
సాక్షి, హైదరాబాద్: అభం శుభం తెలియని రెండు నెలల చిన్నారిని తల్లి పొత్తిళ్ల నుంచి ఎత్తుకెళ్లి నీటి సంపులో పడేసి హత్య చేశారు. ఎస్‌ఐ రమేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రామంతాపూర్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన సనాబేగానికి భర్త, రెండు నెలల కుమారుడు ఉన్నాడు. అత్తమామలు అబ్దుల్ బాబు, ఖుమర్ బేగంతో పాటు ఆడపడుచు, మరుదులు వారి సంతానం మొత్తం దాదాపుగా పది మందితో అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. 19న రాత్రి ఆమె భర్త ఉద్యోగ రీత్యా బయటికి వెళ్లడంతో సనాబేగం తన రెండు నెలల కుమారుడు అబ్ధుల్ రహమాన్.. అత్త, ఆడపడచూ ఫౌజియా బేగం, అడపడుచు కుమార్తెతో కలిసి ఒకే గదిలో నిద్రించారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత తన కుమారుడు కనిపించక పోవడంతో ఆందోళనకు గురైన సనాబేగం చిన్నారి కోసం ఇంటి పరిసరాల్లో గాలించింది. ఎక్కడా ఆచూకీ దొరకŠక్ పోవడంతో అనుమానంతో నీటి సంపులో వెతకగా అందులో కనిపించాడు. దీంతో బాలుడిని వెలికి తీసి చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ అసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తల్లి సనాబేగం కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ఐదుగురి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment