గాంధీనగర్ (గుజరాత్): సుపరిపాలన అందించడం ద్వారా కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించవచ్చని, ప్రజలకు మెరుగైన న్యాయం అందించవచ్చని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) స్వర్ణోత్సవాల్లో భాగంగా శనివారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. కనీసం రాంగ్ పార్కింగ్ కేసును కూడా తానెప్పుడూ ఎదుర్కోలేదని...అందువల్ల కోర్టు గదిని ఎప్పుడూ చూడలేదన్నారు.
న్యాయ వ్యవస్థ గురించి తనకు తెలిసింది తక్కువని...ఇది ఒకందుకు మంచిదేనని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ మాట్లాడుతూ, ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, సెల్ ఫోన్లు ఇస్తామంటున్న పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల్లో న్యాయ సంస్కరణలకు చోటు దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
రాంగ్ పార్కింగ్ కేసునూ ఎదుర్కోలేదు: మోడీ
Published Sun, Mar 2 2014 1:30 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement