Parineeti Chopra Fiance Raghav Chadha Net Worth Interesting Facts - Sakshi
Sakshi News home page

Raghav Chadha Net Worth: పరిణీతి చోప్రా ఫియాన్సీ ఆస్తి ఇంతేనా? ఇల్లు, కారు గురించి ఆసక్తికర విషయాలు

Published Mon, May 15 2023 6:57 PM | Last Updated on Mon, May 15 2023 7:12 PM

Parineeti Chopra fiance Raghav Chadha - Sakshi

Raghav Chadha Net Worth: ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది.  ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు!

బాలీవుడ్‌లో విజయవంతమైన చిత్రాలలో నటిస్తున్న పరిణీతి చోప్రా విలాసవంతమైన జీవనశైలి కలిగిన నటి.  ఆమెకున్న బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ఇతర ఆస్తులతో ఆమె నెట్‌వర్త్‌ రూ. 60 కోట్లు. అయితే ఆమెకు కాబోయే భర్త రాఘవ్ చద్దా ఆస్తుల గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. మై నేత డాట్‌ ఇన్ఫో ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ. 50 లక్షలు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా వయసు 34 ఏళ్లు. రాజ్యసభలో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీ. కాబోయే భార్య పరిణీతి చోప్రాతో పోల్చితే రాఘవ్ చద్దా జీవనశైలి,  నికర ఆస్తులు చాలా తక్కువ.

చిన్న ఇల్లు, పాత కారు..
రాఘవ్ చద్దా ప్రకటించిన మొత్తం ఆస్తులు MyNeta.info ప్రకారం.. రూ. 50 లక్షలు. ఇందులో చరాస్తుల విలువ రూ. 36 లక్షలు.  సొంత ఇల్లు ఉంది. దాని విలువ రూ.37 లక్షలు.  ఇక కార్ల విషయానికి వస్తే..  రాఘవ్ చద్దా వద్ద ఉన్నది 2009 మోడల్‌ మారుతీ సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్‌ మాత్రమే.  ఇది కాకుండా ఆయన వద్ద దాదాపు 90 గ్రాముల బంగారం ఉంది. దీని విలువ రూ. 4.94 లక్షలు.

పరిణీతి నెట్‌వర్త్‌ రూ. 60 కోట్లు
ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం.. పరిణీతి చోప్రా నెట్‌వర్త్‌ రూ.60 కోట్లు. ఆమె సంపదలో ఎక్కువ భాగం సినిమా డీల్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుంచి వచ్చిందే. ఆమెకు ముంబైలో సముద్ర తీరాన లగ్జరీ విల్లా ఉంది. ఇక ఆమె దగ్గర ఆడీ A6, జాగ్వార్ XJL, ఆడీ Q5 వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి.

ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్‌.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement