![China Toddler Stucked In Elevator With Safety Leash - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/30/lift.jpg.webp?itok=GcQAZFrI)
వీడియో దృశ్యం
బీజింగ్ : చేతికి కట్టిఉన్న సేఫ్టీ లీష్ (తీగ లాగా ఉండే ‘సేఫ్టీ లీష్’ను పిల్లలు తప్పిపోకుండా, ఎవరైనా ఎత్తుకుపోకుండా ఉండేందుకు తల్లిదండ్రులు దీని ఓ కొనను పిల్లలకు మరో కొనను తమకు కట్టుకుంటారు) కారణంగా ఓ చిన్నారి తీవ్ర ఇబ్బందికి గురైంది. లిఫ్ట్ తలుపుల మధ్య సేఫ్టీ లీష్ చిక్కుకుని కొన్ని క్షణాలు నరకం అనుభవించింది. చైనాలోని హ్యూబే ప్రావిన్స్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. డాయి సిటీకి చెందిన ఓ బాలిక గత గురువారం ఓ మహిళతో కలిసి బయటకు వచ్చింది. ఓ భవనంలోకి అడుగుపెట్టగానే బాలిక వెంటనే అక్కడి లిఫ్ట్‌లోకి వెళ్లింది. ఆ వెంటనే లిఫ్ట్ క్లోజ్ అయింది. ( వైరల్ వీడియో: ఇద్దరిపై చిరుత పంజా! )
లిఫ్టులో ఇరుక్కుపోయిన చిన్నారి
అయితే చేతికి ఉన్న సేఫ్టీ లీష్ లిఫ్ట్ తలుపుల మధ్య చిక్కుకోవటంతో బాలిక లిఫ్ట్‌తో పాటు ఠక్కున పైకి వెళ్లిపోయింది. ఏం జరుగుతోందో అర్థంకాని పరిస్థితిలో చిన్నారి ఉక్కిరిబిక్కిరి అయింది. పైన ఉన్న లిఫ్ట్ తలుపుల కొనలకు అతుక్కుపోయింది. కొన్ని క్షణాల పాటు గాల్లోనే ఉండిపోయింది. కొద్ది సేపటి తర్వాత సేఫ్టీ లీష్ లూజ్ అవటంతో కిందకు పడింది. బతుకుజీవుడా అంటూ బయటకు వెళ్లడానికి లిఫ్ట్‌లో ఉన్న ఫ్లోర్ నెంబర్స్ నొక్కుతూ ఉండిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment