gandhi nagar
-
‘బంధువుల సంస్థలో ఉద్యోగం చేస్తున్నారా?’
గాంధీ నగర్ : నా మనసులో మాట చెబితే వాళ్లు ఏమనుకుంటారు? ఇంట్లో వాళ్లు, బంధువులు, స్నేహితులు ఏమనుకుంటారో? ఈ ఆలోచనల్లో కూరుకుపోయిన ఓ ఉద్యోగి తన వేదనను ఎవరికీ చెప్పలేకపోయాడు. ఆ వేదనను చెప్పుకునే ధైర్యం లేక చివరకు భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన చేతి వేళ్లను తానే నరికేసుకున్నాడు. ఈ సంఘటన ఒక మనిషి ఎంత ఒత్తిడిలో ఉంటే ఎలాంటి పరిణామానికి దారితీస్తుందనేదానికి ఉదాహరణగా నిలుస్తోంది. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని వరచా మినీ బజార్లో అనభ్ జెమ్స్‌లో మయూర్ తారాపర (32) అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సంస్థ తన బంధువులదే. అయితే, మయూర్‌కి ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఇష్టం లేదని బంధువులకు చెప్పే ధైర్యం లేదు. ఇదే విషయంపై గత కొంత కాలంగా తీవ్ర ఒత్తిడి గురయ్యేవాడు. ఈ తరుణంలో మయూర్ డిసెంబర్ 8న తన స్నేహితుడి ఇంటికి వెళుతుండగా అమ్రోలిలోని వేదాంత సర్కిల్ సమీపంలోని రింగ్‌రోడ్‌లో తల తిరిగి కిందపడిపోయాడు. దీంతో అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తారాపరా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.ముందుగా,ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మయూర్ స్టేట్మెంట్ తీసుకున్నారు. స్టేట్మెంట్లో తన స్నేహితులు ఇంటికి వెళ్లే సమయంలో వేదాంత సర్కిల్ వద్ద తన కళ్లు తిరిగాయని, 10 నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చానని, ఆ సమయంలో అతని ఎడమ చేతి నాలుగు వేళ్లు నరికివేసినట్లు తారాపరా పోలీసులకు చెప్పాడు. దీంతో, కేసును మరింత వేగవంతం చేశారు. తారామారా పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కి కేసును బదిలీ చేశారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సైతం మయూర్ చేతివేళ్లను చేతబడి కోసం అగంతకులు నరికి ఉంటారేమోనన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మయూర్ చెప్పినట్లుగా వేదాంత రింగ్ రోడ్, స్నేహితుల ఇళ్లు, మయూర్ ఇంటి నుంచి ఆఫీస్ వెళ్లే ప్రాంతాలలో సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. ఆ ఫుటేజీల్లో మయూరే తన చేతి వేళ్లను తానే నరుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.తారామార పోలీసుల వివరాల మేరకు.. సింగన్పూర్లోని చౌరస్తా సమీపంలోని ఓ దుఖాణంలో మయూర్ ఓ పదునైన కత్తిన కొనుగోలు చేశాడు. నాలుగు రోజుల తర్వాత ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అమ్రోలి రింగ్‌రోడ్డు సమీపంలో తన బైక్‌ను పార్క్ చేశాడు. అనంతరం, వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో తన చేతి నాలుగు వేళ్లను నరుక్కున్నాడు. దారాళంగా కారుతున్న రక్తాన్ని ఆపేందుకు మోచేతి దగ్గర తాడు కట్టాడు. ఆపై కత్తి,వేళ్లను రెండు బ్యాగుల్లో వేసి దూరంగా పారేశాడు. కేసు దర్యాప్తు అధికారి మాట్లాడుతూ.. ఒక బ్యాగ్ నుండి మూడు వేళ్లు స్వాధీనం చేసుకోగా, మరొక బ్యాగ్‌లో కత్తిని గుర్తించామని అన్నారు. తమ విచారణలో బంధువుల సంస్థలో ఉద్యోగం చేయలేక, ఆ విషయం వాళ్ల చెప్పలేక.. చేతి వేళ్లనే మయూరే నరికేసుకున్నాడని వెల్లడించారు. చేతి వేళ్లను నరికేసుకుంటే ఉద్యోగం చేసే అవసరం ఉండదనే ఈ పనిచేసినట్లు పోలీసులు నిర్దారించారు. -
Alcohol Ban Exemption: గుజరాత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
గాంధీనగర్: మద్యపాన నిషేధం నుంచి గిఫ్ట్ సిటీని మినహాయిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ మండిపడ్డారు. గుజరాత్ ప్రభుత్వం.. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ)లో హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో ‘వైన్ అండ్ డైన్’ సేవలకు అనుమతి ఇచ్చింది. అయితే మద్య నిషేధంలో గాంధీనగర్ జిల్లాలోని (గిఫ్ట్ సిటీ)లో మినహాయిచడాన్ని ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ తప్పుపట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గుజరాత్ మొత్తం వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపుతుందని మండిపడ్డారు. ‘గాంధీనగర్ గిఫ్ట్ సిటీలో మద్య నిషేధం లేకపోతే.. ఇక్కడి ప్రజలు మద్యం సేవిస్తారు. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఒక వ్యతిరేక ప్రభావం పడుతుంది’ అని శక్తిసిన్హ్ గోహిల్ మండిపడ్డారు. గిఫ్ట్ సిటీలో మద్య నిషేదం ఎత్తివేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి లాభం చేకూరుతుందో తనకు అర్థం కావటం లేదని విమర్శించారు. గుజరాత్ ప్రభుత్వం గిఫ్ట్ సిటీలో ఉద్యోగులు, అధికారులు, సందర్శకులకు మద్యం నిషేధం ఎత్తివేస్తున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రస్తుతం మందు బాటిళ్ల అమ్మకానికి అనుమతి లేదు. చదవండి: ఈ ఏడాది భారత్‌కు వెరీ బిగ్ ఇయర్ -
చిన్నారిని చిదిమేశారు.. నీటి సంపులో పడేసి రెండు నెలల పసికందు హత్య
సాక్షి, హైదరాబాద్: అభం శుభం తెలియని రెండు నెలల చిన్నారిని తల్లి పొత్తిళ్ల నుంచి ఎత్తుకెళ్లి నీటి సంపులో పడేసి హత్య చేశారు. ఎస్ఐ రమేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రామంతాపూర్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన సనాబేగానికి భర్త, రెండు నెలల కుమారుడు ఉన్నాడు. అత్తమామలు అబ్దుల్ బాబు, ఖుమర్ బేగంతో పాటు ఆడపడుచు, మరుదులు వారి సంతానం మొత్తం దాదాపుగా పది మందితో అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. 19న రాత్రి ఆమె భర్త ఉద్యోగ రీత్యా బయటికి వెళ్లడంతో సనాబేగం తన రెండు నెలల కుమారుడు అబ్ధుల్ రహమాన్.. అత్త, ఆడపడచూ ఫౌజియా బేగం, అడపడుచు కుమార్తెతో కలిసి ఒకే గదిలో నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తన కుమారుడు కనిపించక పోవడంతో ఆందోళనకు గురైన సనాబేగం చిన్నారి కోసం ఇంటి పరిసరాల్లో గాలించింది. ఎక్కడా ఆచూకీ దొరకŠక్ పోవడంతో అనుమానంతో నీటి సంపులో వెతకగా అందులో కనిపించాడు. దీంతో బాలుడిని వెలికి తీసి చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ అసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తల్లి సనాబేగం కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ఐదుగురి అరెస్ట్ -
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దినసరి కూలీ.. రూపాయి నాణేలతో..
గాంధీనగర్: డిసెంబర్ మొదటి వారంలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దినసరి కూలీగా పనిచేసే ఒక యువకుడు బరిలోకి దిగుతున్నాడు. గాంధీ నగర్‌లోని ఓ మురికివాడలో నివసించే మహేంద్ర పాట్నీకి స్థానికులు మద్దతుగా నిలుస్తున్నారు. వీరి నుంచి ఇతడు రూ.10వేలు సేకరించాడు. ఈ డబ్బంతా రూపాయి నాణేల రూపంలోనే ఉండటం గమనార్హం. ఈ మొత్తాన్ని తీసుకెళ్లి అతడు ఎన్నికల సంఘం వద్ద సెక్యూరిటీ డిపాజిట్ చేశాడు. దీంతో డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు. మహేంద్ర పాట్నీ గాంధీనగర్ నార్త్ నుంచి పోటీ చేస్తున్నాడు. అయితే ఈ యువకుడు స్వతహాగా ఎన్నికల బరిలో దిగడానికి బలమైన కారణమే ఉంది. 2019లో ఓ హోటల్‌కు దారికోసం ఇతడు నివసించే మురికివాడను అధికారులు తొలగించారు. 521 గుడిసెలను నేలమట్టం చేశారు. దీంతో వారు గత్యంతరంలేక వేరేప్రాంతానికి తరలివెళ్లారు. కానీ అక్కడ విద్యుత్, నీటి సరఫరా వంటి కనీస సౌకర్యాలు లేవు. వీరిని పట్టించుకునే నాథుడు కూడా లేడు. దీంతో ఈ ప్రాంతంలో నివసించే వారంసా తమ ప్రతినిధిగా మహేంద్ర పాట్నీని నిలబెట్టారు. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకున్నా స్వతంత్రంగా బరిలోకి దింపుతున్నారు. 2010లోనూ మహెంద్ర పాట్నీ నివసించే మురికివాడను అధికారులు తొలగించారు. మహాత్మా గాంధీకి అంకితం చేస్తూ ప్రభుత్వం నిర్మించిన దండీ కుటీర్ మ్యూజియం కోసం వీరి గుడిసెలను తొలగించారు. ఇప్పుడు మళ్లీ మరోమారు ఓ హోటల్‌కు దారికోసం వీరి కాలనీని కాళీ చేయించారు. దీంతో తమ సమస్యను పరిష్కరించునేందుకు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకుని మహేంద్ర పాట్నీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ వద్దకు వస్తాయని, కానీ ఎన్నికల తర్వాత తమ గోడు ఎవరూ వినిపించుకోవడం లేదని వీరు వాపోతున్నారు. అందుకే తామే స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. అయితే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా వచ్చి తమ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటానని మహేంద్ర పాట్నీ చెబుతున్నాడు. తాము నివసించేందుకు శాశ్వతంగా ఒక స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నాడు. అంతేకాదు తమ దుకాణాలు, తోపుడు బండ్లను అధికారులు తరచూ సీజ్ చేస్తున్నారని, తిరిగి వాటిని విడిచిపెట్టేందుకు రూ.2500-3000 తీసుకుంటున్నారని తెలిపాడు. ఇలా జరగకుండా ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు డిసెంబర్ 2, 5 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 8న ప్రకటిస్తారు. చదవండి: అది మసాజ్ కాదు.. ట్రీట్మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్.. -
గాంధీనగర్ పీఎస్ పరిధిలో భారీగా హవాలా నగదు పట్టివేత
-
పట్టణ శ్రేయస్సు ముఖ్యం
గాంధీనగర్: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యవహరిస్తే పట్టణాభివృద్ధి జరగదని, పట్టణాల శ్రేయస్సు గురించి ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పట్టణాల అభివృద్ధికి స్థానిక సంస్థలు సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గాందీనగర్‌లో మంగళవారం బీజేపీ పాలిత నగరాల మేయర్ల అఖిల భారత సదస్సును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించి ప్రసంగించారు. ఈ రెండు రోజుల సదస్సులో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 118 మంది మేయర్లు, డిప్యూటీ మేయర్లు పాల్గొన్నారు. అర్బన్ ప్లానింగ్, శాటిలైట్ నగరాలు, టైర్–2, టైర్–3 నగరాల నిర్మాణంపై దృష్టి సారిస్తే మెట్రో నగరాలపై జనాభా భారాన్ని తగ్గించవచ్చన్నారు. పట్టణాల సుందరీకరణ, నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో అనే అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రధాని మేయర్లను కోరారు. ‘‘ఎన్నికల్లో కేవలం గెలుపు మాత్రమే మీ లక్ష్యం కాకూడదు. అలా వ్యవహరిస్తే మీ ఊళ్లు అభివృద్ధి చెందవు. పట్టణాల శ్రేయస్సుని దృష్టిలో ఉంంచుకోవాలి. అలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఎన్నికల్లో ఓడిపోతారు’’ అని ప్రధాని మోదీ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా పట్టణాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ప్రణాళికలు రూపొందించాలని ప్రధాని అన్నారు. దేశవ్యాప్తంగా కేంద్రం 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తోందని ఇప్పటివరకు రూ.75 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తయ్యాయని అన్నారు. ప్రతీ పట్టణానికి ఓ ఘనమైన చరిత్ర ఉంటుందని, అది ప్రతిబింబించేలా మ్యూజియంలు ఏర్పాటు చేయాలని మోదీ మేయర్లతో చెప్పారు. -
ట్యాంక్‌బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ఓ డ్రైవర్ నిద్రమత్తు చిన్నారిని చిదిమేసింది. ఆమె తల్లిదండ్రులకు తీవ్ర గుండెకోత మిగిల్చింది. ఈ ప్రమాదంలో చిన్నారి తల్లిదండ్రులు, డ్రైవర్ కూడా క్షతగాత్రులయ్యారు. బుధవారం తెల్లవారుజామున ట్యాంక్‌బండ్‌పై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాంధీనగర్ ఇన్స్పెక్టర్ మోహన్‌రావు కథనం ప్రకారం... మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన దుస్సా శివకుమార్ (40) నగరంలోని నిర్మాణ సంస్థలో మేనేజర్ కాగా ఈయన భార్య సమత (36) సాఫ్ట్వేర్ ఇంజనీర్. రాయదుర్గంలో నివసిస్తున్న వీరికి చిన్నారి సిరి (రెండేళ్లు పూర్తి) ఉంది. రైలులో కుటుంబంతో సహా బెల్లంపల్లి వెళ్లడానికి శివకుమార్ బుధవారం తెల్లవారుజామున క్యాబ్ (టీఎస్ 08 యూజీ 1939) బుక్ చేసుకున్నారు. రాయదుర్గం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వస్తున్న వీరి క్యాబ్‌కు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన కౌశిక్ డ్రైవర్‌గా ఉన్నారు. ఈ వాహనం తెల్లవారుజాము 4.30 గంటకు ట్యాంక్‌బండ్‌పైకి చేరుకుంది. అదే సమయంలో ఈ వాహనానికి వ్యతిరేక దిశలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఎంహెచ్ 34 బీజీ 2877) వస్తోంది. ఈ బస్సు తన ముందు ఉన్న కారును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో కుడి వైపునకు వచ్చింది. ఫలితంగా బస్సు ముందు కుడివైపు భాగంలో కారు ముందు కుడివైపు భాగం బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో క్యాబ్ డ్రైవర్ కౌశిక్, వెనుక సీటులో కూర్చున్న శివకుమార్, సమతలకు తీవ్ర గాయాలు కాగా.. చిన్నారి సిరి అక్కడికక్కడే కన్ను మూసింది. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి, క్షతగాత్రులపై ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అది డబుల్ లైన్ రోడ్... రహదారికి మధ్యలో అనేక రకాలైన గీతలు కనిపిస్తుంటాయి. ఒక్కో గీతకు ఒక్కో అంశానికి సూచికగా నిబంధనలు చెప్తుంటాయి. రోడ్డు మధ్యలో రెండు గీతలు పక్కపక్కనే ఉంటే దాన్ని డబుల్ లైన్ అంటారు. అలాంటి రహదారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్ టేకింగ్ చేయకూడదని అర్థం. ఒక గీత ఉండే దాన్ని సింగిల్ లైన్ అంటారు. దీనిపై ఓవర్ టేకింగ్ నిషిద్ధం. దూరందూరంగా ఉండే గీతలతో కూడిన బ్రోకెన్ లైన్ ఉన్న మార్గంలో మాత్రమే ఎదుటి వా హనాల పరిస్థితిని బట్టి ఓవర్ టేక్ చెయ్యాలి. ట్యాంక్‌బండ్ డబుల్ లైన్ రోడ్. అయినప్పటికీ బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించడం, నిద్రమత్తు ఈ ప్రమాదాలకు కారణమయ్యాయి. గత నెలలోనే రెండో పుట్టినరోజు శివకుమార్‌కు ఛాతి, తల భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి. సమతకు రెండు చేతులూ విరిగిపోగా, తల, తుంటి భాగాల్లోనూ గాయాలయ్యాయి. కౌశిక్ ఎడమ చేయి విరగ్గా..ముఖం మీదా గాయాలయ్యాయి. శివకుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. శివకుమార్ బావ జగదీష్ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని అనుమానిస్తున్నారు. శివకుమార్, సమతలకు వివాహమైన పదేళ్లకు సిరి జన్మించింది. గత నెల 15నే చిన్నారి రెండో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంతలోనే ఇంతటి విషాదం చోటు చేసుకోవడంతో వారి బంధుమిత్రులు దుఖసాగరంలో మునిగిపోయారు. చదవండి: 2022లో సింగరేణిలో ఉద్యోగాల భర్తీ.. పూర్తి విరాలు ఇవే.. -
భర్త పోస్టులకు మరో మహిళ లైక్‌లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య..
గాంధీనగర్: సోషల్ మీడియా పుణ్యామా అని.. ప్రతి ఒక్కరు తాము చేస్తున్న ప్రతి పనిని... సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తున్నారు. వాటికి వచ్చే లైక్‌లు, కామెంట్లను చూసి మురిసిపోతున్నారు. ఒక్కొసారి లైక్‌లు, కామెంట్లు రాకపోతే కొంత మంది కుంగుబాటుకు గురైతే.. మరికొందరు తమ విచక్షణ కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నారు. కాగా, ఇలాంటి కోవకు చెందిన ఒక సంఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. అక్టోబరు 22న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. వడోదరలోని సదరు దంపతులకు సోషల్ మీడియాలో వేర్వేరు అకౌంట్లు ఉన్నాయి. ఈ క్రమంలో.. కొంతకాలంగా భర్త పోస్ట్‌లకు వేరే మహిళ లైక్‌లు చేయడాన్ని భార్య గమనించింది. దీంతో భర్త ఖాతాపై ఒక కన్నేసి ఉంచింది. భర్త.. ఏ పోస్టు చేసిన వెంటనే ఆ మహిళ లైక్‌లు కొట్టడం చేయసాగింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన భార్య... తన భర్త ఫోన్లను లాక్కుని కిందపడేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. భర్త.. ఆమెను కిందపడేసి విచక్షణ రహితంగా కొట్టాడు. ఈ క్రమంలో ఆమె అభయం అనే పోలీసు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి భర్తపై ఫిర్యాదు చేసింది. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ దంపతులిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి కట్టుకున్న భార్యపై చేయిచేసుకుంటే.. తీవ్ర పరిణామాలుంటాయని కౌన్సిలింగ్ నిర్వాహకులు బాధిత మహిళ భర్తను హెచ్చరించారు. చదవండి: వ్యభిచారానికి ఒప్పుకోలేదని సొంత చెల్లిని హతమార్చిన అక్క -
సరికొత్త ప్రయోగం: విజయ్ రూపానీ మంత్రివర్గంలోని వారికి నో ఛాన్స్
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని కూడా సిద్ధం చేశారు. గుజరాత్ కొత్త మంత్రులు గురువారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 24 మంది మంత్రులతో కూడిన కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. వారందరితో గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆధ్వర్యంలో తొలిసారి మంత్రివర్గం సమావేశం జరిగింది. అయితే ఈసారి అంతా కొత్తవారే మంత్రులుగా నియమితులు కావడం విశేషం. గుజరాత్ మంత్రివర్గంతో సరికొత్త ప్రయోగం బీజేపీ చేపట్టింది. విజయ్ రూపానీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారెవరికీ కూడా కొత్త మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. 2022 ఎన్నికలకు భూపేంద్ర పటేల్ ఈ టీమ్‌తో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ రూపానీ రాజీనామాతో గుజరాత్లో కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఎన్నికైన విషయం తెలిసిందే. చదవండి: రైలు పట్టాలపై మొసలి.. ఆగిపోయిన రైళ్లు కొత్త మంత్రులు వీరే.. గజేంద్ర సిన్హ్ పర్మార్, రాఘవ్జీ మక్వానా, వినోద్ మొరాడియా, దేవభాయ్ మాలం, హర్ష్ సంఘ్వీ, ముఖేశ్ పటేల్, నిమిష సుతార్, అర్వింద్ రాజ్యాని, కుబేర్ దిన్‌దాన్, కీర్తిసిన్హ్ వాఘేలా, జగ్జీశ్ పంచాల్, బ్రిజేశ్ మెర్జా, జితూ చౌదరి, మనీశ వకీల్, కానూ భాయ్ దేశాయ్, కీర్తిసిన్హ్ రాణా, నరేశ్ పటేల్, ప్రదీప్‌సిన్హ్ పర్మార్, అర్జున్ సిన్హ్ చౌహాన్, రాజేంద్ర త్రివేది, జితూ వాఘానీ, రిషికేశ్ పటేల్, రాఘవ్జీ పటేల్, పూర్ణేశ్ మోదీ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపి గుజరాత్ మార్క్ పాలనను కొనసాగించాలని ఆకాక్షించారు. చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం -
పట్టాలెక్కనున్న ఫైవ్ స్టార్ హోటల్.. దేశంలో తొలిసారి ఇలా
గాంధీనగర్: దేశంలో తొలిసారిగా ఓ ఫైవ్ స్టార్ హోటల్ రైలు పట్టాలెక్కబోతుంది. ఫైవ్ స్టార్ హోటల్ రైలు పట్టాలెక్కడమేంటి అని ఆలోచిస్తున్నారు. అయితే ఇది చదవండి. గుజరాత్‌లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్‌ను భారత రైల్వేశాఖ కొత్త హంగులతో సుందరీకరిస్తుంది. ఇందులో భాగంగా ఓ ఫైవ్ స్టార్ హోటల్‌ను పట్టాలపై నిర్మించాలని ఓ వినూత్న ఆలోచన చేసింది. దేశంలో తొట్టతొలిసారి నిర్మించ తలపెట్టిన ఇలాంటి ప్రాజెక్ట్‌ను భారతీయ రైల్వేస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మిస్తుంది. ఈ ఫైవ్ స్టార్ హోటల్‌ను లీలా గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వహించనున్నట్లు రైల్వే వర్గాల సమాచారం. మూడు టవర్లుగా నిర్మించే ఈ హోటల్లో మొత్తం 300 గదులు ఉండనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. ఈ ఐదు నక్షత్రాల హోటల్ కింద రైళ్లు తిరుగుతున్నా ఎలాంటి ప్రకంపనలు కానీ శబ్దాలు కానీ హోటల్లో ఉన్న వారికి వినిపించకుండా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. నిజానికి అంతర్జాతీయంగా ఇలాంటి ప్రాజెక్టులు సాధారణమే అయినా.. భారత్‌లో మాత్రం రైలు పట్టాలపై ఇదే తొలి ఫైవ్ స్టార్ హోటల్ అని వెల్లడించారు. దీని నిర్మాణానికి రెండేళ్ల సమయం పడుతుందని పేర్కొన్నారు. -
ఆవు పేడతో తగ్గుతున్న కరోనా, ఆందోళనలో డాక్టర్లు?
గాంధీ నగర్ : ఆవుపేడ ఒంటికి రాసుకుంటే కరోనా తగ్గుతుందని చాలా మంది నమ్ముతున్నారు. కానీ అలా చేస్తే మొదటికే మోసం వస్తుందని, కరోనాతో పాటు ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు ఆందోళన. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయం తాండవం చేస్తోంది. ఆస్పత్రుల్లో బెడ్లు లేక, ఆక్సిజన్ కొరత కారణంగా ఇప్పటి వరకు 2,26,62,575 మందికి కరోనా సోకగా 2,49,992 మరణించారు. అయితే ఈ మరణాల సంఖ్య ఐదు నుంచి 10 రెట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అహ్మదాబాద్ రాష్ట్ర ప్రజలు ఒంటికి ఆవు పేడ పూసుకుంటే కరోనా తగ్గిపోతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని గోశాలలకు క్యూ కడుతున్నారు.ఈ ఆచారంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జెఎ జయలాల్ ఆవుపేడ తో వ్యాధినిరోధక శక్తి పెరిగిపోతుందని ఎలాంటి ఆధారాలు లేవన్నారు. 'నాకు గతేడాది కరోనా సోకింది. రుషులు నిర్వహిస్తున్న శ్రీస్వామినారాయాణ గురుకుల్ విశ్వవిద్యాలయంలో ఆవుపేడతో కరోనా తగ్గుతుందని నా సన్నిహితులు చెబితే నేనూ అదే చేశాను.నాకు కోవిడ్ తగ్గిపోయింది అంటూ ఫార్మా కంపెనీ అసోసియేట్ మేనేజర్ గౌతమ్ మనీలాల్ బోరిసా' తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను ఇదే ఆశ్రమంలో చాలామంది డాక్టర్లును చూశాను. వాళ్లు కూడా ఆవుపేడతో కరోనా తగ్గుతుందని నమ్ముతున్నారని చెప్పారు. కరోనా బాధితులు శ్రీస్వామినారాయాణ గురుకుల్ విశ్వవిద్యాలయంలో దొరికే ఆవుపేడను ఒంటికి అప్లయ్ చేసుకుంటారు. ఆ పేడ ఎండిపోయే వరకు అలాగే ఉంటారు. కొంతమంది ఆవుల్ని కౌగిలించుకుంటారు. అలా కౌగిలించుకోవడం వల్ల ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయని వారి నమ్మకం. ఆ తర్వాత ఆశ్రమంలో దొరికే పాలు, లేదంటే మజ్జిగతో శరీరాన్ని శుభ్రం చేసుకుంటారని మనీలాల్ బోరిసా తెలిపారు. చదవండి : చేతులెత్తేసిన కేంద్రం, వలస కార్మికులకు నో ఫ్రీ రేషన్ -
విషాదం : గర్బా డ్యాన్స్ చేస్తూ మృత్యుఒడిలోకి
గాంధీనగర్ : గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శుక్రవారం రాత్రి పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. అందరితో కలిసి సరదాగా గర్బా డ్యాన్స్ చేస్తున్న మహిళ గుండెపోటు రావడంతో సెకండ్ల వ్యవధిలోనే మరణించింది. వివరాలు.. గాంధీనగర్ జిల్లా రూపాన గ్రామానికి చెందిన 45 ఏళ్ల కల్పనాబెన్ గాద్వి తమ బంధువుల వివాహానికి హాజరైంది. (చదవండి : పెద్దాయన క్రూరత్వం, నెటిజన్ల మండిపాటు) వివాహ వేడుకలో తోటి మహిళలతో కలిసి గర్భా డ్యాన్స్ ఆడుతున్న కల్పనాబెన్ వద్దకు ఆమె కూతురు పరిగెత్తుకు వచ్చింది. దీంతో పాపను ఎత్తుకున్న కల్పనా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలింది. డ్యాన్స్ చేస్తున్న తోటి మహిళలు వచ్చేలోపే ప్రాణాలు విడిచింది. దీంతో అంతసేపు చలాకీగా డ్యాన్స్ చేస్తూ కనిపించిన కల్పనా మరణించడం కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. (చదవండి : డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు అస్వస్థత) -
ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఆటలు సాగవు
-
విషాదం.. ఏడుగురు సజీవ దహనం
గాంధీనగర్ : గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న డంపర్ కారును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఏడుగురు సజీవదహనం అయ్యారు. శనివారం ఉదయం సురేంద్రనగర్ జిల్లా కేంద్రం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక ఎస్పీ హెచ్‌సీ దోషీ దర్యాప్తు చేస్తున్నారు. తాజా ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
లక్ష విలువైన మద్యం బాటిల్స్‌తో పరార్
సాక్షి, హైద్రాబాద్ : దేశ వ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేయడంతో మందుబాబులు అల్లాడుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా.. మద్యం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు మద్యం షాప్ లూటీకి పాల్పడ్డారు. షాప్ మూసివేడంతో వెనుక నుంచి రంద్రం చేసి లోపలికి ప్రవేశించారు. లక్ష రూపాయల విలువైన మద్యం బాటల్స్‌తో పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సీసీటీవీ వీడియోల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. కాగా మద్యం దొరక్క దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలోనూ తొమ్మదిమంది బలవన్మరణానికి పాల్పడ్డారు. -
విజయవాడలో అగ్నిప్రమాదం
సాక్షి, విజయవాడ : నగరంలోని గాంధీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజ్ యువరాజు సినిమా థియేటర్‌కు ఉన్న దత్తా షాపింగ్ కాంప్లెక్స్‌లో శుక్రవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రూ.800కే ఏసీ..
గాంధీనగర్ : ఏసీ ఇప్పటికీ చాలామందికి ఖరీదైన వ్యవహారమే. అయితే ఇకపై ఏసీల కోసం అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదంటున్నారు మనోజ్ పటేల్. గుజరాత్‌లోని వడోదరలో తన పేరుతోనే ఓ డిజైన్ స్టూడియో నిర్వహిస్తున్న ఈ వ్యక్తి.. రూ.800తోనే ఏసీ తయారు చేశారు. ఒక్కసారి మట్టికుండలోని నీటి చల్లదనాన్ని గుర్తు చేసుకోండి. మట్టిలోని అతిసూక్ష్మ రంధ్రాల గుండా వెళ్లే నీరు ఆవిరి కావడం చల్లదనానికి కారణమని తెలిసిన విషయమే. సరిగ్గా ఇదే ఆలోచనతోనే మనోజ్ పటేల్ చిన్నసైజు ఏసీ తయారు చేశారు. కాకపోతే ఇందులో మట్టికి బదులుగా పింగాణీ ఉపయోగిస్తారు. ప్రస్తుతం మనోజ్ పటేల్ మూడు మోడళ్ల ఏసీని తయారు చేశారు. ఒకదాంట్లో పైన ట్యాంకులోని నీటి మోతాదును చెప్పేందుకు ఓ సూచికతో పాటు ఓ మొక్క పెంచేందుకు ఏర్పాట్లు ఉంటాయి. ఆఫీసులు, ఇళ్లల్లో వాడుకోగల వ్యక్తిగత ఏసీ మూడోది. గది ఉష్ణోగ్రతలను 32 డిగ్రీల నుంచి 23 డిగ్రీల స్థాయికి తీసుకు రాగల ఈ ఏసీలకు విద్యుత్ అవసరమే ఉండదు. వ్యక్తిగత పింగాణీ ఏసీలో మాత్రం ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. పైగా ట్యాంకును ఒకసారి నింపితే 10–12 రోజుల వరకు ఆ నీటినే వాడుకోవచ్చు. పింగాణీ, రాళ్లు, మట్టి మాత్రమే వాడటం వల్ల ఖర్చు తక్కువగా ఉంటుందంటున్నారు మనోజ్. -
ఫాల్స్ అఫిడవిట్: అమిత్ షాపై అనర్హత వేటు!?
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఉన్నాయని, ఆస్తులు, అప్పులకు సంబంధించి పలు తప్పుడు వివరాలు ఆయన అఫిడవిట్లో పొందుపర్చారని, కాబట్టి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అమిత్ షా తన అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పులకు సంబంధించి రెండు కీలకమైన విషయాలను ఉద్దేశపూర్వకంగా వదిలేశారని, ఇందుకుగాను ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గాంధీనగర్‌లో తన పేరిట ఉన్న ప్లాట్ ఖరీదు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూ. 66.5 లక్షలు కాగా.. దాని విలువను రూ. 25 లక్షలుగా అఫిడవిట్లో చేర్చారని, అంతేకాకుండా గుజరాత్లో అతిపెద్దదైన సహకార బ్యాంక్ కలుపూర్ కమర్షియల్ కో ఆపరేటివ్ బ్యాంకు నుంచి జయ్ షా 2016లో తన వ్యాపారం కోసం రుణాలు తీసుకున్నారని, ఇందుకు అమిత్ పూచీకత్తుదారుగా ఉన్నారని, కానీ అఫిడవిట్లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించలేదని కథనాలు వచ్చాయి. ఈ కథనాలను ఉటంకిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అమిత్ షాపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. -
నామినేషన్ దాఖలు చేసిన అమిత్ షా
-
బీజేపీ టోపీని నిరాకరించిన అమిత్ షా మనవరాలు
-
అమిత్ షాకు మనవరాలు షాక్!
గాంధీనగర్: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శనివారం గాంధీనగర్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన తన కుటుంబసమేతంగా కలిసి వచ్చి నామినేషన్ వేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. అమిత్ షా తన మనవరాలికి కాషాయరంగుతో ఉన్న టోపీ పెట్టడానికి ప్రయత్నించాడు. అయితే ఆమె మాత్రం దానిని పెట్టుకోవడానికి నిరాకరించింది. తన హ్యాట్ మాత్రమే పెట్టుకుంటానని అమిత్ షా పెట్టిన బీజేపీ టోపిని తీసేసింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా అమిత్ షా తొలిసారి లోక్‌సభ బరిలో నిలుస్తోన్న విషయం తెలిసింది. గాంధీనగర్ నుంచి ఆరుసార్లు విజయం సాధించిన అగ్రనేత ఎల్కే అద్వానీని పక్కన పెట్టి షాని బీజేపీ ఇక్కడ బరిలో నిలిపింది. -
మోదీ మళ్లీ వారణాసి నుంచే
న్యూఢిల్లీ: అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆ పార్టీ అగ్ర నాయకుడు ఎల్కే అడ్వాణీ స్థానంలో గాంధీనగర్‌లో పోటీచేయబోతున్నారు. హోలీ పర్వదినం సందర్భంగా బీజేపీ బుధవారం 184 మంది అభ్యర్థులతో గురువారం తొలి జాబితాను విడుదలచేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్(28), మహారాష్ట్ర(16), తెలంగాణ(10), పశ్చిమ బెంగాల్(28), అస్సాం(8), ఉత్తరాఖండ్(5), తమిళనాడు(5), ఛత్తీస్‌గఢ్(5), జమ్మూ కశ్మీర్(5), కర్ణాటక(21), కేరళ(13), ఒడిశా(10), రాజస్తాన్(16), తమిళనాడు(5), అరుణాచల్ ప్రదేశ్(2), ఆంధ్రప్రదేశ్(2) తదితర రాష్ట్రాల్లో బీజేపీ తన అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢీకొనబోతున్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లక్నోలో, రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్‌లో, హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్‌ప్రదేశ్(పశ్చిమ)లో పోటీచేయబోతున్నారు. కేంద్ర మంత్రులు వీకే సింగ్(ఘజియాబాద్), మహేశ్ శర్మ(గౌతమబుద్ధనగర్–నోయిడా)లు తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకున్నారు. బిహార్‌లోనూ 17 మంది అభ్యర్థులను ఖరారుచేసిన బీజేపీ ఆ జాబితాను రాష్ట్ర యూనిట్‌కు పంపింది. మిత్రపక్షాలతో కలిసి అందులోని పేర్లను వెల్లడిస్తామని నడ్డా చెప్పారు. యూపీలో ఎస్పీ–బీఎస్పీ కూటమి నుంచి తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత మంది సిట్టింగ్‌లను తప్పించే అవకాశాలున్నాయి. ముఖ్యాంశాలు ► క్రిష్ణరాజ్(షాజహాన్‌పూర్) మినహా లోక్‌సభ ఎంపీలైన దాదాపు అందరు కేంద్ర మంత్రులకు టికెట్లు దక్కాయి ► యూపీలో ప్రకటించిన 28 మందిలో ఆరుగురు సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరించారు. అందులో ఎస్సీ కమిషన్ చైర్మన్, ఆగ్రా ఎంపీ రామ్‌శంకర్ కఠారియా, క్రిష్ణరాజ్ ఉన్నారు. ► మాజీ కేంద్ర మంత్రి బీసీ ఖండూరి(గార్వాల్), ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి భగత్‌సింగ్ కోషియారి(నైనిటాల్)ల స్థానంలో కొత్తవారికి చోటు కల్పించారు. ► ఇటీవలే మిజోరం గవర్నర్‌గా వైదొలిగిన కుమ్మనం రాజశేఖరన్‌కు కేరళలోని తిరువనంతపురం టికెట్ కేటాయించారు. ► తమిళనాడు యూనిట్ చీఫ్ తమిళిసాయి సౌందరరాజన్ తూత్తుకుడిలో డీఎంకే అభ్యర్థి కనిమొళితో పోటీపడనున్నారు. ► మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్ కుమారుడు సుజయ్ విఖే పాటిల్‌కు అహ్మద్‌నగర్ టికెట్ దక్కింది. ఆయన ఇటీవలే బీజేపీలో చేరారు. ► మహారాష్ట్రలో వారసత్వ రాజకీయ నేపథ్యమున్న పూనమ్ మహాజన్(ప్రమోద్ మహాజన్ కూతురు), ప్రీతమ్ ముండే(గోపీనాథ్ ముండే కూతురు), రక్షా ఖడ్సే(ఏక్నాథ్ ఖడ్సే కోడలు)లకు జాబితాలో చోటు దక్కింది. మరోసారి రాహుల్ వర్సెస్ స్మృతి అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీల మధ్య మరోసారి ఆసక్తికర పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో రాహుల్ చేతిలో స్మృతి లక్షకు పైగా ఓట్ల తేడాతో ఓటమిపాలైనా స్ఫూర్తిదాయక ప్రదర్శనే చేశారు. మరోవైపు, ముంబై నార్త్ సెంట్రల్లో పూనమ్ మహాజన్(బీజేపీ), సంజయ్ దత్ సోదరి ప్రియాదత్(కాంగ్రెస్)ల మధ్య ఇలాంటి పోరే జరిగే అవకాశాలున్నాయి. క్రితంసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాదత్‌ను పూనమ్ మహాజన్ ఓడించారు. అడ్వాణీ రాజకీయ జీవితానికి తెర! బీజేపీ తొలి జాబితాలో 91 ఏళ్ల కురువృద్ధుడు, అగ్ర నేత ఎల్కే అడ్వాణీ పేరును విస్మరించడం ఆశ్చర్యపరిచింది. గాంధీనగర్ నియోజకవర్గంలో ఆయన స్థానంలో పోటీచేస్తున్న అమిత్ షా తొలిసారి లోక్‌సభ బరిలో దిగబోతున్నారు. దీంతో అడ్వాణీ రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనని భావిస్తున్నారు. 1998 నుంచి అడ్వాణీ గాంధీనగర్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, తొలినాళ్లలో ఆయనకు అమిత్ షా ప్రచార బాధ్యతలు నిర్వర్తించడం గమనార్హం. ప్రస్తుతం కూడా గాంధీనగర్ ఎంపీగా ఉన్న అడ్వాణీ ఆ స్థానం నుంచి ఐదు సార్లు గెలుపొందారు. 2014లో మోదీ–షా ద్వయం బీజేపీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అడ్వాణీ ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోయింది. ఈ లోక్‌సభలో 92 శాతం పార్లమెంట్ సమావేశాలకు హాజరైనా ఆయన మాట్లాడింది కేవలం 350 పదాలే. అడ్వాణీకి సీటు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ స్పందిస్తూ..అగ్ర నేతను తొలుత బలవంతంగా మార్గదర్శన్ మండలికి పంపిన బీజేపీ ఇప్పుడు ఆయన నుంచి గాంధీనగర్ స్థానాన్ని లాగేసుకుందని ఎద్దేవా చేసింది. 75 ఏళ్లు నిండిన నాయకులను ఇప్పటికే ప్రభుత్వానికి దూరంగా పెట్టిన బీజేపీ ఇక వారిని పోటీయుత రాజకీయాల నుంచి కూడా తప్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
సోషల్ మీడియా: వెనక్కి తగ్గిన కేంద్రం
సాక్షి, గాంధీనగర్ : ఆన్లైన్ డేటాపై నిఘా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకుకోవడంలేదని కేంద్ర సమాచార, ప్రసార సహాయ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ప్రకటించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ కట్టడికి, ఖాతాదారులు పంపించే సందేశాలను పరీశీలించడానికి సోషల్ మీడియా హబ్ ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కొందరూ వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అత్యన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కేసును విచారించిన సుప్రీం ధర్మాసనం సోషల్ మీడియా హబ్ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పౌరుల కదలికలు, సంబంధాలపై పూర్తి నిఘా ఉండే రాజ్యాంలా దేశాన్ని మార్చాలనుకుంటున్నారా? అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని కర్ణావతి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన యూత్ పార్లమెంట్లో పాల్గొన్న రాజ్యవర్థన్ సింగ్ సుప్రీం నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించారు. ప్రతి వ్యక్తి ఎవరికివారే సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ సందర్భంగా రాథోడ్ మాట్లాడుతూ.. దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పౌరుల వాక్ స్వాతంత్రంపై ఆంక్షలు విధించిన చర్రితదేశతొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూదే అని, అదే పద్దతిని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కూడా అనుసరించారని విమర్శించారు. అఖండ భారతదేశం కోసం పాటుపడిన జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు స్యామ్ ప్రసాద్ ముఖర్జీపై కూడా కాంగ్రెస్ పార్టీ ఆంక్షలు విధించిందని విమర్శించారు. -
విశాఖ గాంధీనగర్ వాసుల్లో గుబులు
-
విశాఖ గాంధీనగర్‌లో దారుణహత్య
-
అన్న గొంతు కోసిన తమ్ముడు
హైదరాబాద్ : నగరంలోని గాంధీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి వివాదంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన వివాదంలో.. తమ్ముడు సొంత అన్న గొంతు కోశాడు. అన్న శ్రీధర్ యాదవ్‌కు తమ్ముడు శేఖర్‌యాదవ్‌కు మధ్య గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో తగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఇద్దరి మధ్య తిరిగి గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన తమ్ముడు కత్తితో అన్నపై దాడి చేసి గొంతు కోశాడు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విజయవాడ తరలిన శోభన్‌బాబు విగ్రహం
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలోని వుడయూర్ శిల్పశాలలో రూపొందిన ఆంధ్రుల అందాల నటుడు శోభన్‌బాబు విగ్రహాన్ని బుధవారం విజయవాడకు తరలించారు. 8 అడుగుల ఆ కాంస్య విగ్రహాన్ని విజయవాడ గాంధీనగర్ సెంటర్లో ఏర్పాటు చేయనున్నట్లు శిల్పి రాజ్‌కుమార్ వుడయూర్ తెలిపారు. శోభన్‌బాబు స్వగ్రామం కృష్ణా జిల్లా మైలవరం మండలం చిననందిగామ అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బంధువులు, ఆయన అభిమానుల కోరిక మేరకు శోభనబాబు కుమారుడు కరుణశేషు ఆధ్వర్యంలో విగ్రహాన్ని విజయవాడలో నెలకొల్పుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు రాజమండ్రి, చెన్నై, విశాఖపట్నం, కర్నూలు నగరాల్లో ఏర్పాటు చేసిన శోభన్‌బాబు విగ్రహాలన్నీ తాము తయూరు చేసినవేనని ఆయన వెల్లడించారు. అన్ని విగ్రహాలూ ఒకే రీతిలో తయారు చేయడానికి గల కారణాలను ఈ సందర్బంగా ఆయన వివరించారు. రెండు చేతులతో కోటును పట్టుకున్నట్టు ఉండే విగ్రహాలు బాగున్నాయని ప్రశంసలు రావడంతో విజయవాడలో కూడా అదే తరహాలో విగ్రహాన్ని రూపొందించామని రాజ్‌కుమార్ వుడయూర్ చెప్పారు. ఈ విగ్రహాన్ని ఈ వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించ వచ్చని పేర్కొన్నారు. -
బైక్‌ను ఢీకొట్టిన లారీ ముగ్గురు మృతి
పిడుగురాళ్లరూరల్ : రోడ్డు పక్కన నిలిపివున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టిన ఘటనలో వుుగ్గురు వుృతి చెందారు. పిడుగురాళ్ల పట్టణం పాత బీసీ హాస్టల్ వద్ద వుంగళవారం ఈ సంఘటన జరిగింది. వివరాలు ఇలా వున్నాయి. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన పణితి రాజేష్ (20)అనే యువకుడు తన అక్క కూతురు చంద్రకుంట వసంత(17)తో పాటు బాబారుు వునవడైన కాశివుళ్ల ఆనంద్‌పాల్(4) అనే బాలుడిని తన బైక్‌పై సెంటర్‌కు తీసుకెళ్లాడు. షాపింగ్ అనంతరం వుున్సిపాలిటీ కార్యాలయుం మీదుగా గాంధీనగర్‌కు వెళ్లే క్రవుంలో ఎదురుగా లారీ ఉండడంతో రాజేష్ తన బైక్‌ను పక్కన నిలిపివేశాడు. ఈ సమయంలో వెనుకగా వస్తున్న మరో లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. లారీ వెనుక టైరు రాజేష్ తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వసంత,ఆనంద్‌పాల్‌కి కూడా తీవ్ర గాయూలయ్యూరుు. క్షతగాత్రులను హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. సీఐ సుబ్బారావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే దుర్ఘటన జరిగినట్టు గుర్తించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. -
హైదరాబాద్‌లో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ
హైదరాబాద్ : హైదరాబాద్ ప్రజలను స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. రోజురోజుకీ స్వైన్‌ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. ఆసుపత్రుల్లో ఉన్న రోగులకు భయం పుట్టిస్తోంది. గత మూడు రోజుల్లోనే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో 12 మంది చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్రంలో నెలకొన్న చలితీవ్రతతో స్వైన్‌ఫ్లూ మరింత వ్యాపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. -
లూటీకి లెసైన్స్!
కర్నూలు(జిల్లా పరిషత్) : కర్నూలు నగరంలోని గాంధీనగర్‌లో ఉన్న ఓ వైద్యుని నుంచి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ప్రతి ఏటా రూ.10 వేల దాకా ట్రేడ్ లెసైన్స్ ఫీజు వసూలు చేశారు. ఈ ఏడాది సదరు వైద్యుని ఆసుపత్రికి ట్రేడ్ లెసైన్స్ రశీదు అవసరమైంది. ఇదే విషయమై ఆయన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని పిలిచి రశీదు ఇవ్వాల్సిందిగా కోరారు. రశీదు తెచ్చిస్తామని పలుమార్లు బుకాయించిన సిబ్బంది తీరా ఇవ్వకుండా ఉడాయించారు. దీంతో ఈ విషయమై కార్పొరేషన్ ఉన్నతాధికారి కల్పించుకుని రశీదు ఇప్పించినట్లు సమాచారం. వాస్తవానికి ఆ వైద్యులు కట్టింది రూ.10 వేలైతే రశీదు మాత్రం రూ.5 వేలకు ఇచ్చారు. మరో రూ.5 వేలు సిబ్బంది జేబుల్లోకి చేరాయి. మరో వైద్యుని వద్దకు కార్పొరేషన్ సిబ్బంది వెళ్లి మీకు తెలిసిన డాక్టర్ లెసైన్స్ ఫీజు రూ.10 వేలు ఇచ్చారని, బోగస్ రశీదు చూపారు. దాన్ని చూసి నిజమే అనుకుని ఆ డాక్టర్ కూడా రూ.10 వేలు సిబ్బంది చేతిలో పెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఈ ఇద్దరు డాక్టర్లు కలుసుకున్న సమయంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. నా దగ్గర కూడా కార్పొరేషన్ సిబ్బంది నువ్వు కట్టినట్లు రశీదు చూపించారని వాపోయారు. ఇద్దరినీ బోల్తా కొట్టించారని తెలుసుకున్నారు. పాతబస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఓ బంకుకు లెసైన్స్ ఫీజు చెల్లించాలని కార్పొరేషన్ సిబ్బంది వెళ్లారు. రూ.1000 ఫీజు అవుతుందని, మరో రూ.1000 కొత్త సారుకు ఇవ్వాలని చెప్పి రూ. 2 వేలు తీసుకున్నారు. నాలుగు రోజుల్లో రశీదు తెచ్చిస్తామని చెప్పి వెళ్లారు. రెండు నెలలైనా రశీదు తెచ్చివ్వకపోవడంతో ఆ బంకు యజమాని ఆందోళన చెందాడు. ఈ విషయమై తేల్చుకుందామని మున్సిపల్ కార్పొరేషన్‌కు వెళ్లి విచారిస్తే మీ బంకుకు అనుమతే ఇవ్వకూడదు. అయినా కార్పొరేషన్ స్థలంలో బంకు ఎలా పెట్టుకుంటావ్, వెంటనే తీసెయ్యు లేకపోతే పొక్లెయిన్ తెచ్చి తొలగిస్తామని బెదిరించడంతో అతడు చేసేదేమీ లేక వెళ్లిపోయాడు. ఇలా.. ట్రేడ్ లెసైన్స్ ఫీజు పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కర్నూలు నగరంలో చేస్తున్న వసూళ్ల పర్వంలో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నగరంలో వేల కొద్దీ ఉన్న వివిధ వ్యాపార వర్గాల నుంచి ట్రేడ్ లెసైన్స్ ఫీజు పేరుతో శానిటరి ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు వేల రూపాయలు వసూలు చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్లో చెల్లించకుండా ఖజానాకు భారీగా కన్నం వేస్తున్నారు. ఈ విషయం తెలిసినా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1995, సెక్షన్ నెం.521 ప్రకారం ఏ వ్యాపారి అయినా వ్యాపారం చేసుకోవాలంటే వారి దగ్గర కార్పొరేషన్ వ్యాపార లెసైన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఏపీ మున్సిపాలిటి చట్టం, సెక్షన్ 263లో కూడా ఇలాంటి చట్టం ఉంది. వ్యాపారి కచ్చితంగా లెసైన్స్ తీసుకోవాలని ఇందులో ఉంది. కాని కొందరు వ్యాపారులు మాత్రం లెసైన్స్‌లు లేకుండానే వ్యాపారం చేస్తున్నట్లు గత ఏడాది అక్టోబర్‌లో ప్రిన్సిపల్ కార్యదర్శికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లకువిజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ జనరల్ నివేదిక సమర్పించారు. గత ఏడాది విజిలెన్స్ అధికారులు రాష్ట్రంలోని కొన్ని మున్సిపాలిటిలు, కార్పొరేషన్లలో ట్రేడ్ లెసైన్స్ ఫీజు వసూళ్లపై విచారణ చేశారు. మున్సిపల్ రికార్డుల ప్రకారమే భారీగా ట్రేడ్ లెసైన్స్ ఫీజు వసూలు కావడం లేదని తేల్చారు. ఈ మేరకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 208 నర్సింగ్ హోమ్‌లు, క్లినిక్‌లు ఉన్నాయి. అందులో 16 నర్సింగ్ హోమ్‌లు, 3 క్లినిక్‌లకు మాత్రమే ట్రేడ్ లెసైన్స్‌లు ఉన్నట్లు చూపారు. మిగిలిన 38 నర్సింగ్ హోమ్‌లు, 151 క్లినిక్‌లకు వ్యాపార లెసైన్స్‌లు లేవు. వీటికి లెసైన్స్‌లు లేని కారణంగా కార్పొరేషన్ ప్రతి యేటా రూ.78,70,500 ఆదాయం కోల్పోతోంది. కర్నూలులో 170 రెడీమేడ్ షాపులు, 22 చీరల షోరూమ్‌లు, 215 క్లాత్షోరూమ్లు, 27 గార్మెంట్ షాపులు, ఒక హ్యాండ్లూమ్ షాప్, 3 గోడౌన్లు, 201 మార్కెట్‌యార్డు షాపులు కలిపి 640 దుకాణాలు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు వివరాలు సేకరించారు. వీటిలో కేవలం 88 షాపులకు మాత్రమే వ్యాపార లెసైన్స్‌లు ఉన్నట్లు అధికారులు చూపించారు. మిగతా 551 షాపులు లెసైన్స్ లేకుండానే నిర్వహిస్తున్నారట. ఈ లెక్కన లెసైన్స్‌లేని షాపుల నుంచి అధికారిక లెక్కల ప్రకారం రూ. 1,08,45,000 రావాల్సి ఉంటుంది. కేవలం ఆసుపత్రులు, బట్టల షాపులు, మార్కెట్‌యార్డు షాపుల నుంచే లెసైన్స్‌లు లేని కారణంగా రూ. 1,87,15,000 ఆదాయాన్ని ప్రతి సంవత్సరం మున్సిపల్ కార్పొరేషన్ కోల్పోతోంది. దీన్ని బట్టి ట్రేడ్ లెసైన్స్ జారీ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఘోరంగా విఫలమైనట్లు తెలుస్తోంది. రావాల్సింది కొండంత.. వస్తోంది గోరంత కర్నూలు నగర పాలక సంస్థలో ఎన్ని ట్రేడ్ లెసైన్స్‌లు ఉన్నాయనే సమాచారంపై ఎవరూ నోరు విప్పరు. ఎవరు వెళ్లినా వివరాలు కావాలంటూ రోజుల తరబడి కార్పొరేషన్ చుట్టూ తిరగాల్సిందే. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తిని వివరణ కోరగా ఆయన నాలుగేళ్లలో ఎంత లక్ష్యం ఉంది, ఎంత వసూలైందనే వివరాలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన వివరాల ప్రకారం 2011-12లో రూ.62 లక్షల ట్రేడ్ లెసైన్స్ ఫీజు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా రూ.50.75 లక్షలు మాత్రమే వసూలు చేశారు. 2012-13లో రూ.82.77 లక్షలకు గాను రూ.70.40 లక్షలు, 2013-14లో రూ.87.78 లక్షలకు గాను రూ.74.29 లక్షలు, 2014-15లో రూ.95.38 లక్షలకు గాను నవంబర్ వరకు రూ.77.46 లక్షలు మాత్రమే వసూలు చేశారు. కేవలం విజిలెన్స్ నివేదికల ప్రకారం బట్టల దుకాణాలు, మార్కెట్‌యార్డు షాపులు, నర్సింగ్ హోమ్‌లు, క్లినిక్‌ల బకాయిలే రూ.1.87 కోట్లు ఉండటం గమనార్హం. ఈ లెక్కన అన్ని వ్యాపారాల నుంచి లెసైన్స్ ఫీజు వసూలు చేస్తే రూ.5 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ మున్సిపల్ అధికారులు మాత్రం సంవత్సరానికి టార్గెట్ రూ.95.38 లక్షలు మాత్రమే చూపడం అనుమానాలకు తావిస్తోంది. అధికారుల జేబుల్లోకి ప్రజల సొమ్ము కర్నూలు కార్పొరేషన్లో కోట్లలో వసూలవుతున్న ప్రజల డబ్బు కొందరు అధికారుల జేబుల్లోకి వెళుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు, మున్సిపల్ అదికారులు ఇస్తున్న వివరాలను బట్టి అర్థం అవుతోంది. రహదారి పక్కన చిన్న బంకు పెట్టుకున్నా ముక్కుపిండి ట్రేడ్ లెసైన్స్ ఫీజు పేరిట డబ్బులు వసూలు చేసే మున్సిపల్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఫీజు వసూలు కావడం లేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ప్రతి సంవత్సరం కోట్లలో ఫీజులు వసూలు చేస్తూ లక్షల్లో మాత్రమే కార్పొరేషన్ ఖజానాలో వేస్తున్నారన్న విమర్శలూ వ్యక్తం అవుతున్నాయి. చట్టం ఏం చెబుతోందంటే...! మున్సిపల్ చట్టం ప్రకారం అధికారులు జారీ చేసిన లెసైన్స్‌లో ఆ లెసైన్స్ చెల్లుబాటు కాలం, దానికి సంబంధించిన నిబంధనలు, నియమావళి తెలపాలి. లెసైన్స్ ఇచ్చినప్పుడు దానిపై మున్సిపల్ కమిషనర్‌తో సంతకం చేయించాలి. ఈ విషయం సెక్షన్ 119లో కూడా పేర్కొన్నారు. ఎంత ఫీజు తీసుకోవాలి లెసైన్స్ ఇచ్చేసమయంలో కొంత ఫీజు వసూలు చేస్తారు. ఆ రేటు ఎప్పటికప్పుడు కమిషనర్ విధిస్తారు. అది కూడా కౌన్సిల్ అనుమతితో జరగాలి. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ప్రకారం సెక్షన్ 521(1), (ఇ) ఆసుపత్రులు, క్లినిక్‌లు నడుపుకోవడానికి నియమాలు ఈ విధంగా ఉన్నాయి. సెక్షన్ 521 ప్రకారం కొన్ని వ్యాపారాలు కచ్చితంగా వ్యాపార లెసైన్స్ లేకుండా చేయకూడదు. ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్‌కు ఒకటి నుంచి 30 పడకలకు సంవ త్సరానికి రూ.5 వేలు, 31 నుంచి 40 పడకలకు రూ.8 వేలు, 41 నుంచి 50 లేదా అంతకన్నా ఎక్కువ పడకలుంటే రూ.10 వేలు ఫీజు వసూలు చేయాలి. ఆయుర్వేదం, హోమియో, యునాని, అల్లోపతి క్లినిక్‌లకు సంవత్సరానికి రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రెడీమేడ్ బట్టల దుకాణాలకు రూ.1000, రూ.2 వేలు, రూ.5 వేలు, కట్‌పీస్ క్లాత్ షోరూంకు రూ.2 వేలు, చీరల షోరూం లెసైన్స్ ఫీజు రూ.2 వేల నుంచి రూ.5 వేలు, ప్రభుత్వ దుకాణానికి రూ.1000, హ్యాండ్లూమ్ షాపు లెసైన్స్ రూ.2 వేలు, గోడౌన్ లెసైన్స్ ఫీజు రూ.500 వసూలు చేస్తారు. వ్యాపారులు గడువులోగా లెసైన్స్ ఫీజు చెల్లించలేకపోతే 60 రోజుల్లోపు 25 శాతం అపరాధ రుసుము, 60 రోజులు దాటితే 50 శాతం అపరాధ రుసుము వసూలు చేస్తారు. -
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
మూర్చవ్యాధి నయం కాకపోవడంతో మనస్తాపం చెంది బలవన్మరణం ధర్మవరం టౌన్ : పట్టణంలోని గాంధీనగర్ రైల్వే గేట్ వద్ద బుధవారం స్థానిక ఇందిరానగర్‌కు చెందిన నారాయణమ్మ(19) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. భవన నిర్మాణ కార్మికులైన యల్లమ్మ, ఓబిలేషు దంపతుల కుమార్తె నారాయణమ్మకు చిన్ననాటి నుంచే మూర్చవ్యాధితో బాధపడుతుండేది. పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగి చికిత్స చేస్తున్నా ఫలితం లేకపోయింది. ఈ వ్యాధి కారణంగా పెళ్లి సంబంధాలు కూడా కుదరడం లేదు. దీంతో ఇక తనకు ఈ వ్యాధి నయం కాదని నారాయణమ్మ తరచూ మదనపడుతుండేదని తల్లిదండ్రులు వాపోయారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 6 గంటల సమయంలో బహిర్భూమికి ఆమె రైలు కింద పడి బలవన్మరణం పాలైంది. స్థానికులు గుర్తించి మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సంఘటన స్థలంలో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు రోదించిన తీరు కలచి వేసింది. రైల్వే ట్రాక్ మధ్యలో పడి ఉన్న సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: సుష్మ
న్యూఢిల్లీ : బీజేపీ భారీ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సుష్మా స్వరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. విదీశ నుంచి బరిలోకి దిగిన ఆమె భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. గెలుపు అనంతరం సుష్మ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ప్రభుత్వంలో తన పాత్ర ఏంటో ప్రధానమంత్రి, పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని తెలిపారు. ఇక గాంధీనగర్‌లో 3 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందిన ఎల్కే అద్వానీ బీజేపీ సాధించిన భారీ విజయంతో ఖుషీగా ఉన్నారు. కాంగ్రెస్ అవినీతి, ధరల పెరుగుదలాంటి అంశాలు ఎన్నికలపై తీవ్రంగా ప్రభావం చూపించాయన్న ఆయన తమ పార్టీ భారీ విజయానికి ఇదే కారణమన్నారు. -
తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోడీ
గాంధీనగర్ : దేశానికి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా తన తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ (వారణాసి, వడోదర) భారీ విజయం సాధించిన తర్వాత ఆయన నేరుగా గాంధీనగర్‌లోని తన నివాసానికి వెళ్లారు. తల్లి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కాసేపు ఆమెతో ముచ్చటించారు. తన కొడుకు ప్రధాని కాబోతుండటంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. భారీ విజయం తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన మోడీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. స్థానికులు బాణసంచా కాల్చి, డప్పువాయిద్యాలతో హోరెత్తించారు. దీంతో అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. తన కొడుకు తన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని.. దేశానికి మోడీ ఎంతో సేవ చేయాలని ఆయన తల్లి ఆకాంక్షించారు. -
గాంధీనగర్‌లో అద్వానీ కుమార్తె ప్రచారం
-
అలకవీడిన బీజేపీ అగ్రనేత అద్వానీ
-
గాంధీనగర్ నుంచే అద్వానీ
న్యూఢిల్లీ: మలుపులు తిరుగుతూ.. ఉత్కంఠ రేపుతూ సాగిన రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత నేత లాల్‌కృష్ణ అద్వానీ లోక్‌సభ సీటు వ్యవహారం చివరికి టీ కప్పులో తుపాను మాదిరిగా ముగిసింది. పార్టీ నాయకత్వం దిగి రావడంతో అద్వానీ కూడా ఓ మెట్టుదిగారు. ముందు భోపాల్ నుంచి పోటీకి మొగ్గు చూపిన ఆయన చివరికి గాంధీనగర్ నుంచే లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటించారు. గాంధీనగర్, భోపాల్ సీట్లలో ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అద్వానీయే నిర్ణయించుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్సింగ్ ప్రకటించారు. రాజ్‌నాథ్ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే అద్వానీ తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో అద్వానీ పోటీ చేసే స్థానంపై 24 గంటలుగా కొనసాగిన డ్రామాకు తెరపడినట్లయ్యింది. అయితే మోడీకి, అద్వానీకి మధ్య ఉన్న దూరాన్ని ఈ వ్యవహారం మరోసారి బట్టబయలు చేయడం గమనార్హం. కాగా గురువారం ఉదయం పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీతో పాటు పార్టీ సీనియర్ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు అద్వానీతో భేటీ అయ్యారు. మోడీ సుమారు అరగంట పాటు అద్వానీతో సమావేశమై గుజరాత్ ప్రజలంతా అద్వానీ గాంధీనగర్ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నట్టు ఆయనకు విన్నవించారు. అనంతరం సుష్మా, జైట్లీ, వెంకయ్య కూడా అద్వానీతో చర్చించారు. -
రాంగ్ పార్కింగ్ కేసునూ ఎదుర్కోలేదు: మోడీ
గాంధీనగర్ (గుజరాత్): సుపరిపాలన అందించడం ద్వారా కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించవచ్చని, ప్రజలకు మెరుగైన న్యాయం అందించవచ్చని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) స్వర్ణోత్సవాల్లో భాగంగా శనివారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. కనీసం రాంగ్ పార్కింగ్ కేసును కూడా తానెప్పుడూ ఎదుర్కోలేదని...అందువల్ల కోర్టు గదిని ఎప్పుడూ చూడలేదన్నారు. న్యాయ వ్యవస్థ గురించి తనకు తెలిసింది తక్కువని...ఇది ఒకందుకు మంచిదేనని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ మాట్లాడుతూ, ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, సెల్ ఫోన్లు ఇస్తామంటున్న పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల్లో న్యాయ సంస్కరణలకు చోటు దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఏసీబీకి చిక్కిన ఏఈ
పెద్దపల్లి, న్యూస్‌లైన్ : ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. చేసిన పనులను ఎంబీ రికార్డు చేసేం దుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడో పంచాయతీరాజ్ ఏఈ. సుల్తానాబాద్ మండలం తొగర్రాయిలో గ్రామంలోని గాంధీనగర్‌లో మాజీ సర్పంచ్ గుండా మురళి రూ.2లక్షల విలువైన సీసీ రోడ్డు నిర్మించారు. గత నెలలో పనులు పూర్తి కావడంతో బిల్లు కోసం అధికారుల చుట్టూ తిరగగా ఎంబీ రికార్డు చేసేందుకు పంచాయతీరాజ్ ఏఈ మంచాల శ్రీధర్ రూ.20 వేలు డిమాండ్ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనన్నా ఏఈ వినకపోవడంతో రూ.15 వేలు ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మురళి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం పెద్దపల్లిలోని ఈఈ కార్యాలయానికి వెళ్లిన మురళి ఏఈని కలిశాడు. కార్యాలయం గేటు వద్ద మురళి నుంచి ఏఈ శ్రీధర్ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల్లో అవినీతి పెరిగిపోయిందని, అరికట్టాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, విద్యావంతులపై ఉందని చెప్పారు. మిగతా జిల్లాలతో పోల్చితే మన జిల్లాలో అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, ఇది మంచి పరిణామమని అన్నారు. పనిచేస్తే ఏం మిగల్లేదు - మురళి, బాధితుడు ఎమ్మెల్సీ భానుప్రసాదరావు కోటా నిధుల నుంచి రూ.2 లక్షల విలువ గల సీసీ రోడ్డు డిసెంబర్లో మంజూరైంది. వెంటనే నిర్మాణం పూర్తి చేశా. బిల్లు కోసం నెల రోజులుగా తిరుగుతున్న. రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సహించలేకపోయా. మొత్తం పని చేస్తేనే రూ.20 వేలు కూడా మిగలలే. ఏసీబీ అధికారులను ఆశ్రయించా. -
అడవిని తలపిస్తున్న మహిళా ప్రాంగణం
నెల్లూరు (పొగతోట), న్యూస్‌లైన్: మహిళలకు స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన మహిళా ప్రాంగణం అడవిని తలపిస్తూ భయాందోళన కలిగిస్తోంది. నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో మహిళా ప్రాంగణాన్ని నిర్మించారు. విశాలమైన ప్రాంగణంలో చెట్లు విపరీతంగా పెరిగి అడవిని తలపిస్తోంది. విష పురుగులు సంచరిస్తుండటంతో మహిళలు భయపడుతున్నారు. ఈ ప్రాంగణంలో విద్యార్థులకు, మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమారు 90 మంది గ్రామీణ విద్యార్థినులకు మూడు నెలలుగా కుట్టు శిక్షణ, మిగిలిన అంగన్వాడీ కార్యకర్తలకు న్యూట్రిషన్‌పై శిక్షణ ఇస్తున్నారు. ఆదరణ లేని మహిళలు, వితంతువులు అనేక మంది ప్రాంగణంలో ఆశ్రయం పొందుతున్నారు. సుమారు 200 మంది మహిళలు, విద్యార్థినులు ప్రాంగణంలో ఉంటూ ఉపాధి కోర్సులో శిక్షణ తీసుకుంటున్నారు. ఇంత ప్రాధాన్యం ఉన్న ప్రాంగణం ముళ్ల చెట్లు, పిచ్చి చెట్లు పెరిగి విషపురుగులకు నిలయమైంది. రాత్రి వేళల్లో వారు వెలుపలికి రావాలంటే ఆందోళనకు గురవుతున్నారు. ప్రాంగణం ఆవరణలో ఏర్పాటు చేసిన వీధిలైట్లు సక్రమంగా వెలగడం లేదు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులకు ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. హాస్టల్ మరమ్మతులకు గురైంది. వర్షం పడితే పైకప్పు ఉరుస్తుంది. హాస్టల్ మరమ్మతులకు రూ.8.50 లక్షలు జిల్లా పరిషత్ నిధుల నుంచి కేటయించారు. ఇంత వరకు పనులు ప్రారంభం కాలేదు. పంచాయతీరాజ్ శాఖకు పనులు అప్పగించారు. సేవా సదన్‌లో ఆదరణలేని మహిళలు జీవనం సాగిస్తున్నారు. 100 మందికి పైగా మహిళలు సేవాసదన్‌లో ఉంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాంగణం అడవిని తలపిస్తోంది. సేవాసదన్ మహిళలతో అక్కడి భూమిలో కూరగాయలు సాగు చేసేలా చర్యలు తీసుకుంటే వారికి ఆదాయం లభిస్తుంది. ప్రాంగణంలో చెట్లను తొలగించడంతో పాటు విద్యుత్ లైట్లు సక్రమంగా వెలిగేలా జిల్లా అధికారుల చర్యలు తీసుకోవాలని మహిళలు, విద్యార్థినులు కోరుతున్నారు. -
ఆస్తి కోసం ఘాతుకం
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: ఆస్తి కోసం తోడబుట్టిన చెల్లి కుటుంబాన్నే కడతేర్చేందుకు ప్రయత్నించిన ఓ అక్క ఉదంతమింది. చెల్లెలు కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న ఇంట్లో కిరోసిన్ పోసి నిప్పంటించడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడగా మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున నెల్లూరులోని ఎన్టీఆర్నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..గూడూరులోని గాంధీనగర్‌కు చెందిన బుజ్జమ్మ, పోలయ్య దంపతులకు పద్మమ్మ, రమణమ్మ, ఆదిలక్ష్మమ్మ, మురళి, వరలక్ష్మి పిల్లలు. వీరిలో వరలక్ష్మి మృతి చెందింది. ఎన్టీఆర్ నగర్లో ఉన్న బుజ్జమ్మ నివాసంలో కొన్నేళ్లుగా చిన్నకుమార్తె ఆదిలక్ష్మమ్మ తన భర్త అమృతనారాయణ, పిల్లలు సాయిరామ్, సుప్రజతో కలిసి ఉంటోంది. నారాయణ పెయిం టర్గా, ఆదిలక్ష్మమ్మ విజయమహల్ గేటు సమీపంలోని ఓ బార్ వద్ద అరటికాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏసీనగర్‌లోని మున్సిపల్ పాఠశాలలో సాయిరామ్ తొమ్మిదో తరగతి, సుప్రజ ఏడో తరగతి చదువుతున్నారు. ఆదిలక్ష్మమ్మ అక్క రమణమ్మ ఏడేళ్ల కిందట భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రులు, బంధువుల వద్ద ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో రెండు నెలల కిందట ఆదిలక్ష్మమ్మ ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ తల్లికి చెందిన ఇల్లు ఖాళీ చేయమంటూ చెల్లెలుపై ఒత్తిడి తెచ్చింది. రమణమ్మకు తల్లి బుజ్జమ్మ నచ్చజెప్పినా ఫలితం కరువైంది. ఇంటి వెనకవైపున్న స్థలంలో ఇల్లు కట్టుకున్న అనంతరం ఖాళీ చేస్తానని ఆదిలక్ష్మమ్మ చెప్పినా రమణమ్మ ఒప్పుకోలేదు. ఈవిషయమై అక్కాచెల్లెలు మధ్య సోమవారం వివాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తురాలైన రమణమ్మ చెల్లెలు ఆదిలక్ష్మమ్మ కుటుంబాన్ని కడతేర్చి ఆస్తి సొంతం చేసుకోవాలని భావించింది. అందులో భాగంగా ఐదు లీటర్ల కిరోసిన్‌ను సిద్ధం చేసుకుంది. ఎప్పటిలాగే సోమవారం రాత్రి అందరూ కలిసి ఇంట్లో నిద్రించగా, మంగళవారం తెల్లవారుజామున రమణమ్మ కిరోసిన్‌ను ఇంట్లో పోసి నిప్పంటించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడిన వెంటనే రమణమ్మ తలుపునకు బయట గడియ పెట్టుకుని వెళ్లిపోయింది. మంటల తీవ్రతకు ఇంట్లోని ఆదిలక్ష్మమ్మ కుటుంబసభ్యులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టి 108లో నారాయణ ఆస్పత్రికి తరలించారు. ఆదిలక్ష్మమ్మ, సుప్రజ, సాయిరామ్‌కు తీవ్రగాయాలు కాగా నారాయణకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఆదిలక్ష్మమ్మ, సాయిరామ్‌ల పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న బాలాజీనగర్ సీఐ మంగారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. రమణమ్మపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. సూర్యాపేట మండలం రామన్నపేట స్టేజీ సమీపంలో ద్విచక్రవాహనం పైనుంచి పడి ఒక్కరు దుర్మరణం చెందగా.. మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లిలో బైక్ ఢీకొని మరొకరు చనిపోయారు. సూర్యాపేట రూరల్, న్యూస్‌లైన్: ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడిన సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మండలంలోని రామన్నగూడెం స్టేజీ వద్ద శనివారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన మర్రిపెల్లి అంతయ్య సొంత పనినిమిత్తం యర్కారం గ్రామానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రామన్నగూడెం స్టేజీ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అంతయ్యను స్థానికులు గమనించి సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ద్విచక్రవాహనం ఢీకొని... యాద్గార్పల్లి(మిర్యాలగూడ క్రైం): మండలంలోని యాద్గార్‌పల్లిలో తడకమళ్ల రహదారిపై ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తడకమళ్లకు చెందిన పంగ చంద్రయ్య(50 ) అంతిరెడ్డి అనే వ్యక్తి ట్రాక్టరుపై డ్రైవరుగా పని చేస్తున్నాడు. యాద్గార్‌పల్లిలో పనులు ముగిసిన అనంతరం ట్రాక్టరును అక్కడే ఉంచి స్వగ్రామానికి వెళ్లేందుకు రోడ్డు పక్కన నిల్చున్నాడు. ఇదే సమయంలో యద్గార్పల్లికి చెందిన మహేష్ ద్విచక్రవాహనంపై వస్తూ ప్రమాదవశాత్తు చంద్రయ్యను ఢీకొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గోవా పారిపోయేందుకు యత్నించిన బాలికలు
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురు బాలికలను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ గాంధీనగర్‌కు చెందిన ఈ బాలికలు...ఇంట్లో తల్లిదండ్రులు మందలించటంతో వారు గోవా పారిపోయేందుకు సిద్ధపడినట్లు విమానాశ్రయ సీఐఎస్ఎఫ్ సిబ్బంది తెలిపారు. అనంతం వారిని పోలీసులకు అప్పగించారు.వారి వద్ద నగదు, ఆధార్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించి విచారణ జరుపుతున్నారు. -
'వెస్ట్మాల్' ఘటనను ఖండించిన గుజరాతీ సమాజం
కెన్యాలో నివసించే భారతీయ సమాజం రక్షణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని గుజరాతీయులు అభిప్రాయపడ్డారు. కెన్యా రాజధాని నైరోబీలో వెస్ట్గేట్ షాపింగ్ మాల్లో చోటు చేసుకున్న ఘటనలో గుజరాతీయుల మరణం పట్ల వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంగళవారం గుజరాత్ లోని గాంధీనగర్‌లో మృతుల స్మృత్యర్థం ఏర్పాటు చేసిన స్మారక సభలో పలువురు పాల్గొని ప్రసంగించారు. వెస్ట్మాల్ ఘటనలో భారతీయులు మరణించిన సంఘటన తమను తీవ్రంగా కలచి వేసిందని తెలిపారు. ఆ సంఘటనలో మృతి చెందిన ఆరుగురు భారతీయుల్లో ముగ్గురు గుజరాత్ ప్రాంతం నుంచి వెళ్లిన వారేనని వారు చెప్పారు. గతంలో గుజరాత్ నుంచి వేలాది మంది వ్యాపారం చేసుకునేందుకు కెన్యా వలస వెళ్లారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారి రక్షణ కోసం తగు చర్యలు తీసుకోవాలని కెన్యా ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. అలాగే కెన్యాలోని గుజరాతీ సమాజానికి మరింత రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారని వారు అభిప్రాయపడ్డారు. కెన్యాలో ఇటీవల తరచుగా చోటు చేసుకుంటున్న దాడులతో స్థానికంగా నివసిస్తున్న గుజరాతీయులు కలత చెందుతున్నారని వివరించారు. ఇప్పటికే చాలా మంది గుజరాతీయులు అలా స్వస్థలాలకు చేరుకున్నారని వారు తెలిపారు. కెన్యా అభివృద్ధిలో గుజరాతీయులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. వెస్ట్మాల్ షాపింగ్ మాల్‌పై తీవ్రవాదుల దాడిని గుజరాతీ సమాజం ముక్త కంఠంతో ఖండించింది. కెన్యా రాజధాని నైరోబీలో శనివారం వెస్ట్మాల్ ఘటనలో 63 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
రయ్.. గయ్..!
‘గుడు.. గుడు’ చప్పుడు విన్పిస్తే గుండె ఆగినంత పనవుతోంది. వెనుక వైపు నుంచి బైక్ ఏమాత్రం వేగంగా వచ్చినా అదిరిపడే పరి స్థితి. వీధిచివరన ఒకరి కన్నా ఎక్కువ మంది యువకులు మాట్లాడుకుం టున్నా.. అడుగు ధైర్యంగా ముందుకేయలేని దుస్థితి. కనీసం బంగారు తాళితో బయటకెళ్లినా అతివకు రక్షణ కరువైంది. బండిమీద రయ్.. అని వచ్చి.. చైన్లు లాక్కుని జుయ్ అని దూసుకెళ్తున్నారు దొంగలు. -న్యూస్‌లైన్, కరీంనగర్ క్రైం సమయం రాత్రి 8 గంటలు: సిరిసిల్లలోని గాంధీనగర్‌లో నడుస్తూ వెళ్తున్నారు కందూకూరి అనందం-విజయలక్ష్మి దంపతులు. ఖరీదైన బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు విజయలక్ష్మి మెడలోని 12 తులాల బంగారు నగలను లాక్కుని క్షణాల్లో మాయమయ్యారు. సమయం సాయంత్రం 5 గంటలు: కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన ఓ ఉద్యోగిని ఇం టికి వెళ్తోంది. వీధి చివర పల్సర్‌బైక్‌పై నీట్‌గా త యారైన ఇద్దరు యువకులు కబర్లు చెప్పుకుంటున్నారు. కాసేపటికే బైక్‌పై వచ్చి ఆమె మెడలోని రెండు తులాల బంగారం చైక్ లాక్కుపోయారు. సమయం ఉదయం 7గంటలు: కరీంనగర్‌లోని పాతబజారుకు చెందిన మహిళ గుడికి వెళ్తోంది. వీధి మలుపు తిరిగిందో లేదో.. బైక్‌పై రయ్యని దూసుకొచ్చిన ఇద్దరు లిప్తపాటులో ఆమె మెడలోని బంగారు గొలుసు నొక్కేశారు. వారం వ్యవధిలో వీటితోపాటు10 చోరీలు జరిగాయి. పోలీసుల నిఘా వైఫల్యంతో చోరులు రెచ్చిపోతున్నారు. రెప్పపాటులో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఖరీదైన బైకులు వాడుతూ పెద్దింటి బిడ్డల్లా నమ్మిస్తున్నారు. అనుమానం రాకుండా వెంబడించి సొత్తుతో మాయమవుతున్నారు. ఎవరైనా ప్రతిఘటిస్తే దాడులకూ తెగబడుతున్నారు. వీరంతా ప్రొఫెషనల్సేం కాదు. దొంగల్లో ఉన్నత విద్యావంతులూ ఉండడం కలవరపరుస్తోంది. జల్సాల కోసం.. కొంతకాలం క్రితం పోలీసులు కొందరు దొంగలను అరెస్టు చేశారు. వీరంతా ఇంజినీరింగ్ విద్యార్థులే అని తెలిసి ఆశ్చర్యపోయారు. చాలామంది ఖరీదైన బైక్‌లపై వచ్చి చోరీలు చేస్తున్నారు. ఇందులో జల్సాలకు అలవాటుపడినవారే అధికం. జిల్లాలో సుమారు 120 మందిదాక దొంగలు ఉన్నారు. ఇందులో 80 శాతం మంది 22 -28 ఏళ్లలోపువారే. బంగారం ధర బాగా పెరగడంతో నగల చోరీపై దృష్టిసారించారు. సులభంగా అమ్ముతూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు పొందుతున్నారు. నగలతో సంచరించే మహిళలపై నజర్ వేసి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఏ మాత్రం అనుమానం రాకుండా ఆహార్యంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనావాసాల్లో, జనసమ్మర్థ ప్రాంతాల్లోనూ సులువుగా పనికానిచ్చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. పోలీస్ నిఘా జాడేది? ఇటీవల పోలీస్ నిఘా కొరవడింది. మూడు నెలల్లో జరిగిన భారీ చోరీలే దీనికి తార్కాణం. నగరంలాంటి ప్రాంతాల్లో బ్లూకోట్, ఇంటెలిజె న్స్, స్పెషల్‌బ్రాంచ్, ఐడీ పార్టీ పోలీసులు జనాల్లో తిరుగుతుంటారు. గ్రామాల్లో వీపీవోల ను ఏర్పాటు చేశారు. ఇవేవీ దొంగలకు చెక్ చె ప్పడం లేదు. ఘటన జరిగాక వివరాల సేకరణలోనూ వెనకంజే కన్పిస్తోంది. చోరీ జరిగిందని ఫిర్యాదు చేసినా ఘటన స్థలానికి పోలీసులు వెళ్లని సందర్భాలున్నాయి. మరికొన్ని చోట్ల ఫి ర్యాదు స్వీకరించినా చాలారోజుల దాక కేసులు నమోదు చేయడం లేదని సమాచారం. ఈ నిర్లక్ష్యం దొంగలకు అయాచిత వరం అవుతోంది. రికవరీలోనూ చేతివాటం అదృష్టం బాగుండి దొంగలు దొరికితే.. సొత్తు రికవరీలోనూ పోలీసులు చేతివాటం చూపుతున్నారు. పూర్తిస్థాయిలో రికవరీ అయినా సొత్తును బాధితులకు ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. లేకపోతే కల్తీ బంగారం కట్టబెడుతున్నట్లు సమాచారం. తాజాగా ఓ ఠాణా నుంచి బాధితుడికి కోర్టు ద్వారా సుమారు 36 గ్రాముల బంగారం రికవరీ చేశారు. తీరా దాన్ని పరిశీలిస్తే 14 గ్రాములు రాగి కలిపారు.