(నల్గొండ జిల్లా) చిట్యాల: మండలంలోని పెద్దకాపర్తి గ్రామానికి చెందిన రామన్నపేట సమితి మాజీ ప్రెసిడెంట్ కందిమళ్ల జగ్గారెడ్డి మనుమడు రాజీవ్‌రెడ్డికి యూకేలోని మాంచెస్టర్‌కు చెందిన యువతితో శనివారం వివాహం జరిగింది. రాజీవ్‌రెడ్డి మాంచెస్టర్‌లో హోటల్ మేనేజమెంట్ కోర్సు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే పోలీస్‌శాఖలో పనిచేస్తున్న లారెన్ ఫిషర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్‌లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో శనివారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తమ కుమార్తె తెలంగాణ ఇంటి కోడలు కావటం ఎంతో ఆనందంగా ఉందని వధువు తల్లిదండ్రులు కే.ఫిషర్ డేవ్ ఫిషర్ ఆనందం వ్యక్తం చేశారు. పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు మహేందర్‌రెడ్డి–ప్రేమలత ఇరుకుటుంబాలకు చెందిన పెద్దలతో పాటు పెద్దకాపర్తి గ్రామ మాజీ సర్పంచ్ కందిమళ్ల శిశుపాల్‌రెడ్డి–రేణుక, కందిమళ్ల జైపాల్‌రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment