Former footballer
-
'లవర్‌ను వివస్త్ర చేసి గెంటివేత'.. మాజీ ఫుట్‌బాలర్‌పై ఆరోపణలు
మాంచెస్టర్ యునైటెడ్ మాజీ ఫుట్‌బాలర్.. వేల్స్ ఫుట్‌బాల్ మేనేజర్ రియాన్ గిగ్స్ చిక్కుల్లో పడ్డాడు. మాజీ గర్ల్‌ఫ్రెండ్ కేట్ గ్రీవెల్లిని నగ్నంగా హోటల్ రూం నుంచి బయటకు గెంటేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేట్ కోర్టుమెట్లను ఆశ్రయించడంతో ప్రస్తుతం రియాన్ గిగ్స్ యునైటెడ్ కింగ్డమ్ కోర్టులో ట్రయల్‌లో ఉన్నాడు. విషయంలోకి వెళితే.. వేల్స్ ఫుట్‌బాల్ మేనేజర్.. రియాన్ గిగ్స్ కేట్ గ్రీవెల్లిని ఇష్టపడ్డాడు. మొదట్లో అతని ప్రవర్తన నచ్చి ఆమె అతన్ని ఇష్టపడింది. ఆ తర్వాత రియాన్ కేట్‌పై వేధింపులకు దిగేవాడు. దాదాపు మూడేళ్లుగా ఆమెను శారీరకంగా వేధించడమే గాక ఆమె ఫోన్‌కు అసభ్యకర సందేశాలు పంపించేవాడు. ప్రతీరోజు సెక్స్ చేయాలని.. లేకుంటే తనతో చనువుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసేవాడు. గతంలో చాలాసార్లు కేట్తో గొడవపడి కొట్టిన సందర్బాలు ఉన్నాయి. దీంతో కేట్ గ్రీవెల్లి రియాన్ గిగ్స్‌తో తెగదెంపులు చేసుకోవాలని భావించింది. కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని రియాన్ గిగ్స్.. కేట్కు ఫోన్ చేసి హోటల్‌కు ఆహ్వానించాడు. అయితే కేట్ తన సోదరి ఎమ్మాతో కలిసి హోటల్‌కు వచ్చింది. ఆమె వచ్చే సమయానికి గిగ్స్ మరొక మహిళతో రిలేషిన్‌షిప్‌లో ఉన్నాడు. ఇది చూసిన కేట్స్కు విపరీతంగా కోపమొచ్చింది. వెంటనే లోపలికి వెళ్లిన కేట్స్.. మాట్లాడుకుందామని పిలిచి ఏం చేస్తున్నావు ? అంటూ నిలదీసింది. అయినా నీతో మాట్లాడి ప్రయోజనం లేదు.. మనిద్దరం విడిపోవడమే బెటర్ అని తన వెంట తెచ్చుకున్న సూట్‌కేసు తీసుకొని బయలుదేరుతుండగా.. గిగ్స్ కోపంతో ఆమె జుట్టు పట్టుకొని లాగాడు. ఇద్దరి మధ్య కాసేపు పెనుగులాట జరిగింది. కేట్స్ తలను గట్టిగా నేలకేసి కొట్టాడు గిగ్స్. ఈ క్రమంలో ఆమె పెదవులు చిట్లి నోటి నుంచి రక్తం వచ్చింది. అనంతరం ఆమెను వివస్త్రను చేసి హోటల్ రూం నుంచి బయటకు గెంటేశాడు. అడ్డువచ్చిన కేట్స్ చెల్లి ఎమ్మాను కూడా కొట్టి బయటకు తోశాడు. కేట్ సోదరి ఎమ్మా సమాచారంతో గిగ్స్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఆదివారం(ఆగస్టు7న) కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా వాదనలు విన్న కోర్టు గిగ్స్పై వచ్చిన ఆరోపణలు నిజమేనని.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ప్రస్తుతం గిగ్స్ ట్రయల్‌పై రిమాండ్‌లో ఉన్నాడు. చదవండి: కాబోయే భార్యతో సాగర తీరంలో టీమిండియా ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్ -
ఒలింపియన్ ఫుట్‌బాలర్ హకీమ్‌కు కరోనా
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, 1960 రోమ్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన సయ్యద్ షాహిద్ హకీమ్ కోవిడ్–19 బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని హైదరాబాద్‌కు చెందిన 81 ఏళ్ల హకీమ్ స్వయంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన నగరంలోని ఒక హోటల్లో ప్రభుత్వ పర్యవేక్షణలో క్వారంటైన్లో ఉన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకొని త్వరలోనే ఇంటికి వెళతానని హకీమ్ విశ్వాసం వ్యక్తం చేశారు. హకీమ్‌కు ముందుగా న్యుమోనియా సోకగా... పరీక్షల అనంతరం కరోనాగా తేలింది. గతంలో ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసిన ఆయన ముందుగా మిలిటరీ ఆస్పత్రిలో చేరేందుకు ప్రయత్నించగా పడకలు అందుబాటులో లేవని తెలిసింది. ప్రభుత్వ ఆస్పత్రిలలో సౌకర్యాలపై సందేహంతో చివరకు హోటల్లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. భారత దిగ్గజ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ (ఎస్ఏ) రహీమ్ కుమారుడైన హకీమ్ రిటైర్మెంట్ అనంతరం కోచ్‌గా, రిఫరీగా కూడా పని చేశారు. ఫుట్‌బాల్‌కు హకీమ్ అందించిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 2017లో ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారంతో గౌరవించింది. -
మాజీ ఫుట్‌బాలర్ సఫీ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు జీఎంఎస్ సఫీ (47) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1993–2001 మధ్య కాలంలో ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ సహా పలు టోర్నీల్లో సఫీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్ వేదికగా 2001లో జాతీయ క్రీడల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించారు. ఎస్బీఐ (సీసీపీసీ) హైదరాబాద్ శాఖలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న సఫీ...ఇటీవలే ఆలిండియా ఇంటర్ బ్యాంక్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. సఫీ మృతి పట్ల తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సంతాపం ప్రకటించింది. -
'మేకప్ వేసుకునేందుకు నేను రెడీ'
లండన్ : నటన చాలా కష్టమైన వృత్తి అని ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీమ్ మాజీ కెప్టెన్ డేవిడ్ బెకహామ్ అన్నాడు. ఇప్పటికే అతడు గయ్ రిచీ మూవీ 'నైట్స్ ఆఫ్ ది రౌండ్ టేబుల్' లో ఓ పాత్రకు తన గొంతు అరువిచ్చిన విషయం విదితమే. త్వరలో పూర్తిస్థాయి నటుడు అనిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మేకప్ వేసుకుని తెరపై కనిపించేందుకు తాను నిర్ణయించుకున్నట్లు ప్రటించేశాడు. వచ్చే ఏడాది ఆ మూవీ విడుదలవుతుంది. ఈ ప్రముఖ ఆటగాడు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొందరికి మాత్రమే తెలుసు. మోడలింగ్ నుంచి ఛారిటీ ట్రస్ట్ వరకు పలు రంగాలలో అపార అనుభవం అతడి సొంతం. అయితే, తన టాలెంట్‌కు హద్దులు లేవని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు మరి. సినిమాలలో నటించాలనుకున్నట్లు ఇటీవలే తెలిపాడు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ప్రఖ్యాత ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూడా సిల్వర్ స్క్రీన్ వైపు అడుగులు వేసిన విషయం విదితమే. 'నటన అనేది చాలా టఫ్ జాబ్' అని తనకు తెలుసునని బెకహామ్ అన్నాడు. అయితే, చాలా మంది క్రీడాకారులు నటన వైపు అడుగులేసి చేతులు కాల్చుకున్నారనీ, ఎందుకంటే నటించడం అనేది నైపుణ్యం, క్రమశిక్షణతో కూడుకున్న పని అంటూ చెప్పుకొచ్చాడు. నటనలో ఓనమాలు నేర్చుకుని శిక్షణ తీసుకున్న తర్వాతే ఈ రంగంలోకి అడుగుపెడతానని పేర్కొన్నాడు. 'నైట్స్ ఆఫ్ ది రౌండ్ టేబుల్' దర్శకుడు బెకహామ్ డబ్బింగ్ చెప్పడంపై ప్రశంసల జల్లులు కురిపించాడట. ఇప్పటివరకు చాలా రంగాల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని, గుర్తింపు ఉన్న వ్యక్తిని అవడంతో విమర్శలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. -
'ముద్దుకు గెడ్డం అడ్డమంది అందుకే...'
లాస్ ఏంజిల్స్ : మాజీ పుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్ హమ్ కొత్త అవతారం ఎత్తాడు. ఎప్పుడు గెడ్డంతో ఉండే అతడు ఈ సారి న్యూ లుక్‌లో కనిపించాడు. ఎంతో ముచ్చటగా లైట్‌గా గెడ్డం పెంచుకునే బెక్ హమ్ ఇప్పుడా గెడ్డాన్ని తీసి నున్నగా తయారైయ్యాడు. ఇదేమి చెప్మా అంటే అసలు విషయాన్ని బాబుగారు సిగ్గు పడుతూ సెలవిచ్చాడు. భార్యామణి విక్టోరియాను బెక్ హమ్ ఓ ముద్దు ఇవ్వమని కోరాడంటా. అందుకు ఆమె ససేమిరా అంది. ఎందుకని అడిగితే గెడ్డం అడ్డంగా ఉందని బదులిచ్చిందట. అంతేకాకుండా గెడ్డం తీసే వరకు ముద్దు పెట్టనని కరాఖండిగా చెప్పిందట. దాంతో భార్య ముద్దు కోసం డేవిడ్ బెక్ హమ్ గెడ్డం త్యాగం చేసేశాడు. అంతేకాకుండా పనిలో పనిగా భార్య విక్టోరియాను ఆకాశానికి ఎత్తేశాడు. ఆమె చాలా నిజాయితీగా ఉంటుందని చెప్పాడు. తన భార్య ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా చెబుతుందని మురిసిపోతున్నాడు. ఆమె తనకు ఇచ్చే సలహాలు ఎంతో దార్శనికతో కూడి ఉంటాయని పొగడ్తలు కురిపించాడు. విక్టోరియా వ్యాపార రంగంలో దూసుకుపోతుందని సంబరపడుతున్నాడు. ఆమె చెప్పే సలహాలు 99 శాతం పాటిస్తానని బెక్ హమ్ మురిసిపోతు చెప్పటం విశేషం.