![Theft In Wine Shop At Gandhi Nagar - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/4/wine-shop.jpg.webp?itok=ckKDDW9q)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైద్రాబాద్ : దేశ వ్యాప్త లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేయడంతో మందుబాబులు అల్లాడుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా.. మద్యం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు మద్యం షాప్ లూటీకి పాల్పడ్డారు. షాప్ మూసివేడంతో వెనుక నుంచి రంద్రం చేసి లోపలికి ప్రవేశించారు. లక్ష రూపాయల విలువైన మద్యం బాటల్స్‌తో పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సీసీటీవీ వీడియోల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. కాగా మద్యం దొరక్క దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలోనూ తొమ్మదిమంది బలవన్మరణానికి పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment