ప్రముఖ గాయకుడు పి.జయచంద్రన్ (80) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళలోని త్రిసూర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, గురువారం తుది శ్వాస విడిచారు. 1944 మార్చి 3న కొచ్చిలో జన్మించిన జయచంద్రన్ 1965లో వచ్చిన ‘కుంజలి మరక్కర్’ అనే సినిమాలోని ‘ఒరు ముల్లప్పుమలమే..’పాటతో గాయకుడిగా పరిచయమయ్యారు. 1967లో విడుదలైన ‘కలితోజన్’ చిత్రంలోని ‘మంజలైల్ ముంగి తోర్తి’పాట ఆయన కెరీర్‌లో ఒక మైలురాయి. ఆరు దశాబ్దాలకుపైగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 16 వేలకుపైగాపాటలుపాడారాయన.
జయచంద్రన్ తెలుగులోపాడిన‘రోజావే చిన్ని రోజావే (సూర్యవంశం), అనగనగా ఆకాశం ఉంది (నువ్వే కావాలి), హ్యాపీ హ్యాపీ బర్త్‌డేలు (సుస్వాగతం)’ వంటిపాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. 2002లో వచ్చిన ‘ఊరు మనదిరా’లోపాడిన ‘నా చెల్లి చంద్రమ్మ’ తెలుగులో ఆయన చివరిపాట. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ , ఎం.ఎం. కీరవాణి, విద్యాసాగర్, కోటి వంటి సంగీత దర్శకుల సినిమాలకు ఆయన ఎక్కువగాపాటలుపాడారు. హిందీలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘అదా: ఎ వే ఆఫ్ లైఫ్’ అనే ఒకే ఒక మూవీలోపాడారు జయచంద్ర.
అదేవిధంగా తన మాతృ భాష మలయాళంలో ‘నఖక్ష తంగళ్’, ‘త్రివేండ్రం లాడ్జ్’ వంటి సినిమాల్లో అతిథిపాత్రల్లో మెరిశారాయన. అంతేకాదు.. ‘శ్రీ నారాయణ గురు’ అనే మలయాళ సినిమా లోని ‘శివ శంకరా సర్వ శరణ్య విభో..’పాటకుగానూ ‘బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్’గా 1986లో జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే ఐదు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు, రెండు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు కూడా ఆయన్ని వరించాయి. జయచంద్రన్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment