
గుట్ట సూపరింటెండెంట్‌గా వినోద్‌రెడ్డి
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మండల పరిషత్ సూపరింటెడెంట్‌గా వినోద్‌రెడ్డి బాధ్యతలను బుధవారం స్వీకరించారు. గతంలో వినోద్‌రెడ్డి సంస్థాన్ నారాయణపురం ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి పదోన్నతిపై యాదగిరిగుట్టకు వచ్చారు. ఇటీవల స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన విజయ్‌భాస్కర్‌రెడ్డి ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన వినోద్‌రెడ్డిని ఎంపీడీఓ సాంబశివరావు అభినందించారు.