interesting facts
-
2025లో ముఖ్యమైన పండుగలు, ఏ రోజున వచ్చాయో తెలుసా?
2024 ఏడాదికి వీడ్కోలు పలికి, కొత్త ఏడాది 2025 (New Year 2025)లోకి అడుగుపెట్టబోతున్నాము. కొత్త ఆశలు, ఆశయాలతో నూతన ఏడాదికి స్వాగతం చెప్పబోతున్నాము. మి కొత్త సంవత్సరం వస్తుందంటే ఏ పండుగలు ఏ రోజు వచ్చాయో అన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. అంతేకాదు న్యూ ఇయర్ అనగానే పిల్లలంతా తమ బర్త్‌డే ఎపుడు (వారం) వచ్చిందా అని ఆసక్తిగా వెదుక్కుంటారు. ఉద్యోగులైతే ఏ ఏ పండుగలు ఆదివారం వచ్చాయబ్బా అని తెలుసుకునేందుకు తెగ ఉవ్విళ్లూరుతారు. ఇక మహిళలు (మిగిలినవారు కూడా) పెద్ద పండుగలు, శుభఘడియలు ఎపుడు వచ్చాయో తెలుసు కునేందుకు ఉత్సాహంగా చూపుతారు. మరి 2025లో సంక్రాంతి (Sankranti, ఉగాది (Ugadi), హోలీ (holy) వినాయక చవితి, శ్రీరామ నవమి, వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి, దసరా (Dussera) దీపావళి (Diwali) ఎపుడు వచ్చాయో చూద్దామా?2025లో పెద్ద పండుగలు, వారం తేదీభోగి : సోమవారం (13/01/25)మకర సంక్రాంతి : మంగళవారం (14/01/25)కనుమ : బుధవారం(15/01/25)మహాశివరాత్రి: 26/02/25 (బుధవారం)హోలీ: శుక్రవారం (14/3/25)ఉగాది : ఆదివారం (30/3/25)శ్రీరామ నవమి : ఆదివారం( 6/04/25)వరలక్ష్మి వ్రతం : శుక్రవారం(8/08/25)శ్రీ కృష్ణాష్టమి : శనివారం (16/08/25)వినాయక చవితి: బుధవారం(27/08/25)దుర్గాష్టమి : మంగళవారం (30/09/25)విజయ దశమి లేదా దసరా : గురువారం(02/10/25) ఇదీ చదవండి: 2025లో ముఖ్యమైన పండుగలు, ఏ రోజున వచ్చాయో తెలుసా? దీపావళి:సోమవారం (20/10/25)క్రిస్మస్ : గురువారం (25/12/25)అలాగే 2025లో రిపబ్లిక్ డే (జనవరి 26), ఉగాది రోజులు ఆదివారం వచ్చాయి. -
వేలాదిమందికి పట్టెడన్నం పెట్టిన ‘కరుణామయుని కోవెల’కు వందేళ్లు (ఫోటోలు)
-
నారింజ పండులా ఉంటుంది.. కానీ తొక్కతో పాటు తినేయొచ్చు
కుమ్ఖాత్ సిట్రస్ జాతి పండు. నారింజలాగే ఉంటుంది. కానీ, గుండ్రంగా కాకుండా కోడి గుడ్డు మాదిరిగా ఓవెల్ ఆకారంలో చిన్నగా (1–2 అంగుళాలు) ఉంటుంది. చైనా దీని పుట్టిల్లు. 500 ఏళ్ల క్రితం దీన్ని ఫార్చునెల్లా అని పిలిచేవారట. చైనీస్ భాషలో గామ్ (అంటే బంగారం), గ్వాత్ (టాంగెరిన్స్కు మరో పేరు) మాటల కలయిక వల్ల కుమ్ఖాత్ అనే పేరు ఈ పంటకు, పండుకు స్థిరపడింది. 400 ఏళ్ల క్రితమే ఈ పంట యూరప్‌కి, అమెరికాకు చేరింది. ఇది అతి చలిని, అతి వేడిని కూడా తట్టుకొని బతకగల విలక్షణ నారింజ జాతి పంట. దీన్ని తొక్క తీపిగా ఉంటుంది. దాంతో పాటుగా తినేయొచ్చు. కుమ్ఖాత్ పండ్లు వగర, పులుపు, కొద్దిగా తీపి కలగలిసిన రుచి కలిగి ఉంటుంది. కట్ చెయ్యాల్సిన అవసరం లేకుండా నోట్లో పెట్టుకొని తినెయ్యగలిగే ఈ పండ్లలో విటమిన్ సి, పీచు పదార్థం పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్లు, మాంగనీసు, రాగి, కాల్షియం తదితర పోషకాలు కూడా ఉన్నాయి. కుమ్ఖాత్ పండులోని విత్తనాలు కూడా తినదగినవే. ఆరోగ్యదాయకమైన ఒమెగా –3 ఫ్యాటీ ఆసిడ్స్ వున్నాయి. నీటి శాతం కూడా ఎక్కువే. కుమ్ఖాత్ పండ్ల జాతిలో అనేక రకాలున్నాయి. జనాదరణ పొందిన రకాలు.. నగమి, మరుమి, మీవ. మురుమి, మీవ కుమ్ఖాత్ రకాల పండ్లు గుండ్రంగా ఉంటాయి. ఓవెల్ షేప్‌లో కొంచెం పుల్లగా ఉండే నగమి పండ్ల కన్నా తియ్యగా ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్నారింజ జాతి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్న వారిలో ఈ పండ్లు బ్లడ్ గ్లూకోజ్‌ను పెంచవు. అతి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌తో పాటు పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున కుమ్ఖాత్ పండ్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి.అధిక పీచుకుమ్ఖాత్ పండ్లలో పీచుతో కూడిన సంక్లిష్ట పిండిపదార్థాలుంటాయి. కాబట్టి, జీర్ణకోశంలో ఎక్కువ సేపు అరిగిపోకుండా ఉంటాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. అందువల్ల బరువు పెరగకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. దీనిలోని జీర్ణమయ్యే పీచుకు విరేచనాలను అరికట్టే గుణం ఉంది. ఇది జీర్ణకోశంలోని అదనపు నీటిని పీల్చుకొని, జెల్ మాదిరిగా ఏర్పడుతుంది. అందువల్ల, ఎక్కువ సార్లు విరేచనాలు అవుతూ ఉంటే గుప్పెడు కుమ్ఖాత్ పండ్లు నోట్లో వేసుకుంటే సరి.ఆరోగ్యదాయకమైన కొవ్వులుకుమ్ఖాత్ పండ్లలో కొవ్వు చాలా తక్కువ. కాబట్టి, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు వారి దినసరి ఆహారంలో కుమ్ఖాత్ పండ్లను చేర్చుకుంటే మంచిది. ఈ పండ్లలోని విత్తనాలను కూడా నమిలి తినాలి. ఈ విత్తనాల్లో ఒమెగా ఫాటీ ఆసిడ్లు ఉంటాయి కాబట్టి దేహంలో బాడ్ కొలెస్ట్రాల్ తగ్గి, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.యాంటీఆక్సిడెంట్‌గా ఉపయోగంకుమ్ఖాత్ పండ్లలో విటమిన్ ఎ, సి వంటి యాంటీఆక్సిడెంట్ విటమిన్లు ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ దేహంలో ఎక్కువైతే కణ నిర్మాణం దెబ్బతింటుంది. మన దేహంలో ఫ్రీ రాడికల్స్ కలిగించే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను కుమ్ఖాత్ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు తగ్గిస్తాయి.గుండె ఆరోగ్యానికి మేలుకుమ్ఖాత్ పండ్లలోని విటమిన్ సి, పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ వంటి పోషకాలు రక్తనాళాల్లో కొవ్వు పేరుకు పోయి గుండెపోటు రాకుండా చూస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలా అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. మొత్తంగా గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఎల్‌డిఎల్‌ను తగ్గించటం ద్వారా గుండె సమస్యల్ని నిరోధిస్తాయి.ఇన్ఫ్లమేషన్కు చెక్కుమ్ఖాత్ పండ్లలో కీంప్‌ఫెరాల్, లుటియోలిన్, హెస్పెరిడిన్, క్యుఎర్సెటిన్, సి–గ్లైకోసైడ్ వంటి ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. సి–గ్లైకోసైడ్ దేహంలో వాపును నివారించే గుణం కలిగిఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. రోగనిరోధక వ్యవస్థలో ఇన్ఫ్లమేటరీ రీయాక్షన్ను, ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ పుట్టుకను తగ్గించటంలో సి–గ్లైకోసైడ్ ఉపయోగపడుతుంది.యాంటీబాక్టీరియల్ ప్రభావంకుమ్ఖాత్ పండు తొక్కలోని నూనెకు సూక్ష్మక్రిములను హరించే గుణం ఉందని పరిశోధనల్లో తేలింది. ఆహార పదార్థాలపై పెరిగే బూజు, సూక్ష్మజీవులను నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా ఆహార పదార్థాలు త్వరగా చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఇది దోహదం చేస్తుంది.కేన్సర్‌నూ అరికడుతుందికుమ్ఖాత్ పండులో ఉండే అపిజెనిన్ అనే ఫ్లేవనాయిడ్ కేన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుందని పరిశోధనల్లో తేలింది. అపిజెనిన్ కేన్సర్ కణాలను ఇతర ఆరోగ్యకరమైన కణాలకు సోకకుండా అరికట్టగలుగుతుందని భావిస్తున్నారు.ఊబకాయాన్ని తగ్గిస్తుందికుమ్ఖాత్ పండ్లలోని పోన్సిరిన్ అనే ఓ ఫ్లావనాయిడ్ ఊబకాయాన్ని తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. దేహం కొత్త కొవ్వు కణాలను తయారు చేసుకోకుండా అడ్డుకోవటం ద్వారా బరువు పెరగకుండా ఉండేందుకు పోన్సిరిన్ దోహదపడుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీనితో పాటు ఈ పండ్లలోని అధిక పీచుపదార్థం కడుపులో ఎక్కువ సేపు దన్నుగా ఉండటం వల్ల ఆకలి భావనను త్వరగా కలగనివ్వదు.కంటి చూపునకు మంచిదికుమ్ఖాత్ పండ్లలో బీటా కరోటెన్ రూపంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది. ఈ పండ్లలో ఉన్న 11 కెరొటెనాయిడ్లలో ఇదొకటి. బీటీ కరోటెన్, జియాక్సాంతిన్, లుటీన్ వంటి కెరొటెనాయిడ్లు కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కంటి చూపు బాగుండాలంటే విటమిన్ ఎ తోడ్పాటుతో రోడోస్పిన్ ఉత్పత్తి అవుతుంది.మూడ్ డిజార్డర్లకూ... వత్తిడి సమస్యలను, మూడ్ డిజార్డర్లను, నిద్ర సమస్యలను విటమిన్ సి ఆహారాలు అరికడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వత్తిడి, కుంగుబాటు, ఆందోళనల తీవ్రతను తగ్గించటం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యాంటీడిప్రెసెంట్ మాదిరిగా కుమ్ఖాత్ పండ్లు పనిచేస్తాయి. ఆరోగ్యదాయకమైన నిద్రకు దోహదం చేస్తాయి. అయితే, అది ఏ విధంగా దోహదపడతాయో ఇంకా స్పష్టంగా తెలియదు.ఎముక పుష్టికి.. ఎముక పెరుగుదలలో విటమిన్ సి పాత్ర కీలకమైనది. విటమిన్ సి కొల్లజెన్ ఏర్పడటానికి దోహదపడుతుంది. కుమ్ఖాత్ పండ్లలో కాల్షియం, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఎముకలు పటుత్వాన్ని కోల్పోయే ఆస్టియోపోరోసిన్ వంటి సమస్యలను విటమిన్ సి తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకల నుంచి కాల్షియంను హరించే యాసిడ్ ఫుడ్స్ ఎముక సమస్యల్ని పెంచుతాయి. కుమ్ఖాత్ పండ్లు ఆల్కలిన్ ఫ్రూట్స్ కాబట్టి ఆస్టియోపోరోసిన్కు దారితీయకుండా కాపాడుతాయని చెప్చొచ్చు.రోగనిరోధక శక్తి కుమ్ఖాత్ పండ్లలోని బీటా–క్రిప్టోక్సాంతిన్, ఎల్–లైమోనెనె మన దేహంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని ఓ అధ్యయనం చెబుతోంది. సహజ సిద్ధమైన కిల్లర్ సెల్స్ కార్యకలాపాలను పెంపొందించటం ద్వారా దేహంలో మెటబాలిక్ స్ట్రెస్‌ను తగ్గించటంలో ఇవి ఉపయోపడతాయి.చదవండి: పొలాల్లో రసాయనాల వాడకంతో మనుషుల్లో జబ్బుల పెరుదలకుమ్ఖాత్ పోషక విలువలు: 100 గ్రాముల కుమ్ఖాత్ పండ్లలో పోషకవిలువలు ఇలా ఉంటాయి... శక్తి : 71 కిలోకేలరీలు; పిండిపదార్థాలు : 15.9 గ్రా; మాంసకృత్తులు : 1.8 గ్రా; కొవ్వు : 0.8 గ్రా; పీచు : 6.5 గ్రా; విటమిన్ ఎ : 15 మిల్లీ గ్రాములు; విటమిన్ సి : 43.9 ఎం.జి; రిబొఫ్లేవిన్ : 0.09 ఎం.జి; క్లోరిన్ : 8.4 ఎం.జి; కాల్షియం : 62 ఎం.జి; ఐరన్ : 0.87 ఎం.జి; మెగ్నీషియం : 20 ఎం.జి; మాంగనీసు : 0.13 ఎం.జి; జింక్ : 0.17 ఎం.జి; -
శోభిత- నాగచైతన్య పెళ్లి.. అల్లుడికి అత్తమామల కానుకలేవో తెలుసా? (ఫొటోలు)
-
పెళ్లయిన నలుగురితో ఎఫైర్.. కట్ చేస్తే 49 ఏళ్లు దాటినా సింగిల్‌గానే స్టార్ హీరోయిన్ (ఫోటోలు)
-
బార్బీ డాల్.. ఈ సంగతులు తెలుసా మీకు?
ఇదీ బార్బీ బొమ్మ కథ!హాయ్! నేనే.. మీకెంతో ఇష్టమైన బార్బీ బొమ్మని. నా గురించి చె΄్పాలని వచ్చాను. నా పూర్తి పేరు బార్బరా మిలిసెంట్ రాబర్ట్స్. నేను పుట్టింది మార్చి 19, 1959లో. మా ఊరు న్యూయార్క్. నేను మొదటిసారి మీ ముందుకు బ్లాక్ అండ్ వైట్ స్విమ్‌సూట్‌లో వచ్చాను. నేను 11.5 అంగుళాల ఎత్తుతో ఉంటాను. నా మొదటి ధర మూడు డాలర్లు. నాకో ప్రత్యేకమైన రంగు ఉంది. ఆ రంగు పేరు ’బార్బీ పింక్’. నన్ను మీరు రకరకాల రూ΄ాల్లో చూసి ఉంటారు. డాక్టర్, లాయర్, ఇంజినీర్, పైలెట్.. ఇలా 250 రకాల రూపాల్లో నేను మీకు కనిపిస్తాను. మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టే నాలుగేళ్ల ముందే, అంటే 1965లో నేను అంతరిక్షానికి వెళ్లాను తెలుసా? అమ్మాయిలు ఏయే రంగాల్లో అయితే తక్కువగా ఉన్నారో ఆ రంగాల్లో నేను కనిపించి వారిలో స్ఫూర్తి నింపాను. అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే నా కల. ప్రపంచంలోని అన్ని దేశాల వారూ నన్నెంతో ఇష్టపడతారు. నన్నింకా వైవిధ్యంగా తయారు చేసేందుకు నాకోసం సుమారు వెయ్యి మందికిపైగా రకరకాల ఫ్యాషన్లు తయారు చేశారు. మొదట్లో చిన్నపిల్లలు మాత్రమే నన్ను ఇష్టపడేవారు. ఆ తర్వాత 6 నుంచి 99 ఏళ్లవారు కూడా నా మీద ఇష్టం చూపడం మొదలుపెట్టారు. 1997లో నా పేరు మీద ’బార్బీ గాల్’ అనే పాట కూడా తయారు చేశారు. అది ఇప్పటికీ ఎంతో ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికీ 100 బార్బీ బొమ్మలు అమ్ముడు΄ోతున్నాయి. మొత్తం 150 దేశాల్లో నా బొమ్మలు అమ్ముతున్నారు.నా పేరిట అనేక సోషల్‌మీడియా అకౌంట్లు ఉన్నాయి. అందులో నాకు 19 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నా పేరిట ఉన్న యూట్యూబ్ ఛానెల్‌కి ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. నా పేరిట ఉన్న యూట్యూబ్ ఛానెల్లో నాకు సంబంధించి రకరకాల వీడియోలుంటాయి. ఇప్పటిదాకా 151 మిలియన్ల నిమిషాల సేపు ఆ వీడియోలను జనం చూశారు. నా పేరుతో 2023లో ’బార్బీ’ అనే విడుదలైంది. -ఇదీ నా కథ. ఇక ఉంటాను. బై! -
సొంత హోటల్లో టాటా చేసిన పనికి ఫిదా!
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఐబీఎస్ సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ వీకే మాథ్యూస్.. టాటాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా వ్యక్తిత్వం గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర సంఘటలను పంచుకున్నారు.రతన్ టాటా వ్యక్తిత్వంలో తనకు బాగా నచ్చేది ఆయన మానవత్వం అని, దీంతోపాటు ఆయనలో హాస్య చతురత కూడా ఉందని మాథ్యూస్ చెప్పారు. రతన్ టాటా ఉన్నారంటే ఎంతటి సీరియస్ వాతావరణాన్ని అయినా తన హాస్యంతో తేలికపరచగలరని పేర్కొన్నారు.తానెవరో తెలియకుండా..“యూఎస్ పర్యటనలో రతన్ టాటాతో కొంత సమయం గడిపే అవకాశం నాకు దొరికింది. ఆ సందర్భంగా జరిగిన రెండు సంఘటనలు నాకు ఎప్పుడూ గుర్తంటాయి” అని వాటి గురించి వెల్లడించారు మాథ్యూస్.ఒక రోజు న్యూయార్క్‌లోని టాటా సొంత హోటల్లో వీరిద్దరూ అల్పాహారం చేశారు. అయితే రతన్ టాటా ఓనర్‌గా తన దర్పం ప్రదర్శించలేదని, అసలు తానెవరో అక్కడి సిబ్బందికి చెప్పలేదని మాథ్యూస్ గుర్తుచేసున్నారు. ఇదే ఆయన నిరాడంబరతకు నిదర్శనమని చెప్పారు.“అదే రోజు తరువాత నేను, నా కుటుంబం మరొక రెస్టారెంట్‌కి వెళ్లగా అక్కడ రతన్ టాటా కనిపించారు. ఆయన బిల్లును స్వయంగా తన క్రెడిట్ కార్డ్‌తో చెల్లించడం చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. అది ఆయన ఎంత సింపుల్‌గా ఉంటారో తెలియజేసింది” అని మాథ్యూస్ గుర్తుచేసున్నారు.మరో కోణంఇక రతన్ టాటాలో ఉన్న మరో కోణం ఆయన హాస్య చతురత. "తన ట్రేడ్‌మార్క్ హాస్యంతో రతన్ టాటా నన్ను, 'నేను నిన్ను వెంటాడుతున్నానా, లేక నువ్వు నన్ను వెంటాడుతున్నావా?' అన్నారు. ఆ తేలికైన వ్యాఖ్య పరిస్థితితో సంబంధం లేకుండా ఇతరులతో కనెక్ట్ అయ్యే ఆయన స్వభావాన్ని తెలియజేసింది” అని మాథ్యూస్ వివరించారు. -
ఈ విషయం తెలుసా? ఈ సాలీడు కుడితే.. ఇక అంతే!
ప్రపంచంలోని సాలెపురుగుల్లోకెల్లా ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఏదో బూజు గూడు అల్లుకునే మామూలు సాలెపురుగే అనుకుంటే పొరపాటే! ఇది కుట్టిందంటే, ఇక అంతే సంగతులు! ‘సిడ్నీ ఫన్నెల్ వెబ్ స్పైడర్’ అనే ఈ సాలెపురుగు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి వంద కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలోని అడవుల్లో కనిపిస్తుంది. ఒక్కోసారి ఈ సాలెపురుగులు ఇళ్లల్లోకి కూడా చేరుతుంటాయి.ఈ సాలెపురుగు కుట్టినప్పుడు శరీరంలోకి చేరే విష పదార్థాలు నిమిషాల్లోనే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. తక్షణ చికిత్స అందించకుంటే, అరగంటలోనే ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతుంది. ఈ సాలెపురుగు కాటు వల్ల మనుషులకు ప్రాణాపాయం ఉంటుంది గాని, కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇదొక అరుదైన విశేషం.ఒళ్లంతా ముళ్లున్న స్టార్ఫిష్..సముద్రంలో స్టార్‌ఫిష్‌లు అరుదుగా కనిపిస్తాయి. స్టార్ఫిష్లలో మరీ అరుదైనది ఈ ముళ్ల స్టార్ఫిష్. ఇది సముద్రం లోలోతుల్లో ఉంటుంది. ఒళ్లంతా ముళ్లు ఉండటం వల్ల దీనిని ‘క్రౌన్ ఆఫ్ థాన్స్ స్టార్ఫిష్’ అని అంటారు.ఈ ముళ్ల స్టార్‌ఫిష్‌లు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఎక్కువగా నలుపు, ముదురు నీలం, ఊదా, ఎరుపు, గోధుమ రంగు, బూడిద రంగుల్లో ఉంటాయి. ఇవి ఎక్కువగా పగడపు దిబ్బలను ఆశ్రయించుకుని బతుకుతాయి. పర్యావరణ మార్పుల వల్ల పగడపు దిబ్బలు రంగు వెలిసిపోతుండటం, పగడపు దిబ్బల విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతుండటంతో ఈ ముళ్ల స్టార్ఫిష్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పగడపు దిబ్బలను కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టకుంటే, ఈ ముళ్ల స్టార్ఫిష్ జాతి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది.అత్యంత పురాతన గుహాచిత్రాలు..ప్రపంచంలో పురాతన మానవులు సంచరించిన ప్రదేశాల్లో పలుచోట్ల ఆనాటి మానవులు చిత్రించిన గుహాచిత్రాలు బయటపడ్డాయి. సహస్రాబ్దాల నాటి గుహాచిత్రాలు పురాతన మానవుల ఆదిమ కళా నైపుణ్యానికి అద్దంపడతాయి. ఇటీవల ఇండోనేసియాలోని సూలవేసీ దీవిలో అత్యంత పురాతన గుహాచిత్రాలు బయటపడ్డాయి. ఈ దీవిలోని మారోస్ పాంగ్కెప్ ప్రాంతానికి చెందిన లీంగ్ కరాంపాంగ్ సున్నపురాతి గుహల్లో ఈ పురాతన చిత్రాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.వీటిలో ఎర్రరంగుతో చిత్రించిన మూడడుగుల పంది బొమ్మ, చిన్న పరిమాణంలో నిలబడి ఉన్న భంగిమలో మూడు వేటగాళ్ల బొమ్మలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు ఈ గుహాచిత్రాలపై క్షుణ్ణంగా పరిశోధనలు జరిపారు. గుహ లోపలి భాగంలో ఒకే రాతిపై వరుసగా చిత్రించిన ఈ బొమ్మలను కార్బన్ డేటింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరీక్షించి, ఇవి కనీసం 51,200 ఏళ్ల కిందటివని అంచనాకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దొరికిన గుహా చిత్రాలలో ఇవే అత్యంత పురాతనమైన గుహా చిత్రాలని గ్రిఫిత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాక్సిమ్ ఆబర్ట్ వెల్లడించారు. -
ప్రపంచ బీర్ దినోత్సవం : క్రాఫ్ట్ బీర్ ఇంత పాపులర్?!
International Beer Day: వినడానికి, అనడానికి గమ్మత్తుగా ఉన్నా, ప్రతీ ఏడాది ఆగస్టు తొలి శుక్రవారం ప్రపంచ బీర్ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ బీర్ దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బీర్ ప్రియులను ఒక్కచోట చేర్చే పండగ అదే దీని స్పెషల్. అయితే అంతర్జాతీయ బీర్ దినోత్సవం అమెరికాలో పాటించే జాతీయబీర్ దినోత్సవం కంటే భిన్నంగా ఉంటుంది. బీర్ అనేది ప్రపంచంలోని అత్యంత విస్తృతంగా సేవించే ఆల్కహాల్ డ్రింక్స్‌లో ఒకటి. ఇంటర్నేషనల్ బీర్ డే సందర్బంగా మనదేశంలో బాగా పాపులర్ అయిన క్రాఫ్ట్ బీర్, ఇతర విశేషాలను తెలుసుకుందాం.2007లో కాలిఫోర్నియాలోని శాంటా క్రూజ్‌లో జెస్సీ అవ్షలోమోవ్ అనే సామాన్యుడు ప్రారంభించారు. ఈ వేడుకను తొలుత ఆగస్టు 5 న జరుపుకునేవారట. కానీ ఆ తర్వాతి కాలంలో ఆగస్టు తొలి శుక్రవారం నాడు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. పురాతన ఇరాన్లో రసాయన అవశేషాల రూపంలో లభించిన పురాతన ఆధారాలతో బీర్ చరిత్ర సుమారు 3500-2900 బీసీ నాటిది. స్కాటిష్ బ్రూవరీ బ్రూమీస్టర్ తయారుచేసిన స్నేక్ వెనమ్ 67.5శాతం స్ట్రాంగ్తో ప్రపంచంలోనే అత్యంత బలమైన బీర్‌గా పేరొందింది.1040లో జర్మనీలోని ఫ్రీసింగ్లో స్థాపించబడిన వీహెన్స్టెఫాన్ బ్రూవరీ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బ్రూవరీ. బీర్ ఉత్పత్తి చేసే తొలి ఐదు దేశాలుఅమెరికా చైనా, జర్మనీ, రష్యా, బ్రెజిల్ నిలుస్తాయి. 5వ శతాబ్దంలో పురాతన గ్రీకు రచయిత జెనోఫోన్ రచనలలో బీర్ గురించిన మొట్టమొదటి లిఖిత ప్రస్తావన ఉందని చెబుతారు. క్రాఫ్ట్ బీర్ భారతదేశంలో బీర్ ఒక గమ్మత్తైన వ్యాపారం. ఇటీవలి వరకు మనదేశంలో స్ట్రాంగ్, లైట్ అనే బీర్లో ఉండేది. కానీ15 సంవత్సరాల క్రితం, ‘క్రాఫ్ట్ బీర్ ఎంట్రీ ఇచ్చి బాగా ప్రజాదరణ పొందింది. క్రాఫ్ట్ బీర్ అంటే సాంప్రదాయ బ్రూయింగ్ పద్ధతుల్లో, అధిక-నాణ్యత పదార్థాలను ఉపయోగించి చిన్న, స్వతంత్ర బ్రూవరీస్ ద్వారా ఉత్పత్తి చేసే బీర్. వివిధ రకాల మాల్ట్‌లు, హాప్‌లు , ఈస్ట్ జాతులతో ప్రయోగాలతో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, కోల్‌కత, హైదరాబాద్ నగరాలతో పాటు బెంగళూరు, పూణే , ముంబై లాంటి నగరాల్లో క్రాఫ్ట్ బీర్ విరివిగా లభిస్తుంది. ఇండియన్ క్రాఫ్ట్ బీర్ మిల్లెట్, స్థానికంగా లభించే పండ్లు సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం వల్ల ప్రత్యేకంగా నిలుస్తుంది అంటారు ఈ రంగ నిపుణులు. పలు అంచనాల ప్రకారం క్రాఫ్ట్ బీర్ పరిశ్రమ 2014-2018 మధ్య కాలంలో 304 శాతం వృద్ధి రేటును సాధించింది. ఇక 2024-2032లో 24.41శాతం పెరుగుతుందని అంచనా. నోట్ : మద్యపానం ఆరోగ్యానికి హానికరం. -
Tree frog శాపం గురించి ఎపుడైనా విన్నారా?! ఆసక్తికర సంగతులు
మా తోటలోని అధ్బుతమైన మర్రివృక్షం కింద కట్టుకున్న రెండంతస్తుల ఇల్లు.. మన మనుషుల కోసం అనుకుని ఎంతో పొరబడ్డాను. మొదటి వేసవికాలంలో, కొన్ని చెట్టుకప్ప(Tree Frog) లు వచ్చి చక్కగా నివసిస్తుంటే, అది చూసి నేను ఎంతో ముచ్చటపడ్డాను. వాటి శరీరం కింద పొందికగా పెట్టిన వాటి నాజూకైన పాదాలతో, పెద్ద జాలిగొన్న కళ్ళతో చూసే వాటికి నేను ఇంత చోటు ఇవ్వడానికి వెనకాడలేదు. కానీ ఈ విషయం స్పష్టంగా మిగిలిన కప్ప వంశానికి తెలిసిపోయి, ముని ముని మనవలు, ముని ముని మేనల్లుళ్లు, మేనకోడలు మరియు అవ్వలూ, అందరూ వచ్చి చేరారు. అతి త్వరలో ప్రతీ చూరు, పుస్తకము, కప్పు, ఇంకా పటములు వాటితో నిండిపోయాయి. కొన్నయితే వాషింగ్ మెషీన్ సబ్బు పెట్టెలో కూడా దూరాయి; కొన్ని వాషబేసిన్ నుంచి బయటకి వెళ్లే పైపులలో, మరికొన్నైతే సుఖంగా ఫ్లష్ ట్యాంక్ గోతిలో, ఇక చాలా అయితే గోడకీ బీరువాకి మధ్యనున్న చిన్న చోటిలో దూరి పడుక్కున్నాయి. ఒక దయ నిండిన ఉద్వేగ క్షణంలో, మా బతుకు మేము బతకటానికి మాకు ఇంత చోటు వదిలాయి.అర దశాబ్దం క్రితం, ఒక ఏడాది నగరంలో గడిపినప్పుడు, నేను ఒక పిల్లిని కానీ, కుక్కని కానీ పెంచుకునే స్థోమత లేకపోయింది. వాటికి బదులుగా నేను ఒక చిన్న చెట్టు కప్పను పెంచుకున్నాను. తను ఉన్న చిన్న గదిలో నిత్యకృత్యాల కోసం ఒక చిన్న బేసిన్ పెట్టి, ఆహారం కోసం పురుగులను ఆకర్షించడానికి లైటు వేసి ఉంచాను. ఇది ఒక బాధ్యతారహిత బంధం: నేను నడిపించడానికి తీసుకువెళ్లాలని కానీ, భోజనం పెట్టాలని కానీ, విద్యలు నేర్పాలని కానీ నా పెంపుడు కప్ప ఆశించలేదు. తన మనుగడ మొత్తం ఆ ఒక చిన్న తేమ నిండిన గదిలో సాగించింది. కిటికీ బయట తనకి బ్రతికి బట్ట కట్టే అవకాశం ఆట్టే లేని ఒక గందరగోళ కాంక్రీట్ అడవి ఉంది. చెప్పడానికి మేము ఒకరినొకరు హత్తుకుని గడపకపోయినా, ఆ కప్ప అక్కడ ఉండడం వల్ల నేను కొంత సేద తీరాను. అంత బాగానే సాగుతున్నంతలో, ఒక పుస్తకం పడి కప్ప ప్రాణం పోయింది. ఈ విపత్తును ఊహించనందుకు నాకు తీరని ఆవేదన కలిగింది.కానీ ఇప్పుడు దాని ఖర్మ ఫలంగా, పురాతన ఈజిప్టు మమ్మీ శాపమంత ఖచ్చితంగా ఈ చెట్టు కప్ప శాపం నాకు చుట్టుకుంది. మా కొత్త ఇంట్లో ఆ కప్పలు కేవలం కాస్త చోటే ఆశిస్తే, నేను శాంతి వహించి ఉండేదాన్ని. కానీ అవి వాటి కింది భాగం ఎంతో వ్యూహాత్మక కోణంలో బయటికి తిప్పి, విచక్షణ లేకుండా వంటగది అరుగులనూ, బల్లలనూ, తువ్వాళ్లనూ, కంచాలనూ ఆక్రమించాయి. కొన్ని గదుల్లో ఎండిపోయిన కప్ప మూత్రం చారలు కట్టాయి. టాయిలెట్ పై కూర్చోవడం ఒక పెద్ద ప్రహసనంగా మారింది. టాయిలెట్ మూత కింద మరిన్ని కప్పలు నక్కి ఉండి, అప్రమత్తంగా లేని అతిధులను అతి సున్నితమైన శరీర భాగాలపై తట్టి ‘భౌ’ మని దాగుడుమూతలు ఆడేవి. ఒక పెద్ద తల్లి కప్ప, బాత్రూంలో లైట్ వేసే దురదృష్టవంతులు ఎవరిపైనైనా సరే మూత్ర జల్లు కురిపించేది. చీకటి బాత్రూములూ, కప్ప మూత్రపు వాసనగొట్టే తువ్వాళ్ళు వాడవలసి వచ్చినందుకూ, పలుమార్లు ప్లేట్లు కడుక్కోవలసి వచినందుకూ అలసి, విసిగి, ఆ గెంతే దౌర్భాగ్యులపై సున్నితమైన యుద్ధం ప్రకటించాము.మొత్తం 289 కప్పలను పట్టి, పొరుగునున్న నూతుల్లో వదలడంలో ఒక ఆదివారం గడిపాము. కానీ అదంతా వ్యర్ధ ప్రయాసే. అవి చిన్న జంతువులే కానీ వాటికి పరిసర జ్ఞానాం ఖచ్చితంగా ఉంది. మేము ఆఖరి కప్పను తొలంగించేలోపే, వాటి ఆరితేరిన ఇంటితోవ తెలుసుకునే నైజం వాటిని ఇంటికి చేర్చింది. అంతేకాదు, ఇరవై నాలుగు గంటలు గడిచేలోపు అవన్నీ వాటికి ఇంట్లో ప్రీతి అయినా స్థలాల్లోకి వచ్చేశాయి; అసల అవి వెళ్లనేలేదు అన్నట్టు. నేను వాటి అత్యుత్తమ ప్రతిభకు వంగి నమస్కరించాను.చాలా కప్పలు వంటగదిలోని మూల బీరువా తలుపు కింద దూరి, బూరెలమూకుళ్లపై, ప్రెషర్ కుక్కర్ పై, ఇంకా మిక్సీ జార్ల పై యాజమాన్యాన్ని ప్రకటించాయి. నిన్న నేను వెల్లుల్లిపాయలు వేయిస్తుండగా మూకుడి నుంచి ఒక ఘాటైన దుర్గంధం వచ్చింది….అది…కాదు… అయి ఉండదు... చెట్టు కప్ప మూత్రం! కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు ఒలవడానికే నాకు కొన్ని యుగాలు పట్టింది. మరి కాసిన్ని వలవడానికి మిగిలి ఉన్న జీవితాన్ని వృధా చేయదలచలేదు. అంచేత ఆ వాసన మాపడానికి మరిన్ని మసాలా దినుసులు వేశాను. కానీ తర్వాత వచ్చిన పొగడ్తలు, నా అద్భుతమైన వంట నైపుణ్యానికి వచ్చాయో, లేదా దాగిఉన్న ఆ…. వంటవారి రహస్య దినుసు అందామా … దానివల్ల వచ్చాయో, నేను ఖచ్చితంగా చెప్పలేను.రచయిత : జానకి లెనిన్ఫోటోలు : సచిన్ రాయ్ -
World Kebab Day 2024 నోరూరించే కబాబ్స్ , స్మోకీ , జ్యూసీ.. వీటికథ పెద్దదే!
కబాబ్..ప్రస్తుత కాలంలో ఆహార ప్రియులకు పరిచయం అవసరం లేని వంటకం. వెజ్, నాన్‌వెజ్, అనేక రకాలుగా కబాబ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ప్రపంచ కబాబ్ దినోత్సవం సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..ప్రపంచ కబాబ్ దినోత్సవం 2024: కబాబ్ డే అనేది కబాబ్‌ల రుచికరమైన సంప్రదాయాన్ని గౌరవించడానికి జూలై రెండవ శుక్రవారం ప్రపంచ కబాబ్ డే జరుపుకుంటారు. అరబిక్ పదం ‘కబాబ్’ అంటే ‘కాల్చినది’ లేదా ‘వేయించినది’ అని అర్థం. కబాబ్‌లు మధ్ యప్రాచ్యం, మధ్యధరా దక్షిణాసియా వంటకాలలో ఇది చాలా పాపులర్. ఆ తరువాత ఇది భారతదేశం, టర్కీ ,పర్షియాలో ప్రసిద్ధి చెందింది.నాన్-వెజ్ కబాబ్స్‌ను చికెన్, మటన్, తదితర మాంసాన్ని కొన్ని గంటలపాటు వివిధ రకాలైన మసాలా దినుసులలో మెరినేట్ చేసిన తర్వాత స్కేవర్లపై నిప్పు మీద కాల్చి స్మోకీ ఫ్లేవర్లతో తయారు చేస్తారు. శాకాహారులు సోయాబీన్ కబాబ్‌లు లేదా పనీర్, తదితర కబాబ్‌లను తయారు చేసుకోవచ్చుపాపులర్ కబాబ్స్ అత్యంత ప్రసిద్ధ కబాబ్‌లలో టర్కీకి చెందిన డోనర్ కబాబ్ ఒకటి. భారతదేశానికి గలౌటీ కబాబ్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 'గలూటి' అంటే నోటిలో కరిగిపోయేది అని అర్థం. 17వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్‌లో న ఔద్ నవాబ్ వజీర్ మీర్జా అసద్-ఉద్-దౌలా కోసం దీన్ని తయారు చేశారట. నవాబుకు వయసు పెరిగేకొద్దీ, పళ్ళు రాలడం ప్రారంభించడంతో, ఇష్టమైన రుచికరమైన పదార్థాన్ని ఆస్వాదించేందుకు దీన్ని కనిపెట్టారు. మరో ప్రసిద్ధ కబాబ్ రకంలెబనాన్కు చెందిన షవర్మా, అలాగే పాకిస్తాన్ నుండి సీక్ కబాబ్ ఇతర పాపులర్ కబాబ్స్. -
World Population Day 2024 : ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
World Population Day 2024 : జనం.. ప్రభంజనం..ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్!
ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటిస్తారు. నానాటికి పెరుగుతున్న జనాభా, తద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, జనాభా పెరుగుదల సమస్యలపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా జూలై 11వ తేదీన "ప్రపంచ జనాభా దినోత్సవాన్ని" నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ప్రపంచవ్యాప్తంగ ప్రజలలో అవగాహన తెచ్చేందుకుగాను ఐక్యరాజ్యసమితి 1989వ సంవత్సరంలో దీనిని ప్రారంభించింది.1987, జూలై 11న ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న ("డే ఆఫ్ ఫైవ్ బిలియన్") రోజును పురస్కరించుకుని ఆరోజును "ప్రపంచ జనాభా దినం"గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది.ప్రపంచ జనాభా దినోత్సవం 2024 థీమ్యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) సమన్వయంతో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) సంయుక్తంగా ప్రతీ ఏడాది ఒక్కో థీమ్‌ను నిర్ణయిస్తాయి ఈ సంవత్సరం థీమ్: 'ఎవరినీ వదిలిపెట్టవద్దు, ప్రతి ఒక్కరినీ లెక్కించండి (To Leave No One Behind, Count Everyone’)కొన్ని ఇంట్రస్టింగ్ సంగతులు ఐరాస లెక్కల ప్రకారం 20 ఏళ్ల తరువాత జూలై 11, 2007లో ప్రపంచ జనాభా 6,602,226,175కు చేరుకుంది. .కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, మాతృ ఆరోగ్యం , మానవ హక్కులు వంటి జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడమే ప్రపంచ జనాభా దినోత్సవ లక్ష్యం. ప్రపంచ జనాభా అధికారికంగా ప్రస్తుతం 8 బిలియన్లు దాటేసింది. ఇది ఇలాగే పెరుగుతూ పోతే, భవిష్యత్ తరాలకు స్థిరమైన, స్నేహపూర్వక అభివృద్దికి అడ్డంకులను సృష్టిస్తుం దనేది ప్రధాన ఆందోళన. ప్రస్తుత ప్రపంచ జనాభా ఇరవయ్యవ శతాబ్దం మధ్యలో ఉన్నదానికంటే మూడు రెట్లు ఎక్కువ. అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు చైనా, భారతదేశం. ఈ రెండూ వందకోట్ల కంటే ఎక్కువ జనాభా ఈ దేశాల్లో ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. 2050నాటికి ప్రపంచ జనాభా 9.7 బిలియన్లకు చేరుతుందని ఐరాస అంచనా. అలాగే 2080ల మధ్యలో 10.4 బిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. -
వరలక్ష్మికి కాబోయే భర్త.. నటి కంటే తక్కువే సంపాదించాడా! (ఫోటోలు)
-
రూ. 29వేల కోట్ల వజ్రం.. ఎవరిదగ్గరుంటే వారు చనిపోతారట!
బ్రిటీష్ వారితో సహా విదేశీ ఆక్రమణదారులు భారతదేశాన్ని దోచుకోకుండా ఉండి ఉంటే.. ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశంగా భారత్ ఖ్యాతి గడించేది. ఎంతోమంది విదేశీయులు భారదేశంలోని రాజుల మీద, దేవాలయాల మీద దాడి చేసి ఎన్నో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఇలా దోచుకెళ్లిన వాటిలో ఒకటి 'హోప్ డైమండ్' అని పిలువబడే వజ్రం.నిజానికి ఖరీదైన వజ్రం అంటే కోహినూర్ వజ్రమే గుర్తొస్తుంది, హోప్ డైమండ్ అనే మరో ఖరీదైన వజ్రం కూడా ఉందని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ చిత్రం ఏమిటంటే.. ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో.. వారంతా అకాల మరణం చెందుతారని ఓ నమ్మకం ఉంది. ఈ కారణంగానే దీన్ని శాపగ్రస్త వజ్రంగా పిలుస్తారు.గుంటూరులోని కొల్లూరు గనుల నుంచి ఈ వజ్రం వెలికితీసినట్లు కొంతమంది, ఇతర వజ్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని వజ్రకరూర్‌లోని కింబర్లైట్ ప్రాంతాల నుంచి తీసి ఉండొచ్చని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్‌లో దొరికినట్లు స్పష్టమవుతోంది.17వ శతాబ్దంలో ఈ వజ్రం బయటపడినప్పటి నుంచి చాలాసార్లు చేతులు మారినట్లు సమాచారం. మొదట్లో ఈ వజ్రాన్ని ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ ఓ ముడి పదార్థంగానే కొనుగోలు చేసారు. ఆ తరువాత రాజ కుటుంబాలు దాన్ని దక్కించుకున్నాయి. ఆ తరువాత ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XIV, న్యూయార్క్ నగరానికి చెందిన హ్యారీ విన్స్టన్ దీన్ని సొంతం చేసుకున్నారు. ఈ తరువాత ఈ వజ్రాన్ని 1958లో వాషింగ్టన్‌లోని స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా ఇచ్చేసారు.ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ దీన్ని భారతదేశంలోని ఓ హిందూ దేవాలయం నుంచి దొంగలించినట్లు ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. దేవాలయంలోని వజ్రం కనుక.. ఆ ఆలయంలో పూజారులు వజ్రం పోయిందని, ఆ వజ్రం తీసుకున్న వ్యక్తులను శపించారు. ఈ కారణంగానే ఇది ఎవరి దగ్గర ఉంటే వారు అకాలమరణం చెందుతున్నారని, చివరకు స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా ఇచ్చేసారు.1839లో హెన్రీ ఫిలిప్ హోప్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని మొదట సేకరించడంతో.. దానికి అతనిపేరే పెట్టారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ వారి ప్రకారం.. ఈ వజ్రం 16 తెల్లని వజ్రాల మధ్యలో ఓ లాకెట్టు మాదిరిగా ఉంది. చికాగో డైమండ్ కొనుగోలుదారుల ప్రకారం.. హోప్ డైమండ్ విలువ 350 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 29,19,52,67,500. -
లివ్ ఇన్ రిలేషన్.. ముగ్గురు పిల్లల తల్లి.. ప్రముఖ క్రికెటర్ సహచరి (ఫొటోలు)
-
ప్రపంచంలో అతిపెద్ద షిప్.. రిపేర్ ఖర్చే రూ.2212 కోట్లు!
టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయిన తరువాత.. ప్రపంచంలో అతిపెద్ద ఓడల నిర్మాణం పూర్తిగా ఆగిపోయిందని అనుకున్నారు. కానీ 1979లో జపాన్ ఓ నౌకను తయారు చేసింది. దీనిపేరు 'సీవైజ్ జెయింట్'. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..సీవైజ్ జెయింట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద షిప్. దీనిని 1974-79 మధ్య జపాన్ కంపెనీ సుమిటోమో హెవీ ఇండస్ట్రీస్ తయారు చేసింది. ఈ నౌక పొడవు టైటానిక్ షిప్ కంటే రెండు రెట్లు ఎక్కువ. ఇది కార్గో షిప్‌గా పరిచయమైంది. దీనికి భారతదేశంతో కూడా ఓ ప్రత్యేకమైన అనుభందం ఉన్నట్లు సమాచారం.సీవైజ్ జెయింట్ నౌకను గ్రీకు వ్యాపారవేత్త కోసం.. జపాన్ దేశంలోని ఒప్పామా షిప్‌యార్డ్‌లో నిర్మించడం ప్రారభించారు. కానీ ఓడ నిర్మాణం చాలా ఆలస్యం కావడంతో ఆర్డర్ చేసిన ఓనర్ ఈ నౌకను నిరాకరించారు. అప్పటికి నౌకకు పేరు పెట్టలేదు. ఆ తరువాత తయారీ సంస్థ, ఆర్డర్ చేసిన యజమానికి మధ్య సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది.ఒప్పామా షిప్‌యార్డ్‌లో ఈ అతిపెద్ద నౌకను నిర్మించడం వల్ల దీనికి మొదట్లో ఒప్పమా అని పేరుపెట్టారు. కంపెనీ దీనిని ఆ తరువాత చైనాకు అప్పగించడం జరిగింది. చైనా చేతుల్లోకి చేరిన తరువాత దీనికి సీవైజ్ జెయింట్ అని పేరుపెట్టారు. ఈ నౌక అప్పట్లో ముడి చమురు రవాణా చేయడానికి ప్రధానంగా ఉపయోగించేవారు.1988లో సీవైజ్ జెయింట్ నౌక ఇరాన్ నుంచి చమురు తీసుకుని బయలుదేరి.. లారాక్ ద్విపంలో ఆగింది. అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ వైమానిక దళం ఈ నౌకపై దాడి చేసింది. ఆ సమయంలో ఇది చాలా వరకు దెబ్బతింది. ఈ ఓడను మరమ్మత్తులు చేయడానికే.. ఏకంగా 100 మిలియన్ డాలర్లు ఖర్చు (1988లో) అయినట్లు సమాచారం. 100 మిలియన్ డాలర్ల నేటి విలువ సుమారు 265 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.2212 కోట్లు.సీవైజ్ జెయింట్ నౌక దాదాపు 1500 అడుగుల పొడవు ఉంది. 1988 తరువాత దీనిని పూర్తిగా మరమ్మత్తు చేసి 1991లో నార్వేజియన్ కంపెనీకి విక్రయించారు. 1991 తరువాత 2009లో గుజరాత్‌లోని అలంగ్ షిప్బ్రేకింగ్ యార్డ్‌కు చేరుకుంది. ఆ తరువాత దీనిని కూల్చి వేశాలు. ప్రస్తుతం ఇది హాంకాంగ్ మారిటైమ్ మ్యూజియంలో ఉన్నట్లు తెలుస్తోంది. -
వేలకోట్ల సామ్రాజ్యం.. చివరకు భార్య నగలు అమ్మాల్సి వచ్చింది: అనిల్ అంబానీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
-
ఇవేం పేర్లు బాబోయ్!.. రాజకీయ పార్టీలకు గమ్మత్తైన పేర్లు
ట్వంటీ20. హైటెక్. సాఫ్. సూపర్ నేషన్. జాగ్తే రహో... ఇవన్నీ ఏమిటా అనుకుంటున్నారా? రాజకీయ పార్టీల పేర్లు! వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజం. మన దేశంలో ఆరు జాతీయ పార్టీలు, 57 రాష్ట్ర పార్టీలున్నాయి. వీటి పేర్లు మనం తరచూ వినేవే. వీటితో పాటు భారత్‌లో ఏకంగా 2,597 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. వీటిలో వినడానికే గమ్మత్తైన, ఆసక్తికరమైన, పేర్లున్న పార్టీలకు కొదవ లేదు. కాకపోతే వీటిలో చాలావరకు ఎన్నికల సమయంలో తప్ప పెద్దగా తెరపైకే రావు. పార్టీ పెట్టడం యమా ఈజీ మన దేశంలో పార్టీ పెట్టడం సులువైన పని. రూ.10 వేలు డిపాజిట్, 100 మంది సభ్యుల మద్దతుంటే చాలు... పార్టీ పెట్టేయొచ్చు. ఏ మతాన్నో, కులాన్నో, ప్రాంతాన్నో కించపరిచేలా లేకపోతే చాలు. దాంతో దేశవ్యాప్తంగా ఇలా వేలాది పార్టీలు పుట్టుకొచ్చాయి. వాటిలో గమ్మత్తైన పేర్లకూ కొదవ లేదు. ఇండియన్ లవర్స్ పార్టీ, ఇండియన్ ఓషియానిక్ పార్టీ, లైఫ్ పీస్ఫుల్ పార్టీ, హోలీ బ్లెస్సింగ్ పీపుల్స్ పార్టీ, లేబర్ అండ్ జాబ్ సీకర్స్ పార్టీ, అఖిల భారతీయ భారత్‌మాతా–పుత్రపక్ష, భారతీయ మొహబ్బత్ పార్టీ, మినిస్టీరియల్ సిస్టం అబాలిషన్ పార్టీ, ఆల్ పెన్షనర్స్ పార్టీ, తమిళ్ తెలుగు నేషనల్ పార్టీ, ఇండియన్ విక్టరీ పార్టీ, ఇంటర్నేషనల్ పార్టీ, చిల్డ్రన్ ఫస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, చాలెంజర్స్ పార్టీ, స్వచ్ఛ భారత్ పార్టీ, సత్యయుగ్ పార్టీ, ఇన్సానియత్ పార్టీ, నేషనల్ టైగర్ పార్టీ, మర్యాదీ దళ్... ఇలా ఈ జాబితా చాంతాడును మించిపోతుంది. ప్రధాని మోదీ ఇటీవల పదేపదే ప్రస్తావిస్తున్న నారీ శక్తి పేరుతో కూడా ఒక పార్టీ ఉంది! ఆమ్ ఆద్మీ పార్టీని తలపించేలా గరీబ్ ఆద్మీ పేరుతో కూడా ఒక పార్టీ ఉంది. ఇక, ద రిలిజియన్ ఆఫ్ మ్యాన్ రివాల్వింగ్ పొలిటికల్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ పేరునైతే వీటికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు! అయితే ఈ పార్టీల్లో చాలావరకు వ్యవస్థపై తమ అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసేందుకు, ఆదర్శ సమాజ స్వప్నానికి రూపమిచ్చేందుకు వాటి వ్యవస్థాపకులు చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. రైట్ టు రీకాల్! ...అంటే తమకు నచ్చని ప్రజాప్రతినిధిని చట్టసభ నుంచి తప్పించే హక్కు. భారత్‌లో లేకున్నా చాలా దేశాల్లో ఈ హక్కుంది. కాకపోతే యూపీలో రాకేశ్ సూరి అనే 42 ఏళ్ల కంప్యూటర్ ఆపరేటర్ ఈ పేరుతో ఏకంగా పార్టీయే పెట్టారు. హామీలు నెరవేర్చని ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే ప్రతిపాదనపై పౌరులకు అవగాహన కల్పించడమే ఆయన లక్ష్యమట. అన్నట్టూ, ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఘాజియాబాద్ నుంచి ఆయన పోటీ కూడా చేస్తున్నారు! యూపీలో ఇలాంటి భిన్నమైన పేర్లతో కూడిన పార్టీలకు కొదవ లేదు. సబ్ సే అచ్ఛీ అనే పార్టీ కూడా అక్కడ ఉనికిలో ఉంది. తొలుత దీని పేరు ఇస్లామిక్ డెమోక్రటిక్ పార్టీ. మతపరమైనదిగా ఉందంటూ అభ్యంతరాలు రావడంతో ఇలా మార్చేశారన్నమాట! ఆప్ కీ అప్నీ పార్టీ (పీపుల్స్), సుభాష్ వాదీ భారతీయ సమాజ్‌వాదీ పార్టీ వంటి పార్టీలు కూడా యూపీలో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈవీ రూ.10 లక్షల లోపయితే ఓకే
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యం..మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ 2023లో రూ.16,675 కోట్లు ఉండగా..2025 నాటికి రూ. 62,532 కోట్లకు చేరే అవకాశముంది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్ల విషయంలో వాహనదారులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నట్టు లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయాల్లో మెజారిటీ వ్యక్తులు రూ.8 నుంచి రూ.10 లక్షలలోపు ధర ఉంటే ఎలక్ట్రిక్ కారు కొనుగోలు సులువు అవుతుందనే అభిప్రాయపడ్డారు. ► పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తాము ఎలక్ట్రిక్ కారు కొనాలని భావిస్తున్నట్టు 44 శాతం మంది చెప్పారు. ►పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు 31% మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మారేందుకు ప్రయతి్నస్తున్నట్టు తెలిపారు. ►2023లో మనదేశంలో 72,321 ఎలక్ట్రిక్ కార్లు రిజిస్టర్ అయ్యాయి. లోకల్ సర్కిల్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 5 శాతం మంది ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ఆసక్తి చూపారు. ఈ లెక్క ప్రకారం 2024లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ 2,00,000కు చేరే అవకాశముంది. ►ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు సంబంధించి దేశవ్యాప్తంగా 319 జిల్లాల్లో లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో 40 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ►తెలంగాణలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలపైనే ప్రస్తుతం రిజి్రస్టేషన్ జీవితకాలపు ఫీజు రాయితీ ఉండగా, ఏపీలో కార్లు, జీపులపై కూడా రిజి్రస్టేషన్ ఫీజు పూర్తిగా రాయితీ ఇస్తున్నట్టు అధికారవర్గాల సమాచారం. ఎలక్ట్రిక్ కారు కొనాలనుకోవడానికి కారణం? ► పర్యావరణ హితంగా ఉండాలని.. 44% ►పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను తట్టుకునేందుకు 31% ►తక్కువ ధరలు 15% ►ఇతర కారణాలు 5% ►చెప్పలేం 5% ఎలక్ట్రిక్ కారు కొనకపోవడానికి కారణాలు ? ►సాధారణ కార్లతో పోలిస్తే అధిక ధర 21 శాతం ►మా ప్రాంతంలో సరిపడా చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం 21 శాతం ►ఎలక్ట్రిక్ కార్ల గురించి అవగాహన లేదు 12 శాతం ►ఈ సమయంలో కారు కొనాలనుకోవడం లేదు 26 శాతం ►నా బడ్జెట్‌కు తగిన మోడల్స్ ఈవీలో లేవు 7 శాతం ►ఇతర కారణాలు, కొనేంత డబ్బు లేదు 8 శాతం ►ఇది నాకు వర్తించదు 5 శాతం -
ఆర్థిక సంవత్సరం.. ఏప్రిల్ 1 నుంచే ఎందుకబ్బా?
ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు మాత్రమే ఎందుకు పరిగణిస్తారు, అని చాలామందికి అనుమానం రావొచ్చు. దీనికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. ఆర్థిక పరిశోధకులు కొన్ని ప్రధాన కారణాలను వెల్లడించారు.బ్రిటిష్ పాలన నుంచి వారసత్వంబ్రిటీష్ దేశాల్లో ఏప్రిల్ నుంచి మార్చి వరకు అకౌంటింగ్ వ్యవధిని అనుసరించారు. భారతదేశం సుమారు 150 సంవత్సరాలు బ్రిటిష్ నియంత్రణలో ఉన్నప్పుడు కూడా ఈస్టిండియా కంపెనీ ఇదే విధానాన్ని కొనసాగించింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఈ పద్దతినే భారత ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది.వ్యవసాయ దేశంభారతదేశం వ్యవసాయ దేశం. కాబట్టి చాలా వరకు ఆదాయం ప్రధానంగా పంటలపై ఆధారపడి ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి కాలంలో పండిన దిగుబడుల అంచనాపై ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఈ రెండు నెలల వ్యవధిలో ఆదాయం పెరుగుతుందా/తగ్గుతుందా అనే అంచనా కూడా వేస్తారు. అందువల్ల ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మార్చి వరకు తీసుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణం.పండుగలుభారతదేశంలో నవరాత్రి, దీపావళి వంటి ప్రధాన పండుగలు అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తాయి. ఆ తరువాత డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది. ఈ సమయంలో వ్యాపారుల అమ్మకాలు భారీగా ఉంటాయి. కాబట్టి డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరం చివరి నెలగా పరిగణించలేరు. మార్చిలో పెద్దగా పండుగలు లేకపోవడం వల్ల ఆర్థిక సంవత్సరం క్లోజింగ్ నెలగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది.ప్రాంతీయ నూతన సంవత్సరంభారతదేశంలో ఏప్రిల్ నెల హిందూ నూతన సంవత్సరానికి సంబంధించినది. ఈ కారణంగా మన దేశంలో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చని చెబుతారు.ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించే దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా ''కెనడా, యునైటెడ్ కింగ్డమ్ (UK), న్యూజిలాండ్. హాంగ్ కాంగ్, జపాన్'' దేశాలు కూడా ఉన్నాయి. -
ఆర్థిక సంవత్సరం.. ఏప్రిల్ 1 నుంచే ఎందుకబ్బా?
ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు మాత్రమే ఎందుకు పరిగణిస్తారు, అని చాలామందికి అనుమానం రావొచ్చు. దీనికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. ఆర్థిక పరిశోధకులు కొన్ని ప్రధాన కారణాలను వెల్లడించారు. బ్రిటిష్ పాలన నుంచి వారసత్వం బ్రిటీష్ దేశాల్లో ఏప్రిల్ నుంచి మార్చి వరకు అకౌంటింగ్ వ్యవధిని అనుసరించారు. భారతదేశం సుమారు 150 సంవత్సరాలు బ్రిటిష్ నియంత్రణలో ఉన్నప్పుడు కూడా ఈస్టిండియా కంపెనీ ఇదే విధానాన్ని కొనసాగించింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఈ పద్దతినే భారత ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. వ్యవసాయ దేశం భారతదేశం వ్యవసాయ దేశం. కాబట్టి చాలా వరకు ఆదాయం ప్రధానంగా పంటలపై ఆధారపడి ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి కాలంలో పండిన దిగుబడుల అంచనాపై ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఈ రెండు నెలల వ్యవధిలో ఆదాయం పెరుగుతుందా/తగ్గుతుందా అనే అంచనా కూడా వేస్తారు. అందువల్ల ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మార్చి వరకు తీసుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణం. పండుగలు భారతదేశంలో నవరాత్రి, దీపావళి వంటి ప్రధాన పండుగలు అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తాయి. ఆ తరువాత డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది. ఈ సమయంలో వ్యాపారుల అమ్మకాలు భారీగా ఉంటాయి. కాబట్టి డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరం చివరి నెలగా పరిగణించలేరు. మార్చిలో పెద్దగా పండుగలు లేకపోవడం వల్ల ఆర్థిక సంవత్సరం క్లోజింగ్ నెలగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ప్రాంతీయ నూతన సంవత్సరం భారతదేశంలో ఏప్రిల్ నెల హిందూ నూతన సంవత్సరానికి సంబంధించినది. ఈ కారణంగా మన దేశంలో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చని చెబుతారు. ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించే దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా ''కెనడా, యునైటెడ్ కింగ్డమ్ (UK), న్యూజిలాండ్. హాంగ్ కాంగ్, జపాన్'' దేశాలు కూడా ఉన్నాయి. -
Sonia Agarwal: డైరెక్టర్‌తో ప్రేమవివాహం- విడాకులు.. ఇప్పటికీ సింగిల్‌గానే! (ఫోటోలు)
-
Sonu Srinivas Gowda Photos: పాపను దత్తత తీసుకుంది.. జైలుపాలైంది (ఫోటోలు)
-
వివాదాలతో సావాసం చేసే ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? (ఫోటోలు)