అనంతపురం సెంట్రల్ : అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఆదివారం ఆరేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. వివరాల్లోకి వెలితే.... నగరంలో గుత్తిరోడ్డులో నివాసముంటున్న డ్రైవర్ రామాంజనేయులు తన కుమారుడు జయచంద్ర (6)కు ఆరోగ్యం బాగలేకపోవడంతో శనివారం సర్వజనాస్పత్రిలో చేర్పించాడు. రాత్రి తల్లిదండ్రుల వద్దే పడుకున్న జయచంద్ర ఆదివారం ఉదయం కనిపించలేదు.
ఆస్పత్రి ఆవరణమంతా గాలించినా జాడకానరాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ మేరకు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రికి చేరుకున్న ఎస్‌ఐ శివగంగాధర్‌రెడ్డి సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వివరాలు ఆరా తీశారు. ఆస్పత్రి నుంచి బయటకు ఒక్కడే వెళుతున్న దృశ్యాలు రికార్డ్ అయినట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సర్వజనాస్పత్రిలో బాలుడు అదృశ్యం
Published Sun, Jan 29 2017 11:15 PM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM
Advertisement
Advertisement