wine shop
-
సీఐడీ కుట్ర విఫలం.. ఇక సిట్ కుతంత్రం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగ వేధింపులు రోజు రోజుకూ వెర్రి తలలు వేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా నిర్వహించిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానంపై అవాస్తవ ఆరోపణలతో, అక్రమ కేసులతో వేధించేందుకు అడ్డదారులు తొక్కుతోంది. ఈ వ్యవహారంపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే సీఐడీ అక్రమ కేసుతో పన్నిన పన్నాగం బెడిసి కొట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో అవినీతిపై ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయింది. దాంతో బాబు ప్రభుత్వం కొత్త కుట్రకు తెరతీసింది. తాము చెప్పింది చెప్పినట్టు చేసే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. తెర వెనుక ఉంటూ పోలీసు వ్యవస్థను నడిపిస్తున్న రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ద్వారా ఈ కుట్రను అమలు చేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. కాగా సిట్‌కు నేతృత్వం వహించనున్న రాజశేఖర్ బాబుపైనే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉండటం గమనార్హం.కొండను తవ్వి.. ఎలుకను కూడా పట్టలేని సీఐడీవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అవాస్తవ ఆరోపణలతో సీఐడీ అక్రమ కేసు కుట్ర బెడిసికొట్టింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవహారంపై సీఐడీ ద్వారా కేసు నమోదు చేసింది. వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా అవాస్తవ ఆధారాలను సృష్టించాలని, అక్రమ కేసులు బిగుసుకునేలా చేయాలని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. అక్రమ కేసుల బనాయింపులో తాము చెప్పిన లక్ష్యాలు సాధిస్తే ఆయనకు డీజీపీ పోస్టు ఇస్తామని కూడా ప్రలోభ పెట్టింది. ఈ నేపథ్యంలోనే సీఐడీ ఆరు నెలలుగా చేయని హడావుడి లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డితోసహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వాసుదేవరెడ్డిని పలుసార్లు విచారణ పేరిట వేధించారు. ఆయన్ను అక్రమంగా రోజుల తరబడి నిర్బంధించి తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారు. తాము చెప్పినట్టు చేస్తే ఢిల్లీలో కీలక పోస్టింగు ఇస్తామని, లేకపోతే అంతు చూస్తామన్న హెచ్చరికలతో సీఐడీ అధికారులు బరితెగించారు. డిస్టిలరీల్లో తనిఖీల పేరిట హడావుడి చేశారు. ఇంత చేసినప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో అక్రమాలపై ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించ లేకపోయారు. అవాస్తవ ఆధారాలతో కనికట్టు చేసేందుకు చేసిన యత్నాలు ఫలించ లేదు.సీఐడీ చీఫ్‌పై చినబాబు ఆగ్రహం రెడ్‌బుక్ రాజ్యాంగ వేధింపుల కేసులను తాము చెప్పినట్టు చేయడం లేదని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్పై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారు. చినబాబే అందరి ముందు ఆయనపై పరుష పద జాలంతో విరుచుకు పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకానొక దశలో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ను బదిలీ చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. కుట్రకు పదునుపెట్టేందుకే సిట్‌మద్యం అక్రమ కేసు పేరిట వైఎస్సార్సీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్తకుట్రకు తెరతీసింది. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యాన్నార్ విఫలమయ్యారని భావించిన ప్రభుత్వ పెద్దలు తమ అస్మదీయ అధికారి రాజశేఖర్ బాబును తెరపైకి తెచ్చారు. ఆయన నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి సిట్ వంటి ప్రత్యేక దర్యాప్తు బృందానికి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారి నేతృత్వం వహిస్తారు. అంటే డీజీపీ, సీఐడీ, ఏసీబీ తదితర విభాగాల్లోని ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. కానీ జిల్లా పోలీసు యంత్రాంగాల బాధ్యతలు నిర్వర్తించే పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు సిట్ బాధ్యతలు అప్పగించరు. ఎందుకంటే వారికి వారి జిల్లా శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యతలు చాలా ముఖ్యం. అయితే అందుకు విరుద్ధంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా ఉన్న రాజశేఖర్‌బాబును సిట్ చీఫ్‌గా నియమించడం గమనార్హం. అంటే తాము చెప్పినట్టు చేసే అధికారి, ఎంతటి అక్రమ కేసునైనా పెట్టి వేధించే అధికారికే బాధ్యతలు అప్పగించాలన్నదే ప్రభుత్వ పెద్దల ఉద్దేశమని స్పష్టమవుతోంది. రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ సిట్ తెరవెనుక పాత్ర పోషించనున్నారు. ఆయన చెప్పినట్టుగా రాజశేఖర్‌బాబు దర్యాప్తు పేరిట వేధింపులకు పాల్పడుతారన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలోనే అసలు రాజశేఖర్‌బాబు ట్రాక్ రికార్డు చర్చనీయాంశంగా మారింది. ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న విషయాన్ని పోలీసు వర్గాలే ప్రస్తావిస్తున్నాయి. మద్యం దందాతోపాటు పలు వ్యవహారాల్లో ఆయన అవినీతి బాగోతాన్ని కేస్ స్టడీలతోసహా ఉటంకిస్తున్నాయి. అసలు మద్యం వ్యవహారంపై సిట్ సంగతి తర్వాత.. అసలు సిట్‌కు నేతృత్వం వహిస్తున్న పోలీస్ అధికారుల అవినీతి బాగోతం మరోసారి బట్టబయలవుతోందని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. సిట్ సభ్యులు వీరే.. సిట్ చీఫ్: ఎస్వీ రాజశేఖర బాబు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్సభ్యులు: ఎల్. సుబ్బారాయుడు, ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్ ఎస్పీ (చంద్రబాబుకు వీర విధేయ అధికారి. అందుకే తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చి తిరుపతి ఎస్పీగా నియమించారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో ప్రభుత్వ వైఫల్యం.. భక్తుల తొక్కిసలాట.. ఆరుగురు భక్తుల దుర్మరణానికి ప్రధాన బాధ్యుడు. అయినా సరే ప్రభుత్వం సస్పెండ్ చేయకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా చిత్తూరు జిల్లాలోనే పోస్టింగు ఇచ్చింది. ప్రస్తుతం సిట్‌లో సభ్యునిగా నియమించింది.)– కొల్లి శ్రీనివాస్, అదనపు ఎస్పీ, విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ విభాగం– ఆర్.శ్రీహరి బాబు, అదనపు ఎస్పీ, సీఐడీ– పి.శ్రీనివాస్, డీఎస్పీ, డోన్– కె.శివాజీ, సీఐ– సీహెచ్.నాగ శ్రీనివాస్, సీఐ -
విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్!
-
ఈ దొంగకు న్యూ ఇయర్ ఒకరోజు ముందే వచ్చింది.. ఏం చేశాడో తెలుసా?
సాక్షి,మెదక్ : అతడో దొంగ. అసలే కొత్త సంవత్సరం (new year). సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాడు. డబ్బులు కావాలి కదా. వైన్ షాపులో డబ్బులు బాగా ఉంటాయ్. దోచేద్దామని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా రెండ్రోజుల పాటు రెక్కీ కాచాడు. మూడో రోజు ప్లాన్ ప్రకారం.. తాను ముందుగా రెక్కి నిర్వహించిన వైన్ షాప్‌లో దొంగతనం చేశాడు. దొంగతనానికి ముందే తాను ఎవరికి దొరక్కూడదనే ఉద్దేశ్యంతో సీసీ టీవీ కెమెరాల్ని ధ్వంసం చేశాడు. గల్లా పెట్టెలో ఉన్న డబ్బుంతా ఊడ్చేశాడు. అనంతరం బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్లుగా చేశాడు. కానీ చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టడంతో పోలీసులకు అడ్డంగా దొరికి పోయాడు.మెదక్ జిల్లా నార్సింగ్ ప్రాంతంలో నిర్వాహకులు కనకదుర్గా వైన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి 10 వైన్ షాపును క్లోజ్ చేసి ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆ వైన్ షాప్‌లో దొంగతనం ప్లాన్ చేసిన దొంగ రూఫ్‌ను తొలగించి షాప్‌లో చొరబడ్డాడు. డబ్బుల్ని కాజేశాడు. అనంతరం, దొంగతనానికి వచ్చిన ఆ దొంగకి మందు మీద కుతిపుట్టింది. వెంటనే వైన్ షాపులో ఏ బ్రాండ్ దొరికితే.. ఆ బ్రాండ్‌ని ఫుల్లుగా సేవించాడు. మత్తులో తాను దొంగతనానికి వచ్చానన్న విషయాన్ని మర్చిపోయి ఎంచక్కా పడుకున్నాడు. ఆ మరుసుటి రోజు అంటే నిన్న ఉదయం నిర్వహాకులు వైన్ షాప్‌ను ఓపెన్ చేశారు. దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఆ పక్కనే మత్తులో ఉన్న దొంగను గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగను పరిశీలించి అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మోతాదుకు మించి మద్యం సేవించడం వల్ల స్పృహ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. స్పృహలోకి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభిస్తామని వెల్లడించారు. -
ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులు
-
చంద్రబాబుపై శృంగవరపుకోట పబ్లిక్ ఫైర్
-
బార్ షాప్‌లో పచ్చ లీడర్ల దౌర్జన్యం
-
మందు పునాదులను పెకలించిన మహిళలు
-
వైన్ షాప్ వద్దంటూ పబ్లిక్ నిరసన
-
AP: ఉద్రిక్తత.. వైన్‌షాప్ మూసేయాలని మహిళల ఆందోళన
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జగదీష్‌నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జనావాసాల నడుమ ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేశారు.మహిళలు, స్థానికులు షాపు వద్ద పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో తీవ్రతరంగా మారింది దుకాణం కౌంటర్ వద్దకు వెళ్లి నిర్వాహకులను హెచ్చరించారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జనావాసాల మధ్య మద్యం షాపు వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ఎక్సైజ్ అధికారులు స్పందించకపోవడం దారుణమని, ఇప్పటికైనా దుకాణాన్ని తొలగించాలని లేనిపక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. జగదీష్‌నగర్‌లో మద్యం షాపు వద్ద స్థానికుల ఆందోళనకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు.ఇదిలా ఉండగా వైన్ షాప్ నిర్వాహకునికి మద్దతుగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అంతేగాక మహిళను బెదిరించేందుకు వైన్‌షాప్ నిర్వాహకులు రౌడీలను తీసుకొచ్చారు. మరోవైపు షాప్ మూసేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని మహిళలు హెచ్చరిస్తున్నారు. తమకు ళలకు అన్యాయం జరిగితే రాని పోలీసులు.. మద్యం షాప్ ఓనర్‌కు మద్దతుగా వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తాడేపల్లిలో మద్యం షాపును అడ్డుకున్న మహిళలు
-
మా ఊరికి మద్యం షాపు వద్దు!
తిరుపతి అర్బన్: తమ ఊరికి మద్యం షాపు వద్దంటూ ఈనెల 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి రూరల్ మండలం పరిధిలోని సాయినగర్ గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామసభలో ప్రజలు తీర్మానించారు. ఈ మేరకు సాయినగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ డీవీ రమణ బుధవారం కలెక్టరేట్లోని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంతోపాటు జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవికి వినతిపత్రం అందజేశారు.డీవీ రమణ మాట్లాడుతూ గతంలో 2014–15 సంవత్సరంలో ఒకసారి సాయినగర్ గ్రామపంచాయతీ పరిధిలోని జయనగర్‌లో మద్యం షాపు ఏర్పాటు చేశారన్నారు. ఆ సమయంలో స్థానిక ప్రజలందరూ అనేక రోజులపాటు సదరు మద్యం షాపు తొలగించే వరకు ప్రజా ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. గ్రామసభలో తీర్మానం మేరకు మద్యం షాపులు వద్దని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించామని తెలిపారు. తమ గ్రామపరిధిలో నూతన మద్యం షాపులు ఏర్పాటు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ప్రభుత్వ మద్యం షాపులు రద్దు
సాక్షి, అమరావతి: రాష్టంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ, రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేర్వేరు ఆర్డినెన్స్‌లు జారీ చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ చట్టాలకు సవరణలు చేసింది. ఈ రెండు ఆర్డినెన్స్‌లను గెజిట్‌లో ప్రచురిస్తూ న్యాయ శాఖ ఇన్చార్జి కార్యదర్శి వి.సునీత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్‌ల ప్రకారం వచ్చేనెల 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది. కొత్త మద్యం విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలపడంతో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు మార్గదర్శకాలను రూపొందించి న్యాయ శాఖకు పంపారు. వీటికి న్యాయ శాఖ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం గవర్నర్ అనుమతితో ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. ప్రస్తుతం శాసన సభ సమావేశాలు లేకపోవడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌లు చట్ట రూపం దాలుస్తాయి. దాదాపు 3,736 రిటైల్ షాపులను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
మందు బాబు యాక్షన్.. అవాక్కైన 108 సిబ్బంది
బోధన్ టౌన్ (బోధన్): అత్యవసర వైద్య సేవలకు వినియోగించాల్సిన 108 అంబులెన్స్‌ను ఓ ప్రబుద్ధుడు మద్యం కొనుగోలు కోసం దుర్వినియోగం చేసిన ఘటన బోధన్‌లో చోటు చేసుకుంది. ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామానికి చెందిన శంకర్ మంగళవారం రాత్రి తన ఆరోగ్యం బాగా లేదని 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న 108 సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకొని బోధన్‌లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది శంకర్ పేరు నమోదు చేసుకొని కొద్దిసేపట్లో డాక్టర్ వస్తారు.. కూర్చోమని చెప్పారు. అయితే ఈలోగా శంకర్ ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లి కొద్ది దూరంలో ఉన్న మద్యం దుకాణానికి చేరుకొని మద్యం కొనుగోలు చేస్తుండగా గమనించిన 108 సిబ్బంది శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
వెంగళరావునగర్: యువతి వైన్స్ షాపు వద్ద హల్చల్ సృష్టించిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... శుక్రవారం రాత్రి ఓ యువతి తన స్నేహితులతో కలిసి మధురానగర్‌లోని మధుర వైన్స్‌కు వచ్చింది. వైన్స్లోనికి ప్రవేశించి మద్యం బాటిల్స్ పగలకొట్టి, రాక్లను కొడుతూ, క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి హడావుడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునే సరికి యువతి తన హంగామాను కొనసాగిస్తూనే ఉంది. పోలీసులు ఆ యువతితోపాటు ఆమె స్నేహితులను బయటకు తీసుకొచ్చారు. రోడ్డుపై వచ్చిన వారు ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. ఆయా సంఘటనలను పోలీసులు ఫొటోలు, వీడియోలు తీస్తుండగా వారిని దుర్భాషలాడుతూ వారి ఫోన్‌ను లాక్కును కింద పడేసి రాయితో పగలకొట్టడానికి ప్రయతి్నంచారు. అడ్డుకోబోయిన పోలీసులను రక్కుతూ, జుట్టుపట్టుకుని లాగుతూ కేకలు వేస్తూ ట్రాఫిక్ జామ్ చేశారు. ఎట్టకేలకు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అర్ధరాత్రి వరకు పీఎస్‌లో సిబ్బందిని అత్యంత తీవ్రమైన పదజాలంతో దుర్భాషలాడుతూ మరోసారి హడావుడి చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
వైన్ షాప్‌లో దొంగతనం.. రూ.4లక్షలకు పైగా నగదు ఇంకా మద్యం బాటిళ్లు!
రాజాపేట: గుర్తుతెలియని వ్యక్తులు వైన్ షాపులో చొరబడి నగదు, మద్యం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన రాజాపేట మండలంలోని పొట్టిమర్రి గ్రామ పరిధిలో జరిగింది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టిమర్రి గ్రామ పరిధిలో మాధవరెడ్డి అనే వ్యక్తి అరుణాచల వైన్ షాపును నిర్వహిస్తున్నాడు. కాగా మంగళవారం రాత్రి 10 గంటలకు రోజుమాదిరిగానే వైన్ షాపునకు తాళాలు వేసి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్తున్న గ్రామస్తులు వైన్ షాపులో దొంగలు పడినట్లు గుర్తించి మాధవరెడ్డికి సమాచారం ఇచ్చారు. వెంటనే షాపు వద్దకు చేరుకున్న మాధవరెడ్డి చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. దీంతో ఏసీపీ శివరాంరెడ్డి, సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్ఐ సుధాకర్‌రెడ్డి క్లూస్ టీంను రప్పించి పరిసరాలను పరిశీలించారు. రూ.4,21,000 నగదుతో పాటు సుమారు మద్యం బాటిళ్లు చోరీకి గురైనట్లు వైన్ షాపు నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. -
వైన్ షాప్ తొలగించాలని మహిళల ఆందోళన
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు...‘మందు’ షాపులు బంద్ (ఫొటోలు)
-
వైన్ షాప్‌నకు నిప్పు.. మద్యం ఇవ్వలేదని తగలబెట్టేశాడు!
విశాఖపట్నం: మద్యం ఇవ్వలేదని వైన్ షాప్‌ను తగలబెట్టిన ఘటన విశాఖపట్నం మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోతినమల్లయ్య పాలెం పోలీసుల కథనం ప్రకారం.. మధు అనే ఓ వ్యక్తి మద్యం కోసం మధురవాడ ప్రాంతంలోని ఓ వైన్ షాప్ వద్దకు వచ్చాడు. అయితే అప్పటికే షాప్ మూతపడే సమయంలో కావడంతో సిబ్బంది అతనికి మద్యం ఇవ్వలేదు.దీంతో వారితో వాగ్వాదానికి దిగిన అతను అక్కడి నుంచి వెళ్లిపోయి ఆదివారం సాయంత్రం పెట్రోల్ డబ్బాతో వచ్చిన అతను వైన్‌షాప్ లోపల, సిబ్బందిపైనా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో సిబ్బంది వెంటనే షాప్ బయటకు పరుగులు తీశారు. కానీ వైన్‌షాప్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. లోపల ఉన్న కంప్యూటర్, ప్రింటర్ ఇతర సామగ్రి కాలిపోయి రూ.1.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
అధిక మాసంలోనూ ‘అదరగొట్టారు’
సాక్షి, హైదరాబాద్: అధిక మాసంలోనూ వైన్‌షాపు టెండర్ల ప్రక్రియ అదిరిపోయింది. ఈసారి ఎలాగైనా మద్యం షాపులు దక్కించుకోవాలన్న వ్యాపారుల ఆశతో భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. ఈనెల 14న ఒక్కరోజే రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 14 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక, 15వ తేదీన సెలవుదినం కావడంతో 16వ తేదీ బుధవారం 8,500 పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం మీద 14, 16 తేదీల్లో కలిపి.. 23 వేల వరకు దరఖాస్తులు రాగా, ఈనెల 4 నుంచి 16 వరకు మొత్తం కలిపి 43,500 పైగా దరఖాస్తులు వచి్చనట్టు సమాచారం. కాగా, గత రెండేళ్ల కాలానికి గాను మొత్తం 10 రోజుల్లో 69 వేలకు పైగా దరఖాస్తులు రాగా, ఈసారి తొలి పది రోజుల్లో 43,500 మాత్రమే రావడం గమనార్హం. అయితే, ఈసారి గడువు రెండు రోజులు ఎక్కువగా ఇవ్వడం, అధిక శ్రావణం ముగిసి శ్రావణ మాసం రావడంతో చివరి రెండు రోజుల్లోనూ భారీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే వేలాది మంది డీడీలు తీసి, శ్రావణ మాసం కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చివరి రెండురోజులైన గురు, శుక్రవారాల్లో భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తాయని, గతం కంటే ఇప్పుడు ఎక్కువే దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నామని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు మద్యం షాపుల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.870 కోట్ల ఆదాయం సమకూరింది. చివరి రెండు రోజుల్లో కలిపి మరో రూ.500 కోట్ల వరకు వస్తుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. -
మేడ్చల్ జిల్లాలో అర్థరాత్రి కాల్పుల కలకలం.. తుపాకీతో బెదిరించి..
సాక్షి, మేడ్చల్: సినీ ఫక్కీలో మద్యం దుకాణం వద్ద రూ.2.8 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం రాత్రి 10.30 గంటలకు నగర శివారులోని మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దమర్రి గ్రామంలో గుర్తు తెలియని ఆగంతుకులు రెండు రౌండ్ల కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన ఈ ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్దమర్రిలోని వినాయక వైన్స్‌లో బాలకృష్ణ అనే వ్యక్తి క్యాషియర్‌గా, హెల్పర్‌గా జైపాల్‌రెడ్డి పని చేస్తున్నారు. ప్రతిరోజు మాదిరిగానే సోమవారం సైతం మద్యం అమ్మగా వచ్చిన నగదు రూ.2.8 లక్షలు తీసుకుని రాత్రి 10.30 గంటలకు వైన్స్ షాపును మూసివేసి బయటకు వచ్చారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు (25 నుంచి 30 ఏళ్ల వయసు) మంకీ క్యాపులు, కర్చీష్‌లు ధరించి బైక్‌పై వచ్చారు. పైసా దేవో అంటూ తుపాకితో బెదిరించారు. దీంతో వైన్స్ సిబ్బంది పక్కనే ఉన్న కర్రలతో వారిపై దాడి చేస్తుండగా.. దుండగులు తుపాకీతో బాలకృష్ణపై కాల్పులు జరపడంతో అతను తప్పించుకున్నాడు. తూటా వైన్స్ షెటర్‌కు తగిలి లోపల ఉన్న 5 మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి. దుండగులు మరో రౌండ్ కాల్పులతో వైన్స్ సిబ్బందిని బెదిరించి వారి నుంచి రూ.2.8 లక్షల నగదుతో పరారయ్యారు. దుండగులు పక్కా ప్రణాళికతోనే దోపిడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. గ్రామానికి చివర మద్యం దుకాణం ఉండటంతో పాటు మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉండటంతో పారిపోయేందుకు సులువుగా ఉంటుందని ఈ దుకాణాన్ని దుండగులు ఎంచుకొని ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.దుండగులను పట్టుకునేందుకు 5 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పేట్‌బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు తెలిపారు. చదవండి: Smita Sabharwal: నెల క్రితమే నిందితుడి రెక్కీ.. ప్లజెంట్ వ్యాలీలో కరువైన నిఘా -
బ్యాగులో లక్ష్మీ కటాక్షం: అమ్మ తోడు సార్.. ఆ పదిలక్షల బ్యాగ్ నాదే!
యశవంతపుర: వైన్‌షాపులో మద్యం తాగి బయటకు వచ్చిన శివరాజ్ అనే వ్యక్తికి రోడ్డుపై రూ. 10 లక్షల డబ్బు దొరికింది. తన జతలో ఉన్న కూలీకి కొంత డబ్బు ఇచ్చి మిగతాది తీసుకెళ్లాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన మంగళూరు నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాగులో లక్ష్మీ కటాక్షం నవంబర్ 27న మంగళూరులో పంప్‌వెల్ వద్ద కూలీలు శివరాజ్, తుకారామ్‌లు కలిసి ఓ బ్రాందీషాపులో మద్యం తాగి రోడ్డు పక్కలో నిలబడి ఉండగా ఓ బ్యాగ్ రోడ్డు పైన పడి ఉంది. శివరాజ్ దానిని తీసుకుని ఉత్కంఠగా తెరిచి చూడగా అందులో ఐదువందలు, రెండు వేల నోట్లు ఉన్న బండిళ్లు కనిపించాయి. అమ్మో ఎంత డబ్బో అని ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయారు. నాకెంత అని తుకారామ్ అడగడంతో రెండు వేల రూపాయల నోట్ల కట్టను ఇచ్చాడు. అందులో రెండు నోట్లు తీసి ఇద్దరు కలిసి మళ్లీ మద్యం తాగి ఎవరి దారిలో వారు వెళ్లిపోయ్యారు. ఆనందం పట్టలేని శివరాజ్ ఒక్కడే మళ్లీ వైన్‌షాపుకు వెళ్లి తాగాడు. కంకనాడి పోలీసులు అతని ప్రవర్తన చూసి బ్యాగ్‌లో ఏముందో చూపాలని అడిగారు. డబ్బులు కనిపించటంతో వెంటనే జీపులో ఎక్కించుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు. తుకారామ్‌కు ఇచ్చిన డబ్బులను తీసుకురావాలని చెప్పి మూడు రోజుల పాటు స్టేషన్లోనే పెట్టుకున్నారు. తుకారామ్ జాడ తెలియని కారణంగా శివరాజ్‌ను వదిలిపెట్టలేదు. రూ. 3.50 లక్షలు ఉన్నాయి: కమిషనర్ ఈ విషయం అనోటా ఈ నోటా మంగళూరు నగరమంతా పాకింది. ఈ డబ్బులు వక్క వ్యాపారులదిగా తెలిసింది. ఓ వ్యాపారి వెళ్లి డబ్బులు తనవేనని పోలీసులను కలిశాడు. కానీ ఇది నీ డబ్బులు కాదంటూ వ్యాపారిని మందలించి పంపారు. చివరకు తమకు దొరికిన బ్యాగులో 10 లక్షలు లేవు. రూ.49 వేలు ఉన్నట్లు పోలీసులు వాదించారు. ఇంతవరకూ తమ డబ్బులు పోయినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. తాగుబోతు వద్ద రూ. మూడున్నర లక్షలు మాత్రమే లభించిన్నట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్ శశికుమార్ తెలిపారు. సీసీ కెమెరాలను పరిశీలించి ఎవరు పోగొట్టుకున్నారో గుర్తిస్తామని చెప్పారు. -
మద్యం మత్తుకు.. ‘మామూళ్ల’ కిక్కు!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఆరు వైన్‌షాప్‌లు ఉన్నాయి. అవన్నీ సిండికేట్‌గా దందా చేస్తున్నాయని.. మండలంలోని ఓ గోదాంలో సరుకు నిల్వచేసి మరీ సిండికేట్ నిర్వాహకులు బెల్ట్‌షాపులకు మందు పంపిస్తుంటారని ఎక్సైజ్ వర్గాలకూ తెలుసు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా బెల్టుషాపులతో నెలకు లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. అయితే సిండికేట్ నుంచి కొందరు ఎక్సైజ్ సిబ్బందికి నెలకు రూ.1.20 లక్షలు, సివిల్ పోలీసు అధికారులు, సిబ్బందికి మరో రూ.1.20 లక్షలు ముడుపులు అందుతుండటంతో ఈ వ్యవహారమంతా చూసీచూడనట్టు వదిలేస్తున్నట్టు ప్రచారముంది. .. ఇది కేవలం పర్వతగిరి మండలానికి చెందిన విషయం కాదు. దాదాపు రాష్ట్రమంతటా ఇదే తరహాలో దందా కొనసాగుతోందని.. అటు ఎక్సైజ్ పోలీసులు, ఇటు సివిల్ పోలీసులు వైన్‌షాపులు, బార్ల యజమానుల నుంచి నెలవారీ మామూళ్లను ముక్కు పిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్నా ఈ మధ్య ‘వసూళ్ల’ డిమాండ్ పెరిగిందని.. లేకుంటే ఏదో ఒక పేరిట ఇబ్బందిపెడుతున్నారని అంటున్నారు. ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఇలాంటి అంశాలు మరిన్ని వెలుగుచూశాయి. అమ్మకాలను బట్టి మామూళ్ల లెక్క.. రాష్ట్రంలోని వైన్‌షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి వసూళ్లు గత రెండేళ్ల కాలంలో రెండింతల వరకు పెరిగినట్టు అంచనా. ముఖ్యంగా సివిల్ పోలీసుల దందా ఎక్కువైందని వైన్‌షాప్‌ల నిర్వాహకులు అంటున్నారు. దీనికితోడు అప్పుడప్పుడూ మద్యం బాటిళ్లు కూడా ఫ్రీగా తీసుకెళ్తుంటారని చెప్తున్నారు. ఇక ఎక్సైజ్ సిబ్బందికి అయితే లైసెన్సు తీసుకున్నప్పుడు, రెన్యువల్ సమయంలో, ఫైనల్ క్లియరెన్స్ సందర్భంగా వారికి లక్షల్లోనే ముట్టజెప్పాల్సి వస్తుందని అంటున్నారు. ఈ మామూళ్లలో స్టేషన్ నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు, నగరాల్లో అయితే ఏసీపీ స్థాయి అధికారుల వరకు వాటాలు చేరుతుంటాయనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా వైన్స్, బార్ల నిర్వాహకుల అక్రమ దందాలు ఓవైపు.. ఎక్సైజ్, సివిల్ పోలీసుల మామూళ్లు మరోవైపు కలిసి మందుబాబుల జేబుకు మాత్రం చిల్లు పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఊరి నుంచి రాజధాని దాకా ఇంతే.. హైదరాబాద్ నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 44 వైన్‌షాపులు, 38 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వాటినుంచి ఎక్సైజ్ సిబ్బందికి నెలకు రూ.10.40 లక్షలు, సివిల్ పోలీసులకు రూ.5.20 లక్షలు మామూళ్ల రూపంలో వెళుతున్నట్టు ప్రచారముంది. కొన్ని నెలల కింద మామూళ్లను 50శాతం పెంచారని అంటున్నారు. మామూళ్లు ముట్టకపోతే వైన్‌షాపుల ముందు కానిస్టేబుల్ ప్రత్యక్షమవుతారని.. పార్కింగ్ నుంచి జనాలు గుమికూడే వరకు అన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతుంటారని వైన్‌షాపుల నిర్వాహకులు చెప్తున్నారు. జనగామ జిల్లాలో వైన్‌షాపుల నిర్వాహకులు ఎక్సైజ్ పోలీసులకు నెలకు రూ.15వేల–30 వేలవరకు, సివిల్ పోలీసులకు రూ.20–35వేల వరకు ఇస్తున్నట్టు సమాచారం. గ్రేటర్ వరంగల్‌లో గతంలో ఎక్సైజ్ సిబ్బంది నెలకు రూ.15వేలు వసూలు చేసేవారని, ఇప్పుడు రూ.20వేలు తీసుకుంటున్నారని.. సివిల్ పోలీసులు కూడా రూ.10 వేల నుంచి రూ.15వేలకు పెంచారని వైన్స్‌షాపుల నిర్వాహకులు అంటున్నారు. పోలీసులకు మామూలు ముట్టకపోతే.. వైన్‌షాపు ఎదురుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, న్యూసెన్స్ జరుగుతోందని కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. కొన్నిచోట్ల సివిల్ పోలీసులే తనిఖీలు కూడా చేస్తున్నారని పేర్కొంటున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులకు గతంలో నెలకు రూ.25 వేలు ఇచ్చేవారమని, ఇప్పుడు రూ.50 వేలు వసూలు చేస్తున్నారని వైన్స్‌షాపుల వర్గాలు చెప్తున్నాయి. లేకుంటే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, బెల్ట్‌షాపులపై దాడులు చేస్తుంటారని అంటున్నాయి. తమ వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందోనని ప్రతినెలా ఠంచన్‌గా ముట్టజెప్పాల్సి వస్తోందని చెప్తున్నాయి. హైదరాబాద్ నడిరోడ్డు హిమాయత్‌నగర్, నారాయణగూడ ప్రాంతాల్లో సివిల్ పోలీసుల దందా ఎక్కువైందని వైన్‌షాపుల యజమానులు చెప్తున్నారు. కేవలం ఎక్సైజ్ వాళ్లకు మాత్రమే ఇస్తే సరిపోదని, తమకూ ఇవ్వకపోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అంటున్నారు. నారాయణగూడలో వైన్‌షాపుల నుంచి పోలీసులకు నెలకు రూ.25 వేల చొప్పున అందుతుంటాయని.. అందుకే సిబ్బంది ఆ షాపులు సమయం దాటి తెరిచి ఉన్నా, రోడ్డుపై ఇబ్బంది అవుతున్నా పట్టించుకోరని స్థానికులు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ డివిజన్ పరిధిలో సివిల్ పోలీసులు తరచూ దావత్ల పేరుతో పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి బార్ల నుంచి నెలకు రూ.15 వేల దాకా వసూలు చేస్తున్నారని వైన్స్ నిర్వాహకులు చెప్తున్నారు. రాత్రి సమయం ముగిశాక మద్యం అమ్మితే.. అందినంత దోచుకుని ఏమీ జరగనట్టు వెళ్లిపోతుంటారని స్థానికులు అంటున్నారు. ఖమ్మం జిల్లాలో గోదావరి జిల్లాలకు ఆనుకుని ఉండే ప్రాంతాల్లోని వైన్స్ నుంచి పోలీసులకు నెలకు రూ.50వేల చొప్పున అందుతాయని.. పైగా అడిగినన్ని మద్యం బాటిళ్లూ ఇవ్వాల్సిందేనని నిర్వాహకులు చెప్తున్నారు. అలా ఇవ్వకుంటే వైన్‌షాపుల్లో మద్యం అన్లోడ్ కూడా కానివ్వరని అంటున్నారు. ఇక ఎక్సైజ్ మామూళ్లు సాధారణమేనని.. లేకుంటే పర్మిట్ రూం, ఇతర అంశాల్లో తీవ్రంగా ఇబ్బందిపెడతారని ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతంలో కొందరు పోలీసుల మామూళ్ల దందా మరీ ఎక్కువన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ సమయానికి డబ్బులు అందకుంటే అలుగుతారని.. కొన్నిరోజులు ఇబ్బందిపెడతారని వైన్ షాపుల నిర్వాహకులు చెప్తున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి ఇబ్బంది పెడుతున్నారు నెలవారీగా సివిల్ పోలీసులకు మామూళ్లు ఇవ్వకపోతే షాప్ వద్దకు వచ్చి ఇబ్బందిపెడతారు. షాప్‌లో పనిచేసే వారిని స్టేషన్‌కు తీసుకెళుతుంటారు. లేదంటే షాప్ దగ్గర డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు పెట్టి భయాందోళనకు గురిచేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఓ వైన్‌షాప్ నిర్వాహకుడు మద్యం కూడా ఫ్రీగా తీసుకెళ్తారు ప్రభుత్వ జీతాలైనా ఆలస్యంగా అందుతాయేమోగానీ పోలీసులకు ఇచ్చే మామూళ్లకు మాత్రం ఆలస్యం జరగకూడదు. డబ్బులేకాదు వారు అడిగినప్పుడల్లా మద్యం బాటిళ్లు ఫ్రీగా ఇవ్వాలి. లేదంటే వేధింపులు మొదలవుతాయి. మాకు మిగిలే దాంట్లో ఎంతోకొంత ఇచ్చి ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నాం. డబ్బులిస్తే మా జోలికి వచ్చే వారే ఉండరు. – వైన్‌షాప్ యజమాని, నారాయణగూడ, హైదరాబాద్ -
క్వార్టర్ సీసా తెస్తాడని నమ్మితే నట్టేట ముంచాడు.. ఎంతసేపైనా రాకపాయె!
నాగిరెడ్డిపేట (నిజామాబాద్): ఓ గుర్తు తెలియని వ్యక్తి మద్యం తాగుదామని పరిచయం పెంచుకొని బైక్ ఎత్తుకెళ్లిన ఘటన నాగిరెడ్డిపేట మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎర్రగుట్ట తండాకు చెందిన మాలవత్ లింగ్య ఈ నెల 24న మద్యం తాగేందుకు తన ద్విచక్ర వాహనంపై గోపాల్పేట మద్యం దుకాణం వద్దకు వెళ్లాడు. అదే సమయంలో వైన్‌షాపు వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి లింగ్యతో పరిచయం చేసుకుని మాటలు కలిపాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి మద్యం తాగుదామని నిర్ణయించుకున్నారు. సదరు వ్యక్తి మద్యం షాప్‌నకు వెళ్లి క్వార్టర్ బాటిల్‌ను తీసుకున్నాడు. ఇద్దరు కలిసి బైక్‌పై మండలంలోని తాండూరు శివారులో పౌల్ట్రీఫామ్ వెనుకకు వెళ్లి మద్యం తాగారు. మరికొంత మద్యం తాగుదామని చెప్పడంతో లింగ్య అంగీకరించాడు. దీంతో గుర్తుతెలియని వ్యక్తి లింగ్య బైక్‌ను తీసుకుని మద్యం తెస్తానని చెప్పి వెళ్లి.. తిరిగి రాలేదు. దీంతో తన బైక్ పోయిందని గుర్తించి, ఇట్టి విషయమై బాధితుడు లింగ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. (చదవండి: వలపు వల విసిరి బ్లాక్మెయిల్.. రూ.80 లక్షలు వసూలు చేసిన జంట) -
బెడిసికొట్టిన ‘మద్యం చోరీ’ స్కెచ్.. పోలీసులకు చిక్కిన మందుబాబులు
చెన్నై: తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో ఇద్దరు మందుబాబుల ‘మద్యం చోరీ’ స్కెచ్ బెడిసికొట్టింది. మద్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకొని ఓ వైన్ షాప్ గోడకు కన్నం వేసిన దొంగలు.. తీరా లోపలున్న మందు సీసాలను చూశాక కాస్త ప్లాన్ మార్చుకున్నారు. ముందుగా ఓ రెండు పెగ్గులేసి గొంతు తడుపుకొని ఆ తర్వాత ‘పని’కానిద్దామనుకున్నారు. అయితే అదే సమయంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు గోడకున్న రంధ్రాన్ని చూసి షాపు వద్దకు వచ్చి చూడగా లోపలి తతంగం వారి కంటపడింది. అయితే దుకాణానికి తాళం వేసి ఉండటంతో వెళ్లిన ‘దారి’లోనే బయటకు రావాలని దొంగలను పోలీసులు ఆదేశించారు. దీంతో తిరిగి వారు రంధ్రంలోంచి బయటకు వచ్చాక అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Two men drilled a hole in the wall of a liquor shop & were boozing inside when caught redhanded by a patrol police in Thiruvallur district. The men had planned to steal the liquor bottles but decided to booze before taking off when they were caught @xpresstn @NewIndianXpress pic.twitter.com/zF9MoRjlUX — Novinston Lobo (@NovinstonLobo) September 4, 2022 చదవండి: గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి -
మందుబాబులకు షాక్.. తాగేదంతా మద్యం కాదు
సాక్షి, వికారాబాద్: వికారబాద్ జిల్లా పరిధిలోని 19 మండలాల్లోని మద్యం దుకాణాల యజమానులు ధనార్జనే ధ్యేయంగా మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. దీంతో మద్యం ప్రియులకు ఏది అసలో ఏది కల్తీనో తెలియని పరిస్థితి. టెండర్లలో మద్యం షాపులను దక్కించుకున్న వ్యాపారస్తులు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించాలనే ఆలోచనతో మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. దీంతో మద్యం కల్తీ చేసే వారిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి గుట్టుగా దంగా చేస్తున్నారనే ఆరోపణలు ఊపందుకున్నాయి. ప్రముఖ బ్రాండ్లకు చెందిన బాటిళ్ల మూతలు ఓపెన్ చేసి అందులో చీప్ లిక్కర్, నీటిని కలిపి మల్లీ యథావిధిగా సీల్ చేస్తున్నారు. ఈ వ్యవహారం చాలా రోజులుగా జరుగుతున్నా అధికారులు తమకేమీ తెలియనట్లు గా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బ్రాండ్లన్నీ కల్తీమయం జిల్లా ఎక్సైజ్ పరిధిలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో మొత్తం 59 వైన్ షాపులు, ఐదు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటికి తోడు గ్రామాలు, తండాల పరిధిలోని ఐదు నుంచి పది వరకు బెల్టు షాపులు ఉన్నాయి. తక్కువ ధరకు లభించే మద్యాన్ని ఎక్కవ ధర ఉన్న బాటిళ్లలో స్టిక్కర్లు, లేబుళ్లను మార్చుతూ విక్రయిస్తున్నారు. ప్రధానంగా పరిగి నియోజకవర్గంలోని పలు దుకాణాల్లో ఈ దందా కొనసాగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన తాండూరు, కొడంగల్ లోనూ కొనసాగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. పెరిగిన మద్యం ధరలతో ఈ కల్తీ ప్రక్రియ మరింత ఎక్కువగా సాగుతోంది. చదవండి: హైదరాబాద్‌లో ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠా గుట్టురట్టు వేసిన సీల్ వేసినట్లే.. అధిక ధరలున్న మద్యం సీసాల లేబుళ్లను, స్టిక్కర్లను ఏమాత్రం తేడా లేకుండా ఓపేన్ చేసి మళ్లీ సీల్ వేసేందుకు కొన్ని వైన్‌షాపుల యజమానులు స్థానికేతరులను, కల్తీ చేయడంతో అనుభవం ఉన్నవారిని తీసుకువస్తున్నట్లు సమాచారం. వారికి ఎక్కువ మొత్తంలో జీతాలు ఇచ్చి మద్యాన్ని ఇష్టానుసారంగా కల్తీ చేయిస్తున్నట్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ప్రముఖ బ్రాండ్లలో 25శాతం మద్యాన్ని బయటకు తీస్తూ బదులుగా నీటిని కలుపుతున్నారు. లేదంటే తక్కువ ధరకే లభ్యమయ్యే చీప్ లిక్కర్ ఇతర మందులను కలుపుతూ కల్తీ చేస్తున్నారు. దీంతో వైన్స్ యజమానులు మూడు పువ్వులు, ఆరుకాయలుగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. బెల్టు షాపుల్లోనూ ఈ తరహా వ్యాపారమే కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. నామమాత్రపు తనిఖీలు జిల్లాలో ఇంత భారీగా మద్యం కల్తీ చేస్తున్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తుల్లో జోగుతూ కల్తీ మద్యం తయారీకి వత్తాసు పలుకుతున్నారని చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మద్యం షాపుల్లో కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా కేటుగాళ్లు తయారయ్యారు. ప్రమాదకర, విషపూరిత రసాయనాలు కలిసి అసలు ఏదో.. నకిలీ ఏదో తెలియకుండా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. -
అర్ధరాత్రి వైన్స్ వద్ద ఉద్రిక్తత.. మహిళలపై దాడి
అర్ధరాత్రి నడిరోడ్డుమీద మహిళలు హల్చల్ చేశారు. వైన్ షాప్ వద్ద బీభత్సం సృష్టించారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఓ వైన్ షాప్ వద్దకు గురువారం అర్ధరాత్రి కొందరు మహిళలు చేరుకున్నారు. అనంతరం వైన్ షాపు మూసివేయాలని వారు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మహిళలు, వైన్ షాపు సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, వైన్ షాపులో ఉన్న మహిళా బౌన్సర్లు.. నిరసనకు దిగిన మహిళలపై దాడులకు దిగడంతో వారు కూడా ఎదురు దాడికి పాల్పడ్డారు. బౌన్సర్లు.. మహిళలను చితకబాదడంతో వారు గట్టిగా కేకలు వేశారు.కాగా, ఆ ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్న దక్షిణ ఢిల్లీలోని తిగ్డి పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రంజిత్ జోక్యం వారికి నప్పజెప్పే ప్రయత్నం చేశాడు. ఫుల్ ఫైర్‌లో ఉన్న మహిళలు.. పోలీసులపై దాడి చేయడంతో అతడి డ్రెస్ చిరిగిపోయింది. దీంతో, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని 10 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. देवली रेजिडेंशियल ऐरिया में अवैध शराब के ठेके का विरोध कर रही महिलाओं को शराब माफिया ने बाहर के गुंडों को बुलाकर उनको बुरी तरह से पिटवाया। दिल्ली सरकार की नई लीकर पॉलिसी के करण जगह-जगह यही मौहोल बनता जा रहा है केजरीवाल जी आप से निवेदन इस तरह दिल्ली को बर्बाद न करें। pic.twitter.com/7I7lSkWAnO — Siddharthan (@siddharthanbjp) June 24, 2022 ఇది కూడా చదవండి: ఫన్నీ వీడియో: తప్పతాగి పెళ్లి కూతురి బదులు.. చెంప పగలకొట్టి రచ్చ చేసిన మరదలు -
బెల్టు షాపులు లేకుండా చేస్తాం: ప్రవీణ్‌కుమార్
కనగల్: బీఎస్పీ అధికారంలోకి వస్తే బెల్టుషాపులు లేకుండా చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. 24వ రోజుకు చేరిన బహుజన రాజ్యాధికార యాత్ర మంగళవారం కనగల్‌లో కొనసాగింది. కనగల్ నుంచి క్రాస్‌రోడ్డు వరకు పాదయాత్ర నిర్వహించిన ప్రవీణ్‌కుమార్ అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బెల్టుషాపుల వల్ల గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందన్నారు. మద్యానికి బానిసలై చాలా మంది చిన్నవయస్సులోనే అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో ఏమోగానీ రాష్ట్రం మద్యం విక్రయించడంలో మాత్రం నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని తెలిపారు. కూలీలుగా ఉన్న బడుగుబలహీన వర్గాలను ఓనర్లను చేయడమే తమ లక్ష్యమన్నారు. ఏనుగు గర్తుకు ఓటేసి, ప్రగతి భవన్‌పై నీలిజెండా ఎగురవేసేందుకు బడుగు బలహీనవర్గాలు పాటుపడాలని పిలుపునిచ్చారు. -
‘వైన్‌షాప్ ఉండాలా.. వద్దా’ అంటూ ఓటింగ్.. ఫలితం ఏంటంటే!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఓటింగ్‌ను నాయకులను ఎన్నుకునేందుకు చేపడతారు. అయితే బేగంపేట గురుమూర్తిలేన్ ప్రాంతంలో మాత్రం వైన్ షాప్ ఉండాలా? వద్దా? అనే విషయంపై ఓటింగ్ నిర్వహించారు. గుర్తిమూర్తిలేన్‌లో వైన్‌షాపు ఏర్పాటుపై గత కొద్ది రోజులుగా స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు షాపును ఏర్పాటుచేశామని నిర్వాహకులు చెప్పారు. అయితే దీనిపై ఓటింగ్‌కు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్న సందర్భంలో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్‌కు అనుబంధంగా ఉన్న ‘హక్కు ఇన్షియేటివ్ అండ్ ఛానల్’ సంస్థను పలువురు స్థానికులు ఆశ్రయించారు. సదరు సంస్థ ప్రతినిధులు శనివారం సిటిజన్ రెఫరెండమ్ పేరుతో గుర్తిమూర్తి లేన్ నివాస, వాణిజ్య కేంద్రాలకు 500 మీటర్ల పరిధిలో ఓటింగ్ నిర్వహించారు. ‘మీకు మీ ఏరియాలో వైన్ షాపులు ఉండడం ఇష్టమేనా?’ అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందిగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 1479 మంది ఓటు వేయగా ఆదివారం కౌంటింగ్ ప్రక్రియ జరిపారు. 1415 మంది (95.67 శాతం) ‘నో’ (వద్దు) అని ఓట్ చేయగా, 53 మంది (3.58 శాతం) మంది ‘ఎస్’ (కావాలి) అని ఓట్ చేశారు. 11 ఓట్లు చెల్లలేదు. ఓట్లు వేసిన వారిలో 737 మంది (49.8 శాతం) మహిళలు, 742 మంది (50.16) పురుషులు ఉన్నారు. కోర్టులో పిటిషన్.. ‘హక్కు ఇన్షియేటివ్ అండ్ ఛానల్’ సంస్థ నిర్వహించిన ఈ ఓటింగ్ ఫలితాల ఆధారంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. అయితే కోర్టు తీర్పు ఏవిధంగా ఉంటుందనేది వేచి చూడాల్సిందే. గతంలో ఇదే సంస్థ సికింద్రాబాద్ ఒకసారి, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వైన్‌షాపుల ఏర్పాటుపై పలు సర్వేలు జరిపినట్లు సమాచారం. నగరంలో ఇది రెండో ఓటింగ్ ప్రక్రియ. -
930 మద్యం సీసాలు స్వాధీనం
హనుమాన్ జంక్షన్ రూరల్: ప్రభుత్వ వైన్ షాపు ఉద్యోగి అక్రమార్కులతో చేతులు కలిపి భారీ మొత్తంలో మద్యం సీసాలు తరలిస్తుండగా హనుమాన్ జంక్షన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలు నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు మంగళవారం మీడియాకు చెప్పారు. స్థానిక గుడివాడ రోడ్డులోని వేగిరెడ్డి థియేటర్ వద్ద ఉన్న ప్రభుత్వ వైన్‌షాపు నుంచి భారీ మొత్తంలో మద్యం సీసాలను కారులో తరలిస్తున్నట్లుగా సోమవారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. హనుమాన్‌జంక్షన్ ప్రధాన కూడలిలో సీఐ కె.సతీష్, ఎస్ఐలు పామర్తి గౌతమ్‌కుమార్, కార్తిక ఉషారాణి వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో గుడివాడ నుంచి నూజివీడు వైపు వెళ్తున్న మారుతీ కారులో రూ.1,39,500 విలువ చేసే 930 మద్యం బాటిళ్లు గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించటంతో సరైన సమాచారం చెప్పకుండా వారు పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ వైన్‌షాపులో సూపర్వైజర్గా పనిచేస్తోన్న పశ్చిమగోదావరి జిల్లా అప్పనవీడు గ్రామానికి చెందిన మద్దాల రమేష్ కొంతకాలంగా హనుమాన్జంక్షన్కు చెందిన మొవ్వ ప్రసాద్‌తో చేతులు కలిపి అడ్డదారిలో మద్యం సీసాలు తరలిస్తున్నట్లు నిర్థారించారు. వీరి నుంచి 930 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోవటంతో పాటుగా నిందితులను అరెస్ట్ చేసి మంగళవారం నూజివీడు కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. సీఐ కె.సతీష్, ఎస్ఐలు పామర్తి గౌతమ్‌కుమార్, కార్తిక ఉషారాణి, సహకరించిన కానిస్టేబుళ్లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వీరికి రివార్డులు అందించేందుకు సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు. -
చోరీ మామూలే..కానీ ఈ దొంగకు ఓ ప్రత్యేకత ఉంది
సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం) : అశ్వారావుపేటలోని ఓ వైన్స్‌లో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. కేవలం చోరీ అయితే మామూలు విషయమే కావొచ్చు కానీ ఈ చోరీకి ఓ ప్రత్యేకత ఉంది. చోరీకి పాల్పడింది ఒకరో, ఇద్దరో తెలియదు కానీ దాదాపు రూ.2 లక్షల విలువైన మద్యం బాటిళ్లను అపహరించుకుపోయారు. రానున్న దసరాకు అమ్మకాలు జోరుగానే సాగుతాయనే భావనతో భారీగా స్టాక్ తెప్పించినట్లు సమాచారం. చదవండి: హుజురాబాద్ ఉపఎన్నిక: సమరభేరిలో సకుటుంబం.. అయితే, వైన్స్షాపులో సీసీ కెమెరాలు ఉండగా.. వైర్లను కత్తిరించిన నిందితులు లోపలికి ప్రవేశించారు. షాపులో వివిధ రకాల ఖరీదైన బ్రాండ్ల మద్యం ఉన్నా... కేవలం మాన్షన్ హౌస్ బ్రాందీ సీసాలు మాత్రమే ఎత్తుకెళ్లారు. ఇక వెళ్లిపోయే క్రమంలో వైన్స్‌లోని సీసీ కెమెరాల పుటేజీ హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకెళ్లడం విశేషం. ఈ మేరకు సమాచారం అందుకున్న సీఐ ఉపేంద్రరావు, ఎస్సై చల్లా అరుణ సంఘటనా స్థలానికి చేరుకుని కొత్తగూడెం నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. చదవండి: Stegosaurus: గుడ్డు నుంచి ఆకాశానికి.. నెల రోజుల క్రితం ఊట్లపల్లిలో.. నెల రోజుల క్రితం మండలంలోని ఊట్లపల్లి గ్రామం వద్దగల మద్యం దుకాణంలో కూడా గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ. లక్ష విలువైన మద్యం అపహరించారు. కాగా ఈ రెండు చోరీ ఘటనపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేయలేదు. నెలరోజుల వ్యవధిలో రెండుసార్లు మద్యం చోరీ జరగడం గమనార్హం. చోరీ ఘటనలపై స్థానిక ఎస్సై చల్లా అరుణను ‘సాక్షి’ వివరణ కోరగా..చోరీ జరిగినట్లు సమాచారం ఉందని, కానీ వాటిపై బాధితుల నుంచి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు రాకపోవడంతో కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. -
వైరల్: నో బీర్, ఓన్లీ విస్కీ.. వైన్ షాప్‌లో మందేసిన కోతి
Monkey Alcohol Drinking Video: కోతులు చేసే చేష్టలు మామూలుగా ఉండవు. ఒక్కసారి గుంపులుగా జనావాసంలోకి చొరబడ్డాయంటే అవి చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఇంట్లోకి వచ్చాయంటే వస్తువులన్నీ చిందరవందర అవ్వాల్సిందే. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్లు ఓ కోతి ఏకంగా ఓ వైన్ షాప్‌లోకే దూరింది. అక్కడున్న బీర్, వైన్ బాటిళ్లను పక్కకు పెట్టి విస్కీ బాటిల్‌ను టార్గెట్ చేసింది. ఇంకేముంది హీరోలా విస్కీ బాటిల్‌ను చేతులోకి తీసుకొని దర్జాగా తాగేసింది. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ మాండ్లా జిల్లాలో చోటుచేసుకుంది. బహమని బంజార్ గ్రామంలో ఓ మద్యం దుకాణం ఉంది. అక్కడికి కొన్ని రోజుల నుంచి ఓ కోతి తరుచుగా వస్తోంది. ఖాళీగా పడి ఉన్న మద్యం సీసాల్లో మిగిలిపోయిన మద్యం చుక్కలను తాగేది.అయితే, ఓ రోజు ఆ కోతి ఏకంగా వైన్ షాపులోకే ఎంటర్ అయ్యింది. మద్యం దుకాణంలోకి ప్రవేశించిన కోతి కాటన్ తెరిచి అందులోంచి వైన్ బాటిల్‌ను లాక్కుంది. తరువాత ఓ టెబుల్‌పై దర్జాగా కూర్చొని విస్కీ బాటిల్ మూతను నెమ్మదిగా తీసేందుకు ప్రయత్నిస్తుంది. చివరికి మూత ఒపెన్ అవ్వడంతో ప్రొఫెషనల్ మందుబాబులా గటాగటా తాగేసింది. అయితే కోతి షాప్‌లోకి చొరబడినప్పటికీ యాజమాని ఎలాంటి కంగారు పడలేదు. అతని పని తను చేసుకుంటూ ఉన్నాడు. మధ్యలో షాప్ యాజమాని కోతికి బిస్కెట్ కూడా ఇచ్చేందుకు ప్రయత్నించగా వద్దని తిరస్కరించి బాటిల్ మొత్తం ఖాళీ చేసి కూర్చుంది. కాగా, కోతి మద్యం సేవించడాన్ని వైన్ షాప్‌కు వచ్చిన పలువురు వీడియో తీశారు. ఆ వీడియోనుఓ వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. కోతి విస్కీ తాగడంపై ఆశ్యర్యానికి గురవుతున్నారు. pic.twitter.com/RCUGLzzkcO — sudhanshu maheshwari (@smaheshwari523) July 14, 2021 -
మద్యం దుకాణంలో ఎలుకల రచ్చ.. 12 వైన్ బాటిళ్లు తాగేశాయ్!
ఇంట్లో ఎలుకలు ప్రవేశించాయంటే అవి చేసే గోల అంతా ఇంతా కాదు.. వంటలు, బియ్యం.. ఇలా అన్నిట్లో నేనున్నానంటూ చేయి పెట్టి చిందర వందర చేస్తాయి. అంతేగాక ఎంతో ఇష్టంగా కొనుకున్న కొనుకున్న దుస్తులను సైతం దేనికి పనికిరాకుండా చింపి నాశనం చేస్తాయి. ఏ ఇంట్లోనైనా ఎలుకలు ఒంటరిగా ఉండవు. తమతోపాటూ...పెద్ద ఫ్యామిలీని వెంట తెస్తాయి. వాటిని ఇంట్లో నుంచి తరిమేయడం ఓ సవాలు లాంటిది. అప్పటి వరకు ప్రశాంతత ఉండదు. అయితే ఇటీవల ఎలుకల నోటికి కొత్త రుచి కావాల్సి వచ్చిందేమో. వైన్ షాప్‌లోకి దూరి ఏకంగా 12 వైన్ బాటిళ్లను ఎలుకలు ఖాళీ చేశాయి. ఈ విచిత్ర ఘటన తమిళనాడులో నీలగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గుడలూర్ సమీపంలోని కదంపూజాలో ప్రభుత్వం నడుపుతున్న టాస్మాక్ మద్యం దుకాణాన్ని లాక్డౌన్ కారణంగా మూసివేశారు. తాజాగా కోవిడ్ తగ్గుముఖం పట్టడం వల్ల ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో మద్యం షాపులను ఓపెన్ చేశారు. ఈ క్రమంలో సోమవారం వైన్ షాప్ తెరిచి చూసేసరికి 12 ఖాళీ వైన్ బాటిళ్లు ఒపెన్ చేసి ఉండటంతో తమిళనాడు ఎక్సైజ్ సిబ్బంది షాక్ తిన్నారు. బాటిళ్ల మూతలపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు ఉండంటంతోపాటు.. అందులోని వైన్ ఖాళీ అయ్యింది. ఈ 12 మద్యం సీసాల మూతలను ఎలుకలే కొరికినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. సిబ్బంది సమాచారం మేరకు టాస్మాక్ సీనియర్ అధికారులు దర్యాప్తు చేసి.. ఎలుకలే ఈ పని చేశాయని నిర్దారించారు. లాక్డౌన్ వల్ల చాలాకాలం ఈ మద్యం దుకాణం మూసివేయడంతో షాపులో ఎలుకలు తిరగడం ప్రారంభించాయని, బాటిళ్ల మూతలను కొరికి ఎలుకలు మద్యం తాగేశాయని తమిళనాడు ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారి అన్నారు. ఎలుకలు ఖాళీ చేసినవైన్ విలువ 1500 ఉంటుందని తెలిపారు. కేవలం వైన్ బాటిల్స్‌నే టార్గెట్ చేశాయని, బీర్ లేదా మిగతా మద్యం సీసాలను అసలు ముట్టుకోలేదన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజనులు.. ఎలుకల్లో కూడా మందుబాబులు ఉన్నారని, ఏమాత్రం కిక్కుఏక్కిందో అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. -
వైన్ షాపుల్లో నిధుల గోల్ మాల్ పై విచారణకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
-
వామ్మో.. తాగుబోతు ఎంత పనిచేశాడు!
సాక్షి, బంజారాహిల్స్: బోరబండ ఎస్పీఆర్హిల్స్ సమీపంలోని కాకతీయ వైన్స్‌లో మద్యం తీసుకునేందుకు గోపి అనే డ్రైవర్ శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. మద్యం ధరకు అనుగుణంగా క్యూఆర్ కోడ్‌తో డబ్బులు చెల్లించేందుకు యత్నిస్తుండగా ఆ మిషన్ రెండు నిమిషాలు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది. ఇంత ఆలస్యమా అంటూ గోపి మద్యం సీసా ఇచ్చిన సేల్స్‌మెన్ రంజిత్‌పై అదే సీసాతో తలపై దాడి చేశాడు. దీంతో రంజిత్ తల పగలడంతో ఆగ్రహానికి లోనైన వైన్‌షాప్ ఇతర సిబ్బంది మూకూమ్మడిగా గోపిని కొట్టారు. రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తనపై కూడా దాడి చేశారంటూ గోపి కూడా శనివారం ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా పరిశీలిస్తున్నారు. -
అప్పులు తీర్చేందుకు దొంగయ్యాడు!
సాక్షి, మదనపల్లె టౌన్: మద్యం షాపులో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆ షాపులో పనిచేసే సేల్స్‌మెన్ ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. మదనపల్లె–పుంగనూరు రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణం (దినేష్ వైన్స్)లో ఈ నెల 28న అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడటం విదితమే. కేసు నమోదు అనంతరం సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ దిలీప్‌కుమార్, క్లూస్ టీం బృందం సేకరించిన ఆధారాలతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు బుధవారం డీఎస్పీ రవిమనోహరాచారి స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించిన వివరాలు..మద్యం షాపు చోరీ కేసులో ఆరోగ్యవరం తురకపల్లెకు చెందిన పి.సుజిత్(23) ప్రధాన నిందితుడు అని తేలింది. ఇతడు మద్యం షాపులో సేల్స్‌మెన్‌గా పనిచేస్తూ చోరీకి స్కెచ్ వేశాడు. నాలుగు రోజులుగా బ్యాంకులో మద్యం షాపు సొమ్మును జమ చేయకపోవడంతో దీనిని చోరీ చేసి అప్పులు తీర్చాలని తలపోశాడు. అదే ఊరులో ఉంటున్న తన స్నేహితుడు ఎస్. అబ్దుల్ కలాం అలియాస్ రంజాని(20) సహకారం తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి 28న రాత్రి మద్యం షాపు తాళాలు చాకచక్యంగా తెరచి క్యాష్ చెస్ట్లాకర్తో పాటు రూ.8,99,720 లక్షల నగదును చోరీ చేశారు. ఆ తర్వాత లాకర్‌ను మాత్రం తురకపల్లె సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో పడేశారు. చోరీ సొమ్ముతో అప్పులు తీర్చడానికి రుణదాతల వద్దకు వెళ్తుండగా స్థానిక సీటీఎం రోడ్డులోని తట్టివారిపల్లె జంక్షన్లో వారిని సీఐ, ఎస్ఐల బృందం మంగళవారం ఉదయం అరెస్ట్ చేసింది. కేసును ఛేదించిన సిబ్బందికి డీఎస్పీ రివార్డులు ప్రకటించారు. నాన్న కోసం..! ఆరోగ్యవరం తురకపల్లెకు చెందిన ప్రశాంత్ బాబుకు ఏకైక కుమారుడు పి.సుజిత్. డిగ్రీ వరకు చదివాడు. ప్రశాంత్‌బాబు అనారోగ్యం బారిన పడడంతో చేసిన వైద్యపరీక్షల్లో గుండె వాల్వులు చెడిపోయాయని తేలింది. దీంతో డాక్టర్లు గుండెకు స్టంట్ ఏర్పాటు చేశారు. సుజిత్ చేసిన అప్పులకు తోడు తన తండ్రి గుండె ఆపరేషన్‌కు చేసిన అప్పులు తీర్చడం భారమయ్యాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కెందుకు ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్‌మెన్ ఉద్యోగం పొందాడు. వచ్చే జీతంతో అప్పులు తీర్చలే క, మద్యం దుకాణం సొమ్ముపై కన్నేశాడు. చోరీకి స్కెచ్ వేసి, చివరకు అరెస్టయి, తన స్నేహితుడిని కూడా కటకటాల పాల్జేశాడు. -
హైదరాబాద్‌లో వైన్ షాపుల ఇష్టారాజ్యం
-
చచ్చినా పర్వాలేదనుకుంటున్నారా?: భట్టి
సాక్షి, హైదరాబాద్: ‘పోలీస్ కాపలా ఉంచినంత మాత్రాన వైన్‌షాపుల వద్ద భౌతిక దూరం పాటించడం సాధ్యం కాదని, తాగుబోతులకు కరోనా వచ్చి చచ్చినా పర్వాలేదనుకుంటున్నారా?’అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో మద్యం దుకాణాలకు అనుమతిస్తే తాగుబోతులు భౌతికదూరం పాటిస్తారా? అని నిలదీశారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వైన్స్ ఓపెన్ చేయడంతో ఇన్ని రోజుల శ్రమ, వైద్యులు, పోలీసులు పడ్డ కష్టం వృథా అయిందని ఆయన మండిపడ్డారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఇసుక సరఫరా వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందనే ఆందోళన ఉందని, ఇసుక సరఫరా చేసే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాబోయే రెండు వారాలు కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
కేసీఆర్ చిత్రపటానికి మందుబాబుల పాలాభిషేకం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు 45 రోజులు తర్వాత, బుధవారం దుకాణాలు తెరుచుకోవటంతో మద్యం ప్రియుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. చాలా రోజుల తర్వాత ‘చుక్క’ దొరకబోతుందన్న సంతోషంతో మందుబాబులు ఉదయం నుంచే వైన్స్ ముందు క్యూ కట్టారు. ఎండను కూడా లెక్కచేయలేదు. మద్యం దొరికే వరకు ఇంటికి వెళ్లేది లేదని తేల్చి చెబుతూ క్యూ లైన్లో నిల్చున్నారు. ఒక్కో వైన్ షాపు వద్ద రెండు, మూడు క్యూలైన్లు దర్శమించాయి. (చదవండి : హైదరాబాద్‌లో వైన్స్ ముందు మహిళల క్యూ..) ఇక చాలా రోజుల తర్వాత చుక్క దొరకడంతో మందుబాబులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పలు చోట్లు మద్యం బాటిళ్లు పట్టుకొని ఆనందంతో చిందులేశారు. పలు వైన్స్ షాపులకు పూల మాల వేసి కొబ్బరి కాయలు కొట్టారు. ఇక ఒక చోట అయితే ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. కనకదుర్గ వైన్స్ దగ్గర సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూల మాలవేసి పాలాభిషేకం చేశారు. అనంతరం జై కేసీఆర్ అంటూ మందుబాబు నినాదాలు చేశారు. అయితే ఇది తెలంగాణలోని ఏ ప్రాంతంలో జరిగిందో వివరాలు తెలియరాలేదు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా బుధవారం ఉదయం 10 గంటలకు మద్యం షాపులు తెరుచుకున్న విషయం తెలిసిందే. వినియోగదారులు భౌతికదూరం పాటిస్తూ.. క్యూ లైన్లలో ఉన్నారు. ధరలు పెంచినా అమ్మకాల్లో మాత్రం తేడా కనిపించలేదు. పైగా మళ్లీ వైన్ షాపులు మూసివేస్తారోనని ఎక్కువగానే మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పలు చోట్ల మహిళలు కూడా మద్యం కోసం లైన్లలో వేచి ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కొండాపూర్, పంజాగుట్ట, మాదాపూర్, ఫిలింనగర్, రాయదుర్గం, హైటెక్‌సిటీలో మద్యం కోసం మహిళలు, సాఫ్ట్వేర్ యువతులు క్యూ కట్టి మద్యం కొనుగోలు చేశారు. -
కూచిపూడి పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, కృష్ణా : జిల్లాలోని కూచిపూడి పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు.. కూచిపూడిలో ఉన్న వైన్‌షాప్ వద్ద మద్దాల కోటేశ్వరరావుపై సోమవారం రాత్రి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడడంతో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉన్నాడు. కాగా దాడిలో మృతి చెందిన కోటేశ్వరరావు మొవ్వ మండలం అయ్యంకి గ్రామానికి చెందినవాడు. కోటేశ్వరరావుపై దాడి చేసిన వ్యక్తులే ఆయన మృతికి కారణమంటూ అతని బంధువులు ఆరోపించారు. వీరికి మద్దతుగా అయ్యంకి గ్రామస్తులు మంగళవారం పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తుకు చేరుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. -
మీర్పేట్ వైన్ షాపులో చోరి
-
సికింద్రాబాద్ వైన్స్ షాప్‌లో చోరీ
-
లక్ష విలువైన మద్యం బాటిల్స్‌తో పరార్
సాక్షి, హైద్రాబాద్ : దేశ వ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేయడంతో మందుబాబులు అల్లాడుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా.. మద్యం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు మద్యం షాప్ లూటీకి పాల్పడ్డారు. షాప్ మూసివేడంతో వెనుక నుంచి రంద్రం చేసి లోపలికి ప్రవేశించారు. లక్ష రూపాయల విలువైన మద్యం బాటల్స్‌తో పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సీసీటీవీ వీడియోల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. కాగా మద్యం దొరక్క దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలోనూ తొమ్మదిమంది బలవన్మరణానికి పాల్పడ్డారు. -
వింతగా ప్రవర్తిస్తున్న మందుబాబులు
-
వైన్స్‌కు కన్నం.. నగదు, మద్యం మాయం!
సాక్షి, హైదరాబాద్: వైన్స్ షాపులు నిత్యం రద్దీగా ఉంటాయి. వీటిలో మద్యానికి, కాసులకు కొదువ ఉండదు. అందుకే దొంగలు వినూత్నంగా ఆలోచించారు. ఇళ్లకు కాకుండా ఈసారి ఏకంగా మద్యం దుకాణానికి కన్నం వేశారు. అర్ధరాత్రి ఎవరూలేని వేళ మద్యం దుకాణానికి పైకప్పు నుంచి రంధ్రం చేసి.. అందులోకి దూరిపోయారు. వైన్స్ షాపులోని డబ్బుతోపాటు అందినకాడికి మద్యం బాటిళ్లు ఎత్తుకుపోయారు. రాజేంద్రనగర్ అత్తాపూర్‌లోని మంజు వైన్స్షాపులో ఈ చోరీ జరిగింది. మంజు వైన్స్‌కు పైనుంచి రంధ్రం చేసి.. అందులోకి దూరిన దొంగలు.. భారీగా నగదు, మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
మద్యం దుకాణం సూపర్వైజర్ అరెస్టు
రణస్థలం: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కోటపాలెం మద్యం దుకాణ సూపర్వైజర్ పాకాడ అప్పలస్వామిని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇంచార్జి సీఐ ఎ.గణపతిబాబు శనివారం అరెస్టు చేశారు. కోటపాలెం ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి అక్రమంగా మద్యం సరఫరా అవుతుందనే ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ సిబ్బంది, ఎన్ఫోర్స్మెంట్ సీఐ బి.నర్సింహులు, సిబ్బంది శుక్రవారం నిఘా వేశారు. బైల్టు దుకాణం నడుపుతున్న సుగ్గు రవికి అప్పలస్వామి 48 మద్యం సీసాలను ఒకేసారి విక్రయించాడు. అక్కడే మాటు వేసిన ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వీరిద్దరినీ పట్టుకున్నారు. వీరిని అరెస్టు చేశామని ఇన్చార్జి సీఐ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రణస్థలం ఎస్ఐ బి.బంగారురాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
సరిహద్దు నుంచి యథేచ్ఛగా మద్యం..
అక్రమ మద్యం రాష్ట్ర సరిహద్దులు దాటి వస్తోంది. ఏపీ సరిహద్దున ఉన్న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి నిత్యం మద్యం రాష్ట్రంలోని గ్రామాలకు సరఫరా అవుతోంది. ఎక్సైజ్ శాఖ చెక్‌పోస్టులు లేకపోవడంతో ఎటపాక మండలంలోకి మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దాంతో గ్రామాల్లోని చిన్న చిన్న కిరాణా షాపుల్లో సైతం విచ్చలవిడిగా తెలంగాణ మద్యం విక్రయాలు సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలోని భద్రాచలం పట్టణం ఎటపాక మండలంతో కలిసే ఉంటుంది. ఎటపాక మండల ప్రజలు ఏది కొనాలన్నా నిత్యం భద్రాచలంలోని షాపుల్లోనే కొనుగోలు చేస్తుంటారు. ఇదే తరహాలో మద్యం బాటిళ్లను కూడా తెలంగాణ నుంచే తెచ్చి ఇక్కడ జోరుగా విక్రయిస్తున్నారు. తూర్పుగోదావరి ,నెల్లిపాక (రంపచోడవరం): దశల వారీ మద్య నిషేధంపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల బెల్ట్‌షాపుల్లో మద్యం అమ్మకాలను కట్టడి చేశారు. గ్రామాల్లో బెల్టు షాపులు ఎత్తివేయటమే గాకుండా మద్యం షాపులను ప్రభుత్వమే నడుతోంది. దీంతో అక్కడి షాపుల్లో మద్యం గ్రామాలకు సరఫరా కావటం లేదు. దీంతో గ్రామాల్లో మద్యం వ్యాపారులు మండలం సరిహద్దునే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఉండటంతో అక్కడి మద్యం సరిహద్దులను దాటించి తెస్తున్నారు. అలా తెచ్చిన మద్యంను గుట్టుచప్పుడు కాకుండా గ్రామాల్లోని పలుషాపుల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.ఈ విధంగా మన రాష్ట్ర ఆదాయానికి కూడా గండి కొడుతున్నారు. ఎటపాక మండల కేంద్రంతో భద్రాచలం పట్టణం కలిసి ఉండడంతో మద్యం, సారా తయారీకి వాడే నల్లబెల్లం, పటికను ఏపీలోకి తరలించటం సులభం అవుతోంది. అదేవిధంగా లక్ష్మీపురం సమీపంలోనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దు అటు తెలంగాణలోని దుమ్ముగూడెం మండల సరిహద్దు ఉండటంతో ఇరు రాష్ట్రాల నుండి కూడా మద్యం ఏపీకి తరలిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి నకిలీ మద్యం కూడా రాష్ట్రంలోకి చేరవేస్తున్నుట్లు సమాచారం. చెక్‌పోస్టులు లేకపోవడంతో.. పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం ఏపీకి తరలిస్తుండటానికి ఇక్కడ సరిహద్దుల్లో ఎక్సైజ్ శాఖ చెక్‌పోస్టులు లేకపోవడమే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. నిత్యం ఆటోలు, ద్విచక్ర వాహనాలు, టాటా మ్యాజిక్ తదితర వాహనాల్లో భద్రాచలం నుంచి ఎటపాక మండలానికి మద్యం రవాణా చేస్తున్నారు. కొందరు ఆటోల్లో మద్యం బాటిళ్లను ఇక్కడి దుకాణాలకు విక్రయిస్తూ ఒక్కో బాటిలుకు రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. మద్యపానం నిషేధించాలనే ఉద్దేశంతో మహిళలు, యువకులు ఇటీవల పలు గ్రామాల్లో మద్యం షాపులపై దాడులు కూడా చేశారు. ప్రస్తుతం ఈ గ్రామాల్లో మద్యం, సారా అమ్మకాలు 80 శాతం తగ్గాయి. మిగతా గ్రామాల్లో తెలంగాణ నుంచి తెచ్చిన మద్యం విక్రయిస్తుండడంతో ఎక్సైజ్ శాఖ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు చేసి మద్యం, సారా అమ్మకాల వ్యాపారులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ముడుపులు తీసుకుని వదిలిపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వ్యాపారులు యథేచ్ఛగా సారా, మద్యం అమ్ముతున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఎక్సైజ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పక్క రాష్ట్రాల మద్యం ఏపీలోకి రాకుండా నియంత్రించాలని మహిళలు కోరుతున్నారు. -
మద్యంపై యుద్ధం
అక్కచెల్లెమ్మల సంతోషం కోసం నివాస ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులను తొలగించాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి యుద్ధం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 48 గంటలపాటు దీక్ష చేసినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. అయినా ఎమ్మెల్యే తన నిర్ణయాన్ని మార్చుకోకుండా వైఎస్సార్సీసీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదిశగా అడుగులు వేశారు. తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చారు. ఎమ్మెల్యే నిర్ణయంతో ఆయా ప్రాంతాల్లోని మహిళలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాల నేతలు సైతం ఎమ్మెల్యే తీరును స్వయంగా ప్రశంసించారు. ప్రొద్దుటూరు : నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మద్యం షాపులను తొలగించడం మహిళలకు ఎంతో ఊరట కలిగించింది. దీనికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం కలిసి వచ్చింది. ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో సాయిబాబా ఆలయానికి ఇరువైపులా చాలా కాలం నుంచి ఐదు మద్యం షాపులు నడిచేవి. ఇక్కడ ఉన్న ఓ మద్యం షాపు టెండర్ జిల్లాలోనే అత్యధికంగా రూ.కోటి పలికిన సందర్భాలు ఉన్నాయి. మద్యం షాపుల మధ్యలోనే సాయిబాబా ఆలయం ఉండటంతో వసంతపేట మున్సిపల్ హైస్కూల్, చుట్టూ పేదలు నివసించే ప్రాంతాలు ఉన్నాయి. రాత్రి వేళల్లో, ఆదివారాల్లో మద్యం ప్రియుల ధాటికి తట్టుకోలేక మహిళలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. రోజురోజుకు సమస్య తీవ్రతరమైంది. 48 గంటలకు దీక్ష చేసిన ఎమ్మెల్యే రాచమల్లు వరుసగా ఉన్న ఈ మద్యం షాపులను ఎత్తివేయాలని కోరుతూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి 2017లో 48 గంటలపాటు నిరసన దీక్ష చేపట్టారు. అప్పట్లో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి స్వయంగా వచ్చి ఎమ్మెల్యే చేత దీక్షను విరమింపజేశారు. ఆ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు హామీ ఇచ్చినా టీడీపీ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఆ హామీ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే రాచమల్లు తిరిగి ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 16న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ సీతారామిరెడ్డి, ఎస్ఐ కల్యాణ్‌తో కలసి నివాస ప్రాంతాల్లోని మద్యం షాపులను పరిశీలించి ఆయా ప్రాంతాల్లోని మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రామేశ్వరం రోడ్డుతోపాటు ఆర్ట్స్‌కాలేజీ నాలుగు రోడ్ల కూడలి, వైఎంఆర్ కాలనీ ఎంట్రెన్స్ వద్ద ఉన్న మద్యం షాపులను తొలగించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. పలువురు మద్యం షాపులు తిరిగి ఏర్పాటు చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఎమ్మెల్యే సూచన మేరకు రామేశ్వరంలోని నాలుగు, ఆర్ట్స్‌కాలేజీ నాలుగు రోడ్డు కూడలి, వైఎంఆర్ కాలనీ వద్ద ఉన్న మద్యం షాపులను ఈనెల 1వ తేదీ తొలగించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం షాపులను నియంత్రించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏటా 20 శాతం మద్యం దుకాణాలను రద్దు చేయాలని నిర్ణయించడం ఎమ్మెల్యేకు కలిసి వచ్చింది. . ఎమ్మెల్యేను అభినందించిన ప్రజా సంఘాలు గతంలో మద్యం షాపులను తొలగించాలని ఆందోళన చేయడంతోపాటు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా నివాస ప్రాంతాల్లోని మద్యం దుకాణాలను తొలగించాలని ఎమ్మెల్యే రాచమల్లు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజా సంఘాలు హర్షిస్తున్నాయి. సంఘాల నేతలు ఆగస్టు 18న స్థానిక ఎన్జీఓ హోంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడంతోపాటు ఎమ్మెల్యే రాచమల్లు ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, విరసం నేత వరలక్ష్మి, సీపీఐ, సీపీఎం నేతలు సుబ్బరాయుడు, సత్యం, చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మ, జమా అతె ఇస్లామి హింద్ అధ్యక్షుడు మహబూబ్‌ఖాన్ తదితరులు ఎమ్మెల్యేను అభినందించిన వారిలో ఉన్నారు. -
పండగ నేపథ్యంలో చుక్కకు కిక్కు!
తుర్కయాంజాల్‌కు చెందిన శంకర్: శుక్రవారం సాయంత్రం స్థానికంగా ఉన్న ఓ వైన్‌షాపునకు వెళ్లి క్వార్టర్ మద్యం కావాలని అడగ్గా... ఎమ్మార్పీపై అదనంగా రూ.10 ఇవ్వాలని చెప్పారు. ఎందుకని ప్రశ్నిస్తే.. మద్యం ధరలు పెరిగాయని సమాధానమిచ్చారు. దీంతో చేసేదేమీ లేక రూ.10 అదనంగా చెల్లించి క్వార్టర్ కొనుగోలు చేశాడు. ఎన్టీఆర్నగర్కు చెందిన రాములు ఆర్కేపురంలోని ఓ మద్యం దుకాణానికి వెళ్లి ఆఫ్ బాటిల్ కొనుగోలు చేయగా రూ.20అదనంగా తీసుకున్నారు. ఎందుకనిఅడిగితే... ‘ఇష్టం ఉంటేతీసుకో.. లేకపోతే లేదు’ అని చెప్పారు. మరోవైపు చీప్ లిక్కర్ కూడా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు.ఇది ఏదో ఒక్క ప్రాంతానికి పరిమితం కాదు.. గ్రేటర్‌లోని అన్ని దుకాణాల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. సాక్షి, సిటీబ్యూరో: మద్యం దుకాణాల లైసెన్స్ అయిపోయినప్పటికీ ప్రభుత్వం ఒకనెల గడువు పెంచడంతో ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘ఇష్టం ఉంటే తీసుకోండ’ని దురుసుగా సమాధానం ఇస్తున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆబ్కారీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నా... గడువు ముగిసింది కాబట్టి తమను ఏం చేయలేరనే ధీమాతో ఇలా చేస్తున్నారు. మరోవైపు దసరా పండగ రూపంలో అదృష్టం కలిసిరావడంతో వ్యాపారుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అధిక ధరలకే బహిరంగంగా విక్రయిస్తున్నా ఆబ్కారీ అధికారులు చర్యలు తీసుకోవ డం లేదన విమర్శలు వినిపిస్తున్నాయి. మళ్లీ దక్కదేమోనని... 2017–19 మద్యం పాలసీ ప్రకారం సెప్టెంబర్ 30తో లైసెన్స్ గడువు ముగిసింది. అయితే కొత్త పాలసీ సిద్ధం కాకపోవడంతో ప్రభుత్వం పాత దుకాణాలకే నెల రోజుల గడువు పెంచిన విషయం విదితమే. కొత్త పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. అక్టోబర్ చివరి వరకు ప్రస్తుత వ్యాపారులకు గడువు ఉంది. ఈ నెల ముగిశాక కొత్త పాలసీలో దరఖాస్తు చేసుకున్న వారికి లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు ఉంటుంది. దీంతో మళ్లీ దుకాణం వస్తుందో లేదోననే భావనలో ఉన్న వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. పండగ నేపథ్యంలో అందినకాడికి దండుకుంటున్నారు. ఎక్కడైనా అంతే... దసరాకు మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో ఉంటాయి. దీన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న వ్యాపారులు అందరూ కలిసి సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఆర్డినరీ మద్యం ఫుల్ బాటిల్‌పై రూ.40, మీడియం బ్రాండ్లపై రూ.80, ప్రీమియం బ్రాండ్లపై రూ.100 నుంచి రూ.150 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ కావడంతో వినియోగదారులు ఏ దుకాణానికి వెళ్లినా అదే రేటుకు విక్రయిస్తున్నారు. దీంతో ఏం చేయలేక అడిగినంత ఇచ్చి కొనుక్కుంటున్నారు. గ్రేటర్లో సాధారణంగా రోజుకు రూ.13 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. పండగ నేపథ్యంలో ఇవి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇదే అదనుగా వ్యాపారులు అధికాదాయం కోసం దోపిడీకి పాల్పడుతున్నారు. దసరా ధమాకా దసరా పండుగ సందర్భంగా గ్రేటర్లో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని అబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దసరా పండుగ నేపథ్యంలో ఏటా రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడుపోతుంది. సాధారణ రోజుల్లో జరిగే అమ్మకాలకు రెట్టింపు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. శని, ఆది వారాలు సెలవులు కావడంతో దసరాకు ముందుగానే ఊర్లకు వెళ్లే వారు మద్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో దుకాణాలు కిటకిటలాడాయి. గ్రేటర్లో 412 వైన్ షాపులు, 405 బార్లు ఉండగా దసరా పండుగతో అన్ని దుకాణాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. రూ.100 కోట్ల టార్గెట్... 2018 దసరా సందర్భంగా గ్రేటర్లో ఒక్క రోజు రూ.26 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. ఈసారిగడిచిన ఏడాది కంటే అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. చర్యలు తీసుకుంటాం మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఫిర్యాదులు వస్తే తనిఖీలు నిర్వహించి దుకాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిఘాపెంచుతాం. – మహ్మద్ యాసిన్ ఖురేషి,ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా -
నిషేధానికి తొలి అడుగు..
నెల్లూరు(క్రైమ్): సంపూర్ణ మధ్య నిషేధించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి తొలి అడుగుపడింది. విచ్చల విడిగా విక్రయాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. పలు ఆంక్షలతో విక్రయాలు జరిగాయి. నూతన మద్యంపాలసీ మంగళవారం అమలులోకి వచ్చింది. నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ జిల్లాల పరిధిలో 280 దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా నాలుగుచోట్ల మినహా మిగిలిన చోట్ల దుకాణాలన్నీ ప్రారంభమయ్యాయి. సూపర్వైజర్ల పర్యవేక్షణలో ఉదయం 11గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మద్యం విక్రయాలు సాగాయి. ప్రతి దుకాణం వద్ద వివరాలు, విక్రయవేళలు, ఎంఆర్పీ ధరలతో పాటు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ముద్రించిన ఫ్లెక్సీలు, బోర్డులను ఏర్పాటు చేశారు. పడిగాపులు కాసిన మందుబాబులు... గతంలో ఉదయం 10గంటలకే మద్యందుకాణాలు ప్రారంభమయ్యేవి. దీంతో మందుబాబులు పదిగంటల నుంచి మద్యసేవనంలో మునిగితేలేవారు. అయితే తాజాగా మారిన వేళల ప్రకారం ఉదయం 11గంటల నుంచి మద్యం దుకాణాలు తెరవడం, మందుబాబులు దుకాణాల వద్ద మద్యంకోసం పడిగాపులు కాశారు. రాత్రి 8 గంటలకు దుకాణాలు మూసివేస్తుండడంతో రాత్రి 7గంటల నుంచి క్యూకట్టారు. దీంతో దుకాణాలవద్ద కంట్రోల్‌చేయడం సిబ్బందికి కష్టతరంగా మారింది. ప్రారంభం కాని నాలుగు దుకాణాలు... నెల్లూరు నగరంలోని నిప్పోసెంటర్, బుజబుజనెల్లూరు, ఆత్మకూరు, ఉదయగిరి పట్టణాల్లో నాలుగుదుకాణాలు ప్రారంభం కాలేదు. పలు ప్రభుత్వ మద్యం దుకాణాలను నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ వి. రాధయ్య, నెల్లూరు, గూడూరు ఈఎస్‌లు కె. శ్రీనివాసాచారి, వెంకటరామిరెడ్డి తదితరులు పరిశీలించారు. ఆయా ప్రాంత సిఐలు షాపుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సిబ్బందికి పలు సూచనలు, సలహాలిచ్చారు. -
తొలిరోజు నిబంధనలకు తూట్లు
ద్వారకాతిరుమల: మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేయాలన్న ప్రభుత్వ ఆశయాలకు స్థానిక ఎక్సైజ్ శాఖ అధికారులు, గత సిండికేట్లతో కుమ్మకై ఆదిలోనే తూట్లుపొడుస్తున్నారు. ద్వారకాతిరుమలలో మంగళవారం ప్రారంభమైన ప్రభుత్వ మద్యం దుకాణం నిర్వహణ చూస్తే స్థానిక ఎక్సైజ్‌శాఖ అధికారుల డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ పాలసీ ప్రకారం మద్యం అమ్మకాల బాధ్యత పూర్తిగా సూపర్వైజర్లు, సేల్స్మెన్లదే. అదేవిధంగా ప్రభుత్వ నియమ, నిబంధనల అమలు తీరును పర్యవేక్షించాల్సిన బాధ్యత స్థానిక ఎక్సైజ్ శాఖ అధికారులది. దుకాణంలో బీరు బాటిల్స్‌ను కూలింగ్ లేకుండా విక్రయించాలి. దుకాణం వద్ద గానీ, పరిసరాల్లో గానీ కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిల్స్, షోడాలు, స్నాక్స్ వంటివి అమ్మకూడదు. చివరకు మందు బాబులు దుకాణం వద్ద తాగకుండా చూడాల్సిన బాధ్యత కూడా నిర్వాహకులదే. ఇక్కడ దుకాణం ప్రారంభించిన తొలిరోజే ఆ నిబంధనలన్నీ అటకెక్కాయి. దర్జాగా దుకాణం వెనుక రెండు ఫ్రిజ్‌లు, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, సోడాలు, స్నాక్స్ వంటివి దర్శనమిచ్చాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దుకాణం వెనుక వీటి విక్రయాలు జోరుగా సాగాయి. ఈ విషయం బయటకు పొక్కే సరికి రేకులు, టార్పాలిన్లు కప్పి దాచే ప్రయత్నం చేశారు. సిండికేట్ల ఒత్తిడితోనే.. కొత్త మద్యం పాలసీలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలించి, మద్యం దుకాణాల ఏర్పాటును పూర్తిగా కుదించి, నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ప్రభుత్వ ఆశయాలను సక్రమంగా అమలు చేసేందుకు స్థానిక ఎక్సైజ్ శాఖ అధికారుల నిఘా నిరంతరం దుకాణాలపై ఉండాలి. అయితే కంచే చేను మేసిన చందాన ఇక్కడి అధికారులు గత సిండికేట్ల ఒత్తిడికి తలొగ్గారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ద్వారకాతిరుమలలో క్షేత్ర పవిత్రత దృష్ట్యా, గతానికి భిన్నంగా మద్యం దుకాణాన్ని గ్రామ శివారులో ఏర్పాటు చేశారు. ఆ దుకాణం వెనుకే కూల్ డ్రింక్స్, సోడాలు, ఇతర తినుబండారాల అమ్మకాలు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. వీటిని విక్రయించింది దుకాణంలోని కొత్త సేల్స్‌మేన్‌లా.? లేక గత సిండికేట్‌దారుల అనుచరులా.? అన్నది స్థానిక ఎక్సైజ్ శాఖ అధికారులే చెప్పాలి. ద్వారకాతిరుమలలో మద్యం దుకాణం ప్రారంభించిన తరువాత మధ్యాహ్నం 1.30 గంటల వరకు అక్కడే ఉన్నానని భీమడోలు ఎక్సైజ్ ఎస్సై శ్రీనివాస్‌బాబు వివరణ ఇచ్చారు. దుకాణం వద్ద కూల్ డ్రింక్స్, స్నాక్స్ వంటివి ఏవీ విక్రయించలేదని తెలిపారు. దుకాణం వెనుక ఫ్రిజ్‌లు పెట్టిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. -
మద్యంతో పాటు ఉచితంగా స్నాక్స్..
పశ్చిమగోదావరి, భీమవరం: మద్యం ప్రియులకు తక్కువ ధరకే కిక్కెంచేందు వైన్ షాపుల యజమానులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 30తో పాత మద్యం విధానం ముగుస్తుండడంతో షాపుల్లో ఉన్న మద్యం నిల్వలను క్లియర్ చేసుకునేందుకు కొంతమంది యజమానులు మద్యం ధరల్లో ఆఫర్లు ఇవ్వడంతో పాటు మద్యం కొనుగోలు చేస్తే స్నాక్స్ ఉచితంగా ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు చెబుతున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో జిల్లా వ్యాప్తంగా 474 మద్యం షాపులు ఏర్పాటు చేశారు. వీటి కాలపరిమితి జూన్ నెలాఖరు నాటికే ముగిసినప్పటికీ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం షాపుల గడువును మూడు నెలల పాటు పొడిగించింది. అంతేగాకుండా మద్యం షాపుల్లో తప్పనిసరిగా ఎమ్మార్పీకే విక్రయించాలని, బెల్ట్‌షాపులను పూర్తిగా నిర్మూలించాలని ఎక్సైజ్‌శాఖను ఆదేశించడంతో గత మూడు నెలలుగా మద్యం షాపుల్లో ఎంఆర్పీ «విక్రయాలు చేస్తున్నారు. ఇదే తరుణంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంది. దాంతో పాటు గతంలో ఉన్న షాపుల సంఖ్యను 20 శాతం తగ్గించింది. దీనితో జిల్లాలో ప్రస్తుతం 379 షాపులు మాత్రమే ఏర్పాటు కానున్నాయి. భీమవరం ఎక్సైజ్ డివిజన్ ప్రాంతంలో 238, ఏటూరు పరిధిలో 236 షాపులు ఏర్పాటు కానున్నాయి. మద్యం షాపులను అద్దెకు తీసుకుని విక్రయాలకు సిబ్బందిని నియమించి వారికి జీతాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టింది. జూన్‌తో గడువు ముగిసిన షాపుల్లో కొంతమంది రెన్యువల్ చేసుకోకపోవడంతో వాటిలో 76 షాపులను సెప్టెంబర్ నెల నుంచి ప్రభుత్వమే నిర్వహిస్తోంది. నూతనంగా ఏర్పాటయ్యే మద్యం షాపుల్లో మద్యం విక్రయాల సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్ణయించారు. మద్యం షాపుల వద్ద ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలి, 18 ఏళ్లలోపు వయసు గల వారికి మద్యం విక్రయించకూడదనే నిబంధనలున్నాయి. గుడి, బడి, ఆసుపత్రులకు 100 మీటర్ల దూరంలోను జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంగా షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆఫర్లకు రంగం సిద్ధం గత రెండేళ్లుగా మద్యం షాపులు నిర్వహిస్తున్న వారికి ఈనెలాఖరునాటికి గడువు ముçగుస్తుండడంతో షాపుల్లోని సరుకును ఖాళీ చేసేందుకు షాపుల యజమానులు ఆఫర్లు ప్రకటించడానికి రంగం సిద్దం చేస్తున్నారు. షాపుల్లో మిగిలిపోయిన మద్యం ప్రభుత్వానికి తిరిగి అప్పగించి సొమ్ములు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువ మంది యజమానులు స్థానికంగానే సరుకును వదిలించుకునేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలిసింది. దీంతో మద్యం ధరలను ఎంఆర్పీ కంటే తగ్గించడంతో పాటు మద్యం షాపుల వద్దనే సేవించేవారికి కోడిగుడ్లు, కోడి పకోడి, అరటిపళ్లు వంటి స్నాక్స్‌ను ఉచితంగా అందించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్టు చెబుతున్నారు. కొంతమంది యజమానులు మద్యం షాపుల్లో గత నెల రోజుల నుంచి తక్కువ సరుకు పెడుతున్నప్పటికీ మద్యం జోరుగా విక్రయాలు జరిగే షాపుల్లో పెద్ద మొత్తంలో సరుకు నిల్వలున్నట్లు చెబుతున్నారు. దీనితో గడువు ముంచుకొస్తున్నందున సరుకును వదిలించుకునేందుకు ఆఫర్లు ప్రకటించనున్నారని చెబుతున్నారు. అయితే కొంతమంది సిండికేట్‌గా ఉన్న షాపుల యజమానులు తమ వద్ద మద్యం సరుకును సభ్యుల సంఖ్యను బట్టి వాటాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా మరికొంతమంది స్నేహితులు, బంధువులకు పంపకాలు చేయడానికి నిర్ణయించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద మద్యం పాలసీ మారడంతో మద్యం ప్రియులకు తక్కువ ధరకే మద్యం లభించడంతో పాటు ఉచితాలు కూడా దక్కనున్నాయని ప్రచారం జరుగుతోంది. -
మద్యం షాపులో పనిచేస్తా.. నిషేధానికి కృషి చేస్తా
సాక్షి, చెన్నేకొత్తపల్లి: అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం వెంకటంపల్లికి చెందిన ఈమె పేరు వన్నా స్వప్న. ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశారు. తానూ ప్రభుత్వ మద్యం దుకాణంలో పని చేస్తానంటూ సూపర్వైజర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. భర్త వ్యవసాయం చేస్తుండగా.. ఆ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన స్వప్నను.. మహిళగా ఈ ఉద్యోగం ఎలా చేయగలరని పలువురు ప్రశ్నించారు. ఆమె సమాధానమిస్తూ.. ‘నా భర్త మల్లికార్జునరెడ్డి సహకారంతోనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేశా. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. స్వచ్ఛమైన మనసుండాలే కానీ.. ఏ ఉద్యోగమైతే ఏంటి. నాకు ఈ ఉద్యోగమొస్తే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తా. మద్యం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తా’ అని చెప్పింది. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు సూపర్వైజర్స్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేల్స్‌మెన్ ఉద్యోగ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించినట్టు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ తెలిపారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, ఎక్సైజ్ అధికారులు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు. జిల్లాలో 198 సూపర్వైజర్ పోస్టులకు 5019 మంది, 495 సేల్స్‌మెన్ పోస్టులకు 4208 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఇందులో వికలాంగులు సూపర్వైజర్ ఉద్యోగాలకు 165 మంది, సేల్స్‌మెన్ ఉద్యోగాలకు 111 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరికి 1శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. గైర్హాజరైన వారిని అనర్హులుగా ప్రకటిస్తామన్నారు. 13న ఇంటర్వ్యూలు ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగాలకు (సూపర్వైజర్స్, సేల్స్‌మెన్) సంబంధించి ఈనెల 13న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ ఎస్. డిల్లీరావు తెలిపారు. ఇంటర్వ్యూలు ఉదయం 9 గంటల నుంచి కదిరి, కళ్యాణదుర్గం, అనంతపురం, పెనుకొండ, ధర్మవరం రెవెన్యూ డివిజినల్ అధికారి(ఆర్డీఓ) కార్యాలయాల్లో నిర్వహిస్తామని చెప్పారు. ముందుగా సూపర్వైజర్ పోస్టులకు, అనంతరం సేల్స్‌మెన్ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఆయా డివిజన్ల పరిధిలోని అభ్యర్థులు సంబంధిత ఆర్డీఓ అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరవ్వాలని సూచించారు. ఇంటర్వ్యూ బోర్డులో ఆర్డీఓ చైర్మన్‌గా, కో–ఆపరేటివ్, ఎక్సైజ్ అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సిన అభ్యర్థుల సెల్‌కు సంక్షిప్తం సందేశం పంపుతామని పేర్కొన్నారు. -
రాత్రి 9 గంటలకు మద్యం దుకాణం కట్టేయాల్సిందే
మద్యాన్ని ఆదాయ వనరుగా చూడబోమని, పేదల జీవితాలను రోడ్డున పడేస్తున్న మద్యపానాన్ని దశలవారీగా నిషేధిస్తామని హామీ ఇచ్చిన వైఎస్.జగన్మోహ న్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలి అడుగుగా జిల్లాలో 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించారు. 2024 నాటికి మద్యాన్ని కేవలం ఫైవ్‌స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడుతూ చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో ఆదివారం 55 ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. చిత్తూరు అర్బన్:జిల్లాలో గత ప్రభుత్వం మద్యం దుకాణాలకు ఉన్న పరిమితులను ఎత్తేస్తూ ఇష్టానుసారంగా లైసెన్సులు జారీ చేసింది. తద్వారా గుడి, బడి, రహదారుల వెంబడి ఏకంగా 430 మద్యం దుకాణాలు వెలశాయి. దీనికితోడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ప్రతి గ్రామంలో కనీసం ఐదు వరకు బెల్టు దుకాణా లు ఏర్పాటు చేసి, ఆ పార్టీ నాయకులకు ఉపాధి కేంద్రాలను కల్పించారు. ఫలితంగా మద్యానికి బానిసవుతున్న పేదల కుటుంబాలను రోడ్డున పడేసిన దృశ్యాలు కోకొల్లలు. మద్యపానాన్ని కొందరికే పరిమితం చేసి, పేదలకు దాన్ని దూరం చేస్తామని మాటిచ్చిన వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ఉన్న దుకాణాల్లో 20 శాతం తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మద్యం లైసెన్సులు దక్కించుకున్న వారికి దాసోహమంటూ సాగిలపడ్డ గత పాలకుల వైఖరిని పూర్తిగా పక్కన పెడుతూ ఆదాయం లేకున్నా పర్లేదని ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పా టు చేశారు. దీనివల్ల జిల్లా నుంచి ప్రభుత్వానికి ఏటా రూ.వందల కోట్లలో ఆదాయం పోతున్నా పేదల కుటుంబాల్లో మద్యం రాకాసిని పారదో లేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. కిక్కు దిగాల్సిందే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు ఇప్పటికే ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నిరుద్యోగుల ఎంపిక, శిక్షణ పూర్తి చేశారు. మరో రెండు రోజుల్లో వీరు దుకాణాల్లో పనిచేయనున్నారు. దుకాణాలన్నీ ప్రభుత్వానివే కావడంతో అమ్మకాల్లోనూ సర్కారు కఠినంగా వ్యవహరి స్తోంది. జిల్లాలోని 55 మద్యం దుకాణాల్లో 21 ఏళ్లలోపు వయసు వారికి మద్యం విక్రయించవద్దని నిబంధనలు విధించారు. ఇప్పటి వరకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉన్న మద్యం విక్రయ వేళల్లో గంట కాలాన్ని కుదించారు. దుకాణాలన్నీ రాత్రి 9 గంటలకే మూసేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని దుకాణాల్లో తప్పనిసరిగా ఎమ్మార్పీని అమలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు జిల్లాలోని తిరుపతి ఎౖసజ్ పరిధిలో 34 ప్రభుత్వ దుకాణాలు తెరుచుకున్నాయి. పాకాల సర్కిల్లో 5, శ్రీకాళహస్తి 5, సత్యవేడు 6, పుత్తూరు 8, తిరుపతి అర్బన్ 4, తిరుపతి రూరల్‌లో 3 దుకాణాలున్నాయి. చిత్తూరులో 21 దుకాణాలు ఏర్పాటవగా చిత్తూరు రూరల్‌లో 6, మదనపల్లె 1, ములకలచెరువు 3, పుంగనూరు 4, పలమనేరు 2, వాయల్పాడులో ఒక దుకాణం ఏర్పాటు చేశారు. వచ్చేనెల 286 దుకాణాలు గతంలో ఉన్న 430 దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం ఏటా 20 శాతం దుకాణాలను తొలగించనుంది.ప్రస్తుతం జిల్లాలో ఉన్న 55 మద్యం దుకాణాలకు అదనంగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మరో 286 దుకాణాలు ఏర్పాటుకానున్నాయి. ఇలా ఏటా 20 శాతం దుకాణా లు తగ్గించి, రానున్న ఐదేళ్లలో అన్ని దుకాణా లను తీసేసి, స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యాన్ని అందుబాటులో ఉంచనుంది. -
మద్యం షాపు అద్దె ఒక్క రూపాయే!
సాక్షి, ఏలూరు టౌన్ : త్వరలో ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాలకు సంబంధించి అద్దెకు షాపుల ఎంపిక ప్రక్రియను ఆబ్కారీ శాఖ అధికారులు శనివారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో చేపట్టారు. అయితే, అద్దె షాపుల ఎంపికకు అధికారులు ఓపెన్ టెండర్లను స్వీకరించగా ఇందుకు తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. ముఖ్యంగా ఏలూరు, పెదవేగి మండలాల పరిధిలో ఒకరికొకరు పోటీపడి అతి తక్కువ ధరకే షాపులు అద్దెకిచ్చేందుకు ఒప్పుకోవటం గమనార్హం. కేవలం రూ.1కే షాపును ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఏలూరు నగరంలోని 30వ డివిజన్లో షాపు, పెదవేగి మండలం కూచింపూడి, కొప్పులవారిగూడెం, కొప్పాక గ్రామంలోని మద్యం దుకాణాలను రూ.1కే ప్రభుత్వానికి అద్దెకు ఇస్తున్నారు. -
వామ్మో.. బీరు సీసాలో తేలు
పరకాల: బీరు సీసాలో తేలు అవశేషాలు కనిపించిన ఘటన పరకాల పట్టణంలోని ఓ వైన్స్షాపులో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటన మద్యం ప్రియులను కలవరానికి గురి చేసింది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల ఆర్టీసీ డిపో సమీపంలోని వెంకటేశ్వర వైన్స్‌లో రాకేష్ ఓ కంపెనీకి చెందిన లైట్ బీరు కొనుగోలు చేశాడు. సీసా నలుపు రంగులో ఉండటంతో సీసాలోని బీరు మొత్తం పూర్తయ్యేంత వరకు తేలు ఉన్న విషయాన్ని గమనించలేకపోయాడు. బీరు సీసా అడుగు భాగంలో తేలు కనిపించడంతో విషయాన్ని వైన్స్ యాజమాని దృష్టికి తీసుకెళ్లాడు. దీనికి ఆ యాజమాని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. తాము ఏమైనా తయారు చేశామా అని షాపు యాజమాని అనటంతో కొద్ది సేపు మద్యం కొనుగోలు దారులతో గొడవ జరిగింది. తేలు అవశేషాలు ఉన్న బీరు త్రాగటంతో బాధితుడు ఆందోళనకు గురయ్యాడు. ఘటనను పరకాల ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తాము విచారణ జరుపుతామని అధికారులు తెలపడంతో గొడవ సద్దుమణిగింది. అసలే వేసవి కాలం..బీరు పట్ల ఎక్కువగా ఇష్టపడే మద్యం ప్రియులు బీరు సీసాలో తేలు రావడంతో అయోమయానికి గురయ్యారు. -
వైన్ షాప్‌ల వద్ద తెలుగు తమ్ముళ్ల హల్చల్
-
హంతకులను పట్టించిన మద్యం సీసా మూత
సాక్షి, నాగోలు: మద్యానికి బానిసైన భర్త తరచూ వేధింస్తుండడంతో పాటు తన తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుండడాన్ని సహించలేని ఓ మహిళ తన బంధువులతో కలసి భర్తను హత్య చేసింది. ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో శనివారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. శామీర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో అద్రాస్పల్లి గ్రామానికి చెందిన బోణి శ్రీనివాస్‌కు 14 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన స్వప్నతో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. కూలిపని చేసే శ్రీనివాస్ మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తున్నాడు. అత్తమామలను సైతం ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో శ్రీనివాస్‌ను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నారు. స్వప్న తన మేనమామ తీగళ్ల యాదగిరిని సంప్రదించగా అందుకు అంగీకరించిన అతడు స్వప్న కుటుంబ సభ్యుల నుంచి కొంత నగదు మొత్తం అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. యాదగిరి అతడి స్నేహితుడు రమేష్, స్వప్న, ఆమె తల్లి లక్ష్మి, తండ్రి మల్లేశం కలిసి హత్యకు పథకం పన్నారు. గతనెల 29న యాదగిరి, రమేష్ శ్రీనివాస్‌కు మద్యం తాగించి ధర్మవరం ప్రాంతంలోని రవలకోలు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్‌ను హత్య చేసి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. శ్రీనివాస్ కనిపించకపోవడంతో ఇతడి తల్లి శామీర్‌పేట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అడవిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడు శామీర్‌పేట పరిధిలో అదృశ్యమైన శ్రీనివాస్‌గా గుర్తించి దర్యాప్తు చేపట్టారు. పట్టించిన మద్యంసీసా మూత.. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సంఘటనా స్థలంలో ఓ మద్యం సీసా మూత లభించింది. దానిపై ఉన్న బార్కోడ్ ఆధారంగా పూడూరు ఎక్స్‌రోడ్‌లో జైదుర్గ వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వైన్స్ షాప్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా యాదగిరి, రమేష్, మృతుడు శ్రీనివాస్‌ను బైక్‌పై తీసుకెళుతుండడాన్ని గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. హత్య తో సంబంధం ఉన్న శ్రీనివాస్ భార్య స్వప్న, అత్తమామలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
కళ్ల ముందే ప్రాణంపోయినా లెక్కలేదా?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మద్యం దుకాణంలో మద్యం సేవిస్తూ కీ బోర్డ్ కళాకారుడు హఠాన్మరణం చెందిన ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు చెందిన మద్యం సిండికేట్ దుకాణంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖ నగరంలోని మర్రిపాలెంకు చెందిన ఎం.తిరుమలరావు(48) కీ బోర్డ్ ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు. ఎంవీపీ కాలనీ 7వ వార్డులోని శ్రీ సాయిరామ శక్తి లింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సాంస్కృతిక కార్యక్రమాలకు కీ బోర్డ్ ప్లే చేసేందుకు వచ్చాడు. సాయంత్రం 6 గంటల సమయంలో ఆలయానికి సమీపంలోని శ్రీ జయ వైన్స్‌లో మద్యం సేవించేందుకు వెళ్లాడు. అక్కడ మద్యం తాగుతూ తిరుమలరావు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయినా మద్యం దుకాణం నిర్వాహకులు పట్టనట్టే వ్యవహరించారు. విషయం తెలిసి సమీపంలోని దేవాలయ కమిటీ అధ్యక్షుడు సింహాద్రిబాబు, స్థానికులు వైన్ షాపు వద్దకు చేరుకున్నారు. ‘108’కి సమాచారం చేరవేయగా ఇప్పుడు రావడం కుదరని అంబులెన్స్ సిబ్బంది ఫోన్ పెట్టేశారు. బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేయాలని షాపు నిర్వాహకులను కోరగా వారు నిరాకరించారు. ఆటోలో తీసుకుపోండని గదమాయించారు. స్థానికులు, దేవాలయ కమిటీ సభ్యులు ఆందోళన చేపట్టగా.. ఎట్టకేలకు ప్రైవేట్ అంబులెన్స్‌ను పిలిపించారు. అయితే అప్పటికే తిరుమలరావు మృతి చెందినట్టు అంబులెన్స్ సిబ్బంది తేల్చిచెప్పారు. అనంతరం తిరుమలరావు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. కళ్ల ముందే ప్రాణంపోయినా లెక్కలేదా? ఓ వ్యక్తి తమ దుకాణంలో మద్యం తాగుతూ మరణించినా వైన్ షాపు నిర్వాహకులు స్పందించకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపులో కళ్ల ముందే ఓ ప్రాణం పోయినా ఏమీ జరగనట్టు రాత్రి పదిన్నర దాకా యథావిధిగా మద్యం విక్రయాలు కొనసాగించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మద్యం సిండికేట్‌కు చెందిన ఈ మద్యం దుకాణాన్ని అనుమతులు లేకపోయినా పూర్తిస్థాయి బార్ అండ్ రెస్టారెంట్‌గా మార్చేశారు. అయినా ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఇప్పటివరకు పట్టించుకోలేదు. కాగా, తిరుమలరావు కల్తీమద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకున్నాడా లేక మద్యం సేవిస్తూ గుండెపోటుతో మృతిచెందాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ మందో కాదో తేలుస్తాం: ఎక్సైజ్ సీఐ తిరుమలరావు తీసుకున్నది కల్తీ మందా లేక గుండెపోటుతోనే మరణించాడా అనే దానిపై విచారణ చేపట్టామని ఎక్సైజ్ సీఐ బాపినాయుడు తెలిపారు. అతను తీసుకున్న మద్యం శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తామని, కల్తీ మద్యం తీసుకున్నట్టు తేలితే వైన్ షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
మద్యం మత్తులో ఘర్షణ
తూర్పుగోదావరి , కాకినాడ క్రైం: మద్యం షాపులో తలెత్తిన చిన్నపాటి ఘర్షణ కొట్లాటకు దారి తీసింది. ఒకరిపై ఒకరు బీరు సీసాలతో దాడికి తెగబడడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి కథనం ప్రకారం.. కాకినాడ సాంబమూర్తినగర్ సమీపంలోని పావురాల తూము వద్ద ఉన్న సూర్య రెస్టారెంట్ అండ్ బార్ లో దుమ్ములపేటకు చెందిన కొయ్యా పెద బూసియ్య, గరికిన రాజు, వసుపిల్లి యల్లారావు అనే ముగ్గురు మత్స్యకారులు మద్యం తాగుతున్నారు. అదే సమయంలో దుమ్ములపేట సమీపంలోని కొత్తపాకలు ప్రాంతానికి చెందిన పిండ్రాల పరమేష్ అదే షాపులో మద్యం తాగుతున్నాడు. మత్స్యకారులు మద్యం మత్తులో మద్యం గ్లాసులను పగుల కొడుతున్నారు. ఆ సమయంలో పక్కనే మద్యం తాగుతున్న పరమేష్ వారిని గ్లాసులను ఎందుకు పగలుకొడుతున్నారని, దీని వల్ల ఇతరులకు ఇబ్బంది అని ప్రశ్నించాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న వారు పరమేష్‌ను నోటిపై బలంగా గుద్దాడు. దీంతో కింద పడిపోయిన పరమేష్ పైకి లేచి అతడిని కొట్టిన మత్స్యకారుడిపై దాడికి దిగాడు. దీంతో ముగ్గురు మత్స్యకారులు కలసి పరమేష్‌పై దాడి చేసి కొట్టారు. దీంతో ఆగ్రహించిన పరమేష్ అక్కడ తాను తాగుతున్న బీరు సీసాలను బద్దలు కొట్టి పెద బూసియ్య, గరికిన రాజు, వసుపిల్లి యల్లారావులపై దాడి చేశాడు. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు కలసి పరమేష్‌పై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కొయ్యా పెద బూసియ్యకు మెడ ఎడమ భాగంలో గాయం కాగా, గరికిన రాజుకు తలకు కిందిభాగంలో చెవి పక్కన కోసుకుపోయింది. వసుపల్లి యల్లారావుకు తలకు, కంటిపైభాగంలో రక్తపుగాయమైంది. పరమేష్ కింది పెదవి సగభాగం తెగి కిందపడిపోయిందని సర్పవరం పోలీసులు వివరించారు. మత్స్యకారులపై దాడిని ఆగ్రహించిన వారి బంధువులు సూర్య బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ధర్నా నిర్వహించారు. రాకపోకలను స్తంభింపజేశారు. గాయపడిన వ్యక్తులను సర్పవరం ఎస్సైలు ఎండీ ఎంఆర్ ఆలీఖాన్, సత్యనారాయణరెడ్డి కాకినాడ జీజీహెచ్‌లో పరామర్శించి సంఘటన వివరాలను తెలుసుకున్నారు. దీనిపై ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నలుగురు వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. బాధితులను, వారి కుటుంబ సభ్యులను సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పరామర్శించి, మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులను కోరారు. -
క్షణ క్షణం...
రాత్రి ఏడు కావస్తోంది.రోడ్డు దాటుతున్న అతన్ని ఎదురుగా వచ్చిన కారు గుద్దింది. కారు ముందుభాగం అంచు తగలడంతో తుళ్లిపడి విసురుగా వెనక్కు తూలిపడ్డాడతను. చేతిలోని న్యూస్‌పేపర్ చుట్టిన కవర్ దూరంగా పడి అందులోని బాటిల్ బద్దలైంది. ఒక్కసారిగా విస్కీ వాసన గుప్పుమంది.అతనికి పెద్దగా దెబ్బలు తగల్లేదు. డ్రైవింగ్ సీటులోని అమ్మాయి డోరు తెరుచుకుని అతన్ని సమీపించింది. ‘‘సారీ సర్! తప్పయిపోయింది’’ అందామె అపరాధం చేసినట్టు.‘‘ఐయామ్ ఓకే, డోంట్ వర్రీ’’ అని చెప్పి, దూరంగా పడిన ప్యాకెట్ అందుకుని జాగ్రత్తగా తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో పడేశాడు. అది ట్రాఫిక్ లేని రోడ్డుకావడంతో జనం మూగలేదు.‘‘మీకు నేను వేరే బాటిల్ కొనిస్తాను’’ చెప్పిందామె. ‘‘అవసరం లేదు. షాపు మూసేశారు’’ తాపీగా అన్నాడతను.ఆమె వైన్‌షాపు వైపు దృష్టి సారించి, ఆ తర్వాత అతన్ని ఆశ్చర్యంగా చూసింది. ఆ హడావుడిలో కూడా వెనుక వైపు వైన్‌షాపు షట్టర్ మూసిన శబ్దం అతను విన్నాడని గ్రహించడం వల్ల కలిగిన ఆశ్చర్యం అది.‘‘ఇప్పుడు మీకేమైనా పని ఉందా?’’ అడిగిందామె.‘‘లేదు’’ చెప్పాడతను.‘‘ఇంట్లో బోర్ కొడుతుంటే షాపింగ్‌కి వచ్చాను. మీరు కలిశారు. నా దగ్గర స్కాచ్ ఉంది’’అతను మౌనంగా ఉండిపోయాడు. ‘‘అనుమానాలు పెట్టుకోవద్దు. ఇంట్లో ఎవరూ లేరు’’ నవ్వుతూ చెప్పిందామె.‘‘పదండి’’ అన్నాడతను ఒక నిర్ణయానికి వచ్చినట్టు.ఇద్దరూ ఎక్కాక కారు బయల్దేరింది. ఆ వీధిలోంచి కుడివైపు తిప్పి మెయిన్ రోడ్డులోని ట్రాఫిక్‌లోకి పోనిచ్చింది కారు. ఢిల్లీ నగరంలో సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. ‘‘మీ పేరు?’’ అడిగాడతను.‘కీర్తన’’ డ్రైవింగ్ మీద నుంచి దృష్టి మరల్చకుండానే చెప్పింది.‘‘ఏం చేస్తుంటారు?’’‘‘సాఫ్ట్వేర్ ఇంజనీర్ని... మీరేం చేస్తుంటారు?’’ అడిగిందామె.‘‘సెక్రటరియేట్లో యూడీసీని. ఆఫీసు అయ్యాక మందు కొనుక్కుని రూమ్‌కు తీసుకుపోవడం అలవాటు. ఈ వైన్‌షాపుకి వస్తూ హోటల్లో దాల్ రోటీ తీసుకుంటాను. మళ్లీ రేపు ఉదయమే బయటికొచ్చేది’’ వివరించాడతను.సెంట్రల్ బస్టాండ్ దాటాక ఓ కాలనీలోకి తిరిగి, ఒక ఇంటి ముందు ఆగింది కారు. ఆమె కారు దిగి గేటు తాళం తీసి, కారు లోపల పార్క్ చేశాక గేటుకి లోపలి నుంచి తాళం వేసింది. ఇంట్లో కాలుపెట్టిన మరుక్షణం విశాలమైన హాలు ఎదురైంది. హాల్లో రెండు పెద్ద సోఫాలు, నాలుగు కుర్చీలు, మధ్యలో టీపాయ్ ఉన్నాయి. టీపాయ్ మీద న్యూస్‌పేపర్, టెలిఫోన్, మోడెమ్ కనిపిస్తున్నాయి. గోడలకు రకరకాల పెయింటింగ్స్. కిటికీలకు అందమైన కర్టెన్లు వేలాడుతున్నాయి.‘‘కాఫీ తాగుతారా? టీనా?’’ అడిగిందామె.‘‘టీ...’’ చెప్పాడతను.‘‘పేపర్ చూస్తూ ఉండండి. ఇప్పుడే వస్తాను’’ చెప్పి లోపలికి నడిచిందామె.న్యూస్‌పేపర్ అందుకుంటూ టీపాయ్ వంక చూశాడు. న్యూస్పేపరుకి, టెలిఫోనుకి మధ్య యాష్ ట్రే ఉంది. దాని నిండా కాల్చిపడేసిన సిగరెట్ పీకలు. అవి రెండు బ్రాండ్లకు చెందినవి.పదినిమిషాల్లో ట్రేతో వచ్చిందామె. ఒక కప్పు అతనికిచ్చి తనొకటి తీసుకుంది. టీ తాగడం అయ్యాక ఖాళీ కప్పులు ట్రేలో పెట్టుకుని చెప్పింది.‘‘బట్టలు మార్చుకుని వస్తాను’’అతను తలూపి సిగరెట్ వెలిగించి లేచి గోడలకు వేలాడుతున్న పెయింటింగ్స్ చూడసాగాడు. సరిగా మూడు నిమిషాలకు అతని శరీరం తూలింది. వెంటనే తూటా దెబ్బతిన్న పిట్టలా నేలకూలిపోయాడు.వేళ్ల మధ్య నుంచి జారి పక్కకు దొర్లింది సిగరెట్.ఆ చప్పుడుకి బయటకొచ్చి కిందపడి ఉన్న అతన్ని చూసి చిన్నగా నవ్వుకుంది. ఒంటరిగా సింహాన్ని బోనులో బంధించానన్న గర్వం ఆమె మనసులో కలిగింది. చన్నీళ్లు ముఖం మీద పడటంతో అతను కళ్లు తెరిచాడు. ఎదురుగా ముగ్గురు వ్యక్తులతో పాటు కీర్తన నిలబడి ఉంది. ‘‘టీలో ఏం కలిపావు..?’’ ఏమీ జరగనట్టు నవ్వుతూ అడిగాడు కీర్తనని. ఆమె ముఖం పక్కకి తిప్పుకుంది. ముగ్గురు మగాళ్ల చేతుల్లో రివాల్వర్స్ ఉన్నాయి.‘‘మేము అడిగిన సమాచారం చెబితేనే నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వెళతావు. లేదంటే ఇక్కడే సమాధి అవుతావు.’’ చెప్పాడు ముగ్గురిలో సన్నగా ఉన్న వ్యక్తి. అతని ముఖం నిండా స్ఫోటకం మచ్చలు. వారందరికీ అతనే నాయకుడని మిగతావారి బాడీ లాంగ్వేజీని బట్టి తెలుస్తోంది.‘‘రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ హెడ్‌క్వార్టర్స్ ఎక్కడ?’’ అడిగాడు స్ఫోటక మచ్చల వ్యక్తి.‘‘నాకు తెలీదు’’ చెప్పాడతను.ఆ వ్యక్తి చెయ్యి మెరుపులా కదిలింది. అతని చెంపకి బలంగా తగిలి ఫట్మనే చప్పుడొచ్చింది. ఆ బాధ తట్టుకోవడానికి కొన్ని క్షణాల పాటు కళ్ల మూసి తెరిచాడతను.‘‘నేను ఢిల్లీ ప్రభుత్వ సెక్రటరియేట్లో క్లర్కుగా చేస్తున్నాను. నా పేరు రామస్వామి నాయర్. కావాలంటే నా ఐడెంటిటీ చూడండి’’ అన్నాడు. ఆ వ్యక్తి శబ్దం రాకుండా నవ్వాడు.‘‘నువ్వు రా ఏజెంట్ మిస్టర్ ఎక్స్ అని నాకు తెలుసు. నిన్ను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాం’’ అని కీర్తన వైపు చూసి తలూపాడు. ఆమె లోపలికి వెళ్లి అరచేతిలో ఇమిడిపోయే ఎలక్ట్రానిక్ పరికరంతో తిరిగొచ్చింది.దాన్ని చూడగానే అతని ముఖం కళ తప్పింది. కంటికి కనిపించకుండా దాచిన మైక్రోచిప్స్‌ను కనుక్కునే లేటెస్ట్ డిటెక్టర్ అది. తను ఊహించిన దానికంటే ప్రమాదకరమైన వ్యక్తుల మధ్య ఉన్నానని అతనికి అర్థమైపోయింది. కీర్తన ఆ డిటెక్టర్‌తో అతని శరీరం మొత్తం చెక్ చేసింది. కుడికాలి పిక్క దగ్గర బీప్ అనే చప్పుడు చేసిందా పరికరం.‘‘అది నీ ఐడెంటిటీ కదూ!’’ అన్నాడు స్ఫోటకం మచ్చల వ్యక్తి.అతను మాట్లాడలేదు. హోం మినిస్టర్ దగ్గర ప్లాంట్ చేసిన రా ఏజెంట్ అతను. ఎవరో తనను వెంటాడుతున్నారని పది రోజుల కిందట గ్రహించాడు. తన ప్రవర్తనలో ఏమాత్రం తేడా వచ్చినా పిట్ట ఎగిరిపోతుందని, మెడికల్ లీవు తీసుకున్నాడు. శత్రువు గురించి తెలుసుకోవాలంటే తెగించాలి. అంతా అనుకున్నట్టే జరిగింది. కాని ఆమె వెనుక శత్రు గూఢచారులు ఉన్నారనేది కొత్త సంగతి.దేశ రాజధాని కాబట్టి ఢిల్లీకి నిత్యం లక్షలాది మంది వచ్చి పోతుంటారు. అలా వచ్చిన వాళ్లందరి మీదా నిఘా ఉంచడం సాధ్యంకాని పని. అయినా రకరకాల రూపాల్లో ఏజెంట్లు సంచరిస్తూ ఉంటారు. ఎవరి మీదైనా అనుమానం కలిగితే అంత తేలిగ్గా వదిలిపెట్టరు. అలాంటి పరిస్థితిలో రా వంటి ముఖ్యమైన గూఢచారి శాఖలోని ఒక ఏజెంట్‌ని వాచ్ చేయడమంటే మాటలు కాదు.ఎవరో సమాచారం లీక్ చేసి ఉండాలి. అతని ఆలోచనలు సాగుతుండగానే ఒక వ్యక్తి అతన్ని సమీపించి, ఫ్యాంట్‌ను కుడి మోకాలి వరకు లాగాడు. కీర్తన మరోసారి డిటెక్టర్‌తో చెక్ చేసింది. ఈసారి కూడా బీప్ శబ్దం వచ్చింది. పరీక్షగా చూస్తే అక్కడ చర్మం గీరుకున్నట్టు పొడవుగా మచ్చ. ఆ భాగంలో చాకును గుచ్చి కండను పెకలించాడు ఆ వ్యక్తి.అతని శరీరం బాధతో మెలి తిరిగింది. కదలకుండా కట్టేసినా అతని బలానికి కుర్చీ చప్పుడు చేసింది. కండతో పాటు చిప్ బయటపడింది. దాన్ని నేల మీద పడేసి బూటు కాలితో నలిపేశాడా వ్యక్తి.‘‘ఇప్పుడు మనకి ముసుగులు లేవు. మేము శత్రు గూఢచారులమని, నువ్వు ఈ దేశ ప్రధాన గూఢచారి సంస్థ రా ఏజెంటువని తేలిపోయింది. నువ్వు మాకు సహకరిస్తే ప్రాణాలతో ఉంటావు’’ చెప్పాడు స్ఫోటక మచ్చల వ్యక్తి.అంతవరకు పంటి బిగువున బాధ భరించిన అతను తలెత్తి నవ్వుతూ అడిగాడు... ‘‘రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ హెడ్‌క్వార్టర్స్ ఎక్కడ ఉందో తెలిస్తే ఏం చేస్తావు?’’ అని.‘‘మా పథకాలు మాకున్నాయి’’ అన్నాడతను.‘‘మీరు ఎన్ని పథకాలు వేసినా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ హెడ్‌క్వార్టర్స్‌ను కనుక్కోలేరు. ఆ సంగతి తెలియక సమయం వృథా చేసుకుంటున్నారు. అసలు దానికి హెడ్‌క్వార్టర్స్ లేదు’’స్ఫోటక మచ్చల వ్యక్తి ముఖం తెల్లగా పాలిపోయింది. అతని పక్కన నిలబడిన వ్యక్తి కత్తిని భుజంలో గుచ్చాడు. బాధతో అతని శరీరం వణికింది. అప్పటికే కుడికాలి పిక్క నుంచి కారిన రక్తం పాదం చుట్టూ మడుగులా ఏర్పడింది.‘‘కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి నిజం చెప్పు’’ అరిచాడు కత్తి భుజంలోకి దించిన వ్యక్తి.‘‘ఎంత హింసించినా నా దగ్గరలేని సమాచారం తెలుసుకోలేరు. రా ఏజెంట్లు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలీదు. ఎవరికి వారు స్వతంత్రంగా ఉంటారు. వారితో అవసరం వచ్చినప్పుడు బాస్ లేదా అతని అసిస్టెంట్లు ఏదో హోటల్లో కలుస్తారు. వారికి చెయ్యాల్సిన పని అప్పగిస్తారు. ఇదంతా మూడో కంటికి తెలియకుండా జరుగుతుంది’’ చెప్పాడతను. భుజం నుంచి కారిన రక్తం షర్టుని తడిపేస్తోంది.‘‘పని పూర్తయ్యాక ఎక్కడ రిపోర్టు చేస్తారు?’’ అడిగింది కీర్తన. ‘‘అతనికి అన్‌లిస్టెడ్ నంబర్ ఒకటి ఇస్తారు. ఆ నంబర్‌కి కాల్ చేస్తే కలుసుకోవాల్సిన చోటు తెలుస్తుంది.’’‘‘అతను మరణిస్తే’’‘‘చావడం అనేది ఈ వృత్తిలో ఒక భాగం. నిర్ణీత సమయానికి కాల్ చేయాల్సిన ఏజెంట్ నుంచి సమాచారం రాకపోతే అతను ప్రమాదంలో చిక్కుకున్నట్టే. వెంటనే తమ సోర్స్ ద్వారా అతని పరిస్థితి తెలుసుకోవడానికి రా ప్రయత్నిస్తుంది.’’అక్కడ కొన్ని క్షణాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. హఠాత్తుగా స్ఫోటక మచ్చల వ్యక్తి అడిగాడు.‘‘నీకిచ్చిన అన్‌లిస్టెడ్ నంబర్ ఎంత?’’అంత నీరసంలో కూడా అతను నవ్వాడు.‘‘అది తెలుసుకోవడం నీ తరం కాదు’’ చెప్పాడు. ఆవేశంతో స్ఫోటక మచ్చల వ్యక్తి ముఖం ఎర్రబడింది. రివాల్వర్ అతని తలకి గురిపెట్టాడు.ఇంతలో కాలింగ్‌బెల్ మోగింది.కీర్తన వైపు చూసి తలూపాడు స్ఫోటక మచ్చల వ్యక్తి. వెంటనే అతని నోట్లో కర్చీఫ్ దూర్చి.. ఆ గది తలుపులు మూశారు. ఒక వ్యక్తి తలుపు చాటున, మరో అతను కర్టెన్ వెనుక, మూడో అతను రెండో గది గుమ్మం పక్కన పొజిషన్ తీసుకున్నారు. వెనక్కి తిరిగి అంతా సవ్యంగా ఉందని గ్రహించి, మెయిన్ డోర్ దగ్గరకు నడిచింది కీర్తన. సెక్యూరిటీ హోల్ నుంచి బయటకు చూసింది. టెలి కమ్యూనికేషన్స్ ఉద్యోగి నిలబడి ఉన్నాడు. అతను ఎప్పుడూ వచ్చేవాడిలా గుర్తించి, వెనక్కి తిరిగి తలూపింది కీర్తన. ఆ ముగ్గురూ తేలిగ్గా ఊపిరి తీసుకుని మొదటి గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నారు. ‘‘నెట్ పనిచేయడం లేదని కంప్లైంట్ ఇచ్చారు మేడమ్’’ అని చెప్పి లోపలకు వచ్చాడు ఆ ఉద్యోగి. తిన్నగా ఫోన్ దగ్గరకు నడిచి రిసీవర్ అందుకుని చెవి దగ్గర పెట్టుకున్నాడు. రిసీవర్ పెట్టేసి మోడెం స్విచాఫ్ చేశాడు.అతన్ని జాగ్రత్తగా గమనిస్తోంది కీర్తన.ఆమె ఉలికిపాటుగా వెనక్కి తిరిగే లోపు ఒక మనిషి కీర్తన నోరు మూసి కదలకుండా పట్టుకున్నాడు. ఆటోమేటిక్ ఆయుధాలతో కమెండోలు లోపలకు ప్రవేశించారు. ఎలాంటి రక్తపాతం లేకుండా అక్కడున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మిలటరీ హాస్పిటల్లో ఆ ఏసీ రూమ్ తలుపు తెరుచుకుని లోపలకు వచ్చిన ఆయన్ని చూసి అంత నీరసంలో కూడా ఉలిక్కిపడ్డాడతను. మంచం పక్కనున్న టేబుల్ మీద ఫ్రూట్బ్యాగ్ ఉంచి స్టూల్ మీద కూర్చుని అభిమానంగా అడిగాడు. ‘‘హౌ ఆర్యూ మై బోయ్’’‘‘ఫైన్ సర్!’’ చెప్పాడతను వినయంగా.ఆయనకు అరవైదాక ఉంటుంది వయసు. జనంతో కిటకిటలాడే కన్నాట్ ప్లేస్‌లో వాకింగ్‌కి వెళితే రిటైరైన ఉద్యోగిలా ఉంటాడు. సినిమాహాలు క్యూలో నిలబడితే ఆ వయసులో ఏమీ తోచక సినిమాకు వచ్చినవాడిలా కనిపిస్తాడు. అంతే తప్ప అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతదేశ గూఢచర్య నెట్‌వర్క్‌ను లీడ్చేస్తాడని, ఏ సమయంలోనైనా రాష్ట్రపతి, ప్రధాని వంటి వారిని కలవడానికి అనుమతి పొందిన అరుదైన వ్యక్తి అని కనీసం ఊహించడానికి కూడా వీలుకానంత మామూలుగా ఉంటాడాయన.‘‘ఆ ఇంట్లోని నలుగురినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించాం. ఒకతను సైనైడ్ గుళిక మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్లంతా ఎక్స్‌ప్లోజివ్స్ మీద శిక్షణ పొందిన వాళ్లు. ఆ ఇంట్లో ఆర్డీఎక్స్తో పాటు శత్రుదేశం నుంచి భారత్‌లోకి ప్రవేశించే రూట్ మ్యాప్ దొరికింది. గుడ్ జాబ్. ఒక మనిషి నిన్ను అనుసరిస్తున్నాడని గ్రహించినప్పుడు డిపార్ట్మెంట్కి ఎందుకు ఇన్ఫామ్ చెయ్యలేదు’’ అడిగాడాయన.‘‘ఒక యువతి నన్ను అనుసరిస్తోందని అనుమానం కలిగింది సార్! ఆమె నావెంట ఎందుకు పడిందో తెలీదు. నా ప్రవర్తనలో తేడావస్తే అసలు విషయం తెలియదని, ఆమె సంగతి తేల్చుకోవాలని మెడికల్లీవు తీసుకుని నన్ను అనుసరించమని మనవాడికి చెప్పాను.’’‘‘ఒంటరిగా శత్రు శిబిరంలోకి ప్రవేశించడం ప్రమాదం కదా!’’‘‘ప్రమాదమని శత్రువుని వదిలితే ఎలా సార్?’’‘‘ఈ ఆపరేషన్‌లో నీకేమైనా అయితే..?’’‘‘ప్రాణాలు పోతాయని భయపడి దేశానికి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం కూడా దేశద్రోహమే సార్! పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయిన ఉమన్ హోమ్‌గార్డు ప్రాణం కంటే నా ప్రాణం గొప్పది కాదు సార్!’’ఆయన తలపంకించి నిలబడ్డాడు.‘‘నిన్ను ఏ వన్‌కి రికమెండ్ చేశాను. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే కాంటాక్ట్ చెయ్యి. ఆపరేషన్ పీకే చార్జ్ తీసుకోవాలి’’అతను గుటకలు మింగుతూ తలూపాడు. ఆపరేషన్ పీకే అంటే క్షణక్షణం ప్రమాదంతో కూడుకున్నది. తిరిగి దేశంలో కాలుపెడతామో లేదో తెలియనంత తీవ్రమైంది. అదంతా ఆ వృత్తిలో భాగమని అతనికి తెలుసు. - మంజరి -
మద్యం వద్దే వద్దు!
తమ గ్రామం మద్యం దుకాణాన్ని తొలగించాలని యర్రగొండపాలెం మండలం గురిజేపల్లికి చెందిన మహిళలు సోమవారం రాస్తారోకోనిర్వహించారు. జాతీయ రహదారిపై బైటాయించి ఆందోళన చేశారు. ప్రకాశం ,యర్రగొండపాలెం: తమ గ్రామంలో బ్రాందీషాపు ఎత్తేయాలని మహిళలు జాతీయ రహదారిపై దాదాపు గంటపాటు రాస్తారోకో చేసి రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సంఘటన మండలంలోని గురిజేపల్లిలో సోమవారం జరిగింది. తమ గ్రామంలో మద్యం దుకాణం తీసేయాలని మహిళలు డిమాండ్ చేశారు. జాతీయ రహదారి పక్కనే ఇప్పటి వరకు గోలుసు దుకాణం నిర్వహించారు. మండలంలో మొత్తం ఆరు లైసెన్స్ షాపులు ఉండగా నాలుగు షాపులు పట్టణంలో, మానిగుడిపాడు, కొలుకులలో ఒక్కొక్కటి చొప్పున నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ఒకషాపు మెయింటినెన్స్ ఖర్చులు కూడా రావడంలే దని కొన్ని నెలలుగా మూలేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం గురిజేపల్లిలోని బెల్ట్‌షాపును పర్మినెంట్ షాపుగా మార్చారు. మద్యం కోసం సమీప గ్రామాలైన బోయలపల్లె, సర్వాయపాలెం, వాదంపల్లె గ్రామాలకు చెందిన మద్యం ప్రియులు ద్విచక్ర వాహనాలపై వచ్చి మద్యం తాగుతున్నారు. జాతీయ రహదారిపై షాపు ఉండటంతో భారీ వాహనాలు సైతం మద్యం కోసం నిలుపుతారన్న ఆందోళన మహిళలు వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మద్యం దుకాణం తెరిచే ఉంచుతున్నారని ఆరోపిస్తున్నారు. రెండు రోజులుగా మద్యం పుటుగా తాగి గ్రామంలో అల్లర్లు చేస్తున్నారని, ఇంట్లో మహిళలను కొడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి గ్రామంలోని పలు గృహాల్లో గోడవలు ప్రారంభమయ్యాయి. ఒకరు మద్యం మత్తులో తన భార్యకు ఉరేసేందుకు విఫలయత్నం చేశాడు. మరొకరు భార్యను చితకబాదాడని మహిళలు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు రోడ్డు ఎక్కారు. జాతీయ రహదారిపై బైఠాయించడంతో అనేక వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ దేవకుమార్ తన సిబ్బందితో వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఎక్సైజ్ ఉన్నతాధికారులతో మాట్లాడి షాపు ఎత్తేయిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు రాస్తారోకో విరమించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ సాయంత్రం పోలీసులు రక్షణగా మద్యం అమ్మకాలు జరిపించడం గమనార్హం. -
వైన్‌షాపులో సరుకు ఖాళీ
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ పరిధిలోని వైన్‌షాపులన్ని ఆదివారం మధ్యాహ్ననికి ఖాళీ అయ్యాయి. రెగ్యులర్ బీర్లు, విస్కీ, రమ్, బాటిళ్లన్ని అమ్ముడు పోయాయి. ఒక పక్క పోలీసులు షాపులను మూసి వేయాలని, మరోపక్క నాయకులు మందు బాటిళ్లు కావాలని యజమానులపై ఒత్తిడి తెచ్చారు. చివరకు మధ్యాహ్నానికి బార్లు, వైన్‌షాపులన్ని మూతపడ్డాయి. కొన్ని షాపులు ఉదయమే మూయించివేశారు. ప్రగతి నివేదన సభ నేపథ్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ముందే మందు బాటిళ్లను కొనుగోలు చేశారు. పెద్ద ఎత్తున మందు బాటిళ్లను కొనుగోలు చేయడంతో షాపులో మధ్యం బాటీలన్నీ ఖాళీ అయ్యాయి. ఆదివారం ఉదయం బార్, వైన్‌షాపులను పోలీసులు తెరవ వద్దంటూ సూచించారు. కానీ నాయకుల ఒత్తిడితో షాపులను తెరిచి వారికి కావాల్సిన బాటిళ్లను అందించారు. ఎక్సైజ్ పోలీసులు తాము ఎవరికి షాపులు మూసివేయాలని తెలుపలేదన్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు మాత్రం సభకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న షాపులను మూసివేయాలని తెలిపామని వెల్లడించారు. -
గొడవలకు దిగితే కఠిన చర్యలు
విశాఖ క్రైం: నగరంలోని మద్యం దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఎడమవైపు ఆర కిలోమీటరు, కుడివైపు ఆర కిలో మీటర్ పరిధిలో జరిగే వ్యవహారాలన్నీ కనిపించేలా అధిక రిజల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్రలడ్డా ఆదేశించారు. ‘సాక్షి’తో బుధవారం ఆయన మాట్లాడారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇప్పటికే నేరాలపై దృష్టి సారించి పలు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లు హత్యలు, గొడవులకు పాల్పడడంతోపాటు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే స్టేషన్‌కు సంబంధించిన అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. అదేవిధంగా స్టేషన్లో లంచాలు తీసుకున్నారనే సమాచారం వస్తే చర్యలు తప్పవన్నారు. ఫిర్యాదుదారులను డబ్బులు అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ♦ మద్యం దుకాణాల వద్ద రాత్రి వేళల్లో గస్తీ పెంచామని, ఇప్పటికే చిన్న చిన్న గొడవులు లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ♦ నగరానికి వచ్చిన పర్యాటకులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పర్యాటకులకు రక్షణ కలిగించేందుకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. చైన్ స్నాచర్లపై ప్రత్యేక దృష్టి చైన్స్నాచర్లపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎక్కడైనా స్నాచింగ్ జరిగితే సిబ్బంది వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. స్నాచర్లను పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా పాత నేరస్తులపై కూడా ప్రత్యేక నిఘా పెట్టామని, రోజూ ఓ బృందం నిఘా పర్యవేక్షిస్తుందని తెలిపారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ వ్యాపార సముదాయాలు, అపార్ట్మెంట్లు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిం చారు. దొంగతనాలు, ఇతర అఘాయిత్యాలు జ రిగినప్పుడు వెంటనే నిందితులను గుర్తించి ప ట్టుకునేందుకు సీసీ కెమెరాల ఫుటేజీ దోహదపడుతుందన్నారు. ఇప్పటికే జీవీఎంసీ, పోలీసు శాఖ తరఫున పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరంలోని చాలా ప్రాం తాలను సీసీ కెమెరాల ద్వారా పర్యేవేక్షిస్తున్నామని తెలిపారు. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రౌడీ షీటర్లుకు రెండు రోజులుగా కౌన్సిలింగ్ ఇస్తున్నామని సీపీ తెలిపారు. ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని సూచించా మని, వారి ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. నగరంలో సుమారు 400 మంది రౌడీషీటర్ల కదలికలపై పై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. -
మద్యం అప్పు ఇవ్వలేదని..
సింగరాయకొండ: మద్యం అప్పు ఇవ్వలేదని కొందరు యువకులు ఆగ్రహించి బ్రాందీషాపులో పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ సంఘటన శుక్రవారం స్థానిక లారీ యూనియన్ ఆఫీసు వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బ్రాందీ షాపు నంబర్–196కు నలుగురు యువకులు వచ్చి మద్యం తాగారు. చాలక పోవడంతో పాటు వారి వద్ద డబ్బులు లేవు. మరికొంత మద్యం అప్పు ఇవ్వాలని షాపులోని కుర్రోడు నాగరాజుతో గొడవకు దిగారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి బి.నారాయణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన యువకులు పరారయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికి శీలం రవి అనే యువకుడు బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చి షాపులో పోసి నిప్పంటించాడు. ప్రమాదంలో వాటర్ ఫ్రిజ్‌తో పాటు సుమారు కేసు మద్యం ధ్వంసమైంది. టంగుటూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు షాపులో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. షాపు యజమానులు ఎటువంటి సేఫ్టీ చర్యలు తీసుకోలేదని, దీనిపై జిల్లా అధికారికి తెలియజేసి తగిన చర్యలు తీసుకుంటామని అగ్నిమాపక అధికారి కొండయ్య హెచ్చరించారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మురళీధర్ వివరించారు. -
చిల్లర దొంగ
రాత్రి పదకొండు కావస్తోంది. కర్నూల్ పట్టణం పొలిమేరల్లో ఓ కాలనీ! మెయిన్ రోడ్డులోని వైన్‌షాపులో ఓ పెగ్గు వేసుకున్నాక కాలనీలోకి ప్రవేశించాడు రఘు. ఆ రోజు ఆదివారం కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.రఘు ఓ చిల్లరదొంగ. జేబులు కొట్టడం, సామాన్లు తస్కరించడం, మారు తాళం చెవులతో ఇళ్ల తాళాలు తెరిచి దొంగతనం చేయడంలాంటివి చేస్తుంటాడు. ఓసారి పట్టుబడి జైలుకి కూడా వెళ్లొచ్చాడు. రాత్రుళ్లు దొంగతనానికి బయల్దేరే ముందు ధైర్యం కోసం ఓ పెగ్గు పుచ్చుకోవడం అతనికి అలవాటు.రోడ్డుపై పరధ్యానంగా నడుస్తున్న రఘు ఎవరో పలకరించడంతో తల తిప్పి చూశాడు. నిండుగా బురఖా ధరించిన ఓ స్త్రీ చీకట్లోంచి బయటికొచ్చింది. ఆమె కళ్లు తప్ప ముఖం కనిపించడం లేదు. ‘‘రఘు..! ఓ చిన్న దొంగతనం చేస్తావా? నువ్వు అడిగినంత డబ్బిస్తాను’’ గుసగుసగా అంది. రఘు ఆశ్చర్యపోయాడు. ‘‘మీరెవరు? నా పేరు మీకెలా తెలుసు?’’ అనడిగాడు. ‘‘అదంతా నీకు అనవసరం. అక్కడ ఓ ఇంట్లో భార్యాభర్తలు పొరపాటున తలుపుకి తాళం వేయడం మరిచిపోయి బయటికెళ్లారు. ఇప్పట్లో తిరిగిరారు. ఆ ఇంటి బెడ్రూమ్లోని అల్మారాలో ఓ చిన్న బ్యాగ్ ఉంది. అందులో కొన్ని పత్రాలున్నాయి. ఆ బ్యాగ్ నాకు తెచ్చి ఇస్తే, నీకు పదివేలు ఇస్తాను’’ అందామె. పదివేలు అన్న మాట వినగానే రఘు కళ్లు మెరిశాయి.అంతలోనే అతనికొక అనుమానం వచ్చింది. ‘‘ఇంటికి తాళం లేదన్నారు. మరి మీరే వెళ్లి ఆ బ్యాగ్‌ను తీసుకోవచ్చు కదా’’ అన్నాడు రఘు.‘‘ఇంటికి తాళం లేకున్నా అల్మారాకి తాళం వేసి ఉంది. తాళం తెరవడం నాకు చేతకాదు. అందుకే నీకు చెబుతున్నాను’’ అంది ఆ బురఖాలోని స్త్రీ.‘‘సరే.. ఆ ఇల్లు ఎక్కడుందో చూపించండి’’ రఘు ఉత్సాహంగా అడిగాడు. ఆమె అతణ్ని ఆ రోడ్డు చివర్లో ఉన్న ఓ ఇంటి దగ్గరికి పిలుచుకెళ్లింది. ‘‘ఇదే ఆ ఇల్లు. వెంటనే లోపలికెళ్లి బ్యాగు తీసుకురా. నేను ఆ కారు వెనుక నిల్చొని నీ కోసం ఎదురు చూస్తుంటాను’’ అంటూ ఆమె అక్కడికి కొద్ది దూరంలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారువైపు వెళ్లిపోయింది.రఘు అటూఇటూ చూశాడు. ఎక్కడా మనిషి జాడలేదు. అతను హుషారుగా ఆ ఇంటి గేటు తెరిచి కాంపౌండులోకి ప్రవేశించాడు. ఆ స్త్రీ చెప్పినట్టే ఇంటి ముఖ ద్వారానికి తాళం లేదు. తలుపు నెట్టగానే తెరుచుకుంది. రఘు చప్పుడు చేయకుండా లోపలికి ప్రవేశించాడు. ఇంట్లో చడీచప్పుడు లేదు. హాల్లో ఉన్న జీరో లైటు తప్ప ఏ గదిలోనూ లైట్లు వెలగడం లేదు. దాన్నిబట్టి ఇంట్లో ఎవరూ లేరని రఘుకి అర్థమైంది. చేతిలో ఉన్న టార్చీని వెలిగించాడు. ఆ వెలుగులో ఒక్కో గదిని పరిశీలించాడు. ఓ గదిలో తలుపుకి ఎదురుగానే అల్మారా కనిపించింది. వెంటనే లోపలికెళ్లి మారు తాళం చెవులతో కొద్దిసేపట్లోనే దాన్ని తెరిచాడు. కానీ లోపల బ్యాగు కనపడలేదు. దానికి బదులు కొన్ని నోట్ల కట్టలు, బంగారు నగలు ఉన్నాయి. ఏదైతే తనకేం అనుకుంటూ రఘు ఆనందంగా వాటిని తన జేబుల్లో పెట్టుకున్నాడు. ఆ స్త్రీ చెప్పిన బ్యాగుతో తనకేం పని? ఆమె ఇస్తానన్న దానికి ఎన్నోరెట్లు ఎక్కువ సొమ్ము దొరికింది. ఆ సొమ్ముతో ఎక్కడికైనా పారిపోయి హాయిగా బతకొచ్చుననుకున్నాడు. ఆ బురఖా స్త్రీ కూడా దొంగే కాబట్టి తన గురించి పోలీసులకు చెప్పే సాహసం చేయదనుకున్నాడు.ఆ గదిలో ఇంకేమైనా దొరుకుతుందేమోననే ఆశతో మంచం ఉన్నవైపు టార్చి వేశాడు. ఆ వెలుగులో కనపడిన దృశ్యం చూసి అదిరిపడ్డాడు. మంచం పక్కన నేల మీద ఓ స్త్రీ మృతదేహం ఉంది. ఆమె గొంతుకి వైరు చుట్టబడి ఉంది. కళ్లు బయటికి పొడుచుకొచ్చాయి. కొద్దిసేపటి క్రితమే ఆమెనెవరో చంపేశారు. బహుశా ఆ బురఖా స్త్రీయే ఈ హత్య చేసి తనని ఇరికించినట్టుంది. ఇక తను అక్కడుంటే ప్రమాదమని రఘు గబగబా తలుపువైపు పరిగెత్తాడు.తలుపు తెరవబోయాడు. కానీ అది తెరుచుకోలేదు. తను ఇంట్లోకి ప్రవేశించాక ఆ బురఖా స్త్రీ తలుపుకి బయటి నుంచి గొళ్లెం పెట్టినట్టుంది. ఇక పెరటి వాకిలి గుండా బయట పడాలనుకుని ఇంటి వెనుకవైపు పరిగెత్తాడు. కానీ ఆ తలుపు కూడా తెరుచుకోలేదు. తను పూర్తిగా ఇరుక్కుపోయానని రఘుకి అర్థమైంది. దిక్కుతోచక ఇల్లంతా తిరగసాగాడు.అంతలో ఇంటి ముందు జీపు ఆగిన చప్పుడైంది. కాసేపట్లో ముందు వాకిలి తలుపు తెరుచుకుంది. బిలబిలమంటూ లోపలికొచ్చిన పోలీసులు రఘుని చుట్టుముట్టారు. రఘు చెప్పింది ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ నమ్మలేదు. ‘‘నువ్వొక దొంగవని అందరికీ తెలుసు. ఓసారి జైలుకి కూడా వెళ్లొచ్చావ్. జైలులో బాగా రాటుదేలినట్టున్నావ్. ఈసారి దొంగతనంతో పాటు హత్య కూడా చేశావ్. అయితే నువ్వు ఈ ఇంట్లోకి దూరడాన్ని అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి చూశాడు. బయటి తలుపుకి గొళ్లెం పెట్టి అతనే మాకు ఫోన్‌కాల్ చేసి చెప్పాడు. అందువల్లే వెంటనే మేము ఇక్కడికొచ్చి నిన్ను పట్టుకోగలిగాం. ఇప్పుడు నువ్వు కట్టుకథ చెబితే నమ్ముతామా?’’ అన్నాడు విజయ్.‘‘ఇదంతా ఆ బురఖా స్త్రీ పనే సార్..! తను హత్య చేసి నన్ను ఇరికించింది’’ బేలగా అన్నాడు రఘు.‘‘షటప్!! గొంతుకి వైరు బిగించి చంపడం ఓ స్త్రీకి సాధ్యమయ్యే పనికాదు. ఈ పని మగాడే చెయ్యగలడు. అందువల్ల ఇది నీ పనే’’ కరాఖండీగా అన్నాడు ఇన్స్పెక్టర్.తర్వాత విజయ్ ఇరుగుపొరుగు వారి ద్వారా హతురాలి వివరాలు సేకరించాడు. ఆమె పేరు లక్ష్మి అని, భర్త పేరు రాంబాబు అని తెలిసింది. ఇంట్లో వారిద్దరు తప్ప పనిమనిషి కూడా లేదని, రాంబాబు తరచుగా బిజినెస్ పని మీద హైదరాబాద్ వెళ్తుంటాడని పక్కింటి గురునాథం చెప్పాడు. రాత్రి పది గంటలకు రాంబాబు కారులో హైదరాబాద్‌కి బయల్దేరడం తాను కిటికీలో నుంచి చూశానని ఎదురింటి మాలిని చెప్పింది.మృతురాలు లక్ష్మి సెల్ఫోన్లో ఉన్న రాంబాబు నంబర్ చూసి అతనికి ఫోన్ చేసి విషయం తెలిపాడు విజయ్. హైవేలో హైదరాబాద్ వైపు కారులో వెళ్తున్న రాంబాబు.. భార్య హత్యకి గురైందని వినగానే షాక్‌కి గురయ్యాడు. వెంటనే కర్నూల్‌కి తిరిగొస్తానన్నాడు. గంట తర్వాత తిరిగొచ్చాడు.ఆలోగా ఫొటోగ్రాఫర్లు, ఫోరెన్సిక్ నిపుణులు తమ పని పూర్తి చేశారు. అప్పటికే పంచనామా ముగించిన విజయ్ చివరగా రాంబాబు స్టేట్మెంట్ తీసుకున్నాడు. ‘‘నేను పది గంటలకు ఇంటి నుంచి బయల్దేరాను. తలుపు వేసుకోమని లక్ష్మికి చెప్పాను. ఆమె మరిచిపోయినట్లుంది. తలుపు వేసి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదు’’ అంటూ వాపోయాడు రాంబాబు. ∙∙ పోస్టుమార్టమ్ రిపోర్టు చూశాక ఇన్స్పెక్టర్ విజయ్‌కి ఓ విషయం అర్థమైంది. అదేమిటంటే ఈ హత్యకి రఘుకి ఎలాంటి సంబంధం లేదని. అసలు హంతకుని కోసం ఇన్వెస్టిగేషన్ మొదలెట్టాడు. ఆదివారం రాత్రి రాంబాబు ఇంట్లోకి ప్రవేశించాక బయటి నుంచి తలుపుకి గడియపెట్టి పోలీసులకు ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ ఫోన్ నంబర్ గురించి ఆరా తీస్తే అది రాంబాబు ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ పబ్లిక్ బూత్దని తెలిసింది. తర్వాత రాంబాబు కాల్ రికార్డ్స్ గురించి కూపీ లాగాడు. తన ఎదురింట్లో ఉండే మాలినికి రాంబాబు తరచుగా ఫోన్లు చేసేవాడని, హత్య జరిగిన రాత్రి కూడా తొమ్మిది గంటలకు అతను మాలినికి ఫోన్ చేశాడని తెలిసింది.విజయ్ వెంటనే మాలినిని పోలీస్ స్టేషన్‌కి పిలిపించి ప్రశ్నించాడు. ‘‘రాంబాబు, నేను కలిసే చదువుకున్నాం. తను నా క్లాస్మేట్. ఆ చనువుతోనే నాకు ఫోన్ చేసేవాడు. అంతమాత్రాన నన్ను అనుమానిస్తారా?’’ మాలిని మండిపడింది. విజయ్ ఆమెకు జవాబు చెప్పేలోగా.. లాకప్‌లో ఉన్న రఘు ఊచల్లోంచి మాలినిని పరీక్షగా చూస్తూ ఉలిక్కిపడ్డాడు. ‘‘సార్..! ఆ బురఖా స్త్రీ ఎవరో కాదు. ఈవిడే..!!’’ అంటూ అరిచాడు.‘‘నువ్వు ఆమె ముఖం చూడలేదన్నావ్ కదా! ఇప్పుడెలా గుర్తుపట్టావ్?’’ విజయ్ ఆశ్చర్యంగా అడిగాడు.‘‘ముఖం చూడకపోయినా కళ్లను చూశాను. ఆమెవి పిల్లి కళ్లు. ఈమెవి కూడా పిల్లి కళ్లే. అప్పుడామె గొంతు మార్చి నాతో మాట్లాడింది. గొంతు మారిస్తే తనని గుర్తుపట్టననుకుంది. గొంతు మార్చినా కళ్లను మార్చలేకపోయింది. ఆ కళ్లే ఇప్పుడామెని పట్టించాయి’’ హుషారుగా అన్నాడు రఘు.మాలిని ముఖం పాలిపోయింది. విజయ్ సైగ చేయగానే, అక్కడే ఉన్న లేడీ కానిస్టేబుల్ మాలిని పక్కకు తీసుకెళ్లింది. తనదైన స్టయిల్లో ఆ కానిస్టేబుల్ అడిగేసరికి మాలిని నేరం ఒప్పుకుంది. విజయ్ వెంటనే రాంబాబుని అరెస్ట్ చేశాడు. గత్యంతరం లేక రాంబాబు నేరం ఒప్పుకొని జరిగిందంతా చెప్పసాగాడు. ‘‘నాకు, మాలినికి కాలేజీ రోజుల నుంచి స్నేహం ఉంది. ఆ చనువుతోనే తనకు దగ్గరయ్యాను. ఈ విషయం నా భార్యకు తెలియదు. లక్ష్మి మైగ్రేన్ తలనొప్పితో తరచూ బాధపడేది. ఆ సమయంలో తను నిద్రమాత్రలు వేసుకుని పడుకునేది. అప్పుడు నేను మాలిని ఇంటికి వెళ్లేవాణ్ని. ఆ రోజు రాత్రి లక్ష్మికి మాపై అనుమానం వచ్చినట్టుంది. తలనొప్పి లేకపోయినా నిద్రమాత్రలు వేసుకున్నట్లు నటించి పడుకుంది. ఆమె నిజంగానే పడుకుందనుకుని, నేను మాలిని ఇంటికి వెళ్లాను. కొద్దిసేపయ్యాక లక్ష్మి మాలిని ఇంటికి వచ్చి, మమ్మల్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇక కోపంతో నన్ను తిట్టుకుంటూ మా ఇంట్లోకి వచ్చేసింది. వెంటనే తననే ఫాలో అవుతూ నేనూ మా ఇంటికొచ్చాను. ఇద్దరి మధ్యా వాగ్వావాదం జరిగింది. ఇంక ఆవేశం తట్టుకోలేక నేనే నా భార్యను చంపేశాను. ఆవేశం తగ్గాక ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే పక్కవీధిలో ఉండే చిల్లరదొంగ రఘు గుర్తొచ్చాడు. ఆ హత్య కేసులో అతణ్ని ఇరికించాలని నేను, మాలిని పథకం వేశాం. మాలిని తన ఇంట్లో ఉన్న స్నేహితురాలి బురఖాను ధరించి రఘుని బోల్తా కొట్టించి మా ఇంట్లో బందీ చేసింది. నేను పబ్లిక్ ఫోన్ నుంచి మీకు ఫోన్ చేశాక హైదరాబాద్‌కి బయల్దేరాను. అంతా ప్లాన్డ్గా చేశామనుకున్నాం.. కానీ’’ అని ఆగాడు రాంబాబు.‘‘మీరు అంత ప్లాన్డ్గా చేసినా.. ఎలా దొరికామా.. అని ఆలోచిస్తున్నావా? తప్పు నీది కాదు. నీ సెల్ఫోన్ది. ఆ రోజు రాత్రి హత్య జరిగిన సమయంలో నువ్వు ఇంట్లోనే ఉన్నావని అది మాకు చెప్పేసింది. ఆ రాత్రి పది, పదకొండు గంటల మధ్య హత్య జరిగిందని పోస్టుమార్టమ్‌లో తేలింది. కానీ రాత్రి పది గంటలకే నువ్వు హైదరాబాద్ బయల్దేరానని మాతో అబద్ధం చెప్పావ్. కానీ నీ సెల్‌ఫోన్ రికార్డ్స్ పరిశీలిస్తే ఆ రోజు రాత్రి పదకొండు వరకు నీ సెల్ లొకేషన్ నీ ఇంటి పరిధిలోనే ఉన్నట్లు తెలిసింది. దాన్నిబట్టి ఈ హత్య నువ్వే చేశావని మాకు అనుమానం కలిగింది. చివరికి అదే నిజమైంది’’ అన్నాడు ఇన్స్పెక్టర్. - మహబూబ్ బాషా -
వైన్ షాపు పైనే వెల్ఫేర్ హాస్టల్
విద్యార్థులకు హాస్టల్ అవస్థలు తప్పడం లేదు. గుంటూరు నగరం నడిబొడ్డున చుట్టుగుంట ప్రాంతంలో ఓ వైన్‌షాపుపైన సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని నిర్వహించడం పలు విమర్శలకు తావిస్తోంది. అది కూడా పగిలిపోయిన రేకులతో, అపరిశుభ్రత వాతావరణంతో దర్శనమిస్తోంది. ఈ పోస్ట్‌మెట్రిక్ వసతిగృహం కలెక్టరేట్‌కు, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉండటం గమనార్హం. లక్ష్మీపురం(గుంటూరు): పేద విద్యార్థుల ఉన్నత చదువులే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వసతి గృహం నిర్వహణలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. కనీస వసతులు లేని భవనానికి వేల రూపాయల అద్దెలు చెల్లిస్తున్నారు. తాగేందుకు నీరు, ఉండేందుకు సరైన నీడ లేక విద్యార్థులు అందులో కష్టాలు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే... గుంటూరు నగరం నడిబొడ్డున చుట్టుగుంట ప్రాంతంలో ఓ వైన్‌షాపుపైన సాంఘిక సంక్షేమ వసతి గృహం నిర్వహిస్తున్నారు. భవనం పైభాగంలో పగిలిపోయిన రేకులు, అపరిశుభ్రతతో నడుస్తున్న ఈ పోస్ట్‌మెట్రిక్ వసతిగృహం కలెక్టరేట్‌కు, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాలకు కూతవేటు దూరంలోనే ఉంది. నిత్యం ఈ హాస్టల్ మీదుగానే రాష్ట్ర మంత్రులు, జిల్లా స్థాయి అధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. కాని ఈ హాస్టల్ వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ప్రభుత్వం ఈ వసతి గృహానికి నెలకు రూ.50 వేలు చెల్లిస్తోంది. నాలుగేళ్లుగా ఆ భవనంలో హాస్టల్ నడుపుతున్నారు. ఈ వసతి గృహంలో ఇంటర్ నుంచి పీజీ, ఇంజినీరింగ్, బీటెక్ విద్యార్థులు ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌లతో విద్యాభ్యాసం చేస్తూ, ఇక్కడ ఉంటారు. ఈ హాస్టల్ పర్యవేక్షణ అంతా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, జాయింట్ డైరెక్టర్ చూడాల్సి ఉంది. ఈ హాస్టల్లో 100 మంది విద్యార్థులకు వసతి గృహాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జిల్లా వాసి అయినప్పటికీ ఈ హాస్టల్ దుస్థితి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం హాస్టల్ అని బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. అడిగే నాథుడు ఎవరూ లేకపోవడంతో ఏడాదికి రూ.6 లక్షలు అద్దె వసూలు చేస్తున్న భవన యజమాని కనీస మరమ్మతులు కూడా చేయించడంలేదు. మురుగు గురించి పట్టించుకోకుండా బ్లీచింగ్ చల్లి సరిపెడుతున్నారు. వర్షం పడితే పుస్తకాలు, దుస్తులు తడిచి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పైకప్పు రేకులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అవి ఎక్కడ ఊడిపడతాయోనని వణికిపోతున్నారు. మరుగుదొడ్లు, తాగునీటి వసతి లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. -
నిబంధనలకు చెల్లు.. మందుబాబుల జేబుకు చిల్లు
సాక్షి, గుంటూరు: వైన్ షాపుల ముందు ధరల పట్టిక ఉండాలి.. హోలో గ్రామ్ మిషన్ ఏర్పాటు చేయాలి.. హోల్‌సేల్‌గా అమ్మకూడదు.. 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయించకూడదు.. ఇవన్నీ మద్యం వ్యాపారులు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు. అయితే, చాలాచోట్ల ఇవి నీటి మీద రాతల్లా మారాయి. కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారి లాభాలే లక్ష్యంగా నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుగుతున్నా ఎక్సైజ్ అధికారుల్లో చలనం రాకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. బార్ కోడింగ్ అమలు, దుకాణాల ముందు సీసీ కెమేరాల ఏర్పాటు, ఆన్లైన్ బిల్లు వంటి నిబంధనలు తప్పనిసరి చేసినా చాలాచోట్ల అమలు అవి రికార్డులకే పరిమితంగా మారాయి. మూన్నాళ్ల ముచ్చటగా హెచ్‌పీఎఫ్‌ఎస్ విధానం మ్యానువల్‌గా మద్యం అమ్మకాల్లో అక్రమాలను నియంత్రించడం కోసం ఎక్సైజ్ శాఖ ప్రవేశపెట్టిన ఆన్లైన్ అమ్మకాల నిర్వహణ మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. హెడోనిక్ పార్ట్ ఫైండర్ సిస్టమ్ (హెచ్‌పీఎఫ్‌ఎస్) విధానం రాష్ట్రవ్యాప్తంగా 2015 జులై 1వ తేదీ నుంచి అన్ని వైన్ షాపులు, బార్లలో తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ విధానం ద్వారా ఎమ్మార్పీ, బ్యాచ్ నంబర్, అమ్మకాలు పూర్తిగా నమోదు అవుతాయి. అయితే, ఈ విధానం నామమాత్రంగానే అమలవుతోంది. కొన్ని దుకాణాల్లో కంప్యూటర్ కూడా ఉండటం లేదు. హెచ్‌పీఎఫ్‌ఎస్ విధానం సరిగా అమలు కాకపోవడం వల్ల కల్తీ మద్యానికి అడ్డుకట్ట వేయడం అధికారులకు సమస్యగా మారుతోంది. ఈ విధానం సరిగా అమలు జరిగితే ఉదయం 10 గంటల కన్నా ముందు, రాత్రి పది గంటల తర్వాత మద్యం అమ్మకాలు జరిపితే అధికారులకు వెంటనే సమాచారం తెలిసిపోతుంది.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మడానికి అవకాశం ఉండదు. దీంతో పాటు వినియోగదారులకు కంప్యూటర్ బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ నిబంధనలు అన్ని పాటిస్తే తమ లాభాలకు గండి పడుతుందనే ఉద్దేశంతో చాలా వరకు మద్యం వ్యాపారులు హెచ్‌పీఎఫ్‌ఎస్ విధానాన్ని పాటించడం లేదు. దీనివల్ల కల్తీ మద్యం బాటిళ్లు పట్టుబడినప్పుడు అవి ఎక్కడి నుంచి తయారై వచ్చాయో గుర్తించడానికి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిలువుదోపిడీ ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం మద్యాన్ని బాటిల్స్‌లోనే విక్రయించాలి. కానీ జిల్లాలోని అన్ని దుకాణాల్లో విరుద్ధంగా లూజుగా విక్రయిస్తున్నారు.దీన్ని ఆసరాగా చేసుకుని కల్తీ మద్యం రాయుళ్లు ఖరీదైన మద్యం సీసాల్లో మధ్య రకం బ్రాండ్లను కలిపి మందుబాబులకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. బార్లలో ఎమ్మార్పీ రేట్లు వర్తించవన్న అంశాన్ని ఆసరాగా చేసుకుని యజమానులు సర్వీసు చార్జీల పేరుతో వినియోగదారులను నిలువునా దోచేస్తున్నారు. కొన్ని బార్లలో బీర్ బాటిల్ ధర రూ. 110 నుంచి రూ. 170 వరకు విక్రయిస్తున్నారు. ఇవన్నీ తెలిసినా ఎక్సైజ్, స్థానిక పోలీసు అధికారులు నెలానెలా మామూళ్లు తీసుకుని పట్టించుకోవడం లేదు. కొద్ది నెలల క్రితం ఎక్సైజ్ శాఖలో లోపాలు ఆసరాగా చేసుకుని సాక్షాత్తు ఆ శాఖ ఉద్యోగే కల్తీ మద్యం తయారు చేస్తూ పట్టుబడిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జిల్లాలో 185 బార్లు, 352 వైన్‌షాపులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రూ. 4.25కోట్ల చొప్పున నెలకు రూ. 125 కోట్ల నుంచి 130 కోట్ల వరకూ వ్యాపారం జరుగుతోంది. రోజురోజుకూ మద్యం విక్రయాలు పెరగడంతో పాటు నిబంధనలు అతిక్రమిస్తున్న వ్యాపారుల సంఖ్య కూడా పెరుగుతోంది. అ«ధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండదండలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇస్టానుసారంగా విక్రయాలు కొనసాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇష్టమైతే కొనండి.. లేకుంటే వెళ్లిపోండనే సమాధానం వస్తోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో తెనాలి, రేపల్లె, పల్నాడు ప్రాంతాల్లో గ్రామానికి రెండు లేదా మూడు చొప్పున బెల్టు కొనసాగుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారిలో దాదాపుగా అందరూ అధికారపార్టీకి చెందిన వారు కావడంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు సైతం సాహసించలేక పోతున్నారు. మా దృష్టికి వస్తేకఠినంగా వ్యవహరిస్తాం సిగ్నల్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే బార్ కోడింగ్ విధానం అమలులో లేదు. ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్న విషయం మాదృష్టికి వస్తే కఠినంగా వ్యవహరిస్తాం. పల్నాడుతో పాటు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. కలెక్టర్ ఆదేశాలతో త్వరలో రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని బెల్టు దుకాణాలపై చర్యలు తీసుకుంటాం.– శ్రీమన్నారాయణ, ఎక్సైజ్ డీసీ -
ఆటోడ్రైవర్ దారుణ హత్య
కర్నూలు : స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని దేవి ఫంక్షన్ హాల్ సందులో శుక్రవారం ఆటోడ్రైవర్ మహేష్ (28)ను దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల మేరకు.. వెల్దుర్తి మండలం రత్నపల్లెకు చెందిన మహేష్ తండ్రి హనుమంతు కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కర్నూలుకు వలస వచ్చారు. పి.వి.నరసింహారావు నగర్లో తండ్రి, టీవీ9 ప్రజానగర్ కాలనీలో మహేష్ ఉండేవారు. మహేష్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య హైమావతికి ఇద్దరు కుమార్తెలున్నారు. మగ సంతానం కోసం మేరీని వివాహం చేసుకోవడంతో ఆమెకు కుమారుడు, కూతురు ఉన్నారు. నగరానికి చెందిన ఆటోడ్రైవర్లు బాబు, ఖాలీషాతో కలసి గురువారం రాత్రి నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని రోహిత్ వైన్స్‌లో మద్యం సేవిస్తుండగా పక్క టేబుల్లో మద్యం సేవిస్తున్న వారితో మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు. మద్యం దుకాణంలో నుంచి మహేష్ బయటకు వచ్చిన తర్వాత భరత్ అనే వ్యక్తి మరికొంతమంది స్నేహితులను పిలిపించి దేవీ ఫంక్షన్ హాల్ సందులోకి తీసుకెళ్లి ఇనుప రాడ్లతో బాది పారిపోయారు. స్థానికులు మహేష్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. శుక్రవారం ఉదయం బంధువులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. కోలుకోలేక మృతి చెందడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. మూడో పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ మల్లికార్జున సిబ్బందితో మద్యం దుకాణంతో పాటు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పోలీస్ వాహనంలోకే మద్యం సఫ్లై
-
ఎనీ సెంటర్..ఎనీ వేర్!
రోజంతా కష్టపడి ఆ కష్టాన్ని మరిచి పోయేందుకు కొందరు తాగుతున్న మద్యం మకిలీగా మారింది. జిల్లాలో ప్రధానంగా చీరాల్లోనే కల్తీ మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. చాలా మద్యం దుకాణాలు అధికార పార్టీ నేతల చేతుల్లోనే ఉండటంతో అడిగేవారెవరూ లేకపోవడంతో నకిలీ మద్యం పరవళ్లు తొక్కుతోంది. 24 గంటలూ మద్యం దుకాణాలు బార్లా తెరచి అమ్మకాలు సాగిస్తున్నారు. అర్ధరాత్రి మద్యం దరువు చందంగా కనీసం మంచినీరు దొరక్కునా మద్యం మాత్రం పుష్కలంగా దొరుకుతోంది. వ్యాపారులను ఎక్సైజ్ అధికారులు ప్రశ్నిస్తే తమవి అధికార పార్టీ నేతలకు సంబంధించిన షాపులని యథేచ్ఛగా బెదింపులకు దిగుతున్నారు. చీరాల సబ్‌డివిజన్‌లో 37 వైన్ షాపులు, 6 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రకాశం, చీరాల:మద్యం దుకాణాల్లో క్వార్టర్ రాయల్‌స్టాగ్ రూ.160, మ్యాన్షన్ హౌస్ రూ.130, సిగ్నేచర్ రూ.220, బ్లాక్‌డాగ్ రూ.375, బ్లెండర్ స్ప్రైడ్ రూ.220, బ్లాక్ గోల్డ్ రూ.170 మార్పిస్ రూ.220 చొప్పున విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీకే అమ్మకాలు చేస్తుండటంతో మద్యం వ్యాపారులు కల్తీకి అలవాటు పడ్డారు. ఖరీదు మద్యం బాటిళ్లలో క్వార్టర్ రూ.50లు విలువ చేసే చీప్ లిక్కర్‌ను కలిపి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చీరాల్లోని అన్నీ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం రాజ్యమేలుతోంది. అధిక ధరలు ఉన్న మద్యం బాటిళ్లల్లో హెచ్డీ, ఓటీతో పాటు కొన్ని బ్రాండ్లలో మంచినీరు పోసి విక్రయాలు చేస్తున్నారు. క్వార్టర్, ఆఫ్, ఫుల్ బాటిళ్లలో మరింత కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా కలుపుతున్నారు. కథ నడిపేది వీరే.. మద్యం దుకాణాల్లో కౌంటర్లో పనిచేసే వారే కల్తీ చేయడంలో సిద్ధ హస్తులు. ఫుల్ బాటిల్లో క్వార్టర్ మద్యాన్ని తీసేందుకు రబ్బరు ట్యూబుతో ప్రత్యేకంగా తయారు చేసిన యంత్రం ద్వారా సీల్ తీసి బాటిల్లోని మద్యం తీసేసి అందులో చీప్ లిక్కర్, వాటర్ కలిపి యథాస్థానంలో బాటిళ్లు ఉంచి అమ్మకాలు చేస్తున్నారు. తమ లాభాలు, బేటాల కోసం దుకాణం నిర్వహకులు, అటెండర్లతో కలిసి అక్రమాలు చేస్తున్నారు. కన్నెత్తి చూడని ఎక్సైజ్ అధికారులు చీరాల డివిజన్లో ఉన్న అన్నీ మద్యం దుకాణాల్లో మద్యం కల్తీ చేసి విక్రయిస్తున్నారని ఎక్సైజ్ అధికారులకు తెలిసినా దుకాణాల వైపు వెళ్లడం లేదు. అధికార పార్టీకి చెందిన నేతలు, వారి అనుయాయులకు చెందిన దుకాణాలు కావడంతో తనిఖీలు నిలిపేసి ఎక్సైజ్ అధికారులు మద్యం అమ్మకాలు ప్రోత్సహిస్తూ తమ వాటాలు పంచుకుంటున్నారు. కల్తీ మద్యం ఏరులై పారుతున్నా అడ్డుకట్ట వేయడంలో విఫలయ్యారు ఎక్సైజ్ అధికారులు. 24 గంటలూ మద్యం అమ్మకాలు చీరాల ప్రాంతంలో మద్యం అమ్మకాలకు నిర్ణీత సమయం, పగలు రాత్రి అన్న తేడాలు లేవు. మద్యం వ్యాపారాలను పెంచుకునేందుకు 24 గంటలూ దుకాణాలు తెరిచి అమ్మకాలు చేస్తున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు చేయాల్సి ఉండగా దుకాణదారులు మాత్రం తెల్లవారు జాము 4 గంటలకు టీ దుకాణాల మాదిరిగా రాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలు చేస్తున్నారంటే కల్తీ వ్యాపారం ఏ విధంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం:నాసరయ్య, సీఐ, ఎక్సైజ్ చీరాల సబ్ డివిజన్లోని మద్యం దుకాణాలు, బార్లలో మద్యం కల్తీ చేసి అమ్మకాలు చేస్తుంటే ఫిర్యాదు చేయవచ్చు. దుకాణాల్లో అమ్మే మద్యంపై అనుమానం ఉంటే వాటిని పరీక్షలు చేయిస్తాం. కల్తీ మద్యం అమ్మకుండా చర్యలు చేపడతాం. కల్తీ మద్యం అమ్మితే దుకాణాన్ని సీజ్ చేస్తాం. -
జోరుగా అక్రమ మద్యం దందా?
రైల్వేగేట్: నగరంలోని వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓ వైన్ షాపు నుంచి అక్రమంగా మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు మద్యం బాటిళ్లు రవాణా అవుతున్నట్లు సమాచారం. చంద్రాపూర్ జిల్లాలో మద్య నిషేదం ఉండడంతో అక్కడి నుంచి వచ్చిన కొందరు వరంగల్‌లోని వైన్ షాపుల నుంచి మద్యం (90 ఎంఎల్, క్వార్టర్ ) బాటిళ్లను వారి జిల్లాకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి చంద్రాపూర్ నుంచి వచ్చిన వారు వరంగల్ అండర్ బ్రిడ్జి సమీపంలోని వైన్స్‌లో నాలుగు బ్యాగుల్లో మద్యం బాటిల్స్ తీసుకుని వరంగల్ శివనగర్ వైపు ఉన్న రైల్వే ప్లాట్ ఫామ్‌లో ఉండగా రైల్వే పోలీసులు వారిని గుర్తించి పట్టుకున్నట్లు తెలిసింది. సుమారు రూ.40 వేల విలువగల మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. గతంలో చంద్రాపూర్ నుంచి మద్యం కోసం వచ్చే వారు కాగజ్‌నగర్, మంచిర్యాల ప్రాంతాల నుంచి ఎక్కువగా మద్యం రవాణా చేస్తుండేదని, అక్కడ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో వారంతా వరంగల్ బాట పట్టినట్లు విశ్వసనీయ సమాచారం. -
చికెన్ తినను అన్నందుకు దాడి
నాగోలు: వైన్‌షాప్‌లో ఏర్పడ్డ చిన్న వివాదం ఓ వ్యక్తిమృతికి దారితీసింది. డీసీపీ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ది వినాయక వైన్ షాపులో ఈ నెల 10న రాత్రి మద్యం తాగడానికి లింగోజిగూడ జనప్రియ అపార్ట్‌మెంట్‌కు చెందిన అర్వపల్లి వెంకటేశ్వర్లు (45) వెళ్ళాడు. ఇతని పక్కనే మున్సిపల్ కాలనీకి చెందిన గజపాక హరిబాబు, వట్కూరి ఈశ్వర్‌గౌడ్, శ్రీధర్ మద్యం తాగుతున్నారు. తినుబండారాలు లేకుం డా వెంకటేశ్వర్లు మద్యం తాగుతుండగా చికెన్‌తినాలని ఒత్తిడి చేశారు. వెంకటేశ్వ ర్లు వద్దనడంతో వాగ్వాదం జరిగింది. దీంతో వెంకటేశ్వర్లను ఆ ముగ్గురు తోసివేయడంతో క్రిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి.చికిత్స నిమిత్తం ఓమ్ని ఆసుపత్రికి తరలించి అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ ఈ నెల 14న మృతిచెందాడు. వెంకటేశ్వర్లు కొడుకు అర్వపల్లి గణేష్ సాయిరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు హరిబాబు, ఈశ్వర్‌లను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
ఊరూ.. వాడా బెల్ట్‌షాపులే..
సంగెం(పరకాల): గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుంది. వాడవాడలా బెల్ట్‌షాపులు పుట్ట గొడుగుల్లా పుట్టుకోస్తున్నాయి. ప్రతి కిరాణా షాపులో మద్యం విచ్చల విడిగా విక్రయాలు చేస్తున్నారు. మండలంలోని కొన్ని గ్రామాల్లోని బెల్ట్‌షాపులకు ఆయా ఆయా మద్యం షాపుల నుంచి ఆటోల ద్వారా డోర్ డెలివరీలు సైతం చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. వైన్‌షాపుల యజమానులు బెల్ట్‌షాపుల వారి నుంచి బాటిల్‌పై రూ.10 నుంచి 20 వరకు ఎమ్మార్పీ రేటుకు మించి వసూలు చేస్తున్నారని వినికిడి. బెల్టుషాపుల యజమానులు మరో రూ.10–20 జోడించి వసూలు చేస్తూ మందుబాబుల జేబులను ఖాళీ చేస్తున్నారని సమాచారం. మినీ ఏటీఎంలుగా మద్యం షాపులు.. బెల్ట్‌షాపులు మినీ ఏటీఎంలు విరాజిల్లుతున్నాయి. ఎటీఎం అంటే ఎనీ టైం మందు అని అర్థమే మార్చుకున్నారు మందుబాబులు. మం డలంలోని 24 గ్రామపంచాయతీలు, శివారు గ్రామాలు, తండాల్లో సుమారు 300లకు పైగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. మండల కేంద్రంతో పాటు వైన్ షాపుకు అనుమతి ఉన్న చోట ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం విక్రయించాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. కాని గ్రామాల్లో బెల్ట్‌షాపులు 24 గంటలు తెరచి ఉండటంతో యువత మద్యం మత్తులో తూగుతున్నారు. కొన్ని బెల్ట్‌షాపులు పేకాటకు అడ్డాలుగా మారుతున్నాయి. ఉన్నత చదువులు చదువుకొని తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన యువకులు తాగుడుకు బానిసవుతున్నారు. పనిపాటా లేకుండా ఇంట్లో ఉన్న సరుకులు, సామాన్లు సైతం అమ్ముకుని తాగడానికి వనకాడడం లేదని మహిళలు వాపోతున్నారు. కంటితుడుపు చర్యగా దాడులు.. గ్రామాల్లోని బెల్ట్‌షాపులకు అనుమతి లేకున్నా అధికారుల అండదండలతోనే నడుస్తున్నట్లు నిర్వాహకులు బాహటంగానే చెబుతున్నారు.అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి ఒకటి, రెండు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల్లోని బెల్టుషాపులను తొలగించి తమ కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని పలువురు మహిళలు కోరుతున్నారు. -
తాగిస్తారు... జైలుకు పంపుతారా: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: మద్యం షాపులను అడ్డగోలుగా పెంచేయడంతోపాటు అమ్మకాలకు సమయాన్ని పెంచుతు న్న ప్రభుత్వమే తాగినవారిని జైలుకు పంపిస్తున్నదని మాజీ ఎంపీ వి.హన్మంతరావు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మద్యానికి యువత దాసోహం అవుతోందని బాధ పడుతున్న ప్రధాని మోదీ మద్యంపై నిషేధం ఎందుకు విధించడంలేదని ప్రశ్నించారు. బీజేపీ, దాని భాగస్వామ్య పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మద్యపాన నిషేధాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ మాటలు చెప్పడం తప్ప పనులు చేయడంలేదని వీహెచ్ విమర్శించారు. -
మద్యం షాఫుల్!
►వైన్‌షాపుల వద్ద బహిరంగంగా తాగి ఊగుతున్న మందుబాబులు ►ఆ మైకంలో విపరీతంగా దాడులు ►ఆర్టీసీ బస్సుపై దాడి చేసిన వారిని అరెస్టు చేసిన పోలీసులు ►గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న బెల్టుషాపులు ►నిబంధనలకు విరుద్ధంగా ఉదయాన్నే షాపులు తెరుస్తున్న వైనం ►మొదట్లో హడావుడి ..తరువాత పట్టించుకోని యంత్రాంగం ► రైల్వేకోడూరులో వైన్‌షాపుల వద్ద ఆదివారం అయితే చాలు జాతర వాతావరణం ఉంటోంది. ఏదో విందుకు వచ్చిన వారి మాదిరిగా వరుసగా రోడ్డుపక్కనే, రోడ్డుపైన మందుబాబులు కొలువుదీరుతున్నారు. ఆ వైపు ఎవరైనా వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ► గత ఆదివారం రాత్రి కడప ట్రంకురోడ్డులో వెళుతున్న ఆర్టీసీ సూపర్‌లగ్జరీ బస్సుపై ముగ్గురు మందుబాబులు మద్యం మత్తులో రాళ్లతో దాడి చేశారు. ఎదురుతిరిగిన ప్రయాణికులు, డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించారు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసులపైనా వారు తిరగబడ్డారు. ► మద్యం షాపుల వద్ద మందుబాబుల వ్యవహారం విచ్చలవిడిగా మారింది. ఎక్కడపడితే అక్కడ మద్యం తాగుతూ వీరంగం సృష్టిస్తున్నారు. రోజూ ఏదో ఒకచోట ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. మందుబాబుల ఆగడాలపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు కూడా నమోదవుతున్నాయి. అయినా అరికట్టే చర్యలు మాత్రం శూన్యం. కడప: జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. మంచినీరు దొరుకుతుందో లేదో చెప్పలేం కానీ మద్యం మాత్రం ఎక్కడపడితే అక్కడ.. ఏ సమయంలోనైనా సరే అందుబాటులో ఉంటోంది. నగరం, గ్రామం అని తేడా లేదు. మద్యం మాత్రం పుష్కలం. టార్గెట్లు పెట్టి మరీ అధికారులు మద్యం అమ్మిస్తున్నారని స్వయంగా దుకాణదారులే చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ చూసినా మందుబాబుల హడావుడి ఎక్కువైంది. రోడ్లపక్కన, జనావాసాల మధ్య ఉన్న వైన్‌షాపుల వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడపడితే అక్కడ కూర్చుని మందుబాబులు సురాపానంలో మునిగి తేలుతున్నారు. బెల్టుషాపులు లేవని అధికారులు చెబుతున్నా.. మారుమూల గ్రామాల్లోని కొన్ని చిల్లరదుకాణాల్లో మద్యాన్ని రహస్యంగా విక్రయిస్తున్నారని తెలిసింది. ఒకరికి రెండు బాటిళ్లు అన్న నిబంధన ఎక్కడా అమలుకావడం లేదు. విచ్చలవిడిగా మద్యం దొరుకుతుండటంతో వివాదాలు, ఘర్షణలు, నేరాలు పెరిగిపోయాయి. గత నెలరోజుల్లోనే విపరీతంగా క్రైం రేటు ఎక్కువైంది. రోడ్లపైనే సిట్టింగ్‌లు.. అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని బెల్టుషాపులన్నింటినీ రద్దుచేస్తామని చంద్రబాబు చెప్పినా.. ఈనాటికీ అది రూపుదాల్చలేదు.. అయితే మూడేళ్ల తరువాత మేల్కొన్న సర్కారు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో బెల్టుషాపులన్నీ రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త మద్యం పాలసీల వ్యవహారంతోపాటు బెల్టుషాపుల రద్దుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.. అనేకచోట్ల షాపుల ఏర్పాటు విషయంలోనే ప్రజా తిరుగుబాటు వచ్చినా..మందుబాబుల వీరంగాలు మాత్రం తగ్గడం లేదు. పైగా కొంతమంది తాగుబోతులు ఏకంగా షాపుల ఎదుటనే తాగుతూ దాడులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే పరిణామం. తాగరా..తాగి ఊగరా.. నిబంధనల ప్రకారం వైన్‌షాపులో మందు కొనుగోలు చేసిన వ్యక్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పర్మిట్ రూములోకి వెళ్లి మాత్రమే తాగాలి. కాని కొంతమంది షాపు బయటనే కూర్చుని తాగుతుండటం, రోడ్లపైనే సిట్టింగ్‌లు ఎక్కువయ్యాయి. బహిరంగంగా మందు తాగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.మద్యం షాపుల వద్దనే విచ్చలవిడిగా తాగుతూ ఊగుతున్నా అడిగే అధికారులు లేకపోవడం విశేషం. ఆ వైపు వెళ్లాలంటేనే మహిళలు వణికిపోతున్నారు. మందుషాపు ఉన్న ప్రాంతమంతా కూడా మందుబాబులతో హడావుడి ఉంటుండటంతో ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎవరైనా స్థానికులు ఇదేంటని ప్రశ్నించడానికి సైతం జంకుతున్నారు. వైన్‌షాపుల వద్ద బయట పరిస్థితి అంతా జాతరను తలపిస్తోంది. తాగిన మత్తులో వాళ్లు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. బెల్టుషాపుల జోరు జిల్లాలో మద్యంషాపులకు తోడు బెల్టుషాపులు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. రోజూ ఏదో ఒకచోట ఎక్సైజ్ అధికారులు బెల్టుషాపుల నిర్వాహకులను పట్టుకుంటునే ఉన్నారు. కానీ బెల్టుషాపులను మాత్రం పూర్తిగా అరికట్టలేకపోయారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో 3,200 వరకు ఉన్న గొలుసు దుకాణాలు ఇప్పడు తగ్గిపోయాయి. కానీ అక్కడక్కడ రహస్యంగా నడుస్తూనే ఉన్నాయి. అధికారపార్టీ అండదండలతో గుట్టుచప్పుడు కాకుండా బెల్టుషాపులను కొందరు నడిపిస్తున్నారు. కొంతమంది స్థానిక అధికారుల సహకారంతోనే నడుస్తున్నాయనేది అందరికీ తెలిసిన సత్యం. బహిరంగ ప్రాంతాల్లో కాకుండా చడీచప్పుడు లేని ప్రాంతాలు వేదికగా షాపులను నిర్వహిస్తున్నారు. రాయచోటి పరిధిలో అయితే ఇప్పటికీ ఏకంగా కూల్‌డ్రింక్ షాపుల్లో, సాధారణ ఇళ్లలో పెట్టి మద్యం విక్రయిస్తున్నారు. పైగా అధికారుల సహకారంతోనే నడుస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. -
మద్యం దుకాణాల పై రాళ్ల దాడి
-
వైన్‌షాపు ఏర్పాటుపై ఆగ్రహం
గోనెగండ్ల వాసుల రాస్తారోకో గోనెగండ్ల : మండల కేంద్రంలో రెండోవైన్ షాపు ఏర్పాటు మరోసారి స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. మొదటి సారి గ్రామంలోని అచ్చుకట్ల వీధిలో పెద్ద కట్ట వద్ద టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త నాగేష్‌నాయుడు బినామీ పేరుపై వచ్చిన వైన్‌షాపు ఏర్పాటుకు ప్రయత్నించగా అక్కడి ముస్లింలు అడ్డుకున్నారు. మూకుమ్మడిగా కలెక్టరేట్ ముట్టడి చేపట్టడంతో షాపు ఏర్పాటుకు తెరపడింది. ప్రస్తుతం రెండోషాపు ఏర్పాటు విషయం మళ్లీ స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. స్థానిక స్టేట్‌బ్యాంక్ సమీపంలో రోడ్డు పక్కన ఓవ్యక్తి దుకాణంలో వైన్‌షాపు ఏర్పాటు చేయడంతో ఆప్రాంత మహిళలు, ముస్లింలు అడ్డుతగిలారు. ఈమేరకు శనివారం స్థానిక పోలీసులతోపాటు పత్తికొండ ఎక్సైజ్ అధికారులు, కర్నూలులోని ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా షాపు ఏర్పాటు చేయడంతో ఆదివారం ముస్లింలు, మహిళలు వందలాదిగా తరలివచ్చి షాపు ఎదుట కర్నూలు ప్రధాన రహదారిపై బైఠాయించారు. జనావాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటుకు ఎలా అనుమతించారంటూ ఎక్సైజ్ శాఖ అధికారులను ప్రశ్నించారు. ముడుపులు తీసుకుని అనుమతించారంటూ ఆరోపించారు. మద్యం షాపు అనుమతి రద్దు చేయాలని, లేకుంటే ఎక్సైజ్ జిల్లా కార్యాలయంతో పాటు కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఖతీబ్రహమాన్, రహంతుల్లా, ఎస్ఎన్.మాబువలి, డాక్టర్ ఉస్మాన్, దాదావలి, వాహిద్, బ్రహ్మయ్య, బావిగడ్డ ఈరన్న, కొడల్ షఫి. పెయింటర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
రాయచోటిలో కట్టలు తెంచుకున్న మహిళల కోపం
-
వైన్‌షాపు తొలగించే వరకు ఆందోళన
- ఎమ్మిగనూరులో మహిళల ఆగ్రహం - బైపాస్ రోడ్డుపై రాస్తారోకో ఎమ్మిగనూరు రూరల్ : స్థానిక ఎస్ఎంటీ కాలనీ నాగప్పల కట్ట నివాసాల దగ్గర కొత్తగా ఏర్పాటు చేసిన తుంగభద్ర వైన్ షాపును తొలగించే వరకు ఉద్యమిస్తామని ఆ ప్రాంతం మహిళలు అన్నారు. దుకాణం తొలగించాలని కోరుతూ గురువారం కాలనీ మహిళలు స్థానిక ఆదోని రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మందుబాబులు మత్తులో ఇళ్ల ముందు మూత్ర విసర్జన చేస్తున్నారని, ఈ కారణంగా కంపు భరించలేకుండా ఉన్నామని భారతమ్మ, రాజేశ్వరి, చంద్రకళ, పార్వతమ్మ, పద్మావతి, శాంతమ్మ వాపోయారు. మద్యం కోసం వైన్‌షాప్ దగ్గర జనం గుమిగూడుతుండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. మహిళలు , పిల్లలు రోడ్డుపైకి రావాలంటేనే భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి వైన్ షాప్‌ను తొలగించే వరకు ఉద్యమిస్తామని, ఎన్నిరోజులైనా అందోళనకు దిగుతామని హెచ్చరించారు. వైన్‌షాప్ వారితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి సర్దిచెప్పడంతో శాంతించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్‌దాస్, పోలీసులకు వినతి పత్రాలు అందించారు. -
అడ్డా నాదే
– నా ఇలాకాలో ఇతరుల మద్యం షాపులను సహించను – ఎక్సైజ్ అధికారులకు అధికార పార్టీ ‘నేత’ల హుకూం – 5 నియోజకవర్గాల్లో 50కి పైగా దుకాణాలకు నాయకుల సెగ కర్నూలు : నేను మోనార్క్... నా ఇలాకాలో ఇతరులు మద్యం షాపులను ఏర్పాటు చేస్తే సహించను... వారి లైసెన్సులను రద్దు చేయండి.. అంటూ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఎక్సైజ్ అధికారులకు ఫోన్లో హుకూం జారీ చేయడం ఆ శాఖలో చర్చనీయాంశమయ్యింది. కర్నూలు శివారులోని మాసమసీదు సమీపంలో సుంకేసుల రోడ్డులో మద్యం దుకాణం ఏర్పాటుకు అలంపూర్‌కు చెందిన వ్యక్తికి అధికారులు లైసెన్సు జారీ చేశారు. దుకాణం ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికార పార్టీ నేత హుకూం జారీ చేశాడు. ఆ దుకాణం రద్దుకు ఎక్సైజ్ అధికారులపై కూడా ఒత్తిడి చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అలాగే మండల పరిధిలోని సుంకేసుల మద్యం దుకాణాన్ని లక్కీడిప్‌లో ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకుడు దక్కించుకున్నాడు. అక్కడ కూడా తన అనుచరులే మద్యం దుకాణం నిర్వహిస్తారు. మరో ప్రాంతం వారిని అనుమతించేది లేదంటూ సదరు నాయకుడు దుకాణం ఏర్పాటును అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ లైసెన్స్‌దారుడు అక్కడ దుకాణం ఏర్పాటు చేసుకోలేక అవస్థలు పడుతున్నాడు. నాయకుడిని ఎదిరించి దుకాణం పెట్టుకోలేక గార్గేయపురంలో ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించగా అక్కడ కూడా అధికార పార్టీ నేత ముఖ్య అనుచరుడు అడ్డుకున్నట్లు సమాచారం. ఎమ్మిగనూరు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 15 దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. అందులో ఎమ్మెల్యే అనుచరులు 9, ఇతరులు 6 దుకాణాలు దక్కించుకున్నారు. అయితే ఇతరుల దుకాణాలను ఏర్పాటు కానివ్వకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఆదోని, పత్తికొండ, నందికొట్కూరు, కోడుమూరు ప్రాంతాల్లో కూడా అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలతో ఇదే తరహాలో ఎక్సైజ్ అధికారులపై నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ముందు నుయ్యి... వెనక గొయ్యి... జిల్లాలో మద్యం వ్యాపారుల పరిస్థితి ముందు నుయ్యి... వెనక గొయ్యి... అన్న చందంగా మారింది. మద్యం దుకాణాలను ప్రారంభించేందుకు కొందరికి ధైర్యం చాలడం లేదు. మహిళలు, ప్రజాసంఘాల ఆందోళనలు ఒకవైపు.. అధికార పార్టీ నాయకుల బెదిరింపులు మరోవైపు. జిల్లాలో 5 నియోజకవర్గాల్లో సుమారు 50 దుకాణాలకు ఈ పరిస్థితి ఏర్పడింది. షాపుల ఏర్పాటుకు స్థలాలు ఇవ్వకుండా అధికార పార్టీలోని వైరి వర్గాలే అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అటు మద్యం వ్యాపారులు... ఇటు ఎక్సైజ్ అధికారులు తర్జనభర్జనలో ఉన్నారు. అనుమతి పత్రాలు పొందిన వ్యాపారులు కూడా ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో దుకాణాలు ప్రారంభించడానికి జంకుతున్నారు. కొత్తగా షాపులు దక్కించుకున్న వారిని అధికార పార్టీ నాయకులు నా సామ్రాజ్యంలో దుకాణం పెట్టొద్దంటూ హెచ్చరిస్తుండటంతో ఎక్కడ ప్రారంభించాలని ఆలోచనలో పడ్డారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నువ్వా.. నేనా.. అన్న రీతిలో పోటీ పడి లక్కీడిప్‌లో దుకాణాలను దక్కించుకున్నారు. తీరా వాటిని ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా నేతల జోక్యం తలనొప్పిగా మారింది. -
తెనాలిలో ఉద్రిక్తత.. కారం చల్లిన మహిళలు
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్తత నెలకొంది. ఇళ్ల మధ్యనే మద్యం షాపు ఏర్పాటును ఆగ్రహించిన పట్టణ మహిళలు ఆ షాపు పై దాడి చేశారు. స్తానిక రజక చెరువు సమీపంలో ఏర్పాటువుతున్న దుకాణంలోని సిబ్బందిపై కారం చల్లి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై చేరి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
అధిక ధరలకు మద్యం.. వైన్ షాపు సీజ్
వరంగల్ రూరల్: నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న ఓ వైన్ షాపును ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. వరంగల్ రూరల్ జిల్లాలోని పర్వతగిరి మండల కేంద్రంలో ఉన్న లక్ష్మి వైన్ షాపులో గత కొన్ని రోజులుగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న లక్ష్మి వైన్స్ షాపును సీజ్ చేయడంతో పాటు రూ. 3.50 లక్షల జరిమానా విధించారు. -
ఆయన కిక్కుకో లెక్కుంది!
►ఓ మద్యం దుకాణం చెప్పిన అవినీతి కథ ►అనధికార వైన్‌షాపునకు అండాదండా ఆయనే ►కోర్టు తీర్పులు, ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ ►చోద్యం చూస్తున్న డిప్యూటీ కమిషనర్ ►కోర్టుధిక్కారణ కేసు నమోదుకు ఫిర్యాదుదారుల సమాయత్తం అవిలాల(తిరుపతి రూరల్): ఎక్సైజ్‌శాఖలో ఆయనో సర్కిల్ ఇన్స్పెక్టర్. తిరుపతి నగరానికి సమీపంలో విధులు నిర్వర్తించే ఆయన కాసులు ఇస్తే నిబంధనలు తుంగలో తొక్కుతారని సొంత డిపార్ట్మెంట్ సిబ్బంది నుంచే ఆరోపణలు ఉన్నా యి. ఇది ఎంతగా అంటే కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతారు చేసి మరీ అడ్డదారి లో షాపులు ఏర్పాటు చేసేంత ‘లెక్క’ లేని తనం తన సొంతమని చెప్పుకుంటారు. తప్పుడు అడ్రస్‌తో ఏర్పాటు చేసిన షాపును ఎత్తివేయాలని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్పందించని ఆ అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పుడు అడ్రస్‌తో షాపు నిర్వాహణ.. తిరుపతి రూరల్ మండలం రామానూజపల్లి చెక్‌పోస్ట్ నుంచి మహిళావర్సిటీకి వచ్చే దారిలో ఓ వైన్ షాపును 33 రోజుల క్రితం ఏర్పాటు చేశారు. వేదాంతపురం అడ్రస్‌తో అనుమతి వచ్చిన ఈ షాపును నిబంధనలకు విరుద్ధంగా అవిలాల పంచాయతీలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే పంచాయతీలో రెండు షాపులు ఉన్నాయి. మూడోది నిబంధనలకు విరుద్ధమని అవిలాల వైన్స్ నిర్వాహకులు కిషోర్ కుమార్, మల్లంగుంట చిన్ని వైన్స్ అధినేత మునస్వామిరెడ్డి అధికారుల కు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిం చారు. దీంతో షాపును ఎత్తివేయాలని గత నెల 19న కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులు బేఖాతర్ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన షాపును ఎత్తివేయాలని హైకోర్టు ఆదేశించినా.. సంబంధిత ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవటం లేదు. ముత్యాలరెడ్డిపల్లిలోని కార్యాలయంలో ఆ త్రిబుల్‌స్టార్ అధికారి మధ్యస్తం పేరుతో ఫిర్యాదుదారులను పిలిపించుకుని బెదిరిస్తున్నట్లు సమాచారం. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైతం కోర్టు ఆదేశాల మేరకు షాపును ఎత్తివేయాలని ఆదేశించారు. కానీ ఆ ఆదేశాలను సైతం పట్టించుకోని సదరు అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన షాపును మాత్రం కంటికి రెప్పలా కాపాడుతుండడంపై సిబ్బంది సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ కమిషనర్‌కు.. ఫిర్యాదు చేస్తాం అవిలాల పంచాయతీలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వైన్‌షాపును ఎత్తివేయాలని ఎన్నిసార్లు విన్నవించినా స్పందించకపోవడం దారుణం. కోర్టు ఆదేశాలు సైతం పట్టించుకోని ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తప్పుడు అడ్రస్‌తో ఏర్పాటు చేసిన షాపు వల్ల రోజుకు రూ.8 వేలు నష్ట పోతున్నాం. గత 33 రోజులుగా మాకు జరిగిన నష్టాన్ని అధికారులే చెల్లించాలి. అధికారి తీరుపై కోర్టు ధికార్కణ కేసు నమోదు చేయడమే కాకుండా కమిషనర్‌కు సైతం ఫిర్యాదు చేస్తాం. – కిషోర్‌కుమార్, అవిలాల వైన్స్ నిర్వాహకుడు -
తలుపులు బార్లా!
⇒మహానగరంలో ‘మద్య’భారతం ⇒రాత్రీ పగలు మందుబాబుల స్వైర విహారం ⇒వేళలు పాటించని వైన్ షాపులు, బార్లు ⇒అధిక ధరలతో అర్ధరాత్రీ అమ్మకాలు ⇒అవినీతి మత్తులో ఎక్సైజ్ శాఖ మహానగరంలో మందుబాబుల ఆగడాలు మితిమీరుతున్నాయి. రాత్రీ పగలూ.. రహదారుల వెంట..వీధులు..కాలనీలు..నడిరోడ్లపై.. ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగుతూ న్యూసెన్స్ సృష్టిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల గుండా వెళ్లాలంటేనే మహిళలు, వృద్ధులు, చిన్నారులు హడలిపోతున్నారు. కాసుల కక్కుర్తితో వేళలు పాటించకుండా బార్లు, వైన్ షాపుల్లో ఎప్పుడు పడితే అప్పుడు మద్యం విక్రయిస్తున్నారు. అవినీతికి మరిగిన ఎక్సైజ్ శాఖ వీటిని పట్టించుకోక పోవడంతో మద్యం విక్రేతలు అధిక ధరలకూ విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ వివిధ రేట్లలో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. మహానగరవ్యాప్తంగా అసాంఘిక శక్తులు, మందుబాబుల ఆగడాలకు నిలయంగా మారిన మద్యం దుకాణాలు, బార్ల వద్ద పరిస్థితిని గురువారం రాత్రి, శుక్రవారం ‘సాక్షి’ బృందం విస్తృతంగా పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై.. లైవ్ రిపోర్ట్... నగరంలో చాలా చోట్ల మద్యం షాపులు, బార్ల వద్ద బహిరంగంగానే మద్యం తాగుతూ మందుబాబులు రెచ్చిపోతున్నారు. దీంతో ఆ దారుల గుండా వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ మద్యం షాపులు, బార్లను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచుతున్నారు. కొందరు దొడ్డిదారిలో యథేచ్ఛగా మద్యం విక్రయిస్తూ అధికరేట్లు వసూలు చేస్తున్నారు. మద్యం షాపుల వద్ద పరిస్థితిపై సాక్షి లైవ్ రిపోర్టు ఇదీ... సాక్షి, సిటీబ్యూరో: రూట్ 1 ప్రాంతాలు: దిల్సుఖ్నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, వనస్థలిపురం, హస్తినాపురం, బీఎన్‌రెడ్డి నగర్ లైవ్‌రిపోర్ట్ నిబంధనలకు విరుద్ధంగా భారీ విస్తీర్ణంలో పర్మిట్‌రూంలు ఉన్నాయి. రాత్రి 9.30 తరువాత తలుపులు మూసి లైట్లు ఆర్పి.. అర్ధరాత్రి 12 వరకు మద్యం సరఫరా అవుతోంది. రాత్రి 10 తరవాత కూడా వనస్థలిపురం ప్రధాన రహదారిపై ఉన్న ఓ వైన్స్ సమీపంలో రోడ్డుపక్క నిలబడి మందుబాబులు బీర్లు తాగుతూ కనిపించారు. రూట్ 2 ఏరియా: మాదాపూర్ ప్రాంతాలు: మాదాపూర్ పరిసరాలు లైవ్‌రిపోర్ట్: ఐటీసంస్థలకు నిలయంగా మారిన ఈ ప్రాంతంలో మద్యం దుకాణాలు వేళాపాళా లేకుండా కొనసాగుతున్నాయి. మహిళా ఉద్యోగులు రాకపోకలు సాగించే ఈ మార్గంలో రోడ్డుపైనే మందుబాబుల ఆగడాలు కనిపించాయి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వంద అడుగుల రోడ్డులోని మద్యం దుకాణం ముందు వాహనాలు ఆపి బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. మద్యం మత్తులో పాదచారుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు చెప్పారు. కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు డ్రైవర్లు బస్సుల్ని ఆపి మరీ మద్యం కొనుగోలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. రూట్ 3 ఏరియా: మారేడ్‌పల్లి లైవ్‌రిపోర్ట్: మారేడుపల్లిలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద ప్రజలు బహిరంగంగా మద్యం సేవిస్తూ కనిపించారు. వైన్‌షాపు సిబ్బంది కానీ, స్థానిక పోలీసులు కానీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మందుబాబుల ఆగడాలతో పాదచారులు ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగించడం కనిపించింది. కొన్ని చోట్ల మద్యం షాపులు, బార్లు వేళాపాళా లేకుండా తెరవడం, మూయడం కన్పించింది. కనీస వేళలను ఎవరూ పట్టించుకోవడం లేదు. రూట్ 4 లైవ్‌రిపోర్ట్: రాత్రి 10 గంటలు దాటినా మద్యం దుకాణాల వద్ద హడావిడి కనిపించింది. పర్మిట్ రూమ్‌లు నిబంధనలకు విరుద్ధంగా విశాలంగా నిర్మించారు. రూట్ 5 ఏరియా: పాతబస్తీ ప్రాంతాలు: లాల్‌దర్వాజా, ఛత్రినాక, ఉప్పుగూడ, శంషీర్‌గంజ్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఫిసల్‌బండ లైవ్‌రిపోర్ట్: లాల్‌దర్వాజా మోడ్ ప్రాంతంలోని ఓ వైన్స్ వద్ద న్యూసెన్స్ ఉంటుండడంతో అక్కడే బస్టాప్‌లో ఉంటున్న ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఛత్రినాక చౌరస్తాలోని ఓ వైన్స్ ముందు మందుబాబులు తిష్ట వేస్తుండడంతో పక్కన ఉన్న గల్లీలోకి స్థానికులు వెళ్లలేని దుస్థితి. ఉప్పుగూడలోని ఓ వైన్స్ ముందు కూడా పార్కింగ్ సమస్య కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శంషీర్‌గంజ్‌లోని ఓ వైన్స్, నాగులబండలోని వైన్స్‌ల వద్ద పర్మిట్ రూమ్ 10 బై 10 కాకుండా అతి పెద్ద విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. చాంద్రాయణగుట్టలోని పరిధిలోని రెండు మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల కన్నామముందే తెరచుకుంటున్నాయి. కొన్ని బార్లు అర్ధరాత్రి అనంతరం కూడా అమ్మకాలు కొనసాగించాయి. ►గ్రేటర్ పరిధిలో మద్యం దుకాణాలు: 400 ►బార్లు: 540 -
మద్యం దుకాణం.. కాలనీల్లో దుమారం
- 500 మీటర్ల ఆంక్షలతో విక్రయదారులు ఉరుకులు..పరుగులు - ప్రత్యామ్నాయలో భాగంగా సమీప కాలనీ వైపు చూపు – సంసారల మధ్య వద్దంటూ మహిళల ఆందోళన – భగవాన్‌నగర్, ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో చీపుర్లతో నిరసన కర్నూలు: మద్యం వ్యాపారుల్లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు గుబులు పుట్టిస్తున్నాయి. ఆరు నెలల క్రితం వరకు 100 మీటర్లకే ఉన్న ఆంక్షలు కాస్త 500 మీటర్లకు చేరడంతో కొత్త ఇలాకాల్లో దుకాణాల ఏర్పాటుకు విక్రయదారులు వెతుకులాటలో ఉన్నారు. అయితే సంసారాల మధ్య మద్యం దుకాణాలు వద్దు అంటూ మహిళలు చాలా కాలనీల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు నగరంలో జాతీయ రహదారి పక్కన ఉన్న కల్లూరు చెన్నమ్మ సర్కిల్ పరిధిలోని మద్యం దుకాణాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వ్యాపారులు సన్నద్దం కాగా, కల్లూరు ఎస్టేట్ పరిధిలోని భగవాన్‌నగర్, పోలీస్ కాలనీ, ఇండస్ట్రీయల్ ఎస్టేట్, గ్రామ స్వరాజ్య సంఘం కాలనీ వాసులు కొంత కాలంగా అడ్డుకుంటున్నారు. ఒక్కొక్క దుకాణానికి లక్ష రూపాయల దాకా బాడుగ ఇస్తామని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంటున్నప్పటికీ స్థానికంగా నివాసం ఉండే కుటుంబాల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారులకు 500 మీటర్లలోపు మద్యం విక్రయాలను నిషేధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో మద్యం వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్న నేపథ్యంలో నిరసనలు మొదలయ్యాయి. దిక్కుతోచని స్థితిలో వ్యాపారులు జిల్లాలో మొత్తం 203 మద్యం దుకాణాలు, 32 బార్లు ఉన్నాయి. అందులో 164 దుకాణాలు, 16 బార్లు జాతీయ రహదారులకు 100 మీటర్ల దూరంలోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి నిర్వాహకులకు ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఆంక్షల పరిధిలో ఉన్న దుకాణాలు, బార్లను ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త కాలనీలకు దుకాణాలను తరలించే పనిలో మద్యం వ్యాపారులు ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు కావడంతో కచ్చితంగా అమలు చేసేందుకు ఎక్సైజ్ అధికారులు పట్టుదలగా ఉన్నారు. సంసారాల మధ్య మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు కాలనీ మహిళలు నిరసన వ్యక్తం చేస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కొంతమంది వ్యాపారులు కొట్టుమిట్టాడుతున్నారు. భగవాన్ నగర్, పోలీసు కాలనీ వాసులు మద్యం దుకాణాలను అడ్డుకోవడం కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కల్లూరులోని పారిశ్రామిక వాడలో తమ ఇళ్ల మధ్య మద్యం దుకాణం వద్దంటూ ఆదివారం చీపుర్లతో నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో అటు వ్యాపారులకు, ఇటు ఎక్సైజ్ అధికారులకు సమస్య మింగుడు పడని విధంగా మారింది. ఏప్రిల్ నుంచి కొత్త మద్యం లైసెన్సులు: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారుల పక్కన 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఉండాలన్న నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ తీసుకరానుంది. ఈ మేరకు మద్యం షాపుల యజమానులకు కొత్త లైసెన్సులు జారీ చేసే విషయంలపై ఇటీవల విజయవాడలో ఆశాఖ మంత్రి కమిషనర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో కర్నూలు డివిజన్ పరిధిలో 86, నంద్యాల డివిజన్ పరిధిలో 77 షాపులు జాతీయ రహదారుల పక్కనున్నట్లు గుర్తించి వాటికి నోటీసులు కూడా జారీ చేశారు.మిగితా 40 షాపులు మాత్రం యథావి«ధిగా కొనసాగుతాయి. వీటికి మాత్రం జూన్ వరకు లైసెన్సులు కొనసాగించాలని, 163 దుకాణాల మాత్రం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త లైసెన్సులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. జాతీయ రహదారి పక్కనున్న దుకాణాలను ప్రత్యామ్నాయ కాలనీల్లో ఏర్పాటు చేయడానికి మహిళల నుంచి నిరసన వెల్లువెత్తుతుండటంతో ఎక్సైజ్ అధికారులకు తలనొప్పిగా మారింది. -
ఇదేం చోద్యం!
మద్యం వద్దంటే బెదిరింపు లేఖలు లేఖల తీరుపై పెనుబాక కాలనీవాసుల నిరసన ర్యాలీ పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన మద్యం వద్దన్నందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమ గ్రామంలో మద్యం విక్రయాలు జరిపేందుకు వీల్లేదంటూ కొన్నాళ్ల కిందట పెనుబాక దళిత కాలనీవాసులు సంబంధిత విక్రయాలను అడ్డుకున్నారు. విక్రయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయితే కొద్ది రోజుల పాటు ఊరుకున్న మద్యం వ్యాపారుల వ్యక్తులు గుర్తు తెలియని పేర్లతో కాలనీ వాసులను హెచ్చరిస్తూ తాజాగా లేఖలు పంపారు. దీనిపై ఆగ్రహించిన కాలనీ వాసులు నిరసన ర్యాలీ నిర్వహించారు. సంబంధిత లేఖలు రాసిన వారిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... రాజాం: గ్రామంలో మద్యం విక్రయాలు నిలిపి వేయమన్నందుకు బెదిరింపు లేఖలు పంపిస్తున్నారు. అసభ్య పదజాలాలతో ఆడవాళ్లను అవమానపరిచే విధంగా లేఖలు రాసారు. దీంతో ఆందోళన చెందిన పెనుబాక కాలనీ వాసులు సంబంధిత వ్యక్తులపై చర్యలకు డిమాండ్ చేస్తూ సుమారు ఐదు కిలోమీటర్ల దూరాన నిరసన ర్యాలీ ఆదివారం నిర్వహించారు. ర్యాలీగా రాజాం పోలీసుస్టేషన్‌కు వచ్చి మూకుమ్మడిగా ఫిర్యాదు చేశారు. ఇదేం చోద్యమంటూ ప్రశ్నించారు. సంబంధిత వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... మండల పరిధిలోని పెనుబాక గ్రామంలో మూడు నెలలు కిందట బెల్ట్ దుకాణాలకు సంబంధించి వేలం పాట నిర్వహించారు. దీంతో ఈ పాటను వ్యతిరేకిస్తూ గ్రామంలో మద్యం విక్రయాలు నిలిపివేయాలని గ్రామంలోని దళిత కాలనీకి చెందిన పలువురు డిమాండ్ చేశారు. విక్రయాలు జరిపితే దాడులకు సైతం పాల్పడతామని హెచ్చరించారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామంలో మద్యం విక్రయాలు నిలిచిపోయాయి. బెదిరింపు లేఖలు వీటిని సహించలేని మద్యం విక్రయాలు కొందరు వ్యక్తులు దళిత కాలనీకి చెందిన బలగ సూర్యనారాయణ, టొంపల గణేష్‌లకు ఆదివారం ఉదయం వేర్వేరుగా పోస్టు ద్వారా లేఖలను బట్వాడా చేశారు. ఈ లేఖల్లో సూర్యనారాయణ, గణేష్ కుటుంబాలను ఎస్సీ కులంతో తిట్టడమే కాకుండా వారి ఇళ్లల్లో ఉన్న భార్య, పిల్లలను అసభ్య పదజాలాలతో తిడుతూ లేఖ రాసారు. దీంతో ఆందోళనకు గురైన ఆయా కుటుంబాలు వారు కాలనీ వాసులైన బలగ అప్పన్న, బలగ నర్శింహులు, జరజాన గణేష్ తదితర వారికి వాటిని చూపించి సుమారు 200 మందితో ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న రాజాం పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీగా వచ్చారు. ఆ లేఖలపై సీఐ శంకరరావుకు ఫిర్యాదు చేశారు. తక్షణమే లేఖలు రాసిన∙వారిని గుర్తించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన సీఐ మాట్లాడుతూ దర్యాప్తు నిర్వహించి చర్యలు చేపడతామని తెలిపారు. -
గుళ్లు సరే.. మరి మద్యం షాపు ?
214–ఎ జాతీయ రహదారి పక్కనే మద్యం దుకాణం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లో..పసుపు జెండాలతో హెచ్చరికలు మిన్నకుండిపోతున్న అధికారులు రేపల్లె: పుష్కర ఘాట్లకు ఆటంకం అంటూ దేవాలయాలు, పేదల నివాసాలను నిర్ధాక్షణ్యంగా తొలగిస్తున్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా హైవేకు 50మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించకపోవటంపై గ్రామస్తులు విమర్శ వర్షం కురిపిస్తున్నారు. కాసులకు అలవాటు పడిన అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో నడుస్తున్న మద్యం దుకాణం జోలికి మాత్రం వెళ్ళకపోవటంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేషనల్ హైవేకు 500మీటర్ల దూరంలో ఉండాల్సిన మద్యం దుకాణం ఏకంగా 50 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయటంతో పాటు దానికి అనుసంధానంగా హోటల్ ఏర్పాటు చేసి బార్‌ను తలపించే విధంగా నిర్వహిస్తున్నారు. వైన్ షాపు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నదని అధికారులు గుర్తించే విధంగా పసుపు జెండాలను రక్షణ కవచంలా ఏర్పాటు చేశారని, అందుకే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపును నిర్వాహిస్తున్న తమకు రావాల్సిన వాటాలను అందుకుని అటువైపు కన్నెతైనా చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కర ఘాట్‌కు సమీపంలో ఎటువంటి తినుబండారాలు అమ్మకూడదంటూ చిరువ్యాపారులకు హుకుంజారీ చేసిన అధికార యంత్రాంగం అధికార పక్షం నేతల కనుసన్నల్లో నడుస్తున్న వైన్ షాపుకు మాత్రం ఎటువంటి నింబంధనలు విధించకపోవటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెనుమూడి–పులిగడ్డ వారధికి పోలీస్ చెక్ పోస్టుకు మద్యలో 214–ఎ జాతీయ రహదారికి 50 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురికావటంతో పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగే విధంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. -
నిషా ధర.. నషాళానికి!
⇒చుక్కల్లో మద్యం ధరలు క్వార్టర్‌కు రూ.10 అదనం ఫుల్ బాటిల్‌పై రూ.40 ⇒ఎక్సైజ్ మంత్రి సొంత ఇలాకాలోనూ ఇష్టారాజ్యంగా విక్రయాలు ⇒24 గంటలూ అందుబాటులో మద్యం బెల్టుషాపుల నిర్వహణ షరా మామూలే జిల్లాలో మద్యం ధరలు చుక్కలనంటుతున్నాయి. ఎమ్మార్పీ ధరకు మించి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లా అంతటా ఈ పరిస్థితి కొనసాగుతోంది. సాక్షాత్తూ ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లా అయినా నిబంధనలను పట్టించుకునే నాథుడే లేడు. అధిక ధరకు విక్రయాలు సాగిస్తున్నా అడిగే పరిస్థితి లేదు. తాజాగా మంత్రి సొంత నియోజకవర్గమైన మచిలీపట్నంలోనూ మద్యం ధరలు ఇష్టారాజ్యంగా పెంచేశారు. మచిలీపట్నం : ఎక్సైజ్ శాఖ మంత్రి సొంత ఇలాకాలో మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. జిల్లాలో యథేచ్ఛగా ఎమ్మార్పీపై క్వార్టర్ బాటిల్‌కి రూ.10 పెంచి విక్రయాలు చేస్తున్నారు. ఫుల్ బాటిల్‌కి ఈవిధంగా రూ.40 అదనంగా వసూలు చేస్తున్నారు. తాజాగా మంత్రి సొంత నియోజకవర్గమైన మచిలీపట్నంలోనూ బరితెగించేశారు. ఐదు రోజుల క్రితం మద్యం సిండికేట్ వ్యాపారులు, మరో ఇద్దరు టీడీపీ కీలక నాయకులు సమావేశమై మద్యం ధరలను పెంచాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా క్వార్టర్ బాటిల్‌కు రూ.10 చొప్పున ధర పెంచేసి విక్రయాలు జరుపుతున్నారు. పట్టణంలోని ఏడు వైన్ షాపులు, పది బార్ అండ్ రెస్టారెంట్లలో ఇవే ధరలు అమలవుతున్నాయి. ఇంతా జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. జిల్లా అంతటా... జిల్లాలో మొత్తం 334 మద్యం దుకాణాలు ఉండగా, విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలో 160, మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలో 174 మద్యం షాపుల వరకు ఉన్నాయి. మచిలీపట్నం ఈఎస్ పోస్టు ఎనిమిది నెలలుగా ఖాళీగానే ఉంది. మచిలీపట్నం సీఐ పోస్టుతో పాటు మచిలీపట్నం ఎక్సైజ్ కార్యాలయ ఏవో పోస్టు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉన్నా వీటిని భర్తీ చేయటం లేదు. ఏఈఎస్ ఇన్చార్జ్ ఈఎస్‌గా వ్యవరిస్తున్నారు. జిల్లా అంతటా మద్యం ధరలు ఎమ్మార్పీ కంటే అదనంగా పెంచి వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. సమయపాలన ఏదీ? మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంటోంది. నిబంధనల ప్రకారం వైన్‌షాపు ఉదయం 10 గంటలకు తీసి రాత్రి 10 గంటలకు మూసివేయాలి. బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలి. ఈ నిబంధనలు జిల్లాలో ఎక్కడా అమలుకాని పరిస్థితి నెలకొంది. 24 గంటల పాటు మద్యం విక్రయాలు జరుపుతున్నారు. వీటికి తోడు తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. బెల్టు షాపుల్లో క్వార్టర్ బాటిల్‌కు మరో రూ.5 వసూలు చేస్తున్నారు. చింతగుంటపాలెం, కాలేఖాన్‌పేట, గిలకలదిండి, బందరుకోట బైపాస్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో బెల్టుషాపుల నిర్వహణ యథేచ్ఛగా కొనసాగుతోంది. గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
బేకరి బాయ్ నుంచి మేయర్ వరకు
ఆయనది చిన్నప్పటి నుంచి ముళ్లబాటే. చదువుకునే రోజుల్లోనే తండ్రి దూరమయ్యాడు. అందరికంటే చిన్నవాడైనా ఇంటి బాధ్యత భుజాన వేసుకున్నాడు. ఇది.. అదీ అని చూడకుండా బేకరీలో, కూరగాయల మార్కెట్లో ఇలా.. అన్ని పనులూ చేశాడు. వైన్‌షాప్‌లో బిల్రైటర్గా చేరి.. వర్కింగ్ పార్ట్నర్ అయ్యూడు. అదే ఆయన వ్యాపారానికి తొలి మెట్టు. తప్పుని సహించని తత్వంతో రాజకీయంలోకి వచ్చాడు. జీవిత భాగస్వామి ఆయనకు పెద్ద ఆస్తి. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్న నానుడి ఆయన జీవితంలో నిజమైంది. ఎంత సంపాదించినా.. ఎంత ఎత్తుకు ఎదిగినా లారీ డ్రైవర్ కొడుకుననే విషయూన్ని మరిచిపోనంటున్న గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ -
ఆర్ట్ ఆఫ్ డ్రామా
హ్యూమర్ ప్లస్ మా చిన్నప్పుడు నాటకాలు ఆడేవాళ్లు. రాగం తీస్తే జీడిపాకమే. ఎంతకూ తెగదు. నోట్లోకి నాలుగైదు రెక్కల పురుగులు వెళ్లి కాసేపు సరాగాలు ఆడుకున్నా చలించేవాళ్లం కాదు. రాగానికి రాగానికి మధ్య కొంతమంది కునుకు కూడా తీసేవాళ్లు. రాగం వేగం పుంజుకునే కొద్దీ హార్మోనిస్ట్ వేళ్లు మెట్ల మీద నాట్యం చేసేవి. మా ఊళ్లో సాంబశివయ్య అనే హార్మోనిస్టు ఉండేవాడు. మంచి సంగీత విద్వాంసుడే కానీ, మందు పడితే హార్మోన్లు పని చేయవు. ఈ మందుకున్న గొప్పతనం ఏమంటే నిజమైన కళాకారుల్ని నిద్రపుచ్చుతుంది. డూప్లికేట్ కళాకారుల్ని మేల్కొలుపుతుంది. అందుకే వైన్‌షాపుల్లో బోలెడంత మంది మంచింగ్‌తో పాటు సింగింగ్‌ని కూడా నంజుకుంటారు. స్పోకెన్ ఇంగ్లిషు క్లాసులకంటే కూడా ఎక్కువ ఇంగ్లిష్ వినిపించేది ఇక్కడే. ఇంతకూ మన సాంబశివయ్య ఏం చేశాడంటే, నాటకం పరదాలు ఎత్తుతున్న సమయంలో బాటి ల్ మూత తీశాడు. మందుని బిగించాడు. మైక్ టెస్టింగ్‌లు జరుగుతూ ఉండగా నిశ్శబ్దంగా స్టేజి కిందికెళ్లి నిద్రపోయాడు. గురకలు తీశాడు కానీ అది మైక్ శబ్దం అనుకున్నారు. తబలావాడు ‘తదిగిణతోం’ అని దరువేసి హార్మోనిస్టుని కేకేశాడు. యముడి మహిషపు లోహపు గంటలు వినిపించినా లేచే పరిస్థితిలో లేడు సాంబశివుడు. తబలాకి అర్థమైంది, తనని వదిలి హార్మోనియం మందేసిందని. ‘తక్కిట తక్కిట’ అని కోపాన్నంతా తబలాపై తీర్చుకున్నాడు. మద్యం వల్ల పద్యానికి ఇబ్బంది వచ్చిందని నిర్వాహకులు గ్రహించారు. ప్రతి ఇల్యూజన్‌కి ఒక సొల్యూషన్ ఉంటుంది. అందువల్ల రామదాస్ రంగంలోకి వచ్చాడు. రామడోస్ అని ఆయనకో ముద్దు పేరు కూడా ఉంది. తనకి హార్మోనియం వస్తుందన్నాడు. ఎక్కడ నేర్చుకున్నావని అడిగారు. ఎక్కడా నేర్చుకోలేదని చెప్పాడు. సంగీతాన్ని కొందరు విని నేర్చుకుంటారు, కొందరు చూసి నేర్చుకుంటారు. మన రామదాస్ హార్మోనియం వాయించడాన్ని చూశాడంతే. లోకంలోని మహా పండితులంతా గొప్ప గొప్ప విద్యల్ని ఇలాగే నేర్చుకున్నారు. కనీసం వరుసలైనా తెలుసా అని రామదాసుని అడిగితే తనకి వావి వరసలు లేవన్నాడు. వెళ్లి హార్మోనియం ముందు కూర్చున్నాడు. హార్మోనియంలు రెండు రకాలు. చేత్తో గాలిని తోసేవి. కుట్టు మిషన్ తొక్కినట్టు కాలితో తొక్కేవి. టెంట్ హాల్లో లాగా ఇలా రెండు క్లాసులు ఉంటాయని మనవాడికి తెలియదు. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేసేసి రామదాసు బర్రుమని సౌండ్ చేశాడు. మందు వల్ల ఆల్రెడీ వణుకుతున్నందు వల్ల ఇతని ప్రమేయమేమీ లేకుండానే అవి మెట్ల మీద అటు ఇటు దొర్లాయి. తాము ఏమి పాడారో, వీడేం వాయించాడో నటులకు అర్థం కాలేదు. ప్రేక్షకులకు ఏవో గావు కేకలు, పెడబొబ్బలు వినిపించాయి. స్టేజ్ టు లో ఉన్న సాంబశివుడు ఎంత నికార్సయిన కళాకారుడంటే తన హార్మోనియంపై ఎవరో దాడి చేసి హింసిస్తున్నారని అతను నిద్రలోనే గ్రహించాడు. వస్త్రాపహరణం నాటకంలో ద్రౌపదిలాగా తన పెట్టె వేడుకుంటూ ఉందని కలలోనే తెలుసుకుని మేల్కొన్నాడు. లేచి చూస్తే రామదాసు సైకిల్ తొక్కినట్టు హార్మోనియాన్ని తొక్కుతున్నాడు. వేళ్లు దబేల్ దబేల్ మని బాదుతుంటే కొన్ని మెట్లు ముక్కలు చెక్కలై ఉన్నాయి. తబలాకి ఏం వాయించాలో తెలియక మౌనం వహించింది. సాంబశివుడు మూడో కన్ను తెరిచాడు. స్టేజి పైన స్తంభంలోంచి రావాల్సిన నరసింహస్వామి స్టేజి కింద నుంచి వచ్చాడు. ప్రమాదం గ్రహించిన రామదాసు, హార్మోనియంని గాలికొదిలి సేఫ్టీ కోసం స్టేజి ఎక్కాడు. పెద్ద దుడ్డుకర్ర తీసుకుని వెంటపడి కొండంత రాగం తీస్తున్న నటులకి కూడా సాంబశివుడు రెండు వడ్డించాడు. రామదాసు మాత్రం దొరకలేదు. డోస్‌లో ఉన్నా జోష్ తగ్గకుండా పారిపోయాడు. ఇప్పుడు స్టేజి మీద ఆడే నాటకాలు తగ్గిపోయాయి. అవి జీవితాన్ని ఆక్రమించేశాయి. ఎవడికి వాడే మహా నటుడుగా మారిపోతున్నాడు. కొత్త నాటకాలకి తెరలు, రంగులు అక్కర్లేదు. ప్రాంప్టింగ్తో పని లేదు. డైలాగ్‌లు ఇన్‌స్టంట్‌గా తయారైపోతున్నాయి. నటుడు, ప్రేక్షకుడు ఒకే మనిషిలో కనిపించే ఆధునిక నాటకాలు ఇవి. - జి.ఆర్. మహర్షి -
మద్యం షాపు ఏర్పాటును అడ్డుకున్న మహిళలు
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లాలో మద్యం షాపు ఏర్పాటును నిరసిస్తూ స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. సామర్లకోట విఘ్నేశ్వర థియేటర్ సమీపంలో మద్యం షాపు ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నివాసాల మధ్య, మార్కెట్ సమీపంలో షాపు ఏర్పాటు చేయవద్దని టెంట్ వేసుకుని మహిళలు అక్కడే కూర్చోని నినాదాలు చేస్తున్నారు. కాగా, మద్యం షాపు ఏర్పాటుకు తమకు లైసైన్స్ ఉందని షాపు యజమానులు చెబుతున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
కల్తీ మద్యం.. వైన్ షాప్ సీజ్
జమ్మికుంట (కరీంనగర్) : కల్తీ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కల్తీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. గాంధీ చౌరస్తా వద్ద ఉన్న లక్కీ వైన్స్‌లో కల్తీ మద్యం అమ్ముతున్నారని గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు దుకాణాన్ని సీజ్ చేసి షాప్ యాజమని ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఇంట్లో కూడా మద్యం కల్తీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
లిక్కర్ వ్యాపారులకు బార్కోడ్ బాదుడు
నెలకు రూ. 5 వేల వసూలు సరిగా పనిచేయని సాఫ్ట్వేర్ ఐఎంఎల్ డిపో వద్ద పడిగాపులు వైన్‌షాపుల్లో కొనుగోలు చూపినా స్టాక్ బ్యాలెన్సు చూపని వైనం గుడివాడ: లిక్కర్ వ్యాపారులకు బార్ కోడ్ స్కానర్ విధానం తలనొప్పిగా మారింది. అది సరిగా పనిచేయక పోయినా నెలనెలా సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీ మాత్రం అద్దె పేరుతో నెలకు రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ సరిగా లేకపోవడంతో ఐఎంఎల్ డిపో వద్ద సరుకు కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైటెక్ విధానం సాఫ్ట్వేర్ కంపెనీకి వరంగాను లిక్కర్ వ్యాపారులకు తలనొప్పిగాను మారింది. ఏడు నెలలుగా ఇబ్బంది ఎదుర్కొంటున్నా పట్టించుకున్న నాథుడే లేడని లిక్కర్ వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బార్ కోడింగ్ బాదుడు ఇలా.. మద్యం అమ్మకాలు ఆన్లైన్ చేసేందుకు బార్‌కోడింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బార్కోడ్ స్కానర్, కంప్యూటర్ కోసం ఒక్కో షాపు యజమాని రూ. ఒక లక్షా రెండు వేలకు చెక్కులను గ్యారెంటీ రూపంలో అందించారు. దీని సాఫ్ట్వేర్ కాంట్రాక్టును సీటెల్ కంపెనీ తీసుకోగా వైన్‌షాపుల్లో కంప్యూటర్లు అమర్చి బార్కోడ్ స్కానర్లు ఇచ్చారు. నిర్వాహణను కార్వే కంపెనీ తీసుకుంది. ప్రతి షాపునకు కంప్యూటర్లు, బార్కోడ్ స్కానర్లు ఇచ్చారు. బార్కోడ్ స్కానింగ్ అయిన అనంతరమే మద్యం విక్రయించాల్సి ఉంది. లిక్కర్ డిపో వద్ద కూడా ఇదే తరహాలో బార్ కోడ్ ద్వారా స్కాన్ చేస్తేనే సరుకు బయటకు ఇస్తారు. ఆన్ లైన్ సరిగా లేకపోవడంతోపాటు, బార్కోడ్ సాఫ్ట్వేర్ ఇబ్బందుల కారణంగా వారంలో రెండు, మూడు సార్లయినా లిక్కర్ గోదాము వద్ద సరుకు కోసం ఇబ్బంది పడాల్సి వస్తోంది. డిపో వద్దకు సరుకు కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రి వరకు వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. నెలకు రూ.4,999 బాదేస్తున్నారు జిల్లాలో ఉన్న 301 వైన్‌షాపులకు ఈ బార్కోడ్ స్కానర్లును అమర్చారు. ఇంకా 167 బార్లకు బార్కోడ్ స్కానర్లు ఇచ్చినా అవి అమర్చలేదు. ప్రస్తుతం అమర్చిన వైన్‌షాపుల నుంచి నెలకు బ్యాంకు అకౌంటు ద్వారా ఒక్కోషాపునకు రూ.4999 నేరుగా ఖాతా నుంచి తీసేసుకుంటున్నారు. స్కానర్లు కొన్ని బ్రాండ్లను ఆన్లైన్లో ఫీడ్ చేయకపోవడంతో ఐఎంఎల్ డిపో వద్ద స్కాన్ చేసినా తీసుకోవడం లేదని చెబుతున్నారు. వీటిలో ఎంసీ లగ్జరీ, ఓటి, ఆఫీసర్స్ చాయిస్ తదితర బ్రాండ్లను ఆన్లైన్లో స్కానింగ్ అంగీకరించ డం లేదు. కార్వే కంపెనీ ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌లో అమ్మకాలు వస్తున్నాయి కానీ ఆన్లైన్లో బ్యాలెన్సు షీటు రావడం లేదని చెబుతున్నారు. దీంతో ఒక్కో వైన్ షాపు యజమాని వద్ద ఆన్లైన్లో పెద్దఎత్తున స్టాక్ ఉన్నట్లు చూపిస్తోంది. పూర్తిస్థాయిలో సాఫ్ట్వేర్ పనిచేయకపోయినా తమ వద్ద ఇలా వసూలు చేయడంపై వైన్‌షాపు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ను సరిచేయాలని కోరుతున్నారు. -
మద్యం దుకాణంలో భారీ దొంగతనం
మెదక్: మద్యం దుకాణంలోనికి చోరబడిన దుండగులు పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లను ఎత్తుకుపోయారు. ఈ ఘటన మెదక్ జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ చౌరస్తా సమీపంలోని అమృత మద్యం దుకాణం నిర్వాహకులు మంగళవారం రాత్రి మద్యం షాపునకు తాళాలు వేసి వెళ్లిపోయారు. అర్థరాత్రి దాటిన తర్వాత గోడకు కన్నం పెట్టిన దొంగలు దుకాణంలోనికి ప్రవేశించి రూ.3 లక్షల విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకుపోయారు. బుధవారం ఉదయం స్థానికులు గమనించి దుకాణం నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. బాధితుని ఫిర్యాదు మేరకు తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్సై బాల్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మత్తెక్కిస్తాండ్లు..
పల్లె వాకిట్లో చీప్ లిక్కర్ ప్రవాహం నవంబర్‌లో 25,848 కేసుల మద్యం అమ్మకం గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిన విక్రయం బెల్ట్ షాపులకు ఎక్సైజ్ సిబ్బంది ప్రోత్సాహం మద్యం రహిత గ్రామాల్లో మళ్లీ వెలుస్తున్న షాపులు జిల్లాలోని పలు గ్రామాల్లో గుడుంబా అమ్మకాలు, తయారీని నియంత్రిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు ప్రకటించుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా మద్యం.. ఇందులో చీప్ లిక్కర్ వినియోగం వేల రెట్లు పెరిగిపోతున్నా, గ్రామాల్లో బెల్ట్ షాపుల సంఖ్య రెట్టింపవుతున్నా విస్మరించడం ఆందోళన కలిగిస్తోంది. వరంగల్ : పల్లెల్లో మద్యం విపరీతంగా పారుతోంది. మద్యపాన నియంత్రణపై అవగాహన కల్పించాల్సిన ఎక్సైజ్ శాఖే బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తోంది. ఎక్సైజ్ అధికారులు గుడుంబా విక్రయాలు నిర్వహించే వారిని అది మాన్పించి.. బెల్ట్ షాపుల నిర్వహణ వైపు మళ్లిస్తున్నారు. దీంతో ప్రతి ఊరిలోనూ బెల్ట్ షాపుల సంఖ్య రెట్టింపవుతోంది. మద్యం అమ్మకాలు కూడా ఇదే తీరుగా పెరుగుతున్నాయి. గుడుంబాను నియంత్రిస్తున్నట్లు ప్రకటించుకుంటున్న ఎక్సైజ్ అధికారులు మద్యం వినియోగం భారీగా పెరుగుతున్నా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగేలా వైన్‌షాపుల నిర్వాహకులను ప్రోత్సహిస్తున్నారు. మద్యం తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందులో చీప్ లిక్కర్‌తో ఇంకా ఎక్కువ ప్రమాదం. ఇలాంటి చీప్ లిక్కర్ వినియోగం వేల రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం అమ్మకాలకు సంబంధించి ఎక్సైజ్ శాఖ గణాంకాలు ప్రమాదకర పరిస్థితులను సూచిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం 2014 నవంబరులో జిల్లా వ్యాప్తంగా 1209 కేసుల (పెట్టెల) చీప్ లిక్కర్ అమ్మకాలు జరగగా.. ఈ ఏడాది ఏకంగా 25,848 కేసులు అమ్ముడుపోరుుంది. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన తక్కువ ధర ఉన్న(లీటరు రూ.80) ఛీప్ లిక్కర్ విక్రయం గ్రామాల్లో భారీగా పెరిగింది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని చెప్పుకుంటున్న ఎక్సైజ్ శాఖ.. మద్యం వినియోగం వల్ల గ్రామాల్లో నెలకొంటున్న ఆందోళనకర పరిస్థితులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాది క్రితం వరకు బెల్ట్ షాపులను నియంత్రించే పనిలో ఉన్న ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు ఈ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు. కొత్తగా బెల్ట్ షాపులు పెట్టుకుంటే ఫర్వాలేదనే పద్ధతిలో ఈ శాఖ పనితీరు ఉందనే విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులు ఈ విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. ఏడాదిగా జిల్లాలోని చాలా గ్రామాలు మద్యం రహిత పల్లెలుగా ప్రకటించుకుంటున్నాయి. ఇలాంటి వాటిలో 90 శాతానికిపైగా గ్రామాల్లో ప్రస్తుతం బెల్ట్ షాపులు వెలిశాయి. మద్యం రహిత పల్లెలుగా ప్రకటించకముందు కంటే ఇప్పుడు ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయి. మద్యం రహిత పల్లెలుగా ప్రకటించిన గ్రామాల్లో మళ్లీ ఈ మహమ్మారి పెరుగుతుంటే ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని మహిళలు ప్రశ్నిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బెల్ట్ షాపుల నియంత్రణ కోసం సర్పంచ్‌లు ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితులతో జిల్లాలో మద్యం వినియోగం పెరిగి ప్రజలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా చితికిపోతున్నారు. మద్యం రహిత గ్రామాలుగా ప్రకటించినా ప్రస్తుతం బెల్ట్ షాపులు ఉన్నవి.. కేసముద్రం : కల్వల, కోరుకొండపల్లి, కాట్రపల్లి, రంగాపురం, కేసముద్రం, అర్పనపల్లి మహబూబాబాద్ : అనంతారం, అయోధ్య, ముడుపుగల్, రెడ్యాల, సింగారం, వేంనూరు, వి.ఎస్.లక్ష్మీపురం రాయపర్తి : గన్నారం, తిర్మలాయపల్లి. పాలకుర్తి : లక్ష్మీనారాయణపురం, వావిలాల, దర్దెపల్లి, విస్నూరు, గూడూరు, చెన్నూరు, బొమ్మెర జనగామ : మరిగడి, యశ్వంతాపూర్, గానుగుపహాడ్, వెంకిర్యాల, ఎర్రగొల్లపహాడ్, వడ్లకొండ బచ్చన్నపేట : బండనాగారం, దబ్బగుంటపల్లి, కట్కూరు, పడమటికేశ్వాపూర్, లింగంపల్లి, చిన్నరామన్చర్ల, సాల్వాపూర్, రాంచంద్రాపూర్, మన్సాన్పల్లి, నారాయణపురం, అలీంపూర్, నాగిరెడ్డిపల్లి, పోచన్నపేట చేర్యాల : ఐనాపూర్, వేచరేణి మద్దూరు : లద్నూరు, రేబర్తి, గాగిళ్లాపూర్, లింగాపూర్, దూల్మిట్ట, వంగపల్లి, బైరాన్‌పల్లి, కూటిగల్ నర్మెట్ట : వెల్దండ, అమ్మాపూర్, హన్మంతాపూర్, అంకుషాపురం, బొత్తలపర్రె, అబ్ధుల్నాగారం రఘునాథపల్లి : కంచనపల్లి, గబ్బెట, కోడూర్, ఖిలాషాపూర్, ఇబ్రహీంపూర్, మేకలగట్టు, మండెలగూడెం, జాపర్గూడెం, కోమళ్ల, గోవర్దనగిరి, కుర్చపల్లి, వెల్ది, మంగళిబండ తండ ధర్మసాగర్ : మల్లక్‌పల్లి, పీచర, సాయిపేట, క్యాతంపల్లి నల్లబెల్లి : కొండాపూర్, కన్నారావుపేట, మేడిపల్లి, రాంపూర్, ఆసరవెల్లి, గొల్లపల్లి, కొండాయిపల్లి ఏటూరునాగారం : కొండాయి, చెల్పాక -
మద్యం షాపుపై ఎక్సైజ్ దాడులు
జైపూర్ (ఆదిలాబాద్) : కల్తీ మద్యం విక్రయం ఆరోపణలతో ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని వైన్‌షాపుపై ఎక్సైజ్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు సిబ్బందితో కలసి శ్రీ వినాయక వైన్స్ షాపులో తనిఖీలు నిర్వహించారు. మద్యం లూజ్‌గా విక్రయిస్తుండడంతో దానిని సీజ్ చేశారు. ల్యాబ్‌కు పంపించి వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. -
అక్రమంగా మద్యం విక్రయాలు.. వైన్‌షాపు సీజ్
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని పరిధిలో ఓ వైన్ షాపును టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం సీజ్ చేశారు. మాల్ గ్రామంలోని శ్రీసాయి వైన్స్‌లో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో దాడులు నిర్వహించారు. షాపు పక్కనే ఉన్న ఇంట్లో అక్రమంగా మద్యాన్ని నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నట్టు గుర్తించారు. 180 లిక్కర్ కేసులు, 250 బీర్ల కేసులను స్వాధీనం చేసుకోవడంతోపాటు షాప్‌ను సీజ్ చేశారు. నిర్వాహకుడు శేఖర్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. -
ఉద్యోగులే... ఓనర్లు
వైన్ షాపులు, బార్లలో ఎక్సైజ్ సిబ్బంది పెట్టుబడులు కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఇదే తీరు రెండు జిల్లాల్లో 30కి పైగా షాపుల్లో భాగస్వామ్యం విజయవాడ : ఎక్సైజ్ శాఖలో ఉద్యోగులే కింగ్మేకర్లుగా ఎదుగుతున్నారు. సాధారణ ఉద్యోగిగా ప్రభుత్వ సర్వీసులో చేరి అనతి కాలంలోనే కోట్లు గడిస్తున్నారు. బార్, వైన్‌షాపుల నుంచి మామూళ్లు వసూలు చేసి కొందరు జేబులు నింపుకొంటుంటే.. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి బార్, వైన్ షాపుల్లో బినామీల పేర్లతో పెట్టుబడులు పెట్టి భాగస్వాములుగా మారుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని బార్లు, వైన్ షాపుల్లో దాదాపు 15 మందికిపైగా ఎక్సైజ్ శాఖలోని వివిధ స్థాయిల్లోని సిబ్బందికి భారీగా వాటాలు ఉన్నాయి. తాజాగా స్వర్ణ బార్ వ్యవహారంతో ఎక్సైజ్ ఉద్యోగుల పాత్ర, మామూళ్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో రెండు జిల్లాల్లోని బార్లు, రెస్టారెంట్లలో ఎవరి వాటాలు ఎంత అనే లెక్కలపై అందరి దృష్టీ నెలకొంది. 15 బార్లు, వైన్ షాపుల్లో ఉన్నతాధికారికి వాటాలు... కృష్ణా జిల్లాలో 325 వైన్ షాపులు, 163 బార్లు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 355 వైన్ షాపులు 186 బార్లు ఉన్నాయి. రెండు జిల్లాల్లో కలిపి నెలకు సగటున రూ.230 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. అనతికాలంలోనే కోట్లు గడించటం కోసం ఎక్సైజ్ సిబ్బంది కొందరు తమ మామూళ్లను పెట్టుబడులుగా మార్చుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ఉన్న ఒక ఉన్నతాధికారికి జిల్లాలోని ఎక్సైజ్ సిండికేట్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ లావాదేవీలు ఉన్నాయి. ఖమ్మం, విశాఖపట్నం జిల్లాలతో పాటు నగరంలో పేరుమోసిన లిక్కర్ సిండికేట్లతో కలిపి మొత్తం 15 వరకు బార్లు, వైన్ షాపుల్లో వాటాలు ఉన్నట్లు సమాచారం. ఆయన వ్యవహారాలన్నీ చూడటానికి తొలినుంచి నమ్మినబంటుగా ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. పెట్టుబడులన్నీ అతని పేరుతోనే ఉండటంతో అతనే శాఖాపరమైన విధులతో పాటు వ్యాపార వ్యవహారాలు చూస్తుంటాడు. ఉన్నతాధికారి ఎక్కడ ఉంటే.. అదే జిల్లాలో అతనికీ పోస్టింగ్ ఉండటం గమనార్హం. కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు సైతం... కృష్ణా జిల్లాలో ఐదుగురు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు వివిధ బార్లలో భాగస్వామ్యం ఉంది. ముఖ్యంగా నందిగామ స్టేషన్లో పనిచేసే ఒక హెడ్ కానిస్టేబుల్‌కు రెండు బార్లలో వాటాలు ఉన్నాయి. విజయవాడ నగరంలోని మరో హెడ్ కానిస్టేబుల్‌కు రెండు బార్లలో భాగస్వామ్యం ఉంది. ఒక కానిస్టేబుల్‌కు ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉండగా, దీనిని అతని బంధువులే నిర్వహిస్తున్నారు. డిస్టిలరీలో విధులు నిర్వహించే ఒక కానిస్టేబుల్‌కు, విజయవాడ తూర్పు ఎక్సైజ్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్‌కు, గన్నవరం ఎక్సైజ్ స్టేషన్లో పనిచేసే మరో కానిస్టేబుల్‌కు వివిధ బార్లలో భాగస్వామ్యం ఉంది. విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసే మరో కానిస్టేబుల్‌కు ఓ బార్లో వాటా ఉంది. గుంటూరు నగరంలోని ఒక కానిస్టేబుల్‌కు పేరేచర్ల, గుంటూరులలో మూడు వైన్ షాపుల్లో వాటాలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేసే మరో కానిస్టేబుల్‌కు గుంటూరులోని జిన్నాటవర్, చుట్టుగుంట సెంటర్, మరో ప్రాంతంలో ఉన్న బార్లలో వాటాలు ఉండగా, చుట్టుగుంట బార్ ఉన్న స్థలం కూడా అతనితో పాటు పలువురి పేర్లతో ఉంది. దాడులతో వెనుకంజ... 2012కు ముందు వరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్సైజ్ సీఐలు మొదలుకొని డిప్యూటీ కమిషనర్ల వరకు సుమారు వందకు పైగా వైన్స్, బార్లలో భాగస్వామ్యం ఉండేది. 2011 డిసెంబర్లో ఎక్సైజ్ శాఖపై అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుస దాడులు నిర్వహించి పదుల సంఖ్యలో అధికారుల్ని, వ్యాపారుల్ని అరెస్టు చేయటంతో అధికారుల్లో భయం మొదలై ంది. దీంతో నెలవారీ మామూళ్లు తీసుకుంటూ.. బాగా ఆదాయం వచ్చే ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటికీ తమ వాటాలు కొనసాగిస్తున్నారు. -
వైన్స్ షాపులో చోరీ
శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలో మంగళవారం అర్థరాత్రి ఓ వైన్స్షాపులో చోరి జరిగింది. శంషాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర వైన్స్ షాపులో గుర్తుతెలియని దుండుగులు వైన్స్ షాపు తాళాలు పగలగొట్టి దోపిడి పాల్పడ్డారు. రూ. 25 వేల నగదుతో పాటు విలువైన 20 మద్యం బాటిళ్లను దొంగలు ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం గుర్తించిన వైన్స్ షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం దుకాణంలో చోరీ
గుంటూరు: మద్యం దుకాణంలో దొంగలు పడి రూ. 2 లక్షలు దోచుకెళ్లారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నకిరేకల్లులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సోమవారం ఉదయం చోరీ జరిగిందని గుర్తించిన వైన్స్ వ్యాపారి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వేసిన తాళాలు వేసేనట్లే ఉన్నా దొంగతనం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. వైన్స్‌లో పని చేసే సిబ్బందే ఈ పనిచేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
మద్యం షాపుపై మహిళల దాడి
-
మద్యం షాపుపై మహిళల దాడి
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనావాసాల మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణంపై మహిళలు దాడులు చేశారు. సోమవారం ఉదయం దాడికి దిగిన మహిళలు మద్యం సీసాలను ధ్వంసం చేశారు. డిగ్రీ కళాశాల ఇతర విద్యాసంస్థలు, జనావాసాల మధ్య మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారని, వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఒక్కసారిగా మహిళలు పెద్దసంఖ్యలో తరలిరావడంతో దుకాణం దారులు మూసేందుకు ప్రయత్నించినా మహిళలు జొరబడి మద్యం బాటిళ్లను పగలగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
హోంమంత్రిని అడ్డుకున్న మహిళలు
సామర్లకోట: గ్రామంలో జనావాసాల మధ్య ఉన్న బ్రాందీ షాపును అక్కడి నుంచి తరలించాలని కోరుతూ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పను మహిళలు అడ్డుకున్నారు. మంత్రి చినరాజప్ప ఆదివారం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంకు వెళ్లారు. దీంతో మహిళలు ఆయన్ను అడ్డుకుని బ్రాందీ షాపును అక్కడి నుంచి తరలించాలని ఆయనను డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన హోంమంత్రి ఎక్సైజ్ శాఖ అధికారులతో మాట్లాడారు. పది రోజుల్లో షాపును అక్కడి నుంచి తరలిస్తామని అధికారులు చెప్పడంతో ఆ మేరకు చినరాజప్ప వారికి హామీ ఇచ్చారు. దీంతో వారు తమ ఆందోళనను విరమించుకున్నారు. -
మద్యం పాలసీ విధానాలు యథాతథం
హైదరాబాద్: తెలంగాణలో ఎక్సైజ్ పాలసీ విధానాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం ఖరారు చేశారు. ఈ మేరకు పాలసీ విధానాలను మీడియా ముందు కేసీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. వచ్చే అక్టోబర్ నెల నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీలు అమల్లోకి వస్తాయన్నారు. రెండేళ్ల కాలపరిమితి కోసం వైన్ షాపుల లైసెన్సులు ఇస్తామని.. రిటైల్ షాపుల కోసం ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ పద్ధతిలో లైసెన్సులు ఇస్తామని సీఎం కేసీఆర్ మీడియాతో వెల్లడించారు. -
అక్కడ పోలీసులే మేనేజర్లు!
సర్కారీ మద్యం దుకాణాల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది కుదింపు గాడిలో పడుతున్న మద్యం షాపులు గత నెలలో జిల్లాలో రూ.4.26 కోట్ల విక్రయాలు వచ్చేనెల నుంచి తిరిగి అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం విజయవాడ : సర్కారీ వైన్ షాపుల్లో ఇకపై పోలీసులే మేనేజర్లు. షాపులకు మద్యం నిల్వలు తీసుకురావటం నుంచి విక్రయాలు చేసి, డబ్బు లెక్కలు చూసి డిపోలకు చెల్లించటం వరకు అంతా ఎక్సైజ్ పోలీసులదే బాధ్యత. ఇప్పటి వరకు ఎక్సైజ్ పోలీసులు స్టేషన్లలో ఉండి కేటాయించిన విధులు నిర్వహించటం లేదా తనిఖీల బృందంలో వెళ్లటం తదితర పనులు మాత్రమే నిర్వహిస్తుండేవారు. కాని ఇక నుంచి ప్రభుత్వ మద్యం షాపుల్లో విక్రయాలు తగ్గకుండా చూసుకుంటూ వ్యాపారం చేసే బాధ్యత కూడా ఎక్సైజ శాఖ వారిపైనే పెట్టింది. దీని కోసం జిల్లాలో సుమారు 50 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ ్లను, హెడ్ కానిస్టేబుళ్లను కేటాయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 32 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. ప్రారంభంలో అనేక బాలారిష్టాలతో షాపులు నామమాత్రంగా నడిచాయి. దీంతో జూలై నెలలో మొదటి 15 రోజులకు రూ.కోటి విక్రయాలు కావటమే చాలా కష్టమైంది. ప్రధానంగా జిల్లాలో ప్రభుత్వ షాపులు ఏర్పాటు చేసినప్పుడు ప్రతి షాపులో ఇద్దరు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించుకొని విక్రయాలు నిర్వహించారు. అయితే వారికి అనుభవం లేకపోవటం, బాధ్యత కూడా అంత ఉండదనే కారణాలతో కేవలం రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర విలువైన సరుకు మాత్రమే షాపుల్లో నిల్వలు ఉంచేవారు. చెల్లిస్తున్న అద్దెకు, జరగుతున్న విక్రయాలకు పొంతన లేకపోవటంతో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తగ్గించారు. వారి స్థానంలోకి ఎక్సైజ్ కానిస్టేబుళ్లను తీసుకువచ్చారు. వారికి హెల్పర్లుగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. ప్రభుత్వ సిబ్బంది అయితే బాధ్యతగా విక్రయాలు నిర్వహిస్తారని, అలాగే ఎక్కువ నిల్వలు ఉన్నా ఇబ్బంది ఉండదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో గత 20 రోజుల నుంచి ప్రతి షాపులో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు స్టాకు నిల్వలు ఉంచి విక్రయాలు సాగిస్తున్నారు. విజయవాడ నగరంలో 5 వైన్ షాపులు, మిగిలినవి 27 జిల్లా నలుమూలలా ఉన్నాయి. విజయవాడలోని షాపుల్లో రోజుకి సగటున రూ.లక్ష వరకు విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని షాపులు కొన్ని రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వ్యాపారం జరుగుతుండగా, మరి కొన్నిచోట్ల రూ. 20 వేల వరకు విక్రయాలు సాగుతున్నాయి. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ షాపుల్లో అన్ని బ్రాండ్ల మద్యాన్నీ అందుబాటులో ఉంచి విక్రయిస్తున్నారు. ఈక్రమంలో ఇప్పటివరకు రూ. 4.26 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. దీనిలో 7,625 మద్యం కేసులు కాగా 2,432 బీరు కేసులు ఉన్నాయి. ప్రభుత్వ దుకాణాల్లో బీర్ల విక్రయాలకు అనువుగా ఫ్రిజులు లేకపోవటంతో వీటి విక్రయాలు తక్కువగా ఉన్నాయి. ఎక్సైజ శాఖ ఇంఛార్జ్ డిప్యూటీ కమిషనర్ ఎన్. బాబ్జీరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం షాపుల్లో విక్రయాలు గాడిలో పడ్డాయన్నారు. గతం కంటే బాగా పెరిగాయని వచ్చే నెల నుంచి లెసైన్స్ షాపులతో సమానంగా విక్రయాలు సాగిస్తామని చెప్పారు. అలాగే ప్రభుత్వ షాపులకు అన్ని హంగులు ఏర్పాటు చేయటానికి కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. -
వైన్‌షాపులో చోరీ
వరంగల్ : వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం పాతిని గ్రామంలోని కోమల్ వైన్స్‌లో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగలు తాళాలు పగలగొట్టి షాపులో ఉన్న రూ. 4.5 లక్షల విలువైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం షాపు యజమాని ఆ విషయాన్ని గుర్తించి పోలీసులను ఆశ్రయించి... ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎక్సైజ్ మంత్రి అడ్డాలో.. ప్రభుత్వ వైన్ షాప్ పంచాయితీ
లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి కోనేరు సెంటర్‌కు షాప్ తరలింపు మసీదుకు 50 మీటర్ల దూరంలోనే ప్రభుత్వ వైన్ షాప్ మద్యం సిండికేట్‌కు అనుకూలంగా చక్రం తిప్పిన అమాత్యుని బంధువు విజయవాడ: ఎక్సైజ్‌శాఖ మంత్రి అడ్డాలో అడ్డగోలు పంచాయితీ సాగుతోంది. అక్కడ నిబంధనలు పాటించరు. కావాల్సిన వారికి మేలు చేయటానికి నిబంధనలకు పూర్తిగా నీళ్లు వదిలేస్తున్నారు. గుడి, బడి నిబంధన పక్కన పెట్టి మరీ అడ్డగోలుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. పర్యవసానంగా విక్రయాలు జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వ వైన్ షాప్‌ను అక్కడి వ్యాపారుల కోసం వేరే సెంటర్‌కు మార్చివేశారు. మార్చిన సెంటర్లో పక్కనే మసీదు ఉన్నప్పటికి కనీసం పట్టించుకోకుండా షాపు ఏర్పాటు చేయటానికి సిద్ధం చేసి షాపు ఏర్పాటు చేసి మద్యం లోడ్లు దించటంతో స్థానికులు, ముస్లింలు ఆందోళణకు దిగటంతో వివాదంగా మారింది. జిల్లాలో కేటాయించిన 33 ప్రభుత్వ దుకాణాల్లో భాగంగా మచిలీపట్నంలో ఒక ప్రభుత్వ వైన్ షాప్ ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. ఎక్కువ విక్రయాలు జరిగే ప్రాంతంలోనే వైన్ షాప్ పెట్టాలని ఎక్సైజ్ శాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. కాగా, మచిలీపట్నం పట్టణంలో మద్యం విక్రయాలు ఎక్కువగా లక్ష్మీటాకీస్ సెంటర్లో జరగుతాయి. ఇక్కడి ైవైన్షాపులు రోజుకు సగటున రూ.రెండు లక్షల వరకు విక్రయాలు సాగుతుంటాయి. ఈ ప్రాంతంలో ప్రభుత్వ వైన్ షాప్ ఏర్పాటు చేస్తే కనీసం సగటున రోజుకి రూ.లక్ష వరకు విక్రయాలు జరుగుతాయని ,శాఖకు ఎక్కువగా ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ భావించి అక్కడ ఏర్పాటుకు అంతా రంగం సిద్ధం చేసుకున్నారు. దీనిపై అక్కడి వైన్ షాపులు, బార్ల యజమానులు అమాత్యుని వ్యవహారాలు చూసే ఆయన సమీప బంధువును ఆశ్రయించారు. దీంతో సదరు బంధువు ఎక్సైజ్ అధికారులను పిలిచి మాట్లాడి షాపును వేరే చోట పెట్టాలని ఆదేశించారు. అది కొంత కష్టమని అధికారులు బదులిచ్చే క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో అక్కడి నుంచి షాపును కోనేరు సెంటర్లో ఏర్పాటు చేయాలని ఆదేశించటంతో అధికారులు చేసేదేమీలేక కోనేరు సెంటర్లో షాపును వెతికారు. అయితే సదరు సెంటర్లో ఇప్పటికే 3 వైన్ షాపులు, 3 బార్లు ఉన్నాయి. అక్కడ ఒక్కొక్క షాపులో రోజుకి సగటున రూ.70 వేల నుంచి నుంచి రూ.లక్ష వరకు విక్రయాలు జరుగుతాయి. ఈ క్రమంలో అక్కడ షాపును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. శనివారం మద్యం నిల్వలు దించి షాపును ప్రారంభించటానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఏర్పాటు చేసిన షాపు మసీదుకు 50 మీటర్లు దూరంలోనే ఉంది. దీనికి ఎక్సైజ్ అధికారులు మాత్రం కొత్త వాదన వినిపిస్తున్నారు. వారి లెక్క ప్రకారం వంద మీటర్లు దూరం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ముస్లింలు, స్థానికులు, స్థానిక వ్యాపారులు షాపు ఏర్పాటు నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. -
మందులోనూ కల్తీ
వైన్‌షాపుల్లోని బాటిళ్లలో నీళ్లు కలిపి అక్రమ అమ్మకాలు ఎస్టీఎఫ్ దాడుల్లో వెలుగు చూస్తున్న నిజాలు నిజామాబాద్ మినహా మిగతా జిల్లాల్లో9 నెలల్లో 51 కేసులు బాటిళ్లు తెరిచి ఏమాత్రం అనుమానం రాకుండా మళ్లీ సీల్ మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్‌లలో ప్రత్యేక నిపుణులు సాక్షి, హైదరాబాద్: నిఖార్సైన మందు కూడా మద్యం దుకాణాల్లో దొరకడం లేదు. అన్ని చోట్ల కల్తీ మాదిరే మందు బాటిళ్లు కూడా కల్తీ అవుతున్నాయి. డిమాండ్ ఉన్న, ఖరీదైన మద్యం బాటిళ్లలో నీళ్లు, చీప్‌లిక్కర్ కలిపి విక్రయిస్తున్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ కల్తీ అధికంగా ఉంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో ఎక్సైజ్ శాఖ స్టేట్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) జరిపిన దాడుల్లో దొరికిన కల్తీ మద్యం సీసాల సీల్ చూసి అధికారులే ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ సీసాలో మద్యాన్ని ప్రయోగశాలలో పరిశీలిస్తే తప్ప కల్తీ అయినట్లు వారు గుర్తించలేకపోయారు. సీల్ చేసిన మద్యం సీసాలపై ఎక్సైజ్ శాఖ వేసే రంగుల లేబుళ్లను కూడా అంటిస్తారని, పర్మిట్ రూంలలో మందు బాబులు తాగేసిన లూజ్ సేల్ బాటిళ్లపైన ఉండే లేబుళ్లను తెప్పించి అనుమానం రాకుండా అతికించి విక్రయిస్తారని ఎస్టీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో మినహా హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు ఎస్టీఎఫ్ అధికారులు వైన్‌షాపులపై దాడులు చేసి కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకొని దుకాణాలను సీజ్ చేశారు. జూలై నుంచి ఇప్పటి వరకు 51 కేసులు నమోదుచేసినట్లు ఎస్టీఎఫ్ అధికారి శశిధర్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. బేవరేజెస్ కార్పొరేషన్ ముద్రించిన లేబుళ్లతో సీల్ చేసిన మద్యం సీసాలనే అమ్మాల్సి ఉన్నా దుకాణదారులు అదనపు ఆదాయం కోసం కల్తీకి పాల్పడుతున్నారు. స్థానిక ఎక్సైజ్ అధికారులు, సిబ్బందికి మామూళ్లు ఇచ్చి వారి చేతులను కట్టేస్తున్నారు. కల్తీ ఎలా జరుగుతుందంటే... సాధారణ మూతలు ఉన్న సీసాలతో పాటు కల్తీకి అవకాశం లేకుండా సీసా మధ్యలో ప్రత్యేకంగా అమర్చిన ప్లాస్టిక్ తొడుగులు ఉండే ప్రీమియం మద్యం సీసాల మూతలను కూడా ఏమాత్రం అనుమానం రాకుండా తీసి యథాతథంగా అమరుస్తున్నారు. ఈ సీసాల మూతలు తీసే నిపుణులు హైదరాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండల్లో ఉన్నట్లు సమాచారం. దుకాణ యజమానులు లేదా వారికి తెలియకుండా అందులో పనిచేసే వర్కర్లు సీసాల మూతలు తీసే నిపుణులను సంప్రదించి ప్రణాళిక బద్ధంగా కల్తీ చేస్తారు. రూ.300 నుంచి 450 ఎంఆర్పీ కలిగిన 750 ఎంఎల్ సాధారణ మద్యం సీసాలు 12 కలిగిన కేస్‌లను అజ్ఞాత ప్రాంతానికి తరలించి ఆ సీసాల మూతలు తీసి ఓ బకెట్లో మద్యం నింపి అందులో సగం వరకు నీళ్లు, కొంత చీప్ లిక్కర్ కలిపి మళ్లీ సీసాల్లోకి నింపుతారు. కొత్త బాటిల్‌పై ఉన్నట్లే సీల్ చేసి, వాటిపైన లేబుళ్లను కూడా అతికించి దుకాణాలకు తరలిస్తారు. ఇదంతా చేసినందుకు నిపుణులకు ఒక కేస్‌కు రూ. 1,000 వరకు చెల్లిస్తారు. -
వైన్ షాపులో దొంగ హల్చల్
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ వైన్ షాప్‌లో మంగళవారం దొంగ హల్చల్ సృష్టించాడు. వైన్ షాప్‌లో మద్యం సేవిస్తున్న వ్యక్తిపై దాడి చేసి... అతడి వద్దనున్న రూ. 50 వేలు బలవంతంగా లాక్కున్నాడు.అనంతరం దొంగ అక్కడి పరారైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.... నిందితుడి వివరాలు సేకరించారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో అతడిని బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకుని ... పట్టణ టూటౌన్‌కు తరలించారు. పోలీసులు దొంగను తమదైన శైలిలో విచారిస్తున్నారు. అయితే వైన్ షాపులో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. -
మామూళ్ల కిక్
ఎక్సైజ్ శాఖలో లంచాల ప్రహసనం మద్యం వ్యాపారుల నుంచి క్రమం తప్పకుండా నెలవారీ మామూళ్లు టాస్క్‌ఫోర్స్ అధికారులకు సైతం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయూలు విజయవాడ : ఎక్సైజ్ శాఖలో మామూళ్ల ప్రహసనం యథేచ్ఛగా సాగుతోంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు అందరికీ నెలవారీ మామూళ్లు భారీగానే అందుతున్నారుు. దీంతో జిల్లాలో ఎమ్మార్పీ నిబంధనను గాలికొదిలేసిన వ్యాపారులు ఇష్టానుసారంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. జిల్లాలో నెలకు సగటున రూ.100 కోట్లపైనే మద్యం విక్రయాలు జరుగుతున్నా.. నామమాత్రంగా కూడా నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు కావడంలేదు. జిల్లాలో 301 వైన్షాఫులు, 156 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వైన్‌షాపుల్లో తప్పనిసరిగా ఎమ్మార్పీకే విక్రయించాలని నిబంధన అమలులో ఉంది. ఇక బార్లలో ఎలాంటి నిబంధనలు లేకపోవటంతో 365 రోజులూ అధిక ధరలకే విక్రరుుస్తున్నారు. ఎమ్మార్పీతో నిమిత్తం లేకుండా 30 శాతం అధిక ధరలకు ఇక్కడ విక్రయూలు జరుగుతున్నారుు. పెరుగుతున్న మద్యం విక్రయలు జిల్లాలో గత మూడు నెలలుగా మద్యం విక్రయాలు పెరిగాయి. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో మద్యం విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. నవంబర్‌లో కొంత తక్కువగా ఉంటాయి. కానీ, గత నవంబర్‌లో కూడా భారీ విక్రయూలు జరిగారుు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే సగటున పదిశాతం అధిక విక్రయాలు జరిగాయి. ఇక డిసెంబర్ 31 అర్ధరాత్రి పార్టీల్లో మద్యం కొనుగోళ్లు రికార్డు స్థారుుకి చేరింది. ఒక్క డిసెంబర్ 31నే జిల్లాలో రూ.7కోట్ల విలువైన 17,800 కేసుల మద్యం విక్రయాలు జరిగాయి. 2013, డిసెంబర్ 31న రూ.5కోట్ల వ్యాపారం జరిగింది. ఇలా.. జిల్లాలో రికార్డుస్థాయిలో విక్రయాలు జరుగుతుండటంతో అధిక ధరలకు అమ్మకాలు జరుపుతున్న వ్యాపారులు పండగ చేసుకుంటున్నారు. అధికారులకు క్రమం తప్పకుండా నెలవారీ మామూళ్లు జిల్లాలో మద్యం వ్యాపారులు సిండికేట్ అయ్యారు. రెండు, మూడు ప్రధాన సిండికేట్లుగా మారి పోలీస్స్టేషన్లకు మామూళ్లు మొదలుకుని ఎక్సైజ్ శాఖలోని స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీమ్ వరకు నెలవారీ మామూళ్లు క్రమం తప్పకుండా పంపిస్తున్నారు. జిల్లాలో 20 ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 301 మద్యం షాపులు, 156 బార్లు ఉన్నాయి. ఒక్కో వైన్‌షాపు నిర్వాహకుడు నెలకు రూ.25వేల వరకు ఎక్సైజ్ శాఖ అధికారులకే చెల్లిస్తున్నారు. రేట్లు ఫిక్స్ : వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు ముందుగానే మాట్లాడుకుని మామూళ్ల రేట్లు ఫిక్స్ చేసుకుంటున్నారు. ఐదు నెలలుగా జిల్లాలో ఈ రేట్లు అమలులో ఉన్నాయి. స్టేషన్‌కు నెలకు రూ.13వేల వరకు మామూళ్లు అందుతున్నారుు. కానిస్టేబుల్ మొదలుకుని సీఐ వరకు అందరికీ వాటానే. అలాగే, సర్కిల్ ఉన్నతాధికారికి, కార్యాలయానికి నెలకు రూ.3వేలు, జిల్లాస్థాయి అధికారి, ఆయన కార్యాలయానికి రూ.3వేలు, ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో కిందిస్థాయి నుంచి జిల్లా అధికారి వరకు అందరికీ కలిపి నెలకు రూ.6వేలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) నేతృత్వంలో ఉండే టాస్క్‌ఫోర్స్‌కు నెలకు రూ.6వేలు, రాష్ట్రస్థాయిలో దాడులు నిర్వహించే స్టేట్ టాస్క్‌ఫోర్స్‌కు ఆరు నెలలకు రూ.6వేలు మామూళ్లు అందుతున్నారుు. మామూళ్ల భారం మందుబాబులపైనే.. మామూళ్ల నేపథ్యంలో వ్యాపారులు క్వార్టర్ మద్యం రూ.10 నుంచి రూ.15 ఎక్కువగా అమ్ముతున్నారు. ఎక్సైజ్ అధికారులు నెల మొదటి వారంలో బెల్ట్‌షాపులపై హడావుడి దాడులు చేసి.. తర్వాత వాటిని కూడా వదిలేస్తున్నారు. గడిచిన రెండు నెలల కాలంలో స్టేట్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) కూడా జిల్లాలో దాడులు చేసిన సందర్భాలు లేవు. తిరువూరు, నూజివీడు, నందిగామల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. నిబంధనలు ఉల్లఘించి.. అధిక ధరలకు విక్రయూలు జరపడం వల్ల జిల్లాలోని వ్యాపారులకు నెలకు సగటున రూ.12కోట్ల అదనపు లాభం వస్తోంది -
హల్చల్ చేస్తున్న వీడియో!
పాండిచ్చేరిలో బిజీ సెంటర్... అక్కడున్న ఓ మద్యం దుకాణంలోకి ఓ అందమైన అమ్మాయి ఎంటరైంది. ‘బీరు కావాలి?’ అనడిగేసరికి, అందరూ షాక్. డబ్బున్న అమ్మాయిలు కొంతమంది పబ్‌లకెళ్లి, బీరు తాగుతారని తెలుసు కానీ, మరీ ఇలా బహిరంగంగా షాపుకొచ్చి కొనడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకూ ఆ అందమైన అమ్మాయి ఎవరంటే నయనతార. ఇది మళ్లీ షాక్ కదూ. నయనతార ఓ మద్యం దుకాణంలో బీరు కొంటున్న వీడియో యూ ట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. కొంతమంది ఈ వీడియోను పదే పదే చూసి, ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం సంప్రదాయబద్ధంగా ఉండేవాళ్లు మాత్రం ‘హవ్వ. ఎంతకు తెగించింది. మరీ ఇంత విచ్చలవిడితనమా..’ అని నోటికొచ్చినట్లు మాట్లాడుకున్నారు. కానీ, నయనతార మాత్రం హాయిగా నవ్వుకున్నారు. ఎందుకంటే, అసలు విషయం ఏంటో ఆమెకే తెలుసు కనుక. ఇంతకీ ఏంటా విషయం అనుకుంటున్నారా? నయన్ బీరు బాటిల్ కొనడం ఒక నటన. ప్రస్తుతం ‘నానుమ్ రౌడీదాన్’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారామె. ఈ చిత్రంలో నయన్ బీరు సీసా కొనే సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారు. ఈ సన్నివేశాలను ఎవరో చిత్రీకరించి, ఆ వీడియోను బయటపెట్టారు. ఫలితంగా నలుగరి నోళ్లలోనూ నయన్ నానారు. ఈ నెగటివ్ పబ్లిసిటీ కారణంగా నయన్ అనవసరంగా నిందలకు గురయ్యారు కానీ, ఆ సినిమాకి మాత్రం బోల్డంత పబ్లిసిటీ వచ్చింది. -
క్షణక్షణం..భయం..భయం
నెల్లూరు(క్రైమ్): ఏ నిమిషానికి ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో..ఎప్పుడు ఏ ఘటన జరుగుతుందో.. ఎక్కడ ఎవరు ప్రాణాలు కోల్పోతారో..దొంగలు ఎటువైపు నుంచి విరుచుకుపడతారోననే భయంతో జిల్లా వాసులు క్షణక్షణం..భయంభయంగా గడుపుతున్నారు. జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో నిత్యం ఏదో ఒక ఘటన చోటుచేసుకుంటుండటమే ఇందుకు నిదర్శనం. నెల్లూరు(క్రైమ్): ఓ దోపిడీ దొంగల ముఠా నెల్లూరు శివారులోని అయ్యప్పగుడి సమీపంలో బీభత్సం సృష్టింది. ఓ వైన్‌షాపు టార్గెట్‌గా దోపిడీకి వచ్చి ఒకరిని హతమార్చడంతో పాటు మరొకరిని తీవ్రంగా గాయపరిచింది. ఆదివా రం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి రావడంతో నెల్లూరులో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసుల కథనం మే రకు..వెంకటాచలం మండలం చెముడుగుంటకు కుంకాల శ్రీనివాస్‌యాదవ్ అయ్యప్పగుడి నుంచి హైవేకు వెళ్లే కూడలి ప్రాంతంలో చింతాళమ్మ వైన్స్ పేరిట మద్యం దుకాణం నిర్వహిస్తున్నాడు. సైదాపురం మండలం తూర్పుగుంట్లకు చెందిన చంద్రయ్య కసుమూరులో కాపురం ఉంటూ ఆ దుకాణంలో నైట్ సేల్స్‌మన్‌గా వ్యవహరిస్తున్నాడు. గుంటూరు ఎస్వీఎన్ కాలనీకి చెంది న దేవినేని శ్రీనివాసులు(38) కొంతకాలంగా బ్రాందీషాపు ఆవరణలో నూడి ల్స్, టిఫిన్ వ్యాపారం చేస్తున్నాడు. రా త్రి వేళలో చంద్రయ్యకు తోడుగా వైన్‌షాపులోనే నిద్రపోయేవాడు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి కూడా షాపు ఆవరణలో నిద్రపోగా, చంద్రయ్య నైట్ సేల్స్ కోసం దుకాణం వెనుక ఉన్న గది లో ఉన్నాడు. రాత్రి 1.30 గంటల సమయంలో నలుగురు యువకులు వెనుకవైపు ఉంచి దుకాణం ఆవరణలోకి ప్రవేశించారు. అక్కడే బల్లపై నిద్రపోతున్న శ్రీనివాసులును తలపై రాడ్‌తో కొట్టి హతమార్చారు. అలికిడి కావడంతో తానున్న గది కిటికీ తెరిచిచూసిన చం ద్రయ్యను ఓ వ్యక్తి క్యాట్‌బాల్‌తో కొట్టడంతో తలకు తీవ్రగాయమైంది. తేరుకునేలోపే మరో వ్యక్తి రాడ్‌తో తలపై పొడిచాడు. అతడిని ఆ గదిలోనే బంధించి ఇద్దరు యువకులు వైన్‌షాపు షర్టర్ పగలగొట్టి లోనికి ప్రవేశించారు. ఒకడు మంకీ క్యాప్ ధరించగా మరొకడు ముఖానికి కర్చీఫ్ కట్టుకున్నాడు. క్యాష్ కౌంటర్ ఎక్కడుందని చంద్రయ్యను హిందీలో ప్రశ్నించి అతడి సెల్‌ఫోన్ లాక్కున్నారు. కౌంటర్లోని కొం త చిల్లరనగదు, రెండు మద్యం సీసాలను తీసుకుని వచ్చిన దారిలోనే వెళ్లిపోయారు. వారు బయటే ఉంటారని భా వించిన చంద్రయ్య బిక్కుబిక్కుమం టూ లోపలే ఉన్నాడు. తెల్లవారుజాము న 4 గంటల సమయంలో మద్యం కో సం వచ్చిన ఓ వ్యక్తి సాయంతో బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే తన యజమాని ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలా న్ని సిటీ డీఎస్పీ ఎస్ మగ్బుల్, ఐదో నగర ఇన్స్పెక్టర్ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ సోమయ్య పరిశీ లించారు. క్లూస్‌టీం వేలిముద్రలు సేకరించింది. పోలీసు జాగిలం దుకాణం వెనుకవైపున్న చెట్లు, ఖాళీ ప్రదేశంలో తిరుగతూ తల్పగిరికాలనీ వైపు వెళ్లింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదైన పుటేజీల ఆధారంగా నింది తుల కోసం ఆరా తీస్తున్నారు. దోపిడీకి పాల్పడింది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా భావిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. తడ సమీపంలో దారిదోపిడీయత్నం సూళ్లూరుపేట(తడ): తడ-శ్రీకాళహస్తి రోడ్డులోని విన్నమాలగుంట అటవీప్రాంతంలో ఓ వ్యాపారిని దోచుకునేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..సూళ్లూరుపేటలోకి కోళ్లమిట్టకు చెందిన చంద్రమౌళిరెడ్డి కోళ్ల వ్యాపారి. వ్యాపార పనుల్లో భాగంగా చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం వెళ్లిన ఆయన అక్కడ నుంచి రూ.3.5 లక్షలు తీసుకుని బైక్‌పై తిరుగుముఖం పట్టాడు. ఆయన దగ్గర నగదు ఉందని గమనించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వెంబడించారు. విన్నమాలగుంట వద్ద అటవీప్రాంతంలో ఆయన బైక్‌ను అడ్డుకున్నారు. కత్తితో దాడి చేసి నగదు లాక్కునే ప్రయత్నం చేశారు. చంద్రమౌళిరెడ్డి తిరగబడి వారి బారి నుంచి తప్పించుకుని రక్తగాయాలతోనే తడలోని హుస్సేన్ చికెన్ స్టాల్ వద్దకు వచ్చి పడిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే తడ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఘటనా స్థలం వరదయ్యపాళెం పరిధిలో ఉండటంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చి, చంద్రమౌళిరెడ్డి సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని విజయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వరదయ్యపాళెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాల కార్మికుడికి చిత్రహింసలు
గదిలో నిర్బంధించి బ్రాందీ షాపు యజమాని దాడి కార్మిక శాఖాధికారులకు ఫిర్యాదు విజయవాడ: వైన్ షాపు యజమాని, సిబ్బంది కలసి ఓ బాల కార్మికుడిని చిత్రహింసలకు గురిచేశారని కార్మిక శాఖాధికారులకు గురువారం ఫిర్యాదు అందింది. అధికారుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోసాలలోని లక్ష్మీ వైన్స్‌లో అదే గ్రామానికి చెందిన వల్లెపు బుజ్జిబాబు(13) నాలుగు నెలల క్రితం బార్ బాయ్‌గా చేరాడు. నాలుగు రోజుల క్రితం షాపులో రూ.50 వేల సొమ్ము మాయమైంది. ఆ డబ్బును బుజ్జిబాబు అపహరించాడని షాపు యజమాని కోలా కోటేశ్వరరావు, సిబ్బంది కలసి బాలుడిని ఓ గదిలో నిర్బంధించి తీవ్రంగా గాయపరిచినట్లు బాధితుడు చెప్పాడన్నారు. ఆ తర్వాత బ్రాందీ షాపు క్యాషియర్ కల్యాణ్ బుధవారం రాత్రి పెనమలూరు పోలీస్ స్టేషన్లో డబ్బు మాయంపై ఫిర్యాదు చేశారని, బాలుడి వద్ద డబ్బు దొరక్కపోవడంతో పోలీసులు అతడ్ని వదిలేసినట్టు అధికారులు వివరించారు. బుజ్జిబాబు ఇచ్చిన ఫిర్యాదుపై విజయవాడలో కార్మిక శాఖాధికారులు షాపు యజమానిపై కేసు నమోదు చేశారు. బాలుడితో మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇప్పించారు. గాయాలకు గురైన అతడికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు జరిపించారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సూర్యనారాయణ పర్యవేక్షణలో అసిస్టెంట్ కమిషనర్ ఆంజనేయరెడ్డి, ఉయ్యూరు కార్మికశాఖ సహాయ అధికారి కనకమహాలక్ష్మి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలల జీతం కూడా ఇవ్వలేదు కాగా, తన భర్త సత్తెరాజు వికలాంగుడు కావటంతో కుటుంబ పోషణ కోసం పిల్లాడిని బ్రాందీ షాపులో చేర్చామని అతడి తల్లి వివరించింది. నెలకు రూ.2 వేలు జీతం ఇస్తామని నాలుగు నెలలు పనిచేయించుకున్నారని, యజమాని రెండు నెలల జీతం ఎగ్గొట్టాడని, పైగా చేయని నేరాన్ని బిడ్డపై మోపి హింసించారని ఆమె వాపోయింది. బ్రాందీ షాపు యజమాని నుంచి తన బిడ్డకు రక్షణ కల్పించాలని కోరింది. -
బాల కార్మికుడిపై దాష్టీకం!
విజయవాడ: ఓ బాల కార్మికుడిపై వైన్ షాపు యజమానితోపాటు పోలీసులు కూడా దాష్టీకం ప్రదర్శించారు. కంకిపాడులోని వైన్ షాపులో ఓ బాల కార్మికుడు పని చేస్తున్నాడు. ఆ షాపులో 50 వేల రూపాయలు ఎవరో చోరీ చేశారు. షాపు నిర్వాహకుడు నాగేశ్వర రావు బాల కార్మికుడిని అనుమానించాడు. చిన్న పిల్లవాడని కూడా చూడకుండా దారుణంగా చితకబాదాడు. ఆ తరువాత ఆ బాల కార్మికుడిని నాగేశ్వర రావు పెనమలూరు పోలీసులకు అప్పగించాడు. చివరకు పోలీసులు కూడా దయా దాక్షిణ్యం లేకుండా ఆ బాలుడిని చితకబాదారు. బాలుడి తల్లిదండ్రులు లేబర్ కమిషన్‌ను ఆశ్రయించారు. వాళ్లు ఏం చేస్తారో చూడాలి. ** -
పోలీస్ బందోబస్తుతో వైన్ షాపు ప్రారంభం!
విశాఖపట్నం: కోర్టు ఆర్డర్‌తో ఈరోజు ఇక్కడ పోలీస్ బందోబస్తుతో మద్యం షాపును ప్రారంభించారు. మహిళలు దీనికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. రెల్లి వీధిలో ప్రారంభించిన వినాయక వైన్ షాపును తొలగించాలని మహిళలు ఆందోళనకు దిగారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొని రెల్లివీధిలో రాస్తారోకో చేశారు. ** -
సందు చూసి..
పండుగ పూట వైన్ షాపుల దందా బెల్ట్ షాపులకు మందు డోర్ డెలివరీ ఎక్సైజ్ అండదండలతో వ్యాపారుల ఇష్టారాజ్యం ధనదాహంతో నిబంధనలకు తిలోదకాలు గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం సాక్షి ప్రతినిధి, వరంగల్ : దసరాకు ముందే పల్లెలను మత్తులో ముంచెత్తి... జేబులు నింపుకునేలా మద్యం వ్యాపారులు కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. ఆయా ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలోని వైన్‌షాపుల నిర్వాహకులు సిండికేట్‌గా ఏర్పడి.. ట్రాలీ ఆటోలతో మద్యం సీసాలను నేరుగా బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. పలువురు ఎక్సైజ్ అధికారుల అండదండలతో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలన్న చందంగా కొనసాగుతోంది. అంతేకాదు... మద్యం వ్యాపారులకు అధిక ఆదాయం వచ్చేలా ఎక్సైజ్ అధికారు లు విధులు నిర్వర్తిస్తుండడం విశేషం. ప్రభుత్వం అధికారికంగా కేటాయించి న వైన్ షాపులు, బార్లలోనే మద్యం అమ్మకాలు జరగాలని నిబంధనలు చెబుతున్నాయి. జిల్లాలో ఈ నిబంధనలకు ఎక్సైజ్ శాఖ అధికారులే పాతర వేస్తున్నారు. బెల్ట్ షాపుల నియంత్రణలో కఠినంగా వ్యవహరించాల్సిన వారు... ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మద్యం వ్యాపారులకు అధిక ఆదాయం తెప్పించేందుకు తాపత్రయపడుతున్నారు. వైన్‌షాపుల నుంచి బెల్ట్ షాపులకు ఆటోల్లో మద్యం సరఫరా దందా వరంగల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో ఎక్కువగా జరుగుతోంది. వర్ధన్నపేట ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధిలోని మండలాల్లో ఈ రకమైన దందా ఇంకా ఎక్కువగా ఉంది. దీనిపై పలువురు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ... వర్ధన్నపేట ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. సిండికేట్‌గా మారి... వర్ధన్నపేట మండల కేంద్రంలో మూడు వైన్ షాపులు, ఇదే మండలంలోని ఇల్లంద, పంథిని, ఐనవోలు గ్రామాల్లో ఒకటి చొప్పున వైన్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. జూన్ 1 నుంచి ఈ ఆరు వైన్ షాపులు ప్రారంభమయ్యాయి. వైన్ షాపులు తెరుస్తూనే నీళ్లు కలిపిన మద్యాన్ని ఇష్టారాజ్యంగా విక్రయించడం మొదలుపెట్టారు. దీనికి ఇక్కడి ఎక్సైజ్ శాఖ అధికారులు సహకరించారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తారుు. చివరకు కొందరు ఫిర్యాదు చేయడంతో ఒక వైన్ షాపులో తనిఖీ చేసి మూసివేశారు. సదరు నిర్వాహకుడు ఫైన్ చెల్లించి... ఆ షాపును మళ్లీ తెరిచాడు. ఆరు షాపుల్లో పోటీ వల్ల దాడులు జరిగాయని భావించి... అన్ని షాపుల యజమానులు ఒక్కటయ్యారు. ఆరు వైన్ షాపులకు వచ్చిన మద్యాన్ని ఒకే గోదాంలో పెట్టి... ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామంలోని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. ఆరు వైన్ షాపులకు సంబంధించిన అమ్మకాల్లో వాటా ఎలా అనే దానికి కొత్త ఉపాయం రచించారు. ఆరు వైన్ షాపుల సరుకులో ఏ మద్యం సీసా ఎవరిది అనే దాన్ని గుర్తించేందుకు ఆయా వైన్ షాపుల పేరులో మొదటి అక్షరంతో స్టిక్కర్లను ముద్రించారు. వీటి ఆధారంగా అమ్మకాలకు సంబంధించిన డబ్బులు పంచుకుంటున్నారు. ఎక్సైజ్ పని మారింది... బెల్ట్ షాపులను నియంత్రణను పక్కనబెట్టిన ఎక్సైజ్ శాఖ కొత్త రకమైన విధులను చేపట్టింది. బెల్ట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి అక్కడ ఉన్నది ఆయా ప్రాంతాలకు చెందిన వైన్ షాపుల మద్యం సీసాలేనా అని మాత్రమే చూస్తోంది. తనిఖీకి వచ్చిన అధికారులు బెల్ట్ షాపును మూసివేయకుండా... వెళ్తూ వెళ్తూ ఒకటిరెండు ఖరీదైన మద్యం సీసాలు తీసుకెళ్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అక్రమాలకు పలువురు ఎక్సైజ్ శాఖ అధికారులు మద్దతు ఇస్తుండడంతో... మద్యం వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉండే దసరా సీజన్లో ఇష్టారాజ్యంగా కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారు. -
టీడీపీ నేతలదాష్టీకం
విజయనగరం మున్సిపాలిటీ: పట్టణంలోని ఖరీదైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యవైఖరి కారణంగా రూ. కోట్లు విలువ చేసే స్థలాలు టీడీపీ నేతల చెరలోకి వెళుతున్నాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన నాయకుడొకరు వివాదస్పద స్థలాన్ని ఆక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా వైన్‌షాపు ఏర్పాటు చేశారన్న ఆరోపణలొచ్చాయి. అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. కానీ అధికారులు మీన మీషాలు లెక్కిస్తున్నారు. గంటకో మాట చెప్పి గందరగోళం సృష్టిస్తున్నారు. సదరు స్థలంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు గాను పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయన్న విమర్శలొస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డు పరిధిలో గల కొత్తగ్రహారం ఒకటవ వీధిలో ఆర్అండ్ బి జిల్లా కార్యాలయం ఎదురుగా సర్వేనంబర్ 54, 143లలో సుమారు 500 గజాల స్థలం ఎవరదనేదన్న విషయంలో స్థానికుడైన కొణతాల వేణుగోపాలరావు అనే వ్యక్తికి, మున్సిపల్ అధికారుల మధ్య వివాదం కొనసాగుతోంది. హైకోర్టులో ప్రస్తుతం కేసు నడుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ స్థలంలో మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండానే టీడీపీకి చెందిన ఓ వార్డు కౌన్సిలర్ మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ దుకాణం గాజులరేగ ప్రాంతంలో పెట్టుకునేందుకు అబ్కారీ శాఖ అధికారులు అనుమతినివ్వగా అక్కడి స్థానికులు దుకాణ ఏర్పాటును వ్యతిరేకించ డంతో అధికార పలుకుబడిని ఉపయోగించి కొత్తగ్రహారం ఒకటవ వీధిలో ఏర్పాటు చేసేశారు. ఇదే విషయమై 38వ వార్డు కౌన్సిలర్ గార సత్యనారాయణ, స్థానికులు పి.సుబ్బారావు, బిఎమ్ఎమ్ కృష్ణ, ఎం.అప్పారావు, టీవీఆర్ నాగేశ్వరరావు, టీ.శ్రీనివాసరావు తదితరులు సోమవారం జరిగిన గ్రీవెన్‌సెల్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దుకాణం ఏర్పాటులో నిబంధనలకు నీళ్లు వాస్తవానికి మద్యం దుకాణం ఏర్పాటు చేయాలంటే పలు నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని అతిక్రమించి స్థానిక కొత్తగ్రహారంలో దుకాణం ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనల మేరకు బడికి, గుడికి 100 మీటర్ల దూరంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయకూడదు. అయితే కొత్తగ్రహరంలో అధికారి పార్టీ కౌన్సిలర్ ఏ ర్పాటు చేసిన దుకాణం మాత్రం నిబంధనలకు అతిక్రమించి ఉంది. ఆ షాపునకు ఐదు మీటర్ల దూరంలో పాఠశాల ఉండగా...30 మీటర్ల దూరంలో చిన్న పిల్లల ఆస్పత్రి, కామర్స్ కళాశాల ఉన్నాయి. అంతే కాకుండా సదరు షాపునుంచి తూర్పుకు 10 మీటర్ల దూరంలో రామమందిరం,పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. ఈ ఆలయాలకు నిత్యం ఉదయం, సాయంత్ర వేళల్లో వందలాది మంది భక్తులు వచ్చివెళుతుంటారు. కళాశాల, పాఠశాల విద్యార్థులు నిత్యం ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయటాన్ని స్థానికులు తీవ్ర ంగా వ్యతిరేకిస్తున్నారు. పట్టించుకోని మున్సిపల్ అధికారులు పట్టణం నడిబొడ్డున ఉన్న విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించకుని నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు నిర్లక్ష్య వైఖరి కారణంగానే స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని స్థానికుల వాదన. ఎక్సైజ్ అధికారులను నిలదీసిన స్థానికులు కాగా, షాపు వద్దకు సోమవారం సాయంత్రం వచ్చిన ఎక్సైజ్ అధికారులను స్థానికులు నిలదీశారు. పాఠశాలలు, దేవాలయాలు, ఆసుపత్రులు ఉన్నచోట అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కానీ ఎక్సైజ్ అధికారులు మౌనమే సమాధానంగా దాటవేసి వెళ్లిపోయారు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం పట్టణంలోని 38వ వార్డు పరిధిలో గల కొత్తగ్రహారం ఒకటవ వీధిలో మున్సిపాలిటీ స్థలం ఆక్రమణకు గురైనట్లు మా దృష్టికి వచ్చింది. ఇటీవల స్థానికులు పిర్యాదు చేశారు. ఈ విషయంపై టౌన్‌ప్లానింగ్ అధికారులతో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. - కమిషనర్ సోమన్నారాయణ. అనుమతులు ఇవ్వలేదు కొత్తగ్రహారం ఒకటవ వీధిలోగలమున్సిపాలిటీ స్థలంలో మద్యం దుకాణం ఏర్పాటుకు ఎవరికీ అనుమతివ్వలేదు. ఈవిషయం ఇంత వరకు మాదృష్టికి తీసుకురాలేదు. సర్వేయర్‌ను ఆప్రాంతానికి పంపించాం. మంగళవారం వాస్తవ పరిస్థితేంటో తేలుతుంది. మున్సిపల్ స్థలమైతే చర్యలు తీసుకుంటాం. - లక్ష్మణరావు, టీపీఓ -
వైన్ స్కాన్
ఆదిలాబాద్ : నిన్నా మొన్నటి వరకు సూపర్బజార్లు.. ఏదేని పెద్ద పెద్ద షాపుల్లో వస్తువులు కొనుగోలు చేస్తే బార్కోడ్ సాయంతో ధర ప్రింట్ అయ్యేది. హోలోగ్రామ్‌పై కంప్యూటర్ స్కానర్‌తో పరిశీలించగానే ఆ వస్తువు ధర కంప్యూటర్లో ప్రత్యక్షమయ్యేది. ఇప్పుడు ఆ విధా నం ఇక వైన్షాపుల్లోనూ రానుంది. కొత్త ఎక్సైజ్ పాలసీలో ఈ విధానాన్ని అమలుపర్చారు. బాటిల్ హోలోగ్రామ్‌లో కొత్తగా 2డీ బార్‌కోడ్‌ను రూపొందిస్తున్నారు. అయితే.. దీన్ని కొత్త వైన్‌షాప్ హోల్డర్లు వ్యతిరేకిస్తున్నారు. బాటిల్ వివరాలు ప్రత్యక్షం.. పాత ఎక్సైజ్ పాలసీలో మద్యం బాటిళ్లపై ఎక్సైజ్ అడిహసీవ్ లేబుల్ బార్కోడ్ ఉండేది. ప్రస్తుతం హోలోగ్రామ్ 2డీ బార్‌కోడ్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తోంది. దీనికి సంబంధించి హెడానిక్ పాత్ ఫైన్డర్ సిస్టమ్ (హెచ్‌పీఎఫ్‌ఎస్) అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. డిస్టిలరీ నుంచి మొదలుకుని మద్యం డిపోలు వైన్‌షాపులను అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టింది. మద్యం బాటిల్‌పై స్కాన్ చేయగానే బాటిల్ తయారైన డిస్టిలరీ, డిస్టిలరీ నుంచి డిపో, డిపో నుంచి వైన్స్, ఏ రకం బ్రాండ్, దాని రేటు తదితర వివరాలు వస్తాయి. తద్వారా బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ కంటే షాపులో ఎక్కువ ధరకు అమ్మే పరిస్థితి ఉండదు. గతంలో జిల్లాలో ఎమ్మార్పీ కంటే రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు చేస్తుండేవారు. దీంతో మందుబాబుల జేబులకు చిల్లు పడేది. ఇక బార్కోడ్ విధానం అమలైతే అధిక వసూలుకు బ్రేక్ పడనుంది. జిల్లాలో నాన్డ్యూటీపేడ్ (ఎన్డీపీ) లిక్కర్‌తోపాటు కల్తీ లిక్కర్‌ను విస్తృతంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బార్కోడ్ అమలైన పక్షంలో నాన్డ్యూటీపేడ్ లిక్కర్‌కు కూడా చెక్పడే ఆస్కారం ఉంది. అయితే బార్కోడ్ విధానం వైన్‌షాపు యజమానులకు లాభం చేకూరుస్తుందని అధికారులు అంటున్నారు. ప్రధానంగా ఓనర్ కౌంటర్ మీద ఉన్నా లేకున్నా కంప్యూటర్ నుంచి సెల్‌కు అనుసంధానం చేస్తే సంక్షిప్త సమాచారం వస్తుంది. సరుకు కొనుగోలుకు సంబంధించి ఇదే ఆన్లైన్లో సేల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజూ అకౌంట్ వివరాలు తెలుసుకునేందుకు సులువవుతుంది. ఎన్ని బాటిళ్లు అమ్ముడుపోయాయి.. ఏ బ్రాండ్ లిక్కర్ విక్రయాలు అమ్ముడుపోతున్నాయనే వివరాలు కంప్యూటర్లో తెలుసుకోవచ్చు. అదే సమయంలో తనిఖీల కోసం వెళ్లే అధికారులకు స్కానింగ్ ఆప్లికేషన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లను ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఫోన్ల ద్వారా మద్యం బాటిల్‌ను స్కాన్ చేసినప్పుడు పూర్తి వివరాలు సెల్లో వస్తాయని, తద్వారా అది నాన్డ్యూటీపేడ్ లిక్కరా లేదా డ్యూటీపేడ్ లిక్కరా అని తేలిపోతుంది. ఇదిలా ఉంటే.. మంగళవారం వైన్‌షాపులను ప్రారంభించిన వైన్ షాపు యజమానులు ఈ స్కానింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రధానంగా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ఏర్పాటు చేసుకోవాలంటే రూ.50 వేల పైన ఖర్చవుతుందని, దాన్ని ఆపరేట్ చేసేందుకు జీతం ఇచ్చే వ్యక్తిని నియమించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికే పర్మిట్ రూమ్ పేరిట రూ.2 లక్షలు, ప్రివిలేజ్ పేరిట ఏడు రెట్లు మద్యం అమ్మిన తర్వాత 13 శాతం ట్యాక్స్ విధిస్తున్నారని, ఈ విధానం అమలుచేస్తే నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో 2డీ బార్కోడ్ విధానం అమలవుతుందా లేదా అనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శివరాజ్‌ను వివరణ కోరగా ప్రతి వైన్‌షాప్‌లో విధిగా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ఏర్పాటు చేసుకోవాలని, వినియోగదారుడికి బిల్లు జారీ చేయాలని చెప్పారు. సోమవారమే కొత్త పాలసీ ప్రారంభమైనందున వైన్‌షాప్ యజమానులు తొందరగా ఈ విషయంపై దృష్టి సారించాలని, తప్పనిసరిగా బార్కోడ్ విధానం అమలుచేసి తీరుతామని పేర్కొన్నారు. -
వైన్ షాపు ఎదుట ప్రజల ఆందోళన
-
ఓపెనైతే అంతే!
పబ్లిక్‌గా తాగితే కేసులు మందుబాబుల వీరంగాలకు చెక్ నేటి నుంచి కొత్త విధానం అమలు : సీపీ సాక్షి, సిటీబ్యూరో:బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే మందుబాబుల భరతం పట్టేందుకు నగర పోలీసులు సిద్ధమయ్యారు. వైన్‌షాప్‌లు, నిర్మానుష్య ప్రదేశాలు, కమ్యూనిటీ హాళ్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో మందు తాగి పోలీసులకు చిక్కితే గతంలో సిటీ పోలీసు చట్టం కింద చిన్నపాటి శిక్షతో వదిలి పెట్టేవారు. ఇకపై ఏకంగా ఐపీసీ 188 కింద కేసు నమోదు చేసి కోర్టుకు పంపనున్నారు. ఈ కొత్త పద్ధతిని శనివారం నుంచి అమలు చేయనున్నారు. ఇందుకుగాను నగరంలోని అన్ని ఠాణాల ఎస్హెచ్ఓలకు పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మందుబాబుల ఆగడాలు అరికట్టేందుకు శనివారం నుంచి ఏడో తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. మద్యం తాగి వాహ నం నడిపిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కోర్టుకు అప్పగిస్తున్న విషయం తెలిసిందే. ఇక బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి పట్టుబడిన వారిని ఉపేక్షించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపనున్నారు. ఇలా చేయడంతో రహదారులపై వెళ్లే మిహ ళలు, చిన్న పిల్లలకు రక్షణ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. బాబుల వీరంగంపై గత పక్షం రోజులుగా ఆయా కాలనీలు, బస్తీ సంఘాల నేతలు కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలిసి మహిళలు పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించారు. వారి విజ్ఞప్తుల మేరకు కమిషనర్ మందుబాబులపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. -
ఎక్సైజ్ ఖజానాకు రూ.62 కోట్లు
విజయవాడ డివిజన్లో 142 షాపులే కేటాయింపు మిగిలిన 20 షాపులకు మళ్లీ గజిట్ విడుదల 7వ తేదీ లాటరీ సాక్షి, విజయవాడ : వైన్ షాపుల కేటాయింపుల ద్వారా ఎక్సైజ్ శాఖ ఖజానాకు భారీగా సొమ్ము చేరింది. విజయవాడ డివిజన్ పరిధిలోని వైన్ షాపుల కేటాయింపు ద్వారా రూ 62.13 కోట్లు ఆదాయం లభించింది. డివిజన్లోని 11 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఉన్న 162 వైన్ షాపులకు గత నెలలో దరఖాస్తులు స్వీకరించి లాటరీ ప్రకియలో తొలి విడత షాపులు కేటాయించారు. 162 షాపులకు గానూ142 షాపులకు మాత్రమే దరఖాస్తులొచ్చాయి. దీంతో 142 షాపులను లాటరీ పద్ధతిలో కేటాయించారు. గత నెల 22 నుంచి 27 వరకు దరఖాస్తుల స్వీకరణ 28న లాటరీ నిర్వహించారు. 142 షాపులకు గానూ 2452 ధరఖాస్తులందాయి. అత్యధికంగా తిరువూరులోని 11 వైన్సాపుల కోసం 479 దరఖాస్తులొచ్చాయి. కేవలం దరఖాస్తుల ద్వారానే రూ.6.13 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక వైన్ షాపుల లెసైన్స్ ఫీజుల ద్వారా విజయవాడ డివిజన్లో 62,13,50,000కోట్లు ఆదాయం లభించింది. ఈ మొత్తాన్ని వ్యాపారులు మూడు విడతలుగా ఎక్సైజ్ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. లాటరీలో షాపు దక్కగానే ముందు ఒక విడత మొత్తం చెల్లించి షాపును ఖరారు చేసుకోవాలి. దీంతో తొలివిడతగా 20.71 కోట్లు వ్యాపారుల ఇప్పటికే ఎక్సైజ్ అధికారులకు చెల్లించారు. దీనిని ఇప్పటికే ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. రెండో గజిట్ విడుదల ఎన్వి.రమణ విజయవాడ డివిజన్ పరిధిలో ఉన్న 20 వైన్‌షాపులకు సంబంధించి రెండో నోటిఫికేషన్ విడుదల చేశామని విజయవాడ ఎక్సైజ్ సూపరిండెంటెంట్ ఎన్వి. రమణ సాక్షికి తెలిపారు. డివిజన్లో మొదటి గజిట్ ద్వారా 162 షాపులకు గానూ 142 షాపులకు దరఖాస్తులొచ్చాయని వాటిని పరిశీలించి షాపులను కేటాయించామని చెప్పారు. ప్రభుత్వ అదేశాలతో రెండో విడతలో మిగిలిన 20 షాపులకు గజిట్ విడుదల చేశామని, 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి 7వ తేదీన మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి షాపులు కేటాయిస్తామని చెప్పారు. -
మద్యంపై భారీ ఆదాయమే లక్ష్యం
జిల్లాలో 234 వైన్ షాపుల ఏర్పాటుకు నిర్ణయం గత ఏడాది కంటే మూడు షాపులు అదనం నాలుగు కేటగిరీలుగా లెసైన్‌స ఫీజులు ఎజెన్సీలో ప్రత్యేక మార్గదర్శకాలతో 19 దుకాణాలు {పభుత్వ గెజిట్ ప్రకారం జిల్లాలో మొత్తం 234 వైన్ షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ టెండర్ల ప్రక్రియను మొదలు పెట్టింది. కొత్త విధానంలోనూ మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ పద్ధతినే అవలంబించనున్నారు.మద్యం దుకాణాల లెసైన్స్ పొందాలనుకునే వారు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.25 వేలుగా నిర్ణయించారు. దరఖాస్తుతో పాటు ఫొటోలు, లెసైన్స్ ఫీజులో 10 శాతం ఈఎండీగా చెల్లించాలి. ఇది గరిష్టంగా రూ.5 లక్షలుగా నిర్ణయించారు. ఈ నెల 23వ తేదీన హన్మకొండలోని రెడ్డి మ్యారేజ్ హాల్లో లాటరీ విధానం ద్వారా వైన్ షాపులను కేటాయించనున్నారు. ఒకరు ఎన్ని షాపులకు... ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా... లాటరీలో ఒక షాపు దక్కితే అక్కడితోనే సరిపెడతారు. మిగిలిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. లాటరీలో వైన్ షాపు దక్కిన వారు వెంటనే లెసైన్స్ ఫీజులో మూడో వంతు చెల్లించాలి. వరంగల్ :మద్యం అమ్మకాల ద్వారా ఈ సంవత్సరం (2014-15) ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా 234 మద్యం దుకాణాలు (వైన్ షాపులు) ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. రెండేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన విధానానికి మార్పులు చేస్తూ కొత్త విధానం రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం... జిల్లాకు సంబంధించి ప్రత్యేక గెజిట్‌ను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా కొత్త షాపులను కేటాయించింది. గత ఏడాది జిల్లాలో 231 వైన్ షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణరుురచగా... ఈ సారి మూడు షాపులు అదనంగా ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలో గత సంవత్సరం వైన్ షాపుల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడు షాపులు మిగిలిపోయూరుు. వాటిని ఈ ఏడాది మన జిల్లాకు కేటాయించారు. జిల్లాలో గత ఏడాది దరఖాస్తులు రాకుండా మిగిలిపోయిన భూపాలపల్లిలోని మూడు షాపులను కేసముద్రం, తొర్రూరు, మరిపెడకు... పరకాల షాపును వర్ధన్నపేటకు కేటాయించారు. లెసైన్స్ ఫీజు ద్వారా రూ.93 కోట్లు జనాభా ప్రాతిపదికన జిల్లాలో ఏర్పాటు చేయనున్న వైన్ షాపులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. రూ.32.5 లక్షల లెసైన్స్ ఫీజు మద్యం దుకాణాలు 86, రూ.34 లక్షలు లెసైన్స్ ఫీజు దుకాణాలు 84, రూ.42 లక్షల ఫీజు దుకాణాలు 24, రూ.68 లక్షల చొప్పున లెసైన్స్ పీజుల చెల్లించే మద్యం దుకాణాలు 40 ఉన్నాయి. జిల్లాలో ఏర్పాటు చేయనున్న 234 వైన్ షాపులకు లెసైన్స్ రూపంలోనే రూ.93.59 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుంది. ఈ వైన్ షాపుల లెసైన్స్ కోసం చేసే దరఖాస్తు ఫీజు రూ.25 వేలు ఉంది. భారీగా రానున్న దరఖాస్తులతో ఈ మొత్తం కూడా భారీగానే ఉండనుంది. ఈ షాపుల ఏర్పాటు తర్వాత విక్రయించే మద్యంతో ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆదాయం తీరు చూసినా... ఇదే పరిస్థితి కనిస్తోంది. 2013-14 ఎక్సైజ్ సంవత్సరంలో మద్యం విక్రయాలపై నెలకు సగటున రూ.75 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఏడాదిలో రూ.900 కోట్లు వచ్చినట్లు అధికాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇది వెయ్యి కోట్ల రూపాయలు దాటుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏజెన్సీలో 19 షాపులు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోకి వచ్చే ఏజెన్సీ ప్రాంతాల్లో వైన్ షాపుల ఏర్పాటుకు ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయి. మన జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో 19 వైన్ షాపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏటూరునాగారం, ములుగు, గూడూరు ఎక్సైజ్ విభాగాల పరి ధిలోకి వచ్చే మండలాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో వైన్ షాపు ఏర్పాటు చేసేందుకు గ్రామసభల తీర్మానం తప్పనిసరి. మద్యం దుకాణం ఏర్పాటుకు ఇబ్బంది లేదని గ్రామసభ తీర్మానం చేస్తేనే అక్కడ వైన్ షాపు ఏర్పాటుకు అనుమతి ఉంటుంది. ఏజెన్సీలో వైన్ షాపు ల లెసైన్స్‌లను అక్కడి స్థానికలకే ఇస్తారు. ఐటీడీఏ పరిధిలో వైన్ షాపుల లెసైన్స్ కోసం దరఖాస్తు చేసే వారు స్థానికత, కులం సర్టిఫికెట్లు జత చేయాలి. వీటిని ప్రమాణికంగా తీసుకుని లాటరీలో దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు. -
నిమ్మలంగా తాగేసేయ్
సాక్షి, హైదరాబాద్: గ్రామమైనా.. పట్టణమైనా.. చివరికి నగరమైనా.. వైన్‌షాపు ఏర్పాటు చేసే మద్యం వ్యాపారి దానికి అనుబంధంగా ‘పర్మిట్ రూమ్’ ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇప్పటికే ప్రకటించిన మద్యం విధానంలో 5 వేల జనాభా దాటిన గ్రామంలో ఏర్పాటు చేసే వైన్‌షాపు లెసైన్స్‌తో పాటు పర్మిట్ రూమ్‌కు కూడా అనుమతి తీసుకోవలసిందేనని ఎక్సైజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వచ్చేనెల 1 నుంచి ప్రారంభమయ్యే ఎక్సైజ్ సంవత్సరం నుంచి ఈ నిబంధనను తప్పనిసరి చేయనున్నారు. ఇప్పటి వరకు పర్మిట్ రూమ్‌లు వైన్‌షాపు యజమానుల ఇష్టంపైనే ఆధారపడి ఉండేవి. ఇకనుంచి వాటిని చూపించిన వారికే వైన్‌షాపు లెసైన్స్ జారీ చేయాలని నిర్ణయించారు. లెసైన్స్ ఫీజు రూ.2లక్షలు: వైన్‌షాపుతో పాటు ఏర్పాటు చేసే పర్మిట్ రూమ్ లెసైన్స్ ఫీజు ఏటా రూ. 2 లక్షలు. తెలంగాణ రాష్ట్రంలో 2,216 వైన్‌షాపులకు పర్మిట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఈనెల 14న నోటిఫికేషన్ జారీ చేసింది. 5 వేల జనాభా కన్నా తక్కువగా ఉన్నచోట వైన్‌షాపులు ఏర్పాటు చేయడమే అరుదు. హైవేలు, పర్యాటక ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి వెసులుబాటు ఉంటుంది. ఈ లెక్కన మొత్తం షాపుల్లో దాదాపు 2 వేల దుకాణాలకు పర్మిట్ రూమ్‌లు తప్పనిసరి కానున్నాయి. ఈ లెక్కన ఎక్సైజ్ శాఖకు కేవలం పర్మిట్ రూంలపైనే రూ. 40 కోట్ల ఆదాయంగా రానుందన్న మాట! భవిష్యత్తులో బార్కోడ్..: తెలంగాణలో అమలులోకి వచ్చే కొత్త ఎక్సైజ్ విధానం ప్రకారం ప్రతి మద్యం బాటిల్‌పై హోలోగ్రామ్లోనే కొత్తగా 2డీ బార్కోడ్ ఏర్పాటు చేస్తారు. ఆ బార్‌కోడ్‌లోనే మద్యం ధర ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే కంప్యూటరైజ్డ్ బిల్లు వస్తుంది. జూలై 1 నుంచి ఈ విధానం ద్వారానే మద్యం అమ్మకాలు సాగుతాయి. అయితే ఈసారి కేవలం ఐఎంపీఎల్ మద్యానికే బార్కోడ్ విధానాన్ని అనుసంధానం చేసినట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ అహ్మద్ నదీం ‘సాక్షి’కి తెలిపారు. బీర్లకు హోలోగ్రామ్ ఉంటుందే తప్ప బార్కోడ్ ఉండదని, భవిష్యత్‌లో వాటికి కూడా బార్కోడ్ ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. బార్కోడ్ విధానం ద్వారా డ్యూటీ పెయిడ్ మద్యాన్ని మాత్రమే వైన్‌షాపులో అమ్ముతారని, అక్రమ మద్యం అమ్మకాలకు అడ్డుకట్ట పడుతుందని ఆయన చెప్పారు. దరఖాస్తు ఫారం రుసుము రూ.25 వేలు మద్య దుకాణాల లెసైన్స్‌లు పొందేందుకు ఈనెల 21లోగా ఆయా జిల్లాల్లోని ఎక్సైజ్ సూపరింటెం డెంట్ కార్యాలయాల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం రుసుము రూ.25 వేలు. ఒక దుకాణానికి ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు వస్తే డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఈనెల 23న జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా ద్వారా దుకాణాల కేటాయింపు జరుగుతుందని ఎక్సైజ్ కమిషనర్ తెలిపారు. -
అటు బడి.. ఇటు గుడి మధ్యలో వైన్ షాప్
-
మద్యం లెసైన్సులు 3 నెలల పొడిగింపు!
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ నిర్ణయం హైదరాబాద్: రాష్ట్ర విభజన.. మద్యం దుకాణదారులకు బంపర్ బొనాంజా ఇవ్వబోతోంది. వైన్‌షాపుల లెసైన్స్ గడువు జూన్ 30తో ముగుస్తున్నప్పటికీ.. అదనపు ఫీజు చెల్లించి మరో మూడు నెలల పాటు మద్యం అమ్మకాలు కొనసాగించుకునే వెసులుబాటు రాబోతుంది. జూన్ 2 నుంచి రాష్ట్ర విభజన అధికారికంగా అమలులోకి వచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రాలు ఏర్పాటవుతుండటంతో కీలక అంశాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. మద్యం లెసైన్సులకు సంబంధించి ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ పాటించే తుది గడువు ‘జూన్ 30’ లోగా రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొత్త మద్యం విధానాన్ని రూపొందించి అమలు చేయటం కష్టమని అధికార యంత్రాంగం భావిస్తోంది. రెండు రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండే ఎక్సైజ్ శాఖ విషయంలో ప్రస్తుత అధికారులు కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా లేదు. దీంతో.. ఈ ఏడాది ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లెసైన్సులనే మరో మూడు నెలలు పొడిగించాలని నిర్ణయించినట్లు సమాచారం. -
అంబులెన్స్‌లో ప్రత్యక్షమైన నాటుసారా
-
వైన్షాపే బార్!