గాంధీనగర్: సోషల్ మీడియా పుణ్యామా అని.. ప్రతి ఒక్కరు తాము చేస్తున్న ప్రతి పనిని... సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తున్నారు. వాటికి వచ్చే లైక్‌లు, కామెంట్లను చూసి మురిసిపోతున్నారు. ఒక్కొసారి లైక్‌లు, కామెంట్‌లు రాకపోతే కొంత మంది కుంగుబాటుకు గురైతే.. మరికొందరు తమ విచక్షణ కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నారు. కాగా, ఇలాంటి కోవకు చెందిన ఒక సంఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. అక్టోబరు 22న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాలు.. వడోదరలోని సదరు దంపతులకు సోషల్ మీడియాలో వేర్వేరు అకౌంట్‌లు ఉన్నాయి. ఈ క్రమంలో.. కొంతకాలంగా భర్త పోస్ట్‌లకు వేరే మహిళ లైక్‌లు చేయడాన్ని భార్య గమనించింది. దీంతో భర్త ఖాతాపై ఒక కన్నేసి ఉంచింది. భర్త.. ఏ పోస్టు చేసిన వెంటనే ఆ మహిళ లైక్‌లు కొట్టడం చేయసాగింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన భార్య... తన భర్త ఫోన్‌లను లాక్కుని కిందపడేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
భర్త.. ఆమెను కిందపడేసి విచక్షణ రహితంగా కొట్టాడు. ఈ క్రమంలో ఆమె అభయం అనే పోలీసు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి భర్తపై ఫిర్యాదు చేసింది. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ దంపతులిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి కట్టుకున్న భార్యపై చేయిచేసుకుంటే.. తీవ్ర పరిణామాలుంటాయని కౌన్సిలింగ్ నిర్వాహకులు బాధిత మహిళ భర్తను హెచ్చరించారు.
చదవండి: వ్యభిచారానికి ఒప్పుకోలేదని సొంత చెల్లిని హతమార్చిన అక్క
Comments
Please login to add a commentAdd a comment