Medak Church
-
వందేళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చ్
-
మెదక్ సీఎస్ఐ చర్చిలో గవర్నర్ ప్రార్థనలు
-
వేలాదిమందికి పట్టెడన్నం పెట్టిన ‘కరుణామయుని కోవెల’కు వందేళ్లు (ఫోటోలు)
-
కరుణామయుని కోవెలకు వందేళ్ల ఉత్సవాలు
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న మెదక్ చర్చి ఆసియాలో రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందింది. చారిత్రాత్మక వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ కట్టడం నిర్మాణం జరిగి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ విశేషాలు...అది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం... తినడానికి తిండిలేక... చేద్దామంటే పని లేక ప్రజలు ఆకలితో నకనకలాడి అలమటిస్తున్న రోజులు. మరో బాధాకరమైన విషయం... అంటురోగాలతో జనం పిట్టల్లా నేలరాలి చనిపోతున్న దుర్భరమైన పరిస్థితులు అవి. పట్టెడన్నం దొరికితేనే పంచభక్ష్యపరమాన్నాలుగా భావించి పరమానంద పడుతున్న రోజులు. సరిగ్గా ఇటువంటì దుర్భర పరిస్థితులలో దేశంకాని దేశం నుండి ఖండంతరాలు దాటి సాక్షాత్తూ పరలోకం నుంచి ప్రభువు పంపిన దేవదూతలా వచ్చాడు చార్లెస్ వాకర్ పాస్నెట్. ఇంగ్లాండ్ దేశస్థుడైన ఆయన ముందుగా సికింద్రాబాద్‌లోని అప్పటి మిలటరి(ఆర్మీ) సేనకు నాయకుడిగా వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటికే అమాయక ప్రజలనేకులు గత్తర వ్యాధితో మూకుమ్మడిగా చనిపోతున్నారు. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంది. ఆకలి తీర్చిన ఆలయం..!ఆకలితో ఎవరూ చనిపోకూడదని భావించిన చార్లెస్ వాకర్ పాస్నెట్ ఈ ప్రాంతంలో చర్చి నిర్మాణం తలపెట్టాడు. చర్చ్ నిర్మాణం కోసం దాదాపు 200 రకాల నమూనాలను తయారు చేశారట. వాటిలో ఏది ఉత్తమమైనదో తెలియక ఆందోళన చెందుతూ వాటన్నింటిని ముందు పెట్టుకుని మోకరిల్లి ‘పరలోకదేవా ఇందులో ఏ నమూనా ప్రకారం నిర్మించాలో దారిచూపు’ అంటూ ప్రార్థన చేయగా ఉన్నటుండి పెద్ద గాలి వచ్చి అందులోని 199 నమూనా కాగితాలు కొట్టుకుపోయి ఒకే ఒక్క నమూనా మిగిలిందట. అదే దైవ నిర్ణయంగా భావించి దాని ప్రకారం నిర్మించబడిందే ప్రస్తుత చర్చి అని పెద్దలు చెబుతున్నారు. నిర్మాణానికి తన వద్ద ఉన్న డబ్బు సరిపోక పోవడంతో స్వదేశంలో భిక్షమెత్తి మరీ నిర్మాణాన్ని పూర్తి చేశారు వాకర్.ఈ చర్చి వల్లే ‘మెదక్’కు ఆ పేరువేలాది మంది కూలీలతో పది సంవత్సరాలపాటు కొనసాగిన నిర్మాణం వల్ల కాలే కడుపులకు పట్టెడు మెతుకులు దొరికేవట. అప్పట్లో ఈ ప్రాంతానికి గుల్షనాబాద్ అని పేరు. వేలాది జనం చర్చి నిర్మాణంలో భాగస్వాములు కావటం కోసం తండోపతండాలుగా తరలి వెళ్లేవారట. వారిని చూసి ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే ‘మెతుకు’ కోసం పనికి వెళ్తున్నామంటూ చెప్పేవారట. దీంతో ఈ ప్రాంతం గుల్షానాబాద్ నుంచి మెతుకు సీమగా పేరుగాంచింది. అది కాస్తా రానురాను మెదక్‌గా రూపాంతరం చెందింది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఠీవిగా కనిపించే మెదక్ చర్చిని భారతీయ, విదేశీ కళానైపుణ్యాల మేళవింపుతో నిర్మించారు. రెండంతస్తుల్లో నిర్మించిన ఈ కట్టడం, శిఖరం.. వందేళ్లు పూర్తయినా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు భారతీయ పురాతన పద్ధతులను అనుసరించారు. చర్చి లోపల ప్రతిధ్వనులు వినిపించని విధంగా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు.ప్రశాంతతకు, పవిత్రతకు నిలయమైన ఈ చర్చికి ఇంకా అనేక ప్రత్యేకతలున్నాయి. చర్చి నిర్మాణానికి రాతి, డంగుసున్నాన్ని మాత్రమే వాడారు. పిల్లర్లు, బీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమైనప్రార్థనా మందిరాన్ని, శిఖరాన్ని నిర్మించడం నాటి పనితనానికి అద్దం పడుతోంది. 200 అడుగుల ΄÷డవుతో సువిశాలమైన చర్చి చూపరులను కట్టిపడేస్తుంది.ఈ చర్చి నిర్మాణం కోసం ఆరో నిజాం 1000 ఎకరాల భూమిని కేటాయించారు. సుమారు 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కొంతకాలం కిందట 2 కోట్లతో మరమ్మతులు చేశారు. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంటి పర్వదినాల్లో ఈ చర్చిని సందర్శించేందుకు విదేశీయులు కూడా వస్తుంటారు. సందర్శకుల్లో క్రైస్తవులే కాకుండా ఇతర మతస్థులు కూడా ఉంటారు. ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆసియా ఖండంలోనే అద్భుతంగా నిర్మించిన ఈ చర్చి నిర్మాణం జరిగి ఈ డిశంబర్ 25 నాటికి 100 సంవత్సరాలు పూర్తి కానుంది. 25న క్రిస్మస్ కావడం వల్ల ఆ రోజున భక్తులప్రార్థనలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈనెల 23న శతజయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు చర్చిని ముస్తాబు చేస్తున్నారు. 23న పదిహేను మంది బిషప్‌లతో ఉదయం నుంచే ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. ఇందులో భాగంగా మెదక్ పరిధిలోని ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో పలు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల కోసం చిత్రలేఖనం, నృత్యం తదితర పోటీలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారు. అలాగే చర్చి నిర్మాణదాత చార్లెస్ వాకర్ పాస్నెట్ రక్త సంబంధీకులు సైతం హాజరు అవుతారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కట్టడాన్ని మూడు గవాక్షాలు, పలు రంగుటద్దాలతో నిర్మింపజేశారు. తూర్పున ఏసుక్రీస్తు జన్మవృత్తాంతం, పడమర క్రీస్తును శిలువ వేసిన దృశ్యం, ఉత్తరాన క్రీస్తు పునరుత్థానుడై నిలిచిన దృశ్యాలు కనిపిస్తాయి. వీటిని తయారు చేసిన కళాకారులు ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఫ్రాంకో ఓ, సాలిస్బర్లు. అంతే కాకుండా ఇవి సూర్యరశ్మివెలుతురులో (పగలు) మాత్రమే కనిపిస్తాయి. సూర్య అస్తమయం అయిందంటే కనిపించవు. ఈ నిర్మాణం 1914 నుండి 1924 డిశంబర్ వరకు 10 ఏళ్లపాటు జరుగగా డిశంబర్ 25న క్రిస్మస్ పర్వదినం రోజున ఆరంభించారు. ఈ చర్చిలో ఒకేసారి 5 నుంచి 6 వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు.–సీహెచ్. నీలయ్యసాక్షి, మెదక్ -
ముస్తాబైన మెదక్ చర్చి
-
క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలకు మెదక్ చర్చ్ సిద్ధం
-
మెదక్‌లో కేసీఆర్ పర్యటన.. ఎస్పీ ఆఫీస్ ప్రారంభం
►మెదక్ జిల్లాలో ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంబించిన సీఎం కేసీఆర్ ►63 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయం ►జీ ప్లస్ 3 పద్దతిలో 38.50 కోట్లు వ్యయంతో నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయం ►ఎస్పీ కార్యాలయం ఆవరణలోనే పరేడ్ గ్రౌండ్...పక్కనే పోలీస్ క్వార్టర్స్ ►జిల్లాలో అత్యాధునిక హంగులతో నిర్మించిన BRS పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, హోం మంత్రి మొహమ్మద్ అలీ చేతులమీదుగా బుధవారం మధ్యాహ్నాం ప్రారంభించారు. ►ఎకరా స్థలంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించిన పార్టీ కార్యాలయం.. సభలు, సమావేశాలకు వేదిక కానుంది. ►కార్యాలయంలో మీటింగ్ పెట్టుకోవడానికి అనువుగా ప్రత్యేకంగా పెద్ద హాల్ నిర్మాణం చేపట్టారు. ఇక మెదక్ పర్యటనలో భాగంగా.. జిల్లా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను సీఎం తన చేతులతో ప్రారంభిస్తారు. దివ్యాంగులకు రూ. 3116 నుంచి రూ. 4116 కు పెంచిన పింఛన్‌ను, టెకేదార్ బీడీ కులవృత్తుల కార్మికులకు పింఛన్ పంపిణీ చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లను మంత్రి హరీశ్ పర్యవేక్షించారు. స్వయంగా సీఎం ప్రారంభోత్సవానికి వస్తుండటంతో జిల్లా పోలీసు కార్యాలయ సముదాయం విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. కలెక్టరేట్ భవనం, లోపలి చాంబర్లను రంగు రంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు సిబ్బంది. ఇది కూడా చదవండి: గల్లంతైన ఎమ్మెల్యే ఆశలు.. హెల్త్ డైరెక్టర్ అడుగులు ఎటువైపు? -
మెతుకు సీమలో ప్రధాన పర్యాటకుల ఆకర్షణగా మెదక్ చర్చి
మెదక్ ఒకప్పటి మెతుకు సీమలో అడుగు పెట్టగానే అల్లంత దూరం నుంచి మనకు స్వాగతం చెప్పేది. అక్కడి కొండ పై నున్న కాకతీయుల కాలం నాటి మెదక్ కోట. అంతే ప్రాధాన్యత గలది, మెదక్ పట్టణానికే ఒక మైలురాయి లాంటిది, ఎంతో మంది పర్యాటకులను ఆకర్షించేది. ఆసియాలోనే అతిపెద్ద చర్చులలో ఒక్కటైనది 'మెదక్ చర్చి'. బ్రిటిష్ వారి పాలనా కాలంలో తిరుమలగిరి లోనున్న వారి సైనికుల కోసం 1895 లో వచ్చిన రెవరెండ్ చార్లెస్ పోస్నెట్ అనే క్రైస్తవ మత గురువు, హైదరాబాద్‌కు వంద కి.మీ దూరంలోనున్న మెతుకు సీమ కరువు కాటకాలతో అల్లాడుతుందని తెలుసుకొని అక్కడికి గుర్రం మీద ఒక రోజు ప్రయాణం చేసి వెళ్ళాడట. కరువు పీడితులను ఆదుకోడానికి 'ఫ్రీ కిచెన్' అన్నదానాల కన్నా వారికి ఉపాధి నిచ్చే పని కల్పించడం ఉత్తమమని ఆలోచించాడు. అందుకోసం 1914 లో ఘుస్నాబాద్ ప్రాంతంలోని విశాల స్థలంలో ప్రస్తుత చర్చి నిర్మాణాన్ని ప్రారంభించగా అది పది సంవత్సరాలు కొనసాగిందట. దీని వాస్తు శిల్పి థామస్ ఎడ్వార్డ్ హార్దింగ్ క్యాతెడ్రాల్. ముప్పై మీటర్లు వెడల్పు, అరవై మీటర్లు పొడువు ఈ నిర్మాణం దాదాపు ఐదు వేల మందికి సరిపడే ప్రార్థనాలయం. దీనికి కావలసిన మొజాయక్ టైల్స్‌ను ఆ రోజుల్లోనే బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకున్నారట. వాటిని పరిచే ఇటాలియన్ మేస్త్రీలను బొంబాయి నుంచి పిలిపించారట. బోలు స్పాంజ్‌తో పై కప్పువేసి సౌండ్ ప్రూఫ్‌గా మార్చారట. క్రీస్తు జీవితంలోని క్రీస్తు జననం, శిలువ వేయడం, ఆరోహణ వంటి విభిన్న దృశ్యాలున్న స్టాయిన్ గ్లాస్ కిటికీలు ఇందులో ప్రత్యేకమైనవి. ఈ చర్చి 'బెల్ టవర్' మరీ ప్రత్యేకమైంది. దీని ఎత్తు 53 మీటర్లు అంటే చార్మినార్ కన్నా కూడా ఎత్తయిందన్న మాట. హైదరాబాద్ నగరానికే మకుటాయమానమైన చార్మినార్ కన్నా కూడా మించిన ఎత్తులో ఈ బెల్ టవర్‌ను నిర్మించడం ఆనాటి నిజాంగారికి నచ్చలేదంటారు. ఏదేమైనా 1924 నాటికీ అన్ని హంగులతో సిద్దమైన ఈ చర్చి క్రైస్తవ భక్తులనే కాదు దేశ విదేశ పర్యాటకులను కూడా ఆకర్శించడం సంతోషకరం. వేముల ప్రభాకర్, అమెరికా డల్లాస్ -
మెదక్ చర్చి బిషప్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షి, మెదక్: సీఎస్ఐ మెదక్ డయాసిస్ బిషప్ రెవ ఎ.సి.సాల్మన్‌రాజ్‌ను సస్పెండ్ చేస్తూ సీఎస్ఐ చెన్నై సినాడ్ మాడరేటర్ ధర్మరాజు రసాలం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మెదక్ బిషప్ ఎ.సి.సాల్మన్‌రాజు తన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని, సీఎస్ఐ గైడ్‌లైన్స్ ఉల్లంఘించారని సినాడ్‌కు ఫిర్యాదులు అందాయి. మెదక్ చర్చి పాస్టరేట్ కమిటీ పాలకవర్గ నియామకం విషయంలో మెజారిటీ సభ్యుల ప్యానెల్‌కు కాకుండా బిషప్ తన వర్గానికి పదవులు దక్కేలా చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై పాస్టరేట్ కమిటీ ఎన్నికల్లో మెజారిటీ సభ్యులు నిరసన తెలుపుతూ బిషప్‌పై చెన్నై సినాడ్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన సినాడ్ కోర్టు ఎ.సి.సాల్మన్‌రాజ్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పరిపాలన విషయాల్లో సీఎస్ఐ బైలాను పాటించలేదని నిర్ధారిస్తూ మెదక్ డయాసిస్ బిషప్ పదవి నుంచి ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో డోర్నకల్ మోడరేటర్ బిషప్ పద్మారావును మెదక్ డయాసిస్ ఇన్చార్జ్ బిషప్‌గా నియమిస్తున్నట్లు సీఎస్ఐ మాడరేటర్ ధర్మరాజ్ రసాలం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సికింద్రాబాద్‌లో సీఎస్ఐ ఆఫీస్‌లో బాధ్యతలు స్వీకరించారు. చదవండి: తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు: సుప్రీం వ్యాఖ్య -
మెతుకును పంచిన మెదక్ చర్చ్
తీవ్ర కరువులో మెతుకు పంచుతూ.. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికీ అండగా నిలిచి ప్రపంచంలో రెండో అతిపెద్ద చర్చిగా ప్రసిద్ధి చెందిన మెదక్‌లోని కెథడ్రల్ చర్చి ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. అన్ని కాలాల్లోనూ చల్లగా ఉండే పంచ రంగుల బండలు.. సూర్యకిరణాలతో ప్రకాశించే గాజు కిటికి లోని అపురూప దృశ్యాలతోపాటు మెట్టుమెట్టుకో విశేషం.. అన్నింటికీ అర్థాలతో మహిమాన్విత చర్చిగా వెలుగొందుతున్న మెదక్ చర్చి గురించి ... ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎస్ చర్చి నిర్మాణాన్ని ఇంగ్లాండ్‌కు చెందిన రెవరెండ్ చార్ల్స్ వాకర్ ఫాస్నెట్ 1914లో ఆరంభించారు. 1924లో దీని నిర్మాణం పూర్తయింది. దీనికి అప్పుడు అయిన వ్యయం రూ.14 లక్షలు. దీనిని ఎంతో అపురూపంగా నిర్మించారు. చర్చి లోపలకు, వెలుపలకు వెళ్లేందుకు పంచద్వారాలు ఉన్నాయి. యూదా దేశ నాయకుడు ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండలు రాశారు. ఈ ఐదు కాండాలకు గుర్తుగా ఐదు ద్వారాలు నిర్మించారు. ప్రధాన ద్వారానికి ఇరుపక్కల రెండేసి చొప్పున ఉంటాయి. తూర్పు నుంచి పురుషులు, పడమర నుంచి స్త్రీలు లోపలకు వెళ్లాలి. 40 స్తంభాలు.. 40 రోజల ఉపవాసాలు చర్చి లోపల 40 స్తంభాలు ఉన్నాయి. పై కప్పు ఎక్కడ చూసినా సిలువ ఆకారంలో ఉండడం ప్రత్యేకం. 40 రోజుల ఉపవాస దీక్షలకు గుర్తుగా 40 స్తంభాలు ఏర్పాటు చేశారు. 66 దిమ్మెలు.. 66 గ్రంథాలు చర్చి లోపలికి వెళ్తుంటే పది మెట్ల తర్వాత చుట్టూరా 66 చొప్పున ఎడమ, కుడి వైపు విద్యుత్ సొబగులు సమకూరేలా తామర పూలతో నిర్మించిన దిమ్మెలు గొలుసులతో కలపబడి ఉంటాయి. బైబిల్లోని 66 గ్రంథాలకు సూచికగా 66 దిమ్మెలు ప్రతీకగా నిలుస్తున్నాయి. 12 మెట్లు.. 12 మంది శిష్యులు ఏసు ప్రభువుకు ప్రధానంగా 12 మంది శిష్యులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సువార్తను పరిచయం చేయాలని ప్రభువు వారికి బోధనలు చేశారు. (మార్కు సువార్త 16:15) ఆయన 12 మంది శిష్యులకు గుర్తుగా 12 మెట్లు నిర్మించారు. సూర్యకిరణాలు... సుందర దృశ్యాలు చర్చిలో మొత్తం మూడు గాజు కిటికీలు ఉన్నాయి. వీటిని ఇంగ్లాండ్‌కు చెందిన ఫ్రాంక్ ఓ సాలిజ్బరీ రూపొందించాడు. చర్చి లోపల ఆరాధించే స్థలంలో ఒకటి చొప్పున ఉత్తరం, తూర్పు, పడమర వైపు నిర్మించారు. ఈ కిటికీలపై సూర్యకిరణాలు పడితేనే అపురూప దృశ్యాలు కనపడతాయి. సూర్యుడు తూర్పున ఉదయించి.. పడమరన అస్తమిస్తాడు. ఉత్తరం వైపు కిరణాలు పడే అవకాశం లేకున్నా.. ఈ కిటికీని సూర్యకిరణాలు దరిచేరడం విశేషం. తూర్పు, పడమరనపడే కాంతి పుంజాలు కింద వేసిన బండలపై వక్రీభవనం చెంది.. ఉత్తరం వైపునకు ప్రసరిస్తాయి. ఈ మూడు కిటికీలకు స్థలాన్ని వదిలి.. వేర్వేరు సంవత్సరాల్లో అమర్చారు. తూర్పు కిటికీ.. ఏసు జన్మ వృత్తాంతం ఏసు పుట్టుకను తెలియజేసేలా ఈ కిటికీని 1947లో అమర్చారు. సూర్యకిరణాలు పడితేనే ప్రకాశవంతమైన చిత్రాలు దర్శనమిస్తాయి. కింది భాగంలో ఏసుప్రభువు తల్లి మరియ, తండ్రి యేసేపు, తొట్టెలో బాల యేసు, ఎడమ వైపు గొల్లలు, మధ్యలో గాబ్రియల్, లోక రక్షకులు, కుడివైపు జ్ఞానులు ఉంటారు. పైభాగంలో ఏసుకు ఇష్టమైన పిల్లలు, మధ్యలో పెద్ద మనిషి చిత్రాలు కనిపిస్తాయి. ఏసు పుట్టుకకు 700 ఏళ్ల క్రితమే ఏసు ప్రభువు పుడతాడని యేషయా అనే ప్రవక్త తాను రాసిన గ్రంథంలో చెప్పారు. ఆయనకు గుర్తుగా ఈ కిటికీలో పెద్దమనిషిని పెట్టినట్లు ప్రతీతి. పడమర కిటికీ.. ఏసు సిలువ వృత్తాంతం ఏసు సిలువ సందర్భాన్ని తెలియజేసేలా రూపొందించిన ఈ కిటికీని 1958లో అమర్చారు. సిలువ ఎత్తుకున్న తర్వాత కింద కూర్చుని ఉన్న తల్లి మరియ, మీద చేయి పట్టుకుని నిలబడిన మగ్దలేని మరియ దృశ్యాలు కనిపిస్తాయి. ఎడమవైపు స్త్రీలతోపాటు ఏసు శిష్యుడు యోహాన్ పబ్బతి (దండం) పెడుతూ నిలబడి ఉంటాడు. ఏసు తన శిష్యుడు యోహాన్‌కు ఏడు మాటలు చెబుతున్న తీరును ఈ దృశ్యాలు కళ్లకు కడతాయి. కుడివైపు బల్లెంపట్టుకుని ఉన్న శతాధిపతి కూడా కనిపిస్తారు. దీనిపై హిందీ, తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో వాక్యాలు ఉన్నాయి. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ సూచన మేరకు మూడు భాషల్లో వాక్యాలు పెట్టినట్లు పెద్దలు చెబుతున్నారు. – కిశోర్ పెరుమాండ్ల, సాక్షి, మెదక్ -
మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు..
క్రిస్మస్ వేడుకల సందర్భంగా మెదక్ పట్టణంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చి ముస్తాబైంది. గురువారం రాత్రి విద్యుత్ దీప కాంతుల్లో మెరిసిపోయింది. చర్చి ప్రాంగణంలో శాంతాక్లాజ్, క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. అలాగే మహాదేవాలయంలో జరిగే ప్రత్యేక ఆరాధనలకు తరలివచ్చే భక్తులకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. శుక్రవారం తెల్లవారు జామున జరిగే మొదటి ఆరాధనను బిషప్ సాల్మాన్రాజ్ ప్రారంభించనున్నారు. రెండో ఆరాధన ఉదయం 9గంటలకు ప్రారంభమవుతుంది. పోలీసుల నిఘా కోసం ప్రత్యేకంగా ఔట్‌పోస్టు ఏర్పాటు చేసి అక్కడే బస చేస్తున్నారు. బందోబస్తును ఎస్పీ చందనాదీప్తి పర్యవేక్షిస్తున్నారు సాక్షి, మెదక్ : కరుణామయుడు, లోకరక్షకుడు ఏసుక్రీస్తు జననం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో క్రిస్మస్ సందడి నెలకొంది. చర్చిలను విద్యుత్ కాంతులతో అత్యంత సుందరంగా అలంకరించారు. క్రిస్మస్ పండుగకు ముందు రోజైన గురువారం అర్థరాత్రి నుంచే ఆధ్యాత్మికత వైభవం వెల్లివిరిసింది. ప్రత్యేక ట్రీలు, క్రీస్తు జననాన్ని తెలిపే పూరిపాక ఘట్టాలు, దైవదూత విగ్రహాలు తీరొక్క విద్యుత్ దీపాలు శోభాయమానంగా వెలిగిపోయాయి. అంతటా కోలాహలం నెలకొంది. క్రిస్మస్ వేడుకలు అంగ రంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆసియా ఖండంలో అతి పెద్ద మెదక్ చర్చిలో యేసు పుట్టిన రోజు వేడుకలు అర్ధరాత్రి నుంచి మొదలయ్యాయి. చర్చి పాస్టర్ సాల్ మాన్ రాజు ఆరాధన యేసు సందేశాలు అందిస్తున్నారు. దివ్యతార దిగి వచ్చిన వేళ.. గజ్వేల్‌రూరల్: ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అతి పవిత్రమైన ఈ చర్చిని సందర్శించేందుకు గజ్వేల్ పట్టణ ప్రజలతో పాటు సమీప గ్రామాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. గురువారం అర్థరాత్రి నుంచి బాలయేసు పుణ్యక్షేత్రంలో ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు మొదలై శుక్రవారం రాత్రి వరకు కొనసాగుతాయి. చర్చి ఆవరణలో పశువుల పాక, స్టార్, ఏసు జననం వంటి కళాకృతులను అందంగా అలంకరించారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చర్చి ఆవరణను అందంగా తీర్చిదిద్దారు. మెథడిస్ట్ చర్చి.. మైమరపించెన్ జహీరాబాద్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చీలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. జహీరాబాద్‌లోని పలు చర్చీలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. సంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద చర్చి అయిన ఎంఆర్హెస్ఎస్ ఆవరణలో నిర్మించిన మెథడిస్ట్ చర్చి విద్యుత్ కాంతులతో విరాజిల్లుతోంది. ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని టౌన్ చర్చితో పాటు పలు కాలనీల్లో ఉన్న చర్చీలను సైతం అందంగా అలంకరించారు. ముస్తాబైన చర్చిలు చిలప్‌చెడ్(నర్సాపూర్): క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి చిలప్‌చెడ్ మండలంలోని పలు చర్చిలు ముస్తాబయ్యియి. గురువారం మండల కేంద్రమైన చిలప్‌చెడ్ గ్రామంలోని చర్చిని అందంగా అలంకరించారు. నర్సాపూర్ రూరల్: నేటి క్రిస్మస్ పండుగ వేడుకల కోసం నర్సాపూర్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న చర్చిలను రంగులు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. నర్సాపూర్ సీఎస్ఐ చర్చితో పాటు నాగులపల్లి, అవంచ, ఎల్లాపూర్, ఖాజీపేట, పెద్దచింతకుంట చర్చిలకు పెద్ద ఎత్తున్న భక్తులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వీరిని దష్టిలో పెట్టుకొని అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దివ్య సందేశం దుబ్బాకటౌన్: పెద్దగుండవెల్లి సీఏస్‌ఐ చర్చిలో ప్రతి ఏటా క్రిస్మస్ సంబురాలు ఘనంగా జరుపుతారు. క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ తాతయ్య (శాంతక్లాజ్) వేషధారణతో గ్రామంలో తిరుగుతూ పిల్లలకు చాక్లెట్లు పంచుతారు. చర్చిలో 100 కుటుంబాలు ఒకేచోట ఉండి సంబురాలు ఆనందంగా జరుపుకొంటారు. క్రిస్మస్ శుభాకాంక్షలు సిద్దిపేటకమాన్: నేడు జరుపుకోనున్న పవిత్ర క్రిస్మస్ పండగను పురస్కరించుకుని క్రిస్టియన్ సోదరి, సోదరులకు సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సీపీ ఆకాంక్షించారు. విద్యుత్ కాంతుల్లో మెదక్ సీఎస్ఐ చర్చి -
ముస్తాబైన మెదక్ చర్చి
కరుణామయుడి ఆలయం.. ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడం.. ఆనాటి కట్టడాలను కళ్లారచూస్తే తప్పా వర్ణించటం ఎవరితరం కాదు.. అదే మెదక్‌లోని ఏసయ్య కోవెల సీఎస్ఐ చర్చి. డిసెంబర్ 25న లోక రక్షకుడి అవతరణ వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఏసయ్య మందిరంలో ప్రతి వస్తువు కళాత్మకమే.. ప్రతి కట్టడం ప్రత్యేకమే.. మహా దేవాలయం వీక్షణం నయనానందకరమే. రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్ ఆధ్వర్యంలో 1914 నుంచి 1924 వరకు చర్చి నిర్మాణం జరిగింది. డిసెంబర్ 25, 1924లో ప్రారంభించారు. – మెదక్‌జోన్ ఆధ్యాత్మిక, కళాత్మకతల మేళవింపుతో చారిత్మాక సీఎస్ఐ చర్చి ప్రసిద్ధిగాంచింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాదేవాలయాన్ని సందర్శించిన వారెవరైనా నిర్మాణ సౌందర్యాన్ని తిలకించి పులకించి పోవాల్సిందే. చర్చిలో మూడు వైపులా కుడ్యాలపై కరుణామయుని చిత్రాలు అబ్బుర పరుస్తాయి. స్పెయిన్ గ్లాస్ పలకలపై చిత్రించిన క్రీస్తు జననం, శిలువ, పునరుత్థానం దృశ్యాలు కేవలం సూర్య కిరణాలతోనే తేజోవంతంగా ప్రకాశించడం వాటి ప్రత్యేకత. ఈ దృశ్యాలు తిలకించిన పర్యాటకులు మంత్ర ముగ్ధులు కావాల్సిందే. దేవదారు కర్రతో, పక్షిరాజు ఆకృతిలో తయారుచేసి పరిశుద్ధ గ్రంథ వేధిక మరో ఆకర్షణ. మహా దేవాలయంలో ప్రసంగ వేదికను బాల్‌స్టోన్‌తో రూపొందించారు. ఫరి్నచర్ కోసం రంగూన్ టేకు కర్రను, ఇతరత్రా ఆసనాలకు గులాబీ కర్రలను వినియోగించారు. ఈ చర్చి కట్టడాలను తిలకించిన పర్యాటకులు మళ్లీ మళ్లీ వస్తుండటం ఇక్కడి నిర్మాణ శైలి ప్రత్యేకత. చర్చి లోపల భాగాన ప్రత్యేక అలంకరణ క రక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు జరిగే క్రిస్మస్ వేడుకలకు మెదక్ సీఎస్ఐ చర్చిని నిర్వాహకులు అందంగా అలంకరించారు. ఈ ఉత్సవాలకు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి సుమారు 10 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందుకోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అనేక రకాల గిఫ్టులు ఏసయ్య జన్మ దినమైన క్రిస్మస్ పండగ డిసెంబర్ 25న జరగనుంది. కాగా క్రిస్మస్ సంప్రదాయాల్లో ప్రధానంగా ఏడు అంశాలు ప్రపంచ వ్యాప్తంగా అమలులో ఉన్నా యి. అందులో గిఫ్ట్‌లు ఇవ్వ డం ప్రత్యేకత. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఇళ్లకు వెళ్లి క్యారెల్స్ గీతాలు ఆలపించడం, ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం, బహుమతులు పంచుకోవడం, కేక్‌కట్ చేసుకోవడం ఆనవాయితి. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని జనరల్ స్టోర్స్, ఫ్యాన్సీ స్టోర్లలో విభిన్న రకాల బహుమతులు కొలువు దీరాయి. ఏసుక్రీస్తు, మేరిమాత రూపాలతో, శిలువ గుర్తులతో ఉన్న వాల్ హ్యాంగింగ్స్, రకరకాల ఫొటో ఫ్రేములు, క్రీస్తు బొమ్మతో ఉన్న గడియారాలు, శాంతాక్లాజ్ బొమ్మలు లభిస్తున్నాయి. క్రైస్తవుల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్స్ కూడా దొరుకుతున్నాయి. ఏసుక్రీస్తు జన్మవత్తాంతాన్ని, బోధన తెలిపే సీడీలు, డీవీడీలు లభిస్తున్నాయి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులు తమ సన్నిహితు లు, మిత్రులు, బంధువులకు అందజేసేందుకు వీటిని కొనుగోలు చేస్తున్నారు. క్రీస్తు శకం 300ల నుంచే బహుమతులు పంచే సంప్రదాయం ఉందని క్రైస్తవ మతపెద్దలు చెబుతున్నారు. ఆధ్యాత్మిక, కళాత్మకతల మేళవింపుతో చారిత్మాక సీఎస్ఐ చర్చి ప్రసిద్ధిగాంచింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాదేవాలయాన్ని సందర్శించిన వారెవరైనా నిర్మాణ సౌందర్యాన్ని తిలకించి పులకించి పోవాల్సిందే. చర్చిలో మూడు వైపులా కుడ్యాలపై కరుణామయుని చిత్రాలు అబ్బుర పరుస్తాయి. స్పెయిన్ గ్లాస్ పలకలపై చిత్రించిన క్రీస్తు జననం, శిలువ, పునరుత్థానం దృశ్యాలు కేవలం సూర్య కిరణాలతోనే తేజోవంతంగా ప్రకాశించడం వాటి ప్రత్యేకత. ఈ దృశ్యాలు తిలకించిన పర్యాటకులు మంత్ర ముగ్ధులు కావాల్సిందే. దేవదారు కర్రతో, పక్షిరాజు ఆకృతిలో తయారుచేసి పరిశుద్ధ గ్రంథ వేధిక మరో ఆకర్షణ. మహా దేవాలయంలో ప్రసంగ వేదికను బాల్‌స్టోన్‌తో రూపొందించారు. ఫరి్నచర్ కోసం రంగూన్ టేకు కర్రను, ఇతరత్రా ఆసనాలకు గులాబీ కర్రలను వినియోగించారు. ఈ చర్చి కట్టడాలను తిలకించిన పర్యాటకులు మళ్లీ మళ్లీ వస్తుండటం ఇక్కడి నిర్మాణ శైలి ప్రత్యేకత. క్రిస్మస్ పర్వదినాన దేశ నలుమూలల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చికి వస్తారని, ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని చెప్పారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. వందలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు. అలాగే ఆలయం తరఫున వలెంటీర్లను సైతం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 25వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకే మొదటి ప్రార్థన ఉంటుందని తెలిపారు. కేక్ కట్‌చేసిన కలెక్టర్, ఎస్పీ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం బిషప్ బంగ్లాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎస్పీ చందనాదీప్తితో కలిసి కలెక్టర్ ధర్మారెడ్డి కేక్‌కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలు కుల, మత, ప్రాంత బేధాలు వీడి ప్రేమతో నడుచుకోవాలని సూచించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకున్నప్పుడే ఏసుక్రీస్తు మార్గం అనుసరించిన వారౌతారని చెప్పారు. అనంతరం ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ క్రైస్తవ సోదర, సోదరీ మణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చి సంఘం ద్వార సాధ్యమైనంత వరకు ఇతరులకు లబ్ధి చేకూర్చాలని కోరారు. చర్చ్బిషప్ సాల్మన్‌రాజ్ మాట్లాడుతూ, దేవుడి దృష్టిలో ప్రతిఒక్కరూ సమానమేనని పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా అందరూ ప్రేమభావంగా నడుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నాగరాజు, డీఎస్పీ కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
మెదక్ చర్చిలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్/ అమరావతి : తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా క్రిస్మస్ సందడి నెలకొంది. కరుణామయుడైన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకోసం చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాకాంతులతో ప్రార్థన మందిరాల్లో క్రిస్మస్ శోభ వెల్లివిరుస్తోంది. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ను జరుపుకుంటున్నారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో చర్చిల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మెదక్ చర్చిలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు.. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దీంతో చర్చి ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. అలాగే సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చి, విజయవాడ గుణదల చర్చిలలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. -
మెదక్ చర్చి అద్భుతం
సాక్షి, మెదక్ : సీఎస్ఐ చర్చి నిర్మాణం మహా అద్భుతమని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రోస్ ఫ్లెమింగ్ పేర్కొన్నారు. గురువారం ఆయన చర్చిని సందర్శించి దాని విశిష్టత గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 5న ప్రపంచ క్రైస్తవ సంఘనాయకుల అధిపతి మెదక్ చర్చిని సందర్శించేందుకు వస్తున్నారని, దానికోసం ముందస్తుగా ఏర్పాట్లను పరిశీలించేందుకు తాను వచ్చినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పొలిటికల్ ఎకనామిక్ అడ్వయిజర్ నలినిరఘురామన్తో పాటు చర్చి నిర్వాహకులు ఉన్నారు. మెదక్‌లో పర్యటన మెదక్ రూరల్: బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ గురువారం మెదక్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ ధర్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్‌కు కలెక్టర్ ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా భౌగోళిక పరిస్థితులు, చారిత్రాత్మక కట్టడాలు, వ్యవసాయ అనుకూల పరిస్థితులతో పాటు జిల్లాలోని ముఖ్య అంశాల గురించి వివరించారు. ఆయనతో పాటు పొలిటికల్ ఎకానమి అడ్వైజర్ నళిని రఘురామన్, ఇంటర్న్ జార్జ్ హనోక్‌తో పాటు ఇతర అధికారులు ఉన్నారు. -
హ్యాపీ క్రిస్మస్
మెదక్ జోన్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో చర్చ్ ప్రాంగణం కిటకిటలాడింది. బిషప్ ఏసీ సాలమాన్‌రాజ్ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆ«రాధనలు ప్రారంభమయ్యాయి. అనంతరం బిషప్ దైవ సందేశం వినిపించారు. మానవుల పాపాలను కడిగేసేందుకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన రారాజు ఏసయ్య అన్నారు. అనంతరం ప్రెస్బిటరీ ఇన్చార్జి ఆండ్రోస్ ప్రేమ్ సుకుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేసి విశ్వమంతా నిండి ఉన్న దేవుడు ఏసయ్య అని కొనియాడారు. భక్తులు ఇబ్బందులు పడకుండా దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రార్థనల్లో పాల్గొన్న ప్రముఖులు... స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఉపేందర్‌రెడ్డిలు చర్చ్ ప్రాంగణంలో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా మెదక్ సీఎస్ఐ చర్చ్‌లో ప్రార్థనలు జరుగుతున్నాయని చెప్పారు. ఏసుక్రీస్తు బోధించిన పరలోక మార్గం సూత్రాలను ప్రతిఒక్కరూ ఆచరించాలన్నారు. భారతీ సిమెంట్ ఆధ్వర్యంలో పాల వితరణ: క్రిస్మస్ పండుగ సందర్భంగా మెదక్ సీఎస్ఐ చర్చ్ ప్రాంగణంలో భారతీ సిమెంట్ ఆధ్వర్యంలో పాల వితరణ చేశారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సుమారు 10 వేల లీటర్ల పాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీ సిమెంట్ ప్రతినిధులు మల్లారెడ్డి, కొండల్‌రెడ్డి, సతీష్‌కుమార్, గంగాధర్, శ్రీరాములు, శ్రీనివాస్‌రెడ్డి భారతీ సిమెంట్ మెదక్ డీలర్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సాక్షి, మెదక్: ప్రసిద్ధ మెదక్ సీఎస్ఐ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు వేడుకలకు హాజరయ్యారు. సీఎస్ఐ సంఘం అధ్యక్షుడు బిషప్ ఏసీ సాల్మన్‌రాజ్ ఆధ్వర్యంలో వేకువజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ప్రెస్బిటరీ ఇన్చార్జి వై.రాబిన్సన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి ఎదురుగా ఉన్న శిలువ వద్ద భక్తులు కొవ్వొత్తులు ఉంచి ప్రార్థనలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మహాదేవాలయం ప్రాంగణంలో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భారతి సిమెంట్ ఆధ్వర్యంలో పాలు వితరణ: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని భారతి సిమెంట్ ఆధ్వర్యంలో సుమారు ఆరువేల మంది భక్తులకు పాలవితరణ చేశారు. కార్యక్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్ కొండల్‌రెడ్డి, సీనియర్ మేనేజర్ ఓబుల్‌రెడ్డి, సేల్స్ మేనేజర్ సతీశ్‌కుమార్, టెక్నికల్ మేనేజర్ గంగాధర్, మెదక్ డీలర్ లింగమూర్తి, విజయ్, లక్ష్మీనారాయణ, సంగమేశ్వర్, కృష్ణకాంత్ ఉన్నారు. -
మెదక్ చర్చిలో ఉచిత 5జీ వైఫై
సాక్షి, మెదక్: మెదక్ చర్చిలో భక్తులు, పర్యాటకుల సౌకర్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉచిత 5జీ వైఫై సేవలను ప్రారంభించాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా చర్చిలో ఉచిత బీఎస్ఎన్ఎల్ వై ఫై ఏర్పాటు చేశారు. కలెక్టర్ భారతి హోళికేరి గురువారం ఉచిత 5జీ వైఫైని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లాను పర్యాటక కేంద్రంగా అన్ని హంగులతో అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే పర్యాటకుల కోసం చర్చిలో ఉచిత వైఫై ప్రారంభించినట్లు తెలిపారు. అమెరికా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఉచిత 5జీ వైఫైని ఏర్పాటు చేశామన్నారు. ఏకకాలంలో 2 వేల మంది వై ఫై వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సురేష్‌బాబు, డీఆర్ఓ మెంచు నగేశ్, మెదక్ చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జి విజయ్‌కుమార్, బీఎస్ఎన్ఎల్ అధికారులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు
సాక్షి, మెదక్: మెదక్ చర్చిలో ఆదివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. లోకరక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చిలో రోజంతా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బిషప్ ఏసీ సాల్మన్‌రాజ్ ఆధ్వర్యంలో వేకువజామున 4.30 గంటలకు దైవ ప్రార్థనలు మొదలయ్యాయి. ప్రార్థనల అనంతరం ఆయన భక్తులకు దైవ సందేశం ఇచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారితో చర్చి కిటకిటలాడింది. ప్రార్థనల్లో సుమారు 3 లక్షల మంది పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్మాదేవేందర్‌రెడ్డితో కలసి కడియం కేక్ కట్ చేశారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ బాసలికా చర్చిలో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ బిషప్ తుమ్మ బాల ప్రత్యేక ప్రార్థనలుS చేసి, క్రీస్తు సందేశాన్ని అందించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. -
క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చి ముస్తాబు
-
క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చి ముస్తాబు
ఆసియాలోనే అతిపెద్దదైన మెదక్ సీఎస్ఐ చర్చి క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. కరుణామయుని నిలయంలో ప్రార్థన చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సీఎస్ఐ మెదక్ డయాసిస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు జనవరి 2 వరకు కొనసాగనున్నాయి. వేకువజామున 4.30 గంటలకు బిషప్ ఏసీ సాల్మన్ రాజు మొదటి ప్రార్థనలతో చర్చిలో వేడుకలను ప్రారంభిస్తారు. -
'సొంత జిల్లాలో చర్చిని కేసీఆర్ పట్టించుకోవట్లేదు'
మెదక్ రూరల్/రామాయంపేట: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు క్రైస్తవులను చిన్నచూపు చూస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆయన మెదక్‌లోని చర్చిగేటు వద్ద ఆదివారం ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హిందు దేవాలయాలకు సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నారని ఆరోపించారు. కానీ, ఆయన సొంత జిల్లాలోని మెదక్ చర్చిని మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మెదక్ చర్చికి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారని, అలాంటి చర్చికి వెంటనే రూ.100 కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. -
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
మెదక్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు
-
ఏసయ్యా..! దీవించు
ఎల్లలు దాటి వెల్లువలా తరలివచ్చిన భక్తజన సందోహం... భక్తిప్రపత్తులతో మార్మోగిన ప్రార్థనలు... మొక్కుల చెల్లింపులు... గురువుల దీవెనలతో... కరుణామయుని కోవెల కిక్కిరిసిపోయింది. బుధవారం మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. రాష్ట్రాలు, జిల్లాలు దాటి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు, సందర్శకులు ఏసయ్య దీవెనల కోసం బారులు తీరారు. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులతో లోకరక్షకుని మందిరం కిటకిటలాడింది. పాప ప్రక్షాళన చేసుకోవాలి.. కిస్మస్ సందర్భంగా బుధవారం తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో జరిగిన మొదటి ఆరాధనలో సీఎస్ఐ మెదక్ డయాసిస్ వైస్ చైర్మన్ రైట్ రెవరెండ్ ఏసీ సాల్మన్ రాజ్ భక్తులకు వాక్యోపదేశం చేశారు. కులమత ప్రాంతీయ భేదాలు లేకుండా దేవుని నామస్మరణతో పాపాలను ప్రక్షాళన చేసుకోవాలన్నారు. ఈ లోకమంతా ఆయురారోగ్యాలతో... సుఖ సంతోషాలతో.. పిల్లా పాపలతో.. సకల సంపదలతో విరాజిల్లాలని ఈ సందర్భంగా తాను ప్రభువును వేడుకుంటున్నట్టు తెలిపారు. అహింస, శాంతి ద్వారా సమసమాజ స్థాపన జరుగుతుందన్నారు. మానవత్వమే ప్రభువు అభిమతమని, అందుకే ఆయన చూపిన మార్గం అనుసరణీయమన్నారు. శాంతి, కరుణ, ప్రేమప్రభువు బోధనలన్నారు. వాటి స్థాపన కై దైవ కుమారుడిగా ఏసయ్య భూమి మీదకు వచ్చారని తెలిపారు. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు. మెదక్/మెదక్ టౌన్, న్యూస్‌లైన్: మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వణికిస్తున్న చలిని సైతం లెక్క చేయకుండా మంగళవారం రాత్రి నుంచే భక్తులు చర్చికి తరలివచ్చారు. బుధవారం తెల్లవారుజాము 4.30కి ప్రారంభమైన మొదటి ఆరాధనల్లో పాల్గొన్న భక్తులను గురువులు ఆశీర్వదించారు. ఉద యం 7.30 గంటల ప్రాంతంలో డయాసిస్ వైస్ చైర్మన్ రెవరెండ్ ఏసీ సాల్మన్ రాజ్, చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జి వై.రాబిన్సన్లు కేక్ కట్‌చేసి ఏసయ్య జయంతి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. రెండో ఆరాధనలో సంఘ కాపరి అయిన ప్రెసిబెటరీ ఇన్చార్జి రెవరెండ్ వై. రాబిన్సన్ దైవ సందేశాన్ని అం దించారు. ఈ సందర్భంగా భ క్తులు చర్చి ప్రాంగణంలోని శిలువ వద్ద క్యాండిల్స్ వెలిగిం చి, కొబ్బరికాయలు కొట్టి మొ క్కులు తీర్చుకున్నారు. అనంత రం కానుకలు సమర్పించారు. చ ర్చి లోపల వేసిన పశువుల పాక, క్రిస్మస్ ట్రీ, చర్చి ప్రాంగణంలో గల శాం తా క్లాజ్ బెలూన్లు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఎల్ఈడీ ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జెయింట్ వీల్స్, ఎగ్జిబిషన్లతో ప్రజలు ఎంజాయ్ చేశా రు. అక్కడే ఏర్పాటు చేసిన దుకాణాల్లో తినుబండారాలు, క్రీస్తు ఫొటోలు, బైబిల్, పాటల సీడీలు, కీ చైన్లను కొనుగోలు చేశారు. ఈ వేడుకల్లో అసిస్టెంట్ ప్రెసిబెటరీ ఇన్చార్జి విజయ్‌కుమార్, గురువులు కరుణాకర్, జాన్‌పీటర్, సీఎస్ఐ ప్రతినిధులు గెలెన్, రోలాండ్ అండ్ పాల్, జయరాజ్, జాన్‌వెస్లీ, సాల్మన్ , సువన్ డగ్లస్, జెల్ల సుధాకర్, శాంతకుమార్, నోబుల్సన్, ఉదయ్‌కిరణ్, వికాస్, ప్రదీప్‌కుమార్, స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు. భారతి సిమెంట్ ఆధ్వర్యంలో పాల వితరణ.. క్రిస్మస్ ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు భారతి సిమెంట్ ఆధ్వర్యంలో పాల వితరణ చేశారు. ఆ సంస్థ జనరల్ మేనేజర్ ఎంసీ మల్లారెడ్డి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎ.కొండల్‌రెడ్డి, టెక్నికల్ మేనేజర్ ఓబుల్‌రెడ్డి, అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ నరేశ్, స్థానిక డీలర్ కిరణ్ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. అనంతరం భారతి సిమెంట్స్ ప్రతినిధు లు డయాసిస్ వైస్ చైర్మన్ రెవరెండ్ సాల్మన్రాజ్తో క్రిస్మస్ కేక్ కట్ చేయించా రు. సందర్భంగా భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్ష లు తెలిపారు. హాజరైన ప్రముఖులు.. మెదక్ చర్చిలో జరిగిన వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ జయప్రకాశ్‌రెడ్డి, మెదక్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే లు మైనంపల్లి హన్మంతరావు, ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రొళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డితోపాటు ఎస్పీ విజయ్‌కుమార్ కుటుంబసభ్యులు హాజరై ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వారు వేర్వేరుగా క్రిస్మస్ కేక్‌ను కట్‌చేసి భక్తులకు పంచి పెట్టారు. వచ్చే యేడు తెలంగాణ రాష్ట్రంలోనే క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటామని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ బందోబస్తు.. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా మెదక్ డీఎస్పీ గోద్రూ, పట్టణ సీఐ విజయ్‌కుమార్ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లు, బస్టాండ్లతోపాటు చర్చి ప్రధాన ద్వారం వద్ద పికెట్ నిర్వహించారు. కిటకిటలాడిన మెదక్ పట్టణం క్రిస్మస్ సంబరాలకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో మెదక్ పట్టణం కిటకిటలాడింది. పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, స్వీట్‌హౌస్‌లు జనసంద్రంగా మారాయి. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపారు.