
ప్రతీకాత్మక చిత్రం
లక్నో: అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన కుమార్తెకు పెళ్లి కుదిరింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. కొద్ది రోజుల్లో వివాహం జరగనుంది. తండ్రి బంధువులకు పెళ్లి కార్డులు పంచడానికి వెళ్లాడు. బయటకు వెళ్లే ముందు ఇంట్లో తనకు నవ్వుతూ కనిపించిన కుమార్తె.. గంటల వ్యవధిలోనే రోడ్డు పక్కన శవంగా కనిపించడంతో ఆ తండ్రి గుండె పగిలింది. ఆయనను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు. ప్రేమించి.. పెళ్లాడబోతున్న వాడే ఈ గర్భశోకాన్ని మిగల్చడం విషాదకరం. హృదాయవిదారక సంఘటన ఉత్తరప్రదేశ్ బరేలీలో చోటు చేసుకుంది. ఆ వివారలు..
బరేలీకి చెందిన మదన్‌పాల్ సింగ్ కుమార్తె మీనాక్షికి జితన్ అనే వ్యక్తితో వివాహం నిశ్చయమయ్యింది. మరో విశేషం ఏంటంటే వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 20న వివాహం.. మదన్‌పాల్ కుటుంబం ఆ పనులతో బిజీగా ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పెళ్లి కార్డులు పంచడానికి బయలుదేరాడు మదన్‌పాల్. మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వస్తుండగా.. మొరాదాబాద్ కుర్‌ద్వారా ప్రాంతంలో ఓ చోట రోడ్డు మీద జనం గుమికూడి ఉండటం గమనించాడు. ఏం జరిగిందో తెలుసుకుందామని అక్కడకు వెళ్లాడు.
ఇక అక్కడ కనిపించిన దృశ్యం చూసి కుప్పకూలిపోయాడు మదన్‌పాల్. తల్లి మీనాక్షి అంటూ బిగ్గరగా ఏడ్వసాగాడు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరేముందు చిరునవ్వుతో తనకు బాయ్ చెప్పిన కుమార్తె మధ్యాహ్నానికి శవంగా కనిపించడంతో ఆ తండ్రి పిచ్చివాడయ్యాడు. గుండలవిసేలా ఏడ్చాడు. మదన్‌పాల్‌ను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాలేదు.
అసలేం జరిగింది...
మదన్‌పాల్ ఇంటి నుంచి వెళ్లాక జితిన్ మీనాక్షికి కాల్ చేశాడు. షాపింగ్‌కు వెళ్దాం బయటకు రమ్మని కోరాడు. బయటకు వచ్చాక ఆమెను హత్య చేశాడు. కారణం ఏంటంటే అతడికి మీనాక్షిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దానిగురించి మాట్లాడటానికి మీనాక్షిని బయటకు పిలచాడు. ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. వివాహాన్ని ఆపాలని కోరాడు. అందుకు మీనాక్షి అంగీకరించకలేదు. దాంతో ఆగ్రహించిన జితిన్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి జితిన్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment