింది. అంతర్జాతీయ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి కట్టుబడిన దేశాలకు శాంతియుత అవసరాల కోసం అణుశక్తిని ఉపయోగించుకోడానికి హక్కు ఉంటుందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ మీడియాతో అన్నారు. భారత్-జపాన్ చేసిన సంయుక్త ప్రకటనలో దక్షిణ చైనా సముద్రం గురించిన ప్రస్తావన ఉండటంపైనా చైనా స్పందించింది. ఈ విషయంలో తాము తమ పాత విధానానికే కట్టుబడి ఉంటున్నట్లు తెలిపింది. పౌర అణు ఒప్పందం మీద సంతకాలు కుదరడానికి ముందు చైనా మీడియాలో మాత్రం దీనిపై విపరీతంగా విమర్శలు వచ్చాయి. కానీ మీడియా అభ్యంతరాలను గెంగ్ ఏమాత్రం పట్టించుకున్నట్లు కనిపించలేదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబుల బారిన పడిన ఏకైక దేశమైన జపాన్.. ఇన్నాళ్ల నుంచి ఎప్పుడూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం గురించిన విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. జపాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నా, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) మీద సంతకాలు చేయని మొట్టమొదటి దేశం భారతదేశమే. ఎన్పీటీ మీద సంతకం పెట్టడానికి నిరాకరించడం వల్లే అణు సరఫరాదారుల బృందంలో భారతదేశం చేరడాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తోంది. కానీ, అలాంటి చైనా ఇప్పుడు జపాన్ -భారత్ ఒప్పందానికి మద్దతు పలకడం ఆశ్చర్యంగా ఉంది. -
పాక్ నుంచి చైనా వ్యాపారం షురూ
గ్వాదర్ పోర్టు నుంచి సరుకుల ఎగుమతి ప్రారంభం ఇస్లామాబాద్: చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా పాక్‌లో పునరుద్ధరించిన గ్వాదర్ పోర్టు నుంచి ఆదివారం చైనా సరుకుల ఎగుమతి ప్రారంభమైంది. 250 కంటైనర్లతో పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు సరుకులు చేరవేయడానికి చైనాకు వాణిజ్య నౌక గ్వాదర్ నుంచి బయలుదేరింది. బలూచిస్తాన్‌లోని ఈ పోర్టు నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రారంభించారు. దీంతో పశ్చిమ చైనాను అరేబియా సముద్రంతో కలపాలన్న చైనా కల నెరవేరింది. చైనా ప్రారంభించిన వన్ బెల్ట్- వన్ రోడ్ కార్యక్రమంలో భాగంగా ఈ పోర్టును ప్రారంభించి తమ నిబద్ధతను చాటుకున్నామని, సీపీఈసీలో గ్వాదర్ పోర్టు కీలకమైనదని నవాజ్ పేర్కొన్నారు. సీపీఈసీలో భాగం గా చేయాల్సిన పనుల్ని గడువులోగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. -
చైనా ఫ్యాషన్ వీక్
-
చైనా మందుల దిగుమతులకు చెక్
• ఏటా చైనా నుంచి 3 బిలియన్ డాలర్ల దిగుమతులు • దేశీయంగానే రసాయనాలు, ఏపీఐ తయారీకి సిద్ధం • ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం • ఫార్మాక్సిల్ చైర్మన్ మదన్ మోహన్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చైనా నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్న ఔషదాలకు త్వరలోనే చెక్ పడనుంది. ‘‘ఫార్ములేషన్లను తయారుచేసే మూల ఔషదాల్లో భారత్ వెనకబాటు మొత్తం ఔషద రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో ఏటా 3-3.2 బిలియన్ డాలర్ల ఔషదాలు, ముడిపదార్థాలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది’’ అని ఫార్మాక్సిల్ చైర్మన్, అరబిందో ఫార్మా డెరైక్టర్ ఎం.మదన్మోహన్ రెడ్డి తెలిపారు. ‘ఇండియా ఫార్మా వీక్-2016’ కార్యక్రమం వివరాలను వెల్లడించేందుకు మంగళవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నిజానికిపుడు చైనా నుంచి దిగుమతవుతున్న టాప్ వంద ఔషదాలు దేశీయంగానే తయారు చేసే సామర్థ్యం భారత్కంది. కానీ ఇందుకోసం దేశీ కంపెనీలను బలోపేతం చేసి ఉమ్మడి మౌలిక సదుపాయాలు, ఔషద క్లస్టర్లను ఏర్పాటు చేయాలి. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చించాం. దేశీయంగా ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు ఆవశ్యకతను వివరించాం. కేంద్రం కూడా సుముఖంగానే ఉంది. వీటి ఏర్పాటుతో పాటు స్థలం, మౌలిక వసతుల కల్పన వంటి వాటిలో సబ్సిడీ ఇవ్వాలని సూచించాం. ఇది జరిగితే కంపెనీలకు వ్యయం తగ్గి పోటీతత్వం పెరుగుతుంది’’ అని ఆయన వివరించారు. ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుతో దేశీయంగానే రసాయనాలు, యాక్టివ్ ఫార్మా ఇన్గ్రేడియెంట్లు (ఏపీఐ), అడ్వాన్స్ ఇంటర్మీడియేట్లు, ఇంటర్మీడియేట్ల తయారు చేయగలమని చెప్పారాయన. ప్రస్తుతం అమెరికా వంటి దేశాలకు ఫార్మా ఎగుమతులు 16.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఈ ఏడాది ముగిసే నాటికి మరో 10 శాతం వృద్ధిని సాధిస్తామనే నమ్మకముందని చెప్పారాయన. నవంబర్ 17-23 వరకు ‘ఇండియా ఫార్మా వీక్-2016’.. సీపీహెచ్ఎల్, పీ-ఎంఈసీ సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే నెల 17 నుంచి 23 వరకు వారం రోజుల పాటు ‘ఇండియా ఫార్మా వీక్-2016’ జరగనుంది. ముంబైలోని బీఈసీ, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ రెండు వేదికల్లో జరగనున్న ఈ ఫార్మా వీక్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. దీన్లో 100కు పైగా దేశాల నుంచి 1,300లకు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటారు. ఫార్మా రంగంలో బిజినెస్ నాలెడ్జ్, లీడర్షిప్, నెట్వర్కింగ్ వంటి అంశాలపై ప్రదర్శన సాగనుంది. ఈ కార్యక్రమంలో ఫార్మాక్సిల్ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రవి ఉదయ్ భాస్కర్, సింతొకెమ్ ల్యాబ్స్ ఎండీ జయంత్ ఠాగూర్, ఎకోబ్లిస్ ఎండీ ఏవీపీఎస్ చక్రవర్తి, యూబీఎం ఇండియా ఎండీ యోగేష్ ముద్రాస్ పాల్గొన్నారు. -
'చైనా వస్తువులు అందుకే కొనొద్దన్నా'
న్యూఢిల్లీ: చైనా వస్తువులను బహిష్కరించాలని యోగా గురువు బాబా రాందేవ్ పిలుపునిచ్చారు. దీనికి గల కారణాన్ని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. భారతదేశంలో సొమ్ము ఆర్జించి, పాకిస్థాన్ కు చైనా సహాయపడుతోందని ఆయన ఆరోపించారు. చైనా పాలకులపై సామాజిక-ఆర్థిక ఒత్తిడికి తీసుకురావాలన్న లక్ష్యంతోనే చైనా వస్తువులు వాడొద్దని పిలుపునిచ్చినట్టు తెలిపారు. పాకిస్థాన్ కళాకారులతో నిషేధం గురించి ప్రశ్నించగా... 'కళాకారులు తీవ్రవాదులు కాదు. కానీ హిందీ సినిమాల్లో నటిస్తున్న పాక్ నటీనటులకు మనస్సాక్షి లేదు. ఎంతసేపు సినిమాలు, డబ్బు సంపాదన, బిర్యానీ తినడం గురించి ఆరాట పడుతుంటారు. ఉడీ ఉగ్రదాడిలో భారతీయులు చనిపోతే వారు ఎందుకు ఖండించలేద'ని రాందేవ్ నిలదీశారు. పాకిస్థాన్ లో పతంజలి శాఖను ఎందుకు నిర్వహిస్తున్నారని అడగ్గా... 'నేను పాకిస్థాన్ నటీనటుల వంటివాణ్ణి కాదు. పాకిస్థాన్ లో సంపాదించిన డబ్బును ఇక్కడకు తరలించాలన్న ఆశ నాకు లేదు. అక్కడ ఆర్జించిన సొమ్మును పాకిస్థాన్ ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాన'ని తెలిపారు. పంతజలిలో తనకు సింగిల్ షేరు కూడా లేదని, నిరాడంబర జీవితం గడుపుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్డీఏ రెండేళ్ల పాలనపై సంతృప్తిగా ఉన్నారా అని ప్రశ్నించగా... 'యోగికి సంతోషం, దుఃఖం అంటూ ఉండవు. ఈ రెండింటికి అతీతంగా ఉంటా. భారతదేశానికి నరేంద్ర మోదీ విజయవంతమైన ప్రధాన మంత్రి. ఆయనపై నాకు నమ్మకం ఉంది. రాజకీయాల పట్ల నాకు ఆసక్తి లేదు. నేనెప్పుడు రాజకీయ పదవులు ఆశించను' అని రాందేవ్ సమాధానమిచ్చారు. -
చైనా వస్తువులను నిషేధిద్దాం
స్వదేశీ జాగరణమంచ్ నెల్లూరు(బృందావనం): దేశప్రజలు చైనా వస్తువుల వాడకాన్ని నిషేధించి, దేశ ఆర్థిక, రక్షణరంగ వ్యవస్థ బలోపేతానికి తమ వంతు సహకారం అందించాలని స్వదేశీ జాగరణమంచ్ రాష్ట్ర యూత్ కో–కన్వీనర్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు చైనా లోపాయకారిగా మద్దతు ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో స్ధానిక గాంధీబొమ్మ సెంటర్లో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ పొరుగున ఉన్న పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు దొంగచాటుగా దేశంలోకి చొరబడుతూ మన సైనికులపై దాడులు చేస్తుంటే ప్రపంచంలోని దేశాలన్నీ ఈ వైఖరిని ఖండిస్తున్నాయన్నారు. అయితే మన దేశానికి మరో వైపున ఉన్న చైనా పాకిస్తాన్‌కు మద్దతుగా నిలవడం హేయమైన చర్యగా కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆ దేశంలో తయారైన పలు మొబైల్ఫోన్లు, బాణసంచా తదితర సామగ్రిని కొనుగోలు చేయకుండా స్వదేశంలో తయారైన ఉత్పత్తుల కొనుగోళ్లను ప్రోత్సహించాలన్నారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆ సంస్థ సభ్యులు సుధాకర్‌శెట్టి, మధు, జాన్, జి.హరికృష్ణ, వై.హరికృష్ణ పాల్గొన్నారు. -
భారత్ విధానంతో బంగ్లాకు నష్టం
బ్రహ్మపుత్ర నీటిపై చైనా వ్యాఖ్య బీజింగ్: వివిధ మార్గాల్లో బ్రహ్మపుత్ర నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి భారత్ చేస్తున్న యత్నాల వల్ల బంగ్లాదేశ్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లవచ్చని చైనా పేర్కొంది. ఆర్థిక అవసరాలకు బంగ్లాదేశ్ ఆధారపడటంతో, ఆ దేశ బేరసారాల శక్తిని భారత్ హరిస్తోందని విమర్శించింది. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ ఆరోపణలతో కథనాన్ని ప్రచురించింది. తాము నిర్మిస్తున్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుపై భారత్ అతిగా స్పందించాల్సిన అవసరం లేదని, బ్రహ్మపుత్ర నీటిని చైనా అపేసిందనే వార్తలతో భారత ప్రజల్లో పెల్లుబుకిన ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలమని తెలిపింది. భారత్, బంగ్లాదేశ్‌లతో నీటిని పంచుకోనేందు కు బహుముఖ సహకార విధానానికి చైనా సిద్ధం గా ఉందంది. కాగా, తమ అధికారిక పత్రిక కథనం ప్రభావాన్ని తక్కువ చేసేందుకు చైనా విదేశాంగ శాఖ ప్రయత్నించింది. భారత్‌కు తమ సహకారం ఉంటుందని పేర్కొంది. -
ఆ గ్రామంలో చైనా వస్తువులు నిషేధం
పట్నా: బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా ఒబ్రా గ్రామ పంచాయతీ చైనా వస్తువులను నిషేధించింది. పాకిస్తాన్‌కు చైనా మద్దతునిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. చైనా వస్తువులను అమ్మినా, కొన్నా జరిమానా తప్పదని హెచ్చరించింది.‘భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు చైనా మద్దతిస్తున్నందున చైనా కూడా మనకు శత్రువే. అందుకే చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ఆ దేశ వస్తువులను నిషేధించాలని పంచాయతీ సమావేశంలో నిర్ణయించాం’ అని సర్పంచ్ గుడియాదేవీ చెప్పారు. -
శివకుమార్ అంటే ఐ‘డర్’
సాక్షి, సిటీబ్యూరో: చైనా బైక్స్ పేరుతో దేశ వ్యాప్తంగా 60 మందికి పైగా టోకరా వేసిన శివకుమార్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘరానా మోసగాడిని సీసీఎస్ పోలీసుల శనివారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. హయత్‌నగర్ సమీపంలోని పెద్ద అంబర్‌పేటలో ఉన్న గోడౌన్‌ను సీజ్ చేసిన అధికారులు అందులో ఉన్న బైక్స్‌ను స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క ఈ ఘరానా మోసగాడు అనేక మంది యువతులనూ వంచించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కోణంలో తమకు ఫిర్యాదులు రాలేదని, వస్తే నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని సీసీఎస్ అధికారులు పేర్కొంటున్నారు. ఐడర్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి అదే బ్రాండ్‌తో బైక్స్ తయారు చేసి విక్రయించాలని శివకుమార్ ప్రయత్నాలు చేశాడు. చైనాకు చెందిన ద్విచక్ర వాహనాల తరహాలోనే ఇవీ ఉంటాయని ప్రచారం చేసుకున్నాడు. అయితే ఇలాంటి వాహనాల తయారీకి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. తానే స్వయంగా హైదరాబాద్‌లో కొన్ని వాహనాలు తయారు చేయించి ప్రదర్శించాడు. మొత్తం 15 మోడల్స్‌లో 110 సీసీ నుంచి 650 సీసీ సామర్థ్యం కలిగిన వాహనాలు ఉంటాయని, వీటి ధర రూ.49 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని నమ్మబలికాడు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ మహరాష్ట్ర, గోవాలతో పాటు దేశ వ్యాప్తంగా 60 మంది నగదు చెల్లించి డీలర్షిప్స్ తీసుకున్నారు. ఈ నయవంచకుడు కొందరు యువతులకూ ప్రేమ పేరుతో వల వేసి వారినీ వంచించాడు. ఆయా యువతులతో సన్నిహితంగా ఉన్న సమయాల్లో వారికి తెలియకుండా వీడియోలు, ఫొటోలు తీసేవాడు. వీటిని చూపించి ఆ యువతులను బెదిరించే వాడని, అలా తన డీలర్ల వద్దకు వారిని పంపుతూ ఆ దృశ్యాలు చిత్రీకరించే వాడని తెలిసింది. రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వరకు డిపాజిట్లుగా, మరికొంత మొత్తం బైక్స్ కోసం అడ్వాన్స్‌గా చెల్లించే డీలర్లు చివరకు మోసపోయామని తెలుసుకునే వారు. తాము చెల్లించిన నగదు తిరిగి ఇవ్వమంటే ‘దృశ్యాలు’ ఉన్నాయంటూ వారినీ బ్లాక్మెయిల్ చేసే వాడని తెలుస్తోంది. ఇతడి కార్యాలయంలో సోదాలు చేసిన పోలీసులకు రెండు ఈ తరహాకు చెందిన సీడీలు లభించాయని సమాచారం. పోలీసులు మాత్రం తమకు ఈ వ్యవహారాలపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేస్తున్నారు. ఇతడిపై ఇప్పటికే జూబ్లీహిల్స్, కాచిగూడ, మీర్‌చౌక్, సరూర్‌నగర్ ఠాణాల్లో కేసులు నమోదై ఉండగా... తాజాగా సీసీఎస్ పోలీసులు నమోదు చేశారు. శివకుమార్ మాటలు నమ్మిన అనేక మంది డీలర్లు కొన్ని నెలలుగా షోరూమ్స్, కార్యాలయాలు, సిబ్బందిని సిద్ధం చేసుకున్నారు. అప్పటి నుంచి వాటి అద్దెలు, వారికి జీతాలు చెల్లిస్తున్నారు. చివరకు ఇప్పుడు మోసపోయామని తెలియడంతో లబోదిబోమంటున్నారు. -
చైనా బైక్ ల పేరుతో టోకరా
హైదరాబాద్: చైనా బైక్స్ విక్రయానికి సంబంధించిన షోరూమ్స్ అనుమతుల పేరుతో దేశ వ్యాప్తంగా అనేక మందికి టోకరా వేసిన నగరవాసి శివకుమార్‌ను సీసీఎస్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇతడిపై నగరంలో 6 కేసులు నమోదై ఉన్నాయి. హైదర్ మోటార్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసిన శివ చైనా నుంచి ద్విచక్ర వాహనాలను తీసుకువచ్చి విక్రయిస్తామంటూ ప్రచారం చేశాడు. మొత్తం 15 మోడల్స్‌లో 110 సీసీ నుంచి 650 సీసీ సామర్థ్యం కలిగిన వాహనాలు ఉంటాయని, వీటి ధర రూ.49 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని నమ్మబలికాడు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ మహరాష్ట్ర, గోవాలతో పాటు దేశ వ్యాప్తంగా అనేక మందిని డీలర్‌షిప్‌లు ఇస్తున్నట్లు చెప్తూ వారి నుంచి డిపాజిట్లు వసూలు చేశాడు. కనిష్టంగా రూ.20 లక్షల నుంచి గరిష్టంగా రూ.30 లక్షల వరకు దండుకున్నాడు. ఇతడి బారినపడిన వారిలో నగరవాసులూ ఉండటంతో జూబ్లీహిల్స్ సహా వివిధ పోలీసుస్టేషన్లలో ఇప్పటికే ఆరు కేసులు నమోదై ఉన్నాయి. తాజాగా శనివారం కొందరు బాధితులు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రికవరీలపై దృష్టిపెట్టారు. -
చైనా బ్రాండ్లతో స్మార్ట్ ఫోన్ విక్రయాల జోష్..
♦ క్యూ2లో 17 శాతం వృద్ధి ♦ 2.75 కోట్లకు అమ్మకాలు న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ2)లో 2.75 కోట్ల యూనిట్లకు చేరాయి. చైనా కంపెనీలైన లెనొవొ, షావోమి, వివో వంటి కంపెనీలే ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచాయి. స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో గత త్రైమాసికంతో పోలిస్తే 17% వృద్ధి, గతేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 3.7% వృద్ధి నమోదయ్యింది. రీసెర్చ్ సంస్థ ఐడీసీ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మొబైల్ కంపెనీలు 2.35 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే క్యూ2లో పలు ఇతర దేశాలు సహా దేశీ మొబైల్ కంపెనీల స్మార్ట్‌ఫోన్ విక్రయాలు తగ్గితే.. చైనా కంపెనీల అమ్మకాలు మాత్రం 75 శాతం ఎగశాయి. జనవరి-మార్చి క్వార్టర్‌తో పోలిస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లెనొవొ సహా షావోమి, వివో, జియోనీ, ఒప్పొ కంపెనీల విక్రయాలు 28 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో స్మార్ట్‌ఫోన్ తయారీదారులు రిటైల్ వ్యాపారంపై ఎక్కువ దృష్టి నిలపడంతో ఆన్లైన్ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 35 శాతం నుంచి 28 శాతానికి పడ్డాయి. గతేడాదితో క్యూ2తో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో ఫీచర్ ఫోన్ల విక్రయాలు 2.6 శాతం వృద్ధితో 3.37 కోట్ల యూనిట్లకు చేరాయి. కాగా శాంసంగ్ 25 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. ఇక దీని తర్వాతి స్థానాల్లో మైక్రోమ్యాక్స్ (12 శాతం), లెనొవొ గ్రూప్ (8%), ఇంటెక్స్ (7%), రిలయన్స్ జియో (6.8 %) ఉన్నాయి. -
గిన్నిస్ పుటల్లో రోబో బ్రేక్ డ్యాన్స్..
షాన్డాంగ్ః బీర్ ఫెస్టివల్ లో రోబోల బ్రేక్ డ్యాన్స్ చూపరులను అమితంగా ఆకట్టుకుంది. చైనాలో జరిగిన బీర్ ఫెస్టివల్ సందర్భంగా 1007 రోబోలు ఏకకాలంలో వినూత్నంగా బ్రేక్ డ్యాన్స్ చేసి, విశేషంగా ఆకర్షించడమే కాదు గిన్నిస్ రికార్డును కూడా సాధించాయి. చైనా షాన్డాంగ్ రాష్ట్రంలోని క్విండగో సిటీలో ఎవర్ విన్ కంపెనీ బీర్ ఫెస్టివల్ నిర్వహించింది. ఈ వేడుకలో భాగంగా మొత్తం 1007 రోబోలు బ్రేక్ డ్యాన్స్ చేసి చూపరులను కట్టిపడేశాయి. క్యూఆర్సీ-2 పేరున్న43.8 సెంటీమీటర్లు అంటే సుమారు 19 అంగుళాల పొడవుండే ఒకేసైజులోని రోబోలు మొబైల్ ఫోన్ కంట్రోల్ తో ఏకకాలంలో ఒకేరీతిలో డ్యాన్స్ చేయడం విభిన్నంగా ఆకట్టుకుంది. మొత్తం 60 సెకన్లలో అద్భుతంగా డ్యాన్స్ చేసి అలరించిన రోబోలు రికార్డును కైవసం చేసుకున్నాయి. వేడుకలో భాగంగా ఎవర్ విన్ కంపెనీ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు ప్రయత్నించింది. రోబోల అద్భుత నృత్య ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకించి, గిన్నిస్ రికార్డు అర్హతను ధృవీకరించేందుకు కార్యక్రమానికి రోబో అసోసియేషన్ సాంకేతిక నిపుణుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డు నిర్ణేత ఎంజెలా వు హాజరయ్యారు. సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి పరచిన రోబోలు విభిన్నంగా డ్యాన్స్ చేసి.. వినూత్నంగా చూపరులను ఆకట్టుకున్నాయి. ప్రపంచ రికార్డును సాధించి గిన్నిస్ పుటలకెక్కాయి. ఇటువంటి వేడుకలు మరిన్ని నిర్వహిస్తామని రోబో ఫెస్టివల్ నిర్వహించిన ఎవర్ విన్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. రోబో బ్రేక్ డ్యాన్స్ కు ముగ్ధులైన చిన్నారులు సైతం ఫెస్టివల్ లో సందడి చేశారు. -
గిన్నిస్ పుటల్లో రోబో బ్రేక్ డ్యాన్స్..
-
మరింత రెచ్చిపోతున్న చైనా
-
మరింత రెచ్చిపోతున్న చైనా
దక్షిణ చైనా సముద్రంలో కొంతభాగం మూసివేత.. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై గుండుగుత్తగా తన ఆధిపత్యం చాటాలని భావిస్తున్న చైనా మరో ముందడుగు వేసింది. సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు ఈ సముద్రంలో కొంత భాగాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కులు లేవని అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిన కొద్దిరోజుల్లోనే చైనా ఈ చర్యకు దిగడం గమనార్హం. సముద్రంలోని ఆగ్నేయ దీవి ప్రావిన్స్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సోమవారం నుంచి గురువారం ఈ ప్రాంతాన్ని మూసివేస్తున్నట్టు చైనాకు చెందిన హైనాన్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అయితే, ఇవి ఏరకమైన సైనిక కార్యక్రమాలు అనేది వివరించలేదు. చైనా నేవీగానీ, రక్షణశాఖగానీ దీనిపై స్పందించలేదు. దక్షిణా చైనా సముద్రంపై వివాదాన్ని సామరస్య ధోరణిలో పరిష్కరించేందుకు, రెండు దేశాల ఆర్మీల మధ్య సంప్రదింపులను పెంచేందుకు అమెరికా నేవీ టాప్ అడ్మిరల్ చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలోనే డ్రాగన్ ఈ చర్యకు దిగడం గమనార్హం. అపార వనరులు, సహజ సంపదకు నెలవైన దక్షిణా చైనా సముద్రంలో చైనాకు ఎలాంటి చారిత్రక హక్కులు లేవని హేగ్ లోని అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. ఈ ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ చైనా తన ధిక్కార ధోరణిని చాటుతున్న సంగతి తెలిసిందే. -
భారీ టార్గెట్‌తో వస్తున్న వివో
నోయిడా: చైనా కు చెందిన మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ వివో భారత మొబైల్ మార్కెట్ ను క్యాప్చర్ చేసే ఆలోచతో రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈమేరకు భారీటార్గెట్ తో రంగంలో దిగుతోంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి తయారీ యూనిట్ ను భారత్‌లో ఏర్పాటు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఈ యూనిట్ నెలకొల్పేందుకు యోచిస్తోంది. దీని ద్వారా ఇండియాలో మొట్టమొదటి తయారీ యూనిట్ పెడుతున్న సంస్థగా తాము అవతరించనున్నామని వివో ఇండియా చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ వివేక్ జాంగ్ తెలిపారు. ఇప్పటికే గుర్గావ్లో రూ. 125 కోట్ల పెట్టుబడితో గత ఏడాది ప్రారంభించిన 30వేల చదరపు గజాల ప్లాంట్ లో ప్రస్తుతం తాము నెలకు 10 లక్షల యూనిట్లను ఎసెంబ్లింగ్ చేస్తున్నామని, దీన్ని మూడింతలు చేయాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. దాదాపు30 లక్షల టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిపారు. తద్వారా స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభ్యం కానున్నాయని వెల్లడించారు. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదిక ప్రకారం మార్చి 31 తో ముగిసిన మొదటి త్రైమాసానికి వివో, షియామీ, అప్పో, లీ ఇకో , లాంటి చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్స్ భారతదేశం అమ్మకాల్లో 22 శాతం వాటా కలిగి ఉన్నాయన్నారు. ఐడీసీ అంచనాల ప్రకారం మెట్రో నగరాల్లోనే మొబైల్ ఫోన్ విక్రయాలు బావున్నాయనీ, మోటరోలా, లెనోవో, షియామీ, లీ ఇకో ఫోన్లు ఇక్కువగా అమ్ముడవుతున్నాయని తెలిపారు. ఇక్కడి మార్కెట్లో అపార అవకాశాలు ఉన్నాయని, పూర్తి స్థాయి తయారీ కేంద్రం ఏర్పాటు తమ కంపెనీకి ప్రాధాన్య అంశమని మీడియాతో చెప్పారు. సరసమైన ధరల్లో టెక్నాలజీని అందించడమే వివో లక్ష్యమన్నారు. ఈ విషయంలో మేకిన్ ఇన్ ఇండియా తమకు గ్రామీణ ప్రాంతాల్లో బలమైన పునాది వేసిందన్నారు. భారత మార్కెట్లో వివో నిబద్ధతను చాటుకునేందుకు మేక్ ఇన్ ఇండియా ఒక ప్రధాన అడుగుగా పనిచేయనుందన్నారు. సుదీర్ఘ అనుభవం కంపెనీ సొంతమని ఈ నేపథ్యంలో భారత్‌లో విభిన్న, వినూత్న ఫీచర్లతో ఫోన్లను అందించనున్నట్టు వివేక్ జాంగ్ పేర్కొన్నారు.