
ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చి మెదక్ క్యాథడ్రల్ చర్చి ప్రశాంతతకు, పవిత్రతకు నిలయం.

చారిత్రాత్మక వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనం.

శతాబ్దం గడిచినా చెక్కుచెదరని కట్టడం.

చర్చిలోని గాజు పెయింటింగ్స్ మరో అద్భుతం.

సూర్యకిరణాలు అద్దాల మీద ప్రసరించినప్పుడే వాటిపైన చిత్రాలు కనిపిస్తాయి.

175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఠీవీగా కనిపించే కరుణామయుని కోవెల.

వేలాది కూలీలకు పట్టెడన్నం పెట్టిన ప్రశాంత నిలయం.













