యజమాని ముందే ఒక పెంపుడు కుక్క చిన్నారిపై దాడి చేసింది. ఈ ఘటన ఘజియాబాద్‌లోని హౌసింగ్ సొసైటి లిఫ్ట్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఆ వీడియోలో సదరు పెంపుడు కుక్క యజమాని చూస్తుండగానే ఒక బాలుడిపై కుక్క దాడి చేస్తుంది. దీంతో ఆ చిన్నారి బాధతో విలవిలాడుతూ లిఫ్ట్ ముందుకు వచ్చి నిలబడతాడు.
కానీ ఆ యజమాని కనీసం ఆ బాలుడిని ఓదార్చడం గానీ, సాయం చేయడం గానీ చేయకుండా బండరాయిలా నుంచొని ఉంది. పైగా తన కుక్కకు ఏమైన జరిగిందేమోనని చూస్తుందే తప్ప ఆ బాలుడిని ఓదార్చే పని చేయదు. దీంతో ఆకాష్ ఆశోక్ గుప్తా అనే నెటిజన్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ఆ లిఫ్ట్‌లో వారిద్దరే ఉన్నారని, ఎవ్వరూ చూడలేదని ఇంతలా నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తారా? అని ఆగ్రహంతో ప్రశ్నించారు.
దీంతో ఘజియాబాద్ పోలీసులు వెంటనే స్పందించి....ఆ బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఇలా దయాదాక్షిణ్యం లేకుండా ప్రవర్తించిన మహిళలను వదిలిపెట్టకూడదు...కఠినంగా శిక్షించాలి అంటూ ఫైర్ అయ్యారు.
a pet dog bites a kid in the lift while the pet owner keeps watching even while the pet owner the kid is in pain! where is the moral code here just cos no one is looking?
— Akassh Ashok Gupta (@peepoye_) September 6, 2022
.
.
p.s: @ghaziabadpolice
Location: Charms Castle, Rajnagar Extension, Ghaziabad
Dtd: 5-Sep-22 | 6:01 PM IST pic.twitter.com/Qyk6jj6u1e
"दिनांक 05.09.22 को राजनगर एक्सटेंशन स्थित एक सोसाइटी की लिफ्ट में एक कुत्ते द्वारा अपने मालिक की मौजूदगी में बच्चे को काट लेने के वायरल वीडियो के सम्बन्ध में बच्चे के पिता की तहरीर पर थाना नंदग्राम पर अभियोग पंजीकृत करते हुए अग्रिम विधिक कार्यवाही की जा रही हैं"
— GHAZIABAD POLICE (@ghaziabadpolice) September 6, 2022
बाइट-सीओ सिटी-2 pic.twitter.com/dvLwBXyUaT
(చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment