న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఉన్నాయని, ఆస్తులు, అప్పులకు సంబంధించి పలు తప్పుడు వివరాలు ఆయన అఫిడవిట్‌లో పొందుపర్చారని, కాబట్టి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
అమిత్ షా తన అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పులకు సంబంధించి రెండు కీలకమైన విషయాలను ఉద్దేశపూర్వకంగా వదిలేశారని, ఇందుకుగాను ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గాంధీనగర్‌లో తన పేరిట ఉన్న ప్లాట్ ఖరీదు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూ. 66.5 లక్షలు కాగా.. దాని విలువను రూ. 25 లక్షలుగా అఫిడవిట్‌లో చేర్చారని, అంతేకాకుండా గుజరాత్‌లో అతిపెద్దదైన సహకార బ్యాంక్ కలుపూర్ కమర్షియల్ కో ఆపరేటివ్ బ్యాంకు నుంచి జయ్ షా 2016లో తన వ్యాపారం కోసం రుణాలు తీసుకున్నారని, ఇందుకు అమిత్ పూచీకత్తుదారుగా ఉన్నారని, కానీ అఫిడవిట్‌లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించలేదని కథనాలు వచ్చాయి. ఈ కథనాలను ఉటంకిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అమిత్ షాపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment