కృష్ణా జిల్లాలో దారుణం | 5 Days Boy Died in Gannavaram Government Hospital | Sakshi
Sakshi News home page

గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

Published Fri, Jun 29 2018 11:30 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

5 Days Boy Died in Gannavaram Government Hospital - Sakshi

సాక్షి, గన్నవరం: కృష్ణా జిల్లాలోని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో 5 రోజుల బాబు మృతి చెందాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు మండలం పి.శోభనాపురం గ్రామానికి చెందిన జూకూటి వరలక్ష్మీకి ఈ నెల 24న గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే నిన్న(గురువారం) రాత్రి 11 గంటల సమయంలో బాబు కదలకపోవడంతో వార్డులో ఉన్న నర్సుకి సమాచారం అందించారు. నర్సు సంబంధిత డాక్టర్‌కి ఫోన్‌ చేయడంతో ఆయన స్పందించలేదు. 

దీంతో బాబు రాత్రి 2 గంటల సమయంలో మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లాడు మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. అయితే బాబు పుట్టినపుడు ఆరోగ్యంగానే ఉన్నాడని, నిన్న రాత్రి కూడా బాబు ఆరోగ్యం బాగుందని.. ఇది సహజ మరణం అని వైద్యులు చెబుతున్నారు.        

ముగ్గురు ఆడపిల్లల అనంతరం వరలక్ష్మికి బాబు పుట్టడంతో కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగిపోయారు. అంతలోనే ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. పిల్లలు పుట్టకుండా వరలక్ష్మి గురువారమే ఆపరేషన్ చేయించుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement