►మెదక్ జిల్లాలో ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంబించిన సీఎం కేసీఆర్
►63 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయం
►జీ ప్లస్ 3 పద్దతిలో 38.50 కోట్లు వ్యయంతో నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయం
►ఎస్పీ కార్యాలయం ఆవరణలోనే పరేడ్ గ్రౌండ్...పక్కనే పోలీస్ క్వార్టర్స్
►జిల్లాలో అత్యాధునిక హంగులతో నిర్మించిన BRS పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, హోం మంత్రి మొహమ్మద్ అలీ చేతులమీదుగా బుధవారం మధ్యాహ్నాం ప్రారంభించారు.
►ఎకరా స్థలంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించిన పార్టీ కార్యాలయం.. సభలు, సమావేశాలకు వేదిక కానుంది.
►కార్యాలయంలో మీటింగ్ పెట్టుకోవడానికి అనువుగా ప్రత్యేకంగా పెద్ద హాల్ నిర్మాణం చేపట్టారు.
ఇక మెదక్ పర్యటనలో భాగంగా.. జిల్లా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను సీఎం తన చేతులతో ప్రారంభిస్తారు. దివ్యాంగులకు రూ. 3116 నుంచి రూ. 4116 కు పెంచిన పింఛన్‌ను, టెకేదార్ బీడీ కులవృత్తుల కార్మికులకు పింఛన్ పంపిణీ చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లను మంత్రి హరీశ్ పర్యవేక్షించారు.
స్వయంగా సీఎం ప్రారంభోత్సవానికి వస్తుండటంతో జిల్లా పోలీసు కార్యాలయ సముదాయం విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. కలెక్టరేట్ భవనం, లోపలి చాంబర్లను రంగు రంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు సిబ్బంది.
ఇది కూడా చదవండి: గల్లంతైన ఎమ్మెల్యే ఆశలు.. హెల్త్ డైరెక్టర్ అడుగులు ఎటువైపు?
Comments
Please login to add a commentAdd a comment