
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు జీఎంఎస్ సఫీ (47) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1993–2001 మధ్య కాలంలో ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ సహా పలు టోర్నీల్లో సఫీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్ వేదికగా 2001లో జాతీయ క్రీడల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించారు. ఎస్‌బీఐ (సీసీపీసీ) హైదరాబాద్ శాఖలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న సఫీ...ఇటీవలే ఆలిండియా ఇంటర్ బ్యాంక్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. సఫీ మృతి పట్ల తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సంతాపం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment