fiance
-
కాబోయే భర్తతో కలిసి పీవీ సింధు డ్యాన్స్ ప్రాక్టీస్(ఫొటోలు)
-
వరలక్ష్మికి కాబోయే భర్త.. నటి కంటే తక్కువే సంపాదించాడా! (ఫోటోలు)
-
గుట్టుగా గోవాలో..పెళ్లి చేసుకున్న నటి
2011లో టాలీవుడ్లో చిత్రం బ్రమ్మిగాడి కథ మూవీతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ అస్మితా సూద్ మూడు ముళ్లు వేయించుకున్న సంబరంలో మునిగి తేలుతోంది. గోవాలో జరిగిన ఒక ప్రయివేట్ ఈవెంట్లో ప్రియుడు, గుజరాతీ వ్యాపారవేత్త సిద్ధ్ మెహతాను పెళ్లాడింది. బాలీవుడ్షాదీస్డాట్కామ్ ప్రకారం అస్మితా సూద్ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గోవాలో ఫిబ్రవరి తొలి వారంలో 'లవ్ ఆఫ్ లైఫ్' సిద్ధ్ మెహతాను వివాహం చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. గులాబీ రంగు లెహంగా, డిజైనర్ ఆభరణాలతో పెళ్లి కూతురిగా అస్మితా, వైల్ కలర్ బంద్‌గాలా సూట్లో సిద్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశారు. అంతేకాదు తొలి రోజు సంగీత్, కాక్టెయిల్ పార్టీ, రెండో రోజు హల్దీ వేడుకలను చేసుకున్న ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. బ్రమ్మిగాడి కథ తరువాత, 40కి పైగా బ్రాండ్లలలో కనిపించింది. అలాగే ‘ఫిర్ భీ నా మానే’...‘బత్తమీజ్ దిల్’, ‘దిల్ హీ తో హై’సహా అనేక టెలివిజన్ షోలతో పాపులర్ అయింది. ఇక చివరిసారిగా టీవీ షో, ‘జనమ్ జనమ్ కా సాత్’లో కనిపించింది. ఇప్పటికే సిద్ధ్ తో డేటింగ్లో ఉన్న ఈ అమ్మడు ఇటీవల వెకేషన్ ఫోటోలను, ప్రియుడు ప్రపోజ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గతేడాది సెప్టెంబర్‌లోనే నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. -
పరిణీతి చోప్రా ఫియాన్సీ ఆస్తి ఇంతేనా?
Raghav Chadha Net Worth: ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! బాలీవుడ్లో విజయవంతమైన చిత్రాలలో నటిస్తున్న పరిణీతి చోప్రా విలాసవంతమైన జీవనశైలి కలిగిన నటి. ఆమెకున్న బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఇతర ఆస్తులతో ఆమె నెట్‌వర్త్ రూ. 60 కోట్లు. అయితే ఆమెకు కాబోయే భర్త రాఘవ్ చద్దా ఆస్తుల గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. మై నేత డాట్ ఇన్ఫో ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ. 50 లక్షలు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా వయసు 34 ఏళ్లు. రాజ్యసభలో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీ. కాబోయే భార్య పరిణీతి చోప్రాతో పోల్చితే రాఘవ్ చద్దా జీవనశైలి, నికర ఆస్తులు చాలా తక్కువ. చిన్న ఇల్లు, పాత కారు.. రాఘవ్ చద్దా ప్రకటించిన మొత్తం ఆస్తులు MyNeta.info ప్రకారం.. రూ. 50 లక్షలు. ఇందులో చరాస్తుల విలువ రూ. 36 లక్షలు. సొంత ఇల్లు ఉంది. దాని విలువ రూ.37 లక్షలు. ఇక కార్ల విషయానికి వస్తే.. రాఘవ్ చద్దా వద్ద ఉన్నది 2009 మోడల్ మారుతీ సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్ మాత్రమే. ఇది కాకుండా ఆయన వద్ద దాదాపు 90 గ్రాముల బంగారం ఉంది. దీని విలువ రూ. 4.94 లక్షలు. పరిణీతి నెట్‌వర్త్ రూ. 60 కోట్లు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం.. పరిణీతి చోప్రా నెట్‌వర్త్ రూ.60 కోట్లు. ఆమె సంపదలో ఎక్కువ భాగం సినిమా డీల్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్ల నుంచి వచ్చిందే. ఆమెకు ముంబైలో సముద్ర తీరాన లగ్జరీ విల్లా ఉంది. ఇక ఆమె దగ్గర ఆడీ A6, జాగ్వార్ XJL, ఆడీ Q5 వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by @parineetichopra ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! -
ఇలా కూడా ఉంటారా.. కాబోయే భర్తని రీల్స్ చేద్దామని పిలిచి..
బెంగళూరు: ప్రస్తుత రోజుల్లో యువతలో రీల్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదొక సరదా నుంచి వ్యసనంగా మారిందని కూడా చెప్పవచ్చు. తాజాగా ఓ మైనర్ బాలిక దీనినే అవకాశంగా తీసుకున్న తనకు కాబోయే భర్తపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటన రాణేబెన్నూరు పట్టణ శివార్లలోని ఓం పబ్లిక్ స్కూల్ సమీపంలో చోటుచేసుకుంది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హవేరి జిల్లాలో 17 ఏళ్ల టీనేజర్‌కు దేవేంద్ర గౌడతో వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఇటీవల వారిద్దరి నిశ్చితార్థం కూడా అయ్యింది. అయితే బాలిక వేరొకరితో ప్రేమలో ఉన్నందున, ఆమె గౌడ్‌తో పెళ్లి ఇష్టం లేకపోవడంతో..అతడిపై దాడి చేయాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఆమె తనకు కాబోయే భర్తకి బహుమతి ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పి.. గౌడను పార్కుకు రప్పించింది. అసలు విషయం అతను యువతిని కలిసేందుకు పార్క్‌కు వెళ్లాడు. ప్లాన్ ప్రకారం బహుమతి ఇస్తానని గౌడ చేతులు కట్టేసి, కళ్లు మూసుకోమని చెప్పి, హఠాత్తుగా అతని మెడపై కత్తితో పొడిచింది. గౌడ తల్లిదండ్రులు బాలికపై హలగేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దేవేంద్ర గౌడను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
కాబోయే భార్యతో ఫస్ట్ పోస్ట్ చేసిన శర్వానంద్.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గు్డ్బై చెప్పబోతున్నారు. రక్షితా రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో ఆయన త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇవాళ(జనవరి26)న హైదరాబాద్‌లోని ఓ హోటల్లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సందడి చేశారు. రామ్‌చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. చిన్నప్పటి నుంచి శర్వా, రామ్‌చరణ్‌లు మంచి స్నేహితులు. ఇక శర్వానంద్ తనను కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోలను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసుకున్నారు. నా జీవితంలో ఎంతో స్పెషల్ పర్సన్ అంటూ కాబోయే భార్యను పరిచయం చేశారు. దీంతో పలువురు సెలబ్రిటీలు సహా అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) -
దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కాబోయే భార్య... దెబ్బకు వరుడు అరెస్టు
రేపు పెళ్లి అనంగా ఒక వ్యక్తి అరెస్టు అయ్యాడు. అతని నిజ స్వరూపాన్ని కాబోయే భార్య బట్టబయలు చేసింది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలోని దాద్రీలో నివాసం ఉంటున్న హసిన్ సైఫీ అనే వ్యక్తి ఒక ఒక మహిళకు తన పేరు ఆశిష్ ఠాకూర్‌గా(నకిలీ పేరుతో) పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఒక రోజు ఆమెకు ఉద్యోగం పోయింది. దీన్నే అవకాశంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఆశిష్ ఆమె ఉంటున్న ఫ్లాట్‌కి వచ్చి ఉండటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే గాక కొద్దిరోజులకే పెళ్లి చేసుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతో ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వారి పెళ్లి ఈ నెల డిసెంబర్ 12న జరగాల్సి ఉంది. ఐతే ఆ జంట ఇంట్లో లేనప్పుడు ఒక పెద్దాయన తన కొడుకు హసన్ ఆచూకీ కోసం ఇరుగుపోరుగు వారిని ఆరా తీశాడు. ఐతే ఇక్కడ ఆశిష్ అనే వ్యక్తి ఇటీవలే కొత్తగా వచ్చి ఉంటున్నాడని హసన్ కాదని వారు చెప్పారు. ఈ విషయం సదరు మహిళ తెలుసుకుని ఆ పెద్దాయనను కలుసుకుంది. ఆయన ద్వారా అతడి పేరు ఆశిష్ కాదని హసీన్ సైఫీ అని తెలుసుకోవడమే గాక అతడి చేసిన మోసం అంతా తెలుసుకుని షాక్ తింటుంది. దీంతో ఆమె తనను మోసం చేయడమేగాక బలవంతంగా పెళ్లిచేసుకునేలా ఒత్తిడి తీసుకువచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సదరు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) దినేష్ కుమార్ తెలిపారు. (చదవండి: పెళ్లైపోతుందనంగా... వధువు తండ్రి ఆనందంగా డ్యాన్స్ చేస్తూ...) -
కాబోయే భార్య ఎగ్జామ్ ఫెయిల్ అయ్యిందని ఏకంగా స్కూల్‌నే తగలెట్టేశాడు
కోపంతో ఆవేశంగా తీసుకునే నిర్ణయాలు చాలా అనర్థాన్ని సృష్టిస్తాయి. ఆ కోపం వారినే కాదు తనతో ఉన్నవారిని కూడా కష్టాలపాల్జేస్తుంది. అచ్చం అలానే ఇక్కడోక వ్యక్తి తన కాబోయే భార్య ఎగ్జామ్ పెయిలైందన్న కోపంతో చేసిన పని కొంతమంది విద్యార్థుల భవితవ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వివారాల్లోకెళ్తే...ఈజిప్టులోని 21 ఏళ్ల యువకుడు తన కాబోయే భార్య చదువుతున్న స్కూల్‌కి నిప్పుపెట్టాడు. తన కాబోయే భార్య ఎగ్జామ్‌లో ఫెయిలైందన్న కోపంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఈ మేరకు ఈజిప్టులోని ఘర్బియా గవర్నరేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈజిప్టు రాజధాని కైరోకు ఉత్తరాన ఉన్న మెనోఫియా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. సదరు నిందితుడు విచారణలో చెప్పిన విషయాలు విని పోలీసుల ఒక్కసారిగా షాక్ అయ్యారు. తన కాబోయే భార్య ఎగ్జామ్ ఫెయిలవ్వడంతో ఆమె మరో ఏడాది చదువుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. అందువల్ల తమ పెళ్లి వాయిదా పడుతుందన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టానని చెప్పుకొచ్చాడు. ఐతే సమయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి త్వరితగతిన మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రిన్స్‌పాల్ కార్యాలయం, అడ్మినిస్ట్రేటివ్ భవనం దారుణంగా దెబ్బతాన్నాయని పోలీసులు చెప్పారు. అంతేగాక ఆ స్కూల్లోని కొంతమంది విద్యార్థుల రికార్డులు నాశనమయ్యాయని తెలిపారు. ఐతే అతను ఈ దారుణానికి ఒడిగట్టినప్పుడు చూసిన స్థానికులు అతని గురించి పూర్తి సమాచారం అందించారని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే కాకుండా కోర్టు ఎదుట హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: Lying Down Championship: అలా తిని పడుకుంటే.. డబ్బులొస్తాయ్!) -
కాబోయే భర్తనే అరెస్టు చేసిన లేడీ సింగంపై అవినీతి మరక
గౌహతి: అస్సాంలోని నాగావ్ జిల్లాలో సబ్-ఇన్స్పెక్టర్ రభాను అవినీతి ఆరోపణలతో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె మజులీ జిల్లాలోని కోర్టు ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. రభా గత నెలలో తన కాబోయే భర్తను అరెస్టు చేసి లేడీ సింగంగా పేరుతెచ్చుకున్న ఆమె ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇద్దరు కాంట్రాక్టర్లు రభా తన కాబోయే భర్త రాణా పోగాగ్‌తో కలిసి ఓఎన్‌జీలో ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకుని మోసం చేశారంటూ పిర్యాదు చేశారని పోలీసుల తెలిపారు. ఆమె కాబోయే భర్త పోగాగ్ రభా తరుపున డబ్బులు వసూలు చేసేరనే ఆరోపణలు కూడా రావడంతో ఆమెను విచారణకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది అక్టోబర్‌లో ఆమెకు పోగాగ్‌తో నిశ్చితార్థం కాగా ఈ ఏడాది నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. ఐతే ఈ ఏడాది జనవరిలో బిహ్పురియా ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్‌తో ఆమె జరిపిన ఫోన్ సంభాషణ లీక్ కావడంతో రభా ఈ వివాదంలో చిక్కుకుంది. లీక్ అయిన ఆ ఆడియో టేప్ తీవ్ర దుమారానికి తెరలేపింది. పైగా ఆయన తన నియోజక వర్గ ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారంటూ రభా పై ఆరోపణలు గుప్పించారు. (చదవండి: చిచ్చురేపిన భూ వివాదం...దంపతులపై ట్రాక్టర్ ఎక్కించి..) -
‘పైసలు ఇవ్వలేక పోతే చావు’ అని మెసేజ్‌లు పెట్టి వేధించడంతో..
హాలియా: పెళ్లి చేసుకోబోయే వ్యక్తి వేధింపులు భరించలేక యువతి బలవన్మరణానికి పాల్పడింది. నల్లగొండ జిల్లా అనుముల మండలం పంగవానికుంట గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. పంగవానికుంటకు చెందిన మేగావత్ వెంకటేశ్వర్లు కుమార్తె నవత (22), త్రిపురారం మండలంలోని లక్పతి తండాకు చెందిన ధనావత్ జగపతిబాబు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన ఇరు కుటుంబాలు ఇటీవల నిశ్చితార్థం జరిపించాయి. కట్నం కింద వరుడికి రూ.20 లక్షల విలువైన ప్లాటుతో పాటు రూ.80 వేల నగదు ఇచ్చేలా పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. కట్నం కింద తనకు ప్లాటు వద్దని.. దాన్ని అమ్మి డబ్బులివ్వాలని జగపతిబాబు ఆదివారం రాత్రి నవతకు ఫోన్ చేసి తిట్టాడు. ‘పైసలు ఇవ్వలేక పోతే చావు’ అని మెసేజ్‌లు పెట్టి వేధించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవత.. సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రాహుల్ రామకృష్ణ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే..
ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. లిప్‌లాక్ ఫోటోతో కాబోయే భార్యను పరిచయం చేస్తూ.. ఎట్టకేలకు త్వరలోనే పెళ్లి అంటూ శుభవార్త చెప్పాడు. అర్జున్‌రెడ్డి స్టైల్లో ఢిపరెంట్‌గా పెళ్లి వార్తను అనౌన్స్ చేయడంతో క్షణాల్లోనే రాహుల్ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: లిప్ లాక్ ఫోటోతో పెళ్లి అనౌన్స్ చేసిన ప్రముఖ కమెడియన్ ఈ క్రమంలో రాహుల్ రామకృష్ణ పెళ్లి చేసుకోబోయేది ఎవరు,ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరిగింది. మరికొందరేమో ఆమె పేరు బిందు అంటూ నెట్టింట ప్రచారం చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు హరిత.. బిందు కాదు' అంటూ క్లారిటీ ఇచ్చాడు. చదవండి: అల్టీమేట్ ఫన్ ఎఫ్-3 ట్రైలర్ వచ్చేసింది.. Small clarification- my fiancé’s name is Haritha, not Bindu. ☺️ — Rahul Ramakrishna (@eyrahul) May 8, 2022 -
పచ్చి మోసగాడని తెలీదు.. నా కళ్లు తెరిపించారు
నా జీవితం నాశనం అవ్వకుండా కాపాడారు. అతనంత పచ్చి మోసగాడని తెలీదు. విషయం నా దాకా తీసుకొచ్చిన ఆ ముగ్గురికి జీవితాంతం రుణపడి ఉంటా. వాళ్లు నా కళ్లు తెరిపించారు. అంటోంది అస్సాం(అసోం) నాగావ్‌కు చెందిన ఎస్సై జున్‌మోనీ రభా. సోషల్ మీడియాలో ఈ ధైర్యశాలి పోలీస్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. అసోంలో ఈ మహిళా పోలీసు అధికారిణి.. తన కాబోయే భర్త మోసగాడని తెలియడంతో ఏమాత్రం వెనుకంజ వేయకుండా అరెస్ట్ చేసింది. జున్‌మోనీ రభా నాగావ్‌లో పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. గత అక్టోబరులో రానా పోగాగ్ అనే వ్యక్తితో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్‌లో ఆమె వివాహం జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. రానా పోగాగ్ తనను తాను ఓ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్(పీఆర్వోగా) జున్‌మోనీ కుటుంబానికి పరిచయం చేసుకున్నాడు. అయితే, అతగాడు ఓఎన్జీసీలో పనిచేస్తున్నానని పలువురిని నమ్మబలికి.. ఉద్యోగాల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. అతనికి కాబోయే భార్య ఒక ఎస్సై అని, పైగా నిజాయితీకి మారుపేరని తెలియడంతో ముగ్గురు బాధితులు ఆమెను ఆశ్రయించారు. దీంతో వాళ్ల నుంచి ఫిర్యాదు తీసుకుని మరి రానా పోగాగ్ ను అరెస్ట్ చేసింది. మధ్యవర్తి ద్వారా వచ్చిన ఆ సంబంధాన్ని పెద్దలే తీసుకురావడంతో తాను మంచోడనే అనుకున్నానంటూ ఆమె చెబుతోంది. ఇదిలా ఉంటే.. జున్మోనీకి ధైర్యశాలి అధికారిణి అనే పేరుంది. గతంలో ఎంతో సంక్షిష్టమైన కేసుల్ని సాహసోపేతంగా డీల్ చేశారామె. అందుకే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలోనూ ఆమె డేరింగ్ స్టెప్ తీసుకుందని పలువురు కొనియాడుతున్నారు. చదవండి: పాక్ నుంచి రిందా కుట్ర -
కాబోయే భార్యకు స్టేజ్‌పై ప్రపోజ్ చేసిన హీరో కార్తికేయ
Hero Karthikeya Proposed to His Fiance Lohitha Reddy: ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా రాజా విక్రమార్క చిత్రంలో నటించాడు. శనివారం(నవంబర్7)న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో కార్తికేయ తన కాబోయే భార్యను అందరికి పరిచయం చేశాడు. ఈవెంట్లోనే భార్యకు లవ్‌ప్రపోజ్ చేశాడు. 'నేనే ముందు ప్రపోజ్ చేశా. నా లైఫ్‌లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ తన ప్రేమ కోసం పెట్టాను. అప్పుడే చెప్పా..హీరో అయ్యాక వచ్చి మీ ఇంట్లో అడుగుతానని. అదృష్టం. ఆ అమ్మాయినే నేను ఈనెల21న పెళ్లి చేసుకోబోతున్నాను. తను నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, గాళ్ ఫ్రెండ్. ఎక్స్ గాళ్ ఫ్రెండ్. ఇక నుంచి ఒక్కటే రోల్.. వైఫ్' అంటూ కాబోయే భార్యను పరిచయం చేశాడు. కాగా కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా లోహిత కార్తికేయ కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. -
అతను కూడా నాలాగే ఆమెను ప్రేమిస్తున్నాడు
న్యూఢిల్లీ: కొంతమంది మంచి మనుషులను చేసే గొప్ప గొప్ప పనులను చూస్తే మనకి అభినందించడం, మెచ్చుకోవడం వంటి మాటలు సరిపోవేమో అనేలా ఉంటుంది వారి వ్యక్తిత్వం. అలాంటి మహోన్నత వ్యక్తులు చాలా అరుదు. ఒకవేళ తారస పడితే మన అదృష్టంగా భావిస్తాం. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయికి భర్తగా వస్తే ఆ అమ్మాయి ఆనందం మాటల్లో చెప్పలేం కదా! (చదవండి: రాజీనామా ఉపసంహరణ చేసుకున్న సిద్ధూ) అసలు విషయం ఏమిటంటే ప్రతి వ్యక్తి జీవితంలో వివాహ వేడుక అత్యంత మధురమైన ఘట్టం. అలాంటి వివాహతంతులో ఒక పెళ్లికూతురు తన కవల సోదరి దివ్యాంగురాలు. ఆమె కూడా ఆ తంతులో పెళ్లికూతురులా ముస్తాబవుతోంది. ఆమెను తమ వివాహ వేడుకకు తన కాబోయే భర్తే స్వయంగా అతని చేతులతో ఆమెను ఎత్తుకుని తీసుకు వస్తాడు. ఇది ఆ వివాహ వేడుకు వచ్చిన బంధువులందర్నీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాక అందరీ హృదయాలను గెలుచుకున్నాడు. ఈ సంఘటనను వధువు వీడియో తీసి "ఇప్పుడు నేను అతన్ని నా భర్త అని మనస్పూర్తిగా పిలుస్తాను, నేను అతన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. అంతేకాదు నేను నా చెల్లెల్ని నేను ఎంత అమితంగా ప్రేమిస్తున్నానో తను అంతే ప్రేమిస్తున్నాడంటూ ట్యాగ్ లైన్ జోడించి మరీ పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు నెటిజన్లు దయకు అర్థం అతనే అంటూ ఆ పెళ్లికొడుకుపై ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు. (చదవండి: అమేజింగ్.. ప్రపంచంలోనే అత్యంత పొడగరి!) -
అయ్యో ఎంత పని: బాత్ వీడియో వైరల్, యువతి ఆత్మహత్య
భోపాల్: గోప్య, వ్యక్తి గతమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్న టీనేజర్లకు ఈ సైట్స్ వినియోగం ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయో తెలిపే ఘటన ఇది. తెలిసో తెలియకో, సరదాకోసమో చేసే పిచ్చి పనులు ఒక్కోసారి ప్రాణాలు మీదికి తీసుకొస్తాయి. ఇలాంటి పొరపాటు పనే ఒక యువతి ప్రాణం తీసింది. తన కాబోయే భర్తకు తనకు సంబంధించిన వ్యక్తిగత వీడియోను పంపాలనుకుంది. కానీ కాస్తా వికటించి చివరికి ప్రాణాలే పోగొట్టుకుంది. మధ్యప్రదేశ్, ఉజ్జయిని పరిధిలోని తోబ్రిఖేడా గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాలను పరిశీలిస్తే.. తోబ్రిఖేడాకు చెందిన యువతికి 15 రోజుల క్రితం ఇండోర్‌కు చెందిన ఒక యువకుడితో నిశ్చితార్థం జరిగింది. కాబోయే భర్తతో సరదాగా ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో ఏమైందో తెలియదుగానీ స్నానం చేస్తున్న వీడియోను భర్తకు పంపాలనుకుంది. అనుకున్నట్టుగా వీడియోను తీసుకుంది. కానీ ఇక్కడే దారుణం జరిగిపోయింది. వాట్సాప్ ద్వారా తన కాబోయే భర్తకు పంపాల్సిన వీడియోను, పొరపాటున తన మరో ఫ్రెండ్‌కి పంపేసింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికి బదులుగా మిగిలిన వాట్సాప్ గ్రూపులో షేర్ చేశాడు. అంతే అది క్షణాల్లో వైరల్ అయింది. చివరికి ఈ విషయం బాధిత యువతి తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకు తెలియడంతో తీవ్రంగా మందలించారు. దీంతో జరిగిన పొరపాటును సరిదిద్దుకునే మార్గం తోచక, పరువు పోతుందనే భయంతో ఆమె విషం తాగేసింది. వెంటనే ఆమెను స్థానికంగా ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ యువతి మరణించింది. దీంతో త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన తమ బిడ్డ శ్మశానానికి తరలి పోవడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇప్పటివరకు ఈ విషయంలో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. -
4 రోజుల్లో పెళ్లి.. రోడ్డు పక్కన పెళ్లి కూతురు శవం
లక్నో: అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన కుమార్తెకు పెళ్లి కుదిరింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. కొద్ది రోజుల్లో వివాహం జరగనుంది. తండ్రి బంధువులకు పెళ్లి కార్డులు పంచడానికి వెళ్లాడు. బయటకు వెళ్లే ముందు ఇంట్లో తనకు నవ్వుతూ కనిపించిన కుమార్తె.. గంటల వ్యవధిలోనే రోడ్డు పక్కన శవంగా కనిపించడంతో ఆ తండ్రి గుండె పగిలింది. ఆయనను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు. ప్రేమించి.. పెళ్లాడబోతున్న వాడే ఈ గర్భశోకాన్ని మిగల్చడం విషాదకరం. హృదాయవిదారక సంఘటన ఉత్తరప్రదేశ్ బరేలీలో చోటు చేసుకుంది. ఆ వివారలు.. బరేలీకి చెందిన మదన్‌పాల్ సింగ్ కుమార్తె మీనాక్షికి జితన్ అనే వ్యక్తితో వివాహం నిశ్చయమయ్యింది. మరో విశేషం ఏంటంటే వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 20న వివాహం.. మదన్‌పాల్ కుటుంబం ఆ పనులతో బిజీగా ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పెళ్లి కార్డులు పంచడానికి బయలుదేరాడు మదన్‌పాల్. మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వస్తుండగా.. మొరాదాబాద్ కుర్ద్వారా ప్రాంతంలో ఓ చోట రోడ్డు మీద జనం గుమికూడి ఉండటం గమనించాడు. ఏం జరిగిందో తెలుసుకుందామని అక్కడకు వెళ్లాడు. ఇక అక్కడ కనిపించిన దృశ్యం చూసి కుప్పకూలిపోయాడు మదన్‌పాల్. తల్లి మీనాక్షి అంటూ బిగ్గరగా ఏడ్వసాగాడు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరేముందు చిరునవ్వుతో తనకు బాయ్ చెప్పిన కుమార్తె మధ్యాహ్నానికి శవంగా కనిపించడంతో ఆ తండ్రి పిచ్చివాడయ్యాడు. గుండలవిసేలా ఏడ్చాడు. మదన్పాల్ను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాలేదు. అసలేం జరిగింది... మదన్‌పాల్ ఇంటి నుంచి వెళ్లాక జితిన్ మీనాక్షికి కాల్ చేశాడు. షాపింగ్‌కు వెళ్దాం బయటకు రమ్మని కోరాడు. బయటకు వచ్చాక ఆమెను హత్య చేశాడు. కారణం ఏంటంటే అతడికి మీనాక్షిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దానిగురించి మాట్లాడటానికి మీనాక్షిని బయటకు పిలచాడు. ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. వివాహాన్ని ఆపాలని కోరాడు. అందుకు మీనాక్షి అంగీకరించకలేదు. దాంతో ఆగ్రహించిన జితిన్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి జితిన్‌ను అరెస్ట్ చేశారు. చదవండి: వరుడికి బంపరాఫర్.. స్టేజిమీదే ముద్దు పెట్టిన మరదలు -
ప్రేయసికి నిశ్చితార్థం: అంతలోనే కిడ్నాప్ చేసిన లవర్
మైలార్దేవుపల్లి (హైదరాబాద్): తన ప్రేయసికి ఒకడితో వివాహం నిశ్చయమైన విషయం తెలుసుకున్న ప్రియుడు తట్టుకోలేకపోయాడు. దీంతో ప్రేయసికి కాబోయే భర్తను కిడ్నాప్ చేశాడు. తన లవర్‌ను పెళ్లి చేసుకోవద్దు అనే ఉద్దేశంతో అతడు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మైలార్ దేవుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అబ్బాయి, అమ్మాయి తరఫు వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మైలార్దేవుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కింగ్స్ కాలనీకు చెందిన నదీమ్ ఖాన్(28)కు ఇటీవల ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ అమ్మాయిని ఓ యువకుడు ప్రేమించాడు. ఈ విషయం తెలుసుకున్న అతడు పెళ్లిని చెడగొట్టాలని భావించాడు. ఈ క్రమంలో ఆమెకు కాబోయే భర్త నదీమ్ ఖాన్ శనివారం బైక్‌పై వెళ్తుండగా ఆపి కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ఆ ప్రేమికుడు కిడ్నాప్ చేయడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ అతడితో కుమార్తె ప్రేమాయణం తెలిసే కుటుంబసభ్యులు నదీమ్‌ఖాన్‌తో నిశ్చితార్థం జరిపారు. ఇది తట్టుకోలేకనే ఆ యువకుడు నదీమ్‌ను కిడ్నాప్ చేశారని తెలుస్తోంది. అయితే ఈ కిడ్నాప్ ఘటనలో అమ్మాయికి ముందుగానే సమాచారం ఉందా లేదా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మైలార్ దేవుపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు కిడ్నాప్‌లో పాల్గొన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని విచారణ చేపట్టి కిడ్నాప్‌కు గురయిన నదీమ్‌ఖాన్‌ను విడుదల చేయించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. చదవండి: కరోనా సోకిందని సూటిపోటి మాటలు.. ఆత్మహత్య చదవండి: ఘోరం నలుగురు కరోనా రోగులు సజీవ దహనం -
ఇంతకూ ధనశ్రీ ఎవరో తెలుసా!
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. చహల్ కొంతకాలంగా ధనశ్రీ వర్మ అనే యువతిని ప్రేమిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తననే పెళ్లి చేసుకోబోతున్నానని, ఇవాళ (శనివారం) రోకా కార్యక్రమం కూడా జరిగినట్లు చహల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. రోకా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేస్తూ అవును ‘మేము ప్రేమించుకున్నాం’ అంటూ ట్వీట్ చేశాడు. అప్పటి నుంచి ఈ ధనశ్రీ వర్మ ఎవరా? అని తెలుసుకునేందుకు నెటిజన్లు, చహల్ అభిమానులు గూగుల్‌లో వెతకడం మొదలు పెట్టారు. అయితే ఈ ధనశ్రీ.. ఓ డ్యాన్సర్, కొరియోగ్రఫర్. తన పేరు మీద సొంతంగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. (చదవండి: టీమిండియా క్రికెటర్ చహల్ పెళ్లి ఆమెతోనే) అతే విధంగా బాలీవుడ్ ట్రాక్స్ డ్యాన్సర్‌తో పాటు హిప్ హాప్లో శిక్షణ కూడా ఇస్తూ ఉంటుంది. అంతేకాదు తను ఫేమస్ యూట్యూబర్ కూడా. యుట్యూబ్లో తనకు 1.5 మిలియన్న్ల ఫాలోవర్స్ కూడా ఉన్నారు. కాగా ధనశ్రీ వర్మ జూలై 23 చహల్ పుట్టిన రోజు సంద్భంగా శుభకాంక్షలు చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో సల్మాన్ ఖాన్ ‘భరత్’లోని ఓ స్లో మోషన్ సాంగ్‌కు చహల్ డ్యాన్స్ చేస్తున్నవీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. “డ్యాన్స్ టీచర్‌గా నేను మీ వికెట్ తీశానని చెప్పాలనుకుంటున్నాను @yuzi_chahal23 మీరు ఎప్పుడు సరదాగా ఉండే విద్యార్థి, అద్భుతమైన వ్యక్తి కూడా” అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. దీనికి చహల్ ‘ధన్యవాదాలు’ అంటూ హర్ట్ ఎమోజీని జోడించి సమాధానం ఇచ్చాడు. -
ఫియాన్సీ కాస్తా ప్రొడ్యూసర్ ఆయెనే!
నయనతార, విఘ్నేశ్ శివన్ లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. ప్రేమను అధికారికంగా ప్రకటించకపోయినా పండగలు చేసుకోవడాలు, కలిసి టూర్‌కి వెళ్లడాలతో వ్యక్తపరుస్తుంటారు. ఓ అవార్డ్ ఫంక్షన్లో విఘ్నేశ్‌ను నయనతార ఫియాన్సీ (కాబోయే భర్త) అని సంబోధించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఫియాన్సీ ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మారబోతున్నారట. ఇటీవల దర్శకుల్లో ఎక్కువ శాతం మంది నిర్మాణంలో భాగం అవ్వాలనుకుంటున్నారు. తాజాగా విఘ్నేశ్ కూడా ఓ సినిమా నిర్మించాలనుకుంటున్నారట. నయనతార ప్రధాన పాత్రలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. సిద్ధార్థ్, ఆండ్రియా హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘అవళ్’ (తెలుగులో గృహం) దర్శకుడు మిలింద్ రాజు ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించనున్నారు. శివ కార్తికేయన్‌తో చేస్తున్న ‘మిస్టర్ లోకల్’ షూటింగ్ పూర్తి చేశాక విజయ్ సరసన కమిట్ అయిన కొత్త షూటింగ్లో జాయిన్ అవ్వనున్నారు నయనతార. ఆ తర్వాత తన ఫియాన్సీ నిర్మించనున్న సినిమాను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. -
కాబోయే భర్త అంటూ అనౌన్స్ చేసేసింది
సాక్షి, చెన్నై : లేడీ సూపర్ స్టార్ నయనతార, యువదర్శకుడు విఘ్నేశ్ శివన్ మధ్య సంబంధం గురించి తెలియంది కాదు. నాన్‌మ్ రౌడీ ధాన్(తెలుగులో నేనూ రౌడీనే)చిత్ర షూటింగ్ సందర్భంగా ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరూ పలు ఈవెంట్లలో జంటగా కనిపిస్తూ హాట్ టాపిక్‌గా మిగిలారు. ఒకానోక దశలో వీరిద్దరూ కేరళలో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు రావటం.. వాటిని నయనతార ఖండించటం చూశాం. ఆ సమయంలో విఘ్నేశ్‌తో ఉంది కేవలం స్నేహం మాత్రమే అంటూ ఆమె ప్రకటించారు. అయినప్పటికీ వారి మధ్య రిలేషన్షిప్ గురించి తర్వాత చాలా కథనాలు వచ్చాయి. ఇక శుక్రవారం ది హిందూ పత్రిక నిర్వహించిన మహిళా అవార్డుల వేడుకలో నయనతార పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటనా రంగంలో ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న నయన్.. తల్లిదండ్రులకు, సోదరుడికి, కాబోయే భర్త(విఘ్నేశ్‌ను ప్రస్తావిస్తూ)కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వేదిక మీద ప్రకటించింది. దీంతో వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారన్న వార్త కన్ఫర్మ్ అయిపోయింది. -
ఆ నచ్చినవాడెవరు?
నచ్చినోడితో జీవితం పంచుకోవడం సంతోషమే కదా అంటోంది నటి త్రిష. ఈ బ్యూటీకి పెళ్లి కళ వచ్చేసిందనేది తాజా వార్త. పెళ్లెప్పుడంటూ ఎన్నోసార్లు ఎందరో అడిగిన ప్రశ్నకు ఈ చెన్నై చిన్నది బదులిచ్చింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటున్న త్రిష ప్రస్తుతం చాలా జోష్‌లో ఉంది. అందుకు కారణం తాజాగా ఈ భామ నటించిన ఎండ్రెండ్రుం పున్నగై చిత్రం హిట్‌టాక్‌ను సొంతం చేసుకోవడమే. త్రిష మాట్లాడుతూ తాను సినీ రంగ ప్రవేశం చేసి దశాబ్దం దాటిందని చెప్పింది. చిత్ర విజయం అనేది ఏ నటికైనా చాలా ముఖ్యం అని చెప్పింది. ఎండ్రెండ్రుం పున్నగై తనకు చాలా ముఖ్యమైన చిత్రం అని చెప్పింది. ఏడాది గ్యాప్ తరువాత తమిళంలో విడుదలైన ఈ చిత్రం సక్సెస్ టాక్‌ను సంపాదించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది. హీరోయిన్గా అన్ని తరహా పాత్రలు పోషించానని అందువలన ఫలానా పాత్ర పోషించాలనే కోరికలు లేవని పేర్కొంది. తన మనసుకు నచ్చిన పాత్రల్ని చేసుకుంటూ పోతున్నట్టు తెలిపింది. పెళ్లి చేసుకుంటున్నారా? అని తనను అడుగుతున్నారని ఖచ్చితంగా అది జరుగుతుందని చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వనున్నట్లు తెలిపింది. జీవితంలో మనసుకు నచ్చిన వాడితో భాగం పంచుకోవడం ఆనందమేగా నంటున్న ఈ ముద్దుగుమ్మ ఆ నచ్చిన వాడెవరో చెప్పలేదు.