
ట్రంప్ ఫొటోతో టాయిలెట్ పేపర్లు!
బీజింగ్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం బరిలో ఉన్న ట్రంప్ అమెరికా ఉద్యోగాలను, వ్యాపార లాభాలను చైనీయులు కొల్లగొడ్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై చైనా కంపెనీలు వినూత్న నిరసన తెలిపాయి.
ట్రంప్ హావభావాలు, ముఖ కవళికలను ముద్రించిన టాయిలెట్ పేపర్లను ఉత్పత్తి చేసి అమెరికాలో ‘డంప్ విత్ ట్రంప్’ అంటూ అమ్ముతున్నాయి. వీటికి మంచి డిమాండ్ వస్తోంది. కాగా, దివంగత లిబియా నియంత గడాఫీతో పలు ఒప్పందాలు కుదుర్చుకుని భారీగా ఆర్థిక లాభం పొందినట్లు ట్రంప్ చెప్పారు