వైరల్‌.. లిఫ్ట్‌లో బాలుడి బిత్తిరి చర్య | Boy pees on elevator buttons, gets stuck | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 27 2018 10:15 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

Boy pees on elevator buttons, gets stuck - Sakshi

లిఫ్ట్‌లో టాయిలెట్‌ పోస్తున్న బాలుడు

బీజింగ్‌ : చైనాలో ఓ బాలుడు చేసిన బిత్తిరి చర్య ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండరు. ‘బాగైందంటూ.. భుజాలు ఎగురేస్తారు’.  ఎవడు తీసుకున్న గొయ్యిలో వాడే పడ్డట్లుంది ఆ బాలుడి చేసిన పని. లిఫ్ట్‌లో ఒంటరిగా వెళ్తున్న ఆ బాలుడికి ఓ తీట పని చేయాలని తోచింది.

లిఫ్ట్‌ బటన్స్‌ను ఇతరులు కూడా ఉపయోగిస్తారనే ఉద్దేశంతో వాటిపై టాయిలెట్‌ పోసాడు. తీరా ఆ బటన్స్‌ను తానే ఉపయోగించాల్సి వచ్చింది. తాను దిగాల్సిన ఫ్లోర్‌ వచ్చే సరికి బటన్స్‌ వాటంతటవే పని చేయడంతో లిఫ్ట్‌ ఒక్కసారిగా స్ట్రక్‌ అయింది. దీంతో లిఫ్ట్‌ డోర్‌ తెర్చుకోవడం.. మూసుకోవడంతో ఆ కుర్రాడు భయంతో అరవడం మొదలెట్టాడు. చివరకు తానే ఆ బటన్‌లను ప్రెస్‌ చేసి బయటకి వచ్చాడు. ఇతరులకు కీడు చేయాలనుకుంటే తనకే కీడు జరుగుతుందనే  కర్మ సిద్దాంతం రుజువైంది. ఈ తతంగం అంతా అందులోని సీసీ టీవీలో రికార్డు అయింది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా వైరల్ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement