![Woman Falls Off Bike After Trying To Kick Another Rider - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/8/biker.jpg.webp?itok=vQk0YZVI)
పెద్దలు ఊరికే అనలేదు.. చెడపకురా చెడేవు అని. పక్కవారికి హాని తలపెట్టాలని చూస్తే అది మనకే రివర్స్‌లో తగులుతుంది. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ యువతి తాను చేసిన పనికి.. కర్మ ఫలం వెంటనే అనుభవించింది.
ఓ యువకుడు, యువతి రోడ్డుపై బైక్ మీద వెళ్తున్నారు. ఈ క్రమంలో వారి పక్కన మరో బైక్‌పై ఓ వ్యక్తి వెళ్తున్నాడు. ఈ సందర్భంగా ఒక్కసారిగా ఆమెకు ఏం అనిపించిందో ఏమో.. పక్కన బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని తన కాలితో తన్నే ప్రయత్నం చేసింది. దీంతో, బ్యాలెన్స్ తప్పి రన్నింగ్‌లో ఉన్న బైక్ మీద నుండి కిందపడిపోయింది. కాగా, పక్కన వెళ్తున బైకర్.. తనను ఆమె తన్నడాన్ని గమనించకపోవడం విశేషం.
ఆమె కిందపోడిపోవడంతో స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఇక, ఆమె కిందపడిపోవడం గమనించిన రైడర్.. బైక్‌ను పక్కనే ఆపి మళ్లీ ఆమెకు మళ్లీ బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. బహుషా కర్మ అంటే ఇదేనేమో అంటూ కామెంట్స్ చేశారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు.
ఇది కూడా చదవండి: ‘అమ్మో ఎలుగుబంటి.. దారుణంగా దాడి చేసింది’
Comments
Please login to add a commentAdd a comment