breaking news
Yadadri District News
-
సాగు, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం
చౌటుప్పల్ : చౌటుప్పల్ ప్రాంతంలో నెలకొన్న సాగు, తాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. పిలాయిపల్లి కాలువ నుంచి లక్కారం చెరువులోకి మూసీ జలాలను తరలించేందుకు దివీస్ పరిశ్రమ సీఎస్ఆర్ నిధులు రూ.1.10లక్షలతో రూపొందించిన లిఫ్ట్ పథకానికి శనివారం చిన్నకొండూర్ గ్రామ శివారులో ఆయన శంకుస్థాపన చేశారు. అదే విధంగా మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడేనికి జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి దివీస్ పరిశ్రమ సీఎస్ఆర్ నిధులు రూ.88లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివృద్ధి పనులకు దివీస్ పరిశ్రమ తమ వంతుగా సీఎస్ఆర్ నిధులు వెచ్చించడం అభినందనీయమన్నారు. ఇతర పరిశ్రమల యాజమాన్యాలు సైతం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ మనోహర్, డీఈ కృష్ణారెడ్డి, ఏఈలు పృథ్వీ, వెంకటరమణ, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, దివీస్ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, ఎంపీడీఓ సందీప్‌కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పబ్బు రాజుగౌడ్, దివీస్ ప్రతినిధులు బి.కిషోర్‌కుమార్, గోపి, శివకృష్ణ, పలు గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి -
మేడారం ప్రసాదం పంపిణీకి ఆర్టీసీ శ్రీకారం
రామగిరి(నల్లగొండ): దేవాదాయ శాఖ సహకారంతో ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదం, దేవతల ఫొటోతో సహా పసుపు, కుంకుమ అందజేయనున్నట్లు రీజనల్ మేనేజర్ జానిరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను శనివారం నల్లగొండలో ఆవిష్కరించిన అనంతరం రీజనల్ మేనేజర్ జానిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రసాదం కోసం www.tgsrtclogistics.co.in వెబ్సైట్లో లేదా సమీపంలోని ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో రూ.299 చెల్లించి ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని తెలిపారు. మరింత సమాచారం కోసం నల్ల గొండ 9154298690, మిర్యాలగూడ 9154298693, దేవరకొండ 9154298694, సూర్యాపేట 9154298695 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బద్రి నారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. సంక్రాంతి సెలవుల్లో మేడారం, కొమురవెల్లి, ఐనవోలు వంటి ఆలయాలకు వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో యాదగిరీశుడిని దర్శించుకొని వెళ్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కోలాహలంగా మారాయి. ధర్మ దర్శనానికి రెండు గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి 45 నిమిషాల సమయం పట్టింది. శ్రీస్వామిని 35వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో శ్రీస్వామి వారికి నిత్యాదాయం రూ.35,07,311 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. -
సెలవులు జీవితాలు
నల్లగొండ, అర్వపల్లి : ఆ నలుగురు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు. వారంతా ఒకే మండలంలో పనిచేస్తున్నారు. నల్లగొండ నుంచి తుంగతుర్తి మండలానికి ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలకు వచ్చి వెళుతుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్న వారు సెలవులు ముగియడంతో శనివారం పాఠశాలలకు పయనమయ్యారు. మరో అరగంటలో బడులకు చేరుకుంటారనగా.. మార్గమధ్యలో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఇందులో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి శివారులో శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటన ఉపాధ్యాయ లోకాన్ని విషాదంలోకి నెట్టివేసింది. విద్యార్థులను కలిచివేసింది. నల్లగొండ నుంచి తుంగతుర్తికి.. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని కేజీబీవీ ప్రత్యేక అధికారిణి మామిడాల కల్పన(43), తుంగతుర్తి మండలం రావులపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు పోరెడ్డి గీత(48)తో పాటు తుంగతుర్తి జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు అలువాల ప్రవీణ్‌కుమార్, తుంగతుర్తి మండలం అన్నారం జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు అలువాల సునితారాణి శనివారం ఉదయం గీతకు చెందిన కారులో నల్లగొండ నుంచి పాఠశాలలకు బయలుదేరగా అర్వపల్లి శివారులోని ముదిరాజ్‌కాలనీ వద్ద కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ టైరు పేలి 200 మీటర్ల దూరంలో పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో రోడ్డుపై దుమ్ములేవడంతో అక్కడ ఏమీ కనిపించలేదని స్థానికులు తెలిపారు. కల్పన, గీత తీవ్రంగా గాయపడి మృతిచెందగా.. సునితారాణి, ప్రవీన్కుమార్లు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కారు డ్రైవర్ గిరికి స్వల్ప గాయాలయ్యాయి. సీటు బెల్టులు ధరించి ఉంటే.. కారులో డ్రైవర్‌తో పాటు ఉపాధ్యాయులు కూడా సీటు బెల్టులు ధరించలేదు. ఈ బెల్టులు ధరించి ఉంటే ఇంతపెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని పోలీసులు చెబుతున్నారు. నివాళులర్పిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిఫ మరో అరగంట అయితే పాఠశాలలకు వెళ్లేవారే.. ఫ ఈలోపే కబళించిన మృత్యువు ఫ రోడ్డు ప్రమాదంలో ఎస్ఓ, హెచ్ఎం మృతి ఫ మరో ఇద్దరు హెచ్ఎంలకు తీవ్ర గాయాలు ఫ గాయపడిన హెచ్ఎంలు అన్నాచెల్లెళ్లు ఫ విషాదంలో ఉపాధ్యాయ లోకం -
నేరుగా వరి విత్తనాలు విత్తే పద్ధతితో అధిక దిగుబడులు
గరిడేపల్లి: నేరుగా వరి విత్తనాలు విత్తే పద్ధతితో అధిక దిగుబడులు సాధించవచ్చని భారత వరి పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త మహేందర్‌కుమార్, అగ్రానమి విభాగాధిపతి సాయిప్రసాద్ అన్నారు. శనివారం ఎస్బీఐ ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా వరి విత్తనాలు నేరుగా విత్తే సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీఎస్ఆర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించి వరి సాగును సుస్థిరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. నేరుగా విత్తిన వరి సాగులో పాటించాల్సిన భూమి తయారీ, విత్తన మోతాదు. పోషకాల నిర్వహణ, కలుపు నియంత్రణ, నీటి యాజమాన్యం, ఖర్చు తగ్గించే సాగు పద్ధతులపై రైతులకు వివరించారు. ప్రాజెక్టు ద్వారా నేరుగా విత్తే వరికి అనుకూలమైన ధాన్60 వరి విత్తనాన్ని, హూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్‌ను రైతులకు అందించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు నరేష్, కిరణ్‌కుమార్, ఎస్బీఐ, డీఎస్ఆర్ ప్రాజెక్టు రీసెర్చ్ అసోసియేట్ కవిరాజు తదితరులు పాల్గొన్నారు. -
గ్రంథాలయానికి 1,235 పుస్తకాల అందజేత
చిట్యాల: మండలంలోని గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన కీర్తి పురస్కార గ్రహీత, విపంచి ఫౌండేషన్ చైర్మన్ అనుముల శ్రీనివాస్ చేపట్టిన స్టార్ట్ లైబ్రెరీ–సేవ్ లైబ్రెరీ కార్యక్రమానికి ఏపీ గ్రంథాలయ సంఘం కార్యదర్శి డాక్టర్ రావి శారద బాసటగా నిలిచారు. ఈమేరకు శని వారం వివిధ అంశాలకు చెందిన 1,235 పుస్తకాలను శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నడిగోటి శ్రీనివాస్, ఏపీ గ్రంథాలయ కార్యాలయ మేనేజర్ శివరామకృష్ణ, గ్రంథపాలకురాలు అనిత పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మర్యాల విద్యార్థులుబొమ్మలరామారం: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మర్యాల జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు సన్నీ, భావేష్ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు పగిడిపల్లి నిర్మలజ్యోతి శనివారం తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 11న నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ అండర్ 20 బాల బాలికల జిల్లా స్థాయి ఎంపికలో సన్నీ, భావేష్లు ప్రథమ స్థానం సాధించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 18న ఆదిలాబాద్ జిల్లా ఇందిర ప్రియ దర్శిని స్టేడియంలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్మల జ్యోతి వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఎంఈఓ రోజారాణి, సర్పంచ్ సంగి గణేష్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం ఫ వివాహమైన మూడు నెలలకే విషాదం వైరారూరల్: ఖమ్మం జిల్లాలోని వైరా నదిలో ప్రమాదవశాత్తు పడి గల్లంతైన వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైంది. కోదాడ మండలం అనంతగిరి వాసి షేక్ నాగుల్‌మీరా(32)కు మూడు నెలల క్రితం కల్లూరు మండలం పెద్దకోరుకొండికి చెందిన షేక్ ముంతాజ్తో వివాహమైంది. సంక్రాంతి సెలవుల సందర్భంగా ఈనెల 12న ఆయన పెద్దకోరుకొండిలోని అత్తగారింటికి వచ్చాడు. తిరిగి శుక్రవారం స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో గన్నవరంలోని వైరా నది లోలెవల్ వంతెనపై ద్విచక్ర వాహనం అదుపు తప్పగా నాగుల్‌మీరా నదిలో పడ్డాడు. స్థానికులు అప్రమత్తమై రక్షించే ప్రయత్నం చేసినా నీట మునిగిపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై పి.రామారావు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో శనివారం ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించి గాలిస్తుండగా నాగుల్‌మీరా మృతదేహం లభ్యమైంది. ఆయన తండ్రి షేక్ యాకూబ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు. -
ఆరు మాసాల క్రితమే ప్రమోషన్
నల్లగొండంలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న పోరెడ్డి గీతకు ఆరు మాసాల క్రితమే గెజిటెడ్ హెచ్ఎంగా పదోన్నతి లభించింది. పెద్దకాపర్తి నుంచి తుంగతుర్తి మండలం రావులపల్లి ప్రభుత్వ పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంగా పోస్టింగ్ వచ్చింది. భర్త రఘుపతిరెడ్డి నల్లగొండ ఎస్పీ కార్యాలయంలోని ఎస్బీలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి కొడుకు సాయినితిన్‌రెడ్డి, కూతురు సౌమిక ఉన్నారు. ఇరువురు అమెరికాలో ఉంటున్నారు. కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు. సౌమిక తన భర్తతో కలిసి అమెరికాలో ఉంటుంది. ఫిబ్రవరి 22న అమెరికా వెళ్లి రెండు నెలలు అక్కడే ఉండి తిరిగి వద్దామని అనుకున్నారు. టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇంతలోనే గీత మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబమం దుఃఖసాగరంలో మునిగిపోయింది. తల్లిని కడసారి చూసేందుకు అమెరికాలో ఉన్న ఇద్దరు పిల్లలు బయల్దేరారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. సోమవారం గీత అంత్యక్రియలు నల్లగొండలో జరగనున్నాయి. ఆమె మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ప్రార్థనకు రాలేదని.. గీత ఆరు నెలలుగా క్రమంతప్పకుండా ప్రా ర్థన సమయానికి పాఠశాలకు హాజరవుతుంది. శనివారం ప్రార్థనకు రాలేదని, ఇంతలో ఈ దుర్వా ర్త వినాల్సి వచ్చిందని తోటి టీచర్లు కన్నీరు పెట్టారు. -
ఆధారం లేని చిన్నారులు
మర్రిగూడ: నా అనుకునే వాళ్లు తోడుగా లేకపోవడంతో చిన్నారులిద్దరూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారి నానమ్మే కంటికి రెప్పలా చూసుకుంటుంది. చిన్నారుల తండ్రి గతేడాది మృతిచెందగా తల్లి సాకలేక తన పుట్టింటికి వెళ్లింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొల్లపడకల్ గ్రామానికి చెందిన గుగ్గిళ్ల లక్ష్మమ్మకు 60 సంవత్సరాలు. ఆమె భర్త పదేండ్ల క్రితం మృతిచెందాడు. తన కొడుకు ఏడాది క్రితం మృత్యువాతపడ్డాడు. అప్పటి నుంచి దిక్కుతోచని స్థితిలో తన కూతురు ఉంటున్న సరంపేట గ్రామానికి వచ్చి ఆరునెలలుగా ఇక్కడే ఉంటున్నారు. సరంపేటలో జీవనం. గుగ్లిళ్ల లక్ష్మమ్మ మర్రిగూడ మండలంలోని సరంపేటలో తన కుమార్తె సంధ్య వద్దకు చేరుకుని సమీపంలోని పూరి గుడిసె నిర్మించుకుని నివసిస్తున్నారు. లక్ష్మమ్మ కూలీ పనులు చేసుకుంటూ ఏడేళ్ల మనుమరాలైన వెన్నెల, ఆరేళ్ల వయసున్న నందును సరంపేట ప్రాథమిక పాఠశాలలో చదివిస్తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారులు, వృద్ధురాలికి స్థానిక నాయకులు, అధికారులు సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా ఊపిరి ఉన్నంతవరకు చూసుకుంటా దాతలు సహకారం అందిస్తే గూడు ఏర్పాటు చేసుకుని నా మనుమడు, మనుమరాలిని చూసుకుంటూ బడికి పంపుతా. వారికి తల్లిదండ్రులు లేరాయే, నాకు చేతకాకపాయే. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. దాతల సహకరించి గూడు ఏర్పాటు చేస్తే నా ఊపిరి ఉన్నంతవరకు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటా. – గుగ్గిళ్ల లక్ష్మమ్మ గతేడాది తండ్రి మృతి పిల్లలను సాకలేక పుట్టింటికి వెళ్లిన తల్లి అన్నీ తానై చిన్నారుల ఆలనాపాలన చూసుకుంటున్న నానమ్మ -
కేటీఆర్, హరీశ్‌లతో బీఆర్ఎస్ నాయకుల భేటీ
నల్లగొండ టూటౌన్: ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, ఇతర ముఖ్య నాయకులు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు, పార్టీ బలోపేతం పలు అంశాలపై చర్చించారు. వారిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, భాస్కర్ రావు, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, భగత్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, సీనియర్ నాయకులు పాల్వాయి స్రవంతి, చింతల వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు. -
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
భువనగిరిటౌన్: గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ తన చాంబర్లో అన్ని శాఖల అధికారులతో గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించిన అనంతరం మాట్లాడారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేడుకల నిర్వహణకు అవసరమైన వేదిక, వీఐపీలు, అధికారులు, ఇతరులకు సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేయాలన్నారు. ప్రొటోకాల్ ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, భువనగిరి ఆర్డీఓ కృష్ణా రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి జగన్మోహన్ ప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు -
పట్టణానికి తిరుగు ప్రయాణం
రామగిరి(నల్లగొండ), చౌటుప్పల్, కేతేపల్లి, కోదాడరూరల్, చిట్యాల : సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వచ్చిన ప్రజలు తిరుగుప్రయాణం అయ్యారు. దీంతో హైదరాబాద్– విజయవాడ జాతీయరహదారి శనివారం వాహనాలతో రద్దీగా మారింది. వాహనాల రద్దీకి అనుగుణంగా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద ఉన్న 12 టోల్ కౌంటర్లకుగాను ఏడు కౌంటర్లను హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు కేటాయించారు. భారీ వాహనాల నిలిపివేత జాతీయ రహదారిపై రద్దీ నేపథ్యంలో భారీ వాహనాలను పోలీసులు కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద నిలిపివేశారు. చిట్యాల, పెద్దకాపర్తి గ్రామాల వద్ద అండర్‌పాస్ వంతెన పనులు జరుగుతున్నందున ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండటంతో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు భారీ వాహనాలను టోల్‌ప్లాజా వద్ద ఆపివేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ట్రాలీ, కంటైనర్, ట్యాంకర్ వంటి భారీ సైజు లారీలను వందల సంఖ్యలో టోల్‌ప్లాజా వద్ద ఖాళీ స్థలంలో నిలిపివేయించారు. ప్రమాదాలకు నిలయంగా మారిన కోదాడలోని కట్టకమ్ముగూడెం క్రాస్‌రోడ్‌ను పోలీసులు పూర్తి మూసి వేశారు. వాహనాలను హుజూర్నగర్ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లే విధంగా దారి మళ్లించారు. అదే విధంగా విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న భారీ వాహనాలు లారీలు, ట్రక్కులు వంటి వాహనాలను గుడిబండ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద దారి మళ్లించి హుజూర్నగర్, మిర్యాలగూడెం మీదగా వెళ్లాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. చిట్యాలలో, పెద్దకాపర్తిలో జాతీయ రహదారిపై అండర్ బ్రిడ్జి రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఇరుకుగా ఉండే సర్వీస్‌రోడ్డులో వాహనాలు బారులుదీరాయి. పలు చోట్ల కార్లు బ్రేక్ డౌన్ అయ్యాయి. సాయంత్రం సమయానికి ట్రాఫిక్ పెరిగిపోవటంతో విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలను చిట్యాలలో భువనగిరి రోడ్డు మీదుగా మళ్లించారు. నల్లగొండ నుంచి హైదరాబాద్ మధ్య నడిచే ఆర్టీసీ బస్సులను దారి మళ్లించారు. నల్లగొండ డిపో నుంచి హైదరాబాద్ మధ్య నడిచే అన్ని బస్సులను నార్కట్‌పల్లి అద్దంకి హైవే పై ట్రాఫిక్ దృష్ట్యా ఆర్టీసి అధికారులు వయా మునుగోడు నారాయణపూర్ గుండా మళ్లించారు. ఫ పండుగ ముగియడంతో స్వగ్రామాల నుంచి పట్టణానికి పయనం ఫ హైదరాబాద్– విజయవాడ రహదారిపై పెరగిన వాహనాల రద్దీ ఫ క్రాసింగ్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఫ భారీ వాహనాలు కోదాడ నుంచి హుజూర్నగర్ వైపు దారి మళ్లింపుచౌటుప్పల్లోని హైవేపై విపరీతమైన రద్దీ ఏర్పడడంతో చాలా వాహనాలు పట్టణంలోని సర్వీస్‌రోడ్డు మీదుగా వెళ్లాయి. పలు జంక్షన్లను మూసివేశారు. మండల పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ మార్గంలో అదనపు టోల్ బూత్‌లను కేటాయించారు. శుక్రవారం 52500 వాహనాలు టోల్‌ప్లాజా మీదుగా రాకపోకలు సాగించగా, శనివారం సాయంత్రం 6గంటల వరకు 45600వాహనాలు రాకపోకలు సాగించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను చాలాచోట్ల దారి మళ్లించడంతో ఈ మార్గంలో చాలా మేరకు రద్దీ తగ్గింది. చౌటుప్పల్ మండలంలోని కై తాపురం వద్ద హైదరాబాద్ మార్గంలో వరుసగా నాలుగు కార్లు ఒకదాని వెనుక మరొకటి ఢీకొనడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎల్లగిరి శివారులో పెట్రోల్‌బంక్ ఎదురుగా హైదరాబాద్ మార్గంలో డీసీఎం వాహనం నడిరోడ్డులో బ్రేక్ డౌన్ కావడంతో ఎల్లంబావి శివారు వరకు వాహనాలు జామ్ అయ్యాయి. -
రోడ్డు భద్రత.. అందరి బాధ్యత
భువనగిరిటౌన్ : రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో జిల్లాలో రోడ్డుభద్రతపై సంబంధింత అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి? వాటి పై తీసుకున్న చర్యలు ఏమిటని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో మరణించినవారి సంఖ్య తగ్గిందన్నారు. గత సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల మరణించిన వారి సంఖ్య 204 ఉండగా ఈ సంవత్సరం 174 మంది మాత్రమే చనిపోయినట్లు వివరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్ లను గుర్తించి రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాద ప్రదేశాలలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాద అవకాశం ఉన్న స్థలాల్లో వాహనాల వేగ నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. నేషనల్ హైవే అథారిటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రోడ్ సేఫ్టీ సమావేశాల్లో చర్చించిన అంశాలకు సంబంధించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏఎస్పీ రాహుల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించామన్నారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అధికారి సాయి కృష్ణ, రోడ్లు భవనాల శాఖ అధికారి సరిత, ఆర్టీఏ నర్సింహ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
త్వరగా వస్తానని చెప్పి..
నల్లగొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉండే లింగంపల్లి కల్పనకు 2024 డిసెంబరులో తుంగతుర్తి కేజీబీవీ పాఠశాలలో ఎస్‌వోగా కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగం వచ్చింది. ఆమె భర్త యాదగిరి నల్లగొండలో ఎన్జీ కాలేజీ ఎదురుగా ఉన్న పోలీస్ కాంప్లెక్స్‌లో మీసేవ కేంద్రం నిర్వహిస్తున్నారు. వీరికి కుమారుడు శ్రీకర్, కూతురు సాత్విక ఉన్నారు. కుమారుడు బీటెక్ మొదటి సంవత్సరం, కూతురు ఎంబీబీఎస్ చదువుతున్నది. సంక్రాంతి పండుగకు పిల్లలు ఇద్దరు నల్లగొండకు వచ్చారు. అంతా ఆనందంగా గడిపారు. కూతురు సాత్విక పుట్టిన రోజు శుక్రవారం కావడంతో కుటుంబ సభ్యులు సాత్విక స్నేహితులు కలిసి ఇంట్లో వేడుకలు చేసుకున్నారు. మరుసటి రోజైన శనివారం ఉదయం పాఠశాలకు బయలుదేరి మృతిచెందింది. ఇంత ఘోరం జరిగిందని అనుకోలేదు.. నా భార్యను నేను వెంకటేశ్వర కాలనీ వద్ద కారు ఎక్కించి వచ్చాను. మా తోడల్లుడు ఫోన్ చేసి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పాడు. నేను ఏదో దెబ్బలు తగిలాయని అనుకున్నా. 9.10 గంటలకు నా భర్య చనిపోయిందని చెప్పారు. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని కల్ప న భర్త యాదగిరి బోరున విలపించారు. సాయంత్రం త్వరగా వస్తానని చెప్పింది.. సాయంత్రం కంటే ముందుగానే శవమై వచ్చిందని విలపించారు. -
ఏఎస్పీ రాహుల్‌రెడ్డి బదిలీ
భువనగిరి: భువనగిరి ఏఎస్పీ కె .రాహుల్‌రెడ్డి బదిలీ అయ్యారు. మల్కాజ్గిరి జోన్ ట్రాఫిక్–1 డీసీపీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి సర్పంచ్‌లకు శిక్షణభువనగిరిటౌన్ : ఈ నెల 19 నుంచి నూతన సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వన్నట్లు కలెక్టర్, జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్‌లో ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు మొదటి బ్యాచ్ వలిగొండ, రెండో బ్యాచ్ భూదాన్‌పోచంపల్లి, తుర్కపల్లి మండలాలు, వచ్చేనెల 3నుంచి 7వ తేదీ వరకు మొదటి బ్యాచ్ బొమ్మలరామారం, రెండో బ్యాచ్ అడ్డగూడూరు, ఆలేరు, రామన్నపేట మండలాలకు ఉంటుందని వివరించారు. ఫిబ్రవరి 9నుంచి 13వరకు మొదటి బ్యాచ్ భువనగిరి, రెండో బ్యాచ్ మోత్కూర్, రాజాపేట, యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు మొదటి బ్యాచ్ బీబీనగర్, రెండో బ్యాచ్ చౌటుప్పల్, నారాయణపూర్, ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు మొదటి బ్యాచ్ గుండాల, మోటకొండూర్, ఆత్మకూరు మండలాలకు ఉంటుందని తెలిపారు. కూరెళ్లకు జీవన సాఫల్య పురస్కారంరామన్నపేట: పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు దాసోజు ఫౌండేషన్వారు జీవన సాఫల్య పురస్కారం ప్రదాన చేశారు. శనివారం వెల్లంకిలోని ఆచార్య కూరెళ్ల గ్రంథాలయంలో పురస్కారంతోపాటు రూ 10,116 నగదును ఆయనకు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ దాసోజు పద్మావతి మదనాచారి అందజేసి సన్మానించారు. దాసోజు వజ్రమ్మ, విశ్వనాథచారిల జ్ఞాపకార్థం ఈ పురస్కారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు దాసోజు గోవర్ధనాచారి, ప్రముఖ న్యాయవాది భాస్కరాచారి, కూరెళ్ల ఫౌండేషన్ అధ్యక్షుడు బోగోజు గోవర్ధనాచారి, కార్యదర్శి కె.నర్మద పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. శనివారం ఉదయం సుప్రఽభాతం, ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. స్వయంభూ మూర్తులకు నిజాభిషేకం,అర్చన పూజలు చేపట్టారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు నిర్వహించి, అనంతరం గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేపట్టారు. -
బేగంపేటలో చిరుత జాడలు!
రాజాపేట : రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామంలో శనివారం ఉదయం చిరుతపులి సంచారం చేసినట్లు అడుగు జాడలను రైతులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శేఖర్‌రెడ్డి, బీట్ ఆఫీసర్లు లిఖిత, మల్లేష్, ఆర్ఐ నర్సింహులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన రైతు నీల బాలకిషన్ వ్యవసాయ భూమిలో పులి అడుగుజాడలను గుర్తించి వాటిని క్షణ్ణంగా పరిశీలించారు. ఇవి చిరుతపులి అడుగు జాడలేనని, బురదలో అడుగు జాడలు కొంచెం పెద్ద సైజు ఉండటంతో పెద్దపులిగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తుర్కపల్లి మండలంలోని గంధమల్ల నుంచి వచ్చి ఉండొచ్చని, రాత్రి ఇక్కడే ఉందా లేదా వెళ్లిపోయిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వీరారెడ్డిపల్లి, బేగంపేట, రాజాపేట పరిసర ప్రాంతాల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సూర్యోదయం తరువాత వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి తిరిగిరావాలని కోరారు. ఒంటరిగా వ్యవసాయ బావులవద్దకు వెళ్లొద్దని, గుంపులుగా చప్పుడు చేస్తూ వెళ్లాలని గ్రామంలో డప్పు చాటింపు వేయించారు. వ్యవససాయ బావుల వద్ద ఉన్న పశువులను ఇంటికి తరలించాలని సూచించారు. జిల్లా అధికారులకు సమాచారం అందించామని, చిరుతపులి జాడలపై వివరాలు సేకరిస్తామని తెలిపారు. చిరుత వెళ్లిపోయిన సమాచారం అందించేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంధమల్ల, వీరారెడ్డిపల్లివాసుల భయాందోళన తుర్కపల్లి: మండలంలో గంధమల్ల, వీరారెడ్డిపల్లి అటవీ ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో తుర్కపల్లి మండలంలో భయాందోళన నెలకొంది. ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ బీట్ అధికారి మల్లేశం సూచించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాల వైపు వెళ్లొద్దని, పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు లోనుకాకుండా అధికారులకు సహకరించాలని కోరారు. -
2803 మంది కార్మికులకు లబ్ధి!
భూదాన్‌పోచంపల్లి : చేనేత కార్మికులకు రుణమాఫీ నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం ఊరటనిచ్చింది. కార్మికుల లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నవంబర్‌లో రూ. 33 కోట్లు మంజూరు చేయగా, తాజాగా రూ.16.27 కోట్లు విడుదల చేస్తూ ఉత్వర్తులు జారీ చేసింది. ఈ నెల 14న రాష్ట్ర చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు నిధులను బ్యాంక్‌లకు పంపించి కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో 2803 మంది 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి లోపు చేనేత కార్మికులు బ్యాంకులలో తీసుకొన్న లక్షలోపు వ్యక్తిగత రుణాలకు రుణమాఫీ వర్తిస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2,803 మందికి రూ. 23.25 కోట్ల మేర రుణమాఫీ జరుగనుంది. ఇందులో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,380 మందికి రూ.19.25 కోట్లు మాఫీ కానుండగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు కలిపి 423 మందికి రూ.4 కోట్ల మేర రుణమాఫీ కానుంది. రుణమాఫీలో జాప్యం రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకు కూడ రూ. లక్షలోపు రుణమాఫీ చేస్తామని 2024 సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లోని జాతీయ సాంకేతిక సంస్థ ప్రారంభోత్సవం సందర్బంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జీఓ నెంబర్ 56 జారీ చేసి 2025–26 బడ్జెట్లో రూ. 33 కోట్లు మంజూరు చేశారు. బ్యాంకుల వారీగా కార్మికులు తీసుకొన్న రుణాల జాబితాను అధికారులు రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించగా, సదరు కమిటీ ఆమోదించి ప్రభుత్వానికి నివేదించడంలో జాప్యం జరిగింది. దాంతో చేనేత రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గత ఏడాది నవంబర్ 20న కార్మికులు హైద్రాబాద్‌లోని హ్యాండ్లూమ్ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 25న రూ.33కోట్లు విడుదల చేసింది. కానీ గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రుణమాఫీ ప్రక్రియ ఆగిపోయింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా రూ.48 కోట్లకు పైగా రుణమాఫీ చేయాల్సి ఉండగా, ప్రభుత్వం రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేసింది. పూర్తిస్థాయి నిధులు విడుదల కాకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. దాంతో ఇటీవల చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ పోచంపల్లి, పుట్టపాకలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దాంతో ప్రభుత్వం మిగిలిన నిధులను సైతం విడుదల చేసింది. చేనేత రుణమాఫీ నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం ఫ గతంలో రూ.33 కోట్లు మంజూరు ఫ తాజాగా రూ.16.27 కోట్లు విడుదలప్రభుత్వం రెండు రోజుల క్రితం రూ.16.27 కోట్లు విడుదల చేస్తూ జీఓ జారీ చేసింది. గతంలో రూ.9.62 కోట్లు రాగా, ప్రస్తుతం మంజూరైన నిధుల నుంచి జిల్లాకు 9 కోట్లు వస్తాయి. డబ్బులు రిలీజ్ కాగానే వారం, పది రోజుల్లో కార్మికుల ఖాతాలలో నేరుగా జమ చేస్తాం. శ్రీనివాసరావు, చేనేత ఏడీ, యాదాద్రి భువనగిరి జిల్లా -
డివైడర్‌ను దాటొచ్చి కారును ఢీకొన్న లారీ
చౌటుప్పల్ : అతి వేగంగా వచ్చిన సిమెంట్ రెడీమిక్స్ ట్యాంకర్ లారీ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను దాటి వెళ్లి కారును ఢీకొట్టింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జాతీయ రహదారిపై చౌటుప్పల్‌లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని సూరారం ప్రాంతానికి చెందిన ముడావత్ భాస్కర్నాయక్తోపాటు అతడి స్నేహితుడు యాకోబు, అతడి భార్య ఫాతిమా, కుమారులు మోసిన్, బిలాల్ కారులో ఈ నెల 14వ తేదీ రాత్రి కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు. పట్టణంలోని తంగడపల్లి చౌరస్తా వద్దకు రాగానే హైదరాబాద్ రూట్లో వెళ్తున్న సిమెంట్ రెడీమిక్స్ ట్యాంకర్ లారీ వేగంగా దూసుకువచ్చి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ వద్ద ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అదే వేగంతో అవతలివైపు వెళ్లి కారును ఢీకొట్టింది. దాంతో కారులోని ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మండలంలోని కొయ్యలగూడెం గ్రామానికి చెందిన ట్యాంకర్ లారీ డ్రైవర్ ప్రకాశ్‌యాదవ్(37)ను పోలీసులు అదుపులోకి తీసుకొని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ఫ నలుగురికి తీవ్ర గాయాలు -
దొంగతనం చేశాడని.. చెట్టుకు కట్టేసి చిత్రహింసలు
గుర్రంపోడు : డీజిల్ దొంగతనం చేశాడనే నెపంతో మైనింగ్ కంపెనీలో పనిచేస్తున్న బిహార్ కార్మికుడిని కంపెనీ ఇన్చార్జి చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు. దాంతో బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన అమిత్ కుమార్‌షా గుర్రంపోడు మండలం మక్కపల్లి గ్రామ పరిధిలోని మైనింగ్ కంపెనీలో మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే డీజిల్ దొంగతనం చేశాడనే నెపంతో కంపెనీ ఇన్చార్జి తనను గ్రామ శివారుకు తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి మరో ఏడుగురితో కలిసి చిత్రహింసలకు గురిచేశారని, తన వద్ద నుంచి రూ.24 వేలను ఫోన్‌పే ద్వారా బలవంతంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధంచౌటుప్పల్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన ఘటన మండలంలోని కుంట్లగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లెబోయిన శివశంకర్ చౌటుప్పల్‌లో టీస్టాల్లో పనిచేసేవాడు. ప్రస్తుతం సొంతంగా టీస్టాల్ పెట్టుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అతడి భార్య లింగమణి గ్రామంలో చీరలు విక్రయిస్తుంది. శివశంకర్ సంక్రాంతి పండుగకు కప్రాయిపల్లిలోని తన అత్తగారి ఊరికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. శుక్రవారం అతడి ఇంట్లో నుంచి పొగలు వస్తుండడంతో గుర్తించిన స్థానికులు తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి మంటలు ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లో ఉన్న రూ.3 లక్షల నగదు, అమ్మకానికి తెచ్చిన చీరలు, టీవీ, ఫ్రిజ్, వంట సామగ్రి, దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. టీస్టాల్ పెట్టుకునేందుకు అప్పుతెచ్చి ఇంట్లో పెట్టిన నగదు, సామాన్లు పూర్తిగా కాలిపోయాయని, తమ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని శివశంకర్ దంపతులు బోరున విలపించారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
మర్రిగూడ : మండలంలోని తిరగండ్లపల్లి గ్రామానికి చెందిన డేరంగుల శ్రీను ఇంట్లో గురువారం రాత్రి దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. శ్రీను ఈ నెల 15న ఇంటికి తాళం వేసి భార్య పిల్లలతో కలిసి సంక్రాంతి పండుగకు అత్తగారి ఇంటికి వెళ్లాడు. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటితాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న రూ.50వేల నగదుతోపాటు ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం గమనించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, క్లూస్ టీంను రప్పించి0 ఆధారాలు సేకరించామని ఎస్ఐ మునగాల కృష్ణారెడ్డి తెలిపారు. కుక్కను తప్పించబోయి ఆటో బోల్తాచివ్వెంల(సూర్యాపేట) : కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటన మండలంలోని బి.చందుపట్ల గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. సూర్యాపేట మండలం యర్కారం గ్రా మానికి చెందిన వెంకటేశ్ సంక్రాంతి పండుగకు మండలంలోని బి.చందుటప్ల గ్రామానికి ఆటోలో వచ్చాడు. డీజిల్ కోసం గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ వద్దకు బయల్దేరాడు. మార్గ మధ్యంలో కుక్క అడ్డు రాగా దానిని తప్పించబోయి అదుపుతప్పిన ఆటో పల్టీ కొట్టింది. దాంతో వెంకటేశ్ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి 108కు సమా చా రం అందించారు. అంబులెనస్ సిబ్బంది ఘట నా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. వైరా నదిలో అనంతగిరి వాసి గల్లంతువైరారూరల్ : ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరంలో జాలిముడి ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న వైరా నదిలో వ్యక్తి ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అనంతగిరి గ్రామానికి చెందిన షేక్ నాగుల్ మీరా(32) సంక్రాంతి పండుగకు ఇటీవల కల్లూరు మండలం చిన్నకోరుకొండిలోని అత్తగారింటికి వెళ్లాడు. పండుగ శుక్రవారం ముగిశాక ద్విచక్ర వాహనంపై అనంతగిరి బయల్దేరాడు. మార్గమధ్యలో వైరా నదిపై గన్నవరం వద్ద లోలెవల్ వంతెనపై వాహనం అదుపు తప్పినట్లు తెలిసింది. దాంతో నాగుల్‌మీరా వైరా నదిలో పడి గల్లంతయ్యాడు. వైరా ఎస్ఐ పుష్పాల రామారావు ఘటనా స్థలానికి చేరుకుని వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా వివరాలు తెలుసుకుని నాగుల్‌మీరా కుటుంబానికి సమాచారం ఇచ్చారు. గల్లంతైన వ్యక్తి కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వండర్స్ ఆఫ్ తెలంగాణ పోటీల్లో అవార్డుదేవరకొండ : తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పోటీల్లో దేవరకొండ పట్టణానికి చెందిన యూనూస్ ఫర్హాన్ అవార్డు అందుకున్నారు. కై ట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో పట్టణానికి చెందిన పరిశోధకుడు ఫర్హాన్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఫర్హాన్ మాట్లాడుతూ తన పరిశోధనలో భాగంగా దేవరకొండ ఖిలాకు సంబంధించి అద్భుతమైన ఫొటోలను ప్రదర్శించినందుకు తనకు అవార్డు లభించినట్లు తెలిపారు. పలు వురు యూనూస్ ఫర్హాన్‌ను అభినందించారు. -
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం
నల్లగొండ : విదేశాల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తానని నమ్మించి నిరుద్యోగ యువత నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుడిని చింతపల్లి పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ జి. రమేష్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాటికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన ముప్పాల్ల లీలాకృష్ణ ప్రైవేటు ఉద్యోగి. విదేశాల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబుతూ జిల్లాలోని పలువు నిరుద్యోగులకు ఆశ చూపి వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. నల్లగొండ జిల్లా పోలేపల్లి రామ్‌నగర్‌కు చెందిన కోయిల్లకార్ కరుణాబాయి కొడుకునే కూడా ఇలాగే మోసం చేశాడు. దాంతో ఆమె ఇటీవల చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. లీలాకృష్ణ నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పలువురు నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడినట్లు తేలింది. గతంలో విదేశాల్లో ఉద్యోగం చేసిన నిందితుడు.. స్వదేశానికి వచ్చిన తర్వాత వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో నిరుద్యోగ యువతను మోసం చేసినట్లు విచారణలో తేలినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. నిందితుడు ఇప్పటి వరకు 8 మంది నుంచి రూ. 85 లక్షలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో మాల్ గ్రామం మర్రిగూడ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా చింతపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. నిందితుడి నుంచి మూడు సెల్ఫోన్లు, ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడిపై మాడ్గులపల్లి, వరంగల్ పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు నమోదైనట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన నాంపల్లి సీఐ రాజు, చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తి, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు పేర్కొన్నారు. చీఇలాంటి వారిపట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ సూచించారు. ఫ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు -
మాంజా తగిలి యువకుడి గొంతుకు గాయం
ఆలేరు : చైనా మాంజా తగిలి పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన చింతకింది భరత్(26) గొంతుకు గాయమైంది. భరత్ శుక్రవారం సాయంత్రం బైక్‌పై క్రాంతినగర్‌లోని ఇంటికి వెళుతుండగా రైల్వే ఫ్లైఓవర్పైన అతడి గొంతుకు చైనా మాంజా తగిలి కోసుకు పోయింది. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో స్థానికులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. మంజా తగిలి గొంతుకు గాయం ఆత్మకూరు(ఎం) : మంజా తగిలి బాలిక గొంతుకు గాయమైన ఘటన ఆత్మకూరు(ఎం) మండలం మొరిపిరాలలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన హేమలత భర్త పరశురాములు, అయిదు సంవత్సరాల కూతురు భానుశ్రీ కలిసి సంక్రాంతి పండుగకు పుట్టింటికి వచ్చింది. పరశురాములు బైక్‌పై భానుశ్రీని గ్రామంలోని షాపునకు తీసుకెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తుండగా బైక్ ముందు కూర్చున్న భానుశ్రీ గొంతుకు మంజా తగిలి కోసుకు పోయింది. గాయపడిన బాలికను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చైనా మాంజా విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు చౌటుప్పల్ : నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్న వ్యక్తిపై శుక్రవారం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణం బంగారిగడ్డ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ఎండీ.అమీర్(23) స్థానిక గాంధీపార్క్‌లో పతంగులు విక్రయిస్తున్నాడు. అతడి వద్ద నిషేధిత చైనా మాంజా ఉందన్న సమాచారంతో పెట్రోలింగ్ పోలీసులు దాడిచేశారు. అతడి వద్ద వివిధ రకాల 53 చర్కాలు లభించాయి. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
పంటలు లేవు.. పండుగ లేదు
ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన మాకు ప్రభుత్వం నష్టపరిహరం కింద ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఐదేళ్లుగా తండా ప్రజలు పరిహారం కోసం నిరీక్షిస్తున్నారు. డబ్బులు వచ్చి ఉంటే గ్రామ దేవతల పండుగలతో పాటు సంక్రాంతిని ఘనంగా జరుపుకొనేవాళ్లం. కానీ ఈ సారి పండుగను ఆనందంగా జరుపుకోలేక పోయాం. భూక్య రాజారాంనాయక్, చౌక్లతండా సర్పంచ్ ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఇళ్లు కట్టుకొని ప్రశాంతంగా జీవించాలనుకున్నాం. కానీ పరిహారం ఇవ్వక పోవడంతో జీవనోపాధి లేకుండా పోయింది. చేతిలో డబ్బులు లేక పండుగలకు కూడా దూరమయ్యాం. ప్రభుత్వం వెంటనే నష్టపరిహరం విడుదల చేయాలి భూక్య వెంకటేశ్‌నాయక్, చౌక్లతండా ఫ బస్వాపురం రిజర్వాయర్ ముంపు గ్రామాల్లో కానరాని సంక్రాంతి ఫ సాగు భూములు కోల్పోవడంతో పాడి పంటలకు దూరం ఫ నష్టపరిహారం అందక ఆర్థిక ఇబ్బందులుయాదగిరిగుట్ట రూరల్, తుర్కపల్లి : బస్వాపురం రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో ఈ సారి సంక్రాంతి సందడి కనిపించలేదు. గతంలో వ్యవసాయ భూముల్లో సంవృద్ధిగా పంటలు పండగా.. రైతుల ఇళ్లు పాడి పంటలతో నిండుగా ఉండగా తండాల ప్రజలు సంతోషంగా పండుగను జరుపుకొన్నారు. కానీ ప్రస్తుతం సాగు భూములతో పాటు ఇళ్లు కోల్పోయారు. దాంతో పాడి, పంటలు లేక, మరి కొద్ది రోజుల్లో గ్రామాన్ని వీడాలనే బాధతో సంక్రాంతిని వేడుకలను జరుపుకోలేక పోయామని తండావాసులు చెప్పారు. లప్పానాయక్ తండాలో 327 కుటుంబాలు యాదగిరిగుట్ట మండలంలోని లప్పానాయక్ తండాలో 327 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ తండా వాసులకు సంబంధించిన 721 ఎకరాల భూమిని ప్రభుత్వం బస్వాపురం రిజర్వాయర్ కోసం తీసుకుంది. దాంతో తండా వాసులు ఇల్లు వాకిలి, వ్యవసాయ భూములు కోల్పోయారు. పునరావాస ప్రాంతానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం వీరందరికి యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి గ్రామంలోని 30 ఎకరాల్లో మౌళిక వసతులు కల్పిస్తున్నది. ఉన్న ఊరును వదిలి వెళ్లాల్సి వస్తుందనే బాధతో ఈ సారి సంక్రాంతి వేడుకలకు తండావాసులు దూరమయ్యారు. తండాలో జన సంచారం లేకుండా పోయింది. పరిహారం రాక ఆర్థిక ఇబ్బందులు బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలైన తుర్కపల్లి మండలంలోని చౌక్లతండా, కొక్యాతండా, పిర్యాతండాల్లో ఈ సారి సంక్రాంతి సంబురాలు కనిపించలేదు. ప్రాజెక్ట్ కోసం తమ భూములు త్యాగం చేసిన రైతులు, తండావాసులు ప్రభుత్వ ఇవ్వాల్సిన నష్టపరిహారం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నా తమకు ఇప్పటికీ న్యాయం జరుగలేదని ఆయా తండాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీవనాధారమైన భూములు కోల్పోయామని, పరిహారం అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. చేతిలో డబ్బులు లేక పండుగకు కావాల్సిన కొత్త బట్టలు, సామగ్రి కొనలేక ఈ సంక్రాతి రోజున నిరుత్సాహంగా గడిపినట్లు గ్రామస్తులు తెలిపారు. భూములు త్యాగం చేసినా న్యాయంగా రావాల్సిన పరిహారం దక్కలేదని, రప్రభుత్వం తక్షణమే నష్టపరిహరం చెల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బస్వాపురం రిజర్వాయర్‌లో మా గ్రా మం ముంపునకు గురైంది. మేమంతా మరొక చోటుకు వెళ్లాలి. అందుకే ఈ సంక్రాంతి పండుగను బాధతో జరుపుకొన్నాం. పంటలు పండించుకొని సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ, భూములు కోల్పోయి ప్రతీది కొనుగోలు చేసుకొని జరుపుకోవాల్సి వచ్చింది. పునరావాస ప్రాంతానికి వెళ్లిన తర్వాత మాకు ఉపాధి ఉండదు. ప్రభుత్వం ఉపాధి కల్పించి ఆదుకోవాలి. – భరత్, లప్పానాయక్ తండా గతంలో మా భూముల్లో కందులు, నువ్వులు, ఉలువలు, వేరుశనగ వంటి వాటిని పండించుకొని, సంక్రాంతి పండగను సంతోషంగా జరుపుకొనే వాళ్లం. ఇప్పుడు బస్వాపురం రిజర్వాయర్‌లో ఇళ్లతో పాటు వ్యవసాయ భూములు ముంపుకు గురై గుంతలు, నీళ్లు తప్పా ఏమి లేవు. పంటలు లేక సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కోల్పోయాం. –బిచ్యానాయక్, లప్పానాయక్ తండా -
సైనికుడికి పాదాభివందనం
గరిడేపల్లి : సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని కల్మలచెరువు గ్రామానికి చెందిన సైనికుడు వట్టే దశరథ్ యాదవ్‌కు బీఆర్ఎస్ నాయకుడు రాపోలు నవీన్‌కుమార్‌తో పాటు స్థానికులు పాదాభివందనం చేశారు. ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్న దశరథ్ యాదవ్ సంక్రాంతి సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చాడు. గ్రామస్తులు అతడి పాదాలు పాలతో కడిగి ఘనంగా సన్మానించారు. దేశరక్షణకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవ చేస్తున్న సైనికుడిని గౌరవించడం ప్రతిఒక్కరి బాధ్యత అంటూ వారు పేర్కొన్నారు. భారత సైనికుడు వట్టే దశరథ్ యాదవ్ కాళ్లు కడుగుతున్న నవీన్‌కుమార్, స్థానికులు -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఆలేరు : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మున్సిపాలిటీ పరిధి లోని పోచమ్మ గుడి ప్రాంతానికి చెందిన బండి వెంకటేష్(53) సోమవారం సాయంత్రం స్థాని కంగా ఉన్న సాయిబాబా గుడికి బైక్‌పై వెళ్తున్నా డు. ఈ క్రమంలో రెడ్డిగూడెం కమాన్ సమీ పంలోకి రాగానే వెంకటేష్ బైక్, మరో స్కూటీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెంకటేష్ తలకు తీవ్ర గాయాలు కాగా.. స్కూటీపై వెళ్తున్న నందిని అనే యువతికి కూడా గాయాలయ్యా యి. వెంకటేష్‌ను హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలుమర్రిగూడ : బైక్‌పై అతివేగంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మర్రిగూడ మండలం సరంపేట గ్రామ శివారులో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అతివేగంతో వెళ్తూ సరంపేట గ్రామ సమీపంలో చండూరు ప్రధాన రఽహదారిపై అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని మర్రిగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మర్రిగూడ పోలీసులు తెలిపారు. చైనా మాంజా విక్రయిస్తున్న వ్యక్తిపై కేసువలిగొండ : మండల పరిధిలోని గోకారం గ్రామానికి చెందిన వాసం నారాయణ తన కిరాణ దుకాణంలో నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తుండగా.. స్థానిక పోలీసులు దాడి చేసి ఐదు కట్టల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ యుగంధర్ మంగళవారం తెలిపారు. అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టిన కారుకొండమల్లేపల్లి : అదుపుతప్పి కారు కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో మంగళవారం కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి పరిధిలో జరిగింది. దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జగమంతు నల్లగొండ నుంచి కారులో వస్తుండగా.. మార్గమధ్యలో గుమ్మడవెల్లి గ్రామ పరిధిలోని రైస్ మిల్లు వద్దకు రాగానే అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జగమంతు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని కొండమల్లేపల్లి ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. -
ఎగిరే గాలిపటం.. బృంద స్ఫూర్తి సంబరం
ఫ సొంతంగా గాలిపటాలు తయారు చేసుకోవడంతో చిన్నారుల్లో పెరగనున్న సృజనాత్మకతతిరుమలగిరి (తుంగతుర్తి) : పర్వదినాల్లో సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రజలు సంబరాలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. చిన్నారులు, యువకులు, మహిళలు, వృద్ధులు ఈ పండగొస్తుందంటే భలే సంతోషపడతారు. సందడి చేస్తారు. పిల్లలైతే పది రోజుల ముందు నుంచే గాలిపటాలను ఎగురవేస్తూ పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు. విద్యాలయాలకు సెలవులు ప్రకటించకముందే పల్లె, పట్టణ ప్రాంత ప్రజలు రంగురంగుల పతంగులను ఎగురేస్తూ సంతోషంగా గడుపుతారు. పతంగుల సంబరంలో నింగికెగసే వీరి సంతోషం వెనుక సృజనాత్మకత, ఆరోగ్య సూత్రాలు, బృద స్ఫూర్తి ఇమిడి ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. రూపకల్పనలో సజనాత్మకత.. కొంతమంది చిన్నారులు గాలిపటాలను వారే తయారుచేసుకుంటారు. కొంత మంది పిల్లలు ఒకచోట చేరి పేజీలను తీసుకొని చతురస్రం, దీర్ఘచతురస్రం ఆకారంలో కత్తిరించుకొని ఇంటి దగ్గర దొరికే పుల్లలతో అందంగా గాలిపటాలు తయారుచేస్తారు. దీని ద్వారా వారిలో మైత్రి బంధం పెరుగుతుంది. జట్టుగా పని.. గాలిపటం ఎగురవేసేటప్పుడు లక్ష్యం నింగికై నా కేకలతో ఆహ్లాదకర పోటీతత్వం కనిపిస్తుంది. గాలికి పతంగి బరువు తప్పుతున్నప్పుడు పక్కనే ఉన్న స్నేహితులు పసిగడుతుంటారు. ఒకరు ఎగురవేస్తుంటే మరొకడు దారం వదులుతారు. ఆనందంలో అక్కడ వారి బృద స్ఫూర్తి కనిపిస్తుంది. -
19 నుంచి నూతన సర్పంచ్‌లకు శిక్షణ
భూదాన్‌పోచంపల్లి: భువనగిరి జిల్లాలో నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లకు 19 నుంచి భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు జెడ్పీ సీఈఓ శోభారాణి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వారు గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ అధికారి రాఘవేంద్రరావుతో కలిసి స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థను సందర్శించారు. అక్కడ శిక్షణకు అందుబాటులో ఉన్న గదులు, భోజన సదుపాయాలు, రాత్రి బసచేయడానికి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికై న 421మంది సర్పంచ్‌లకు ఎంపీడీఓలు, ఎంపీఓలు నాలుగు విడతలుగా, ఒక్కో విడతలో ఐదు రోజుల పాటు పరిపాలనా అంశాలపై శిక్షణ ఇవ్వనన్నట్లు చెప్పారు. శిక్షణలో భోజనం, నివాస సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఆర్టీఆర్ఐ డైరెక్టర్ కిషోర్‌రెడ్డి, ఎంఈఓ మాజిద్, ఏపీఓ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
రెండు వైన్ షాపుల్లో చోరీ
నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని జాన్‌పహాడ్ రోడ్డులో పక్కపక్కనే ఉన్న రెండు వైన్ షాపుల్లో గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. మంగళవారం ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. రెండు వైన్ షాపుల సిబ్బంది సోమవారం రాత్రి దుకాణాలను మూసివేసి వెళ్లారు. మంగళవారం ఉదయం సిబ్బంది వచ్చి చూసేసరికి షట్టర్లు తెరిచి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విజయదుర్గా వైన్ షాపులో రూ.60వేల నగదు, రూ.4వేల విలువైన మూడు మద్యం బాటిళ్లు, శివాంజనేయ వైన్ షాపులో రూ.15వేల నగదు, రూ.2వేల విలువైన ఒక మద్యం బాటిల్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
మునగాల : ట్రాక్టర్ డ్రైవర్ బావిలో శవమై తేలిన ఘటన మునగాల మండలం మాధవరం గ్రామంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ దేశగాని అశోక్(35) మంగళవారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో శవమై కనిపించాడు. చుట్టుపక్క రైతులు బావిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీకొండమల్లేపల్లి : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో జరిగింది. వివరాలు.. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని వాసవీ బజార్లో నివసిస్తున్న కానమోని నాగరాజు సోమవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి తన అమ్మమ్మ గ్రామమైన పెండ్లిపాకలకు వెళ్లాడు. తిరిగి మంగళవారం ఉదయం 7గంటలకు వచ్చి చూసేసరికి తలుపులు పగలగొట్టి ఉండడంతో పాటు ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.67వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ పరిశీలించి వివరాలు సేకరించారు. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యంభువనగిరి : మండలలోని పెంచికల్‌పహాడ్ గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెంచికల్‌పహాడ్ గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి తల్లిదండ్రులు రోజు మాదిరిగా ఉదయం కూలీ పనికి వెళ్లారు. ఆ చిన్నారి ఇంటి వద్ద నానమ్మతో ఉండిపోయింది. మధ్యాహ్నం సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని అటుగా వచ్చిన అదే గ్రామానికి చెందిన సిలివేరు ఎల్లయ్య తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సాయంత్రం చిన్నారి మూత్రవిసర్జన సమయంలో నొప్పిగా ఉందని నాయనమ్మకు చెప్పింది. దీంతో నాయనమ్మ ఏం జరిగిందని చిన్నారిని అడగగా జరిగిన విషయం తెలిపింది. చిన్నారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపారు. చిన్నారిని చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక
బొమ్మలరామారం : మండలంలోని మర్యాల జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు శ్రేష్ట, శ్రావణి జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు పగిడిపల్లి నిర్మల జ్యోతి మంగళవారం తెలిపారు. ఇటీవల వికారాబాద్ జిల్లా తాండూర్‌లో నిర్వహించిన 69వ రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ బాలికల ఖోఖో పోటీల్లో(అండర్–14) ఉమ్మడి జిల్లా తరఫున శ్రేష్ట, శ్రావణి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. వారిద్దరు ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు రాజస్తాన్ రాష్ట్రంంలో జరగనున్న 69వ జాతీయ స్థాయి అండర్ 14 బాలికల ఖోఖో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపికై న విద్యార్థులను డీఈఓ సత్యనారాయణ, ఎంఈఓ రోజారాణి, సర్పంచ్ సంగి గణేష్, పాఠశాలల జిల్లా క్రీడల కార్యదర్శి కందాడి దశరథరెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులు అభినందించారు. -
స్కూటీని ఢీకొట్టిన కారు.. ఇద్దరికి గాయాలు
కొండమల్లేపల్లి : మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో మంగళవారం సాయంత్రం కారు అదుపుతప్పి స్కూటీని, స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తితో పాటు రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకునే మహిళకు గాయాలయ్యాయి. వివరాలు.. హైదరాబాద్ నుంచి అనుములకు కారులో వెళ్తున్న వ్యక్తి కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో యూటర్న్ తీసుకుంటుండగా.. అదుపుతప్పి స్కూటీపై వెళ్తున్న నాంపల్లి మండలం సల్సాపురం గ్రామానికి మెండె నరేష్‌ను ఢీకొని బస్టాండ్ వద్ద ఉన్న స్తంభాన్ని కూడా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో మెండె నరేష్ కాలు ఫ్యాక్చర్ కాగా చుట్టుపక్కల వారు 108 సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. పెట్రోల్ బంకుల్లో తనిఖీలుభూదాన్పోచంపల్లి : పోచంపల్లి పట్టణ కేంద్రంతో పాటు జలాల్పురంలోని పెట్రోల్ బంకుల్లో మంగళవారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి రోజా, డీటీ బాలమణి తనిఖీలు చేపట్టారు. కొలతల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అని పరిశీలించారు. పెట్రోల్ నాణ్యతలో, కొలతల్లో ఏమైనా తేడాలొస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. -
మోత్కూరులో భోగి బోనాలకు సిద్ధం
మోత్కూరు : సంక్రాంతిని మోత్కూరు పట్టణంలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. భోగి రోజు ముది రాజ్ కులస్తులు పెద్దమ్మ తల్లికి, గౌడ కులస్తులు కంఠ మహేశ్వర స్వామికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. 2009లో బిక్కేరు సమీపంలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ముదిరాజ్ కులస్తులు నిర్మించారు. అప్పటి నుంచి ఏటా వార్షికోత్సవాన్ని భోగి రోజున నిర్వహిస్తున్నారు. మహిళలు బోనాలతో ప్రదర్శనగా వెళ్లి పెద్దమ్మ తల్లి, గంగమ్మ తల్లికి నైవేద్యం సమర్పిస్తారు. సంక్రాంతి రోజు ముదిరాజ్‌లు కుటుంబ సమేతంగా వన భోజనాలకు వెళ్లడం సంప్రదాయం. భోగి రోజు గౌడ కులస్తులు కంఠమహేశ్వరస్వామికి తీపి భోనాలతో నైవేద్యం సమర్పించడం ఆచారం. ఇది రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. సంక్రాంతి రోజు వన మైసమ్మ, రేణుక ఎల్లమ్మ, గ్రామ దేవతలకు మేకపోతులు, కోళ్లు బలి స్తారు. -
సంబరాల సంక్రాంతి
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సూర్యాపేట సమీపంలోని పలు హోటళ్లను నిర్వాహకులు పండుగ వాతావరణంలో ముస్తాబు చేశారు. సెవెన్ ఆర్ హోటల్లో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలను తలపించేలా ఎద్దుల బండి, ఎద్దులతో సెట్టింగ్ చేశారు. పట్టణంలో పతంగులు, చెరుకు గడలు, గొబ్బెమ్మల సామగ్రితో పాటు కలర్లను ప్రజలు కొనుగోలు చేస్తుండడంతో పండగ వాతావరణం నెలకొంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, సూర్యాపేట -
ఈతకు వెళ్లి గుంతలో పడి బాలుడు మృతి
మర్రిగూడ : ఈతకు వెళ్లి నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన మర్రిగూడ మండలంలోని వెంకేపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకేపల్లి గ్రామానికి చెందిన గోగుల అంజయ్య, శారద దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు అక్షయ్‌కుమార్(11) సంతానం. అక్షయ్‌కుమార్ మంగళవారం గ్రామ శివారులో శివన్నగూడెం రిజర్వాయర్ మట్టి కోసం తవ్విన గుంతలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి ఊపిరాడక మృతిచెందాడు. అక్షయ్‌కుమార్ మాల్లోని కృష్ణవేణి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ మునగాల కృష్ణారెడ్డి తెలిపారు. -
వైభవంగా గోదాదేవికి నిరాటోత్సవాలు
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గోదాదేవి అమ్మవారి నీరాటోత్సవాలను మంగళవారం ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి పంచామృతాలతో నవ కలశ స్నపనం చేపట్టారు. అనంతరం తిరుమాడ వీధుల్లో స్వామి, అమ్మవార్లను గజ వాహనంపై ఊరేగించారు. ఆ తర్వాత సంప్రదాయ పూజలు చేశారు. మధ్యాహ్నం తిరుప్పావై మండపంలో తిరువారాధన ఆరగింపు, తీర్ధ ప్రసాద గోష్ఠి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రచార్యులు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహామూర్తి, ఆలయ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నేడు గోదాదేవి కల్యాణం ధనుర్మాసంలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో నేడు గోదాదేవి కల్యాణం జరిపించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. సాయంత్రం 7 గంటలకు కల్యాణం నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈ నెల 15న మధ్యాహ్నం ఒడి బియ్యం కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. -
‘ఆరోగ్య లక్ష్మి’ని సద్వినియోగం చేసుకోవాలి
భువనగిరి(బీబీనగర్): ఆరోగ్యలక్ష్మి భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీ్త్ర శిశు, వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితారామచంద్రన్ కోరారు. బీబీనగర్ మండల కేంద్రంలోని 5,6వ నంబర్ గల అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం సీ్త్ర శిశు, వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితారామచంద్రన్ తనిఖీ చేశారు. కేంద్రంలోని గర్భిణులతో మాట్లాడారు. ఆరోగ్యలక్ష్మి భోజనం, మెనూ, అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలు ఇంకా సక్రమంగా నడవాలంటే ఎలాంటి సదుపాయాలు కల్పించాలని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీబీనగర్‌లో ప్రారంభమైన వయోవృద్ధుల డాట కేర్ సెంటర్‌ను సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, సీడీపీఓ శైలజ, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.ఫ సీ్త్ర శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితారామచంద్రన్ -
50 మందిపై కేసు
స్లాట్ బుకింగ్ కుంభకోణంలోభువనగిరిటౌన్ : భువనగిరి తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్టాంప్‌డ్యూటీ మళ్లింపు విషయంలో 9 మందిపై కేసు నమోదు చేసినట్టు భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్‌కుమార్ తెలిపారు. చౌటుప్పల్ : భూ భారతి కుంభకోణానికి చౌటుప్పల్ కేంద్ర బిందువుగా మారింది. దీనిపై తహసీల్దార్ వీరాభాయి, డిప్యూటీ తహసీల్దార్ పజ్జూరు సిద్ధార్ధకుమార్, గతంలో ఇక్కడ పని చేసి బదిలీ అయిన తహసీల్దార్ హరికృష్ణలు పోలీస్‌స్టేషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. డాక్యుమెంట్ రైటర్ బాతరాజు తరుణ్ వెనుక మరో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు సమాచారం. భూ భారతి పోర్టల్‌లోని ఎడిట్ ఆప్షన్ ఆధారంగా చోటుచేసుకున్న భారీ కుంభకోణంలో జిల్లాలో 50 మందిపై కేసు నమోదైంది. ఇందులో డాక్యుమెంట్ రైటర్లు ఇంటర్నెట్ నిర్వాహకులు ఉన్నారు. ఇంటర్నెట్ సెంటర్, కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు భూమి యజమానుల నుంచి చలానా మొత్తం వసూలు చేసి ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ విలువ ప్రకారం చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలానా మొత్తం ప్రభుత్వానికి చెల్లించలేదు. రాజాపేట: భూభారతి ధరణి స్లాట్ బుకింగ్‌లో పలు ఆన్లైన్ కేంద్రాల నిర్వాహకులు జెల్ల పాండు, జెల్ల పావని, నార భాను, పసునూరి బస్వరాజు, గోపగాని శ్రీనాథ్, శ్రీకాంత్, రేహాన్ష్లు అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించి తహసీల్దార్ ఫిర్యాదుమేరకు ఏఎస్ఐ మైసయ్య చీటింగ్ కేసు నమోదు చేశారు. మోటకొండూర్ : మోటకొండూర్ తహసీల్దార్ కార్యాలయంలో 59 డ్యాకుమెంట్లకు సంబంధించి స్లాట్ బుక్కింగ్‌లో ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించారు. అక్టోబర్ 2024 నుంచి నేటి వరకు ఈ స్లాట్ బుకింగ్ ద్వారా రూ.18.952 లక్షలు ప్రభుత్వానికి గండి పడినట్లు డీటీ జయమ్మ తెలిపారు. అక్రమాలకు పాల్పడిన ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులు ఆలేటి నాగరాజు, నాగరాజు, మల్గ లావణ్య, దుంపల కిషన్, పసునూరి బసవరాజు, భానులపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. యాదగిరిగుట్ట రూరల్: డాక్యుమెంట్లల్లో అక్రమాలకు పాల్పడిన ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులు బస్వరాజ్, భాను, దేవేందర్, శ్రీకాంత్, పాండు, పావని, భానుచందర్, నాగరాజు, కృష్ణ,నాగరాజు లపై యాదగిరిగుట్టలో రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మండలంలో 212 డాక్యుమెంట్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ డాక్యుమెంట్లకుగాను చలానా ఫీజు రూ.74,75868 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ. 2,77482 లక్షలు మాత్రమే చెల్లించినట్లు అధికారులు తెలిపారు. కాగా రూ.71,98386 లక్షలు ప్రభుత్వ ఖజానాకు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. ఆత్మకూరు(ఎం): స్లాట్‌లో అక్రమాలకు పాల్పడిన ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన డాక్యుమెంట్ రైటర్‌పై తహసీల్దార్ వి. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి మండలంలో భూభారతి పోర్టల్ ద్వారా భూ రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ చలాన్లలో అక్రమాలకు పాల్పడిన చౌటుప్పల్‌కు చెందిన డాక్యుమెంట్ రైటర్ తరుణ్‌పై తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. 2024 నవంబర్ నుంచి మార్చి 2025 వరకు భూమి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన సుమారు రూ.12.92 లక్షల ఆదాయానికి గండి కొట్టారని చెప్పారు. వలిగొండ : వలిగొండలో భూభారతిలో స్థాంపు డ్యూటీ ఆన్లైన్ చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డ స్థానిక స్టాంప్ వెండర్స్ కల్కూరి మధు, ఎం .భువనేశ్, పి. బసవరాజు, రాజు, రాఖేష్, శివరామ కృష్ణ, తరుణ్‌పై తహసీల్దార్ దశరథ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 41 స్లాట్లలో రూ.15,58,472 తక్కువ చెల్లించినట్లు తెలిపారు. ఆలేరు: రిజిస్ట్రేషన్ రుసుమును పక్కదారి పట్టించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆలేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తహసీల్ధార్ ఆంజనేయులు మంగళవారం తెలిపారు. గుండాల: జనగామ జిల్లా కొడకండ్లకు చెందిన కె.సత్యనారాయణ, బీబీనగర్ మండలానికి చెందిన నరేష్‌లు గుండాల మండలం అనంతారం, వెల్మజాల, బ్రాహ్మణపల్లి, సుద్దాలకు చెందిన 8 మంది రైతుల భూ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ చేసినట్లు చెప్పారు. 8 స్లాట్లకు రూ.1.97 లక్షల 772 ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ సదరు డాక్యుమెంట్ రైటర్లు రూ.9807 మాత్రమే చెల్లించి మిగతావి కాజేశారని తెలిపారు. సదరు ఆన్లైన్ నిర్వాహకులపై తహసీల్దార్ ఎస్.హరికృష్ణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ తేజమ్‌రెడ్డి కేసు నమోదు చేశారు.బొమ్మలరామారం మండలంలో అక్రమాలకు పాల్పడిన డాక్యుమెంట్ రైటర్ దొమ్మాట శంకర్‌తో పాటు కొండ భాను చందర్, నల్ల శ్రీకాంత్‌లపై తహసీల్దార్ శ్రీనివాస్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బసవన్నలతో భుక్తి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : మండలంలోని ఏనుబాముల గ్రామానికి చెందిన బత్తుల వెంకట్రాములు గంగిరెద్దులను ఆడించడమే వృత్తిగా ఎంచుకొని జీవనం సాగిస్తున్నాడు. దాంతో ఇతడి పేరే గంగిరెద్దుల వెంకట్రాములుగా మారిపోయింది. వెంకట్రాములుతో పాటు అతడి కుటుంబ సభ్యులు సైతం తాతల కాలం నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. సంక్రాంతితో పాటు ఇతర రోజులలోకూడా గంగిరెద్దులను ఆడిస్తూ మండలంలోని అన్ని గ్రామాలకు వెళ్తుంటారు. శుభ, అశుభ కార్యాలకు సైతం వీరిని ఆహ్వానిస్తుంటారు. దశదిన కార్యాలకు, కొందరు పెద్ద రైతులు, భూస్వాములు అందించే కొడే దూడలను తీసుకొచ్చి తమ వద్దే ఉంచుకొని ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. దూడలను గంగిరెద్దుగా మార్చేందుకు రెండు, మూడేళ్ల పాటు శిక్షణ ఇచ్చి ఆ తరువాత రంగంలోకి దింపుతారు. గంగిరెద్దులను వెంకట్రాములు కుటుంబం దైవంలా భావిస్తుంటారు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు, మూడురోజులుగా వివిధ గ్రామాల్లో తిరుగుతూ గంగిరెద్దులను ఆడిస్తున్నారు. -
గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల
సాక్షి, యాదాద్రి: సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇటీవల జిల్లాలోని 427 గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఏడు నెలలుగా గ్రాంటు లేక గ్రామ పంచాయతీలు ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. మంగళవారం ఆర్థిక శాఖ నిధులను విడుదల చేసింది. ఈ నిధులను బుధవారం గ్రామ పంచాయతీ ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. అనంతరం సర్పంచ్, ఉపసర్పంచ్‌ల సంతకాలతో డ్రా చేసి గ్రామ అవసరాలకు ఖర్చు చేయవచ్చునని అధికారులు చెబుతున్నారు. విద్యా ప్రగతిని మెరుగుపర్చేందుకే ‘జట్టు’ఫ కలెక్టర్ హనుమంతరావుభువనగిరి(బీబీనగర్): పదో తరగతిలో విద్యార్థుల విద్యా ప్రగతిని మెరుగుపర్చేందుకే జట్టు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. మంగళవారం బీబీనగర్ మండలం కొండుమడుగ గ్రామంలో విద్యార్థుల జట్టు ఏర్పాటుచేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పదోతరగతి.. విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో కీలకమైందన్నారు. ప్రతి గ్రామంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు, విద్యావంతులైన యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జట్టుగా ఏర్పడాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులు మంచి వాతావరణ పరిస్థితులు కల్పించాలన్నారు. ప్రతి రోజు తెల్లవారు జామున 4 గంటలకు లేచి చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకం ఫ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు భువనగిరిటౌన్ : మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణలో ప్రతీ ఒక్క అధికారి పాత్ర కీలకమైనదని, సమన్వయంతో విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఫలితాల ప్రకటన వరకు తీసుకోవాల్సిన చర్యలు, నిర్వర్తించాల్సిన బాధ్యతలకు సంబంధించి ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు చెక్ లిస్ట్ తయారుచేసుకోవాలన్నారు .ఈ కార్యక్రమం లో రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి , మాస్టర్ ట్రైనర్లు నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
60ఏళ్లుగా పతంగుల తయారీలో ‘సాహు’ కుటుంబం
భువనగిరి: సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేది గాలిపటాలు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వీటిని ఎగురవేస్తుంటారు. ఆరుదశాబ్దాలుగా ఈ పంతంగుల తయారీనే వృత్తిగా మలుచుకుంది భువనగిరికి చెందిన ఓ కుటుంబం. పట్టణంలోని సమ్మద్ చౌరస్తా సమీపంలో సాహు లక్ష్మీనారాయణ కుటుంబం 1963లో ఇంట్లోనే పతంగుల తయారీకి శ్రీకారం చుట్టింది. పతంగుల తయారీలో ఎన్నోమార్పులు వచ్చినా నేటికి సంప్రదాయ రీతిలో పేపర్, వెదురు కర్రలతో తయారు చేసి విక్రయిస్తున్నారు. గాలిపటాల తయారీకి అవసరమైన ముడిసరుకును హైదరాబాద్ నుంచి తీసుకొస్తారు. ఏటా డిసెంబర్, జనవరి నెలల్లోనే పతంగుల సీజన్ వస్తుంది. దీనికోసం ఆగస్టు నుంచే పతంగులను తయారీకి శ్రీకారం చుడుతారు. నవంబర్‌కు వరకు తయారు చేసినవాటిని మార్కెట్లోకి తెస్తారు. ప్రతి సీజన్లో సుమారు 1,500 నుంచి రెండు వేల వరకు పతంగులను వివిధ డిజైన్లలో తయారు చేస్తారు. సీజన్లో పట్టణంలో నాలుగు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో డిజైన్, సైజులను బట్టి ఒక్కో పతంగికి రూ.10 నుంచి రూ.50 వరకు విక్రయిస్తుంటారు. ఎన్నో రకాల కవర్ పతంగులు వచ్చినప్పటికీ పేపర్ పతంగులకు మంచి డిమాండ్ ఉంటుంది. సీజన్‌కు 5 నెలల ముందు తయారు చేయడం ప్రారంభిస్తాం. ఇంట్లో అందరికీ పతంగులు తయారు చేయడం వచ్చు. ప్రస్తుతం మనవరాళ్లు కూడా తయారు చేస్తున్నారు. స్వయంగా తయారు చేసి విక్రయించడం ద్వారా కూలి డబ్బులు లాభంగా ఉంటుంది. – లక్ష్మీనారాయణ, పతంగుల తయారీదారుడు, భువనగిరి -
పండుగొచ్చింది
పల్లెగూటికి..పిండి వంటలకు కేరాఫ్ తాళ్లగడ్డఆనందం.. ఆరోగ్యంహరిదాసు.. భాగ్యలక్ష్మిఫ 30 ఏళ్లుగా ఇదే వృత్తిగా జీవనం భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేటలోని తాళ్లగడ్డ ప్రాంతం పిండివంటలకు కేరాఫ్‌గా నిలిచింది. తాళ్లగడ్డకు చెందిన శ్రీరాముల అంజమ్మ కుటుంబం 30 ఏళ్లుగా పిండి వంటలు తయారు చేస్తూ విక్రయిస్తోంది. అంజమ్మ మొదట్లో కారపూస చేసి విక్రయించేది. ఆమె చేసిన పిండి వంటలు బాగుండడంతో గిరాకీ పెరగడం ప్రారంభమైంది. దాంతో ఆమె కూడా అన్నిరకాల పిండి వంటలను తయారు చేయడం మొదలు పెట్టారు. అంజమ్మ కుమారులు, మనుమళ్లు సైతం నాలుగు దుకాణాలు ఏర్పాటు చేసి పిండి వంటలను తయారు చేసి విక్రయిస్తున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. సూర్యాపేటతో పాటు ఇతర ప్రాంతాల వారు సైతం వచ్చి తీసుకెళ్తుంటారు. కొందరు ఆర్డర్లు ఇచ్చి మరీ పిండి వంటలు చేయించి తీసుకెళ్తుంటారు. సంక్రాంతికి 10 రోజుల ముందు నుంచే గిరాకీ అధికంగా ఉంటుంది. కారపూస, సకినాలు, చెకోడీలు, బూందీ, లడ్డూలు, అరిసెలు, కట్టె గారెలు, పూర్ణాలు, గవ్వలు, మైసూర్‌పాక్ ఇలా అన్ని రకాల పిడి వంటలు వీరు తయారు చేసి కిలోల చొప్పున విక్రయిస్తున్నారు.ఫ మూడు రోజులు సందడే.. సందడి ఫ తొలిరోజు భోగి మంటలు, భోగిపండ్లు ప్రత్యేకం ఫ రంగవల్లులతో కళకళలాడనున్న లోగిళ్లు సూర్యాపేటటౌన్, రామగిరి(నల్లగొండ) : సంక్రాంతి పండుగకు చిన్నారులు, యువత పతంగులను ఉత్సాహంగా ఎగురవేస్తుంటారు. వీటిని ఎగురవేయడంలోనూ ఆరోగ్యపరమైన కారణాలతోపాటు, శాసీ్త్రయత కూడా దాగి ఉంది. పురాణాల ప్రకారం శ్రీరాముడు మకర సంక్రాంతి రోజున గాలిపటం ఎగురవేశాడని, అది ఇంద్రలోకానికి చేరిందని చెప్పుకుంటారు. అదేవిధంగా సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో ఆకాశం వైపు చూస్తూ పతంగులు ఎగురవేయడం సూర్యారాధనకు గౌరవంగా భావిస్తారు. అంతేకాకుండా పతంగులు ఎగురవేయడం వల్ల శరీరానికి వ్యాయామం అవుతుంది. ఎముకలు బలపడతాయి. విటమిన్ ఈ సరఫరా పెరుగుతుంది. చలి తగ్గే సమయంలో సూర్యకిరణాలు శరీరానికి అందడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గాలిపటాలు ఎగురవేసే క్రమంలో వారు దానివైపు చూసే తీక్షణ చూపు చిన్నారుల కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇదిలా ఉండగా.. దుకాణాల్లో కొన్నవే కాకుండా కొంతమంది చిన్నారులు గాలిపటాలను వారే సొంతంగా తయారు చేసుకుంటుంటారు. చతురస్రం, దీర్ఘచతురస్రం ఆకారంలో పేపర్లను కత్తిరించుకొని అందంగా తీర్చిదిద్దుతుంటారు. దీని ద్వారా గణితంలోని జ్యామితి, ఆకారాలు వారికి తెలుస్తాయి. సూర్యాపేటలో గంగిరెద్దును ఆడిస్తున్న దృశ్యంఫ ప్రతి ధనుర్మాసంలో హరిదాసు వేషధారణ ఫ ప్రభాత సమయంలో ప్రజలను మేల్కొలుపుతున్న మహిళ రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రానికి చెందిన అయ్యోరి మురళి గతంలో ప్రతి ధనుర్మాసంలో హరిదాసు వేషధారణతో సంకీర్తనలు, పాశురాలు పాడుతూ ప్రతి గడప ముందుకు వచ్చేవాడు. ఉదయం నాలుగు గంటల నుంచి తెల్లవారే వరకు గ్రామంలో సంచరిస్తూ తన మధురమైన గాత్రంతో ప్రజలను మేల్కొలిపేవాడు. మూడేళ్ల క్రితం ఆయన హఠాన్మరణంతో ఆ గ్రామం చిన్నబోయినట్లయింది. దాంతో తండ్రి వృత్తిని తానే స్వీకరించింది భాగ్యలక్ష్మి. ధనుర్మాసం రావడంతోటే తెల్లవారుజామున ప్రతి ఇంటికి వెళ్లి తన శ్రావ్యమైన గొంతుతో పాశురాలు, సంకీర్తనలు పాడుతూ ఇంటిల్లిపాదినీ మేల్కొలుపుతుంది భాగ్యలక్ష్మి. ఆమె సంకీర్తనలు విన్న రాజాపేట ప్రజలు ఆమె తండ్రి మురళిని గుర్తుతెచ్చుకోకుండా ఉండలేరు. మురళికి ఒక్కగానొక్క కుమార్తె అయిన రేపాక భాగ్యక్ష్మి తన తండ్రితోపాటే పాటలు, సంకీర్తనలు సంకీర్తనలు పాడుతూ తిరిగేది. తండ్రి తదనంతరం ప్రతి ధనుర్మాసంలో ఉదయంపూట గ్రామంలోని కాలనీల్లో మహిళా హరిదాసు వేషధారణతో సంచరిస్తూ తండ్రి పాడిన పాటలను మైక్ ద్వారా వినిపించడమే కాకుండా తన గాత్రంతో తండ్రి చదివే పద్యాలను చదువుతూ ప్రజలకు మేల్కొలపడాన్ని వృత్తిగా స్వీకరించింది. పండగ రోజుల్లో గ్రామ ప్రజలు ఇచ్చిన కానుకలను స్వీరిస్తూ వారికి ఆశీర్వచనాలు తెలియజేస్తుంది. పురుషులకు తీసిపోకుండా పౌరోహిత్యం మురళి కుమార్తె భాగ్యలక్ష్మి తన తండ్రి బాటలోనే నడుస్తుంది. మురళి బతికున్న రోజుల్లో శుభాకార్యాలు నిర్వహించేవాడు. అతని ఒక్కగానొక్క కుమార్తె భాగ్యలక్ష్మి తండ్రిలాగా పౌరహిత్యం నేర్చుకుంది. పురుషులకు తీసిపోకుండా చక్కటి ఉచ్చారణతో మంత్రాలు చదువుతూ వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, వినాయక విగ్రహ ప్రతిష్ఠలు, సత్యనారాయణ వ్రతాలు వంటివి నిర్వహిస్తోంది. గ్రామ ప్రజలు కూడా ఆమె తండ్రిని ఆదరించినట్లే ఆమెనూ ఆదరించడం విశేషం. చిన్నారులకు జ్ఞానం కలగాలని భోగి పండ్లు పోస్తారుఫ కాండూరి వెంకటాచార్యులు, గుట్ట ఆలయ ప్రధాన అర్చకుడు యాదగిరిగుట్ట : భగవంతుడి అనుగ్రహం ఉండాలని ధనుర్మాసంలో గోదాదేవి పూజలు చేస్తుంది. ఇందులో భాగంగానే అమ్మవారు కృష్ణ పరమాత్మను అత్యంత పవిత్రంగా భావించి వర్షాలు బాగా పడాలని, ఆరోగ్యం బాగుండాలని, పంటలుబాగా పండాలని వేడుకుంటూ గోదాదేవి అమ్మవారు వ్రతాన్ని ఆచరిస్తుంది. మకరంలో సూర్యుడు సాయంత్రం 8.45గంటలకు ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది. ఈ సమయంలో చిన్న పిల్లలకు కొత్త పంటల నుంచి వచ్చిన బియ్యం, నువ్వులు, పైసలు, రేగు పండ్లు శ్రీస్వామి వారి పాదాల వద్ద పెట్టి పిల్లల నెత్తిపై పోస్తారు. చిన్నారులకు జ్ఞానం కలుగాలని భదిరికా (రేగుపండ్లు) ఫలాలను భోగి రోజున పోస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో పశువులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదే సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభం అవుతుంది. మంచి వెలుతురును ఇచ్చే పండుగనే సంక్రాంతిగా జరుపుకుంటాం. ఈశ్వర తత్వం కలిగిన గోవును పూజించే సమయమే సంక్రాంతి. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యనారాయణుడిని ధాన్యం చేస్తే చాలా బాగుంటుంది. విశాలమైన ప్రదేశంలోనే పతంగులను ఎగురవేసేందుకు పిల్లలకు అవకాశమివ్వాలి. దారం తెగి చెట్లు, ఇళ్లపై పడితే వారిని అక్కడకు వెళ్లనీయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో భవనాలపై గాలిపటాలు ఎగరవేయకుండా జాగ్రత్తపడాలి. చైనా మాంజా వాడకుండా చూడాలి. విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లకు సమీపంలో పతంగులను ఎగురవేయొద్దు. మూడు రోజుల పండుగ సంక్రాంతికి పల్లెలు, పట్టణాలు ముస్తాబయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే పనిలో రైతులు.. ఇళ్ల లోగిళ్లలో రంగవల్లులు వేస్తూ యువతులు.. పిండివంటల తయారీలో మహిళలు.. గాలిపటాల ఎగురవేతలో చిన్నారులు.. ఆటల పోటీల్లో యువకులు.. ఇలా ఎవరి పనుల్లో వారు బిజీగా మారారు. మరో పక్క బంధుమిత్రుల రాక.. కొత్త కోడళ్లు, అల్లుళ్ల సందడితో పండుగ కళ ఉట్టిపడుతోంది. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో ఊర్లన్నీ సందడిగా మారాయి. బుధవారం భోగి సందర్భంగా భోగి మంటలు వేస్తారు. చిన్నారులకు భోగి పళ్లు పోస్తారు. -
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలిసి ప్రజల నుంచి 35 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. అర్జీల్లో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 22, సివిల్ సప్లయీస్ 6, గ్రామీణ అభివృద్ధి శాఖ 2, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 2, సర్వే ల్యాండ్స్ , వ్యవసాయ, మున్సిపాలిటీ శాఖలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున వచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, జెడ్పీసీఈఓ శోభారాణి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులు త్వరగా పూర్తి చేస్తాం జిల్లాలో భువనగిరి, ఆలేరులో మంజూరైన రెండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేస్తామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇందులో కలెక్టరేట్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో సంబంధిత అధికా రులు తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
మున్సిపల్ ఓటర్లు 1,32,725 మంది
సాక్షి,యాదాద్రి: మున్సిపల్ ఓటర్ల లెక్క తేలింది. ముసాయిదాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించిన అధికారులు వార్డుల వారీగా ఓటరు తుది జాబితాను సోమవారం విడుదల చేశారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 1,32,725 మంది ఓటర్లు ఉన్నారు. మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదాను ప్రకటించనున్నారు. ఈనెల 16న ఫొటోతో కూడిన ఓటరు తుది జాబితా విడుదల చేస్తారు 2,833 మంది మహిళా ఓటర్లు అధికం జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 1,32,725 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 64,937 మంది పురుషులు, 67,770 మంది మహిళలు, 18 మంది ఇతరులు ఉన్నారు. అత్యధికంగా భువనగిరిలో 47,831 మంది ఓటర్లు, అత్యల్పంగా ఆలేరులో 13,632 మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితాలో మాదిరిగానే తుదిజాబితాలో మొత్తంగా చూస్తే పురుషుల కంటే మహిళా ఓటర్లు 2,833 మంది అధికంగా ఉన్నారు. మున్సిపాలిటీల వారీగా చూసినా అన్నింటిలోనూ మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. కార్యాలయాల వద్ద అందుబాటులో.. తాజాగా విడుదల చేసిన ఓటరు తుది జాబితాలను వార్డుల వారీగా మున్సిపల్, తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల వద్ద అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉండగా 2025 అక్టోబర్ 1న తేదీనాటి జాబితా ఆధారంగా ముసాయిదా జాబితాను 2026 జనవరి1న ప్రకటించారు. మున్సిపాలిటీలు, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించారు. కొన్నిచోట్ల ఓటర్ల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 153 అభ్యంతరాలు రాగా వాటన్నింటినీ పరిష్కరించిన అధికారులు సోమవారం వార్డుల వారీగా ఓటరు తుది జాబితాను ప్రకటించారు.ఆరు మున్సిపాలిటీల్లో మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను అధికారులు ప్రకటిస్తారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి పరిష్కరిస్తారు. ఇక ఈనెల 16న ఫొటోతో కూడిన ఓటరు జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా విడుదల చేస్తారు. ఈ జాబితా ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ఓటరు తుది జాబితా ప్రకటించిన అధికారులు ఫ అత్యధికంగా భువనగిరిలో 47,831 మంది, అత్యల్పంగా యాదగిరిగుట్టలో 13,632 మంది ఓటర్లు ఫ పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం ఫ నేడు పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రకటన ఫ 16న ఫొటోతో కూడిన ఓటరు జాబితా మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఓటరు తుది జాబితాలను ప్రకటించాం. 104 వార్డుల్లో 211 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి వార్డులో రెండు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అధికంగా ఓటర్లు ఉన్న చోట మూడు పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, డెడికేషన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం బీసీ, జనరల్ రిజర్వేషన్లు ఉంటాయి. – భాస్కర్‌రావు, అదనపు కలెక్టర్ మున్సిపాలిటీ వార్డులు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఆలేరు 12 6,671 6,960 01 13,632 భువనగిరి 35 23,037 24,793 01 47,831 చౌటుప్పల్ 20 13,553 13,663 – 27,216 మోత్కూరు 12 7,106 7,277 – 14,383 పొచంపల్లి 13 7,808 8,031 – 15,839 యాదగిరిగుట్ట 12 6,762 7,046 16 13,822 మొత్తం 104 64,937 67,770 18 1,32,725 -
చేనేత కార్మికుల ఆమరణ దీక్ష
సంస్థాన్ నారాయణపురం : చేనేత రుణమాఫీ వెంటనే చేయాలని సోమవారం సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో చేనేత కార్మికులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గ్రామానికి చెందిన వర్కాల వెంకటేశం, గూడెల్లి బాలరాజు దీక్ష చేపట్టగా వీరికి మద్దతుగా చేనేత కార్మికులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో చేనేత నాయకులు గజం సత్యనారాయణ, చెరుపల్లి రామాలింగం, కర్నాటి శ్రీనివాస్, చిట్టిప్రోలు రమేష్. చిలుకూరి గిరి, దామర్ల వేణుగోపాల్, గంజి హరీష్, రవి, రామాలింగస్వామి, సైదులు, శేఖర్, రమేష్ పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్‌తో ప్రింటింగ్ ప్రెస్ దగ్ధం
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మండల కేంద్రంలోని సమతా ప్రింటింగ్ ప్రెస్‌లో సోమవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రింటింగ్ మిషన్లు, ప్రింటర్లు, కంప్యూటర్లు, కౌంటర్లో ఉన్న రూ.4500 కాలిబూడిదయ్యాయి. రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లుదుకాణ యజమాని గుండు కిరణ్‌కుమార్ తెలిపారు. ఇంట్లో సామగ్రి..నార్కట్‌పల్లి : మండలంలోని మాధవఎడవెల్లి గ్రామానికి చెందిన ఎడమ మల్లేష్ ఇంట్లో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి సామగ్రి కాలిపోయాయి. ఇంట్లోని విద్యుత్ వైర్లకు మంటలు రావడంతో బీరువా, బీరువాలో ఉన్న విలువైన సర్టిఫికెట్లు, రూ.70 వేల నగదు, మంచం మీద సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు మల్లేష్ తెలిపారు. వ్యక్తి కిడ్నాప్‌నకు యత్నం.. నలుగురిపై కేసు నమోదుమోటకొండూర్ : బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని బెదిరించి కారులో ఎక్కించుకెళ్లిన నలుగురిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన సోమవారం మోటకొండూర్ మండల కేంద్రంలో జరిగింది. స్థానిక ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ హజీమ్ తన భార్య షేక్ హసీనా బేగంతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు బైక్‌ను ఆపి హజీమ్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. హజీమ్ భార్య హసీనా బేగం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. చౌటుప్పల్ సమీపంలో పోలీసులు కారును పట్టుకుని హజీమ్‌ను కిడ్నాప్ చేసిన పీసరి నవీన్‌రెడ్డి, పీసరి మల్లారెడ్డి, తుమ్మల వెంకట్‌రెడ్డి, ముత్తినేని సందీప్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు నలుగురిపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.. నకిలీ విత్తనాలు అమ్మారంటూ రైతు నిరసన కొండమల్లేపల్లి : తనకు నకిలీ విత్తనాలు అమ్మారంటూ ఓ రైతు మండల కేంద్రంలోని సాగర్ రోడ్డులో గల మన గ్రోమోర్ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశాడు. చింతపల్లి మండలంలోని వెంకటంపేటకు చెందిన ఓ రైతు 10 రోజుల క్రితం కొండమల్లేపల్లిలోని మన గ్రోమోర్ దుకాణంలో వరి విత్తనాలు కొనుగోలు చేసి తన పొలంలో నారు చల్లాడు. ఐదు రోజులు గడిచినా మొలకెత్తకపోవడంతో రైతు ఆందోళన చెంది సోమవారం మన గ్రోమోర్ వద్దకు వచ్చి నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న ఏఓ జానకి రాములు అక్కడకు వచ్చి రైతుతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం రైతుకు వరి విత్తనాల బస్తాలు తిరిగి ఇప్పించడంతో రైతు నిరసన విరమించాడు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు చేసినపుడు రశీదు తీసుకొని భద్రపరుచుకోవాలని సూచించారు. నల్లగొండ జీజీహెచ్‌లో అరుదైన శస్త్ర చికిత్సనల్లగొండ టౌన్ : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో వైద్యులు సోమవారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. వేములపల్లి మండలం మంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మి (40) కడుపునొప్పితో బాధపడుతూ ఈ నెల 5న ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆమె కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. సోమవారం డాక్టర్ స్వరూపారాణి బృందం లక్ష్మికి శ్రస్త చికిత్స చేసి కిలోన్నర కణితితో కూడిన గర్భసంచిని తొలగించారని సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం నర్సింహారావు తెలిపారు. ప్రస్తుతం పేషంట్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. -
సరైన పద్ధతులతో నల్ల తామర నివారణ
గుర్రంపోడు : నాలుగేళ్లుగా మిరుపలో నల్ల తామర తెగులు తీవ్రంగా ఉంటోందని, దీని ఉనికిని సకాలంలో గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని ప్రాంతీయ ఉద్యానవన అధికారి కె. మురళి అన్నారు. సోమవారం గుర్రంపోడు మండలంలోని చేపూరు, మొసంగి గ్రామాల్లో మిరుప తోటలను ఆయన పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. అధిక నత్రజని ఎరువులను వేసుకోకుండా సిఫారసు చేసిన మోతాదులోనే యూరియా అందించాలన్నారు. నల్ల తామర పురుగుకు కలుపు మొక్కలు ఆవాసాలుగా ఉంటాయి కాబట్టి పొలం గట్టు మీద ఉన్న కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు నిర్మూలించుకోవాలన్నారు. పురుగులు బెట్ట పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉన్నందున భూమిలో తగినంత తేమతో పురుగు ఉధృతిని నివారించవచ్చున్నారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బెవరియా బెసినియా లేదా లెకానిసిలియం లెకాని 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. చివరి అస్త్రంగా సయాంట్రానిలిప్రోల్ 1.2 మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.32 మి.లీ. లేదా ఫిఫ్రోనోల్ 80 డబ్లుజీ 0.2 గ్రాములు లేదా పిప్రోనిల్ మరియు ఇమిడా క్లోఫ్రిడ్ 0.2 గ్రాములు లేదా స్పైనటోరం ఒక మిల్లీలీటరు ఒక లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ పిచికారీ చేయాలని సూచించారు. -
చౌటుప్పల్‌లోనూ ‘భూ భారతి’ కుంభకోణం
చౌటుప్పల్, యాదగిరిగుట్ట : భూ భారతి పోర్టల్‌లోని ఎడిట్ ఆప్షన్ ఆధారంగా జరిగిన చలాన్ల కుంభకోణంలో చౌటుప్పల్‌కు చెందిన డాక్యుమెంట్ రైటర్ పాత్ర తాజాగా వెలుగుచూసింది. జనగామలో వెలుగు చూసిన ఈ కుంభకోణంపై చేపట్టిన విచారణలో ఇక్కడి డాక్యుమెంట్ రైటర్ కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా ఈ కేసులో యాదగిరిగుట్ట పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో మరో ఇంటర్నెట్ నిర్వాహకుడిని ఆదివారం రాత్రి వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. కాజేసిన సొమ్ము ఎంత? రైతుల భూములకు రిజిస్ట్రేషన్ చేసేందుకు అవసరమైన స్లాట్ బుకింగ్ చేసిన సమయంలో సదరు రైతుల వద్ద లెక్కప్రకారంగా చలాన్‌కు డబ్బులు తీసుకుని ప్రభుత్వ ఖజానాకు మాత్రం మొత్తం చెల్లించకుండా చౌటుప్పల్‌కు చెందిన డాక్యుమెంట్ రైటర్ కాజేసినట్లు తెలిసింది. అయితే స్లాట్ బుకింగ్‌ల ద్వారా ప్రభుత్వ సొమ్ము ఎన్నిరోజులుగా కాజేశాడు, ఎన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి అనే విషయం తేలాల్సి ఉంది. జనగామలో వెలుగుచూసిన కుంభకోణం ఆధారంగా చేపట్టిన అంతర్గత విచారణలో ఇక్కడ సైతం కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. దాంతో వారు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆ మేరకు స్థానిక ఆర్డీఓ వెల్మ శేఖర్‌రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. అయితే డాక్యుమెంట్ రైటర్ ఒక్కడే ఇతర మండలాల డాక్యుమెంట్ రైటర్లతో జతకట్టి ఈ కుంభకోణానికి తెరలేపాడా, లేక స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎవరైనా ఉద్యోగిని తనతో కలుపుకొని ఈ తతంగానికి పాల్పడ్డాడా అన్న విషయం తేలాల్సి ఉంది. విషయాన్ని అధికారులు గుట్టుగా ఉంచారు. కుంభకోణంలో ఇక్కడి డాక్యుమెంట్ రైటర్ పాత్ర వాస్తవమేనని తహసీల్దార్ కార్యాలయ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. ఎన్ని డాక్యుమెంట్లు, ఎంత డబ్బు అనే విషయం ఇప్పుడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. విచారణ జరుగుతుందని తెలిపారు. ఫ ప్రభుత్వానికి డబ్బులు జమ చేయకుండా డాక్యుమెంట్ రైటర్ కాజేసినట్టు గుర్తింపు ఫ వివరాలు ఆరా తీస్తున్న అధికారులు ఫ వరంగల్ పోలీసుల అదుపులో యాదగిరిగుట్ట ఇంటర్నెట్ నిర్వాహకుడు భూభారతి పోర్టల్‌ను ఆధారంగా చేసుకొని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ రుసుములను పక్కదారి పట్టించి రూ.కోట్లు కాజేసిన కేసులో పోలీస్ కస్టడీలో నలుగురు ఉన్నారు. ఇప్పటికే బస్వరాజుతో పాటు రాజాపేట మండలానికి చెందిన మరో ఇద్దరి ఉన్నారు. తాజాగా యాదగిరిగుట్ట పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో మరో ఇంటర్నెట్ నిర్వాహకుడిని ఆదివారం రాత్రి వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై సంబంధిత శాఖ మంత్రి సైతం అక్రమార్కులను వదిలి పెట్టబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే యాదగిరిగుట్ట పట్టణంలోని అశోక భూభారతి రిజిస్ట్రేషన్ కార్యాలయ నిర్వాహకుడు బస్వరాజును వరంగల్, జనగామ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. బస్వరాజును విచారించిన సమయంలో రాజాపేట మండలానికి చెందిన ఇద్దరు ఇంటర్నెట్ నిర్వాహకులను సైతం రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. భూభారతి పోర్టల్‌ను ఆధారంగా చేసుకొని ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని కాకుండా తక్కువ రుసుమును చలాన్‌గా చెల్లించి, ఎడిట్ ఆప్షన్ ద్వారా ఇంకా ఎంత మంది పక్కదారి పట్టించారు? ఎన్ని డబ్బులు ప్రభుత్వానికి గండి పడిందనే అంశంపై పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని డాక్యుమెంట్, ఇంటర్నెట్ దుకాణాలపై సైతం వరంగల్, జనగామ పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసు కస్టడీలో ఉన్న నింధితుల విచారణలో తమతో సంబంధాలు ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలోని కొంత మంది డాక్యుమెంట్ కార్యాలయ నిర్వాహకులను కలెక్టర్ కార్యాలయానికి పిలిచి, డాక్యుమెంట్ చేసిన విధానంతో పాటు ఎన్ని డాక్యుమెంట్లు చేశారు? ఎంత నగదు ప్రభుత్వానికి చెల్లించారనే అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. -
ఆస్తి కోసం అంత్యక్రియలు నిలిపివేత
శాలిగౌరారం : ఆస్తి తగాదాతో ఓ వృద్ధురాలి అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిలిపివేశారు. రెండు రోజులుగా ఇంటిముందు మృతదేహంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు.. శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన అయితగోని పెంటయ్య, అక్కులయ్య ఇద్దరు అన్నదమ్ములు. వీరు తల్లిదండ్రులు సంపాందించిన 12 ఎకరాల వ్యవసాయ భూమిని ఒక్కొక్కరు 6 ఎకరాలు చొప్పున సమానంగా పంచుకున్నారు. పెంటయ్యకు ఇద్దరు కుమారులు రవీందర్, జానయ్యతో పాటు కుమార్తె ఉన్నారు. అక్కులయ్యకు సంతానం లేరు. దీంతో అక్కులయ్య అతడి భార్య శాంతమ్మ(65)ను పెంటయ్య ఇద్దరు కుమారులు చూసుకునేవారు. అక్కులయ్య తన భాగానికి చెందిన 6 ఎకరాల భూమిని అన్న కుమారులైన రవీందర్, జానయ్యకు 3 ఎకరాల చొప్పున పంచి ఇచ్చాడు. అక్కులయ్య భార్య శాంతమ్మ తల్లిగారి గ్రామం కూడా ఆకారం కావడంతో శాంతమ్మకు ఆమె తల్లిదండ్రులు 8 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అందులో ప్రస్తుతం శాంతమ్మ పేరున 5.15 ఎకరాల భూమి పట్టా ఉండగా.. 2.25 ఎకరాల భూమి ఇతరుల పేరున పట్టా కలిగి ఉంది. ఇదిలా ఉండగా నాలుగు సంవత్సరాల క్రితం అక్కులయ్య అన్న కుమారుల్లో చిన్న కుమారుడు జానయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి అక్కులయ్య–శాంతమ్మ దంపతులు పెద్ద కుమారుడైన రవీందర్ వద్ద ఉంటున్నారు. దీంతో శాంతమ్మ తన పేరున ఉన్న 5.15 ఎకరాల భూమిలో 5 ఎకరాలను రవీందర్ కుమారులైన శ్రవణ్‌కుమార్‌కు 2 ఎకరాలు, లవకుమార్‌కు 3 ఎకరాలు పట్టా మార్పిడి చేసేందుకు గత సంవత్సరం ఫిబ్రవరిలో స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లింది. దీంతో విషయం తెలుసుకున్న జానయ్య భార్య, కుమారుడు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని అక్కులయ్య–శాంతమ్మ దంపతులతో పాటు రవీందర్ కుటుంబ సభ్యులతో గొడవ పడటంతో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో 2025 ఏప్రిల్‌లో శాంతమ్మ తనకున్న 5.15 ఎకరాల భూమిలో నుంచి రవీందర్ కుమారులకు 5 ఎకరాలు రిజిష్ట్రేషన్ చేసింది. దీంతో రవీందర్, జానయ్య కుటుంబ సభ్యుల మధ్య భూతగాదాలు జరుగుతూనే ఉన్నాయి. శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో ఘటన అనారోగ్యంతో శాంతమ్మ మృతి రవీందర్ ఇంటి వద్ద ఉంటున్న అక్కులయ్య–శాంతమ్మ దంపతుల్లో శాంతమ్మ అనారోగ్యంతో ఆదివారం మధ్యాహ్నం మృతిచెందింది. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు రవీందర్ ప్రయత్నించగా జానయ్య కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. శాంతమ్మ ఆస్తి నుంచి తమ వాటా సమానంగా పంపిణీ జరిగే వరకు అంత్యక్రియలు జరుగనీయమన్నారు. రాత్రి కావడంతో శాంతమ్మ అంత్యక్రియలు నిలిచిపోయాయి. సోమవారం కూడా పరిస్థితి అలాగే మారడంతో గొడవకు దారితీసింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ సైదులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో శాలిగౌరారం, కట్టంగూర్ ఎస్ఐల నేతృత్వంలో 10 మంది పోలీసులు శాంతమ్మ మృతదేహం బందోబస్తు నిర్వహించారు. గ్రామపెద్దలు నచ్చజెప్పినా వినలేదు. సోమవారం రాత్రి వరకు శాంతమ్మ మృతదేహం రవీందర్ ఇంటిముందే ఉంది. అయితే జానయ్య కుమారుడు ఉమేశ్.. శాంతమ్మ మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని శాంతమ్మ మృతదేహాన్ని సోమవారం రాత్రి పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
క్రీడా సంగ్రామం
భువనగిరి: గ్రామ స్థాయి నుంచే క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్ పోటీలు వేదికగా నిలువనున్నాయి. సీజన్–2 సీఎం కప్ పోటీలు ఈ నెల 17 నుంచి ప్రారంభించేలా షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో సీఎం కప్ క్రీడా పోటీలపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. వీటితో పాటు వచ్చే సోమవారం మండల కేంద్రాల్లోనూ అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రపంచ చాంపియన్స్ నినాదంతో.. విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులున్నారు. ఇలాంటి వారిని వెలుగులోకి తెచ్చేందుకు ఈ సారి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రపంచ చాంపియన్స్ అనే నినాదంతో పోటీలు నిర్వహిస్తున్నారు. 29 అంశాలలో.. రాష్ట్ర స్థాయి 44 క్రీడా అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 29 క్రీడా అంశాలలో పోటీలు నిర్వహించేలా అధికారులు సన్నద్ధం అవుతున్నారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్(బాల,బాలికలు) విభాగాలతో పాటు ఓపెన్ రిక్రియేషన్ గేమ్స్(పిల్లలు, ఇతరులు)కు అవకాశం ఉంది. గత ఏడాది జిల్లాలో 29 రకాల క్రీడల్లో పోటీలు జరగగా 564మంది ని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించారు. 2023 సంవత్సరానికి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ఖోఖో జట్టు ప్రథమ స్థానంలో రాణించడం వల్ల రూ. లక్ష నగదు ప్రోత్సాహకాన్నిసైతం పొందింది. ప్రతిభ చాటిన వారికి నగదు ప్రోత్సాహకం సీఎం కప్ పోటీలు జిల్లాలో గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతారు. పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. లక్ష, ద్వితీయ స్థానం పొందిన జట్టుకు రూ. 75వేలు, తృతీయ స్థానం అయితే రూ. 50వేలు, వ్యక్తిగత క్రీడాంశాలలో ప్రథమ రూ. 20వేలు, ద్వితీయ రూ. 15వేలు, తృతీయ రూ. 10వేలు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా నమోదుకు అవకాశం పోటీల్లో పాల్గొనేందుకు అధికారులు ఆన్లైన్ విధానం ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 1,500 మంది విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేందుకు వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. క్రీడాకారులు తమ పేర్లను satg.telangana.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకుంటున్నారు. ఫ ఐదు స్థాయిల్లో సీఎం కప్ పోటీల నిర్వహణ ఫ 17న గ్రామ స్థాయి పోటీలతో శ్రీకారం ఫ ఇప్పటి వరకు 1,500 మంది నమోదు గ్రామ పంచాయతీ స్థాయిలో ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు, మండల స్థాయిలో ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు, నియోజకవర్గ స్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు, జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు క్రీడా పోటీలు జరగనున్నాయి.రాష్ట్ర స్థాయి పోటీలు ఫిబ్రవరి 19 నుంచి 26వరకు జరగనున్నాయి సీఎం కప్ పోటీల కోసం పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగానీ పీఈటీలుగానీ ఆన్లైన్ ద్వారా విద్యార్థుల పేర్లను నమోదు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి. – కె.ధనుంజనేయులు, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి శాఖ అధికారి -
1వ తేదీ నుంచి కందుల కొనుగోళ్లు
సాక్షి,యాదాద్రి : వచ్చేనెల 1వ తేదీ నుంచి జిల్లాలో కందుల కొనుగోళ్లు ప్రారంభించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశించారు. అదనపు కలెక్టర్ తన చాంబర్లో మార్క్‌ఫెడ్ డీఎంతో కలిసి సోమవారం నిర్వహించిన డీఎల్‌పీసీ సమావేశంలో కందుల కొనుగోలుపై సమీక్షించి మాట్లాడారు. జిల్లాలో దాదాపు 4,400 ఎకరాల్లో కందులు సాగుకాగా 25 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. కొనుగోలు ప్రక్రియ మొత్తం సొసైటీల ద్వారా చేపట్టాలని ఆదేశించారు. కందులకు క్వింటాకు రూ.8వేలు మద్దతు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. మద్దతు ధరకు రైతుల నుంచి కందులు కొనుగోలు చేయాలని సూచించారు. తేమ12 శాతం కంటే కూడా తక్కువ ఉండే విధంగా రైతులు జాగ్రత్త వహించి సెంటర్లకు తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, మార్క్‌ఫెడ్ అధికారిణి జ్యోతి, డీసీఓ మురళి పాల్గొన్నారు. త్వరలో బ్లాక్ గ్రానైట్ వేలం పాటభువనగిరిటౌన్ : రామన్నపేట మండల కేంద్రంలోని 134 సర్వే నంబర్లో గల బ్లాక్ గ్రానైట్ వేలం పాటను త్వరలో నిర్వహించనున్నట్లు మైనింగ్ శాఖ సహాయ సంచాలకుడు రవి కుమార్ తెలిపారు. సోమవారం జనరల్ బ్లాక్ ఫేస్ 4 ఆక్షన్ పై కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సమావేశం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 10 మినరల్ బ్లాక్ లకు ఆక్షన్ నోటిఫికేషన్ విడుదల చేశారని ఇందులో భాగంగా రామన్నపేటలోని సర్వే నంబర్ 134లో 5.00 హెక్టార్లలో ఉన్న బ్లాక్‌గ్రానైట్ వేలం పాట నిర్వహించనున్నామని ఆసక్తి గలవారు పాల్గొనాలని కోరారు. ప్రజారోగ్య రక్షణే ప్రభుత్వ లక్ష్యం భువనగిరి : ప్రజారోగ్య రక్షణే లక్ష్యంగా ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలో రూ.1.43కోట్లతో నిర్మించిన అర్బన్ పీహెచ్సీ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా బీపీ చెక్ చేయించుకున్నారు. అనంతరం పచ్చలకట్ట సోమేశ్వరాలయానికి వెళ్లే మార్గంలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. కార్యక్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్మనోహార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్ చీస్తి, మున్సిపల్ కమిషనర్ రాంలింగం, వైద్యధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బీబీనగర్‌లో.. ప్రణామ్ కార్యక్రమం వృద్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్ విధానంలో వృద్ధులకు డాటా కేర్ సెంటర్ ప్రారంభించేందుకు బీబీనగర్ మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్ చీస్తి, నాయకులు పాల్గొన్నారు. -
అటవీ సంపద కొల్లగొట్టేందుకే మావోల హత్య
చౌటుప్పల్ : దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న అటవీ సంపదను కొల్లగొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై హత్యాకాండ మొదలు పెట్టిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. అడవులకు, గిరిజనులకు, ఆదివాసీలకు రక్షణగా ఉన్న మావోయిస్టులను లేకుండా చేయడం ద్వారా విస్తారమైన ఖనిజ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం చౌటుప్పల్‌లో సీపీఎం మున్సిపల్ కమిటీ విస్త్రతస్థాయి సమావేశానికి జాన్‌వెస్లీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇటీవల మృతిచెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ చింతల భూపాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రధానమంత్రి ప్రయత్నిస్తున్నారని, పేదలను ఉపాధికి దూరం చేసేందుకే ఉపాధి హామీ పథకం పేరు మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల పక్షాన పనిచేసే సీపీఎం అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, మున్సిపల్ కమిటీ కార్యదర్శి గోశిక కరుణాకర్, జిల్లా కమిటీ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
బెట్టింగ్‌కు బానిసలై పత్తి ట్రాక్టర్ చోరీ
నకిరేకల్ : ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాడు పడి పత్తి లోడు ట్రాక్టర్ చోరీ చేసిన ఇద్దరు నిందితులను కేతేపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను సోమవారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన వీరబోయిన మహేష్ తాను పండించిన పత్తిని అమ్మేందుకు గాను ఈ నెల 8న అదే గ్రామానికి చెందిన జటంగి బుచ్చయ్య ట్రాక్టర్లో లోడు చేశాడు. మరుసటి రోజు ఉదయం మార్కెట్‌కు తీసుకెళ్లి పత్తిని అమ్ముదామనుకుని ట్రాక్టర్‌ను అదే గ్రామానికి చెందిన ప్రదీప్‌రెడ్డి ఇంటి సమీపంలో పార్కింగ్ చేశాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి పత్తి లోడు ట్రాక్టర్ కనింపించలేదు. దీంతో వీరబోయిన మహేష్ కేతేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బంధువుతో కలిసి చోరీ.. అయితే కేతేపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన నూకల కోటేష్ ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్స్ ఆడుతూ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడుతుండేవాడు. 2019లో మాడుగులపల్లి, వేములపల్లి, కేతేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాక్టర్లు చోరీ చేసి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా కోటేష్ మళ్లీ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో తన బంధువు అయిన సూర్యాపేటకు చెందిన ఆడెపు సాయికుమార్‌తో కలిసి తిరిగి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఈ నెల 8వ తేదీ రాత్రి కేతేపల్లి మండల కేంద్రంలో వీరబోయిన మహేష్ పత్తి లోడు ట్రాక్టర్‌ను చోరీ చేసి సూర్యాపేటకు తరలించారు. ట్రాక్టర్‌లోని కొంత పత్తిని సూర్యాపేట శివారులోని బాలెంలోని కాటన్ మిల్లులో అమ్మగా రూ.72,475 నగదు వచ్చాయి. మిగిలిన పత్తిని సోమవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల వద్ద గల కాటన్ మిల్లుకు తీసుకెళ్తుండగా.. కేతేపల్లి మండలం ఇనుపాముల శివారులో పోలీసులు పట్టుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులు కోటేష్, సాయికుమార్‌పై కేసు నమోదు చేసి, వారి నుంచి రూ.50వేల నగదు, ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, కేతేపల్లి ఎస్ఐ సతీష్‌ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారని డీఎస్పీ పేర్కొన్నారు. ఇద్దరు నిందితుల అరెస్టు ట్రాక్టర్, రూ.50 వేలు స్వాధీనం -
చలికాలం జీవాల పెంపకంలో జాగ్రత్తలు
త్రిపురారం : రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ ఉంది. దీంతో జీవాలు, పశువులు జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. జీవాలు, పశువులు వ్యాదుల బారిన పశు పోషకులు, జీవాల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని త్రిపురారం మండల పశువైద్యాధికారి నాగేందర్ సూచిస్తున్నారు. చలికాలం జీవాల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే.. 1. జలుబు, దగ్గు : ● తీవ్రమైన చలి ఉన్నప్పుడు జీవాలకు జలుబు, దగ్గు సోకితే తుమ్ములతో పాటు కళ్లు, ముక్కు నుంచి నీరు కారడం, చీమిడి పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ● క్రిముల ద్వారా సోకే అంటువ్యాధులతో పాటు ఆహారం ద్వారా శ్యాసకోశంలోకి వచ్చే కణాలు, నూనె పదార్థాలు, శ్వాసకోశాన్ని చికాకు పెట్టే ఇతర పదార్థాలు జలుబు, దగ్గుకు కారణమవుతాయి. ● జీవాల పాకలు ఇరుకుగా ఉండటం.. గాలి, వెలుతురు సరిగా లేకపోవడం.. పాకల్లో తేమ, తడి ఎక్కువగా ఉండడం.. కాలుష్యం, దుమ్ము వాతావరణంలో అకస్మాతుగా వచ్చే మార్పులు ఈ జబ్బుకు కారణమవుతాయి. ● వ్యాధి నివారణకు పాకలోకి గాలి, వెలుతురు వచ్చేలా చూడాలి. వాతావరణం సరిగా లేనప్పుడు జీవాలను బయటకు వదలకూడదు. పాకలను శుభ్రంగా ఉంచాలి. జబ్బులు సోకిన వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించాలి. ● ఒకవేళ జీవం చనిపోతే పోస్టుమార్టం ద్వారా వ్యాధి నిర్ధారించుకొని మందలో మిగిలిన జీవాలకు వెంటనే చికిత్స చేయించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు ముందు జాగ్రత్త టీకాలు వేయించుకోవాలి. 2. దొమ్మ రోగం :● పశువుల్లో దొమ్మ రోగం వ్యాప్తికి పలు రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, పరాన్న జీవులు కారణం. కంటేజియస్ కాప్రెస్ ప్లూరో నిమోనియా అనే వైరస్ కారణంగా మేకలకు మాత్రమే వచ్చే వ్యాధి ఇది. ● ఈ వ్యాధి సోకిన జీవాలకు తీవ్రమైన జ్వరం ఉంటుంది. ● వేగంగా శ్వాస పీల్చుకోవడం, ఎగ శ్వాస, ముక్కు నుంచి నీరు, చీమిడి కారడం, ఆకలి లేకపోవడంతో జీవాలు రోజురోజుకు నీరసించిపోతాయి. ● కల్లు ఎర్రబడి నీరుగారడం, వీపు భాగం వంగి ఉండడం, తల, మెడ ముందుకు సాగినట్లు కనిపిస్తాయి. ● ముక్కు రంధ్రాలు వెడల్పు అవుతాయి. త్వరగా చికిత్స చేయించకపోతే ఊపిరితిత్తులు వాచి వాటికి చీము పట్టే ప్రమాదం ఉంటుంది. ● ఈ లక్షణాలు అమ్మతల్లి వీవీఆర్ మొదలైన జబ్బుల్లో కూడా కనిపిస్తాయి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం, శుభ్రమైన నీటిని అందిస్తూ ఎప్పటికప్పుడు టీకాలు వేయించాలి.22 వరకు అమ్మతల్లి టీకాలుపశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో పశువైద్య సిబ్బంది ఈ నెల 22వ తేదీ వరకు జీవాలకు అమ్మతల్లి వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి రైతు ఈ ఉచిత టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చలి తీవ్రత ఉన్నందున టీకాలు వేయించకపోతే జీవాలు మరణించి రైతులు, కాపరులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. -
సోలార్ వినియోగదారులకు షాక్ !
కోదాడ : సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి ఓ వైపు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తుండగా.. మరోవైపు వినియోగదారుడిపై అధిక భారం మోపుతూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) గుట్టుచప్పుడు కాకుండా సోలార్ బిల్లంగ్లో మార్పులు చేసింది. పథకం ప్రారంభంలో ఉన్న నెట్ మీటరింగ్‌కు బదులు నెట్ బిల్లింగ్‌ను అమలు చేస్తోంది. దీని లోగుట్టు అర్ధంకాక వినియోగదారుడు భారీగా నష్టపోతున్నాడు. సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు ఇదేమిటని ప్రశ్నిస్తే అదంతా మాకు తెలియదు.. రాష్ట్ర వ్యాప్తంగా పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే బిల్లింగ్ విధానంలో మార్పు వచ్చిందని స్థానిక విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఇంటి అవసరాలకు అవసరమయ్యే విద్యుత్‌ను సౌరశక్తి ద్వారా ఉత్పత్తి చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ అనే పథకాన్ని గత సంవత్సరం ప్రవేశపెట్టింది. దీని ద్వారా 3 కిలోవాట్ల సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటే అయ్యే ఖర్చు సుమారు రూ.2లక్షల్లో సబ్సిడీ కింద రూ.78వేలు కేంద్ర ప్రభుత్వం వినియోగదారుడి అకౌంట్లో వేస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వమే బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు ఇచ్చే ఏర్పాటు చేసింది. దీంతో పలువురు ఈ పథకం ద్వారా తమ ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో నెట్ మీటరింగ్ విధానం అమలు చేసేవారు గత అక్టోబర్ నుంచి దీన్ని నెట్ బిల్లింగ్గా మార్చారు. సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారుడు వాటి ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌ను విద్యుత్ సంస్థకు సరఫరా చేస్తాడు. దీన్ని ఎక్స్పోర్ట్ విద్యుత్ అంటారు. అదే సమయంలో వినియోగదారుడు విద్యుత్ సంస్థ నుంచి తన ఇంటి అవసరాలకు వాడుకుంటాడు. దీన్ని ఇంపోర్ట్ విద్యుత్ అంటారు. గతంలో వినియోగదారుడు వాడుకున్న విద్యుత్‌కు తన సోలార్ ప్యానల్స్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌లో నుంచి తీసేసి మిగిలిన యూనిట్లకు బిల్లు వసూలు చేసేవారు. ఉదాహరణకు వినియోగదారుడు ఒక నెల 300 యూనిట్ల విద్యుత్ వాడుకుంటే.. అతడు తన సోలార్ ప్యానల్స్ ద్వారా 200 యూనిట్లు ఉత్పత్తి చేశాడనుకుంటే దాన్ని అతను వాడుకున్న 300 యూనిట్ల నుంచి తీసివేసి మిగిలిన 100 యూనిట్లకు బిల్లు వసూలు చేసేవారు. దీన్నే నెట్ మీటరింగ్ అంటారు. అమ్మబొతే అడవి.. కొనబోతే కొరివి విద్యుత్ సంస్థ వినియోగదారుడికి 200 యూనిట్ల వరకు యూనిట్ రూ.5 చొప్పున, 200 నుంచి 300 యూనిట్ల వరకు రూ.6, 300 యూనిట్లు దాటితే సుమారు రూ.7 వరకు వసూలు చేస్తుంది. ఒక వినియోగదారుడు 300 యూనిట్లు వాడుకుంటే దానికి విద్యుత్ సంస్థ రూ.7 చొప్పున రూ.2100 వసూలు చేస్తుంది. సోలార్ ప్యానల్స్ ద్వారా వినియోగదారుడు 200 యూనిట్లు ఉత్పత్తి చేస్తే దానికి యూనిట్‌కు రూ.5.25 చొప్పున రూ.1050 మాత్రమే ఇస్తుంది. అంటే తన విద్యుత్‌ను యూనిట్‌కు రూ.7 అమ్ముతున్న సంస్థ వినియోగదారుడి విద్యుత్‌కు మాత్రం యూనిట్‌కు రూ.5.25 మాత్రమే ఇస్తుంది. దీన్నె నెట్ బిల్లింగ్ అంటారు. నెట్ మీటరింగ్ విధానంలో వాడుకున్న విద్యుత్ 300 యూనిట్ల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్ 200 యూనిట్లు ముందుగానే తీసేవేస్తే మిగిలిన వంద యూనిట్లకు స్లాబ్ ప్రకారం రూ.5 వసూలు చేయాలి. దీని కోసమే నెట్ బిల్లింగ్ విధానాన్ని టీజీఎస్పీడీసీఎల్ అమలు చేస్తుందని వినయోగదారులు ఆరోపిస్తున్నారు. గతంలో నెట్ మీటరింగ్ విధానం అమలు దానిని ప్రసుత్తం నెట్ బిల్లింగ్ విధానంలోకి మార్చిన టీజీఎస్పీడీసీఎల్ ఇంపోర్ట్కు ఎక్కువ ఛార్జీ వసూలు ఎక్స్పోర్ట్కు తక్కువ ధర చెల్లింపుఅధికారులు ఏమంటున్నారంటే.. సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు గృహజ్యోతి పథకాన్ని వినయోగించుకోవడం వల్ల సంస్థకు భారీ నష్టం జరుగుతుంది. దీంతో సంస్థ ఉన్నతాధికారులు బిల్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లోనే మార్చారు. దీనిలో మా ప్రమేయం ఏమిలేదని స్థానిక విద్యుత్ అధికారులు అంటున్నారు. -
ఎంజీయూ హాకీ జట్టు కోచ్‌గా లింగస్వామి
రామన్నపేట : మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) హాకీ జట్టు కోచ్‌గా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన రాపోలు లింగస్వామి నియమితులయ్యారు. ఈ నెల 18వ తేదీ వరకు తమిళనాడు రాజధాని చైన్నెలోని సత్యభామ యూనివర్సిటీ మైదానంలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఛాపియన్‌షిప్‌లో పాల్గొనే ఎంజీయూ హాకీ జట్టుకు ఆయన కోచ్‌గా వ్యవహరించనున్నారు. లింగస్వామి నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో హాకీలో రాణించి ఎంజీయూ జట్టుకు ఎంపికై రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అతడి ప్రతిభను గుర్తించి హాకీ అసోసియేషన్, యూనివర్సిటీ క్రీడా విభాగం వారు కోచ్ బాధ్యతలను అప్పగించారు. లింగస్వామికి పలువురు అభినందనలు తెలిపారు. -
చోరీ కేసులో ముగ్గురు రోహింగ్యాల అరెస్టు
రామగిరి(నల్లగొండ) : చోరీ కేసులో బర్మా దేశానికి చెందిన ముగ్గురు రోహింగ్యాలను ఆదివారం అర్ధరాత్రి నల్లగొండ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను నల్లగొండ అడిషనల్ ఎస్పీ జి.రమేష్ సోమవారం విలేకరులకు వెల్లడించారు. బర్మా దేశానికి చెందిన రోహింగ్యాలు హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫిక్ ఆలం, మహ్మద్ ఇస్లాం, కమల్ హుస్సేన్, ఖైసర్, నూర్ ఖాసీం 2012లో ఇండియాకు శరణార్ధులుగా వచ్చి హైదరాబాద్‌లోని బాలాపూర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. వారంతా కలిసి పట్టణ శివారుల్లోని కంపెనీల్లో విలువైన వస్తువులు దొంగిలించి వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. 2024లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఈ నెల 7న హైదరాబాద్ నుంచి వచ్చి నల్లగొండ పట్టణ సమీపంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న నిధి పాలిమర్ కంపెనీ గేటు తాళం పగులగొట్టి పైపుల తయారీకి వినియోగించే విలువైన వస్తువులను దొంగిలించారు. దొంగతనం చేసిన వస్తువులను కంపెనీ దగ్గరలో ఉన్న చెట్ల పొదల్లో ఉంచి బాలాపూర్ వెళ్లారు. హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫిక్ ఆలం ఆదివారం అర్ధరాత్రి తిరిగి నల్లగొండకు వచ్చి దొంగిలించిన వస్తువులను ఆటోలో తరలిస్తుండగా.. చర్లపల్లి శివారులో టూటౌన్ సీఐ రాఘవరావు, రూరల్ ఎస్ఐ సైదాబాబు పట్టుకున్నారు. మిగతా నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారి నుంచి రూ.60లక్షల విలువైన 40 ఇత్తడి సైజర్లు, 35 అమరాన్ బ్యాటరీలు, యూపీఎస్ కేబుల్, 50 కేజీల కాపర్ వైరు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రూ.60లక్షల విలువైన వస్తువులు స్వాధీనం వివరాలు వెల్లడించిన నల్లగొండ అడిషనల్ ఎస్పీ రమేష్ -
40 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక
తుంగతుర్తి : మండల పరిధిలోని వెలుగుపల్లి జెడ్పీహెచ్ఎస్లో 1984 –85 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనాటి గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు రంగారెడ్డి, అహల్య ప్రభాకర్ రెడ్డి, విమల శ్రీనివాస్‌రెడ్డి, పూర్వ విద్యార్థులు మైదం నారాయణ, ఎస్కే జానీ హనుమంతురెడ్డి, విట్టల్‌రెడ్డి, సోమరాజు, అల్లం శ్రీను, వెంకన్న, బీజాల ఇంద్ర, భారతి, మాలతి, శ్రీలక్ష్మీ, ఆయూష భాను, పద్మ, కళమ్మ, వినోద పాల్గొన్నారు. -
ఉద్యోగం వదిలి ఉపాధి కల్పించే స్థాయికి..
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలోని చేనేత కుటుంబానికి చెందిన సాయిని భరత్(33) ఎంటెక్ పూర్తి చేసి ఆరేళ్లపాటు ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. తన తల్లిదండ్రులు చేస్తున్న కులవృత్తిని పదికాలాల పాటు సజీవంగా ఉంచాలని ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి చేనేత వృత్తిని ఎంచుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ చిన్న, లఘు, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కళా పునర్వి పేరిట హ్యాండ్లూమ్ నెలకొల్పి 80 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఎన్నో అవార్డులు సొంతం – 2022లో చేనేతలో నూతన ఆవిష్కరణలు, ఉపాధి కల్పనకు గాను బెస్ట్ ఫర్మామెన్స్ అవార్డు అందుకున్నాడు. – 2018లో చేనేతలో డిజైనింగ్‌లో నేషనల్ మెరిట్ సర్టిఫికెట్ అందుకున్నాడు – 2018లో ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ రాష్ట్ర స్థాయి అవార్డు – 2014లో చిన్న మగ్గంపై జాతయ నాయకుల కళాఖండాలను రూపొందించినందుకు లిమ్కా బుక్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. -
రోడ్డుప్రమాదంలో నలుగురికి గాయాలు
కోదాడరూరల్ : రెండు కార్లు పల్టీకొట్టడంతో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన కోదాడ మండల పరిధిలో నల్లబండగూడెం శివారులో హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై పోరస్ పరిశ్రమ వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్‌రోడ్‌లో ఫ్లైఓవర్ వంతెన పనులు జరగుతుండటంతో పోరస్ పరిశ్రమ నుంచి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేశారు. వేగంగా వచ్చిన రెండు కార్లు ఒక్కసారిగా బ్రేకు వేయడంతో పల్టీ కొట్టాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈఘటనపై ఫిర్యాదు అందలేదని రూరల్ పోలీసులు తెలిపారు. మురుగు కాలువలో పడి వ్యక్తి మృతిత్రిపురారం : మండల కేంద్రం నుంచి బెజ్జికల్ గ్రామానికి వెళ్లే దారిలో మురుగు కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం త్రిపురారం ఎస్ఐ గైకూరి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రాపూర్ మండలం, జివాటి గ్రామానికి చెందిన నిఖిల్ సుదామ్ చౌహాన్(24) త్రిపురారం మండల కేంద్రంలోని మినార్ టీ స్టాల్లో పని చేస్తున్నాడు. శనివారం నిఖిల్ మహారాష్ట్రకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అతడి వెంట టీ స్టాల్లో పని చేస్తున్న నితేష్ గుజానంద్ రాతోడ్ నిఖిల్‌ను బస్సు ఎక్కించాడు. అప్పటికే నిఖిల్ తన లగేజీ బ్యాగ్‌ను బెజ్జికల్ రోడ్డులోని ఓ వైన్ షాపులో మరిచిపోయాడు. కొద్దిదూరం వెళ్లిన తరువాత అతను బస్సు దిగి తన బ్యాగు మరిచిపోయిన వైన్స్ షాపు వద్దకు వెళ్లాడు. అప్పటికే రాత్రి కావడంతో మద్యం తాగి ఉన్న నిఖిల్ బెజ్జికల్ రోడ్డులో మూలమలుపు వద్ద మురుగు కాలువలో పడి మృతిచెందాడు. టీ స్టాల్ నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఉరేసుకొని మహిళ బలవన్మరణంసూర్యాపేటటౌన్ : ఓ మహిళ వ్యక్తిగత కారణాలతో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బత్తుల వీరబాబు, బత్తుల లక్ష్మి(34) దంపతులు. సూర్యాపేట పట్టణంలోని శ్రీనివాస కాలనీలో నివాసముంటున్నారు. భర్త గత కొంతకాలం క్రితం ఉద్యోగ రీత్యా కెనెడాకు వెళ్లాడు. లక్ష్మి తన ఇద్దరు కుమార్తెలతో ఇక్కడే ఉంటోంది. ఆదివారం ఉదయం 3గంటల సమయంలో లక్ష్మి తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. వ్యక్తిగత కారణాలతో తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లి పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్ తెలిపారు. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సుకేతేపల్లి: కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ వద్ద 65 నంబరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి తిరువూరుకు బయలుదేరింది. ఈక్రమంలో కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ బస్‌స్టేజీ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బస్సు లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న రామకృష్ణారావు, నర్సింహారావు తీవ్రంగా గాయపడగా మరో నలుగురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులకు 108 అంబులెన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
● వ్యవసాయం, ఉపాధి రంగాల్లో రాణిస్తున్న యువత ● నచ్చిన పనులు చేస్తూ విజయ తీరాలకు
యువతా మేలుకో.. నిద్ర నుంచి మేల్కొని గమ్యం చేరే వరకు విశ్రమించకు అనే స్వామి వివేకానంద సూక్తిని నిజం చేస్తూ యువత ముందుకు సాగుతోంది. వ్యవసాయ రంగాల్లో, కుల వృత్తుల్లో నైపుణ్యం ప్రదర్శిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విభిన్న రంగాల్లో విజయం సాధించిన వారిపై ప్రత్యేక కథనాలు. హుజూర్నగర్ : మండలంలోని అంజలీపురం గ్రామానికి చెందిన గొర్రె అశోక్ దేశవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన యువ సృష్టికర్తగా గుర్తింపు పొందారు. ఫోర్బ్స్ ఇండియా అవార్డ్స్ సీజన్–2లో టెక్ లీడ్ సోషల్ ఇన్నోవేషన్ విభాగంలో ఎంపికై గత నెలలో జాతీయ అవార్డు అందుకున్నాడు. డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయదారులు కావడంతో వారికి చేదోడు వాదోడుగా ఉండాలని చిన్నతనం నుంచే భావించాడు. అందులో భాగంగా వ్యవసాయ పరికరాల తయారీపై దృష్టి సారించి పత్తి, మిరప పంటల్లో విత్తనాలు వేసే యంత్రం, కలుపు తీసే యంత్రం, పురుగుల మందు పిచికారీ యంత్రాలను రూపొందించాడు. ఆతర్వాత రూరల్ రైజ్ అగ్రినరీ అనే స్టార్టప్ కంపెనీ ప్రారంభించాడు. పరికరాలను తయారు చేసి తక్కువ ధరలో రైతులకు అందుబాటులోకి తెచ్చాడు.. ఈనేపథ్యంలో అతని ప్రతిభను గుర్తించిన ఫోర్బ్స్ ఇండియా ఇటీవల అశోక్‌ను జాతీయ స్థాయి అవార్డుతో సత్కరించింది. -
సద్గుణకు మెరుగైన వైద్యమందిస్తాం
తుర్కపల్లి : మండల కేంద్రానికి చెందిన గర్భిణి బండారు సద్గుణకు వైద్యసాయమందిస్తామని డీఎంహెచ్ఓ మనోహర్ అన్నారు. శనివారం తుర్కపల్లికి చెందిన బండారి సద్గుణ కడుపునొప్పితో బాధపడుతూ స్థానిక పీహెచ్‌సీకి వస్తే వైద్యసిబ్బంది అందుబాటులో లేక వైద్యం అందలేదు. ఈ ఘటనపై స్పందించిన డీఎంహెచ్ఓ ఆదివారం బండారి సద్గుణ ఇంటి వద్దకు వెళ్లి కలిసి ఆమె ఆర్యోగ పరిస్థితిని అడిగి తెలుసుకుని మాట్లాడారు. సద్గుణకు ఎలాంటి వైద్య అవసరమైనా చేయాలని సిబ్బదికి సూచించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ సోమల్ల వెంకటేష్.. డీఎంహెచ్ఓను కలిసి పీహెచ్సీలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని కోరారు. ఆసుపత్రిలో పనిచేయాల్సిన సిబ్బంది డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహించడం వల్ల ఇక్కడి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా చూడాలని విన్నవించారు. ఫ డీఎంహెచ్ఓ మనోహర్ -
తెలంగాణ సాయుధ పోరాట యోధుడి వందవ బడ్త్ డే
గరిడేపల్లి: గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్య్ర సమరఽయోధుడు బండా పుల్లారెడ్డికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులు ఆదివారం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆయన భార్య కాంతమ్మ, విజయలక్ష్మి, చంద్రశేఖర్‌రెడ్డి, లలిత, మురళీధర్‌రెడ్డి, ప్రశాంతి, పుల్లమ్మ, చంద్రమ్మ, జానకమ్మ, కోటమ్మ, ధనమ్మ, కృష్ణ, చంద్రమ్మ, రాములయ్య, సీతారామరెడ్డి పాల్గొన్నారు. చైనా మాంజా విక్రయిస్తున్న ఆరుగురిపై కేసుసూర్యాపేటటౌన్ : సూర్యాపేటలో చైనా మాంజా విక్రయాలపై ఆదివారం ఎస్ఐలు శివతేజ్, మహేందర్నాథ్, ఏడుకొండలు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈమేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. -
హామీల అమలే లక్ష్యం
చౌటుప్పల్ : మాది చౌటుప్పల్ మండలం పీపల్‌పహాడ్ గ్రామానికి చెందిన ఉన్నత విద్యావంతురాలు పులనగారి నాగేశ్వరి సర్పంచ్‌గా విజయం సాధించింది. కేవలం 28ఏళ్ల వయస్సున్న ఆమె పోటీ చేసిన తొలిసారే సర్పంచ్ పీఠాన్ని దక్కించుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే.. నాకు వివాహం జరిగినప్పటికీ చదువును మాత్రం ఆపలేదు. ఉస్మానియా కళాశాలలో చదువుతూ అక్కడే హాస్టల్లో ఉండి ఎంఎస్సీ జియో కెమిస్ట్రీ పూర్తి చేశా. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను బలోపేతం చేయడమే నా కర్తవ్యం. – పులనగారి నాగేశ్వరి, పీపల్‌పహాడ్ సర్పంచ్ -
గ్రామానికి సేవ చేసేందుకే
అడవిదేవులపల్లి : గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చా. బీటెక్ చదివి, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న నన్ను సర్పంచ్‌గా పోటీ చేయమని స్థానికులు కోరడంతో ఉద్యోగం వదిలేసి ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నా. గతంలో నా తండ్రి సూర్యానాయక్ ఉమ్మడి మొల్కచర్ల సర్పంచ్‌గా పని చేసినందుకు గ్రామ సమస్యలపై నాకు చిన్ననాటి నుంచి పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తా. పదవీ కాలం పూర్తయ్యే సరికి శాశ్వతంగా గుర్తుండేలా నా వంతుగా అభివృద్ధి చేసి చూపిస్తా. – మూడావత్ సేవానాయక్, మొల్కచర్ల సర్పంచ్ పెద్దఅడిశర్లపల్లి : ప్రస్తుతం కొండమల్లేపల్లిలో డిగ్రీ చదువుతున్నా. 24 ఏళ్లకే సర్పంచ్‌గా ఎన్నికయ్యా. రానున్న రోజుల్లో మల్లాపురం గ్రామంలో సమస్యలను పరిష్కరించడంతో పాటు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. సమస్యలను ఒక్కొక్కటిగా తీసుకొని అధికారులు, వార్డు సభ్యులు, ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరిస్తా. ముఖ్యంగా గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారిస్తా. – కొలుకులపల్లి చందన, మల్లాపురం సర్పంచ్ -
అమ్మా.. నాకు దిక్కెవరు
ఖమ్మంక్రైం : చిన్నప్పుడే తండ్రి మృతి చెందాడు. తల్లితోనే తన జీవితం, తల్లి వెంటే తాను అన్నట్టుగా గడిపాడు. తినడానికి తిండి, ఉండడానికి గూడు కూడా లేదు. దీంతో తన కొడుకు పస్తులుండకుండా ఆ తల్లి నిత్యం భిక్షాటన చేస్తూ బాలుడి కడుపు నింపేది. అయితే ఆ చిన్నారిపై విధి వక్రించింది. యాచనతో తన కడుపు నింపే తల్లిని కూడా దూరం చేసింది. ఈ విషాదకరమైన ఘటన ఖమ్మం రైల్వేస్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. కోదాడకు చెందిన మోతె లక్ష్మి( 40), లక్ష్మణ్ దంపతులు కూలి పని చేస్తూ జీవనం సాగించేవారు. ఐదేళ్ల క్రితం లక్ష్మణ్ అనారోగ్యంతో మృతిచెందడంతో కుమారుడు కిట్టూను పోషించేందుకు లక్ష్మి తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో కొడుకుతో సహా ఖమ్మం వచ్చి కూలి పనులు చేస్తూ కాలం గడుపుతుండగా ఆమె కూడా అనారోగ్యానికి గురైంది. దీంతో భిక్షాటన చేస్తూ కిట్టూను పోషించేది. కాగా, ఆమె పరిస్థితి విషమించి ఆదివారం ఖమ్మం రైల్వే స్టేషన్లో తనువు చాలించింది. ఈ విషయం తెలియని తొమ్మిదేళ్ల కిట్టూ తల్లిని ఎంత లేపినా లేవకపోవడంతో బిగ్గరగా రోదిస్తుండగా ప్రయాణికులు జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా అప్పటికే లక్ష్మి మృతిచెందింది. పక్కనే కూర్చుని రోదిస్తున్న కిట్టూను వివరాలు అడగగా తన పేరు, వివరాలు తెలిపాడు. తనకు ఒక మేనత్త ఉందని, ఆమె ఆచూకీ తెలియదని చెప్పాడు. దీంతో బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించిన పోలీసులు బంధువుల ఆచూకీ కోసం కోదాడ పోలీసులను సంప్రదించారు. అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరావు సాయంతో మృతదేహన్ని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు. ● తల్లి మృతదేహం వద్ద బాలుడి రోదన -
యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారంతో పాటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి తమ సొంత గ్రామానికి వెళ్లే వారు యాదగిరీశుడిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ముఖ మండపం క్యూలైన్, ప్రసాద విక్రయశాల వంటి ప్రాంతాల్లో భక్తుల రద్దీ కనిపించింది. శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి 3గంటల సమయం, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీస్వామివారిని 35వేలమందికి పైగా భక్తులు దర్శించుకోగా.. నిత్యాదాయం రూ.39,22,539 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. ఆలయ ముఖ మండపంలో క్యూలైన్లో ఉన్న భక్తులు -
స్వయం ఉపాధికి ప్రోత్సాహం
తిప్పర్తి: యువత స్వయం ఉపాధి కోసం ప్రోత్సహిస్తా. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. గ్రామస్తులు ఆదరించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ, నిరంతరం వారి వెంట ఉండి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తా. గ్రామంలో ఇప్పటికే సమస్యలు పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించాం. తాగు నీరు, విద్యుత్, డ్రెయినేజీ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించేలా కృషి చేస్తా. – హేమలత, పజ్జూరు సర్పంచ్ -
సేంద్రియ సాగులో రాణిస్తూ..
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన యువ రైతు బిళ్లపాటి గోవర్ధన్‌రెడ్డి తన వ్యవసాయ భూమిలో సేంద్రియ వ్యవసాయ సాగు చేస్తూ రాణిస్తున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌లో అర్ధశాస్త్రం పూర్తి చేశారు. గత 5 సంవత్సరాలుగా భూ ఆధారిత సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అంతరించి పోతున్న దేశీయ వరి రకాలను కాపాడటం, పర్యావరణాన్ని, భూమి, నీరు పరిరక్షించుకోవడం, తగ్గిపోతున్న భూసారాన్ని కాపాడాలనే లక్ష్యంతో దేశవాళి వరి విత్తనాల వరి సాగు చేపట్టారు. తనకున్న 3 ఎకరాల విస్తీర్ణంతో పాటు మరికొంత కౌలుకు భూమి తీసుకొని సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అదేవిధంగా 20 గుంటల విస్తీర్ణంలో 23 రకాల దేశవాళీ వరి విత్తనాల సాగు చేస్తున్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల ఆధ్వర్యంలో గతేడాది డిసెంబర్లో పుడమి పుత్ర పురస్కారం అందుకున్నారు. -
ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఆదివారం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆ సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బొడ్డు కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగటి వెంకటేష్, గౌరవ అధ్యక్షుడిగా గంటెపాక స్వామి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎర్రబెల్లి నాగమల్లు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా భూక్య గోవింద్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులుగా నరాల కృష్ణ, మతిదొడ్డి సునిత, జిల్లా కోశాధికారిగా గూడెపు పరుశరాములు, జిల్లా కార్యదర్శి బండారు మల్లయ్య ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తొంట సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కటాఫ్ మార్కులకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీలను అన్ రిజర్వుడ్ (జనరల్) కోటాలోనే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన సలహాదారులు బండారు రవి వర్ధన్, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు దారపు శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి యాదగిరి, నాయకులు గంటెపాక స్వామి,ఎర్రబెల్లి నాగమల్లు, గూడెపు పరశురాములు,చుక్క రమేష్, చిరుమర్తి యాదయ్య గుడుకుంట్ల వెంకటేష్, నల్ల స్వామి, కృష్ణయ్య, జి.క్రాంతి కుమార్ పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి నాగటి వెంకటేష్ అధ్యక్షుడు బొడ్డు కృష్ణయ్య -
పల్లెపాలనలో యువ తరంగాలు
ఫ సర్పంచ్‌గా ఎన్నికై గ్రామాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న యువత ఫ ఇచ్చిన హామీలపై దృష్టి ఫ ప్రణాళికలు రూపొందించుకుని పక్కాగా అమలు చేస్తామంటున్న నవయువ సర్పంచ్‌లు నేడు జాతీయ యువజన దినోత్సవంకొండమల్లేపల్లి : ఎంఏ, బీఈడీ పూర్తి చేసిన నేను 26 ఏళ్ల వయసులోనే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇటీవల జరిగిన కొండమల్లేపల్లి మండలం గుర్రపుతండా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాను. డెత్ సర్టిఫికెట్లు తీయడం, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇప్పించడం వితంతు పెన్షన్లు ఇప్పించడంతో తమ తండాలో ఆడ బిడ్డ పుడితే రూ.1,016, అమ్మాయి వివాహానికి కల్యాణ కానుకగా రూ.2,016 ఇస్తాను. చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. – రమావత్ సేవానాయక్, గుర్రపుతండా సర్పంచ్ ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో యువత ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇంజనీరింగ్, సాంకేతిక విద్యతోపాటు, ఇతర ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం సర్పంచ్ పీఠాన్ని దక్కించుకుని గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. సోమవారం వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువ సర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి రూపొందించుకున్న ప్రణాళికలు, వాటి అమలుకు తీసుకుబోయే కార్యాచరణ వారి మాటల్లోనే.. -
సమాజాభివృద్ధిలో తోడ్పాటు
హాలియా : నూతనంగా ఏర్పడ్డ కుపాసిపల్లి గ్రామపంచాయతీని అనుముల మండలంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలో ఎంఏ పొలిటికల్ సైన్స్ విభాగంలో విద్యనభ్యసించాను. బహుజన వాదిగా, విద్యార్థుల సమస్యలపై కొంతకాలంగా పనిచేస్తూ సమాజాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నా. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా సీసీ రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీల నిర్మాణం, లైబ్రరీ ఏర్పాటు చేయటమై నా ముందున్న లక్ష్యం. ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చి మా గ్రామాన్ని ఉత్తమ పంచాయతీగా అభివృద్ధి చేయడమే నా ముందున్న లక్ష్యం. – పెరుమాళ్ల వేణుగోపాల్, కుపాసిపల్లి సర్పంచ్ -
శ్రీనృసింహుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం విశేష పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తీసిన అర్చకులు సుప్రఽభాతం, ఆరాధన నిర్వహించారు. అనంతరం నిజాభిషేకం, అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు జరిపించి, అనంతరం గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన పూజలు చేపట్టారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. రాత్రికి శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి, ద్వార బంధనం చేశారు. వడ్డె ఓబన్న జయంతిభువనగిరిటౌన్ : తొలి వడ్డెర స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భువనగిరి కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలో ఓబన్న చిత్రపటానికి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సాహితి, జిల్లా అధికారులు, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. భూభారతి స్కాం విచారణ అధికారులుగా ఆర్డీఓలు సాక్షి, యాదాద్రి : భూభారతి స్లాట్ బుకింగ్ స్కాంపై విచారణ చేపట్టినట్లు కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ అధికారులుగా భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు నియమించామని పేర్కొన్నారు. జిల్లాలోని పలు ఇంటర్ నెట్, మీసేవ కేంద్రాల్లో తక్కువ మొత్తం నగదును జమచేసిన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు భూభారతి స్లాట్ బుకింగ్ స్కాంలో తేలిన బాధ్యుల నుంచి డబ్బులను రికవరీ చేయడమే కాకుండా పీడీ యాక్ట్, క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. 18న సీపీఐ బహిరంగ సభచౌటుప్పల్ : సీపీఐ ఆవిర్భవించి వంద వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల 18న నిర్వహించే భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ బహిరంగ సభకు నలబై దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బచ్చనగోని గాలయ్య, పల్లె శేఖర్‌రెడ్డి, నాయకులు భాస్కర్, మోహన్‌రెడ్డి, రామలింగం, శంకర్, రాములు, సుధాకర్, మనోహర్ పాల్గొన్నారు. వైభవంగా కూడారై ఉత్సవంవలిగొండ : ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వలిగొండ మండలం వెంకటాపురంలోని మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం కూడారై ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాదేవి–రంగనాయక స్వామివార్లకు 108 గిన్నెలతో పాయసం నివేదనగావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్‌బాబు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
‘జననీ’ ప్రోత్సాహకం పెండింగ్
మా పాపకు మూడు నెలల టీకా కూడా వేయించారు. గ్రామ ఏఎల్ఎం ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాను అందజేశాను. అయినప్పటికీ టీకా సంబంధించిన రూ.3 వేల ప్రోత్సాహకం అందాల్సి ఉంది. ఇంత వరకు డబ్బులు ఖాతాలో పడలేదు. – పోలెపాక కవిత, పారుపల్లి మా మనుమరాలును టీకా వేయించడం కోసం కూరెళ్ల సబ్ సెంటర్‌కు తీసుకొచ్చాను. పుట్టిన నుంచి ఇప్పటి వరకు 18 నెలల టీకా పూర్తయింది. పుట్టిన నుంచి ఇప్పటి వరకు రూ.7వేల వరకు జననీ సురక్ష ప్రోత్సాహకం నిధులు అందాల్సి ఉన్నా ఒక్క రూపాయ కూడా రాలేదు. – వనం జనమ్మ, కూరెళ్ల ఆత్మకూరు(ఎం) : గర్భిణులు, చిన్న పిల్లలకు జననీ సురక్ష యోజన పేరుతో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నా ఆర్థిక ప్రయోజనం మాత్రం చేకూరడం లేదు. ఈ పథకంలో భాగంగా టీకాలు వేయించుకునే గర్భిణులకు, చిన్నారులకు ప్రోత్సాహకంగా అందించే ఆర్థికసాయం గత రెండేళ్ల నుంచి నిలిచిపోయింది. ఫలితంగా గర్భిణులు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తున్నారు. పథకం అమలు ఇలా.. గర్భిణులు, అప్పుడే పుట్టిన పిల్లలు వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జననీ సురక్ష పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద గర్భిణులకు, పిల్లలకు టీకాలను వేస్తుంటారు. ఈ క్రమంలో గర్భిణులు మూడు నెలలలోపు స్థానిక ఆరోగ్య కార్యకర్త వద్ద రిజిస్టర్ చేసుకున్నట్లయితే రూ.3 వేలు, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తే రూ.4వేలు, ఆడపిల్లకు జన్మనిస్తే అదనంగా రూ.వెయ్యి గర్భిణుల ఖాతాలో జమ చేస్తారు. ఇక పుట్టిన పిల్లలకు మూడున్నర నెలల లోపు బీసీజీ టీకాలు పూర్తిగా వేయించినట్లయితే రూ.2వేలు, తొమ్మిది నెలలకు మిజిల్స్ టీకా వేయించినట్లయితే రూ.3వేలు, 18 నెలలకు బూస్టర్ టీకా వేయిస్తే రూ.2వేలు గర్భిణుల ఖాతాలో డబ్బులు జమవుతాయి. అయితే జననీ సురక్ష పథకం కింద లబ్ధి పొందడానికి ప్రతి గర్భిణి ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాను ఆరోగ్య కార్యకర్తకు అందజేయాల్సి ఉంటుంది. పేర్లు రిజిస్టర్ చేసుకున్నా.. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గత 2023–24, 2024–25వరకు 15,314 గర్భిణులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 7,176 గర్భిణులు ప్రసవించారు. మూడున్నర నెలలలోపు పిల్లలు 20,491, పూర్తిగా టీకాలు వేయించుకున్న పిల్లలు 18,925 మంది పిల్లలు నమోదయ్యారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,176 గర్భిణులకు, 39,416 పిల్లలకు జననీ సురక్ష పథకం కింద రూ.15,34,78,000 అందాల్సి ఉన్నా.. ఇంత వరకు ఖాతాల్లో జమకాలేదు. ఇప్పటికై నా జననీ సురక్ష పథకం కింద అందాల్సిన డబ్బులను వెంటనే ఖాతాల్లో జమచేయాలని గర్భిణులు కోరుతున్నారు. ఫ రెండేళ్ల నుంచి ఆర్థిక చేయూతనివ్వని జననీ సురక్ష పథకం ఫ గర్భిణులు, చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలతోనే సరి ఫ ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రూ.15.34 కోట్లు ఫ 46,592 మంది లబ్ధిదారుల ఎదురుచూపు గర్భిణులు, పుట్టిన పిల్లలు వ్యాధుల బారిన పడకుండా వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నాం. టీకాలు వేయించుకునే వారిని ప్రోత్సహించేందుకు జననీ సురక్ష పథకం కింద ఆర్థికసాయం నిధులు అందిస్తున్నాం. అయితే టీకాలు పూర్తిచేసిన గర్భిణుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సి ఉంది. నిధులు విడుదల కాగానే జమచేస్తాం. – ఎం.మనోహర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి -
ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ హడావుడి
చిట్యాల: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు హడావుడి చేస్తున్నారు తప్పితే గత రెండేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. చిట్యాల మున్సిపాలిటీలోని ఏడవ వార్డులో ఆదివారం ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నేరవేర్చలేదని, మళ్లీ మాయ మాటలతో మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. ప్రజలకు రావాల్సిన రైతుబంధు, రైతు భరోసా, ఆసరా పింఛన్లు ఇవ్వలేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు సక్రమంగా అందాయన్నారు. రాబోయే రెండున్నరేళ్లలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు చిట్యాల మున్సిపాలిటీలో పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మెండె సైదులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్యగౌడ్, నాయకులు కొలను వెంకటేష్, కందాటి రమేష్‌రెడ్డి, జిట్ట శేఖర్, బొల్గూరి సైదులు, మేడి ఉపేందర్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
చైనా మాంజాకు చెక్ పెట్టేలా..
భువనగిరిటౌన్ : జనవరి నెలలో ప్రధాన పండుగైన సంక్రాంతి వస్తుందంటే పిల్లలకు గుర్తుకు వచ్చేది గాలిపటాలు (పతంగులు)ఎగురవేయడమే. పిల్లలే కాదు పెద్దలు కూడా సంతోషంగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. పక్కనోడి గాలిపటాన్ని పడేయాలని తెగ ఆసక్తి చూపిస్తారు. అయితే గాలిపటాలను ఎగురవేసేందుకు సంప్రదాయ దారాన్ని మాత్రమే ఉపయోగించాల్సి ఉన్నా అది బలంగా లేక తెగిపోతుందని కొందరు నిషేధిత చైనా మాంజాను వినియోగిస్తుంటారు. ఈ మాంజా మనుషులు, జంతువులు, పక్షులకు ముప్పు తెచ్చిపెడుతోంది. నిషేధిత చైనా మాంజాను కొందరు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా మాంజా వినియోగించొద్దని, మీ సరదా కోసం ఇతరుల ప్రాణాల మీదకు తేవొద్దని పోలీసులు అంటున్నారు. నిషేధిత చైనా మాంజా విక్రయాలు, వినియోగం వద్దని సోషల్ మీడియాలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. చాటుమాటుగా ఎవరైనా అమ్మితే తమకు సమచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా కొందరు వ్యాపారులు చైనా మాంజాను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే చైనా మాంజా విక్రయించకుండా, వాడకుండా దుకాణదారులు, వియోగదారులను కట్టడి చేస్తే ప్రమాదాలు జరగవని ప్రజలు అంటున్నారు. ఫ సోషల్ మీడియా ద్వారా ముమ్మర ప్రచారం ఫ గాలిపటాలు ఎగురవేసేందుకు సంప్రదాయ దారం వాడాలి ఫ నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే సమాచారం ఇవ్వండి ఫ పేర్లు గోప్యంగా ఉంచుతామంటున్న పోలీసులు -
నిధులు దుర్వినియోగం కాకుండా..
భువనగిరి: నేను వ్యవసాయం చేస్తున్నా. పెంచికల్‌పహాడ్ గ్రామంలో సర్పంచ్ బరిలో యువత ఉంటే బాగుంటుందని చెప్పి నన్ను ప్రోత్సహించారు. అయితే అమలుకు సాధ్యంకాని పనుల విషయంలో ముందుగానే హామీ ఇవ్వలేనని సూటిగా చెప్పా. అసంపూర్తిగా ఉన్న శ్మశాన వాటిక, పంచాయతీ భవన నిర్మాణ పనులు పూర్తి చేయిస్తా. అవసరమైన చోట్ల సీసీ రోడ్డు నిర్మాణాలు, అండర్ డ్రెయినేజీ నిర్మాణాలు చేపడుతా. గ్రామాభివృద్ధి కోసం వచ్చే నిధులు దుర్వినియోగం కాకుండా పనిచేస్తా. – మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచ్, పెంచికల్‌పహాడ్, భువనగిరి మండలం -
కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి
చిట్యాల: త్వరలో రాబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై చిట్యాల మున్సిపాలిటీ ప్రజలు నిలదీయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. చిట్యాలలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు గత రెండేళ్లుగా ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా, సమస్యలను పరిష్కరించకుండా కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నందునే ఇప్పుడు వార్డుల్లో హడావుడిగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారని ఆరోపించారు. డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి రాజకీయాలు చేసేందుకు వస్తున్న నాయకులకు చిట్యాల పట్టణ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చిట్యాల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకుగాను రూ.30కోట్లు కేటాయించి మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు. మరోమారు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. మరో రెండున్నరేళ్లలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పీటీసీ శేపూరి రవీందర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్యగౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మెండె సైదులు, మాజీ ఎంపీటీసీ జనగాం నర్సింహాగౌడ్, నాయకులు బొబ్బల శివశంకర్‌రెడ్డి, కందాటి రమేష్‌రెడ్డి, అఫ్సర్, చిత్రగంటి ప్రవీణ్, కన్నెబోయిన శ్రీశైలం, జిట్ట శేఖర్, అశోక్, వెంకన్న పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌లో నిడమనూరు ఆదర్శ విద్యార్థుల ప్రతిభ
నిడమనూరు : ఈ నెల 7,8,9వ తేదీల్లో కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌లో నిడమనూరు ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. జూనియర్ విభాగంలో పాఠశాలకు చెందిన ఈ. పవన్‌కుమార్ ప్రదర్శించిన ఆల్కహాల్ డిటెక్షన్ వెహికిల్ కంట్రోల్ (హెల్త్ అండ్ హైజీన్) ఎగ్జిబిట్‌కు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. సీనియర్ విభాగంలో పాఠశాలకు చెందిన కె.వెంకట్ ప్లాట్ మెజర్మెంట్(గణిత నమూనా)కు రాష్ట్రస్థాయిలో రెండో బహుమతిని లభించింది. వీరికి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి బహుమతులు అందించారు. రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌లో బహుమతులు అందుకున్న విద్యార్థులను నల్లగొండ డీఈఓ భిక్షపతి, జిల్లా సైన్స్ ఆఫీసర్ లక్ష్మీపతి, పాఠశాల ప్రిన్సిపాల్ బి.నిర్మల, సైన్స్ ఉపాధ్యాయులు సైదులు, వెంకటేశ్వర్లు, నరేష్కుమార్, సంధ్య, చంద్రశేఖర్‌లు అభినందించారు. -
రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా ఎంపిక
హాలియా : హాలియా పట్టణానికి చెందిన చింతలచెరువు తేజు రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా ఎంపికై నట్లు నల్లగొండ జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) సెక్రటరీ విమల శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో జరిగే అండర్–17 ఎస్జీఎఫ్ 69వ జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో తేజు తెలంగాణ రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్య వహించనున్నట్లు ఆమె తెలిపారు. గతేడాది నవంబర్‌లో నల్లగొండలో జరిగిన అండర్–17(ఎస్జీఎఫ్) 69వ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు తరఫున తేజు బరిలోకి దిగి ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. ప్రస్తుతం తేజు తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ ఫుట్‌బాల్ అకాడమీ–జనగామ జిల్లా కేద్రంలో శిక్షణ పొందుతున్నాడని పేర్కొన్నారు. తనను ప్రోత్సహించిన జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ విమల, సీనియర్ పీడీ, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ ఫుట్‌బాల్ అకాడమీ కోచ్ లింగానాయక్కి తేజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. -
మతోన్మాద భావజాలం హానికరం
భువనగిరిటౌన్ : గ్రామాల్లో పెరుగుతున్న మతోన్మాద భావజాలం చాలా హానికరమని, దీనిని అణచివేసేందుకు కలిసికట్టుగా పోరాడాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద భావజాల వ్యాప్తి అడ్డూఅదుపు లేకుండా పెరుగుతుందని, కులం, మతం పేరుతో మనుషుల మధ్య విషం నింపుతోందన్నాని ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్లను సవరించడం, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా పేరు మార్చడం తగదన్నారు. విత్తన చట్టం, విద్యుత్ సవరణ బిల్లును తీసుకురావడం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలని ఆలోచనలు చేయడమేనన్నారు. బీజేపీ విధానాలు రాష్ట్రాల హక్కులను కాలరాసేలా ఉన్నాయన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ సాగిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలన్నారు. బీజేపీ మతం, కులం పేరుతో చేస్తున్న రాజకీయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, నాయకులు బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసాచారి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సిర్పంగి స్వామి, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, బొల్లు యాదగిరీ, ఎండి పాష, బొడ్డుపల్లి వెంకటేష్, గుండు వెంకటనర్సు, దోడ యాదిరెడ్డి, మద్దేపూరం రాజు, బోలగాని జయరాములు, అవ్వారు రామేశ్వరి, రాచకొండ రాములమ్మ, ఎంఏ ఇక్బాల్, వనం ఉపేందర్, గడ్డం వెంకటేష్, మల్లేపల్లి లలిత, బల్గూరి అంజయ్య, కోట రామచంద్రారెడ్డి, గోశిక కరుణాకర్, మండల కార్యదర్శులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు -
‘గుట్ట’ ఓటరు జాబితా గందరగోళం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మున్సిపల్ ఓటరు జాబితా గందరగోళంగా రూపొందించారు. ఇందుకు మున్సిపల్ అధికారుల తప్పిదాలే కారణమని తెలుస్తోంది. ఒకే ఇంటి నంబర్‌పై చాలా ఓట్లు ఉండడం ఏమిటని మున్సిపల్ అధికారులను స్థానిక నాయకులు నిలదీస్తున్నారు. ముసాయిదా విడుదలతో బట్టబయలు..ఈ నెల 1న అధికారులు యాదగిరిగుట్ట మున్సిపల్ ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఈ ఓటరు లిస్టులను రాజకీయ పార్టీల నాయకులు, స్థానికులు పరిశీలిస్తే ప్రధానంగా 6వ వార్డులో 3–133 ఇంటి నంబర్‌తో పాటు అదే ఇంటికి బై నంబర్లు ఉండి సుమారు 92 ఓట్లు ఉన్నాయి. 9వ వార్డులో సైతం 4–223 ఇంటి నంబర్‌పై 20 ఓట్ల వరకు నమోదైన విషయం బట్టబయలైంది. పక్క ఇంటి నంబర్‌తో ఓటు హక్కు..1995లో సుమారు ఐదు సంచార జాతి కుటుంబాలు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వలసొచ్చి పాత గుండ్లపల్లిలో ఉంటూ ఓటు హక్కు పొందారు. ప్రస్తుతం వీరు 15 కుటుంబాలు కాగా 90 ఓట్లు కలిగి ఉన్నారు. వీరిలో 35మంది ఓటర్లు మాత్రమే స్థానికంగా ఉంటుండగా మిగతా వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకొని వస్తుంటారు. వీరికి స్థానికంగా సొంతిళ్లు లేక ఓ ప్రయివేట్ స్కూల్ పక్కనే గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. వీరికి స్కూల్‌కు సంబంధించిన ఇంటి నంబర్‌ను ల్యాండ్ మార్క్‌గా వేశారు. దీంతో ఒకేఇంటి నంబర్‌పై 92ఓట్లు ఉన్నట్లు లిస్టులో చూపెడుతుంది. ఇక 9వ వార్డులో సుమారు 20 ఓట్ల వరకు ఒకే ఇంటి నంబర్‌ను కలిగి ఉన్నాయి. గతంలో ఓ ముస్లిం ఇంట్లో 5 కుటుంబాలు అద్దెకు ఉన్నవారికి అదే ఇంటి నంబర్‌పై ఓటు హక్కు కల్పించారు. ప్రస్తుతం ఆ ఓటర్లు ఆ ముస్లిం ఇంట్లో నుంచి వెళ్లి అదే వార్డులోనే మరొకరి ఇంట్లో ఉంటున్నా గతంలో ఉన్న ఇంటి నంబర్‌పైనే ఓటు నమోదైంది. వీరందరికి ప్రస్తుతం నివాసముంటున్న ఇంటి నంబర్లు ఓటరు జాబితాలో చేర్చితే ఇబ్బందులు తలెత్తవని స్థానికులు అంటున్నారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ఓటరు జాబితాలు తప్పుల తడకగా మారాయి. ప్రస్తుతం నివాసం ఉంటున్న వార్డులో కాకుండా ఇతర వార్డులో ఓట్లు మారాయి. 6వ వార్డులో ఒకే ఇంటి నంబర్‌పై 92 ఓట్లు 9వ వార్డులోనూ అదే పరిస్థితి ఇల్లు ఒక వార్డులో.. ఓటు మరో వార్డులో.. అధికారుల తప్పిదమే కారణం -
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
మఠంపల్లి : మండలంలోని యాతవాకిళ్లకు చెందిన పులి హర్షవర్ధన్, కొత్త శివ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. వీరిద్దరు ఖమ్మంలో 2025 డిసెంబర్ 26న మోడరన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన సెలక్షన్స్‌లో పాల్గొని సత్తా చాటడంతో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికచేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలలో వారు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా శనివారం విద్యార్థులను నాయకులు, గ్రామస్తులు అభినందించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతిపెన్పహాడ్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఏఎస్ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన అంకిత్‌పాండే(24) ధూపహాడ్ గ్రామంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 4న సొంత పనుల నిమిత్తం సూర్యాపేట వెళ్లి తిరిగి వస్తుండగా అనంతారం క్రాస్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి బావమర్ది భీంపాండే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యంనల్లగొండ : నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల అన్నపూర్ణ క్యాంటీన్ సమీపంలో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు వన్‌టౌన్ ఎస్ఐ సతీష్ తెలిపారు. మృతుడు భిక్షగాడిలా ఉన్నాడని, వయస్సు సుమారు 55 నుంచి 60 సంవత్సరాలు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. మృతుడి గురించిన వివరాలు తెలిసిన వారు 87126 67670, 80968 49380 నంబర్లకు సమచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు. -
ఇచ్చిన హామీలు అమలు చేయాలి
భూదాన్‌పోచంపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ డిమాండ్ చేశారు. శనివారం భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలో చేనేత రుణమాఫీతో పాటు చేనేత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేనేత సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన మూడో రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా వాంటావార్పు చేసి నిరసన తెలిపారు. దీక్షా శిబిరాన్ని బూర నర్సయ్యగౌడ్ సందర్శించి సంఘీభావం తెలిపి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి చేనేత కార్మికులకు రూ.లక్ష లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించి నేటికీ అమలు చేయకపోవడం దారుణమన్నారు. త్రిఫ్ట్ ఫథకం, నేతన్న భరోసా, నూలు సబ్సిడీ ఏ ఒక్కటి కూడా అమలు కావడంలేదని విమర్శించారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్‌గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, కిసాన్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్రెడ్డి, అధికార ప్రతినిధి సుర్కంటి రంగారెడ్డి, ఎన్నం శివకుమార్, ఏలే చంద్రశేఖర్, చేనేత సెల్ జిల్లా కన్వీనర్ గంజి బస్వలింగం, పట్టణ అధ్యక్షుడు డబ్బికార్ సాహేశ్, అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ, పల్లెకాడి బస్వయ్య, మండల అధ్యక్షుడు మేకల రవీందర్‌రెడ్డి, ఏలే శ్రీనివాస్, చింతకింది రమేశ్, ఏలే భిక్షపతి, రచ్చ సత్యనారాయణ, భారత భూషణ్, శ్రీహరి, రుద్ర నర్సింహ, భారత బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ -
స్థానికంగానే ఉంటున్నాం
ఇరవై ఐదేళ్లుగా 9వ వార్డులోని ఇందిరా వికలాంగుల కాలనీలో గుడిసెలు వేసుకుని మా కుటుంబ సభ్యులం 15 మంది వరకు ఉంటున్నాం. గతంలో ఓట్లు నమోదప్పుడు మా గుడిసెల పక్కనే ఉన్న ఇంటి నంబర్‌ను రాసుకున్నారు. అదే మా ఓటరు కార్డుపై వస్తుంది. ఈ విషయం అధికారులకు చెబితే మారుస్తామన్నారు. – పెద్ద సమ్మయ్య, 9వ వార్డు, యాదగిరిగుట్ట ఓట్లు తొలగించే అవకాశం మాకులేదు ప్రస్తుతం ఓట్లు చేర్చడం, తొలగించడం మా పరిధిలో లేదు. మార్పులు, చేర్పులు వంటివి రెవెన్యూ శాఖ అధికారులు చేస్తారు. మున్సిపాలిటీలోని 9వ వార్డులో, 6వ వార్డులో ఒకే ఇంటిపై అధిక ఓట్లు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. దానిపై మా సిబ్బందితో విచారణ చేయిస్తున్నాం.రిపోర్టును కలెక్టర్‌కు సమర్పిస్తాం. – లింగస్వామి, మున్సిపల్ కమిషనర్ -
నేటి నుంచి కళాశాలలకు సంక్రాంతి సెలవులు
భువనగిరి : ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు ఇంటర్ బోర్డు సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించిందని డీఐఈఓ రమణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈ నెల 19వ తేదీన కళాశాలలు పునఃప్రారంభం కానున్నట్లు ఆమె పేర్కొన్నారు.పండుగ ముగిసే వరకు విధులు● ఎస్పీ అక్షాంశ్ యాదవ్ చౌటుప్పల్ : సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్తున్న ప్రజలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరే వరకు తాము విధులు నిర్వహిస్తామని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజాను శనివారం ఆయన సందర్శించారు. టోల్ ప్లాజా నిర్వాహకులను అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ రద్దీ నేపథ్యంలో జాతీయ రహదారిపై 150 మంది పోలీసులు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. హైవేపై అంబులెన్సులు, క్రేనులు అందుబాటులో ఉన్నాయన్నారు. పండుగకు ఇంటికి వెళ్తున్నందున ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపొద్దన్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ఽ ధరించాలని, కార్లలో సీటు బెల్టులు పెట్టుకోవాలని సూచించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు. ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన భువనగిరి : మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్‌కు చెందిన నృత్య గురువు భారతిలక్ష్మీ శిష్య బృందం ఆధ్వర్యంలో భరత నాట్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్శకులను నృత్యప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కళాకారిణిలు ఆరాధ్య, వైష్ణవి, హరిచందన, ప్రజ్ఞ, నిషిక, శాన్వి తదితరులు పాల్గొన్నారు. -
పురుగు మందుల పిచికారీలో జాగ్రత్తలు తీసుకోవాలి
త్రిపురారం : వరి, బత్తాయి, జామ, దానిమ్మ, పత్తి, కంది, మొక్కజొన్న, వివిధ రకాల కూరగాయల సాగులో చీడపీడల నివారణకు గాను పురుగు మందులను ఇష్టానుసారంగా పిచికారీ చేస్తుంటారు. అయితే కనీస జాగ్రత్తలు పాటింకపోవడంతో రైతులు అనారోగ్యం బారిన పడుతుంటారు. వాతావరణ పరిస్థితుల వలన పంటలకు కొత్త కొత్త చీడపీడలు ఆశిస్తుండడంతో మార్కెట్లో గాఢత ఎక్కువ ఉన్న పురుగు మందులను విక్రయిస్తున్నారు. దీంతో రైతులు మోతాదు మించి పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికా రుల సూచనల మేరకు పురుగు మందులు కొనుగోలు చేసి తగిన జాగ్రత్తలు పాటిస్తూ పిచికారీ చేసుకోవాలని త్రిపురారం మండల వ్యవసాయ అధికారి పార్వతి చౌహన్ సూచిస్తున్నారు. ● గాలికి ఎదురుగా పురుగు మందులు పిచికారీ చేయరాదు. ఇలా చేయడం వల్ల పురుగు మందు శరీరంపై పడుతుంది. ● పిచికారీ చేసే సమయంలో చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్కులు తప్పకుండా ధరించాలి. ● పిచికారీ సమయంలో మంచి నీరు తాగడం, ఆహరం తీసుకోవడం, బీడీ, సిగరెట్ వంటివి తాగొద్దు. ● శరీరం మొత్తం కప్పి ఉంచేలా ప్రత్యేక దుస్తులు ధరించాలి. కళ్లజోడు సైతం వాడాలి. ● మందులను ట్యాంకుల్లో కలుపుకునే సమయంలో చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. ● పిచికారీ పూర్తయిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ● వాడిన పురుగు మందుల డబ్బాలను ఎట్టి పరిస్థితుల్లో పశుల పాకల్లో భద్రపరచరాదు. ● పురుగు మందుల వాసనతో పశువులు, మూగజీవాలు సైతం అనారోగ్యానికి గురై మృతిచెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ● ఉపయోగించిన పురుగు మందుల డబ్బాలు, ప్యాకెట్లను గుంత తీసి భూమిలో పాతి పెట్టాలి. ● మందులు పిచికారీ చేసే సమయంలో రైతులకు వాంతులు, చెమటలు అధికంగా వచ్చినా, ఆయాసం ఎక్కువైనా వెంటనే వైద్యులను సంప్రదించాలి.డ్రోన్ల వినియోగం మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పురుగు మందలు పిచికారీకి డ్రోన్లను వినియోగించుకోవడం మేలు. డ్రోన్ల వల్ల తక్కువ సమయంలో ఎక్కువ పంటపై మందులు పిచికారీ చేసుకోవచ్చు. డ్రోన్లు ఎక్కువగా వాడాలి త్రిపురారం మండల వ్యవసాయ అధికారి పార్వతి చౌహన్ సూచనలు -
బస్సుల్లో నిద్రించే ప్రయాణికులే టార్గెట్
నల్లగొండ: బస్సుల్లో నిద్రించే ప్రయాణికులనే టార్గెట్‌గా చేసుకుని బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా సభ్యుడిని నల్లగొండ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి బస్సుల్లో నిద్రించే ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్నారు. డిసెంబరు 5న చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సులో భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరానికి పాల్పడింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాకు చెందిన పాత నేరస్తుడిగా గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు అక్కడికి ప్రత్యేక పోలీసు బృందాలను పంపించి వివిధ ప్రాంతాల్లో నిఘా ఉంచి మనవార్ పోలీస్ స్టేషన్ పరిధిలో షా అల్లా రఖా అనే వ్యక్తిని పట్టుకున్నట్లు వివరించారు. పట్టుబడిన నిందితుడు డ్రైవర్‌గా పనిచేస్తాడని, అతడి స్వస్థలం ధార్ జిల్లా ధర్మపురి తాలుకా ఖల్ఘాట్ గ్రామమని ఎస్పీ పేర్కొన్నారు. అతడిని విచారించగా.. మరో నలుగురు అఫ్రత్ఖాన్, సైఫ్అలీఖాన్, జాబర్ ఖాన్, ఉమర్‌ఖాన్‌తో కలిసి బస్సుల్లో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడని తెలిపారు. నిందితుడి నుంచి రూ.85లక్షల విలువైన చోరీకి గురైన వస్తువులు, 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని, మిగతా నలుగురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు గతంలోనూ విజయవాడ హైవేపై హోటళ్ల వద్ద ఆగి ఉన్న బస్సుల్లో బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకున్న చిట్యాల సీఐ నాగరాజు, సీసీఎస్ ఎస్ఐ శివకుమార్, సిబ్బంది విష్ణువర్ధన్‌గిరి, పుష్పగిరి, నాగరాజు, వెంకటేష్, సాయికుమార్, జువేద్, శివరాజు, మహేష్, కమల్ కిషోర్, చిన్నబాబును ఎస్పీ అభినందించారు.ప్రయాణికుల జేబులు కత్తిరిస్తున్న దొంగల అరెస్ట్నల్లగొండ : నల్లగొండ బస్టాండ్ పరిసరాల్లో తిరుగుతూ ప్రయాణికుల జేబులు కత్తిరిస్తున్న, బ్యాగులు చోరీ చేస్తున్న ఇద్దరిని టూ టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన పసుపులేటి రేణుకతో పాటు ఆమె సహచరుడు అరవింద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. రేణుక, అరవింద్ 2025, జూన్ 30వ వారంలో రవి, ఆదినారాయణకు చెందిన కారులో నల్లగొండకు వచ్చి బస్టాండ్‌కు కొద్ది దూరంలో దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారు. బస్టాండ్‌లో హైదరాబాద్‌కు వెళ్లే బస్ ఎక్కుతున్న వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులోని రూ.80 వేలు చోరీ చేసి అదే కారులో పారిపోయారు. డిసెంబరు 2వ వారంలో బస్టాండ్‌కు కొద్ది దూరంలో కారు దిగి వచ్చారు. బస్టాండ్‌లో దేవరకొండ బస్ ఎక్కుతున్న వ్యక్తి వద్ద ఉన్న రూ.60 వేలు చోరీ చేశారు. మగవేషం వేసుకొని అమాయక ప్రయాణికులను మోసం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఆడ దొంగపై పలువురు బాధితులు టూ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో క్రైమ్ సిబ్బంది రంగంలోకి దిగి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విచారణ చేపట్టారు. దొంగతనాలకు పాల్పడుతున్న రేణుక, అరవింద్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరం ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించి దొంగలను పట్టుకున్న టూ టౌన్ ఎస్ఐ వై.సైదులు, సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించినట్లు డీఎస్పీ వెల్లడించారు. బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా సభ్యుడి అరెస్టు వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
రాజేశ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం
కోదాడ : దళిత యువకుడి కర్ల రాజేశ్‌ను పోలీసులు చిత్రహింసలకు గురిచేసి చంపారని, అతడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. శనివారం కోదాడలోని గాంధీనగర్‌లో జరిగిన కర్ల రాజేశ్ సంతాప సభలో ఆయన మాట్లాడారు. రాజేశ్ మృతికి పోలీసులే కారణమని స్పష్టంగా తెలుస్తున్నా ఉన్నతాధికారులు కేవలం సస్పెన్షన్తోనే సరిపెట్టారని అన్నారు. జిల్లా ఎస్పీ ఇంత వరకు ఈ కేసు విషయంలో నోరు మెదపకపోవడం వెనుక మతలబేమిటో చెప్పాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా దళిత యువకుడి మృతిపై కనీస స్థాయిలో స్పందించలేదని అన్నారు. రాజేశ్ మృత దేహానికి పోస్ట్‌మార్టం చేసిన వైద్యుడిపై కూడా తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసును పూర్తిస్థాయిలో రీ ఇన్వెస్టిగేషన్ చేసి బాధ్యులపై హత్యాహత్నం, ఎట్రాసీటీ కేసులను నమోదు చేయాలని, చిలుకూరు ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకు ముందు రాజేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు అధ్యక్షతన జరిగిన సభలో రాజేశ్ తల్లి కర్ల లలితమ్మ, జిల్లా, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మంద కృష్ణమాదిగ -
చెరువులో పడి కూలీ మృతి
మునగాల: ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి కూలీ మృతిచెందాడు. ఈ ఘటన మునగాల మండలం నేలమర్రి గ్రామ పంచాయతీ పరిఽ దిలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలమర్రి గ్రామానికి చెందిన చామకూరి రామానుజం(45) వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం గ్రామానికి చెందిన కొంతమంది వ్యవసాయ కూలీలతో కలసి పొలం పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లి.. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. అతడికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. అటువైపు వెళ్తున్న వ్యక్తి గమనించి మిగతా వ్యవసాయ కూలీలకు సమాచారం ఇచ్చాడు. వారు చెరువులో నుంచి రామానుజం మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రామానుజంకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. లారీ ఢీకొని ఆటో డ్రైవర్‌కు గాయాలుచౌటుప్పల్ : మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామ శివారులోని పరిశ్రమ ముందు జాతీయ రహదారిపై యూటర్న్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలయ్యాయి. దివీస్ కంపెనీ ముందు యూటర్న్ తీసుకుంటున్న ఆటోను విజయవాడ వైపునకు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దాంతో ఆటో ఒక్కసారిగా పల్టీకొట్టి ముందున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ లింగోజిగూడేనికి చెందిన పోలేపల్లి అంజయ్య(56)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అంజయ్యను చికిత్సనిమిత్తం చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆటో డైరవర్ కుమారుడు పోలేపల్లి ధన్‌రాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. పత్తిలోడ్ ట్రాక్టర్ చోరీ కేసులో పురోగతి● పోలీసుల అదుపులో నిందితులు కేతేపల్లి : కేతేపల్లిలో గురువారం రాత్రి పత్తి లోడుతో ఉన్న ట్రాక్టర్ చోరీకి గురైన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కేతేపల్లికి చెందిన జటంగి బుచ్చయ్య తన ట్రాక్టర్లో అదే గ్రామానికి చెందిన వీరబోయిన మహేశ్‌కు చెందిన పత్తిని లోడ్ చేసుకొని మిల్లుకు తరలించేందుకు బయల్దేరాడు. ట్రాక్టర్‌ను గురువారం రాత్రి హైవే వెంట ఉన్న ఓ ఇంటి ముందు నిలిపి ఉంచగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేతేపల్లి నుంచి సూర్యాపేట వరకు రోడ్డు వెంట ఉన్న సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. మండలంలోని భీమారం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ట్రాక్టర్ ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితులు చోరీ చేసిన పత్తిలో కొంత ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించగా మరికొంత ప్రైవేటు వ్యాపారులకు విక్రయించినట్లు తెలిసింది. పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలనీలో వారు వదిలేసిన ట్రాక్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు తెలిసింది. నిందితుల విచారణ అనంతరం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. -
బస్వాపూర్
డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్.. దేశ, విదేశాల్లో జరిగే వెడ్డింగ్‌లను మన రాష్ట్రంలోనే నిర్వహించడం ద్వారా ఆదాయంతోపాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లాలోని భువనగిరి మండల పరిధిలోని బస్వాపూర్ రిజర్వాయర్ వద్ద పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రైవేట్, పబ్లిక్ పార్టనర్‌షిప్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రం ఏర్పాటుకు సిద్ధమైంది. ఇంటికి దూరంగా ప్రత్యేకంగా..ఇంటికి దూరంగా అందమైన ప్రదేశాల్లో వివా వేడుకలు జరుపుకోవడాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు. ఇతరదేశాలు, అందమైన ప్రకృతి రమణీయ ప్రాంతాలు, బీచ్‌లు, పర్వతాలు ఇలా జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ వేడుక నిర్వహిస్తారు. ప్రస్తుతం బీచ్ వెడ్డింగ్‌కు గోవా, మాల్దీవులు, ప్యాలెస్, హిస్టారికల్ ప్రాంతాల కోసం రాజస్థాన్ లోని రాజభవనాలు, ఆగ్రాలోని తాజ్‌మహల్, ఉదయ్‌పూర్ సరస్సులు, కేరళ, ఇటలీ, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌తోపాటు మనదేశంలోని పలుచోట్ల డెస్టినేషన్ వెడ్డింగ్‌లు జరుగుతున్నాయి. పెళ్లికోసం ఇరు కుటుంబాలు కొద్ది మందిని తీసుకుని విమానాల్లో డెస్టినేషన్ సెంటర్లకు వెళ్తారు. ప్రభుత్వం అనుమతిస్తే చాలు..బస్వాపూర్‌లో 93 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. హిల్స్, అప్అండ్ డౌన్ ప్రాంతాలు, రిజర్వాయర్‌లో నీరు నింపితే అద్భుతంగా వెడ్డింగ్ డెస్టినేషన్ కింద అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పలువురు పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఎవరైనా ఔత్సాహికులు ముందుకొచ్చి తమ ప్రాజెక్టు వివరాలను ప్రభుత్వానికి వివరించాలి. ప్రభుత్వం వారి ప్రతిపాదనలు అంగీకరిస్తే డీపీఆర్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. డీపీఆర్‌లను ప్రభుత్వం ఒకే చేస్తే భూమిని అద్దె ప్రాతిపదికన కేటాయిస్తుంది. సబ్ రిజిస్ట్రార్ విలువపై ఐదు శాతం అద్దె చెల్లించాల్సి ఉంటుంది. రూ.500 కోట్ల ప్రాజెక్టుకు 66 ఏళ్లు అద్దెకు ఇస్తారు. వచ్చిన లాభాల్లో అసెట్డెవలప్ మెంట్ ఫండ్ చెల్లించాల్సి ఉంటుంది. సీఎం, టూ రిజం, రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో వీటిపై నిర్ణయాలు తీసుకుంటారు. ఔత్సాహిక పెట్టుబడిదారులు ఇప్పటికే బస్వాపూర్ వచ్చి స్థల పరిశీలన చేసి వెళ్తున్నారు. గతంలో ప్రతిపాదనలు ఇలా..యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మికత తర్వాత పర్యాటకాన్ని అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ఇందులో బస్వాపూర్ రిజర్వాయర్ వద్ద సుమారు 93 ఎకరాల్లో కర్ణాటకలోని బృందావనం గార్డెన్‌ను అభివృద్ధి చేస్తామని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. భువనగిరి మండలం బస్వాపురం చెరువును రిజర్వాయర్‌గా మార్చారు. 11.39టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం రిజర్వాయర్‌ను నిర్మించారు. బస్వాపురం రిజర్వాయర్‌ను సాగు, తాగునీటి అవసరాలతోపాటు ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే చర్యలు ప్రారంభం అయ్యాయి.బస్వాపూర్ రిజర్వాయర్ బృందావనంగా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు పలు నిర్మాణాలు చేపట్టేలా ప్రత్యేక కార్యాచరణ ఇటీవల ప్రకటించిన టూరిజం శాఖ మంత్రి జూపల్లి ప్రాజెక్టుల ఏర్పాటుకు గాను పెట్టుబడిదారులకు ఆహ్వానంపర్యాటకులను రప్పించేలా యాదగిరిగుట్టకు వచ్చే భక్తులతోపాటు దేశ, విదేశాలకు చెందిన లక్షలాది మంది భక్తులు, పర్యాటకులను ఇక్కడికి రప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా బస్వాపురం రిజర్వాయర్ పూర్తి చేసి అందులో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు అనుకూలంగా పలు నిర్మాణాలు చేపట్టనున్నారు. వాటర్ బోటింగ్, ఉద్యానవనాలు, అభయారణ్యాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, కల్యాణ మంటపాలు, విశాలమైన రోడ్లు, ఇలా భక్తులకు ఆహ్లాదరకర వసతులు కల్పిస్తారు. ఈ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. -
సంక్రాంతికి సాగు పనిముట్లు
రామన్నపేట : వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు సబ్సిడీపై అందించే పనిముట్ల పంపిణీకి ముహూర్తం ఖరారు అయింది. ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు ఈనెల 12 నుంచి పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 1.27కోట్లు విడుదల చేసింది. ఈ పథకం కింద జిల్లాకు మంజూరు చేసిన 316 యూనిట్లను రైతులకు యాభైశాతం సబ్సిడీపై అందజేస్తారు. 1,150 దరఖాస్తుల స్వీకరణరైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందించేందుకు అమలు చేస్తున్న వ్యవసాయ యాత్రీకరణ పథకాన్ని గత ప్రభుత్వం 2016–17లో నిలిపి వేసింది. అయితే చిన్న సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు ఽఆధునిక వ్యవసాయ పనిముట్లను అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో ప్రస్తుత ప్రభుత్వం సాగు యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మండలాల వారీగా యూనిట్లను కేటాయించి రైతుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. సుమారు 1,150 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాకు మంజూరైన 316 యూనిట్లకుగాను 177 యూనిట్ల పంపిణీ చేయుటకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలేరు నియోజకవర్గానికి మంజూరైన యూనిట్లను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఈనెల 12న ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు సంబంధించిన యూనిట్లను పాటిమట్లలో ఎమ్మెల్యే మందుల సామేలు చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సన్నాహాలు చేశారు.యాంత్రీకరణ పథకంలో రైతులకు అందించే వ్యవసాయ పనిముట్లుకేటాయించిన యూనిట్లు సబ్సిడీపై రైతులకు యాత్రీకరణ పరికరాలు జిల్లాకు 1.27 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం మొత్తం 316 యూనిట్లు మంజూరు లబ్ధిదారులకు రేపటి నుంచి పంపిణీనియోజకవర్గం మంజూరైనవి పంపిణీ చేసేవి ఆలేరు 142 70 భువనగిరి 84 62 మునుగోడు 34 12 నకిరేకల్ 20 06 తుంగతుర్తి 36 27 మంజూరైన పరికరాలు ఇవే.. పవర్ స్ప్రేయర్లు 100 రోటోవేటర్లు 98కల్టివేటర్లు, కేజ్‌వీల్స్, డిస్క్హారోస్ 61బండ్ ఫార్మర్ 04పవర్వీడర్స్ 08పవర్టిల్లర్లు 12బ్రష్‌కట్టర్స్ 17స్ట్రాబేలర్లు 15సీడ్‌కం ఫర్టిలైజర్ డ్రిల్ 01యాంత్రీకరణ పథకం కింద రైతులకు సబ్సిడీపై నిరంతరం పనిముట్లను పంపిణీ చేస్తాం. జిల్లాకు మంజూరైన 316 యూనిట్లకు గాను 177 యూనిట్లను ఎంపిక చేసిన రైతులకు ఎమ్మెల్యేల చేతుల మీద అందజేస్తాం. మిగిలిన యూనిట్లు కూడా త్వరలో పంపిణీ చేస్తాం. యాంత్రీకరణ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
విద్యార్థి దశ మహోన్నతమైనది
బొమ్మలరామారం : మానవ జీవితంలో విద్యార్థి దశ మహోన్నతమైనదని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బొమ్మలరామారం మండలం రంగాపూర్ గ్రామంలోని హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుతో కలసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తున్నారని అన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ అకాడమీ విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుకుంటున్నారని పేర్కొన్నారు. స్పష్టమైన లక్ష్యం లేకుండా చదివే విద్య వ్యర్ధమని, ప్రతి విద్యార్థి కఠోర దీక్షతో ముందుకెళ్లాలన్నారు. యువత పెడదారి పట్టకుండా మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. డిఫెన్స్ అకాడమీలో ఇంటర్ విద్యతో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ లాంటి ఉన్నత ఉద్యోగాలు సాధించేందకు ప్రత్యేక కోర్సులు, శిక్షణ అందించడం అభినందనీయన్నారు. రక్షణ రంగంలో ఉన్న అపారమైన అవకాశాలను విద్యార్థులు సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపేందుకు నిరంతరం శ్రమిస్తున్న అకాడమీ చైర్మన్ రాజ్‌కుమార్‌ను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు కృష్ణచైతన్యరెడ్డి, వంశీకృష్ణారెడ్డి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ కోరే రాజ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అకాడమీ ఎండీ నవ్య, మాజీ సైనిక బ్రిగెడార్ హిలగరి, మాజీ కల్నల్ డీకే దాస్, డీన్ ఆర్కే రావు, ప్రిన్సిపాల్ అంజయ్య, విద్యావేత్త బాల్‌నర్సింహ, శ్రీశైలం పాల్గొన్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ -
సూక్ష్మపోషకాల లోపాన్ని నివారిస్తే అధిక దిగుబడులు
త్రిపురారం : పంటల పెరుగుదలకు సూక్ష్మపోషకాల అవసరం ఎంతగానో ఉంటుంది. సూక్ష్మపోషకాల లోపం వలన నేలలు చౌడుగా మారి పంటల దిగుబడులపై ప్రభావం చూపుతుంది. రైతులు సాధ్యమైనంత మేర ఎరువులు వేసుకొని పంటలపై సూక్ష్మపోషకాల ప్రభావం లేకుండా చూసుకోవాలి. సరైన సమయంలో చర్యలు చేపడితే సూక్ష్మపోషకాల లోపాన్ని అధిగమించవచ్చని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచిస్తున్నారు. ఫ జింకు లోపం : జింకు లోపం ముఖ్యంగా వరి, మొక్కజొన్న, అపరాల్లో అధికంగా కనిపిస్తుంది. వరిలో జింక్ లోపం భాస్వరం ఎక్కువగా వేసిన పొలాలు, చౌడు నేలలు, మాగకుండా సేంద్రీయ పదార్థాలు అధికంగా వినియోగించిన పొలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపం వలన వరి నాటిన 2 నుంచి 4 వారాల్లో మొక్కపై నుంచి 3 లేదా 4 ఆకుల నడుమ ఈను తెల్లగా పాలిపోతుంది. ఆ తర్తా ఆకు కొనభాగం ఆకుపచ్చ రంగులోనే ఉండి ఆకు భాగంలో ముదురు ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్నిపార్లు ఏవిధమైన లోపాలు కనిపించకున్నా.. నత్రజని, భాస్వరం, తగినంత మోతాదులో వేసినప్పటికీ పైరు ఏపుగా పెరగదు. మొక్కజొన్నలో జింకు లోపం వల్ల లేత ఆకుల నడుమ ఈనెకు సమాంతరంగా తెలుపు లేదా పసుపు చారలు ఏర్పడి మొక్కలు గిడసబారిపోతాయి. లోపం తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు ఎరుపు రంగులోకి మారి మచ్చలు ఏర్పడతాయి. పప్పుధాన్యాల్లో జింకు లోపం వల్ల మొక్కలు గిడసబారిపోతాయి. లేత ఆకుపచ్చ మచ్చలు వచ్చి ఆకులు చిన్నవిగా మారి కనువులు దగ్గరగా ఉండి మొక్కల పెరుగుదల ఆలస్యంగా పెరుగుతుంది. ఫ నివారణ చర్యలు సాధారణ నేల్లో మూడు పంటలకు ఒకసారి.. కొత్తగా ఆయకట్టు కింద సాగుచేసే నేలల్లో, చౌడు, ఉప్ప నేలల్లో రెండు పంటలకు ఒకసారి ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్‌ను వేయాలి. పంటలో జింకు లోపం గమనిస్తే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింకు సల్ఫేట్‌ను కలిపి ఆకులు మొత్తం తడిసేలా ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని 2 నుంచి 3 సార్లు ఐదు రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. వరి పండించే నేలల్లో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ప్రతి పంటకు ముందు వేస్తే జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. ఫ ఇనుము లోపం : ఇనుము లోపం సున్నం అధికంగా ఉండే నేలల్లో లేదా సాగు నీటిలో కార్బోనేట్లు, బైకార్బోనేట్లు అధికంగా ఉండే సందర్భాల్లో కనిపిస్తుంది. ఇనుము లోపం వరిలో మెట్ట నారు మడుల్లో నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఆకుల ఈనెల మధ్యభాగం పత్రహరితాన్ని కోల్పోయి పసుపుగా మారుతాయి. లోపం తీవ్రమయ్యే కొద్ది ఆకు క్రమంగా పాలిపోయి తెల్లగా మారి ఎండిపోతాయి. ఇతర పంటల్లో కూడా ఇదే విధమైన లక్షణాలు లేత ఆకుల్లో కనిపించి మొక్క పెరుగుదల కుంటుపడుతుంది. నివారణ చర్యలు పంటల్లో ఇనుము లోపం గుర్తించినప్పుడు లీటరు నీటికి 10 గ్రాముల అన్నబేదిని ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి మొక్క మొత్తం తడిసేలా 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ఫ బోరాన్ లోపం : వరిలో బోరాన్ లోపం వల్ల లేత ఆకులు వంకర్లు తిరిగి ఎండిపోతాయి. నేలల్లో బోరాన్ ఎక్కువైనప్పుడు ఆకులపై చివరన మచ్చలు వచ్చి ఎండిపోతాయి. బోరాన్ లోప స్థాయి లేదా విషమ స్థాయి మధ్య వ్యత్యాసం తక్కువ కావున బోరాన్ లోపం నిర్ధారించిన తర్వాత మాత్రమే నేలలకు లేదా పంటలకు బోరాన్‌ను అందించాలి. పత్తి పండించే నేలల్లో కూడా బోరాన్ లోపం కనిపిస్తుంది. పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటల్లో బోరాన్ లోపం సర్వ సాధారణంగా ఉంటుంది. ఫ నివారణ చర్యలుబోరాన్ లోపం నివారణకు ఎకరాకు రెండు కిలోల బోరాక్స్‌ను ఆఖరి దుక్కిలో వేయడంతో పాటు రెండుసార్లు 0.15 శాతం బోరాక్స్‌ను 60 లేదా 90 రోజులకు పిచికారీ చేయాలి. పొద్దుతిరుగుడు పూవ్వులల్లో మధ్యభాగం గింజ కట్టదు. వేరుశనగలో గింజ మధ్యభాగం తోడుకోదు. ఈ లోపాన్ని నివారించడానికి 0.1 శాతం బోరిక్ ఆమ్లాన్ని ఒక లీటరు నీటికి కలిపి పంట వేసిన 30 నుంచి 45 రోజుల తర్వాత రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ ఎరువుల వినియోగించడం పెంచడం వల్ల భూమిలో సూక్ష్మపోషకాల లోపాన్ని అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. నేలలోనే కాకుండా పంటపై కూడా లోపాలను సరిచేసుకోవచ్చు. రసాయనిక ఎరువులు మోతాదుకు మించి ఉపఝెగించడం వల్ల భూమిలో సారం తగ్గిపోతుందని రైతులు గమనించాలి. ఫ కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచనలు -
భారత ఆర్థిక వ్యవస్థను మార్చడం సవాల్‌తో కూడినది
రామగిరి(నల్లగొండ): భారత ఆర్థిక వ్యవస్థను 40 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం సవాల్‌తో కూడినదని హైదరాబాద్‌లోని ఐసీఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధాకర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీలో సోషల్ సైన్స్ ఆధ్వర్యంలో ఐసీఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఆర్సీ, పీఎం ఉషా ఆర్థిక సహకారంతో ‘వికసిత్ భారత్–2047 స్ట్రాటజీస్ అండ్ ఛాలెంజెస్’ అనే అంశంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సులో వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధనా వ్యాసాలు సమర్పించారు. అనంతరం సావనీర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీయూ ప్రొఫెసర్ సీహెచ్. కృష్ణారెడ్డి, అంబేద్కర్ యూనివర్సిటీ అడిషనల్ సీఓఈ కె. కృష్ణారెడ్డి, మునుస్వామి. మల్లేశం, బట్టు కిరీటం, నర్సింగ్ కోటయ్య, వైస్ ప్రిన్సిపాల్ అంతటి శ్రీనివాస్, అకాడమిక్ కో ఆర్డినేటర్ బి. నాగరాజు, జ్యోత్స్న, హబీబ్, దినేష్, అంకుష్, నాగరాజు, హస్రత్ బేగం తదితరులు పాల్గొన్నారు. -
బీసీలను పాలకులుగా నిలబెడతాం
యాదగిరిగుట్ట: బీసీల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో బీసీలను పాలకులుగా నిలబెట్టాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో మన ఆలోచన సాధన సమితి(మాస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జనాభా ధామాషా ప్రకారం బీసీలకు వాటా దక్కించుకోవడం, రాజకీయ అధికారం అంతిమ లక్ష్యంగా శిబిరాలు నడుస్తున్నాయన్నారు. తెలంగాణలో గ్రామస్థాయి నుంచి పట్టణస్థాయి వరకు బీసీ నాయకులను తయారు చేయడమే లక్ష్యంగా మాస్ ముందుకు కదులుతుందన్నారు. మెజార్టీ ప్రజలకు రావాల్సిన రాజ్యాధికారం అందకుండా పోతుందని, పాలకులుగా కావాల్సిన వారు పాలితులుగానే ఉంటున్నారన్నారు. బీసీలంతా సైనికులుగా తయారై రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలన్నారు. రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీ ఉద్యమం తీవ్రమైతుందని అన్నారు. దానిని ఆపటం ఎవరితరం కాదని పేర్కొన్నారు. బీసీ ఉద్యమాన్ని నిర్మాణాత్మకంగా నడిపించేందుకు బీసీలందరూ ఒక్కతాటి పైకి తీసుకురావాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. నిజంగా కాంగ్రెస్‌కు బీసీలపై ప్రేమ ఉంటే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలకు బీసీలంటే చిత్తశుద్ధి లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగరావు, గౌరవ అధ్యక్షుడు గడ్డం నర్సింహగౌడ్, పూస నర్సింహా బెస్త, సలహా మండలి సభ్యుడు తడక యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్ల ఆంజనేయులుగౌడ్, పంతంగి విట్టలయ్యగౌడ్, అధికార ప్రతినిధులు మంగిళిపల్లి శంకర్ గంగపుత్ర, ఆవుల వెంకట్‌యాదవ్, సంగెం రమేశ్వర్ నేత, కోరంగి దుర్గారాణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బచ్చనబోయిన శ్రీనివాసులు, గోద మల్లికార్జున్‌గౌడ్, రాష్ట్ర కార్యదర్శి గునిగంటి చంద్రశేఖర్‌గౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శులు పెద్దవురా బ్రహ్మయ్య రజక, కొంపోజు నరహరిచారి, జక్కుల బాలరాజు యాదవ్, శ్రీకాంత్ గంగపుత్ర, నక్క కాాశినాథ్, చుక్కల సత్యనారాయణ, పవన్‌కుమార్, మరోజు రాజుచారి, నిమ్మల సత్యం, పెండం లక్ష్మణ్, వడ్డేపల్లి దశరథ సాగర్, కై రంకొండ నర్సింగ్, తిప్పరి లింబాద్రి, మురళీచారి, దశరథ్ రజక, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ -
హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు : మంత్రి
చిట్యాల: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగకు వెళ్లే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. చిట్యాల పట్టణంలో హైవేపై జరుగుతున్న ఫ్లైఓవర్ పనులను గురువారం కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, హైవే పీడీ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిట్యాల పట్టణంలో హైవేపై జరుగుతున్న పనులను నిలిపివేసి, జాతీయ రహదారిపై తాత్కాలిక మరమ్మతులు చేసి వాహనాలు ఆగకుండా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు. ఎన్‌హెచ్–65ను 8 లైన్లుగా మార్చేందుకు డీపీఆర్ సిద్ధం చేశామని, మార్చిలో టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. ప్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు గ్రీన్ ఫీల్ట్ హైవే రహదారిని నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆయన వెంట డీటీసీ వాణి, చిట్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీనర్సింహ, జడల చినమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
మద్యం షాపు ఎదుట విద్యార్థుల ధర్నా
పెద్దఅడిశర్లపల్లి : నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలో పాఠశాలకు సమీపంలో ఉన్న మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం పాఠశాల విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మద్యం షాపు ఎదుట ధర్నా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను వెంటనే మరో చోటుకు తరలించాలన్నారు. ఈ ధర్నాలో విద్యార్థులతో పాటు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొర్ర రాంసింగ్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, పలువురు సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. ఫ పాఠశాల సమీపంలో నుంచి తొలగించాలని డిమాండ్ -
మొదలైన సంక్రాంతి రద్దీ
కోదాడరూరల్ : సంక్రాంతికి వారం రోజులు ముందు నుంచే ఏపీ వైపు వాహనాల రద్దీ మొదలైంది. గురువారం హైదరాబాద్–విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. కోదాడ మండలం కొమరబండ వై జంక్షన్ నుంచి రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్‌రోడ్ వరకు క్రాసింగ్‌ల వద్ద పోలీసులు ఇప్పటికే బారికేడ్లను ఏర్పాటు చేశారు. కోదాడలోని కట్టకమ్ముగూడెం క్రాసింగ్‌ను మూసివేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న కొమరబండ వైజంక్షన్, రామాపురం క్రాస్‌రోడ్ వద్ద ట్రాఫిక్‌జామ్ అవుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
సూర్యాపేటటౌన్ : ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని జాకీర్‌హుస్సేన్ నగర్‌కు చెందిన ధరావత్ చాంప్లా(50) కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. బుధవారం సాయంత్రం కొత్త వ్యవసాయ మార్కెట్లో చెట్టుకు తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం మృతుడి కుమారుడు రాహుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. చెట్టుపై నుంచి పడి వ్యక్తి దుర్మరణంపెన్పహాడ్ : చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలం మాచారం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్ మండల కేంద్రానికి చెందిన దాసరి కోటయ్య(50) దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మచారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో చెట్టు కొమ్మలను మిషన్‌తో తొలగిస్తుండగా.. ప్రమాదశాత్తు జారి కిందపడి తీవ్రంగా గాపడ్డాడు. స్థానికులు 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాదాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య విజయతో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. చికిత్స పొందుతూ నవజాత శిశువు మృతిభువనగిరి(బీబీనగర్): బీబీనగర్ మండలం పడమటిసోమారం మంలోని లింగ బసవేశ్వరస్వామి దేవాలయం వద్ద ఈ నెల 6న గుర్తుతెలియని మహిళ నవజాత ఆడ శివువును వదిలి వెళ్లగా.. గ్రామస్తులు గుర్తించి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం శిశువు మృతి చెందింది. శిశువు చలిలో ఉండటం వల్ల హార్ట్‌బీట్, శరీర ఉష్ణోగ్రత తగ్గిందని, సీపీఆర్ చేసినప్పటికీ శిశువు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారని జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు గురువారం చెప్పారు. జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికమోత్కూరు : మహారాష్ట్రలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఆత్మకూరు (ఎం) మండలం కొరటికల్ గ్రామానికి చెందిన సీహెచ్. శ్రవణ్‌కుమార్, మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మనోజ్ ఎంపికయ్యారు. వరంగల్ జిల్లాలో జరిగిన 44వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో వారు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు షూటింగ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోత్కూరు యాదయ్య గురువారం పేర్కొన్నారు. హాకీ పోటీలకు ఎంపికై న రామన్నపేట విద్యార్థిరామన్నపేట : తమిళనాడులో ఈనెల 12 నుంచి జరిగే విశ్వవిద్యాలయాల జాతీయస్థాయి హాకీ పోటీల్లో రామన్నపేట డిగ్రీ కళాశాలకు చెందిన నోముల సాయికుమార్ పాల్గొననున్నాడు. గురువారం జరిగిన ఎంపిక ప్రక్రియలో సాయికుమార్ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జట్టుకు ఎంపికయ్యాడు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ జట్టు తరఫున సాయికుమార్ బరిలో దిగనున్నాడు. -
జీవాలకు అమ్మతల్లి టీకాలు
నల్లగొండ అగ్రికల్చర్ : గొర్రెలు, మేకల్లో చలికాలంలో వ్యాప్తి చెందే అమ్మతల్లి రోగాన్ని నివారించేందుకు జిల్లా పశువైద్య సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గురువారం నుంచి 22వ తేదీ వరకు రోగ నిరోదక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.దీ ఒక్కసారి టీకాలు వేస్తే జీవాలలో మూడు సంవత్సరాల వరకు వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. మూడు నెలల నిండిన పిల్లల నుంచి టీకాలు వేయనున్నారు. జీవాల సంఖ్యలో మూడోవంతు జీవాలకు టీకాలను వేయడానికి జిల్లా పశువైద్య సంవర్థక శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 10 లక్షల వరకు గొర్రెలు, 3 లక్షల వరకు మేకలు ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. వీటన్నింటిని రోగ నిరోధక టీకాలను వేయడానికి గాను 78 బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు ఉదయం 8 గంటలకు గ్రామాలకు చేరుకుని పెంపకందారులకు మందల వద్దకు చేరుకుని జీవాలకు టీకాలను వేయనున్నారు. ఇప్పటికే టీకాలు జిల్లాకు చేరుకోవడంతో వాటిని ఆయా మండల పశువైద్యశాలలకు పంపిణీ చేశారు. వ్యాధి లక్షణాలు... వ్యాధి సోకిన గొర్రెల, మేకల్లో జ్వరం 104 నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది. మేత తినవు, నీరసంగా ఉంటాయి. కళ్ల నుంచి నీరు కారడం, పెదవులు, నోరు వాపుగా ఉంటుంది. చర్మంపై ఎర్రమచ్చలు, చర్మగట్టి పడడం, నీటి బుడగలు ఏర్పడడం, చీము బుడగలు ఏర్పడుతాయి. నోరు, ముక్కు, కళ్లచుట్టూ, వృషణాలు, తొడల లోపల, వెంట్రుకలు లేని ప్రదేశాల్లో పైవన్నీ ఏర్పడుతాయి. వ్యాధి తీవ్రతను బట్టి మరణాలు కూడా సంభవిస్తాయి. లక్షణాలు, పాక్స్ గడ్డల ఆధారంగా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. ఫ నేటి నుంచి వ్యాక్సినేషన్ -
స్వర్ణగిరిలో ముగిసిన ఉత్తర ద్వార దర్శనం
భువనగిరి : భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30న ప్రారంభమైన ఉత్తర ద్వారం దర్శనం గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ, సహస్రనామార్చన, సుదర్శన నరసింహ హవనం, ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆండాళ్ అమ్మవారికి పంచామృతాభిషేకం, తిరుప్పావడ సేవ, నిత్య కల్యాణోత్సవం, సాయంత్రం ఆలయ మాడ వీధుల్లో స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవ వైభవంగా నిర్వహించారు. ఆయా పూజా కార్యక్రమాల్లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మురళీకృష్ణ, గోపికృష్ణతో పాటు ప్రధాన అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
డాక్టర్ల నిర్లక్ష్యంతోనే రాజేష్ మృతి చెందాడు
సూర్యాపేట : డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే కర్ల రాజేష్ మృతిచెందాడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. బుధవారం మంద కృష్ణమాదిగ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించి సూపరింటెండెంట్‌తో కలిసి పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం నవంబర్ 15న కర్ల రాజేష్‌కు అందించిన వైద్యం గురించిన వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజేష్ అందించిన వైద్యంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద వర్గాలకు వైద్యం కానీ, చట్టం కానీ సమానంగా ఉండే పరిస్థితి లేదని, దళిత యువకుడు రాజేష్ మృతికి పోలీసుల చిత్రహింసలు, డాక్టర్ల నిర్లక్ష్యమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి ఎలాంటి స్పందనలేదని, వారు బాధ్యత వహించి కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో మొదటి ముద్దాయి అయిన చిలుకూరు ఎస్ఐ సురేష్‌రెడ్డిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చింతలపాటి చినశ్రీరాములు మాదిగ, రాజన్న మాదిగ, చింత వినయ్ మాదిగ, డప్పు మల్లయ్య మాదిగ, మందుల శ్రీనివాస్ మాదిగ, బోడ సునీల్ మాదిగ, బొజ్జ సైదులు మాదిగ, ములకలపల్లి రవి మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
నత్తనడకన అండర్‌పాస్‌ల నిర్మాణం
ఫ తూప్రాన్‌పేట నుంచి రెడ్డిబావి వరకు అన్ని జంక్షన్లను పోలీసులు నియంత్రణలోకి తీసుకుని ఇష్టానుసారంగా వాహనాలు హైవే పైకి వెళ్లకుండా చేస్తే వాహనాల రద్దీని నియంత్రించవచ్చు. ఫ సర్వీస్ రోడ్లు, అండర్‌పాస్‌లు ఉన్న గ్రామాల్లో జంక్షన్లను మూసివేయాలి. ఫ చౌటుప్పల్‌లోని తహసీల్దార్ కార్యాలయం ముందున్న దర్గా వద్ద రాంగ్రూట్లో వాహనాల రాకపోకలు ఆపేయాలి. ఫ స్థానికులు ఫుట్ఓవర్ బ్రిడ్జిల మీదుగా హైవే దాటేలా చూడాలి. ఫ హైవేకు, సర్వీస్ రోడ్డుకు మధ్యన బారికేడ్లు ఏర్పాటు చేయాలి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి మీదుగా ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి వాహనాలు బారులుదీరుతాయి. ప్రస్తుతం ఈ హైవేపై చౌటుప్పల్, చిట్యాల పట్టణ కేంద్రాల్లో చేపట్టిన అండర్‌పాస్ బ్రిడ్జిల నిర్మాణం నత్తనడకన సాగుతుండడంతో ఈ ఏడాది సమస్య మరింత జఠిలంగా మారే అవకాశాలు ఉన్నాయి. చౌటుప్పల్, చిట్యాల : హైవేపై చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో గతేడాది జూలైలో అండర్‌పాస్ బ్రిడ్జి పనులు చేపట్టారు. వాహనాలను మళ్లించేందుకు నవోదయ టాకీస్ నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి బీఈడీ కళాశాల వరకు ఇరువైపులా సర్వీస్ రోడ్ల విస్తరణ పనులు మొదలుపెట్టారు. ఏడాదిన్నర అవుతున్నా 40శాతం కూడా పనులు పూర్తవ్వలేదు. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు వాహనాలను సర్వీస్ రోడ్ల మీదుగా మళ్లించే అవకాశాలు ఉండగా.. ఇప్పటికే సర్వీస్ రోడ్లు విస్తరణ కోసం చేపట్టిన తవ్వకాలతో అస్తవ్యస్తంగా ఉన్నాయి. అదే రోడ్ల మీదుగా వాహనాలను పంపిస్తే మాత్రం ట్రాఫిక్ జాం అయ్యే అవకాశం ఉంది. ప్రమాదకరంగా రోడ్డు అంచులు సర్వీస్ రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో హైవేకు, సర్వీస్ రోడ్డుకు మధ్యన ఉన్న ఇనుప గ్రిల్స్‌ను తొలగించారు. సర్వీస్ రోడ్డుతో పోలిస్తే హైవే ఒకటి నుంచి రెండు ఫీట్ల ఎత్తులో ఉంది. వాహనదారులు ఏమాత్రం రోడ్డు చివరకు వెళ్లినా సర్వీస్ రోడ్డులోకి వాహనం బోల్తా పడే అవకాశం ఉంది. చిట్యాలలోనూ నెమ్మదిగా.. చిట్యాల పట్టణంలోనూ పాల శీతలీకరణ కేంద్రం నుంచి ఎస్బీఐ వరకు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. ఇప్పటి వరకు 30 శాతం పనులు మాత్రమే జరిగాయి. అదేవిధంగా పెద్దకాపర్తి వద్ద కూడా అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాలేదు. దీంతో సర్వీస్ రోడ్డు గుండా వెళ్లే వాహనాదారులకు ఇబ్బందులు ఏర్పడి ట్రాఫిక్ జాం అవుతోంది. చిట్యాల పట్టణంలో ఫ్లైఓవర్ పనుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను సర్వీస్ రోడ్డు మీదుగా విజయవాడ వైపు పంపిస్తున్నారు. దీంతో దుమ్ము, ధూళితో సర్వీస్ రోడ్డులోని దుకాణాదారులతో పాటు దిచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ● చిట్యాల పట్టణంలోని రైల్వే అండర్‌పాస్ వద్ద రోడ్డు దెబ్బతినటంతో పాటు నీరు ఉబికి వస్తుంది. ● చిట్యాల నుంచి ఆటోనగర్, ఉరుమడ్ల రోడ్డు నుంచి బస్టాండ్‌కు వచ్చేందుకు స్థానికులు రాంగ్రూట్లో రాకపోకలు కొనసాగిస్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ● చిట్యాల మండల పరిధిలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పలు చోట్ల ధ్వంసమైంది. ● హైవేకి ఇరువైపులా హోటల్స్, దాబాలు, టిఫిన్ సెంటర్లు టీ పాయింట్లు ఉండగా.. అక్కడ ఆగిన వాహనదారులు ఒక్కసారిగా హైవే మీదకు వస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ● హైవేపై ఎక్కడ పడితే అక్కడ భారీ వాహనాలను నిలిపి డ్రైవర్లు విశ్రాంతి తీసుకుంటుండడంతో అజాగ్రత్తగా వచ్చే వాహనదారులు వాటిని ఢీకొంటున్నారు. ● ప్రమాదాల నివారణకు, పండుగ రద్దీని నియంత్రించేందుకు చిట్యాల, పెద్దకాపర్తి వద్ద ప్రత్యేక పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపారు. చౌటుప్పల్ : బస్టాండ్ ఎదుట ప్రమాదకరంగా హైదరాబాద్–విజయవాడ హైవే అంచుచౌటుప్పల్ : వ్యవసాయ మార్కెట్ వద్ద అసంపూర్తిగా సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు చిట్యాల : సర్వీస్ రోడ్డులో ఎదురెదురుగా వెళ్తున్న వాహనాలుఫ విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై తరచూ ట్రాఫిక్ జాంతో వాహనాల బారులు ఫ సంక్రాంతికి వెళ్లే నగరవాసులకు తప్పని తిప్పలు -
జాతీయ మహిళా సదస్సులో పాల్గొన్న తుమ్మడం సర్పంచ్
నిడమనూరు : మహారాష్ట్రలోని పుణేలో జరుగుతున్న మహిళా స్నేహపూర్వక పంచాయతీల జాతీయ సదస్సులో గురువారం నిడమనూరు మండలం తుమ్మడం గ్రామ సర్పంచ్ బుర్రి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సు విశేషాలను ఆయన విలేకరులతో పంచుకున్నారు. గ్రామ పంచాయతీల్లో మహిళలకు కల్పిస్తున్న అవకాశాలపై 2024–25 సంవత్సరానికి గాను ఉత్తమ గ్రామ పంచాయతీగా తుమ్మడం గ్రామ పంచాయతీ ఎన్నికై ందని, దీంతో కొత్తగా సర్పంచ్‌గా ఎన్నికై న తనకు పుణేలో నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొనాలని ఆహ్వానం అందడంతో అక్కడకు వెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా నలుగురు సర్పంచులు, నలుగురు ఎంపీడీఓలు, స్థానిక సంస్థల స్పెషల్ సెక్రటరీ జాన్ వెస్లీ ఈ సదస్సుకు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. -
ట్రాన్స్‌కో, డిస్కమ్ ఇంటర్ సర్కిల్ క్రీడలు ప్రారంభం
నల్లగొండ : నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని మేకల అభివనవ్ స్టేడియంలో బుధవారం తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కమ్ ఇంటర్ సర్కిల్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 9వ తేదీ వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఏడీఈ స్పోర్ట్స్ జనరల్ సెక్రటరీ తిరుగుడు శ్రీనివాస్, స్పోర్ట్స్ ఆఫీసర్ నీలం జగన్నాథ్ తెలిపారు. వాలీబాల్ పోటీలకు 12 టీమ్‌లు, ఫుట్‌బాల్‌కు 8, క్యారమ్స్కు 12 టీమ్‌లు వివిధ సర్కిళ్ల నుంచి వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈటీ రాజునాయక్, ఏడీఈ నరేందర్‌రావు, అంజల్‌రావు, సలీం, ఫరూక్, బాలు, ఎన్వీ రావు పాల్గొన్నారు. -
ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏటీసీల ఏర్పాటు
హుజూర్నగర్ : యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్సాలజీ సెంటర్స్‌ను(ఏటీసీ) ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ఐటీఐ కళాశాల పనులను బుధవారం మంత్రి పర్యవేక్షించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఏటీసీల ద్వారా అందించే శిక్షణలో ఆటోమేషన్, రోబోటిక్స్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, 3డీ లేజర్ ప్రింటింగ్, మ్యానుఫ్యాక్షరింగ్ ప్రాసెసింగ్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, సీఎస్సీ మిషన్ టెక్నీషియన్ లాంటి ఆధునిక కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో 172 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారని, వారందరికీ శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఐటీఐ కళాశాల భవన నిర్మాణంలో నాణ్యత పాటిస్తూ పనులు వేగవంతంగా పూర్తి చేసి జూన్ నాటికి తరగతులు నిర్వహించేలా చూడాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అదేవిధంగా హుజూర్నగర్ పట్టణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆర్‌ఆండ్‌బీ గెస్ట్ హౌస్, షాపింగ్ కాంప్లెక్స్, నీటిపారుదల శాఖ కార్యాలయం పనులను కూడా మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన లబ్ధిదారులకు హుజూర్నగర్ మండల పరిషత్ కార్యాలయంలో రూ.1.71 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఆయన వెంట మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఏటీసీ ప్రిన్సిపాల్ శ్రీరాంరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రాధికాఅరుణ్కుమార్ దేశ్‌ముఖ్, ఆర్అండ్బీ ఈఈ సీతరామయ్య, ఇరిగేషన్ ఈఈ నాగభూషణం, డీఈ రమేష్, తహసీల్ధార్లు, ఎంపీడీఓలు, సర్పంచులు తదితరులు ఉన్నారు. ఫ భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
రాష్ట్రపతి భవన్లో నృత్య ప్రదర్శనకు ఎంపిక
భూదాన్‌పోచంపల్లి : హైదరాబాద్‌లోని బొల్లారంలో గల రాష్ట్రపతి భవన్‌కు శీతాకాల విడిదిలో భాగంగా త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో ఆమె ముందు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు పోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన కుమారి బడుగు నిఖితకు అవకాశం లభించింది. బుధవారం లిఖిత రాష్ట్రపతి భవన్లో రిహార్సల్స్‌లో పాల్గొందని, ఆమె నృత్య ప్రదర్శనను ఢిల్లీ నుంచి వచ్చిన రాష్ట్రపతి భవన్ అధికారులు చూసి ప్రశంసించినట్లు తండ్రి శివశంకర్ తెలిపారు. గతంలో బడుగు నిఖిత అనేక వేదికల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చి ప్రముఖులచే ప్రశంసలు పొందింది. -
సెమినార్లను సద్వినియోగం చేసుకోవాలి
ఫ ఎంజీయూ వైస్ చాన్స్‌లర్ అల్తాఫ్ హుస్సేన్రామగిరి(నల్లగొండ) : సెమినార్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ‘న్యూ విస్టాస్ ఆఫ్ కెమిస్ట్రీ– యాన్ ఇంటర్‌డిసిప్లినరీ అప్రోచ్’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సెమినార్ బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎంజీయూ వీసీ హాజరై మాట్లాడారు. అనంతరం విశిష్ట అతిథి ప్రొఫెసర్ జి. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కెమిస్ట్రీలో మంచి పరిశోధనలకు అవకాశం ఉందని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దక్షిణాఆఫ్రికాలోని క్వా జులు యూనివర్సిటీ ప్రొఫెసర్ జొన్నలగడ్డ శ్రీకాంత్, వీరారెడ్డి, ఎన్. రవికుమార్‌రెడ్డి. ఏ. వసంత, వెంకటకృష్ణ, కె. మంజుల, ఏ. దయానంద్, కె. రవికుమార్, కె. నరేష్, పి. ఉపేంద్ర, బొజ్జ అనిల్, ఎం. అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ మృతి
కొండమల్లేపల్లి : బురద పొలంలో దిగబడిన ట్రాక్టర్ టైర్లను సరిచేస్తుండగా కిందపడి తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండలం చెన్నంనేనిపల్లి గ్రామానికి చెందిన బాషిపాక శివ(20) ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మూడు రోజుల క్రితం ట్రాక్టర్‌పై వర్ధమానిగూడెం గ్రామానికి వెళ్తుండగా.. బురదలో ట్రాక్టర్ దిగబడింది. ఈ క్రమంలో శివ ట్రాక్టర్ టైర్లను సరిచేస్తుండగా అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం శివను హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. అత్యాచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదుతిప్పర్తి : మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తిపై తిప్పర్తి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన ఓ మహిళ తన భూమి పంచాయితీని పరిష్కరించాలని మునుగోడుకు చెందిన ఓ వ్యక్తిని కోరింది. పెద్దమనిషిగా ఉన్న ఆ వ్యక్తి భూ సమస్య పరిష్కరిస్తానని నమ్మించి బుధవారం దుప్పలపల్లి వద్ద గల ఎఫ్‌సీఐ గోదాముల వెనుకకు తీసుకెళ్లి కత్తితో బెదిరించి తనపై అత్యాచారం చేశాడని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు. నకిలీ సరుకులు విక్రయిస్తున్న వ్యక్తిపై.. హుజూర్నగర్ : నకిలీ సరుకులు విక్రయిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిర్యాలగూడకు చెందిన జైయిని సత్యేందర్ హుజూర్నగర్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఏరియల్, టైడ్ కంపెనీకి చెందిన నకిలీ సరుకులు అమ్ముతున్నాడని డిస్ట్రిబ్యూటర్ బచ్చు రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం ఎస్ఐ బండి మోహన్‌బాబు తెలిపారు. లారీ బీభత్సంఫ మద్యం మత్తులో రోడ్డు వెంట స్తంభాలను ఢీకొట్టిన డ్రైవర్ మోత్కూరు : మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో బుధవారం లారీ బీభత్సం సృష్టించింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేషన్ బియ్యం లోడుతో వెళ్తున్న లారీని డ్రైవర్ మద్యం మత్తులో అజాగ్రత్తగా నడుపుతూ పాలడుగు గ్రామ స్టేజీ వద్ద ప్రధాన రహదారి వెంట ఉన్న బారికేడ్లు, సోలార్ లైట్ల స్తంభాలను ఢీకొట్టాడు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో బారికేడ్లు, సోలార్ లైట్ల స్తంభాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు లారీ డ్రైవర్ రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సి. వెంకటేశ్వర్లు తెలిపారు. -
వైభవంగా స్వర్ణగిరీశుడి తిరువీధి ఉత్సవ సేవ
భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం రాత్రి స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ, సహస్రనామార్చన, నిత్య కల్యాణం, అష్టదళ పాదపద్మార్చన చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా పూజా కార్యక్రమాల్లో ఆలయ వ్యవస్థాఽపక ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మురళీకృష్ణ, గోపికృష్ణ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
తాత నుంచే స్ఫూర్తి పొందాను
ఫ కేరళ రాష్ట్ర డీజీపీగా ఆయన చేసిన సేవలు నాకు ఆదర్శం ఫ స్వతహాగా ప్రిపేరై గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపికయ్యాను ఫ పోచంపల్లి మున్సిపాలిటీ ట్రైనీ కమిషనర్ అన్నంబొట్ల లలిత శ్రావణి భూదాన్‌పోచంపల్లి : రిటైర్డ్ డీజీపీ అయిన తన తాత నుంచి స్ఫూర్తి పొంది గ్రూప్–1 ఉద్యోగం సాధించినట్లు పోచంపల్లి మున్సిపాలిటీ ట్రైనీ కమిషనర్ అన్నంబొట్ల లలిత శ్రావణి తెలిపారు. తాత చేసిన సేవలు, ప్రజలచే ఆయన పొందిన మన్ననలను చూసి డిగ్రీ పూర్తవ్వగానే గ్రూప్–1 సాధించి గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికై నట్లు ఆమె పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా గత వారం రోజులుగా పోచంపల్లి మున్సిపల్ కార్యాలయంలో పరిపాలన అంశాలను అధ్యయనం చేస్తున్న ఆమె.. తాను విజేతగా నిలవడానికి పడిన కష్టం గురించి సాక్షికి వివరించింది.మాది హైదరాబాద్‌లోని మలక్‌పేట. మా నాన్న వెంకట్రామ్మోహన్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్, అమ్మ లక్ష్మి గృహిణి. మేము ఇద్దరం సంతానం. తమ్ముడు ఎంఎస్ చేసి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. నేను చిన్నప్పటి నుంచి చదువులో ఫస్టే. గౌతమ్ మోడల్ స్కూల్లో ఎస్సెస్సీ(10/10 జీపీఏ), దిల్‌సుఖ్‌నగర్‌లోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ (972/1000) పూర్తి చేశాను. ఆ తర్వాత ఎంసెట్, జేఈఈ వైపు వెళ్లకుండా కోఠి ఉమెన్స్ కాలేజీలో చేరి 2019లో బీఏ డిగ్రీ పూర్తి చేశాను. మా తాత బలిజపల్లి శంకర్శాస్త్రి కేరళ రాష్ట్ర రిటైర్డ్ డీజీపీ. ఆయన తన సర్వీసులో చేసిన సేవలు, పొందిన అవార్డులు, ప్రజలచే పొందిన ప్రసంశలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. నేను కూడా ఆయన లాగే ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రజాసేవ చేయాలని ఇంటర్లో ఉండగానే నిశ్చయించుకున్నాను. డిగ్రీ అయిపోగానే యూపీఏస్సీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాను. ఈలోగా 2022లో టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో దానికి దరఖాస్తు చేసి ప్రిలిమ్స్ పాసయ్యాను. మెయిన్స్ సమయంలో పేపర్ లీక్ అయ్యిందనే కారణంతో ఆ నోటిఫికేషన్ రద్దయ్యింది. ఆ తర్వాత మళ్లీ నోటిఫికేషన్ వేశారు. కానీ కొందరు కోర్టుకు వెళ్లడంతో మళ్లీ ఆగిపోయింది. మూడోసారి గ్రూప్–1 నోటిఫికేషన్ వచ్చింది. ఎటువంటి కోచింగ్‌కు వెళ్లకుండా స్వతహాగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే ఏడాది పాటు ప్రిపేర్ అయ్యాను. ప్రిపరేషన్ సమయంలో శుభకార్యాలు, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండి మొదటి ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయిలో 151వ ర్యాంకు సాధించి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగానికి ఎంపికయ్యాను. నేను కష్టపడ్డ తీరు చూసి ఏదో ఒక జాబ్ కొడతా అని నా తల్లిదండ్రులకు చాలా నమ్మకం ఉండేది. వారి విశ్వాసాన్ని నిలబెట్టాను. ప్రజలకు నేరుగా సేవ చేసే ఉద్యోగం వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. విజయం సాధించాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. అనవసర విషయాలు వదిలేసి లక్ష్యం వైపు దృష్టిపెడితే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. అంతర్జాతీయంగా పేరున్న పోచంపల్లి మున్సిపాలిటీకి ట్రైనీ మున్సిపల్ కమిషనర్‌గా రావడం అదృష్టంగా భావిస్తున్నా. భూదానోద్యమ చరిత్ర, ఇక్కత్ చేనేత వస్త్రాలు, చేనేత కళాకారుల గొప్పదనం, కుల వృత్తులు ఇలా పోచంపల్లిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. -
కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి
అడ్డగూడూరు: విద్యార్థులు కష్టపడికాకుండా ఇష్టపడి చదవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. అడ్డగూడూరు మండలం కోటమర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థుల పరీక్షల సన్నద్ధతకోసం నేస్తం ఫౌండేషన్ ప్రతినిధులు పాశం అంజనేయులు, పాశం కృష్ణమూర్తి, పాశం నరసిహస్వామి ఆధ్వర్యంలో ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. దీనికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. కోటమర్తి పాఠశాలను చూస్తుంటే తాను చదువుకున్న బేతవోలు పాఠశాలతో పాటు తన బాల్యాన్ని గుర్తు చేసిందన్నారు. 10వ తరగతి జీవితంలో కీలక మలుపు అని ఇది భవిష్యత్‌కు మైలురాయిగా మారాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివినవారే జీవితంలో మంచి నాయకులుగా, ఉన్నతవిద్యావంతులుగా ఎదుగుతారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10 వ తరగతి విద్యార్థులకు రీడింగ్ చైర్స్, ప్యాడ్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో టాప్‌లో నిలిచినవారికి జూన్2న 200 సైకిళ్లను అందజేస్తాయడంతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానిస్తామన్నారు. డీఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కృషిచేయాలన్నారు. పాఠశాల ప్రహరీ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, గ్రామంలో శ్మశానవాటికకు సీసీ రోడ్డు మంజూరు చేయాలని కలెక్టర్‌ను సర్పంచ్ విష్ణువర్ధన్‌రావు కోరారు. స్పందించిన కలెక్టర్ ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీఇచ్చారు. ఈకార్యక్రమంలో మండల విద్యాధికారిణి సబిత, ఎంపీడీఓ శంకరయ్య, ఎంపీఓ ప్రేమలత, ఆర్ఐ ఉంపేదర్, కోటమర్తి పాఠశాల హెచ్ఎం రాజవర్ధన్‌రెడ్డి, ఎంపీపీఎస్ హెచ్ఎం వెంకటయ్య, చుక్క వెంకటయ్య, ఉపసర్పంచ్ కుంభం శ్రీశైలం, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ పద్మ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.ఫ టెన్త్ విద్యార్థుల ప్రేరణ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు -
యాదగిరీశుడి సన్నిధిలో నిత్య కల్యాణ వేడుక
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం నిత్య కల్యాణ వేడుకను ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలను భక్తులతో జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక గ్రీవెన్స్‌కు 80 అర్జీలుభువనగిరిటౌన్ : కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణికి 80 అర్జీలు వచ్చాయి. వీటిని కలెక్టర్ స్వీకరించారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించారు. దీర్ఘకాలంగా ధరణిలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు సంబంధించిన ఫైల్స్ క్లియర్ చేశారు. బొమ్మలరామారం మండలం మర్యాలలో సమాధులకోసం కొందరు భూమి కబ్జాచేశారని బాధితులు వినతిపత్రం ఇచ్చారు. వెంటనే తహసీల్దార్‌కు కలెక్టర్ ఫోన్ చేశారు. కబ్జాచేసిన స్థలం వెంటనే తిరిగి ఇవ్వాలని ఆదేశించారు. భువనగిరిలో బీజేపీ విజయం ఖాయంభువనగిరి: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ విజయం ఖాయనమి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. గురువారం భువనగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, కాసం వెంకటేశ్వర్లు, పోతంశెట్టి రవీందర్, పడాల శ్రీనివాస్, దాసరి మల్లేశం, పడమటి జగన్మోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్, పాశం భాస్కర్, చందా మహేందర్ గుప్తా, సుర్వి శ్రీనివాస్, చందుపట్ల వెంకటేశ్వర్రావు, మహమూద్,మేడి కోటేష్, రత్నపురం బలరాం పాల్గొన్నారు. యాదాద్రి జిల్లా నుంచే నిర్వహించాలి మోత్కూరు: అడ్డగూడూరు, మోత్కూరు మండలాల బీజేపీ కార్యక్రమాలను యాదాద్రి జిల్లా నుంచే నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సూచించారు. సూర్యాపేట జిల్లా నుంచి పార్టీ కార్యక్రమాలు నిర్విహిస్తేు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నాయకులు గురువారం భువనగిరిలో ఆయన దృష్టికితేవడంతో ఈ సూచన చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో నాయకులు గుజ్జ సోమనర్సయ్య, తుమ్మల మురళీధర్‌రెడ్డి, పోచం సోమయ్య, ఏనుగు జితేందర్‌రెడ్డి, గూదె మధుసూదన్ యాదవ్, ననుబోతు సైదులు యాదవ్ తదితరులు ఉన్నారు. -
12న తుది ఓటరు జాబితా
భూదాన్‌పోచంపల్లి: మున్సిపల్ ఎన్నికల తుది ఓటరు జాబితాను ఈనెల 12న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచురించాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. గురువారం సాయంత్రం ఆయన పోచంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి ముసాయిదా ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు. ఈ నెల 13న పోలింగ్ కేంద్రాల జాబితాను కూడా ప్రదర్శించి, 16న పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోతో కూడిన తుది జాబితాను ప్రచురించాలని మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డిని ఆదేశించారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ కేంద్రమైన స్థానిక వినోబాభావే మందిరాన్ని సందర్శించారు. ఆయన వెంట తహసీల్దార్ పి. శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్లు రాజేశ్, ఆదిత్య ఉన్నారు. సకాలంలో జాబితా పూర్తి చేయాలి భువనగిరిటౌన్ : ముసాయిదా ఓటరు జాబితా సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి మండలం దివ్య బాల స్కూల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ – రిసెప్షన్ సెంటర్ ను ఆయన గురువారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో కీలక మైన కౌంటర్లు, సామగ్రి పంపిణీ ఏర్పాట్లు, రిసెప్షన్ డెస్కులు, నియంత్రణ గదులు, మౌలిక సదుపాయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామలింగం పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు -
సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే పరీక్షలు
చౌటుప్పల్ : ఇంటర్ బోర్డు నిర్వహించే ప్రతి పరీక్ష సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని ఇంటర్‌బోర్డు జాయింట్ సెక్రటరీ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రత్యేకాధికారి భీంసింగ్ తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలోని పలు జూనియర్ కళాశాలలను ఆయన గురువారం సందర్శించారు. ప్రతిభ ఒకేషనల్ కళాశాలలో ల్యాబ్ పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాక్టికల్, థియరీ పరీక్షల సమయంలో కళాశాలల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని వసతులు కల్పించాలన్నారు. వార్షిక పరీక్షలకు ప్రభుత్వ కళాశాల విద్యార్తులను అన్ని విధాలుగా సంసిద్ధులను చేసేందుకు అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. నూరుశాతం ఫలితాల సాధనకు ప్రణాళికతో పనిచేయాలని కోరారు. ఈనెల 21న ఇంగ్లిష్ ప్రథమ సంవత్సరం, 22న ద్వితీయ సంవత్సరం, 24న పర్యావరణ ప్రాక్టికల్స్ ఉంటాయన్నారు. ఫిబ్రవరి 1నుంచి ప్రాక్టికల్స్ మొదలవుతాయని తెలిపారు. అదే నెల 25నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఫ ఇంటర్‌బోర్డు జాయింట్ సెక్రటరీ భీంసింగ్ -
సాఫీగా నీరు పారేలా..
కాలువ విస్తరణకు సంబంధించిన పనులు చివరిదశలో ఉన్నాయి. అక్టోబర్, నవంబర్‌లో అకాలవర్షాల వల్ల సిమెంట్, కాంక్రీటు పనులకు ఆటంకం కలిగింది. ప్రస్తుతం స్ట్రక్చర్స్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మాతో పాటు, కాంటాక్ట్ సంస్థ ప్రతినిధులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారు. పనుల ప్రగతిని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తున్నారు. రైతులకు వీలయినంత త్వరగా నీరు అందించాలనే సంకల్పంతో ఉన్నారు. – కె.కృష్ణారెడ్డి, డీఈ నీటిపారుదలశాఖ రామన్నపేట: యాదాద్రిభువనగిరి, నల్లగొండ జిల్లాల్లోని సుమారు పద్దెనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించే ధర్మారెడ్డిపల్లి కాలువ ఆధునీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాలువ తవ్వకం(ఎర్త్‌వర్కు) దాదాపు పూర్తయింది. సిమెంట్ కాంక్రీటు పనులు వేగంగా జరుగుతున్నాయి. నిర్ణీత గడువుకంటే ముందే పనులు పూర్తిచేసి వచ్చే వానాకాలం వరకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 118 స్ట్రక్చర్స్....71 వంతెనలు ధర్మారెడ్డిపల్లి కాలువ రెండుజిల్లాల పరిధిలో ఽ51.51కి.మీ విస్తరించి ఉంది. స్థిరీకరించిన ఆయకట్టు 5,126 ఎకరాలు. అదనంగా 12,661 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కాలువలో పారే నీటి సామర్థ్యాన్ని 50 క్యూసెక్కుల నుంచి 208 క్యూసెక్కులకు పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలువ ఆధునీకరణకు అదనంగా రూ. 123.98కోట్లు మంజూరు చేశారు. కాలువల్లో నీరు సాఫీగా ప్రవహించడానికి ఇరిగేషన్ అధికారులు 118 స్ట్రక్చర్స్ డిజైన్ చేశారు. 71చోట్ల వంతెనలు, 4కిలోమీటర్ల మేర గైడ్‌వాల్స్‌ను ప్రతిపాదించారు. 20 చోట్ల వంతెనల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఏడుచోట్ల పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర రహదారులపై 12మీటర్ల వెడల్పు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్ల వెంట 7.50 మీటర్లు, వ్యవసాయబావుల వద్దకు వెళ్లే దారులపై 4.25మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. వంతెనలకు నలువైపులా ప్రొటెక్షన్వాల్స్ను నిర్మిస్తున్నారు. విస్తరణ ఇలా.. ధర్మారెడ్డిపల్లి కత్వ 0 కి.మీ నుంచి గోకారం చెరువు వరకు కాలువ వెడల్పు 10మీటర్లు (అడుగుభాగం), గోకారం నుంచి చిట్యాల మండలం శివనేనిగూడెం మహాలింగం చెరువు వరకు అడుగుభాగం ఆరు మీటర్లు ఉండే విధంగా కాలువను విస్తరిస్తున్నారు. విస్తరణ పనులను నకిరేకల్, భువనగిరి ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిలు ఐబీ అధికారులు, రైతులతో కలిసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే వానాకాలం సీజన్‌నాటికి నీరు అందించే అవకాశం ఉంది. ఫ ధర్మారెడ్డికాలువపై 118స్ట్రక్చర్స్ నిర్మాణానికి ప్రణాళిక ఫ ఏడు చోట్ల వంతెనలు పూర్తి ..13చోట్ల పురోగతిలో.. ఫ 4కి.మీ మేర గైడ్‌వాల్స్ ఫ చివరి దశలో తవ్వకం పనులు -
ఔట్లెట్ లేక అవస్థలు
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి మున్సిపాలిటీలో మురుగునీటిని బయటికి పంపడానికి ఔట్లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వెంకటరమణ కాలనీ, రాంనగర్‌కాలనీ, సాయినగర్ కాలనీ, పద్మానగర్ కాలనీలకు చెందిన మురుగునీరంతా ప్రభుత్వ ఆస్పత్రి ప్రహరీ పక్కనుంచి వెళ్తోంది. కానీ ఆస్పత్రి దాటిన తరువాత పట్టా భూములు ఉండటం.. సదరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నీరు వెళ్లే మార్గంలేక మురుగునీరు నిలిచి మడుగును తలపిస్తోంది. బీసీ కాలనీ, మహామ్మాయి కాలనీ, ఆర్టీసీ బస్టాండ్ సమీప కాలనీలలో గతంలో అండర్ డ్రెయినేజీలు నిర్మించారు. ఆయాకాలనీల మురుగునీరు చిన్నేటిలో కలుపడానికి గతంలో రూ.1.20 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. ఈలోపు ప్రభుత్వం మారడంతో పనులు మధ్యలోనే ఆగిపోయి సమస్య మొదటికి వచ్చింది. ఈ ఐదారు కాలనీల మురుగునీరు కూడా బయటికి పోయే మార్గంలేక ఇళ్ల మధ్య చేరి దుర్వాసన, ఇటు దోమలు విస్తరించి ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. -
రూ.30కోట్ల నిధులున్నా..
ఆలేరు: ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని మంతపురి రోడ్డులో ఓపెన్ నాలాతో ప్రజలు అవస్థలుపడుతున్నారు. ఈ ఓపెన్ నాలా నుంచి వచ్చే దుర్వాసనతో పక్కనే ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినుల పాట్లు అన్నీఇన్నీ కావు. ఐదో వార్డులో డ్రెయినేజీ నిర్మాణం చేయకపోవడంతో ఇళ్ల మధ్య మురుగునీరు నిలుస్తోంది. గత పాలకమండలి హయాంలో నిర్మించిన భూగర్భ డ్రెయినేజీ సరిగా పని చేయడంలేదు. ఇక పాత మున్సిపల్ కార్యాలయం వరద కాల్వ నిర్మాణం శిలాఫలకానికే పరిమితమైంది. దాంతో రంగనాయకుల గుడి, కుమ్మరివాడ కాలనీలు వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయి. హైదరాబాద్ ప్రధాన రోడ్డు , రైల్వేట్రాక్ పక్కన బృందావన్ కాలనీ మీదుగా వెళ్లే పెద్ద కాల్వ ఆక్రమణలు ముంపు సమస్యకు కారణమవుతుంది. మూడేళ్లుగా మున్సిపాలిటీ ఖజానాలో రూ.15కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులు ఉన్నా డ్రెయినేజీల నిర్మాణంపై దృష్టిపెట్టకపోవడం గమనార్హం. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి పట్టణాభివృద్ధి స్కీం కింద మరో రూ.15కోట్లను మంజూరు చేశారు. అయినా డ్రెయినేజీల నిర్మాణంపై అధికారులు దృష్టిపెట్టడంలేదు. డీపీఆర్ అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టి త్వరలో పనులు చేయడానికి కృషి చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. -
ఇష్టారాజ్యంగా చెత్త వేస్తున్న జనం
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణకు మున్సిపాలిటీ నుంచి 10ఆటోలు, 02ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. చెత్త సేకరణ, ఆటోలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ప్రతి రెండు వార్డులకు ఒక ఆటో చొప్పున కేటాయించారు. ఒక్కో వార్డులో రోజువిడిచి రోజు చెత్తను సేకరిస్తున్నాయి.ప్రైవేట్ నిర్వాహకులు ఒక్కో కుటుంబం నుంచి రూ. 100 చొప్పున వసూలు చేస్తున్నారు. రోజూ సుమారు 12–14 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఈ చెత్తను పట్టణ శివారులో ఉన్న గోల్డెన్ ఫారెస్ట్ భూమిలో పోస్తున్నారు. ఇటీవల తీసుకువచ్చిన రెమిడియేషన్ యంత్రం ద్వారా చెత్తలోని ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, సీసాలు, ఇనుము, మెత్తటి మట్టి, దుస్తులు, ఇతర వస్తుల చొప్పున వేరు చేస్తున్నారు. చెత్తసేకరణకు సరిపడా సిబ్బంది ఉన్నారు. ఇంటి ముందుకు వాహనాలు వస్తున్నా కొందరు చెత్త వేయడంలేదు. తమ ఇంట్లోని చెత్తను ప్లాస్టిక్ కవర్లలో నింపి ఊరు చివరన పడేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం పూర్తిగా దుర్గంధంగా మారుతోంది. -
వారం రోజులకు ఒకసారి
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి మున్సిపాలిటీలో ఐదు రోజులు, ఒక్కోసారి వారం రోజుల ఒకసారి కూడా చెత్తబండి రావడంలేదు. దీంతో చెత్తను ఇళ్లలో జమ చేయలేక, బయట పడేయలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోచంపల్లిలో ముక్తాపూర్, రేవనపల్లి గ్రామాలను విలీనం చేసి మున్సిపాలిటీగా మార్చారు. మున్సిపాలిటీలో మొత్తం 6,097 గృహాలు, 21వేల పైచిలుకు జనాభా, 13 వార్డులు ఉన్నాయి. కానీ 21వేల జనాభాకు కేవలం నాలుగు చెత్తసేకరణ ఆటోలు, రెండు ట్రాక్టర్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో రెండు ఆటోలు చెడిపోగా, ఇటీవల ఒకటి రిపేరు చేయించారు. మున్సిపాలిటీ ప్రతిరోజు 6 టన్నుల చెత్త వస్తోంది. కానీ సరిపోను ఆటోలు, పారిశుద్ధ్య సిబ్బంది లేరు. సెగ్రిగేషన్ షెడ్(డీఆర్సీ) లేక చెత్తను కాలుస్తున్నారు. మోడల్‌స్కూల్ సమీపంలో ఏర్పాటుచేసిన చెత్తడంపింగ్ యార్డులో చెత్తను కాలుస్తుండటంతో పొగ, దుర్వాసనతో విద్యార్థులు అనారోగ్యంబారిన పడుతున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో 36 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. జనాభా ప్రతిపాదికన మరో 20 మంది కార్మికులు, మరో నాలుగు చెత్త సేకరణ ఆటోలు అవసరం. -
ఆవాసాల్లో పేరుకుపోతున్న చెత్తకుప్పలు
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో రెండు రోజుల కోసారి చెత్తను సేకరిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు ప్రత్యేక చొరవ చూపకపోవడంతో ఆవాసాల్లో చెత్త కుప్పులు పేరుకుపోతున్నాయి. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 35 వార్డులు ఉన్నాయి. పారిశుద్ధ్య విభాగంలో 31 మంది రెగ్యులర్, 130 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. నిత్యం 18 ఆటోలు, నాలుగు ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరిస్తున్నారు. ఒక్కో వార్డులో ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. నిత్యం 32 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తున్నట్లు అంచనా. సేకరించిన చెత్తను పట్టణంలోని రైల్వే ట్రాక్ వెంట వేయడంతో డంపింగ్ యార్డుగా మారింది. ఇక్కడ పశువులు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. -
ఆరుట్ల దంపతుల చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలి
ఆత్మకూరు(ఎం): ఆరుట్ల కమలాదేవి–రామచంద్రారెడ్డి దంపతుల జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఆత్మకూరు(ఎం) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆరుట్ల కమలాదేవి–రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న నియోజక వర్గ స్థాయి క్రీడోత్సవాలను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేదల పక్షాన నిలబడి తుపాకీ చేతబట్టి సాయిధ పోరాటంలో పాల్గొనడం వల్ల మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఏటా క్రీడోత్సవాలను నిర్వహిస్తున్న ఫౌండేషన్ ప్రతినిధులను అభినందిస్తున్నానని చెప్పారు. ఆత్మకూరు(ఎం)లో యువజన మండలి కోరిక మేరకు ఓపెన్ జిమ్‌కు రూ. 2లక్షలు, రక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి రూ. 3లక్షలు ఎంపీ కోటా కింద మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ ఆరుట్ల కమలాదేవి–రామచంద్రారెడ్డి ఇద్దరు మహానీయులుగా చరిత్రలో నిలిచిపోయినట్లు చెప్పారు. రాష్ట్ర మహిళా అభివృద్ధి సహకార సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి మాట్లాడుతూ ఆరుట్ల దంపతుల జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని అన్నారు. ఎంఈఓ కొత్త మహాదేవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ఫౌండేషన్ చైర్మన్ ఆరుట్ల సుశీల, స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి కందాడి అనంతరెడ్డి, స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి, ఏఏపీసీ చైర్మన్ సుగుణమ్మ, తహసీల్దార్ వి. లావణ్య, వలిగొండ ఎంఈఓ భాస్కర్, రిటైర్డ్ హెచ్ఎం గోపాల్‌రెడ్డి, ఆరుట్ల కుటుంట సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, మమత, సీపీఐ జిల్లా కార్యదర్శి దామోదర్‌రెడ్డి, ఉప సర్పంచ్ మజ్జిగ నరేష్, నేతాజీ యువజన మండలి అధ్యక్షుడు దొంతరబోయిన మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి యాస మహేందర్‌రెడ్డి,నాయకులు యాస లక్ష్మారెడ్డి, బీసు చందర్‌రెడ్డి, ఉప్పల ముత్యాలు, రచ్చ గోవర్ధన్, గజరాజు కాశీఽనాఽఽథ్ పాల్గొన్నారు. ఫ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
వీధుల్లో చెత్త.. శివారులో పొగ
ఆరు మున్సిపాలిటీల్లో చెత్త నిర్వహణ అస్తవ్యస్తం ఫ రెండు రోజులకోసారి చెత్తసేకరణ ఫ ఊసేలేని తడి, పొడి చెత్త రీసైక్లింగ్ ఫ గుట్టలుగా పేరుకుపోతున్న చెత్తాచెదారం ఫ నిప్పు పెడుతున్న సిబ్బంది.. ఇబ్బందుల్లో ప్రజలు మోత్కూర్ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని లూర్దునగర్ కాలనీకి సమీపంలో ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకుపోతోంది. మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు, సుమారు 20 వేల జనాభా ఉంది. రోజూ రెండు ట్రాక్టర్లు, ఆరు ఆటోల ద్వారా సుమారు 5 నుంచి 6 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి సమీపంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రధాన వీధుల్లో మాత్రమే నిత్యం చెత్త సేకరిస్తున్నారు. కాలనీలు, గల్లీలు, శివారు గ్రామాలు, విలీన గ్రామాల్లో ఐదారు రోజులకోసారి చెత్త సేకరిస్తున్నారు. చెత్త రీ సైక్లింగ్ యూనిట్ ఏర్పాటుకు రూ.కోటి మంజూరైనా పనులు చేపట్టలేదు. డంపింగ్ యార్డ్ సమీపంలో ఉన్న భూములు చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయని రైతు చెరుకు సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. తర్వలో రీసైక్లింగ్ పనులు చేపట్టనున్నట్లు కమిషన్ సతీష్కుమార్తెలిపారు. పెద్దవాగులో చెత్త డంప్ఆలేరు: ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. 23వేల జనాభా ఉంది. నాలుగు ప్రైవేట్ ఆటోలు, మరో రెండు మున్సిపల్ ఆటోల ద్వారా ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీ వారు ఇంటికి నెలకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇద్దరు సూపర్వైజర్లతో కలిపి మొత్తం 42మంది పారిశుద్ధ్య సిబ్బంది పని చేస్తున్నారు. ఇళ్లు, వ్యాపార వర్గాల నుంచి రోజూ సుమారు 3వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని అంచనా.ఈ చెత్తను మున్సిపల్ సిబ్బంది పెద్దవాగులో డంప్ చేస్తున్నారు. దీంతో వాగు జలాలు కలుషితం అవుతున్నాయి. చెత్తను దహనం చేయడంతో చుట్టుపక్కల కాలనీల వాసులు పొగతో ఇబ్బంది పడుతున్నారు. డంపింగ్ యార్డు కోసం సాయిగూడెం శివారులో మూడేళ్ల కిత్రమే అధికారులు రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. స్థానిక రైతుల నుంచి అభ్యంతరం రావడంతో డంపింగ్ యార్డు ఏర్పాటు ప్రక్రియ పెండింగ్‌లో పడింది. డంపింగ్ యార్డుకు కేటాయించిన స్థలం హద్దులు చూపించాలని ఇటీవల తహసీల్దార్‌కు లేఖ రాసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. త్వరలో యార్డు ఏర్పాటు చేస్తామన్నారు. -
పండుగ వాతావరణంలో గృహ ప్రవేశాలు చేయాలి
భువనగిరి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకుని పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం భువనగిరి మండలం ఆకుతోటబావితండా, బొల్లేపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఇళ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసుకునేలా కార్యదర్శులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లు పూర్తి చేసుకుంటే రెండో విడత కింద అర్హులైనవారికి మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా గ్రామాల్లో ఏర్పడిన పాలక వర్గాలు అభివృద్ధి పనులతో పాటు పారిశుద్ధ్య పనులుచేపట్టాలన్నారు. పొరపాట్లు లేకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలిభువనగిరిటౌన్ : పొరపాట్లు లేకుండా మున్సిపల్ వార్డు ఓటర్‌జాబితా సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీలో ముసాయిదా ఓటరు జాబితాను అదనపు కలెక్టర్ పరిశీలించారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఏమైనా మార్పులు చేర్పులపై ఫిర్యాదులు అందితే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముసాయిదా ఓటరు జాబితాలో ప్రజలకు ఎవరికై నా ఎలాంటి అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉన్నా అర్జీలు స్వీకరించి పరిష్కరించాలన్నారు. ఆయన వెంట భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామలింగం, సిబ్బంది ఉన్నారు. నేడు ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథంభువనగిరిటౌన్ : కలెక్టరేట్లో గురువారం ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగ వాణి యథాతథంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలు రావచ్చని సూచించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు రూ.5.50లక్షలుభువనగిరి: ఇంటర్మీడియేట్ ప్రాక్టీకల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం జిల్లాకు రూ.5.50లక్షల నిధులు మంజూరు చేసింది. జిల్లాలో 50 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ప్రథమ సంవత్సరంలో 1,524 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,867 మంది విద్యార్థులున్నారు. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు గత ఏడాది ఒక్కో కళాశాలకు రూ. 25వేల చొప్పున మంజూరు చేసింది. కానీ ఈ సారి రూ. 50వేల చొప్పున మంజూరు చేసింది. దీంతో జిల్లాలో ఉన్న 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మొత్తం రూ. 5.50 లక్షలు నిధులు మంజూరయ్యాయి. కలెక్టర్ అనుమతులతో వారం రోజుల్లో పరికరాలు, సామగ్రి కొనుగోలు చేయనున్నట్లు డీఐఈఓ రమణి తెలిపారు. డీఆర్డీఎల్ డైరెక్టర్ రాజుకు ఎంపీ అభినందనలురాజాపేట : డీఆర్డీఎల్ డైరెక్టర్, శాస్త్రవేత్త అంకతి రాజును ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని డీఆర్డీఎల్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా డీఆర్డీఎల్ క్షిపణి తయారీ విధానం, అభివృద్ధి, కీలక నైపుణ్యంపై వీడియో ప్రజెంటేషన్ తిలకించారు. రాజాపేటలోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించి డీఆర్డీఎల్ డైరెక్టర్‌గా ఎదగడం ఎంతో గర్వంగా ఉందని అభినందించారు. అనంతరం ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి అంకతి రాజు డీఆర్డీఎల్ మిసైల్ జ్ఞాపికను అందజేశారు. -
భువనగిరిలో బీజేపీ జెండా ఎగురవేయాలి
భువనగిరి: వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో భువనగిరిలో బీజేపీ జెండా ఎగురవేయాలని భువనగిరి మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి వట్టిపల్లి శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్ పేర్కొన్నారు. బుధవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ కౌన్సిలర్ల సీట్లు గెలుపొంది బీజేపీ సత్తా చాటాలన్నారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, సీనియర్ నాయకులు నర్ల నర్సింగ్‌రావు, చందుపట్ల వెంకటేశ్వర్లురావు,సుర్వి శ్రీనివాస్‌గౌడ్, పడమటి జగన్మోహన్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి, పట్నం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు చందా మహేందర్ గుప్తా, మున్సిపల్మాజీ వైస్ చైర్మన్ మాయ దశరథ, కోళ్ల భిక్షపతి, పట్నం కపిల్, బలరాం, వెంకటేశం, శ్రీశైలం, మహమూద్, కృష్ణచారి, ఉడుత భాస్కర్ పాల్గొన్నారు. -
16న ఫొటోతో కూడిన జాబితా
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ పోరుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో 16న ఫొటోతో కూడిన ఓటరు తుది జాబితా ప్రకటన, బ్యాలెట్బాక్సులు, బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేసుకోవడం, సిబ్బంది నియామకంపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 600 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున వార్డుకు రెండు కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు ప్రారంభించారు. 16న ఫొటోతో కూడిన తుది జాబితా మున్సిపల్ ఎన్నికల కోసం ఓటరు తది జాబితాను ఈనెల 12న విడుదల చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 10వతేదీనే తుది జాబితాను విడుదల చేయాల్సి ఉంది. అయితే ముసాయిదాజాబితాలపై పెద్ద ఎత్తున వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈనెల 13వ తేదీన నూతనంగా ఏర్పాటుచేసే పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ముసాయిదా జాబితాలను మున్సిపల కమిషనర్లు విడుదల చేస్తారు. ప్రతివార్డు పరిధిలో ఓటర్ల సంఖ్య ఆధారంగా రెండు పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ముసాయిదాను టీ పోల్‌లో అప్లోడ్ చేస్తారు. 16న పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోలతో కూడిన తుది ఓటరు జాబితాలను ప్రకటిస్తారు. వార్డుకు రెండు పోలింగ్ కేంద్రాల చొప్పున ఏర్పాటు చేయనున్నారు. 600ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. పోలింగ్ సిబ్బంది సిద్ధం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ అధికారులు, సిబ్బందిని సిద్ధం చేశారు. ఎన్నికల అఽధికారులకు విధుల కేటాయింపు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, కౌంటింగ్‌కేంద్రాల ఏర్పాటును సిద్ధం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నాటినుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలుకు సన్నాహాలు ప్రారంభించారు. మున్సిపాలిటీ వార్డులు బాలెట్ రిటర్నింగ్ బాక్స్‌లు అధికారులు భువనగిరి 35 173 14 ఆలేరు 12 58 05 చౌటుప్పల్ 20 96 08 మోత్కూరు 12 30 05 పోచంపల్లి 13 31 05 యాదగిరిగుట్ట 12 58 05 ఈ సారి బ్యాలెట్ బాక్స్‌ల ద్వారా పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. 2005 నుంచి మున్సిపల్ ఎన్నికలు ఈ వీఎంల ద్వారా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే బ్యాలెట్ పద్ధతిన పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్య ఆధారంగా రెండునుంచి మూడు చొప్పున బ్యాలెట్ బాక్స్‌లు అంటే మొత్తం పదిశాతం అదనంగా కలుపుకుని 446 బాక్సులు ఏర్పాటు చేయనున్నారు. ఫ వార్డుకు రెండు పోలింగ్ కేంద్రాల చొప్పున ఏర్పాటుకు కసరత్తు ఫ ఒక్కో పోలింగ్ కేంద్రంలో 600మంది ఓటర్లు ఫ బ్యాలెట్ బాక్సులు, పత్రాలు సిద్ధం చేసే పనిలో బిజీ ఫ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఈసీ దిశానిర్దేశం -
నిధులొస్తేనే ఊరట..
గ్రామ పంచాయతీలను ప్రస్తుతం నిధులు కొరత తీవ్రంగా వేధిస్తోంది. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం (ఎఫ్ఎఫ్సీ), రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ), నిధులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. దీంతో పంచాయతీల ఖజానాల్లో నిధులు లేకపోడంతో అనేక సమస్యలు తిష్టవేశాయి. తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాల నిర్వహణకు సైతం పంచాయతీ కార్యదర్శులు తిప్పలు పడాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ట్రాక్టర్ల నిర్వహణ పూర్తిగా లోపించింది. దీంతో ఎక్కడి చెత్త అక్కడే ఉండేది. ట్రాక్టర్ల ఈఎంఐలు చెల్లించలేని, డీజిల్ సైతం కొనలేని పరిస్థితి నెలకొంది. ఆలేరురూరల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులతో పాటు సీఎం ప్రకటించిన ప్రత్యేక నిధుల ద్వారా గ్రామాల్లో కొంతవరకు మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కలగనుంది.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే అవకాశం లభిస్తుందనే అభిప్రాయం నూతన పాలకవర్గాల్లో వ్యక్తమవుతోంది. చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్దవాటికి రూ.10 లక్షలు మేజర్ పంచాయతీకి రూ.10 లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్ఎఫ్డీ) కింద అందజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి డిసెంబర్ 24 ప్రకటించారు. యాదాద్రి జిల్లాలో 427 పంచాయతీలు ఉన్నాయి. మండల కేంద్రాలు 17 ఉండగా వీటికి రూ.10 లక్షల చొప్పున రూ.1.70 కోట్లు నిధులు విడుదలయ్యే అవకాశముంది. మిగతా 410 గ్రామ పంచాయతీలు చిన్నవి. ఇందులో ఆరు పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డవే. చిన్న పంచాయతీల పరిస్థితి దయనీయం చిన్న పంచాయతీలకు ఎలాంటి ఆదాయం వనరులు లేకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేని దుస్థితి. స్పెషల్ ఫండ్ కింద వీటికి రూ. 5లక్షలు చొప్పున ఇస్తామనే సీఎం ప్రకటనతో అక్కడి పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వీటికి గాను జిల్లా వ్యాప్తంగా రూ.20.50 కోట్లు నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో పంచాయతీలకు అదనపు ఆర్థిక భరోసా కలిగి సమస్యలు పరిష్కారానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న నిధులు కూడా విడుదలయ్యేలా చూడాలని పాలకవర్గాలు కోరతున్నాయి. ప్రభుత్వం స్పెషల్ ఫండ్ కింద పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ నిధులు వస్తే గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. మరికొన్ని నిధులు మంజూరు చేస్తే నూతన పాకలవర్గాలకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. –ఇందూరి యాదిరెడ్డి, గొలనుకొండ సర్పంచ్ఫ గ్రామాల్లో కుంటుపడిన అభివృద్ధి ఫ ‘ఎస్డీఎఫ్’పై ముఖ్యమంత్రి ప్రకటనతో నూతన పాలకవర్గాల హర్షం ఫ జిల్లాలో 427 పంచాయతీలకు ప్రయోజనం ప్రభుత్వం ముంజూరు చేయనున్న రూ.5 లక్షలతో గ్రామాల్లో కొంత మేరకు మౌలిక వసతులు కల్పించుకోవచ్చు. ఇంకా మరిన్ని నిధులు మంజూరుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలతోనే ప్రజలు మమ్ముల్ని గెలిపించారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం. –పసుల సతీష్‌రెడ్డి, మంతపురి సర్పంచ్ -
టెండర్లు వాయిదా
చౌటుప్పల్ : మండల పరిధిలోని దండుమల్కాపురం శివారులో గల శ్రీఆంథోళ్ మైసమ్మ దేవాలయంలో సోమవారం నిర్వహించిన టెండర్లు వాయిదా పడ్డాయి. కిరాణం, జనరల్, సీసీ కెమెరాల నిర్వహణ, పూలు, కొబ్బరి చిప్పల కోసం టెండర్లు నిర్వహించారు.భక్తులు కొట్టిన కొబ్బరి కాయల చిప్పలకు, పూల విక్రయాలకు గతంలో ఎప్పుడూ టెండర్లు లేవని, కొత్త విధానం తీసుకువచ్చి తమ జీవనోపాధి దెబ్బతీయొద్దని కుమ్మరులు టెండర్లను అడ్డుకున్నారు. కొత్త సంప్రదాయానికి తెరలేపడం సరికాదని వాపోయారు. ఈ క్రమంలో గ్రామస్తులు, ఆలయ ఈఓ, ఉద్యోగులకు మధ్య వాగ్వాదం చోటుచేసుని ఉద్రిక్తతకు దారి తీయడంతో టెండర్ల ప్రక్రియ వాయిదా పడింది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడగా తాజాగా మరోమారు వాయిదా వేశారు.యాదగిరీశుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రద్దు చేయబడిన ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళాలతో సహస్రనామార్చన చేశారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపించిన అర్చకులు, ఉత్సవమూర్తుల నిత్య తిరుకల్యాణాన్ని నేత్రపర్వంగా చేపట్టారు. వీటితో పాటు బ్రహ్మోత్సవం, వెండి జోడు సేవోత్సవం తదితర పూజలను ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఎస్పీని కలిసిన బీజేపీ నాయకులు భువనగిరి : జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అక్షాంశ్యాదవ్ను సోమవారం బీజేపీ నాయకులు కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు అచ్చయ్య, చందా మహేందర్‌గుప్తా, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాయ దశరథ, నాయకులు మేడి కోటేష్, రామకృష్ణ, మంగ నరసింహరావు, రత్నపురం బలరాం, శ్రవణ్‌కుమార్, ఉడుత భాస్కర్, కృష్ణాచారి, రమేష్, నాగరాజు, మల్లికార్జున్, జనగాం నర్సింహచారి, రాము పాల్గొన్నారు. స్వర్ణగిరీశుడికి తిరువీధి సేవోత్సవం భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో సోమవారం రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామివారి తిరువీధి ఉత్సవ సేవోత్సవం వైభవంగా చేపట్టారు. స్వామివారిని దివ్యమనోహరంగా అలంకరించి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఆలయంలో సుభ్రబాత సేవ, సహస్రనామార్చన, స్వామివారికి నిత్యకల్యాణం తదితర వేడుకలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తరద్వారం ద్వారా శ్రీస్వామి వారిని శ్రీరంగం పాండరీపురం అశ్రమ హెచ్‌హెచ్ శ్రీపరవకోటై శ్రీమత్ చిన్న అండవన్ స్వామి దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మురళీకృష్ణ, గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి
భువనగిరి : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి మాధవిలత అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సోమవారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకోవాలని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. డ్రైవింగ్ చేసి వాహనాలు నడపడం, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయటం చట్టరీత్యా నేరమన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయ సేవాధికార సంస్థఽ ఆధ్వర్యంలో న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. అనతరం రోడ్డు భద్రత నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ అసిస్టెంట్ హర్షవర్థన్‌రెడ్డి, ప్రిన్సిపల్ రాధిక తదితరులు పాల్గొన్నారు.ఫ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత -
మీరైనా న్యాయం చేయండి సారూ..
ఫ ప్రజావాణిలో వృద్ధురాలి వేడుకోలు ఫ కుమారులు పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతం భువనగిరిటౌన్ : కలెక్టర్ సారూ.. చరమాంకంలో ఉన్న తన బాగోగుల గురించి కొడుకులు, కోడళ్లు పట్టించుకోవడం లేదు.. ఆర్డీఓ చెప్పినా ఖాతరు చేస్తలేరు.. మీరైనా న్యాయం చేయండంటూ ఓ వృద్ధురాలు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ హనుమంతరావును వేడుకుంది. నడవలేని స్థితిలో కలెక్టరేట్‌కు వచ్చిన వృద్ధురాలిని చూసిన కలెక్టర్.. స్టేజీ దిగి ఆమె వద్దకు వచ్చి సమస్య తెలుసుకున్నారు. వివరాలిలా.. రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన మల్లెబోయిన మీనమ్మకు ఇద్దరు కుమారులు. ఇద్దరికి పెళ్లిళ్లు చేసి, ఆస్తిపాస్తులను పంచి ఇచ్చింది. కాగా వృద్ధాప్యంలో ఉన్న మీనమ్మ బాగోగులను కుమారులు పట్టించుకోకపోవడంతో గత ఏడాది డిసెంబర్ 6న ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌కు గోడు చెప్పుకుంది. స్పందించిన కలెక్టర్.. చౌటుప్పల్ ఆర్డీఓ వద్దకు పంపించారు. ట్రిబ్యునల్‌లో ఆర్డీఓ విచారణ చేసి మీనమ్మ పోషణ, వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా కొంత నగదు చెల్లించాలని కుమారులను ఆదేశించారు. కానీ, ఆదేశాలను బేఖాతరు చేయకపోవడంతో ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేయాలని రామన్నపేట సీఐకి ఆర్డీఓ లేఖ రాశారు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో మీనమ్మ మరోసారి ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌ను కలిసి కన్నీటి పర్యంతమైంది. ఆర్డీఓతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని కలెక్టర్ ఆమెకు భరోసా ఇచ్చి పంపించారు. అత్యధికంగా రెవెన్యూ సమస్యలపైనే.. ప్రజావాణికి వచ్చిన ప్రజల నుంచి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. 36 అర్జీలు రాగా అందులో 15 రెవెన్యూకు సంబంధించినవే ఉన్నాయి. దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్ఓ జయమ్మ, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్ రెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
సరిచేస్తారా.. సరిపెడతారా..
ఆలేరు: మున్సిపాలిటీలోని ఓటర్లను చెల్లాచెదురు చేశారు.. ఒకే కుటుంబానికి చెందినవారిని వేర్వేరు వార్డుల్లో నమోదు చేశారు.. తప్పులను సరిదిద్దిన తరువాతే తుది జాబితా ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితా అభ్యంతరాలపై ఆలేరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశం గరంగరంగా సాగింది. అడ్డగోలుగా ఓటరు జాబితా తయారు చేశారని నాయకులు అధికారులపై మండిపడ్డారు.మున్సిపల్ కార్యాలయం ఎదుట ౖబైఠాయించి ఆందోళన చేశారు. అఖిలపక్షం అభ్యంతరాలు ఇవీ.. 12వ వార్డు ఓటర్లతో 10వ వార్డుగా, 9వ వార్డు ఓట్లతో 12వ వార్డుగా ఏర్పాటు చేయడాన్ని నాయకులు తప్పబట్టారు. 6వ వార్డులోకి సమీప కాలనీ ఓట్లను కాకుండా వేరే వార్డు ఓట్లను కలపి ఓటర్ల సంఖ్య పెంచడంపై అఖిలపక్ష నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక వార్డులో అధికంగా, ఒక వార్డులో తక్కువగా మొత్తం 12 వార్డులతో కూడిన జాబితాను తప్పులతడకగా మార్చేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారపార్టీకి అనుకూలం చేకూరేలా అధికారులు వార్డుల ఓటర్ల విభజన ఇష్టారీతిగా చేశారని ఆరోపించారు. పాత వార్డుల ప్రకారంగా జాబితా తయారు చేయాలి నాలుగో వార్డులో గుర్తు తెలియని వ్యక్తుల పేర్లు జాబితాలో ఉన్నాయని నాయకులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇతర ప్రాంతాలతో పాటు మృతిచెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగించడం, అన్ని వార్డుల్లో ఓటర్లు సమానంగా, పాత వార్డుల ప్రకారం జాబితాను తిరిగి రూపొందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, అఖిలపక్ష నాయకులు పుట్ట మల్లేశ్, తునికి దశరథ, బేతి రాములు, సృజన్‌కుమార్, ఎలుగల వెంకటేష్, ఎక్బాల్,గొట్టిపాముల రాజు, మొరిగాడి శ్రీశైలం, కుండె సంపత్, రమేష్, సాంబిరెడ్డి, బోగ సంతోష్, శంకర్, భాస్కర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.ఫ ముసాయిదా ఓటరు జాబితాపై అఖిలపక్షం గరంగరం ఫ సవరించాలని ఆలేరులో నాయకుల ఆందోళన రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు 2025 అక్టోబర్ 1వ తేదీ నాటి వివరాల ఆధారంగా, ఇంటి నంబర్ల ప్రకారం ముసాయిదా ఓటరు జాబితా తయారు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. మున్సిపాలిటీ నుంచి సాయిగూడెం విడిపోవడం వల్ల వార్డుల ఓటర్ల విభజనలో తేడాకు కారణమని, అభ్యంతరాలపై ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. తమ పరిధిలో ఉన్న వాటిని పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. -
అధ్యయనోత్సవాలు పరిసమాప్తం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆరు రోజుల పాటు కొనసాగిన అధ్యయనోత్సవాలు ఆదివారం పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారంగా ముగిశాయి. చివరి రోజు శ్రీస్వామిని శ్రీలక్ష్మీనరసింహుడిగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ అద్దాల మండపంలో శ్రీస్వామిని అధిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. అధ్యయనోత్సవాలకు వచ్చిన దివ్య ప్రబంధ పారాయణీకులను ఆలయాధికారులు ఘనంగా సన్మానించారు. అంతకు ముందు అలయంలో నిత్య ఆరాధనలు నిర్వహించి, పారాయణీకులచే ప్రబంధ పారాయణం జరిపించారు. శ్రీస్వామి వారి ఆలయంలో ఉత్సవమూర్తులకు తిరుమంజన, నవకలశ స్నపన మహోత్సవం చేపట్టారు. అధ్యనోత్సవాలు ముగిసిన నేపథ్యంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. చివరి రోజు శ్రీలక్ష్మీనరసింహుడిగా అలంకరణ నేటి నుంచి నిత్య, శాశ్వత కల్యాణం, సుదర్శన హోమం ప్రారంభం -
ప్రతిఒక్కరి కంటి సమస్యను తీరుస్తా
మునుగోడు: నియోజకవర్గంలోని ప్రతిఒక్కరి కంటి సమస్యను పరిష్కరిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మునుగోడులోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 11వ విడుత ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లోని అనేక మంది నిరుపేదలు కంటి సమస్యలతో బాధపడుతున్నారని, వారు కార్పొరేట్ స్థాయి ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకొలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. వారందరికీ తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేయిస్తున్నానని తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన 10 శిబిరాల్లో 7,806 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 1490 మందికి ఆపరేషన్లు చేయించినట్లు చెప్పారు. అవసరమైతే మునుగోడులో అన్ని సౌకర్యాలతో ప్రత్యేక కంటి ఆస్పత్రి నిర్మాణం చేపట్టి నల్లగొండ జిల్లాలోని పేద ప్రజలందరికీ వైద్య సేవలు అందించేలా ఏర్పాటు చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు నారబోయిన రవి, చండూరు మార్కెట్ చైర్మన్ దొటి నారయణ, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, పాల్వాయి జితేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి -
పనిచేసే నాయకులు ప్రజల హృదయాల్లో నిలుస్తారు
గరిడేపల్లి: ప్రజల కోసం పనిచేసే నాయకులు చనిపోయినప్పటికీ వారు ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో జీవించే ఉంటారని సీపీఐ జాతీయ నాయకుడు, జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ అన్నారు. ఆదివారం గరిడేపల్లి మండల పరిధిలోని రంగాపురం గ్రామంలో సీపీఐ నాయకుడు పోటు ప్రసాద్ స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కమ్యూనిజం లేకుండా చేస్తామని మోదీ, అమిత్‌షా అంటున్నారని, కమ్యూనిజాన్ని అంతమొందించడం అంత సులువు కాదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. వెనుజులా దేశంపై అమెరికా చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, పశ్య పద్మ, హేమంతరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, దండి సురేష్, రాజేశ్వరరావు, గుమ్మడి నరసయ్య, పోటు రంగారావు, గన్న చంద్రశేఖర్, ధనుంజయనాయుడు, రాములు, నారాయణరెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, సృజన, కంబాల శ్రీనివాస్, నంద్యాల రామ్‌రెడ్డి, సాయిబెల్లి, కళావతి, బాబు, కడియాల అప్పయ్య, సర్పంచ్‌లు కట్ట కళ్యాణి, పద్మ, పూర్ణచంద్రరావు, పున్నయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు. -
39 ఏళ్ల తరువాత ఒక్కచోటుకు..
పెద్దవూర: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో 1986–87లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఆదివారం ఒకే వేదికపైకి చేరారు. 39 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ప్రస్తుత పెద్దవూర సర్పంచ్ ఐతగోని వెంకటయ్య, కూర్నాల శ్రీనివాస్, పీఎల్ఎన్ శర్మ, శ్రీనవాస్శర్మ, సంజీవ, వెంకటయ్య, రవీందర్‌రెడ్డి, దేవదాసు, సంజీవ్‌కుమార్, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీదేవి, నీలమ్మ, జయమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డికి నివాళి
చిట్యాల: చిట్యాల పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డి (ముప్ప నర్సింహారెడ్డి) (84) అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా, జియాలజీ డిపార్ట్మెంట్ హెడ్‌గా విధులు నిర్వహించారు. 2004 నుంచి 2007 వరకు భూదాన్‌పోచంపల్లిలోని శ్రీ స్వామి రామానంద తీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. ఆయనకు భార్య భారతి, కుమార్తె అర్పిత, అల్లుడు గోపాల్‌రెడ్డి(మద్యప్రదేశ్ స్టేట్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరి) ఉన్నారు. ఎంఎన్ రెడ్డి మనవడితో ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కుమార్తెతో వివాహమైంది. ఎంఎన్.రెడ్డి మృతదేహాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా నకిరేకల్, మునుగోడు ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాళులర్పించారు. చిట్యాల శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఎంఎన్.రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. సంతాపంభూదాన్పోచంపల్లి: మండలంలోని జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డి మృతి పట్ల ఆదివారం సంస్థ చైర్మన్ కిషోర్‌రెడ్డి, డైరెక్టర్ హరికృష్ణ, వైఎస్ చక్రవర్తిస్వామి, అధ్యాపకులు సంతాపం తెలిపారు. -
గురుకులం పిలుస్తోంది!
ముఖ్యమైన తేదీలు : దరఖాస్తులు ప్రారంభం : డిసెంబర్ 11, 2025 దరఖాస్తులకు గడువు : జనవరి 21, 2026 ప్రవేశ పరీక్ష : ఫిబ్రవరి 22, 2026 పూర్తి వివరాలు: టీజీసెట్.సీజీజీ.జీవోవీ.ఇన్ ఐదో తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ 21వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం పెద్దవూర: తెలంగాణ ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతిలో ప్రవేశానికి, ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈ ఐఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గత నెల 11వ తేదీన ప్రారంభంకాగా.. ఈనెల 21వ తేదీ వరకు అవకాశం ఉంది. ప్రవేశ పరీక్ష రుసుం రూ.100లు ఆన్లైన్లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులకు సూచనలు ఐదవ తరగతిలో ప్రవేశానికి విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో నాల్గో తరగతి చదువుతుండాలి. ఆరు నుంచి తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి గాను వరుసగా ఐదు నుంచి ఎనిమిదో తరగతి చదువుతుండాలి. ఐదవ తరగతిలో ప్రవేశాలకు ఓసీ, బీసీ, బీసీ మైనారిటీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు వరుసగా ఓసీ, బీసీ, బీసీ మైనారిటీలకు 10 నుంచి 15 ఏళ్ల మద్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 10 నుంచి 17 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణం ప్రాంతం వారికి రూ.1,50,000లు, పట్టణ ప్రాంతం వారికి రూ.2 లక్షలకు మించకూడదు. ప్రవేశ పరీక్ష పూర్తిగా అబ్జెక్టీవ్ పద్ధతిలో ఓఎంఆర్ షీట్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. తెలుగు (20 మార్కులు), ఇంగ్లిష్(25 మార్కులు), గణితం(25 మార్కులు), మెంటల్ ఎబిలిటీ(10 మార్కులు), పరిసరాల విజ్ఞానం(20 మార్కులు) సబ్జెక్టులలో నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నంటాయి. విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఐదవ తరగతిలో ప్రవేశానికి ప్రస్తుత విద్యా సంవత్సరంలో నాల్గో తరగతి చదువుతున్నట్లుగా, ఆరో తరగతిలో 5వ తరగతి, 7వ తరగతిలో 6, 8వ తరగతికి 7వ, 9వ తరగతికి 8వ తరగతి చదువుతున్నట్లు సంబంధిత పాఠశాల నుంచి బోనఫైడ్/స్టడీ సర్టిఫికెట్‌ను దరఖాస్తుతో పాటు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. విద్యార్థుల ఎంపికకు ఉమ్మడి జిల్లాను యూనిట్‌గా పరిగణిస్తారు. ఇతర సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 1800 42545678ను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వ గురుకులాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని ప్రమాణాలతో బోధన చేసి విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రత్యేకించి విద్యార్థులలో క్రమశిక్షణ, ఆటలపై ఆసక్తి, ధ్యానం ఇతర అన్ని విధాలా విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ప్రోత్సహకాన్ని అందిస్తున్నాం. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – మంగ్తా భూక్యా, ప్రిన్సిపాల్, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం, పెద్దవూర -
చెరువులో కబ్జాలు, అక్రమ నిర్మాణాలు తొలగింపజేస్తా
● ఎమ్మెల్యే మందుల సామేల్ మోత్కూరు : మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని పెద్ద చెరువులోని కబ్జాలు, అక్రమ నిర్మాణాలు తొలగింపజేస్తామని, మున్సిపల్ సుందరీకరణకు కృషి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మున్సిపల్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. రూ.13 కోట్లతో డీపీఆర్ రూపొందిస్తున్నారని, పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ కేంద్రంలో రూ.2.50 కోట్లతో అంబేద్కర్ స్టడీ సర్కిల్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీలో విలీన గ్రామాలైన కొండగడప, బుజిలాపురంల అభివృద్ధితో పాటు శివారు గ్రామాలైన ఆరెగూడెం, రాజన్నగూడెం, ధర్మాపురం, కొండాపురం, జామచెట్లబావి అభివృద్ధి కోసం పాటు పడతానన్నారు. మోత్కూరు మినీ ట్యాంక్‌బండ్ చెరువు కట్ట రోడ్డును పూర్తి స్థాయిలో నిర్మాణం చేపడతామని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంద్రు, వంగాల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమల, జిల్లా నాయకులు అవిశెట్టి అవిలుమల్లు, గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, చింతల విజయభాస్కర్‌రెడ్డి, కంచర్ల యాదగిరిరెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, మండల, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ముద్దం జయశ్రీ, అన్నెపు పద్మ, కుర్మిళ్ల ప్రమీల, మందుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణగిరిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుభువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ సందర్శించారు. ఈసందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి స్వామి వారి ఆశీర్వచనం అందజేశారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. వారి వెంట భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ అంజిరెడ్డి తదితరులున్నారు. బేకరీ యాజమాన్యానికి రూ.5వేల జరిమానాసూర్యాపేట అర్బన్ : సూర్యాపేట పట్టణంలోని పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న బెంగళూరు బేకరీని ఆదివారం కస్టమర్ల ఫిర్యాదు మేరకు మున్సిపల్ అధికారులు పరిశీలించారు. బేకరీ నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యానికి రూ.5వేల జరిమానా వేసినట్లు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యేనేపల్లి యాదగిరి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. కోతులు, కుక్కల దాడిలో ఏడుగురికి గాయాలు అర్వపల్లి : మండల పరిధిలోని జాజిరెడ్డిగూడెం, తిమ్మాపురం, కాసర్లపహాడ్, అడివెంల తదితర గ్రామాలకు చెందిన ఏడుగురిని ఆదివారం కోతులు, కుక్కలు కరిచి గాయపర్చాయి. కోతుల దాడిలో నలుగురు, కుక్కల దాడిలో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిలో నాగయ్య, అంజయ్య, లింగమ్మ, సూరమ్మ, అంజమ్మ, తేజశ్రీ, శేఖర్ ఉన్నారు. -
పెళ్లికి నిరాకరించాడని..
చందంపేట : రెండు సంవత్సరాలుగా ప్రేమించి, తీరా ప్రభుత్వ ఉద్యోగం రావడంతో పెళ్లికి నిరాకరించాడని ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఆదివారం నేరెడుగొమ్ము మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నేరెడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన పులికంటి శ్రీను, అదే గ్రామానికి చెందిన నిరసనమెట్ల మంజుల ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. శ్రీనుకు కొన్ని నెలల క్రితం రైల్వేలో ఉద్యోగం వచ్చింది. యువతి డిగ్రీ చదువుతోంది. వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రభుత్వ కొలువు వచ్చిన నాటి నుంచి తనను వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తుండడంతో మంజుల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గ్రామంలో పెద్దమనుషుల మధ్య మాట్లాడేందుకు శ్రీను రాకపోవడంతో గత నెల 24వ తేదీన అతడి ఇంటి ఎదుట పెట్రోల్ బాటిల్‌తో బైఠాయించింది. అంతకుముందే విషయం తెలుసుకున్న శ్రీను, అతడి కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి వ్యవసాయ పొలానికి వెళ్లారు. యువతి కుటుంబసభ్యులు, బంధువులు అక్కడకు వెళ్లగా వీరి మధ్య వాగ్వాదం నెలకొంది. తాజాగా శనివారం మాట్లాడేందుకు శ్రీను, మంజుల తరపున కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. వీరి మధ్య మాటామాటా పెరగడం, శ్రీను వివాహం చేసుకునేందుకు అంగీకరించకపోవడంతో యువతి తన వెంట తెచ్చుకున్న డెటాల్‌ను తాగింది. గమనించిన సీఐ బీసన్న చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం యువతిని ఆదివారం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలంటూ యువతి తరపు బంధువులు కోరుతున్నారు.● యువతి ఆత్మహత్యాయత్నం ● నేరెడుగొమ్ము మండల కేంద్రంలో ఘటన -
హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం
చిట్యాల: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన బాకీ కార్డులను ఆదివారం చిట్యాల మున్సిపాలిటీలోని 8వ వార్డులో ఇంటింటికి వెళ్లి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బాకీ పడిన మొత్తాన్ని, రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వార్డు ప్రజలకు వివరించారు. అనంతరం చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే చిట్యాల మున్సిపాలిటీలో సుమారుగా రూ.30కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వైకుంఠధామం, ఇంటిగ్రేటేడ్ వెజ్ అండ్ నాజ్ మార్కెట్, వ్యవసాయ మార్కెట్ దుకాణ సముదాయాల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. గత రెండేళ్ల కాలంలో చిట్యాల మున్సిపాలిటీలో ఒక్క అభివృద్ది కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మాజీ జెడ్పీటీసీ శేపూరి రవీంధర్, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మెండె సైదులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, నాయకులు జమాండ్ల శ్రీనివాస్‌రెడ్డి, జిట్ట బొందయ్య, కందాటి రమేష్‌రెడ్డి, రుద్రవరం యాదయ్య, కన్నెబోయిన శ్రీశైలం, ఆగు అశోక్, జిట్ట శేఖర్, ఆవుల ఆనంద్, అమరోజు నవీన్‌కుమార్, విఠల్‌రెడ్డి, ఉపేందర్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి
వలిగొండ : లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన వలిగొండ మండలం నర్సాపురం గ్రామం పరిధిలోని బోడబండగూడెం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూర్ మండలంలోని దత్తప్పగూడేనికి చెందిన కుక్కల సాయికిరణ్ (19), దాచారం గ్రామానికి చెందిన బోల్ల దీక్షిత్ (21) స్నేహితులు. ఇద్దరు కలిసి బైక్‌పై భువనగిరికి వెళ్తుండగా నర్సాపురం గ్రామంలోని బోడబండగూడెం వద్ద ప్రమాదవశాత్తు లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు లారీ టైర్ల కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగేందర్ తెలిపారు. దాచారం, దత్తప్పగూడెంలో విషాదఛాయలు మోత్కూరు : నర్సాపురం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుల స్వగ్రామాలైన మోత్కూరు మండలం దాచారం, దత్తప్పగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరు ఇరు కుటుంబాల్లో ఏకై క కుమారులు కావడంతో ఆర్తనాదాలు మిన్నంటాయి. నాడు పిడుగుపాటుతో తండ్రి.. నేడు రోడ్డు ప్రమాదంలో కుమారుడు.. దాచారం గ్రామానికి చెందిన బోళ్ల సంపత్– విజయ దంపతులకు కుమారుడు దీక్షిత్ (21), కుమార్తె జస్విక ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం స్వగ్రామంలో చింత చెట్టు కింద ఉన్న సంపత్ పిడుగుపాటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తల్లి ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ కింద నైట్ వాచ్‌మెన్‌గా పని చేస్తూ పిల్లలను పోషిస్తోంది. దీక్షిత్ హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. నాడు భర్త సంపత్ పిడుగుపాటుకు గురై మృతి చెందడంతో ఆ బాధ నుంచి తేరుకోక ముందే ఇప్పుడు కుమారుడు దీక్షిత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఏకై క కుమారుడిని కోల్పోవడంతో.. దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కుక్కల సాయికిరణ్–పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిది నిరుపేద వ్యవసాయ కుటుంబం. కుమారుడు సాయికిరణ్ డిగ్రీ వరకు చదివాడు. కొంత కాలం ప్రైవేట్ కంపెనీలో పని చేసి మానేశాడు. కుటుంబానికి అండగా నిలబడతాడనుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు, అతడి అక్కాచెల్లెళ్లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇరు కుటుంబాల్లో ఒక్కగానొక్క కుమారులు చనిపోవడంతో వారి తల్లిదండ్రుల రోదనలు ప్రజలను కలిచివేశాయి. -
విద్యాభివృద్ధికి అబ్దుల్ ఖాదిర్ సేవలు అభినందనీయం
కోదాడరూరల్ : పేదపిల్లల విద్యాభివృద్ధికి మదర్సాను స్థాపించి మౌలానా అబ్దుల్ ఖాదిర్ చేస్తున్న సేవలు అభినందనీయమని జమీయత్ ఉలేమా ఏ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఎహెసానుద్దీన్, ప్రధాన కార్యదర్శి నబీర్ సాహెబ్ అన్నారు. ఆదివారం కోదాడ మండలం దుర్గాపురం క్రాస్‌రోడ్‌లోని మదర్సాలో ఏర్పాటు చేసిన అభినందన సభలో వారు మాట్లాడారు. యాభై ఏళ్లుగా వేలాది మంది పిల్లలకు ఉచిత వసతితో పాటు ఆధ్యాత్మిక, సాధారణ విద్యను అందిస్తూ వారిని ప్రయోజకులను చేయడం గొప్ప విషయమన్నారు. ఆర్గనైజర్ మదీనా మోడల్ స్కూల్ చైర్మన్ మౌలానా అహ్మద్ నద్వీ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైతిక విలువలు, ఆధ్యాత్మిక జిజ్ఞాస పెంపొందించడమే మదర్సా లక్ష్యమన్నారు. పూర్వ విద్యార్థులు గురువు అబ్దుల్ ఖాదిర్‌కు కారును బహూకరించారు. ఆర్గనైజర్ మౌలానా అహ్మద్ నద్వీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మౌలానా అత్తహర్, మీరాజుద్దీన్, హామీద్సాబ్, హాఫీజ్ పాల్గొన్నారు. -
మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు సౌత్ ఇండియా బెస్ట్ టీచర్ అవార్డు
గరిడేపల్లి: సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రసన్నకుమారి సౌత్ ఇండియా బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, నాణ్యమైన విద్య, క్రమశిక్షణతో కూడిన విద్యా నిర్వహణలో ప్రసన్నకుమారి అందించిన సేవలను గుర్తించి గురుచైతన్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమెను విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. -
6 మున్సిపాలిటీల్ల్లో 121 అభ్యంతరాలు
భువనగిరిటౌన్ : మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితా అభ్యంతరాల స్వీకరణ గడువు ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఈనెల 1న డ్రాఫ్ట్ లిస్ట్ ప్రకటించిన అధికారులు.. వాటిని ఆర్డీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఈటిపై ఓటర్ల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. ఒకే కుటుంబంలోని ఓట్లు వేర్వేరు వార్డుల్లో నమోదు కావడం, ఇల్లు ఒక వార్డులో ఉంటే.. ఓట్లు మరో వార్డు పరిధిలోకి రావడం, ఇల్లు విక్రయించి మరో చోటకు తరలివెళ్లినా అదే ఇంటిలో పేర్లు ఉండటం వంటి కారణాలపై అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. వీటితో పాటు డోర్ నంబర్ల నమోదులో తప్పిదాలు చోటు చేసుకున్నాయి. అభ్యంతరాల స్వీకరణకు 2నుంచి 4వ తేదీ వరకు గడువు ఉండగా.. జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీల్లో 121 దరఖాస్తులు అందాయి. అత్యధికంగా భువనగిరి, యాదగిరిగుట్టలో అభ్యంతరాలు అందినట్లు అధికారులు తెలిపారు. మున్సిపాలిటీల వారీగా వచ్చిన అభ్యంతరాలుఅత్యధికంగా భువనగిరి మున్సిపాలిటీలో 45, యాదగిరిగుట్టలో 44 దరఖాస్తులు వచ్చాయి. చౌటుప్పల్ 12, మోత్కూర్ 2, భూదాన్‌పోచంపల్లి 16, ఆలేరులో 2 చొప్పున అభ్యంతరాలు అందాయి. 10న తుది జాబితా..అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసినందున రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. 5న మున్సిపాలిటీ, 6న కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అందిన అభ్యంతరాలపై చర్చించనున్నారు. సవరణలు ఉంటే సరిచేసి ఈనెల 10న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. ముగిసిన అభ్యంతరాల స్వీకరణ గడువు నేడు,రేపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంపొరపాట్లకు తావుండొద్దు ఓటరు జాబితాలో పొరపాట్లకు తావుండరాదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆదేశించారు. ఆదివారం ఆయన భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలను సందర్శించారు. డ్రాఫ్ట్ లిస్ట్‌పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు. మార్పులు, చేర్పులు ఉంటే పరిష్కరించి 10వ తేదీన తుది జాబితా విడుదల చేయాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఈ ప్రక్రియ ఎంతో కీలకమని, పారదర్శకంగా జాబితా రూపొందించాలని స్పష్టం చేశారు. -
కూల్చి రెండేళ్లు.. పూర్తికి ఎనే్నళ్లో
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా యాదగిరిగుట్ట పట్టణంలో ఉన్న యోగానంద నిలయాన్ని రెండేళ్ల క్రితం కూల్చారు. దాని స్థానంలో కొత్త భవనం నిర్మించాల్సి ఉండగా.. నేటికీ పనులు ప్రారంభించలేదు. యోగానంద నిలయం ఉన్నప్పుడు సామాన్య భక్తులు బస చేయడానికి ఎంతో సౌకర్యంగా ఉండేది. దేవస్థానం అధికారులు వెంటనే స్పందించి నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని భక్తులు కోరుతున్నారు. శిథిలావస్థకు చేరిందని..యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి సన్నిధికి వచ్చే భక్తులు బస చేయడానికి 1986 జనవరి 22న యాదగిరిగుట్ట పట్టణంలో యోగానంద నిలయాన్ని ప్రారంభించారు. ఈ భవనంలో 58 గదులు, 7 పెద్ద హాళ్లు ఉండేవి. ప్రారంభించినప్పటి నుంచి 2019 వరకు యోగానంద నిలయంలో నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో బస చేసేవారు. 2019లో కరోనా విజృంభించడంతో నిలయాన్ని మూసివేశారు. తిరిగి మూడేళ్ల పాటు తెరవకపోవడంతో అందులోని ఫర్నిచర్, విద్యుత్ సామగ్రి తదితర వస్తువులన్నీ అపహరణకు గురయ్యాయి. భవనం కూడా శిథిలావస్థకు చేరడంతో భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థానం అధికారులు నూతన భవన నిర్మాణానికి సంకల్పించారు. నిలయం ముందు భాగంలోని దుకాణాలను ఉంచి, వెనుకభాగంలో ఉన్న గదులను పూర్తిగా తొలగించారు. 2023 సెప్టెంబర్‌లో కూల్చివేతదుకాణాలు మినహా మిగతా భవనాన్ని 2023 సెప్టెంబర్‌లో పూర్తిగా తొలగించారు. నూతన భవన నిర్మాణం కోసం అప్పట్లోనే టెండర్లు పిలిచేందుకు అధికారులు హడావుడి చేశారు.అప్పటి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ, ప్రక్రియ ముందుకు సాగలేదు. భవనం కూల్చివేసిన ప్రాంతమంతా ప్రస్తుతం పిచ్చిమొక్కలు, కంపచెట్లు, చెత్తాచెదారంతో నిండిపోయింది.యాదగిరిగుట్టలో యోగానంద నిలయం కూల్చివేత నేటికీ మొదలుకాని పనులు సామాన్య భక్తుల బసకు ఇక్కట్లు -
సంస్థ ప్రగతికి దీక్షతో పని చేయండి
యాదగిరిగుట్ట: విద్యుత్ సంస్థ ప్రగతికి సంస్థలోని ప్రతి ఉద్యోగి కర్తవ్య దీక్షతో పని చేసి వినియోగదారుల మన్ననలు పొందాలని తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.బి.సి.రెడ్డి పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర పవర్ డిప్లొ మా ఇంజనీర్ల సంఘం నూతన డైరీని ఆ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్వ ఏపీఎస్ఈబీ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు)ని నాలుగు కంపెనీలుగా విడగొట్టిన తర్వాత విద్యుత్ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా సంస్థ పురోభివృద్ధికి ఇంజనీర్లు వ్యూహాలు రచించి, ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మూడో డిస్కం విధివిధానాలపై చర్చించడంతో పాటు, దాని మనుగడకు యాజమాన్యాలు ఏకపక్షంగా వ్యవహరించకుండా ఉద్యోగులను కూడా భాగస్వాములను చేసి సూచనలు స్వీకరించాలన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి అమలుపర్చబోమే పీఆర్సీ ఆమోదయోగ్యంగా ఉండేలా అన్ని సంఘాల జేఏసీలు ఏకతాటిపైకి వచ్చి కృషి చేయాలని కోరారు. ప్రైవేట్ విద్యుత్ తక్కువ ధరకు లభిస్తుందన్న సాకుతో జెన్కో థర్మల్ ప్లాంట్లు ఉత్పత్తి తగ్గిస్తున్నాయన్నారు, వాటిని పూర్తిస్థాయిలో నడిపించి ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఉద్యోగుల బదిలీలు ప్రస్తుతం నిలిపివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని, సానుకూలంగా ఫలితం వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్ తాజుద్దీన్ బాబా, నాయకులు ఇంద్రసేన, రాజా, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, నరేందర్, ప్రతాప్‌రెడ్డి, సీతారామరెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. డిప్లొమా ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.బి.సి.రెడ్డి -
ప్రశాంతంగా టెట్
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని దేశ్ముఖిలో గల విజ్ఞాన్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆదివారం నిర్వహించిన టెట్ పేపర్–2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2గంటల నుంచి 4.30 వరకు సైన్స్, గణితం పరీక్షలు నిర్వహించారు. 100 మంది విద్యార్థులకు గాను 84 మంది హాజరయ్యారు. 16 మంది గైర్హాజరయ్యారని డీఈఓ సత్యనారాయణ తెలిపారు.ఆదిమహావిష్ణువు ఆలయ హుండీ లెక్కింపుచౌటుప్పల్ : మండల పరిధిలోని దేవలమ్మనాగారం శ్రీఆదిమహా విష్ణువు ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీల్లో భక్తులు సమర్పించి నగదు, కానుకలను ఆదివారం లెక్కించారు. నగదు లక్షా 62 వేలు సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు వరకాంతం జంగారెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జంగం శ్రీనివాస్‌రెడ్డి, ప్రతినిధులు అత్తాపురం వెంకట్‌రెడ్డి, సర్పంచ్ సురుగు గౌరీశ్రీను, గట్టు సాలయ్య, పన్నాల రాజురెడ్డి, రమేష్, దానయ్య, రాము, మైసయ్య, సత్తయ్య, మనోహర్, శ్రీను, రాములు, భిక్షపతి, శ్రీను, రాజేష్ పాల్గొన్నారు. నేత్రపర్వంగా పంచామృతాభిషేకంభువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువైన ఆండాళ్ అమ్మవారికి నవకలశ పూర్వక పంచామృతాభిషేకం అర్చకులు నేత్రపర్వంగా జరిపించారు. అంతకుముందు సుభ్రబాత సేవ, సహస్రనామార్చన సేవ, సాయంత్రం తిరువీధిఉత్సవ సేవ తదితర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మురళీకృష్ణ, గోపి కృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలి భూదాన్‌పోచంపల్లి : మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరు నర్వోత్తమ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం భూదాన్‌పోచంపల్లిలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కోరారు. సమష్టిగా పనిచేసి అన్ని మున్సిపాలిటీలను కై వసం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు డబ్బీకార్ సాహేశ్, రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, కిసాన్‌మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సుర్కంటి రంగారెడ్డి, బీజెపీ మండల అధ్యక్షుడు మేకల రవీందర్‌రెడ్డి, జిల్లా నాయకులు ఎన్నం శివకుమార్, చిక్క కృష్ణ, గంజి బస్వలింగం, చెరుకు వెంకటేశం, ఏలే శ్రీనివాస్, గొలనుకొండ ప్రభాకర్, రచ్చ సత్యనారాయణ, బడుగు శ్రీకాంత్, సిద్ధు పాల్గొన్నారు. -
ఒకే కుటుంబంలోని ఓట్లు చెల్లాచెదురు
ఓటరు జాబితా అంశం తమ పరిఽధిలోనిది కాదని మున్సిపల్ అధికారులు దరఖాస్తుదారులకు చెబుతున్నారు. ఓటరు నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులు.. అన్నీ రెవెన్యూ అధికారుల బాధ్యతేనని సూచిస్తున్నారు.ఎన్నికల అధికారులు ఇచ్చిన ఓటరు జాబితా ప్రకారం తాము ఓటింగ్ నిర్వహిస్తామని అంటుడటం.. చెల్లాచెదురైన ఓటర్లు, చిరునామాలు తప్పులున్న ఓటర్లు అయోమయంలో ఉన్నారు.ఉన్నతాధికారులను కలిసే పనిలో కొందరు ఉన్నారు. సాక్షి, యాదాద్రి : మున్సిపాలిటీల్లో ఈనెల 1న జారీ చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు తప్పుల తడకగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ లిస్టు ఆధారంగా వెల్లడించిన ఈ జాబితాలో అనేక తప్పులు దొర్లాయి. ఒకే కుటుంబంలోని ఓట్లు చెల్లాచెదురై వేర్వేరు వార్డుల్లో నమోదయ్యాయి. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు వస్తుండటంతో, వాటిని సరిదిద్దే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. మొదటి రోజు శుక్రవారం 50కి పైగా దరఖాస్తులు రాగా, శనివారం ఆ సంఖ్య రెట్టింపు ఉంది. ● ఆలేరు మున్సిపాలిటీలో 1వ వార్డుకు చెందిన రెండు కొత్త ఓట్లు కొలనుపాక జాబితాలో చేరాయి. పట్టణంలోని కొలనుపాక రోడ్డులో 1.237బై1 ఇంటిలో ఉంటున్న ఇద్దరు యువకులు గతంలో ఓటు హక్కు కోసం నమోదు చేసుకోగా.. కొలనుపాక పంచాయతీ జాబితాలో వచ్చాయి. ఇలా ఆలేరు పట్టణానికి చెందిన సుమారు 50 ఓట్లు కొలనుపాకలోకి వెళ్లాయి. ● ఆలేరులోని 7, 8, 9 వార్డుల్లో ఒకే కుటుంబంలోని ఓట్లు వేర్వేరు పోలింగ్ బూత్‌లలో నమోదయ్యాయి. ఒక కుటుంబ ఓట్లన్నీ ఒకే వార్డులో ఉండాలన్న నిబంధన అమలు కాలేదు. బీసీ కాలనీ, సిల్క్‌నగర్, మార్కండేయకాలనీ, భరత్‌నగర్, మెయిన్‌రోడ్డులో పదుల సంఖ్యలో ఓట్లు వేర్వేరు వార్డుల జాబితాల్లో వచ్చాయి. నివాసం ఉంటున్న వార్డుకు మార్చండి యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో రెండో రోజు శనివారం 25 మంది డ్రాఫ్ట్ లిస్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దరఖాస్తులు అందజేశారు. తమ ఓట్లు ఇతర వార్డులో ఉన్నాయని, ప్రస్తుతం ఉన్న ప్రదేశంలోకి మార్చాలని దరఖాస్తులో కోరారు. కాగా ఎక్కువగా 10, 9వ వార్డు నుంచి దరఖాస్తులు వచ్చాయని మున్సిపల్ కమిషనర్ లింగస్వామి వెల్లడించారు. గతంలో ఓటర్ జాబితాలో తమ అడ్రస్ మార్చుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఫ వేర్వేరు వార్డుల్లో నమోదు ఫ గందరగోళంగా ముసాయిదా ఓటరు జాబితా ఫ ప్రజల నుంచి అభ్యంతరాలు రిజర్వేషన్లు ఖరారు కానప్పటికీ ఆశావహులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తే తమకు గెలుపు అవకాశాలుంటాయని అంచనాలో ఉన్నారు. అయితే డ్రాఫ్ట్ లిస్ట్ కొన్ని చోట్ల ఆశావహులకు ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది. తమకే పడుతాయనుకున్న ఓట్లు వేర్వేరు వార్డుల్లో నమోదు కావడం, చనిపోయిన వారి ఓట్లను తొలగించకపోవడం, కొత్త ఓట్లను పక్క వార్డులు, పొరుగు గ్రామ పంచాయతీల్లో నమోదవడం ఆశావహులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు ఆశావహులు తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చేలా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. భూదాన్‌పోచంపల్లి : ముసాయిదా ఓటరు జాబితాపై శనివారం పది మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దరఖాస్తులు అందజేశారని అంజన్‌రెడ్డి తెలిపారు. ఎక్కువగా వార్డుమార్పుపై వచ్చిన దరఖాస్తులే ఉన్నాయని చెప్పారు. ఓటరు జాబితాపై ఈనెల 5వ తేదీన అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. -
వైకుంఠనాథుడిగా యాదగిరీశుడు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. శనివారం ఐదో రోజు ఉదయం యాదగిరిశుడిని వటపత్రశాయిగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అంతకుముందు ఆలయంలో నిత్యారాధనలు జరిపించి, దివ్య ప్రబంధ పారాయణాలను పారాయణీకులచే నిర్వహించారు. సేవోత్సవం అనంతరం స్వామివారి అలంకార సేవను అద్దాల మండపంలో అధిష్ఠించి, వటపత్రశాయి అలంకార విశిష్టతను భక్తులకు ఆచార్యులు వివరించారు. అదేవిధంగా సాయంత్రం ద్రవిడ ప్రబంధ సేవాకాలం పారాయణీకులచే నిర్వహించారు. అనంతరం స్వామిని వైకుంఠనాథుడిగా(పరమపదనాధుడి) అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ తిరు, మాడ వీధిల్లో ఊరేగించారు. ఆయా వేడుకల్లో ఆలయ అధికారులు, ప్రధానార్చకులు, అర్చకులు, పారాయణీకులు, రుత్వికులు, భక్తులు పాల్గొన్నారు. నేటితో ఉత్సవాలకు ముగింపు అధ్యయనోత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఉదయం 9గంటలకు లక్ష్మీనరసింహస్వామి అలంకార సేవను ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం సూత్తందాది చాత్మర నిర్వహించి ఉత్సవాలను పరిసమాప్తి చేయనున్నారు. ఫ నేటితో ముగియనున్న అధ్యయనోత్సవాలు -
ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారించాలి
హుజూర్నగర్ : కర్ల రాజేష్ మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. శనివారం హుజూర్‌నగర్‌కు వచ్చిన ఆయన పట్టణంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సబ్ జైలును, ఏరియా హాస్పిటల్‌ను సందర్శించి జైలు అధికారులను, డాక్టర్లను అడిగి కర్ల రాజేష్ మృతికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్ల రాజేష్‌ను చిత్రహింసలు పెట్టడం వలనే మృతిచెందాడని ఆరోపించారు. రాజేష్ మృతిపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని, ఇందులో సూర్యాపేటకు సంబంధించిన అధికారులు ఎవరూ ఉండొద్దని కోరారు. రాజేష్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, అతడిని రిమాండ్ చేసే సమయంలోనే కోర్టు ప్రాంగణంలో హైకార్డ్ అనే ఇంజెక్షన్ వేశారని ఆరోపించారు. రాజేష్ మృతికి ప్రధాన కారకుడు చిలుకూరు ఎస్ఐ, సరైన నిర్ణయం తీసుకోలేని కోదాడ రూరల్ సీఐ అని.. వారిద్దరిని శిక్షించాలని కోరినప్పటికీ కేవలం సీఐని మాత్రమే వీధుల నుంచి తొలగించారని, ఎస్ఐని ఇంకా విధుల్లోనే ఉంచారని అన్నారు. దళితుల మీద ఫిర్యాదు వస్తే నిమిషాల్లో కేసులు నమోదు చేస్తారని, అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐపై కూడా కేసు ఉన్నప్పటికీ ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని ప్రశ్నించారు. ఎస్ఐ సురేష్‌రెడ్డిని కాపాడే మొదటి వ్యక్తి కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి కాగా.. ఇతర అధికారులు, డీఐజీతో సహా అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారేనని ఆరోపించారు. రాజేష్ రిమాండ్ రిపోర్ట్ మొత్తం తప్పుల తడకగా ఉందని, రాజేష్ మృతికి కారణమైన ఎస్ఐ, సీఐలను కాపాడేందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీ కూడా ప్రధాన భూమిక పోషించారని విమర్శించారు. ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, డీజీపీ, మంత్రి ఉత్తమ్ సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బచ్చలకూరి వెంకటేశ్వర్లు బచ్చలకూరి ప్రసాద్, చింతిరాల నాగయ్య, బాలచంద్రుడు, మంద నాగరాజు, ఒగ్గు విశాఖ, రెడపంగు వెంకటేశ్వర్లు మంద వెంకటేశ్వర్లు మీసాల శరత్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ


