ఏసీబీ వలలో అవినీతి జలగ | ACB arrested corrupted officer | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో అవినీతి జలగ

Published Wed, Sep 18 2013 2:12 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB arrested corrupted officer


 నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: ఏసీబీ వల కు వైద్యారోగ్యశాఖకు చెందిన అవినీతి జలగ చిక్కింది. మూవ్‌మెంట్ ఆర్డర్ ఇచ్చేందుకు వైద్యుడి నుంచి రూ.9 వేలు లంచం తీసుకుంటూ నెల్లూరు డీఎం అండ్‌హెచ్‌ఓ కార్యాలయ సూపరింటెండెంట్ ఎస్. మీరావలి నగరంలో ని జెడ్పీ కాలనీలో తన నివాసంలో ఏసీ బీ అధికారులకు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘట నపై కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ జె.భాస్కర్‌రావు తెలిపారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు..డాక్టర్ సీహెచ్ నిరంజన్ గతంలో జగదేవిపేట పీహెచ్‌సీలో వైద్యునిగా పనిచేశారు. పీహెచ్‌సీలో ఫార్మసిస్ట్ సీహెచ్ హరిప్రసాద్ పెద్దఎత్తున మందుల దుర్వినియోగానికి పాల్పడటంతో ఈ ఏడాది జూన్ 6న అతనిపై డాక్టర్ నిరంజన్ నాటి ఇన్‌చార్జి డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ జి.సుధాకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం అధికారులు విచారణ నిర్వహించి మందుల దుర్వినియోగం వాస్తవమేనని నిర్ధారించారు. దీనిని జీర్ణించుకోలేని ఫార్మసిస్ట్ అదే పీహెచ్‌సీలో పని చేస్తున్న ఏఎన్‌ఎంలను డాక్టర్‌పైకి ఉసిగొలిపి తమను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేయించాడు.
 
  డాక్టర్ నిరంజన్ వ్యవహారశైలిపై ఏజేసీ పెంచలరెడ్డి విచారణ నిర్వహించారు. అనంతరం ఆయన్ను గండిపాళెం పీహెచ్‌సీకి బదిలీ చేశారు. ఆయన స్థానంలో మైపాడు పీహెచ్‌సీ వైద్యుడు వెంకటేశ్వర్లును ఇన్‌చార్జిగా నియమించారు. చేయని తప్పుకు తాను ఎందుకు వెళ్లాలని ఉన్నతాధికారులను నిరంజన్ ప్రశ్నించారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో అతను గత నెల 12న ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి యధాస్థానంలో కొనసాగేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలను పట్టించుకోని వైద్యాధికారులు గత నెల 15న స్పీకింగ్ ఆర్డర్‌ను డాక్టర్‌కు ఇచ్చారు. దీంతో తిరిగి ట్రిబ్యునల్‌ను డాక్టర్ నిరంజన్ ఆశ్రయించారు. వైద్యాధికారులపై ట్రిబ్యునల్ మండిపడుతూ నిరంజన్‌ను జగదేవిపేటలోనే కొనసాగించాలని ఆగస్టు 22న ఉత్తర్వులు జారీ చేసింది. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు మూవ్‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉండగా వైద్యాధికారులు మాత్రం తాము చెప్పినట్టు గండిపాళేనికి వెళ్లాలని, లేదంటే ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తామంటూ బెదిరించారు. తనను వేధిస్తున్నారంటూ బాధితుడు  కలెక్టర్‌ను ఆశ్రయించారు.
 
  ఈ విషయం కలకలం రేపడంతో డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ జి.సుధాకర్ మూవ్‌మెంట్ ఆర్డర్ ఇవ్వాలని కార్యాలయ సూపరింటెం డెంట్ ఎస్. మీరావలిని ఈ నెల 9న  ఆదేశించారు. అప్పటి నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా బాధితుడికి మూవ్‌మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. మీరావలి, డీఎంఅండ్‌హెచ్‌ఓ పరస్ప రం ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాల యాపన చేస్తూ వచ్చారు. విసిగివేసారిన బాధితుడు మీరావలిని సంప్రదించి ఎలాగైనా తన పనిచేసి పెట్టాలని అభ్యర్థించారు. రూ.10 వేలు ఇస్తే పని అవుతుందని మీరావలి చెప్పాడు. రూ.9 వేలకు ఒప్పందం కుదిరింది. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీ డీఎస్పీ జె. భాస్కర్‌రావును ఆశ్రయించారు.
 
  సోమవారం ఇంటికి వస్తే మూవ్‌మెంట్ ఆర్డర్ ఇస్తానని మీరావలి చెప్పడంతో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అతని ఇంటివద్ద నిరంజన్ పడిగాపులు కాశారు. అయితే అతను ఇంటికి రాలేదు. ఫోన్ చేయగా మంగళవారం ఇస్తానని చెప్పడంతో నిరంజన్ వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం బాధిత వైద్యుడు రూ.9 వేలు లంచం తాలూకు డబ్బు మీరావలికి ఇస్తుం డగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని రసాయన పరీక్షలు నిర్వహించారు. అప్పటికే మీరావలి మూవ్‌మెంట్ ఆర్డర్‌ను నిరంజన్ చేతి కి ఇచ్చారు. మీరావలి ఇంట్లో సోదా లు నిర్వహించి కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మీరావలిని తమ వెంట ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు చంద్రమౌళి, వెంకటేశ్వర్లు, కృపానందం, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 
 నాలా మరొకరు బాధపడకూడదనే..
 వేధింపులు తాళలేకే ఏసీబీని ఆశ్రయించాను. నన్ను డీఎం అండ్‌హెచ్‌ఓ డాక్టర్ జి. సుధాకర్, మైపాడు వైద్యుడు డాక్టర్ వెంకటేశ్వర్లు, డీఎఅండ్‌హెచ్‌ఓ కార్యాలయ సూపరింటెండెంట్ ఎస్. మీరావలి తదితరులు చిత్రహింసలకు గురి చేశారు. ట్రిబ్యునల్ నాకు అనుకూలంగా తీర్పునిచ్చినా మూవ్‌మెంట్ ఆర్డర్ ఇవ్వకుండా తిప్పుకున్నారు. డీఎంఅండ్‌హెచ్‌ఓకు రూ.10 వేలు ఇచ్చా. మీరావలికి రూ.10 వేలు ఇవ్వడం ఇష్టంలేక ఏసీబీకి పట్టించా. నాలా ఇంకొకరు బాధపడకూడదనే ఇదంతా చేశా.
 డాక్టర్ సీహెచ్ నిరంజన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement