Superintendent
-
ఇంటర్ విద్యలో వింత పోకడ!
సాక్షి, అమరావతి: ఏదైనా ప్రభుత్వ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్న ఉద్యోగికి పదోన్నతి ఇస్తే సినియర్ అసిస్టెంట్ అవుతారు. సీనియర్ అసిస్టెంట్ నుంచి సెక్షన్ సూపరింటెండెంట్ అవుతారు. కానీ ఇంటర్మీడియట్ విద్యా మండలి(Board of Intermediate Education)లో జూనియర్ అసిస్టెంట్ నుంచి నేరుగా సూపరింటిండెంట్‌గా పదోన్నతి ఇచ్చేస్తారు. ఇదేలా సాధ్యమంటారా? ఇది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఏదైనా సాధ్యమే. ఇంటర్మీడియట్ విద్యా మండలిలో కొందరు జూనియర్ లెక్చరర్లకు ఏకంగా జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు (డీవీఈవో)లుగా పదోన్నతులిచ్చేందకు రంగం సిద్ధమైంది. వాస్తవానికి జూనియర్ లెక్చరర్ల (జేఎల్)కు సీనియారిటీ ప్రకారం ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి ఇస్తారు. ప్రిన్సిపల్స్‌కు డీవీఈవోగా పదోన్నతి ఇస్తారు. కానీ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో ఇచ్చిన వివాదాస్పద జీవో నం.283లోని ‘ఇనిషియల్ గెజిటెడ్ ర్యాంక్’ పాయింట్‌కు కొత్త భాష్యం చెబుతూ కొందరు జేఎల్‌లకు డీవీఈవోలుగా నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ జీవో ఇచ్చిన సందర్భం, పదోన్నతుల నిబంధనలతో సంబంధం లేకుండా చేస్తున్న ఈ ప్రక్రియ బోర్డు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకునేలా ఉంది. మరోపక్క ప్రస్తుతం పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ప్రిన్సిపల్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లేని పోస్టుల కోసం ఇచ్చిన జీవోతో లబ్ధి చేసేలా.. ఇంటర్ విద్యా శాఖలో ఒకేషనల్ కోర్సుల పర్యవేక్షణకు 2002–03లో జేఎల్‌తో సమానమైన కేడర్‌తో డిప్యూటీ డీవీఈవో (డీవైడీవీఈవో) పోస్టులు భర్తీ చేశారు. డీవీఈవోలుగా జేఎల్‌లకు పదోన్నతి కల్పించాలని ఉమ్మడి రాష్ట్రంలో 2008లో జీవో 283ని నాటి ప్రభుత్వం జారీ చేసింది. ఇలా జేఎల్లను నేరుగా జిల్లా అధికారులుగా నియమించడంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఆ జీవో అమలును నిలిపివేసింది. 2012లో డీవైడీవీఈవోలకు పదోన్నతులిచ్చినా, ఈ జీవోను కాకుండా ప్రిన్సిపల్ సీనియారిటీనే పరిగణనలోకి తీసుకుంది. ఆ తర్వాత డిప్యూటీ డీవీఈవో పోస్టులను భర్తీ చేయలేదు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఈ కేడర్‌లో ఎవరూ పనిచేయడం లేదు. 16 ఏళ్లుగా అమలు కాని ఈ జీవోను ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొందరికి లబ్ధి చేకూర్చేలా ముందుకు తెచ్చింది. జీవోలో ఉన్న లోపాలను అవకాశంగా తీసుకొని ప్రస్తుతం తక్కువ సర్వీసు ఉన్న ప్రిన్సిపల్స్ కోర్టుకెళ్లి జీవోను అమలు చేయాలని ఇంటర్ విద్యా కమిషనర్‌పై ఒత్తిడి తెస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ జీవో అమలైతే ఎన్నో ఏళ్లుగా ప్రిన్సిపల్స్‌గా పనిచేస్తున్న వారికి తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదముంది. ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా జేఎల్స్ అయినవారు, టీచర్లు, ఇతర కేడర్ల నుంచి జేఎల్స్‌గా పదోన్నతులు పొందిన వారి మధ్య ఇప్పటికే సీనియారిటీ వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు వివాదాస్పద జీవోను తెరపైకి తెచ్చి ప్రభుత్వం మరో కొత్త సమస్య తెచ్చిపెడుతోంది.జీవో 283ఏం చెబుతోంది?మూడేళ్ల సర్వీసు ఉన్న ప్రిన్సిపల్స్‌కు, మూడేళ్ల సర్వీసు ఉన్న డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు కలిపి కామన్ సీనియారిటీ చేసేటప్పుడు వారి ‘ఇనిషియల్ గెజిటెడ్ కేడర్ సర్వీస్’ని పరిగణనలోకి తీసుకోవాలి. ఎవరి యూనిట్ సీనియారిటీ దెబ్బతినకుండా చూడాలి. కానీ ప్రస్తుతం డిప్యూటీ డీవీఈవో కేడర్‌లో లబ్దిదారులు లేకపోవడంతో ఈ జీవోను అమలు చేయాల్సిన అవసరం లేదన్నది సీనియర్ ప్రిన్సిపల్స్ వాదన.ఈ రెండు కేడర్లలో అర్హులైన వారు ఉంటేనే జీవోను అమలు చేయాలి. ఒక కేడర్‌లో పనిచేసే లబ్దిదారులు లేకుండా ఉమ్మడి సీనియారిటీ ఎలా తీస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ విద్యా శాఖలో రూల్ 34, జీవో 283ని కొందరి స్వార్థం కోసం ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని చెబుతున్నారు.సీనియర్ ప్రిన్సిపల్స్‌కు అన్యాయం సర్వీసు నిబంధనల ప్రకారం జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ కావాలంటే జేఎల్స్ గెజిటెడ్ ఆఫీసర్ టెస్ట్ (జీవోటీ), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెస్ట్ (ఈవోటీ) పాసవ్వాలి. డీవీఈవోలుగా పదోన్నతి పొందాలంటే తప్పనిసరిగా ప్రిన్సిపల్ అయ్యుండాలి. అంటే జూనియర్ లెక్చరర్లలో సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా ఎవరైతే జీవోటీ, ఈవోటీ పాసవుతారో వారే ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి పొందుతారు. జీవో 283లో పేర్కొన్న ‘ఇనిషియల్ గెజిటెడ్ కేడర్ సర్వీస్’ అనేది కేవలం డిప్యూటీ డీవీఈవోలు, ప్రిన్సిపల్స్‌కు మాత్రమే ఉద్దేశించింది. కానీ ఈ అంశాన్ని ఇప్పుడు జేఎల్‌గా సర్వీసులో చేరినప్పటి నుంచి సీనియారిటీని లెక్కించాలని కొందరు కొత్త భాష్యం చెబుతూ ప్రస్తుతం డీవీఈవోల పదోన్నతులకు దీనినే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల అన్ని టెస్టులు పాసై, అర్హతలు సాధించిన సీనియర్ ప్రిన్సిపల్స్ డీవీఈవోలుగా పదోన్నతి పొందే అవకాశం కోల్పోతున్నారు. జూనియర్ ప్రిన్సిపల్స్ లబ్ధి పొందుతున్నారని సీనియర్లు వాపోతున్నారు. హైకోర్టు సైతం యూనిట్ సీనియారిటీకి నష్టం జరగకుండా పదోన్నతులివ్వాలని చెప్పినా ఇనిషియల్ సీనియారిటీనే పరిగణనలోకి తీసుకుంటున్నారని, ఇదే జరిగితే తాము పూర్తిగా పదోన్నతులకు దూరమవుతామని ప్రిన్సిపల్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అందరికీ సమన్యాయం చేయాలని కోరుతున్నారు. -
వైద్య కళాశాలల్లో ప్రిన్సిపల్స్, సూపరింటెండెంట్ల బదిలీ
రాష్ట్రంలో పలు ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల ప్రిన్సిపల్స్, సూపరింటెండెంట్లను బదిలీ చేస్తూ సోమవారం వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీచేశారు. – సాక్షి, అమరావతి: -
సహానా కేసులో దళిత అధికారికి బదిలీ కానుక
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడైన రౌడీషీటర్ నవీన్ చేతిలో హతమైన తెనాలి యువతి మధిర సహానా (25) కేసులో తాము చెప్పిన పనిని సకాలంలో చేయలేదన్న అక్కసుతో గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌పై కూటమి ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. దళితుడైన కిరణ్‌కుమార్ బదిలీ ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం అయ్యిందని, నేడోరేపో బదిలీ ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయన నడుచుకోలేదని, సీఎంఓ కార్యాలయం నుంచి చెప్పినా వినలేదనే ఆరోపణలతో ఆస్పత్రి సూపరింటెండెంట్ సీటు నుంచి ఆయనను తొలగిస్తూ సీఎం కార్యాలయం ఆమోద ముద్ర వేసింది. అసలు కారణం ఇదీ..రౌడీషీటర్ నవీన్ చేతిలో తీవ్రంగా గాయపడిన తెనాలికి చెందిన సహానాను ఈ నెల 20న చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అప్పటికే యువతి పరిస్థితి విషమించింది. కోమాలో ఉన్న సహానాను న్యూరోసర్జరీ ఐసీయూలో ఉంచి ఆస్పత్రి అ«ధికారులు, వైద్యులు చికిత్స అందించారు. కాగా.. రౌడీషీటర్ చేతిలో దారుణంగా దెబ్బతిని సహానా కోమాలోకి వెళ్లగా.. ఆమెపై ముగ్గురు లైంగిక దాడి చేశారని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు.దీంతో ఈ నెల 23న సహానా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తారని పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 22న సాయంత్రం 5 గంటలకు రౌడీషీటర్ నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటివరకు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సహానా ఆ రోజు రాత్రి 7 గంటలకు మరణించినట్టు నిర్ధారించి మార్చురీకి తరలించారు. ఆమెకు మరుసటి రోజు ఉదయం 6గంటలకల్లా శవపంచనామా, 9 గంటల్లోగా పోస్టుమార్టం పూర్తిచేసి భౌతికకాయాన్ని తెనాలి తరలించాలని కూటమి ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు భావించారు. ఆ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌కు ఆదేశాలిచ్చారు. అయితే, సహానా తల్లిదండ్రులు పోలీసుల ఉచ్చులో పడకుండా జగన్మోహన్రెడ్డి పర్యటన పూర్తయిన తర్వాత కూడా పంచనామాపై సంతకం చేయకుండా తమ బిడ్డకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. మరోవైపు సహానా భౌతికకాయాన్ని పరిశీలించి, కుటుంబసభ్యులు, వైద్యులతో మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సహానా కేసు విషయంలో ప్రభుత్వ తాత్సారాన్ని, నిర్లక్ష్య వైఖరిని జగన్ ఎండగట్టారు. దీంతో ఈ ఘటనలో తమ పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై సీరియస్ అయ్యారు. చివరకు ఆయనకు బదిలీ కానుక ఇచ్చారు. -
ఆదాయం ఎందుకు తగ్గింది?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయిన వాణిజ్యపన్నుల శాఖ నుంచి ఆదాయం తగ్గడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రావాల్సిన ఆదాయం కంటే గడిచిన ఆరేడు నెలల్లో ప్రతినెలా ఆదాయం రూ 650 కోట్ల మేరకు తగ్గడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదాయం తగ్గడానికి కారణాలేంటి? ఎక్కడ లొసుగులున్నాయో దృష్టిపెట్టాలని ఆదేశించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్యపన్నులు, రవాణా, మైనింగ్, ఎక్సైజ్ తదితర శాఖల ఉన్నతాధికారులతో గురువారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను సది్వనియోగం చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యపన్నుల లక్ష్యం రూ.85,126 కోట్లుగా ఉంటే.. ఏప్రిల్‌నుంచి సెపె్టంబర్‌వరకు రూ.42,034 కోట్లు ఆదాయం రావాల్సి ఉంది. అయితే ఇందులో రూ.37,315 కోట్లు మాత్రమే వచి్చంది. రూ.4,719 కోట్లు తక్కువ రావడంపై సీఎం సీరియస్ అయినట్లు సమాచారం. లక్ష్యాన్ని చేరుకోవాలి ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరే విధంగా పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఆదాయ వసూళ్లపై నిక్కచి్చగా ఉండాలని, అవసరమైతే సంబంధిత విభాగాన్ని పునర్వ్యవస్థీకరించుకోవాలని, సంస్కరణలు చేసుకోవాలని సూచించారు. ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రతీశాఖ పనితీరును క్షుణ్ణంగా సమీక్షించారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరినీ ఉపేక్షించరాదని హెచ్చరించారు.అత్యధికంగా జీఎస్టీలో 4,086 కోట్లు, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి రూ.654 కోట్లు తక్కువగా వచి్చనట్లు తేలింది. రాష్ట్రంలో జీఎస్టీలో ఎంట్రీ కాకుండా చాలామంది కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారని. అటువంటి వారిని కూడా గుర్తించాలని ఆదేశించారు. మద్యం విక్రయాల్లో ఆదాయం మరింత పెరగాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు తెలిసింది. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికట్టాలన్నారు. ఆర్ఆర్ఆర్తో సానుకూల వాతావరణం రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధి ప్రాజెక్టులతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. వీటితోపాటు ఫోర్త్‌సిటీ, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, కొత్త ఎయిర్‌పోర్టులు వంటివాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. అయితే అనుకున్న స్థాయిలో ఈ నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లలేదని, గందరగోళానికి తావు లేకుండా చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని చెప్పినట్లు తెలిసింది.ఇసుక, ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. ఎఫ్టీఎల్లో ఉన్న అక్రమ నిర్మాణాలనే హైడ్రా కూలి్చవేసిందని, అన్నీ సక్రమంగా ఉన్న భూముల విలువ పెరిగి.. రిజి్రస్టేషన్లు పెరగాల్సిన చోట.. ఆదాయం తగ్గడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మూసీలోని నిర్మాణాల తొలగింపునకు, రిజిస్ట్రేషన్లు తగ్గడానికి ఎలా ముడిపెడతారని సీఎం అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. -
ఆస్పత్రిలో అవినీతి జలగ
కోల్‌కతా: కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతం వేళ ఆ ఆస్పత్రి తాజా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. గతంలో ఆయన పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని అదే ఆస్పత్రి మాజీ డెప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ ఒక జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘సందీప్ సెక్యూరిటీ సిబ్బందిలో నిందితుడు సంజయ్ రాయ్ కూడా ఉన్నాడు. ఆస్పత్రి, వైద్యకళాశాలలోని అనాథ మృతదేహాలను సందీప్ అమ్ముకునేవాడు. దీనిపై కేసు నమోదైంది. తనకు సెక్యూరిటీగా ఉండే బంగ్లాదేశీలతో కలిసి సిరంజీలు, గ్లౌజులు, బయో వ్యర్థ్యాలను రీసైకిల్ చేసి బంగ్లాదేశ్‌కు తరలించి సొమ్మ చేసుకునేవారు. నేను గతేడాది వరకు ఆస్పత్రిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఉండగా సందీప్ అక్రమాలపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదుచేశా. దీనిపై ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీలో నేనూ ఉన్నా. సందీప్‌ను దోషిగా తేల్చినా చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖకు నివేదిక పంపిన రోజు నన్ను, కమిటీలోని ఇద్దరు సభ్యులను బదిలీచేశారు. ఈయన నుంచి విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యా’’ అని అఖ్తర్ అన్నారు.ప్రతి టెండర్లో 20 శాతం కమిషన్‘‘ ఆస్పత్రి, వైద్యకళాశాల పరిధిలో చేపట్టే ప్రతి టెండర్ ప్రక్రియలో సందీప్ 20 శాతం కమిషన్ తీసుకునేవాడు. తనకు అనుకూలమైన సుమన్ హజ్రా, బిప్లబ్ సింఘాలకు ఈ టెండర్లు దక్కేలా చూసేవాడు. సుమన్, సింఘాలకు 12 కంపెనీలు ఉన్నాయి. ఏ టెండర్ అయినా వారికి రావాల్సిందే. డబ్బులు ఇచ్చిన వైద్య విద్యార్థులనే పాస్ చేసేవాడు. లేకుంటే ఫెయిలే. తర్వాత డబ్బులు తీసుకుని మళ్లీ పాస్ చేయించేవాడు. ‘శక్తివంతమైన’ వ్యక్తులతో సందీప్‌కు సత్సంబంధాలున్నాయి. అందుకే రెండు సార్లు బదిలీచేసినా మళ్లీ ఇక్కడే తిష్టవేశాడు’’ అని అఖ్తర్ చెప్పారు.కొత్త ప్రిన్సిపల్ తొలగింపుకోల్కతా: వైద్య విద్యార్థుల డిమాండ్ మేరకు ఆర్జి కర్ మెడికల్ కాలేజీ కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్‌ను బెంగాల్ ప్రభుత్వం తొలగించింది. వైస్–ప్రిన్సిపల్ బుల్బుల్, మరో ఇద్దరిని కూడా తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ‘‘మా కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్ పత్తా లేరు. మాకు సంరక్షకురాలి వ్యవహరించాల్సిన ఆమె ఆర్జి కర్ ఆసుపత్రిలో విధ్వంసం జరిగిన రాత్రి నుంచి ఆసుపత్రి ప్రాంగణంలో కనిపించలేదు. ఆమె స్వాస్థ్య భవన్ నుంచి పనిచేస్తున్నారని విన్నాం. అందుకే ఇక్కడకు వచ్చాం’ అని ఒక జూనియర్ డాక్టర్ బుధవారం ఉదయం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్పత్రిపై దుండగులు దాడి చేస్తుంటే అడ్డుకోకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు, ఒక ఇన్స్పెక్టర్ను కూడా కోల్‌కతా పోలీసు శాఖ బుధవారం సస్పెండ్ చేసింది. మంగళవారం నాటి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ ఆస్పత్రి, వైద్యకళాశాల వద్ద దాదాపు 150 మంది పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందితో కట్టుదిట్టమైన రక్షణ కల్పించారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద డాక్టర్ల ఆందోళనలు పదోరోజు కూడా కొనసాగాయి. విధుల్లో చేరాలని రెసిడెంట్ డాక్టర్స్‌కు ఎయిమ్స్ విజ్ఞప్తి చేసింది. -
పసికందు కోసం కన్నతండ్రి కష్టం..
-
ఏసీబీవలకు చిక్కిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్
-
జైల్లో ఓ అధికారి పైసా వసూల్..!
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో వసూళ్ల రాజాలు చెలరేగుతున్నారు. జైళ్లలో నూతన సంస్కరణలు తీసుకొచ్చి శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో మార్పు తీసుకురావడానికి ఓ పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వాటిని అమలు చేయాల్సిన జైల్ అధికారుల్లో కొందరు ఆ విధానాలను విస్మరిస్తున్నారు. విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీల నుంచి ఓ అధికారి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. జైల్ లోపల ఖైదీల లీడర్లతో డబ్బులను వసూలు చేయించి జేబులు నింపుకొంటున్నారు. ఇక్కడ జైల్లో నర్మదా, తపతి, గోదావరి, పెన్నా, కావేరి, గోస్తని, గంగా, తదితర నదుల పేర్లతో బేరక్లున్నాయి. సాధారణ ఖైదీలు, రిమాండ్ ఖైదీలు, తీవ్ర నేరాలకు పాల్పడి శిక్ష పడిన ఖైదీలు, మావోయిస్టులు తదితర ఖైదీలను వేర్వేరుగా ఆయా బేరక్‌లలో పెడతారు.ప్రతి బేరక్లకు సీనియర్ ఖైదీలు మేసీ్త్రలు (లీడర్లు)గా ఉంటారు. వారు మిగిలిన ఖైదీలను నియంత్రిస్తూ జైల్ సిబ్బందికి సహాయకులుగా ఉంటారు. జైల్‌కు వెళ్లే రిమాండ్ ఖైదీలను తక్కువ రద్దీ గల బేరక్‌లలో పెట్టాల్సి ఉంది. అలాంటి బేరక్‌లలో పెట్టడానికి రిమాండ్ ఖైదీల నుంచి ఓ అధికారి మేసీ్త్రల సాయంతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఖైదీల కుటుంబ సభ్యుల నుంచి మేసీ్త్రల కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ చేసుకొని తర్వాత విత్‌డ్రాలు చేస్తున్నట్లు తెలిసింది. అలా డబ్బులు ఇవ్వని ఖైదీలను కరుడు కట్టిన నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న బేరక్‌లు, రద్దీగా ఉండే బేరక్‌లలో వేస్తామని, అక్కడ ఆ ఖైదీల మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారని, శిక్ష పూర్తిచేసుకొని బయటకు వచ్చిన వారు, బెయిల్‌పై బయటకు వచ్చిన వారు ఆవేదన చెందుతున్నారు. జైల్లో ఉన్నప్పుడు దీనిపై వారిని నిలదీస్తే ఎలాంటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఫిర్యాదు చేయలేకపోయామని అంటున్నారు. ఖైదీల కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కరి నుంచి రూ 5,000 నుంచి ఆపైన వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఆ అధికారి గతంలో పనిచేసిన జైల్లో కూడా ఇదే తీరు కనబరిచాడని, ఉన్నతాధికారులు పలుసార్లు మందలించినా ఆయన తీరు మారలేదని ఇక్కడ సిబ్బందిలో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. జైల్ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి ఇలాంటి పరిణామాలు జరగకుండా అడ్డుకట్టవేయాలని ఖైదీల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాలేదు జైల్లో ఖైదీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఖైదీలను ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. మేం ప్రతిరోజు జైల్లో రౌండ్స్‌కు వెళుతుంటాం. ఆ రౌండ్స్‌లో ఖైదీల సమస్యలు కూడా అడుగుతుంటాం. అలాంటిప్పుడు ఖైదీలు నిర్భయంగా ఏ సమ స్య గురించైనా చెప్పవచ్చు. కానీ ఇంతవరకు ఎవరూ డబ్బులు అడుగుతున్నట్లు మాకు చెప్పలేదు. అధికారులు, సిబ్బందిని పిలిపించి దీని పై సీరియస్‌గా హెచ్చరిస్తాం. ఒకవేళ డబ్బులు తీసుకున్నట్టు వెల్లడైతే చర్యలు తీసుకొంటాం. –కిశోర్‌కుమార్, కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ -
మేయర్ ఫోన్ చేస్తే మాట్లాడవా? నా చాంబర్ ఎదుట30 నిమిషాలు నిల్చో!
ఎంజీఎం: ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తన తండ్రి వృత్తిని కించపరుస్తూ తనను డీఎంఓ వచ్చే వరకు 30 నిమిషాలు ఆయన చాంబర్ ఎదుట నిల్చోబెట్టాడని కాకతీయ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న డాక్టర్ వీర ప్రసాద్ ఆరోపించడం కలకలం రేపింది. మనస్తాపానికి గురైన ప్రసాద్ తన పీజీ సీటు వదిలేస్తానని లేఖ రాసి.. తనకు అవమానం జరిగిందంటూ జూడా ప్రతినిధు లకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు విషయం బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సదరు లేఖ, ఫిర్యాదులోని వివరాల ప్రకారం..’’ ఈ నెల రెండో తేదీన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డ్యూటీలో ఉండగా ఓ రోగి ఛాతీనొప్పితో రావడంతో పరీక్షిస్తున్నాను. సరిగ్గా అదే సమయంలో అటెండర్ ఫోన్ తీసుకువచ్చి మేయర్ మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పగా.. రోగికి వైద్యం అందించగానే మాట్లాడతానని చెప్పాను. వెంటనే ఫోన్ తీసుకోలేదన్న కారణంగా సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్.. నన్ను చాంబర్ దగ్గరికి పిలిపించాడు. నా తండ్రి వృత్తిని పేర్కొంటూ వ్యక్తిగతంగా కించపరిచాడు. డీఎంఓ వచ్చే వరకు 30 నిమిషాలు తన చాంబర్ ఎదుట నిలుచోబెట్టి తీవ్రంగా అవమాపరిచాడు’ అని ఆ లేఖ, ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ చదవడంకంటే పీజీ సీటు వదిలేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నాడు. ప్రజాప్రతినిధుల ఫోన్లకు స్పందించాలని చెప్పారంతే: ఆర్ఎంఓ శ్రీనివాస్ ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాస్ ఈ ఘటనపై స్పందించారు. సదరు పీజీ వైద్యుడితో సూపరింటెండెంట్ దురుసుగా ప్రవర్తించలేదని, సాధారణంగా పీజీ విద్యార్థి ఏ స్థాయి నుంచి వచ్చారో అనే కోణంలో ప్రశ్నించారని తెలిపారు. చాంబర్ ముందు 30 నిమిషాలు ఉండమన్నందుకు సదరు విద్యార్థి మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి కాబట్టి ప్రజాప్రతినిధుల ఫోన్లకు స్పందించాలని చెప్పారే తప్ప వ్యక్తిగతంగా దూషించలేదని వివరణ ఇచ్చారు. -
విధుల్లో చేరిన రాజమండ్రి జైలు సూపరిండెంట్ రాహుల్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ రాహుల్ విధుల్లోకి చేరారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో సూపరిండెంట్ రాహుల్ విధులకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. జైలు సూపరిండెండెంట్ భార్య అనారోగ్య కారణాలతో సెలవు పెడితే పచ్చ మీడియా విపరీతార్థాలు తీసింది. దీంతో పచ్చ మీడియా తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్య ఎస్ రాహుల్ భార్య కిరణ్మయి(46) ఈ నెల 15న మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్మయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతదేహాన్ని అంబులెన్సులో గుంటూరు తీసుకెళ్లారు. భార్య అనారోగ్యం కారణంతో జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవులపై వెళ్లారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నేపథ్యంలో ఒత్తిడిపై రాహుల్ సెలవులపై వెళ్లారని పలువురు దుష్ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఎస్పీ జగదీష్ స్పందిస్తూ ఆ వార్తలను కొట్టిపారేశారు. భార్య అనారోగ్యం కారణంగానే ఆయన సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఒత్తిళ్లు లేవని, తమ డ్యూటీ తాము చేస్తున్నానమని స్పష్టం చేశారు. -
ఈనాడు సైకో రాతలు
-
రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ భార్య మృతి
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్య ఎస్ రాహుల్ భార్య కిరణ్మయి(46) మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్మయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. మృతదేహాన్ని అంబులెన్సులో గుంటూరు తీసుకెళ్లారు. జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్, ఎస్పీ జగదీశ్ ఆస్పత్రికి వెళ్లి సంతాపం తెలిపారు. భార్య అనారోగ్యం కారణంతో జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవులపై వెళ్లారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నేపథ్యంలో ఒత్తిడిపై రాహుల్ సెలవులపై వెళ్లారని పలువురు దుష్ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఎస్పీ జగదీష్ స్పందిస్తూ ఆ వార్తలను కొట్టిపారేశారు. భార్య అనారోగ్యం కారణంగానే ఆయన సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఒత్తిళ్లు లేవని, తమ డ్యూటీ తాము చేస్తున్నానమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా భార్య మరణం దృష్ట్యా సూపరింటెండెంట్ రాహుల్ సెలవును పొడిగిస్తున్నట్లు జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్ తెలిపారు. ఆయన తిరిగి విధుల్లో చేరే వరకూ కేంద్ర కారాగార పర్యవేక్షణ బాధ్యతలు తానే నిర్వర్తిస్తానని చెప్పారు. చదవండి: Live Updates: చంద్రబాబు కేసు అప్డేట్స్ -
రామోజీ పైశాచికత్వం
సాక్షి, అమరావతి: ‘ఈనాడు’ పత్రిక, దాన్ని నడిపిస్తున్న రామోజీరావు ఇంత పైశాచికంగా ఆలోచిస్తున్నారెందుకు? తెలుగుదేశం పార్టీ దారుణంగా దిగజారిపోయి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ‘ఈనాడు’ కూడా తన సొంత స్టోరీల మాదిరిగా రాస్తూ ఎందుకింత నీచానికి ఒడిగడుతోంది? ఒక జైలు సూపరింటెండెంటు... అనారోగ్యంతో ఉన్న తన భార్య ఆరోగ్యం విషమించిందని తెలుసుకుని అప్పటికప్పుడు సెలవు పెట్టి వెళితే దానిక్కూడా ఊహలు, అతిశయోక్తులు జోడించి ‘రాజమండ్రి జైల్లో ఏం జరుగుతోంది?’ అంటూ కథనాన్ని వండేశారంటే ఏమనుకోవాలి? చంద్రబాబుతో, పవన్ కళ్యాణ్, లోకేశ్, బాలకృష్ణ ములాఖత్ అయిన కాసేపటికే జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవు పెట్టారని, ప్రభుత్వ పెద్దలు బలవంతంగా సెలవుపై పంపించటం వల్లే ఇదంతా జరుగుతోందని, జైలును కుట్రలకు కేంద్రంగా మారుస్తున్నారని... ఇలా చేతికొచ్చిన అక్షరాలన్నిటినీ రాసేసింది. దాన్నే తెలుగుదేశం పార్టీ తన విషప్రచారానికి వాడుకుంటోంది. జనం మెదళ్లలో వీలైనంత విషం నింపటానికి ఎల్లో ముఠాలన్నీ ఒక్కటై సాగిస్తున్న ఈ దుష్ప్రచారం హద్దుల్లేకుండా సాగిపోతోంది. భార్య అనారోగ్యం అని చెప్పినా.... వాస్తవానికి జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి (46) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఔట్ పేషెంట్‌గానే చికిత్స పొందుతున్న కిరణ్మయిని.. ఆరోగ్యం విషమించటంతో ఈ నెల 14న ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో రాహుల్ కూడా సెలవు పెట్టారు. దురదృష్టవశాత్తూ పరిస్థితి విషమించి శుక్రవారం ఆమె మరణించారు కూడా. ‘ఈనాడు’ పత్రిక గానీ, టీడీపీ గానీ ఇలాంటి వార్త రాసేముందు రాహుల్ సెలవు పెట్టిన కారణాన్ని తెలుసుకుని... అది వాస్తవమో కాదో ఒక్కసారి ధ్రువపరుచుకుని ఉంటే సరిపోయేది. అలా చేస్తే.. ఇంతటి హేయమైన, నీచమైన దౌర్భాగ్యపు రాతలు రాసి ఉండేవారు కాదేమో!!. వాస్తవానికి అలా అనుకోవటానికి లేదు. ఎందుకంటే వీళ్లెవరికీ నిజాలతో పనిలేదు. నిజం తెలిసినా దాన్ని బయటకు చెప్పరు కూడా. ఎన్ని అబద్ధాలు చెప్పయినా... జనం మెదళ్లలో ఎంతటి విషాన్ని నింపయినా చంద్రబాబును వీలైతే జైల్లోంచి బయటకు తేవటం, లేకపోతే సానుభూతి సంపాదించి రాజకీయంగా లబ్ధి పొందటమే వాళ్ల లక్ష్యాలు. దీనికోసం తాము అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా సంపాదించిన కోట్ల రూపాయల డబ్బు మూటల్ని వెదజల్లటానికి ఎల్లో ముఠా వెనకాడటం లేదు. కోట్లాది రూపాయలు ఫీజులివ్వటంతో పాటు ప్రత్యేక విమానాల్లో లాయర్లను తీసుకురావటం... దత్తపుత్రుడితో సహా కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ – విజయవాడ– ఢిల్లీ అంటూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతుండటం... జాతీయ మీడియాకు ఢిల్లీలో చినబాబు లోకేశ్ ఇంటర్వ్యూలు... స్కిల్‌డెవలప్‌మెంట్‌పై నిజాలు అంటూ గాలి మాటలతో ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించటం.. ఇవన్నీ ఈ అక్రమ సంపాదనకు పుట్టిన సంతానమే అనుకోవాలి. దొంగతనం చేసి ఇంత యాగీ చేయటమా? దేశంలోనే కాదు... ఒక దొంగని అరెస్టు చేస్తే ఇంత యాగీ చెయ్యటమనేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఒక్క ఏపీలో తప్ప... అదీ చంద్రబాబునాయుడి విషయంలో తప్ప. ఒకవైపేమో సీమెన్స్ సంస్థ తమతో ఎవరూ ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదని చెబుతోంది... కానీ ఎల్లో మీడియా మాత్రం సీమెన్స్ పెద్ద సంస్థకాదా? సీమెన్స్ అంతర్జాతీయ దిగ్గజం కాదా? అని వాదిస్తోంది. నిజాలకు మసిపూస్తోంది. నిజంగా సీమెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టే ఎదురు ప్రశ్నలు వేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున విడుదల చేసిన డబ్బులు బయటకు పోయాయన్నది నిజం. అవి సీమెన్స్‌కు చేరలేదని ఆ సంస్థే చెబుతోంది. అవి షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబును చేరాయని కేంద్ర దర్యాప్తు సంస్థలే తేల్చాయి. మరి ఇంత రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి కూడా.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల సంఘీభావమంటూ, బెంగళూరులో తమకు మద్దతు తెలిపారంటూ పదేసి మందిని పోగేసి ఇంత యాగీ చేయటమెందుకు? మణిపూర్ పోరాట యోధురాలు ఇరోమ్ షర్మిల ద్వారా కూడా ట్వీట్ చేయించారంటే చంద్రబాబు ఎల్లో నెట్వర్క్ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే తెలుస్తుంది. అసలు ఇరోమ్ షర్మిలకు ఏపీ గురించి తెలుసా? ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? చంద్రబాబు ఎంత లూటీ చేశాడో తెలుసా? నిజంగా తప్పు చేయకపోతే... తాము అన్నీ సక్రమంగానే చేసి ఉంటే ఆ విషయాలన్నీ కోర్టులో చెప్పొచ్చు కదా? చంద్రబాబును వదిలేయాలంటూ వాట్సాప్ మెసేజ్‌లు, ఆడియో సందేశాలు... ఎందుకిదంతా? 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు... ఈ 40 ఏళ్లుగా తాను పెంచి పోషించిన విష వ్యవస్థను తనకు మద్దతివ్వటానికి ఉపయోగించుకుంటున్నారని తెలియటానికి ఇంకేం కావాలి? తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే న్యాయమూర్తిపై కూడా దారుణంగా దు్రష్పచారం చేసిన ఈ ఎల్లో ముఠా తన అబద్ధాలతో ఇంకెన్నాళ్లు మనుగడ సాగించగలదు?. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్య కిరణ్మయి మృతి కంబాలచెరువు (రాజమహేంద్రవరం):రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ సతీమణి కిరణ్మయి (46) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో కిరణ్మయి బాధపడుతున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగోకపోవడంతో నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్, కిరణ్మయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పోలీసు యంత్రాంగం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది స్థితిగతులు తెలుసుకుని వాస్తవాలను ప్రచురించండి జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్,తూర్పు గోదావరి ఎస్పీ పి.జగదీష్ కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు యంత్రాంగం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని, స్థితిగతులు తెలుసుకుని రాయాలని, అవాస్తవాలను ప్రచురించవద్దని కోస్తా, ఆంధ్ర రీజియన్ జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి.జగదీష్ చెప్పారు. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి అనారోగ్యంతో మృతిచెందడంతో డీఐజీ రవికిరణ్, ఎస్పీ జగదీష్ శుక్రవారం హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి సూపరింటెండెంట్‌ను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పలు వార్తాపత్రికల్లో జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తపరుస్తూ వార్తలు వచ్చాయన్నారు. ఆయన సతీమణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ నెల 14న ఉదయం 6గంటలకు ఆసుపత్రిలో చేర్చారన్నారు. ఆమెను చూసుకునేందుకు రాహుల్ రెండు రోజులు సెలవుపై వెళ్లారన్నారు. దీనికి ఈ ఒక్క కారణమే తప్ప మరేకారణం లేదన్నారు. రాహుల్ భయపడి వెళ్లిపోయారు, అధికారులు బలవంతంగా పంపించారు అనేవి పూర్తిగా అవాస్తవాలన్నారు. -
జువెనైల్ హోమ్‌లో అమానుషం.. పిల్లలను చెప్పుతో కొట్టిన అధికారి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. జువెనైల్ హోమ్‌లో పిల్లలకు రక్షణ కల్పించాల్సిన ఓ ప్రభుత్వ అధికారి చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించింది. బాల ఖైదీలుగా హోమ్‌లోకి వచ్చిన పిల్లలకు మంచి బుద్దులు, సత్ప్రవర్దన అలవాటు చేయాల్సిన ఓ మహిళా అధికారి తన బాధ్యతలు మరిచి వారిపై చేయి చేసుకుంది. చిన్న పిల్లలనే కనికరం లేకుండా కర్కశంగా కొట్టింది. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. మహిళా సూపరింటెండెంట్ చిన్నారులను కొడుతున్న దృశ్యాలు జువెనైల్ హోమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ గదిలో ఆరుగురు చిన్నారులు బెడ్స్ మీద పడుకొని ఉన్నారు. అక్కడికి వచ్చిన సూపరిండెండ్ పాల్ ఇతర ఉద్యోగులు చూస్తుండానే ఒక్కసారిగా ఓ చిన్నారిపై దాడి చేసింది. చెప్పుతో పదే పదే చెంపదెబ్బలు కొట్టింది. మిగతా పిల్లలను కూడా తిడుతుండటం వీడియోలో కనిపిస్తుంది. అదే జువెనైల్ హోమ్‌లో నుంచి మంగళవారం మరో వీడియో బయటకు వచ్చింది. ఇందులో మళ్లీ సూపరిండింట్ ఏడేళ్ల వయస్సున్న ఓ అమ్మాయి చేతులు, కాళ్లు మంచానికి కట్టేసి పడుకోబెట్టింది. విడిపించుకనేందుకు ఆమె ప్రయత్నించినా సాధ్యపడలేదు. మంచం కిందకు జారిపోతుంది. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అధికారి ప్రవర్దనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. జువెనైల్ హోమ్‌లో చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. సందరు సూపరింటెండెంట్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. In #Agra's govt run children shelterhome (Pachkuiyaan), Poonam Lal, the center superintendent was caught slapping a girl with slippers. Earlier she was booked for abetment to suicide in #Prayagraj district in 2021 after a 15-yr-old girl allegedly killed her self in shelter home pic.twitter.com/JE5V56jR7l — Arvind Chauhan 💮🛡️ (@Arv_Ind_Chauhan) September 12, 2023 రెండు ఘటనలపై ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపారు. క్రూరంగా వ్యవహరించిన హోమ్ సూపరింటెండెంట్ పూనమ్ పాల్‌ను అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. అంతేగాక కొన్ని రోజుల క్రితం ఆ హోమ్‌లో ఓ చిన్నారి ఆత్మహత్యకు సైతం ప్రయత్రించింది. కాగా పూనమ్ పాల్ గతంలోప్రయాగ్ రాజ్‌లో పనిచేసింది. అక్కడ కూడా పిల్లలపట్ల ఇంతే క్రూరంగా వ్యవహరించారని అధికారుల విచారణలో తేలింది. The department of woman and child development #UttarPradesh has suspended the accused superintendent Poonam Pal based on the investigation of #Agra DM. pic.twitter.com/jnLIxQtiQq — Arvind Chauhan 💮🛡️ (@Arv_Ind_Chauhan) September 12, 2023 ఆగ్రా డివిజన్ కమీషనర్ రీతూ మహేశ్వరి మాట్లాడుతూ.. ఈ సంఘటనలతో సంబంధం ఉన్న హోమ్ సూపరింటెండెంట్ పూనమ్ పాల్,ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఆమెపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యిందని కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించామని పేర్కొన్నారు. -
చట్టాల్లో మార్పులు అవసరం
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఖైదీలను దండించడానికే రూపొందించిన బ్రిటిష్ కాలం నాటి చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని, కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా తెలిపారు. విశాఖలో సాయిప్రియ రిసార్ట్‌లో రెండు రోజుల పాటు జరిగే అన్ని రాష్ట్రాల జైళ్ల అధిపతుల 8వ జాతీయ సదస్సుకు సోమవారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్రమంత్రి మాట్లాడుతూ.. దేశంలో జైళ్ల సామర్థ్యం కంటే 25 శాతం అధికంగా ఖైదీలు ఉన్నట్టు చెప్పారు. అందులో 80 శాతం మంది అండర్ ట్రయిల్ ఖైదీలేనని వెల్లడించారు. పూర్వకాలం నాటి చట్టాల కారణంగా ఈ సమస్య తలెత్తుతోందన్నారు. జైళ్లు దండించడానికి కాదని, ఖైదీలలో పరివర్తన తీసుకువచ్చి వారికి పునరావాసం కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిటిషర్ల ఆలోచనా ధోరణితో రూపుదిద్దుకున్న చట్టాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందుకు సంబంధించి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టినట్టు తెలిపారు. కేసు దర్యాప్తు నుంచి విచారణ వరకు అన్నీ వేగవంతంగా జరిగేలా మార్పులు చేస్తున్నట్టు వివరించారు. కొత్త బిల్లుతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో జైళ్ల ఆధునికీకరణకు రూ.950 కోట్లు మంజూరు చేసినట్టు కేంద్రమంత్రి వెల్లడించారు. రూ.100 కోట్లతో చేపట్టిన జైళ్ల కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోందన్నారు. ఇప్పటికే 1,100 జైళ్లలో కంప్యూటరీకరణ పూర్తయిందన్నారు. కేంద్ర కారాగారాల్లో నైపుణ్య కేంద్రాలు సదస్సుకు హాజరైన రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జైలు అభివృద్ధి నిధి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాలు జైలు అభివృద్ధి నిధి ఖాతాలోకి వెళ్తాయని చెప్పారు. ఆ నిధి ఖైదీల సంక్షేమానికి వినియోగిస్తున్నట్టు చెప్పారు. అన్ని కేంద్ర కారాగారాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. గర్భిణి ఖైదీలకు, వారి పిల్లలకు, వృద్ధ మహిళా ఖైదీలకు ప్రత్యేక ఆహారాన్ని అందజేస్తున్నామని వెల్లడించారు. సదస్సులో బీపీఆర్ అండ్ డీ డైరెక్టర్ జనరల్ బాలాజీ శ్రీవాస్తవ్, రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్‌కుమార్ గుప్తా పాల్గొన్నారు. -
ఎలాంటి ఆక్సిజన్ కొరత లేదు.. నెల్లూరు ఆసుపత్రిలో మరణాలపై వైద్యుల క్లారిటీ
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో ఆరుగురు మృతి చెందడంతో వైద్య బృందం అప్రమత్తమైంది. ఆక్సిజన్ కొరతపై దుష్ప్రచారాన్ని సూపరిండెంట్ సిద్ధా నాయక్ ఖండించారు. ఎలాంటి ఆక్సిజన్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తీవ్ర అనారోగ్య కారణాల వల్లే మృతి చెందారని సూపరింటెండెట్ పేర్కొన్నారు. చదవండి: ఆ నలుగురిపై సీఎం జగన్ కౌంటర్లు.. అందుకేనా? -
ACB Raids: నగేష్ మామూలోడు కాదు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఏసీబీ.. అవినీతి అధికారుల భరతం పడుతోంది. 14400 కాల్‌సెంటర్, ఏసీబీ యాప్‌లకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా పక్కా ఆధారాలతో కేసులు నమోదు చేసి, అవినీతి జలగలను కటకటాల వెనక్కి పంపుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ అజ్జా రాఘవరావుకు సంబంధించిన ఆస్తులపై మంగళవారం సాయంత్రం నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న విషయం తెలిసింది. బుధవారం కూడా ఈ సోదాలు కొనసాగాయి. అలాగే దుర్గగుడి సూపరింటెండెంట్ వాసా నగేష్‌పై వచ్చిన ఆరోపణలపైనా ఏసీబీ అధికారులు బుధవారం ఇంద్రకీలాద్రికి వచ్చి తనిఖీలు నిర్వహించారు. పెద్ద చేపే.. పటమట సబ్ రిజిస్ట్రార్ అజ్జా రాఘవరావు ఆస్తులపై తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు రాఘవరావుతో పాటు మరో ముగ్గురు ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి పటమట కార్యాలయం, ఆయన ఇల్లు, బంధువులు, స్నేహితులకు సంబంధించిన ఇళ్లు, తదితర ప్రాంతాల్లో మొత్తం ఆరుచోట్ల జరిపిన సోదాల్లో భారీ ఎత్తున అక్రమాస్తులకు సంబంధించిన విలువైన పత్రాలు, నగదు, వాహనాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్‌కు డబ్బులు కలెక్టు చేస్తున్న ముగ్గురు కీలక ప్రైవేటు వ్యక్తులు అదుపులోకి తీసుకొని ఎవరెవరి నుంచి డబ్బులు కలెక్ట్ చేశారో ఆరా తీస్తున్నారు. తాజాగా ఇటీవల రెండు భవనాల కొనుగోలు చేసేందుకు రూ.50 లక్షల అడ్వాన్స్ ఇచ్చినట్లు గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నాలుగు నుంచి ఐదుకోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు కనుగొన్నారు. మార్కెట్ విలువ ఆధారంగా వీటి విలువ రూ.10కోట్ల నుంచి రూ.15కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకా కొన్ని లాకర్స్‌ను ఓపెన్ చేయాల్సి ఉన్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. గతంలో 2018లో అవనిగడ్డ సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో జరిగిన సోదాలకు సంబంధించి శాఖాపరమైన చర్య ఇంకా పెండింగ్‌లో ఉంది. నగేష్ మామూలోడు కాదు.. విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవాలయం సూపరింటెండెంట్ వాసా నగేష్ ఆస్తుల పైనా సోదాలు కొనసాగుతున్నాయి. కుమ్మరిపాలెంలోని లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నంబర్ ఎఫ్–34లోని నివాసం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో 6 చోట్ల, దుర్గ గుడిలోని ఏఓ కార్యాలయంతో పాటు ఏఓ బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇంకా పలు చోట్ల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు అధికారుల సోదాల్లో రూ.5కోట్ల నుంచి రూ.7కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించారు. ఇంద్రకీలాద్రిపై కలకలం.. దుర్గగుడి సూపరిండెంటెంట్ వాసా నగేష్‌పై బుధవారం అవినీతి నిరోధక శాఖ సోదాలు చేయడంతో ఇంద్రకీలాద్రిపై కలకలం రేగింది. నగేష్ తన వ్యక్తిగత పనులపై బుధ, గురువారాలు సెలవుపై వెళ్లారు. అయితే ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు తెలిసిన వెంటనే కొంత మంది నాల్గో అంతస్తులోని కార్యాలయానికి వెళ్లి ఆరా తీసేందుకు ప్రయత్నించగా నగేష్ అందుబాటులోకి రాలేదు. గతంలో పాలకవర్గ సమావేశంలో సైతం ఈయన అవినీతిపై ఈవోను పలువురు ప్రశ్నించారు. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అయితే నగేష్‌పై ఆరోపణలు చేసిన వారు సాక్ష్యాలు ఉంటే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని ఈవో భ్రమరాంబ ఆ సమావేశంలో దాట వేశారు. పాలక మండలి ఫిర్యాదును సైతం ఈవో బుట్టదాఖలు చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈయనపైన చర్య తీసుకోకపోడటానికి ప్రధాన కారణం ఈయనే షాడో ఈవోగా వ్యవహరిస్తూ, అన్నీ చక్కబెడుతుండటమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కీలక బాధ్యతలు ఆయనకే.. ద్వారకాతిరుమల నుంచి ఇంద్రకీలాద్రికి బదిలీపై వచ్చిన నగేష్‌కు ఈవో భ్రమరాంబ ఆలయంలోని పలు విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించారు. దేవస్థానంలో కీలకమైన అంతరాలయ పర్యవేక్షణతో పాటు ప్రసాదాల కౌంటర్లు, టోల్గేట్లు నిర్వహణ బాధ్యతలు నగేష్ చూస్తారు. అంతే కాకుండా ఆలయం సిబ్బంది పొరపాటున ఏదైనా తప్పు చేసినట్లు గుర్తిస్తే దానికి నగేష్నే విచారణ అధికారిగా నియమించడం సర్వసాధారణమైంది. నకిలీ టికెట్ల వ్యవహారంలో లోతుగా విచారణ చేస్తే నగేష్ మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నప్పటీకీ ఈవో వెనకేసుకురావడంతో అది తప్పింది. ఇప్పుడు ఏసీబీ తనిఖీలతో ఆలయ ప్రతిష్ట మసకబారే పరిస్థితి ఏర్పడిందని పలు భక్తులు ఆరోపిస్తున్నారు. -
98 ఏళ్ల వృద్ధ ఖైదీకి..ఘనంగా జైలు సిబ్బంది వీడ్కోలు
జైలు నుంచి విడుదలైన ఖైదీలకు ఘనంగా వీడ్కోలు పలకడం చాలా అరుదు. ఒకవేళ మంచి సత్ప్రవర్తన కారణంగానో లేక ఏదైన మంచి పనులు చేసినట్లయితే గనుక వారిని మంచిగా సన్మానించి విడుదల చేయడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. ఇలా ఒక ఖైదీకి జైలు సూపరింటెండెంటే ఏకంగా స్వయంగా కారు వద్దకు తీసుకువెళ్లి ఘనంగా పంపిచడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకెళ్తే..98 ఏళ్ల రామ్ సూరత్ అనే వృద్ధ ఖైదీ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జైలు నుంచి విడుదలయ్యాడు. అతడు ఐపీసీ సెక్షన్ 452, 323, 352 కింద దోషిగా నిర్థారించి 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ మేరకు జైలు శిక్ష అనంతర విడుదలైన రామ్ సూరత్‌ని తీసుకుని వెళ్లేందుకు అతని కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు. దీంతో జైలు సూపరింటెండెంట్ శశికాంత్ మిశ్రా పుత్రావత్ ఘనంగా వీడ్కోలు పలుకుతూ..స్వయంగా ఆయనే ఆ వృద్ధ ఖైదీ వెంట వచ్చి కారు ఇచ్చి మరీ అతని ఇంటికి పంపించారు. వాస్తవాని సూరత్ ఆగస్టు8న విడుదల కావాల్సి ఉంది. కానీ మే 20, 2022న కోవిడ్ ఉన్నట్లు నిర్థారణ కావడంతో 90 రోజులపాటు పెరోల్‌పై ఉన్నారు. అందుకు సంబంధించిన ఘటనను ఉత్తరప్రదేశ్ డీజీ ప్రిజన్స్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు 98 ఏళ్ల వృద్ధుడిని జైలులో ఉంచడం మానవత్వం అని ఫైర్ అవుతుండగా, మరికొందరూ మాటలు రావడం లేదు ఎంత ఘనంగా పంపిచారంటూ జైలు సిబ్బందిపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. परहित सरिस धर्म नहीं भाई . 98 वर्षीय श्री रामसूरत जी की रिहाई पर लेने कोई नहीं आया . अधीक्षक जिला जेल अयोध्या श्री शशिकांत मिश्र पुत्रवत अपनी गाड़ी से घर भेजते हुए . @rashtrapatibhvn @narendramodi @myogiadityanath @dharmindia51 pic.twitter.com/qesldPhwBB — DG PRISONS U.P (@DgPrisons) January 8, 2023 (చదవండి: వేధించాడని ఇంటికి పిలిచి హత్య) -
బిర్యానీ బిల్లు రూ.3 లక్షలు..! అవాక్కైన అధికారులు
కోల్‌కతా : బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా ఎక్కువగా ఆర్డర్ ఇచ్చేది బిర్యానీనే. ఇంట్లోనూ బిర్యానీ ఎంతో ఇష్టంగా చేసుకొని తింటారు. చికెన్, మటన్, ఫిష్, మష్రూమ్ బిర్యానీ.. ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. సాధారణంగా బయట హోటల్స్‌లో సింగిల్ బిర్యానీ రూ. 100 నుంచి 200 ఉండొచ్చు. అదే ఫ్యామిలీ ప్యాక్ అయితే రూ. 500 వరకు ఉంటుంది.. కానీ కొందరు బిర్యానీ కోసం రూ. 3 లక్షలు ఖర్చు చేశారట. ఆ బిల్లును ఓ ప్రభుత్వ ఆస్పత్రికి సమర్పించడంతో.. ఈ ఘటన వెలుగు చూసింది. బిర్యానీ కోసం లక్షల్లో బిల్లు పెట్టడంతో అధికారులు అవాక్కయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని కత్వా సబ్ డివిజనల్ ఆస్పత్రిలో ఈ వింత ఘటన జరిగింది. శోబిక్ ఆలం అనే వ్యక్తి ఇటీవలే ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలనుకున్నారు. కింగ్ షుక్ గోష్ అనే కాంట్రాక్టర్ ఫర్నీచర్, వాహనాలతో పాటు బిర్యానీని సరఫరా చేస్తుంటాడు. వీటన్నింటి ఖర్చులు కలపి సుమారు రూ. కోటి బిల్లు పెట్టాడు. అయితే అందులో బిర్యానీ కోసం దాదాపు రూ.3 లక్షలు, ఫర్నీచర్ కోసం 82 వేలు వెచ్చించినట్టు బిల్లు దాఖలు చేశాడు. వీటిని చూసి సూపరింటెండెంట్ షాక్ అయ్యారు. బిల్లులు అన్ని పరిశీలించి కాంట్రాక్టర్ సమర్పించిన వాటిలో 81 బిల్లులు బోగస్‌వే ఉన్నట్లు గుర్తించారు. దీంతో పెద్దఎత్తున అవినీతి జరిగినట్టు గుర్తించిన అధికారి.. ఈ బోగస్ బిల్లులను డిపాజిట్ చేసిన నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ బిల్లును ఆమోదించిన ప్రతి ఒక్కరిని విచారిస్తామని, దోషులగా తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు చెప్పారు. చదవండి: ‘ఇళ్లు తగలబెట్టే హిందూత్వ కాదు..ఇంట్లో పొయ్యి వెలిగించే సిద్ధాంతం’ -
నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా సి.రాధాకృష్ణ
సాక్షి, నెల్లూరు: లైంగిక వేధింపుల ఘటనలో నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి ప్రభాకర్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో ప్రభుత్వం సి.రాధాకృష్ణను సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం వేసిన రెండు కమిటీలు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి. ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో ఈ రెండు కమిటీలు విచారణ చేశాయి. అలానే డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ట్ త్రిసభ్య కమిటీలు కూడా ఈ ఘటనపై విచారణ చేశాయి. చదవండి: నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై వేటు -
నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై వేటు
సాక్షి, నెల్లూరు: లైంగిక వేధింపుల ఘటనలో నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి ప్రభాకర్‌ను తొలగించారు. తిరుపతి రుయా ఆసుపత్రికి ఆయనను బదిలీ చేశారు. కాగా జీజీహెచ్ ఘటనపై రెండు కమిటీలు విచారణ చేపట్టిన సంగతి విదితమే. డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ట్ త్రిసభ్య కమిటీలు లైంగిక వేధింపుల ఘటనపై లోతుగా దర్యాప్తు చేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా.. ఆయనను నెల్లూరు జీజీహెచ్ బాధ్యతల నుంచి తొలగించారు. కాగా, ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ఆదేశించారు. విచారణ చేపట్టిన రెండు కమిటీలు.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి. చదవండి: టెన్త్ పరీక్షలు రద్దు చేయం: మంత్రి సురేష్ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవద్దు: టీటీడీ ఈవో -
లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ ఆగ్రహం
సాక్షి, నెల్లూరు: జీజీహెచ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్‌తో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. వైద్యవృత్తికి మచ్చతెచ్చేలా జీజీహెచ్ సూపరింటెండెంట్ వ్యవహరించడం బాధాకరమని తెలిపారు. అతడి బాధితులు నిర్భయంగా మహిళా కమిషన్‌కు వివరాలు వెల్లడించాలని చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. ఫిర్యాదులు చేసిన బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల వ్యవహారంపై దర్యాప్తు జరపాలని వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కోరారు. సూపరింటెండెంట్ వైద్య విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో గురువారం బహిర్గతమైన విషయం తెలిసిందే. -
కరోనా భయం వీడి జాగ్రత్తలు పాటించాలి
-
నా బదిలీ వెనుక మంత్రి సత్యవతి కుట్ర
సాక్షి, మహబూబాబాద్: పదవీ విరమణకు 16 నెలల సమయమే ఉన్నప్పటికీ తనను అకారణంగా బదిలీ చేశారని, ఇందుకు మంత్రి సత్యవతి రాథోడే కారణమని డాక్టర్ ఎస్.భీంసాగర్ ఆరోపించారు. మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న ఆయనను తాజాగా హైదరాబాద్ లోని టీవీవీపీ రాష్ట్ర జాయింట్ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్‌గా బదిలీ చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన కన్నీరు మున్నీరయ్యారు. మంత్రి బంధువుకు సూపరింటెండెంట్ పదవి కట్టబెట్టేందుకే తనను బదిలీ చేయించారని పేర్కొన్నా రు. మంత్రి కుమారుడు, ఛాతీ వైద్య నిపుణుడు సతీష్ రాథోడ్ నెలలో వారం రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నారని, అయినప్పటికీ పూర్తి జీతం ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. అలా ఇవ్వకపోవడంతోనే తనను లక్ష్యంగా చేసుకుని బదిలీ చేయించారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు పదోన్నతి ఇవ్వకపోగా, కేవలం డిప్యుటేషన్‌పై బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. పని హైదరాబాద్‌లో చేస్తూ వేతనం మహబూబాబాద్‌లో తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమేనన్నారు. కాగా, సూపరింటెండెంట్ డాక్టర్ భూక్యా వెంకట్రాములు మాట్లాడుతూ, భీంసాగర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మంత్రి సత్యవతి, ఆమె కుమారుడు డాక్టర్ సతీ‹Ùతో పాటు తనపై వ్యతిరేక ప్రచారం చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. -
ప్రభుత్వాసుపత్రిలో కాంగ్రెస్‌నేత కలకలం..
-
ఏం డాక్టర్‌వయ్యా.. దిమాక్ ఉందా?
సాక్షి, కరీంనగర్ జిల్లా: కాంగ్రెస్ నేత తీరుతో హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కలకలం రేగింది. ఇటీవల గుండెపోటుతో మరణించిన ప్రవీణ్ అనే వ్యక్తి మృతికి ఆసుపత్రి సూపరింటెండెంట్ కారణమని ఆరోపిస్తూ పీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం జమ్మికుంట, హుజురాబాద్ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు, సేవలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కౌశిక్ రెడ్డిని భట్టి విక్రమార్క వారించినా వినకుండా సూపరింటెండెంట్ వైపు వేలు చూపుతూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏం డాక్టర్‌వయ్యా...దిమాక్ ఉంటా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మర్డర్ కేసు నమోదు చేయించి, సస్పెండ్ చేసే వరకు ఊరుకోమంటూ సూపరిండెంట్‌పై కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. హుజురాబాద్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్‌ను సూపరింటెండెంట్ విధుల నుంచి తొలగించడంతో మానసిక ఆందోళనతోనే అతడికి గుండెపోటు వచ్చిందని కౌశిక్‌రెడ్డి ధ్వజమెత్తారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్, సూపరింటెండెంట్ కలిసి ఎంతమందిని చంపుతారని ప్రశ్నించారు. తమ కార్యకర్తలు ఆసుపత్రికి వస్తే కేసులు పెట్టి వేధిస్తారా.. నీ అంతు చూస్తామంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఆసుపత్రిలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. -
ఈ కొలువు మాకొద్దు
-
నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ రాజీనామా
-
గాందీ ఆసుపత్రిలో అక్రమాలు జరగలేదు
-
రెండో బినామి.. కొరియర్ వీరన్న!
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల గోల్మాల్ కేసులో మరొకరు అరెస్టయ్యారు. ఈ కేసులో ఇప్పటికే 16 మం దిని అరెస్టు చేసిన అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తాజా గా ఐఎంఎస్ కార్యాలయం సూపరింటెండెంట్ కె.వీరన్నను అరెస్టు చేసినట్లు గురువారం ప్రకటించింది. కొత్త పేట గ్రీన్‌హిల్స్ కాలనీకి చెందిన వీరన్న స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ. మొత్తంగా దేవికారాణికి ఈ భారీ కుంభకోణంలో ముగ్గురు వ్యక్తులు బినామీలు గా వ్యవహరించారు. వారిలో ఒకరైన ఫార్మాసిస్ట్ నాగలక్ష్మిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి విచారించిన సంగ తి తెలిసిందే. తాజాగా సూపరింటెండెంట్ వీరన్నను కూడా అరెస్టు చేయడంతో మరోసారి కలకలం రేగింది. కంపెనీల నుంచి డబ్బు తీసుకొచ్చి.. ఐఎంఎస్‌లో దేవికారాణి డైరెక్టర్‌గా పనిచేస్తోన్న సమయంలో సూపరింటెండెంట్ వీరన్న ఆమె అక్రమాలకు కొరియర్‌గా పనిచేశాడు. జీవో నెం.51ని పక్కనబెట్టిన దేవికారాణి నాన్‌రేటెడ్ కంపెనీ (ఎన్ఆర్సీ)లకు కాంట్రాక్టులను కట్టబెట్టింది. వీటిలో చాలా కంపెనీలు ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నాయి. దేవికారాణి కాంట్రాక్ట్ ఇవ్వగానే లాభాలు ఆర్జించాయి. దీనికి ప్రతిగా దేవికారాణికి ప్రతిసారీ రూ.2 నుంచి 5 లక్షల రూపాయలు ముడుపులుగా ముట్టాయి. వీటిని తీసుకువచ్చే బాధ్యత వీరన్నదే. దేవికారాణి ఒక ఫోన్‌నెంబర్ ఇస్తుంది. సదరు కంపెనీ ప్రతినిధికి ఫోన్ చేసి లక్షల రూపాయల నగదును వసూలు చేసి తీసుకొస్తాడు. వాటిని దేవికారాణి చెప్పినట్లుగా పీఎంజే జ్యువెలరీస్‌కి వెళ్లి అప్పగించేవాడు. ఆ నగదును దేవికారాణి తన నగల ఆర్డర్ కోసం ఇచ్చే అడ్వాన్సుగా చూపించేది. అలా ఏకంగా రూ. 6.5 కోట్ల విలువైన నగలను ఆమె పీఎంజే జ్యువెలరీస్ నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. బినామీ కంపెనీల గుట్టు ఇతనివద్దే.. దేవికారాణి బినామీ ఫార్మా కంపెనీల వ్యవహారాల్ని కూడా వీరన్నే నడిపించాడని సహోద్యోగులు ఆరోపిస్తున్నారు. చూడటానికి సాధారణంగా కనిపించే వీరన్న దాదాపు రూ.40 కోట్ల ఆస్తులు కూడబెట్టాడని సమాచారం. అవన్నీ తన బావ, బావమరుదుల పేరిట రిజిష్టర్ చేయించాడని చెబుతున్నారు. ఇతని వద్ద దేవికారాణి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఓ పెన్‌డ్రైవ్ ఉందని, అందులో బినామీ కంపెనీలతోపాటు, ఎవరు ఎంత చెల్లించారన్న బ్యాలెన్స్ షీటు కూడా నిర్వహించాడని సమాచారం. ఇప్పటికే ఇతని ఇంటిపై దాడులు చేసిన ఏసీబీ కుంభకోణానికి సంబంధించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఇతను తేజఫార్మా రాజేశ్వర్‌రెడ్డి నుంచి రూ.50 వేలు, ఆరిజిన్ ఫార్మాకు చెందిన శ్రీకాంత్ గుప్తా నుంచి రూ.3.5 లక్షలు.. మొత్తంగా రూ.4 లక్షలను సొంత బ్యాంకు ఖాతాలకు వేయించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. రేపోమాపో మూడో బినామీ! దేవికారాణికి సంబంధించిన మూడో బినామీ సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌లో పనిచేసే మరో కీలక ఉద్యోగి. ఫార్మా కంపెనీల ద్వారా వసూలు చేసిన డబ్బులతో బీహెచ్ఈఎల్, సంగారెడ్డి, గచ్చిబౌలిలో విలువైన స్థలాలు కొనుగోలు చేశాడు. త్వరలోనే ఇతనినీ ఏసీబీ అరెస్టు చేయనుంది. -
బాపట్ల ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సస్పెన్షన్
సాక్షి, బాపట్ల: బాపట్లలోని పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలలో అరకోటి రూపాయలకు పైగా జరిగిన నిధుల స్కామ్‌లో ఎట్టకేలకు జిల్లా యంత్రాంగం చర్యలకు పూనుకుంది. ‘సాక్షి’ దినపత్రికలో గత రెండు నెలలుగా ప్రచురించిన వివిధ కథనాలకు స్పందించిన జిల్లా యంత్రాంగం ఆడిట్ నిర్వహించేందుకు ముందుకు రాగా ఒక్కొక్కటిగా తవ్వేకొద్దీ ఆవినీతి బయటపడింది. రెండు నెలలుగా జిల్లా ఆడిట్, రాష్ట్ర అడిట్ అధికారులు నిర్వహించిన రెండేళ్ల ఆడిట్లో రూ.50,19,820 నిధులు స్వాహా అయ్యాయని ఏరియా వైద్యశాలల జిల్లా కో ఆర్డినేటర్ ప్రసన్నకుమార్ ప్రకటించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన గత సూపరింటెండెంట్ డాక్టర్ ఆశీర్వాదాన్ని సస్పెండ్ చేయగా, కాంట్రాక్టు ఉద్యోగులు సుబ్రహ్మణ్యస్వామి, చిరంజీవిలను విధుల నుంచి తొలగించారు. వీరి ముగ్గురిపై బాపట్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక ఏరియా వైద్యశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏరియా వైద్యశాలల జిల్లా కో ఆర్డినేటర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ బాపట్ల ఏరియా వైద్యశాలలో రెండేళ్లుగా ఆడిట్ నిర్వహించకపోవటంతో అభివృద్ధి నిధులు, స్పెషల్ రూముల అద్దెలు, పలు షాపుల అద్దెలు, ఆపరేషన్లు, గర్భిణులకు ఇవ్వాల్సిన చెక్కులు, కాంట్రాక్టు ఉద్యోగులకు అత్యధికంగా వేతనాలు చెల్లించేందుకు పలు అకౌంట్ల సృష్టికి నిధులను దారిమళ్లించినట్లు గుర్తించామన్నారు. అభివృద్ధి కమిటీ, సూపరింటెండెంట్ ఉమ్మడిగా చెక్కులను డ్రా చేయించి సొంత ఖాతాల్లో నిధులు జమ చేసుకోవటంతో రాష్ట్ర ఆడిట్, జిల్లా ఆడిట్ విభాగాలతో పరిశీలన చేయించి పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేయించామని చెప్పారు. ఈ పరిశీలన రెండు నెలలుగా జరుగుతుండగా మొత్తం రూ.50,19,820 నిధుల గోల్మాల్ జరిగినట్లు నిర్ధారించామని చెప్పారు. నోటీసులు జారీ.. గత రెండేళ్లుగా బాపట్లలో సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ ఆశీర్వాదాన్ని సస్పెండ్ చేసి, నోటీసులు జారీ చేశామని జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్నకుమార్ చెప్పారు. జిల్లా కోఆర్డినేటర్‌తో పాటు ప్రస్తుత సూపరింటెండెంట్ డాక్టర్ రసూల్ శుక్రవారం బాపట్ల టౌన్ పోలీసు స్టేషన్లో ఎస్ఐ హజరత్తయ్యకు లిఖిత పూర్వకంగా ఈమేరకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ ఆశీర్వాదంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు సుబ్రమణ్యస్వామి, చిరంజీవిపై కూడా ఫిర్యాదు చేశారు. ఈవిషయంపై ఎస్ఐ హజరత్తయ్య మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. బాపట్ల ఏరియా వైద్యశాలలో నిధుల దుర్వినియోగం తీరు చూస్తే ఇంకా లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని, అంతర్గత ఆడిట్లు కూడా నిర్వహించి ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉంటే చర్యలు తీసుకుంటామని ప్రసన్నకుమార్ తెలిపారు. ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. -
సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ బాబూలాల్
సాక్షి, అనంతపురం : ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్(ఎఫ్ఏసీ)గా ప్రొఫెసర్ డాక్టర్ బాబూలాల్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ బాబూలాల్ ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. ఈయనను తక్షణమే సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరాలంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డాక్టర్ లాల్ విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా 2018 మే నుంచి పనిచేస్తూ ఉద్యోగులు, వైద్యులను సమన్వయపరుస్తూ సమర్థంగా విధులు నిర్వహించారు. ఆయనకు ముందు పనిచేసిన వారు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొనగా, డాక్టర్ లాల్ మాత్రం ఏడాదిగా ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా పనిచేస్తూ వచ్చారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా పనిచేశారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్‌గా, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఇదిలా ఉండగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డాక్టర్ జగన్నాథ్‌ను నిబంధనలకు విరుద్ధంగా సూపరింటెండెంట్ పోస్టులో నియమించడం తెలిసిందే. 19 మంది ప్రొఫెసర్లను కాదని ఆయనకు ఆ పోస్టు కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు ఆయనను ప్రభుత్వం సూపరింటెండెంట్ విధుల నుంచి తప్పించింది. -
6 నెలలు 170 మరణాలు
కళ్యాణదుర్గానికి చెందిన గీతమ్మ నెలలు నిండకముందే 2 కేజీల బరువున్న పాపను ప్రసవించింది. కుటుంబీకులు నవజాత శిశువును ఆస్పత్రిలో ఎస్‌ఎన్‌సీయూలో చేర్చారు. ఈ నెల 9న రాత్రి పాప మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందు మృతి చెందిందని బాధిత కుటుంబీకులు ఆగ్రహం చేశారు. ఇలాంటి పరిస్థితి ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో నిత్యం చోటు చేసుకుంటోంది. గడిచిన ఆరు నెలల్లో ఏకంగా 170 మంది శిశువులు మృత్యువాత పడ్డారు. సాక్షి, అనంతపురం న్యూసిటీ: నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్సీయూ) ఆస్పత్రిలోని చాలా కీలకమైనది. నవజాత శిశువులకు చికిత్స అందించే ఈ వార్డుపై ప్రత్యేక దృష్టిసారించి సేవలందించాల్సిన పరిస్థితి. కానీ అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఉన్నతాధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడం...వైద్యులు ఇష్టానుసారంగా విధులు నిర్వర్తించడంతో పరిస్థితి చేయిదాటి పోయింది. ఏసీలు పనిచేయకపోవడంతో ఊపిరాడని పరిస్థితి నెలకొందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరు నెలల్లోనే 170 మంది శిశువులు మృత్యువాత పడగా....ఎందరో తల్లులకు కడుపుకోత మిగిలింది. వైద్యుల ఇష్టారాజ్యం ఉన్నతాధికారి పర్యవేక్షణ లేకపోవడంతో ఎస్ఎన్సీయూలోని సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుబాటులో నలుగురు వైద్యులున్నా..ఒకరిద్దరు మినహా మిగితా వారు తూతూమంత్రంగా విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వాస్తవంగా గంటకోసారి పసికందుల ఆరోగ్య పరిస్థితిని చూడాల్సి ఉంది. కానీ కొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ... స్టాఫ్‌నర్సులపైనే వైద్యులు భారం వేస్తున్నారు. స్టాఫ్‌నర్సులు సైతం నర్సింగ్ విద్యార్థినిలకు పసికందులను అప్పజెబుతున్నారు. ఎటువంటి అనుభవం లేని వారికి పసికందులను ఇవ్వడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయి. సూపరింటెండెంట్ వైఫల్యం వల్లే... సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్...ఎస్‌ఎన్‌సీయూపై దృష్టి సారించకపోవడం వల్లే వైద్యసేవల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కనీసం మందులను కూడా అందుబాటులో ఉంచకపోవడంతో రోగులంతా ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. సూపరింటెండెంట్ తన ఛాంబర్‌ను వదిలి బయటకు రాకపోవడంతో వార్డుల్లో వైద్యులు ఇష్టానుసారం విధులు నిర్వర్తిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. -
అయినవాడికే అతిపెద్ద పోస్ట్
గుంటూరు మెడికల్: ఆయన చాలామందికన్నా జూనియర్. టీడీపీ ప్రభుత్వ వీర విధేయుడు కావడంతో రాష్ట్ర రాజధాని ఆస్పత్రి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా అవకాశం దక్కించుకున్నారు. ఆయనే డాక్టర్ దేవనబోయిన శౌరిరాజు నాయుడు. 2017లోనే పదవీ విరమణ చేయాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఆగమేఘాలపై ఒక ప్రత్యేక జీఓనే తీసుకొచ్చింది. సీనియర్లను కాదని అతనికే సూపరింటెండెంట్ పదవి దక్కేలా చేసింది. సుమారు నాలుగేళ్లుగా జూనియర్ పరిపాలనలో రాష్ట్ర రాజధాని ఆస్పత్రి నడిచింది. అతని వివక్ష, అవినీతి, అసమర్థత, అవినీతి ధోరణితో ఆస్పత్రిలోని వారంతా అతడికి వ్యతిరేకంగా మారారు. అయినా నేటికీ ఆయనే కొనసాగుతూ ఉన్నారు. అతని కోసమే ప్రత్యేక జీవో.. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా శౌరిరాజు నాయుడు విధుల్లో చేరటం కూడా పెద్ద చర్చనీయాంశమే అయింది. సాధారణంగా వైద్యుల్లో సీనియర్స్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్స్‌గా ప్రభుత్వం నియమిస్తుంది. కానీ డాక్టర్ రాజునాయుడు టీడీపీ నేతలతో తనకున్న సంబంధాలతో 26–09–2015న సూపరింటెండెంట్ పదవి దక్కించుకున్నారు. ఆయన పదవీకాలం 31–5–2017న ముగిసింది. వైద్యుల పదవీవిరమణ వయస్సు 60 నుంచి 63 ఏళ్లకు పెంచుతూ 2017 మే 31న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ జీఓను కేవలం రాజు నాయుడు కోసమే ప్రభుత్వం ఇచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైద్యులు విమర్శిస్తున్నారు. ఈ చర్యకు నిరసనగా తాము స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తామని, తమకు 60 ఏళ్ల వయస్సు వరకూ ఉద్యోగం చాలని పలువురు వైద్యులు ప్రభుత్వాన్ని కలిసి మొరపెట్టుకున్నా స్పందించలేదు. అన్నీ వివాదాస్పద నిర్ణయాలే... జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన సొంతంగా తీసుకున్న పలు నిర్ణయాలతో పలు వివాదాలు తలెత్తాయి. రెండేళ్లక్రితం జిల్లాలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల అనుమతి ప్రక్రియలో నిబంధనలకు నీళ్లు వదిలారనే అపవాదును ఎదుర్కొంటున్నారు. విజిలెన్స్ విచారణ కూడా దీనిపై నడుస్తోంది. ఏడాదిన్నర క్రితం జిల్లాలో కనీవిని ఎరుగని రీతిలో అత్యధిక సంఖ్యలో డయేరియా మరణాలు, డయేరియా కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో డయేరియా బాధితులకు ఉచితంగా వైద్యం చేయించాలని కలెక్టర్ ఆదేశించగా సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన మాత్రం ప్రభుత్వ మెప్పు పొందేందుకు జీజీహెచ్‌కు డయేరియా రోగులను తీసుకొచ్చారు. ప్రైవేటు ఆస్పత్రి నుంచి జీజీహెచ్‌కు తీసుకురావటం వల్లే తమ వారు చనిపోయారంటూ మృతుల బంధువులు ఆస్పత్రిలో తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. ఆస్పత్రిలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానంలో టీడీపీ ప్రభుత్వం పలు వైద్యసేవలను ప్రారంభించింది. వారికి వైద్యసేవలకు అనుమతి కోసం అధిక మొత్తంలో మామూళ్లు తీసుకున్నారనే ఆరోపణలపై పలు పత్రికల్లో సైతం కథనాలు ప్రచురితం అయ్యాయి. ఆస్పత్రిలో ఇరువురు ఆర్‌ఎంఓలు, నలుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు ఉన్నా అందరిని పక్కనపెట్టేసి 8 నెలల క్రితం ఉద్యోగాల్లో చేరిన జూనియర్ వైద్యులకు అన్ని బాధ్యతలు ఇవ్వటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ నిధులు, ఆస్పత్రికి సంబంధించిన ఇతర నిధులపై నాలుగేళ్లుగా ఆడిట్లు జరగలేదని ప్రభుత్వ ఆర్థిక సలహాదారే నాటి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కార్యాలయ ఉద్యోగుల సీట్లు మార్పులు చేర్పుల సమయాల్లో వివక్ష చూపించారని ఉద్యోగులు వాపోతున్నారు. నిధులు ఉన్నా ఆరోగ్యశ్రీ పారితోషికాలు వైద్యులకు, వైద్య సిబ్బందికి ఇవ్వకపోవటంతో ఆరోగ్యశ్రీ జిల్లా అధికారులకు సైతం వైద్య సిబ్బంది ఫిర్యాదులు చేశారు. క్యాన్సర్ వార్డు నిర్మాణం కోసం అడ్డగోలుగా నర్సింగ్ స్కూల్‌ను పడగొట్టడం, ఎంసీహెచ్ వార్డు నిర్మాణం కోసం వందేళ్లకు పైగా ఉన్న మహా వృక్షాలను నరికి వేయటంలాంటి ఆరోపణలు వినిపించాయి. జీవోపై సీనియర్ల మండిపాటు... టీడీపీ ప్రభుత్వం 2014 జూన్‌లో అధికారం చేపట్టిన నాటి నుంచి రెగ్యులర్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయకుండా అత్యంత జూనియర్ వైద్యులను టీచింగ్ ఆస్పత్రుల సూపరింటెండెంట్లుగా కొనసాగిస్తూ ఉండటంపై వైద్యుల సంఘం నాయకులు, సీనియర్ వైద్యులు మండిపడుతున్నారు. పలువురు సీనియర్ వైద్యులు కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టు జోక్యంతో సీనియారిటీ ప్రకారం పదోన్నతులు ఇస్తామని టీడీపీ ప్రభుత్వం డీపీసీ షెడ్యూల్ ప్రకటించింది. 2018 మే 10వ తేదీలోగా డీపీసీ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని టీడీపీ ప్రభుత్వం వెల్లడించింది. కానీ జీజీహెచ్ సూపరింటెండెంట్ కోసం పదోన్నతులు ఇవ్వలేదు. 80 మంది వైద్యులతో టీడీపీ ప్రభుత్వం సీనియారిటీ జాబితాను ప్రకటించగా అందులో 78వ స్థానంలో ఉన్న డాక్టర్ రాజునాయుడు నాలుగేళ్లుగా సూపరింటెండెంట్‌గా కొనసాగుతూ ఉన్నారు. -
టీటీడీ వివాదం.. శ్రీలక్ష్మి బదిలీ
-
టీటీడీ వివాదం.. శ్రీలక్ష్మి బదిలీ
సాక్షి, అమరావతి : పురావస్తు శాఖ ఇటీవల టీటీడీకి జారీ చేసిన సర్క్యులర్‌పై వివాదం చెలరేగటంతో ఆశాఖ అమరావతి సర్కిల్ సూపరింటెండెంట్ టి.శ్రీలక్ష్మిని చెన్నైకి బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో చెన్నైలో పని చేస్తున్న రామన్‌ను నియమించారు. తిరుమల దేవాలయాలను చారిత్రక కట్టడాలుగా ప్రకటించే అంశాన్ని పరిశీలించనున్నట్లు ఈ నెల 5వ తేదీన సూపరింటెండెంట్ శ్రీలక్ష్మి టీటీడీ కార్యనిర్వహణాధికారికి సర్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో వెంటనే సర్క్యులర్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తిరుమల ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునేందుకు కుట్ర చేస్తోందని బహిరంగంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో చేసేది ఏమీలేక కేంద్ర ప్రభుత్వం శ్రీలక్ష్మిపై బదిలీ వేటు వేసింది. -
నవరత్నాలు
శ్యామలానగర్ ఎనిమిదో నంబర్ వీధిలోకి ప్రవేశించాడు నల్ల సత్యం. అప్పుడు సాయంకాలం ఆరు కావొచ్చింది. వీధి అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ వీధిలో అంతా ధనవంతులే. పెద్దపెద్ద మేడల్లో నివాసం ఉంటారు. కార్లలో తిరుగుతుంటారు. నడిచే జనం చాలా తక్కువ. పట్టపగలు కూడా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది.నల్ల సత్యం గేదెను తోలుకెళ్లడం చూశారు వీధి మొదట్లో ఉన్న ఆటోవాలాలు.‘‘ఏంది సత్యం, రేచలమ్మగారికి పాలు పొయ్యడానికా?’’ అని అడిగాడు జానీ.‘‘ఔనన్నా..! ఇప్పటికే ఆలస్యం అయింది’’ అన్నాడు సత్యం.‘‘ఏం తిప్పలు సత్యం? మీ ఇంటి దగ్గరే పాలు పిండి తీసుకెళ్లి పోయవచ్చుగా! గేదెను తోలుకెళ్లి ఆవిడగారి ముందు పిండాలా?’’ అన్నాడు జానీ నవ్వుతూ.‘‘ఇంటి దగ్గర పిండి తీసుకెళ్తే రేచలమ్మ ఒప్పుకోదు. తను చూస్తుండగా పిండాలంటుంది’’ అన్నాడు సత్యం.నల్ల సత్యం రేచల్ ఇంటి గేటు తీసుకుని గేదెను లోపలకి తోలుకెళ్లాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. ఎంతకీ తలుపు తెరుచుకోలేదు.‘‘అమ్మగారూ! అమ్మగారూ..!’’ అని తలుపు తట్టాడు.ఎవరూ పలకలేదు. నల్ల సత్యం తలుపు నెట్టాడు. బార్లా తెరుచుకుంది. ‘‘అమ్మగారూ.. అమ్మగారూ..!’’ అని పిలుస్తూ ఇంట్లోకి వెళ్లాడు సత్యం. ఎవరూ పలకడం లేదు.‘ఎవరూ లేరా ఏంది?’ అనుకుంటూ బెడ్రూమ్ తలుపు నెట్టాడు. తలుపు తెరుచుకుంది. ఆ దృశ్యం చూసి గట్టిగా కేకలు పెట్టాడు. రేచల్ నేల మీద నెత్తురు మడుగులో చచ్చిపడుంది.సత్యం రోడ్డు మీదకు పరిగెత్తాడు. ‘‘అమ్మగార్ని చంపేశారు’’ అంటూ అరవసాగాడు. శ్యామలానగర్ ఎనిమిదో నంబర్ వీధి జనంతో నిండింది. రేచల్ చనిపోయిందని తెలిసి గుంటూరులో ఉన్న బంధుమిత్రులు చాలామంది వచ్చారు. ఆమె భర్త విలియమ్స్ చర్చిఫాస్టర్ కావడంతో పరిచయస్తులు ఎక్కువే. వాళ్లకి ఇద్దరు కొడుకులు. ఒక కూతురు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. విలియమ్స్, రేచల్ మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు.పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉంది శ్యామలానగర్. రేచల్ హత్యవార్త తెలియగానే ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తన సిబ్బందితో చేరుకున్నాడు.రేచల్‌ని ఎవరో కత్తితో పొడిచి చంపారు. బీరువా అంతా వెతికినట్టు చిందరవందరగా పడిన దుస్తులు, వస్తువులను బట్టి తెలిసింది. బీరువాలో డబ్బు ఎక్కువ లేదు. పదివేలు పోయి ఉండొచ్చునన్నాడు విలియమ్స్. బంగారు నగలు ఏమీలేవు ఇంట్లో. అంతా లాకర్లో పెట్టామని కూడా చెప్పాడు.రేచల్, విలియమ్స్ దంపతులు ఒంటరిగా ఉంటున్నట్లు కనిపెట్టిన దొంగలు ప్లాన్డ్గా వచ్చారు. కానీ అనుకున్నంత ఏమీ దొరకలేదు. అనవసరంగా నిండు ప్రాణం తీశారు దుర్మార్గులు అని వాపోయారంతా.రేచల్కి అరవై ఏళ్లున్నా చాలా ఆరోగ్యంగా ఉంది. పని మనిషిని కూడా పెట్టుకోదు. ఇంటి పని అంతా తనే స్వయంగా చేసుకుంటుంది. గార్డెనింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టం. కాంపౌండ్‌లో ఉన్న మొక్కలే ఆ విషయం చెబుతాయి.‘‘రేచల్కి డెయిరీ మిల్క్ అంటే ఇష్టం ఉండదు. వెన్న తీసిన పాలు రుచిగా ఉండవంటుంది. ఖరీదు ఎక్కువైనా ఫ్రెష్ మిల్క్‌నే ఇష్టపడుతుంది. నల్ల సత్యం ఇంటికొచ్చి గేదె పాలు పిండి పోస్తాడు’’ అని పోలీసులకు చెప్పాడు విలియమ్స్. రేచల్ శవాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు పోలీసులు. ‘‘సార్! రేచల్ హత్య డబ్బు, నగలు దొరుకుతాయని దొంగలు చేశారని నాకు అనిపించడం లేదు’’ అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు ఎస్సై రంగనాథ్. ‘‘ఇంకెవరు చేసి ఉంటారు? ఆమె భర్త ఫాస్టర్. ఆయనకు శత్రువులు ఉంటారా?’’అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రవీణ్.‘‘ఎందుకుండరు సార్? ఆయనేమైనా అజాతశత్రువా? నేరాలు డబ్బు కోసం, ఆడవాళ్ల వ్యవహారంలో, ఆస్తుల తగాదాల వల్ల ఎక్కువగా జరుగుతాయి కదా సార్!’’ అన్నాడు రంగనాథ్.ప్రవీణ్, రంగనాథ్‌లు వెళ్లేసరికి విలియమ్స్ ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంట్లో బంధువులున్నారు. విలియమ్స్ వాళ్లని ఒక గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు.‘‘విలియమ్స్ గారూ! చెప్పండి మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అంటే మీ భార్యను హత్య చేసేంత పగబట్టిన వాళ్లు?’’ అడిగాడు ప్రవీణ్.విలియమ్స్ తల అడ్డంగా ఊపాడు.‘‘లేదండీ! మాకు శత్రువులు ఎవరు ఉంటారు?’’ అన్నాడు.‘‘శత్రువులు బయట ఎక్కడో ఉంటారనుకోవద్దు సార్! ఇంట్లో కూడా ఉంటారు. ఈ మధ్య మీ ఆస్తి పంపకాలు జరిగాయనీ, కొడుకు, కోడళ్ల మధ్య ఘర్షణలు జరిగాయని మా ఎంక్వైరీలో తేలింది. ఆ వివరాలు చెప్తారా?’’ అడిగాడు ఇన్స్పెక్టర్.విలియమ్స్ ఇన్స్పెక్టర్వైపు ఆశ్చర్యంగా చూశాడు. ‘‘ఇన్స్పెక్టర్ గారూ! నాకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఆల్ఫ్రెడ్ డాక్టర్. గుంటూరు జనరల్ హాస్పిటల్లో సర్జన్. రెండోవాడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. బెంగళూరులో ఉన్నాడు. మీరన్నది నిజమే. నాకు గుంటూరు హిందూ కాలేజీ వెనుక అగ్రహారంలో ఓ పాత బిల్డింగ్ ఉంది. వెయ్యి గజాల్లో చిన్నచిన్న కొట్లున్న బిల్డింగ్ అది. ఆస్తులు పంచుతున్నప్పుడు ఆ బిల్డింగ్ తనకు రాసివ్వమన్నాడు పెద్దోడు. తను డాక్టర్ కనుక ఆ బిల్డింగ్ పడగొట్టి హాస్పిటల్ కడతానన్నాడు. చిన్నోడిని రెంటచింతలలో ఉన్న పది ఎకరాల పొలం తీసుకోమన్నాడు. అయితే చిన్నోడి భార్య అడ్డం తిరిగింది. బిల్డింగ్‌లో సగం, పొలంలో సగం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. ఆమె తరఫు బంధువులు కూడా నన్ను అలా చేయడం న్యాయమని బలవంతపెట్టారు. నా భార్య మాత్రం పెద్దోడికి బిల్డింగ్ ఇవ్వడమే న్యాయం అంది. రెండో కోడలు జెస్సీ నా భార్యతో పోట్లాడింది. జెస్సీకి ఆవేశం ఎక్కువే! ‘అంతు తేలుస్తాను’ వంటి మాటలు వాడింది’’ చెప్పాడు విలియమ్స్. ‘‘చివరికి ఎలా పరిష్కారం చేశారు?’’ అడిగాడు ఇన్స్పెక్టర్.‘‘నేను చెప్పినట్టు బిల్డింగ్ పెద్దోడికి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఆస్తి పంచడం కుదరదు. మేమే మా ఇష్టం వచ్చినట్లు విల్లు రాసి, మా తదనంతరం చెందేట్టుగా రిజిస్టర్ చేస్తాం’’ అని రేచల్ బెదిరించింది. ‘‘ఆ తర్వాత ఏం జరిగింది?’’‘‘ఆల్ఫ్రెడ్ తమ్ముడికి నచ్చజెప్పాడు. మీరు ఇప్పట్లో గుంటూరు రారు. బెంగళూరులో స్థిరపడతారు. ఇక్కడ ఆస్తి ఉన్నా మీకేం ఉపయోగం? నాకైతే ఉపయోగం. కావాలంటే రేటు కట్టి సగం క్యాష్ ఇస్తా. పొలం చెరి సగం పంచుకుందామన్నాడు. హెన్రీ కూడా అన్న మాట విన్నాడు. ఆ బిల్డింగ్ ఆల్ఫ్రెడ్‌కి రాసిచ్చాం’’ చెప్పాడు విలియమ్స్.‘‘ఇదంతా మీ చిన్న కోడలు జెస్సీకి నచ్చని వ్యవహారం. దీనికి వత్తాసు పలికిన అత్త మీద ఆమెకు కోపం ఉండి ఉంటుంది కదా?’’ అన్నాడు ఇన్స్పెక్టర్.‘‘కోపం ఉంటే ఉంటుంది కానీ అత్తను చంపేంత ఉందని అనుకోను’’ అని నిట్టూర్చాడు విలియమ్స్.‘‘అయితే దొంగలు చేసిన హత్యే అని నమ్ముతున్నారా?’’‘‘నా నమ్మకంతో పనేముంది? నేరస్తుడిని ఆ జీసస్ బయటపెడతాడు’’ అని విలియమ్స్ దేవుణ్ని తలుచుకున్నాడు.‘‘మీకు ఒక కూతురు కూడా ఉంది కదా? ఆమెకు ఆస్తిలో భాగం ఇవ్వలేదా?’’ ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్.‘‘మా అమ్మాయి పెళ్లిలో అల్లుడికి పది లక్షలు కట్నంగా ఇచ్చాం. ఇప్పుడు మేమున్న ఈ ఇల్లు మా తదనంతరం అమ్మాయికే అని విల్లు రాసిచ్చాం’’ చెప్పాడు విలియమ్స్.‘‘మీ అల్లుడు ఏం జాబ్ చేస్తాడు?’’‘‘మా అల్లుడు చార్లెస్ బీటెక్ చదివాడు. జాబ్ చేయడం తనకి ఇష్టం ఉండదు. ఏదో బిజినెస్ చేస్తానంటున్నాడు. ప్రస్తుతం ఏటుకూరు రోడ్డులో జిన్నింగ్ మిల్లును లీజుకు తీసుకొని నడుపుతున్నాడు’’ చెప్పాడు విలియమ్స్. జనరల్ హాస్పిటల్ నుంచి ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కి పిలుపు వచ్చింది. సూపరింటెండెంట్ ఒకసారి కలుసుకోమన్నారు. ప్రవీణ్ వెళ్లి ఆయన్ని కలిశాడు. ‘‘ఇన్స్పెక్టర్ గారూ! రేచల్ బాడీ పోస్ట్‌మార్టమ్ చేస్తున్నప్పుడు ఆమె కుడిచెయ్యి గుప్పిట మూసుకొని ఉంది. మీరెవరూ గమనించి ఉండరు. డాక్టర్లు తెరిచి చూస్తే, ఈ రింగ్ బయటపడింది’’ పోస్మార్టమ్ రిపోర్టుతో పాటు ఆ ఉంగరాన్ని ఇచ్చాడు హాస్పిటల్ సూపరింటెండెంట్.ఇన్స్పెక్టర్ దాన్ని తీసుకున్నాడు. నవరత్నాలు పొదిగిన ఉంగరం అది . ఆయనకి థ్యాంక్స్ చెప్పి బయల్దేరాడు ఇన్స్పెక్టర్.నవరత్నాలు పొదిగిన ఉంగరం చూడగానే విలియమ్స్ ఆశ్చర్యపోయాడు. ‘‘ఇన్స్పెక్టర్! మీకు ఈ రింగ్ ఎక్కడిది?’’ అడిగాడు విలియమ్స్.‘‘చెప్పండి! ఈ ఉంగరం ఎవరిది?’’ ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్.‘‘ఈ రింగ్ మా అల్లుడు చార్లెస్ది’’ అన్నాడు. చార్లెస్‌ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకొచ్చారు.‘‘మిస్టర్ చార్లెస్! మీ అత్త రేచల్‌ని ఎందుకు మర్డర్ చేశారు?’’ కఠినంగా ధ్వనించింది ప్రవీణ్ కంఠం. ‘‘మా అత్తను నేను మర్డర్ చేశానా? నో.. సార్!... నో.. నేను చెయ్యలేదు’’ వెలవెలపోతున్న ముఖంతో చెప్పాడు చార్లెస్.‘‘మమ్మల్ని బుకాయించకండి. మీ అత్తను మీరే చంపారు. కత్తితో పొడిచారు. ఆ పెనుగులాటలో మీ ఉంగరం ఆమె చేతిలోకి వచ్చింది. మీరు అది గమనించలేదు. ఎక్కడో జారిపోయిందని అనుకున్నారు. ఆ హత్య దొంగలు చేశారని అనుకోవాలని బీరువాలో డబ్బు తీసుకొని బట్టలను చిందరవందరగా పడేశారు’’ చెప్పాడు ఇన్స్పెక్టర్.చార్లెస్ ఉంగరం వైపు చూశాడు. తర్వాత తలవంచుకొని చెప్పసాగాడు. ‘‘సార్! మా అత్త మాకు చాలా అన్యాయం చేసింది. ఆమెకు కొడుకుల మీదనే ప్రేమ. కూతురు పరాయిది. పది లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాం? ఇంకేంది మీకిచ్చేది అని వాదించింది. న్యాయానికి ఇప్పుడు ఆస్తిలో కూతురికి కూడా భాగం ఇవ్వాలి. అందుకు ఆమె ఒప్పుకోలేదు. మా మామ ఆ బిల్డింగ్‌ని ఇద్దరు కొడుకులకు పంచి ఇచ్చారు. నా భార్యకు కూడా ఇచ్చి ఉంటే, పెద్ద బామ్మర్ది మా భాగానికి వెలకట్టి డబ్బు ఇచ్చేవాడు. నాకు ఇప్పుడు క్యాష్ చాలా అవసరం. బిజినెస్‌కి పెట్టుబడి కావాలి. అది ఇవ్వకుండా అడ్డుపడింది మా అత్తే. చివరికి మా మామ తాము ఉంటున్న ఇల్లును తదనంతరం నా భార్యకు రాశారు. తదనంతరం అంటే ఎప్పుడు? వాళ్లు పోయాక? ఇప్పట్లో పోతారా? ఏ ఇరవై ఏళ్ల తర్వాత సంగతి. అప్పుడు మాకేం ఉపయోగం. అందుకే మా అత్తను చంపాను. మా మామకు తర్వాత నచ్చజెప్పి అమ్మేయాలని ప్లాన్ వేశాను’’ చెప్పాడు చార్లెస్.‘‘చార్లెస్! మీకు అన్యాయం జరిగిందని పిల్లనిచ్చిన అత్తను చంపుతారా? ఘోరం కాదా? కోర్టుకి వెళ్లి న్యాయం పొందాల్సింది. హత్యలు పరిష్కారం కావు?’’ అన్నాడు ఇన్స్పెక్టర్. చార్లెస్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు.‘‘నవరత్నాలు అదృష్టం తెచ్చిపెడతాయని నమ్ముకున్నావు. కానీ అవే నిన్ను జైలుపాలు చేశాయి’’ చెప్పాడు ఇన్స్పెక్టర్ ప్రవీణ్. - వాణిశ్రీ -
జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సభ్యుడి వీరంగం
నెల్లూరు(బారకాసు): ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై అభివృద్ధి కమిటీ సభ్యుడు బుధవారం వీరంగం సృష్టించాడు. క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు నిరసనకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రి చైర్మన్, పోలీసులు జోక్యం చేసుకుని క్షమాపణ చెప్పించడంతో వివాదం సమసింది. వివరాలు...జీజీహెచ్‌లో బుధవారం జరిగిన సెమినార్ హాల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు మొగరాల సురేష్ మాట్లాడుతూ ఆస్పత్రిలో శానిటేషన్ బాగాలేదని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, తనకు తెలియకుండా ఎన్నో కార్యక్రమాలు జరిగిపోతున్నాయని సూపరింటెండెంట్ రాధాకృష్ణరాజుపై విరుచుకుపడ్డారు. తాను ఏమి చెప్పినా ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. తాను ఆస్పత్రికి వచ్చినప్పుడు కనీసం కూర్చునేందుకు కుర్చీ కూడా లేదని, చెట్లు, మెట్ల వద్ద ఉండాలా అని మండిపడ్డారు. కమిటీ సభ్యుడిగా కాకపోయినా కనీసం జాతీయ పార్టీ జిల్లా నాయకుడిగా కూడా గౌరవించరా అంటూ ప్రశ్నించారు. అందుకు సూపరింటెండెంట్ పార్టీ పరంగా ఏమైనా ఉంటే బయట చూసుకోవాలని సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన మొగరాల తమ పార్టీనే విమర్శిస్తావాని విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఇరువురి నడుమ మాటమాట పెరిగిపోతుండగా వైద్యాధికారులు, ఆస్పత్రి చైర్మన్ జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఆస్పత్రి ఉద్యోగులు, వైద్యులు సెమినార్ హాల్ ప్రారంభోత్సవం అనంతరం మూకుమ్మడిగా ఆస్పత్రి చైర్మన్ ఛాంబర్‌కు చేరుకున్నారు. ఆస్పత్రి చైర్మన్ ఛాంబర్లో ఉన్న మొగరాలపై ధ్వజమెత్తారు. సూపరింటెండెంట్‌ను పళ్లు రాలగొడతావా, వెంటనే క్షమాపణ చెప్పి కమిటీ సభ్యుడిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో గందరగోళం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆస్పత్రి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు స్పందిస్తూ కమిటీ చైర్మన్‌గా తాను సూపరింటెండెంట్‌కు క్షమాపణ చెబుతున్నానన్నా ఉద్యోగులు ఒప్పుకోలేదు. అనుచితంగా మాట్లాడిన వారే క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. సూపరింటెండెంట్ తనకు జరిగిన అవమానాన్ని కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని, వారే చర్యలు తీసుకుంటారని, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో వివాదం ఆపకపోతే చిలికి చిలికి గాలివానలా మారే ప్రమాదం ఉందని గ్రహించిన ఆస్పత్రి చైర్మన్, పోలీసులు చర్చలు జరిపి మొగరాలతో క్షమాపణ చెప్పించారు. సూపరింటెండెంట్ చేతులతోనే ఫిర్యాదుని చించివేయించారు. దీంతో మూడు గంటల పాటు నెలకొన్న గందరగోళానికి తెరపడింది. -
ఇదేం రోగం..?
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పైస్థాయి అధికారుల పెత్తనం పెరిగిపోయింది. సరైన సిబ్బంది లేక రోగులను బంధువులే మోసుకెళ్లాల్సిన పరిస్థితులు ఇక్కడుంటే, పదుల సంఖ్యలో ఉద్యోగులను స్వప్రయోజనాలకు వాడుకుంటున్న ఆస్పత్రి అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. పెంపుడు కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు ఒకరు, ఇంటి అవసరాల కోసం ఇంకొకరు.. ఇలా నాలుగో తరగతి ఉద్యోగులను తమ ఇష్టానుసారం వాడుకుంటున్న తీరు తాజాగా వెలుగులోకి వచ్చింది. లబ్బీపేట (విజయవాడతూరు): విజయవాడ ప్రభుత్వాస్పత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని ఓ అధికారి అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటూ పెత్తనం సాగిస్తున్నారు. ఓ ఉన్నతాధికారి అండతో తన ఇంటి వద్ద పనులు చేసేందుకు నలుగురు ఉద్యోగులను కేటాయించాలని హుకుం జారీ చేశారు. ఇంకేముంది.. అడిగిందే ఆలస్యం సెక్యూరిటీ కాంట్రాక్టర్ ఇద్దరిని, వార్డులో విధులు నిర్వహించాల్సిన నాల్గో తరగతి ఉద్యోగులు ఇద్దరినీ కేటాయించారు. ఒకరు నిత్యం ఆ అధికారి కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు కేటాయించగా, మరొకరు ఇంటి వ్యవహారాలు చూసేందుకు నియమితులయ్యారు. నిత్యం ఇద్దరు ఉద్యోగులు ఆమె ఇంట్లో పనులు చేస్తుంటారు. ఇటీవల కుక్క వ్యవహారాలు చూసే ఉద్యోగి బంధువు మృతిచెందడంతో ఆ స్థానంలో మరొకరిని నియమించారు. ఇలా.. శోభ, యేసయ్య అనే ఉద్యోగులతో పాటు మరో ఇద్దరు ఆ అధికారి సేవలోనే ఉంటున్నట్లు తెలిసింది. మరో అధికారి ఇంట్లో ఇద్దరు, సూపర్వైజర్ వద్ద మరో ఇద్దరు ఉద్యోగులు ఇంటి పనులు చక్కబెడుతూ ఆస్పత్రి విధులకు డుమ్మా కొడుతున్నారు. రోగులకు తప్పని కష్టాలు ఉద్యోగులు అధికారుల ఇళ్లలో పనులు చక్కబెడుతుండగా, రోగులకు సేవలు అందించేవారు లేక బంధువులే వీల్చైర్లు, స్ట్రెచ్చర్‌పై ఎక్స్‌రేలు, స్కానింగ్‌లకు తీసుకెళ్లాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది. ఒక్కో సమయంలో రోగులను బంధువులే చేతులపై ఎత్తుకెళ్లడం జరుగుతోంది. అత్యవసర విభాగంలో సిబ్బందిని సైతం తమ సొంత పనులకు కేటాయించడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ గారూ దృష్టిపెట్టండి ఆస్పత్రిలో ఉద్యోగులు లేరంటూ ప్రతిసారీ ఆరోగ్యశ్రీలో ఉద్యోగులను నియమించాలని కలెక్టర్ నుంచి అనుమతులు తీసుకుంటున్నారు. రోగుల కోసం అలా నియమించిన వారిని సొంత అవసరాలకు వాడుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా కలెక్టర్ దీనిపై దృష్టిసారిస్తే.. అనేక అవకతవకలు బయట పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. చోద్యంచూస్తున్న అధికారులు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఓ అధికారి.. సిబ్బందిపై పెత్తనం చేస్తూ సొంత అవసరాలకు వాడుకుంటున్నా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. ఇటీవల తన ఇంట్లో ఫంక్షన్ జరగ్గా, ఆస్పత్రి క్యాంటీన్ నుంచి డిమాండ్ చేసి భోజనాలు తీసుకెళ్లారు. ఆదివారం సెలవులో ఉన్న సిబ్బందిని పిలిపించి మరీ భోజనాలు తీసుకురావాలని హుకుం జారీచేసినట్లు చెబుతున్నారు. ఇలా ఆస్పత్రి ఉన్నతాధికారి అండగా, కాంట్రాక్టర్లు, కిందిస్థాయి సిబ్బందిని సొంత అవసరాల కోసం ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నా దృష్టికి రాలేదు ఆస్పత్రిలో నాల్గో తరగతి ఉద్యోగులు.. అధికారుల ఇళ్లలో పనులు చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. అలాంటిది ఏమైనా ఉంటే ఇక నుంచి జరగకుండా చూస్తాను. – డాక్టర్ జి.చక్రధర్, సూపరింటెండెంట్ -
రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన డీఈఓ సూపరింటెండెంట్
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ) కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. డీఎస్పీ కె.రాజేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో ఆఫీస్ పర్యవేక్షకుడు ఎ.వి.ప్రసాదరావు రూ.20 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. పాతపట్నంకు చెందిన జమ్మయ్య అనే ఉద్యోగి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఈ దాడులు నిర్వహించింది. -
హెచ్‌ఓడీలంతా ఏం చేస్తున్నారు?
సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ అనంతపురం మెడికల్: ‘రక్త పరీక్షలు చేయడం లేదని నా వద్దకొస్తారు.. స్కానింగ్ చేయడం లేదని చెబుతారు.. ఆపరేషన్ల విషయంలోనూ ఫిర్యాదులే.. వార్డుల్లో సరిగా చూడడం లేదని రోజూ గొడవ.. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే హెచ్‌ఓడీలంతా ఏం చేస్తున్నారు?’ అని సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం తన చాంబర్లో అన్ని విభాగాల అధిపతులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సేవల కోసం రోగులు, వారి బంధువులు తన వరకు రావడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో కలెక్టర్ సీరియస్‌గా ఉన్నారని, అందరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విభాగాల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మందుల కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అల్ట్రాసౌండ్ సేవల విషయంలో వైద్యుల కొరత కారణంగా ఇన్‌పేషెంట్స్‌కు మాత్రమే చేయాలన్నారు. మైక్రో బయాలజీ, పెథాలజీ విభాగాల కోసం ప్రత్యేక గదులు కేటాయించనున్నట్లు చెప్పారు. గతంలో మెడికల్ కళాశాలకు వెళ్లి పరీక్షలు చేయాల్సి వచ్చేదని, ఇక నుంచి ఆ సమస్య కూడా ఉండదన్నారు. ఆస్పత్రి నుంచి మృతదేహాలను స్వగ్రామాలకు చేర్చడం కోసం ‘మహాప్రస్థానం’ వాహనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ విషయం తెలిసేలా ప్రతి విభాగంలోనూ ప్రత్యేకంగా రాయించనున్నట్లు చెప్పారు. అనవసరంగా సీటీ స్కాన్ పరీక్షలు రాయొద్దని సూచించారు. నాలుగు నెలల్లో ఎంఆర్ఐ కూడా వస్తుందని తెలియజేశారు. చెవి, ముక్కు, గొంతు సమస్యలతో వచ్చే వారి కోసం త్వరలోనే ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇటీవల 100 మంచాలు, బెడ్లు వచ్చాయని, నూతన బిల్డింగ్‌లో వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి అంటే ప్రజల్లో నమ్మకం కలిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, ఆర్ఎంఓ డాక్టర్ లలిత, హెచ్ఓడీలు డాక్టర్ నవీన్, డాక్టర్ నవీద్, డాక్టర్ యండ్లూరి ప్రభాకర్, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ సంధ్య, డాక్టర్ శివకుమార్, మేనేజర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
అత్యవసర వేళల్లో సత్వరసేవలకు చర్యలు
-పేదలకు సకాలంలో నాణ్యమైన వైద్యం -జీజీహెచ్ కొత్త సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు కాకినాడ వైద్యం : ప్రాణాపాయస్థితిలో అత్యవసర విభాగంలోకి వచ్చే క్షతగాత్రులు, రోగులకు సత్వర వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు తెలిపారు. బుధవారం ఆయన జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ వై.నాగేశ్వరరావు నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యవసర విభాగంలో ఎమ్మెల్సీ, నాన్ ఎమ్మెల్సీ వార్డుల్లో షిఫ్టుకి ప్రస్తుతమున్న ఒక్క సీఎంవోలకు బదులు ఇద్దరు సీఎంవోలను నియమించనున్నట్లు తెలిపారు. జీజీహెచ్‌లో వైద్యసేవలు పొందేందుకు ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా విశాఖజిల్లా సరిహద్దు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వస్తుంటారన్నారు. ఇక్కడకు నూటికి 80 మంది నిరుపేదలే వస్తారని, వీరికి కాలయాపన లేకుండా, సకాలంలో నాణ్యమైన వైద్యసేవలందేలా చర్యలు తీసుకుంటున్నటు తెలిపారు. రోగ నిర్ధారణ పరీక్షల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు గుర్తించామని, నిర్ణీత సమయంలో పరీక్షలు నిర్వహించకపోయినా, సకాలంలో రిపోర్టులు ఇవ్వకపోయినా సిబ్బందిని ఎంత మాత్రం ఉపేక్షించబోమన్నారు. విధి నిర్వహణలో అలసత్వం, సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది, విభాగాధిపతులతో సమన్వయం చేసుకుంటూ ఆసుపత్రి అభివృద్ధి, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా జీజీహెచ్‌లో వైద్యసేవలు అందించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటానన్నారు. పారిశుద్ధ్య సక్రమ నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, పలువురు వైద్య విభాగాధిపతులు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, పీజీలు, హౌస్ సర్జన్లు డాక్టర్ రాఘవేంద్రరావును కలసి, పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. పలు వార్డుల తనిఖీ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రాఘవేంద్రరావు నేరుగా ఈఎన్టీ వార్డు, ఆప్తాల్మాలజీ పైన ఏర్పాటు చేసిన స్వైన్‌ప్లూ వార్డును సందర్శించారు. వెంటిలేటర్లు, మాస్క్‌లు, మందులు, పరికరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం అత్యవసర విభాగాన్ని సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్యసేవలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెడిసిన్, సర్జికల్, టీబీ వార్డులను, మాతా,శిశు విభాగంలోని లేబర్ రూమ్‌లను సందర్శించారు. చిన్నారుల సంరక్షణపై సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సక్రమ పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు చేపట్టాలన్నారు. -
‘తీహార్’ సూపరింటెండెంట్‌గా మహిళా అధికారి
న్యూఢిల్లీ: తీహార్ పురుషుల జైలు సూపరింటెండెంట్‌గా తొలిసారి అంజూ మంగ్లా అనే మహిళా అధికారి నియమితులయ్యారు. ఆమె ఇంతకు ముందు మహిళల జైలుకు ఇదే హోదాలో సేవలందించారు. అత్యంత భద్రత ఉండే తీహార్ జైలుకు గతంలో కిరణ్ బేడీ, మిమలా మెహ్రా అనే మహిళా అధికారులు డైరెక్టర్ జనరల్స్‌గా చేశారు. మంగ్లా 18–21 ఏళ్ల మధ్యనున్న సుమారు 800 మంది ఖైదీలను పర్యవేక్షించనున్నారు. -
దేవుడికే శఠగోపం పెట్టారు
-
సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోండి
ఈఓకు పురోహితుల ఫిర్యాదు ∙ చైర్మన్‌తో చర్చించిన తర్వాతేనని హామీ అన్నవరం : అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహితుల విషయంలో సూపరింటెండెంట్ కె. కొండలరావు దురుసుగా ప్రవర్తించడంపై ఏర్పడిన వివాదం ఈఓ జోక్యంతో సద్దుమణిగింది. ఒక దశలో సూపరింటెండెంట్‌పై సత్వరం చర్య తీసుకోవాలని ఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలపాలని పురోహితులు భావించారు. అయితే మధ్యాహ్నం ఈఓ నాగేశ్వరరావుతో సమావేశమైన తరువాత ఆయన సూపరింటెండెంట్‌పై చర్యలకు ఇచ్చిన హామీతో వివాదం సద్దుమణిగింది. వివరాలిలా ఉన్నాయి. భక్తుల నుంచి పురోహితులు ఏరకమైన దక్షిణలనైనా డిమాండ్ చేయరాదని, వారిస్తే తీసుకోవచ్చని ఈఓ నిబంధన విధించారు. దీనిపై అసంతృప్తిగా ఉన్న పురోహితులు గురువారం భక్తులు స్వచ్ఛందంగా ఇచ్చిన కానుకలు కూడా హుండీలోనే వేసేసారు. గురువారం ఉదయం వ్రతకధలో భాగంగా సత్యదేవుని ఆలయం త్రిమూర్త్యాత్మకం అనే విషయాన్ని ఓ భక్తుడు అడిగిన సందేహానికి పురోహితుడు వివరణ ఇస్తుండగా సూపరింటెండెంట్ కొండలరావు అతనిని బలవంతంగా జబ్బ పట్టుకుని మండపం నుంచి బయటకు లాగేశాడని సహ పురోహితులు తెలిపారు. మిగిలిన నలుగురి పురోహితుల విషయంలో కూడా ఆయన ఇలాగే ప్రవర్తించాడని పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన విషయాన్ని పురోహితులు ఈఓ నాగేశ్వరరావుకు ఫో¯ŒSలో వివరించి సూపరింటెండెంట్‌పై చర్యలకు డిమాండ్ చేశారు. దీనిపై చర్చించేందుకు మధ్యాహ్నం ఒంటిగంటకు తన చాంబర్ కు రావాలని ఈఓ వారికి తెలిపారు. మధ్యాహ్నం ఈఓ ను కలిసిన పురోహితులు జరిగిన విషయాన్ని, అలాగే భక్తులు స్వయంగా ఇచ్చే కానుకలు తీసుకోవడానికి అనుమతించే విషయాన్ని వివరించారు. అలాగే తాము భక్తులను కానుకలు అడిగితే సస్పెండ్ చేయవచ్చునని ఈఓకి హామీ ఇచ్చారు. దీనిపై ఈఓ సానుకూలంగా స్పందించారు. అలాగే సూపరిండెంట్ విషయాన్ని కార్తికమాసం తరువాత ఆలయ చైర్మన్ రోహిత్‌తో చర్చించి నిర్ణయిస్తామని ఈఓ తెలిపారు. ఈఓ కె.నాగేశ్వరరావును కలిసిన పురోహితుల ఫైవ్మె¯ŒS కమిటీ సభ్యులు స్పెషల్‌గ్రేడ్ పురోహితుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, కర్రి వైకుంఠరావు, బండి నర్శింహమూర్తి, చామర్తి కన్నబాబు, కర్రి సూర్యనారాయణ మూర్తి, స్పెషల్‌గ్రేడ్ పురోహితుడు ముత్య సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
ఏసీబీకి చిక్కిన మరో ఉద్యోగి
రిటైర్డ్ ప్రిన్సిపాల్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆర్జేడీ కార్యాలయ సూపరింటెండెంట్ వరంగల్ : జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగి పింఛను కు సంబంధించిన ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపేం దుకు లంచం డిమాండ్ చేసిన కార్యాల య సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. కరీనగర్ జిల్లా హుస్నాబాద్‌లోని మహిళా జూని యర్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన వి.విజయమారుతి ఈ ఏడాది మార్చి 31న పదవీ విరమణ పొందారు. ఆయన తన పింఛను మంజూరు కోసం హన్మకొండ సుబేదారిలోని ఆర్జేడీ కార్యాలయంలోని సూపరింటెం డెంట్ వీరంరాజును సంప్రదించారు. ఫైల్‌ను హైదరాబాద్‌లోని ఏజీ ఆఫీస్ కు పంపేందుకు వీరంరాజు రూ.10 వేలు లంచంగా డిమాండ్ చేశాడు. ఆరు నెలలుగా తిరిగి విసిగిపోయిన విజయమారుతి మొదటి విడతగా రూ.4 వేల నగదు ముట్టజెప్పాడు. నగ దు ముట్టిన వెంటనే ఫైల్‌ను ఆర్జేడీకి పంపగా ఆయన దానిని ఆమోదించా రు. ఆ ఫైల్‌ను ఏజీ కార్యాలయానికి పంపకుండా తన దగ్గరే పెట్టుకున్న వీరంరాజు మిగి లిన డబ్బులు ఇస్తేనే పంపిస్తానని చెప్పాడు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో విజయమారుతి ఏసీబీ అధికారులను అశ్రయించారు. బుధవారం సూపరింటెండెంట్ వీరంరాజుకు మిగతా రూ.6 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, అరెస్టు చేసి హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నామని సాయిబాబా తెలిపారు. -
‘ప్రీమియర్’ ఎదుట కార్మికుల ధర్నా
యాదగిరిగుట్ట : మండలంలోని రామాజీపేట పరిధిలో ఉన్న ప్రీమియర్ వైర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పరిశ్రమ యాజమాన్యం ప్రాంతీయ విభేదాలతో కార్మికులను వేధిస్తున్నారని హెచ్ఎంఎస్, సీఐటీయూ నాయకులు అన్నారు. దీనిని నిరసిస్తూ బుధవారం పరిశ్రమ ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న మేనేజర్లను పరిశ్రమ నుంచి తొలగించి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. ఈ ధర్నాలో హెచ్ఎంఎస్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శిలు వెంకటేష్, మహేష్, కార్మికులు మల్లేష్, భాస్కర్, స్వామి, వెంకటేష్, కష్ణ, గణేష్, దశరథ, సత్తయ్య, ప్రసాద్, నర్సింహులు, కుమార్, సంజీవ, శ్రీనివాస్, శ్రీశైలం, రమేష్ తదితరులున్నారు. -
గుట్ట సూపరింటెండెంట్‌గా వినోద్‌రెడ్డి
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మండల పరిషత్ సూపరింటెడెంట్గా వినోద్‌రెడ్డి బాధ్యతలను బుధవారం స్వీకరించారు. గతంలో వినోద్‌రెడ్డి సంస్థాన్ నారాయణపురం ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి పదోన్నతిపై యాదగిరిగుట్టకు వచ్చారు. ఇటీవల స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన విజయ్‌భాస్కర్‌రెడ్డి ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన వినోద్‌రెడ్డిని ఎంపీడీఓ సాంబశివరావు అభినందించారు. -
తండ్రి స్థానంలో ఉండి 12మంది బాలికలను..
న్యూఢిల్లీ: తండ్రి స్థానంలో ఉండాల్సిన ఉద్యోగి కామాంధుడిగా మారాడు. తన పిల్లల వయసున్న వారిపై లైంగిక వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా తన చర్యలను సెల్ ఫోన్లో వీడియోలు తీశాడు. ఇలా అతడు చేసిన దారుణం ఒక్కరిపైనో ఇద్దరిపైనో కాదు.. పన్నెండుమంది బాలికలపైన. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. మొబైల్ ఫోన్‌ను తనిఖీల నిమిత్తం పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మీనా అనే అధికారి 1998లో ప్రభుత్వ సంక్షేమ శాఖలో ఉద్యోగిగా చేరాడు. ఇటీవలె అతడు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడిని ప్రభుత్వం ఓ బాలికల సంరక్షణ గృహానికి అధికారిగా పంపించింది. అయితే, అలా వెళ్లిన అతడు ఈ నెల (జూన్) 2న వికృత చర్యలకు ప్రణాళిక రచించుకున్నాడు. పన్నెండుమంది 8 నుంచి 10 ఏళ్లలోపు ఉన్న బాలికలను ఓ గదిలోకి తీసుకెళ్లి టీవీ ఆన్ చేసి చూడమని చెప్పాడు. అనంతరం ఒక్కొక్కరిని తన వద్దకు వేరే గదిలోకి రావాలని ఆదేశించాడు. అలా వచ్చిన బాలికను పరీక్షల పేరుతో చేతులు కట్టేసి అనంతరం అసభ్యంగా ముట్టుకుంటూ బట్టలు విప్పేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇలా మొత్తం పన్నెండుమందిపై ఇలాగే చేశాడు. ఇదంతా తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. అలా అతడి బారిన పడిన బాలికలు ఇన్ ఫెక్షన్కు గురికావడంతో అసలు విషయం బయటకు తెలిసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
ప్రమాదంలో దుర్గగుడి సూపరింటెండెంట్ మృతి
తాడేపల్లి/ఇంద్రకీలాద్రి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పరిధిలో ప్రకాశం బ్యారేజీపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్గ గుడి సూపరింటెండెంట్ ఎంవీవీ సత్యానారాయణ మృతి చెందారు. మంగళగిరి మండలం ఉండవల్లిలో నివసించే సత్యనారాయణ దుర్గగుడిలో విధులకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై వెళుతున్నారు. ప్రకాశం బ్యారేజీపై వెనుక నుంచి వచ్చిన మరో ద్విచక్రవాహనదారుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సత్యనారాయణ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సత్యనారాయణ 35 సంవత్సరాలుగా ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య అమ్మాజీ కూడా కొంత కాలం క్రితమే మృతి చెందారు. వీరికి ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. కాగా, కుమారుడు వినాయక నిమజ్జనం సందర్భంగా కృష్ణా నదిలో మునిగి మృతి చెందాడు. కుమారుడు మృతి చెందిన స్థలం, ప్రస్తుతం సత్యనారాయణ ప్రమాదానికి గురైన ప్రదేశం ఒకే చోట కావడం గమనార్హం. -
ఎక్సైజ్ సూపరింటెండెట్ రమణపై వేటు
-
ఏసీబీకి చిక్కిన సోమశిల భూసేకరణ సూపరింటెండెంట్
నెల్లూరు(క్రైమ్): ప్రూప్ ఆఫ్ అవార్డు కోసం (నిర్వాసిత ధ్రువీకరణ పత్రం) రూ. 2వేలు లంచం తీసుకొంటూ సోమవారం సాయంత్రం నగరంలోని సోమశిల భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలోని సూపరింటెండెంట్ ఏసీబీ అధికారులకు దొరికారు. ఏసీబీ డీఎస్పీ ఆర్‌వీఎస్‌ఎం మూర్తి కథనం మేరకు.. సోమశిల ప్రాజెక్టు కట్ట నిర్మాణ సమయంలో బొంతల శేషయ్యకు చెందిన ఇంటి స్థలాన్ని భూసేకరణ విభాగం శాఖ సేకరించింది. దానికి తగిన నష్టపరిహారం చెల్లించడంతో పాటు 1982ను అవార్డు కాపీని ఇచ్చారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బేల్దారీ పనులు చేసుకుంటున్న శేషయ్య మనుమడు కఠారి అరుణ్‌కుమార్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయసాగాడు. తన తాతకు చెందిన ఇంటి స్థలంను సోమశిల ప్రాజెక్టు కట్ట నిర్మాణ సమయంలో భూసేకరణ విభాగం సేకరించిందనీ, దానికి సంబంధించి ప్రూప్ ఆఫ్ అవార్డు కాపీ కోసం నెల్లూరులోని సోమశిల భూసేకరణ విభాగం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్(డిప్యూటీ తహశీల్దార్)టి. రమేష్‌కుమార్‌ను ఆరునెలల కిందట ఆశ్రయించారని తెలిపారు. శేషయ్య వారసులము తామేనని ఫ్యామిలీమెంబర్స్ సర్టిఫికేట్‌ను సైతం సూపరింటెండెంట్‌కు అందజేరన్నారు. తనతో పాటు దరఖాస్తు చేసుకొన్న వారంద రూ ప్రూప్ ఆఫ్ అవార్డు కాపీని తీసుకెళ్లిపోయారని పేర్కొన్నారు. ఎంతకూ అవార్డు కాపీని ఇవ్వకపోవడంతో పలుమార్లు సూపరింటెండెంట్‌ను కలిశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో డిప్యూటీ కలెక్టర్‌ను సైతం కలిసి తన పరిస్థితిని విన్నవించాడు. ఆయన అవార్డు కాపీని ఇవ్వాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అయిన్నప్పటికి రమేష్‌కుమార్ బాధితుడిని తిప్పించుకోసాగాడు. ఇటీవల రమేష్‌కుమార్ బాధితునికి ఫోనుచేసి రూ. 3,500ఇస్తే అవార్డు కాపీని ఇస్తానని చెప్పాడు. రూ. రెండువేలు అయినా ఇస్తే పనిచేస్తానని చెప్పడంతో బాధితుడు లంచం ఇవ్వలేక ఏసీబి అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ ఇన్చార్జ్ డీఎస్పీ ఆర్విఎస్ఎం మూర్తి సూచనల మేరకు సోమవారం బాధితుడు సూపరింటెండెంట్‌ను కార్యాలయంలోనే కలిశాడు. ముందస్తు ఒప్పందం ప్రకారం రూ. రెండువేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా రమేష్‌కుమార్‌ను పట్టుకున్నారు. రసాయన పరీక్షలు నిర్వహించి నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నెల్లూరు అరవిందనగర్‌లోని రమేష్‌కుమార్ ఇంట్లో ఏసీబి అధికారులు సోదాలు నిర్వహించారు. రమేష్‌కుమార్‌ను ఏసీబి అధికారులు నాల్గోనగర పోలీసుస్టేషన్‌కు తరలించారు. మంగళవారం ఆయనను ఏసీబి ప్రత్యేక కోర్టులో హాజరుపెట్టనున్నారు. ఏసీబి అధికారులు అరెస్ట్‌చేసిన రమేష్‌కుమార్ 2014అక్టోబర్ 28నుంచి భూసేకరణ విభాగంలో పనిచేస్తున్నారు. కడుపు మంటతోనే ఏసీబీకి పట్టించా... కడుపు మంటతోనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానని బాధితుడు అరుణ్‌కుమార్ మీడియా ఎదుట వాపోయాడు. తన ఆర్థిక పరిస్థితి సూపరింటెండెంట్‌కు తెలిపినా పట్టించుకోలేదనీ, రూ. రెండువేలు ఇచ్చేంతవరకూ పీడించాడని ఆవేదన వ్యక్తం చేశారు. దాడుల్లో ఏసీబి సిఐలు ఎన్. శివకుమార్‌రెడ్డి, కృపానందం, సిబ్బంది శ్రీను, కె. మధు, ఖుద్దూస్, సుధాకర్, ఫణి, రవీంద్ర, ఎం మధు తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన సూపరింటెండెంట్
నెల్లూరు: సోమశిల ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కార్యాలయంలో రెండువేలు లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్ అధికారి రమేష్ కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన సోమవారం నెల్లూరు జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. సోమశిల ప్రాజెక్టు ముంపు ప్రాంత గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ అనే వ్యక్తి నుంచి ఒక పని విషయమై సూపరింటెండెంట్ రమేష్‌కుమార్ రూ. 2వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం అరుణ్‌కుమార్ నుంచి లంచం తీసుకుంటుండగా రమేష్‌కుమార్‌ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అత్యాశకు పోయి.. అడ్డంగా దొరికాడు
చిగురుమామిడి : యువత స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందించే యూనిట్ మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన మండల పరిషత్ సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం... చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన షేక్ మోసిన్ మైనారిటీ కార్పొరేషన్ కింద రూ.లక్ష వ్యయమయ్యే టెంట్‌హౌస్ యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ యూనిట్ కింద రూ.50 వేలు రుణం కాగా, రూ.50 వేలు మైనారిటీ సంక్షేమశాఖ సబ్సిడీ అందిస్తుంది. మోసిన్‌కు రుణం ఇచ్చేందుకు ఇందుర్తిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ కాన్సెంట్ ఇచ్చారు. యూనిట్ మంజూరు కావాలంటే బ్యాంకు మేనేజర్, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి సంతకం చేసిన జే.ఐ షీట్‌ను జిల్లా మైనారిటీ కార్పొరేషన్‌కు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ భూక్యా రాజేశ్‌నాయక్ మోసిన్‌ను రూ.5 వేలు డిమాండ్ చేశాడు. తాను నిరుపేదనని, అంత ఇచ్చుకోలేనని మోసిన్ బతిమిలాడినా వినిపించుకోలేదు. గత్యంతరం లేక ముందుగా రూ.3 వేలు, సబ్సిడీ మంజూరయ్యాక రూ.2 వేలు ఇచ్చేలా ఇప్పందం కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం రాజేశ్‌నాయక్ డిమాండ్‌ను మోసిన్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్‌కు సమాచారం ఇచ్చాడు. ఆయన సూచన మేరకు రూ.3 వేలు లంచం ఇచ్చేందుకు రాజేశ్‌కు శనివారం ఫోన్ చేయగా... తనకు కరీంనగర్లో మీటింగ్ ఉందని, రేకుర్తి సమీపంలో తన ఇల్లు ఉంటుందని, రేకుర్తి బస్టాండ్ వద్దకు రావాలని సూచించాడు. మీటింగ్ అయిపోయాక రాజేశ్ రేకుర్తి బస్టాండ్ వద్ద వేచి చూస్తున్న మోసిన్ వద్దకు వెళ్లాడు. అతడిని కొద్ది దూరం తీసుకెళ్లి రూ.3 వేలు తీసుకున్నాడు. వెంటనే అక్కడకు చేరుకున్న ఏసీబీ అధికారులు రాజేశ్ వాహనంలో దాచిన డబ్బులను, రాజేశ్‌ను పట్టుకున్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయానికి తరలించారు. వ్యక్తిగత రుణాల కోసం వచ్చిన దరఖాస్తులను డీఎస్పీ పరిశీలించారు. మోసిన్ దరఖాస్తును కూడా పరిశీలించారు. రాజేశ్నాయక్ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ‘కావాలనే ఇరికించారు’ తనను ఇందులో కావాలనే ఇరికించారని భూక్యా రాజేశ్ ఆరోపించాడు. శనివారం సాయంత్రం మండల పరిషత్ కార్యాలయంలో విలేకరుల ఎదుట కంటతడిపెట్టాడు. ఓ విలేకరి(సాక్షి కాదు) తన బంధువుకు రుణం మంజూరు చేయలేదనే కుట్రతో కావాలనే డబ్బులు ఇచ్చి తనను పథకం ప్రకారమే పట్టించారని ఆరోపించారు. తనకు లంచం ఇవ్వబోగా వద్దని వారించానని, మోసిన్ బలవంతంగా ఇచ్చి తనను ఇరికించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. -
రిమ్స్‌లో ప్రచ్ఛన్న యుద్ధం!
రిమ్స్‌క్యాంపస్: ఎవరైనాతప్పు చేస్తే వారిని మందలించటం సహజం. మరీ అవసరమైతే చర్యలు తీసుకోవటం ఏ శాఖలోనైనా పరిపాటే. తప్పు చేసిన వారు కూడా ఒక్కోసారి తలవంచుకుపోతారు. అదే తప్పు చేయకుండానే ఉన్నతాధికారులు చర్యలకు సిద్ధమైతే? కిందిస్థాయి సిబ్బందిలో ఆగ్రహావేశాలు ముంచుకొస్తాయి. కొద్దిసేపు సహనం వహిస్తారు. అప్పటికీ అధికారుల తీరు మారకపోతే ఆందోళనకు సిద్ధమవుతారు. ఇదే పరిస్థితి జిల్లాకు తలమానికంగా ఉన్న రిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం నెలకొంది. కొద్దిరోజులుగా ఏదో ఒక విషయంలో రిమ్స్‌లో నెలకొంటున్న విభేదాలు మరోసారి తారస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిమ్స్ ఆస్పత్రిలో సుమారు 250 మంది స్టాఫ్ నర్సులు విధులు నిర్వహిస్తున్నారు. వీరి విధులను నర్సిం గ్ సూపరింటెండెంట్లు పర్యవేక్షిస్తారు. ఎవరైన విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే నర్సింగ్ సూపరింటెండెంట్ చర్యలు తీసుకుంటారు. అయితే ఇక్కడ పరిస్థితి తారుమారైంది. నర్సింగ్ స్టాఫ్ పై రిమ్స్ డెరైక్టర్ అజమాయిషీ చెలాయించేందుకు చూస్తున్నారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. రిమ్స్ మొత్తానికి ఉన్నతాధికారిగా ఆయనకు అధికారం ఉన్నప్పటికీ లేనిపోని తప్పులను చూపించడాన్ని మాత్రం నర్సింగ్ స్టాఫ్ తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల వార్డు ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వార్డులో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రోగులకు ఏ విధమైన సేవ లు అందుతున్నాయి, దొంగతనాలు జరుగకుండా ఇలా వీటి ద్వారా అధికారులు పరిశీలించి తెలుసుకుంటున్నారు. అయితే స్టాఫ్ నర్సులు రోగులకు సేవలందించిన తరువాత సంబంధిత రికా ర్డు వర్క్, డైట్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం స్టాఫ్ నర్సులు వార్డులో వారికి కేటాయించిన చోట కూర్చొని విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఇటీవల ఓ వార్డులో స్టాఫ్ నర్సులు ఒకే దగ్గర కూర్చొని ఉండటాన్ని సీసీ కెమెరాలో చూసిన రిమ్స్ డెరైక్టరు వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెమోలివ్వాలంటూ ఆదేశాలు స్టాఫ్ నర్సులంతా ఒకచోట కూర్చొని ఉండటాన్ని తప్పుబట్టిన డెరైక్టర్ ఆ సమయంలో ఎవరెవరు డ్యూటీలో ఉన్నారో వారికి మెమోలివ్వాలంటూ నర్సింగ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలను జారీ చేశారు. అయితే రికార్డు వర్క్ చేసుకుంటున్న వారికి ఏ విధంగా మెమోలిస్తామంటూ సూపరింటెండెం ట్లు డెరైక్టరుకు వివరించారు. డెరెక్టర్ మాత్రం వీరి మాటలను పట్టించుకోలేదు. వారికి మెమోలివ్వకుంటే నేను మీకు మెమోలిస్తానంటూ హెచ్చరించి నట్టు సమాచారం. తప్పు చేయని స్టాఫ్ నర్సులకు మెమోలివ్వలేక, డెరైక్టరు మాటకు ఎదురు చెప్పలేక ఓ నర్సింగ్ సూపరింటెండెంట్ కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలిసింది. ఆందోళన ఆలోచనలో నర్సింగ్ స్టాఫ్ ! డెరైక్టర్ తీరు మార్చుకోకపోతే ఆందోళనకు సిద్ధం కావాలననే ఆలోచనలో స్టాఫ్ నర్సులు ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు కొంతమంది గురువారం సమావేశమై చర్చించినట్టు ఆస్పత్రి వ ర్గాలు చెబుతున్నాయి. నిజంగా తప్పు చేసి ఉంటే ఆధారాలతో సహా రుజువు చేసి చర్య తీసుకోవాలంటున్నారు. మెమోలివ్వమన్న మాట వాస్తవమే విధులు సక్రమంగా నిర్వహించటం లేదంటూ కొంత మంది స్టాఫ్ నర్సుల కు మెమోలను ఇవ్వమని డెరైక్టర్ చెప్పటం వాస్తవమేనని గ్రేడ్-2 నర్సిం గ్ సూపరింటెండెంట్ దుర్గాంబ ‘సాక్షి’కి చెప్పారు. తొలుత మెమోలు ఇవ్వమని చెప్పినా.. ఆ తరువాత వాటిని రద్దు చేయమని చెప్పడంతో ప్రస్తుతం ఎవ్వరికి మెమోలు ఇవ్వలేదన్నారు. ఇదే విషయాన్ని రిమ్స్ సూపరింటెండెంట్ ఎల్.వేణుగోపాల్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా నర్సింగ్ స్టాఫ్ చాలా సమయం ఒకే చోటకూర్చొని ఉంటున్నారని రోగుల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో స్టాఫ్ నర్సులను డెరైక్టరు మందలించినట్టు చెప్పారు. మెమోల విషయం తనకు తెలియదన్నారు. -
సూపరింటెండెంట్‌కు ‘ఈవో’ బాధ్యతలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో వై.రామచంద్రారెడ్డి గురువారం రాత్రి ఆలయ బాధ్యతలను సూపరింటెండెంట్ శ్రీనివాసులురెడ్డికి అప్పగించి వెళ్లిపోయారు. బుధవారం ఆలయ ఈవోను రాష్ట్ర దేవాదాయశాఖకు బదిలీ చేస్తున్నట్లు కమిషనర్ అనురాధ ఉత్తర్వులు పంపిన విషయం తెలిసిందే. కాగా మరోవైపు ఆలయ ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్, కాంట్రాక్టర్లు ఈవో రామచంద్రారెడ్డి నియామకం చెల్లదని హైకోర్టులో వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ కమిషనర్ ప్యూహత్మకంగా వ్యవహరించారు. గురువారం ఈవోను రిలీవ్ చేయించి ఆ ఫైల్‌ను సూపరింటెండెంట్ ఫ్యాక్స్ ద్వారా క మిషనర్‌కు పంపించారు. శుక్రవారం హైకోర్టులో విచారణ సందర్భంగా కమిషనర్ శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవోను బదిలీ చేసినట్లు తగిన ఆధారాలు చూపనుంది. దీంతో కోర్టు ఆ కేసును కొట్టివేస్తుందనే ఉద్దేశంతోనే బదిలీ వేటు పడిందని ఆలయాధికారులు బాహాటంగానే చెబుతున్నారు. ఇక నూతనంగా ఈవో బాధ్యతలు చేపట్టనున్న తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా వాసి తిరుపతి ఆర్జేసీ శ్రీనివాసరావు హైదరాబాద్‌లోని దేవాదాయశాఖ కార్యాలయంలోనే శుక్రవారం బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. -
లోకాయుక్త సోదాలు
ఐదుగురు అధికారుల ఇళ్లపై దాడులు ఓ ఐఎఫ్ఎస్ అధికారి ఇంటిపై కూడా సాక్షి, బెంగళూరు : అక్రమ మార్గంలో ఆస్తులు కూడబెట్టారన్న సమాచారం మేరకు ఐదుగురు ప్రభుత్వ అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో లోకాయుక్త ఏక కాలంలో గురువారం సోదాలు నిర్వహించింది. ప్రతి ఒక్కరూ అదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వివరాలను కర్ణాటక లోకాయుక్త అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్.ఎన్ సత్యనారాయణరావు మీడియాకు ఓ ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి హరికుమార్ ఝా మైసూరు సేల్స్ ఇంటర్ నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతని వద్ద రూ.2.17 కోట్ల స్థిరాస్తులు, రూ.48.42 లక్షల చరాస్తులు ఉన్నాయి. వీటి విలువ నిందితుని సంపాదన కంటే దాదాపు 100 రెట్లు అధికం. ప్రజాపనుల శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్న బీఎల్ రవీంద్రబాబు, అతని కుటుంబ సభ్యుల పేరుపై రూ.8.23 కోట్ల విలువైన భవంతులు, పొలాలు, ఇంటిస్థలాలు ఉన్నాయి. వీటితో పాటు రూ.2.48 కోట్ల బంగారు, వెండి, నగదు ఉన్నట్లు లోకాయుక్త సోదాల్లో బయటపడ్డాయి. అతని సంపాదన కంటే 324 రెట్ల ఎక్కువ ఆస్తులున్నట్లు తేలింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డెరైక్టర్‌గా (ఫైనాన్స్) విధులు నిర్వర్తిస్తున్న పద్మనాభన్ వద్ద రూ.2.96 కోట్ల స్థిర, రూ.19.50 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. అతని సంపాదనతో పోలిస్తే 107 రెట్ల ఆస్తులు అధికంగా ఉన్నట్లు తేలింది. కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్‌లో అసిస్టెంట్ సెక్రెటరీగా పని చేస్తున్న ఆర్ భాస్కర్ కలిగి ఉన్న స్థిర, చరాస్తుల విలువ అతని సంపాదన కంటే 127 రెట్లు ఎక్కువగా ఉంది. రాష్ట్ర అబ్కారీ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసమూర్తి వద్ద 207 రెట్ల ఆక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. -
ఇక హాయిగా మాట్లాడుకోవచ్చు
నాసిక్: నాసిక్ రోడ్ సెంట్రల్ జైల్లోని ఖైదీలు ఇక తమ బంధువులకు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇటీవల ఠాణే, తలోజా కారాగారాల్లోని ఖైదీలకు ఫోన్ కాల్ అవకాశం కల్పించినట్టుగానే... నాసిక్ జైల్లో ఖైదీలకు కూడా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. సుదూర గ్రామాల నుంచి జైల్లో ఉన్న తమ బంధువులను చూడటానికి వచ్చేవారికి ఇకనుంచి ఆ ప్రయాణభారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అందుకే రెండు ఫోన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనను పంపినట్టు నాసిక్ రోడ్ కేంద్ర కారాగార అధికారులు తెలిపారు. ‘దీనిని ప్రయోగాత్మకంగా ఠాణే కేంద్ర కారాగారంతోపాటు తలోజా జైలులో ఈ సౌకర్యాన్ని కల్పించామని, అలాంటిదే ఇప్పుడు నాసిక్ రోడ్ కేంద్ర కారాగారంలో కూడా ఏర్పాటు చేయనున్నామ’ని చెప్పారు. విషయమై ఉన్నతాధికారులతో చర్చించామని జైలు సూపరింటెండెంట్ జయంత్ నాయక్ తెలిపారు. నెలకు రెండుసార్లు తమ బంధువులతో 10 నిమిషాలపాటు మాట్లాడుకునే అవకాశం కల్పిస్తున్నట్లు జైలు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సౌకర్యాన్ని ఖైదీలు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు. నాసిక్ రోడ్ కేంద్ర కారాగారంలో ప్రస్తుతం 2,290 మంది ఖైదీలుండగా, వీరిలో 1,600మంది జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. వారానికోసారి తమ బంధువులను కలిసే అవకాశం ఖైదీలకు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. సుదూరంగా ఉన్న బంధువులు ఎప్పుడు పడితే అప్పుడు కలవడానికి అవకాశం ఉండదు. దీంతో తమ కుటుంబం, పిల్లలు, జీవిత భాగస్వాములు ఎలా ఉన్నారనే ఆలోచన ఖైదీలను మానసిక ఆందోళనకు గురిచేస్తుంది. ఇలాంటి భావోద్వేగాలతోనే కొన్ని వారాల కిందట ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఖైదీలు గందరగోళానికి గురవకుండా ఉండేందుకే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తమ బంధువులతో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ కేంద్ర కారాగారానికి ఒక మానసిక వైద్యుడు కూడా అవసరమని సంబంధిత అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్ర కారాగారంలో అలాంటి పదవి ఇంతవరకూ ఆమోదం పొందలేదు. -
అవినీతి డొంక కదిలింది
గూడెంకొత్తవీధి, న్యూస్‌లైన్: గిరిజన సహకార సంస్థ(జీసీసీ)లో చాపకింద నీరులా సాగుతున్న అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల రంగ ప్రవేశంతో అక్రమాలకు పాల్పడిన వారు కట కటాల వెనక్కు వెళ్లారు. ఆలస్యంగా కళ్లు తెరచిన సంస్థ ఆదిలోనే సమస్యను పట్టించుకుని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. పర్యవేక్షణలోపంతో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అవినీతికి అదుపులేకుండా పోతోంది. నిత్యం అందుబాటులో ఉంటూ గిరిజనులకు నిత్యావసర సరుకులను క్రమం తప్పకుండా అందించాల్సిన అధికారులు, సిబ్బంది అందినకాడికి దోచుకుంటున్నారు. ఒక్క జీకేవీధి బ్రాంచి పరిధిలోనే రూ.71 లక్షల అవినీతి బట్టబయలు కావడం ఆ సంస్థ పనితీరుకు అద్దం పడుతోంది. ఈ బ్రాంచికి పూర్తిస్థాయి మేనేజర్ లేకపోవడంతో గోడౌన్ సూపరింటెండెంట్ కన్నయ్యకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన హయాంలో అటవీ ఉత్పత్తులకు సంబంధించి రూ.10.30 లక్షలు, ప్రభుత్వ పాఠశాలలు, డిపోలకు చేరవేయాల్సిన సరుకులకు సంబంధించి రూ.21 లక్ష లు, ీపీడీఎస్ బియ్యానికి సంబంధించి రూ.30 లక్షలు, కిరోసిన్, గోనె సంచులకు సంబంధించి రూ.9.71 లక్షలు దుర్వినియోగం అయ్యాయి. ఆలస్యంగా కళ్లు తెరిచిన ఆశాఖ ఉన్నతాధికారులు శాఖాపరమైన దర్యాప్తు చేపట్టి బాధ్యుడైన కన్నయ్యపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే జీకేవీధి పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేశారు. ఈమేరకు స్థానిక సీఐ రామకృష్ణారావు, ఎస్ఐ విజయకుమార్‌లు దర్యాప్తు చేపట్టారు. ఆరు నెలలుగా పరారీలో ఉన్న ఇన్చార్జి బ్రాంచి మేనేజర్ ఎం.కన్నయ్యతోపాటు చింతపల్లికి చెందిన ఆమూరి రాజుబాబు, బల్లంకి శ్రీనివాసరావు, రాజమండ్రికి చెందిన పట్టెం పరుశరాంలను శుక్రవారం అరెస్టుచేశారు. కన్నయ్య హయాం లో వరుస అక్రమాలు చోటుచేసుకున్నట్టు తమ విచారణలో తేలిందని పోలీసు అధికారులు తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించిన జీసీసీ నిధులు దుర్వినియోగానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేశామన్నారు. ఇది ఈ ప్రాంతంలో సంచలమైంది. ఇంతవరకూ ఏ జీసీసీ అధికారీ ఇలా అరెస్టు కాలేదు. -
‘ప్రాణాలతో చెలగాటం’పై విచారణ
కోల్‌సిటీ, న్యూస్‌లైన్ : గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఏరియా ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌ను ప్రయోగశాలగా మార్చిన సూపరింటెండెంట్ వైఖరిపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం సంచలం సృష్టించింది. ఉన్నతాధికారుల అనుమతి లే కుండా సూపరింటెండెంట్ హోదాలో అనస్తీషియా డాక్టర్ మోహన్‌రావు, ఓ మహిళతో నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్లు చేస్తున్న వైనాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఈనెల 18న ‘ప్రాణాలతో చెలగాటం’ శీర్షికన ప్రచురితమై న కథనానికి అధికారులు స్పందిం చారు. విచారణ చేపట్టిన డీసీహెచ్ఎస్ డాక్టర్ భోజా బుధవారం ‘న్యూస్‌లైన్’తో ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడారు. ఆపరేషన్ థియేటర్లోకి అనుమతి లేకుండా ఎవరు వెళ్లడానికి వీల్లేదన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్‌రావును వెంటనే బాధ్యతల నుంచి తొలగించినట్లు తెలిపారు. ఇక్కడే గైనకాలజిస్టుగా సేవలందిస్తున్న డాక్టర్ సూర్యశ్రీరావుకు సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. కాగా, అనస్థీషియాగా సేవలందించే డాక్టర్ మోహన్‌రావు ఆస్పత్రికి సంబంధం లేని మహిళతో ఏకంగా థియేటర్లో ఆపరేషన్లు చేయించడం, ప్రత్యేకంగా చూపించడంపై విచారణ చేపట్టినట్లు డీసీహెచ్ఎస్ వివరించారు. అక్రమంగా ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లోకి వచ్చిన సదరు మహిళ, ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలోని ఓపీ విభాగంలో, ఔట్సోర్సింగ్ ఉగ్యోగిగా పేషెంట్లకు చిట్టీలు రాస్తూ కొంతకాలం పని చేసినట్లు తెలిసింది. అసలు ఈ మహిళ ఎవరు? ఆస్పత్రి థియేటర్లోకి ఎలా వస్తోంది? తదితర వివరాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. -
ఏసీబీ వలలో అవినీతి జలగ
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: ఏసీబీ వల కు వైద్యారోగ్యశాఖకు చెందిన అవినీతి జలగ చిక్కింది. మూవ్మెంట్ ఆర్డర్ ఇచ్చేందుకు వైద్యుడి నుంచి రూ.9 వేలు లంచం తీసుకుంటూ నెల్లూరు డీఎం అండ్‌హెచ్‌ఓ కార్యాలయ సూపరింటెండెంట్ ఎస్. మీరావలి నగరంలో ని జెడ్పీ కాలనీలో తన నివాసంలో ఏసీ బీ అధికారులకు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘట నపై కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ జె.భాస్కర్‌రావు తెలిపారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు..డాక్టర్ సీహెచ్ నిరంజన్ గతంలో జగదేవిపేట పీహెచ్సీలో వైద్యునిగా పనిచేశారు. పీహెచ్సీలో ఫార్మసిస్ట్ సీహెచ్ హరిప్రసాద్ పెద్దఎత్తున మందుల దుర్వినియోగానికి పాల్పడటంతో ఈ ఏడాది జూన్ 6న అతనిపై డాక్టర్ నిరంజన్ నాటి ఇన్చార్జి డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ జి.సుధాకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్ఆర్హెచ్ఎం అధికారులు విచారణ నిర్వహించి మందుల దుర్వినియోగం వాస్తవమేనని నిర్ధారించారు. దీనిని జీర్ణించుకోలేని ఫార్మసిస్ట్ అదే పీహెచ్సీలో పని చేస్తున్న ఏఎన్ఎంలను డాక్టర్‌పైకి ఉసిగొలిపి తమను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేయించాడు. డాక్టర్ నిరంజన్ వ్యవహారశైలిపై ఏజేసీ పెంచలరెడ్డి విచారణ నిర్వహించారు. అనంతరం ఆయన్ను గండిపాళెం పీహెచ్‌సీకి బదిలీ చేశారు. ఆయన స్థానంలో మైపాడు పీహెచ్సీ వైద్యుడు వెంకటేశ్వర్లును ఇన్చార్జిగా నియమించారు. చేయని తప్పుకు తాను ఎందుకు వెళ్లాలని ఉన్నతాధికారులను నిరంజన్ ప్రశ్నించారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో అతను గత నెల 12న ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి యధాస్థానంలో కొనసాగేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలను పట్టించుకోని వైద్యాధికారులు గత నెల 15న స్పీకింగ్ ఆర్డర్‌ను డాక్టర్‌కు ఇచ్చారు. దీంతో తిరిగి ట్రిబ్యునల్‌ను డాక్టర్ నిరంజన్ ఆశ్రయించారు. వైద్యాధికారులపై ట్రిబ్యునల్ మండిపడుతూ నిరంజన్ను జగదేవిపేటలోనే కొనసాగించాలని ఆగస్టు 22న ఉత్తర్వులు జారీ చేసింది. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు మూవ్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉండగా వైద్యాధికారులు మాత్రం తాము చెప్పినట్టు గండిపాళేనికి వెళ్లాలని, లేదంటే ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తామంటూ బెదిరించారు. తనను వేధిస్తున్నారంటూ బాధితుడు కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఈ విషయం కలకలం రేపడంతో డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ జి.సుధాకర్ మూవ్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని కార్యాలయ సూపరింటెం డెంట్ ఎస్. మీరావలిని ఈ నెల 9న ఆదేశించారు. అప్పటి నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా బాధితుడికి మూవ్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. మీరావలి, డీఎంఅండ్‌హెచ్‌ఓ పరస్ప రం ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాల యాపన చేస్తూ వచ్చారు. విసిగివేసారిన బాధితుడు మీరావలిని సంప్రదించి ఎలాగైనా తన పనిచేసి పెట్టాలని అభ్యర్థించారు. రూ.10 వేలు ఇస్తే పని అవుతుందని మీరావలి చెప్పాడు. రూ.9 వేలకు ఒప్పందం కుదిరింది. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీ డీఎస్పీ జె. భాస్కర్‌రావును ఆశ్రయించారు. సోమవారం ఇంటికి వస్తే మూవ్మెంట్ ఆర్డర్ ఇస్తానని మీరావలి చెప్పడంతో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అతని ఇంటివద్ద నిరంజన్ పడిగాపులు కాశారు. అయితే అతను ఇంటికి రాలేదు. ఫోన్ చేయగా మంగళవారం ఇస్తానని చెప్పడంతో నిరంజన్ వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం బాధిత వైద్యుడు రూ.9 వేలు లంచం తాలూకు డబ్బు మీరావలికి ఇస్తుం డగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని రసాయన పరీక్షలు నిర్వహించారు. అప్పటికే మీరావలి మూవ్మెంట్ ఆర్డర్‌ను నిరంజన్ చేతి కి ఇచ్చారు. మీరావలి ఇంట్లో సోదా లు నిర్వహించి కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మీరావలిని తమ వెంట ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు చంద్రమౌళి, వెంకటేశ్వర్లు, కృపానందం, శ్రీనివాసరావు పాల్గొన్నారు. నాలా మరొకరు బాధపడకూడదనే.. వేధింపులు తాళలేకే ఏసీబీని ఆశ్రయించాను. నన్ను డీఎం అండ్‌హెచ్‌ఓ డాక్టర్ జి. సుధాకర్, మైపాడు వైద్యుడు డాక్టర్ వెంకటేశ్వర్లు, డీఎఅండ్‌హెచ్‌ఓ కార్యాలయ సూపరింటెండెంట్ ఎస్. మీరావలి తదితరులు చిత్రహింసలకు గురి చేశారు. ట్రిబ్యునల్ నాకు అనుకూలంగా తీర్పునిచ్చినా మూవ్మెంట్ ఆర్డర్ ఇవ్వకుండా తిప్పుకున్నారు. డీఎంఅండ్హెచ్ఓకు రూ.10 వేలు ఇచ్చా. మీరావలికి రూ.10 వేలు ఇవ్వడం ఇష్టంలేక ఏసీబీకి పట్టించా. నాలా ఇంకొకరు బాధపడకూడదనే ఇదంతా చేశా. డాక్టర్ సీహెచ్ నిరంజన్ -
‘ఉస్మానియా’ పదోన్నతుల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: సీనియారిటీని తోసిరాజని మరీ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా నియమించారంటూ చెలరేగిన వివాదానికి తెరపడింది. ఇటీవల ఇచ్చిన ఆ పదోన్నతుల్లో పలు మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా రాయలసీమ ప్రాంతానికి చెందిన శివరామిరెడ్డిని నియమించడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ఆ పోస్టుకు తగిన అర్హత ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన సువర్ణను నియమించకుండా.. తెలంగాణవారికి అన్యాయం చేశారంటూ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఆందోళన ప్రారంభించారు. దాంతో ఉస్మానియాలో పనులు స్తంభించిపోయాయి. దీనికి తక్షణమే పరిష్కారం చూపాలని వైద్య విద్య డెరైక్టర్ ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు. ఈ నేపథ్యంలో ఆ పదోన్నతుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. శివరామిరెడ్డిని అదే పోస్టు (ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్)లో నియమించింది. ఆ స్థానానికి పోటీ పడిన సువర్ణను ఉస్మానియా వైద్య కళాశాల సూపరింటెండెంట్‌గా, కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన పుట్టా శ్రీనివాస్‌ను వైద్య విద్య డెరైక్టర్ కార్యాలయంలో అదనపు సంచాలకుడిగా నియమించారు. అదనపు సంచాలకుడిగా ఉన్న వెంకటేష్‌ను వైద్య విద్యా సంచాలకుడు (అకడమిక్)గా నియమించారు. కాగా.. తక్షణమే ఈ ఉత్తర్వులను అమలు చేయాల్సిందిగా వైద్య విద్యా సంచాలకుడు శాంతారావును ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యమం జరుగుతున్న కారణంగానే ఈ మార్పులు చేసినట్టు సమాచారం. -
కొనసాగుతున్న ‘ఉస్మానియా’ రగడ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ నియామకంపై రగడ కొనసాగుతోంది. డీఎంఈ డాక్టర్ శాంతారావు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు సూపరింటెండెంట్‌గా డాక్టర్ శివరామిరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. సీనియారిటీ లిస్టులో ముందున్న నయాపూల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సువర్ణను కాదని, శివరామిరెడ్డిని నియమించడంపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ), ఉస్మానియా మెడికల్ జేఏసీ ప్రతినిధులు మండిపడ్డారు. మీకన్నా సీనియర్ అయిన డాక్టర్ సువర్ణ ఉండగా, మీరు ఈ పదవిలో ఎలా కొనసాగుతారంటూ శివరామిరెడ్డితో వాగ్వాదానికి దిగి, డాక్టర్ సువర్ణను సూపరింటెండెంట్ సీట్లో కూర్చోబెట్టారు. సోమవారం సాయంత్రం వరకు డాక్టర్ సువర్ణ సూపరింటెండెంట్ సీట్లోనే గడిపారు. మంగళవారం ఉదయం డాక్టర్ శివరామిరెడ్డి సూపరింటెండెంట్ సీట్లో ఆసీనులు కాగా, డాక్టర్ సువర్ణ ఆయన పక్కనే ఉన్న సీట్లో కూర్చున్నారు. సుమారు రెండు గంటలపాటు సూపరింటెండెంట్ చాంబర్లో ఇద్దరూ కూర్చోవడంతో కొంత గందరగోళం నెలకొంది. సిబ్బంది సైతం ఎవరు సూపరింటెండెంటో.. ఎవరి మాట వినాలో.. ఎవరి మాట వినకపోతే ఏమవుతుందోననే సందిగ్ధంలో పడిపోయారు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ సువర్ణ డీఎంఈ కార్యాలయానికి వెళ్లడంతో డాక్టర్ శివరామిరెడ్డి పాలనా వ్యవహారాలను నిర్వహించారు. ‘ఉస్మానియూ’ ఘటనలు ప్రభుత్వం దృష్టికి మంగళవారం ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ దంతవైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ల స్థానంలో తెలంగాణ ఉద్యమకారులు వేరొకరిని కూర్చోబెట్టిన సంఘటనలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వారు ఇచ్చిన నివేదిక ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. జరిగిన పరిణావూలపై నిర్ణయం తీసుకోవాలని, తావుు సీనియారిటీ ప్రాతిపదికనే పదోన్నతులు కల్పించామని అధికారులు తవు నివేదికలో తెలిపారు. ఢఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాల మేరకే తాను ఉస్మానియూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా నియమితులయ్యానని డాక్టర్ శివరామిరెడ్డి పేర్కొన్నారు. అల్వాల్ ఆస్పత్రికి ‘అనంత’ వైద్యుడా? రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రభుత్వాస్పత్రికి అనంతపురంకు చెందిన డాక్టర్‌ను నియమించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ డాక్టర్ల అసోసియేషన్ నాయకులు మంగళవారం అల్వాల్ ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. అల్వాల్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సోమశేఖర్ కర్నూలుకు బదిలీపై వెళ్లడంతో అనంతపురానికి చెందిన డాక్టర్ విష్ణువర్ధన్ సోమవారం అల్వాల్ ఆస్పత్రి ప్రధాన వైద్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న అసోసియేషన్ నాయకులు మంగళవారం ఆస్పత్రికి వచ్చారు. ఈ సమయంలో డాక్టర్ ఆస్పత్రికి రాలేదు. బదిలీని నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సుధాకర్, ప్రధాన కార్యదర్శి నాగార్జున, శామీర్‌పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ ప్రభుత్వాస్పత్రుల డాక్టర్లు, తదితరులు ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద బైఠాయించి నియామకాన్ని నిలిపివేయాలంటూ ఆందోళన నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కీలకదశలో ఉన్న సమయంలో సీమాంధ్రకు చెందిన వైద్యుడిని అల్వాల్‌లో ఎలా నియమిస్తారంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ విషయమై డాక్టర్ విష్ణువర్ధన్‌ను సంప్రదించగా... తన భార్య ఉస్మానియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నందున ఈ బదిలీ అవకాశం లభించిందని, తాను ఎలాంటి పొరపాటు చేయలేదని తెలిపారు. -
ఆస్పత్రికి దిక్కెవ్వరు?
కంఠేశ్వర్, న్యూస్‌లైన్ : జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ భీంసింగ్, ఆస్పత్రి ఆర్ఎంఓ రావూఫ్‌లు సెలవు బాట పడుతున్నారు. నెలరోజుల సెలవు మంజూరు చేయాలని కోరుతూ సూపరింటెం డెంట్ భీంసింగ్ మంగళవారం కలెక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకో గా ఆర్ఎంఓ బుధవారం దరఖాస్తు సమర్పించనున్నారు. ఇటీవల ఆస్పత్రిని తనిఖీ చేసిన ఉన్నతాధికారి ఒకరు ఆస్పత్రిలో లోపాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో మనస్తాపం చెం దిన సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలు సెలవులో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వైద్యసేవలపై ప్రభావం.. జిల్లా ఆస్పత్రిలో వైద్యాధికారులు లేకపోతే వైద్యసేవలు గాడితప్పే ప్రమాదం ఉంది. ఇటీవలి కాలంలో ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. రోగులకు సరైన వైద్య సేవలందించడంలో అధికారులు కీలకపాత్ర పోషిస్తారు. నిరంతరం సిబ్బందిని అప్రమత్తం చేస్తూ పనులు చేయించడం వీరి బాధ్యత. అయితే కీలక అధికారులు సెలవుపై వెళితే ఆస్పత్రిలో సిబ్బంది ఇష్టారాజ్యం నెలకొంటుందని, సేవలు గాడి తప్పుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కింది స్థాయి వైద్యులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినా ఫలితం ఉండదని పేర్కొంటున్నారు. అవసరం నిమిత్తమే... -భీంసింగ్, సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రి వ్యక్తిగత పనుల నిమిత్తం ఎప్పటినుంచో సెలవుకోసం ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు అత్యవసరమైంది. అందుకే సెలవుకోసం దరఖాస్తు చేసుకున్నాను. -
సేవా పన్ను ఎగవేతలపై కేంద్రం కొర డా
న్యూఢిల్లీ/కోల్‌కతా: సేవా పన్ను ఎగవేతదారులపై కేంద్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపిస్తోంది. కోల్‌కతాకు చెందిన ఒక కొరియర్ కంపెనీ యజమానిని దాదాపు రూ.70 లక్షల పన్ను ఎగవేశారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఇటువంటి కేసుల్లో కఠిన చర్యలకు అధికారాలు ఇస్తూ చట్టాల్లో సవరణ తీసుకొచ్చిన తర్వాత దేశంలో జరిగిన తొలి అరెస్ట్ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం పలు రకాల సేవలపై 12.36 శాతం సేవా పన్ను అమలవుతోంది. కేసు పూర్వాపరాలివీ...: బ్లూబర్డ్ పేరుతో కోల్‌కతాలో కొరియర్ ఏజెన్సీని నిర్వహిస్తున్న సుదీప్ దాస్.. పలు కంపెనీల నుంచి రూ.67 లక్షల మేరకు పన్ను వసూలు చేశారు. అయితే, దీన్ని ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో గతవారంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు అధికారిక వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఈ మేరకు కోల్‌కతాలోని సేవా పన్నుల కమిషనర్ కేకే జైస్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న దాస్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. సేవా పన్ను ఎగవేతలకు అడ్డుకట్టవేయడం కోసం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ)లో నిబంధనల మార్పులకు ఆర్థిక మంత్రి పి. చిదంబరం చర్యలు తీసుకోవడం తెలిసిందే. ఈ ఏడాది ఫైనాన్స్బిల్లులో ఈ మేరకు సెక్షన్ 91లో కొత్త నిబంధనను చేర్చి ఆమోదింపజేశారు. దీనిప్రకారం సెంట్రల్ ఎక్సైజ్ పన్నుల విభాగానికి చెందిన అధికారులకు(సూపరింటెండెంట్ స్థాయికి తక్కువ కాకూడదు) సేవా పన్ను ఎగవేతదారుడిని అరెస్ట్ చేసే అధికారం లభించింది. కస్టమ్స్, ఎక్సైజ్ పన్నుల ఎగవేతలకు ఇప్పటికే సీఆర్పీసీ ప్రకారం ఈ కఠిన చర్యలు అమలవుతున్నాయి. ఇప్పుడు సేవా పన్నులకూ ఇది వర్తిస్తుంది. రూ.50 లక్షలు అంతకుమించి సేవాపన్నును ఎగవేస్తే అది శిక్షార్హమైన నేరం కిందికి వస్తుంది. ఈ కేసుల్లో ఎగవేతదారుడికి ఏడేళ్లదాకా జైలు శిక్ష పడొచ్చు.