గుజరాత్‌లో ప్రమాదం.. మంటల్లో ముక్కలైన భారత యుద్ధ విమానం | Pilot Dies After Jaguar Fighter Jet Crashes During Training Mission In Gujarat, More Details Inside | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో ప్రమాదం.. మంటల్లో ముక్కలైన భారత యుద్ధ విమానం

Published Thu, Apr 3 2025 7:44 AM | Last Updated on Thu, Apr 3 2025 9:49 AM

Jaguar Fighter Jet Crashes In Gujarat Pilot Dies

గాంధీ నగర్: గుజరాత్‎లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. భారత వాయుసేనకు చెందిన జాగ్వార్‌ యుద్ధ విమానం గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో కుప్పకూలింది. ప్రమాదం నుంచి ఓ పైలట్‌ సురక్షితంగా బయటపడగా, మరో పైలట్‌ మృతిచెందారు. ప్రమాదం అనంతరం యుద్ధ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ మేరకు భారత వాయుసేన అధికారుల స్పందిస్తూ.. పైలట్‌ మృతి చెందినట్టు వెల్లడించారు. పైలట్‌ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

వివరాల ప్రకారం.. జామ్‌నగర్‌లోని సువర్ద సమీపంలో బుధవారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‎కు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కుప్పకూలింది. పొలాల్లో క్రాష్ కావడంతో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలుగా విరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి ఒక పైలెట్ సురక్షితంగా బయటపడగా.. మరో పైలెట్ తప్పిపోయాడు. శిక్షణలో ఉన్న విమానం కూలగానే మంటలు అంటుకున్నాయని, ప్రమాద కారణం ఇంకా తెలియరాలేదని జిల్లా ఎస్పీ ప్రేమ్‌సుఖ్‌ దేలూ తెలిపారు. గాయపడిన పైలట్‌ను జామ్‌నగర్‌లోని జీజీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఇక, విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది.

ఇదిలా ఉండగా.. మార్చి నెలలో హర్యానాలోని పంచకుల సమీపంలో జాగ్వార్ ఫైటర్ జెట్ కుప్పకూలిన విషయం తెలిసిందే. విమానంలో సాంతికేతిక సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని జనవాస ప్రాంతాల నుంచి దూరంగా తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. కుప్పకూలిన విమానం అంబాలా ఎయిర్‌బేస్ నుంచి శిక్షణాలో భాగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగి నెల రోజులు కూడా కాకముందే.. మరో జాగ్వార్ యుద్ధ విమానం క్రాష్ కావడం ఎయిర్ ఫోర్స్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement