లక్నో: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. జువెనైల్ హోమ్‌లో పిల్లలకు రక్షణ కల్పించాల్సిన ఓ ప్రభుత్వ అధికారి చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించింది. బాల ఖైదీలుగా హోమ్‌లోకి వచ్చిన పిల్లలకు మంచి బుద్దులు, సత్ప్రవర్దన అలవాటు చేయాల్సిన ఓ మహిళా అధికారి తన బాధ్యతలు మరిచి వారిపై చేయి చేసుకుంది. చిన్న పిల్లలనే కనికరం లేకుండా కర్కశంగా కొట్టింది.
ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. మహిళా సూపరింటెండెంట్ చిన్నారులను కొడుతున్న దృశ్యాలు జువెనైల్ హోమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ గదిలో ఆరుగురు చిన్నారులు బెడ్స్ మీద పడుకొని ఉన్నారు. అక్కడికి వచ్చిన సూపరిండెండ్ పాల్ ఇతర ఉద్యోగులు చూస్తుండానే ఒక్కసారిగా ఓ చిన్నారిపై దాడి చేసింది. చెప్పుతో పదే పదే చెంపదెబ్బలు కొట్టింది. మిగతా పిల్లలను కూడా తిడుతుండటం వీడియోలో కనిపిస్తుంది.
అదే జువెనైల్ హోమ్‌లో నుంచి మంగళవారం మరో వీడియో బయటకు వచ్చింది. ఇందులో మళ్లీ సూపరిండింట్ ఏడేళ్ల వయస్సున్న ఓ అమ్మాయి చేతులు, కాళ్లు మంచానికి కట్టేసి పడుకోబెట్టింది. విడిపించుకనేందుకు ఆమె ప్రయత్నించినా సాధ్యపడలేదు. మంచం కిందకు జారిపోతుంది. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అధికారి ప్రవర్దనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. జువెనైల్ హోమ్‌లో చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. సందరు సూపరింటెండెంట్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
In #Agra's govt run children shelterhome (Pachkuiyaan), Poonam Lal, the center superintendent was caught slapping a girl with slippers. Earlier she was booked for abetment to suicide in #Prayagraj district in 2021 after a 15-yr-old girl allegedly killed her self in shelter home pic.twitter.com/JE5V56jR7l
— Arvind Chauhan 💮🛡️ (@Arv_Ind_Chauhan) September 12, 2023
రెండు ఘటనలపై ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపారు. క్రూరంగా వ్యవహరించిన హోమ్ సూపరింటెండెంట్ పూనమ్ పాల్‌ను అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. అంతేగాక కొన్ని రోజుల క్రితం ఆ హోమ్‌లో ఓ చిన్నారి ఆత్మహత్యకు సైతం ప్రయత్రించింది. కాగా పూనమ్ పాల్ గతంలోప్రయాగ్ రాజ్‌లో పనిచేసింది. అక్కడ కూడా పిల్లలపట్ల ఇంతే క్రూరంగా వ్యవహరించారని అధికారుల విచారణలో తేలింది.
The department of woman and child development #UttarPradesh has suspended the accused superintendent Poonam Pal based on the investigation of #Agra DM. pic.twitter.com/jnLIxQtiQq
— Arvind Chauhan 💮🛡️ (@Arv_Ind_Chauhan) September 12, 2023
ఆగ్రా డివిజన్ కమీషనర్ రీతూ మహేశ్వరి మాట్లాడుతూ.. ఈ సంఘటనలతో సంబంధం ఉన్న హోమ్ సూపరింటెండెంట్ పూనమ్ పాల్,ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఆమెపై ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయ్యిందని కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment