'లవర్‌ను వివస్త్ర చేసి గెంటివేత'.. మాజీ ఫుట్‌బాలర్‌పై ఆరోపణలు | Footballer Ryan Giggs Threw Former Girlfriend Kate Greville Out Hotel Room | Sakshi
Sakshi News home page

'లవర్‌ను వివస్త్ర చేసి గెంటివేత'.. మాజీ ఫుట్‌బాలర్‌పై ఆరోపణలు

Published Wed, Aug 10 2022 3:27 PM | Last Updated on Wed, Aug 10 2022 3:43 PM

Footballer Ryan Giggs Threw Former Girlfriend Kate Greville Out Hotel Room - Sakshi

మాంచెస్టర్‌ యునైటెడ్‌ మాజీ ఫుట్‌బాలర్‌.. వేల్స్‌ ఫుట్‌బాల్‌ మేనేజర్‌ రియాన్‌ గిగ్స్‌ చిక్కుల్లో పడ్డాడు. మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ కేట్‌ గ్రీవెల్లిని నగ్నంగా హోటల్‌ రూం నుంచి బయటకు గెంటేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేట్‌ కోర్టుమెట్లను ఆశ్రయించడంతో ప్రస్తుతం రియాన్‌ గిగ్స్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ కోర్టులో ట్రయల్‌లో ఉన్నాడు. 

విషయంలోకి వెళితే.. వేల్స్‌ ఫుట్‌బాల్‌ మేనేజర్‌.. రియాన్‌ గిగ్స్‌ కేట్‌ గ్రీవెల్లిని ఇష్టపడ్డాడు. మొదట్లో అతని ప్రవర్తన నచ్చి ఆమె అతన్ని ఇష్టపడింది. ఆ తర్వాత రియాన్‌ కేట్‌పై వేధింపులకు దిగేవాడు. దాదాపు మూడేళ్లుగా ఆమెను శారీరకంగా వేధించడమే గాక ఆమె ఫోన్‌కు అసభ్యకర సందేశాలు పంపించేవాడు. ప్రతీరోజు సెక్స్‌ చేయాలని.. లేకుంటే తనతో చనువుగా ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు. గతంలో చాలాసార్లు కేట్‌తో గొడవపడి కొట్టిన సందర్బాలు ఉన్నాయి.

దీంతో కేట్‌ గ్రీవెల్లి రియాన్‌ గిగ్స్‌తో తెగదెంపులు చేసుకోవాలని భావించింది. కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని రియాన్‌ గిగ్స్‌.. కేట్‌కు ఫోన్‌ చేసి హోటల్‌కు ఆహ్వానించాడు. అయితే కేట్‌ తన సోదరి ఎమ్మాతో కలిసి హోటల్‌కు వచ్చింది. ఆమె వచ్చే సమయానికి గిగ్స్‌ మరొక మహిళతో రిలేషిన్‌షిప్‌లో ఉన్నాడు. ఇది చూసిన కేట్స్‌కు విపరీతంగా కోపమొచ్చింది. వెంటనే లోపలికి వెళ్లిన కేట్స్‌.. మాట్లాడుకుందామని పిలిచి ఏం చేస్తున్నావు ? అంటూ నిలదీసింది.

అయినా నీతో మాట్లాడి ప్రయోజనం లేదు.. మనిద్దరం విడిపోవడమే బెటర్‌ అని తన వెంట తెచ్చుకున్న సూట్‌కేసు తీసుకొని బయలుదేరుతుండగా.. గిగ్స్‌ కోపంతో ఆమె జుట్టు పట్టుకొని లాగాడు. ఇద్దరి మధ్య కాసేపు పెనుగులాట జరిగింది. కేట్స్‌ తలను గట్టిగా నేలకేసి కొట్టాడు గిగ్స్‌. ఈ క్రమంలో ఆమె పెదవులు చిట్లి నోటి నుంచి రక్తం వచ్చింది. అనంతరం ఆమెను వివస్త్రను చేసి హోటల్‌ రూం నుంచి బయటకు గెంటేశాడు. అడ్డువచ్చిన కేట్స్‌ చెల్లి ఎమ్మాను కూడా కొట్టి బయటకు తోశాడు.

కేట్‌ సోదరి ఎమ్మా సమాచారంతో గిగ్స్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఆదివారం(ఆగస్టు7న) కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా వాదనలు విన్న కోర్టు గిగ్స్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ప్రస్తుతం గిగ్స్‌ ట్రయల్‌పై రిమాండ్‌లో ఉన్నాడు.

చదవండి: కాబోయే భార్యతో సాగర తీరంలో టీమిండియా ఆల్‌రౌండర్‌.. ఫొటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement