
ప్రత్యేక పర్యాటక పాలసీలో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం కొత్త పాలసీని తెచ్చిన ప్రభుత్వం.. కొన్ని కీలక విధానాలను అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ టూరిజం ఏరియా (ఎస్‌టీఏ)లను గుర్తించి వాటి ప్రత్యేకతల ఆధారంగా ఆయా ప్రాంతాలకు పర్యాటకులు వచ్చేలా ప్రత్యేక పర్యాటక షెడ్యూల్ రూపొందించనున్నట్టు పేర్కొంది. తొలిదశలో అలాంటి 27 కేంద్రాలను గుర్తించారు. వీటిల్లో ఆధ్యాత్మిక, వారసత్వ, ఎకో–వెల్‌నెస్, హస్తకళలు, జలపాతాలు, బుద్ధిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి.. అదే సమయంలో అవసరమైన మౌలిక సదుపాయాలనూ నిర్ధారించింది.
స్పెషల్ టూరిజం ఏరియాలు..
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట దేవాలయం, భువనగిరి కోట, బస్వాపూర్, కొలనుపాక, మహదేవపురం.
భద్రాచలం: భద్రచాలం ఆలయం, పర్ణశాల, కిన్నెరసాని డ్యాం, అభయారణ్యం, కనకగిరి హిల్స్.
బాసర: జ్ఞాన సరస్వతి దేవాలయం, వ్యాస మహర్షి దేవాలయం, పరిసర ప్రాంతాలు
వేములవాడ: వేములవాడ దేవాలయం, కొండగట్టు దేవాలయం, కోటిలింగాల, ధర్మపురి
అలంపూర్– సోమశిల: అలంపూర్ శక్తిపీఠం, బీచుపల్లి, జటప్రోలు, కొల్లాపూర్, సోమశిల
రామప్ప: రామప్ప దేవాలయం, చెరువు, లక్నవరం సరస్సు, మేడారం, బొగత జలపాతం, ఏటూరునాగారం అభయారణ్యం, పాండవుల గుట్ట, ఘన్‌పూర్ దేవాలయ సమూహం.
కాళేశ్వరం: కాళేశ్వరం దేవాలయం, గాంధారి కోట, శివరామ్ అభయారణ్యం
మెదక్: మెదక్ చర్చి, కోట, పోచారం రిజర్వాయర్, వైల్డ్‌లైఫ్, ఏడుపాయల దేవాలయం, నర్సాపూర్ అటవీ ప్రాంతం, మంజీరా అభయారణ్యం, సింగూరు డ్యాం.
వరంగల్: వరంగల్ కోట, పరిసరాల్లోని దేవాలయాలు, పాకాల సరస్సు, గూడూరు అభయారణ్యం.
నల్లగొండ: పానగల్ దేవాలయ సమూహం, దేవరకొండ కోట
పాలకుర్తి: పాలకుర్తి దేవాలయం, బమ్మెర పోతన గ్రామం, పెంబర్తి హస్తకళలు, చేర్యాల పెయింటింగ్స్, వల్మిడి, జఫర్‌గడ్
కరీంనగర్: ఎలగందుల కోట, ఫిలిగ్రి, మంథని దేవాలయాలు, రామగిరి కోట.
చార్మినార్ క్లస్టర్: చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్, సాలార్‌జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్
హైదరాబాద్ – రంగారెడ్డి – మేడ్చల్ క్లస్టర్: గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ సమాధులు, తారామతి బారాదరి, కీసరగుట్ట, నెట్ జీరో సిటీ–ఎకోపార్కు, షామీర్‌పేట సరస్సు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు
సిద్దిపేట: రంగనాయకసాగర్, గొల్లభామ హస్తకళలు, వర్గల్ రాక్ ఆర్ట్స్, అన్నపూర్ణ రిజర్వాయర్
నల్లమల సర్క్యూట్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, ఫర్హాబాద్, సలేశ్వరం, మల్లెల తీర్థం, మన్ననూరు, ఉమామహేశ్వరం, మాధవస్వామి ఆలయం, బేడి ఆంజనేయ ఆలయం.
శ్రీరాంసాగర్: శ్రీరాంసాగర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ప్రాంతం.
జన్నారం: కడెం, కవ్వాల్ టైగర్ రిజర్వ్, సప్తగుండాల జలపాతం.
ట్రైబల్ క్లస్టర్: జోడేఘాట్, ఉట్నూరు, కాగజ్‌నగర్ టైగర్ రిజర్వ్.
నాగార్జునసాగర్: బుద్ధిస్ట్ హెరిటేజ్, బ్యాక్‌వాటర్ ప్రాంతం.
వికారాబాద్: వికారాబాద్, అనంతగిరి హిల్స్, అనంత పద్మనాభస్వామి దేవాలయం, కోట్‌పల్లి, పరిగి దామగుండం.
మహబూబ్‌నగర్: కోయిల్‌సాగర్, పిల్లలమర్రి, మన్యంకొండ.
పోచంపల్లి, నారాయణపేట, గద్వాల్ కొత్తకోట వస్త్ర పరిశ్రమ.
కోరటికల్, కుంతాల, పొచ్చెర, గాయత్రి జలపాతాలు.
కొండాపూర్, ధూళికట్ట, కోరుకొండ, నేలకొండపల్లి, బుద్ధవనం, ఫణిగిరి, గాజులబండ బౌద్ధక్షేత్రాలు.
టూరిజం మౌలిక వసతులు ఇలా..
→ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేవలం ఒకటి–రెండు గంటల్లో చేరుకునేలా ప్రత్యేక పర్యాటక గమ్యాలను ఏర్పాటు చేయాలి.
→ బిజినెస్ టూరిజం అభివృద్ధి చెందాలంటే.. రీజినల్ రింగురోడ్డు చుట్టూ డ్రైపోర్టులు ఏర్పాటు చేయాలి. బందరు పోర్టుతో అనుసంధానించే ప్రత్యేక గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌తో వీటిని అనుసంధానించాలి. తద్వారా కావాల్సిన సరుకును సముద్రయానం ద్వారా సులభంగా తరలించే ఏర్పాటు ఉందన్న నమ్మకం పెట్టుబడిదారుల్లో కల్పించాలి.
→ రీజినల్ రింగురోడ్డు చుట్టూ ప్రపంచస్థాయి షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలి.
→ ఔటర్ రింగురోడ్డు చుట్టూ మెగా రిటైల్‌మాల్స్‌ను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలి.
→ గోదావరి, కృష్ణా నదుల్లో పర్యాటక పురోగతికి ఉపయోగపడే ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి. రివర్ ఫెస్టివల్స్, బోట్ ఫెస్టివల్, హౌస్‌బోట్స్, వాటర్ స్పోర్ట్స్, జెట్టీలు, లాంచ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి.
→ పట్టణాల్లో జలాశయాల వద్ద పర్యాటక విడిది కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
→ హెలిప్యాడ్లను అందుబాటులోకి తెచ్చి ప్రధాన పర్యాటక ప్రాంతాలను వాయు మార్గాలతో అనుసంధానించాలి.
→ గోల్ఫ్ టూరిజంను విస్తృతం చేయాలి.
→ బుద్ధవనం, నాగార్జున సాగర్‌లను ఆసరా చేసుకుని వెల్‌నెస్, మెడిటేషన్ కేంద్రాల ఏర్పాటుతో బౌద్ధ పర్యాటకులను ఆకర్షించే చర్యలు చేపట్టాలి.
→ కార్పొరేట్ సంస్థలు కొన్ని పర్యాటక ప్రాంతాలను దత్తత తీసుకోవటం ద్వారా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరిగేలా చూడాలి.
→ పర్యాటక ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి, పార్కింగ్ ఏరియా, రెస్టారెంట్లు, కేఫ్‌లు, కియోస్క్‌లు, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు, ప్రాథమిక చికిత్స కేంద్రాలు, వేసైడ్ ఎమినిటీస్ ఉండాలి.
→దివ్యాంగులకు అనుకూల ఏర్పాట్లు ఉండాలి.
→స్పెషల్ టూరిజం ఏరియా(ఎస్‌టీఏ)ల పరిధిలో కనీసం 5 వేల గదులు అందుబాటులో ఉండాలి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కనీసం 10 వేల గదులు పర్యాటకులకు అందుబాటులో ఉండాలి.
పెట్టుబడులను బట్టి ప్రాజెక్టుల కేటగిరీ ఇలా..
ప్రత్యేక ప్రాజెక్టులు: రూ.500 కోట్లు అంతకంటే ఎక్కువ పెట్టుబడి, 2 వేల మంది కంటే ఎక్కువ మందికి ప్రత్యక్ష ఉపాధి
మెగా ప్రాజెక్టులు: రూ.100 కోట్లు– రూ.500 కోట్లు మధ్య పెట్టుబడి, 500 నుంచి రెండు వేల మంది వరకు ప్రత్యక్ష ఉపాధి
పెద్ద ప్రాజెక్టులు: రూ.50 కోట్లు– రూ.100 కోట్లు మధ్య పెట్టుబడి
మధ్యస్థ ప్రాజెక్టులు: రూ.10 కోట్లు– రూ.50 కోట్ల మధ్య పెట్టుబడి
సూక్ష్మ,చిన్న ప్రాజెక్టులు: రూ.10 కోట్ల వరకు పెట్టుబడి
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్: హైదరాబాద్ నగరం–ఔటర్ రింగురోడ్డు మధ్య పరిధి
తెలంగాణ సెమీ అర్బన్ రీజియన్: ఔటర్ రింగురోడ్డు–రీజినల్ రింగురోడ్డు మధ్య ప్రాంతం
గ్రామీణ తెలంగాణ రీజియన్: ఆర్‌ఆర్‌ఆర్ వెలుపలి ప్రాంతం
Comments
Please login to add a commentAdd a comment