Husband behavior
-
విడిపోవడం పరిష్కారం కాదు..! మరి తగ్గితే..?
నిజామాబాద్: పెళ్లంటే నూరేళ్ల పంట.. పెద్దల సాక్షిగా, సమాజం ఒప్పుకునేలా ఇరువురి బంధువు లు, స్నేహితుల మధ్య జరిగే అద్భుతమైన ఘట్టం. అయితే ఆధునిక కాలంలో ఏడడుగులు నడిచి ఏడాది గడవకముందే మనస్పర్థలతో ఎన్నో జంటలు విడిపోతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇరువురి తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. అహం వల్లే.. జిల్లాలో భార్యాభర్తల గొడవలకు సంబంధించిన కే సులు ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి. చాలా కేసుల్లో చిన్నచిన్న విషయాలకే గొడవలు పడుతూ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతున్నట్లు స్పష్టమవుతోంది. కొన్నింటిలో పోలీసుల కౌన్సెలింగ్‌తో పరిష్కారం కనిపిస్తున్నా.. ఇంకొన్ని ఘటనలలో మొండిగా ప్రవర్తిస్తూ కేసుల వరకు వెళుతున్నారు. చేసేదేమీ లేక పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు పంపుతున్నారు. పోలీసు స్టేషన్లో అయినా, కోర్టులో అయినా సరే సర్దుకుందామనే ఆలోచనకు రావడం లేదు. కొందరైతే పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. చాలా కేసుల్లో భార్య, భర్తలే కాకుండా వాళ్ల తల్లిదండ్రుల ఇగో కూడా విడాకులకు కారణమవుతోంది. సర్ది చెప్పాల్సిన పెద్దలే సమస్యను పెద్దదిగా చేసి విడుకులు ఇప్పిస్తున్నారు. సామరస్యంగా మాట్లాడుకుంటే.. దంపతులు మొండి ధోరణి విడనాడి ఏ సమస్య తలెత్తినా సామరస్యంగా కూర్చుని మాట్లాడుకోవాలి. ఎదుటివారిపై ఆధిపత్యానికి ప్రయత్నించవద్దు. జీతాలు, హోదాలు ఎలా ఉన్నా, అన్నీ తమ కుటుంబం కోసమే అన్న భావన పెంచుకోవాలి. తగాదాలు వస్తే సాధ్యమైనంత వరకు మూడో మనిషికి తెలియకుండా వారే పరిష్కరించుకోవాలి. తప్పు ఎవరిదైతే వారు క్షమించమని అడిగితే పోయేదేమీ లేదు. ఒక్క చిన్న మాట ఎంతో మార్పుకు కారణమవుతుంది. భార్యభర్తల మధ్య వివాదాలు, వాటి పర్యవసానాలు పిల్లలపై పడకుండా చూసుకోవాలి. సంపాదన ఎంత అవసరమో సంతోషం కూడా అంతే అవసరమనే విషయాన్ని గుర్తించాలి. ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గినా.. చిన్నచిన్న విషయాలకే భార్య, భర్తలు గొడవలు పడుతున్నారు. వాటిని పెద్దలు కూడా మరింత పెద్దవి చేస్తున్నారు. దీంతో కుటుంబాలు దెబ్బతింటున్నాయి. పోలీసు స్టేషన్‌కు, కోర్టుకు వెళ్లిన తర్వాత కౌన్సెలింగ్‌లు ఇచ్చినా చాలా మంది విడిపోతామనే చెబుతున్నారు. విడిపోవడమే పరిష్కారమన్న భావన పెరగడం మంచిది కాదు. భార్య, భర్తల మధ్య తలెత్తే చిన్నచిన్న గొడవలను కూర్చుండి పరిష్కరించుకోవచ్చు. ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గినా సమస్య అప్పుడే పరిష్కారం అవుతుంది. పంతాలకుపోతే ఇరువురూ నష్టపోతారు. – బి.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ, కామారెడ్డి -
భర్త పోస్టులకు మరో మహిళ లైక్‌లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య..
గాంధీనగర్: సోషల్ మీడియా పుణ్యామా అని.. ప్రతి ఒక్కరు తాము చేస్తున్న ప్రతి పనిని... సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తున్నారు. వాటికి వచ్చే లైక్‌లు, కామెంట్లను చూసి మురిసిపోతున్నారు. ఒక్కొసారి లైక్‌లు, కామెంట్లు రాకపోతే కొంత మంది కుంగుబాటుకు గురైతే.. మరికొందరు తమ విచక్షణ కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నారు. కాగా, ఇలాంటి కోవకు చెందిన ఒక సంఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. అక్టోబరు 22న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. వడోదరలోని సదరు దంపతులకు సోషల్ మీడియాలో వేర్వేరు అకౌంట్లు ఉన్నాయి. ఈ క్రమంలో.. కొంతకాలంగా భర్త పోస్ట్‌లకు వేరే మహిళ లైక్‌లు చేయడాన్ని భార్య గమనించింది. దీంతో భర్త ఖాతాపై ఒక కన్నేసి ఉంచింది. భర్త.. ఏ పోస్టు చేసిన వెంటనే ఆ మహిళ లైక్‌లు కొట్టడం చేయసాగింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన భార్య... తన భర్త ఫోన్లను లాక్కుని కిందపడేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. భర్త.. ఆమెను కిందపడేసి విచక్షణ రహితంగా కొట్టాడు. ఈ క్రమంలో ఆమె అభయం అనే పోలీసు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి భర్తపై ఫిర్యాదు చేసింది. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ దంపతులిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి కట్టుకున్న భార్యపై చేయిచేసుకుంటే.. తీవ్ర పరిణామాలుంటాయని కౌన్సిలింగ్ నిర్వాహకులు బాధిత మహిళ భర్తను హెచ్చరించారు. చదవండి: వ్యభిచారానికి ఒప్పుకోలేదని సొంత చెల్లిని హతమార్చిన అక్క -
భర్త కళ్లేదుటే పురుగుల మందు తాగిన భార్య..
రాజేంద్ర నగర్(హైదరాబాద్): నెల్లూరు జిల్లాలో భర్త కళ్లేదుటే.. భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువక ముందే హైదరాబాద్‌లోనూ అదే తరహా ఘటన జరిగింది. వివరాలు.. రాజేంద్ర నగర్లో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం.ఎం. పహాడీలో ఈ దారుణం చోటుచేసుకుంది. మద్యానికి అలవాటు పడిన భర్త సాజీద్ వేధింపులు తాళలేక భార్య షబానా బేగం అనే వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, ఆ వివాహిత.. భర్త కళ్లేదుటే.. తాను విషం సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నాను.. నీవు ఇక నుంచి ప్రశాంతంగా ఉండు.. అంటూ భర్తతో చెప్పి పురుగుల మందు సేవించింది. అయితే, భార్యను కాపాడాల్సింది పోయి... సాజీద్ పైశాచికంగా ప్రవర్తించాడు. తన ముందే భార్య విషం తాగి గిల గిలా కొట్టుకుంటున్నా.. ఆసుపత్రికి తీసుకొని వెళ్లకుండా ఆలస్యం చేశాడు. దీంతో పాపం.. ఆ అభాగ్యురాలు ప్రాణాలు విడిచింది. షబానా మృతితో ఆమె ఐదుగురు పిల్లలు అనాథలుగా మారారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: Property Disputes: కన్నవారికే ‘ప్రాణ భయం’ .. -
సారీ శారద
లాక్డౌన్లో భర్తలు ఏం చేస్తున్నారు? ఇంటి నుంచి ఉద్యోగం చేస్తున్నారు. ఇంటి పనిలో సాయపడుతున్నారు. ఇంటి వారితో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కాని ఆ భర్త టెన్షన్ క్రియేట్ చేస్తున్నాడు. వేధిస్తున్నాడు. మందు కోసం మెలి తిరిగిపోతున్నాడు. ఆమెను బాధిస్తున్నాడు. అతను మారాడా? లాక్డౌన్ అతణ్ణి మార్చిందా? ‘ఆపు. ఇంకొక్క మాట మాట్లాడినా ఊరుకోను’ అన్నాడు కొడుకు. ‘ఏం చేస్తావ్’ హుంకరించాడు భర్త. ‘ఏం... చూపించనా ఏం చేస్తానో’ ముందుకు వచ్చాడు కొడుకు. ‘రేయ్’ హడలిపోతూ కేక పెట్టింది ఆమె. ‘ఎందుకురా మీ ఇద్దరూ నా ప్రాణం తింటారు. మీ వల్ల నేను చచ్చేలా ఉన్నాన’ ఏడ్చిందామె. కొడుకు వెనక్కు తగ్గాడు. అతడు కూడా నోరు మూసుకున్నాడు. ఇద్దరూ వారి వారి గదుల్లో దూరారు. కాని హాల్లో ఆమె ఊపిరాడని భావనతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ∙∙ కొడుకు సైకియాట్రిస్ట్‌తో వీడియో కాల్లోకి వచ్చాడు. ‘డాక్టర్. మీరే మా అమ్మను కాపాడాలి’ అన్నాడు. ‘వివరాలు చెప్పండి’ అన్నాడు సైకియాట్రిస్ట్. ‘మా అమ్మ తీవ్రంగా డిప్రెషన్లో ఉంది. చాలా భయపడుతూ ఉంది. మా నాన్న ఆల్కహాలిక్. లాక్డౌన్ వల్ల మందు దొరకడం లేదని చాలా అలజడి సృష్టిస్తూ వచ్చాడు. చీటికీమాటికీ మా అమ్మను విసుక్కుంటున్నాడు. విత్‌డ్రాయల్ సింప్టమ్స్ వల్ల మొన్న నాలుగు రోజుల పాటు హాస్పిటల్లో మా నాన్నను అడ్మిట్ చేస్తే అక్కడే ఉండి మా అమ్మ సేవ చేసింది. అయినా మా నాన్న మారలేదు. ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. మా అమ్మకు ఈ ప్రెజర్ ఉంది. దాంతోపాటు హాస్పిటల్లో ఉన్నందువల్ల తనకు కరోనా వచ్చేసుంటుందని భయపడుతోంది. మా అమ్మకు నేను ఒక్కగానొక్క కొడుకును. నాకెక్కడ కరోనా వస్తుందోనని ఇంకో భయం. ఇవన్నీ కలిసి మా అమ్మను కుంగదీస్తున్నాయి. మీరే కాపాడాలి’ అన్నాడు కొడుకు. ‘అలా అయితే మీ అమ్మతోపాటు మీ నాన్నకు కూడా కౌన్సెలింగ్ ఇవ్వాలి’ ‘ఆయన ఎటుపోయినా çపర్వాలేదు డాక్టర్. మా అమ్మను కాపాడండి’ అన్నాడు కొడుకు. ‘అదేంటి. అలా అంటావు?’ అన్నాడు సైకియాట్రిస్ట్. కొడుకు కాస్త పాజ్ తీసుకొని అన్నాడు– ‘ఆయన మా నాన్న కాదు డాక్టర్. మా అమ్మకు రెండో భర్త’. ∙∙ శారదకు ఇరవై ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. మేనమామ వరుసైన వ్యక్తితో జరిపించారు. వయసు తేడా ఉంది. అతనికి శారదతో ఎటువంటి మానసికమైన అనుబంధం ఏర్పడలేదు. నిలకడ లేని మనిషి. శారద ఉద్యోగం మీద ఆధారపడాలని చూసేవాడు. ఇవన్నీ చూసి శారద ఐదేళ్ల కాపురం తర్వాత విడాకులు తీసుకుంది. అప్పటికే ఆమెకు కొడుకు పుట్టాడు. విడాకుల తర్వాత దాదాపు పన్నెండు పదమూడేళ్ల పాటు కొడుకే లోకం అనుకుంది. కాని ఆ ఒంటరి బతుకు ఆమెను లోలోపల పీల్చి పిప్పి చేసింది. ఇంటి పనితో ఆఫీస్ పనితో కొడుకును చూసుకోవడంలో అలసిపోయింది. ఉద్యోగానికి రాజీనామా చేసింది. సరిగ్గా ఆ సమయంలోనే కృష్ణారావు పరిచయం అయ్యాడు. అతను కూడా డైవొర్సీ. ఇంటికి వస్తూ పోతూ శారదతో, ఆమె కొడుకుతో చనువు పెంచుకున్నాడు. శారద జీవితంలో అతని పరిచయం కొంత ఉత్సాహం తెచ్చింది. కొడుకు అది గమనించాడు. కుంగిపోయిన తల్లి కొంత మామూలు మనిషి కావడానికి ఇతడు సహకరిస్తాడనుకున్నాడు. అందుకే రెండో పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే ఓకే చెప్పాడు. కృష్ణారావు, శారద ల పెళ్లి జరిగిపోయింది. అతడు మంచివాడే. ఉద్యోగం కూడా శ్రద్ధగా చేస్తాడు. కాని అతనికి తాగుడు వ్యసనం ఉందని పెళ్లి తర్వాత తెలిసింది. తల్లీ కొడుకు ఇద్దరూ హతాశులయ్యారు. కాని, అప్పటికే సరిదిద్దుకోలేని విధంగా వారతన్ని తమ జీవితంలోకి తెచ్చేశారు. ∙∙ లాక్డౌన్ దేశం మీదే కాక ఆ ఇంటి మీద కూడా కఠిన సమయాన్ని తెచ్చింది. బయట అన్నీ బంద్ అయ్యాయి. అతనికి మందు బంద్ అయ్యింది. విత్‌డ్రాయల్ సింప్టమ్స్‌తో అతని ప్రవర్తన మారింది. అప్పటికే గుర్రుగా ఉన్న కొడుకు దీంతో ఇంకా గుర్రుగా మారాడు. ‘అమ్మా.. అతన్ని వదిలేయ్. ఇంటి నుంచి పంపేయ్’ అని తల్లి మీద ఒత్తిడి పెంచారు. ‘ఒరే... ఒక పెళ్లి అలా అయ్యిందని అతి కష్టం మీద ఇంకో పెళ్లి చేసుకున్నాను. ఏదో బలహీనత ఉందని దీనిని ఎక్కడ పాడు చేసుకునేదిరా’ అని ఆమె బాధ. ఇటు కొడుకు నుంచి ఒత్తిడి, అటు భర్త పెట్టే బాధ, దానికి తోడు హాస్పిటల్లో ఉండి రావడం వల్ల కరోనా వస్తుందనే భీతి... ఇవి ఆమెను పీల్చి పిప్పి చేస్తున్నాయని గ్రహించాడు సైకియాట్రిస్ట్. ∙∙ సైకియాట్రిస్ట్.. ముందు శారదతోటి ఆ తర్వాత కొడుకుతోటి మాట్లాడాడు. ‘శారద గారూ.. మీరు కరోనా భయాన్ని తీసేయండి. అది వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ప్రయారిటీ మీ భర్తకు ఇవ్వాలి. అతణ్ణి మీరు మనస్ఫూర్తిగా స్వీకరించాలి. అతడు మీతో మనస్ఫూర్తిగా కలిసిపోవాలి. అప్పుడే మీ కుటుంబం నిలుస్తుంది. దానికి ప్రాముఖ్యం ఇవ్వండి’ అన్నాడు. ఆ తర్వాత శారద భర్తతో మాట్లాడాడు. ‘కృష్ణారావు గారూ... నిన్న మొన్నటి దాకా మీరు ఒంటరి. ఇప్పుడు మీ జీవితంలో భార్య ఉంది. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకని ఒక కొడుకు కూడా ఉన్నాడు. మీరు ఇదంతా పాడు చేసుకుంటున్నారు. మీ వ్యసనాన్ని అదుపు చేసుకోవడానికి లాక్డౌన్ మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇన్నాళ్లు కంట్రోల్ చేసుకున్నారు. హాస్పిటల్ దాకా కూడా వెళ్లొచ్చారు. మెల్లగా దాని నుంచి బయట పడండి. ఒక మందు సీసా కావాలో... ఆనందాన్ని ఇచ్చే ఇద్దరు కుటుంబ సభ్యులు కావాలో ఆలోచించుకోండి. బయట ప్రపంచమంతా ఒత్తిడిలో ఉంటే, ఇంట్లో ఒత్తిడి ఇవ్వడం ఇంగితం ఉన్నవారు చేయాల్సిన పనేనా? మీరేం చిన్నపిల్లాడా? అందమైన కుటుంబ జీవితంలోనే అసలైన మత్తు ఉందని ఎప్పటికి గ్రహిస్తారు?’ అన్నాడు సైకియాట్రిస్ట్. లాక్డౌన్ సడలించారు. వైన్‌షాపులు ఓపెన్ చేశారు. ఆ రోజు ఉదయాన్నే బయటకు వెళ్లిపోయాడు కృష్ణారావు. శారద, ఆమె కొడుకు టెన్స్ అయిపోయారు. డీలా పడిపోయారు. గంట తర్వాత వచ్చాడు కృష్ణారావు– రెండు కిలోల చేపల కవర్‌తో. ‘మందు కోసం వెళ్లాననుకున్నావా? సారీ. ఇంకెప్పుడూ నా జీవితంలో అది ఉండదు’ అని మెచ్చుకోలుగా చూస్తున్న కొడుకు భుజం మీద చేయి వేశాడు కృష్ణారావు. ఆ ముగ్గురి మధ్య ఉన్న మానసికమైన లాక్డౌన్ ఆ రోజుతో ముగిసిపోయింది. మీ వ్యసనాన్ని అదుపు చేసుకోవడానికి లాక్డౌన్ మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇన్నాళ్లు కంట్రోల్ చేసుకున్నారు. హాస్పిటల్ దాకా కూడా వెళ్లొచ్చారు. మెల్లగా దాని నుంచి బయట పడండి. ఒక మందు సీసా కావాలో... ఆనందాన్ని ఇచ్చే ఇద్దరు కుటుంబ సభ్యులు కావాలో ఆలోచించుకోండి. బయట ప్రపంచమంతా ఒత్తిడిలో ఉంటే మీరు ఇంట్లో ఒత్తిడి ఇవ్వడం ఇంగితం ఉన్నవారు చేయాల్సిన పనేనా?’ – సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
భర్త కాటుకు భలే దెబ్బ
అసలు సామెత.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. భర్తలు మనుషుల్లా ప్రవర్తించకపోతే.. కరవడం దాకా ఎందుకు.. మొరిగినా చాలు చట్టం ‘గొలుసు’తో కట్టేస్తుంది! ఆ తర్వాత కూడా తోక ఆడిస్తే.. దెబ్బ వేస్తుంది. గృహహింస నుంచి బంగారు తల్లులను రక్షించడానికిది.. భలే చట్టం. ఉసూరుమంటూ గేటు తీసి, కాంపౌండ్‌లోకి వచ్చింది ఉష. రెండు బస్సులు మారి రావడంతో ఒళ్లు హూనమైపోనట్లయింది.వరండాలో పిల్లలు బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉన్నారు. ‘ఏమ్మా డాలీ.. ఇంట్లోకి ఎందుకు వెళ్లలేదు?’ అని కూతుర్ని అడిగింది. ‘డాడీ పక్కింటి ఆంటీకి కీస్ ఇవ్వలేదటమ్మా! తమ్ముడికి ఆకలేస్తోందట.. నీ కోసం వెయిట్ చేస్తున్నాం’ అంది కూతురు. తల్లి మనస్సు తల్లడిల్లింది. తాళం తీసి ఇంట్లోకి వెళ్లింది. లైట్ వేసింది. వెలగలేదు! వీధిలో అందరికీ కరెంట్ ఉంది. వాచ్‌మెన్‌ని అడిగితే, ‘ఈ నెల కరెంటు బిల్లు కట్టలేదటమ్మా.. డిపార్ట్మెంట్వాళ్లొచ్చి మధ్యాహ్నమే కట్ చేసి వెళ్లారు’ అని చెప్పాడు. ‘ఈ ఫోన్‌కి కాల్ చేస్తే అతనొచ్చి బిల్లు కట్టించుకుని కనెక్షన్ ఇస్తాడంట’ అని.. ఫోన్ నెంబర్ రాసి ఉన్న స్లిప్పు ఇచ్చాడు. బిల్లును చూసుకుంది ఉష. గాడ్! వెయ్యి రూపాయలు. నెలాఖరు రోజులు. అంత డబ్బెలా కట్టాలి? ఇల్లంతా వెతికి వెతికి చిల్లర జమ చేసి, పక్కింట్లోంచి కొంత చేబదులు తీసుకుని వెంటనే కరెంట్ కనెక్షన్ ఇప్పించుకుంది. స్వర్గసీమను నరకం చేశాడు! బెడ్రూమ్లోకి వెళ్లింది ఉష. అందులోని వాష్‌రూమ్‌కి తాళం వేసి ఉంది! బుర్ర తిరిగిపోయింది. దేవుడా అనుకుంది. తిరిగి పిల్లల రూమ్‌లోకి వచ్చింది. ‘అమ్మా.. ఆకలి’.. కడుపు చేత్తో పట్టుకుని తల్లి చెంతకు వచ్చాడు కొడుకు. ‘అయిపోతుందమ్మా... స్నాక్స్ చేస్తున్నాను’ అంటూ మిక్సీ దగ్గరకు వెళ్లింది. వైర్ కట్ అయిపోయి కనిపించింది మిక్సీ! అరె, మాయగా ఉందే అనుకుంది ఉష.. అలసటని, చికాకుని దాచుకునే ప్రయత్నం చేస్తూ. రిఫ్రెష్ అవ్వకుండా.. అప్పటికప్పుడు వేడివేడిగా ఉప్మా చేసి పెట్టి పిల్లల ఆకలి చల్లార్చింది. తర్వాత కుక్కర్ పెట్టడానికి బియ్యం డబ్బా తెరిచింది. ఫ్చ్. బియ్యం లేవు! ఉదయమే చెప్పి వెళ్లింది కిశోర్‌కి, బియ్యం తెచ్చిపెట్టమని. తేలేదన్నమాట. పిల్లలు హోమ్ వర్క్ చేసుకుంటున్నారు. ‘అమ్మా.. స్కూల్ ఫీజ్‌కి రేపే లాస్ట్ డేట్’.. కూతురు గుర్తుచేసింది. ఒక్కక్షణం తనవన్నీ సినిమా కష్టాల్లా అనిపించాయి ఉషకి. అంత ఒత్తిడిలోనూ తనను తను సముదాయించుకుంటోంది. ‘అలాగే అమ్మా..’ అని చెప్పి బాత్రూమ్లోకి వెళ్లింది. అర్జెంటుగా తనిప్పుడు స్నానం చెయ్యాలి. వేణ్ణీళ్లతో స్నానం చేస్తే కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది. పిల్లల బాత్రూమ్లో గీజర్ లేదు. మాస్టర్ బెడ్రూమ్లో మాత్రమే ఉంది. దానికి తాళం వేసి ఉంది. ఆలోచనలో పడిపోయింది ఉష. ఇదంతా కిషోర్ చేస్తున్న పని కాదు కదా, ఉద్దేశపూర్వకంగానే తను ఇలా చేస్తున్నాడా అనుకుంది. కొన్నాళ్లుగా భర్త కిషోర్ ప్రవర్తనలో మార్పును గమనిస్తోంది ఉష. ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు పైన రెండు గదులు కట్టించి అద్దెకు ఇవ్వాలని కిశోర్ అంటున్నాడు. ఆ అనడం క్రమంగా సతాయింపుగా మారుతోంది. సతాయింపు కొన్నిసార్లు వేధింపు స్థాయిని అందుకుంటోంది! ఉష పేరు మీద ఉన్న ప్లాట్‌ని అమ్మించి, ఇప్పుడున్న ఇంటిపై గదులు కట్టించాలని కిశోర్ ఒత్తిడి తెస్తున్నాడు. ఇదే విషయమై తరచు గొడవ పడుతున్నాడు. ఆ ప్లాట్‌ని అమ్మడం ఉషకు ఇష్టం లేదు. ముందుముందు పిల్లల చదువులకు పనికొస్తుందని ఆమె ఆశ. పైగా వాళ్లుంటున్న ఏరియాలో అద్దెలు కూడా ఎక్కువగా రావు. ఆ మాట అంటే కిశోర్ వినడం లేదు. పైగా కోపం తెచ్చుకుంటున్నాడు. కిశోర్ మొండితన ం గురించి ఉషకు తెలియంది కాదు కానీ, ప్లాటు విషయమై పట్టినపట్టు విడవకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. అస్తమానం పిల్లల ముందు గొడవపడితే ఆ పసి మనసులు కల్లోలం అయిపోతాయేమోనన్న భయంతో అన్నిటికీ ఓర్చుకుని నెట్టుకొస్తోంది. వేణ్ణీళ్లకు చన్నీళ్లు తోడవుతాయని.. చిన్న ఉద్యోగం వస్తే, ఇరవై కిలోమీటర్ల దూరమే అయినా వెళ్లి వస్తోంది. ఆ ఉదయం మళ్లీ గొడవైంది. ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు. తేలిగ్గా తీసుకుని ఆఫీసుకు వెళ్లిపోయింది. తనూ మొండి వైఖరి ప్రదర్శిస్తే మొదటికే బంధం తెగిపోవచ్చు. అందుకుని అడ్జెస్ట్ అవుతోంది. ఇదిగో... ఇప్పుడు ఇంటికొచ్చేటప్పటికీ ఇలా ఉంది పరిస్థితి. పిల్లలు వింటున్నారన్నా వదల్లేదు! రాత్రి బాగా లేట్‌గా వచ్చాడు కిశోర్. ‘అబ్బో కరెంట్ తెప్పించుకున్నావే! భేష్. ఎంతైనా సంపాదనాపరురాలివి కదా’ అన్నాడు. ప్లేట్లో అందించిన చపాతీలను విసిరికొట్టి, ‘ఏం? బియ్యం తెప్పించుకోలేదా?’ అని పెద్దగా అరిచాడు. పిల్లలు వింటారు అన్నట్లు అతడి వైపు చూసింది ఉష. ‘ఇక మీదట ఇంటి ఖర్చులకూ నాకూ ఏ సంబంధమూ లేదు. నేను బయట తినొస్తాను. నా మాటా వినని వారు నా ఇంట్లో ఉండకూడదు’ అని పెద్ద గొడవ చేశాడు. ‘పిల్లలు వింటున్నారు. మెల్లిగా మాట్లాడండి’ అని ప్రాధేయపడింది ఉష. కిశోర్ వినలేదు. ‘నా అరుపులే కదా ఇప్పటి వరకు పిల్లలు విన్నారు. ఇప్పుడు నీ అరుపులు వింటారు చూడు’ అంటూ చప్పున బెల్టు తీసి ఆమెను కొట్టడం మొదలు పెట్టాడు. ఉష అరవలేదు. బాధను అదిమి పెట్టుకుంది. అది ఇంకా కోపం తెప్పించింది కిశోర్‌కు. పిడికిలి బిగించి ఆమె ముఖం మీద కొట్టాడు. ‘అమ్మా’ అని అరిచింది ఉష. ఆ పెదవుల మధ్య తడిగా.. ఉప్పటి స్పర్శ! వేలితో తడుముకుంది. రక్తం!! ఆర్థికంగా.. మానసికంగా.. శారీరకంగా... రాత్రంతా నిద్ర పోలేదు ఉష. ఆమె దేహం దెబ్బతింది. ఆమె ఆత్మాభిమానం దెబ్బతింది. ఈ రెండిటి కన్నా కూడా.. భర్తతో ఆమె అనుబంధం దెబ్బతింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తల్లిదండ్రులతో పిల్లల బంధం దెబ్బతింటుంది. ఆలోచనలు ఉషను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఇంటి కోసం ఒక్క పనీ చేయడం లేదు కిశోర్. అంతేకాదు, ఇంట్లోని వస్తువులను వాడుకోనివ్వడం లేదు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. భర్త కారణంగా ఆఫీసు నుంచి ఇంటికి రావడానికే భయం వేస్తోంది ఉషకు. తనపై కోపంతో, పగబట్టినట్లు బిహేవ్ చేస్తున్నాడు కిశోర్. అతని ఇష్ట ప్రకారమే ప్లాటు అమ్మేసి, ఇంటిపైన గదులు వేయించినా అతడు మారతాడనేం లేదు. అప్పుడు ఇంకొకటేదో మొదలుపెడతాడు. ‘అద్దెల మీద బతికేయెచ్చు’ అని కిశోర్ తరచు అనేమాట చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఉషకు. ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నదో చితకదో తనూ చేస్తోంది. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు చేస్తే.. తమకేం తక్కువని! ప్లాటు ఎలాగూ ఉంటుంది. ఉండేది అలా ఉండిపోదు కదా. వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇవేవీ కిశోర్ తలకు ఎక్కడం లేదు. తెల్లవారుతుండగా ఒక నిర్ణయానికి వచ్చింది ఉష. ఆఫీస్‌లో లేట్ పర్మిషన్ తీసుకుని ‘ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్’కి వెళ్లింది! అక్కడ ఓ విభాగానికి పెద్ద బోర్డు వేలాడుతోంది. ‘డొమెస్టిక్ వయెలెన్స్ కేసెస్ ఆఫీస్’ అని! పదిరోజులు.. పంటి బిగువన..! ‘ఇది డొమెస్టిక్ వయెలెన్స్’ కిందికి వస్తుంది అన్నారు.. ఉష చెప్పిందంతా విన్న లీగల్ ఆఫీసర్. కేస్ ఎలా ఫైల్ చెయ్యాలో కూడా చెప్పారు. చాలా సులభంగా ఉంది ఆ ప్రొసీజర్ అంతా. ఉష మౌనంగా ఉండిపోయింది. ‘చెప్పండమ్మా.. ఏం చేద్దామంటారు’ అన్నారు ఆఫీసర్.‘కేసు పెట్టడం నా ఉద్దేశం కాదు సర్. నా భర్త మారేలా కౌన్సెలింగ్ ఇప్పించగలరా?’ అని అభ్యర్థనపూర్వకంగా అడిగింది ఉష. ఆ తర్వాత పది రోజుల్లో కిశోర్‌కి నోటీసులు వెళ్లాయి. ఈ పదిరోజుల్లో కిశోర్ ప్రవర్తన మితిమీరిపోయింది. పంటిబిగువన ఓపిక పట్టింది ఉష. నోటీసు రాగానే కాస్త నెమ్మదించింది.‘ఎంతకు తెగించావే’ అంటూ శాపాలు, శాపనార్థాలు పెడుతూ కౌన్సెలింగ్‌కి బయల్దేరాడు కిషోర్. హింస నుంచి రక్షణ ఉత్తర్వులు కౌన్సెలింగ్ మొదలైంది. కౌన్సెలింగ్ పూర్తయింది. లాయర్ ప్రస్తాంచిన ‘డీవీ’ యాక్ట్ తప్ప కిశోర్‌కి ఏవీ గుర్తులేవు. ‘మీ భార్య తలచుకుంటే మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్లిపోయేలా ఈ చట్టం ద్వారా ఆమె ఆదేశాలు తెచ్చుకోవచ్చు. ఉమ్మడి నివాసం నుండి భర్తను ఖాళీ చేయించడానికి మాత్రమే కాదు.. తనను, పిల్లల్నీ వేధించకుండా ‘రక్షణ ఉత్తర్వు’లను కూడా ఆమె ఈ చట్టం ద్వారా పొందవచ్చు’ అని చెప్పాడు లాయర్. అయితే ఆమె మీపై కేసు పెట్టాలని కోరుకోవడం లేదు. మీరు మారితే అదే చాలు అనుకుంటోంది’ అని కూడా చెప్పాడు. కిశోర్ ముఖం వాడిపోయింది. అతడి కళ్లలో భయం కనిపిస్తోంది. ‘ఇకపై అలాంటి పనులు చేయను’ అని లిఖితపూర్వకంగా అంగీకరించి కేసు విత్‌డ్రా చేయించుకున్నాడు. గృహహింస (రక్షణ చట్టం) ఏం చెబుతోంది? ‘గృహహింస నుంచి, వేధింపుల నుంచి మహిళకు రక్షణ కల్పించడం కోసం 2005లో ప్రభుత్వం ఒక చట్టం చేసింది. అదే డీవీ యాక్ట్. (ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయెలెన్స్). ఈ చట్టం ప్రకారం... భర్త కానీ, ఇతర కుటుంబ సభ్యులు కానీ మహిళను ఏ విధంగానైనా హింసిస్తే, ఆమె కోర్టును ఆశ్రయిస్తే.. కోర్టు ఆమెకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. గృహోపకరణాలను వాడుకోనివ్వకుండా అడ్డుకోవడడం, ఇంట్లోని సదుపాయాలను, సౌకర్యాలను వినియోగించకుండా నిరోధించడం; బియ్యం, ఇతర సరకులను తీసుకురాకుండా ఉండడం; అద్దె, కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు కట్టకుండా ఉండడం, పిల్లల ఫీజులకు, గృహావసరాలకు డబ్బులు ఇవ్వకపోవడం.. ఇవన్నీ కూడా గృహ హింసనుంచి రక్షణ కల్పించే చట్టం పరిధిలోకే వస్తాయి. అంతేకాదు.. సూటిపోటి మాటలతో మహిళను కించపరచడం, ఆమె ఆత్మాభిమానం దెబ్బతినేలా అవమానించడం, చెయ్యి చేసుకోవడం, ఆహారం అందకుండా నిర్బంధించడం, బెదిరించడం.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఏ విధంగా మహిళను వేధించినా కూడా ఈ చట్ట ప్రకారం.. ఆ మహిళ కోర్టు నుంచి ‘రక్షణ ఉత్తర్వు’లను పొందవచ్చు. ఇ. పార్వతి, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్