ఇలా కూడా ఉంటారా.. కాబోయే భర్తని రీల్స్ చేద్దామని పిలిచి.. | Karnataka: Teenage Girl Stabs Fiance In The Name Of Making Reels | Sakshi
Sakshi News home page

ఇలా కూడా ఉంటారా.. కాబోయే భర్తని రీల్స్ చేద్దామని పిలిచి..

Published Sun, Apr 9 2023 7:26 PM | Last Updated on Mon, Apr 10 2023 5:49 AM

Karnataka: Teenage Girl Stabs Fiance In The Name Of Making Reels - Sakshi

బెంగళూరు: ప్రస్తుత రోజుల్లో యువతలో రీల్స్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇదొక సరదా నుంచి వ్యసనంగా మారిందని కూడా చెప్పవచ్చు. తాజాగా ఓ మైనర్ బాలిక దీనినే అవకాశంగా తీసుకున్న తనకు కాబోయే భర్తపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటన రాణేబెన్నూరు పట్టణ శివార్లలోని ఓం పబ్లిక్ స్కూల్ సమీపంలో చోటుచేసుకుంది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హవేరి జిల్లాలో 17 ఏళ్ల టీనేజర్‌కు దేవేంద్ర గౌడతో వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఇటీవల వారిద్దరి నిశ్చితార్థం కూడా అయ్యింది. అయితే బాలిక వేరొకరితో ప్రేమలో ఉన్నందున, ఆమె గౌడ్‌తో పెళ్లి ఇష్టం లేకపోవడంతో..అతడిపై దాడి చేయాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఆమె తనకు కాబోయే భర్తకి బహుమతి ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పి.. గౌడను పార్కుకు రప్పించింది.

అసలు విషయం అతను యువతిని కలిసేందుకు పార్క్‌కు వెళ్లాడు. ప్లాన్‌ ప్రకారం బహుమతి ఇస్తానని గౌడ చేతులు కట్టేసి, కళ్లు మూసుకోమని చెప్పి, హఠాత్తుగా అతని మెడపై కత్తితో పొడిచింది. గౌడ తల్లిదండ్రులు బాలికపై హలగేరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దేవేంద్ర గౌడను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement