
మాంచెస్టర్ : భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా..! సగటు క్రికెట్ అభిమానిని ఇప్పుడు పీడిస్తున్న ధర్మ సందేహమిది. మాంచెస్టర్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు జట్లు, బలాబలాల సంగతులు ఎలా ఉన్నా ఈ వరల్డ్‌కప్ ఫలితాలను వర్షం కూడా శాసిస్తోంది. వాన కారణంగా రద్దయిన నాలుగు మ్యాచ్‌లలో భారత్ మ్యాచ్ కూడా ఉంది. కివీస్‌తో మ్యాచ్ పోయినా పెద్దగా పట్టించుకోలేదు కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్ మాత్రం కచ్చితంగా జరగాలని అంతా కోరుకుంటున్నారు. అటు పాక్ అభిమానులు కూడా అంతే శ్రీలంకతో మ్యాచ్ రద్దైనా పట్టించుకోలేదు.
అయితే మాంచెస్టర్‌లో పరిస్థితి మాత్రం అంత ఆశాజనకంగా లేదు. ఇంగ్లండ్‌లో వాతావరణం గురించి దాదాపు కచ్చితమైన సమాచారం అందించే ఏజెన్సీలు అన్నీ ఆదివారం వర్షం పడుతుందనే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అభిమానులు గూగుల్‌లో వెతికేది ఒకటే.. మాంచేస్టర్ వెదర్ రిపోర్డు. ప్రతి అరగంటకు ఒకసారి సర్చ్ చేస్తూ అక్కడి వాతావరణ వివరాలను తెలసుకుంటున్నారు. దీంతో ఇరు దేశాల్లో అతిగా సెర్చ్ చేసిన పదంగా మాంచెస్టర్ వెదర్ రిపోర్ట్ నిలిచింది. ఇక ట్విటర్‌లో #IndiaVsPakistan ఎక్కువగా ట్రెండ్ అవుతుండగా.. Manchester మూడో స్థానంలో ఉంది.
Sitting in the subcontinent, worried about the 🌧️ in Manchester 😎 #INDvPAK #CWC19 pic.twitter.com/je3MsMDRUK
— ESPNcricinfo (@ESPNcricinfo) June 16, 2019
Comments
Please login to add a commentAdd a comment