‘ప్రీమియర్’ ఎదుట కార్మికుల ధర్నా
యాదగిరిగుట్ట : మండలంలోని రామాజీపేట పరిధిలో ఉన్న ప్రీమియర్ వైర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పరిశ్రమ యాజమాన్యం ప్రాంతీయ విభేదాలతో కార్మికులను వేధిస్తున్నారని హెచ్ఎంఎస్, సీఐటీయూ నాయకులు అన్నారు. దీనిని నిరసిస్తూ బుధవారం పరిశ్రమ ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న మేనేజర్లను పరిశ్రమ నుంచి తొలగించి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. ఈ ధర్నాలో హెచ్ఎంఎస్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శిలు వెంకటేష్, మహేష్, కార్మికులు మల్లేష్, భాస్కర్, స్వామి, వెంకటేష్, కష్ణ, గణేష్, దశరథ, సత్తయ్య, ప్రసాద్, నర్సింహులు, కుమార్, సంజీవ, శ్రీనివాస్, శ్రీశైలం, రమేష్ తదితరులున్నారు.