jayachandra
-
సింగర్ జయచంద్రన్ మృతి
ప్రముఖ గాయకుడు పి.జయచంద్రన్ (80) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళలోని త్రిసూర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, గురువారం తుది శ్వాస విడిచారు. 1944 మార్చి 3న కొచ్చిలో జన్మించిన జయచంద్రన్ 1965లో వచ్చిన ‘కుంజలి మరక్కర్’ అనే సినిమాలోని ‘ఒరు ముల్లప్పుమలమే..’పాటతో గాయకుడిగా పరిచయమయ్యారు. 1967లో విడుదలైన ‘కలితోజన్’ చిత్రంలోని ‘మంజలైల్ ముంగి తోర్తి’పాట ఆయన కెరీర్లో ఒక మైలురాయి. ఆరు దశాబ్దాలకుపైగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 16 వేలకుపైగాపాటలుపాడారాయన.జయచంద్రన్ తెలుగులోపాడిన‘రోజావే చిన్ని రోజావే (సూర్యవంశం), అనగనగా ఆకాశం ఉంది (నువ్వే కావాలి), హ్యాపీ హ్యాపీ బర్త్‌డేలు (సుస్వాగతం)’ వంటిపాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. 2002లో వచ్చిన ‘ఊరు మనదిరా’లోపాడిన ‘నా చెల్లి చంద్రమ్మ’ తెలుగులో ఆయన చివరిపాట. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ , ఎం.ఎం. కీరవాణి, విద్యాసాగర్, కోటి వంటి సంగీత దర్శకుల సినిమాలకు ఆయన ఎక్కువగాపాటలుపాడారు. హిందీలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘అదా: ఎ వే ఆఫ్ లైఫ్’ అనే ఒకే ఒక మూవీలోపాడారు జయచంద్ర.అదేవిధంగా తన మాతృ భాష మలయాళంలో ‘నఖక్ష తంగళ్’, ‘త్రివేండ్రం లాడ్జ్’ వంటి సినిమాల్లో అతిథిపాత్రల్లో మెరిశారాయన. అంతేకాదు.. ‘శ్రీ నారాయణ గురు’ అనే మలయాళ సినిమా లోని ‘శివ శంకరా సర్వ శరణ్య విభో..’పాటకుగానూ ‘బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్’గా 1986లో జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే ఐదు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు, రెండు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు కూడా ఆయన్ని వరించాయి. జయచంద్రన్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు సంతాపం తెలిపారు. -
‘సప్తపర్ణ’ శోభితం... సురభి ‘భక్త ప్రహ్లాద’ నాటకం
జంట నగరాలలోని నాటక కళాభిమానులకు మరోసారి కన్నుల విందయింది. ప్రసిద్ధ సాంస్కృతిక సభాంగణం ‘సప్తపర్ణి’ 20వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆరుబయలు ప్రాంగణంలో రెండురోజుల పాటు ‘సురభి’ వారి నాటకాల ప్రత్యేక ప్రదర్శనలు ఆనందాన్ని పంచాయి. శనివారం ‘మాయా బజార్’ నాటకం ప్రదర్శించగా, ఆదివారం క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ‘భక్త ప్రహ్లాద’ నాటక ప్రదర్శన రెండుగంటల పైచిలుకు పాటు ఆద్యంతం రసవత్తరంగా నడిచింది. భాగవత పురాణ కథే అయినప్పటికీ, సంభాషణల్లో కొత్త తరానికి సులభంగా అర్థమయ్యే సమకాలీనతను జొప్పించడం గమనార్హం. 1932లో రిలీజైన తొలి పూర్తి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’కు సైతం ఈ నాటకమే ఆధారం కావడం విశేషం. కాగా, తాజా నాటక ప్రదర్శనలో రోజారమణి నటించిన ఏవీఎం వారి పాపులర్ ‘భక్త ప్రహ్లాద’ సినిమాలోని ‘నారాయణ మంత్రం...’, ‘జీవము నీవే కదా...’ లాంటి పాటలను సైతం జనాకర్షకంగా సందర్భోచితంగా వాడుకోవడం గమనార్హం. నటీనటులు, సంగీత, లైటింగ్ సహకారం అంతా చక్కగా అమరిన ఈ నాటకంలో ఆరేళ్ళ పసిపాప ప్రహ్లాదుడిగా నటిస్తూ, పాటలు, భాగవత పద్యాలను పాడడం అందరినీ మరింత ఆకర్షించింది. గాలిలో తేలుతూ వచ్చే సుదర్శన చక్రం, పామును గాలిలో ఎగురుతూ వచ్చి గద్ద తన్నుకుపోవడం, మొసలిపై ప్రహ్లాదుడు, స్టేజీ మీద గాలిలోకి లేచే మంటలు లాంటి ‘సురభి’ వారి ట్రిక్కులు మంత్రముగ్ధుల్ని చేశాయి. చిన్న పిల్లలతో పాటు పెద్దల్ని సైతం పిల్లల్ని చేసి, పెద్దపెట్టున హర్షధ్వానాలు చేయించాయి. ఏకంగా 150 ఏళ్ళ పై చిలుకు చరిత్ర కలిగిన ‘సురభి’ నాటక వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆరో తరానికి చెందిన ఆర్. జయచంద్రవర్మ సారథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 52 మంది దాకా నటీనటులు, సంగీత వాద్యకళాకారులు కలసి ఈ ప్రదర్శనలు చేయడం విశేషం. కిక్కిరిసిన ఆరుబయలు ప్రాంగణం, గోడ ఎక్కి కూర్చొని మరీ చూస్తున్న నాటక అభిమానులు, ఆద్యంతం వారి చప్పట్లు... వేదికపై ప్రదర్శన ఇస్తున్న నటీనటులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కరోనా సమయంలో తమను ఎంతో ఆదుకొని, ప్రేక్షకులకూ – తమకూ వారధిగా నిలిచి, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసిన రంగస్థల పోషకురాలు – ‘సప్తపర్ణి’ నిర్వాహకురాలు అనూరాధను ‘సురభి’ కళాకారులు ప్రత్యేకంగా సత్కరించి, తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఎంబీఏ, సీఏ లాంటి పెద్ద చదువులు చదివిన పెద్దల నుంచి స్కూలు పిల్లల వరకు అందరూ ఈ రెండు రోజుల నాటక ప్రదర్శనల్లో నటించడం చెప్పుకోదగ్గ విశేషం. ఇది తెలుగు వారు కాపాడుకోవాల్సిన ప్రత్యేకమైన ‘సురభి’ కుటుంబ నాటక వారసత్వమని ప్రదర్శనలకు హాజరైన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. -రెంటాల జయదేవ -
చిత్ర యూనిట్‌ను హడలెత్తించిన మహిళా నిర్మాత
తమిళసినిమా: చిత్ర పరిశ్రమ నిర్మాత తండ్రి లాంటి వాడు. అందుకే ఆయనంటే అందరికీ గౌరవం. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు హీరోల చూట్టూ సినిమా తిరుగుతోందని చెప్పవచ్చు. నిర్మాతలు డబ్బును పెట్టే ఒక యంత్రంగా మారిపోయాడనే అనాలి. అయితే ఇందుకు వ్యతిరేకంగా పాత రోజులను గుర్తుకు తెచ్చే విధంగా ఒక మహిళా నిర్మాత వచ్చారు. ఆమె షూటింగ్ స్పాట్‌కు వస్తే యూనిట్ గడ గడలాడాల్సిందే. ఆమె ఎవరో కాదు తొడ్రా చిత్ర నిర్మాత ఎస్.జయ్‌చంద్ర. నిర్మాతగా ఈమెకిది తొలి చిత్రం. జేఎస్.అపూర్వ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి మధురాజ్ దర్శకుడు. నటుడు పాండ్యరాజన్ కొడుకు పృథ్వీరాజన్ హీరోగా నటించిన ఇందులో వీణ అనే నటి నాయకిగా నటించింది. ఎంఎస్.కుమరన్ ప్రతినాయకుడిగా నటించిన ఇందులో ఏ.వెంకటేశ్, కూల్ సురేశ్, టీ పొట్టి గణేశన్ ముఖ్య పాత్రలను పోషించారు. ఆర్ఎన్.ఉత్తమరాజ్ సంగీతాన్ని అందించిన తొడ్రా చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత జయ్‌చంద్ర మాట్లాడుతూ నిర్మాతగా తనకిది తొలి చిత్రం అని తెలిపారు. తన భర్త ఎంఎస్.కుమరన్‌కు నటనపై చాలా ఆసక్తి అని చెప్పింది. తనకు అసలు నచ్చదన్నారు. అలాంటిది తన అత్త చనిపోయే ముందు కొడుకు కోరిక నెరవేర్చమని చెప్పిందన్నారు. దీంతో అంతకు ముందు పరిచయం ఉన్న మ«ధురాజ్తో మంచి కథ రెడీ చెయ్యమని చెప్పానన్నారు. అలా మొదలైన చిత్రం ఈ తొడ్రా అని చెప్పారు. తనకు ఊరిలో నాలుగు టెక్స్టైల్ షాపులు ఉన్నాయని చెప్పారు. సినిమా కొత్త కావడంతో ఎలా వస్తుందో, ఏమోనన్న భయం ఉండేదన్నారు. అయితే షూటింగ్ దశలో డబ్బు లక్షలు లక్షలు ఖర్చు అయిపోతుండడంతో పెట్టింది తిరిగి వస్తుందో రాదో అన్న ఆందోళన ఉండేదన్నారు. చిత్రం చూసిన తరువాత సంతృప్తి కలిగిందని చెప్పారు. అంతకు ముందు సెట్లో అందరినీ కోపంతో తిట్టేసేదాన్నని, ఇప్పుడు అది తలచుకుంటే పాపం అనిపిస్తుందని అన్నారు. చిత్రాన్ని సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. క్లాప్‌బోర్డు సత్యమూర్తి సహకారంతో తామే చిత్రాన్ని సొంతంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత జయ్‌చంద్ర తెలిపారు. తొడ్రా చిత్రం అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉంటుందని ఆమె అన్నారు. -
కిడ్నాప్ కథ సుఖాంతం
= 24 గంటల్లో బాలుడి ఆచూకీ లభ్యం = కిడ్నాపర్‌ను పట్టించిన సీసీ కెమెరాలు = తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత అనంతపురం సెంట్రల్ : సర్వజనాస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. కిడ్నాపర్ చెర నుంచి బాలుడిని రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు సోమవారం మీడియాకు వెల్లడించారు. నగరంలో గుత్తిరోడ్డుకు చెందిన ఆటోడ్రైవర్ రామాంజనేయులు తన కుమారుడు జయచంద్ర (6) కనిపించడం లేదని ఆదివారం టూటౌ¯ŒS పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్వజనాసుపత్రిలో చికిత్స కోసం వచ్చామని అందులో పేర్కొన్నారు. వెంటనే రంగంలోకి దిగిన టూటౌ¯ŒS సీఐ యల్లమరాజు, ఎస్ఐ శివగంగాధర్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకొని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. బాలున్ని ఓ మహిâýæ ఆటోలో బస్టాండుకు తీసుకెళ్లినట్లు వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దీని ఆధారంగా ఆరా తీస్తే నిందితురాలి వివరాలు లభ్యమయ్యాయి. కిడ్నాప్‌కు పాల్పడిన మహిâýæ ముర్తూజగా గుర్తించారు. ఈమెది కనగానపల్లి మండలం తూమచర్ల గ్రామం అయితే అనంతపురం రూరల్ మండలం కొడిమి వద్ద కొట్టాలలో నివాసముంటున్నట్లు విచారణలో తేలింది. ఆమె బంధువులను అదుపులోకి తీసుకొని ఫో¯ŒSకాల్స్ ట్రాప్ చేయగా బెంగుళూరులో ఉన్నట్లు సిగ్నల్ ఆధారంగా గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు సదరు మహిళను బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని సురక్షితంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించడం వలన కలిగే ఉపయోగాలు మరోసారి నిరూపితమైందన్నారు. నగరంలో 250పైచిలుకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, సర్వజనాసుపత్రిలోనే 50 సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. దీని వలనే బాలున్ని 24 గంటల్లో పట్టుకోవడానికి ఆస్కారమైందని వివరించారు. కిడ్నాప్ కేసును చేధించడంలో సఫలీకృతులైన టూటౌ¯ŒS సీఐ యల్లమరాజు, ఎస్ఐ శివగంగాధర్‌రెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మాల్యాద్రి, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. తిరుమలలో కిడ్నాప్‌కు గురైన బాలుడు తూమచర్లకు చెందడం.. అనంతపురంలో బాలుడిని కిడ్నాప్ చేసి బెంగళూరులో పట్టుబడిన మహిళ ముర్తూజ స్వస్థలం తూమచర్లే కావడంతో.. ఈ రెండింటికీ ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
సర్వజనాస్పత్రిలో బాలుడు అదృశ్యం
అనంతపురం సెంట్రల్ : అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఆదివారం ఆరేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. వివరాల్లోకి వెలితే.... నగరంలో గుత్తిరోడ్డులో నివాసముంటున్న డ్రైవర్ రామాంజనేయులు తన కుమారుడు జయచంద్ర (6)కు ఆరోగ్యం బాగలేకపోవడంతో శనివారం సర్వజనాస్పత్రిలో చేర్పించాడు. రాత్రి తల్లిదండ్రుల వద్దే పడుకున్న జయచంద్ర ఆదివారం ఉదయం కనిపించలేదు. ఆస్పత్రి ఆవరణమంతా గాలించినా జాడకానరాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ మేరకు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రికి చేరుకున్న ఎస్ఐ శివగంగాధర్‌రెడ్డి సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వివరాలు ఆరా తీశారు. ఆస్పత్రి నుంచి బయటకు ఒక్కడే వెళుతున్న దృశ్యాలు రికార్డ్ అయినట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శాశ్వతంగా మూగబోయిన గానం..
గాయకుడు జయచంద్ర హఠాన్మరణం వినుకొండ రూరల్ : ప్రముఖ గాయకులు ఎనుబరి జయచంద్ర (65) హఠాన్మరణం చెందారు. శనివారం ఉదయం తీవ్ర గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గుంటూరు తరలిస్తుండగా మర్గమధ్యలో మృతి చెందారు. ఈపూరు మండలం అంగలూరుకు చెందిన సునందమ్మ, చినజార్జిలకు ఆయన రెండో సంతానం. వినుకొండ కోర్టులో ఎల్డీసీగా పనిచేసి నాలుగేళ్ళ క్రితం పదవీ విరమణ చేశారు. చిన్నప్పటి నుండి ఘంటసాల పాటలపై మక్కువ ఎక్కువ. నిర్విరామంగా 40 ఘంటసాల పాటలను అనర్గళంగా పాడడం ఆయన ప్రత్యేకత. దీంతో ఘంటసాల జయచంద్రగా వినుకొండ పుర ప్రజల గుర్తింపు పొందారు. మక్కెన మల్లికార్జునరావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జయచంద్ర కళను మెచ్చి గండపెండేరం తొడిగారు. ఇప్పటి వరకు వేలాది పాట కచేరీలు నిర్వహించి వందల పాటలను తన మధుర కంఠంతో ఆలపించి ఘంటసాల జయచంద్రగా ప్రఖ్యాతి పొందారు. గత 15 ఏళ్ళగా ప్రముఖ తెలుగు గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఘంటసాల పాటలను పాడిన గొప్ప కళాకారుడిగా కీర్తిగడించారు. ఆయన హఠాన్మరణంతో బంధువులు, కళాకారులు దిగ్భ్రాంతి చెందారు. సమాచారం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, సీపీఐ సీనియర్ నాయకులు సండ్రపాటి సైదాతో పాటు పలువురు ప్రముఖులు వినుకొండలోని ఆయన మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. -
తిరగబడ్డ ‘ఎర్ర’ కూలీలు
చంద్రగిరి: శేషాచలంలో ఎర్రచందనం చెట్లును కూల్చి దుంగలు తరలించడానికి వచ్చిన కూలీలు పోలీసులపై దాడికి యత్నించారు. పోలీసులు అప్రమత్తం కావడంతో వారిని చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఈ ఘటన మామండూరు వద్ద ఉన్న అబ్బాలి రామానాయుడు మామిడితోట సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలను శనివారం పోలీసులు విలేకరులకు తెలిపారు. ఎస్ఐ జయచంద్ర మాట్లాడుతూ మామండూరు సమీపంలోని అబ్బారి రామానాయుడు మామిడి తోట సమీపంలో ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తున్నట్టు శుక్రవారం రహస్య సమాచారం అందిందన్నారు. సీఐ మల్లికార్జున గుప్తా ఆదేశాల మేరకు ఎస్టీఎఫ్ సిబ్బందితో అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించామన్నారు. కూలీలు గొడ్డళ్లు, కర్రలు, రాళ్లతో ఒక్కసారిగా దాడికియత్నించారన్నారు. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంతో 17మంది ఎర్రకూలీలను పట్టుకున్నట్టు తెలిపారు. అయితే మరో ఇద్దరు కూలీలు పరారయ్యారన్నారు. పట్టుబడిన వారినుంచి ఓ టాటా సుమో, 20 ఎర్రచందనం దుంగలు,దాడికియత్నించిన గొడ్డళ్లు, కర్రలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కూలీలు తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి, ధర్మపురి జిల్లాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. అనంతరం కూలీలపై కేసు నమోదు చేసి కోర్టుకుతరలించినట్టు ఆయన వెల్లడించారు. -
ఆగిన పదివేల ఇసుక లారీలు
సాక్షి, బెంగళూరు : రాష్ర్ట ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ఇసుక రవాణా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇసుక లారీల యజమానులు శనివారం నుంచి బంద్ చేపట్టారు. దీంతో రాష్ర్టంలోని సుమారు పది వేల ఇసుక లారీలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఫలితంగా నిర్మాణ పనులకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా నగరంలోని నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులకు ఈ సమస్య మరింత అధికంగా ఉంది. సాధారణంగా నగరంలోని నిర్మాణాలకు ఏ రోజుకారోజు ఇసుక రవాణా అవుతూ ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇసుకను సేకరించే లారీల యజమానులు ఆ ఇసుకను నగర శివార్లలోని ప్రాంతాల్లో అమ్ముతుంటారు. ఇలా ఇసుక అమ్మకానికి నగర శివార్లలో కొన్ని ప్రత్యేక స్టాండ్లు కూడా ఉంటాయి. ఆయా స్టాండ్లలో ఇసుకను కొన్న తర్వాత కొనుగోలుదారులు చెప్పిన చిరునామాకుఇసుకను చేరవేస్తూ ఉంటారు. ప్రస్తుతం లారీల యజమానుల సంఘాలు బంద్‌కు పిలుపునివ్వడంతో నగరంలో ఇసుక సరఫరా చేస్తున్న దాదాపు నాలుగు వేల లారీలు ఆగిపోయాయి. దీంతో లారీల డ్రైవర్లు, క్లీనర్లు, లోడింగ్, అన్లోడింగ్ చేసే కార్మికులు దాదాపు లక్ష మంది శనివారం పనులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అంతేకాక ఇసుక సరఫరా లేకపోవడంతో వివిధ కట్టడాల వద్ద పనిచేస్తున్న నిర్మాణ కూలీలకూ శనివారం నుంచి విధుల్లోకి రావాల్సిన అవసరం లేదంటూ యజమానులు చెప్పడంతో.. ఆ కూలీలు పనిలేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇక ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ఇసుక రవాణా చట్టంలో మార్పులు చేసే వరకు బంద్‌ను విరమించే ప్రసక్తే లేదని ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక లారీ ఓనర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు చెన్నారెడ్డి వెల్లడించారు. ఇసుక రవాణా చట్టంలో మార్పులు చేయకపోతే తాము ప్రతి రోజూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, లారీల డ్రైవర్లంతా జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుందని తెలిపారు. కాగా ఇసుక లారీల బంద్ మరో రెండు రోజుల పాటు కొనసాగితే నిర్మాణ కార్యక్రమాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో పాటు.. ఇసుక ధరలూ విపరీతంగా పెరిగే అవకాశముంది. చర్చలకు రండి : మంత్రి జయచంద్ర ఇసుక రవాణా చట్టాన్ని వ్యతిరేకిస్తూ బంద్‌కు పూనుకున్న ఇసుక లారీల యజమానులు తక్షణమే బంద్‌ను విరమించి చర్చలకు రావాలని న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర లారీల యజమానులకు సూచించారు. శనివారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బంద్‌కు పిలుపునివ్వడానికి ముందు చట్టాలు, నియమావళిని లారీల యజమానులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇసుక రవాణాపై కేంద్ర ప్రభుత్వం చాలా కాలం క్రితమే ఈ చట్టాన్ని రూపొందించిందని, సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలో తాము ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఎదురవుతున్నాయని, అటువంటి సందర్భంలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఇసుక ప్రభుత్వం ఆస్తి అని, అలాంటి ఇసుకను ప్రభుత్వం నుంచి మాత్రమే పొందాల్సి ఉంటుందని తెలిపారు. ఈ చట్టం వల్ల లారీల యజమానులకు ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయనుకుంటే ప్రభుత్వంతో చర్చలు జరపాలే తప్ప.. బంద్‌ను పాటిం చడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో అనంత జాయింట్ కలెక్టర్ మృతి
అనంతపురం జిల్లాలో గత అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ జయచంద్ర ప్రమాదంలో మృతి చెందారు. కర్నూలు నుంచి అనంతపురానికి వస్తుండగా ఓడియంపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న బొలేరో వాహనం డివైడర్‌ను ఢీకొట్ట్టింది. ఈ ప్రమాదంలో జయచంద్ర కుమారుడు, కారు డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అదనపు జాయింట్ కలెక్టర్ జయచంద్ర మృతదేహన్ని అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్చురిలో ఉన్న జయచంద్ర మృతదేహాన్ని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్‌తో పాటు పలువురు జిల్లా ఉన్నతాధికారులు సందర్శించి తమ సంతాపాన్ని తెలిపారు. -
అనంతపురం జిల్లాలో ఘెర రోడ్డు ప్రమాదం
-
ఎలా బతకాలి..!
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: అరకొర దిగుబడితో వరి రైతులు అల్లాడిపోతున్నారు. ఎకరాకు రూ.20 వేలు ఖర్చు చేసినా కనీసం రెండు పుట్లు కూడా ధాన్యం పండక పోవడంతో అప్పులపాలవుతున్నారు. ఇలాగైతే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీలో వందల ఎకరాల్లో వరి(జగిత్యాల) సాగు చేస్తున్నారు. కొందరు భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఎకరాకు 4-5 పుట్లు పండితే కానీ రైతుకు పెట్టుబడి రాదు. ఎకరాకు రూ.20 వేల ఖర్చుపెట్టినా ఎర్ర తెగులు ఆశించడంతో 15 రోజులకోసారి 5 సార్లు మందులు కొట్టాల్సి వస్తోంది. దీంతో ఖర్చు మరింత పెరిగింది. రైతు కుటుంబ సభ్యులే పనులు చేసుకుంటున్నా కూలీల అవసరం తప్పడంలేదు. మందులు కొట్టేందుకు, నాట్లు వేసేందుకు రోజుకు రూ.150 ఇవ్వాల్సి వ స్తోందని వాపోతున్నారు. మరోవైపు పంట దిగుబడి బాగా వచ్చిందనుకుంటే వడ్లల్లో బియ్యం గింజలు లేక పోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 14 బస్తాల దిగుబడి రావడంతో కనీసం ఖర్చులు కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి రైతులకు ఏర్పడింది. అయినా ఏ అధికారి కానీ, ప్రభుత్వం కానీ ఆదుకోలేకపోయిందని అన్నదాతలుఆరోపిస్తున్నారు. పుట్టి వడ్లను గత ఏడాది రూ.6,800లకు విక్రయించగా ఈ ఏడాది ధర మరింత పడిపోయిందని వాపోతున్నారు. పొలాలను పరిశీలించిన అగ్రికల్చరల్ జాయింట్ డైరక్టర్ జయచంద్ర రైతుల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు వెల్లడించారు. గిట్టుబాటు ధర లేదు..పంట దిగుబడి లేదు ఏడేళ్లుగా మూడెకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. నా భర్త సుబ్బరాయుడు, నేను, కుటుంబ సభ్యులంతా కలిసి పనిచేస్తున్నాం. ఎకరాకు రూ.22వేలుపైగానే ఖర్చయింది. ఈ ఏడాది ఎర్రతెగులు సోకడంతో నాలుగైదు సార్లు మందులు కొట్టాల్సి వచ్చింది. ఎకరాకు 5 పుట్లు పండితే ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం ఖర్చులు పోను కూళ్లు గిట్టుబాటు అవుతాయి. కౌలు చెల్లించడం కూడా ప్రస్తుత పరిస్థితిలో భారమైంది. ఎకరాకు 1040 కిలోల వడ్లు దిగుబడి వచ్చాయి. ఈ లెక్కన కనీసం రెండు పుట్లు కూడా దిగుబడి రాలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.