manchester
-
విమానం గాల్లో ఉండగా గందరగోళం.. 11 మంది ప్రయాణికులకు గాయాలు
కరేబియన్ ద్వీపంలోని బార్బడోస్ నుంచి మాంచెస్టర్‌కు వెళుతున్న విమానం గాల్లో ఉండగా ఊహించని గందరగోళాన్ని ఎదుర్కొంది. విచిత్ర వాతావరణ పరిస్థితులతో విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యింది. బెర్ముడాలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. విమానాన్ని అత్యవసర మళ్లింపు చేయడంతో ప్రయాణికులు క్రిస్మస్ పండగ రోజును, బాక్సింగ్ డేనాడు బెర్ముడాలో గడపాల్సి వచ్చింది. డిసెంబర్ 24న మలెత్ ఏరో ఫ్లైట్ 225 మంది ప్రయాణికులతో బార్బడోస్ నుంచి ఒక గంట ఆలస్యంగా బయలుదేరింది. ఇది ఉదయం 6 గంటలలోపు మాంచెస్టర్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే బయలుదేరిన రెండు గంటల తర్వాత ఎయిర్‌బస్ విమానం 38,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు, తీవ్రమైన గందరగోళాన్ని ఎదుర్కొంది. దీంతో పైలెట్లు విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ కోసం దగ్గర్లోని బెర్మాడాకు మళ్లీంచారు. అక్కడ విమానం ల్యాండ్ అవుతుండగా 11 మంది ప్రయాణికులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరికి బర్ముడాలో చికిత్స అందించారు. అయితే సిబ్బందికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. -
ఇంగ్లండ్ బౌలర్ విధ్వంసం.. 30 బంతుల్లోనే..!
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌తో నిన్న (ఆగస్ట్ 13) జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్, ఒరిజినల్స్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి తుఫాన్ ఇన్నింగ్స్ (30 బంతుల్లో 83; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆడి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. Manchester Originals have won the derby 👊 Which player impressed you the most?#TheHundred pic.twitter.com/RLudfitjnD — The Hundred (@thehundred) August 13, 2023 అతనికి లారీ ఈవాన్స్ (18 బంతుల్లో 41; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఒరిజినల్స్ 90 బంతుల్లో (వర్షం అంతరాయం కారణంగా 90 బంతుల మ్యాచ్‌గా అంపైర్లు నిర్ణయించారు) 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఒరిజినల్స్ ఇన్నింగ్స్‌లో ఓవర్టన్, ఈవాన్స్తో పాటు పాల్ వాల్టర్ (22; 4 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. సూపర్ ఛార్జర్స్ బౌలర్లు రీస్ టాప్లే 3, బ్రైడన్ కార్స్, పార్కిన్సన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. The highest men's total for a Manchester Original player 🙌#TheHundred pic.twitter.com/RpRsNNOt7j — The Hundred (@thehundred) August 13, 2023 అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ ఛార్జర్స్ నిర్ణీత 90 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఒరిజినల్స్ బౌలర్లు ఉసామా మిర్ (4/19), జాషువ లిటిల్ (2/33) సూపర్ ఛార్జర్స్‌ను దారుణంగా దెబ్బకొట్టారు. వీరికి జోష్ టంగ్ (1/25), టామ్ హార్ట్లీ (1/9), పాల్ వాల్డర్ (1/26) తోడవ్వడంతో సూపర్ఛార్జర్స్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (37), సైఫ్ జైబ్ (21), హ్యారీ బ్రూక్ (20) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. Well, that was incredible... 👀#TheHundred pic.twitter.com/KBXmSj7nls — The Hundred (@thehundred) August 13, 2023 -
ఆ నగరంలో ఎక్కడపడితే అక్కడ కొత్త నాణేలు..ఎందుకంటే..
ఇంగ్లండ్‌లోని ప్రధాన నగరాల్లో ఒకటైన మాంచెస్టర్‌లో ఇటీవల కొద్దిరోజులుగా నాణేల కలకలం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. నగరంలోని వీథుల్లోను, బస్టాపులు, పార్కుల్లోని బెంచీల మీద, పార్కింగ్ టికెట్ మెషిన్లు, వెండింగ్ మెషిన్లు, ఫుడ్ కోర్టులు సహా జన సమ్మర్దం గల ప్రదేశాల్లో కొద్దిరోజులుగా మిలమిలలాడే సరికొత్త నాణేలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఇవి చెల్లా చెదురుగా పడి ఉంటున్నాయి. జనాల్లో కొందరు వీటిని జేబులో వేసుకుని తీసుకుపోతుంటే, ఇంకొందరు మనకెందులే అన్నట్లుగా ఎక్కడివక్కడే వదిలేసి ముందుకు సాగిపోతున్నారు. ఈ నాణేలు వీథుల్లో ఎక్కడపడితే అక్కడ ఎందుకు కనిపిస్తున్నాయో, వాటిని ఎవరు పడేశారో, దీని వెనుక గల ఉద్దేశమేమిటో జనాలకు కొద్దిరోజుల వరకు అంతుచిక్కలేదు. అయితే, దీనివెనుక గల కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న మాంచెస్టర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కోసం చేపట్టిన ‘ది ఫైండ్’ అనే ఆర్ట్ ప్రాజెక్టులో భాగంగా మార్క్ గాండెర్ అనే కళాకారుడు ఈ నాణేలను రూపొందించాడు. మాంచెస్టర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జూలై 16 నాటితో ముగుస్తోంది. ఫెస్టివల్ చివరి రోజు వరకు నగరంలోని వేర్వేరు చోట్ల ఇలా రెండు లక్షల నాణేలను ఉంచనున్నట్లు ఆర్ట్ ప్రాజెక్ట్ నిర్వాహకులు తెలిపారు. అన్వేషణ ద్వారా జ్ఞానాన్ని కనుక్కోగలమనే దాన్ని ఈ నాణేలు గుర్తు చేస్తాయని, ఇవి నగరవాసులకు, సందర్శకులకు జ్ఞాపికలుగా మిగిలిపోతాయని మార్క్ గాండెర్ వెల్లడించారు. (చదవండి: భూమిలో 285 అడుగుల లోతులో 'నగరం'.. 20 వేల మందిదాక ఉండొచ్చట!) -
మాంచెస్టర్‌లో హైస్కూల్ టీచర్.. సంబల్‌పురీ చీరకట్టి సంబురంగా పరుగెట్టీ
మొన్నటికి మొన్న గ్వాలియర్‌లో... చీరె ధరించి ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు మహిళామణులు. తాజాగా... మాంచెస్టర్ మారథాన్‌లో చీరె ధరించి పాల్గొని ‘శభాష్’ అని ప్రశంసలు అందుకుంటోంది మధుస్మిత జెన... చిన్నప్పటి నుంచి మధుస్మితకు పరుగెత్తడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చింది. మాంచెస్టర్‌లో హైస్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న మధుస్మిత జెన నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్ ఒడియా కమ్యూనిటీలో క్రియాశీల కార్యకర్త. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మారథాన్లు, ఆల్ట్రా మారథాన్లలో పాల్గొంది. తాజాగా మాంచెస్టర్‌లో 42.5 కి.మీల మారథాన్‌లో పాల్గొంది. ఈసారి మాత్రం అందరూ ఆశ్చర్యపడేలా చేసింది. అభినందనలు అందుకుంది. ఈసారి ప్రత్యేకత...సంబల్‌పురీ చీర కట్టి మారథాన్‌లో పాల్గొంది మధుస్మిత. ‘అంతదూరం చీరతో పరుగెత్తడం సులువేమీ కాదు’ అంటున్న మధుస్మిత సంతోషం ప్లస్ సంకల్పబలంతో నాలుగు గంటల యాభైనిమిషాలలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ‘చీరతో మారథాన్‌లో పాల్గొనడం అసాధ్యం అనేది చాలామంది నమ్మకం. ఇది తప్పని రుజువు చేయాలనుకున్నాను’ అంటుంది 41 సంవత్సరాల మధుస్మిత. ‘తనలోని ప్రతిభతో ఎప్పుడూ ఎంతోమందికి స్మిత స్ఫూర్తి ఇస్తుంటుంది. ఆమె విజయానికి గర్విస్తున్నాం’ అంటున్నాడు ఒడియా కమ్యూనిటీ మాజీ కార్యదర్శి సుకాంత్ కుమార్ సాహు. ఒడిశాలోని కుస్పూర్ గ్రామానికి చెందిన మధుస్మితకు తల్లి, అమ్మల ద్వారా చీరెపై ఇష్టం ఏర్పడింది. ఇంగ్లాండ్‌లో ప్రత్యేకమైన సందర్భాలు, వేసవిలో చీర ధరిస్తుంది మధుస్మిత. -
నాకు ద్రోహం చేశారు.. కానీ జట్టుపై అవేమీ ప్రభావం చూపలేవు: రొనాల్డో
Cristiano Ronaldo: ఫిఫా ప్రపంచకప్-2022 ఆదివారం(నవంబర్20)న దోహా వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో అతిథ్య ఖతర్ జట్టును ఈక్వెడార్ 2-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఇక ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం(నవంబర్ 21) రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఇరాన్‌తో ఇంగ్లండ్.. రెండో మ్యాచ్‌లో సెనెగల్, నెదర్లాండ్స్ జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఇక ఇది ఇలా ఉండగా.. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాంచెస్టర్ యునైటెడ్‌తో పాటు ఆ జట్టు కోచ్‌పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మాంచెస్టర్ యునైటెడ్‌తో పాటు ఆ జట్టు మేనేజర్ తనకు ద్రోహం చేశాడంటూ ఆరోపణలు చేశాడు. ఇదే విషయంపై మరోసారి రొనాల్డో స్పందించాడు. మాంచెస్టర్ యునైటెడ్‌తో తన గొడవ ప్రపంచకప్‌లో తమ జట్టుపై ఎటువంటి ప్రభావం చూపదని క్రిస్టియానో రొనాల్డో తెలిపాడు. విలేకరుల సమావేశంలో రొనాల్డో మాట్లాడూతూ.. "మాంచెస్టర్‌తో క్లబ్‌తో విభేదాలు ఆటగాడిగా నన్ను ప్రభావితం చేయవచ్చు. కానీ ఇటువంటి గొడవలు, వ్యక్తిగత విభేదాలు మా జట్టుపై ఏ మాత్రం ప్రభావం చూపవు" అని అతడు పేర్కొన్నాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో భాగంగా పోర్చ్‌గల్ తమ తొలి మ్యాచ్‌లో నవంబర్ 24న ఘనాతో తలపడనుంది. చదవండి: FIFA World Cup 2022: అమెరికా కెప్టెన్‌గా 23 ఏళ్ల టైలర్ ఆడమ్స్ Cristiano Ronaldo: 'పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు' -
ఎలాన్ మస్క్ మరో సంచలనం! ఫుట్‌బాల్ టీమ్‌ను కొంటున్నా!
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కొనుగోలుపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గారు. 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకోవడంతో మస్క్‌పై ట్విట్టర్ చట్టపరమైన పోరాటానికి దిగింది. ఈ నేపథ్యంలో మస్క్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్ టీం మాంచెస్టర్ యూనైటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. To be clear, I support the left half of the Republican Party and the right half of the Democratic Party! — Elon Musk (@elonmusk) August 16, 2022 ట్విట్టర్లో యాక్టీవ్‌గా ఉండే ఎలాన్ మస్క్ తాజాగా అమెరికన్ పాలిటిక్స్‌పై ట్వీట్ చేశారు. నేను రిపబ్లికన్,డెమోక్రటిక్ ఈ రెండు పార్టీలకు మద్దతు ఇస్తున్నాని ట్వీట్లో పేర్కొన్నారు. Also, I’m buying Manchester United ur welcome — Elon Musk (@elonmusk) August 17, 2022 కొద్ది సేపటికే ఫుట్‌బాట్ టీం మాంచెస్టర్ యూనైటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ట్వీట్లో వెల్లడించారు. ప్రస్తుతం మస్క్ నిర్ణయం బిజినెస్ వరల్డ్‌లో మరింత ఆసక్తికరంగా మారింది. ట్విట్టర్ కొనుగోలుపై విచారణ జరుగుతుండగా ఈ బిజినెస్ టైకూన్ నిర్ణయం సర్వత్రా ఆసక్తి నెలకొంది. చదవండి👉 'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ వైరల్! -
'లవర్‌ను వివస్త్ర చేసి గెంటివేత'.. మాజీ ఫుట్‌బాలర్‌పై ఆరోపణలు
మాంచెస్టర్ యునైటెడ్ మాజీ ఫుట్‌బాలర్.. వేల్స్ ఫుట్‌బాల్ మేనేజర్ రియాన్ గిగ్స్ చిక్కుల్లో పడ్డాడు. మాజీ గర్ల్‌ఫ్రెండ్ కేట్ గ్రీవెల్లిని నగ్నంగా హోటల్ రూం నుంచి బయటకు గెంటేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేట్ కోర్టుమెట్లను ఆశ్రయించడంతో ప్రస్తుతం రియాన్ గిగ్స్ యునైటెడ్ కింగ్డమ్ కోర్టులో ట్రయల్‌లో ఉన్నాడు. విషయంలోకి వెళితే.. వేల్స్ ఫుట్‌బాల్ మేనేజర్.. రియాన్ గిగ్స్ కేట్ గ్రీవెల్లిని ఇష్టపడ్డాడు. మొదట్లో అతని ప్రవర్తన నచ్చి ఆమె అతన్ని ఇష్టపడింది. ఆ తర్వాత రియాన్ కేట్‌పై వేధింపులకు దిగేవాడు. దాదాపు మూడేళ్లుగా ఆమెను శారీరకంగా వేధించడమే గాక ఆమె ఫోన్‌కు అసభ్యకర సందేశాలు పంపించేవాడు. ప్రతీరోజు సెక్స్ చేయాలని.. లేకుంటే తనతో చనువుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసేవాడు. గతంలో చాలాసార్లు కేట్తో గొడవపడి కొట్టిన సందర్బాలు ఉన్నాయి. దీంతో కేట్ గ్రీవెల్లి రియాన్ గిగ్స్‌తో తెగదెంపులు చేసుకోవాలని భావించింది. కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని రియాన్ గిగ్స్.. కేట్కు ఫోన్ చేసి హోటల్‌కు ఆహ్వానించాడు. అయితే కేట్ తన సోదరి ఎమ్మాతో కలిసి హోటల్‌కు వచ్చింది. ఆమె వచ్చే సమయానికి గిగ్స్ మరొక మహిళతో రిలేషిన్‌షిప్‌లో ఉన్నాడు. ఇది చూసిన కేట్స్కు విపరీతంగా కోపమొచ్చింది. వెంటనే లోపలికి వెళ్లిన కేట్స్.. మాట్లాడుకుందామని పిలిచి ఏం చేస్తున్నావు ? అంటూ నిలదీసింది. అయినా నీతో మాట్లాడి ప్రయోజనం లేదు.. మనిద్దరం విడిపోవడమే బెటర్ అని తన వెంట తెచ్చుకున్న సూట్‌కేసు తీసుకొని బయలుదేరుతుండగా.. గిగ్స్ కోపంతో ఆమె జుట్టు పట్టుకొని లాగాడు. ఇద్దరి మధ్య కాసేపు పెనుగులాట జరిగింది. కేట్స్ తలను గట్టిగా నేలకేసి కొట్టాడు గిగ్స్. ఈ క్రమంలో ఆమె పెదవులు చిట్లి నోటి నుంచి రక్తం వచ్చింది. అనంతరం ఆమెను వివస్త్రను చేసి హోటల్ రూం నుంచి బయటకు గెంటేశాడు. అడ్డువచ్చిన కేట్స్ చెల్లి ఎమ్మాను కూడా కొట్టి బయటకు తోశాడు. కేట్ సోదరి ఎమ్మా సమాచారంతో గిగ్స్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఆదివారం(ఆగస్టు7న) కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా వాదనలు విన్న కోర్టు గిగ్స్పై వచ్చిన ఆరోపణలు నిజమేనని.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ప్రస్తుతం గిగ్స్ ట్రయల్‌పై రిమాండ్‌లో ఉన్నాడు. చదవండి: కాబోయే భార్యతో సాగర తీరంలో టీమిండియా ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్ -
మాంచెస్టర్ వన్డేలో భారత్ ఘన విజయం
-
తప్పతాగి విమానంలో రచ్చ చేసిన యువకుడు.. గెంటేసిన పోలీసులు
ఇంగ్లండ్: విమానంలో తాగి రచ్చ రచ్చ చేశాడు ఓ వ్యక్తి. 11 ఏళ్ల తర్వాత స్నేహితుడితో కలిసి హాలిడే ట్రిప్‌కు వెళ్తున్నానే ఎగ్జైట్మెంట్లో అతిగా ప్రవర్తించాడు. అంతేకాదు విమానంలోని సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సదరు వ్యక్తి కూర్చున్న సీటు దగ్గరకు పోలీసులు వెళ్లారు. అతడు తాగి ఉన్నాడని, వోడ్కా బాటిల్లో మూడో వంతు కాళీ చేశాడని సిబ్బంది పోలీసులకు చెప్పారు. దీంతో అతడ్ని విమానం నుంచి దిగిపోమని పోలీసులు సూచించారు. అతడు మాత్రం పోలీసులతోనూ వాగ్వాదానికి దిగాడు. నా లగేజ్‌ను మీరు మోసుకొస్తారా? అని పోలీసులను ప్రశ్నించాడు. అంతేకాదు తనతో పోట్లాటకు రావాలని వాగాడు. చివరకు పోలీసులు అతడ్ని విమానం నుంచి దింపి వ్యానులో తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్లీ విమానంలోకి వెళ్లి సదరు వ్యక్తి స్నేహితుడ్ని కూడా విమానం నుంచి దిగాలని ఆదేశించారు. ఆ సమయంలో విమానంలోని ప్రయాణికులంతా చప్పట్లు కొట్టి పోలీసులను అభినందించారు. తాగి రచ్చ చేసిన వ్యక్తి పేరు ఆశ్లే క్రచ్లీ(27). ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో నివాసముంటాడు. హాలిడే ట్రిప్‌కు పోర్చుగల్‌కు వెళ్లే సమయంలో ఇలా చేశాడు. 11 ఏళ్ల తర్వాత తనకు హాలిడే వచ్చిందనే ఉత్సాహంలోనే అతడు ఎగ్జైట్ అయి ఇలా చేశాడని అతని తరఫు న్యాయవాది తెలిపారు. క్రచ్లీ తన ప్రవర్తనకు క్షమాపణలు కూడా చెప్పినట్లు పేర్కొన్నారు. విమానంలో ఇబ్బందికర ప్రవర్తనకు క్రచ్లీ రూ.30వేలు జరిమాన కట్టాలని కోర్టు ఆదేశించింది. అలాగే కోర్టు ఖర్చులకు రూ.8వేలు, బాధిత సిబ్బందికి రూ.12వేలు చెల్లించాలని చెప్పింది. చదవండి: మద్యపానంతో హాని... యువతకే ఎక్కువ! -
బిల్డింగ్‌లో బీచ్ ఉంటే ఎలా ఉంటుంది.. అదిరిపొద్దంతే కదా!
UK's First Indoor Beach: బీచ్ అనగానే విశాలమైన సముద్రం, నేలపై పరుచుకున్న ఇసుక తిన్నెలు, అప్పుడప్పుడు వచ్చిపోయే అలలు కళ్లముందు కనిపిస్తుంటాయి. మరి ఇలాంటివన్నీ బయట కాకుండా ఓ బిల్డింగ్ లాంటి ప్రదేశం లోపల ఇమిడిపోతే. అంటే ఇండోర్‌లోకి వచ్చేస్తే! బ్రిటన్‌లో అచ్చం ఇలాగే ఇండోర్ బీచ్ ఒకటి సిద్ధమవుతోంది. ఒక్క బీచ్ మాత్రమే కాదు.. మినరల్ బాత్‌లు, స్టీమ్ రూమ్‌లు, వేడి నీటి బుగ్గలు.. అబ్బో చూడముచ్చటైన చాలా అందాలు జతకూడనున్నాయి. ఈ బీచ్ పుట్టుపూర్వోత్తరాలు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందామా. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో.. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో ఏర్పాటు చేస్తున్న ఈ బీచ్‌కు ‘థర్మ్ మాంచెస్టర్’ అని పేరు పెట్టారు. దీన్ని దాదాపు రూ.2,500 కోట్లు ఖర్చుతో నిర్మిస్తున్నారు. 2023 నాటి కల్లా సిద్ధమవ్వాల్సి ఉన్నా మరిన్ని ప్రత్యేక వసతులను జత చేసి 2025 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నా రు. ఏటా 20 లక్షల మంది ఈ బీచ్‌ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. 28 ఎకరాల వైశాల్యంలో.. బీచ్‌ను 28 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. అంటే 19 ఫుట్ బాల్ పిచ్‌ల వైశాల్యమంత ఉంటుంది. ఇందులో ఇండోర్, ఔట్‌డోర్ పూల్స్, 35 వాటర్ స్లైడ్స్, స్టీమ్ రూమ్స్, విశ్రాంతి తీసుకోవడానికి తాటి చెట్లు ఏర్పాటు చేయనున్నారు. రోజా పువ్వు ఆకారంలో వెల్ బీయింగ్ గార్డెన్‌ను రెండెకరాల్లో రెడీ చేయనున్నారు. వందలాది చెట్లు, మొక్కలను పెంచనున్నారు. పెద్దల కోసం వేడి నీటి బుగ్గలు (వార్మ్ వాటర్ లగూన్స్), మినరల్ బాత్, స్టీమ్ రూమ్స్ సిద్ధం చేయనున్నారు. పైగా.. బార్లు, కేఫ్‌లు, స్నాక్స్ అందించే రెస్టారెంట్లు కూడా ఉంటాయి. విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజల కోసం ప్రత్యేకంగా సెంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. రోజువారి నీటి సంబంధమైన ఫిట్నెస్ క్లాసులు, యోగా, ధ్యానానికి సంబంధించిన శిక్షణ కూడా ఇవ్వనున్నారు. -
ఫిబ్రవరి 6, 1958.. ఫుట్‌బాల్ చరిత్రలో అతి పెద్ద విషాదం
చరిత్రలో కొన్ని ఘటనలు విషాదాలుగా మిగిలిపోయాయి. సమయం వచ్చినప్పుడు వాటి గురించి ప్రస్తావించుకోవడం తప్ప వాటిని మార్చలేం. అలాంటి కోవకు చెందినది 1958 మునిచ్ ఎయిర్ డిజాస్టర్. మాంచెస్టర్ యునైటెడ్‌కు చెందిన ఫుట్‌బాల్ టీమ్‌తో వెళ్తున్న ఎయిర్‌క్రాప్ట్ క్రాష్ అవడంతో అందులో ఉన్న 23 మంది ఆనవాళ్లు లేకుండా పోయారు. ఫుట్‌బాల్ చరిత్రలోనే అతి పెద్ద విషాదంగా మిగిలిపోయిన ఆ ఘోర దుర్ఘటనకు నేటితో(ఫిబ్రవరి 6) 64 ఏళ్లు పూర్తయ్యాయి. ఆరోజు ఏం జరిగింది.. 1958 ఫిబ్రవరి 6.. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ మంచి ఉత్సాహంతో ఉంది. ఏ మ్యాచ్‌లో పాల్గొన్న విజయం వారిదే అవుతుంది. ఎందుకంటే జట్టు మొత్తం యువ ఆటగాళ్ల రక్తంతో నిండిపోయింది. ఉరకలేసే ఉత్సాహానికి తోడు మంచి మేనేజర్ కలిగి ఉన్నాడు. అందుకే ఆ జట్టుకు బస్బే బేబ్స్ అని నిక్‌నేమ్ వచ్చింది. జర్మనీలోని మ్యునిచ్‌లో మ్యాచ్ ఆడడానికి ఫుట్‌బాల్ ప్లేయర్లు సహా ఇతర సిబ్బంది ఎయిర్‌బేస్‌లో బయలుదేరారు. విజయంతో తిరిగి రావాలని మాంచెస్టర్ ప్రజలు దీవించి పంపారు. కానీ వారి దీవెనలు పనిచేయలేదు. ఆకాశంలో ఎగిరిన కాసేపటికే ఎయిర్‌బేస్‌కు ట్రాఫిక్ సంబంధాలు తెగిపోయాయి. 𝑭𝒐𝒓𝒆𝒗𝒆𝒓 𝒂𝒏𝒅 𝒆𝒗𝒆𝒓, 𝒘𝒆'𝒍𝒍 𝒇𝒐𝒍𝒍𝒐𝒘 𝒕𝒉𝒆 𝒃𝒐𝒚𝒔. In 2018, our participants joined @ManUtd players to record this moving poem to mark the 60th anniversary of the Munich Air Disaster. Today, we share it again, as we remember the #FlowersOfManchester 🔴❤️ pic.twitter.com/rOk3tsdIDQ — Manchester United Foundation (@MU_Foundation) February 6, 2022 దీంతో ఎయిర్‌బేస్ కుప్పకూలిందేమోనన్న అనుమానం కలిగింది. వారి అనుమానమే నిజమయింది. సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలిన ఎయిర్ బేస్‌లో ఉన్న 8 మంది ఫుట్‌బాల్ ప్లేయర్స్ సహా, మాంచెస్టర్ యునైటెడ్ సిబ్బంది, జర్నలిస్టులు, ఎయిర్‌బేస్ సిబ్బంది సహా మరో ఇద్దరి ప్రయాణికులు మొత్తం 23 మందిలో ఏ ఒక్కరు బతికి బట్టకట్టలేదు. మ్యునిచ్ ఎయిర్‌బేస్ విమాన శకలాలు ఇప్పటికి అక్కడే ఉన్నాయి. చనిపోయిన వారి జ్ఞాపకార్థం అక్కడే మ్యూజియం ఏర్పాటు చేసి విమాన శకలాలను భద్రపరిచారు. మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్ళు జియోఫ్ బెంట్ రోజర్ బైర్న్ ఎడ్డీ కోల్మన్ డంకన్ ఎడ్వర్డ్స్ మార్క్ జోన్స్ డేవిడ్ పెగ్ టామీ టేలర్ లియామ్ "బిల్లీ" వీలన్ మాంచెస్టర్ యునైటెడ్ సిబ్బంది వాల్టర్ క్రిక్మెర్ - క్లబ్ కార్యదర్శి టామ్ కర్రీ - శిక్షకుడు బెర్ట్ వాలీ - చీఫ్ కోచ్ ఎయిర్‌బేస్ సిబ్బంది కెప్టెన్ కెన్నెత్ రేమెంట్ టామ్ కేబుల్ జర్నలిస్టులు ఆల్ఫ్ క్లార్క్ డానీ డేవిస్ జార్జ్ అనుసరిస్తాడు టామ్ జాక్సన్ ఆర్చీ లెడ్బ్రూక్ హెన్రీ రోజ్ ఫ్రాంక్ స్విఫ్ట్ ఎరిక్ థాంప్సన్ -
ఫుట్‌బాల్ ఆటగాడి మెడకు బిగుస్తున్న ఉచ్చు..
మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఫుట్‌బాలర్ మాసన్ గ్రీన్వుడ్ మెడకు ఉచ్చు మరింత బిగుస్తుంది.సెక్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాసన్ గ్రీన్‌వుడ్‌ను గత ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌పై బలవంతగా లైంగిక వేధింపులకు దిగినట్లు వచ్చిన వార్తలు నిజమా కాదా అనేది నిర్థారించాల్సి ఉంది. అయితే మాంచెస్టర్ యునైటెడ్ మొదట మాసన్ గ్రీన్వుడ్ విషయంలో ఎలాంటి చర్య తీసుకోలేదు. చదవండి: ఫుట్‌బాల్ ఆటగాడిపై ఆరోపణలు.. సంచలనం రేపుతున్న ఆడియో క్లిప్ తాజాగా అతనిపై వచ్చిన సెక్స్ ఆరోపణలు నిజమేనని తెలియడంతో ఫుట్‌బాల్ క్లబ్ కూడా గ్రీన్‌వుడ్‌పై కఠిన చర్యలు తీసుకుంది. తక్షణమే గ్రీన్‌వుడ్‌ను క్లబ్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. తన తప్పు లేదని నిరూపించుకునేవరకు గ్రీన్వుడ్ ఏ క్లబ్ తరపున ఫుట్‌బాల్ ఆడకుండా ఫుట్‌బాల్ సమాఖ్యకు సిఫార్సు చేసినట్లు పేర్కొంది. దీనికి తోడూ అన్ని ఎండార్స్మెంట్ల నుంచి గ్రీన్‌వుడ్‌ను తొలగిస్తున్నామంటూ తమ అధికారిక వెబ్సైట్లో అతని పేరు తొలగించిన పేజ్‌ను విడుదల చేసింది. ఇక గ్రీన్‌వుడ్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న నైక్ కంపెనీ తమ స్పాన్సర్సిప్ను రద్దు చేసుకుంటున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ''మాసన్ గ్రీన్‌వుడ్‌పై వస్తున్న ఆరోపణలు మమ్మల్ని ఆలోచనలో పడేశాయి. అందుకే తాత్కాలింకగా అతనితో స్పాన్సర్‌షిప్‌ను రద్దు చేసుకుంటున్నాం. పరిస్థితిని గమనిస్తున్నాం.'' అంటూ తెలిపింది. ఇక హారిట్ రాబ్సన్ అనే యువతి మాసన్ గ్రీన్‌వుడ్‌కు మాజీ గర్ల్‌ఫ్రెండ్ అంటూ చెప్పుకుంటూ గత ఆదివారం కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. తనతో శృంగారంలో పాల్గొనాలని చెప్పాడని.. మాట విననందుకు తన శరీర భాగాలపై దాడి చేశాడంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ తర్వాత హారిట్- గ్రీన్‌వుడ్‌కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేపును కూడా రిలీజ్ చేయడం సంచలనం రేపింది. -
రొనాల్డో కొత్త చరిత్ర.. ఎవరికి అందనంత ఎత్తులో
Cristiano Ronaldo Histroy 801 Goal.. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్.. మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. తన కెరీర్లో రొనాల్డో 800వ గోల్ నమోదు చేశాడు. మాంచెస్టర్ యునైటెడ్, ఆర్సినల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో ఈ ఘనత అందుకున్నాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో రెండు గోల్స్ నమోదు చేసిన రొనాల్డో 801 గోల్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో నిలవడం విశేషం. ఇప్పటివరకు అన్ని మ్యాచ్‌లు కలిపి 1138 వరకు ఆడిన రొనాల్డో.. క్లబ్ లీగ్స్ తరపున 485 గోల్స్, పోర్చుగల్ తరపున 115, కాంటినెంటల్‌లో 150, వివిధ మేజర్ కప్ టోర్నీల్లో 51 గోల్స్ సాధించాడు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో బాడీగార్డ్స్‌గా వ్యవహరిస్తున్నదెవరో తెలుసా! ఇక ఆఖరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ 3-2 తేడాతో ఆర్సినల్పై ఘన విజయాన్ని అందుకుంది. మాంచెస్టర్ యునైటెడ్ తరపున బ్రూనో ఫెర్నాండ్స్ ఆట 44వ నిమిషంలో, క్రిస్టియానో రొనాల్డో(ఆట 52వ నిమిషం, 70వ నిమిషంలో) గోల్స్ సాధించగా.. ఆర్సినల్ తరపున స్మిత్ రోవ్ ఆట 13వ నిమిషంలో.. ఓడీగార్డ్ ఆట 54వ నిమిషంలో గోల్ సాధించారు. 💯💯💯💯💯💯💯💯@Cristiano is out of this world 🌍#MUFC pic.twitter.com/UaQjnCUNH0 — Manchester United (@ManUtd) December 2, 2021 -
మాంచెస్టర్‌లో మహారాష్ట్ర కుర్చీ.. 7000 కి.మీ ఎలా ప్రయాణించిందంటే?
ప్రపంచం ప్రస్తుతం ఒక గ్రామంగా మారిపోయింది. ఏం అమ్మాలన్నా, కొనాలన్నా అంతర్జాతీయ మార్కెట్లతో చిటికలో పని జరిగిపోతుంది. ఒకచోట తయారైన వస్తువులు మరోచోట విక్రయం జరగుతుంది. గ్రామాల్లోని వస్తువులు దేశం దాటి ప్రపంచమంతా ప్రయాణిస్తుంటాయి. తాజాగా ఓ కుర్చీ మహారాష్ట్ర నుంచి యూకేలోని మాంచెస్టర్‌కు వెళ్లింది. ఖండాలు దాటిన జర్నీ ఆ కుర్చీ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. అసలు ఇది 7000 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి ఎలా వెళ్లిందో దీని వెనక కథ ఎంటో తెలుసుకుందాం. జర్నలిస్ట్ సునందన్ లేలే ఇటీవల ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ సిటీని సందర్శించాడు. అక్కడ ఓ రెస్టారెంట్‌లోని ఓపెన్ సీటింగ్ ఏరియాలో ఉన్న కుర్చీ అతన్ని బాగా ఆకర్షించింది. ఇనుముతో ఉన్న కుర్చీ వెనక మరాఠీలో ‘బాలు లోఖండే సవ్లాజ్’ అని రాసి ఉంది. దీనిని చూసిన అతను ఆశ్యర్యపోయాడు. ‘ఇది వింత కాదా’ అంటూ తన ట్విటర్లో దీనికి సంబంధించిన వీడియో పోస్టు చేశారు. ఈ ఆసక్తికరమైన విషయాన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. కుర్చీ ప్రయాణాన్ని చూస్తుంటే భారతీయ మార్కెట్ విస్తరణ ఏ విధంగా ఉందో అర్థమవుతోందని, చాలామంది మరాఠీలుగా గర్వపడుతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: గ్లోబల్ స్టార్డమ్ దక్కిన తొలి ఇండియన్ హీరో ఎవరో తెలుసా? కాగా కుర్చీ మహారాష్ట్రలోని సాల్వాజ్ గ్రామానికి చెందిన టెంట్‌హౌజ్ బాలు లోఖండేకు చెందినది. ఇటీవల ప్లాస్టిక్ కుర్చీలకు డిమాండ్ పెరగంతో టెంట్‌హౌజ్ యజమాని ప్లాస్టిక్ కుర్చీలను వాడుతుండటంతో లోఖాండే తన పాత ఇనుప కుర్చీలను 15 ఏళ్ల క్రితం పాత ఇనుప సామానులకు అమ్ముకోవాల్సి వచ్చింది. .అది కాస్తా మహారాష్ట్ర నుంచి 7,627 కిలోమీటర్ల దూరంలోని మాంచెస్టర్‌కు చేరింది. చదవండి: వైరల్: సింగిల్ మీల్‌కు లక్షా ఎనభై వేలు!! View this post on Instagram A post shared by Sunandan Lele (@lelesunandan) -
మాంచెస్టర్‌లో కొత్త చరిత్ర.. రెండు పెద్ద తలలు ఇక్కడే
మాంచెస్టర్: ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ సిటీకి కొత్త కళ వచ్చింది. క్రీడల్లో వేర్వేరు ఆటలకు సంబంధించిన రెండు పెద్ద తలలు ఇక్కడ అడుగుపెట్టడంతో అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. విషయంలోకి వెళితే ఒకరు క్రికెట్లో మెషిన్‌గన్ అయితే.. మరొకరు ఫుట్‌బాల్‌లో కింగ్‌గా పేరుపొందారు. వారే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. మరొకరు పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో రెండు జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో నేటి నుంచి జరగనుంది. ఈ సందర్భంగా టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్‌ను ఆరంభించింది. చదవండి: T20 World Cup 2021: విండీస్ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు ఇటీవలే 12 ఏళ్ల విరామం తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్లో చేరిన క్రిస్టియానో రొనాల్డో ఓల్డ్ ట్రాఫర్డ్లోనే న్యూకాసిల్ యునైటెడ్‌తో మ్యాచ్ ఆడనున్నాడు. ఈ సందర్భంగా లంకాషైర్ క్రికెట్ వినూత్న రీతిలో ట్వీట్ చేసింది. కోహ్లి, రొనాల్డోలు ఒక దగ్గరే ఉన్నారు. వారిద్దిర జాయింట్ ప్రాక్టీస్ సెషన్‌ను మీకు చూడాలని ఉందా అంటూ రాసుకొచ్చింది. దీనిపై మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ స్పందింస్తూ.. వన్ సిటీ.. టూ గోట్స్ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇక టీమిండియా ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. టీమిండియా ఈ మ్యాచ్ డ్రా చేసుకున్న సిరీస్ సొంతం అవుతుంది. అయితే ఇంగ్లండ్ మాత్రం చివరి టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. చదవండి: Messi VS Pele: 'నాకు అతనితో పోలికేంటి'.. దెబ్బకు దెబ్బ తీశాడు One city, two GOATs 😉 — Manchester United (@ManUtd) September 9, 2021 -
వైరల్: 22 వేల మంది ముందు.. ‘యెస్’ చెప్పేసింది!
మాంచెస్టర్: ఇంగ్లండ్- పాకిస్తాన్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. అనూహ్య పరిణామానికి అవాక్కైన ఆమె.. ఆశ్చర్యం నుంచి తేరుకుని అతడి ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ప్రియుడు ఇచ్చిన ఉంగరం స్వీకరించి కన్నీటి పర్యంతమైంది. చుట్టూ ఉన్న ప్రేక్షకులంతా చప్పట్లతో వీరి ప్రేమను హర్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ ఘటన గురించి కామెంటేటర్ డేవిడ్ లాయిడ్ మాట్లాడుతూ.. ‘‘హేయ్... ఇక్కడ ఏం జరుగుతోంది? జిల్, ఫిల్.. అంతేకదా జిల్.. ఫిల్. 22 వేల మంది ముందు ప్రపోజ్ చేశాడు. డెసిషన్ పెండింగ్‌లో ఉంది.. ఓహో.. ఆమె యెస్ చెప్పేసింది’’ అంటూ ప్రేమజంట పేర్లను వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ తమ అధికారికి ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. కాగా మ్యాచ్ 9వ ఓవర్ చివర్లో పాకిస్తాన్ ఆటగాళ్లు మహ్మద్ రిజ్వాన్, ఫఖార్ జమాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక చివరిదైన మూడో టీ20లో విజయం సాధించడం ద్వారా ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు... 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. జాసన్ రాయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. స్కోర్లు: పాకిస్తాన్- 154/6 (20) ఇంగ్లండ్- 155/7 (19.4) Decision Pending... ⏳ She said YES! 💍 Congrats Phil and Jill! ❤️ pic.twitter.com/SHj0iy45Pw — England Cricket (@englandcricket) July 21, 2021 -
ఒక్కరాత్రిలో ట్రిలియనీర్ అయిన స్కూల్ విద్యార్థి?
మనం కొన్ని సార్లు వార్తలలో ఒక్క రోజులో కోటీశ్వరడు అయినట్లు వచ్చిన వార్తలను ఇప్పటి వరకు చదివి ఉంటాం. కానీ, జార్జియా జరిగిన ఈ సంఘటన గురుంచి తెలిస్తే అందరూ ఆశ్చర్య పోతారు. సాదరణంగానే మన లాగే క్రిస్ విలియమ్స్ ప్రతి రోజు ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూస్తాడు. అలా ఒక రోజు ఉదయం 9 గంటలకు లేవగానే విలియమ్స్ తన ఫోను చూసి షాక్‌కు గురయ్యాడు. నేనేమైనా కల కంటున్నానా అని తన కళ్లు నులిమి చూసుకున్నాడు. క్రిప్టోకరెన్సీ రాకెట్ బన్నీలో 20 డాలర్లు పెట్టుబడి పెట్టిన క్రిస్ రాత్రికి రాత్రే ట్రిలియనీర్ అయిపోయాడు. జార్జియాలోని మాంచెస్టర్‌లో చదువుకుంటున్న నర్సింగ్ పాఠశాల విద్యార్థి క్రిస్ విలియమ్స్ గత ఎనిమిది నెలల నుంచి క్రిప్టోకరెన్సీపై అధ్యయనం చేస్తున్నాడు. గత వారం రాకెట్ బన్నీ అనే క్రిప్టోకరెన్సీలో 20 డాలర్లు పెట్టుబడిగా పెట్టాడు. ఈ విలువ ఆ మరుసటిరోజుకు 1.4 ట్రిలియన్లకు పెరిగింది. మన కరెన్సీలోకి మార్చుకుంటే దీని విలువ సరిగ్గా రూ.10,37,49,10,00,00,000. అక్షరాల దీని విలువ రూ.కోటి కోట్లకు పైమాటే. కాసేపటికి తేరుకున్న విలియమ్స్ ఆ మొత్తాన్ని వేరే వాలెట్‌లోకి మార్చుకునేందుకు ప్రయత్నించాడు. అది అదే ధరను ఇతర వాలెట్లో చూపించడం లేదని తాను ఇన్వెస్ట్ చేసిన కాయిన్‌బేస్ వాలెట్‌ను సంప్రదించాడు. తాము ఈ సమస్య పరిష్కారానికి రాకెట్ బన్నీని సంప్రదిస్తున్నామని జవాబు వచ్చింది. చాలా రోజులు గడిచిన ఎటువంటి సమాధానం రాకపోవడంతో సలహా కోసం ఈ విషయాన్ని విలియమ్స్ ట్విటర్లో నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. క్రిప్టోకరెన్సీలపై ఎప్పుడూ తనదైన శైలిలో ట్వీట్లు చేసే స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌నూ ట్యాగ్ చేసి, సలహా ఇవ్వాలని కోరాడు. తాను పెట్టుబడి పెట్టిన క్రిప్టోకరెన్సీ స్కామ్ కాకపోవచ్చని విలియమ్స్ భావిస్తున్నాడు. అతడు ఇంత మొత్తంలో వచ్చిన డబ్బును ఎన్నడూ ఖర్చు చేయలేనని కాబట్టి నేను దానిని మంచి పనుల కోసం వినియోగిస్తాను అని విలియమ్సన్ చెప్పాడు. ఆ డబ్బుతో కుటు౦బాన్ని మంచిగా చూసుకోవడం, సహోదరీలకు ఇళ్లు కట్టించడం, ప్రజలకు ఉచిత వైద్య క్లినిక్‌లను ప్రారంభిస్తానని క్రిస్ చెప్పుకొచ్చాడు. తర్వాత కొద్ది రోజులకు కాయిన్ బేస్ యాప్ విలియమ్సన్ ఖాతాను స్తంభింపచేసింది. దీంతో అంత మొత్తంలో వచ్చిన ఆ నగదును కాయిన్ బేస్ నుంచి ఉపసంహరించుకోలేడు, ఎటువంటి వర్తకం చేయలేడు. ఒక వార్త కథనం ప్రకారం కాయిన్ బేస్ ఈ సంఘటన గురుంచి వివరించింది. అదే రోజు జార్జియాలోని జాస్పర్ లో నివసిస్తున్న అతని స్నేహితుడు అదే నాణెం కొన్నాడు. కానీ అతడికి అంత మొత్తం నగదు జమ కాలేదు. దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. సాంకేతిక లోపం వల్ల విలియమ్సన్ ఖాతాలో అంతా మొత్తం సంపద జమ అయినట్లు పేర్కొంది. -
ఆసీస్‌కు అంతుచిక్కని బ్యాట్స్‌మన్
మాంచెస్టర్: గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్లో తన ఫామ్‌ను కొనసాగిస్తున్న ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమయ్యాడు. ఈ రోజు నుంచి మాంచెస్టర్ వేదికగా ఆరంభంగా కానున్న వన్డే సిరీస్‌లో మోర్గాన్ మరోసారి బ్యాట్ ఝుళిపించే అవకాశం ఉంది. ఇప్పటికే మోర్గాన్ నేతృత్వంలోని మోర్గాన్ సేన టీ20 సిరీస్‌ను గెలుచుకోగా, ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. అదే సమయంలో ఆసీస్‌కు ఈ లెఫ్ట్ హ్యాండర్ బెంగ పట్టుకుంది. ఇందుకు ఆసీస్‌పై వన్డేల్లో మోర్గాన్‌కు తిరుగులేని రికార్డు ఉండటమే. మరొకవైపు వన్డేల్లో ఇంగ్లండ్ ఆల్‌టైమ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా మోర్గాన్ కొనసాగుతుండటంతో అతనిపైనే ఆసీస్ ప్రధానంగా దృష్టి సారించనుంది. ప్రస్తుతం మోర్గాన్ వన్డేల్లో 6,766 పరుగులు సాధించి ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టాప్‌లో ఉన్నాడు. ఇక వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడింది కూడా మోర్గానే కావడం విశేషం. తన 11 ఏళ్ల కెరీర్లో మోర్గాన్ 216 మ్యాచ్‌లు ఆడాడు.ఇక తన సారథ్యంలో ఇంగ్లండ్ గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ను గెలుచుకని చరిత్ర సృష్టించింది. (చదవండి: సెరెనాకు ఊహించని షాక్) వన్డే ఫార్మాట్లో ఆసీస్‌కు అంతుచిక్కని బ్యాట్స్‌మన్ మోర్గాన్. ఆసీస్‌పై అత్యధిక పరుగులు సాధించిన ఎడమచేతి వాటం ఆటగాడు మోర్గాన్. ఇప్పటివరకూ ఆసీస్‌పై 54 వన్డేలు ఆడిన మోర్గాన్.. 1,864 పరుగులు నమోదు చేశాడు. ఇది ఆసీస్‌పై ఏ దేశం తరఫున చూసిన ఒక లెఫ్ట్ హ్యాండ్ క్రికెటర్ సాధించిన అత్యధిక పరుగుల రకార్డుగా ఉంది. ఆసీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఎడమచేతి ఆటగాళ్ల జాబితాలో మోర్గాన్ తొలి స్థానంలో ఉండగా, బ్రియాన్ లారా(వెస్టిండీస్) తర్వాత స్థానంలో ఉన్నాడు. ఆసీస్‌పై లారా సాధించిన పరుగులు 1,858. ఆపై వరుస స్థానాల్లో కుమార సంగక్కరా(1,813 శ్రీలంక), స్టీఫెన్ ఫ్లెమింగ్( 1,241 న్యూజిలాండ్), గ్యారీ కిరెస్టన్(1,167 దక్షిణాఫ్రికా)లు ఉన్నారు. ఆసీస్‌పై మోర్గాన్ 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. (చదవండి: స్వీడన్ జట్టు కోచ్‌గా జాంటీ రోడ్స్) -
ఇంగ్లండ్ పైచేయి...
మాంచెస్టర్: సాధారణంగా చప్పగా సాగిపోయే టెస్టు మ్యాచ్ ఇక్కడ రెండోరోజు మాత్రం వేగంగా మారిపోయింది. కష్టాలు సెషన్ల వారీగా జట్టు నుంచి జట్టుకు బదిలీ అయ్యాయి. అయితే ఓవరాల్‌గా నిర్ణాయక మూడో టెస్టులో రెండో రోజు ఆటను ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు శాసించింది. తొలి సెషన్లో తమ పేస్ పదునుతో దడదడలాడించిన వెస్టిండీస్ తర్వాత సెషన్ నుంచి కష్టాల్లో పడింది. ఆట ముగిసే సమయానికి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. వెలుతురులేమితో ఆటను ముగించే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు విండీస్ మరో 232 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు ఇంగ్లండ్ టెయిలెండర్ స్టువర్ట్ బ్రాడ్ (45 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. ఇంగ్లండ్ కష్టాలతో... ఓవర్‌నైట్ స్కోరు 258/4తో శనివారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో పోప్ (150 బంతుల్లో 91; 11 ఫోర్లు), సెంచరీ చేస్తాడనుకుంటే ఒక్క పరుగైనా చేయకుండానే పాత స్కోరుకే ఔటయ్యాడు. బట్లర్ (142 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా క్రితంరోజు స్కోరుకు 11 మాత్రమే జత చేశాడు. ఇద్దరినీ గాబ్రియెల్ పెవిలియన్ పంపాడు. తర్వాత కీమర్ రోచ్... వోక్స్ (1), ఆర్చర్ (3)లను ఔట్ చేశాడు. వరుస నాలుగు ఓవర్లలోనూ 4 వికెట్లు పడిపోవడంతో ఇంగ్లండ్ 280/8 స్కోరుతో కష్టాల్లో పడింది. ఒకదశలో 300 పరుగుల్లోపే తొలి ఇన్నింగ్స్ ముగిసేలా కనిపించింది. కానీ బ్రాడ్ మెరిపించడంతో టెస్టు కాసేపు వన్డేలా మారింది. ఈ టెయిలెండర్ దూకుడు పెరగడంతో జట్టు స్కోరు కూడా పెరిగింది. బ్రాడ్ 33 బంతుల్లో అర్ధసెంచరీ (8 ఫోర్లు, 1 సిక్స్) ఇంగ్లండ్ టెస్టు చరిత్రలో వేగవంతమై మూడో అర్ధసెంచరీగా నిలిచింది. డామ్ బెస్ (18 నాటౌట్; 1 ఫోర్)తో తొమ్మిదో వికెట్‌కు జతచేసిన 76 పరుగుల భాగస్వామ్యం ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను పటిష్టం చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 111.5 ఓవర్లలో 369 పరుగుల వద్ద ఆలౌటైంది. రోచ్ 4, గాబ్రియెల్, చేజ్ చెరో 2 వికెట్లు తీశారు. వోక్స్‌ను ఔట్ చేయడంతో కీమర్ రోచ్ 200 వికెట్ల క్లబ్‌లోకి చేరాడు. విండీస్ విలవిల... తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విండీస్‌ను బ్రాడ్ బంతితోనూ దెబ్బ తీశాడు. తన మొదటి ఓవర్లోనే క్రెయిగ్ బ్రాత్‌వైట్ (1)ను పడేశాడు. కాసేపయ్యాక మరో ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ (32)ను ఆర్చర్ ఔట్ చేయగా... షై హోప్ (17) అండర్సన్ స్వింగ్‌కు కంగుతిన్నాడు. టీ విరామంలోపే ఈ మూడు వికెట్లు పడటం కరీబియన్ ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీసింది. అప్పుడు విండీస్ స్కోరు 58/3. ఆఖరి సెషన్లోనూ ఇంగ్లండ్ బౌలర్ల హవానే కొనసాగడంతో వెస్టిండీస్ విలవిలలాడింది. బ్రూక్స్ (4)ను అనుభవజ్ఞుడైన అండర్సన్ బుట్టలో పడేయగా... చేజ్ (9)ను బ్రాడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 73 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. కాసేపు పోరాడిన బ్లాక్‌వుడ్ (26; 3 ఫోర్లు)... విండీస్ స్కోరు కష్టంగా 100 పరుగులు దాటాక వోక్స్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. ఆట నిలిచే సమయానికి కెప్టెన్ హోల్డర్ (24 బ్యాటింగ్; 4 ఫోర్లు), డౌరిచ్ (10 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. విండీస్ ఫాలోఆన్ తప్పించుకోవాలంటే మరో 33 పరుగులు చేయాలి. టెస్టు క్రికెట్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్న తొమ్మిదో వెస్టిండీస్ బౌలర్‌గా కీమర్ రోచ్ గుర్తింపు పొందాడు. గతంలో విండీస్ తరఫున కొట్నీ వాల్‡్ష, ఆంబ్రోస్, మార్షల్, లాన్స్ గిబ్స్, గార్నర్, హోల్డింగ్, గ్యారీ సోబర్స్, ఆండీ రాబర్ట్స్ ఈ ఘనత సాధించారు. -
నం.1 ఆల్‌రౌండర్‌గా బెన్‌స్టోక్స్
మాంచెస్టర్: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో వీర విహారం చేసిన ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ తర్వాత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ఆల్ రౌండర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్న మొదటి ఇంగ్లండ్ క్రికెటర్‌గా నిలిచాడు. విండీస్ టెస్టు కెప్టెన్ జాసన్ హోల్డర్(459)ను వెనక్కినెట్టి 497 పాయింట్లతో ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. అంతేగాక టెస్ట్ ర్యాంకింగ్స్ బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడో స్థానం((827))లో నిలిచాడు. కాగా మాంచెస్టర్‌లో విండీస్‌లో జరిగిన రెండో టెస్టులో 113 పరుగులతో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు... సిరీస్‌ను 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే. (బెన్‌స్టోక్స్ రికార్డు బ్యాటింగ్) ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 255 బంతుల్లో సెంచరీ నమోదు చేసిన బెన్‌స్టోక్స్.. రెండో ఇన్నింగ్స్‌లో 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సత్తాచాటాడు. తద్వారా టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ ఓపెనర్‌గా రికార్డు సాధించాడు. మొత్తంగా రెండో ఇన్నింగ్స్‌లో 57 బంతుల్లో 78 స్కోర్ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. అదే విధంగా ప్రత్యర్థి జట్లులో డ్రాపై ఆశలు రేపి హాఫ్ సెంచరీతో దూసుకుపోతున్న జర్మైన్ బ్లాక్‌వుడ్ వికెట్ తీసి మ్యాచ్‌ను కీలక మలుపు తిప్పాడు. ఈ క్రమంలో మ్యాన్ ఆఫ్ ‘ది మ్యాచ్ అవార్డు’ అందుకున్న స్టోక్స్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. కాగా చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1 సమం చేసిన జో రూట్ సేన తమ తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం మాంచెస్టర్ ఓల్డ్ ట్రపోర్డ్ మైదానంలో ఆడనుంది. 🚨 RANKINGS UPDATE 🚨 Ben Stokes is the new No.1 all-rounder 🤩 He is the first England player since Flintoff to be at the top of the @MRFWorldwide ICC Men's Test Player Rankings for all-rounders. Full rankings: https://t.co/AIR0KN4yY5 pic.twitter.com/viRzJzuGiC — ICC (@ICC) July 21, 2020 -
అలవాటులో పొరపాటు.. అంపైర్లకు తిప్పలు
మాంచెస్టర్: కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ప్రపంచ క్రికెట్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)అనేక కొత నిబంధనలను ప్రవేశపెట్టింది. ప్రధానంగా బంతిని లాలాజలంతో(సలైవా) రుద్ద కూడదనే నిబంధనను కచ్చితత్వం చేసింది. కాగా, ఈ నిబంధనలను తొలిసారి ఇంగ్లండ్ క్రికెటర్ డామ్ సిబ్లీ అతిక్రమించాడు. ఇంగ్లండ్-వెస్టిండీస్‌ల రెండో టెస్టులో భాగంగా నాల్గో రోజు సిబ్లీ రూల్స్ బ్రేక్ చేశాడు. బంతిని అందుకున్న మరుక్షణమే అనుకోకుండా చేతితో లాలాజలాన్ని బంతిపై రుద్ది నిబంధనలను ఉల్లంఘించాడు. నాలుగో రోజు లంచ్‌కు ముందు క్రిస్ ఓక్స్ ఓవర్ పూర్తవగానే బంతి సిబ్లీ చేతికొచ్చింది. బంతిని అందుకున్న సిబ్లీ అనుకోకుండా చేతి వేళ్లను నోటి దగ్గరకు పోనిచ్చాడు. వెంటనే లాలాజలాన్ని బంతిపై రుద్ది నాలుక కరుచుకున్నాడు. ఈ విషయం అంపైర్లకు తెలియడంతో బంతిని తీసుకుని శానిటైజర్ టవల్‌తో శుభ్రం చేశారు. సలైవా నిబంధనను మొదటిసారి బ్రేక్ చేసిన సిబ్లీ చర్యకు అంపైర్లకు తిప్పలు తప్పలేదు. ఏం చేయాలో తెలియక బంతిని శానిటైజ్ చేశారు. (‘జస్ప్రీత్ బుమ్రాతో చాలా డేంజర్’) తొలి టెస్టులో ఓడిపోయిన ఇంగ్లండ్ రెండో టెస్టులో ఫలితాన్ని శాసించే స్థితిలో నిలిచింది. నాలుగోరోజు ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 32/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ జట్టు 99 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు బ్రాడ్ (3/66), వోక్స్ (3/42), స్యామ్ కరన్ (2/70) రాణించారు. విండీస్ జట్టులో బ్రాత్‌వైట్ (75; 8 ఫోర్లు), బ్రూక్స్ (68; 11 ఫోర్లు), చేజ్ (51; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. 182 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 37 పరుగులు చేసింది. మరి ఇంగ్లండ్ లక్ష్యాన్ని నిర్దేశించి విజయం కోసం పోరాడుతుందో.. లేక డ్రాతోనే సరిపెట్టుకుంటుందో చూడాలి. (టి20 ప్రపంచకప్ భవితవ్యం తేలేది నేడే) -
సమమా... సంచలనమా!
ఇంగ్లండ్ గడ్డపై వెస్టిండీస్ టెస్టు సిరీస్ గెలిచి 32 ఏళ్లయింది. జట్టులో దిగ్గజాలు ఉన్న కాలంలో 1988లో ఈ ఘనత సాధించింది. ఇప్పుడు ఆ జట్టు ముందు బంగారు అవకాశం నిలిచింది. తొలి టెస్టు విజయం ఇచ్చిన స్ఫూర్తితో మరో గెలుపు అందుకుంటే ఈ సిరీస్ చిరస్మరణీయంగా మారిపోతుంది. అయితే అనూహ్యంగా గత మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లండ్ సొంతగడ్డపై మళ్లీ కోలుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌కు ముందు వరుసగా నాలుగు సిరీస్‌లలో తొలి టెస్టులో ఓడి కూడా ముందంజ వేసిన ఇంగ్లండ్ దానినే పునరావృతం చేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. మాంచెస్టర్: ఇంగ్లండ్, వెస్టిండీస్ తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు అంతా కరోనాకు సంబంధించిన హంగామాయే. మ్యాచ్ ఫలితంకంటే ఆట జరగడంపైనే అందరి దృష్టీ నిలిచింది. అయితే ఇప్పుడు అదంతా గతం. కరోనా ప్రస్తావన లేకుండా క్రికెట్ గురించి చర్చ మొదలైంది. ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ట్రాఫోర్డ్ మైదానం వేదికగా రెండో టెస్టు జరగనుంది. సౌతాంప్టన్‌లో తొలి మ్యాచ్ గెలిచిన విండీస్ ప్రస్తుతం 1–0తో ఆధిక్యంలో ఉంది. డెన్లీపై వేటు... అండర్సన్, వుడ్లకు విశ్రాంతి సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్ తుది జట్టును మ్యాచ్ రోజే ప్రకటించనుంది. అయితే తొలి టెస్టులో ఆడిన ముగ్గురిని రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ జో రూట్ మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. దాంతో జో డెన్లీని తుది జట్టు నుంచి తప్పించారు. నిజానికి రూట్ స్థానంలో తొలి టెస్టులో క్రాలీ ఆడినా... రెండో ఇన్నింగ్స్‌లో అతను బాగా ఆడటం, డెన్లీ రెండుసార్లు కూడా విఫలం కావడంతో వేటు తప్పలేదు. తొలి టెస్టులో ఆడిన బౌలర్లు అండర్సన్, మార్క్ వుడ్లకు విశ్రాంతి ఇచ్చారు. వారి స్థానాల్లో స్టువర్ట్ బ్రాడ్, ఒలీ రాబిన్సన్లను 13 మందితో ప్రకటించిన జట్టులోకి తీసుకున్నారు. తొలి టెస్టులో తనను తుది జట్టు నుంచి తప్పించడంపై స్టువర్ట్ బ్రాడ్ బహిరంగంగానే అసంతృప్తిని ప్రకటించాడు. మొత్తంగా చూస్తే బ్యాటింగ్ వైఫల్యం గత మ్యాచ్‌లో ఓటమికి కారణమైంది. కాబట్టి బ్యాట్స్‌మెన్‌పై ఈసారి బాధ్యత మరింత పెరిగింది. రూట్ రాకతో లైనప్ పటిష్టంగా మారింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ సొంతగడ్డపై ఇంగ్లండ్ స్థాయికి తగిన స్కోర్లు రాలేదు. కీపర్ బట్లర్ వైఫల్యం కూడా జట్టును దెబ్బతీస్తోంది. టాప్ ఆల్‌రౌండర్ స్టోక్స్ కెప్టెన్సీ సత్తా చాటితే ఇంగ్లండ్ మెరుగైన స్థితిలో నిలుస్తుంది. అదే విధంగా అండర్సన్ నుంచి కూడా జట్టు మరింత మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. మార్పుల్లేకుండానే... తొలి టెస్టు విజయంలో విండీస్ ఆటగాళ్లు ప్రతీ ఒక్కరు కీలకపాత్ర పోషించారు. అవసరమైన సందర్భంలో పట్టుదలగా ఆడి సమష్టితత్వంతో గెలిపించారు. కాబట్టి సహజంగానే అదే తుది జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కాస్త ఉదాసీనత ప్రదర్శించకుండా ఉంటే మరో గెలుపు సాధించేందుకు టీమ్‌కు అన్ని రకాలుగా అర్హత ఉంది. నలుగురు పేస్ బౌలర్ల మంత్రం గత మ్యాచ్‌లో ఫలించింది. ముఖ్యంగా హోల్డర్, గాబ్రియెల్ ప్రత్యర్థిని బాగా దెబ్బ కొట్టారు. వీరికి తోడు రోచ్ కూడా చెలరేగాల్సి ఉంది. ఏకైక స్పిన్నర్ ఛేజ్ తన విలువేంటో మళ్లీ చూపించాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్లు బ్రాత్‌వైట్, క్యాంప్‌బెల్ శుభారంభం అందిస్తే విండీస్ భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. తనలో ప్రతిభను బ్లాక్‌వుడ్ ఒక్క ఇన్నింగ్స్‌తో బయటపెట్టాడు. విడివిడిగా చూస్తే ఏ ఒక్కరూ స్టార్ కాకపోయినా జట్టుగా విండీస్ చెలరేగింది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తే మరో గెలుపు అసాధ్యం కాబోదు. ఓల్డ్‌ట్రాఫోర్డ్ మైదానంలో ఇప్పటివరకు ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య 15 టెస్టులు జరిగాయి. 6 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్, 5 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ గెలిచాయి. 4 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ఈ వేదికలో ఇంగ్లండ్‌పై విండీస్ చివరిసారి 1988లో టెస్టు గెలిచింది. ఇంగ్లండ్ మాత్రం విండీస్‌తో ఇక్కడ జరిగిన చివరి నాలుగు టెస్టుల్లో మూడింటిలో గెలిచి, మరో దానిని ‘డ్రా’ చేసుకుంది. -
ఎలుక పెయింటింగ్‌కు ఎంత డిమాండో..
లండన్ : పెయింటింగ్.. సహజంగా వివిధ రంగులతో ఉండి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అలాంటి కళా రూపాన్ని కొన్ని లక్షలు పోసి కొంటారు. అయితే కళకు మనుషులు, జంతువులు అన్న భేదం లేదని నిరూపించింది ఓ ఎలుక. తన చిట్టి పొట్టి పాదాలతో ఓ కళాఖండాన్ని రూపొందించింది. ఈ చిట్టెలుక గీసిన బొమ్మను వేలు పెట్టి కొంటారని మీకు తెలుసా. అవునండి.. ఎలుక గీసిన చిత్రం ఏకంగా 1000 పౌండ్లు (అక్షరాల 92 వేలు) సంపాందించింది. (బుడ్డోడి వలకు చిక్కిన ఖజానా; కానీ) వివరాళ్లోకి వెళితే.. మాంచెస్టర్‌కు చెందిన జెస్ అనే మహిళ కొన్ని ఎలుకలను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో గుస్ అనే ఎలుకతో ఓ పెయింటింగ్ వేసింది. డ్రాయింగ్ రూమ్‌లో ఎలుక పాదాలను పెయింట్‌లో ముంచి కొన్ని కాగితాలపై ఉంచారు. అది అటు ఇటు తిరుగుతుంటే పేపర్‌పై ఎలుక అడుగులు కలర్ఫుల్గా ఏర్పడ్డాయి. అలా కొన్ని పేపర్లపై వేసిన ఎలుక పాదాల పేయింటింగ్లన్నింటినీ ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. అలా పెయింటింగ్‌లు అన్ని అమ్ముడుపోగా జెస్ మొత్తం 1000 పౌండ్లను రాబట్టింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. 'ఎలుక చిత్రాలకు ఇంత మార్కెట్ ఉందా?' అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గుస్ ప్రస్తుతం మినీ ‘హెన్రీ మాటిస్సే’ అయ్యిందని ఆమె అన్నారు. (నేను మాస్కు ధరించా.. మరి మీరు: మహేశ్) -
కరోనా నుంచి రక్షణకు సరికొత్త మాస్క్‌లు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడకుండా తప్పించుకునేందుకు ప్రజలు రకరకాల మాస్క్‌లు వాడుతున్నారు. అవి మామూలు ధరల నుంచి అసాధారణ ధరల వరకు ఉండడమే కాకుండా నాసిరకం నుంచి నాణ్యమైనవి వరకు ఉన్నాయి. ఎంత ఖరీదు పెట్టి కొన్న ఎంతటి నాణ్యమైనా మాస్క్ అయినా సరే దానిపై కరోనా వైరస్ వారం రోజుల పాటు బతికుండే అవకాశం ఉందంటూ లండన్ వైద్యులు తేల్చిన నేపథ్యంలో ప్రజలకు కొత్త భయాలు పట్టుకున్నాయి. పైగా మాస్క్‌లు ధరించడం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. కొందరికి శ్వాస సరిగ్గా ఆడదు. కొందరికి దురద పెట్టినట్లు ఉంటుంది. ఏదేమైనా చీకాకుగా ఉంటుందనడంలో సందేహం లేదు.మాస్క్ అంటే ముఖాన కప్పుకునే ముకుమల గుడ్డలా మెత్తగా ఉండాలి. పైగా ఏరోజుకారోజు పారేసే దానిలా కాకుండా ఏ రోజుకారోజు ఉతుక్కుని మళ్లీ ధరించేలా ఉండాలి. వీలయితే కరోనా వైరస్‌ను ఆకర్షించి చంపేసే రసాయనంతో కూడినదై ఉండాలి.(ఈ టెక్నిక్‌తో కరోనా వైరస్‌కు చెక్!) ప్రొఫెసర్ సబీనా ష్లిష్ అచ్చం ఇలాగా ఆలోచించినట్లు ఉన్నారు. ఆమె చేసిన సూచనల మేరకు అచ్చం ఇలాగే ఉపయోగపడే మాస్క్‌లను ‘మాన్చెస్టర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ’ పరిశోధకులు తయారు చేశారు. వీటిని మామూలుగా మాస్క్లనకుండా ‘స్నూద్’అని పిలుస్తున్నారు. అవి మెడ కింది నుంచి ముఖంపైన కళ్లవరకు ముసుగు ధరించినట్లు ఉండడమే అందుకు కారణం. మనం ముక్కు నుంచి శ్వాసను పీల్చుకునే నాళం పైభాగాన ప్రొటీన్ల మిశ్రమం ఉన్నట్లే ఈ స్నూద్‌కు ప్రొటీన్ల మిశ్రమం పూత ఉంటుందని, అది వైరస్‌లను ఎదుర్కోవడానికి మనకు శక్తినిస్తుందని, అలాగే ప్రొటీన్ల పూతకు పై భాగాన వైరస్‌లను నిర్వీర్యం చేసే రసాయనం ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ప్రొటీన్లు ఉన్నప్పుడే కెమికల్ రియాక్షన్ ఉంటుందని, లేకపోతే లేదని వారు చెప్పారు. ఈ స్నూద్‌లను ఏ రోజుకారోజు ఉతుక్కొని మళ్లీ ధరించవచ్చని కూడా చెప్పారు. అయితే ఎన్ని రోజుల వరకు దాన్ని ధరించవచ్చో, ఎన్ని రోజుల వరకు దానిపై ప్రొటీన్లు, రసాయనం పూత ఉంటుందో వారు చెప్పలేదు. తల పైభాగం నుంచి ధరించే ఈ స్నూద్‌లు ఆన్లైన్ మార్కెట్లో 20 పౌండ్లకు (దాదాపు 1800 రూపాయలు) అందుబాటులో ఉన్నాయి.(మనిషి నుంచి పులికి సోకిన కరోనా వైరస్) -
పిల్లలతో వాంఛ.. దంపతులకు 26 ఏళ్ల జైలు
మాంచెస్టర్: ‘మీ ఇద్దరికి లైంగిక కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మీకు, మీ ఇంటి వరకు పరిమితం అయితే అది మీ ప్రైవసికి సంబంధించిన విషయం. అది మీ పరిధి దాటి ముక్కు పచ్చలారని పిల్లలను మీ కామవాంఛలోకి లాగారు. అది ఆ పిల్లలపై ఎంతో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా వారి తల్లిదండ్రులకు అంతులేని బాధను మిగులుస్తుంది. అందుకని మిమ్మల్ని కఠినంగా శిక్షించాల్సిందే!’ ‘మీలో కీలి బుర్లింగమ్ అనే 33 ఏళ్ల యువతి సామాన్యరాలు, సాదాసీతా జీవితం గడుపుతున్నారు. ఆమె మానసికంగా ఎంతో కుమిలిపోతోంది. పెళ్లి పెటాకులవడంతో కూడా ఆమె బాధ పడుతోంది. భర్త పీటర్ టేలర్ (33) ప్రోద్బలం లేకపోతే ఆమె ఇంతగా దిగజారేది కాదు, పీటర్‌ను పెళ్లే చేసుకోకపోతే ఆమె కోర్టు గడప తొక్కాల్సి వచ్చేది కాదన్న డిఫెన్స్ వాదనను పరిగణలోకి తీసుకుంటున్నాను. అయినా కమిషన్ ఆఫ్ చైల్డ్ సెక్స్ అఫెన్స్, సెక్సువల్ అసాల్ట్ ఏ చైల్డ్ అండర్ 13 కింద కఠినమైన శిక్ష విధించాల్సిందే. అన్ని అంశాలకు పరిగణలోకి తీసుకొని 11 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నాను. అలాగే, పీటర్ టేలర్ ఇక్కడ ప్రధాన నేరస్థుడు. కామవాంఛ తీసుకునేందుకు స్కూల్ డ్రెస్ వేసుకొని రావాల్సిందిగా భార్య బుర్లింగమ్‌ను కోరారు. అందుకు ఆమె అంగీకరించి అలాగే రావడంతో సమస్య మొదలయింది. స్కూల్ గర్ల్స్ మీదకు పీటర్ టేలర్ మనసు మళ్లింది. 11 ఏళ్ల నుంచి ఐదేళ్ల వయస్సున్న ఆడ, మగ పిల్లలపై అత్యాచారం జరిపారు. ఈ విషయంలో భర్తకు సహకరించిన భార్య బుర్లింగమ్ కూడా పిల్లలతో కామవాంఛ తీర్చుకున్నారు. భార్యను స్కూల్ డ్రెస్‌లో చూడాలనుకున్న టేలర్‌కు, స్కూల్ పిల్లలపై ఎప్పటి నుంచి కోరిక ఉండి ఉంటుంది. అన్ని విధాల అతనే ప్రధాన నేరస్థుడిగా నిర్ధారిస్తూ 15 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నాను. అయినా ఇద్దరు ఇక్కడ సెక్స్ అఫెండర్స్ రిజిస్టర్ (వీరి వల్ల భవిష్యత్తులో ముప్పుందనుకుంటే యావజ్జీవ కారాగారా శిక్ష విధించేందుకు ఈ రిజిస్టర్ తోడ్పడుతుంది)లో సంతకం చేయాలి’ అని మాంచెస్టర్‌లోని మిన్శుల్ స్ట్రీట్ క్రౌన్ కోర్టు జడ్జీ మార్క్ సావిస్ శనివారం నాడు మాజీ దంపతులకు శిక్ష విధించారు. ఒకే వయస్సుగల బుర్లింగమ్, టేలర్‌లో గ్రేటర్ మాన్‌చెస్టర్‌లోని డుకిన్‌ఫీల్డ్‌కు చెందిన వారు. వారు 2016లో డేటింగ్ వెబ్సైట్ ద్వారా ప్రేమించుకున్నారు. భార్య ఓ కేఫ్‌లో పనిచేస్తుండగా, భర్త ఎలక్ట్రిషియన్‌గా పనిచేశారు. పెళ్లికి ముందే వారి మధ్య అనైతికంగా లైంగిక సంబంధం ఏర్పడింది. అది కొద్ది కాలానికే పెడతోవలు పట్టింది. ముందుగా టేలర్ కామవాంఛ ఉద్దీపన కోసం ఇంటర్నెట్ నుంచి పిల్లల అసభ్య ఫొటోలను డౌన్లోడ్ చేసుకొని బుర్లింగమ్కు పంపించే నీచానికి దాగాడు. తర్వాత పెళ్లి చేసుకున్నాక స్కూల్ డ్రెస్‌తో మొదలైన తతంగం పిల్లలతో కామవాంఛ తీర్చుకునే దారుణ స్థాయికి వెళ్లింది. పార్ట్‌టైమ్ బేబీ సిట్టర్‌గా పనిచేసిన బుర్లింగమ్ ఐదేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, దాన్ని సెల్‌ఫోన్ ద్వారా రికార్డు చేసి, ఆ వీడియోను భర్తకు పంపించారట. అప్పటి నుంచి ఆ భార్యా భర్తలిద్దరు కలిసి, విడివిడిగానూ అసభ్యంగా పిల్లలతో గడపడమే కాకుండా వాటిని సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసి పరస్పరం షేర్ చేసుకునే పైత్యానికి దిగారు. ఆ తర్వాత వారి మధ్య పరస్పరం మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అయినప్పటికీ వారు పిల్లలతో పెట్టుకున్న సంబంధాన్ని వదులుకోలేక పోయారట. పక్కింటి ఐదేళ్ల బాలుడి తల్లి ఫిర్యాదుతో మొదట బుర్లింగమ్ అరెస్ట్ అయ్యారు. ఆమె దగ్గర దొరికిన సాక్ష్యాధారాల ఆధారంగా 2019, ఏప్రిల్ నెలలో టేలర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి సెల్ఫోన్లలో నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫొటోలు, షేర్ చేసుకున్న వీడియోలు, పంపుకున్న సందేశాలు దొరికాయి. వాటి ఆధారంగానే కేసు విచారణ ఇటీవలే ముగియడంతో శనివారం నాడు తీర్పు వెలువడింది. (ప్రేమించి, పెళ్లి చేసుకున్న భార్యపై..)